సింగరేణి కార్మికులకు వైద్యసౌకర్యం మెరుగుపర్చాలి
రెబ్బెన: సింగరేణి కార్మికులకు వైద్య సౌకర్యం మెరుగుపర్చాలని, మెడికల్ బోర్డు నిర్వహించాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్‌రావు అన్నారు. కొత్తగూడెంలోని సింగరేణి ఫ్రధాన కార్యాలయం ఎదుట బుధవారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షకు ఏరియాకు చెందిన నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ సింగరేణి ఆసుపత్రుల్లో పారామెడికల్ సిబ్బందిని, స్పెషలిస్టు డాక్టర్లను నియమించాలని డిమాండ్ చేస్తూ డైరెక్టర్ (పా) వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ దారావత్ మంగీలాల్, ఏరియా కార్యదర్శి మారిన వెంకటేశ్వర్లు, సెంట్రల్ కమిటీ నాయకులు సమ్మయ్య, కై రిగూడ పిట్ కార్యదర్శి బొంగు వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.


