నేడు దీపోత్సవం
కెరమెరి(ఆసిఫాబాద్): జంగుబాయి ఉత్సవాల్లో భా గంగా సోమవారం తెలంగాణ, మహారాష్ట్ర పరిధి లోని కెరమెరి మండలం మహరాజ్‌గూడ అడవుల్లో గల ఆలయంలో సోమవారం దీపోత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం 7 గంటలకు ఎనిమి ది గోత్రాలకు చెందిన కటోడాలు, ఆదివాసీలు దేవతల విగ్రహాలను టొప్లకస నుంచి తీసుకువచ్చిన గంగాజలంతో శుద్ధి చేయనున్నారు. అనంతరం రావుడ్, పోచమ్మ ఆలయంలోని ప్రతిమలకు పూజ లు చేస్తారు. అనంతరం అమ్మవారి గుహకు చేరి దీపం వెలిగిస్తారు. ఇది నెలరోజులపాటు వెలుగుతూనే ఉండనుంది.
కలెక్టర్‌కు ఆహ్వానం
జంగుబాయి ఆలయంలో సోమవారం నిర్వహించే దీపోత్సవానికి హాజరుకావాలని ఆదివారం కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేను డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. కలెక్టర్‌తో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జంగుబాయి ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు మరప బాజీరావు, చైర్మన్ సలాం శ్యాంరావు, మరప కోసు, మరప ఇస్రు, నాయకులు గుండా శ్యామ్, పెందోర్ సుధాకర్, సుజాయత్ ఖాన్, విజయ, ఇందిరా పాల్గొన్నారు.


