
లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన తాజా చిత్రం ‘థగ్ లైఫ్’(Thug Life). కోలీవుడ్ స్టార్ హీరో శింబు కీలక పాత్ర పోషిస్తున్నారు. త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, పంకజ్ త్రిపాఠి, సాన్య మల్హోత్రా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ‘నాయకుడు’ తర్వాత కమల్, మణిరత్నం కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది.

దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి

ఈ చిత్రం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది

ఈ నేపథ్యంలోనే అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు

ఫస్ హాఫ్ సూపర్ ఎంగేజింగ్‌గా ఉందని చెబుతున్నారు










