సాత్విక్ వర్మ, అనీ ప్రధాన పాత్రల్లో నటించిన కొత్త సినిమా 'తొలి ప్రేమ కథ'. లిఖిత్, ఆదిత్య సమర్పణలో లతా కె ఈ సినిమాను నిర్మిస్తుండగా.. సాయి లక్ష్మణ్ అల్లు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం ఇటీవల ఘనంగా విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను, హీరో ఆకాష్ పూరి ముఖ్య అతిథులుగా హాజరై టీజర్‌ను ఆవిష్కరించారు.


