యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
ఆసిఫాబాద్‌అర్బన్: యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఆయుష్ జిల్లా డిప్యూటీ నోడల్ అధికారి డాక్టర్ సుజాత అన్నారు. అంతర్జాతీయ యోగా దశాబ్ది వేడుకలను పురస్కరించుకుని జిల్లా ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి యోగా వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా సాధనతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు మహేష్, శిల్ప, నరేందర్‌రెడ్డి, వనిత, సిబ్బంది శంకర్, గౌతమి, శ్రీలత, సరిత, యోగా టీచర్ వెంకటేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.


