
ఘనంగా భగీరథ మహర్షి జయంతి
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజు భగీరథ మహర్షి జయంతి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివా ళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ భగీరథ మహర్షి గంగానదిని భూమికి తీసుకువచ్చేందుకు సంవత్సరాలపాటు తపస్సు చేశాడని చరిత్ర చెబుతుందని తెలిపారు. మహనీయు ల చరిత్ర, భారతదేశ విశిష్టతను భావితరాల కు అందించే విధంగా జయంతి, వర్ధంతి అధి కారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమశా ఖ అధికారి సజీవన్, సింగిల్‌విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్‌నర్ రమేశ్, మాలి సంఘం నాయకులు శంకర్, అవుడపు ప్రణయ్, రుకుం ప్రహలాద్, అధికారులు పాల్గొన్నారు.