
పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తే సహించేది లేదు
ఆసిఫాబాద్‌అర్బన్: పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తే సహించేది లేదని ఆసిఫాబాద్ ప్రింట్, ఎలక్ట్రానిక్ ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు హెచ్చరించా రు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిపై ఆంధ్రప్రదేశ్ పోలీసుల దౌర్జన్యంపై గురువారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద ఆసిఫాబాద్ ప్రింట్, ఎలక్ట్రానిక్ ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారన్నారు. సాక్షి ఎడిటర్ నివాసంలో అనుమానితులు ఉన్నారనే నెపంతో ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా చట్టవిరుద్ధంగా రాజకీయ దురుద్దేశాలతో సో దాలు చేశారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం, పోలీసుశాఖ భేషరతుగా జర్నలిస్టులు, సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సాక్షి జిల్లా ప్రతినిధి రామ్మోహన్, రిపోర్టర్ వారణాసి శ్రీనివాస్‌రావ్, జర్నలిస్టులు దాసరి సురేశ్, వేణుగోపాల్, కృష్ణంరాజు, మీర్ సలీం, రాజు, బిక్కాజీ, ప్రకాశ్‌గౌడ్, సురేశ్, శ్రీధర్, బాబుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో నల్లబ్యాడ్జీలు ధరించి జర్నలిస్టుల నిరసన