
● ‘ఆపరేషన్ సిందూర్’పై హర్షాతిరేకాలు ● కశ్మీర్ ఉగ్రదా
అనుక్షణం అప్రమత్తం
సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం విధులు నిర్వర్తిస్తున్నాం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే క్రమంలో విధులు నిర్వర్తిస్తున్నందుకు గర్వంగా ఉంది. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నాం. ఆర్మీ సరైన సమయంలో సరైన బదులిస్తోంది.
– హరి మ్రిదా, గూర్ఖా రెజిమెంట్
భారత ఆర్మీ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో అమాయకులైన ప్రజలను కిరాతకంగా చంపిన ఉగ్రమూకలకు సరైన సమాధానం చెప్పినట్లైంది. భారత సైన్యం సాహసాన్ని జిల్లా ప్రజలు, రిటైర్డ్ జవాన్లు కొనియాడుతున్నారు. ఉగ్రమూకలను తుదముట్టించేందుకు ప్రభుత్వం చేపట్టే చర్యలకు అండగా ఉంటామని స్పష్టం చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్‌పై జిల్లావాసులు ‘సాక్షి’తో తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. – ఆసిఫాబాద్‌అర్బన్/చింతలమానెపల్లి