
‘వికాసం’పై కసరత్తు
● జిల్లావ్యాప్తంగా 29,756 దరఖాస్తులు ● కొనసాగుతున్న ఇంటర్వ్యూ ప్రక్రియ ● నిరుద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు
బెజ్జూర్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఈబీసీలకు రూ.4లక్షల వరకు ఆర్థికసా యం అందించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఆన్‌లైన్‌తో పాటు ఎంపీడీవో కార్యాలయంలో ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తు గడువు గత నెల 14వ తేదీతో ముగిసింది. అయితే ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు ని రుద్యోగ యువత నుంచి జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపికై న లబ్ధిదారులకు జూన్ 2న సబ్సిడీ రుణాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన లబ్ధిదారు ల ఎంపికకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధి కారులు ఆ దిశగా దృష్టి సారించారు. మండలాలవారీగా రుణ మంజూరు యూనిట్ల టార్గెట్లను ఖరా రు చేశారు. అర్హుల గుర్తింపునకు ప్రభుత్వం క్షేత్రస్థాయి సర్వేకు ఆదేశించింది.
కొనసాగుతున్న ఇంటర్వ్యూలు
జిల్లాలోని 15 మండలాల్లో రెండు రోజులుగా రాజీ వ్ యువ వికాసం పథకంపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి. రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్న యువతను బ్యాంక్ మేనేజర్, ఎంపీడీవో, ఎంపీవో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ అధికారులు ఇంటర్వ్యూ చేస్తున్నారు.
యువకులకు బాసటగా..
రాష్ట్రంలో చదువుకున్న యువత భవిష్యత్ బాగుపడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం పకడ్బందీగా అమలు చేస్తే యువతకు బాసటగా నిలవనుందని చెప్పవచ్చు. నిరుద్యోగ యువతను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజీవ్ యు వ వికాసం ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా అధికారులు తగు జాగ్రత్తలతో పకడ్బందీగా అమలు చేయడానికి ముమ్మర కసరత్తు చేస్తున్నారు.
మండలాలవారీగా దరఖాస్తులు
మండలం దరఖాస్తుల సంఖ్య
బెజ్జూర్ 1,788
ఆసిఫాబాద్ 2,238
ఆసిఫాబాద్ రూరల్ 802
చింతలమానెపల్లి 1,907
దహెగాం 1,500
జైనూర్ 1,860
కాగజ్‌నగర్‌టౌన్ 2,633
కాగజ్‌నగర్‌రూరల్ 2,853
కెరమెరి 1,761
కౌటాల 2,027
లింగాపూర్ 793
పెంచికల్‌పేట్ 1,072
రెబ్బెన 2,827
సిర్పూర్(టి) 1,616
సిర్పూర్(యు) 893
తిర్యాణి 1,478
వాంకిడి 1,074