
‘రైతులను పట్టించుకోని సర్కార్’
కౌటాల(సిర్పూర్): రేవంత్‌రెడ్డి సర్కార్ రైతులను నట్టేటా ముంచిందని, రైతులను పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మండలంలోని సాండ్‌గాంలో వర్షంతో దెబ్బతిన్న పంటలను బుధవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా, రుణమాఫీ, పంటలకు బోనస్, దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. పంటలు నష్టపోయిన వారికి ఎకరానికి రూ.40 వేలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్నదాతలు పరిహారం అడుగుతారని ముందే నన్ను కోసినా రూపాయి లేదని సీఎం అంటున్నారని విమర్శించారు. ఆయన వెంట నాయకులు బండు పటేల్, రాజు, నవీన్, కార్తీక్, దిలీప్, రింకూ తదితరులు పాల్గొన్నారు.