
అర్హుల పేర్లు మాత్రమే జాబితాలో ఉండాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల పథకం జాబితా లో అర్హుల పేర్లు మాత్రమే ఉండాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఐదో వార్డు పరిధిలో గల బజార్‌వాడీలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో దరఖాస్తుదారు సాహెరా బేగం ఇంటిని గురువారం స్వయంగా సందర్శించారు. దరఖాస్తుదారు కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులకు సొంతింటి స్థలం ఉండాలని, నిబంధనల ప్రకారం 600 చదరపు అడుగుల లోపు ఇంటి నిర్మాణం చేపట్టాలన్నారు. లబ్ధిదారులు ఇంటిని సొంతంగా నిర్మించుకోవాలని, పనులు పూర్తయిన ప్రకారం నిధులు మంజూరు చేస్తారని స్పష్టం చేశారు. అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా పర్యవేక్షించాలని పరిశీలన అధికారి రాజ్‌కుమార్‌ను ఆదేశించారు.
కలెక్టర్ వెంకటేశ్ దోత్రే