
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
రెబ్బెన: బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి సీహెచ్‌పీలో లోడర్ ఆపరేటర్లకు వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. శనివా రం సీహెచ్‌పీ ఎస్‌ఈ కోటయ్యను కలిసి వేతనాలు చెల్లించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లోడర్ ఆపరేటర్లకు నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో కు టుంబాలను పోషించుకునేందుకు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపారు. క్రమం తప్పకుండా వేతనాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్ వేతనాలతో పాటు సీఎంపీఎఫ్ వివరాలు తెలియజేయాలని సూచించారు. సీఎంపీఎఫ్ ఖాతాలో జమ అవుతున్న మొత్తాలపై కార్మికులకు సమాచారం లేకపోవడంతో ఆందోళన గురవుతున్నారని తెలిపారు. ఆపరేటర్ల సమస్యలపై యాజమాన్యం స్పందించకుంటే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆపరేటర్లు నారాయణ, రాజు, మహేందర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.