breaking news
Jr NTR
-
'నా కథను ఎన్టీఆర్‌తో చేయించండి'
కోలీవుడ్ నటుడు శింబు (Silambarasan TR), దర్శకుడు వెట్రిమారన్ (Vetri Maaran) కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అరసన్’ (Arasan). తెలుగులో ‘సామ్రాజ్యం’ (Saamrajyam) పేరుతో విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా తెలుగు వర్షన్ ప్రోమోను జూనియర్ ఎన్టీఆర్ (NTR) విడుదల చేశారు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు చెప్పారు.ప్రోమో పేరుతో విడుదల చేసిన ఈ వీడియో ఏకంగా 5 నిమిషాలకు పైగానే ఉంది. వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన వడ చెన్నై యూనివర్స్‌లో భాగంగానే సామ్రాజ్యం చిత్రం తీస్తున్నారు. ఇందులో ధనుష్ కూడా అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఉత్తర చెన్నై నేపథ్యంలోని గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ప్రోమోలో మీడియా ప్రతినిధులు తన కథ గురించి చెప్పాలని శింబును అడుగుతారు. దానికి అతను "నా కథను ఎవరితో చేయిద్దామనుకుంటున్నారు.. ఎన్టీఆర్‌తో చేయించండి కుమ్మేస్తాడు" అనే డైలాగ్ చెప్తాడు. ఇప్పుడు సోషల్‌మీడియాలో అది ట్రెండ్ అవుతుంది. -
వెండితెరపై సినీ జీవితం
సైన్స్, స్పోర్ట్స్, పాలిటిక్స్... ఇలా వివిధ రంగాల్లోని ప్రముఖుల జీవితాల ఆధారంగా రూపొందే బయోపిక్స్‌లో సినీ తారలు నటించడం చూస్తూనే ఉన్నాం. ఈ కోవలో ఇప్పటివరకు చాలా బయోపిక్స్ వచ్చాయి. మరికొన్ని బయోపిక్స్ రానున్నాయి. అయితే వీటిలో సినీ తారల బయోపిక్స్ చాలా తక్కువగా వస్తుంటాయి. కానీ సడన్‌గా ఇప్పుడు బాలీవుడ్లో సినీ తారల జీవితం ఆధారంగా రూపొందే బయోపిక్స్ సంఖ్య ఎక్కవైంది. మరి... ఏ స్టార్స్ బయోపిక్స్ వెండితెరపైకి రానున్నాయి? ఈ తారల బయోపిక్స్‌లో ఎవరు నటించనున్నారు? అన్న వివరాలపై ఓ లుక్ వేయండి.ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదా సాహెబ్ ఫాల్కేను ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా చెప్పుకుంటాం. పూర్తి నిడివితో తొలి భారతీయ సినిమా తీసిన వ్యక్తిగా దాదా సాహెబ్ ఫాల్కే ఘనత గొప్పది. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏటా దాదా సాహెబ్ ఫాల్కే పేరిట అవార్డును ప్రదానం చేస్తుంది. ఇలాంటి ప్రముఖ వ్యక్తి జీవితం ఆధారంగా సినిమా అంటే ప్రేక్షకుల్లోనే కాదు... ఇండస్ట్రీ వర్గాల్లోనూ క్రేజ్ ఉంటుంది. దాదా సాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌లో ఆమిర్ ఖాన్ నటించనున్నారు. దాదా సాహెబ్ ఫాల్కేగా ఆయన కనిపిస్తారు.ఆమిర్ ఖాన్‌తో గతంలో ‘పీకే, 3 ఇడియట్స్’ వంటి సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్స్ తీసిన రాజ్‌కుమార్ హిరాణి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్‌లో నటించనున్నట్లుగా ఆమిర్ ఖాన్ కూడా వెల్లడించారు. రాజ్‌కుమార్ హిరాణి, అజిభిత్ జోషి, హిందుకుష్ భరద్వాజ్, ఆవిష్కర్ భరద్వాజ్ ఈ సినిమా స్క్రిప్ట్‌పై నాలుగు సంవత్సరాలుగా పని చేస్తున్నారు. ఈ బయోపిక్కు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ పనులు ఇటీవలి కాలంలో మరింత ఊపందుకున్నాయట. వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుందని సమాచారం. ఈ సినిమాకు దాదా సాహెబ్ మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ స పోర్ట్ చేస్తున్నారు. మేడ్ ఇన్ ఇండియా: ‘మేడ్ ఇన్ ఇండియా’ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించనున్నట్లుగా ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి 2023 సెప్టెంబరులో ప్రకటించిన సంగతి తెలిసిందే. హిందీ చిత్రం ‘నోట్ బుక్’ ఫేమ్ నితిన్ కక్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లుగా, కార్తికేయ, వరుణ్ గుప్తా నిర్మించనున్నట్లుగా ఈ ‘మేడ్ ఇన్ ఇండియా’ అనౌన్స్మెంట్లో ఉంది.అయితే దాదా సాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారని, అందుకే రాజమౌళి ఈ సినిమాలో భాగమయ్యారని, ఇందులో దాదా సాహెబ్ ఫాల్కేగా ఎన్టీఆర్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక ఈ సినిమాను 2023 సెప్టెంబరులో ప్రకటించినప్పటికీ ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. సో... ఈ చిత్రంపై స్పష్టత రావాల్సి ఉంది.మ్యూజిక్ మేస్ట్రో ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా బయోపిక్ వెండితెరపైకి రానున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌లో ఇళయరాజాగా ధనుష్ నటిస్తారు. గత ఏడాది మార్చిలో ఇళయరాజా బయోపిక్‌ను అధికారికంగా ప్రకటించారు. ధనుష్‌తో ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా తీసిన అరుణ్ మాథేశ్వరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈపాటికే పూర్తి స్థాయిలో ప్రారంభం కావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చిత్రీకరణ అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుందట.ప్రస్తుతం ధనుష్ రెండు, మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరో వైపు దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌ను హీరోగా పరిచయం చేసే సినిమా పనుల్లో అరుణ్ బిజీగా ఉన్నారు. ఇలా ధనుష్, అరుణ్‌ల ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత ‘ఇళయరాజా’ బయోపిక్ సెట్స్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ సమాచారం. అంతేకాదు... ఇళయరాజా బయోపిక్‌లో రజనీకాంత్, కమల్‌హాసన్‌లు గెస్ట్ రోల్స్‌లో నటిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కనెక్ట్ మీడియా, పీకే ప్రైమ్ ప్రోడక్షన్, మెర్క్యూరీ మూవీస్ సంస్థలు ఈ బయోపిక్‌ను నిర్మించనున్నట్లు అనౌన్స్మెంట్ పోస్టర్‌పై ఉంది.ఆమిర్ లేదా రణ్‌బీర్ ప్రఖ్యాత గాయకులు కిశోర్ కుమార్ బయోపిక్ వెండితెర పైకి రానుంది. ఈ బయోపిక్‌పై దర్శకుడు అనురాగ్ బసు ఎప్పట్నుంచో వర్క్ చేస్తున్నారు. ఈ బయోపిక్‌లో రణ్‌బీర్ కపూర్ నటించాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన నటించలేక పోయారు. ‘‘కిశోర్ కుమార్‌గారి బయోపిక్‌లో రణ్‌బీర్ కపూర్‌ను అనుకున్న మాట వాస్తవమే. కాక పోతే ఈ బయోపిక్కు బదులు ‘రామాయణ’ సినిమాను రణ్‌బీర్ కపూర్ ఎంపిక చేసుకున్నాడు. అప్పటి పరిస్థితుల్లో అతను మంచి నిర్ణయమే తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు అనురాగ్ బసు.కాగా కిశోర్ కుమార్ బయోపిక్‌లో ఆమిర్ ఖాన్ నటించనున్నారనే వార్తలు ప్రస్తుతం బాలీవుడ్లో తెరపైకి వచ్చాయి. ఇటీవల ఓ సందర్భంలో కిశోర్ కుమార్‌గారి బయోపిక్‌లో నటించే చాన్స్ వస్తే తప్పుకుండా చేస్తానన్నట్లుగా ఆమిర్ ఖాన్ కూడా చె΄్పారు. ఈ నేపథ్యంలో ఈ బయోపిక్‌లో ఆమిర్ ఖాన్ నటించే అవకాశం ఉందని ఊహించవచ్చు. కానీ కిశోర్ కుమార్ బయోపిక్కు అనురాగ్ బసు తొలుత రణ్‌బీర్ కపూర్‌ను అనుకున్నారు. అప్పట్లో కుదర్లేదు. అయితే ఇప్పుడు ‘రామాయణ’ సినిమా పూర్తి కావొచ్చింది. రణ్‌బీర్ కపూర్ చేస్తున్న మరో సినిమా ‘లవ్ అండ్ వార్’ చిత్రీకరణ కూడా తుది దశకు చేరుకుంటోంది.ఈ నేపథ్యంలో కిశోర్ కుమార్ బయోపిక్‌లో రణ్‌బీర్ కపూర్ నటించే అవకాశం లేక పోలేదు. పైగా దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్‌తో ఆమిర్ ఖాన్ బిజీ కానున్నారు. ఒకేసారి రెండు బయోపిక్స్‌లో ఆమిర్ ఖాన్ నటించడం సాధ్యం కాక పోవచ్చు కనుక కిశోర్ కుమార్‌గా వెండితెరపై రణ్‌బీర్ కపూర్ కనిపించే అవకాశం లేక పోలేదు.ఫైనల్‌గా కిశోర్ కుమార్ బయోపిక్‌లో ఎవరు నటిస్తారు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. మరోవైపు కిశోర్‌కుమార్ బయోపిక్ చేయాలని బాలీవుడ్ దర్శకుడు సూజిత్ సర్కార్ ఓ కథ రెడీ చేశారు. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్‌ను హీరోగా అనుకున్నారు. కానీ అనురాగ్ బసు చేస్తున్న ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్న సూజిత్ సర్కార్ తన ప్రయత్నాలను ఆపేశారు. ఈ విషయాలను సుజిత్ సర్కార్ ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించారు.గురుదత్ బయోపిక్‌లో విక్కీ? ‘సైలాబ్, కాగజ్ కె పూల్, ఫ్యాసా’ వంటి ఎన్నో క్లాసిక్ హిట్ ఫిల్మ్స్ తీసిన లెజెండరీ దర్శకుడు గురుదత్ జీవితం వెండితెర పైకి రానుందని బాలీవుడ్ సమాచారం. అల్ట్రా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఇందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ బయోపిక్కు భావనా తల్వార్ దర్శకత్వం వహిస్తారని, ‘ ఫ్యాసా’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారనే ప్రచారం బాలీవుడ్లో జరుగుతోంది. అంతేకాదు... ఈ సినిమాలో గురుదత్‌గా విక్కీ కౌశల్ నటిస్తారని, ఇందుకోసం మేకర్స్ ఆల్రెడీ ఈ హీరోతో సంప్రదింపులు జరుపుతున్నారని బాలీవుడ్ భోగట్టా. మరి... వెండితెరపై గురుదత్‌గా విక్కీ కౌశల్ నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.మధుబాల బయోపిక్ ‘ ఫ్యార్ కియాతో డర్నా క్యా...’ అంటూ వెండితెరపై అనార్కలిగా మధుబాల నటన అద్భుతం. 1960లో విడుదలైన ‘మొఘల్ ఏ అజం’ సినిమా మధుబాలకు అప్పట్లో దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాయే కాదు... పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు మధుబాల. దాదాపు 60 సినిమాల్లో నటించిన మధుబాల 36 సంవత్సరాల చిన్న వయసులో తుది శ్వాస విడిచారు. కాగా, మధుబాల బయోపిక్ రానుంది. గత ఏడాది మార్చిలో ఈ బయోపిక్‌ను అధికారికంగా ప్రకటించారు. ఆలియా భట్ హీరోయిన్గా నటించిన ‘డార్లింగ్స్’ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అయిన జస్మీత్ కె. రీన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్ సంస్థతో బ్రిజ్ భూషణ్ (మధుబాల సోదరి) మధుబాల బయోపిక్‌ను నిర్మించనున్నారు. ఈ చిత్రంలో మధుబాలగా ఆలియా భట్ లేదా ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రీ నటించనున్నారని టాక్. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మనీష్ మల్హోత్రా కూడా మధుబాల బయోపిక్‌ను నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో మధుబాలగా కృతీ సనన్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. కానీ మనీష్ మల్హోత్రా నిర్మించే మధుబాల బయోపిక్‌పై తమకు సమాచారం లేదన్నట్లుగా బ్రిజ్ భూషణ్ ఓ సందర్భంలో వెల్లడించారనే వార్తలు బాలీవుడ్ ఉన్నాయి.ట్రాజెడీ క్వీన్ దివంగత ప్రముఖ నటి, ట్రాజెడీ క్వీన్‌గా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న మీనా కుమారి జీవితం ఆధారంగా హిందీలో ‘కమల్ ఔర్ మీనా’ అనే సినిమా రానుంది. ఆల్రెడీ ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. కానీ ఇంకా పూర్తిస్థాయిలో ఈ సినిమా ప్రారంభం కాలేదు. తొలుత ‘కమల్ ఔర్ మీనా’ చిత్రానికి మనీష్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తారనే టాక్ వినిపించింది. ప్రస్తుతం ఈ మూవీకి దర్శకుడిగా సిద్ధార్థ్. పి మల్హోత్రా ఉన్నారు. అలాగే ఈ ‘కమల్ ఔర్ మీనా’లో మీనా కుమారిగా తొలుత కృతీ సనన్ పేరు వినిపించింది.కానీ ఆ తర్వాత కియారా అద్వానీ పేరు తెరపైకి వచ్చింది. అలాగే ఈ చిత్రంలోని దర్శకుడు కమల్ అమ్రోహిగా ఆయుష్మాన్ ఖురానా, రాజ్‌కుమార్ రావు వంటి హీరోల పేర్లు బాలీవుడ్లో వినిపిస్తున్నాయట. అయితే ఈ అంశాలపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఇక ఈ ఏడాది జూలైలో కియారా అద్వానీ ఓ పాపకు జన్మనిచ్చారు. దీంతో కియారాకు సెట్స్‌కు వచ్చేందుకు వీలుపడదు. ఇలా ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం అవుతోందట. వచ్చే ఏడాదిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావొచ్చని బాలీవుడ్ సమాచారం. అమ్రోహీ ఫ్యామిలీతో కలిసి సిద్ధార్థ్. పి. మల్హోత్రా, సరెగమా సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్నాయి.ది అన్‌టోల్డ్ స్టోరీ గ్లామరస్ క్వీన్‌గా వెండితెరపై ఓ వెలుగు వెలిగారు సిల్క్ స్మిత. ఆ తరం స్టార్ హీరోల సినిమాల్లో ఎన్నో స్పెషల్ సాంగ్స్ చేశారు. అయితే సిల్క్ స్మిత జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఉన్నాయి. జీవితంలో ఎన్నో చేదు అనుభవాలను కూడా ఎదుర్కొన్నారామె. ఎవరూ ఊహించని రీతిలో 1996 సెప్టెంబరు 23న సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె జీవితం ఆధారంగా హిందీలో ‘డర్టీ పిక్చర్’ అనే సినిమా వచ్చింది.విద్యాబాలన్ టైటిల్ రోల్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా సిల్క్ స్మిత జీవితం ఆధారంగానే మరో సినిమా రానుంది. ‘సిల్క్ స్మిత: ది అన్‌టోల్డ్ స్టోరీ’గా వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో సిల్క్ స్మితగా చంద్రికా రవి నటిస్తున్నారు. ఈ మూవీతో జయరామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇలా సినిమా తారల జీవితాల ఆధారంగా రూపొందనున్న మరికొన్ని బయోపిక్స్ చర్చల దశల్లో ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
దారుణంగా ఎన్టీఆర్ లుక్.. ఎందుకో తెలిస్తే..!
-
ఫ్లాష్‌బ్యాక్‌లో యాక్షన్
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది.ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ కోసం ఎన్టీఆర్ ఓ డిఫరెంట్ లుక్‌లోకి మారారని టాక్. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలు సినిమాలో హైలెట్‌గా నిలవనున్నాయట. ఇదిలా ఉంటే... ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్. ఈ చిత్రం 2026 జూన్ 25న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘వార్ 2’ రికార్డ్ : హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదలైంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ఈ నెల 6 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అత్యధిక మంది వీక్షించిన చిత్రాల జాబితాలో ‘వార్ 2’ చిత్రం టాప్‌లో ఉన్నట్లు ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ తెలిపింది. ఈ నెల 6 నుంచి 12 వరకూ 3.5 మిలియన్ల మంది వీక్షించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీంతో గత వారం ఇండియాలోనే ఎక్కువమంది చూసిన సినిమాగా ‘వార్ 2’ నిలిచింది. -
ఎన్టీఆర్ వార్-2.. బాక్సాఫీస్ నో క్రేజ్.. ఓటీటీలో సూపర్ రికార్డ్!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిత్రం వార్-2((War2 Movie)). ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ మూవీలో హృతిక్ రోషన్ కూడా నటించారు. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా.. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సినిమాలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా మెప్పించింది.అయితే ప్రస్తుతం వార్-2 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అక్టోబరు 09 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. తాజాగా ఈ చిత్రం డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో రికార్డ్ క్రియేట్ చేసింది. అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 12 వరకు ఇండియాలో అత్యధిక మంది వీక్షించిన సినిమాల జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది. 3.5 మిలియన్ల వ్యూస్‌తో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ క్రమంలోనే రజినీకాంత్ కూలీ, సన్ ఆఫ్ సర్దార్-2, మహావతార్ నర్సింహా, మదరాసి సినిమాలను దాటేసింది. ఈ విషయాన్ని ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.అయితే బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేని వార్-2 చిత్రానికి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో మాత్రం ఆదరణ దక్కించుకుంటోంది. దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. ఈ చిత్రంలో అనిల్ కపూర్, అశుతోష్ రాణా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. Top 5 most-watched films on OTT in India, for the week of Oct 6-12, 2025, estimated based on audience researchNote: Estimated number of Indian audience (in Mn) who watched at least 30 minutes. pic.twitter.com/1a4ouoYh45— Ormax Media (@OrmaxMedia) October 13, 2025 -
బావమరిది పెళ్లికి ఎన్టీఆర్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి..?
టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్ – శివానీ జంట కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన నితిన్ హ్యాట్రిక్ హిట్స్ అందుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. అక్టోబర్ 10న హైదరాబాద్‌లో నెల్లూరుకు చెందిన శివానీని ఆయన వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుకలో ఎన్టీఆర్ దంపతులే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తన సతీమణి లక్ష్మీ ప్రణతి ఆ ఇంటి ఆడపిల్ల కాబట్టి ప్రతి కార్యక్రమం ఆమె చేతుల మీదుగానే జరిపించారు. అయితే, తన బావమరిదికి పెళ్లి కానుకగా ఎన్టీఆర్ ఎలాంటి బహుమతి ఇచ్చారనేది సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది.కొత్త దంపతులు నితిన్–శివానీలకు పెళ్లి కానుకగా ఒక లగ్జరీ కారును ఎన్టీఆర్ ఇచ్చారని సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. నితిన్ అంటే ఎన్టీఆర్‌కు చాలా ఇష్టం. గతంలో ఇదే మాట తారక్ కూడా చెప్పారు. తనకు సినిమా ఛాన్సులు రావడం వెనుక ఎన్టీఆర్ ప్రధానంగా ఉన్నారని తెలిసిందే. ఇప్పుడు తన బావమరిదికి ఏకంగా కారును గిఫ్ట్‌గా ఇచ్చాడని తెలుస్తోంది. ఈ విషయంలో అధికారికంగా ప్రకటన లేనప్పటికీ రూమర్స్ మాత్రం బలంగానే వైరల్ అవుతున్నాయి.పారిశ్రామికవేత్త నార్నె శ్రీనివాసరావు కుమారుడైన నితిన్ 2023లో ‘మ్యాడ్’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఆయ్, మ్యాడ్ స్క్వేర్ వంటి వరుస సినిమాలతో హిట్ అందుకున్నారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నార్నె నితిన్ దంపతులు (చిత్రాలు)
-
పాన్ ఇండియా మూవీ వాయిదా.. ఎన్టీఆర్ అభిమానుల్లో నిరాశ!
-
అక్క- బావ కాళ్లకు మొక్కిన నార్నె నితిన్.. వీడియో వైరల్
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది, యంగ్ హీరో నార్నె నితిన్ వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో శంకర్‌పల్లిలో ఈ వివాహ వేడుక జరిగింది. నెల్లూరు జిల్లాకు చెందిన వెంకట కృష్ణ ప్రసాద్ – స్వరూప దంపతుల కుమార్తె శివానీతో కలిసి నితిన్ ఏడడుగులు వేశారు. శుక్రవారం (అక్టోబర్ 10) రాత్రి జరిగిన ఈ పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అయితే, ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతితో పాటు కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లు అక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కల్యాణ్ రామ్, రానా వంటి స్టార్ హీరోలు కూడా పెళ్లిలో సందడి చేశారు.కొత్త దంపతులను ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి ఆశీర్వదించారు. ఆ సమయంలో నితిన్ తన బావ ఎన్టీఆర్ కాళ్లకు నమస్కారం చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆపై తారక్ కూడా వారిద్దరినీ చాలా ఆత్మీయతతో హగ్ చేసుకున్నారు. పెళ్లికి వచ్చిన అతిథుల్ని కూడా తారక్ దంపతులే దగ్గరుండి ఆహ్వానించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నె శ్రీనివాసరావు కుమారుడైన నితిన్ ‘మ్యాడ్’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారనే విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_) -
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ పెళ్లి వేడుక (ఫోటోలు)
-
గ్రాండ్‌గా నార్నే నితిన్ పెళ్లి వేడుక.. బామ్మర్ది పెళ్లిలో జూనియర్ ఎన్టీఆర్ సందడి!
మ్యాడ్ స్క్వేర్ హీరో నార్నే నితిన్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. శివానీ అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ మూవీతో అభిమానులను అలరించిన టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్.. గతేడాది శివానీ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. తాజాగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు ఈ జంట. తాజాగా ఇవాళ జరిగిన పెళ్లి వేడుకలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతితో పాటు తన కుమారులు అభయ్, భార్గవ్లతో సందడి చేశారు. పెళ్లికూతురి బ్యాక్ గ్రౌండ్ ఇదే..కాగా.. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్ చంద్రకు.. నెల్లూరు జిల్లాకు చెందిన శివానితో గతేడాది నవంబర్ 3న నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్‌లో ఇరువురి కుటుంబ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం గ్రాండ్‌గా నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో యువతి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. హీరో వెంకటేష్ కుటుంబంతో వారికి దగ్గర బంధుత్వం కూడా ఉందట. శివానీ టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్‌కు కజిన్ డాటర్ అవుతుంది. ఆమె తల్లిదండ్రులు తాళ్లూరి వెంకట కృష్ణప్రసాద్ – స్వరూప దంపతులు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన నార్నే శ్రీనివాసరావు తనయుడే నార్నే నితిన్. 2023లో మ్యాడ్ సినిమాతో ఎన్టీఆర్‌కు బావ మరిదిగా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ మూవీతో ప్రేక్షకులను మెప్పించారు.కాగా.. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్(Narne Nithin) 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్', 'ఆయ్' వంటి సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ సినిమాల కంటే ముందుగానే ఆయన 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు'(Sri Sri Sri Raja Vaaru) అనే మూవీలో నటించారు. అదే నార్నే నితిన్ నటించిన మొదటి చిత్రం కావడం విశేషం. Mana tarak Anna 😍👌🔥 at Nithin naren wedding #JrNTR @tarak9999 pic.twitter.com/sRVaBcBZR6— NTR Fans (@NTR2NTR_FC) October 10, 2025 -
రాజమౌళికి 'జక్కన్న' పేరు ఎవరు పెట్టారో తెలుసా? (ఫోటోలు)
-
టాలీవుడ్ హీరో పెళ్లి సందడి.. ఎన్టీఆర్ బామ్మర్ది మ్యారేజ్ డేట్ ఫిక్స్!
ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ మూవీతో అభిమానులను అలరించిన టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్. వరుసకు మన యంగ్ టైగర్ బామ్మర్ది అయిన నార్నే నితిన్.. శివానీ అనే అమ్మాయితో గతేడాది ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఈ నిశ్చితార్థ వేడుకలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతితో పాటు తన కుమారులు అభయ్, భార్గవ్లతో కలిసి వేడుకలో సందడి చేశారు. ఈ నిశ్చితార్థానికి హీరో కల్యాణ్ రామ్, వెంకటేశ్ కూడా హాజరయ్యారు.తాజాగా వీరిద్దరి పెళ్లికి సంబంధించిన క్రేజీ న్యూస్ వైరలవుతోంది. నార్నే నితిన్- శివాని త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి పెళ్లి తేదీ ఫిక్స్ అయినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తాజాగా సమాచారం ప్రకారం వీరి వివాహ వేడుక అక్టోబర్ 10న గ్రాండ్‌గా జరగనుందని టాక్. ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లిలో వీరి వివాహం ఘనంగా జరగనుందట. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.కాగా.. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్చంద్రకు.. నెల్లూరు జిల్లాకు చెందిన శివానితో నేడు నవంబర్ 3న నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్‌లో ఇరువురి కుటుంబ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం గ్రాండ్‌గా నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో యువతి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. హీరో వెంకటేష్ కుటుంబంతో వారికి దగ్గర బంధుత్వం కూడా ఉందట. శివానీ టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్‌కు కజిన్ డాటర్ అవుతుంది. ఆమె తల్లిదండ్రులు తాళ్లూరి వెంకట కృష్ణప్రసాద్ – స్వరూప దంపతులు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన నార్నే శ్రీనివాసరావు తనయుడే నార్నే నితిన్. 2023లో మ్యాడ్ సినిమాతో ఎన్టీఆర్‌కు బావ మరిదిగా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్ మూవీతో ప్రేక్షకులను మెప్పించారు. -
దేవర 2 బిగ్ ట్విస్ట్..
-
దేవర 2 బిగ్ ట్విస్ట్.. ఎన్టీఆర్ తో స్టార్ హీరో..!
-
వార్2 ఫలితంపై స్పందించిన 'హృతిక్ రోషన్'
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan), జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా వార్2.. ఆగష్టు 14న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేదు. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. ఈ ఫ్రాంఛైజీలోకి ఎన్టీఆర్ రావడంతో వార్2 కోసం తెలుగు వారు కూడా మరింత ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, టాలీవుడ్లో దారుణమైన నెగటివ్ రివ్యూలు కనిపించడంతో పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఫలితం గురించి హృతిక్ రోషన్ ఒక పోస్ట్ చేశారు.వార్2 గురించి హృతిక్ ఇలా చెప్పారు. 'వార్2లో కబీర్ పాత్ర పోషించడం చాలా సరదాగా అనిపించింది. ప్రాజెక్ట్ మొత్తం చాలా రిలాక్స్డ్గా పూర్తి చేశాను. నాకు ఆ పాత్ర గురించి పూర్తిగా తెలుసు కాబట్టి చాలా సులువు అయింది. ఒక నటుడిగా సినిమా కోసం నేను చేయాల్సింది చేశాను. సెట్స్‌లో నా పని పూర్తి అయిన తర్వాత ఇంటికి రావడం.. మరుసటి రోజు షెడ్యూల్ ఏంటో చూసుకోవడం జరిగేది. నా దర్శకుడు అయాన్ నన్ను చాలా బాగా చూసుకున్నాడు. సెట్లో అతను ఎప్పుడూ కూడా చాలా ఎనర్జీగా కనిపిస్తూ ఉండటం చాలా సంతోషాన్ని ఇచ్చింది. సినిమా చేస్తున్నంత కాలం ప్రతిదీ చాలా పరిపూర్ణంగా అనిపించింది. నా పని నేను పూర్తి చేస్తే సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకం.. కానీ, వెనుక నుంచి మమ్మల్ని ఏదో పదేపదే ఆపుతున్న ఒక శబ్ధం వినిపించేది. ప్రతి సినిమా ఒక చిత్రహింసలా, ఒక గాయంలా ఉండాల్సిన పనిలేదు. జస్ట్ రిలాక్స్" అని హృతిక్ పోస్ట్ చేశాడు.వార్ 2 సినిమాకి ఎక్కువగా నెగటివ్ రివ్యూలే వచ్చాయి. రూ. 400 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన వార్ 2 రూ. 236.55 కోట్లు వసూలు చేసిందని నివేదికలు చెబుతున్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2019లో విడుదలైన వార్ కంటే తక్కువ మొత్తంలో వసూలు చేసింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ. 318.01 కోట్లు వసూలు చేసింది. View this post on Instagram A post shared by Hrithik Roshan (@hrithikroshan) -
కాంతార 1 టీమ్‌పై 'ఎన్టీఆర్' కామెంట్స్
‘కాంతార:చాప్టర్1’ (Kantara Chapter 1) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు మరింత క్రేజ్ దక్కింది. తాజాగా ఈ సినిమా విడుదల సందర్భంగా తారక్ చిత్ర యూనిట్‌ను అభినందించారు. నేడు విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం తనకెంతో సంతోషాన్ని ఇస్తుందని ఈ క్రమంలో కాంతార1 టీమ్‌కు అభినందనలు చెప్పారు.కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార-1 మంచి విజయాన్ని సొంతం చేసుకుందని తారక్ అన్నారు. ముఖ్యంగా రిషబ్‌శెట్టి నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా ఎవ్వరి ఊహకు అందని అద్భుతాన్ని క్రియేట్ చేశాడని కొనియాడారు.. రిషబ్ మీద నమ్మకాన్ని ఉంచి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ వారికి శుభాకాంక్షలు అంటూ తారక్ ఒక పోస్ట్ చేశారు. కాంతార చాఫ్టర్ 1లో రిషబ్ శెట్టి నటిస్తూనే దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీలో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 7వేలకు పైగా స్క్రీన్లలో ‘కాంతార: చాప్టర్1’ను విడుదల చేశారు. దీంతో మొదటిరోజు భారీ కలెక్షన్స్ రావచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
Devara 2: బాహుబలి 2 పుష్ప 2ని మించి..
-
జూనియర్ ఎన్టీఆర్ దేవర-2.. కొరటాల శివ బిగ్ ప్లాన్!
జూనియర ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం దేవర పార్ట్-1. గతేడాది దసరా సందర్భంగా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో మెప్పించారు. సముద్రం బ్యాక్ డ్రాప్లో వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది.దేవర సూపర్ హిట్ కావడంతో పార్ట్-2 కూడా ఉంటుందని కొరటాల శివ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ కోసం ప్లాన్ రెడీ చేస్తున్నారు. దాదాపు స్క్రిప్ట్ అంతా ఇప్పటికే పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేవర-2కు సంబంధించిన నెట్టింట ఓ బజ్ నడుస్తోంది. పార్ట్-2 కోసం ఓ పవర్ఫుల్ రోల్‌ను కొరటాల క్రియేట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ రోల్లో తమిళ స్టార్ శింబును అనుకుంటున్నట్లు లేటేస్ట్ టాక్.అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. కథలో బలమైన ప్రభావం చూపించేలా దేవర-2 స్క్రిప్ట్‌లో మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. శింబు అయితే ఈ పవర్ఫుల్ రోల్‌కు సెట్ అవుతాడని కొరటాల అతని వైపే మొగ్గు చూపుతున్నారని టాక్. ఈ విషయంపై ప్రస్తుతం అతనితో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఏదేమైనా దేవర-2 రోల్ కోసం శింబు పేరు తెరపైకి రావడంతో కోలీవుడ్ ఫ్యాన్స్ సైతం ఖుషీ అవుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.Buzz - For #Devara2, Koratala Siva has made significant changes to the script to create a stronger impact....🤞🏼 He has crafted a powerful character in this film...👀 The producer has planned to cast a new actor in this role, and discussions are underway suggesting that Tamil… pic.twitter.com/5kx8QAlQUY— Movie Tamil (@_MovieTamil) September 30, 2025 -
‘కాంతార: చాప్టర్ 1’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ (ఫొటోలు)
-
దేవర పార్ట్ 2 రిలీజ్ ఎప్పుడంటే
-
'దేవర'కు ఏడాది.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్
ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ సినిమా దేవర ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తాజాగా సీక్వెల్‌ను ప్రకటించారు. అందుకు సంబంధించిన ఒక పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. దేవర విడుదలైన మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్లు (గ్రాస్) సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఫైనల్‌గా రూ. 500 కోట్ల మార్క్‌ను ఈ చిత్రం చేరుకుంది. ఏకంగా ఆరు కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. తారక్ కెరీర్లో బిగ్గెస్ట్ చిత్రంగా నిలిచిన ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కించారు. ఈ మూవీతోనే జాన్వీకపూర్ తొలిసారి తెలుగు తెరపై మెరిసింది. ఇందులో సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్ వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటించారు.బాలీవుడ్ చిత్రం వార్2తో కాస్త నిరాశపరిచిన ఎన్టీఆర్ త్వరలో ఒక బలమైన చిత్రంతో రానున్నారు. ఎన్టీఆర్ (NTR), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వచ్చే ఏడాది జూన్ 25న ఈ చిత్రం విడుదల కానుందని ఇప్పటికే ప్రకటించారు. దీనికి ‘డ్రాగన్’ అనే పేరు పరిశీలనలో ఉందని ప్రచారం జరుగుతుంది. త్రివిక్రమ్- ఎన్టీఆర్ కాంబినేషన్లో కూడా ఒక సినిమా ఉన్న విషయం తెలిసిందే. జైలర్ సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో కూడా ఎన్టీఆర్ ఒక సినిమా చేసే అవకాశం ఉంది. ఇలా భారీ లైనప్‌తో ఉన్న తారక్ నుంచి మొదట వెండితెరపైకి వచ్చేది మాత్రం ప్రశాంత్ నీల్ చిత్రమే కావడం విశేషం. ఆ తర్వాతే మిగిలిన దర్శకుల ప్రాజెక్ట్‌లు పట్టాలెక్కనున్నాయి. -
కాంతార కోసం వస్తున్న ఎన్టీఆర్.. జోష్‌లో ఫ్యాన్స్
‘కాంతార:చాప్టర్1’ (Kantara Chapter 1) ట్రైలర్ దుమ్మురేపుతుంది. పాన్ ఇండియా రేంజ్లో ఏకంగా 150 మిలియన్ల వ్యూస్ దాటేసింది. అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల కానున్నడంతో ప్రమోషన్స్ విషయంలో కూడా చిత్ర యూనిట్ జోరు పెంచింది. కన్నడ ప్రాంతీయ చిత్రంగా విడుదలైన కాంతార తెలుగులో కూడా భారీ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ప్రీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ రావడం విశేషం.ఎన్టీఆర్, రిషబ్ శెట్టి మధ్య స్నేహబంధం ఉంది. ఇటీవల, జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి కర్ణాటకలోని ఉడిపిని సందర్శించినప్పుడు రిషబ్ శెట్టి వారికి ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 28న జరిగే కాంతార ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా వస్తున్నారు. హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. కార్యక్రమానికి సంబంధించిన ఒక పోస్టర్‌ను చిత్ర మేకర్స్ విడుదల చేశారు.కాంతార చాఫ్టర్ 1లో రిషబ్ శెట్టి నటిస్తూనే దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్ వెర్షన్‌ను కూడా విడుదల చేస్తున్నారు. దక్షిణ అమెరికాలో ఫస్ట్ పార్ట్‌కు ఆదరణ దక్కడంతో ప్రీక్వెల్‌ను స్పానిష్‌లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 7వేలకు పైగా స్క్రీన్లలో ‘కాంతార: చాప్టర్1’ను విడుదల చేయనున్నారు. -
ఇండియన్ సినిమా ఐకాన్‌కు దక్కిన గౌరవం.. జనతా గ్యారేజ్ నటుడికి విషెస్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. సినీ రంగంలో అందించే ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. నిజమైన ఇండియన్ సినిమా ఐకాన్‌కు దక్కిన గౌరవమని ట్వీట్ చేశారు. కాగా.. కేంద్ర ప్రభుత్వం 2023 ఏడాదికి గానూ సినీ పరిశ్రమలో అందించే అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది.జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రంలో మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. 2016లో వచ్చిన ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించింది. కాగా.. మోహన్ లాల్ మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించారు.Heartiest congratulations to the legendary @Mohanlal sir on being honoured with the prestigious Dadasaheb Phalke Award.A true icon of Indian cinema, this recognition is well deserved.— Jr NTR (@tarak9999) September 21, 2025 -
షూటింగ్లో ఎన్టీఆర్‌కు ప్రమాదం
జూ.ఎన్టీఆర్ గాయపడ్డాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' అనే సినిమా చేస్తున్నాడు. రీసెంట్‌గానే జిమ్‌లో తారక్ వర్కౌట్ చేస్తున్న ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. తాజాగా హైదరాబాద్‌లో ఓ యాడ్ షూటింగ్ జరుగుతోంది. ఇందులో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. అయితే ఓ ప్రమాదం జరగ్గా.. తారక్‌కి స్వల్ప గాయాలయ్యాయి.(ఇదీ చదవండి: హీరోయిన్ సదా ఇంట్లో తీవ్ర విషాదం)స్టేజీపై ఓ చివరన నిలబడి ఉండగా అనుకోకుండా ఎన్టీఆర్ కింద పడ్డాడని దీంతో ఊపిరితిత్తులు, చేయి మధ్య భాగాన కాస్త అసంతృప్తికి గురయ్యారని డాక్టర్స్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఒకటి రెండు వారాల పాటు విశ్రాంతిని వైద్యులు సూచించినట్లు ఎన్టీఆర్ టీమ్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తారక్ ఇంట్లోనే ఉన్నారని, అభిమానులెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని పేర్కొది.గతేడాది 'దేవర'తో వచ్చిన తారక్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్‌తో భారీ మైథలాజికల్ మూవీ ఉండనుంది. దీని తర్వాత తమిళ దర్శకుడు నెల్సన్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: హీరో శర్వానంద్ దంపతులు విడిపోయారా?) -
Jr Ntr: 7 వారాల్లో... 10 కిలోల బరువు తగ్గిన టైగర్
-
పాన్ ఇండియా షేక్..! ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కించే అప్డేట్
-
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబో.. జిమ్‌లో యంగ్ టైగర్‌ను చూశారా!
జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో భారీ యాక్షన్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ తొలి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. కేజీఎఫ్ డైరెక్టర్‌తో మొదటిసారి జతకట్టడంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ త్వరలోనే అమెరికాలో ప్రారంభం కానుంది. ఇవాళ ఎన్టీఆర్ యూఎస్ కాన్సులేట్‌కు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియా వైరల్‌గా మారాయి.తాజాగా ఎన్టీఆర్‌కు సంబంధించిన మరో వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. జిమ్‌లో చెమడ్చోస్తున్న వీడియో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ఎన్టీఆర్ బీస్ట్ మోడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ కోసమే జూనియర్ బరువు తగ్గుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇది చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ మ్యాన్ ఆఫ్ మాసెస్ న్యూ లుక్ అంటూ పోస్టులు పెడుతున్నారు. BEAST MODE ACTIVATED by Man of Masses @tarak9999 🐉💪🔥#JrNTR #NTRNeel #Dragon #TFNReels #TeluguFilmNagar pic.twitter.com/cf44pPs0N3— Telugu FilmNagar (@telugufilmnagar) September 16, 2025 -
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ.. ఇంటర్నేషనల్ షూట్‌కు అంతా రెడీ!
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో జతకట్టారు. కేజీఎఫ్ డైరెక్టర్ తెరకెక్కించనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పీరియాడికల్ యాక్షన్ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పెట్టనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇండియాలో తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా లోకేషన్స్ వెతుకుతున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇంటర్నేషనల్ టచ్ ఇచ్చేలా ఈ మూవీని విదేశాల్లో చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారట. కొత్త షెడ్యూల్ చిత్రీకరణ విదేశాల్లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. అది నిజమేనని ఇవాల్టితో నిజమైంది.తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌కు వెళ్లారు. ప్రశాంత్ నీల్‌తో సినిమా షూటింగ్ కోసం వీసా అనుమతుల కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ ట్విటర్లో షేర్ చేసింది. యంగ్ టైగర్‌తో ఉన్న ఫోటోలను పంచుకుంది.అమెరికా కాన్సులేట్‌కు విచ్చేసిన ఎన్టీఆర్‌ను స్వాగతించడం అనందంగా ఉందని లారా విలియమ్స్ తెలిపింది. యునైటెడ్ స్టేట్స్లో చిత్రీకరణ.. రాబోయే ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం.. కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ మధ్య సంబంధాలను బలోపేతం చేస్తాయని ట్వీట్ చేసింది. దీంతో ఎన్టీఆర్- నీల్ చిత్రం మూవీ షెడ్యూల్ త్వరలోనే అమెరికాకు షిఫ్ట్ కానుంది.కాగా... ప్రశాంత్ నీల్ కేజీఎఫ్‌లాగే కోలార్ గోల్డ్ ఫీల్డ్, సలార్‌లా ఖాన్సార్ ప్రాంతాలు ఉన్నట్లే ఈ సినిమాలో కూడా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని టాక్. అందుకే ఈ సినిమాను పలు విదేశీ లొకేషన్స్‌లో షూట్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ టీ–సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్‌రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది.Excited to welcome @tarak9999 to the Consulate! His recent & upcoming projects filmed in the United States showcase the power of partnership, creating jobs, and strengthening ties between India & the United States. pic.twitter.com/ZTFLxOgPNl— U.S. Consul General Laura Williams (@USCGHyderabad) September 16, 2025 -
రామ్ చరణ్, జూ.ఎన్టీయార్.. చేతి వాచీలు అంత ఖరీదా?
సగటు మనిషికి చేతి గడియారం అంటే సమయాన్ని తెలుసుకునే ఒక అవసరమైన వస్తువు మాత్రమే కావచ్చు. కానీ సెలబ్రిటీలకు, ఇది ఒక స్టైల్ స్టేట్మెంట్, పెట్టుబడి, స్టేటస్ సింబల్... అంతేకాదు అన్నింటికీ మించి ఒక కళా ఖండం కూడా. బాలీవుడ్ తారల నుంచి క్రికెటర్లు వ్యాపార దిగ్గజాల వరకు, భారతదేశంలోని అత్యంత ప్రముఖు వ్యక్తులలో కొందరు లగ్జరీ కార్లు లేదా బహుళ అంతస్తుల భవనాల కంటే ఎక్కువ ఖరీదు పెట్టి కేవలం చేతి గడియారాలను కలిగి ఉన్నారంటే.. అర్ధమవుతుంది విలాసం అనేది ఏ స్థాయిలో పెరిగిందో...ఒక్కసారి ఖరీదైన చేతివాచీలు కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితా చూద్దామా...అత్యంత ఖరీదైన వాచీ ఎవరిదంటే...నెం1 సినిమా తారల్ని సైతం ఇంటి ముంగిట డ్యాన్స్ చేయించేంత డబ్బు, పలుకుబడి ఉన్న భారతదేశపు కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడి వాచీ అత్యంత ఖరీదైనదిగా తెలుస్తోంది. ఇప్పటివరకు తయారు చేయబడిన అత్యంత సంక్లిష్టమైన గడియారాలలో ఒకటైన పటేక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్స్ స్కై మూన్ టూర్‌బిల్లాన్ ను అనంత్ అంబానీ కలిగి ఉన్నాడు. ఆ చేతి వాచీ విలువఏకంగా రూ. 70.48 కోట్లు , ఇది డబుల్ డయల్స్ తో ఖగోళ విధులను సైతం అందిస్తుంది, ఇది చేతివాచీల తయారీ శాస్త్రమైన హోరాలజీలో ఒక గొప్ప కళాఖండంగా ఖ్యాతి పొందింది.కండల వీరుడూ...కాస్ట్లీ వాచ్బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సైతం రూ. 64.43 కోట్లు విలువైన పటేక్ ఫిలిప్ అక్వానాట్ హౌట్ జోయిలెరీ రెయిన్ బో జెమ్‌స్టోన్స్, డైమండ్స్ వాచ్‌ను ధరిస్తాడు. విలువైన రాళ్లతో కూడిన అద్భుతమైన ఇంద్రధనస్సుతో, ఈ చేతివాచీ అతని ఆడంబరమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.పాండ్యా... వాచ్ ఇట్...ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా పిచ్ మీద బ్యాట్‌తో తన ఆటతీరుకు మాత్రమే కాదు బయట తన విలాసవంతమైన జీవనశైలికి కూడా అంతే ప్రసిద్ధి చెందాడు. అతని పటేక్ ఫిలిప్ నాటిలస్ ట్రావెల్ టైమ్ బ్లూ డైమండ్ బాగెట్స్ చేతి వాచీ దర ఏకంగా రూ. 43.83 కోట్లు వజ్రాల ధగధగలతో ఇది మైదానంలో అతని బ్యాటింగ్ మెరుపుల్ని తలపిస్తుంది.రిచ్ దా...బాద్షా...భారతదేశపు ర్యాప్ స్టార్ బాద్షా ‘‘రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్ఫైవ్3–01 టూర్‌బిల్లాన్ పాబ్లో మాక్ డోనఫ్’’ లిమిటెడ్ ఎడిషన్ ను కలిగి ఉన్నాడు. ఇది అడ్వాన్స్డ్ డిజైన్స్ తో ఈ రూ. 24.85 కోట్లు ఖరీదు చేస్తుంది. ఈ వాచ్ అతని సంగీతం లాగే మహా బోల్డ్‌గా ఉంటుంది.యంగ్ టైగర్...వాచ్ కా షేర్...టాలీవుడ్ గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ‘‘రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్ 40–01 మెక్లారెన్ స్పీడ్‌టైల్ ఆటోమేటిక్ టూర్‌బిల్లాన్ ’’ను కలిగి ఉన్నాడు. దీని ధర రూ. 8.93 కోట్లు. రేసింగ్–ప్రేరేపిత డిజైన్ కలిగిన ఈ వాచీ ఆయన పవర్ ప్యాక్డ్, శక్తివంతమైన పెర్మార్మెన్స్కు సరిగ్గా నప్పుతుంది.→ పటేక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్స్ పెర్పెచువల్ క్యాలెండర్ క్రోనోగ్రాఫ్ క్లాసిక్ వాచీని బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ ధరిస్తాడు. ఆయన దీని కోసం రూ. 6.48 కోట్లు ఖర్చు చేశాడు→ క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ రంగురంగుల రోలెక్స్ ఓయిస్టర్ పెర్పెచువల్ కాస్మోగ్రాఫ్ డేటోనా రెయిన్ బో వాచీని వినియోగిస్తాడు. దీని ధర రూ. 4.36 కోట్లు ఇది రోలెక్స్ అత్యంత అద్భుతమైన పీస్‌లలో ఒకటి.→ మరో ప్రముఖ భారతీయ క్రికెటర్ రోహిత్ శర్మ: రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్65–01 వాచీని వాడతాడు. దీని ధర రూ. 4.36 కోట్లు.→ బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా ఎవెరోస్ వాచ్ ఖరీదు రూ. 4.25 కోట్లు.→ టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్: జాకబ్ – కో. ఆస్ట్రోనోమియా సోలార్ కాన్సెటలేషన్స్ వాచీని వినియోగిస్తున్నాడు. దీని ధర రూ. 3.05 కోట్లు.→ గాయకుడు, నటుడు యో యో హనీ సింగ్ రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్ 011 ఫెలిపే మాస్సా వాచీతో కనిపిస్తాడు. ఈ వాచీ ఖరీదు రూ. 2.18 కోట్లు.→ అంబానీల కుటుంబానికి చెందిన ఆకాష్ అంబానీ రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్67–02 బ్రాండ్‌ని ధరిస్తాడు. ఈ వాచీ విలువ రూ. 2.51 కోట్లు. -
జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా.. మంచు మనోజ్ ఆసక్తికర సమాధానం!
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరో విలక్షణ పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ ఏడాది భైరవం మూవీతో మెప్పించిన మనోజ్ మిరాయ్తో అలరించనున్నారు. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వస్తోన్న ఈ చిత్రంలో విలన్‌గా అభిమానులను మెప్పించనున్నారు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో తెరకెక్కించిన మిరాయ్ ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ తన అభిమానులతో ఎక్స్ వేదికగా ఇంటరాక్షన్ నిర్వహించారు. ఆస్క్ బ్లాక్స్వార్డ్ పేరుతో నిర్వహించిన ఇంటరాక్షన్‌లో ఫ్యాన్స్ పలు రకాల ప్రశ్నలు అడిగారు. ఓ అభిమాని నిన్ను, జూనియర్ ఎన్టీఆర్‌ను తెరపై చూడాలన్న కోరిక ఉందని అడిగాడు. దీనికి మంచు మనోజ్ స్పందిస్తూ..నాది కూడా అదే కోరిక అంటూ రిప్లై ఇచ్చారు.మరో అభిమాని మీరు నంద్యాలకు ఎప్పుడు వస్తారు అన్న అని అడిగాడు. దీనికి మనోజ్ స్పందిస్తూ.. మిరాయ్ సెలబ్రేట్ చేసుకునేందుకు వస్తా.. నంద్యాల వైబ్ యే వేరు.. అది మిస్సయితే నా ఇంట్లో నాకు ఫుడ్ కూడా ఉండదు అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికీ ట్విటర్లో సమాధానాలిచ్చాడు మంచు మనోజ్. కాగా.. మిరాయ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. Nakkuddaaa…♥️♥️♥️ #Tfi 🙏🏼❤️#AskBlackSword #Mirai https://t.co/P3PF1GwCat— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 10, 2025 Joining in to celebrate #Mirai big time!!! 🙌🏼Nandyal vibe ye veru :) ♥️♥️ Miss ayithe, na intilo naku food vundadhu… #AskBlackSword https://t.co/jw2isqn1LC— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 10, 2025 -
Top Twitters: మోడీ తర్వాత మన ఎన్టీఆరే..!
-
దట్ ఈజ్ జూనియర్ ఎన్టీఆర్.. రికార్డ్ ధరకు అమ్ముడైన ఫోటో!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ది మ్యాన్ ఆఫ్ మాసెస్‌కు డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆర్ఆర్ఆర్, దేవర, వార్-2 చిత్రాలతో జూనియర్ వరల్డ్ వైడ్‌గా క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఇటీవలే హృతిక్ రోషన్‌తో కలిసి వార్-2 చిత్రంలో ప్రేక్షకులను అలరించారు. కూలీతో పోటీపడిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాతో మన యంగ్ టైగర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.అయితే జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రమే కాదు.. ఆయన ఫోటోకు కూడా ఇంత క్రేజ్ ఉందని అర్థమైంది. బులా రుబీ అనే పెన్సిల్ ఆర్టిస్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను తన టాలెంట్‌తో ఆవిష్కరించారు. తాజాగా ఈ ఫోటోకు అదిరిపోయే ధర వచ్చింది. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకు చెందిన పెన్సిల్ ఆర్ట్‌కు ఇంత భారీ ధరకు అమ్ముడవ్వలేదు. తొలిసారి జూనియర్ ఎన్టీఆర్ ఆర్ట్‌కు ఏకంగా రూ.1,45,300 రూపాయలు అమ్ముడైంది. ఈ విషయాన్ని ఆర్టిస్ట్ బులా రూబీ ట్విటర్ ద్వారా షేర్ పంచుకుంది.ఎన్టీఆర్ ఆర్డ్ సరికొత్త చరిత్ర సృష్టించింది.. నా పెన్సిల్ ఆర్ట్ ఇలా చరిత్ర సృష్టిస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఈరోజు నా జూనియర్ ఎన్టీఆర్ పెన్సిల్ ఆర్ట్ ఇప్పటివరకు అమ్ముడైన అత్యంత ఖరీదైనది. ఈ ఘనతకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు దట్ ఈజ్ ఎన్టీఆర్ క్రేజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన టాలెంట్‌తో ఎన్టీఆర్ ఫోటోను ఆవిష్కరించిన బులా రూబీకి అభినందనలు చెబుతున్నారు.History made! NTR ART ATR 🔥Feeling absolutely speechless… Never in my dreams did I imagine my pencil art would create history. Today, My pencil art of our man of masses @tarak9999 is now the most expensive pencil art of a Telugu actor ever sold !! #JRNTR𓃵 Grateful and… pic.twitter.com/qStUDcw3kT— Buelah Ruby (@buela_ruby) September 2, 2025 -
గెస్ట్ రోల్లో జూనియర్ ఎన్టీఆర్కే ఛాన్స్.. :శివకార్తికేయన్
తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మదరాసి (Madarasi Movie). ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రుక్మిణి వసంత్ కథానాయికగా యాక్ట్ చేసింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కావాల్సి ఉంది. ఈ క్రమంలో హీరోయిన్ రుక్మిణి వసంత్‌తో కలిసి శివకార్తికేయన్ ప్రమోషన్స్‌కు హాజరయ్యాడు.గెస్ట్ రోల్ఈ సందర్భంగా హీరోకు ఓ ప్రశ్న ఎదురైంది. మదరాసి మూవీలో గెస్ట్ రోల్ ఉన్నట్లయితే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏ హీరోను పెట్టుకుంటారు? అని యాంకర్ సుమ అడిగింది. అందుకు శివకార్తికేయన్ ఓ క్షణం ఆలోచించి.. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అని బదులిచ్చాడు. మీపై వచ్చిన రూమర్స్ గురించి చెప్పండి అని సుమ అడిగింది. అందుకు హీరో.. అమరన్ మూవీ టైంలో నేను 8 ప్యాక్ బాడీ చేసినట్లుగా ఫోటో సృష్టించారు. అందులో నా ముఖాన్ని సాగదీశారు. స్టెరాయిడ్స్ వాడానని రూమర్నేను స్టెరాయిడ్స్ వాడటం వల్లే ఆరోగ్యం చెడిపోయిందని రాశారు. అది చూసి లైట్ తీసుకున్నా అని తెలిపాడు. తెలుగు హీరోతో మల్టీస్టారర్ మూవీ చేసే అవకాశం వస్తే నానితో కలిసి నటించాలనుందన్నాడు. ఇక మదరాసి విషయానికి వస్తే.. విద్యుత్ జమాల్, బిజు మీనన్, షబ్బీర్, విక్రాంత్ కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. మరోవైపు ఇదే ఇంటర్వ్యూలో రుక్మిణి.. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ ప్రారంభమైందని అప్డేట్ ఇచ్చింది. ఎన్టీఆర్‌తో మదరాసి హీరోయిన్ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డ్రాగన్(ప్రచారంలో ఉన్న టైటిల్) మూవీలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. ప్రశాంత్ నీల్.. ‘కేజీఎఫ్’లో ‘కోలార్ గోల్డ్ ఫీల్డ్’, ‘సలార్’లో ఖాన్సార్ ప్రాంతాలు క్రియేట్ చేసినట్లు ‘డ్రాగన్’ మూవీలో కూడా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని సమాచారం. ఈ మూవీకి ఇంటర్నేషనల్ టచ్ ఉంటుందని భోగట్టా! గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ–సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్‌రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది.చదవండి: మాజీ ప్రియుడిని ఫ్యామిలీ అంటున్న భార్యలు.. జర జాగ్రత్త!: నటుడి వార్నింగ్ -
ఇంటర్ నేషనల్ డ్రాగన్
‘డ్రాగన్’ రేంజ్ గ్లోబల్ లెవల్లో ఉంటుందట. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ సినిమా ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. అక్టోబరులో ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ విదేశాల్లోప్రారంభం అవుతుందని, ఈ దిశగా చిత్రయూనిట్ ఇప్పట్నుంచే సన్నాహాలు మొదలుపెట్టిందని ఫిల్మ్‌నగర్ టాక్. అంతేకాదు... తన గత చిత్రాలు ‘కేజీఎఫ్’లో ‘కోలార్ గోల్డ్ ఫీల్డ్’, ‘సలార్’లో ఖాన్సార్ప్రాంతాలు ఉన్నట్లే ‘డ్రాగన్’ సినిమాలో కూడా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారట ప్రశాంత్ నీల్. ‘కోలార్ గోల్డ్ ఫీల్డ్, ఖాన్సార్’ల ప్రస్తావన ఇండియా వైడ్‌గా ఉంటే, ‘డ్రాగన్’ చిత్రం కోసం ప్రశాంత్ నీల్ సృష్టిస్తున్న ప్రపంచానికి ఇంటర్ నేషనల్ టచ్ ఉంటుందట. ఇందుకోసమే ఈ సినిమాను పలు విదేశీ లొకేషన్స్‌లో షూట్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోందని భోగట్టా. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ–సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్‌రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జూన్ 25న విడుదల కానుంది. -
ఈ వ్యక్తిత్వం మీరు.. తండ్రిని గుర్తు చేసుకుని ఎన్టీఆర్ పోస్ట్
దివంగత నటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ 69వ జయంతి (Nandamuri Harikrishna Birthday) సందర్భంగా ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్‌మీడియాలో ఒక నోట్ రాశారు. ట్విటర్ వేదికగా తండ్రికి నివాళులు అర్పించారు. "ఈ అస్థిత్వం మీరు. ఈ వ్యక్తిత్వం మీరు. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు. ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే - నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి తారక రామారావు" తమ అంటూ మనసులోని భావాలను వ్యక్తీకరించారు.'మీ 69వ జయంతిన మిమ్మల్ని స్మరించుకుంటూ.... మిస్ యూ నాన్న'! అని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. కళ్యాణ్ రామ్ కూడా బాధాతప్త హృదయంతో తండ్రిని స్మరించుకున్నారు. కాగా నందమూరి తారకరామారావు వారసుడిగా అటు నటుడిగానూ, ఇటు రాజకీయ నాయకుడిగానూ హరికృష్ణ అందరి మన్ననలు అందుకున్నారు. వెండితెరపై సీతయ్యగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. నేడు ఆయన జయంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. కాగా 2018లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించిన విషయం తెలిసిందే. అయితే, హరికృష్ణ మరణం తర్వాత ప్రతి ఏడాది ఎన్టీఆర్ ఇదే నోట్‌ను సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు. దానికి ప్రధాన కారణం తన తండ్రిపై ఉన్న అభిమానమే.. ఆయనపై ఉన్న అభిప్రాయం ఎప్పటికీ మారదనే సంకేతం ఇచ్చేలా అదే నోట్‌ను గత ఏడేళ్లుగా షేర్ చేస్తున్నారు.మీ 69వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ... pic.twitter.com/vImZXQxr1L— Jr NTR (@tarak9999) September 2, 2025 -
2025లో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోలు వీరే!
గతంలో హీరోలు వరుసగా సినిమాలు చేసేవారు. ఏడాదికి రెండు మూడు లేదంటే కనీసం ఒక్క సినిమా అయినా విడుదల చేసేవారు. అయితే ప్రస్తుతం దాదాపు చాలామంది హీరోల నుంచి వరుస పెట్టి సినిమాలు రావడం లేదు. ఒక్కొక్కరు రెండు మూడేళ్లకు ఓ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఏడాదికి ఓ సినిమాని ఆడియన్స్ ముందుకి తీసుకొచ్చే వాళ్లను వేళ్లల్లో లెక్కపెట్టొచ్చు. పైగా ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. అందుకే ఇప్పుడు అందరూ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాలవైపు మొగ్గు చూపుతున్నారు.లేట్ అయినా భారీ హిట్ ఇవ్వాలనే ఆలోచనలతో ఇటు హీరోలు, అటు దర్శక–నిర్మాతలు కథ, షూటింగ్, క్వాలిటీ, విజువల్ ఎఫెక్ట్స్ కోసం బాగా సమయం తీసుకుని, ఆచి తూచి ఎంతో జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నారు. ఈ కారణంగా షూటింగ్, పోస్ట్ ప్రోడక్షన్‌కే చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఈ కారణంగా చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, అఖిల్, నిఖిల్, వరుణ్ తేజ్, శర్వానంద్... ఇలా పలువురు హీరోలు 2025ని మిస్ అవుతున్నారు. ఈ ఏడాది వారు సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవు. అలా 2025ని మిస్ అవుతున్న కథానాయకులెవరో చూద్దాం. రెండేళ్లుగా వెయిటింగ్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోల్లో చిరంజీవి ఒకరు. ఆయన సినిమా ఎప్పుడొస్తుందా? అని మెగా అభిమానులు రెండేళ్లకు పైగా వెయిటింగ్లో ఉన్నారు. చిరంజీవి హీరోగా వచ్చిన చివరి చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023 ఆగస్టు 11న విడుదలైంది. ఈ చిత్రం తర్వాత చిరంజీవి నటించిన సినిమా ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ మూవీలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేష న్స్ పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పల పాటి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మించారు.ఈ సినిమాని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అందుకు తగ్గట్టే షూటింగ్ కూడా శరవేగంగా జరిగింది. అయితే చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం కోసం ‘విశ్వంభర’ విడుదలను వాయిదా వేశారు మేకర్స్. ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్‌పై రకరకాల వార్తలొచ్చాయి. కానీ, ఈ ఏడాది కూడా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ కారణంగా ఈ సినిమాని 2026 వేసవిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.ఇదిలా ఉంటే చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ట్యాగ్‌లైన్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. అర్చన సమర్పణలో సాహు గార పాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వరుసగా 2024, 2025ని మిస్ అయ్యారు చిరంజీవి. అయితే వచ్చే ఏడాది రెండు సినిమాల్లో కనిపించి, అలరించనున్నారు.సోలో హీరోగా గ్యాప్ టాలీవుడ్ టాప్ ఫోర్ సీనియర్ హీరోల్లో నాగార్జున కూడా ఒకరు. ఆయన సోలో హీరోగా వచ్చిన చివరి చిత్రం ‘నా సామిరంగ’. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైంది. అయితే ఆ తర్వాత ఆయన సోలో హీరోగా ఏ చిత్రంలోనూ నటించలేదు. కానీ ‘కుబేర, కూలీ’ సినిమాల ద్వారా తమిళ–తెలుగు ప్రేక్షకులను పలకరించారాయన. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘కుబేర’ సినిమాలో ధనుష్‌తో కలిసి స్క్రీన్ చేసుకున్నారు నాగార్జున. ఈ సినిమా జూన్ 20న విడుదలైంది.అలాగే రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ‘కూలీ’ సినిమాలో విలన్ పాత్రలో మెప్పించారు నాగార్జున. ప్రతి నాయకుడిగా ఆయనకు ఇదే మొదటి చిత్రం. ఇక నాగార్జున సోలో హీరోగా రూపొందనున్న వందో చిత్రానికి తమిళ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం వహించనున్నారు. తన కెరీర్‌లోని ఈ మైలురాయి చిత్రంలో హీరోగా నటించడంతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్‌పై స్వయంగా నిర్మించనున్నారు నాగార్జున.ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే లాక్ అయింది. ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రకటన ఉంటుందని అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, ఎలాంటి అప్డేట్ లేక పోవడంతో వారు నిరాశ చెందారు. ఈ సినిమా ఈ ఏడాది సెట్స్‌పైకి వెళ్లినా విడుదలయ్యేది మాత్రం 2026లోనే. ఆ రకంగా సోలో హీరోగా 2025ని నాగార్జున కూడా మిస్ అయినట్టే. అభిమానులకు నిరాశే వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ స్వింగ్‌లో దూసుకెళుతున్నారు హీరో ప్రభాస్. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. ప్రభాస్ సోలో హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం 2024 జూన్ 27న విడుదలైంది. ఆ తర్వాత ఆయన కథానాయకుడిగా రూ పొందుతోన్న సినిమా ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ హారర్ జానర్లో రూ పొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ద్వి పాత్రాభినయం చేస్తున్నారు.దీంతో ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమాని డిసెంబరు 5న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే టాకీ పార్ట్ పూర్తయినా కొన్ని పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉండటం, వీఎఫ్ఎక్స్ వల్ల డిసెంబరు 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయలేక పోతున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇటీవల ప్రకటించారు. దీంతో ప్రభాస్ అభిమానులు నిరాశపడ్డారు. ‘‘ది రాజా సాబ్’ సంక్రాంతికి వస్తే బాగుంటుందని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు.తెలుగు బిజినెస్ సర్కిల్ వారు కూడా ఈ సినిమాని జనవరి 9న విడుదల చేయాలని చెబుతున్నారు. కానీ, హిందీ ఆడియ న్స్ మాత్రం డిసెంబర్ 5న రిలీజ్ చేయాలని కోరుతున్నారు’’ అంటూ టీజీ విశ్వప్రసాద్ తెలి పారు. అయితే తెలుగువారికి పెద్ద పండగైన సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ రకంగా సోలో హీరోగా 2025ని ప్రభాస్ మిస్ అయినట్టే. అయితే విష్ణు మంచు హీరోగా నటించిన ‘కన్నప్ప’లో రుద్రగా ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించి, అలరించారు. ఈ చిత్రం జూన్ 27న విడుదలైంది.నిరీక్షణ తప్పదు మహేశ్‌బాబు హీరోగా రూ పొందుతోన్న తాజా చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్). ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ‘గుంటూరు కారం’ చిత్రం 2024 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత రాజమౌళి సినిమా ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ కమిట్ అయ్యారు మహేశ్. ఈ సినిమాలో ప్రియాంకా చో్ర పా, హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో ఇప్పటివరకూ చేయని వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు మహేశ్. ఇందుకోసం పొడవాటి జుట్టు, గడ్డంతో మేకోవర్ అయ్యారాయన. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఇండియానా జో న్స్ స్టైల్ కథతో ఈ సినిమా రూ పొందుతోందనే వార్తలు గత కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. రాజమౌళి సినిమా అంటే కనీసం రెండేళ్లకు పైగా చిత్రీకరణకు సమయం పడుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రోడక్షన్‌కి కూడా ఎక్కువ టైమ్ తీసుకుంటారాయన. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా 2026లో విడుదలయ్యే అవకాశాలు లేవని ఫిల్మ్‌నగర్ టాక్. 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ రకంగా చూస్తే 2025 కాదు... 2026ని కూడా మహేశ్ మిస్ అయ్యే అవకాశాలున్నాయి. అప్పటి వరకూ ఆయన అభిమానులకు నిరీక్షణ తప్పదు. రెండేళ్లు గ్యాప్? ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం ‘దేవర: పార్ట్ 1’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2024 సెప్టెంబరు 27న విడుదలైంది. ఆ సినిమా తర్వాత ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు.ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ‘డ్రాగ న్ ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ఫిల్మ్‌నగర్ టాక్. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించింది. అయితే రిలీజ్ డేట్లో మార్పు చేసుకుంది. జనవరి 9న కాకుండా జూన్ 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొన్న విషయం తెలిసిందే.అంటే... సోలో హీరోగా దాదాపు రెండేళ్లు గ్యాప్ వచ్చినట్లు అవుతుంది ఎన్టీఆర్‌కి. ఇదిలా ఉంటే... హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన హిందీ చిత్రం ‘వార్ 2’. ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 14న విడుదల అయింది. అయితే ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన ఏ సినిమా కూడా 2025లో రిలీజ్ కాలేదు.. అలా ఈ ఏడాదిని ఆయన మిస్ అయినట్లే అని చె ప్పాచ్చు. గ్యాప్ ఇవ్వలేదు... వచ్చింది ‘గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది..’ అంటూ ‘అల వైకుంఠపురములో...’ సినిమాలో అల్లు అర్జున్ ఓ డైలాగ్ చెబుతారు. అలా ‘పుష్ప 1, 2’ సినిమాల తర్వాత ఆయనకు 2025లో గ్యాప్ వచ్చినట్లే. సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప: ది రూల్’ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను అలరించారు హీరో అల్లు అర్జున్. ‘పుష్ప: ది రూల్’ 2024 డిసెంబరు 5న విడుదలై, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1800 కోట్ల రూ పాయల వసూళ్లు సాధించింది.ఆ సినిమా తర్వాత తమిళ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్. ‘ఏఏ22 ఏ6’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ హీరోయిన్గా ఫిక్స్ అయ్యారు. కళానిధి మార న్ సమర్పణలో సన్‌పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది.‘అవతార్’, ‘డ్యూన్’, ‘బార్బీ’ వంటి హాలీవుడ్ చిత్రాలకు పని చేసిన కన్నెక్ట్ మాబ్ సీన్ అనే ప్రముఖ టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికి పని చేస్తోంది. ‘పుష్ప: ది రూల్’ తర్వాత వస్తున్న ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘ఏఏ22 ఏ6’ చిత్రం 2026 చివర లేదా 2027 సంక్రాంతికి విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అలా 2025ని అల్లు అర్జున్ కూడా మిస్ అయ్యారు. ఇంకా... ⇒ అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెని న్ ’. ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది’ కాదు అనేది ఉపశీర్షిక. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నాగార్జున, నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అఖిల్ నటించిన చివరి చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 ఏప్రిల్ 28న విడుదలైంది. ఆ తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం ‘లెనిన్’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ 2026లో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన వరుసగా 2024, 2025ని అఖిల్ మిస్సయ్యారు. ⇒ వరుణ్ తేజ్ హీరోగా రూ పొందుతోన్న తాజా చిత్రం ‘వీటీ 15’ (వర్కింగ్ టైటిల్). మేర్ల పాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. యువీ క్రియేష న్స్ , ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టై న్ మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. గత ఏడాది నవంబరు 14న ‘మట్కా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు వరుణ్. తాజాగా ఆయన నటిస్తున్న ‘వీటీ 15’ సినిమా ఈ ఏడాది నవంబరులో విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రం కూడా 2026లోనే రిలీజ్ కానుందని ఫిల్మ్‌నగర్ టాక్. దీంతో వరుణ్ తేజ్ కూడా 2025ని మిస్ అయినట్లే. ⇒ నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్త, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం లేదు. నిఖిల్ నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రం గత ఏడాది నవంబరు 8న విడుదలైంది. సో... ‘స్వయంభు’ 2026లో రిలీజ్ కానుండటంతో 2025ని నిఖిల్ మిస్సయ్యారని చెప్పాచ్చు. ⇒ శర్వానంద్ హీరోగా నటించిన ‘మనమే’ చిత్రం 2024 జూన్ 7న విడుదలైంది. ఈ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘నారి నారి నడుమ మురారి’ ఒకటి. సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టై న్ మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది విడుదల కావాల్సి ఉన్నా రిలీజ్ డేట్‌పై స్పష్టత లేదు. అదే విధంగా శర్వానంద్, మాళవికా నాయర్ జోడీగా నటిస్తున్న చిత్రం ‘శర్వా 36’ (వర్కింగ్ టైటిల్). అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ రెండు చిత్రాలు కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలు లేవు. ఈ కారణంగా శర్వానంద్ కూడా 2025ని మిస్ అయినట్లే. పైన చెప్పిన హీరోలే కాదు. ఇంకా పలువురు కథానాయకులు 2025ని మిస్ అయ్యారు. 2025ని మిస్ అయినప్పటికీ 2026లో మాత్రం తమ జోరు చూపిస్తామంటున్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
నా తమ్ముడు 'తారక్' రాజకీయాల్లోకి వస్తాడు: సుహాసిని
నందమూరి హరికృష్ణ (Nandamuri Harikrishna) వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు పెద్దఎత్తున నివాళులర్పించారు. 2018లో నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించిన విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా జూనియర్ ఎన్టీఆర్ పేరు సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తారక్‌పై చేసిన కామెంట్లతో అభిమానులు భగ్గుమన్నారు. సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే ఆ తర్వాత క్షమాపణలు చెప్తారని అందరూ భావించారు. అదీ లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ది చెప్తామని తారక్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ గురించి ఆయన సోదరి నందమూరి సుహాసిని క్లారిటీ ఇచ్చారు.హరికృష్ణకు సుహాసిని నివాళులర్పించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందని మీడియా ప్రశ్నించగా ఆమె ఇలా చెప్పారు. ' ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాడు.' అని ఆమె క్లారిటీ ఇచ్చారు. నందమూరి హరికృష్ణ వారసుడిగా రాజకీయ ఎంట్రీ ఉంటుందా అనే ప్రశ్నకు ఆమె ఈ సమాధానం చెప్పడం విశేషం. దీంతో తారక్ అభిమానులు సంతోషిస్తున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలను నెట్టింట షేర్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Na_Oopiri_NTR (@na_oopiri_ntr_) -
దేవర సాంగ్.. ఆ క్రెడిట్ అంతా మీకేనా.. మాకు ఇవ్వరా?
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన యాక్షన్ చిత్రం దేవర పార్ట్-1. ఈ మూవీ గతేడాది సెప్టెంబర్ 27న రిలీజై సూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టింది. ఈ విజయంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ చేసుకున్నారు. అయితే ఈ సినిమా ఎంత సక్సెస్ అయిందో.. అంతే రేంజ్లో ఆ సాంగ్ కూడా ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ఎక్కడా చూసిన ఆ పాటే వినిపించేది. రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్‌ను సొంతం చేసుకుంది.'చుట్టమల్లే చుట్టేస్తావే' అంటూ వచ్చిన దేవర సాంగ్‌కు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ రొమాంటిక్ సాంగ్ జూనియర్ ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేసింది. ఇందులో తారక్, జాన్వీ కపూర్ల కెమిస్ట్రీ అభిమానులను తెగ ఆకట్టుకుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందించారు. శిల్పరావు గాత్రం ఈ రొమాంటిక్ మెలోడీని మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.తాజాగా ఇలాంటి పాటలకు వచ్చే క్రెడిట్ తమకు ఇవ్వడం లేదని దేవర సాంగ్ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాట విడుదలైన తర్వాత కొరియోగ్రాఫర్ల పేర్లను పూర్తిగా విస్మరించడం సరికాదంటున్నారు. సాంగ్ పూర్తయ్యాక కొరియోగ్రాఫర్లను మరిచిపోవడం సాధారణంగా మారిపోయిందన్నారు. ఇక్కడ నాకు క్రెడిట్ ఇవ్వలేదని కాదు.. నేను కాకుండా మరో బ్రాండ్ ఉన్న కొరియోగ్రాఫర్ అయితే కచ్చితంగా వారి పేర్లు వేసేవాళ్లన్నారు. పాటలకు పనిచేసిన కొరియోగ్రాఫర్ల బ్రాండ్‌ను దెబ్బ తీయవద్దని మేకర్స్‌ను కోరారు.బోస్కో మాట్లాడుతూ.. 'పాట విడుదలైన తర్వాత కొరియోగ్రాఫర్‌ను మరచిపోతారు. మా కష్టాన్ని ఇతరులకు క్రెడిట్ ఇస్తారు. కానీ ఇప్పుడు కూడా పాట విడుదలైనప్పుడు కొన్నిసార్లు కొరియోగ్రాఫర్ పేర్లను కూడా చూస్తున్నాం. కానీ కొందరు మాత్రం కొరియోగ్రాఫర్ పేరును ఎప్పుడూ ఉంచరు. వారు ఎల్లప్పుడూ ఆ మూవీ స్టార్ పేరునే ఉంచుతారు. ఒక స్టార్‌కు ఎంత గొప్పగా పేరు వస్తే.. కొరియోగ్రాఫర్‌కు కూడా అంతే గొప్పగా రావాలని కోరుకుంటున్నా. సంగీత దర్శకుడికి ఎంత పేరు వస్తుందో.. సింగర్‌కు కూడా అంతే క్రెడిట్ దక్కాలి. నాకు రాకపోయినా.. నా తర్వాత వచ్చే కొత్తతరానికి ఇలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నా' అని అన్నారు. కాగా.. దేవర సినిమా ఈ మూవీ రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించారు. -
ఎన్టీఆర్ ను, ఆయన మాతృమూర్తిని దూషించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
-
మీకు ముందు ముందు సినిమా చూపిస్తాం దగ్గుపాటికి ఎన్టీఆర్ ఫాన్స్ స్వీట్ వార్నింగ్
-
అనంతపురంలో హైటెన్షన్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అరెస్ట్ (ఫోటోలు)
-
'ఎన్టీఆర్' ఫ్యాన్స్‌పై దాడులు, అరెస్ట్‌లు.. తారక్‌ను తేలిగ్గా తీసుకున్న ప్రభుత్వం
జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు నిరసనలు తెలుపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు దగ్గుపాటి క్షమాపణ చెప్పాలని ఆయన ప్యాన్స్ కర్ణాటక, బళ్లారి, ఏపీలోని ఇతర జిల్లాల నుంచి భారీగా అనంతపురం చేరుకున్నారు. అయితే, సమాచారం అందుకున్న పోలీసు సిబ్బంది వారిని అరెస్టు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ తమ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన అనుచిత వాఖ్యలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి నిరసన తెలిపారు. అయితే, ఈ ఆందోళన కేవలం అనంతపురం జిల్లాకు మాత్రమే పరిమితం కాలేదు. నేటి నుంచి ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాలని వారు ప్లాన్ చేస్తున్నారు.'ఛలో అనంతపూర్' పేరుతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనంతపపురంలోని దగ్గుపాటి క్యాంప్ ఆఫీస్‌కు రాబోతున్నారు. అభిమానుల చర్యల వల్ల దగ్గుపాటి నుంచి సరైన సమాధానం రాకపోతే.. రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు చేపడతామని వారు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటికే అఖిల కర్నాటక ఎన్టీఆర్ సేవాసమితి సభ్యుల్ని పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు 40 మందిని ఉరవకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో కొంతమందిపై పోలీసులు చేయిచేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తారక్ ఫ్యాన్స్‌పై టీడీపీ పేరుతో ఉన్న కొన్ని పేజీలు బూతులతో దాడులకు దిగుతున్నాయి.అనంతపురంలో ఇంత జరుగుతుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం తారక్ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. కేవలం ఎమ్మెల్యేపై చంద్రబాబు భగ్గుమన్నారంటూ లీకులు మాత్రమే ఇచ్చి సరిపెట్టారు. అయితే, తారక్ ఫ్యాన్స్ మాత్రం దానిని నమ్మలేదు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బహిరంగంగా మీడియా ముందు క్షమాపణలు చెప్పడంతో పాటు ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న ఎమ్మేల్యే వెనుక లోకేష్ ఉన్నారని ఫ్యాన్స్ కూడా చెప్పుకొస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ వివాదం మరింత తీవ్రరూపం దాల్చేలా కనిపిస్తుంది. ఇప్పటికే కర్ణాటక, బళ్ళారి నుంచి చాలామంది అభిమానులు అనంతపురం చేరుకున్నారు. నేడు తమిళనాడు నుంచి కూడా ఫ్యాన్స్ అక్కడికి రానున్నారు. దీంతో పోలీసులు కూడా అలెర్ట్‌గా ఉన్నారు. The Constitution Of India Gives People The Right To Speak Freely And Protest Peacefully Under Article 19(1)(a) and 19(1)(b)When The Government Stops Such Protests, Is It Really Following The Constitution?#SuspendMLADaggupatiPrasad pic.twitter.com/lKpDjfGmuY— NTR Trends (@NTRFanTrends) August 24, 2025🙏🙏#SuspendMLADaggupatiPrasad pic.twitter.com/naYbfuvbRN— Jr NTR Fan Club (@JrNTRFC) August 24, 2025 -
Jr NTR Fans: దగ్గుపాటి ప్రసాద్.. నిన్ను వదలం
-
ఫ్యాన్స్ కు భయపడి.. ఎమ్మెల్యే దగ్గుపాటి పరార్..!
-
గడువు ముగిసింది.. ఇక ఉద్యమమే..
-
శ్రీలీల సక్సెస్ వెనుక జూనియర్ ఎన్టీఆర్.. అప్పుడే డిసైడయ్యా!
స్ప్రింగులా బాడీని కదిలిస్తూ అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). సింగిల్ టేక్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న తారక్.. డ్యాన్స్‌లోనూ టాప్ హీరోగా తనకు తిరుగు లేదని నిరూపించుకున్నాడు. అయితే డ్యాన్స్ ఇరగదీస్తున్న హీరోయిన్ శ్రీలీలకు తారక్ ఆదర్శమట! ఈ విషయాన్ని ఆమె తల్లి డాక్టర్ స్వర్ణలత చెప్పుకొచ్చింది. జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకి శ్రీలీల హాజరైంది. అప్పుడే డిసైడయ్యా..శ్రీలీల (Sreeleela) గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పేందుకు ఆమె తల్లి స్వర్ణలత కూడా వేదికపై వచ్చింది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆమె ప్రస్తావించింది. తారక్ చిన్నప్పుడు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చిన ఫోటోను జగపతిబాబు చూపించాడు. అది చూసిన స్వర్ణలత.. నాకు ఆడపిల్ల పుడితే డ్యాన్స్ నేర్పించాలని ఈ ఫోటో చూశాకే డిసైడ్ అయ్యాను.ఎన్టీఆర్‌తో మాట్లాడా..1997లో లాస్ ఏంజిల్స్‌లో తానా సభలు జరిగాయి. మేము అక్కడికి వెళ్లాం. అక్కడ తారక్ డ్యాన్స్ చేశాడు. అనంతరం తారక్‌తో మాట్లాడాను. నాకు అమ్మాయి పుడితే కచ్చితంగా నీలా డ్యాన్స్ చేయిస్తాను అని చెప్పాను. అనుకున్నట్లుగానే నా కూతురిని డ్యాన్సర్ చేశాను అని తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్ స్ఫూర్తితోనే శ్రీలీల మంచి డ్యాన్సర్ అయిందని పేర్కొంది.సినిమాశ్రీలీల.. పెళ్లి సందD మూవీతో వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ధమాకా, గుంటూరు కారం, భగవంత్ కేసరి, జూనియర్.. ఇలా అనేక సినిమాలు చేసింది. పుష్ప 2లో 'కిస్ కిస్ కిస్సిక్..' అనే ఐటం సాంగ్‌లోనూ ఆడిపాడింది. జూనియర్ మూవీలోని వైరల్ వయ్యారి పాటతో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈమె రవితేజ సరసన నటించిన మాస్ జాతర త్వరలోనే రిలీజ్ కానుంది. Im Saying N'th TimeYour Biggest Strength is Dance bro @tarak9999 Nee Dance Inspiration Valla TFI ki #Sreeleela lanti No.1 Lady Dancer Dorikindipic.twitter.com/0aIdnKpr5N— Saleem Tarak💙 (@Tarak_Holic) August 23, 2025 చదవండి: అజిత్ భాయ్.. ఏంటా స్పీడ్.. ఇదేమైనా రేసింగ్ అనుకున్నావా? -
టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయం
సాక్షి, అనంతపురం: అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయం పట్టుకుంది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్‌పై ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 48 గంటల్లో ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఆయన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అల్టిమేటం జారీ చేశారు.48 గంటల గడువు ముగియడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడిస్తారన్న భయం.. ఎమ్మెల్యే దగ్గుపాటికి పట్టుకుంది. దీంతో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తూ.. బారికేడ్లు, చెక్ పోస్టులు పెట్టారు.అనంతపురంలో ఉద్రిక్తత..ఈ క్రమంలో అనంతపురంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే దుగ్గుపాటి ప్రసాద్ ఇంటి ముట్టడికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు-జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ.. ఎమ్మెల్యే దగ్గుపాటికి వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
Anantha Venkatarami Reddy: నీ తల్లి అయితే ఒకటి ఎన్టీఆర్ తల్లి అయితే మరొకటా
-
ఎన్టీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు.. నారా రోహిత్ షాకింగ్ రియాక్షన్
-
శ్రీకాకుళం జిల్లా పలాసలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరసనలు
-
War 2 Movie: ఎన్టీఆర్ కోసం జపాన్ నుంచి వచ్చిన అభిమాని..!
-
'వార్ 2' చూడలేదు.. 'కూలీ'కి వెళ్దామంటే ఓకే చెప్పాను: నారా రోహిత్
నారా రోహిత్ హీరోగా నటించిన 'సుందరకాండ' చిత్రం ఆగస్టు 27న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తన మూవీ ప్రమోషన్స్ కోసం ఆయన పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కూలీ, వార్2 సినిమాలు చూశారా..? ఎలా ఉన్నాయంటూ ఆయన్ను ప్రశ్నించారు. ఈ సందర్భంలో రోహిత్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఎన్టీఆర్ సినిమా విడుదలైతే తప్పకుండా తన కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ అభిమానులు చూస్తారు. అయితే, కొంత కాలంగా తారక్‌ను నందమూరి, నారా ఫ్యామిలీలు దూరంగానే ఉంచుతూ వస్తున్నాయి. వార్ 2 మూవీ విడుదల సమయంలో తారక్‌పై టీడీపీ ఎమ్మెల్యేనే భూతులతో విరుచుకుపడ్డాడు. అయితే, తాజాగా ఒక ఇంటర్వ్యూలో వార్2 సినిమా చూశారా అని 'నారా రోహిత్'ని ప్రశ్నించారు. అందుకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. 'వార్ 2 సినిమా చూడలేదు. మా గ్యాంగ్ అంతా కూలీ సినిమా చూద్దాం అన్నారు. అప్పుడు నేనూ కూడా 'కూలీ' కోసమే వెళ్లాను. సినిమా అక్కడక్కడ నచ్చింది. ఓవరాల్‌గా పర్వాలేదు. వార్2 చూడలేదు. కానీ, సమయం దొరికితే తప్పకుండా చూస్తాను.' అని అన్నారు. అయితే, ఇక్కడ నారా రోహిత్‌ను నెటిజన్లు తప్పుబడుతున్నారు. మొదట కుటుంబ సభ్యుల సినిమాకు ప్రాధాన్యత ఇవ్వాలి కదా అంటూ ప్రశ్నిస్తున్నారు.తారక్‌తో తనకు మంచి స్నేహం ఉందని నారా రోహిత్ (Nara Rohith) అన్నారు. ఎక్కడైనా తాము ఎదురైతే మంచిగానే మాట్లాడాతుమాన్నారు. కానీ, పెద్దగా ఫోన్స్‌లలో మాట్లాడుకోవడం వంటివి మాత్రం లేవన్నారు. -
క్షమాపణ చెప్పించకపోతే? ఎన్టీఆర్ ఫ్యాన్స్ హెచ్చరిక
-
టీడీపీ ఎమ్మెల్యే బుడ్డాపై ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు
-
ఎన్టీఆర్ ఫ్యాన్స్ హెచ్చరిక.. దగ్గుపాటికి చంద్రబాబు మద్దతు!
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు.. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ తర్వాత బుధవారం చంద్రబాబుతో ఎమ్మెల్యే దగ్గుపాటి భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఆయనపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. మరోవైపు.. దగ్గుపాటిపై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరించడం గమనార్హం.చంద్రబాబుతో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బుధవారం భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనపై చంద్రబాబు చర్యలు తీసుకుంటారనే చర్చ నడిచింది. కచ్చితంగా సస్పెన్షన్ ఉంటుందని కొందరు టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు ఆశించారు. ఇలాందేమీ జరగకుండానే.. వారిద్దరి భేటీ ముగిసింది. అయితే, మంత్రి నారా లోకేష్‌కి దగ్గుపాటి సన్నిహితుడు అయిన కారణంగానే చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పలువురు చెబుతున్నారు. ఈ క్రమంలో బూతుల ఎమ్మెల్యేకు చంద్రబాబు మద్దతు ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ సైతం చేస్తున్నారు. తాజా పరిణామాలు కూడా అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. దీంతో, మరోసారి ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇక, టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటికి రేపటి వరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ డెడ్ లైన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అనంతపురం నడిబొడ్డున బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. ఎన్టీఆర్ అభిమానుల ప్రెస్ మీట్‌కి కూడా చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం. ఇలాంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ నరేంద్ర చౌదరి మాట్లాడుతూ..‘టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి సభ్యసమాజం తలదించుకునేలా నోటికి ఎంతొస్తే అంత వాగారు. మా ఎన్టీఆర్ తల్లిపై దారుణంగా కామెంట్స్ చేశారు.ఎన్టీఆర్ తల్లినే కాదు, ఏ స్త్రీ మూర్తి గురించి అలా మాట్లాడకూడదు. అలా ఎవరు మాట్లాడినా తప్పే! ఇది సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇది ఇంతటితో ఆపేస్తే బెటర్. ఆయన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అనంతపురం నడిబొడ్డున క్షమాపణలు చెప్పాలి. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతాం. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరం ఛలో అనంతపురం అంటూ మీ ఇంటిని ముట్టడిస్తాం అని హెచ్చరించారు. -
రెండ్రోజుల్లో ‘దగ్గుపాటి’ క్షమాపణ చెప్పాలి
హైదరాబాద్: ‘జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలినిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ను టీడీపీ నుండి వెంటనే సస్పెండ్ చెయ్యాలని.. రెండ్రోజుల్లో ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేదంటే అనంతపురం ముట్టడిస్తామని ఎన్టీఆర్ అభిమానులు హెచ్చరించారు. ‘నందమూరి’ కోడలిని తిడితే ఎలా ఒప్పుకుంటామని వారు బుధవారం హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్‌మీట్ పెట్టుకునే పరిస్థితి లేదన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎవరికైతే ఫోన్‌చేసి బూతులు మాట్లాడాడో అతన్ని పక్కన కూర్చోపెట్టుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎన్టీఆర్ అభిమానులు నరేంద్ర చౌదరి, సుధీర్ రాజు, కావూరి కృష్ణ, బాబ్జి, ఆదోని ముజీబ్‌లు ఏమన్నారంటే..ఎమ్మెల్యేను టీడీపీ నేతలు నిలదీయాలి..ప్రజాప్రతినిధి అయి ఉండి ఎమ్మెల్యే దగ్గుపాటి ఒక మాతృమూర్తిని నోటికి ఎంతవస్తే అంత సోయిలేకుండా మాట్లాడడం సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. టీడీపీ అంటే మహిళలను ఎంతో గౌరవించే పార్టీ అని గొప్పగా చెప్పుకునే నాయకులు ఇలా ఒక స్త్రీ గురించి ఎందుకు మాట్లాడాడో ఆయన్ని నిలదీయాలి. ప్రసాద్ అనే ఎమ్మెల్యే వెనక ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ లేకపోతే తమ సత్తా ఏమిటో చూపించే వాళ్లం. తప్పుచేసి ఇప్పుడు నా వాయిస్ కాదు అని అంటున్నాడు. కానీ, ఫోన్లో మాట్లాడిన అభిమానం మాత్రం ఎమ్మెల్యేనే మాట్లాడాడని స్పష్టంగా చెబుతున్నాడు. దీంతో.. ఎమ్మెల్యే ప్రసాద్ అతనిని, అతని కుటుంబాన్ని బెదిరిస్తున్నాడు. దగ్గుపాటి అహంకారానికి నిదర్శనం..ప్రభుత్వం సినిమాకు అనుమతిచ్చిన తరువాత ‘ఎలా రిలీజ్ చేస్తారు’ అని అనడానికి ఎమ్మెల్యే ఎవరు? 25 ఏళ్లుగా తలాతోక లేనివారు ఎంతోమంది నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు. అయితే, ఎన్టీఆర్ ఏనాడూ ఎవ్వరినీ ఒక్కమాట కూడా అనలేదు. వార్–2 సినిమా ప్రమోషన్లో కూడా పాతికేళ్లుగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని ఎన్టీఆర్ చెప్పారు కానీ, ఎవ్వరినీ విమర్శించలేదు.. ఎవరికీ వ్యతిరేకంగా కూడా మాట్లాడలేదు. అయినా, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అలా మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనం. రెండ్రోజుల్లో ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే చలో అనంతపూర్ నిర్వహించి ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తాం. అక్కడి ఎన్టీఆర్ విగ్రహాల వద్ద నిరసన, రాస్తారోకో చేస్తాం. ఎన్టీఆర్ యువసైన్యం తన సత్తా చూపిస్తుంది.ఏపీలో ప్రెస్‌మీట్ పెట్టే పరిస్థితి లేదు..ఇక ఈ ప్రెస్‌మీట్ అనంతపురంలో పెట్టాల్సింది. కానీ, అక్కడ పోలీసులు విపరీతమైన ఆంక్షలు పెట్టి మీడియా సమావేశం పెట్టకుండా అడ్డుకుంటున్నారు. ఆఖరుకు విజయవాడలో పెడదామనుకున్నా అక్కడ కూడా పెట్టకూడదంటున్నారు. ఏపీలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉండడంతో చివరికి హైదరాబాద్‌కు వచ్చి సమావేశం పెట్టాల్సి వచ్చింది. -
Jr NTR Fans: సస్పెండ్ చేయకపోతే.. ఎన్టీఆర్ అంటే ఏంటో చూపిస్తాం..
-
వార్ 2లో కిక్కిచ్చిన 'సలాం అనాలి' ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం వార్ 2 (War 2 Movie). అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ లభించింది. ఈ మూవీ నుంచి తాజాగా సలాం అనాలి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ పోటాపోటీగా డ్యాన్స్ చేశారు. ఎనర్జిటిక్ డ్యాన్స్వీరి ఎనర్జిటిక్ డ్యాన్స్ చూసేందుకు అభిమానులకు రెండు కళ్లు చాలవు. సినిమా సంగతేమో కానీ వీళ్ల డ్యాన్స్ మాత్రం అదిరింది అని కామెంట్లు చేస్తున్నారు. ఈ పాటకు ప్రీతమ్ సంగీతం అందించగా నకాశ్ అజీజ్, యాజిన్ నిజర్ ఆలపించారు. కృష్ణ కాంత్ తెలుగులో లిరిక్స్ సమకూర్చారు. వార్ 2 మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటించింది. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. అక్షయ్ విధాని సహనిర్మాతగా వ్యవహరించారు. -
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సారీ చెప్పు, లేదంటే మా తడాఖా చూపిస్తాం!
సాక్షి, హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) గురించి నీచంగా మాట్లాడతారా? మా ఫ్యాన్స్ సత్తా ఏంటో చూపిస్తాం అన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ నరేంద్ర చౌదరి. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నరేంద్ర చౌదరి మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ సభ్యసమాజం తలదించుకునేలా నోటికి ఎంతొస్తే అంత వాగారు. మా ఎన్టీఆర్ తల్లిపై దారుణంగా కామెంట్స్ చేశారు.క్షమాపణలు చెప్పాలిఎన్టీఆర్ తల్లినే కాదు, ఏ స్త్రీ మూర్తి గురించి అలా మాట్లాడకూడదు. అలా ఎవరు మాట్లాడినా తప్పే! ఇది సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇది ఇంతటితో ఆపేస్తే బెటర్. ఆయన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అనంతపురం నడిబొడ్డున క్షమాపణలు చెప్పాలి. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతాం. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరం ఛలో అనంతపురం అంటూ మీ ఇంటిని ముట్టడిస్తాం అని హెచ్చరించారు.ఏం జరిగింది?వార్ -2 రిలీజ్ సమయంలో అభిమానుల స్పెషల్ షోకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడు ఆహ్వానించారు. దీంతో దగ్గుపాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్‌పై రెచ్చిపోయారు. వాడి సినిమాలెలా ఆడనిస్తాను? మీరెలా ఆడనిస్తార్రా గాడిదల్లారా.. అంటూ అసభ్య పదజాలంతో హీరో గురించి నీచంగా మాట్లాడారు. ఎన్టీఆర్ తల్లిని సైతం దారుణంగా దూషించారు. వార్ 2 షోలను అనంతపురంలో నిలిపివేయాలని వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యవహారంపై తారక్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
'ధూమ్ 4'లో చెర్రీ, ఎన్టీఆర్..?
-
Jr.NTR తల్లిపై టీడీపీ నేత అడ్డమైన కూతలు.. ఒక్క ముక్కలో తేల్చేసిన సాక్షి
-
జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నిరసన
కృష్ణాజిల్లా : జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మచిలీపట్నంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి, శ్రద్ధాంజలి ఘటించారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. టీడీపీ ఎమ్మెల్యే చిత్ర పటాన్ని తగలబెట్టి నిరసన తెలియజేశారు. దీనిలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే దగ్గపాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై ఎన్టీఆర్ అభిమానులు మండిపడ్డారు. వెంకటేశ్వర ప్రసాద్ బహిరంగ క్షమాపణ చెప్పే వరకూ రోజుకో రీతిలో నిరసన తెలుపుతామంటూ హెచ్చరించారు. ఆపై జూనియర్ .ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి , గుమ్మడికాయతో దిష్టి తీసి, కొబ్బరికాయ కొట్టారు అభిమానులు.కాగా, రెండు రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యంగా మాట్లాడిన దగ్గుపాటి ప్రసాద్.. నారా లోకేష్‌కు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వవంటూ హెచ్చరించారు. 'వార్ 2' షోలను అనంతపురంలో నిలిపివేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు.వార్ -2 విడుదల సందర్భంగా అభిమానుల స్పెషల్ షోకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడు ఆహ్వానించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్‌పై దగ్గుపాటి ప్రసాద్ రెచ్చిపోయారు. -
ఎన్టీఆర్‌కు మద్ధతుగా నిలిచిన ప్రముఖ సింగర్
టాలీవుడ్ హీరో, నందమూరి వారసుడు ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్న వివషయం తెలిసిందే. లోకేశ్‌ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తానంటూ లం.. భాష ఉపయోగించి రెచ్చిపోయారు. దీంతో తారక్ ఫ్యాన్స్ రంగంలోకి దిగి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేశారు. అయితే, చిత్ర పరిశ్రమ నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్‌కు మద్ధతుగా ఎవరూ నిలబడలేదు. కనీసం ఎమ్మెల్యే చేసిన మురికి వ్యాఖ్యలను తప్పుబట్టలేదు. ఆపై టీడీపీ కూడా ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ వ్యాఖ్యలు వెనుక నారా లోకేశ్ ఉన్నాడంటూ విమర్శలు వచ్చాయి. అయితే, ఎట్టకేలకు టాలీవుడ్ నుంచి ప్రముఖ సింగర్, సంగీత దర్శకుడు అనుదీప్ దేవరకొండ (అనుదీప్ దేవ్) రియాక్ట్ అయ్యారు. తారక్ సార్‌తో సంఘీభావంగా నిలబడుతున్నానంటూ తన మద్థతు ఇచ్చాడు.తారక్‌కు సపోర్ట్‌గా రండి.. రేపొద్దున మీకూ ఇదే జరగొచ్చుఎన్టీఆర్కు మద్ధతుగా అనుదీప్ ఇలా చెప్పుకొచ్చారు. 'తారక్ సార్‌తో సంఘీభావంగా నిలబడుతున్నాను. సినిమా మనల్ని ఏకం చేస్తుంది. రాజకీయాలు మనల్ని విభజిస్తాయి. రెండింటినీ వేరుగా ఉంచుదాం. ఈ రోజు ఎన్టీఆర్‌కు ఎదురైన సందర్భం రేపు మరే ఇతర స్టార్‌కు ఎదురుకావచ్చు. మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ (TFI) కలిసికట్టుగా నిలబడి మన ప్రియమైన ఎన్టీఆర్‌కు మద్దతు ఇవ్వాలని అందరినీ అభ్యర్థిస్తున్నాను' అంటూ #StandWithNTR అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.'హనుమాన్' సినిమాతో పాపులర్ ఆంధ్ర ప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన అనుదీప్ 2011లో 'అహ నా పెళ్ళంటా' సినిమాతో సింగర్‌గా పరిచయమయ్యారు. అనుదీప్ ఇప్పటికే 70 చలన చిత్రాలలో సుమారుగా 100 పాటలకు పైగా పాడారు. 'హను మాన్' వంటి హిట్ సినిమాకు సంగీతం అందించిన వారిలో ఆయన కూడా ఒకరు. ప్రముఖ సంగీత దర్శకులు కోటి, యువన్ శంకర్ రాజా,మిక్కీ జె. మేయర్,అనూప్ రూబెన్స్, థమన్, సంతోష్ నారాయణన్ వంటి వారితో ఆయన పనిచేశారు.Standing in solidarity with @tarak9999 sir .Cinema unites us, politics divides us. Let’s keep both separate. Today it’s NTR garu and tomorrow it could be any other star.Requesting the entire TFI to stand together and support our beloved NTR garu.#StandWithNTR #TFIUnited— Anudeep Dev (@anudeepdev) August 19, 2025 -
బహిరంగంగా క్షమాపణ చెప్పు ఎమ్మెల్యే దగ్గుపాటి పై కర్నూల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్
-
'ఎన్టీఆర్' ఫ్యాన్స్ అరెస్ట్.. పోలీస్ స్టేషన్‌కు ముజీబ్
అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భగ్గుమంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. నందమూరి వారసుడిపై నీచమైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై టీడీపీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోఘ ఆ పార్టీపై కూడా తారక్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. తమ అభిమాన హీరోను నోటికొచ్చినట్లు తిట్టడాన్ని వారు జీర్ణించుకోలేక పోయారు. దీంతో ఇప్పటికే అనంతపురం శ్రీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపైకి దాడికి దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే భారీ ఫ్లెక్సీలను చింపేసి నిరసన తెలిపారు. అయితే, నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులను పలుచోట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్లపైకి వచ్చి ఎలాంటి విధ్వంసం చేయరాదని హెచ్చరించారు. దీనిని ఫ్యాన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. మా అభిమాన హీరోను నోటికొచ్చినట్లు తిట్టి మా మీదే కేసులు పెడుతారా..? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే మదనపల్లిలోని ఎన్టీఆర్ అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. అభిమానులు రాష్ట్రం మొత్తం ఎక్కడ ధర్నాలు, ర్యాలీలు ప్రెస్మీట్లు పెట్టకూడదని వారు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్లను పోలీస్‌స్టేషన్ వద్దకు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదోనిలోని పోలీస్‌స్టేషన్‌కు జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం ఏపీ కన్వీనర్ ముజీబ్ అహ్మద్ కూడా వెళ్లారు. కుప్పంలో కూడా పోలీసుల ఒత్తిడి వల్ల ధర్నాలు, ర్యాలీలను ఎన్టీఆర్ అభిమానులు క్యాన్సిల్ చేసుకున్నారు. తప్పు చేసిన వాళ్లను వదిలేసి కేవలం ఎన్టీఆర్ అభిమానులను మాత్రమే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఒక తల్లి గురించి నోటికొచ్చిన మాటలు మాట్లాడిన వారి మీద కేసులు పెట్టరా..? అంటూ ఫైర్ అవుతున్నారు.తారక్ గురించి నీచంగా మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యేఒక ఫోన్ కాల్లో ఎన్టీఆర్ గురించి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇలా మాట్లాడారు. ‘జూనియర్ ఎన్టీఆర్ ఒక బుడ్డా ఫకీర్.. వాడి సినిమాలు ఇక్కడ ఎలా ఆడనిస్తానని అనుకున్నారు.. లోకేశ్‌ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తాను.. వానెమ్మ.. లం.. కొడుకు.. వాని సినిమాలు ఆడనిస్తానా.. మీరెలా ఆడనిస్తార్రా గాడిదల్లారా.. నా పర్మిషన్ లేకుండా వేయిస్తారా.. ఈ సినిమా ఆడదు..’ అంటూ అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘వార్–2’ సినిమా విడుదల నేపథ్యంలో ఎమ్మెల్యే ఇటీవల ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత ధనుంజయనాయుడుతో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. -
కర్నూలులో ఉద్రికత్త.. ఎన్టీఆర్ అభిమానుల నిరసన
సాక్షి, కర్నూలు: కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌కు వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నిరసనకు దిగారు. తక్షణమే టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గుబాటికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు.ఈ నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద ఎన్టీఆర్ అభిమానులు నిరసనలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం, నిరసనకారులను బలవంతంగా త్రీటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో జూనియర్ అభిమానులు త్రీటౌన్ పోలీసు స్టేషన్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకుని పీఎస్ ఎదుటే ఆందోళనకు దిగారు. పోలీసులు, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యాఖ్యలు వైరల్..అంతకుముందు.. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. ఎన్టీఆర్ అభిమాన సంఘం నేతకు ఫోన్ చేసి.. ‘ఈ సినిమాకు ఎన్ని థియేటర్లు అనుమతించారు.. ఎవరు అనుమతి ఇచ్చారు.. ఎలా ఆడనిస్తారు? ఆ సినిమాను ఆడనిచ్చేదే లేదు.. వాడు బుడ్డా ఫకీర్.. లోకేష్‌ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తాను.. వానెమ్మ.. లం..కొడుకు ఈ టైమ్‌లో వాని సినిమాలు ఆడనిస్తానా.. మీరెలా ఆడనిస్తార్రా గాడిదల్లారా? నా పర్మిషన్ లేకుండా వేయిస్తారా? ఈ సినిమా ఆడదు.. వాడు బుడ్డా ఫకీర్ గాడు లోకేశ్ గురించి మాట్లాడతాడా? ఈ సినిమా ఆడదు. నాకు తెలియకుండా సినిమా ఎట్లా ఆడుతుంది.. నేను అనంతపురం ఎమ్మెల్యే.. బుడ్డా ఫకీర్ నా కొడుకు.. సార్ గురించి మాట్లాడతాడా? గాడ్ ప్రామిస్‌గా చెబుతున్నా.. ఈ సినిమా ఆడదు.. ఆపేయిస్తున్నా.. నేను ఊరుకుంటానా.. పంపించేయండి అందరినీ’ అని హుకుం జారీ చేశారు’ ఈ ఫోన్ కాల్ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. లోకేష్, చంద్రబాబు ప్రోద్భలంతోనే ఎన్టీఆర్ సినిమాను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎమ్మెల్యే ప్రసాద్ వ్యాఖ్యలు అందులో భాగమేనని నందమూరి, ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.వాయిస్ రికార్డ్ బయట పెట్టిన ధనుంజయ నాయుడుసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో తనది కాదని ఎమ్మెల్యే ప్రసాద్ వివరణ ఇవ్వబోగా జూ.ఎన్టీఆర్ అభిమాని, టీఎన్ఎస్ఎఫ్ నేత గుత్తా ధనుంజయ నాయుడు ఆయన వాయిస్ రికార్డు బయట పెట్టారు. జూ.ఎన్టీఆర్‌ను తిడుతూ.. తనను ఎమ్మెల్యే ఫోన్లో బెదిరించిన అనంతరం ఆయన ఒక ఆడియోను రికార్డు చేసి ఎమ్మెల్యేకు పంపినట్లు తెలుస్తోంది. ‘అన్నా.. మీరంటే గౌరవం ఉంది. దయచేసి చెబుతున్నా.. ఎవరో చెప్పిన మాటలు విని అలా మాట్లాడవద్దు. జూ.ఎన్టీఆర్‌కు సినిమా పరంగా ముందు నుంచీ అభిమానిని. ఈ విషయాన్ని నారా లోకేశ్ ముందు చెప్పమన్నా చెబుతా. అంతేగానీ ఎవరి కోసమో పని చేయలేదు నేను. దయచేసి నన్ను కాంట్రవర్సీలోకి లాగొద్దు.సినిమా మీద కాంట్రవర్సీ ఎందుకు? నన్నెందుకు మీరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు? అసభ్యంగా మాట్లాడితే నేను పడను. నాకు ఫోన్ చేసి బెదిరించడం తప్పు. ఎన్టీఆర్ గాడు.. గీడు అని మాట్లాడవద్దు. మీరు నాతో మాట్లాడిన ప్రతిదీ వాయిస్ రికార్డు చేశాను. ఈ రికార్డులన్నీ నారా రోహిత్ అన్నకు పంపినా. నాకు నీవు ఏమైనా అర్ధ రూపాయి ఇచ్చినావా? ఏడాది దాటింది. ఒక్క పని ఇచ్చావా? చిన్న సహాయం చేశావా? నా మీద నీకేం హక్కుంది మాట్లాడేందుకు? నన్ను చంపుతావా.. చంపు. నన్ను చంపావంటే మా వాళ్లు ఊరికే ఉండరు. నువ్వు నోరు జారినావంటే బాగుండదు’ అని గుత్తా ధనుంజయ నాయుడు ఎమ్మెల్యేకు పంపిన వాయిస్ రికార్డులో పేర్కొన్నారు. దీంతో జూ.ఎన్టీఆర్ అభిమానులు మరింతగా రగిలిపోతున్నారు. -
బయట కనబడితే.. ఎమ్మెల్యే దగ్గుపాటికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్నింగ్
-
రాయలేని భాషలో జూ ఎన్టీఆర్ ను తిట్టిన టీడీపీ ఎమ్మెల్యే
-
నిన్ను వదలం.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్నింగ్
-
జూ.ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు.. ఆర్కే రోజా రియాక్షన్
సాక్షి, తిరుపతి: జూనియర్ ఎన్టీఆర్‌పై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వాఖ్యలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సినిమా, రాజకీయాలు మిక్స్ చేయెద్దంటూ ఆమె హితవు పలికారు. అరచేతితో సూర్యుడ్ని ఆపలేరన్నారు. ఎమ్మెల్యేలు టికెట్లు కొన్నా.. అభిమానులు పవన్ సినిమాకు రాలేదంటూ రోజా వ్యాఖ్యానించారు.ఉచిత బస్సు ప్రయాణంలో ఆంక్షలపై రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్త్రీశక్తి పేరుతో మహిళలను దగా చేశారని ఆమె మండిపడ్డారు. 16 రకాలు బస్సులు ఉన్నాయి.. ఇప్పుడు 5 బస్సులకు మాత్రమే అమలు చేస్తున్నారంటూ రోజా దుయ్యబట్టారు. 14 నెలలు తర్వాత స్తీశక్తి బస్సు ప్రారంభించారు. లోకల్‌గా తిరిగే బస్సుల్లో మాత్రమే ఉచిత బస్సులకు అమలు చేశారు’’ అంటూ ఆర్కే రోజా నిలదీశారు.‘‘రాష్ట్రం మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ అని చెప్పి.. ఇవాళ ఆంక్షలు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం కోతలు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకుంది. తిరుమల, అన్నవరం, విజయవాడ, శ్రీశైలం పుణ్య క్షేత్రాలకు ఉచిత దర్శనం లేదు. భగవంతుడు పేరు చెప్పి ఓట్లు దండుకున్నారు. మహిళల్ని మోసం చేశారు. పల్లె వెలుగు బస్సుల్లోనే పంపిస్తామని ఎన్నికలు ముందు మీరు చెప్పారు. మహిళల్ని మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు...కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు. సూపర్ సిక్స్.. హిట్ కాదు.. సూపర్ ప్లాప్. తిరుపతి నుంచి తిరుమలకు ఉచిత బస్సు ప్రయాణం లేదు. శ్రీశైలం, విజయవాడ దుర్గమ్మ గుడి, సింహాచలానికి ఉచిత ప్రయాణం లేదు. ఆడబిడ్డ నిధి.. 18 ఏళ్లు నిండిన వారికి ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఆడబిడ్డ లేరు కాబట్టి.. చంద్రబాబుకు ఆడవాళ్లను గౌరవించడం తెలీదు. కానీ, పవన్ కళ్యాణ్‌కు ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి ఆయన ప్రశ్నించాలి.జగనన్న ఆడబిడ్డలకు చెప్పింది చెప్పినట్లుగా అమలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి రావడం కోసమే.. అబద్ధాలు చెప్పారు. మహిళల్ని మోసం చేసినవాళ్లు ఏ రాష్ట్రంలో బాగుపడింది లేదు. వైఎస్ జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటూ చెప్పి చంద్రబాబు మోసం చేశాడు’’ అంటూ ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
MLA దగ్గుపాటి ప్రసాద్ కు వ్యతిరేకంగా NTR అభిమానుల ఆందోళన
-
జూ. ఎన్టీఆర్ సినిమాను ఆపే దమ్ముందా! టీడీపీకి రోజా కౌంటర్
-
టీడీపీ ఎమ్మెల్యే ఆఫీస్ ముందు జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధర్నా
సాక్షి, అనంతపురం: జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వ్యాఖ్యలు రచ్చ రేపుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్‌ను బూతుల తిట్టిన ఎమ్మెల్యే దగ్గుపాటి ఆడియో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ ఎమ్మెల్యే దగ్గుపాటి కార్యాలయం ముందు బైఠాయించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నినాదాలు చేశారు.ఎమ్మెల్యే ప్రసాద్, జూ.ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడు ఫోన్ ఆడియో లీక్ రాష్ట్రవాప్తంగా కలకలం సృష్టిస్తోంది. వార్ -2 సినిమా ఆడదంటూ పదేపదే చెప్పిన దగ్గుపాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్‌ను అత్యంత దారుణంగా దూషించారు. 'వార్ 2' షోలను అనంతపురంలో నిలిపివేయాలంటూ హెచ్చరించడంతో పాటు బూతులతో రెచ్చిపోయారు. ఎమ్మెల్యే అయి ఉండి.. ఇంత అసభ్యకరమైన భాషను వాడటంపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రగిలిపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శనలను అడ్డుకోవడంపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎన్టీఆర్ జోలికి వస్తే సహించేది లేదని జూ.ఎన్టీఆర్ అభిమానులు తేల్చి చెప్పారు. నాలుగు గోడల మధ్య క్షమాపణ చెబితే కుదరదని.. ఎమ్మెల్యే దగ్గుపాటి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేన్నారు. మేం ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యేగా గెలిచావ్ అంటూ జూ.ఎన్టీఆర్ అభిమానులు మండిపడ్డారు.టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇవాళ ఉదయం నుంచి తీవ్ర దుమారం రేగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ అంటే చంద్రబాబు, నారా లోకేష్‌లకు నచ్చదు.. అందుకే ఆయన సినిమాలు ఆడనివ్వను.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు మీరూ చూడవద్దంటూ దగ్గుపాటి ప్రసాద్ హుకూం జారీ చేశారు. అసభ్య పదజాలంతో జూనియర్ ఎన్టీఆర్‌ను దూషించిన ఆడియో వైరల్ కావటంతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌పై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు.జూనియర్ ఎన్టీఆర్ పై అసభ్య పదజాలంతో దూషించారు ఎమ్మెల్యే దగ్గుపాటి.. వార్ 2 సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాన్ షోకి రావాలని జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత ధనుంజయ నాయుడు ఆహ్వానించారు. ఒక్కసారి గా రెచ్చిపోయిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్ పై రాయలేని భాషలో నోరు పారేసుకున్నారు. చంద్రబాబు, లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ను వ్యతిరేకిస్తారని.. మీరు కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూడవద్దంటూ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వనని.. బాక్సులు, స్క్రీన్లు కాల్చేయిస్తానంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి వార్నింగ్ ఇచ్చారు. ఈ ఆడియో సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారటంతో భయపడ్డ.. దగ్గుపాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణ చెబుతూ ఓ విడియో విడుదల చేశారు. అది ఫేక్ వీడియో అన్న ఎమ్మెల్యే.. తనకు నారా-నందమూరి కుటుంబాలపై గౌరవం ఉందంటూ చెప్పుకొచ్చారు.మరో వైపు, టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. అనంతపురం నగరంలోని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని... అలా చెప్పకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఫ్లెక్సీలు చించి వేశారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అందుబాటులో లేరని... ఆయన వచ్చాక బహిరంగ క్షమాపణలు చెప్పిస్తానని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాం హామీ ఇవ్వడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన విరమించారు -
Audio Leak: జూనియర్ ఎన్టీఆర్‌పై నోరు పారేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
-
జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే బూతు పురాణం.. ఆడియో వైరల్
సాక్షి, అనంతపురం: జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసభ్యంగా మాట్లాడిన దగ్గుపాటి ప్రసాద్.. నారా లోకేష్‌కు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వవంటూ హెచ్చరించారు. 'వార్ 2' షోలను అనంతపురంలో నిలిపివేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు. వార్ -2 విడుదల సందర్భంగా అభిమానుల స్పెషల్ షోకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడు ఆహ్వానించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్‌పై దగ్గుపాటి ప్రసాద్ రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో టీడీపీ ఎమ్మెల్యే బూతు పురాణం వైరల్‌గా మారింది.ఎమ్మెల్యే ఆడియో సంభాషణలు ఆలస్యంగా వెలుగుచూశాయి. దగ్గుబాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్‌ను దారుణంగా దూషించడం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యేపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణలు చెప్పారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ఆడియో బయటకు వచ్చిందన్న ఎమ్మెల్యే దగ్గుపాటి.. సొంత పార్టీ నేతలే తన ఇమేజ్ను డామేజ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. -
బాలీవుడ్ లో ఎన్టీఆర్ క్రేజ్..
-
స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్ దూకుడు
-
‘కూలీ’ కంటే ‘వార్ 2’కే తక్కువ కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే?
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన తొలి చిత్రం ‘వార్ 2’. భారీ అంచనాల మధ్య నిన్న (ఆగస్ట్ 14) విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. అభిమానుల అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా విఫలం అయింది. అయినప్పటికీ తొలి రోజు మాత్రం భారీ కలెక్షన్స్‌నే రాబట్టింది.(చదవండి: వార్ 2 మూవీ రివ్యూ)మొదటి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 52.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూళ్లు అయ్యాయి. వాటిలో హిందీ నుంచి అత్యధికంగా రూ. 29 కోట్లు వసూళ్లు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 23.25 కోట్లు రాబట్టింది. జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగానే ఇక్కడ ఈ స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఇక తమిళనాడులో అయితే అతి తక్కువగా కేవలం రూ. 25 లక్షలు మాత్రమే వసూలు చేయడం గమనార్హం. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా ఎఫెక్ట్ కారణంగానే తమిళ్లో వార్ 2 కలెక్షన్స్ భారీగా తగ్గిపోయాయి. గ్రాస్ కలెక్షన్స్ పరంగా చూస్తే వార్ 2 మొత్తంగా రూ. 85-90 కోట్లు మాత్రమే వసూలు చేసింది. (చదవండి: ‘కూలీ’ మూవీ రివ్యూ)ఇక ఇదే రోజు విడుదలైన కూలీ చిత్రంతో పోలిస్తే..వార్ 2 కలెక్షన్సే తక్కువ. కూలీ చిత్రానికి కూడా తొలిరోజే మిశ్రమ స్పందన వచ్చినా.. అత్యధికంగా రూ. 65 కోట్ల నెట్ కలెక్షన్స్‌ని రాబట్టింది. రెండు చిత్రాలు కలిసి తొలి రోజు రూ. 117.50 కోట్లు వసూలు చేశాయి. అయితే ఈ చిత్రాలకు ఉన్న బజ్‌తో పోలిస్తే ఇది తక్కువ అనే చెప్పాలి. రెండు చిత్రాలు భారీ అంచనాలతో రిలీజ్ అయ్యాయి. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో రెండూ విఫలం అయ్యాయి అని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. ఇక వరుసగా మూడు రోజులు సెలవులు ఉండడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. టాక్‌తో సంబంధం లేకుండా ఈ మూడు రోజులు భారీగానే వసూళ్లు వచ్చే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు. మరి వీకెండ్లో ఈ రెండు చిత్రాల్లో ఏది అత్యధికంగా వసూళ్లు సాధిస్తుందో చూడాలి. -
జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రం.. తొలి రోజే వార్-2కు షాకింగ్ కలెక్షన్స్!
హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కీలక పాత్రల్లో వచ్చిన యాక్షన్ చిత్రం వార్-2. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ నెల 14న థియేటర్లలో విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రం చేసిన ఈ సినిమాకు తొలిరోజే మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. రజినీకాంత్ కూలీ మూవీతో బాక్సాఫీస్ బరిలోకి దిగిన వార్-2 మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్స్ సాధించింది.దేశవ్యాప్తంగా దాదాపు రూ.52.5 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. వసూళ్లపరంగా హిందీలో అత్యధికంగా రాగా.. తెలుగు రాష్ట్రాల్లో రెండో అత్యధిక వసూళ్లతో రాణించింది. అయితే యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో వచ్చిన ఏక్ థా టైగర్ సినిమా వసూళ్ల కంటే తక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. ఇది స్పై యూనివర్స్‌లో అత్యల్ప ఓపెనింగ్ నమోదు చేసింది .అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి రోజున హిందీలో దాదాపు రూ. 29 కోట్లకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది. తెలుగులోనూ అదే స్థాయిలో దాదాపు రూ.23.5 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ, అనిల్ కపూర్, అశుతోష్ రాణా ముఖ్య పాత్రల్లో నటించారు. -
హీరో అంటే ఇంత పిచ్చేంటి సామీ?.. చేయి కోసుకుని మరి..!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ వార్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో బాలీవుడ్ అరంగేట్రం చేసిన తారక్.. అభిమానులను మరోసారి బిగ్ స్క్రీన్‌పై అలరించాడ. దేవర తర్వాత వస్తోన్న చిత్రం కావడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ రోజే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద అలరిస్తోంది. జూనియర్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఫ్యాన్స్ థియేటర్ల వద్ద హల్ చల్ చేశారు.ఓ అభిమాని అయితే ఏకంగా తన రక్తంతో వీరతిలకం దిద్దారు. తన చేతి వేలి రక్తాన్ని ఎన్టీఆర్ పోస్టర్‌కు తిలకం దిద్దుతూ తన అభిమానాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ అతన్ని చూసి షాకవుతున్నారు. మరి ఇంత పిచ్చేంట్రా సామీ అంటూ విమర్శిస్తున్నారు. ఎంత అభిమానులు ఇలాంటి చర్యలు చేయడం కరెక్ట్ కాదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఇవాళ థియేటర్లలో విడుదలైన వార్ -2కు బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా మెప్పించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా రజినీకాంత్ కూలీతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతోంది. ఈ మూవీ యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో తెరకెక్కించారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
వార్ 2 సినిమా హిట్టా..! ఫట్టా..!
-
‘వార్ 2 ’మూవీ రివ్యూ
టైటిల్ : వార్ 2నటీనటులు: హృతిక్ రోషన్, ఎన్టీఆర్, అనిల్ కపూర్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా తదితరులునిర్మాణ సంస్థ: యశ్‌రాజ్ ఫిల్మ్స్‌నిర్మాత : ఆదిత్యా చోప్రాదర్శకత్వం: అయాన్ ముఖర్జీసంగీతం: ప్రీతమ్(పాటలు), సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా(బ్యాక్‌గ్రౌండ్ స్కోర్)సినిమాటోగ్రఫీ: బెంజమిన్ జాస్పర్విడుదల తేది: ఆగస్ట్ 14, 2025బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ నుంచి వచ్చిన తాజా స్పై యాక్షన్ ఫిలిం వార్ 2. జూనియర్ ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం కావడంతో టాలీవుడ్లో కూడా ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. మరి ఆ అంచనాలను వార్ 2 అందుకుందా లేదా? రివ్యూలో చూద్దాం.వార్ 2 కథేంటంటే..కలి.. ఓ అజ్ఞాత శక్తి. ఎవరికి కనిపించడు కానీ, ప్రపంచ దేశాలను వణికిస్తాడు. ఈసారి అతని చూపు భారత్‌పై పడుతుంది. భారత్‌ని తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలనుకుంటాడు. అందుకు ‘ రా’ మాజీ ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్)ని పావుగా వాడతాడు. కలి టీమ్‌లో చేరాలంటే.. తన గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి, కల్నల్ సునీల్ లూథ్రా(అశుతోష్ రాణా)ని చంపాలని కబీర్‌కు టాస్క్ ఇస్తాడు. సునీల్ లూథ్రాని కబీర్ చంపేస్తాడు. దీతో ‘రా’ కబీర్‌ని వెంటాడుతుంది. అతడిని పట్టుకోవడానికి ‘రా’ చీఫ్ (అనిల్ కపూర్) ఓ స్పెషల్ టీమ్‌ని నియమిస్తాడు. కేంద్రమంత్రి విలాస్ రావు సారంగ్ సూచనతో స్పెషల్ టీమ్‌కి మేజర్ విక్రమ్ చలపతి(ఎన్టీఆర్)ని లీడర్‌గా నియమిస్తాడు. తన తండ్రి సునీల్ లూథ్రాని చంపిన కబీర్‌పై పగ పెంచుకున్న వింగ్ కమాండర్ కావ్య లూథ్రా (కియారా అద్వానీ) కూడా విక్రమ్ టీమ్‌లో చేరుతుంది. విక్రమ్ టీమ్ కబీర్‌ని పట్టుకుందా? లేదా? అసలు కబీర్ దేశద్రోహిగా ఎందుకు మారాడు? అతని లక్ష్యం ఏంటి? విక్రమ్‌కి, కబీర్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అజ్ఞాతంలో ఉన్న కలి ఎవరు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. స్పై యాక్షన్ థ్రిల్లర్ అనగానే కళ్లు చెదిరే యాక్షన్ విన్యాసాలు, ఊహించని ట్విస్టులు లాంటివి గుర్తుకొస్తాయి. ప్రేక్షకుడు కూడా వాటిని దృష్టిలో పెట్టుకొనే థియేటర్స్‌కి వస్తాడు. వార్ 2లో ఆ రెండూ ఉన్నాయి. కానీ ఇప్పటికే ఆ తరహా యాక్షన్ సీన్లు, ట్విస్టులు చూసి ఉండడంతో ఈ సినిమా చూస్తున్నంతసేపు ‘కొత్తగా ఏమీ లేదే’ అనిపిస్తుంది. కథ, కథనాలే పెద్దగా ఆసక్తి రేకెత్తించవు. దర్శకుడు ట్విస్టులు అనుకొని రాసుకున్న సీన్లు కూడా ఈజీగా ఊహించొచ్చు. విజువల్స్ పరంగానూ సినిమా ఆకట్టుకునేలా లేదు. ఒకటి రెండు యాక్షన్ సీన్లు మినహా మిగతావన్నీ రొటీన్‌గానే ఉంటాయి. ఎమోషనల్ సన్నివేశాలు మాత్రం కొంతమేర ఆకట్టుకుంటాయి. ఓ భారీ యాక్షన్ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. కలి గ్యాంగ్.. హృతిక్‌కి ఒక టాస్క్ ఇవ్వడం.. అందులో భాగంగా కల్నల్ సునీల్ లూథ్రాని చంపేయడం.. అతన్ని పట్టుకునేందుకు ‘రా’ రంగంలోకి దిగడం అంతా రొటీన్‌గానే సాగుతుంది. ఇక మేజర్ విక్రమ్‌గా ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతంది. భారీ ఎలివేషన్‌తో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది. కబీర్‌ని పట్టుకునే క్రమంలో వచ్చే కార్ ఛేజింగ్ సీన్, మెట్రో ట్రైన్‌పై వచ్చే యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్‌కు ముందు విమానంపై వచ్చే యాక్షన్ సీన్ సినిమాకే హైలెట్. స్పై యాక్షన్ సినిమాలను చూసిన వారికి ఇంటర్వెల్ ట్విస్ట్ ఈజీగా ఊహించొచ్చు. సెకండాఫ్ ప్రారంభంలో హృతిక్, ఎన్టీఆర్‌పై వచ్చే ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. కావ్య లూథ్రాకి అసలు నిజం తెలిసిన తర్వాత కథనం పరుగులు పెడుతుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. చివరిలో హృతిక్, ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ సీన్ అదిరిపోతుంది. ఎవరెలా చేశారంటే.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్..ఇద్దరూ గొప్ప నటులే. ఎలాంటి పాత్రల్లో అయినా ఒదిగిపోతారు. హృతిక్‌కు ఆల్రేడీ స్పై యాక్షన్ సినిమాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి కబీర్ పాత్రలో అవలీలగా నటించాడు. యాక్షన్ సీన్లు అదరగొట్టేశాడు. ఎన్టీఆర్‌కి ఇది తొలి స్పై యాక్షన్ మూవీ. మేజర్ విక్రమ్‌గా అద్భుతంగా నటించాడు. యాక్షన్, డ్యాన్స్ విషయంలో హృతిక్‌తో పోటీ పడి యాక్ట్ చేశాడు. సినిమాలో ఎన్టీఆర్ పాత్రకే భారీ ఎలివేషన్, ట్విస్టులు ఉంటాయి. దాదాపు 80 శాతం కథ ఎన్టీఆర్, హృతిక్‌ల చుట్టే తిరుగుతుంది. ఇక కల్నల్ సునీల్ లూథ్రాగా అశుతోష్ రాణా తెరపై కనిపించేది కాసేపే అయినా.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. వింగ్ కమాండర్ కావ్య పాత్రకి కియరా అద్వానీ న్యాయం చేసింది. అయితే ఆమె పాత్రకి స్క్రీన్‌స్పేస్ చాలా తక్కువ అనే చెప్పాలి. హృతిక్‌తో వచ్చే యాక్షన్ సీన్లో కియారా అదరగొట్టేసింది. అనిల్ కపూర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ప్రీతమ్ పాటలు ఓకే. సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా నేపథ్య సంగీతం సినిమాకు అదనపు బలం. సినిమాటోగ్రఫీ బాగుంది. యాక్షన్ సన్నివేశాలు ఒకటి, రెండు బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘వార్ 2’ మూవీ ట్విటర్ రివ్యూ
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన తొలి మల్టీస్టారర్ చిత్రం వార్ 2. అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కియరా అద్వానీ హీరోయిన్. బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం కావడంతో హిందీతో పాటు సౌత్‌లోనే ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 14) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వార్ 2 ఎలా ఉంది? ఎన్టీఆర్,హృతిక్లలో ఎవరి నటన బాగుంది? సినిమాలో ప్లస్ & మైనస్ పాయింట్స్ ఏంటి తదితర అంశాలను ఎక్స్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు.ఎక్స్‌లో వార్ 2 సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది అంటుంటే.. గతంలో వచ్చిన స్పై యాక్షన్ చిత్రాలతో పోలిస్తే ఇది యావరేజ్ అని మరికొంతమంది అంటున్నారు. అయితే ఎన్టీఆర్, హృతిక్‌ల నటనపై మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు. యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని చెబుతున్నారు.వార్2 సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు చాలా హై- ఓల్టేజ్‌లో ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు. ముఖ్యంగా హృతిక్ రోషన్ , జూనియర్ ఎన్టీఆర్‌ల మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయంటున్నారు. అయితే, ఫస్టాప్‌లో వచ్చే ట్రైన్ యాక్షన్ సీన్ పెద్దగా మెప్పించలేదని చెబుతున్నారు. ఫస్టాప్ మొత్తానికి ప్రీ ఇంటర్వెల్ సీన్ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.వార్2 చాలా సాధారణ కథ అని ఎక్కువమంది అభిప్రాయ పడుతున్నారు. కథ, కథనం కొత్తగా లేవని, సాధారణంగా ఉన్నాయని కొన్ని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ (VFX)లో కొన్ని లోపాలు ఉన్నాయని చెబుతున్నారు. ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్ పనితీరు మెప్పించలేదంటున్నారు.ఇంటర్వెల్, ఫ్రీ క్లైమాక్స్ ట్విస్టులు మాత్రమే అదిరి పోయాయని కొందరు చెబుతున్నారు. కియారా అద్వానీ పాత్ర కేవలం గ్లామర్ కోసం మాత్రమే ఉపయోగించారని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి మాత్రమే "వార్ 2" ఒక మంచి ఎంపిక అంటూ ఎక్కువ మంది అంటున్నారు. ఎన్టీఆర్ అభిమానులకు తప్పకుండా నచ్చేలా పాత్రనే డిజైన్ చేశారని అంటూనే ఒక కొత్త కథనాన్ని ఆశించేవారికి ఇది సాధారణ సినిమాగా అనిపించవచ్చని తెలుపుతున్నారు.#War2 An okayish action entertainer. Not great, Not bad either - Strictly MID.Note : #NTR Fans should keep their expectations in check .there are moments where you whistle, but there are moments that will frustrate you , but the ending sort of pulls it back and you will walk…— Thyview (@Thyview) August 14, 2025 I’m just left speechless, what a movie #War2 never a dull moment, full action packed until the end. @iHrithik couldn’t take my eyes off you. #HrithikRoshan #JrNTR enjoyed seeing him in his role.Must watch movie in theatre.Blockbuster loading 💥💥💥💥 pic.twitter.com/rcBRFdCMYS— K k k Kiran (@kkkKiran0) August 14, 2025#War2Review - ⭐⭐⭐⭐/5#War2 is a BLOCKBUSTER in every sense! 💥 @iHrithik is pure swag, his stylish entry sets the tone.ThnComes @tarak9999 with a ROCKSTAR debut, his screen presence is FIRE!🔥 @advani_kiara dazzles like never before grace, glam & grit! Highly Recommended 👍 https://t.co/HsOlFqyiPO pic.twitter.com/MDWRPf4p6M— Cinema 🇮🇳 (@cinemaentr) August 14, 2025#War2Review - ⭐⭐⭐⭐/5#War2 is a BLOCKBUSTER in every sense! 💥 @iHrithik is pure swag, his stylish entry sets the tone.ThnComes @tarak9999 with a ROCKSTAR debut, his screen presence is FIRE!🔥 @advani_kiara dazzles like never before grace, glam & grit! Highly Recommended 👍 https://t.co/HsOlFqyiPO pic.twitter.com/MDWRPf4p6M— Cinema 🇮🇳 (@cinemaentr) August 14, 2025#War2Review: I don't want to spoil but giving too many details but it does distinguish itself from the other Spy Universe films (in a good way!). I liked #War, but #War2 has heart, and it has some enjoyable emotional moments, with good performances from the cast!— ✨️ (@daalchaawal_) August 14, 2025Coolie nakodakallara 😂Coolie demgindi antaga 😂😂😂😂@tarak9999 Hunt begins now all over world 🔥 long run chustaru 💥💥💥💥N T R pure massssss potential 🔥 #War2Review #War2 #War2Celebrations pic.twitter.com/9FFq2Sk2PS— palnadu🐯🔥 (@MpalnaduTiger) August 14, 2025Very below Average First Half disappointed Logic less physics They took Audience as granted there is no High moments in the Action Thriller Movie 😪 No Engaging sequence till now Need a very big jump for second half #War2#War2Review #War2Telugu #War2Disaster pic.twitter.com/hyNwxuDjzF— Don Ak (@Indiamyheart123) August 14, 2025#War2Review : Above average#War2 is a strictly mediocre action thriller, leaning heavily on style over content!the storyline might vary, but same theme makes it feel pretty ordinary and routine.Average VFXBGM could be betterRating: 2.5/5#HrithikRoshan #JrNTR #AyanMukerji https://t.co/DkwnqCnjkW— IndianCinemaLover (@Vishwa0911) August 14, 20252nd half: good back story, but story falls flat & predictable. Lacks emotional connect. Both actors nailed their respective performances. @tarak9999 acting & looks will shut every hater🔥 Result & BO depends on Coolie now. #War2Review #War2 #YRFSpyUniverse pic.twitter.com/FZvCbFiY0X— Alpsreviews (@alpsreviews) August 14, 2025#War2 is a strictly mediocre action thriller, leaning heavily on style over substance!The storyline is somewhat different from the previous spy universe films, which had potential but wasn’t able to fully capitalize on it. Though the storyline might vary, the tempo of the other…— Venky Reviews (@venkyreviews) August 14, 2025#War2 Prabhas Body - NTR face totally worthy VFX for N fans 🤣You pointed out #HHVM from FDFS… now take it back 😁We’re about to give you exactly what you deserve 🔥#DisasterWar2 #JanaNayagan #War2Review— Don Ak (@Indiamyheart123) August 14, 2025First Review #War2 : It is a sureshot hit. It has the magical chemistry of two handsome hunks,their superb action, and an outstanding dance picturised on both of them as its major plus points.#JrNTR & #HrithikRoshan Stole the Show. #KiaraAdvani is just for Sex appealing.🌟🌟🌟🌟 pic.twitter.com/XjbRz8t5og— Umair Sandhu (@UmairSandu) August 11, 2025#War2 intervalJust one word Blockbuster 💥 💥 Its an out and out entertainer You won’t want to even blink For a secondLord Ayan has really cooked 😍😍😍#HrithikRoshan as kabir is unmatchable #JrNTR introduction in Spy Universe is really good #KiaraAdvani is awesome too…— Rohit 😇 (@goonerfromind) August 14, 2025#War2: Disappointing and IllogicalThere is no proper justification for any character in the film, including the lead actors. Their mission and methods follow an abnormal flow. Both the emotion and the conflict between Hrithik and NTR fail to work.— TrackTollywood (@TrackTwood) August 14, 2025 -
మరికొన్ని గంటల్లో ‘వార్ 2’ రిలీజ్.. హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్
ఎన్టీఆర్, హృతిక్ రోషన్లు కలిసి నటించిన వార్ 2 చిత్రం మరికొన్ని గంటల్లో(ఆగస్ట్ 14) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు ‘వార్ 2’ మీద అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్ అవుతుండడంతో అభిమానులకు స్పాయిలర్ల గురించి హీరోలు రిక్వెస్ట్ చేశారు.‘‘వార్ 2’ సినిమాను ఎంతో ప్రేమతో, ఎంతో కష్టపడి తెరకెక్కించాం. ఎంతో ప్యాషన్‌తో చేసిన ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాటిక్ దృశ్యాన్ని ఎక్స్ పీరియెన్స్ చేయడానికి అందరూ థియేటర్లలోనే సినిమాను చూడండి. దయచేసి సినిమాలోని సీక్రెట్లు, ట్విస్ట్‌లను రివీల్ చేయకండి. స్పాయిలర్లను ఆపండి. ఇది మీడియా, ప్రేక్షకులు, అభిమానులను మేం రిక్వెస్ట్ చేస్తున్నాము’ అని అన్నారు.‘మీరు (అభిమానులు) ‘వార్ 2’ని మొదటిసారి చూసినప్పుడు అనుభవించినంత ఆనందం, థ్రిల్, వినోదాన్ని మిగతా వారు కూడా అనుభవించాలి. స్పాయిలర్లు సీక్రెట్లు, ట్విస్టులు రివీల్ చేయడం వల్ల మిగతా వాళ్లకు ఆ అనుభూతి, అనుభవం ఉండదు. దయచేసి ‘వార్ 2’ కథను రహస్యంగా ఉంచండి’ అని ఎన్టీఆర్ తెలిపారు. -
తొలి రోజు 100 కోట్లు పక్కా..!
-
నన్నెవ్వరూ ఆపలేరు.. ఎన్టీఆర్ కౌంటర్ లోకేష్‌కేనా?
పబ్లిక్ ఫంక్షన్లలో సాధారణంగా ఆచితూచి మాట్లాడతాడు తారక్. తన ఫ్యాన్స్‌కోసం మహా అయితే కాలర్ ఎగరేస్తాడు అంతే. ఏ మాత్రం వివాదాస్పద వ్యాక్యల జోలికి పోడు. కానీ ఈ సారి ఓ గట్టి స్టేట్మెంట్నే వదిలాడు తారక్. అదేంటంటే "స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దీవెనలు ఉన్నంత కాలం నన్ను ఎవరూ ఆపలేరు" అనేది జూ. ఎన్టీఆర్ కామెంట్. మామూలుగా అయితే ఈ మాటను పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు పనిగనిగట్టుకుని 'నన్ను ఎవరూ ఆపలేరు' అని తారక్ అనడానికి ఓ కారణం ఉంది.సరిగ్గా 2 రోజుల క్రితం మంత్రి నారా లోకేష్ ఓ ట్వీట్ చేశాడు. అందులో తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ని పొగిడాడు. కూలీ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆకాంక్షించాడు. కానీ ఎన్టీఆర్‌ను, వార్ 2 సినిమా గురించి మాత్రం లోకేష్ ఎక్కడా ప్రస్తావించలేదు.రజినీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్తానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా లోకేష్ ఈ ట్వీట్ చేశాడు. కానీ అదే టైమ్‌లో జూ. ఎన్టీఆర్ కూడా తన 25 ఏళ్ల సినీ ప్రస్తానాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ ప్రస్తావన మాత్రం లోకేష్ ఎక్కడా తీసుకురాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకునే తారక్ ఇలా తన స్టైల్లో కౌంటర్ ఇచ్చాడని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు.ఇక చాలా కాలంగా అటు నారా కుటుంబానికి, ఇటు నందమూరి బాలకృష్ణ కుటుంబానికి జూ. ఎన్టీఆర్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. -
కాంతార 2లో ఎన్టీఆర్ ఎంట్రీ?
-
హైదరాబాద్‌లో గ్రాండ్‌గా 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఫైనల్
ఎన్టీఆర్ అభిమానులకు గుడ్‌న్యూస్... చాలా ఏళ్ల తర్వాత తమ అభిమాన హీరోను చూసే ఛాన్స్ 'వార్2' ద్వారా దొరికింది. వార్2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో భారీ ఎత్తున ఈ కార్యక్రమం జరగనుంది. ఆగష్టు 10న వేడుక నిర్వహిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ కార్యక్రమలో ఎన్టీఆర్‌తో పాటు హృతిక్ రోషన్ కూడా పాల్గొననున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఈ వేడుక ప్రారంభం కానుంది.ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి ఇద్దరు బిగ్‌స్టార్స్ వార్2 కోసం ఏకం కావడంతో సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. 'యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్'లో భాగంగా రూపొందిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. -
జూ.ఎన్టీయార్...నా ప్రచార ‘యుద్ధం’ నాదే
హీరోలు హీరోయిన్లు సినిమా ప్రచారంలో పాల్గొంటారే తప్ప ప్రచార బాధ్యతల్ని స్వయంగా చేపట్టడం అనేది జరగదు. సాధారణంగా ఆ బాధ్యతను కూడా సినిమా నిర్మాతలు, నిర్మాణ సంస్థలే చూసుకుంటాయి. అయితే గత కొంత కాలంగా జూనియర్ ఎన్టీయార్ దీనికి కొంత విభిన్నంగా ప్రయాణిస్తున్నారు. సినిమా నిర్మాణ సంస్థల ప్రచారపు తీరుతెన్నులు ఎలా ఉన్నప్పటికీ... తాను కూడా వ్యక్తిగతంగా మరోవైపు నుంచి వీటిని నిర్వహిస్తున్నట్టు సమాచారం. గతంలో రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ సమయంలో కూడా ఆయన ఇదే పంథాను అనుసరించారు. వ్యక్తిగతంగా అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని అంతర్జాతీయ స్థాయి లో ప్రచార వ్యూహాలు అమలు చేశారట. ఆ సినిమా మల్టీ స్టారర్ అయినప్పటికీ జూ.ఎన్టీయార్(Jr NTR)కు వచ్చిన గుర్తింపు మరెవరికీ రాకపోవడానికి అదే కారణం అంటున్నారు. పలువురు హాలీవుడ్ దర్శకులు సైతం జూ.ఎన్టీయార్‌తో సినిమా చేయడానికి రెడీ అంటూ ప్రకటనలు గుప్పించిన సంగతి తెలిసిందే.(చదవండి: నువ్వు తెలుగేనా? మంచు లక్ష్మితో అల్లు అర్హ క్యూట్ వీడియో)తాజాగా వార్ 2 సినిమా విషయంలోనూ ఆయన ఇదే తరహా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న టాలీవుడ్ యంగ్ టైగర్... వార్ 2 ని రూపొందించిన యష్ రాజ్ ఫిలింస్ ప్రచార శైలి పట్ల కినుక వహించారో, లేక తను కూడా మరింత బలం చేకూర్చాలనుకున్నారో తెలీదు గానీ ఈ సినిమా ప్రచారం విషయంలో ఎన్టీయార్ తన పిఆర్ టీమ్‌ను అలర్ట్ చేశారట. మరోవైపు తాజాగా సయ్యారా సినిమా సంచలన విజయం సాధించిన తర్వాత, ఆ సినిమాను కూడా సమర్పించిన యశ్ రాజ్ ఫిలింస్ భవిష్యత్తు ప్రమోషన్ వ్యూహంలో కీలక మార్పులు చేశారని తెలుస్తోంది. (చదవండి: ఆ సీన్ చేయలేనని చెబితే.. సౌత్ స్టార్ హీరో నాపై కేకలు వేశాడు: తమన్నా)సయ్యారా సినిమా మార్కెటింగ్‌ను ఈ సంస్థ అత్యంత వినూత్నంగా నిర్వహించింది. ప్రధాన జంట ప్రమోషన్ కోసం చాట్ షోలు షాపింగ్ మాల్స్‌లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వంటివి చేయడానికి బదులుగా, సినిమా పాటలు విజువల్ ప్రమోషన్ల ద్వారా మాత్రమే సినిమాపై ఆసక్తిని పెంచడం అనే కొత్త వ్యూహాన్ని ఈ సినిమా కోసం అవలంబించి విజయం సాధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వార్ 2 ప్రచార సరళిలో కూడా ఈ సంస్థ కీలక మార్పు చేర్పులు చేసినట్టు సమాచారం. అయితే ఈ మార్పు చేర్పుల పట్ల అంతగా సంతృప్తి చెందని జూనియర్ ఎన్టీఆర్ తన చిత్రం ప్రమోషన్ బాధ్యతలను తానే స్వయంగా చేపట్టారట. యశ్ రాజ్ ఫిలింస్ వారి మార్కెటింగ్ వ్యూహాన్ని వారు అనుసరిస్తున్నారని భావించిన ఎన్టీఆర్, తన వ్యక్తిగత మీడియా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మరో టాప్ హీరోతో కలిసి చేసే మల్టీ స్టారర్స్ విషయంలో జూ.ఎన్టీయర్ మరింత జాగ్రత్త పడుతున్నట్టుగా కనిపిస్తోంది.ప్రతిష్టాత్మకంగా రూపొందిన వార్ 2 సినిమా ఆగస్టు 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అధికారిక ప్రమోషన్ కార్యక్రమాల్లో స్టార్స్ కనిపించకపోవచ్చుననే అంచనాలతో, అభిమానులు సోషల్ మీడియా ఇతర మార్గాల ద్వారా ఈ సినిమా ప్రచారాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. -
సలాం అనాలి సాంగ్ టీజర్: డ్యాన్స్ ఇరగదీసిన స్టార్స్.. కానీ..!
హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2. ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజవుతోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. ఇకపోతే చిత్రయూనిట్ ఆన్లైన్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది.ఆన్లైన్ ప్రమోషన్స్ఇంటర్వ్యూలు, ప్రెస్మీట్లు అంటూ హంగామా చేయకుండా సోషల్ మీడియాలోనే ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. వార్ 2 మూవీలోని తన పోస్టర్‌తో ఉన్న బిల్‌బోర్డ్‌ను హృతిక్ ఇంటికి పంపించాడు. ఈ యుద్ధాన్ని మాతో గెలవలేరు అంటూ హీరోకు సవాలు విసిరాడు. అందుకు హృతిక్.. తన పోస్టర్ ఉన్న బిల్‌బోర్డ్‌ను తారక్ ఇంటికి పంపాడు. మీరు నాటునాటు డ్యాన్స్ ఎంత చేసినా.. ఈ యుద్ధంలో గెలిచేది మాత్రం నేనే అని రిప్లై ఇచ్చాడు. అలా వీరి మధ్య సోషల్ మీడియాలో సరదా వార్ జరుగుతోంది.ఫుల్ సాంగ్ కావాలంటే..తాజాగా ఈ యుద్ధాన్ని పక్కనపెట్టి వీరిద్దరూ ఒకరితో మరొకరు పోటీపడుతూ స్టెప్పులేశారు. జనాబే ఆలి (తెలుగులో సలాం అనాలి) పాటకు స్టైలిష్ స్టెప్పులు వేస్తూ అదరగొట్టారు. అందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ ఎప్పుడనుకుంటున్నారా? ఆగస్టు 14న.. యూట్యూబ్‌లో కాదు.. ఏకంగా థియేటర్లోనే ఫుల్ సాంగ్ చూసేయండని చెప్తున్నారు. ఏదేమైనా పాట మాత్రం అదిరిపోయిందంటున్నారు. The dance WAR you’ve been waiting for is almost here. Here’s the tease... #JanaabeAali full song in theatres only! pic.twitter.com/iUgdEWZbJ1#War2 releasing in Hindi, Telugu and Tamil in cinemas worldwide on 14th August.@ihrithik | @advani_kiara | #AyanMukerji | @ipritamofficial…— Jr NTR (@tarak9999) August 7, 2025 చదవండి: ఇబ్బందిగా ఉందని చెబితే.. సౌత్ స్టార్ హీరో నాపై కేకలు వేశాడు -
భార్యకు వండి పెడతా.. పిల్లల కోసమే ఆ పద్ధతి మార్చుకున్నా: తారక్
దేవర సినిమాతో సూపర్ హిట్టందుకున్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) వార్ 2తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. వచ్చేవారమే (ఆగస్టు 14న) ఈ మూవీ బాక్సాఫీస్‌లో సందడి చేయనుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా తారక్.. ఈస్క్వైర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.అది నా ఫేవరెట్ముందుగా బాలీవుడ్లో ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. నేను ఏదీ ముందుగా ప్లాన్ చేసుకోను. కుంగ్ఫు పాండా సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. 'నిన్న ఒక చరిత్ర- రేపు ఓ రహస్యం- నేడు అనేది ఓ బహుమతి'. ఇది నా ఫేవరెట్. నేను గతం గురించి, జరగబోయేదాని గురించి ఆలోచించను. వర్తమానంపైనే ఫోకస్ చేస్తాను. వార్ 2 సినిమా విషయానికి వస్తే.. కథ నాకు బాగా నచ్చింది. అలాగే హృతిక్ సర్‌తో పని చేయాలన్న ఉత్సుకత వల్లే వార్ 2 మూవీకి ఓకే చెప్పాను.నెలంతా షూటింగ్స్‌కే..మొదట్లో ఫ్యామిలీని పక్కనపెట్టి మొత్తం సినిమాలకే పరిమితమయ్యాను. వారంలో ఏడురోజులు షూటింగ్‌కు వెళ్లేవాడిని. అంటే నెలలో 30 రోజులు షూటింగ్స్‌కే కేటాయించేవాడిని. కానీ, ఇప్పుడు ఆ పద్ధతి మార్చుకుంటున్నాను. ఆదివారం సెలవు తీసుకుంటున్నాను. నా పిల్లలు అభయ్, భార్గవకు సమయం కేటాయిస్తున్నాను. ఎందుకంటే వారితో నేను సరదాగా, ప్రశాంతంగా గడిపేది ఆ ఒక్కరోజే! వాళ్లకు నచ్చింది చేయనిస్తానా పిల్లలు కూడా నాలాగే యాక్టర్స్ కావాలని ఎప్పుడూ చెప్పను. అది చేయాలి, ఇది చేయాలని ఆదేశించడానికి బదులుగా వారు కోరుకున్న స్థాయికి చేరేందుకు వారధిలా నిలబడతాను. ఇకపోతే నాకు వంట చేయడం ఇష్టం. నా భార్య లక్ష్మీ ప్రణతికి ప్రేమగా వండిపెడతాను. తనకే కాదు, నా స్నేహితుల కోసం, నా చుట్టూ ఉన్నవారి కోసం రుచికరంగా వంట చేస్తుంటాను. నాకు బిర్యానీ ఇష్టమైన వంటకం అని తారక్ చెప్పుకొచ్చాడు.చదవండి: నటి సీమంతం వేడుక.. పెళ్లెందుకు చేసుకోలేదా? నా ఇష్టం! -
ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ లైనప్.. ఒక్కదాన్ని మించి ఇంకొకటి ..!
-
భాగ్యనగరంలో భారీ సెట్స్.. స్టార్ హీరోల షూటింగ్ అప్డేట్స్
తెలుగు చిత్ర పరిశ్రమ అనగానే గుర్తొచ్చేది హైదరాబాద్. నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు ఇక్కడే నివాసం ఉంటుంటారు (ఇతర భాషల వాళ్లు మినహా). సినిమా షూటింగ్‌లకు అనువైన స్టూడియోలు ఇటు భాగ్యనగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ ఉన్నాయి. హైదరాబాద్ సమీపంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేకమైన సెట్టింగులు వేసి చిత్రీకరణలు జరుపుతుంటారు మేకర్స్. ప్రస్తుతం భాగ్యనగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌లు భలే జోరుగా సాగుతున్నాయి. ప్రభాస్, పవన్‌కల్యాణ్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, నాగచైతన్య, రామ్ పోతినేని, విజయ్ సేతుపతి, సాయిదుర్గా తేజ్, తేజా సజ్జా, అఖిల్ అక్కినేని, సిద్ధు జొన్నలగడ్డ వంటి పలువురు హీరోలు హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో తమ సినిమాల షూటింగ్లో హుషా రుగా పాల్గొంటున్నారు. ఇక భాగ్యనగరంలో ఎవరెక్కడ? షూటింగ్లో పాల్గొంటున్నారో ఆ విశేషాలేంటో చూద్దాం...అజీజ్ నగర్లో రాజా సాబ్ ‘బాహుబలి’ సినిమా తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలతో జెట్ స్పీడ్‌లో దూసుకెళుతున్నారు ప్రభాస్. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ సమీపంలోని అజీజ్ నగర్లో పీపుల్స్ మీడియా స్టూడియోలో జరుగుతోంది. ప్రభాస్‌తో పాటు ఇతర తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మారుతి. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తాత పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తయిందట.. మరో పది శాతం చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉందని టాక్. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. త్వరగా షూటింగ్‌ని పూర్తి చేసి ఈ సినిమాకి ఎంతో కీలకం కానున్న గ్రాఫిక్స్ పనులపై దృష్టి పెట్టనున్నారట మారుతి. పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈ చిత్రాన్ని డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. అయితే ఆ తేదీకి రిలీజ్ వాయిదా పడే అవకాశాలున్నాయని టాక్. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉస్తాద్ హీరో పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూ΄÷ందిన ‘గబ్బర్ సింగ్’ (2012) చిత్రం మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఈ హిట్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ΄ోలీసాఫీసర్ ΄ాత్ర చేస్తున్నారు పవన్ కల్యాణ్. ఇటీవల ఈ సినిమా పతాక సన్నివేశాలు పూర్తయినట్లు ప్రకటించారు మేకర్స్. క్లైమాక్స్‌లో భాగంగా నబకాంత మాస్టర్ పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. డ్రాగన్ జోరు ‘దేవర’ వంటి హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్‌తో ΄ాటు ఇతర తారాగణంపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట ప్రశాంత్ నీల్. ఇప్పటి వరకు చూడనటువంటి మాస్ లుక్‌లో ఎన్టీఆర్‌ని చూపించనున్నారు దర్శకుడు. మాస్ హీరో, మాస్ డైరెక్టర్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్– ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూ΄÷ందుతోన్న ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 జూన్ 25న విడుదలకానుంది. శంకరపల్లిలో పెద్ది రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘పెద్ది’. తొలి సినిమా ‘ఉప్పెన’తో(2021) బ్లాక్‌బస్టర్ అందు కున్న బుచ్చిబాబు సానా ‘పెద్ది’కి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ΄ాన్ ఇండియా మూవీలో రామ్‌చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో సమీపంలోని శంకరపల్లిలో జరుగుతోంది. రామ్‌చరణ్‌తో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. అలాగే భాగ్యనగరం సమీపంలోని ఓ ప్రముఖ స్టూడియోలో నైట్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఓ పాటను చిత్రీకరించనున్నారని తెలిసింది. రామ్‌చరణ్, జాన్వీలపై ఈ సాంగ్‌ని చిత్రీకరించనున్నారు. ఈ సినిమా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2026 మార్చి 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రత్యేకమైన సెట్లో... ‘తండేల్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకోవడంతో ΄ాటు వంద కోట్ల క్లబ్లో చేరారు నాగచైతన్య. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్సీ 24’ (వర్కింగ్ టైటిల్). ‘విరూపాక్ష’ (2023) వంటి హిట్ మూవీని తెరకెక్కించిన కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్. బాపినీడు సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఓ ప్రత్యేకమైన సెట్లో జరుగుతోంది. నాగచైతన్య, మీనాక్షీ చౌదరి, ఇతర తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. మిస్టీక్ థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో రూ΄÷ందుతోన్న ఈ సినిమాలో నాగచైతన్య సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఇందుకోసం ఆయన ఫిజికల్‌గానూ కొత్తగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు కూడా. ‘తండేల్’ తర్వాత నాగచైతన్య, ‘విరూ΄ాక్ష’ తర్వాత కార్తీక్ వర్మ కాంబినేషన్లో రానున్న ‘ఎన్సీ 24’ సినిమాపై మంచి బజ్ నెలకొంది. ముచ్చింతల్‌లో ఆంధ్ర కింగ్ రామ్ పోతినేని హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ ఫేమ్ పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా, కన్నడ హీరో ఉపేంద్ర, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఎంటర్టైన్మెంట్, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. రామ్–భాగ్యశ్రీలతో పాటు ఇతర తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను రూ΄÷ందిస్తున్నారట దర్శకుడు. ఈ చిత్రంలో సూపర్‌స్టార్‌గా నటించిన ఉపేంద్రకి వీరాభిమానిగా రామ్ కనిపించనున్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో... విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూ΄÷ందుతోంది. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్గా నటిస్తున్నారు. టబు, కన్నడ నటుడు విజయ్ కుమార్ కీలక ΄ాత్రలు ΄ోషిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పణలో పూరి కనెక్ట్స్, జేబీ మోషన్ పిక్చర్స్‌పై పూరి జగన్నాథ్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు. ఈ ΄ాన్ ఇండియా మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. విజయ్ సేతుపతితో ΄ాటు ఇతర నటీనటులు ఈ షెడ్యూల్ చిత్రీకరణలో ΄ాల్గొంటున్నారట. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. బూత్ బంగ్లాలో లెనిన్ అక్కినేని అఖిల్ హీరోగా మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో రూ΄÷ందుతోన్న చిత్రం ‘లెనిన్’. ‘ఏజెంట్’ సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ అనంతరం అఖిల్ నటిస్తున్న చిత్రం ఇది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమా కోసం ఫుల్ మాస్ లుక్‌లోకి మారిపోయారు అఖిల్. ఈ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని బూత్ బంగ్లాలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో అఖిల్, ఇతర నటీనటులు పాల్గొంటున్నారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా ఫిక్స్ అయ్యారు. అయితే కొద్ది రోజులు షూటింగ్లో పాల్గొన్న అనంతరం ఆమె ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. ఇందుకుగల కారణాలు మాత్రం బయటకు రాలేదు. అఖిల్‌కి జోడీగా ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే పేరు వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తుక్కుగూడలో సంబరాలు... సాయిదుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల యేటిగట్టు). రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై ‘హను–మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ నిర్మించిన కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. హీరో, హీరోయిన్‌తో ΄ాటు ఇతర తారాగణంపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట రోహిత్ కేపీ. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 25న ప్రేక్షకులముందుకు రానుంది. పతాక సన్నివేశాల్లో యోధ ‘జాంబి రెడ్డి’ (2021) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తేజా సజ్జా ‘హను–మాన్’ (2024) చిత్రంతో ΄ాన్ ఇండియా హిట్ అందుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆయన హీరోగా నటిస్తున్న మరో ΄ా¯Œ ఇండియా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో తేజ సూపర్ యోధగా కనిపించనున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ సమీపంలోని ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో భాగంగా సినిమా క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ‘మిరాయ్’ చిత్రం 8 భాషల్లో 2డీ, 3డీ ఫార్మాట్లో సెప్టెంబర్ 5న విడుదలకానుంది. శంకరపల్లిలో తెలుసు కదా ‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ చిత్రాల ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు. స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. స్వచ్ఛమైన ప్రేమ, అనుబంధం, వినోదం, భావోద్వేగాల నేపథ్యంలో రూ΄÷ందుతోన్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని శంకరపల్లిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో భాగంగా హీరో హీరోయిన్లతో ΄ాటు ఇతర ప్రధాన తారాగణంపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు నీరజ కోన. దీ΄ావళి సందర్భంగా అక్టోబర్ 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఇలా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో షూటింగ్స్ జరుపుకుంటున్న సినిమాలు పైన పేర్కొన్నవి కాకుండా మరికొన్ని కూడా ఉన్నాయి. – డేరంగుల జగన్ మోహన్ -
'వార్2' వీడియో సాంగ్ .. బికినీతో కియారా
బాలీవుడ్ మూవీ 'వార్2' ఫ్యాన్స్‌కు మేకర్స్ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. నేడు కియారా అద్వానీ పుట్టినరోజు కావడంతో మేకర్స్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన ఈ భారీ యాక్షన్ సినిమా నుంచి ఏకంగా వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. యశ్ రాజ్ ఫిల్మ్స్‌పై ఆదిత్యా చోప్రా పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ఈ క్రమంలో హృతిక్, కియారా అద్వానీల మధ్య క్రియేట్ చేసిన ఒక రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేశారు. హిందీ వర్షన్లో అమితాబ్ భట్టాచార్య రచించిన ఈ సాంగ్‌ను అర్జిత్ సింగ్, నిఖిత ఆలపించగా ప్రీతమ్ సంగీతం సమకూర్చారు. గతంలో వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలోని ‘కేసరియా...’ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, తాజాగా విడుదలైన ఈ సాంగ్‌లో బికినీతో కనిపించిన కియారా పాన్ ఇండియా రేంజ్లో హీట్ పెంచేసింది. ఈ సినిమాలో ఆమె తొలిసారి బికినీలో కనిపించనుంది. -
వార్ 2 కోసం బ్రహ్మాస్త్ర టీమ్.. హృతిక్, కియారాలతో రొమాంటిక్ సాంగ్!
హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన స్పై యూక్షన్ మూవీ ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 14న రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా కోసం హృతిక్–కియారాలపై చిత్రీకరించిన ‘ఆవన్ జావన్ ...’ అనే పాటను అతి త్వరలోవిడుదల చేయనున్నట్లు వెల్లడించి, ఈ పాట ఫస్ట్‌లుక్ రోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.‘‘హృతిక్ రోషన్ – కియారా అద్వానీ కెమిస్ట్రీ ‘అవన్ జావన్ ..’ ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ పాట కోసం సంగీత దర్శకుడు ప్రీతమ్, లిరిక్ రైటర్ అమితాబ్ భట్టాచార్య, గాయకుడు అరిజీత్ సింగ్ కలిసి పని చే శారు. గతంలో వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలోని ‘కేసరియా...’ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సాంగ్ తరహాలోనే ‘ఆవన్ జావన్ ..’ కూడా ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.కాగా... ఈ నెల 31న కియారా అద్వానీ బర్త్ డే. ఈ సందర్భంగా ‘ఆవన్ జావన్ ...’ పాటని రిలీజ్ చేస్తారని సమాచారం. ఇదిలా ఉంటే... హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘వార్’ (2019) సినిమాకు సీక్వెల్‌గా ‘వార్ 2’ రూపొందిన సంగతి తెలిసిందే. -
ఎన్టీఆర్ తర్వాత మరో స్టార్ హీరోను లైన్లో పెట్టిన రుక్మిణి
ఇతర భాషల్లో హిట్స్ అందుకుంటే వారికి కచ్చితంగా తమిళంలో అవకాశాలు వరిస్తాయి. అలా కోలీవుడ్‌లో మంచి అవకాశాలు అందుకుంటున్న కన్నడ నటి రుక్మిణి వసంత్. ఈ బెంగళూర్ బ్యూటీ 2019లో బీర్బల్ త్రిలోగీ అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయకిగా రంగప్రవేశం చేశారు. ఆ తరువాత అప్‌స్టార్ట్స్ అనే హిందీ చిత్రంలో నటించారు. 2023లో నటించిన 'సప్త సాగరాలు దాటి' అనే చిత్రం రుక్మిణి వసంత్‌కు మంచి విజయాన్ని అందించింది. ఆ చిత్రం పలు అవార్డులను సాధించింది. ఆ చిత్రానికి సీక్వెల్లోనూ నటించిన రుక్మిణి వసంత్‌కు తరువాత కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్‌కు జంటగా భైరతి రణంగళ్ అనే భారీ చిత్రంలో నటించే అవకాశం వరించింది. అలా అక్కడ స్టార్ హీరోయిగా పేరు తెచ్చుకున్న ఈ భామకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కాలింగ్ వచ్చింది. 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అనే చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్‌కు జంటగా నటించారు. ఆ తరువాత కోలీవుడ్‌కు దిగుమతి అయ్యారు. ఇక్కడ శివకార్తికేయన్‌కు జంటగా ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న మదరాసి చిత్రంలో నటించే అవకాశం లభించింది. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే విజయ్ సేతుపతి సరసన ఏస్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్రం ఆ మధ్య విడుదలై మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. దీంతో మదరాసి చిత్రం కోసం ఎదురు చూస్తున్న రుక్మిణి వసంత్‌కు తాజాగా ఒక తెలుగు, ఒక తమిళం చిత్రాల్లో నటించే అవకాశాలు కొట్టేశారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ 31వ చిత్రంలో ఈ అమ్మడు నటించనున్నారు. ఇకపోతే తమిళంలో విక్రమ్‌తో జత కట్టే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ఇటీవల వీరధీరశూరన్ చిత్రంతో హిట్‌ను అందుకున్న విక్రమ్ తాజాగా తన 64వ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. దీనికి 96, మెయ్యళగన్ చిత్రాల ఫేమ్ ప్రేమ్‌కుమార్ కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మిస్తున్నారు. ఇందులో కథానాయకిగా నటి రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక ప్రస్తుతం జరుగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. -
యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ఎన్టీఆర్
-
'వార్2' అతిథి పాత్రలో 'ఆల్ఫా' లేడీ.. సర్ప్రైజ్ చేస్తున్న పోస్ట్
హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ వంటి ఇద్దరు స్టార్ హీరోలతో తెరకెక్కిన చిత్రం 'వార్ 2'... యశ్‌రాజ్ ఫిల్మ్స్ తన స్పై యూనివర్స్‌లో భాగంగా నిర్మించారు. ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ట్రైలరను కూడా మేకర్స్ పంచుకున్నారు. అయితే, వార్ 2 ట్రైలర్‌ను షేర్ చేస్తూ అలియా భట్ షాకిచ్చింది. థియేటర్లో కలుద్ధాం అంటూ సడెన్‌గా సర్ప్రైజ్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇంతవరకు ఈ చిత్రంలో అలియా భట్ నటిస్తున్నట్లు ఎక్కడే కాని వార్తలు రాలేదు. తొలిసారి ఆమె ఇలా పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతుంది.అలియా భట్ తాజాగా చేసిన పోస్ట్‌ను గమనిస్తుంటే వార్ 2లో ఆమె అతిథి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, చాలా రహస్యంగా ఆమె పాత్రను చిత్రీకరణ చేసినట్లు సమాచారం. షూటింగ్ సమయంలో కొద్దిమంది సిబ్బంది మాత్రమే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారట. కానీ, ఇదంతా ఆమె తర్వాతి చిత్రం 'ఆల్ఫా'తో వార్2 లింక్ ఉంటుందని టాక్.. యశ్‌రాజ్ ఫిల్మ్స్ తన స్పై యూనివర్స్‌లో భాగంగానే ఆల్ఫా చిత్రం రానుంది. ఈ ఏడాది డిసెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. స్పై యూనివర్స్‌లో రాబోతున్న మొదటి మహిళా గూఢచారి చిత్రంగా ఆల్ఫా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో (Alpha) అలియా గురువు పాత్రలో హృతిక్ రోషన్ కనిపించనున్నట్లు చిత్ర సన్నిహిత వర్గాలు కూడా గతంలో తెలిపాయి. వార్2లో అలియా నటిస్తున్నట్లు అధికారికంగా ఏమీ ధృవీకరించబడనప్పటికీ ఆమె చేసిన పోస్ట్‌తో నెట్టింట ట్రెండ్ అవుతుంది. వార్ 2 చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. ఆల్ఫా చిత్రాన్ని శివ్ రావేల్ దర్శకత్వంలో రానుంది. అయితే, ఈ రెండు ప్రాజెక్ట్‌లను బాలీవుడ్ అగ్ర నిర్మాణసంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్ నిర్మిస్తుంది. -
టాలీవుడ్ లో సెటిల్ అయ్యేలా దీపిక ప్లాన్స్
-
అద్భుత పోరాటం
హృతిక్ రోషన్, కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా హీరో ఎన్టీఆర్ హిందీ చిత్ర పరిశ్రమకి పరిచయమవుతున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్‌పై ఆదిత్యా చోప్రా పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో ‘వార్ 2’ ఆరవ చిత్రంగా రాబోతోంది.ఈ సినిమా ట్రైలర్‌ని ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించి, ఎన్టీఆర్–హృతిక్ రోషన్ల పోస్టర్ రిలీజ్ చేశారు. ‘‘ఇండియన్ సినీ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు గొప్ప స్టార్స్ అయిన ఎన్టీఆర్–హృతిక్ రోషన్ తమ సినీ ప్రయాణంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు.ఇదొక లైఫ్ టైమ్ మూమెంట్. ఈ అరుదైన క్షణాలను మరింత గొప్పగా సెలబ్రేట్ చేసుకోవటానికి ఈ నెల 25న ‘వార్ 2’ ట్రైలర్ విడుదల చేస్తున్నాం. ఇద్దరు గొప్ప స్టార్స్ మధ్య జరిగే అద్భుత పోరాటమే ఈ సినిమా. జూలై 25ని మీ క్యాలెండర్లో ప్రత్యేకంగా మార్క్ చేసుకోండి’’ అని యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ పేర్కొంది. -
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో కెమియో రోల్.. ఎందుకు చేశానంటే: సిద్ధార్థ్
కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ ఇటీవలే 3బీహెచ్‌కే మూవీతో ప్రేక్షకులను అలరించాడు. శ్రీ గణేశ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ఫర్వాలేదనిపించింది. ఈ మూవీలో మీతా రఘునాథ్ హీరోయిన్గా మెప్పించింది. ఈ చిత్రంలో శరత్ కుమార్, దేవయాని కీలక పాత్రల్లో మెప్పించారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన సిద్ధార్థ్ తెలుగు సినిమాలో కెమియో రోల్ చేయడంపై స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన బాద్షా మూవీలో మీరెందుకు ఆ రోల్ చేయాల్సి వచ్చిందని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. తన ఫ్రెండ్ అడగడంతోనే ఆ రోల్ చేశానని సిద్దార్థ్ తెలిపారు. ఏంటండి ఇలా అడిగారు.. ఎన్టీఆర్ సినిమాలో ఒక ఫ్రెండ్ అడిగితే ఐదు నిమిషాల రోల్ చేశా.. ఆ రోల్ చేయడాన్ని చాలా బాగా ఎంజాయ్ చేసినట్లు వెల్లడించారు. అంత పెద్ద హీరో, పెద్ద సినిమాలో.. అది కూడా నా క్యారెక్టర్ పేరు సిద్ధు అని పెడితే ఎందుకు చేయకుండా ఉంటామని బదులిచ్చారు.కాగా.. తెలుగులో బొమ్మరిల్లు సినిమాతో ఫేమస్ అయిన సిద్ధార్థ్ టాలీవుడ్లో నటించారు. ఆ తర్వాత కోలీవుడ్‌లో చాలా చిత్రాల్లో హీరోగా చేశారు. అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్‌లోనూ చేస్తూ అభిమానులను సంపాదించుకున్నారు. అంతేకాకుండా గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టారు సిద్ధార్థ్. హీరోయిన్ అదితి రావు హైదరీని ఆయన పెళ్లాడారు. -
΄పౌరాణికంలో...
హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌లది హిట్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’ (2018) ఘన విజయం సాధించింది. వీరి కాంబోలో మరో సినిమా ΄పౌరాణికం నేపథ్యంలో రాబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్ మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఈ మూవీ తాజా అప్డేట్స్ గురించి సూర్యదేవర నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘త్రివిక్రమ్‌గారు మా బ్యానర్లో తొలిసారి ΄పౌరాణికం నేపథ్యంలో తీయనున్న సినిమా ఇది. ఈ చిత్రాన్ని ప్రకటించడానికి భారీ స్థాయిలో ప్లాన్ చేశాం.నందమూరి తారక రామారావుగారిని రాముడిగా, కృష్ణుడిగా చూసిన నాకు ఎన్టీఆర్‌ని దేవుడిగా చూపించబోతున్నామనే ఆనందం ఉంది. అయితే ఇటీవల బాలీవుడ్ నుంచి వచ్చిన ‘రామాయణ’(రణ్‌బీర్ కపూర్) చిత్రం గ్లింమ్స్ వచ్చాక దేశమంతా ఆ సినిమా గురించి మాట్లాడుకుంది. దీంతో మేం చేయబోయే చిత్రం గురించి ‘రామాయణ’ కి మించి మాట్లాడుకోవాలనే ఆలోచనతో కాస్త సమయం తీసుకుని ప్రకటిద్దామని ఆగాం. ప్రస్తుతం మా చిత్రం ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. 2026 సెకండ్ హాఫ్ నుంచి ఎన్టీఆర్, త్రివిక్రమ్‌గార్ల చిత్రం షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని తెలిపారు. -
ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్, చరణ్‌ని చూసి అలా ఫీలయ్యా :జెనీలియా
జెనీలియా..ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్. ఆమె కోసమే సినిమాకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. బాయ్స్, సత్యం, బొమ్మరిల్లు, హ్యాపీ, రెడీ, ఢీ చిత్రాలు సూపర్ హిట్‌గా నిలవడంలో జెనీలియా(Genelia) కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా బొమ్మరిల్లు బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే కారణం.. హాసిని పాత్రలో జెనీలియా కనబర్చిన నటననే. ఇప్పటికీ జెనీలియా అనగానే అందరికి హాసిని పాత్రే గుర్తొస్తుంది. ఆ ఒక్క సినిమాతో జెనీలియా స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్, రామ్ పోతినేని..ఇలా అప్పటి యంగ్ హీరోలందరితోనూ నటించింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. దాదాపు పదమూడేళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించబోతుంది ఈ అల్లరి బ్యూటీ. ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటిస్తున్న తొలి సినిమా ‘జూనియర్’లో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జెనీలియా మీడియాతో మాట్లాడుతూ.. టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వారితో కలిసి నటించినప్పుడు ఇంత గొప్ప స్టార్స్ అవుతారని ఊహించలేదని చెబుతోంది. ఇప్పుడు వాళ్లను స్టార్ హీరోలుగా చూస్తుంటే గర్వంగా ఉందన్నారు.‘ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను చూసి.. ‘వీళ్లతోనేనా నేను నటించాను’ అనుకున్నా. ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడు అని ఎప్పుడు చెబుతుంటాను. నిజంగా ఆయన సినిమా ఇండస్ట్రీకి ఒక వరం అని చెప్పాలి. మూడు పేజీల డైలాగుని కూడా సింగిల్ టేక్‌లో చెబుతుంటాడు. రామ్ చరణ్ అమెజింగ్. అతనితో కలిసి ఆరెంజ్ సినిమా చేశాను. ఆర్ఆర్ఆర్లో ఆయన ఫెర్పార్మెన్స్ బాగుంది. ఇక అల్లు అర్జున్.. చాలా ఎనర్జిటిక్ పర్సన్. హ్యాపీ సినిమా షూటింగ్ సమయంలో ఆయన చాలా హుషారుగా ఉండేవాడు. ఇప్పుడు వీరందరిని పాన్ ఇండియా స్టార్స్‌గా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది’ అని జెనీలియా చెప్పుకొచ్చింది. అలాగే ఇటీవల మరణించిన కోటా శ్రీనివాస్‌రావు గురించి మాట్లాడుతూ.. ‘ఆయన గొప్ప నటుడు. బొమ్మరిల్లు సినిమా షూటింగ్ సమయంలో ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఎలా నటించాలో చెప్పేవారు. ఆయనతో కలిసి రెడీ కూడా చేశాను. ఆయన మరణవార్త వినగానే దిగ్బ్రాంతికి గురయ్యాను. అంతగొప్ప నటుడితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం నా అదృష్టం’ అని జెనీలియా చెప్పింది. -
మరో కోట శ్రీనివాసరావు పుట్టరు, రారు: ఎన్టీఆర్ ఎమోషనల్
లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) మరణం తనను ఎంతగానో కలిచివేసిందంటున్నాడు హీరో జూనియర్ ఎన్టీఆర్. ఆదివారం రాత్రి హైదరాబాద్ ఫిలింనగర్‌లోని కోట శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కోటతో కలిసి పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నారు.శకం ముగిసిందిజూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) మాట్లాడుతూ.. కోట శ్రీనివాసరావు మరణంతో ఒక శకం ముగిసింది. ఎన్నో సినిమాల్లో ఆయనతో కలిసి పని చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మహనీయుడైన నటుడితో పని చేయడం నా పూర్వజన్మ సుకృతం. ఈరోజు ఆయన లేకపోవడం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఎక్కడున్నా తన చల్లని చూపు మనందరిపై ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.కోట శ్రీనివాసరావు ఒక్కరేయాక్టింగ్ ఇండస్ట్రీకి, నటనకు నిలువెత్తురూపం కోట శ్రీనివాసరావుగారు. తెలుగు ఇండస్ట్రీకి ఆయన ఒక్కరే.. మరో కోట పుట్టరు, రారు! అందుకే నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. ఆయన మనకు మిగిల్చి వెళ్లిన ఎన్నో అద్భుతమైన పాత్రల్ని, సినిమాలను ప్రేక్షకులు చూసి ఆస్వాదించండి అంటూ తారక్ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా 750కి పైగా సినిమాలు చేసిన కోట శ్రీనివాసరావు ఆదివారం (జూలై 13న) కన్నుమూశారు.చదవండి: Kota Srinivasa Rao: కోట జీవితంలో విషాదం.. ఎన్ని కోట్లు సంపాదిస్తేనేం? -
కోట శ్రీనివాస రావు కుటుంబానికి ఎన్టీఆర్ పరామర్శ
-
‘జట్టు కడదాం... హిట్టు కొడదాం’ అంటున్న స్టార్స్
ఏ ఇండస్ట్రీలోనైనా ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో పాన్ ఇండియా ట్రెండ్ కనిపించింది. అయితే ఒకప్పుడు తెలుగు సినిమాల్లో కనిపించిన మల్టీస్టారర్ ట్రెండ్ ఇప్పుడు మళ్లీ ఊపందుకుంది. ఒక సినిమాలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కవ స్టార్స్ నటిస్తున్నారు. ఆడియన్స్ థియేటర్స్‌కు వచ్చి సినిమా చూసే పరిస్థితులు తగ్గిపోతున్న ఈ తరుణంలో టాప్ హీరోలు ఇలా మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు ఒప్పుకోవడం ఓ మంచి పరిణామమే. ఇలా తాజాగా ‘జట్టు కడదాం... హిట్టు కొడదాం’ అంటూ ఆడియన్స్ ముందుకు రానున్న కొన్ని మల్టీస్టారర్ తరహా సినిమాలపై ఓ లుక్ వేద్దాం. సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం సీనియర్ టాప్ స్టార్స్ చిరంజీవి, వెంకటేశ్ ఒకే సినిమాలో స్క్రీన్‌పై కనిపిస్తే ఆడియన్స్ సూపర్‌గా ఎగ్జైట్ అవుతారు. ఈ ఇద్దరు టాప్ స్టార్స్‌ని దర్శకుడు అనిల్ రావిపూడి ఒకే ఫ్రేమ్‌లోకి తీసుకు రానున్నారు. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి ఓ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైనర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలోనే వెంకటేశ్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఓ సందర్భంలో వెంకటేశ్ కూడా కన్ఫార్మ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా మూడు షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తయింది. నాలుగో షెడ్యూల్ కోసం అతి త్వరలోనే కొచ్చి వెళ్లనుంది యూనిట్. అక్కడ చిరంజీవి – నయనతార కాంబినేషన్లో ఓ సాంగ్ చిత్రీకరణ, కొంత టాకీ పార్టు, ఓ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌ను ప్లాన్ చేశారని తెలిసింది. ఈ షెడ్యూల్ తర్వాత హైదరాబాద్‌లో జరిగే కొత్త షూటింగ్ షెడ్యూల్లో వెంకటేశ్ రాకను అధికారికంగా ప్రకటిస్తారట మేకర్స్. ఇక ఈ సినిమాలో శివశంకర వరప్రసాద్ (చిరంజీవి అసలు పేరు) అనే డ్రిల్ మాస్టర్‌గా చిరంజీవి, ఆయన భార్య పాత్రలో నయనతార కనిపిస్తారని తెలిసింది. వెంకటేశ్ ΄పాత్రపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే ఈ సినిమాకు ప్రస్తుతానికి ‘మన శివశంకర వరప్రసాద్‌గారు, సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది. సుష్మితా కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమా యాక్షన్ జానర్ కాదు... దీంతో స్క్రీన్‌పై చిరంజీవి, వెంకటేశ్ కాంబినేషన్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎలాంటి ఫన్ను జనరేట్ చేయబోతున్నారనే అంశాలపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొని ఉంది. చారిత్రక చిత్రంలో... మల్టీస్టారర్ మూవీస్ చేయడంలో వెంకటేశ్ ముందుంటారు. గతంలో రామ్‌తో కలిసి ‘మసాలా’, పవన్ కల్యాణ్‌తో కలిసి ‘గోపాల గోపాల’ వంటి సినిమాలు చేశారు వెంకటేశ్. అయితే వెంకీ తాజాగా మరో పూర్తి స్థాయి మల్టీస్టారర్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇటీవల అమెరికాలో జరిగిన ‘నాట్స్–2025’ వేడుకల్లో భాగంగా తానో పెద్ద స్టార్‌తో కలిసి సినిమా చేయబోతున్నానని చెప్పేశారు. ఈ వేడుకలకు బాలకృష్ణ కూడా హాజరయ్యారు. దీంతో వెంకటేశ్–బాలకృష్ణ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ కన్ఫార్మ్ అయిపోయిందనే టాక్ తెరపైకి వచ్చింది. తనకు ‘వీరసింహారెడ్డి’ వంటి హిట్‌ను అందించిన గోపీచంద్ మలినేనితో ‘గౌతమి పుత్రశాతకర్ణి’ తరహాలో బాలకృష్ణ ఓ వార్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేయనున్నారని తెలిసింది. ఈ సినిమాలోనే వెంకటేశ్ ఓ లీడ్ క్యారెక్టర్లో కనిపిస్తారని సమాచారం. అయితే ఈ విషయంపై పూర్తి స్థాయిలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు. కూలీతో కొట్లాట యాక్టర్‌గా కెరీర్లో నాగార్జున కాస్త రూట్ మార్చినట్లుగా ఉన్నారు. ఇటీవల ధనుష్‌తో కలిసి ‘కుబేర’ సినిమా చేశారు. ఈ సినిమాలో దీపక్ పాత్రలో నాగార్జున మెప్పించారు. అయితే ఇలాంటి కీలక తరహా పాత్రనే ‘కూలీ’ సినిమాలోనూ చేశారు. రజనీకాంత్ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రంలో నాగార్జున మరో లీడ్ రోల్లో కనిపిస్తారు. దేవ ΄ాత్రలో రజనీకాంత్ నటించగా, సైమన్ పాత్రలో నాగార్జున కనిపిస్తారు. అయితే సైమన్ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయి. సినిమాలో రజనీ–నాగార్జున మధ్య వచ్చే సన్నివేశాలు సూపర్బ్‌గా ఉంటాయట. అలాగే ఈ ‘కూలీ’ సినిమాలోనే బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ‘దహా’ అనే ఓ పవర్ఫుల్ పాత్రలో నటించారు. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఈ పాత్ర ‘కూలీ’ కథను కీలక మలుపు తిప్పుతుందని తెలిసింది. ఇంకా ఇదే చిత్రంలో ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతీహాసన్, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించగా, ‘మోనిక’ అనే ఓ స్పెషల్ సాంగ్‌లో పూజా హెగ్డే డ్యాన్స్ చేశారు. రజనీకాంత్–నాగార్జున–ఆమిర్ ఖాన్–ఉపేంద్ర–శ్రుతీహాసన్... ఇలాంటి టాప్ యాక్టర్స్‌తో ‘కూలీ’ ఓ పర్ఫెక్ట్ మల్టీస్టారర్ సినిమాకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. సీక్వెల్ సిద్ధమౌతోంది! ప్రభాస్ మెయిన్ లీడ్‌గా, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, కమల్‌హాసన్, ప్రధాన పాత్రల్లో నటించిన మైథలాజికల్ అండ్ సైన్స్ ఫిక్షనల్ సినిమా ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకుడు. సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం 2024లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, కమల్హాసన్ల పాత్రలు చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాయి. ఈ సినిమాకు సీక్వెల్ రానుంది. ఈ సీక్వెల్ షూటింగ్ ఈ సెప్టెంబరులో ప్రారంభం కానుందని ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు. అశ్వనీదత్. ఈ ‘కల్కి 2898 ఏడీ పార్ట్ 2’ చిత్రంలో కూడా ప్రభాస్ పాత్రకు దీటుగానే అమితాబ్ బచ్చన్, దీపిక, కమల్హాసన్ల పాత్రలు ఉంటా యని తెలిసింది. తొలి భాగం ‘కల్కి 2898 ఏడీ’లో కనిపించిన విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, దిశా పటానీల రోల్స్ కూడా సీక్వెల్లో మరింత నిడివి ఎక్కువగా కనిపించనున్నాయట. ఇలా ఈ సీక్వెల్ ఓ పర్ఫెక్ట్ మల్టీస్టారర్‌గా ఆడియన్స్‌ను అలరించనుందనడంలో సందేహం లేదు. బాలీవుడ్ వార్ నార్త్‌లో హృతిక్ రోషన్ సూపర్ స్టార్. సౌత్‌లో ఎన్టీఆర్ సూపర్ స్టార్. ఈ ఇద్దరు స్టార్స్ కలిసి చేసిన భారీ యాక్షన్ సినిమా ‘వార్ 2’. ‘బ్రహ్మాస్త్రం’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ డ్రామా సినిమాలో హీరోయిన్ కియారా అద్వానీ మరో లీడ్ రోల్ చేశారు. ఎన్టీఆర్‌కు తొలి స్ట్రయిట్ హిందీ ఫిల్మ్ కూడా ‘వార్ 2’యే కావడం విశేషం. ఇటీవల ఈ ‘వార్ 2’ సినిమా నుంచి విడుదలైన టీజర్‌లోని యాక్షన్ సన్నివేశాలు సినిమా లవర్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా హృతిక్ రోషన్–ఎన్టీఆర్ మధ్య వచ్చే సన్నివేశాలు యాక్షన్ లవర్స్‌కి మంచి కిక్ ఇచ్చేలా ఉంటాయనిపిస్తోంది. అంతేకాదు... ఈ సినిమా కోసం ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ మధ్య ఓ సూపర్ సాంగ్‌ను కూడా చిత్రీకరించారు మేకర్స్. ఇలా సినిమా లవర్స్‌కు ‘వార్ 2’ ఓ పర్ఫెక్ట్ మల్టీస్టారర్ మూవీగా కనిపిస్తోంది. వైఆర్ఎఫ్ (యశ్‌రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా రూ΄÷ందిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఇక ఈ ‘వైఆర్ఎఫ్’ స్పై యూనివర్స్ నుంచి ఇప్పటికే సల్మాన్ ఖాన్ ‘ఏక్తా టైగర్, టైగర్ జిందా హై’, హృతిక్ రోషన్ – టైగర్ ఫ్రాష్ల ‘వార్’, షారుక్ ఖాన్ ‘పఠాన్’ వంటి సినిమాలొచ్చాయి. హీరోయిన్స్ ఆలియా భట్–శార్వరీ చేసిన ‘ఆల్ఫా’ సినిమా రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. కాగా ‘వార్ 2’ కూడా ‘వైఆర్ఎఫ్’ స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న సినిమాయే కనుక ఈ యూనివర్స్‌లోని ఇతర చిత్రాల్లో హీరోలుగా నటించిన సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆలియా భట్ వంటి స్టార్స్ గెస్ట్ రోల్స్‌లో కనిపించే చాన్స్ ఉందట. ఇదే జరిగితే... యాక్షన్ లవర్స్‌కి ‘వార్ 2’ మరింత మజానిస్తుంది. భారీ బడ్జెట్‌తో ఆదిత్యా చో్ర΄ా ఈ సినిమాను నిర్మించారు. హీరో వర్సెస్ ఫ్యాన్ కన్నడ నటుడు ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఈ కన్నడ హీరో తాజాగా నటిస్తున్న తెలుగు సినిమా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. ఇందులో రామ్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఓ సినీ సూపర్ స్టార్ హీరో, అతని ఫ్యాన్‌కి మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఇందులో సూపర్‌స్టార్ సూర్యకుమార్ ΄ాత్రలో ఉపేంద్ర, సూర్యకుమార్ అభిమాని ΄ాత్రలో రామ్ కనిపిస్తారు. భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు పి. మహేశ్‌బాబు దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ నైట్ షూట్లో రామ్–భాగ్యశ్రీలపై లవ్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. త్వరిగతిన ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి, ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం హీరో రామ్ ఓ ΄ాట రాశారని, ఈ పాటను తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ పాడతారని ఫిల్మ్‌నగర్ సమాచారం. మల్టీస్టారర్ సినిమాలంటే... ఇద్దరు, ముగ్గురు హీరోలున్న సినిమాలే కాదు... అలానే ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ఉన్న సినిమాలను కూడా చెప్పుకోవచ్చు. హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు అల్లు అర్జున్ సిల్వర్‌స్క్రీన్‌పై ద్విపాత్రాభినయం చేయలేదు. కానీ ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా నాలుగు పాత్రలు చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. కథ రీత్యా..తాత –తండ్రి – ఇద్దరు కొడుకులు... ఇలా నాలుగు పాత్రల్లో అల్లు అర్జున్ కనిపించనున్నారట. అల్లు అర్జున్ పాత్రలకు తగ్గట్లే... ఈ సినిమాలో నలుగురు ప్రధాన హీరోయిన్స్ రోల్స్ ఉంటాయని, మరో కీలక పాత్రలో ఇంకో హీరోయిన్ కనిపిస్తారని.. ఇలా మొత్తంగా ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ ఉంటారని తెలిసింది. ఈ ఐదుగురు హీరోయిన్స్‌లో దీపికా పదుకోన్ కన్ఫార్మ్ అయ్యారు. ఇంకా ఖరారై΄ోయిన వారిలో జాన్వీ కపూర్, రష్మికా మందన్నా, మృణాల్ ఠాగూర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఐదో హీరోయిన్ పాత్ర కోసం భాగ్య శ్రీ భోర్సే, బాలీవుడ్ నటి ఆలియా.ఎఫ్‌లపై టెస్ట్ షూట్ జరిగిందని, వీరిలో ఒకరు ఫైనల్ అవుతారని బాలీవుడ్ సమాచారం. ఇలా ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉన్న ఐదుగురు హీరోయిన్స్ ఒకే సినిమాలో నటించనుండటం, వీరిలో ఇద్దరు పవర్ఫుల్ వారియర్ రోల్స్ చేస్తుండటం, అందులోనూ రష్మికా విలన్ పాత్రలో కనిపిస్తారనే టాక్ తెరపైకి రావడం అనేది ఆడియన్స్‌ను కచ్చితంగా ఎగ్జైట్ చేసే విషయమే. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం 2027లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ తరహాలో మరికొన్ని మల్టీస్టారర్ సినిమాలు ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
ఒకే సినిమాలో రెండు క్యారెక్టర్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలే!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక్కో సారి ఒక్కో సీజన్ నడుస్తుంటుంది. ఈ కోవలోనే ప్రస్తుతం డ్యూయల్ రోల్స్ సీజన్ కనిపిస్తోంది. తమ అభిమాన హీరో ఒక్క పాత్రలో కనిపిస్తేనే అభిమానుల ఆనందాలకు అవధులుండవు. అలాంటిది రెండు పాత్రల్లో కనిపిస్తే? ఇక చెప్పేదేముంది... పండగ చేసుకుంటారు. పైగా ద్విపాత్రాభినయం చేస్తే వేరియేషన్ చూపించే అవకాశం కూడా ఉంటుంది హీరోలకి. ఇక డ్యూయల్ రోల్స్‌తో ప్రేక్షకులకు, అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనున్న హీరోలపై ఓ లుక్కేద్దాం.మరోసారి...‘రిక్షావోడు, స్నేహం కోసం, అందరివాడు’... ఇలా తన కెరీర్లో పలు సినిమాల్లో ద్విపాత్రాభియం చేసి, ప్రేక్షకులను అలరించారు చిరంజీవి(Chiranjeevi ). చాలా రోజుల తర్వాత ఆయన మరోసారి ప్రేక్షకులకు, అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్). ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుకుంటోంది. చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు అనిల్ రావిపూడి.చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఇది. ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేయబోతున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. వినోదం నేపథ్యంలో రూపొందుతోన్న ‘మెగా 157’లో మనసుని హత్తుకునే భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉంటాయని సమాచారం. చిరంజీవి పాత్ర ‘రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, యముడికి మొగుడు, చంటబ్బాయి’ చిత్రాల తరహాలో ఉంటుందని తెలిసింది. ద్విపాత్రాభినయంలో కనిపించనున్న చిరంజీవి తండ్రీ కొడుకులుగా కనిపిస్తారా? లేకుంటే సోదరులుగానా? అనే వార్తలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ సినిమాలో హీరో వెంకటేశ్ కీలకమైన అతిథి పాత్రలో కనిపించనున్నారట. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ మూవీ టైటిల్ ప్రకటించనున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే... ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది.రెండు చిత్రాల్లో...‘బాహుబలి 1, 2’ చిత్రాల తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు హీరో ప్రభాస్(Prabhas). ‘కల్కి 2898 ఏడీ’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘ది రాజా సాబ్’ ఒకటి. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పటికే ‘బాహుబలి, బిల్లా’ వంటి సినిమాల్లో డ్యూయల్ రోల్స్ చేసిన ఆయన ‘ది రాజా సాబ్’తో మరోసారి తన అభిమానులకు, ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. పీరియాడికల్ హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో తాత–మనవడు పాత్రల్లో ప్రభాస్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ చూస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకంది. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌ని బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ చేయనున్నారనే వార్తలొస్తున్నాయి. ‘ది రాజా సాబ్’ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ ఏడాది ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉండగా డిసెంబరు 5వ తేదీకి వాయిదా పడింది.సలార్ 2 లోనూ...ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సలార్: పార్ట్ 1 సీజ్ఫైర్’. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు. 2023 డిసెంబరు 22న విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘సలార్: పార్ట్ 2 శౌర్యాంగపర్వం’ ఉంటుందని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనూ తండ్రీ కొడుకులుగా కనిపించనున్నారట ప్రభాస్. ‘సలార్’లో ప్రభాస్ తండ్రి కనిపించకపోయినా ‘సలార్ 2’లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో ఆయన వస్తారని సమాచారం.రెండు సినిమాల్లోనూ తండ్రి... కొడుకు?‘‘ఈ సముద్రం సేపల్ని కంటే కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ సూసుండాది.. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు’ అంటూ ‘దేవర: పార్ట్ 1’ చిత్రంలో ఎన్టీఆర్(Jr NTR) చెప్పిన డైలాగ్ గుర్తుండే ఉంటుంది. ‘జనతా గ్యారేజ్’ (2016) వంటి హిట్ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్–డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘దేవర పార్ట్ 1’. దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఈ సినిమా ద్వారా తెలుగుకి హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. సైఫ్ అలీఖాన్, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రల్లో నటించారు. మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కల్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమా 2024 సెప్టెంబర్ 27న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.ఈ సినిమా ఇటీవల జపాన్‌లో కూడా విడుదలవడం, అక్కడి ప్రమోషన్లలో ఎన్టీఆర్ పాల్గొనడం తెలిసిందే. ఇదిలా ఉంటే... ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘దేవర: పార్ట్ 2’ రూపొందనుంది. కొరటాల శివ ‘దేవర 2’ స్క్రిప్ట్ వర్క్ పనుల్లోనే ఉన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. ‘దేవర’ చిత్రంలో కేవలం కొడుకు పాత్రనే చూపించారు దర్శకుడు. రెండో భాగంలో తండ్రి పాత్ర సందడి చేయనుంది. తండ్రి పాత్ర ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో వస్తుందని టాక్. ఇదిలా ఉంటే... ఎన్టీఆర్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘వార్ 2’ (హృతిక్ రోషన్ హీరో) ఆగస్టు 14న విడుదల కానుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. ‘ఎన్టీఆర్ నీల్’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలోనూ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి... ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ అనుకుంటున్నారని టాక్.మూడోసారి?హీరో రామ్‌చరణ్ ‘నాయక్’, ‘గేమ్ చేంజర్’ సినిమాల్లో ద్వి΄ాత్రాభినయం చేశారు. తాజాగా రామ్‌చరణ్ నటిస్తున్న ΄ాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. తొలి చిత్రం ‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రంలో రామ్‌చరణ్ ద్వి΄ాత్రాభియం చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాలోని ఓ ప్రత్యేక ΄ాటలో కాజల్ అగర్వాల్ సందడి చేయనున్నారని భోగట్టా. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన లేదు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే... రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ‘పెద్ది’ చిత్రాన్ని 2026 మార్చి 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.తొలిసారి...‘పుష్ప 1, 2’’ వంటి భారీ పాన్ ఇండియా హిట్స్ తర్వాత హీరో అల్లు అర్జున్... తమిళ దర్శకుడు అట్లీ సినిమాకి పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ‘ఏఏ22 ఏ6’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న పాన్ ఇండియా చిత్రమిది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ హీరోయిన్గా ఖరారు కావడంతో ఈ క్రేజ్ మరింత పెరిగింది. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో అల్లు అర్జున్ తొలిసారి ‘ఏఏ 22 ఏ6’లో ద్విపాత్రాభినయం చేయనున్నారట. ఒక పాత్ర హీరో కాగా మరో పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. తొలిసారి ఆయన ద్విపాత్రాభినయం చేయనుండటంతో అల్లు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. పీరియాడికల్ డ్రామాగా భారీ బడ్జెట్‌తో రూ΄÷ందనున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కి చాలా ప్రాధాన్యత ఉందట. హాలీవుడ్ సూపర్ హీరో సినిమాల తరహాలో ఈ మూవీ ఉంటుందని, అందుకే ఈ సినిమా కోసం హాలీవుడ్ మేకర్స్‌ను రంగంలోకి దింపుతున్నారనీ టాక్. ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. 2026 ఆగస్టులో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తోందట యూనిట్. కాగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేయనున్నారనే వార్తలు కూడా నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. మరి అల్లు అర్జున్‌ది ద్వి΄ాత్రాభినయమా? త్రి΄ాత్రాభినయమా? అనే విషయంపై స్పష్టత వచ్చే వరకు వేచి చూడాలి.తొలిసారి...హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్లది హిట్ కాంబినేషన్. వీరి కాంబోలో వచ్చిన తొలి చిత్రం ‘ట్యాక్సీవాలా’ 2018 నవంబరు 17న విడుదలై, హిట్‌గా నిలిచింది. వీరి కాంబినేషన్లో రూపొందుతోన్న తాజా చిత్రం ‘వీడీ 14’ (వర్కింగ్ టైటిల్). మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. బ్రిటిష్ పాలన నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న చిత్రమిది. 19వ శతాబ్దం నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో తొలిసారి ద్విపాత్రాభినయం చేయనున్నారట విజయ్. తండ్రీ కొడుకులుగా వెండితెరపై సందడి చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి.సర్దార్ 2లో...కార్తీ హీరోగా నటించిన హిట్ చిత్రాల్లో ‘సర్దార్’ ఒకటి. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం 2022 అక్టోబరు 21న విడుదలై థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. రూ. 100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. స్పై యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘సర్దార్ 2’. ఇక గత ఏడాది కార్తీ పుట్టినరోజు (మే 25) సందర్భంగా ప్రారంభించిన ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది జూన్‌లో ముగిసింది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రంలో మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించగా, ఎస్జే సూర్య పవర్ఫుల్ పాత్రలో నటించారు. ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలోనూ ద్వి΄ాత్రాభినయంలో కనిపించనున్నారు కార్తీ. ఈ సినిమా ఫస్ట్ లుక్, ప్రొలాగ్ వీడియోను ఇటీవల విడుదల చేశారు. ఈ సినిమాని 2026 పొంగల్‌కి విడుదల చేయనున్నారట మేకర్స్. వీరే కాదు.. మరికొందరు హీరోలు కూడా డ్యూయల్ రోల్స్‌లో కనిపించే అవకాశం ఉంది. -
సితారకు వార్ 2
హీరో ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘వార్ 2’. హృతిక్ రోషన్, కియారా అద్వానీ జంటగా నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు విడుదల హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) సంస్థ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘‘భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘వార్ 2’. ఇండియన్ సినీ హిస్టరీలో ఇద్దరు బిగ్ స్టార్స్ అయిన హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య ఉండేపోటీ ప్రేక్షకులకు ఓ విజువల్ ఫీస్ట్‌లా ఉంటుంది.ఈ సినిమా కోసం ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ స్పై యూనివర్స్‌లో భాగంగా మరో అధ్యాయంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పఠాన్, టైగర్ 3, వార్’ వంటి గ్లోబల్ హిట్ మూవీస్ తర్వాత వస్తోన్న ‘వార్ 2’ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనుండటం హ్యాపీగా ఉంది. ఆగస్ట్ 14న థియేటర్స్‌లో ఈ ఉత్సవం మొదలు కానుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్ ఫార్మాట్లోనూ రిలీజ్ కానుంది’’ అని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పేర్కొంది. -
ప్రభాస్ ప్లేస్‌లో బన్నీ.. ఎన్టీఆర్ ప్లేస్‌లో చరణ్.. ‘స్టార్స్’ మారిపోయారు!
తినే ప్రతి గింజపై తినేవారి పేరు ఉంటుందంటుంటారు. అలాగే ఓ దర్శకుడు రెడీ చేసిన కథ కూడా ఏ హీరో చేయాలని ఉంటే ఆ హీరో చెంతకు వెళ్తుందేమో. అప్పటికే ఒప్పుకున్న సినిమాలు, నిర్మాణ వ్యయాలు, స్క్రిప్ట్‌లో మార్పులూ చేర్పులు, కాల్షీట్స్ క్లాష్... ఇలా కారణాలు ఏమైనా ఇటీవలి కాలంలో కథలు ఒక హీరో నుంచి మరో హీరోకి షిఫ్ట్ అవుతున్న ట్రెండ్ బాగా కనిపిస్తోంది. ఇలా ఒకరు చేస్తారనుకున్న కథలో వేరే కథానాయకుడు ఎంట్రీ ఇస్తున్నారు. ఒక హీరోతో ప్లాన్ చేసిన కథలో మరో హీరో కనిపించనున్నారు. ఆ వివరాల్లోకి...సూపర్ హీరో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్‌హాసన్ లీడ్ రోల్లో రూపొందిన ‘విక్రమ్’ సినిమా క్లైమాక్స్‌లో రోలెక్స్ అనే పవర్ఫుల్ రోల్లో కనిపించారు సూర్య. ‘లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా రూపొందిన ఈ ‘విక్రమ్’ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న రోలెక్స్ రోల్‌కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. అయితే ‘విక్రమ్’ సినిమా సమయంలోనే సూర్యతో లోకేశ్ ఓ కొత్త సినిమాను ప్లాన్ చేశారని, కానీ ఇది ‘లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్’లోని సినిమా కాదని, ఇదొక సూపర్ హీరో ఫిల్మ్ అనే టాక్ తెరపైకి వచ్చింది. అయితే రీసెంట్గా దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో ఓ సినిమా చేయనున్నట్లుగా బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ కన్ఫార్మ్ చేశారు. ఇది సూపర్ హీరో ఫిల్మ్ అని, వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని ఆమిర్ ఖాన్ స్పష్టం చేశారు. దీంతో సూర్య హీరోగా చేయాల్సిన సూపర్ హీరో ప్రాజెక్ట్ ఆమిర్ ఖాన్ చేతికి వెళ్లిందనే టాక్ తెరపైకి వచ్చింది. సినిమా జానర్, దర్శకుడు ఒకరే కావడంతో సూర్య సినిమాయే ఆమిర్ ఖాన్‌కు వెళ్లినట్లుగా స్పష్టం అవుతోంది. బ్రహ్మ రాక్షస ‘హను–మాన్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘బ్రహ్మ రాక్షస’ (ప్రచారంలోకి వచ్చిన టైటిల్) అనే సినిమాను ఆరంభించారు. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించాల్సింది. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఈ సినిమా నుంచి హీరో రణ్వీర్ సింగ్ తప్పుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్రభాస్ చేతిలోకి వెళ్లిందని, హీరో క్యారెక్టరైజేషన్లో కాస్త నెగటివ్ షేడ్స్ ఉండే ఈ ‘బ్రహ్మ రాక్షస’ సినిమా చేసేందుకు ప్రభాస్ కూడా ఆసక్తి చూపిస్తున్నారని టాక్. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల చిత్రీకరణలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ‘బ్రహ్మ రాక్షస’ సినిమాను సెట్స్‌పైకి తీసుకువెళ్లాలని ప్రశాంత్ వర్మ ఆలోచిస్తున్నారని, ఆ దిశగా కార్యాచరణను మొదలుపెట్టారని తెలిసింది. ఇలా రణ్వీర్ సింగ్ చేయాల్సిన ప్రాజెక్ట్ ప్రభాస్ చేంతకు చేరింది. గేమ్ చేంజ్ ఎన్టీఆర్ ఆడాల్సిన ఆటలను రామ్‌చరణ్ అడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ‘ఉప్పెన’ సినిమా తర్వాత బుచ్చిబాబు సాన ఓ రూరల్ బ్యాక్‌డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా కథను రెడీ చేసుకున్నారు. ఈ కథకు ఎన్టీఆర్‌ను హీరోగా అనుకుని కొన్ని రోజులు వర్క్ చేశారు. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్‌లోని సినిమా ఇదే అని అందరూ అనుకున్నారు. కానీ ఈ దర్శకుడి రెండో సినిమా ‘పెద్ది’లో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు రెడీ చేసిన స్క్రిప్ట్ స్పోర్ట్స్ డ్రామా కావడం, ఇప్పుడు రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమా కూడా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుండటంతో ఎన్టీఆర్ చేయాల్సిన ‘పెద్ది’ సినిమా రామ్‌చరణ్‌కు షిఫ్ట్ అయినట్లుగా ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇక ‘పెద్ది’ సినిమాలో క్రికెట్, కబడ్డీ, కుస్తీ, ఖోఖో... ఇలా పలు రకాల క్రీడల ప్రస్తావన ఉంటుందని తెలిసింది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, దివ్యేందు వర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. కార్తికేయుడు అల్లు అర్జున్ హీరోగా చేయాల్సిన మైథాలజీ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ చేతికి వచ్చినట్లు తెలుస్తోంది. ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల.. వైకుంఠపురములో..’ వంటి చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ మైథాలజీ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లాల్సింది. కానీ ‘పుష్ప: ది రూల్’ సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో కాకుండా తమిళ దర్శకుడు అట్లీతో తన సినిమాను ముందుకు తీసుకువెళ్లారు అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్‌తో తాను చేయాల్సిన మైథాలజీ ప్రాజెక్ట్ కోసం ఏడాదిన్నరపైనే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చేశారు త్రివిక్రమ్. దీంతో ఈ సినిమాను వదులుకోలేక ఈ సినిమాను ఎన్టీఆర్‌తో చేసేందుకు సిద్ధమయ్యారు త్రివిక్రమ్. కార్తికేయ (కుమారస్వామి, మురుగన్) ఆధారంగా ఈ మైథాలజీ సినిమా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. వీటికి తోడు ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ చేతిలో ‘మురగ: గాడ్ ఆఫ్ వార్’ అనే పుస్తకం కనిపించింది. దీంతో త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ ఈ మైథాలజీ సినిమాను చేసేందుకే సన్నద్ధమౌతున్నారని, అందులో భాగంగానే ‘మురుగ’ పుస్తకాన్ని చదువుతున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో ‘ఎన్టీఆర్‌నీల్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా కాకుండా దర్శకుడు నెల్సన్‌తో ఓ సినిమా కమిట్మెంట్ ఉందన్న వార్తలు ఉన్నాయి. ఇంకా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌లో ఎన్టీఆర్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. కొరటాల శివతో ‘దేవర 2’ ఉంటుందని ఎన్టీఆర్‌నే కన్ఫార్మ్ చేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ చేసే సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి కాస్త సమయం పట్టేలా ఉంది. ఈలోపు వెంకటేశ్‌తో త్రివిక్రమ్ ఓ సినిమాను పూర్తి చేస్తారని, ఆ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమాను సెట్స్‌పైకి తీసుకుని వెళ్తారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. రావణం కొంతమంది దర్శకులకు కొన్ని డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అలా ‘సలార్, కేజీఎఫ్’ చిత్రాలను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్స్‌లో ‘రావణం’ ఒకటి. ఈ మైథాలజీ సినిమాను ‘దిల్’ రాజు నిర్మిస్తారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ హీరో అనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ ఈ చిత్రం ఇప్పుడు అల్లు అర్జున్ చేతికి వెళ్లిందని టాక్. ప్రభాస్‌కు భారీ లైనప్ ఉండటం వల్లనే అల్లు అర్జున్‌తో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. మరి... ప్రభాస్ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ చేతికి వెళ్లిందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్నారు. సందీప్‌రెడ్డి వంగాతో ఓ సినిమా, సుకుమార్‌తో ‘పుష్ప 3’ సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘రావణం’ సినిమా సెట్స్‌కు వెళ్లడానికి మరింత సమయం పట్టేలా తెలుస్తోంది. తొలిసారి కొత్తగా... యాక్షన్, లవ్‌స్టోరీ, ఫ్యామిలీ డ్రామా... ఇలాంటి తరహా సినిమాలను చాలానే చేశారు హీరో రామ్. కానీ సస్పెన్స్, హారర్, థ్రిల్ జానర్స్‌లో రామ్ హీరోగా వచ్చిన సినిమాలు లేవు. ఇప్పుడు ఈ జానర్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రామ్ సిద్ధమయ్యారనే టాక్ వినిపిస్తోంది. నాగచైతన్య కోసం కిశోర్ అనే ఓ నూతన దర్శకుడు ఓ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ స్టోరీని రెడీ చేశారట. రానా స్పిరిట్ మీడియా, ఆర్కా మీడియా సంస్థలు ఈ సినిమాను నిర్మించేందుకు సిద్ధమయ్యాయని సమాచారం. కానీ ‘విరూపాక్ష’తో సూపర్ హిట్ సాధించిన కార్తీక్ వర్మ దండు డైరెక్షన్లో ‘వృషకర్మ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీతో నాగచైతన్య ముందుకు వెళ్లారు. ఇలా కిశోర్ రెడీ చేసిన కథ హోల్డ్‌లో పడింది. అయితే ఈ కథ ఇప్పుడు రామ్ చెంతకు చేరిందని, ఈ సినిమా స్క్రిప్ట్ పట్ల రామ్ చాలా ఆసక్తిగా ఉన్నారని, త్వరలోనే ఈ సినిమా సెట్స్‌కు వెళ్లనుందనీ సమాచారం. తమ్ముడు వెండితెరపై ‘తమ్ముడు’ రీ ప్లేస్ అయ్యాడు. నితిన్ హీరోగా చేసిన తాజా చిత్రం ‘తమ్ముడు’. కానీ ఈ సినిమా హీరో నాని చేయాల్సిందని తెలిసింది. చివరి నిమిషంలో నితిన్ చేశారు. మరో ఆసక్తిరమైన విశేషం ఏంటంటే... ‘బలగం’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’ అనే మరో రూరల్ బ్యాక్‌డ్రాప్ మూవీ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమాలోని హీరో పాత్ర కోసం నానీని మేకర్స్ సంప్రదించారు. కొన్ని చర్చలు కూడా జరిగాయి. కానీ చివరి నిమిషంలో ఈ సినిమా నితిన్ చేతికి చేరింది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ‘బలగం’ సినిమాను నిర్మించిన ‘దిల్’ రాజు ఈ ‘ఎల్లమ్మ’ సినిమానూ నిర్మించనున్నారు. ఇక ‘ఎల్లమ్మ’లో హీరోయిన్గా సాయిపల్లవి, కీర్తీ సురేష్ వంటి తారల పేర్లు తెరపైకి వచ్చాయి. చెన్నై లవ్‌స్టోరీ ఆనంద్ దేవరకొండ లవ్‌స్టోరీ కిరణ్ అబ్బవరంకి వెళ్లింది. వైష్ణవీ చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ నటించిన ‘బేబీ’ సినిమా 2023లో రీలీజై, సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘కలర్‌ఫొటో’ ఫేమ్ సాయి రాజేశ్ దర్శకుడు. కాగా ఈ సినిమా తర్వాత సాయిరాజేశ్ మరో లవ్‌స్టోరీని రెడీ చేశారు. రవి నంబూరి ఈ సినిమాకు దర్శకుడు. ‘బేబీ’ సినిమాలో లీడ్ పెయిర్‌గా నటించిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య ఈ సినిమా చేయాల్సింది. కానీ ఈ సినిమా నుంచి ఇద్దరూ తప్పుకోవడంతో వారి స్థానాల్లో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాయి రాజేశ్, ఎస్కేఎన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. వీలైతే ఈ ఏడాది లేకపోతే, వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇలా ఈ తరహాలో ముందు ఓ కథను ఓ హీరో ఆల్మోస్ట్ ఒప్పుకుని, ఆ తర్వాత ఆ కథలో మరో హీరో నటిస్తున్న, నటించనున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి. - మూసిని శివాంజనేయులు -
టాలీవుడ్లో నెం1 గ్లోబల్ స్టార్ ఎవరు?
టాలీవుడ్ సూపర్ స్టార్ల స్టార్ ఫైట్... ఇప్పుడు గ్లోబల్ ఫైట్‌గా మారింది. గత కొంత కాలంగా అంతర్జాతీయ స్థాయిలో టాలీవుడ్ హీరోలు రాణిస్తుండడం, అయితే ఒకరి తర్వాత ఒకరు రికార్డ్స్ బద్దలు కొట్టడంతో... వీరిలో ఎవరు నెం1 గ్లోబల్ స్టార్ అనేది ఇంకా తేలలేదు. తొలుత ప్రభాస్, తర్వాత ఎన్టీయార్, రామ్ చరణ్, ఆ తర్వాత అల్లు అర్జున్... పాన్ ఇండియా సినిమాల ద్వారా సత్తా చాటారు. అయితే వీరిలో ఎవరు టాప్ అనేది ఇంకా నిరూపణ కాలేదు. ఈ నేపధ్యంలో వచ్చే 2027 సంవత్సరం తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా నిలవబోతోంది. టాలీవుడ్ స్టార్ల నుంచి దూసుకు వస్తున్న మూడు భారీ ప్రాజెక్టులు ఎస్ఎస్ఎంబి29, ఎఎ22, స్పిరిట్... చిత్రాలు మూడూ గ్లోబల్ బాక్సాఫీస్‌ను లక్ష్యంగా చేసుకొని రూపొందుతున్నాయి. ఈ మూడు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి.ఈ మూడింటిలో రాజమౌళి – మహేష్ బాబు కాంబోలో వస్తున్న తొలిచిత్రం ఎస్ఎస్ఎంబి29పై అత్యధికంగా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ ద్వారా ఇప్పటికే గ్లోబల్ ప్రేక్షకుల నాడి తెలిసిన రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారు. తొలిసారిగా మహేష్ బాబు ఈ చిత్రంలో పూర్తి మేకోవర్‌తో కనిపించనున్నాడు. సమాచారం. అంతేకాక పాన్ ఇండియా సినిమా లో తన సత్తా తొలిసారి చాటనున్నాడు. అల్లూ అర్జున్, అట్లీ కాంబినేషన్ లో మాస్ అండ్ స్టైల్ ఎంటర్టైనర్గా ఎఎ22 చిత్రం కూడా దాదాపుగా అదే సమయంలో రానుంది. ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న 2వ చిత్రంగా నిలవబోతోంది. విజువల్స్, యాక్షన్, హై ఎనర్జీ ప్రెజెంటేషన్ కారణంగా ఇది ఇండియన్ మార్కెట్ తో పాటు ఇంటర్నేషనల్ సూపర్ హీరో సినిమాల అభిమానులను కూడా ఆకర్షించే అవకాశం ఉందని అంటున్నారు.హీరోగా ఇప్పటికే గ్లోబల్ స్టార్ డమ్‌ను స్వంతం చేసుకున్న ప్రభాస్...స్పిరిట్ కూడా రేసు లో వుంది. తన ప్రతీ సినిమా ద్వారా ప్రేక్షకులకు షాక్ కొట్టే కధాంశాలతో హిట్స్ కొట్టే సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కు దర్శకత్వం వహిస్తున్నారు, ఇప్పటికే దీపిక పదుకునే నిష్క్రమణ సందీప్ వంగా పై కామెంట్స్ తదితర వార్తల ద్వారా ఈ చిత్రం నిత్యం సినీ అభిమానుల నోట్లో నానుతోంది.ఈ చిత్రం యాక్షన్, డార్క్ థీమ్, బోల్డ్ నెరేటివ్ తో రూపొందుతోంది. అంతర్జాతీయ నటుల ఎంపిక, గ్లోబల్ రిలీజ్ ప్లాన్ వంటి లతో ఇది ఇంటర్నేషనల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తోంది.ఈ మూడు ప్రాజెక్టులు తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయంగా మరో మెట్టుకు తీసుకెళ్లే అవకాశముంది. ప్రతి చిత్రమూ దేనికదే తనదైన ప్రత్యేకతను కలిగి ఉండటంతో, ఇండియన్ సినిమా గ్లోబల్ ఆడియన్స్ ముందుకు ఎలా తీసుకెళ్లాలి అనే విషయంలో తదుపరి సినిమాలకు ఈ మూడూ దేనికదే ప్రత్యేక శైలి లో దిశా నిర్ధేశ్యం చేయనున్నాయి. ఆ మార్గదర్శకత్వం చేస్తున్నవారు దక్షిణాది వారు అందులోనూ ఒక్క అట్లీ తప్ప అందరూ తెలుగు వారు కావడం నిజంగా గర్వకారణమే. -
మురుగ పుస్తకంతో జూనియర్ ఎన్టీఆర్
వెండితెరపై కార్తికేయుడిగా జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మైథాలజీ సినిమాలోనే కార్తికేయుడిగా ఎన్టీఆర్ కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ వార్త నిజమయ్యేలా ఉంది. ఎందుకంటే ‘వార్ 2’ సినిమా వర్క్స్‌లో భాగంగా ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన ఎన్టీఆర్ చేతిలో ‘మురుగ’ (కార్తికేయుడు) పుస్తకం కనిపించింది.అందుకోసమే ఈ ప్రిపరేషన్దీంతో త్రివిక్రమ్‌తో చేయబోయే మైథాలజీ సినిమాకు ఎన్టీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని, ఇందులో భాగంగానే మురుగ పుస్తకం చదువుతున్నారని ఆయన ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు. ఈ సినిమాను కల్యాణ్‌రామ్, సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించనున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. కొరటాల శివతో ‘దేవర 2’ కమిట్ అయ్యారు. తమిళ దర్శకుడు నెల్సన్‌తో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తారని టాక్. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ చేయబోయే సినిమా చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందనే చర్చ జరుగుతోంది. ఈ కాంబినేషన్ గురించి కూడా అధికారక ప్రకటన రావాల్సి ఉంది. చదవండి: బిగ్‌బాస్ 9 ప్రోమో వచ్చేసింది.. నాగార్జునే హోస్ట్.. మరి బజ్ హోస్ట్? -
బెట్ ఇలాంటి ‘వార్’ చూసి ఉండరు: ఎన్టీఆర్
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియరా అద్వానీ హీరోయిన్. యశ్‌రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్మించిన స్పై యాక్షన్ మూవీ ‘వార్’ (2019) కొనసాగింపుగా వార్ 2 తెరకెక్కుతుంది. ఆగస్ట్ 14న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం కౌంట్‌డౌన్ మొదలు పెట్టింది. మరో 50 రోజుల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు కొత్త పోస్టర్ల ద్వారా తెలియజేశారు.ఈ పోస్టర్లను ఎన్టీఆర్ తన ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేస్తూ.. ‘బెట్ కాస్తున్నా.. ఇలాంటి ‘వార్’ చిత్రాన్ని మీరెప్పుడూ చూసి ఉండరు. కౌంట్‌డౌన్ మొదలు పెట్టండి’ అని రాసుకొచ్చాడు. ఎన్టీఆర్ ట్వీట్‌తో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసమే గురువారం ఎన్టీఆర్ ముంబైకి వెళ్లారు.కూలీతో పోటీఆగస్ట్ 14న వార్ 2 తో పాటు మరో భారీ పాన్ ఇండియా చిత్రం కూడా రిలీజ్ కానుంది. అదే ‘కూలీ’. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. నాగార్జున, ఆమిర్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సౌత్‌లో రజనీకాంత్ మేనియా ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. అలాంటి హీరోతో ఎన్టీఆర్ పోటీ పడుతున్నాడు. మరి ఈ బాక్సాఫీస్ వార్‌లో గెలిదెవరో చూడాలి. Bet you haven’t ever seen a WAR like this! Let’s count it down #50DaysToWar2 … Releasing in Hindi, Telugu & Tamil on August 14th in cinemas worldwide! @iHrithik | @advani_kiara | #AyanMukerji | #War2 | #YRFSpyUniverse | @yrf pic.twitter.com/22ar5Mau9y— Jr NTR (@tarak9999) June 26, 2025 -
జూనియర్ ఎన్టీఆర్‌కు పెద్ద అభిమానిని: పొలిమేర హీరోయిన్
పొలిమేర సినిమాలతో ఆడియన్స్‌లో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ కామాక్షి భాస్కర్ల. ప్రస్తుతం ఆమె షో టైమ్ అనే మూవీలో నటిస్తున్నారు. నవీన్ చంద్ర హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్గా కనిపించనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన కామాక్షి భాస్కర్ల ఆసక్తికర కామెంట్స్ చేసింది.తాను జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమానినని కామాక్షి భాస్కర్ల అన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్‌గా అరవింద సమేత సినిమా చూసేందుకు థియేటర్‌కు వెళ్లి.. నవీన్ చంద్ర అభిమానిగా బయటికొచ్చానని తెలిపింది. పొలిమేర-2 చూసిన తర్వాత నవీన్ చంద్ర వ్యక్తిగతంగా నన్ను అభినందించారు. ఈ సినిమాలో నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు.. ఈ విషయంలో నవీన్ చంద్రతో పాటు డైరెక్టర్‌కు నా ధన్యవాదాలు.. మా సినిమాలను ఓటీటీలో కాకుండా థియేటర్లకు వచ్చి చూడాలని ఆడియన్స్‌కు విజ్ఞప్తి చేసింది కామాక్షి భాస్కర్ల. -
Jr NTRను దూరం పెట్టడానికి కారణాలు చెప్పిన పురందేశ్వరి
-
ఎన్టీఆర్‌ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి
"పుష్ప" సినిమాలో, హీరో పుష్పరాజ్ ఇంటిపేరు కోసం, ఇంటి పేరు లేకపోవడంతో తను ఎదుర్కొన్న అవమానాలపై పోరాడతాడు. తన పేరు ముందు ఇంటి పేరు రావడం కోసం, జీరో నుండి హీరోగా ఎదిగే క్రమంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాడు. ఫైనల్‌గా తనను వెతుక్కుంటూ ఆ ఇంటిపేరు తన గుమ్మం ముందు వాలుతుంది. ఒకరకంగా ఎన్టీఆర్ పరిస్థితి కూడా పుష్పరాజ్ కథకు దగ్గరగా ఉంటుంది. తారక్‌ను అభిమానించే వారికి ఈ విషయం తెలుసు కూడా! తాజాగా ఇదే అంశం గురించి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) పలు విషయాలు పంచుకున్నారు.దూరం పెరిగింది..సీనియర్ ఎన్టీఆర్ కూతురు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తారక్ (Jr NTR)ను చిన్నతనంలోనే నందమూరి ఫ్యామిలీకి ఎందుకు దూరం పెట్టారో ఇలా చెప్పారు. ' జూనియర్ ఎన్టీఆర్‌ను చిన్నతనంలోనే దూరం పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. దానిని పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. కారణాలు అయితే ఉన్నాయి. కొంచెం దూరం పెరిగింది. కానీ, ఇప్పుడు అందరం కలిసే ఉంటున్నాం' అని ఆమె చెప్పారు.(చదవండి: రామోజీ ఫిలిం సిటీ.. రాశీ, తాప్సీలకు అదే భయానక అనుభవాలు)తారక్ మనసులో ఏముంది?ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ గురించి కూడా పురందేశ్వరి మాట్లాడారు.' రాజకీయాల్లోకి తారక్ రావాలనుకుంటే వస్తారు. అతనిది ఇంకా చిన్న వయసు. అలాంటప్పుడు పాలిటిక్స్‌లోకి తారక్ రావాల్సిన అవసరం ఉందా..? అనేది మనం ప్రశ్నించుకోవాలి. అయితే, రాజకీయాల గురించి తారక్ మనసులో ఏముంది..? అనేది నాకు తెలియదు. ఈ విషయం గురించి ఎప్పడు కూడా చర్చించలేదు' అన్నారు.తారక్‌తో ఇబ్బంది లేదుగతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆమె మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. తారక్ తన పిల్లలతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటాడని పురందేశ్వరి చెప్పారు. తను నటించిన సినిమా విడుదలైతే తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటానని ఆమె అన్నారు. తనను జూ. ఎన్టీఆర్ అత్తా అనే పిలుస్తాడని, తనతో ఎలాంటి ఇబ్బంది లేదని ఆమె పలుమార్లు పంచుకున్నారు.చదవండి: వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్ -
హీరోలో విలన్
విలన్‌గా కెరీర్‌ను ఆరంభించి, ఆ తర్వాత హీరోలైన నటులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అలానే హీరోగా కెరీర్‌ను ఆరంభించి, ఆ తర్వాత విలన్‌గా చేస్తున్న జాబితా కూడా పెద్దదిగానే ఉంది. కానీ ఒకవైపు హీరోగా చేస్తూనే, మరోవైపు విలన్‌గా చేస్తున్నారు కొందరు తెలుగు హీరోలు. విలన్స్‌గానూ తమ సత్తా ఏంటో ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నారు. ఓసారి ఆ హీరోల్లో ఉన్న విలన్‌పై ఓ లుక్ వేద్దాం...రజనీకాంత్‌తో ఢీ: రొమాంటిక్ స్టార్ హీరో నాగార్జున విలన్ రోల్ చేస్తే ఎలా ఉంటుంది? అనేది ‘కూలీ’ సినిమాలో చూడొచ్చు. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘కూలీ’లో నాగార్జున ప్రతినాయకుడిగా నటించారు. ఈ సినిమాలో సైమన్ రోల్లో కనిపిస్తారు నాగార్జున. కాగా ‘కూలీ’ చిత్రీకరణప్రారంభమైనప్పుడు ఓ వ్యక్తిని నాగార్జున కిరాతకంగా చంపుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో లీకైంది.ఆ వీడియో బయటకు వచ్చినప్పుడే ఈ సినిమాలో నాగార్జున విలన్‌గా కనిపిస్తారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజమైంది. ఇక ఈ చిత్రంలో ఉపేంద్ర, శ్రుతీహాసన్, సత్యరాజ్, షౌబిన్ షాహిర్ ముఖ్య పాత్రలు చేశారు. అలాగే ఓ స్పెషల్ సాంగ్‌లో పూజా హెగ్డే అదిరిపోయే స్టెప్పులేశారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. వెండితెర బ్రహ్మ రాక్షస: యాక్షన్ చిత్రాల్లో విలన్లను చితక్కొడుతుంటారు ప్రభాస్. ఆరడుగుల ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు చేస్తుంటే, థియేటర్స్‌లో విజిల్స్ పడాల్సిందే. కానీ ఇప్పుడు తనలోని విలన్ యాంగిల్‌ని కూడా చూపించాలనుకుంటున్నారట ప్రభాస్. ఇందులో భాగంగానే ప్రభాస్ ‘బ్రహ్మ రాక్షస’ అనే సినిమా చేయనున్నారని, ‘హను–మాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారనే టాక్ వినిపిస్తోంది. హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మించనుందట. కానీ... ప్రభాస్ ప్రస్తుత కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమా సెట్స్‌కు వెళ్లడానికి ఎక్కువ సమయం పట్టేలా ఉంది.ఎన్టీఆర్ వార్: ఏ తరహా పాత్రనైనా అవలీలగా చేసేస్తారు ఎన్టీఆర్. ‘జై లవకుశ, టెంపర్’ చిత్రాల్లో హీరోగా కనిపించడంతో పాటు నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లోనూ ప్రేక్షకులను మెప్పించారు. మరోసారి ఈ తరహా పాత్రను ‘వార్ 2’ చిత్రంలో ఎన్టీఆర్ చేసినట్లుగా తెలుస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన లేటెస్ట్ స్పై యాక్షన్ మూవీ ‘వార్ 2’.ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ లీడ్ రోల్స్ చేశారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రానిర్మించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పూర్తి స్థాయి విలన్ పాత్రలో కనిపిస్తారని, ఆ పాత్ర పేరు వీరేంద్రనాథ్ అని బాలీవుడ్ టాక్. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఇక హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లీడ్ యాక్టర్స్‌గా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ మూవీ ‘వార్’ (2019)కు సీక్వెల్‌గా ‘వార్ 2’ రానుంది.హీరో... విలన్ ఒక్కరే!: అల్లు అర్జున్ ‘ఆర్య 2’ సినిమా చూశారుగా! ఆ చిత్రంలో హీరోగా నటించిన అల్లు అర్జున్ పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ కనిపిస్తాయి. కానీ ఈసారి పూర్తి స్థాయిలో ఓ నెగటివ్ రోల్లో అల్లు అర్జున్ కనిపించనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది.ఈ మూడింటిలో ఒకటి విలన్ రోల్ అని, ఇప్పటివరకు అల్లు అర్జున్ను సిల్వర్ స్క్రీన్‌పై చూడని విధంగా ఆయన ఈ పాత్రలో కనిపిస్తారని టాక్. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ముంబైలోప్రారంభమైందని తెలిసింది. అల్లు అర్జున్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే జాన్వీ కపూర్, మృణాల్ ఠాగూర్ ఇతర ప్రధాన హీరోయిన్ పాత్రల్లో నటిస్తారనే ప్రచారం సాగుతోంది.బ్లాక్ స్వార్డ్: నటుడిగా కొంత గ్యాప్ తీసుకుని, ఇటీవల ‘భైరవం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మంచు మనోజ్. ఈ చిత్రంలో మనోజ్ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉన్నాయి. మరోసారి మంచు మనోజ్ విలన్‌గా కనిపించనున్నారు. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ‘మిరాయ్’ చిత్రంలో బ్లాక్ స్వార్డ్ పేరుతో విలన్ పాత్ర చేస్తున్నారు మంచు మనోజ్. ఇటీవల విడుదలైన ‘మిరాయ్’ టీజర్ మనోజ్‌ది విలన్ పాత్ర అని స్పష్టం చేసింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 5న రిలీజ్ కానుంది. మండాడిలో విలన్: తమిళ నటుడు సూరి, తెలుగు నటుడు సుహాస్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం ‘మండాడి’. మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఎల్రెడ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్గా మహిమా నంబియార్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో పూర్తి స్థాయి విలన్ పాత్రను సుహాస్ చేస్తున్నారు. ఇక అడివి శేష్ హీరోగా నటించిన ‘హిట్ 2’ చిత్రంలోనూ సుహాస్ విలన్‌గా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. వీరే కాదు... రానా, సందీప్ కిషన్, నవీన్ చంద్ర, ఆది పినిశెట్టి, కార్తికేయ, వరుణ్ సందేశ్ వంటి వారు ఒకవైపు హీరో పాత్రలు చేస్తూనే, కథ కుదిరినప్పుడు విలన్ పాత్రలూ చేస్తున్నారు. – ముసిమి శివాంజనేయులు -
8k వర్షన్లో ఎన్టీఆర్- జాన్వీ కపూర్ వీడియో సాంగ్
దేవరలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) రొమాంటిక్ స్టెప్పులతో ‘చుట్టమల్లే’ అంటూ యువతను బాగా చుట్టేసుకుంది. ఎన్టీఆర్ (NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో విడుదలైన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘దేవర’లో ఈ పాటకు ఫ్యాన్స్ ఎక్కువే అని చెప్పవచ్చు. తాజాగా 'చుట్టమల్లే' పాటను 8k వర్షన్లో ఉన్న వీడియోను విడుదల చేశారు. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల నుంచి పలు సాంగ్స్ 8k వర్షన్లో విడుదలయ్యాయి. దసరా, స్త్రీ2, గేమ్‌ఛేంజర్, రైడ్2 వంటి చిత్రాలతో పాటు కొన్ని పాత సినిమాల నుంచి కూడా సరికొత్తగా 8k వర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.ప్రస్తుతం 4K వీడియోలోనే ఎక్కువ పాటలు ఉంటున్నాయి. అయితే, ఇప్పుడు 8k వర్షన్లో విడుదల చేస్తున్నారు. దీంతో 4K వీడియో కంటే ఎక్కువ రిజల్యూషన్‌తో నాణ్యత ఉంటుంది. 8k వీడియో చూడటం వల్ల మీరు మరింత స్పష్టమైన. పదునైన విజువల్స్‌ను అనుభవించవచ్చు. 8k వీడియోలను పెద్ద స్క్రీన్లలో లేదా డిస్ప్లేలలో చూడటం ద్వారా వాటిని మరింత బాగా ఆస్వాదించవచ్చు. 4k రిజల్యూషన్ 3840 x 2160 పిక్సెల్స్ (pixels) అయితే, 8k రిజల్యూషన్ 7680 x 4320 పిక్సెల్స్‌గా ఉంటుంది. -
ట్విస్ట్ ఇచ్చిన నాగవంశీ.. త్రివిక్రమ్ సినిమాలపై ప్రకటన
రెండురోజుల నుంచి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) పేరు టాలీవుడ్లో వైరల్ అవుతుంది. ఆయన చేయబోయే సినిమాల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న వేళ నిర్మాత నాగవంశీ ఒక పోస్ట్‌తో అన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టేశారు. త్రివిక్రమ్ చేతిలో ప్రస్తుతం రెండు చిత్రాలు మాత్రమే ఉన్నాయని ఆయన అన్నారు. వాటిలో ఒకటి విక్టరీ వెంకటేశ్‌తో చేస్తారని చెప్పుకొచ్చారు. మరొకటి ఎన్టీఆర్‌తో ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. ఆయన చేతిలో ఈ రెండు తప్పా ఎలాంటి ప్రాజెక్ట్‌లు లేవన్నారు. వేరే హీరోలతో త్రివిక్రమ్చేస్తున్నారని వస్తున్న వార్తలు కేవలం ప్రచారం మాత్రమేనని తేల్చేశారు. త్రివిక్రమ్‌కు సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ ఫైనల్ అయితే స్వయంగా తానే ప్రకటిస్తానని నాగవంశీ తెలిపారు.(ఇదీ చదవండి: సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఎన్టీఆర్.. బన్నీ కథలో మార్పులు!)నాగవంశీ ఇచ్చిన క్లారిటీతో త్రివిక్రమ్-రామ్ చరణ్ ప్రాజెక్ట్ లేనట్టేనని తేలిపోయింది. ఆపై అల్లు అర్జున్ కాంబినేషన్లో ఒక సినిమా అంటూ వచ్చిన వార్తలు కూడా పూర్తిగా ప్రచారం మాత్రమేనని క్లారిటీ వచ్చేసింది. వెంకటేష్, ఎన్టీఆర్ ప్రాజెక్ట్ లు మాత్రమే త్రివిక్రమ్ ప్రస్తుతానికి లాక్ చేశారంటూ నాగవంశీ చెప్పారు. అయితే, మొదట వెంకటేశ్‌తో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాతే ఎన్టీఆర్‌తో భారీ ప్రాజెక్ట్ మొదలౌతుందని చెప్పవచ్చు. ఈ రెండు చిత్రాలను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనుంది. పురాణాలతో ముడిపడిన కథలో ఎన్టీఆర్ నటించనున్నారు. మోస్ట్ పవర్ఫుల్ గాడ్ పాత్రలో తారక్ అన్న నటిస్తున్నారంటూ ఇప్పటికే నాగవంశీ ఒక పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా తారక్ నటిస్తున్నారని టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో వార్2, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్, దేవర్2 సినిమాలు ఉన్నాయి. రామ్ చరణ్, అల్లు అర్జున్‌లకు నాగవంశీ ట్విస్ట్ ఇచ్చాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.Trivikram garu’s next 2 projects are locked with @VenkyMama sir and @tarak9999 anna. Everything else is mere speculation. Any confirmed project of Trivikram garu will be announced by me in this space.— Naga Vamsi (@vamsi84) June 12, 2025 -
దేవుడి అవతారంలో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ స్టోరీ ఇదేనా?
ఎన్టీఆర్,త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది. అల్లు అర్జున్(Allu Arjun)తో చేయాల్సిన సినిమా కథలో స్వల్ప మార్పులు చేసి ఎన్టీఆర్‌తో తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే మొన్నటివరకు ఇది రూమర్‌గానే ఉండే..కానీ తాజాగా నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్‌తో ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబోలో సినిమా రాబోతుందనే విషయంపై స్పష్టత వచ్చింది. మైథలాజికల్ బ్యాగ్రౌండ్‌తో తెరకెక్కే ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనుందట. ‘‘మోస్ట్ పవర్ఫుల్ గాడ్ పాత్రలో నా మోస్ట్ ఫేవరెట్ అన్న నటించనున్నారు. గాడ్ ఆఫ్ వార్ ఈజ్ కమింగ్’’ అని నాగవంశీ ట్వీట్ చేశాడు.దాంతో ఎన్టీఆర్‌ను ఉద్దేశించే నాగవంశీ ఈ పోస్ట్ చేశారనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఇందులో ఎన్టీఆర్ పాత్ర చాలా కొత్తగా ఉండబోతుందట. తొలిసారి ఆయన పూర్తిస్థాయిలో దేవుడి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మోస్ట్ పవర్ఫుల్ గాడ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఎన్టీఆర్ నటించబోతున్నట్లు సమాచారం. పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ ఎలా నటిస్తారో యమదొంగ సినిమాతో కొంతవరకు చూశాం. అందులో కాసేపు యముడి పాత్రలో కనిపించి తనదైన నటనతో అదరగొట్టాడు. ఇక త్రివిక్రమ్ సినిమాలో దేవుడు పాత్ర చేయబోతున్నాడు. అది కూడా పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర. కచ్చితంగా ఎన్టీఆర్ అదరగొడతాడు. అందులో నో డౌట్. తన అభిమాన హీరోని దేవుడి పాత్రలో చూసేందుకు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాం అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు.ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన వార్ 2 సినిమా డబ్బింగ్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై యాక్షన్ సినిమాలో హృతిక్, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటించగా, కియారా అద్వానీ కీలక పాత్ర పోషించింది. ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కానుంది. -
ఫుల్ బిజీగా జూనియర్ ఎన్టీఆర్.. వార్-2 కోసం ఎంట్రీ!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో భారీ యాక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ కూడా జరిగింది. ఈ మూవీ పనులతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ మరో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హృతిక్ రోషన్ నటిస్తోన్న వార్-2 చిత్రంలో విలన్ పాత్రలో మెప్పించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూట్ దాదాపు పూర్తయింది.ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ వార్-2 డబ్బింగ్ పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా ఆయన డబ్బింగ్ చెప్పేందుకు స్టూడియోలో ప్రత్యక్షమయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మూవీ ద్వారానే యంగ్ టైగర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.కాగా.. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వార్ 2 టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. గతంలో సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన 2019 బ్లాక్‌బస్టర్ వార్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ భారీ యాక్షన్ చిత్రం ఆగస్టు 14న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.🎙️ Jr NTR begins dubbing for #WAR2.The much-awaited action thriller moves one step closer to release. 🔥@tarak9999#WAR2 #JrNTR #siima pic.twitter.com/oU1ptFqVJN— SIIMA (@siima) June 11, 2025 -
కన్ఫ్యూజన్కు ఫుల్స్టాప్.. ఆ స్టార్ హీరోతోనే త్రివిక్రమ్ సినిమా.. నిర్మాత హింట్!
టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడంతా ఫుల్ బిజీ అయిపోయారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ తమ కొత్త ప్రాజెక్టులపై దృష్టిపెట్టారు. ఇటీవలే వార్-2 షూటింగ్ పూర్తి చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రస్తుతం ప్రశాంత్‌నీల్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ సైతం శరవేగంగా జరుగుతోంది. దీంతో ఈ స్టార్స్ కోసం మరో డైరెక్టర్ వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇటీవల అల్లు అర్జున్- అట్లీ మూవీపై అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో బన్నీతో మూవీ ప్లాన్ చేసిన త్రివిక్రమ్‌కు నిరాశే ఎదురైంది. ఇప్పట్లో బన్నీ- త్రివిక్రమ్ మూవీ పట్టాలెక్కేలా కనిపించడం లేదు.అయితే ఈ గ్యాప్‌లోనే త్రివిక్రమ్.. మెగా హీరో రామ్ చరణ్‌తో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్లో టాక్ వినిపించింది. అయితే వీటిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఇదిలా ఉండగానే బన్నీ ప్లేస్‌లో మరో స్టార్ హీరోతో మాటల మాంత్రికుడు మూవీ తీసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అతను మరెవరో కాదు.. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్తోనే తెరకెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది.తాజాగా ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సంస్కృతి భాషలో ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. అల్లు అర్జున్‌తో ప్లాన్ చేసిన మైథలాజికల్ ఫాంటసీ చిత్రంలో ఎన్టీఆర్ నటించనున్నట్లు నాగవంశీ హింట్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కార్తికేయ భగవానుడి పాత్రలో అడుగుపెడుతున్నట్లు ఆ ట్వీట్ చూస్తేనే అర్థమవుతోంది. 'అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో నాకు అత్యంత ఇష్టమైన అన్న ఒకరు' అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్ట్‌తో ఎన్టీఆర్తోనే త్రివిక్రమ్ సినిమా చేయనున్నారని దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది.ఆసక్తికర విషయం ఏంటంటే.. మొదట ఈ సినిమాను జూనియర్ ఎన్టీఆర్తోనే ప్లాన్ చేసినట్లు సమాచారం. ఆ తర్వాతే అల్లు అర్జున్ కు ఆఫర్ చేశారు. ఇప్పుడు బన్నీ.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో జత కట్టడంతో నిర్మాతలు మరోసారి ఎన్టీఆర్వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.కాగా.. మహేష్ బాబుతో 'గుంటూరు కారం' తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించలేదు. గతంలో వెంకటేశ్, రామ్ చరణ్‌తో సినిమాల వార్తలొచ్చినా అవేమీ ఇంకా అప్డేట్స్ రాలేదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్తోనే సినిమాకు త్రివిక్రమ్ సిద్ధమైనట్లు లేటేస్ట్ టాక్. నాగవంశీ ట్వీట్‌తో ఈ విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. GOD OF WAR is Coming!! pic.twitter.com/MoIcrKduNw— Naga Vamsi (@vamsi84) June 11, 2025 My most favourite anna as one of the most powerful gods. pic.twitter.com/Vq4dFV3lJd— Naga Vamsi (@vamsi84) June 11, 2025 -
భారీ బడ్జెట్‌తో షారుక్- సల్మాన్ సినిమా.. గెస్ట్ రోల్స్‌లో ఎన్టీఆర్, హృతిక్!
వైఆర్ఎఫ్ (యశ్ రాజ్ ఫిల్మ్స్) స్పై యూని వర్స్‌లో భాగంగా ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన ‘ఏక్తా టైగర్’ (2012), ‘టైగర్ జిందా హై’ (2017), ‘టైగర్ 3’ (2023), హృతిక్ రోషన్ ‘వార్’ (2019), షారుక్ ఖాన్ ‘పఠాన్’ (2023) వంటి సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ యూనివర్స్‌లోనే హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ హీరోలుగా చేసిన ‘వార్ 2’, ఆలియా భట్ – శర్వారీ లీడ్ రోల్స్ చేసిన ‘ఆల్ఫా’ చిత్రం రిలీజ్‌కు సిద్ధమౌతున్నాయి. ‘వార్ 2’ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ‘ఆల్ఫా’ చిత్రం ఈ ఏడాది డిసెంబరు 25న విడుదల కానుంది. కాగా... రెండు సంవత్సరాలుగా ఈ ‘వైఆర్ఎఫ్’ స్పై యూనివర్స్‌లో భాగంగానే ‘పఠాన్ వర్సెస్ టైగర్’(Pathaan Vs Tiger)చిత్రం రానుందని, ఈ మూవీలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ హీరోలుగా చేస్తారని, అలాగే ‘పఠాన్ వర్సెస్ టైగర్’ సినిమాలో ఈ యూనివర్స్‌లో భాగమైన హృతిక్ రోషన్, జాన్ అబ్రహాం, ఆలియా భట్, ఎన్టీఆర్ గెస్ట్ రోల్స్‌లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాని ‘వార్, పఠాన్’ సినిమాలకు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. కానీ హఠాత్తుగా ‘పఠాన్ వర్సెస్ టైగర్’ చిత్రం ఆగిపోయిందనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ అలాంటిది ఏమీ లేదని, ‘వార్ 2’, ‘ఆల్ఫా’ చిత్రాలు విడుదలైన తర్వాత ‘పఠాన్ వర్సెస్ టైగర్’ సినిమా గురించి ఓ స్పష్టత వస్తుందని జాతీయ ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో సిల్వర్ స్క్రీన్‌పై ‘పఠాన్–టైగర్’ల పోరు ఉంటుందని, కాకపోతే కొంత సమయం పడుతుందని తెలుస్తోంది. -
పోలీస్ స్టేషన్లో ఫైట్
పోలీస్ స్టేషన్లో ఫైట్ చేస్తున్నారట ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ‘డ్రాగన్’ (ప్రచారం) అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఓ పోలీస్ స్టేషన్ సెట్లో జరుగుతోందని సమాచారం. పోలీస్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారని, 500 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు ఈ సీక్వెన్స్‌లో పాల్గొంటున్నారని టాక్.ఈ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో ఓ హైలైట్‌గా ఉంటుందట. ఇక ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారని, మలయాళ నటుడు టొవినో థామస్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ–సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది. -
దిల్ రాజు చేతికి 'వార్ 2'.. కూలీ ఎఫెక్ట్‌తో పక్కా ప్లాన్
బాలీవుడ్ స్పై యాక్షన్ డ్రామా చిత్రం ‘వార్ 2’ ఆగష్టు 14న విడుదల కానుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ మూవీ హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది. మరో రెండు నెలల్లో ఈ చిత్రం విడుదల సందడి మొదలు కానుంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్‌కు సంబంధించిన వ్యవహారాలు అప్పుడే ఊపందుకున్నాయి. ఇక్కడ యష్ రాజ్ ఫిలింస్ సొంతంగానే వార్2 ను విడుదల చేయాలని అనుకుంటున్నారు. కానీ, చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారట.వార్2 సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం దాదాపు 120 కోట్లకు పైగానే యష్ రాజ్ ఫిలింస్ కోట్ చేసింది. అయితే, చాలా పక్కా ప్లాన్‌తో ఆ సంస్థ అడుగులేస్తుంది. రజనీకాంత్, నాగార్జున, లోకేష్ కనకరాజ్‌ల సినిమా కూలీ కూడా అదే సమయంలో వస్తుండటంతో సౌత్ ఇండియాలో వార్2కు పోటీ తప్పదు. అందుకే వార్2 చిత్ర యూనిట్ ముందుగా జాగ్రత్త పడుతుందని టాక్. డిస్ట్రిబ్యూషన్ విషయంలో వార్ 2 సరికొత్త ప్లాన్‌తో వెళ్తున్నట్లు తెలుస్తోంది. నేరుగా ముంబై నుంచే థియేటర్ల యజమానులతో వారు డీల్ సెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు అగ్రిమెంట్లు కూడా స్టార్ట్ చేసేశారు. కానీ, ఉత్తరాంధ్ర ఏరియా మాత్రం నిర్మాత దిల్ రాజు సంస్థకు ఇచ్చారని తెలుస్తోంది. వార్2 చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వాలా లేదా తామే పంపిణీ చేద్దామా అనే అంశాన్ని ప్రస్తుతానికి ఆ టీమ్ పక్కన పెట్టేసింది. -
లక్ష్యం కోసం...
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న స్పై యాక్షన్ డ్రామా చిత్రం ‘వార్ 2’. కియారా అద్వానీ హీరోయిన్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది. కాగా ఇటీవల ‘వార్ 2’ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.ఈ టీజర్లో కనిపించిన ఎన్టీఆర్ లుక్స్, స్టైలింగ్ బాగున్నాయనే చర్చ జరిగింది. ఈ విషయంపై ‘వార్ 2’ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన అనైతా ష్రాఫ్ అడజానియా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘వార్ 2’ సినిమా కోసం ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనలో ఏదో ఆకర్షణ శక్తి ఉంది. సెట్స్‌కి ఎంట్రీ ఇవ్వగానే ఆ ఎనర్జీ టీమ్ అందరిలోకి వచ్చేస్తుంటుంది. ‘వార్ 2’ లో ఎన్టీఆర్ పోషించినపాత్రలో ఎన్నో లేయర్స్ ఉన్నాయి. అందుకే చాలా లుక్స్‌ని డిజైన్ చేశాం. ఆయనపాత్ర స్వభావాన్ని ప్రతిబింబించేలా కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేశాం. ఓ ఉద్దేశంతో ఓ లక్ష్యం కోసం పనిచేసే మానవ యంత్రంలా చూపించే ప్రయత్నం చేశాం’’ అని అనైతా ష్రాఫ్ అడజానియా చెప్పారు. -
ప్రశాంత్ నీల్ బర్త్ డే.. సెలబ్రేషన్స్‌లో జూనియర్ ఎన్టీఆర్!
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో భారీ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తొలిసారి ఎన్టీఆర్-నీల్ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. కేక్ కట్ చేసిన ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్‌కు కేక్ తినిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాకుండా ప్రశాంత్ నీల్ బర్త్ డే కావడంతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ విషెస్ తెలిపారు. మీ మాటల కంటే మీ విజన్ సౌండ్ గట్టిగా వినిపిస్తుందని కొనియాడారు. స్క్రీన్‌పై మీ ఫైర్ కనిపిస్తుందని ప్రశంంచారు.(ఇది చదవండి: బెంగళూరు గెలుపు.. పూనకంతో ఊగిపోయిన స్టార్ డైరెక్టర్)అయితే ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ విజయం సాధించడంతో ప్రశాంత్ నీల్ ఆనందం వ్యక్తం చేశారు. బిగ్ స్క్రీన్‌పై మ్యాచ్ వీక్షించిన ఆయన ఒక్కసారిగా చిందులు వేస్తూ కనిపించారు. ఈ సాలా కప్ నమ్దే అంటూ సంబురాలు చేసుకున్నారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. Happy Birthday Prashanth!Your vision speaks louder than words. Here’s to more fire on screen… pic.twitter.com/fv2bxGaEMJ— Jr NTR (@tarak9999) June 4, 2025 -
బెంగళూరు గెలుపు.. పూనకంతో ఊగిపోయిన స్టార్ డైరెక్టర్
ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ గెలవడంతో ఫ్యాన్స్ ఫుల్ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. రోడ్లపైకి వచ్చిన విక్టరీని ఎంజాయ్ చేశారు. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సైతం బెంగళూరు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. మ్యాచ్ ముగిసిన వెంటనే డ్యాన్స్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. కేజీఎఫ్‌తో బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టిన ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం మన యంగ్ టైగర్‌తో సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రానున్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీని ఎన్టీఆర్-నీల్ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. Director #PrashanthNeel is overjoyed as he celebrates #RCB’s victory in IPL 2025🏆#IPL2025Final #TeluguFilmNagar pic.twitter.com/tnXGeqqkem— Telugu FilmNagar (@telugufilmnagar) June 3, 2025 -
ఐపీఎల్ ఫైనల్.. వార్-2 టీమ్ స్పెషల్ సర్ప్రైజ్!
బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2ట'. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మొదటి సారిగా ఎన్టీఆర్ విలన్ పాత్రలో కనిపించనుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హృతిక్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా వార్-2 గ్లింప్స్ విడుదల చేసిన మేకర్స్ మరో సర్ప్రైజ్కు సిద్ధమయ్యారు.ఇవాళ జరగనున్న ఐపీఎల్ ఫైనల్లో మ్యాచ్‌లో వార్-2ను ప్రమోట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ స్పెషల్ ప్రోమోలను స్టేడియంలో ప్రసారం చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో హృతిక్, ఎన్టీఆర్‌ల పాత్రలకు సంబంధించిన వీడియోను ఓవర్ బ్రేక్‌ల మధ్య దాదాపు పది సెకన్ల పాటు ప్రసారం చేయనున్నారని సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ట్విటర్ వేదికగా ఆయన పంచుకున్నారు. మరోవైపు ఈ చిత్రంలో గేమ్ ఛేంజర్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారు. కాగా.. ఇవాళ జరిగే ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్, బెంగళూరు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. 'WAR 2' 10-SECOND PROMOS TO PREMIERE DURING IPL 2025 FINALS... The 10-second promos of #War2 – starring #HrithikRoshan, #JrNTR and #KiaraAdvani – will premiere on #JioHotstar during the #RCB vs #PBKS #IPLFinals tomorrow [3 June 2025]. #RCBvsPBKS pic.twitter.com/hPvvUBc6F1— taran adarsh (@taran_adarsh) June 2, 2025 -
ఎన్టీఆర్ అసలైన వారసుడు జూనియరే
-
టీడీపీ మహానాడు కార్యక్రమంలో కనిపించని ఎమ్మెల్యే బాలకృష్ణ, జూ ఎన్టీఆర్
-
NTR Jayanthi : ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ. ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ నివాళి (చిత్రాలు)
-
ఘనంగా ఎన్టీఆర్ 102వ జయంతి.. నివాళి అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
-
అదుర్స్ నటుడు మృతి.. జూనియర్ ఎన్టీఆర్ సంతాపం
బాలీవుడ్ నటుడి మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ సంతాపం తెలిపారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా ఆయనకు నివాళులర్పించారు. ముకుల్ దేవ్ మృతి చెందడం బాధాకరం.. ఈ విషాద సమయంలో అదుర్స్ మూవీలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నామని రాసుకొచ్చారు. కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.. ఓం శాంతి అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.కాగా..బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్(54) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. సీరియల్ నటుడిగా కెరీర్ ప్రారంభించిన ముకుల్ దేవ్ (Mukul Dev) బాలీవుడ్ మూవీ ‘దస్తక్’తో వెండితెరకి పరిచయం అయ్యాడు. హిందీతో పాటు తెలుగు, పంజాబీ, కన్న చిత్రాల్లోనూ నటించాడు.ముకుల్ దేవ్‌కి టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు ఉంది. తెలుగులో కృష్ణ, ఏక్ నిరంజన్, కేడీ, అదుర్స్, నిప్పు, భాయ్ తదితర సినిమాల్లో నటించాడు. కృష్ణ సినిమాలో పోషించిన విలన్ పాత్ర మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. 2022లో విడుదలైన ‘అంత్ ది ఎండ్’ తర్వాత ఆయన సినిమాల్లో కనిపించలేదు. సింహాద్రి, సీతయ్య, అతడు చిత్రాల్లో నటించారు. Saddened by the passing of Mukul Dev garu. Remembering our time in Adhurs and his commitment to the craft. My condolences to his family. Om Shanti. 🙏 pic.twitter.com/Rp4HsrLR2I— Jr NTR (@tarak9999) May 24, 2025 -
ఎన్టీఆర్ తో శృతి హాసన్..?
-
ఈ ప్రేమ చాలా విలువైనది: ఎన్టీఆర్
‘‘వార్ 2’ టీజర్‌కి ప్రజల నుంచి వస్తున్న ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే నేను నటుణ్ణి అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతటి ప్రేమ లభించడం ఒక వరంలా అనిపిస్తోంది. మీరు చూపించే ఈ ప్రేమ నాకు చాలా విలువైనది’’ అని హీరో ఎన్టీఆర్ అన్నారు. హృతిక్ రోషన్, కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ హిందీ పరిశ్రమకి పరిచయమవుతున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్‌పై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘వార్ 2’ టీజర్‌ని విడుదల చేశారు. ఈ టీజర్‌కు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చినట్లు చిత్రయూనిట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్పందిస్తూ– ‘‘వార్ 2’లో నా పాత్ర నాకు చాలా ప్రత్యేకమైనది. నన్ను పూర్తిగా కొత్తగా చూపించారు. యూనిట్ అంతా సరదాగా కలిసి పని చేశాం. థియేటర్లో మీ స్పందన చూడటానికి నాకు మరింత ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది. ‘వార్ 2’ మీద మీరు చూపిస్తున్న ప్రేమకు థ్యాంక్స్. దేశంలోని ప్రతి మూల నుంచి వస్తున్న ప్రేమని చూసి ఉప్పొంగిపోయాను. టీజర్ ఇంతటి ప్రభావం చూపించడం సంతోషంగా ఉంది. ఆగస్టు 14 నుంచి థియేటర్లలో అభిమానుల సందడి చూసేందుకు నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. -
వార్ 2 డైరెక్టర్ పై మండిపడుతున్న Jr. NTR ఫ్యాన్స్.. కారణం అదేనా
-
'వార్ 2' మొదలైంది.. టీజర్లో ఈ షాట్స్ గమనించారా? (ఫోటోలు)
-
పెట్టుబడుల్లో బాద్షా ఈ దేవర
ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ నటనలో ప్రతిభ కనబరచడంతోపాటు పెట్టుబడులపై ఆసక్తి ఉన్న తెలివైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందుతున్నారు. వెండితెర ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించిపెట్టినప్పటికీ, అతడి ఆర్థిక చతురత, వ్యూహాత్మక పెట్టుబడులు వ్యాపార మొఘల్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేశాయి. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా..డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్స్జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు అతీతంగా ఆకట్టుకునే ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోను నిర్మించారు. హైదరాబాద్, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సుమారు రూ.25 కోట్ల విలువైన విలాసవంతమైన భవనం సహా ఆయన ఆస్తులు విభిన్న రంగాల్లో విస్తరించాయి. ఎన్టీఆర్ విలాసవంతమైన జీవనశైలికి, ఆర్థిక విజయానికి నిదర్శనంగా రూ.80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉంది. రేంజ్ రోవర్, బీఎండబ్ల్యూ, పోర్షే, లంబోర్ఘిని ఉరుస్ వంటి హై-ఎండ్ బ్రాండ్ కార్లను కలిగి ఉన్నారు.సంపదను పెంచుకోవాలని, వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టాలని చూస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎన్టీఆర్ వ్యాపార మనస్తత్వం ఎన్నో విలువైన పాఠాలను నేర్పుతుంది. రియల్ ఎస్టేట్, ప్రొడక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లగ్జరీ అసెట్స్‌లో ఎన్టీఆర్ విజయవంతంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్టర్లు తమ వనరులన్నింటినీ ఒకే రంగంలో పెట్టుబడి పెట్టడం మానుకోవాలి. అందుకు బదులుగా స్థిరమైన ఆర్థిక వృద్ధి కోసం బహుళ పరిశ్రమల్లో ఇన్వెస్ట్ చేయాలనే అందులో దాగిఉంది.ఇదీ చదవండి: మెహుల్ చోక్సీకి రూ.2 కోట్ల డిమాండ్ నోటీసుజూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ ఎండార్స్మెంట్లలో కొన్ని..మలబార్ గోల్డ్ & డైమండ్స్అప్పీ ఫిజ్బోరో ప్లస్ పౌడర్జాండు బామ్నవరత్న ఆయిల్ -
ఎన్టీఆర్ 'వార్ 2' టీజర్ విడుదల.. యుద్ధానికి సిద్ధమా..?
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుక వచ్చేసింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన హిందీ చిత్రం ‘వార్ 2’ నుంచి అదిరిపోయే టీజర్ విడుదలైంది. తారక్‌ను ప్రధానంగా హైలెట్ చేస్తూ వీడియో ఉండటంతో ఆయన ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఇందులో తారక్ కిల్లర్ బాడీకి హృతిక్ రోషన్ లుక్స్ తోడు కావడంతో అటు బాలీవుడ్‌ను కూడా ఊపేయడం ఖాయమని చెప్పవచ్చు. టీజర్‌ను చూస్తే భారీ యాక్షన్ సీన్స్‌తో ఆకట్టుకునేలా సినిమా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా తెలుగు, హిందీ, తమిళ్ వర్షన్లో టీజర్ విడుదలైంది. అయితే, అన్ని భాషల్లో కూడా తారక్‌నే డబ్బింగ్ చెప్పాడు.ఈ ఏడాది ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఆదిత్యా చోప్రా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తున్నారు.వార్తో ‘ఎన్టీఆర్ నీల్’కు బ్రేక్ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్) నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ‘వార్ 2’ నుంచి అప్డేట్ రావడంతో ‘ఎన్టీఆర్ నీల్’ అప్డేట్ని పోస్ట్‌పోన్ చేసినట్లు ప్రకటించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 జూన్ 25న రిలీజ్ కానుంది. -
ఎన్టీఆర్ పుట్టినరోజు ప్రత్యేకం.. అందుకే ఆల్‌రౌండర్ అయ్యాడు
జూనియర్ ఎన్టీఆర్‌కు ఒక చరిత్ర ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ అంశ ఈ తారకరాముడు. నందమూరి వంశంలో నేడు అత్యంత ప్రజాదరణ కలిగిన ఏకైక నటుడు.. ఒకరకంగా చెప్పాలంటే నందమూరి అనే బ్రాండ్‌కు తారక్ ఒక ఐకాన్ అని చెప్పవచ్చు. బాల నటుడిగా తెరంగేట్రం చేసి, నూనూగు మీసాల వయసులోనే బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డ్లను దాటుకుంటూ విరుచుకపడ్డాడు. ఇండస్ట్రీలో అందరూ తారక్‌ను ఆల్‌రౌండర్ అంటారు.. దానికి కారణం భారీ డైలాగ్స్, కళ్లు చెదిరే డ్యాన్స్, దుమ్మురేపే యాక్షన్ సీన్స్, కంటతడి పెట్టించే నటన ఇలా అన్నింటిలోనూ ఆయన అగ్రగామి. క్లాస్, మాస్ అంటూ తేడా ఉండదు. సినీ అభిమానులు అందరూ ఆయనకు ఫ్యాన్సే.. నటనలో తారక్ తర్వాతే ఎవరైనా.. అనేలా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని చిత్రపరిశ్రమలో సెట్ చేశాడు. నేడు ఎన్టీఆర్ (NTR) పుట్టిన రోజు (1983 మే 20).. ఈ సందర్భంగా ఆయన గురించి పలు విషయాలపై ఓ లుక్కేద్దాం (Happy Birthday NTR)..తారక్ @ 'మ్యాన్ ఆఫ్ మాసెస్'ఇండియన్ సినిమాలో ఎందరో సూపర్ స్టార్స్, మెగాస్టార్స్, పవర్ స్టార్స్ ఉన్నారు కానీ యంగ్ టైగర్‌కు మాత్రమే ఉన్న ఏకైక బిరుదు 'మ్యాన్ ఆఫ్ మాసెస్'. ఈ బిరుదుకు ప్రధాన కారణం ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ అలాంటిది. ఇండియన్ మార్కెట్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఆయన చేరుకున్న తీరు అందరనీ ఆశ్చర్యపరుస్తుంది. కింద పడిన ప్రతిసారి సాలిడ్ బౌన్స్ బ్యాక్‌తో తిరిగొచ్చాడు.తారక్ జీవితంలో ఇవన్నీ ప్రత్యేకం🎥 తారక్ 1983 మే 20న జన్మించారు. హైదరాబాద్‌లోని విద్యారణ్య స్కూల్లో చదివిన ఆయన సెయింట్ మేరీ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.🎥 పదేళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్రతో బాల నటుడిగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా నుంచే జూనియర్ ఎన్టీఆర్ అని పిలిచేవారు.🎥ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి చిత్రం 'నిన్ను చూడాలని'. ఈ సినిమాకు ఆయన రూ.3.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్. ఆ మొత్తాన్ని తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చారట.🎥 యమదొంగ, కంత్రి, అదుర్స్, రభస, నాన్నకు ప్రేమతో సినిమాలతో గాయకుడిగానూ తారక్ మెప్పించారు.🎥 జపాన్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తెలుగు హీరో తారక్. బాద్షా సినిమా జపాన్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది.🎥 'ఆది' సినిమాలో భారీ డైలాగులు చెప్పగలడా? అని కొందరు పరుచూరి బ్రదర్స్ దగ్గర సందేహించారట. కానీ, ఎన్టీఆర్ వాటంన్నిటినీ సింగిల్ టేక్‌లో చెప్పడంతో తన స్టామినా ఏంటో నిరూపించారు. ఈ సినిమాకు తారక్ నంది అవార్డు సొంతం చేసుకున్నారు.🎥 నంబర్ 9 అంటే తారక్‌కు సెంటిమెంట్. ఆయన వాహనాల నంబర్లన్నీ 9తోనే ప్రారంభమవుతాయి. ఓ కారు కోసం 9999 అనే ఫ్యాన్సీ నంబర్‌ను రూ. 10లక్షలతో కొనుగోలు చేసి 9 అంటే ఎంత ఇష్టమో తెలిపారు.🎥 మాతృదేవోభవ చిత్రంలోని ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాట అంటే ఎన్టీఆర్‌కు చాలా ఇష్టం.🎥 'ఫోర్బ్స్ ఇండియా' సెలబ్రిటీ లిస్ట్‌లో రెండు సార్లు నిలిచాడు.🎥 పూరీ జగన్నాథ్- ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన 'ఆంధ్రావాలా' సినిమా ఆడియో విడుదల వేడుక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ చెరగని రికార్డు నెలకొల్పింది. ఈ వేడుకలో దాదాపు 10లక్షల మంది తారక్ అభిమానులు పాల్గొన్నారు. నిమ్మకూరులో జరిగిన ఈ కార్యక్రమం కోసం రైల్వే అధికారులు కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.🎥సుమారుగా 8 భాషల్లో ఎన్టీఆర్ అనర్గళంగా మాట్లాడగలడు. తన వాగ్ధాటితో ఇప్పటికే అన్ని చిత్ర పరిశ్రమల వారిని ఆకర్షించాడు.🎥 2016లో వచ్చిన జనతా గ్యారేజ్‌తో కింగ్ ఆఫ్ బాక్సాఫీస్ అవార్డును IIFA నుంచి అందుకున్నాడు🎥కంత్రి, అదుర్స్,బృందావనం చిత్రాలకు గాను ఉత్తమ హీరోగా ఫిలింఫేర్ అవార్డులను అందకున్న తారక్🎥 బాల రామాయణము,ఆది నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందకున్నాడు 🎥తారక్‌కు ఫేవరెట్ సినిమా 'దాన వీర శూర కర్ణ'. ఇప్పటికి ఈ సినిమాను వందసార్లకు పైగా చూశారట🎥 తారక్- ప్రణతిలకు ఇద్దరు అబ్బాయిలు (అభయ్, భార్గవ్). కాగా, కూతురు లేదనే లోటు ఎప్పటికీ ఉంటుందని ఎన్టీఆర్ ఓ సందర్భంలో చెప్పారు.🎥 జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్, తారక్, దేవర అయనకున్న పేర్లు🎥అమ్మ (శాలనీ) చిరకాల కలను తీర్చిన తారక్.. ఆమె స్వగ్రామం కుందాపురంలో ఉన్న ఉడుపి శ్రీకృష్ణ ఆలయ దర్శనం చేసుకోవాలనే ఆమె కోరికను కొడుకుగా తీర్చాడు. -
జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)
-
రబ్బరు గాజులు సాంగ్.. థియేటర్లోనే ఇరగదీసిన ఫ్యాన్స్!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్- దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం యమదొంగ. 2007లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. అప్పట్లో థియేటర్లలో ఓ రేంజ్లో వసూళ్లు రాబట్టింది. అయితే ఈ నెల 20న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. ఈ అత్యాధునిక టెక్నాలజీతో అభిమానులు సినిమాను ఈరోజు థియేటర్లలో ప్రదర్శించారు.అయితే ఈ సినిమాను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ హడావుడి మామూలుగా లేదు. ఈలలు, కేకలతో థియేటర్లను హోరెత్తించారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత యమదొంగ బిగ్ స్క్రీన్‌పై సందడి చేయడంతో అభిమానులు ఆనందంలో చిందులు వేశారు. రబ్బరు గాజులు పాట రాగానే పూనకంతో ఊగిపోయారు. ఈ సినిమా చూస్తూ థియేటర్లో రబ్బర్ గాజులు సాంగ్‌కు స్టెప్పులు వేస్తూ అలరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(ఇది చదవండి: ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్.. థియేటర్స్‌లో ‘యమదొంగ’)కాగా.. ఈ చిత్రంలో మోహన్ బాబు యమధర్మరాజు పాత్రలో మెప్పించారు. ఈ మూవీలో ప్రియమణి, మమత మోహన్‌దాస్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఇద్దరి ఇరగదీశారు మాటల్లేవ్ 💟💟❤️🔥❤️🔥ఇదేం క్రేజీ రా బాబు మామూలుగా లేదుగా సెలబ్రేషన్ 😍😍🥵🥵👌👌#Yamadonga4K @tarak9999 #ManOfMassesNTR pic.twitter.com/ZN1j0zj5kF— Shivam🐉🔱🚩 (@tarak9999SM) May 19, 2025 -
యంగ్ టైగర్ బర్త్ డే.. వార్-2 అప్డేట్ వచ్చేసింది!
బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలకు ముందే సంచలనాలు నమోదు చేయడం మొదలైంది. హృతిక్, ఎన్టీఆర్ కాంబినేషన్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 14, 2025న విడుదల కానుంది. ఈ చిత్రంలో మొదటి సారిగా ఎన్టీఆర్ విలన్ పాత్రలో కనిపించనుండటంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో వార్ -2 మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా వార్-2 గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ పంచుకున్నారు. జూనియర్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ పోస్టర్ షేర్ చేశారు. ఈ తాజా ప్రకటనతో వార్-2 అప్డేట్స్ కోసం ఎదురు చూస్తోన్న యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ చిత్రంలో గేమ్ ఛేంజర్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.అత్యధిక ధరకు తెలుగు రైట్స్..తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వార్ 2 పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్, దేవర... ఎన్టీఆర్ నటించిన మూవీ కావడంతో సినిమా రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమా ప్రాంతీయ హక్కుల కోసం ఎదురైన గట్టి పోటీని తట్టుకుని చివరికి ప్రముఖ నిర్మాతలు నాగ వంశీ, సునీల్ నారంగ్ ఈ డీల్‌ను చేజిక్కించుకున్నారు. విడుదలకి ముందే ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ హక్కులు రూ. 85–100 కోట్ల మధ్య ధరల్లో అమ్ముడైపోయాయని వార్తలొస్తున్నాయి. #HappyBirthdayNTR Can’t wait for this BANGER 💥💥💥💥💥💥 pic.twitter.com/2hg9aAZgNJ— thaman S (@MusicThaman) May 19, 2025 -
దేవర 2 లో మరో హీరో..!
-
నో అప్డేట్!
హీరోల పుట్టినరోజు వస్తోందంటే అభిమానుల జోష్ మామూలుగా ఉండదు. తమ అభిమాన హీరో నటిస్తున్న సినిమాల నుంచి కొత్తపోస్టర్, టైటిల్, టీజర్... ఇలా ఏదో ఒక అప్డేట్ వస్తుందని ఆశిస్తుంటారు. అయితే ఈసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఈ హీరో నటిస్తున్న తెలుగు సినిమా అప్డేట్ ఏమీ ఉండదు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్).ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. కాగా ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘ఎన్టీఆర్ నీల్’ నుంచి అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశించారు. అయితే.. ఆ రోజు ఎటువంటి అప్డేట్ ఉండదని మేకర్స్ స్పష్టం చేశారు.హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన హిందీ చిత్రం ‘వార్ 2’ నుంచి ఎన్టీఆర్ అప్డేట్ రానుండటంతో ‘ఎన్టీఆర్ నీల్’ అప్డేట్నిపోస్ట్΄ోన్ చేసినట్లు ప్రకటించారు. ఇక ‘వార్’ ఈ ఏడాది ఆగస్టు 14న, ‘ఎన్టీఆర్ నీల్’ 2026 జూన్ 25న రిలీజ్ కానున్నాయి. ఇదిలా ఉంటే... ఎన్టీఆర్, ప్రియమణి జంటగా, మోహన్‌బాబు, మమతా మోహన్‌దాస్ కీలకపాత్రల్లో రూపొందిన చిత్రం ‘యమదొంగ’. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఎన్టీఆర్ బర్త్ డేని పురస్కరించుకుని నేడు రీ రిలీజ్ చేస్తున్నారు. -
ఎన్టీఆర్ బర్త్‌డే స్పెసల్.. థియేటర్స్‌లో ‘యమదొంగ’
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మోహన్ బాబు, ప్రియమణి, మమత మోహన్‌దాస్ కాంబినేషన్లో వచ్చిన ఐకానిక్ సోషియో ఫాంటసీ చిత్రం ‘యమదొంగ’(Yamadonga) బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా ఈ చిత్రాన్ని మే 18 నుంచి రీ రిలీజ్ చేయనున్నారు.రీ రిలీజ్ కోసం టీం అమితంగా శ్రమించినట్లు తెలుస్తోంది. ‘యమదొంగ’ను 8Kలో స్కాన్ చేసి, 4K నాణ్యతకు కుదించి, అసాధారణమైన దృశ్య అనుభవాన్ని అందించేలా సిద్ధం చేశారు. ఈ అత్యాధునిక టెక్నాలజీతో అభిమానులు సినిమాను మరింత ఉన్నత నాణ్యతలో ఆస్వాదించవచ్చు.సోషల్ మీడియాలో ‘యమదొంగ’ రీ రిలీజ్ సందడి జోరుగా సాగుతోంది. ప్రధాన నటీమణులు ప్రియమణి, మమత మోహన్‌దాస్ షూటింగ్ రోజుల జ్ఞాపకాలను పంచుకుంటూ విడుదల చేసిన వీడియోలు అందరినీ ఆకట్టుకున్నాయి. రాజమౌళి దర్శకత్వ విజన్, ఎంఎం కీరవాణి సంగీతంతో ‘యమదొంగ’ మరోసారి తెరపై సందడి చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు. -
దాదా సాహెబ్ ఫాల్కే గెటప్‌లో ఎన్టీయార్ స్టిల్స్ బయటకు...
దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి అనే పేరు సెన్సేషన్ అనే పదం రెండూ చెట్టాపట్టాలేసుకుని పక్కపక్కనే నడుస్తుంటాయి. ప్రస్తుతం మహేష్‌బాబుతో సినిమాకు సంబంధించి ఒక్క వార్తా బయటకు రాకుండా సినీ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్... ఇటీవలే తాను తీయబోయే మహాభారతం సినిమా గురించి ఓ అప్డేట్గా హీరో నాని కి పాత్ర ఇవ్వనున్నట్టు చెప్పి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో ఇప్పుడు మరోసారి ఆయన అంతకు మించిన సంచలనాన్ని సృష్టించారు. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ను సినిమాగా సమర్పించబోతున్నానని ప్రకటించారు.అంతేకాదు ఆయన చేసిన ప్రకటనను బట్టి చూస్తుంటే ఆ సినిమాలో కధానాయకుడి పాత్రను జూ.ఎన్టీయార్ పోషించబోతున్నారని దాదాపుగా రూఢీ అయింది. నిజానికి ఇది ఆయన రెండేళ్ల నాడే చెప్పిందే అయినప్పటికీ... ముడి సరకు అంతా రెడీ అయిపోయింది... ఇక షూటింగ్ పట్టాలెక్కబోతోంది అని ఆయన ప్రకటనతో తేలిపోయింది.తాజాగా ఆయన చేసిన పోస్ట్ ఇలా ఉంది..‘‘నేను మొదటిసారి కథ విన్నప్పుడు, అది నన్ను మరేదీ లేని విధంగా భావోద్వేగపరంగా కదిలించింది. బయోపిక్‌ను సినిమాగా తీయడం చాలా కష్టం, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా గురించి ఊహించడం మరింత సవాలుతో కూడుకున్నది. అయితే మా అబ్బాయిలు దానికి సిద్ధంగా ఉన్నారు సగర్వంగా, మేడ్ ఇన్ ఇండియాను ప్రజంట్ చేస్తున్నాను’’రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రకటించి రెండు సంవత్సరాలు అయింది. అప్పుడే ఈ చిత్రానికి మేడ్ ఇన్ ఇండియా అని పేరు పెట్టారు. ఇలా రాజమౌళి పోస్ట్ చేశారో లేదో... అలా ఈ పాత్రకు ఎన్టీయార్ పోషించబోతున్నారని వార్తలు వ్యాపించాయో లేదో... అంతే... ఆధునిక సాంకేతిక యుగపు నిపుణులు తమ టాలెంట్‌కు పదును పెట్టారు.దాదా సాహెబ్ ఫాల్కే పాత్రలో యంగ్ టైగర్ ఎలా ఉంటాడు అనేదానిపై తమ ఊహలకు రూపాల్ని ఇస్తున్నారు. వారికి అత్యాధునిక ఏఐ వంటి టెక్నాలజీలు తోడయ్యాయి. దాంతో జూనియర్ ఎన్టీఆర్ దాదా గెటప్ చిత్రాలు ఇంటర్నెట్లో తుఫానుగా మారాయి, ఏఐ రూపొందించిన ఈ చిత్రాలలో జూనియర్ ఎన్టీఆర్ దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో ఇమిడిపోయినట్టు కనిపిస్తున్నాడు, ఖాదీ కుర్తా ధరించి, కళ్ళద్దాలు గడ్డం తో ఆకట్టుకుంటున్నాడు. ఈ చిత్రాన్ని వరుణ్ గుప్తా (మాక్స్ స్టూడియోస్) ఎస్ఎస్ కార్తికేయ (షోయింగ్ బిజినెస్) నిర్మిస్తారు. నిర్మాతలు స్క్రిప్ట్ పై పనిలో బిజీగా ఉన్నారు మరియు తుది డ్రాఫ్ట్‌ను పూర్తి చేస్తున్నారు.ఓ రకంగా ఇది భారతీయ సినిమా కధ అని చెప్పొచ్చేమో... ఎందుకంటే.. ఈ సినిమా కథాంశం భారతీయ సినిమా పుట్టుక పెరుగుదలకు అద్దం పట్టనుంది. మరోవైపు మేడ్ ఇన్ ఇండియా సినిమా జూనియర్ ఎన్టీఆర్‌కు యాక్షన్ చిత్రాల నుంచి ఒక్కసారిగా రిఫ్రెషింగ్ బ్రేక్ అవుతుంది అనేది నిర్వివాదం.ఇదిలా ఉంటే.. అటు బాలీవుడ్‌లోనూ ఆమిర్‌ఖాన్ - రాజ్‌కుమార్ హిరాణీ కలయికలో ఈ బయోపిక్ రూపొందుతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై దాదాసాహెబ్ ఫాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ స్పందిస్తూ.. రాజమౌళి సమర్పణలో ఈ ప్రాజెక్ట్ వస్తున్నట్లు వార్తలు వచ్చాయి కానీ.. ఆయన టీమ్ ఇంతవరకు నన్ను సంప్రదించలేదు. కానీ ఆమిర్-రాజ్ కుమార్ హిరానీ టీమ్ మూడేళ్లుగా నాతో టచ్‌లో ఉన్నారు’ అని చెప్పారు. మరి రాజమౌళి సినిమా ఉంటుందో లేదో తెలియదు కానీ ఎన్టీఆర్ ఏఐ ఫోటోలు అయితే నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. History meets legacy. Jr. NTR becomes the face of a revolution — portraying the man who gave India its first cinematic heartbeat: Dadasaheb Phalke.”@tarak9999 as Dada Saheb Phalke@ssrajamouli @dpiff_official #historyofcinema #DadasahebPhalke #jrntr #ntrasdadasahebphalke pic.twitter.com/kdyUjoX16t— House Of 24 (@of_2491841) May 15, 2025 -
హాయ్.. తారక్, మే 20న నువ్వు ఊహించలేని గిఫ్ట్ ఉంది: హృతిక్
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న 'వార్2' సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారందరి కోసం తాజాగా హృతిక్ ఒక శుభవార్త చెప్పారు. టీజర్ ఎప్పుడు విడుదలౌతుందో ప్రకటించారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఆదిత్యా చోప్రా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీ నటిస్తున్నారు. తన పాత్రకూ కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయని తెలిసింది.హృతిక్ రోషన్(Hrithik Roshan) తాజాగా తారక్‌ను ట్యాగ్ చేస్తూ సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. 'హాయ్.. తారక్ ఈ సంవత్సరం మే 20న ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా..? సిద్ధంగా ఉండు నువ్వు ఊహించలేని గిఫ్ట్ ఉంటుంది' అని ఆయన పంచుకున్నారు. ఈ సారాంశాన్ని చూస్తే వార్2 టీజర్ ఆరోజున విడుదల కావచ్చని తెలుస్తోంది. మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజు ఉంది. కాబట్టి ఆరోజు ఈ సినిమా నుంచి తప్పకుండా టీజర్ విడుదల కా 2019లో హిట్‌గా నిలిచిన హిందీ చిత్రం ‘వార్’కు సీక్వెల్‌గా ‘వార్ 2’ తెరకెక్కుతుంది. ఈ సినిమాపై టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఆగష్టు 14న విడుదల కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్‌గా నటించనున్నారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. గతంలో షారుక్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, హృతిక్ రోషన్లు రా ఏజెంట్ పాత్రలలో నటించి అక్కడ మంచి గుర్తింపుతో పాటు విజయాన్ని అందుకున్నారు. అయితే, వార్2లో వీటన్నింటికంటే భిన్నంగా ఎన్టీఆర్ పాత్ర ఉందని తెలుస్తోంది. ఆపై ఈ మూవీలో హృతిక్ - ఎన్టీఆర్‌లపై అదిరిపోయే సాంగ్‌ను ప్లాన్ చేశారట . దాదాపు 500మంది డ్యాన్సర్లుతో వారు స్టెప్పులేశారట.Hey @tarak9999, think you know what to expect on the 20th of May this year? Trust me you have NO idea what’s in store. Ready?#War2— Hrithik Roshan (@iHrithik) May 16, 2025