ఆలియా ఆగమనం నిజమేనా? | Alia Bhatt in Talks for Key Role in Jr NTR and Prashanth Neel Dragon | Sakshi
Sakshi News home page

ఆలియా ఆగమనం నిజమేనా?

Apr 22 2026 1:56 AM | Updated on Apr 22 2026 1:56 AM

Alia Bhatt in Talks for Key Role in Jr NTR and Prashanth Neel Dragon

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌. ఆ తర్వాత ఆలియా భట్‌ హీరోయిన్‌గా చేయనున్నారంటూ కొన్ని పెద్ద తెలుగు సినిమాల పేర్లు వినిపించినప్పటికీ ఏదీ ఫైనలైజ్‌ కాలేదు. తాజాగా ఆలియా భట్‌ పేరు మరోసారి ప్రస్తావనకు వచ్చింది. కానీ హీరోయిన్‌గా కాదు...  కథలో ఓ కీలక  పాత్ర కోసం ఆలియా భట్‌ను సంప్రదించారట. ఎవరంటే...‘డ్రాగన్‌’ సినిమా (ప్రచారంలో ఉన్న టైటిల్‌) టీమ్‌. ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘డ్రాగన్‌’.

ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు కీలకమైన  పాత్రలో అనిల్‌ కపూర్‌ నటిస్తున్నారని తెలిసింది. కథను మలుపు తిప్పే మరో లీడ్‌ రోల్‌లో నటించనున్నారంటూ శ్రుతీహాసన్, రష్మికా మందన్నా, కాజోల్‌... వంటి వార్ల పేర్లు వినిపించాయి. తాజాగా ఆలియా భట్‌ పేరు తెరపైకి వచ్చింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రామ్‌చరణ్‌ మరో హీరో) సినిమాలో హీరో ఎన్టీఆర్, ఆలియా భట్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు.

మరి... మరోసారి ‘డ్రాగన్‌’ సినిమా కోసం ఎన్టీఆర్, ఆలియా భట్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటారా? టాలీవుడ్‌కు మరోసారి ఆలియా ఆగమనం నిజమేనా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. మైత్రీ మూవీమేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకాలపై  కల్యాణ్‌ రామ్‌ నందమూరి, నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్‌ 11న రిలీజ్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement