అభిమానికి ఊహించని షాకిచ్చిన ఎన్టీఆర్‌! | Jr NTR Make Cookies First Time, Send To Fan | Sakshi
Sakshi News home page

అభిమానికి ఊహించని షాకిచ్చిన ఎన్టీఆర్‌!

Jun 6 2026 1:21 PM | Updated on Jun 6 2026 1:54 PM

Jr NTR Make Cookies First Time, Send To Fan

అభిమానులకు రకరకాల కోరికలు ఉంటాయి. తమ అభిమాన హీరోని ఒక్కసారైనా కలవాలి.. ఆయనతో కాసేపు మాట్లాడాలి.. వీలైతే కలిసి భోజనం చేయాలి.. కనీసం ఒక సెల్ఫీ అయినా దిగాలి.. ఇలాంటి డ్రీమ్స్ చాలానే ఉంటాయి.

నిజానికి వీటిలో చాలా వరకు నెరవేరని కోరికలే అని అభిమానులకు కూడా బాగా తెలుసు. కానీ, ఆరాధించే గుండెకు లాజిక్కులు తెలియవు కదా! అందుకే నెరవేరుతుందో లేదో తెలియకపోయినా.. సరదాగానైనా సరే, తమ మనసులోని ఆ ముచ్చటను బయటపెడుతుంటారు. అయితే ఇలా సరదాగా అడిగిన కోరికను హీరో నిజం చేస్తే మాత్రం..ఆ అభిమాని షాకవ్వడం మాత్రం గ్యారెంటీ. తాజాగా టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ అలాంటి పనే చేసి అభిమానికి షాకిచ్చాడు. వివరాల్లోకి వెళ్లితే..

ఎన్టీఆర్‌కు వంటలు చేయడం చాలా ఇష్టం. ఖాలీ సమయం దొరికితే కిచెన్‌లోకి దూరిపోతుంటాడు. బిర్యానీ చేయడంతో ఆయన దిట్ట. అయితే ఈ సారి మాత్రం కాస్త వెరైటీ వంటకం ట్రై చేశాడు. పిల్లలకు చాలా ఇష్టమైన కుకీలు రెడీ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఎక్స్‌లో షేర్‌ చేస్తూ.. అవి కొన్నవి కాదని, స్వయంగా తయారు చేశానని చెప్పుకొచ్చాడు.

ఎన్టీఆర్‌ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. పలువు అభిమానులు ఎన్టీఆర్‌ని పొడుగుతూ కామెంట్స్‌ పెట్టారు. అయితే ఓ అభిమాని తన హీరోకి సరదాగా ఓ విజ్ఞప్తి చేశాడు. ‘మా ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. రెండు కుకీలు పంపించు అన్న’అని ట్వీట్‌ చేశాడు. దానికి ఎన్టీఆర్‌ సరదగా స్పందిస్తూ.. ‘అడ్రస్‌ పెట్టు’ అంటూ బ్రహ్మానందం వీడియోని పెట్టాడు. అది చూసి సదరు అభిమాని ఆశ్చర్యపోయాడు. ‘అన్నా.. జన్మ ధన్యమైంది’ అంటూ తన ఇంటి అడ్రస్‌ చెప్పాడు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ నిజంగానే తాను తయారు చేసిన కుకీస్‌ని అతనికి పంపించేశాడు. ఇది చూసి సదరు అభిమాని ఆనందంతో ఉబ్బితబ్బిపోయాడు. ‘కాళ్లు, చేతులు వణుకుతున్నాయి. కన్నీళ్లను ఆపుకోలేకతున్నాను’ అంటూ తారక్‌ పంపిన కుకీల ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement