అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్.. పిల్లలు ఫుల్ హ్యాపీ | Jr Ntr Fulfilled a fan request for his Children goes viral | Sakshi
Sakshi News home page

Jr NTR: అభిమాని కోరిక తీర్చిన ఎన్టీఆర్.. పిల్లలు ఫుల్ హ్యాపీ

Jun 7 2026 2:25 PM | Updated on Jun 7 2026 3:26 PM

Jr Ntr Fulfilled a fan request for his Children goes viral

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఓ అభిమాని కోరిన వెంటనే అతని ఆకాంక్షను నెరవేర్చాడు. తన ఇద్దరు పిల్లల కోసం రెండు కుకీస్ పంపమని ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా కోరాడు. ఇది చూసిన ఎన్టీఆర్ మీ అడ్రస్ పెట్టు పంపిస్తా అంటూ రిప్లై ఇచ్చారు.

అతనికి మాటిచ్చినట్లుగానే తన ఆటోగ్రాఫ్‌తో కూడిన కుకీస్‌ను పంపి అభిమాని కోరిక తీర్చాడు. వాటిని స్వయంగా ఎన్టీఆర్ తయారు చేసి మరి పంపించాడు. తమ రిక్వెస్ట్‌కు స్పందించి కుకీస్ పంపడంతో ఆ ‍అభిమాని ఆనందం పట్టలేకపోయారు. జూనియర్ పంపిన కుకీస్‌ను అతని పిల్లలు తింటుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఆ ఫ్యామిలీ ఆనందంలో మునిగిపోయింది.

ఇక జూనియర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌తో పనిచేస్తున్నారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా కాంతార ఫేమ్ రుక్మిణి వసంత్ కనిపించనుంది. 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement