బీస్ట్‌ మోడ్‌కి సిద్ధం | Jr NTR And Prashanth Neel All Set For Dragon Next Schedule, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

బీస్ట్‌ మోడ్‌కి సిద్ధం

Nov 7 2025 12:51 AM | Updated on Nov 7 2025 12:57 PM

Jr NTR and Prashanth Neel all set for Dragon next schedule

హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ‘ఎన్టీఆర్‌నీల్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా షూటింగ్‌కి కొన్ని కారణాల వల్ల బ్రేక్‌ పడింది. అయితే ఈ సినిమా కొత్త షూటింగ్‌ షెడ్యూల్‌ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌కు సంబంధించిన చర్చలు, ఎన్టీఆర్‌ మేకోవర్‌పై వర్క్‌ జరుగుతోంది.

‘‘సిద్ధం అవుతున్నాను’’ అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో ప్రశాంత్‌ నీల్‌తో ఉన్న ఫొటోను షేర్‌ చేశారు ఎన్టీఆర్‌. ‘‘బీస్ట్‌ మోడ్‌ మళ్లీ మొదలవుతుంది. త్వరలోనే కొత్త షెడ్యూల్‌ స్టార్ట్‌ చేస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. కల్యాణ్‌ రామ్, నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే..‘ఎన్టీఆర్‌నీల్‌’ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే టాక్‌ తెరపైకి వచ్చింది. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement