
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ది మ్యాన్ ఆఫ్ మాసెస్‌కు డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆర్ఆర్ఆర్, దేవర, వార్-2 చిత్రాలతో జూనియర్ వరల్డ్ వైడ్‌గా క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఇటీవలే హృతిక్ రోషన్తో కలిసి వార్-2 చిత్రంలో ప్రేక్షకులను అలరించారు. కూలీతో పోటీపడిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాతో మన యంగ్ టైగర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.
అయితే జూనియర్ ఎన్టీఆర్కు మాత్రమే కాదు.. ఆయన ఫోటోకు కూడా ఇంత క్రేజ్ ఉందని అర్థమైంది. బులా రుబీ అనే పెన్సిల్ ఆర్టిస్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను తన టాలెంట్తో ఆవిష్కరించారు. తాజాగా ఈ ఫోటోకు అదిరిపోయే ధర వచ్చింది. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకు చెందిన పెన్సిల్ ఆర్ట్కు ఇంత భారీ ధరకు అమ్ముడవ్వలేదు. తొలిసారి జూనియర్ ఎన్టీఆర్ ఆర్ట్‌కు ఏకంగా రూ.1,45,300 రూపాయలు అమ్ముడైంది. ఈ విషయాన్ని ఆర్టిస్ట్ బులా రూబీ ట్విటర్ ద్వారా షేర్ పంచుకుంది.
ఎన్టీఆర్ ఆర్డ్ సరికొత్త చరిత్ర సృష్టించింది.. నా పెన్సిల్ ఆర్ట్ ఇలా చరిత్ర సృష్టిస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఈరోజు నా జూనియర్ ఎన్టీఆర్ పెన్సిల్ ఆర్ట్ ఇప్పటివరకు అమ్ముడైన అత్యంత ఖరీదైనది. ఈ ఘనతకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు దట్ ఈజ్ ఎన్టీఆర్ క్రేజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన టాలెంట్‌తో ఎన్టీఆర్ ఫోటోను ఆవిష్కరించిన బులా రూబీకి అభినందనలు చెబుతున్నారు.
History made! NTR ART ATR 🔥
Feeling absolutely speechless… Never in my dreams did I imagine my pencil art would create history. Today, My pencil art of our man of masses @tarak9999 is now the most expensive pencil art of a Telugu actor ever sold !! #JRNTR𓃵
Grateful and… pic.twitter.com/qStUDcw3kT— Buelah Ruby (@buela_ruby) September 2, 2025