breaking news
pencil art
-
దట్ ఈజ్ జూనియర్ ఎన్టీఆర్.. రికార్డ్ ధరకు అమ్ముడైన ఫోటో!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ది మ్యాన్ ఆఫ్ మాసెస్‌కు డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆర్ఆర్ఆర్, దేవర, వార్-2 చిత్రాలతో జూనియర్ వరల్డ్ వైడ్‌గా క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఇటీవలే హృతిక్ రోషన్‌తో కలిసి వార్-2 చిత్రంలో ప్రేక్షకులను అలరించారు. కూలీతో పోటీపడిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాతో మన యంగ్ టైగర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.అయితే జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రమే కాదు.. ఆయన ఫోటోకు కూడా ఇంత క్రేజ్ ఉందని అర్థమైంది. బులా రుబీ అనే పెన్సిల్ ఆర్టిస్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను తన టాలెంట్‌తో ఆవిష్కరించారు. తాజాగా ఈ ఫోటోకు అదిరిపోయే ధర వచ్చింది. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకు చెందిన పెన్సిల్ ఆర్ట్‌కు ఇంత భారీ ధరకు అమ్ముడవ్వలేదు. తొలిసారి జూనియర్ ఎన్టీఆర్ ఆర్ట్‌కు ఏకంగా రూ.1,45,300 రూపాయలు అమ్ముడైంది. ఈ విషయాన్ని ఆర్టిస్ట్ బులా రూబీ ట్విటర్ ద్వారా షేర్ పంచుకుంది.ఎన్టీఆర్ ఆర్డ్ సరికొత్త చరిత్ర సృష్టించింది.. నా పెన్సిల్ ఆర్ట్ ఇలా చరిత్ర సృష్టిస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఈరోజు నా జూనియర్ ఎన్టీఆర్ పెన్సిల్ ఆర్ట్ ఇప్పటివరకు అమ్ముడైన అత్యంత ఖరీదైనది. ఈ ఘనతకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు దట్ ఈజ్ ఎన్టీఆర్ క్రేజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన టాలెంట్‌తో ఎన్టీఆర్ ఫోటోను ఆవిష్కరించిన బులా రూబీకి అభినందనలు చెబుతున్నారు.History made! NTR ART ATR 🔥Feeling absolutely speechless… Never in my dreams did I imagine my pencil art would create history. Today, My pencil art of our man of masses @tarak9999 is now the most expensive pencil art of a Telugu actor ever sold !! #JRNTR𓃵 Grateful and… pic.twitter.com/qStUDcw3kT— Buelah Ruby (@buela_ruby) September 2, 2025 -
మహిత.. తానొెక సూక్ష్మ లిఖిత!
అన్నం మహిత... చిన్నప్పుడు పెన్సిల్‌తో బొమ్మలు వేసింది. ఇప్పుడు పెన్సిల్ మీద గ్రంథాలు చెక్కుతోంది. మహనీయుల జీవిత చరిత్రలను పెన్సిల్ మీద రాస్తోంది. ఇప్పటి వరకు ఆమె రాసిన జీవిత చరిత్రలు, మహాగ్రంథాల జాబితా ఆమె వయసుకంటే పెద్దదిగా ఉంది. ఆంధ్రప్రదేశ్, బాపట్ల జల్లా, కారంచేడు మండలం, స్వర్ణ గ్రామానికి చెందిన మహిత... తాను సాధన చేస్తున్న మైక్రో ఆర్ట్ గురించి ‘సాక్షి ఫ్యామిలీ’తో పంచుకున్న వివరాలివి..‘‘చిన్నప్పటి నుంచి బొమ్మలు వేయడం ఇష్టం. ఇంటర్ పూర్తయి డిగ్రీలో చేరినప్పుడు కోవిడ్ లాక్డౌన్ వచ్చింది. ఆ ఖాళీ టైమ్‌లో బియ్యం మీద వినాయకుడు, జాతీయ పతకాలను చెక్కాను. ఆ తర్వాత మినుములు, పెసలు, బొబ్బర్లు మీద బొమ్మలు చెక్కాను. వాటిని చూసి మా నాన్న మహాభారతం ట్రై చెయ్యి, నీ సాధనకు గుర్తింపు వస్తుందన్నారు. సంస్కృత భాషలో మహాభారతంలోని 700 శ్లోకాలను 810 పెన్సిళ్ల మీద చెక్కాను. మొత్తం అక్షరాలు 67, 230, పదాల్లో చె΄్పాలంటే 7,238.కళను సాధన చేయడంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే... ఒకటి పూర్తయిన తర్వాత మరొకటి చేయాలనిపిస్తుంది. మహాభారతం తర్వాత వాసవీ కన్యకాపరమేశ్వరి జీవిత చరిత్ర, పుట్టపర్తి సాయిబాబా చరిత్ర, అనేకమంది ప్రముఖుల జీవితచరిత్రలను పెన్సిల్ ముక్కు మీద రాశాను. జాతిపిత మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, అమరజీవి ΄÷ట్టి శ్రీరాములు, నెల్సన్మండేలా, ప్రధాని నరేంద్రమోదీ, స్వర్గీయ ఎన్టీఆర్, వైఎస్సార్, అంబేద్కర్, కరుణానిధి, కేసీఆర్, నరేంద్రమోదీ, ఎంఎస్రెడ్డితో΄ాటు ఏఎన్ఆర్ ఇంకా అనేక మంది సినీ ప్రముఖుల జీవితచరిత్రలను చెక్కాను. మన జాతీయగీతాన్ని ΄ాస్తా మీద చెక్కాను.కర్ణాటక రాష్ట్ర అవతరణ చరిత్రను కూడా రాశాను. నా కళకు గుర్తింపుగా చీరాల రోటరీ క్లబ్‌తో మొదలు ఉత్తరప్రదేశ్ ఆర్ట్ కాంపిటీషన్ వరకు అనేక పురస్కారాలందుకున్నాను. ఈ కళాసాధనను కొనసాగిస్తాను’’ అన్నారు అన్నం మహిత. సూక్ష్మ కళ ఆసక్తి కొద్దీ సాధన చేసే వాళ్లతోనే మనుగడ సాగిస్తోంది. ప్రభుత్వం నుంచి శిక్షణ అవకాశం లభిస్తే ఎక్కువ మంది కళాకారులు తయారవుతారని ఈ సందర్భంగా మహిత తన అభిలాషను వ్యక్తం చేశారు. – వంగూరి సురేశ్‌కుమార్, సాక్షి, బాపట్ల జిల్లా -
పెన్సిళ్ల పై మహాభారతాన్ని లిఖించింది!
కారంచేడు: సూక్ష్మకళపై మక్కువతో సీస లేఖినిలపై (పెన్సిళ్లపై) మహాభారతాన్ని లిఖించింది ప్రకాశం జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన అన్నం మహిత. మహాభారతంలోని 18 పర్వాలను.. 700 శ్లోకాలను సంస్కృత భాషలో అవలీలగా లిఖించగలిగింది. ఇందుకు ఆమె 810 పెన్సిళ్లను ఉపయోగించింది. వాటిపై 67,230 అక్షరాలను, 7,238 పదాలను లిఖించింది. ఇందుకోసం పెన్సిళ్లను ముందుగా బద్దగా చీల్చి అందులోని లిడ్ 2 మిల్లీమీటర్ల మందం ఉండేలా చూసుకుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేసుకోవడం లక్ష్యమని మహిత చెబుతోంది. బియ్యపు గింజలపై సూక్ష్మ కళాకృతులు మహిత మొదట్లో బియ్యపు గింజలపై సూక్ష్మ కళాకృతులను చెక్కడం ప్రారంభించింది. గింజలపై జాతీయ జెండా, తాళం, బాణం, వినాయకుడు, కొంగ, మినప్పప్పుపైన కూడా వినాయకుడు వంటి ఆకృతులను చక్కగా చెక్కి శభాష్ అనిపించుకుంది. ఆ తరువాత పెన్సిల్‌పై మహాభారతాన్ని చెక్కాలనే ఆలోచనకు పదునుపెట్టింది. సూక్ష్మ కళలను ప్రోత్సహించాలి కళలలో సూక్ష్మకళ ఒకటి. అధికారులు, ప్రభుత్వం, ప్రజలు ఇలాంటి సూక్ష్మకళను ప్రోత్సహించాలి. నాలాంటి వారెందరో ఉన్నా.. ప్రతిభను కనబర్చుకునే వీలు లేక ఇలాంటి కళలు మరుగున పడుతున్నాయి. ఆర్థికం, శిక్షణ పరంగా ఈ కళలను ప్రోత్సహించాలి. – అన్నం మహిత (చదవండి: సరికొత్త శకం) -
అల్లు అర్జున్‌కు బ్రహ్మానందం స్పెషల్ గిఫ్ట్
"నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం" అంటుంటారు. ఈ మాటను నమ్మడమే కాదు, సినీ ప్రేక్షకులను నవ్వించడమే తన జీవిత ధ్యేయంగా ముందుకు పోతూ హాస్య బ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. ఆయన నటన గురించి అందరికీ తెలుసు కానీ చిత్ర లేఖనం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. కానీ లాక్డౌన్లో ఆయన కాగితం, పెన్సిలు పట్టుకుని గీసిన చిత్రాలు ఎంతగానో వైరల్ అయ్యాయి. దీంతో ఈ సాహితీ ప్రియుడి కళా నైపుణ్యానికి అభిమానులు మంత్ర ముగ్దులవుతున్నారు. మొన్నామధ్య అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న సమయంలో బ్రహ్మానందం రాముని వీర భక్తుడు 'ఆంజనేయుని ఆనంద భాష్పాలు' పేరుతో చిత్రం గీశారు. ఆ డ్రాయింగ్ చాలామందిని ఆకట్టుకుంది. (చదవండి: 30 ఏళ్లలోపు పెళ్లి వద్దే వద్దు: నటి) వెలకట్టలేని బహుమతి.. ఇప్పుడు తాజాగా శ్రీ వెంకటేశ్వర స్వామిని తన కుంచెతో కాగితంపై సాక్షాత్కరించారు. దీన్ని గీయడానికి ఆయనకు 45 రోజుల సమయం పట్టింది. వెంకన్న కరుణా రసం కురిపిస్తున్నట్లుగా ఉన్న ఈ చిత్రపటాన్ని బ్రహ్మానందం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు బహుమతిగా ఇచ్చారు. స్వహస్తాలతో గీసిన ఈ డ్రాయింగ్స్ చూసి బన్నీ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకు వెలకట్టలేని బహుమతి అని పేర్కొంటూ ట్వీట్ చేశారు. దగ్గుబాటి హీరో రానాకు సైతం వెంకటేశ్వరుని పటాన్ని నూతన సంవత్సర బహుమతిగా అందించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బ్రహ్మానందం డ్రాయింగ్ ఫొటోలు వైరల్‌గా మారాయి. (చదవండి: నలుగురికి ఉపయోగపడదాం: బ్రహ్మానందం) THE MOST PRICELESS GIFT I RECEIVED FROM OUR BELOVED BRAHMANANDAM GARU. 45 DAYS OF WORK . HAND DRAWN PENCIL SKETCH . THANK YOU ❤ #AlluArjun #Pushpa @alluarjun pic.twitter.com/rkqY6D8FEi — TelanganaAlluArjunFC (@TelanganaAAFc) January 1, 2021 Got this beautiful gift from #Brahamanadam Garu!! Thank you and Happy new year sir!! My Tatha would have loved it. ❤️❤️❤️ pic.twitter.com/CZNxgBQUlg — Rana Daggubati (@RanaDaggubati) January 1, 2021 -
బొమ్మలే బువ్వపెడుతున్నాయి
సాక్షి, రాజోలు (తూర్పు గోదావరి): నిరుపేద కుటుంబం.. రోజువారీ పనిచేస్తే తప్ప పూట గడవని పరిస్థితి. చిన్నతనం నుంచి చిత్రలేఖనంపై ఆసక్తి. బొమ్మలు గీస్తూ ఇరుగుపొరుగు, స్నేహితుల మన్ననలు పొందుతూ చిత్రలేఖనంపై ఆసక్తి పెంచుకుని దానినే జీవనాధారంగా మలచుకున్నాడు తాటిపాకకు చెందిన గొల్లపల్లి శ్రీనివాస్. చిన్న చిన్న సైన్‌బోర్డులు, స్టిక్కరింగ్ చేయడం వంటి పనులు చేస్తూ నాలుగేళ్ల క్రితం క్రాఫ్ట్ టీచర్‌గా సర్వశిక్షాభియాన్‌లో కూనవరం ఉన్నత పాఠశాలలో శ్రీనివాస్ కొలువు పొందాడు. చిత్రలేఖనంపై ఉన్న ఆసక్తికి డ్రాయింగ్ టీచర్ పోస్టు తోడు కావడంతో విద్యార్థులను చిత్రకారులుగా తీర్చిదిద్దేందుకు నిరంతర శ్రామికుడిగా మారాడు. ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ఆసక్తిని గమనించి వాటిపై చిత్రాలను గీయడం నేర్పిస్తున్నాడు. చిత్రలేఖనం పోటీలు ఎక్కడ జరిగినా విద్యార్థులను వాటిలో పాల్గొనేలా తర్ఫీదు ఇచ్చి ప్రొత్సహిస్తునాడు. అచ్చుగుద్దినట్టు ‘పెన్సిల్ చిత్రాలు’ పెన్సిల్‌తో శ్రీనివాస్ గీచిన చిత్రాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పాస్‌పోర్టు సైజు ఫొటో ఇస్తే చాలు శ్రీనివాస్ తన పెన్సిల్‌కు పని చెప్పి అద్భుతమైన కళాఖండాన్ని సృష్టిస్తాడు. అలా చిత్రలేఖనంలో బహుమతులు పొందిన విద్యార్థినులు, స్నేహితుల చిత్రాలను పెన్సిల్‌తో ఇట్టే చిత్రీకరించాడు. ఓపిగ్గా కదలకుండా కూర్చుంటే లైవ్ చిత్రాన్ని కూడా తన పెన్సిల్‌తో గీస్తానని శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. శ్రీనివాస్ గీచిన చిత్రాలను కూనవరం ఉన్నత పాఠశాలలో ప్రదర్శనకు ఉంచారు. విద్యార్థుల్లో చిత్రలేఖనంపై ఆసక్తి పెంచడం ద్వారా చేతిరాత చక్కదిద్దవచ్చునని, నిరంతరం చదువుతో ఒత్తిడికి గురికాకుండా విద్యార్థులకు చిత్రలేఖనం ఎంతో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుందని శ్రీనివాస్ పేర్కొన్నారు. అందుకే ఎంఈఓ జొన్నలగడ్డ గోపాలకృష్ణ, ప్రధానోపాధ్యాయుడు పట్టా భాస్కరరావుల ప్రోత్సాహంతో విద్యార్థులకు చిత్రలేఖనంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. -
పెన్సిల్ లెడ్‌లో అద్భుత కళాఖండాలు