స్టార్‌ హీరోలకు బ్రహ్మానందం ప్రత్యేక బహుమతులు

Brahmanandam Priceless Gift To Allu Arjun - Sakshi

"నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం" అంటుంటారు. ఈ మాటను నమ్మడమే కాదు, సినీ ప్రేక్షకులను నవ్వించడమే తన జీవిత ధ్యేయంగా ముందుకు పోతూ హాస్య బ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. ఆయన నటన గురించి అందరికీ తెలుసు కానీ చిత్ర లేఖనం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. కానీ లాక్‌డౌన్‌లో ఆయన కాగితం, పెన్సిలు పట్టుకుని గీసిన చిత్రాలు ఎంతగానో వైరల్‌ అయ్యాయి. దీంతో ఈ సాహితీ ప్రియుడి కళా నైపుణ్యానికి అభిమానులు మంత్ర ముగ్దులవుతున్నారు. మొన్నామధ్య అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న సమయంలో బ్రహ్మానందం రాముని వీర భక్తుడు 'ఆంజనేయుని ఆనంద భాష్పాలు' పేరుతో చిత్రం గీశారు. ఆ డ్రాయింగ్‌ చాలామందిని ఆకట్టుకుంది. (చదవండి: 30 ఏళ్లలోపు పెళ్లి వద్దే వద్దు: నటి)

వెలకట్టలేని బహుమతి..
ఇప్పుడు తాజాగా శ్రీ వెంకటేశ్వర స్వామిని తన కుంచెతో కాగితంపై సాక్షాత్కరించారు. దీన్ని గీయడానికి ఆయనకు 45 రోజుల సమయం పట్టింది. వెంకన్న కరుణా రసం కురిపిస్తున్నట్లుగా ఉన్న ఈ చిత్రపటాన్ని బ్రహ్మానందం స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు బహుమతిగా ఇచ్చారు. స్వహస్తాలతో గీసిన ఈ డ్రాయింగ్స్‌ చూసి బన్నీ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకు వెలకట్టలేని బహుమతి అని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు. దగ్గుబాటి హీరో రానాకు సైతం వెంకటేశ్వరుని పటాన్ని నూతన సంవత్సర బహుమతిగా అందించారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బ్రహ్మానందం డ్రాయింగ్‌ ఫొటోలు వైరల్‌గా మారాయి. (చదవండి: నలుగురికి ఉపయోగపడదాం: బ్రహ్మానందం)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top