30 లోపు పెళ్లంటే మూర్ఖత్వమే అవుతుంది

Pooja Bedi Tells Daughter, Getting Married Before 30 Is Stupid - Sakshi

పెళ్లి మాట ఎత్తితే చాలు హీరో హీరోయిన్లు మొహం చాటేస్తారు. మరీ గుచ్చి గుచ్చి అడిగితే.. అప్పుడే పెళ్లేంటి? అన్నట్లు ఓ లుక్కిస్తారు. పోనీ, ఎప్పుడు చేసుకుంటారో చెప్పండి అంటే.. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది అంటూ ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదన్నట్లుగా మాట్లాడతారు. చిత్ర పరిశ్రమలో లేటు పెళ్లిళ్లు, అసలు పెళ్లిళ్లే చేసుకోకపోవడాలు అనేవి సర్వసాధారణం. అయితే ఏది ఏమైనా 30కు ముందు పెళ్లి చేసుకోవద్దంటున్నారు బాలీవుడ్‌ సీనియర్‌ నటి పూజా బేడీ. పెళ్లికి అంత తొందర అవసరం లేదని, లేటుగా పెళ్లి చేసుకోమని తన పిల్లలు ఆలియా, ఒమర్‌లకు సూచనలిస్తున్నారు. ఈ విషయాన్ని ఆలియా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. (చదవండి: సినిమాల్లో నటించను: షాహిద్‌ భార్య)

'నీ కాళ్ల మీద నువ్వు నిలబడగలిగాలి అని నా తల్లిదండ్రులు ఎప్పుడూ నాకు చెప్తూ ఉండేవారు. ముఖ్యంగా అందరి పేరెంట్స్‌లా పెళ్లి చేసుకోమని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. పైగా ముప్పై ఏళ్ల లోపు పెళ్లి చేసుకోవడం కన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదని హెచ్చరించేవాళ్లు. ముందుగా చేసే పని మీద, కెరీర్‌ మీద ధ్యాస పెట్టమని సూచించేవాళ్లు" అని ఆలియా చెప్పుకొచ్చారు. కాగా ఆలియా ఐదేళ్ల వయసులోనే ఆమె తల్లిదండ్రులు పూజా బేడీ - ఫర్హాన్‌ ఫర్నిచర్‌ వాలా విడిపోయారు. అనంతరం ఫర్హాన్‌.. ఫిరోజ్‌ ఖాన్‌ కూతురు లైలా ఖాన్‌ను వివాహం చేసుకోగా వారికి ఓ బిడ్డ కూడా జన్మించింది. ఇక ఆలియా సినిమాల విషయానికి వస్తే.. దర్శకుడు నితిన్‌ కక్కర్‌ తెరకెక్కించిన ‘జవానీ జానేమన్‌’ సినిమాతో ఆమె హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ప్రస్తుతం ఆమె అనురాగ్‌ కశ్యప్‌ డైరెక్షన్‌లో నటించనున్నట్లు సమాచారం. (చదవండి: ‘మా నాన్న నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు’)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top