మళ్లీ పెళ్లి చేసుకోవాలన్నది నా పిల్లల కోరిక | Pooja Bedi Says Her Kids Want Her To Get Marry | Sakshi
Sakshi News home page

‘మా నాన్న నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు’

Aug 21 2020 5:11 PM | Updated on Aug 21 2020 6:00 PM

Pooja Bedi Says Her Kids Want Her To Get Marry  - Sakshi

తన పిల్లలతో పూజా బేడి

ముంబై: తను మళ్లీ పెళ్లి చేసుకోవాలన్నది తన పిల్లల కోరిక అంటూ బాలీవుడ్‌ సీనియర్‌ నటి పూజా బేడీ పేర్కొన్నారు. పూజా మాజీ భర్త ఫర్హాన్ ఫర్నిచర్ వాలాతో విడాకులు అనంతరం మనేక్ కాంట్రాక్టర్‌తో ఆమె ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. మనేక్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు గతేడాది వాలంటైన్స్‌ డేకు ఆమె ప్రకటించారు. ఇటీవల పూజా ఓ ఇంగ్లీష్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తన పిల్లలతో తనకు ఉన్న అనుబంధం గురించి చెప్పారు. అలాగే తన పిల్లలు కూడా మనేక్‌ను ఇష్టపడతారన్నారు. మనేక్‌తో తన పెళ్లి గురించి అడగ్గా.. ‘ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడం కంటే కూడా  జీవితంలో ఇది నాది అనేలా నేను స్థిరపడాలని నా పిల్లలు(అలియా ఫర్నిచర్‌ వాలా, ఒమర్‌ ఫర్నిచర్‌ వాలా) కోరుకుంటున్నార’ని చెప్పారు. (చదవండి: న‌టుడు దిలీప్‌కుమార్ సోద‌రుడు మృతి)

‘వారి జీవితంలోకి నేను తీసుకువచ్చిన అద్భుతమైన వ్యక్తిని వారు ఇష్టపడుతున్నారు. అలాగే నా మాజీ భర్తను కూడా వారు ఇష్టపడతారు. కానీ వీటి కారణంగా నేను ఆందోళన, గందరగోళానికి గురికావొద్దని వారు నాకు చెబుతారు. అంతేగాక వాళ్ల డాడీ (ఫర్హాన్‌ ఫర్నిచర్‌ వాలా) మరో పెళ్లి చేసుకున్నట్లే.. నన్ను కూడా మరో పెళ్లి చేసుకోమని అడుగుతూ ఉంటార’ని పిల్లలు తరచూ తనతో అంటుంటారని పూజా చెప్పుకొచ్చారు. ‘జీవితంలో ఎదురయ్యే ఎన్నో అనుభవాలు మన మంచికే అనుకోవాలి.  మా నాన్న కబీర్‌ బేడీ నాలుగు వివాహలు చేసుకున్నాడు. వాటి వల్ల ఆయన మరింత బలవంతుడు అయ్యాడు’ అని పూజా అన్నారు. (చదవండి: సారాను పెళ్లి చేసుకుంటా: నటి కూతురు)

పూజా బేడీ 1994లో ఫర్హాన్‌ ఫర్నిచర్‌వాలాను వివాహం చేసుకున్నారు. వైవాహిక బంధంలో వచ్చిన కొన్ని మనస్ఫర్థల కారణంగా పూజా, ఫర్హాన్‌లు 2003 విడాకులు తీసుకుని విడిపోయారు. వీరికి అలియా, ఒమర్‌లు ఇద్దరూ పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వారు పూజాతో నివసిస్తున్నారు. అయితే పూజా భర్త ఫర్హాన్‌ ఆమెతో విడిపోయిన అనంతరం  ఫిరోజ్‌ ఖాన్‌ కూతురు లైలా ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు వారికి ఓ బిడ్డ కూడా ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement