బర్త్‌ డేకి గ్రాండ్‌గా... | Jr NTR and Trivikram Srinivas to Announce New Movie Video on May 20 | Sakshi
Sakshi News home page

బర్త్‌ డేకి గ్రాండ్‌గా...

May 8 2026 3:21 AM | Updated on May 8 2026 3:21 AM

Jr NTR and Trivikram Srinivas to Announce New Movie Video on May 20

అభిమాన హీరో పుట్టినరోజు దగ్గర పడుతోందంటే అభిమానులు ఆ హీరో తాజా చిత్రాల అప్‌డేట్స్‌ని ఆశిస్తారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ అభిమానులు అలానే అప్‌డేట్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెల 20న ఈ హీరో పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫ్యాన్ప్‌ ఆశించేవాటిలో ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమా ఒకటి. బర్త్‌ డేకి గ్రాండ్‌గా ఒక వీడియోను విడుదల చేయడానికి ఈ టీమ్‌ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఈ వీడియోలో విజుల్‌ ఎఫెక్ట్స్‌ భారీగా ఉంటాయని టాక్‌. కుమార స్వామి నేపథ్యంలో త్రివిక్రమ్‌ తెరకెక్కించనున్న ఈ మైథలాజికల్‌ మూవీకి ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు ఓ వార్త ప్రచారంలో ఉంది.

మరి... ప్రచారంలో ఉన్నట్లు వీడియోను విడుదల చేస్తారా? ఆ రోజు టైటిల్‌ని కూడా ప్రకటిస్తారా? అనేది వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమా అంగీకరించాక కుమార స్వామి గురించి తెలుసుకోవడానికి ఎన్టీఆర్‌ పుస్తకాలు చదువుతున్నారట. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ‘డ్రాగన్‌’ చిత్రంలో నటిస్తున్నారు ఎన్టీఆర్‌. అలాగే ‘దేవర’ రెండో భాగం కూడా ఉంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement