విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు 103వ జయంతి నేడు (మే 28). ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవడు, హీరో జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. కాసేపు అక్కడే కూర్చుని తాతతో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
వీడియో వైరల్
జూనియర్ ఎన్టీఆర్ రాక నేపథ్యంలో అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఓ అభిమాని హీరోకు షేక్ హ్యాండ్ ఇవ్వబోయి కిందపడ్డాడు. దీంతో తారక్.. అతడిని పైకి లేపి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
గుండె తల్లడిల్లుతోంది
జూనియర్ ఎన్టీఆర్.. తాతను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలోనూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 'మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను' అంటూ ఓ పోస్ట్ షేర్ చేశారు.
— Jr NTR (@tarak9999) May 28, 2026
He cares. 🥹❤️ pic.twitter.com/J5HpAai5Lh
— appie 🎀 (@fizz_nandamuri) May 28, 2026


