దురంధర్‌ నటుడికి జాక్‌పాట్.. జూనియర్ ఎన్టీఆర్‌ మూవీలో ఛాన్స్..! | Dhurandhar Bimal Oberoi will acts in Jr ntr and neel Dragon Movie | Sakshi
Sakshi News home page

Dhurandhar Movie: దురంధర్‌ హిట్.. జూనియర్ ఎన్టీఆర్‌ మూవీలో ఛాన్స్..!

Apr 3 2026 4:22 PM | Updated on Apr 3 2026 4:53 PM

Dhurandhar Bimal Oberoi will acts in Jr ntr and neel Dragon Movie

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ దురంధర్-2. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ మూవీ రిలీజైన వారం రోజుల్లోనే వెయ్యి కోట్ల వసూళ్లు సాధించింది. తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది. కేవలం 15 రోజుల్లోనే రూ.1501 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.  దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. కేవలం మూడు నెలల్లోనే సీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ఈ మూవీ బ్లాక్ బస్టర్‌ హిట్ కావడంతో దురంధర్‌ టీమ్‌కు ఎక్కడా లేని క్రేజ్‌ను తెచ్చిపెడుతోంది. ఈ సినిమాలో నటించిన వారికి ఆదరణ ఓ రేంజ్‌లో వస్తోంది. తాజాగా ఓ దురంధర్‌ నటుడికి ఏకంగా టాలీవుడ్‌ ఛాన్స్‌ తీసుకొచ్చింది దురంధర్. ఈ మూవీలో నటించిన బిమల్ ఒబెరాయ్ తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌ సరసన ఛాన్స్ కొట్టేశారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వస్తోన్న డ్రాగన్‌ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. టోవినో థామస్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో బిమల్‌కు అవకాశమొచ్చినట్లు తెలుస్తోంది.

కాగా.. బిమల్ ఓబెరాయ్ దురంధర్‌లో బలోచ్‌ యునైటెడ్‌ ఫోర్స్‌ లీడర్‌ శ్రీరాని బలోచ్ పాత్రలో మెప్పించారు. ఈ పాత్ర అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. సీరియస్ అండ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్‌తో  బిమల్ ఆడియన్స్‌ను అలరించారు. తాజాగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. ఎన్టీఆర్‌ మూవీలో ఎలాంటి రోల్ చేస్తారన్న విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement