
తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ (Sivakarthikeyan) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మదరాసి (Madarasi Movie). ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రుక్మిణి వసంత్ కథానాయికగా యాక్ట్ చేసింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కావాల్సి ఉంది. ఈ క్రమంలో హీరోయిన్ రుక్మిణి వసంత్‌తో కలిసి శివకార్తికేయన్ ప్రమోషన్స్‌కు హాజరయ్యాడు.
గెస్ట్ రోల్
ఈ సందర్భంగా హీరోకు ఓ ప్రశ్న ఎదురైంది. మదరాసి మూవీలో గెస్ట్ రోల్ ఉన్నట్లయితే తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏ హీరోను పెట్టుకుంటారు? అని యాంకర్ సుమ అడిగింది. అందుకు శివకార్తికేయన్ ఓ క్షణం ఆలోచించి.. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అని బదులిచ్చాడు. మీపై వచ్చిన రూమర్స్ గురించి చెప్పండి అని సుమ అడిగింది. అందుకు హీరో.. అమరన్ మూవీ టైంలో నేను 8 ప్యాక్ బాడీ చేసినట్లుగా ఫోటో సృష్టించారు. అందులో నా ముఖాన్ని సాగదీశారు.
స్టెరాయిడ్స్ వాడానని రూమర్
నేను స్టెరాయిడ్స్ వాడటం వల్లే ఆరోగ్యం చెడిపోయిందని రాశారు. అది చూసి లైట్ తీసుకున్నా అని తెలిపాడు. తెలుగు హీరోతో మల్టీస్టారర్ మూవీ చేసే అవకాశం వస్తే నానితో కలిసి నటించాలనుందన్నాడు. ఇక మదరాసి విషయానికి వస్తే.. విద్యుత్ జమాల్, బిజు మీనన్, షబ్బీర్, విక్రాంత్ కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. మరోవైపు ఇదే ఇంటర్వ్యూలో రుక్మిణి.. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీ ప్రారంభమైందని అప్‌డేట్ ఇచ్చింది.
ఎన్టీఆర్‌తో మదరాసి హీరోయిన్
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న డ్రాగన్(ప్రచారంలో ఉన్న టైటిల్) మూవీలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. ప్రశాంత్ నీల్.. ‘కేజీఎఫ్’లో ‘కోలార్ గోల్డ్ ఫీల్డ్’, ‘సలార్’లో ఖాన్సార్ ప్రాంతాలు క్రియేట్ చేసినట్లు ‘డ్రాగన్’ మూవీలో కూడా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని సమాచారం. ఈ మూవీకి ఇంటర్‌నేషనల్ టచ్ ఉంటుందని భోగట్టా! గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ–సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్‌రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జూన్ 25న విడుదల కానుంది.
చదవండి: మాజీ ప్రియుడిని ఫ్యామిలీ అంటున్న భార్యలు.. జర జాగ్రత్త!: నటుడి వార్నింగ్