జూనియర్ ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై ఈ మధ్య చాలా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. మూవీ షూటింగ్ ఆగిపోయిందని కొద్దిరోజులుగా ప్రచారం అయింది. అయితే, ఈ మూవీ రెండు భాగాలుగా రానుందని సోషల్మీడియాలో కొత్త ప్రచారం తెరపైకి తీసుకొచ్చారు. 'డ్రాగన్' పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీని మొదట ఒకే భాగంగా నిర్మించాలని మేకర్స్ అనుకున్నారట.. కానీ, రన్ టైమ్ ఎక్కువ రావడంతో రెండు పార్ట్స్గా విడుదల చేసేందుకు వారు ప్లాన్ చేసినట్టు ప్రచారం జరిగింది. అయితే, అందులో ఎలాంటి నిజం లేదని ప్రశాంత్ నీల్ టీమ్ తాజాగా ఒక పోస్ట్ చేసింది.
దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే కేజీఎఫ్ చిత్రాలను రెండు భాగాలుగా నిర్మించి భారీ విజయాన్ని అందుకున్నారు. సలార్ మూవీని కూడ రెండు పార్ట్స్గా విడుదల చేస్తామని తెలిపారు. ఇదే క్రమలో తారక్ సినిమాను కూడా సీక్వెల్ ప్లాన్ చేసే పనిలో ఉన్నారని ఒక వార్త ట్రెండ్ అయింది. అయితే, తాజాగా ప్రశాంత్ నీల్ టీమ్ ఖండించింది. ' #NTRNeel సినిమా రెండు భాగాలుగా ఉంటుందని వస్తున్న ఊహాగానాలను ఎవరూ నమ్మవద్దు. ఈ ప్రాజెక్ట్ ఒకే భాగంగా వస్తుంది. ఇదీ చాలా శక్తివంతమైన కథ . భారీ హిట్ కొట్టేలా రూపొందించబడింది. కేవలం ఒక భాగంగా మాత్రమే విడుదల కానుంది.' అంటూ ప్రశాంత్ టీమ్ పేర్కొంది.


