
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. సినీ రంగంలో అందించే ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. నిజమైన ఇండియన్ సినిమా ఐకాన్‌కు దక్కిన గౌరవమని ట్వీట్ చేశారు. కాగా.. కేంద్ర ప్రభుత్వం 2023 ఏడాదికి గానూ సినీ పరిశ్రమలో అందించే అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రంలో మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. 2016లో వచ్చిన ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించింది. కాగా.. మోహన్ లాల్ మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించారు.
Heartiest congratulations to the legendary @Mohanlal sir on being honoured with the prestigious Dadasaheb Phalke Award.
A true icon of Indian cinema, this recognition is well deserved.— Jr NTR (@tarak9999) September 21, 2025