హీరో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా తన అభిమానులకు ఓ కానుక ఇవ్వనున్నారు. మే 20న ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన హీరోగా నటించిన ‘ఊసరవెల్లి’ సినిమా రీ రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఊసరవెల్లి’. తమన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో తనికెళ్ల భరణి, ప్రకాశ్‌రాజ్, విద్యుత్ జమాల్, సాయాజీ షిండే, మురళీ శర్మ తదితరులు ఇతరపాత్రలు పోషించారు.
బి. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా 2011 అక్టోబరు 6న రిలీజ్ అయింది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్లస్‌గా నిలిచింది. కాగా ‘ఊసరవెల్లి’ చిత్రం సుమారు పదిహేనేళ్ల తర్వాత మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్‌నీల్’ (వర్కింగ్ టైటిల్). ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై కల్యాణ్‌రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ సినిమా 2027 జూన్ 11న రిలీజ్ కానుంది.


