హైదరాబాద్‌ టు జోర్డాన్‌ | Jr NTR and Prashanth Neel to head to Jordan for Dragon | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ టు జోర్డాన్‌

Jan 19 2026 3:34 AM | Updated on Jan 19 2026 3:35 AM

 Jr NTR and Prashanth Neel to head to Jordan for Dragon

ఫిబ్రవరిలో జోర్డాన్‌ వెళ్లనుందట ‘ఎన్టీఆర్‌నీల్‌’ టీమ్‌. ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘ఎన్టీఆర్‌నీల్‌’ (వర్కింగ్‌ టైటిల్‌). ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా, ఓ కీలక పాత్రలో అనిల్‌ కపూర్‌ నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలోని ఇతర కీలక పాత్రధారులంటూ టోవినో థామస్, కాజోల్, రష్మికా మందన్నా వంటి వార్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌ శివార్లలోని ఓ ప్రముఖ స్టూడియోలో వేసిన సెట్‌లో ఎన్టీఆర్‌ పాల్గొనగా కొన్ని నైట్‌ సీన్స్‌ చిత్రీకరించారు.

ఈ షెడ్యూల్‌లోనే ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను కూడా చిత్రీకరించారట. మళ్లీ ఈ వారంలో మొదలయ్యే కొత్త షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌ పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుందని సమాచారం. ఈ షెడ్యూల్‌ ఈ నెలాఖరు వరకు సాగుతుందట. హైదరాబాద్‌ షెడ్యూల్‌ ముగిశాక మరో కీలక షెడ్యూల్‌ కోసం ‘ఎన్టీఆర్‌నీల్‌’ టీమ్‌ జోర్డాన్‌ వెళ్లనుందని సమాచారం. అక్కడ ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ కూడా షూట్‌ చేస్తారట. నందమూరి కల్యాణ్‌రామ్, నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement