జూ. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఒక భారీ సర్‌ప్రైజ్ ఉంటుందని ఎదురుచూశారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న మైథలాజికల్ ప్రాజెక్ట్ 'గాడ్ ఆఫ్ వార్'ను అధికారికంగా ప్రకటిస్తారని అందరూ భావించారు. అయితే దానిపై సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తరఫున నిర్మాత నాగవంశీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఆయన ఎక్స్ హ్యాండిల్‌లో మాత్రం ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. "త్వరలోనే సెట్స్‌పై కలుద్దాం" అంటూ పోస్టు పెట్టారు. అదే సమయంలో 'డ్రాగన్ గ్లింప్స్' వీడియోను కూడా ట్యాగ్ చేశారు.
ఈ పరిణామంతో తారక్ అభిమానులు నిరాశ చెందారు. ఆయన పుట్టినరోజు నాడు 'గాడ్ ఆఫ్ వార్' ప్రాజెక్ట్ ప్రకటిస్తారని అభిమానులు ఆశించారు. దానికోసం వారు పదేపదే నాగవంశీ సోషల్‌మీడియా హ్యాండిల్‌ను తనిఖీ కూడా చేశారు. 'గాడ్ ఆఫ్ వార్' కోసం వందలాది పోస్టులు కూడా చేశారు. కానీ ఆ సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. డ్రాగన్ గ్లింప్స్ విడుదల సమయంలో మరో సినిమా ప్రకటించడం వల్ల ఆ ప్రాజెక్ట్‌పై ఉన్న బజ్ తగ్గిపోతుందనే ఆలోచనతో నాగవంశీ వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. అందుకే 'గాడ్ ఆఫ్ వార్' ప్రాజెక్ట్‌ను మరో మంచి రోజున ప్రకటించాలని నిర్ణయించినట్టు టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం పుట్టినరోజు సందర్భంగా ఈ పెద్ద ప్రాజెక్ట్ ప్రకటించకపోవడం వల్ల నిరాశ చెందుతున్నారు.


