ప్రశాంత్‌ నీల్‌ సినిమాపై బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన ఎన్టీఆర్‌ | JR NTR And Prashanth Neel Movie Release Date Announced Officially | Sakshi
Sakshi News home page

ప్రశాంత్‌ నీల్‌ సినిమాపై బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన ఎన్టీఆర్‌

Apr 21 2026 10:49 AM | Updated on Apr 21 2026 11:05 AM

JR NTR And Prashanth Neel Movie Release Date Announced Officially

జూనియర్‌ ఎన్టీఆర్‌- దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ సినిమా కోసం అభిమానులు  ఎదురుచూస్తున్నారు. చాలారోజులుగా ఈ ప్రాజెక్ట్‌ గురించి  ఎలాంటి అప్‌డేట్‌ రాకపోవడంతో వాళ్లు నిరాశలో ఉన్నారనే విషయం తెలసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి బిగ్‌ అప్‌డేట్‌ను తారక్‌ పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2027 జూన్‌ 11న విడుదల కానుందని ప్రకటించారు. ఫస్ట్‌ గ్లింప్స్‌ ఈ ఏడాది మే 20న షేర్‌ చేస్తామని తారక్‌ షాడో పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.

ఎన్టీఆర్‌- ప్రశాంత్‌ నీల్‌  చిత్రం ‘డ్రాగన్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌).  ఈ ప్రాజెక్ట్‌ నుంచి మేకర్స్‌ పెద్దగా అప్‌డేట్స్‌ ఇవ్వకపోవడంతో సినిమా ఇప్పట్లో రాదంటూ ట్రోల్‌ చేశారు. దీంతో కొద్దిరోజుల క్రితం తారక్‌ జిమ్‌ ఫోటోను మేకర్స్‌ విడుదల చేసి ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ఇప్పుడు ఏకంగా విడుదల తేదీని ప్రకటించి అభిమానుల్లో జోష్‌ నింపారు.  ‘సలార్‌’ తర్వాత ప్రశాంత్‌ నీల్‌.. ‘దేవర’ తర్వాత ఎన్టీఆర్‌ చేస్తున్న మూవీ కావడంతో బాక్సాఫీస్‌ వద్ద భారీ అంచనాలు ఉన్నాయి.

ఎన్టీఆర్‌ సరసన  రుక్మిణీ వసంత్‌  నటిస్తుండగా.. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనిల్‌ కపూర్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. నందమూరి కల్యాణ్‌ రామ్, నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో వచ్చే ఏడాది జూన్‌ 11న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్‌.

 

Advertisement
 
Advertisement
Advertisement