
కోలీవుడ్ నటుడు శింబు (Silambarasan TR), దర్శకుడు వెట్రిమారన్ (Vetri Maaran) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘అరసన్’ (Arasan). తెలుగులో ‘సామ్రాజ్యం’ (Saamrajyam) పేరుతో విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా తెలుగు వర్షన్ ప్రోమోను జూనియర్ ఎన్టీఆర్ (NTR) విడుదల చేశారు. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు చెప్పారు.
ప్రోమో పేరుతో విడుదల చేసిన ఈ వీడియో ఏకంగా 5 నిమిషాలకు పైగానే ఉంది. వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన వడ చెన్నై యూనివర్స్‌లో భాగంగానే సామ్రాజ్యం చిత్రం తీస్తున్నారు. ఇందులో ధనుష్ కూడా అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఉత్తర చెన్నై నేపథ్యంలోని గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ప్రోమోలో మీడియా ప్రతినిధులు తన కథ గురించి చెప్పాలని శింబును అడుగుతారు. దానికి అతను "నా కథను ఎవరితో చేయిద్దామనుకుంటున్నారు.. ఎన్టీఆర్‌తో చేయించండి కుమ్మేస్తాడు" అనే డైలాగ్ చెప్తాడు. ఇప్పుడు సోషల్‌మీడియాలో అది ట్రెండ్ అవుతుంది.