
ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ సినిమా దేవర ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తాజాగా సీక్వెల్‌ను ప్రకటించారు. అందుకు సంబంధించిన ఒక పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. దేవర విడుదలైన మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్లు (గ్రాస్) సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఫైనల్‌గా రూ. 500 కోట్ల మార్క్‌ను ఈ చిత్రం చేరుకుంది. ఏకంగా ఆరు కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. తారక్ కెరీర్‌లో బిగ్గెస్ట్ చిత్రంగా నిలిచిన ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కించారు. ఈ మూవీతోనే జాన్వీకపూర్ తొలిసారి తెలుగు తెరపై మెరిసింది. ఇందులో సైఫ్ అలీఖాన్, శ్రుతి మరాఠే, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్ వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటించారు.

బాలీవుడ్ చిత్రం వార్2తో కాస్త నిరాశపరిచిన ఎన్టీఆర్ త్వరలో ఒక బలమైన చిత్రంతో రానున్నారు. ఎన్టీఆర్ (NTR), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వచ్చే ఏడాది జూన్ 25న ఈ చిత్రం విడుదల కానుందని ఇప్పటికే ప్రకటించారు. దీనికి ‘డ్రాగన్’ అనే పేరు పరిశీలనలో ఉందని ప్రచారం జరుగుతుంది.
త్రివిక్రమ్- ఎన్టీఆర్ కాంబినేషన్‌లో కూడా ఒక సినిమా ఉన్న విషయం తెలిసిందే. జైలర్ సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో కూడా ఎన్టీఆర్ ఒక సినిమా చేసే అవకాశం ఉంది. ఇలా భారీ లైనప్‌తో ఉన్న తారక్ నుంచి మొదట వెండితెరపైకి వచ్చేది మాత్రం ప్రశాంత్ నీల్ చిత్రమే కావడం విశేషం. ఆ తర్వాతే మిగిలిన దర్శకుల ప్రాజెక్ట్‌లు పట్టాలెక్కనున్నాయి.