జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇంటి వద్ద అభిమానుల సందడి | Massive Fans Gathered Outside At Jr NTR House On His Birthday, Celebrating With Festivities And Well Wishes, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Jr NTR Birthday: ఎన్టీఆర్‌ ఇంటి వద్ద అభిమానుల కోలాహలం

May 20 2026 9:13 AM | Updated on May 20 2026 10:16 AM

Jr NTR Fans Gathered at Actor House on his Birthday

టాలీవుడ్‌ స్టార్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ బర్త్‌డే నేడు (మే 20). ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌ను చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు ఆయన నివాసానికి చేరుకున్నారు. జై ఎన్టీఆర్‌ అంటూ నినాదాలు చేశారు. బాణసంచా కాలుస్తూ హీరో పుట్టినరోజును పండగలా సెలబ్రేట్‌ చేశారు. ఇక తనకోసం వచ్చిన అభిమానులను ఎన్టీఆర్‌ నవ్వుతూ పలకరించాడు. వారిని పలకరిస్తూ అభివాదం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

డ్రాగన్‌ గ్లింప్స్‌ రిలీజ్‌
ఇకపోతే ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా డ్రాగన్‌ సినిమా నుంచి గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. దాదాపు 4 నిమిషాల నిడివితో ఉన్న ఈ వీడియోలో తారక్‌ బరువు తగ్గి, గంభీరమైన లుక్‌తో కనిపించాడు. ప్రశాంత్‌ నీల్‌ టేకింగ్‌, తారక్‌ డైలాగ్స్‌.. గ్లింప్స్‌లో హైలైట్‌గా నిలిచాయి. రవి బస్రూర్‌ సంగీతం సినిమాకు మరింత ఆకర్షణ తీసుకువచ్చింది. డ్రాగన్‌ మూవీలో రుక్మిణి వసంత్‌ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ 2027 జూన్‌ 11న విడుదల కానుంది.

 

చదవండి: డ్రాగన్‌ గ్లింప్స్‌ రిలీజ్‌

Advertisement
 
Advertisement
Advertisement