
జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో భారీ యాక్షన్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ తొలి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. కేజీఎఫ్ డైరెక్టర్‌తో మొదటిసారి జతకట్టడంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ త్వరలోనే అమెరికాలో ప్రారంభం కానుంది. ఇవాళ ఎన్టీఆర్ యూఎస్ కాన్సులేట్‌కు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియా వైరల్‌గా మారాయి.
తాజాగా ఎన్టీఆర్‌కు సంబంధించిన మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. జిమ్‌లో చెమడ్చోస్తున్న వీడియో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ఎన్టీఆర్ బీస్ట్ మోడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ కోసమే జూనియర్ బరువు తగ్గుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇది చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ మ్యాన్ ఆఫ్ మాసెస్ న్యూ లుక్ అంటూ పోస్టులు పెడుతున్నారు.
BEAST MODE ACTIVATED by Man of Masses @tarak9999 🐉💪🔥#JrNTR #NTRNeel #Dragon #TFNReels #TeluguFilmNagar pic.twitter.com/cf44pPs0N3
— Telugu FilmNagar (@telugufilmnagar) September 16, 2025