జూనియర్ ఎన్టీఆర్‌ హీరోయిన్.. ఎంత బొద్దుగా ఉందో చూశారా? | Tollywood actress Childhood photos viral On Social Media | Sakshi
Sakshi News home page

Tollywood Actress: జూనియర్ ఎన్టీఆర్‌ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

Apr 1 2026 1:40 PM | Updated on Apr 1 2026 1:55 PM

Tollywood actress Childhood photos viral On Social Media

చిన్నప్పటి జ్ఞాపకాలు ఎవరి జీవితంలో అత్యంత విలువైనవే. అలా ఒకసారి మన చిన్ననాటి ఫోటోలు దొరికితే తెగ సంబరపడిపోతాం. ఎవరికైనా ఆ బాల్యంలోని ఫోటోలను చూసినప్పుడల్లా వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. తాజాగా తెలుగులో కొద్ది సినిమాలే చేసిన ముద్దుగుమ్మ తన చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. గుండుతో ఉన్న క్యూట్‌ పిక్స్‌ చూసి తెగ సంబరపడిపోతూ పోస్ట్ చేసింది. తాను మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ నరసింహుడు మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సమీరా రెడ్డి.

ముంబయికి చెందిన బాలీవుడ్ భామ సమీరా రెడ్డి తెలుగు సినిమాల్లోనూ అలరించింది. జూనియర్ ఎ‍న్టీఆర్ సరసన నరహింహుడు, అశోక్‌ చిత్రాలు.. చిరంజీవితో జై చిరంజీవ మూవీలో మెప్పించింది. ఆ తర్వాత 2014లో ఎంటర్‌ప్రెన్యూర్‌ అక్షయ్‌ వార్డేను పెళ్లి చేసుకుంది. సమీరాకు 2015లో కుమారుడు హన్స్‌, 2019లో కూతురు నైరా జన్మించారు. 

అయితే పెళ్లి తర్వాత సమీరా రెడ్డి సినీ ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పేసింది ఈ బాలీవుడ్ బ్యూటీ. అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. తాజాగా తన చైల్డ్‌హుడ్ పిక్స్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసింది. కాగా.. సమీరా రెడ్డి 13 ఏళ్ల తర్వాత చిమ్ని అనే హర్రర్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement