breaking news
rains
-
తిరుపతిలో కుండపోత వర్షం
-
మూడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు
-
Pune: మూతపడిన స్కూళ్లు.. రేపు కూడా సెలవు?
పూణె: మహారాష్ట్రలోని పూణెలో నిన్న(ఆదివారం) రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం ప్రజాజీవనాన్ని ఘోరంగా దెబ్బతీసింది. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ట్రాఫిక్ చాలా నెమ్మదిగా కదులుతోంది. పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో పూణేలోని పాఠశాలలకు ఈ రోజు(సెప్టెంబర్ 15) సెలవు ప్రకటించారు. Pune Rains: Heavy Downpour Triggers Traffic Jams, Waterlogging Across City🔗 https://t.co/ibQExSolWN#punenews #punerains #Rain #weatheralert pic.twitter.com/9HCdtVz3w0— Free Press Journal (@fpjindia) September 15, 2025వాతావారణశాఖ అధికారుల సూచనల మేరకు సెప్టెంబర్ 16న కూడా సెలవు ప్రకటించారు. భారీ వర్షపాతం కారణంగా పూణేలో ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో, ప్రజలు ఇళ్లలోనే ఉండాలని పూణే మున్సిపల్ కార్పొరేషన్ సూచించింది. భారత వాతావరణ శాఖ పూణేతో పాటు సమీప జిల్లాల్లో భారీ వర్షంతో పాటు బలమైన గాలులు వీస్తాయని అంచనా వేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. భారత వాతావరణ శాఖ పూణే, ముంబై, థానే, రాయ్‌గడ్, బీడ్, అహల్యానగర్, లాతూర్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. భారీ నుండి అతి భారీ వర్షాలు కురియనున్నాయని, గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేసింది. -
గ్లోబల్ వార్మింగ్.. ప్రజలకు వార్నింగ్
సాక్షి, అమరావతి: గ్లోబల్ వార్మింగ్ రుతుపవనాల వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తూ.. ప్రజలకు వార్నింగ్ ఇస్తోంది. ప్రధానంగా వ్యవసాయాధారితమైన మన దేశంలో వ్యవసాయ, ఆర్థిక వ్యవస్థలకు పెనుముప్పు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. మన దేశంలో ఎక్కువమంది ప్రజలకు వ్యవసాయమే ఆధారం. సేద్యానికి జీవం పోసేది వర్షం. ఆ వర్షాలను సమకూర్చేవి రుతుపవనాలు. అవి లేకపోతే పంటలే లేవు. పంటలు లేకపోతే అన్నదాతే లేడు. అందుకే రుతుపవనాలను దేశ ఆర్థికవ్యవస్థకు ఊపిరిగా పరిగణిస్తారు. కానీ ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఈ రుతుపవనాల వ్యవస్థ అస్తవ్యస్తమవుతోంది. వర్షాలు ఎక్కడ పడతాయో, ఎప్పుడు పడతాయో అంచనా వేయడం కష్టమవుతోంది. ఎండాకాలంలో ఆకస్మిక వర్షాలు, వరదలు.. వర్షాకాలంలో ఎండలు, కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మన రాష్ట్రంలో గత వేసవిలో విపరీతమైన వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంలేదు. అదే సమయంలో వేసవిలో తరహాలో ఎండలు కాస్తున్నాయి. రెండు ప్రధాన రుతుపవన వ్యవస్థలు భూభాగం వేడెక్కి తక్కువ పీడనం ఏర్పడినప్పుడు సముద్రం నుంచి భూమివైపు వచ్చే తేమగాలులు విస్తారంగా వర్షాలు కురిపిస్తాయి. ఈ వ్యవస్థనే రుతు పవనాలుగా పిలుస్తారు. నైరుతి, ఈశాన్య రుతుపవనాలు వర్షాలు కురిపిస్తాయి.నైరుతి రుతుపవనాలు: ఈ సీజన్ జూన్ నుంచి సెపె్టంబర్ వరకు ఉంటుంది. దేశం మొత్తం వార్షిక వర్షంలో సుమారు 75 శాతం ఈ కాలంలోనే కురుస్తుంది. జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తాయి. అక్కడి నుంచి క్రమంగా దేశమంతా విస్తరిస్తూ జూన్ చివరినాటికి ఉత్తర భారతం వరకు చేరతాయి. జూలైలో గరిష్ట వర్షాలు పడతాయి. ఆగస్టు వరకు కొనసాగి, సెపె్టంబర్ చివర్లో ఇవి వెనుదిరుగుతాయి.ఈశాన్య రుతుపవనాలు: అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది. ముఖ్యంగా తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌కు ఈ వర్షాలు ప్రాణాధారం. నైరుతి రుతుపవనాలు వెళ్లిపోయిన తరువాత ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి. తగ్గిన ఎల్‌నినో ప్రభావం ఇప్పటివరకు రుతుపవనాలపై ఎల్‌నినో, లానినో ప్రభావం బలంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ ప్రభావం బలహీనమైంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల పెరుగుదలే వర్షాలపై ప్రధానంగా ఉంటోంది. ఎల్‌నినో, లానినో అనేవి పసిఫిక్ మహాసముద్రపు నీరు వేడెక్కడం, చల్లబడటం వల్ల జరిగే వాతావరణ మార్పులు. ఎల్‌నినోలో సముద్రం వేడెక్కుతుంది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో ఎండలు, కరువు పరిస్థితులు, కొన్నిచోట్ల వరదలు వస్తాయి. లానినోలో సముద్రం చల్లబడుతుంది. వర్షాలు ఎక్కువై తుపాన్లు కూడా రావచ్చు. ఈ రెండు వ్యవస్థలు ప్రపంచంలోని వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి.రుతుపవనాల ప్రభావం » దేశంలో 51 శాతం వ్యవసాయ భూమి రుతుపవనాలపైనే ఆధారపడి ఉంది. » మొత్తం ఆహారోత్పత్తిలో 40 శాతం ఈ రుతువుల వల్ల కురిసే వర్షాల ద్వారానే వస్తుంది. » గ్రామీణ జనాభాలో 47 శాతం మంది జీవనోపాధి వ్యవసాయమే. » చెరువులు, బావులు, నదులు నిండిపోవడం నుంచి విద్యుత్ ఉత్పత్తి వరకు అన్నింట్లో రుతుపవనాలు కీలకం. భవిష్యత్తు అంచనాలు » 2040 నాటికి వర్షపాతం 12 శాతం నుంచి 22 శాతం వరకు పెరిగే అవకాశం. » వర్షం కురిసే రోజులు తగ్గి, తక్కువ రోజుల్లోనే విపరీతంగా వర్షాలు కురుస్తాయి. » దీనిఫలితంగా వరదలతో పాటు కరువు పరిస్థితులు ఎదురవుతాయి. » ఈ శతాబ్దం చివరినాటికి రుతుపవనాల అసమానత మరింత తీవ్రం అవుతుంది.వాతావరణ వైపరీత్యాలు.. క్లౌడ్‌బరస్ట్‌ల ముప్పు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం రుతుపవనాల్లో విపరీత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తూర్పు, మధ్య, ఉత్తర భారతంలో వర్షపాతం తగ్గిపోతోంది. గుజరాత్, పశ్చిమ రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతాల్లో వర్షాలు పెరుగుతున్నాయి. భారీ వర్షపాతం సంఘటనలు మరింత ఎక్కువవుతున్నాయి. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ము–కశ్మీర్ ప్రాంతాల్లో ఒక్కసారిగా కురిసే ఆకస్మిక వర్షాలు (క్లౌడ్ బరస్ట్‌లు) పెరుగుతున్నాయి. గంటలో 100 మిల్లీమీటర్లకుపైగా వర్షం కురవడం వల్ల గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోతున్నాయి. అపారమైన ప్రాణ, ఆస్తినష్టం జరుగుతున్నాయి. వర్షాలు అసహజంగా కురవడం వల్ల గ్రామాల్లో, పట్టణాల్లో నీటినిల్వలు పెరుగుతున్నాయి. దీనివల్ల డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్య వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ–వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీనికితోడు రుతుపవన ద్రోణుల ప్రభావంతో వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాయలసీమ జిల్లాల్లోనూ తేలికపాటి వర్షం కురుస్తుందని పేర్కొంది. కాగా, శుక్రవారం ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పార్వతీపురం మన్యం జిల్లా నవగంలో అత్యధికంగా 7.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
దంచికొట్టిన వాన
సాక్షి, హైదరాబాద్/మెదక్ మున్సిపాలిటీ/తాండూరు రూరల్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు దంచికొట్టాయి. హైదరాబాద్‌తోపాటు మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లో భారీగా వర్షం కురిసింది. మెదక్‌లో గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏకధాటిగా 3 గంటలపాటు కుండపోత వాన కురిసింది. దీంతో మెదక్ పట్టణం అతలాకుతలమైంది. జిల్లా కేంద్రంలో అత్యధికంగా 17.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రోడ్లన్నీ చెరువులను తలపించగా, పట్టణంలోని పలువురి ఇళ్లలోకి నీరు చేరింది. పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రాంగణం వర్షపు నీటితో నిండిపోవడంతో విద్యా ర్థులు అవస్థలు పడ్డారు. మెదక్ మండలంలోని పలు గ్రామాల్లో 13 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాజధానిలో... హైదరాబాద్‌లో ఉదయం ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదంగా కన్పించిన వాతావరణం మధ్యాహ్నం మూడు తర్వాత ఆకాశంలో ఒక్కసారిగా దట్టంగా మబ్బులు కమ్ముకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం కురిసింది. హయత్‌నగర్‌లో 11.2 సెం.మీ., డిఫెన్స్ కాలనీ కమాన్ వద్ద 10.2 సెం.మీ, వర్షపాతం నమోదైంది. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపైకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్దుపై నాలుగు అడుగుల ఎత్తు మేర వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఎల్బీనగర్ నుంచి మెహిదీపట్నం వరకు ఉన్న ఇన్నర్ రింగ్‌రోడ్డు సహా ఇతర మార్గాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. వాగులో ఒకరి గల్లంతు వాగు దాటుతుండగా ఓ వ్యక్తి గల్లంతైన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంగెంకలాన్‌లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భుక్తంపల్లి మొగులప్ప(40) ఆవుల కాపరిగా పని చేస్తున్నాడు. గురువారం అతను ఊరి శివారులోని చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో వృథాగా పడేసిన టార్ఫాలిన్, ప్లాస్టిక్ కవర్ల కోసం దిడ్డివాగు దాటి వెళ్లాడు. ఎగువ ప్రాంతంలో కరిసిన వర్షానికి వరద ఉధృతమైంది. అవతలి ఒడ్డున ఉన్న గ్రామస్తులు వద్దని వారిస్తున్నా వినకుండా కవర్ల మూటను నెత్తిపై పెట్టుకుని వాగు దాటుతూ కొట్టుకుపోయాడు. అతని భార్య లలితమ్మ, ఇద్దరు కొడుకులు అక్కడికి చేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు. మొగులప్ప ఆచూకీ కోసం చేపట్టిన సహాయక చర్యలకు వర్షం ఆటంకం కలిగించింది. రెండ్రోజులు మోస్తరు వర్షాలు రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర సమీపంలో కొనసాగుతున్న ఉపరితల చక్రవాత ఆవర్తనం గురువారం కూడా కొనసాగింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 4.5 కి.మీ. ఎత్తువరకు కొనసాగుతోంది. మరో ద్రోణి సబ్ హిమాలయన్ పశ్చిమబెంగాల్, సిక్కిం ప్రాంతం నుంచి జార్ఖండ్, దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ వివరించింది. ప్రస్తుత నైరుతి సీజన్లో ఇప్పటివరకు సగటున 64.05 సెం.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 78.52 సెం.మీ. నమోదైంది. -
మరో వారం రోజుల పాటు ఢిల్లీకి వాతావరణ శాఖ వర్ష సూచన
-
కొనసాగుతున్న అల్పపీడనం
సాక్షి, అమరావతి/వాకాడు: వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఉత్తర ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. 24 గంటల్లో ఇది పశ్చిమ, వాయవ్య దిశగా ఉత్తర ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ వైపు కదిలేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయంది. బుధవారం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 5. 4 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. విశాఖ జిల్లా గాజువాకలో 5.3, అనకాపల్లి జిల్లా వేంపాడులో 4.4, విశాఖ జిల్లా నాతయ్యపాలెంలో 4.4, విజయనగరం జిల్లా మెరకముడిదంలో 3.6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అల్పపీడనం ప్రభావంతో గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. సముద్ర తీరంలో అలల ఉధృతి..అల్పపీడనం బలపడటంతో తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాళెం సముద్ర తీరంలో అలల ఉధృతి అధికమైంది. ఒక్కో సమయంలో సముద్రం నిశ్చలంగా, ఒక్కోసారి అలలు 7 మీటర్ల ఎత్తుకు ఎగసి పడుతున్నాయి. సాధారణంగా అల్పపీడనం సమయంలో సముద్రంలో అలలు ఎక్కువగా ఉండడంతోపాటు తీరం దాటే వరకు నిరంతరం కెరటాలు ఎగసి పడుతుంటాయి. ఈసారి అలా కాకుండా సముద్రం గంట గంటకు మార్పు చెందుతూ భయబ్రాంతులకు గురిచేస్తోంది. ప్రస్తుతం వినాయక విగ్రహ నిమజ్జనాల పర్వం తూపిలిపాళెం సముద్ర తీరంలో కొనసాగుతోంది. అలలు లేని సమయం కోసం భక్తులు ఎదురు చూసి నిమజ్జనం చేస్తున్నారు. వాకాడు పోలీసులతోపాటు దుగ్గరాజపట్నం మెరైన్ పోలీసులు భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. మత్స్యకారులు వేట నిలిపివేశారు. -
ఇక పడేదంతా బోనస్సే
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాల సీజన్లో వర్షాలు సంతృప్తికర స్థాయిలో నమోదయ్యాయి. రాష్ట్రంలో ఈ సీజన్లో ఇప్పటివరకు కురవాల్సిన సగటు సాధారణ వర్షపాతానికి మించి వానలు పడ్డాయి. అయితే ఈ సీజన్ సెప్టెంబర్ నెలాఖరు వరకు ఉంది కాబట్టి.. ఇకపై కురిసే వర్షాలు అదనమేనని, వర్షాలు కురిస్తే సగటు సాధారణ వర్షపాతాన్ని మించి నమోదైనట్టేనని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు నైరుతి రుతుపవనాల సీజన్ కాగా.. ఈ 4 నెలల కాలంలో రాష్ట్రంలో 74.06 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. సెప్టెంబర్ 2వ తేదీ నాటికి 59.30 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా,... ఏకంగా 75.75 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సగటు వర్షపాతం కంటే 28 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. ఆరు జిల్లాల్లో అత్యధిక వర్షాలు ∙ప్రస్తుత సీజన్లో రాష్ట్రంలోని 6 జిల్లాల్లో అత్యధిక వర్షాలు నమోదయ్యాయి. 14 జిల్లాల్లో అధిక వర్షపాతం, 13 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అత్యధికంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 60 రోజులు వర్షాలు పడ్డాయి. ఆ తర్వాత ఆదిలాబాద్‌లో 55, ములుగులో 51 రోజుల పాటు వర్షాలు కురిశాయి. నిర్మల్‌లో 48, వరంగల్‌లో 47, మహబూబాబాద్‌లో 44, మెదక్, సంగా రెడ్డి జిల్లాలో 43 రోజుల పాటు వర్షాలు కురిశాయి. నారాయణపేట, రంగారెడ్డి జిల్లాల్లో 42 రోజులు చొప్పున, కామారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, ఖమ్మం జిల్లాల్లో 41 రోజుల చొప్పున వర్షాలు కురిశాయి. మండలాల వారీగా వర్షపాతాన్ని పరిశీలిస్తే..119 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 271 మండలాల్లో అధిక వర్షపాతం, 218 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 13 మండలాల్లో మాత్రం ఇంకా లోటు ఉంది. సీజన్ ముగిసే నాటికి ఈ మండలాల్లో కూడా సాధారణ వర్షపాతం నమోదవుతుందని అధికారులు చెబుతున్నారు. సెపె్టంబర్లో రాష్ట్రంలో సాధారణం కంటే కాస్త ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే అంచనాలు విడుదల చేసింది.» అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లాలు: మెదక్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, యాదాద్రి భువనగిరి, వనపర్తి, కామారెడ్డి » అధిక వర్షపాతం నమోదైన జిల్లాలు : సిద్దిపేట, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, జోగుళాంబ గద్వాల, హైదరాబాద్, నల్లగొండ, మేడ్చల్–మల్కాజిగిరి, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్ » సాధారణ వర్షపాతం నమోదైన జిల్లాలు: ములుగు, మహబూబా బాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, జనగామ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, హనుమకొండ, పెద్దపల్లి. -
ఉత్తరాదిన వర్ష బీభత్సం కొనసాగుతున్న DDMA రిలీఫ్ ఆపరేషన్
-
68 రైళ్లు నెల్లాళ్లు క్యాన్సిల్.. రైల్వే చెబుతున్న కారణమిదే..
శ్రీనగర్: భారీ వర్షాల నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, ఏకంగా 68 రైళ్లను క్యాన్సిల్ చేసింది. వర్షాల తాకిడి జమ్ముకశ్మీర్‌లో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న నేపధ్యంలో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.భారీ వర్షాల కారణంగా జమ్ము- కత్రా స్టేషన్ల నుండి రాకపోకలు సాగించే 68 రైళ్లను సెప్టెంబర్ 30 రద్దు చేసినట్లు భారత రైల్వే శాఖ తెలిపింది. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా, జమ్ము రైల్వే డివిజన్లో గత ఎనిమిది రోజులుగా టైల్ ట్రాఫిక్ నిలిపివేశారు. పఠాన్‌కోట్-జమ్ము సెక్షన్‌లోని పలు చోట్ల ట్రాక్‌లపై పగుళ్లు ఏర్పడ్డాయి. ఆగస్టు 26 నుండి జమ్ము ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వేలాది మంది, ముఖ్యంగా యాత్రికులు ఇక్కడ చిక్కుకుపోయారు. కాట్రాలోని మాతా వైష్ణో దేవి మందిరం సమీపంలో కొండచరియలు విరిగిపడి 34 మంది ప్రాణాలు కోల్పోయారు.జమ్ములో చిక్కుకుపోయిన ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ పలు ప్రత్యేక రైలు సర్వీసులు నడుపుతోంది. మరోవైపు లోయలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం సాయంత్రం కశ్మీర్ లోయలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయని అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణ సూచన దృష్ట్యా విభాగాలన్నీ అప్రమత్తంగా ఉన్నాయన్నారు. జీలం నది, ఇతర నీటి వనరులు వరద హెచ్చరిక స్థాయి కంటే ప్రస్తుతానికి తక్కువగానే ప్రవహిస్తున్నాయని తెలిపారు. -
Himachal: విపత్తుల్లో ఐదుగురు మృతి.. అంతటా జల దిగ్బంధం
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. తాజాగా రాష్ట్రంలో సంభవించిన కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా పలు చోట్ల ఇళ్లు కూలిపోయిన ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. నాలుగు జాతీయ రహదారులు సహా 1,337 రోడ్లు మూసుకుపోయాయని అధికారులు తెలిపారు.రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాలతో భారత వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాంగ్రా, మండి, సిర్మౌర్, కిన్నౌర్ జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. సోలన్ జిల్లాలోని సామ్లో గ్రామంలో భారీ వర్షాలకు ఇల్లు కూలడంతో ఒక మహిళ మృతిచెందింది. మృతురాలిని హేమలతగా గుర్తించారు. ప్రమాదంలో ఆమె భర్త హీమ్ రామ్, నలుగురు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.కులులోని ధల్పూర్లో వర్షం కారణంగా ఇల్లు కూలిపోవడంతో శిథిలాల నుంచి ఒక పురుషుడు, ఒక మహిళను సహాయక సిబ్బంది రక్షించారు. ఆ మహిళ తరువాత మృతిచెందింది. మండి జిల్లాలోని సుందర్‌నగర్‌లోని జంగం బాగ్ బీబీఎంబీ కాలనీ సమీపంలో కొండచరియలు విరిగిపడి, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం, పోలీసు బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రం జలదిగ్బంధంలో చిక్కుకుంది. -
ఐదు రోజులూ వర్షాలే...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం నుంచి ఈ నెల 7వ తేదీ వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. 3వ తేదీ: ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలివేగం గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు అన్ని జిల్లాల్లో అక్కడక్కడా కురవొచ్చు. 4వ తేదీ: ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కుమురంభీంఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు అన్ని జిల్లాల్లో అక్కడక్కడా కురవొచ్చు. 5వ తేదీ: ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగుళాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్–మల్కాజ్గిరి, ములుగు, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, వరంగల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (గాలి వేగం గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు (వేగం గంటకు 30–40 కి.మీ.) జనగాం, ఖమ్మం, నల్లగొండ, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడా వీచే అవకాశం ఉంది. 6వ తేదీ: ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల (వేగం 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. హనుమకొండ, హైదరాబాద్, జనగాం, జోగుళాంబ గద్వాల, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మేడ్చల్– మల్కాజ్గిరి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడా బలమైన ఉపరితల గాలులు (వేగం 30–40 కి.మీ.) వీచే అవకాశం ఉంది.7వ తేదీ: అన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు (వేగం గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
Heavy Rains: ఏపీకిహై అలర్ట్ రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు
-
నీటితో కొట్టుకుపోతున్న మట్టి ఎంత?
మనం తినే ఆహారంలో 95% మట్టిలోనే పండుతోంది. వ్యవసాయానికి, ఆహార భద్రతకు నేలపైన ఉండే 6 అంగుళాల మట్టే (టాప్ సాయిల్) మూలాధారం. మానవాళికి ఎంతో విలువైన ఈ వారసత్వ సంపద వర్షాలకు, వరదలకు కొట్టుకుపోతోంది. మేటలు వేసిన ఇసుక ఆ మట్టిలోనిదే. పంట నష్టం, ఆస్తి నష్టం కన్నా మట్టి నష్టం చాలా పెద్దది. మనం ఎవరూ పట్టించుకోని విపత్తు ఇది.ఇలా భూముల్లోనుంచి కొట్టుకెళ్లిన మట్టి, ఇసుకతో రిజర్వాయర్లు, చెరువులు పూడుకుపోతున్నాయి. పైమట్టిని కోల్పోతున్న సాగు భూములు నిస్సారమవుతున్నాయి. ఫలితంగా 1960లో కిలో రసాయనిక ఎరువు వేస్తే 16.5 కిలోల పంట వచ్చేది. ఇప్పుడు 3.5 కిలోలకు తగ్గిపోయింది. మన దేశంలో ప్రతి సంవత్సరం హెక్టారుకు సగటున 21 టన్నుల టాప్ సాయిల్ కొట్టుకుపోతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు, వరదలకు కోల్పోతున్న మట్టి ఎంత? మట్టి కొట్టుకుపోకుండా ఏమైనా చెయ్యగలమా? ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకోవాలి? వ్యవసాయ పద్ధతుల్లో ఏం మార్పులు తేవాలి? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? చదవండి.. – సాక్షి సాగుబడిమట్టి.. మనకు పూర్వీకులు ఇచ్చిన వారసత్వ సంపద. మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషకాలు, తేమతో కూడి ఉండే నేల పైపొర వ్యవసాయానికి చాలా ముఖ్యమైనది. మట్టి కోతకు గురికావటం వల్ల భూమి ఉత్పాదకశక్తి, పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. భూమి పైపొరలో 6 సెం.మీ. లోతు మట్టిలోనే పంటలు పండించుకొని తిని మనం బతుకుతున్నాం. 95% ఆహారాన్ని ఇస్తున్నది ఈ మట్టే. రాళ్లు రప్పలు, ఆకులు అలముల కారణంగా మట్టి సహజసిద్ధంగా నిరంతరం ఏర్పడుతూనే ఉంటుంది. 6 సెం.మీ. మందాన మట్టి ఏర్పడటానికి 1,000 సంవత్సరాలు పట్టవచ్చని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ లెక్క తేల్చింది. అయితే, అంతకన్నా అతివేగంగా కొట్టుకుపోతున్నది. ఎక్కువగా దున్నే భూములు, కొండ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువ.తెలుగు రాష్ట్రాల్లో కొట్టుకుపోతున్న మట్టి ఎంత?తెలుగు రాష్ట్రాల్లో ఏటా హెక్టారుకు సగటున 14–15 టన్నుల మట్టి కొట్టుకుపోతోంది. తెలంగాణలో సగటున హెక్టారుకు ఏడాదికి 14 టన్నులు, ఆంధ్రప్రదేశ్‌లో సగటున 15 టన్నుల మట్టి వర్షానికి, వరదలకు కొట్టుకుపోతున్నదని ఐఐటీ ఢిల్లీ అధ్యయనంలో వెల్లడైంది. అయితే, కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా వేల టన్నుల్లోనే మట్టి కోతకు గురై కొట్టుకుపోతోంది.కొండ ప్రాంతాలు, వాలు ఎక్కువగా ఉన్న భూములు, అడవులు నరికివేసిన నేలలు, తవ్వకాలు జరిగే ప్రాంతాలు, ఎక్కువగా దుక్కి లేదా దమ్ము చేసే ఎటువంటి ఆచ్ఛాదనా లేని వ్యవసాయ భూముల్లో నుంచి నమ్మలేనంత ఎక్కువ మొత్తంలో హెక్టారుకు ఏడాదికి వేల టన్నుల్లోనే మట్టి కొట్టుకుపోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది 4,407 టన్నులైతే, తెలంగాణలో కొంచెం తక్కువగా 3,498 టన్నులు కొట్టుకుపోతోందని ఈ అధ్యయనం వెల్లడించింది.పెద్దపల్లిలో అత్యధికంతెలంగాణ జిల్లాల్లో కోతకు గురై కొట్టుకుపోతున్న మట్టి హెక్టారుకు ఏడాదికి సగటున టన్నుల్లో : పెద్దపల్లి– 22, నల్లగొండ– 20, కుమురంభీం ఆసిఫాబాద్– 18, ములుగు– 18, జయశంకర్ భూపాలపల్లి– 18, ఆదిలాబాద్ – 17, జగిత్యాల– 17, భద్రాద్రి కొత్తగూడెం– 17, మంచిర్యాల– 17, ఖమ్మం– 16, సూర్యాపేట– 16, వరంగల్ రూరల్– 16, మహబూబాబాద్– 13, కరీంనగర్ – 13, వరంగల్ అర్బన్– 13, యాదాద్రి భువనగిరి– 13, వనపర్తి– 12, జనగాం– 12, నిర్మల్– 12, నిజామాబాద్– 12, వికారాబాద్– 12, కామారెడ్డి– 11, రాజన్న సిరిసిల్ల– 11, మహబూబ్‌నగర్– 11, నాగర్ కర్నూల్– 11, సంగారెడ్డి– 10, నారాయణపేట– 10, సిద్ధిపేట– 9, మెదక్– 9, రంగారెడ్డి– 9, జోగుళాంబ గద్వాల– 8, మేడ్చల్–మల్కాజిగిరి– 6, హైదరాబాద్– 0. జనావాసాలతో కిక్కిరిసి ఉండే హైదరాబాద్ జిల్లా నుంచి వర్షానికి మట్టి పెద్దగా కొట్టుకుపోవట్లేదు! అత్యధికంగా మట్టి కొట్టుకుపోతున్న రాష్ట్రాల్లో తెలంగాణ (Telangana) ఒకటని ఇస్రో అధ్యయనం తెలిపింది.ఆరు వర్గీకరణలుఈశాన్య రాష్ట్రమైన అస్సాంలోని బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతం దాదాపు 300 చదరపు కిలోమీటర్లు లేదా దాని ఉపరితల నేలలో 31 శాతం ‘విపత్కర’ స్థాయిలో కోతకు గురవుతోంది. ‘దేశంలో నేల కోతపై సమగ్ర అవగాహన కలిగించేందుకు నేల కోత ఏయే జిల్లాల్లో ఏయే దశల్లో ఉందో అధ్యయనం చేశాం’ అన్నారు సహారియా. ఒక సంవత్సరంలో హెక్టారు భూమి నుంచి టన్నుల కొద్దీ మట్టి కొట్టుకుపోతోంది. ఒక సంవత్సరంలో ఒక హెక్టారులో 100 టన్నులకు పైగా మట్టి కోతకు గురైనట్లు తేలితే, ఆ ప్రాంతాన్ని ‘విపత్తు’ ప్రాంతంగా వర్గీకరిస్తారు.జాతీయ సగటు హెక్టారుకు 21 టన్నులుదేశంలో వానలు, వరదలకు సగటున సంవత్సరానికి హెక్టారు భూమి నుంచి 21 టన్నుల మేరకు మట్టి నీటితో పాటు కొట్టుకుపోతోందని ఢిల్లీ ఐఐటీ అధ్యయనంలో తేలింది. భౌగోళిక స్థితి, జీవవైవిధ్య పరంగా హిమాలయాలు, బ్రహ్మపుత్ర లోయ ప్రాంతాలు నేల కోతకు అతిపెద్ద హాట్‌స్పాట్. అక్కడితో పోల్చితే భిన్నంగా ఉండే ఒడిశా లో కూడా ‘విపత్కర’ స్థితిలో నేల కోతకు గురవుతోంది.జిల్లాల వారీగా చూస్తే, దేశంలో నేల కోతకు గురయ్యే అవకాశం ఉన్న 20 జిల్లాల్లో తొమ్మిది అస్సాంలోనే ఉన్నాయని అధ్యయనం పేర్కొంది. అడవుల నరికివేత, రసాయనిక/పారిశ్రామిక వ్యవసాయ పద్ధతుల్లో వ్యవసాయం చెయ్యటమే ఇందుకు కారణమని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ‘నేల కోతకు సంబంధించి పాన్–ఇండియా స్థాయిలో రాష్ట్రాలు, జిల్లాల వారీగా అధ్యయనం చేసి గణాంకాలను ఆన్లైన్లో అందరికీ అందుబాటులో ఉంచాం. భవిష్యత్తులో నేల సంరక్షణ ప్రణాళికల అమలుకు ఈ సమగ్ర అవగాహన దోహదపడుతుందని ఆశిస్తున్నాం అన్నారు సహారియా.వర్షపాతం ఇంకా పెరుగుతుంది!వర్షపాతం వచ్చే రోజుల్లో మరింత పెరుగుతుందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 2050 నాటికి ఖరీఫ్ కాలంలో 5–10 శాతం, రబీ కాలంలో 12–17 శాతం వర్షపాతం పెరుగుతుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గతంలో పార్లమెంటులో చెప్పారు. అంటే, నివారణ చర్యలకు మనం ఉపక్రమించకపోతే రానున్న రోజుల్లో మరింత మట్టి కొట్టుకుపోతుందన్నమాట. 2050 నాటికి హెక్టారుకు మరో 10 టన్నుల మట్టి కొట్టుకుపోతుందని కూడా మంత్రి హెచ్చరించారు. సుస్థిర వ్యవసాయ పద్ధతుల ద్వారా ఈ సమస్యను కొంత వరకు అధిగమించవచ్చు.100 టన్నుల మట్టి పోతే విపత్తు!మన దేశంలో భూముల ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని ఢిల్లీలోని ఇండియన్ ఇ¯Œ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) అధ్యయనం వెల్లడించింది. దాదాపు 30 శాతం భూభాగం ‘స్వల్పంగా’ కోతకు గురవుతూ ఉంటే, కీలకమైన 3 శాతం భూభాగం ‘విపత్కర’ స్థితిలో మట్టిని వర్షాలు, వరదల వల్ల నష్టపోతోందని ఈ పరిశోధన తెలిపింది. జియోస్పేషియల్ మోడలింగ్ – మ్యాపింగ్’ పేరిట జరిగిన ఈ అధ్యయనం మన దేశం అంతటా నేల కోతను లెక్కగట్టింది. ఢిల్లీ ఐఐటీలో సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, హైడ్రోసెన్స్ ల్యాబ్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డా. మనబేంద్ర సహారియా, రవిరాజ్ అధ్యయనం చేశారు.ఉత్తరాంధ్రలో అత్యధికంఏపీలోని పాత జిల్లాల్లో కోతకు గురై కొట్టుకుపోతున్న మట్టి హెక్టారుకు ఏడాదికి సగటున టన్నుల్లో : శ్రీకాకుళం– 27, విశాఖపట్నం– 27, విజయనగరం– 25, తూర్పు గోదావరి– 16, చిత్తూరు– 16, అనంతపురం– 15, వైఎస్సార్ కడప – 14, పశ్చిమ గోదావరి– 13, కృష్ణా– 13, ప్రకాశం– 13 (782), గుంటూరు– 12, కర్నూలు– 12, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు– 10 .భవిష్యత్తు తరాలు ఏమైపోతాయి?హెక్టారు భూమిలో 1 సెం. మీ. వర్షం కురిస్తే లక్ష లీటర్ల నీరు పడుతుంది. అధిక వర్షాలకు పొలంలోని మెత్తని మట్టి నీట కరిగి వరదతో వెళ్లిపోతుంది. ఆ మట్టి నీటి అడుగుకు చేరాలంటే పది గంటలు పడుతుంది. కాబట్టి, రిజర్వాయర్లు, చెరువుల్లోకి వరద నీటి ద్వారా ఆ మట్టి చేరుతుంది. ఇసుకైతే దగ్గర్లోని పొలాల్లో మేట వేస్తుంది. నేల పైపొర మట్టి వర్షానికి కొట్టుకుపోతే అడుగున మొరం, రాళ్లు, రప్పలు పైకి తేలతాయి. ఒక మోస్తరు వర్షపు నీరు పొలం నుంచి బయటకు పోకుండా భూమిలోకి ఇంకాలంటే పంట పొలాల్లో కందకాలు, కుంటలు తవ్వుకోవాలి. నీరు ఇంకటంతో పాటు మట్టి కూడా పొలం దాటి బయటకు పోకుండా కందకాలు లేదా కుంటల్లో ఆగుతుంది. మట్టిని తర్వాత తీసి మళ్లీ పొలంలో వేసుకోవచ్చు. మట్టిని పరిరక్షించుకునేందుకు అందరూ శ్రద్ధ తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్తు తరాలు ఏమైపోతాయి?– డా. అల్లూరి పద్మరాజు, ఆంగ్రూ మాజీ వైస్ఛాన్సలర్మట్టిని జాతి సంపదగా చూడాలిఏటా హెక్టారు భూమిలో 1.5 టన్నుల మట్టి కొత్తగా ఏర్పడుతుంది. 200 ఏళ్లకు గానీ ఒక అంగుళం ఎత్తు మట్టి ఏర్పడదు. అయితే, అంతకు 8 రెట్ల మట్టి ప్రతి ఏటా వాన నీటితో, గాలితో కొట్టుకు పోతోంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. పొలం రైతు సొంతదైనా మట్టిని జాతి సంపదగా చూడాలి. మట్టిని కాపాడుకోవటానికి, భూసారాన్ని పెంపొందించుకోవటానికి ప్రభుత్వం ఈ 4 పనులు చెయ్యాలి: 1. భూమిని వీలైనంత మేరకు ఆచ్ఛాదన పంటలతో, గడ్డితో కప్పి ఉంచటం. 2. అతిగా దున్నటం, దమ్ము చెయ్యటం తగ్గించటం. 3.సాగు పద్ధతి ఏదైనా భూమిలో సేంద్రియ పదార్థం ఎక్కువగా కలిసేలా పచ్చిరొట్ట పంటలు సాగు చేసి కలియదున్నాలి. 4. ప్రతి సీజన్లోనూ దున్నాల్సిన అవసరం ఉన్న వరి వంటి పంటలకు బదులు తోటల సాగుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి.– డా. జీవీ రామాంజనేయులు, ఈడీ, సుస్థిర వ్యవసాయ కేంద్రం వ్యవస్థాపకులు -
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు
-
Devastating Monsoon Rains: దేశాన్ని ముంచేస్తోన్న వరద
-
విజయవాడలో భారీ వర్షం
-
రాష్ట్రంలో రెండ్రోజులపాటు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: వాయవ్య బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న ట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో నైరు తి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. దాని ప్రభావంతో పలు ప్రాంతాల్లో వచ్చే రెండ్రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేస్తూ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 26 మండలాల్లో ఇంకా లోటు... జూన్, జూలై, ఆగస్టులలో 57.3 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 72.06 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. జిల్లాలవారీగా చూస్తే 8 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 10 జిల్లాల్లో అధికం, 15 జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. అత్యధికంగా మెదక్ జిల్లాలో 90 శాతం అధిక వర్షాలు నమోద య్యాయి.136 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 238 మండలాల్లో అధికం, 221 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదవగా 26 మండలాల్లో లోటు వర్షపాతం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. నిలకడగా గోదావరి కాళేశ్వరం: గోదావరినది నిలకడగా ప్రవహిస్తోంది. ఆదివారం కాళేశ్వరం వద్ద పుష్కరఘాట్లను తాకుతూ 12.500 మీటర్ల ఎత్తులో నీటిమట్టం దిగువకు ప్రవహించింది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాళేశ్వరానికి ఎగువ ఉన్న అన్నారం బరాజ్ నుంచి వద్ద 3.56 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. మొత్తం 66 గేట్లు ఎత్తి ఉంచడంతో అక్కడి నుంచి కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రాణహితనదితో కలిసి పరవళ్లు తొక్కుతోంది. మేడిగడ్డ బరాజ్‌కు 8.19 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 85 గేట్లు ఎత్తి నీటిని అదేస్థాయిలో దిగువకు వదులుతున్నారు. -
Punjab: భీకర వరదలు.. లక్షల ఎకరాల్లో పంట నష్టం.. 1,018 గ్రామాలు నీట మునక
చండీగఢ్: పంజాబ్‌లో దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత అత్యంత భీకర వరదలు సంభవించాయి. ఫలితంగా మూడు లక్షల ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. 1,018 గ్రామాలు నీట మునిగాయి. 1988లో సంభవించిన వరదల తర్వాత ఇప్పుడు అదే స్థాయిలో వరదలు పంజాబ్‌ను చుట్టుముట్టాయి. పంజాబ్‌లో తాజాగా సంభవించిన వరదలు వెయ్యికి పైగా గ్రామాలను ప్రభావితం చేశాయి. మూడు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కారణంగా సట్లెజ్, బియాస్, రావి నదులు పొంగిపొర్లుతున్నాయి. ముంపు ప్రాంతాల్లోని వేలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద విపత్తులకు ముగ్గురు మరణించినట్లు సమాచారం. హిమాచల్ ప్రదేశ్, జమ్ముక కశ్మీర్లో భారీ వర్షాల కారణంగా సట్లెజ్, బియాస్, రావి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్, అమృత్సర్, తర్న్ తరణ్, ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, ఫాజిల్కా, కపుర్తలా హోషియార్పూర్ జిల్లాల్లో వరదలు సంభవించాయి. On one hand, Indian Punjab is drowning, people are starving & struggling but the lapdog media is only staging pictures to show that it is “helping.” The truth is, this disaster is the very fire it ignited itself which has now come back to haunt it.#PunjabFloods2025 #FloodAlert pic.twitter.com/llwTgL9LzY— Noor Fatima (@Fatima_Zahra120) August 29, 2025ప్రాథమిక నివేదికల ప్రకారం సరిహద్దు జిల్లా ఫాజిల్కాలో 41,099 ఎకరాల వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయి. పంజాబ్ జల వనరుల మంత్రి బరీందర్ కుమార్ గోయల్ మాట్లాడుతూ వరదల వల్ల దెబ్బతిన్న గ్రామాలలో దాదాపు మూడవ వంతు గ్రామాలు గురుదాస్‌పూర్ జిల్లాలో ఉన్నాయన్నారు. గురుదాస్‌పూర్‌లో 2,571 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, ఫజిల్కాలో 1239 మందిని తరలించినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం 77 సహాయ శిబిరాల్లో 4,729 మంది ఆశ్రయం పొందుతున్నారు. Reality of Punjab Floods Full Report Linkhttps://t.co/xktLuLGoLb pic.twitter.com/zzrD89WfWd— Rattandeep Singh Dhaliwal (@Rattan1990) August 27, 2025 -
గంటకు 400 కిలోమీటర్లు!
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకటైన ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. గుజరాత్‌లోని స్టేషన్ ్సలో సివిల్ పనులు పూర్తి అయ్యాయని రైల్వే శాఖ ప్రకటించింది. అత్యాధునిక సాంకేతికతతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో భాగంగా ఈస్ట్ జపాన్ రైల్వే కంపెనీ అభివృద్ధి చేస్తున్న ‘ఈ–10’ షింకన్సెన్ బుల్లెట్ రైలు 2030లో పట్టాలెక్కనుంది. గంటకు 400 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం ఈ ట్రైన్ ప్రత్యేకత.జపాన్ పర్యటనలో భాగంగా షింకన్సెన్ బుల్లెట్ రైలులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించడం ప్రాధాన్యత సంతరించుకుంది. జపాన్ సహకారంతో ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టును భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. హై స్పీడ్ రైల్ నడపడం కోసం అక్కడ శిక్షణ పొందుతున్న భారత డ్రైవర్లతోనూ మోదీ ముచ్చటించారు. ఈ నేపథ్యంలో దేశంలోని తొలి హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు మరోసారి వార్తల్లోకెక్కింది.508 కి.మీ. కారిడార్బుల్లెట్ రైలు ప్రాజెక్టు గుజరాత్, మహారాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీల గుండా పోతుంది. మొత్తం కారిడార్ పొడవు 508 కిలోమీటర్లు. ఇందులో 12 స్టేషన్లు ఉంటాయి. వీటిలో మహారాష్ట్రలో నాలుగు, గుజరాత్లో ఎనిమిది రానున్నాయి. మహారాష్ట్రలో ముంబై స్టేషన్ భూగర్భంలో నిర్మిస్తుండగా మిగిలిన థానే, విరార్, బోయిసర్, అలాగే గుజరాత్‌లోని వాపి, బిలిమోరా, సూరత్, భారుచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి వద్ద ఎలివేటెడ్ స్టేషన్ ్స రానున్నాయి.⇒ మొత్తం 8 స్టేషన్లలో ఫౌండేషన్ పనులు పూర్తయ్యాయి. ⇒ 395 కి.మీ పీయర్ పనులు, 407 కి.మీ. ఫౌండేషన్, 337 కి.మీ. గర్డర్ క్యాస్టింగ్ కూడా పూర్తయ్యాయి. ⇒ 17 రివర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయింది. మరో 9 రివర్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తికావచ్చింది. ⇒ 317 కి.మీ. వయడక్ట్ నిర్మాణం కూడా పూర్తయింది. ⇒ గుజరాత్లో 198 కిలోమీటర్ల ట్రాక్ సిద్ధమైంది.ట్రయల్ రన్ 2027లో..గుజరాత్లో మొదటి 50 కిలోమీటర్ల మార్గంలో 2027లో బుల్లెట్ రైలు పరుగు తీయనుంది. గుజరాత్‌లోని స్టేషన్ల నిర్మాణం 2027 డిసెంబర్ నాటికి, మొత్తం ప్రాజెక్టు 2029 డిసెంబర్ నాటికి పూర్తవుతుందని రైల్వే శాఖ ప్రకటించింది.రూ.78,839 కోట్ల వ్యయంముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,08,000 కోట్లు. ఈ ఏడాది జూన్ 30 నాటికి రూ.78,839 కోట్లు ఖర్చు చేశారు.⇒ ప్రాజెక్టు అంచనా వ్యయంలో 81 శాతం మొత్తాన్ని జపాన్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ (జికా) ద్వారా జపాన్ ప్రభుత్వం సమకూరుస్తోంది. ⇒ ఈ ప్రాజెక్టులో రైల్వే శాఖకు 50 శాతం; మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలకు చెరి 25 శాతం వాటా ఉంది. ఆర్థిక సహాయంతోపాటు భారత్‌లో సమాచార సేకరణ, పరీక్షల కోసం రెండు షింకన్సన్ రైళ్లను జికా ఉచితంగా సరఫరా చేస్తోంది.స్థల సేకరణ పూర్తిమహారాష్ట్రలో భూసేకరణ, అనుమతుల జాప్యం, కోవిడ్–19 మహమ్మారి.. తదితర కారణాలతో ఈ ప్రాజెక్టు దాదాపు రెండున్నరేళ్లు ఆలస్యం అయింది. ప్రాజెక్టుకు కావాల్సిన 1,389.5 హెక్టార్ల భూ సేకరణ పూర్తి అయినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. అన్ని అనుమతులూ పొంది, సివిల్ కాంట్రాక్టులన్నీ నిర్మాణ సంస్థలకు అప్పగించారు.80 నిమిషాల్లో...గంటకు 400 కి.మీ. వేగంతో పరిగెత్తే ఈ–10 బుల్లెట్ ట్రైన్ ముంబై నుంచి సబర్మతికి మధ్య ఉన్న 508 కిలోమీటర్ల దూరాన్ని నాన్ –స్టాప్‌గా అయితే 80 నిముషాల్లో పూర్తి చేస్తుంది.ఈ–5 కాదు.. ఈ–10 రైళ్లుఒప్పందంలో భాగంగా జపాన్ ప్రభుత్వం ‘ఈ–5’ షింకన్సెన్ బుల్లెట్ రైళ్లు మనదేశానికి పంపాలి. కానీ, ఇప్పుడు అత్యాధునికమైన ‘ఈ–10’ రైళ్లు ఆ దేశం తయారుచేస్తోంది. వాటినే మనకు పంపనుంది. ఇవి జపాన్ తోపాటు భారత్‌లోనూ 2030 ప్రారంభంలో ఎంట్రీ ఇవ్వనున్నాయి. ‘ఈ–5’ బుల్లెట్ ట్రైన్ వేగం గంటకు గరిష్టంగా 320 కి.మీ. కాగా, ఈ–10 రైలు వేగం 400 కి.మీ. ఈ రైళ్లను భారత్‌లోనూ తయారు చేసే అవకాశం ఉంది. సముద్రగర్భ రైల్ టన్నెల్ఈ కారిడార్‌లో 21 కిలోమీటర్ల పొడవైన సముద్రగర్భ రైల్ టన్నెల్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ముంబై–థానే మధ్య నిర్మిస్తున్న ఈ టన్నెల్లో భారత్‌లో మొట్టమొదటి 7 కి.మీ. పొడవైన సముద్రగర్భ సొరంగం కూడా ఉంది. 13.1 మీటర్ల వ్యాసం కలిగిన ఒకే ట్యూబ్ సొరంగంలో రెండు ట్రాక్‌లు ఉంటాయి. మహారాష్ట్రలోని 4 కి.మీ. టన్నెల్ పనులు, గుజరాత్‌లోని ఒకే ఒక్క టన్నెల్ నిర్మాణం పూర్తయ్యాయి.⇒ హైస్పీడ్ రైల్ కారిడార్ మొత్తం పొడవు 508 కి.మీ.⇒ నర్మద, తపతి వంటి నదులపై నిర్మిస్తున్న మొత్తం 25 రివర్ బ్రిడ్జిలలో 17 పూర్తి⇒ మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.1,08,000 కోట్లలో ఇప్పటికే రూ.78,839 కోట్ల వ్యయం⇒ గుజరాత్లో 2027లో 50 కిలోమీటర్లలో పాక్షిక కార్యకలాపాలు⇒ 2030లో పూర్తిస్థాయిలో పరుగులు తీయనున్న బుల్లెట్ రైల్ -
jammu Kashmir: రంబన్‌లో క్లౌడ్ బరస్ట్.. అంతటా హాహాకారాలు.. ముగ్గురు మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని రంబన్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఫలితంగా ఆకస్మిక వరదలు తలెత్తాయి. అనేక ఇళ్లు జల సమాధి అయ్యాయి. ఈ ప్రకృతి వైపరీత్యంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. నలుగురు గల్లంతయ్యారు. స్థానిక అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.రంబన్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భారీ వర్షాలు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగిస్తున్నాయి. అయినప్పటికీ రెస్క్యూ సిబ్బంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. క్లౌడ్ బరస్ట్ కారణంగా అకస్మాత్తుగా వచ్చిన వరదలతో పలు ఇళ్లు జలమయమయ్యాయి. కల్వర్టులు, రోడ్లు ధ్వంసమయ్యాయి. వాతావరణ శాఖ భారీ వర్ష సూచనకు సంబంధించిన హెచ్చరిక జారీ చేసింది.ఆగస్టు 14న చిసోటిలో క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన విపత్తులకు 65 మంది మృతిచెందారు. వీరిలో అధిక సంఖ్యలో పర్యాటకులున్నారు. ఈ ఘటనల్లో 100 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. ఇదేవిధంగా కథువా జిల్లాలో ఆకస్మిక వరదకు ఐదుగురు పిల్లలతో సహా ఏడుగురు మృతి చెందారు. మంగళవారం రియాసి జిల్లాలోని వైష్ణో దేవి మార్గంలో కొండచరియలు విరిగిపడి, 34 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారు. ఆకస్మిక వరదల తరువాత పరిస్థితిని సమీక్షించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆగస్టు 24న జమ్మూను సందర్శించారు. J&K| Cloudburst in Rajgarh area of Ramban district. 3 bodies recovered, 2 more reportedly missing⁰Rescue operation underway#Ramban #Cloudburst #JammuAndKashmir pic.twitter.com/oACzmLMy7B— Saahil Suhail (@SaahilSuhail) August 30, 2025 -
కోలుకోలేని దెబ్బ!
సాక్షి ప్రతినిధులు/సాక్షి నెట్వర్క్: ఒక్కసారిగా వరుణుడు సృష్టించిన బీభత్సం కామారెడ్డి జిల్లాను వణికించింది. బుధ, గురువారాల్లో జిల్లాలో దంచికొట్టిన వానలతో అపార నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా వరదలతో అన్ని విధాలుగా దాదాపు రూ.350 కోట్ల మేర నష్టం జరిగినట్టు తెలుస్తోంది. రోడ్లు కొట్టుకుపోయి, వంతెనలు దెబ్బతిని ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖలకు నష్టం వాటిల్లింది. పోచారం ప్రాజెక్టు దెబ్బతినడం, ఆపై 62 చెరువులు తెగిపోవడంతో నీటిపారుదల శాఖకు కూడా భారీ నష్టం జరిగింది.జిల్లాలో దాదాపు రూ.150 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు అంచనా. ఇక భారీ వరదలతో జిల్లాలో పలు రోడ్లు విధ్వంసానికి గురయ్యాయి. 44వ నంబరు జాతీయ రహదారి పలు చోట్ల కోతకు గురయ్యింది. 375 డీ నంబరు గల జాతీయ రహదారిపై పోచారం ప్రాజెక్టు దిగువన వంతెన దెబ్బతినడంతో రాకపోకలు ఇప్పట్లో మొదలయ్యే పరిస్థితి లేదు. తాత్కాలిక మరమ్మతులు చేసినా, పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టేందుకు రూ.60 కోట్ల మేర అవసరం అవుతాయని అంటున్నారు.జిల్లా మొత్తంగా 13 ఆర్అండ్బీ రోడ్లు దెబ్బతినడంతో వాటి పునర్నిర్మాణానికి రూ.35 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. పంచాయతీరాజ్ రోడ్లకు రూ.20 కోట్ల మేర నష్టం వాటిల్లింది. పోచారం ప్రాజెక్టుకు వరద తాకిడి పెరిగి ప్రాజెక్టు కట్టకు కొంతమేర నష్టం జరిగింది. తాత్కాలికంగా మరమ్మతుల కోసం రూ.25 లక్షల వరకు ఖర్చవుతుండగా, దెబ్బతిన్నదాన్ని పునరుద్ధరించడానికి అంచనాలు వేయాల్సి ఉంది.దానికి రూ. కోట్లల్లోనే వ్యయం అవుతుందని నీటి పారుదల శాఖ అధికారులు అంటున్నారు. తెగిపోయిన 62 చెరువులను పూర్తి స్థాయిలో పునర్నిర్మించడానికి దాదాపు రూ.10 కోట్లు ఖర్చవుతాయని భావిస్తున్నారు. ఇక జిల్లాలో విద్యుత్తు శాఖకు రూ.5 కోట్ల మేర నష్టం వాటిల్లింది. 763 కరెంటు స్తంభాలు పడిపోగా, 147 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి.ఇళ్లు గుల్ల..: జిల్లా కేంద్రంలోని జీఆర్ కాలనీ, హౌసింగ్‌బోర్డు కాలనీలలో 107 ఇళ్లల్లోకి వరద రావడంతో ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫర్నిచర్, వంట పాత్రలు, తిండిగింజలు, బట్టలు మొత్తం నాశనమయ్యాయి. ఐదారు కార్లు కొట్టుకుపోగా, నీట మునగడంతో 15 కార్లు, 40 బైకులు దెబ్బతిన్నాయి. ఒక్కో ఇంట్లో కనీసం రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కొందరి ఇళ్లు వరద తాకిడికి దెబ్బతిన్నాయి. జిల్లాలో 487 ఇండ్లు పాక్షికంగా, 14 ఇండ్లు పూర్తిగా కూలిపోయాయి. అన్ని నష్టాలు లెక్కిస్తే రూ.10 కోట్ల మేర నష్టం జరిగినట్టు అంచనా. మెదక్ జిల్లాలో రోడ్లు ధ్వంసం.. తెగిన చెరువులుభారీ వర్షాలతో మెతుకుసీమకు అపారనష్టం జరిగింది. 77 కిలోమీటర్ల పొడవు పీఆర్, ఆర్అండ్బీ రోడ్లు ధ్వంసం కాగా, 92 చెరువులు, కుంటలు, కల్వర్టులు తెగిపోయాయి. వేలాది విద్యుత్ స్తంభాలు, వందలాది ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. ఈ నాలుగు శాఖల పరిధిలో రూ.18.60 కోట్ల పైచిలుకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. జిల్లావ్యాప్తంగా 681 ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా, 4 ఇళ్లు నేలమట్టం అయినట్లు అధికారులు తెలిపారు.దూప్‌సింగ్ తండా దుఃఖంరెండు రోజులుగా వరద నీటిలో చిక్కుకుపోయిన మెదక్ జిల్లా దూప్‌సింగ్ తండా కన్నీరు పెడుతోంది. గంగమ్మ వాగు ఉప్పొంగడంతో వరద తాకిడికి గుడిసెలు నేలమట్టం కాగా, ఇళ్లలోకి బురద చేరి నివాసం ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇళ్లల్లో బురద పేరుకుపోయిందని, తాము ఎక్కడ తలదాచుకోవాలంటూ తండా వాసులు కన్నీరు మున్నీరవుతున్నారు.ఇంట్లో ఉన్న బియ్యం వంటి నిత్యావసరాలు తడిచిపోవడంతో సరైన ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం యశోద అనే మహిళ తడిచిపోయిన ఐదు క్వింటాళ్ల బియ్యాన్ని చూపిస్తూ విలపించింది. ఇంట్లో చేరిన బురదతో తాము ఎట్లా ఉండాలంటూ వనిత కంట నీరు పెట్టుకుంది.తన పూరి గుడిసె కూలిపోవడంతో బీమ్లీ అనే వృద్ధురాలు నిరాశ్రయురాలైంది. విద్యుత్ స్తంభాలు పూర్తిగా కూలిపోయి తండాలో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. స్థానికులు శుక్రవారం కూడా చీకట్లోనే గడిపారు. ఈ తండాలో సుమారు 41 కుటుంబాలు నివసిస్తున్నాయి. -
చేలన్నీ చెరువులే..
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దాదాపు 2.50 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో లక్ష ఎకరాల వరకు నష్టం వాటిల్లగా, మెదక్, నిజామాబాద్, భూపాలపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, మంచిర్యాల, పెద్దపల్లి, నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో జరిగిన నష్టంపై ప్రాథమిక వివరాలను అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి పంపించారు. కామారెడ్డి, మెదక్‌లో అపార నష్టం క్షేత్రస్థాయి నుంచి అందిన సమాచారం ప్రకారం.. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునగడం, ఇసుక మేటలు వేయడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి, సదాశివనగర్, తాడ్వాయి, ఎల్లారెడ్డి, రామారెడ్డి మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అలాగే జుక్కల్ నియోజక వర్గంలోని పిట్లం, పెద్దకొడప్గల్, మహ్మద్‌నగర్, నిజాంసాగర్, మద్నూర్, బిచ్కుంద, జుక్కల్ మండలాల్లో వందలాది ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి.ఇక కామారెడ్డి నియోజక వర్గంలోని కామారెడ్డి, భిక్కనూరు, బీబీపేట, దోమకొండ, మాచారెడ్డి, పాల్వంచ, రాజంపేట మండలాల్లో, అలాగే బాన్సువాడలో పంటలు నీట మునిగాయి. మెదక్ జిల్లాలో ఇసుక మేటలు వేసి పంట చేతికందకుండా పోయింది. భారీగా వరద నీరు చేరడంతో పంట చేనులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు.ప్రధానంగా వరి, పత్తి, చెరుకు పంటలకు నష్టం వాటిల్లింది. నార్సింగి జాతీయ రహదారి పక్కన ఉన్న గన్నేరు వాగుకు వరద పోటెత్తడంతో పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. దీంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నిర్మల్ జిల్లా భైంసా మండలం సిరాల ప్రాజెక్టు అలుగు వరదతో సిరాల, దేగాం గ్రామాల్లో పత్తి, సోయా పంటలు నీటమునిగాయి. శ్రీరాంసాగర్ అవుట్ ఫ్లో వరద కారణంగా లక్ష్మణచాంద, ఖానాపూర్, దస్తురాబాద్ మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. మండలాల వారీగా వివరాలు సేకరించండి: మంత్రి శుక్రవారం అధికారులతో సమావేశమైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మండలాల వారీగా జరిగిన నష్టం వివరాలను సేకరించి, సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టాయని, అధికారులు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పర్యటించి, పంటనష్టంపై సమగ్ర నివేదిక తయారుచేయాలని సూచించారు.ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. గోదావరి వరద ప్రవాహ ఉధృతి పెరగడంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడం జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారిని ఆదేశించారు. త్వరలో 21,325 మెట్రిక్ టన్నుల యూరియా రామగుండం ఎరువుల పరిశ్రమ (ఆర్ఎఫ్సీఎల్)లో యూరియా ఉత్పత్తి నిలిచి పోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని తుమ్మల తెలిపారు. రానున్న రెండురోజుల్లో రాష్ట్రానికి వివిధ కంపెనీల నుంచి 21,325 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని వెల్లడించారు. కాగా,సెపె్టంబర్ ఎరువుల కోటాను బకాయితో కలిపి వెంటనే విడుదల చేయాలని మరోసారి కేంద్ర ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఆయన లేఖ రాశారు. -
రోడ్లన్నీ గుంతలు.. వాహనాలు గంతులు
చంద్రబాబు ప్రభుత్వ బండారం రోడ్డున పడింది. సంక్రాంతికి నాటికి గుంతలు లేని రోడ్లుగా మారుస్తామన్న సీఎం చంద్రబాబు మాటలు నీటి మీద రాతలుగానే మిగిలాయి. నాలుగు నెలల్లో మళ్లీ సంక్రాంతి వస్తున్నా రాష్ట్రంలో రోడ్ల దుస్థితి మాత్రం మారలేదు. అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో రోడ్లపై అసలు గుంతలు లేకుండా చేస్తామన్న ఎన్నికల హామీని రోడ్డుపాలు చేశారు. ఎన్నికలకు ముందు కూటమి పార్టీల నేతలు ప్రధానంగా రోడ్లపై టార్గెట్ చేసి ప్రచారం నిర్వహించారు. రహదారులు బాగుంటేనే అభివృద్ధి సాధ్యమని, ఎంత ఖర్చు అయినా సరే రహదారులకు ప్రధమ ప్రాధాన్యం ఇస్తామని గొప్పలు చెప్పారు.తీరా అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై సాక్షి బృందం విస్తృత స్థాయిలో పరిశీలించింది. ఏ రోడ్డు చూసినా గుంతల మయంగా కనిపించింది. అడుగడుగునా గుంతలు... కోసుకుపోయిన రోడ్లు, కాస్త వర్షానికే కొట్టుకుపోయిన రోడ్లు.. రాళ్లు తేలిన రోడ్లు.. రాష్ట్రం అంతటా ఇవే దృశ్యాలు కళ్లకు కట్టాయి. ఇలాంటి రోడ్లపై గమ్యం చేరడానికి వాహనదారులు అష్టకష్టాలు పడుతుండటం అన్ని ప్రాంతాల్లోనూ కనిపించింది.రాష్ట్రంలో ఎక్కడికక్కడ రోడ్లపై గుంతలు పెరిగిపోయి.. వాహనాలు గంతులేస్తున్న పరిస్థితి నెలకొంది. కొన్ని రహదారుల్లో వాహనాలు కూరుకుపోయి కనిపించాయి. మరికొన్ని చోట్ల ముందుకు వెళ్లలేని పరిస్థితి కళ్లకు కట్టింది. ఇంకొన్ని చోట్ల అయితే రహదారి ఉందో.. లేదో కూడా తెలియని దుస్థితి.ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఈ ఏడాదిలో ఆర్అండ్బీ పరిధిలోని రోడ్లపై గుంతలు పూడ్చటం కోసం ప్రభుత్వం రూ.840 కోట్లు ఖర్చు చేశామని చెబుతోంది. అయితే ఇందులో వాస్తవంగా పదో వంతు కూడా ఖర్చు చేయలేదని ఆర్అండ్బి వర్గాల సమాచారం. మిగతాదంతా కూటమి పార్టీల నేతలే జేబులో వేసుకున్నట్లు తెలిసింది. ఇక పంచాయతీరాజ్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల సంగతి అయితే చెప్పాల్సిన పనిలేదు. దారుణంగా మారిపోయాయి. రోడ్డుపై తారు అన్నదే కనిపించకుండా పోయింది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఆటోలు, కార్లు, లారీలు బోల్తా పడక తప్పదన్నట్లు రహదారులు రూపు మారిపోయింది. –సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలో ఎరుకుపాడు–గంపలగూడెం మధ్య ఏడాది క్రితం ఆర్ అండ్ బీ రహదారిని కొత్తగా వేశారు. నిన్నా, మొన్నటి వర్షానికే కొట్టుకు పోయింది. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం 75 త్యాళ్యూరు గ్రామంలోని జెడ్పీ పాఠశాల సమీపంలోని వంతెన వద్ద కోతకు గురై ప్రమాదకరంగా మారిన రోడ్డు. కనీసం ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని దుస్థితి. ఎప్పుడు కుప్పకూలుతుంతో అన్నట్లుంది. -
కృష్ణా, గోదావరిలో కొనసాగుతున్న వరద
సాక్షి, అమరావతి, విజయపురిసౌత్, పోలవరం రూరల్: వర్షాలు కొనసాగుతుండటంతో వరద ప్రవాహం నిలకడగా ఉంది. కృష్ణా నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,43,377 క్యూసెక్కులు చేరుతుండగా.. 2,38,626 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 197 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 2,61,404 క్యూసెక్కులు చేరుతుండగా దిగువకు 2.43 లక్షల క్యూసెక్కులను వదిలేస్తున్నారు. సాగర్‌లో ప్రస్తుతం 305.75 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పులిచింతల ప్రాజెక్టులోకి 2,71,310 క్యూసెక్కులు చేరుతుండగా 39.55 టీఎంసీలను నిల్వ చేస్తూ 2,60,881 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 3,08,838 క్యూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టాకు 11,938 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 2,96,900 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. గోదావరి నుంచి ధవళేశ్వరం బ్యారేజీలోకి 7,58,779 క్యూసెక్కులు చేరుతుండగా గోదావరి డెల్టాకు 6,200 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 7,52,579 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం పెరుగుతుండటంతో పోలవరానికి క్రమేపీ వరద పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం 31.750 మీటర్లకు చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి దిగువకు 8.07 లక్షల క్యూసెక్కులను అధికారులు దిగువకు వదిలేస్తున్నారు. -
బురదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు
-
హైదరాబాద్‌లో భారీ వర్షం
సాక్షి,హైదరాబాద్: నగరంలో భారీవర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఆఫీసులు ముగించి ఇంటికి వచ్చే సమయం కావడంతో వరదనీరు రోడ్డుపైకి చేరింది. ఫలితంగా పలు కూడళ్లలో భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. జూబ్లీహిల్స్,బంజారాహిల్స్, మాదాపూర్,కొండాపూర్ ఫిలింనగర్, హైటెక్‌సిటీ, కూకట్పల్లి, లింగంపల్లి, ఎర్రగడ్డ, సనత్‌నగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, మోహిదీపట్నం, బహదూర్‌పల్లి, సూరారాం, చింతల్, జీడిమెట్ల, శాపూర్‌నగర్, గాజులరామారంలలో కుండపోత వర్షం కురుస్తోంది. వర్షం తీవ్రతతో జీహెచ్ఎంసీ,హైడ్రాతో పాటు ఇతర రెస్క్యూ బృందాలు అప్రమత్తమయ్యాయి. కురుస్తున్న వర్షం ధాటిని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ అధికారులు నగర వాసులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. -
తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
-
Bandi Sanjay: బాధితులెవరూ భయపడొద్దని పూర్తిగా అండగా ఉంటామని భరోసా
-
కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వరదలు
-
Vijayawada: బెజవాడ అల్లకల్లోలం
-
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
-
ఉత్తరాదిన కుంభవృష్టి
సిమ్లా/జమ్మూ: మేఘ విస్ఫోటం(క్లౌడ్ బరస్ట్) ఘటనల నుంచి తేరుకోకమునుపే మళ్లీ మేఘ విస్ఫోటాలు ఉత్తరాది రాష్ట్రాలపై విరుచుకుపడ్డాయి. హిమాలయాలకు నిలయాలైన హిమాచల్, జమ్మూలు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, కొండచరియలు పడిన ఘటనలతో వణికిపోయాయి. హిమాచల్‌లో మెరుపు వరదల ధాటికి ఇళ్లు, దుకాణాలు నేలమట్టమయ్యాయి. జమ్మూకశ్మీర్‌లోని రియాస్ జిల్లాలోని ప్రఖ్యాత మాతా వైష్ణోదేవి ఆలయ ట్రెక్కింగ్ మార్గంలో మంగళవారం మధ్యాహ్నం కొండచరియలు విరిగిపడడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 14 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఖత్రాలోని బేస్‌క్యాంప్‌లో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. త్రికూట పర్వతంపై కొలువైన ఆలయానికి ఖత్రానుంచి 12 కిలోమీటర్ల మార్గముంది. ఇందులో అర్థ్‌కువారీ సమీప ఇంద్రప్రస్థ భోజనాలయం సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో ఈ ఘోరం జరిగింది. ఆలయానికి రెండు మార్గాల్లో ట్రెక్కింగ్ చేస్తూ చేరుకోవచ్చు. మంగళవారం ఉదయం నుంచి హిమ్కోటీ ట్రెక్కింగ్ మార్గం గుండా యాత్రను నిలిపేశారు. పాత రూట్లో మధ్యాహ్నం 1.30దాకా ట్రెక్కింగ్ జరగ్గా కొండచరియలు పడటంతో అది కూడా నిలిపేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టేదాకా వైష్ణోదేవి ఆలయానికి భక్తుల యాత్రను అర్ధా్థంతరంగా ఆపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నదులుగత మూడ్రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జమ్మూ ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వైష్ణోదేవి ఆలయ ఘటనతో కలిసి జమ్మూవ్యాప్తంగా వర్షసంబంధ ఘటనల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కశ్మీర్లో లోయలోనూ భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల చిన్నపాటి వంతెనలు, మొబైళ్ల టవర్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు సైతం తెగిపోవడంతో టెలికం, ఇంటర్నెట్ సేవలు దాదాపు ఆగిపోవడంతో లక్షలాది మంది ప్రజలు అవస్థలు పడుతున్నారు. రైలుపట్టాలపై రాళ్లు పడటంతో ఖత్రా, ఉధంపూర్, జమ్మూ రైల్వేస్టేషన్ల నుంచి ఇతర ప్రాంతాలకు 18 రైళ్లను రద్దుచేశారు. కొండచరియలు పడటంతో జమ్మూ–శ్రీనగర్, కిష్ఠ్‌వార్–దోడా జాతీయరహదారులపై రాకపోకలను అధికారులు నిలిపేశారు. ఇలా డజన్లకొద్దీ పర్వతసానువుల వెంట రహదారులు మూసేశారు. కిష్ఠివార్, రేసీ, రాజౌరీ, రాంబాన్, ఫూంఛ్ జిల్లాల్లోనూ వర్షబీభత్సం జరిగింది. ఇళ్లు నేలకూలాయి. కిష్్టవార్లోని ముఘల్ మైదాన్ వంతెన ధ్వంసమైంది. జమ్మూలో తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలపై శ్రీనగర్‌లో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు తగు ఆదేశాలిచ్చారు. మనాలీలో బియాస్ ఉగ్రరూపం హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో బియాస్ నది ఉగ్రరూపం దాల్చి పరీవాహక ప్రాంతాలపై విరుచుకుపడింది. చాలా చోట్ల మనాలీ–లేహ్ రహదారి నదీప్రవాహం కారణంగా కొట్టుకుపోయింది. మనాలీలోని బహంగ్ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనం నీటి ఉధృతికి కూలి నదీప్రవాహంలో పడింది. రెండు రెస్టారెంట్లు, కొన్ని దుకాణాలు సైతం కొట్టుకుపోయాయి. 40 షాప్‌లు ధ్వంసమయ్యాయి. రహదారిపై నిలిచి ఉన్న వాహనాలు సైతం నదీప్రవాహంలో కొట్టుకుపోయాయి. సమీప ప్రాంతాల ప్రజలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. రాష్ట్రంలో పర్యటిస్తున్న యాత్రికులు పలు చోట్ల చిక్కుకుపోయారు. పత్లీకుహాల్ ప్రాంతంలో ఇళ్లు నీటమునిగాయి. కులూ ప్రాంతంలోనూ బియాస్ నది ఉధృతంగా ప్రవహించింది. కినౌర్ జిల్లాలోని కన్వీ గ్రామంలోనూ మేఘ విస్ఫోటం సంభవించింది. రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాల కారణంగా కొండచరియలు రహదారులపై పడటంతో రాకపోకలు స్తంభించాయి. దీంతో మంగళవారం ఒక్కరోజే మండీ జిల్లాలో 320, కులూ జిల్లాలో 132 రహదారులను మూసేశారు. కంగ్రా, చంబా, లహౌల్ స్పితి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. -
AP and Telangana: నేడు..రేపు భారీ వర్షాలు
-
ఏపీ, తెలంగాణకు వెదర్ అలర్ట్.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపు వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. దీంతో తెలంగాణ, ఏపీ వాతావరణ కేంద్రాలు హెచ్చరికలు జారీ చేశాయి.ఏపీలో ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. మూడు రోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు కుండపోత తప్పదని తెలిపింది. మరోవైపు.. ఆవర్తన ప్రభావంతో దక్షిణ కొస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు ఉంటాయని తెలిపింది.ఇక.. తెలంగాణకు రెండు రోజులపాటు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ, రేపు.. పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. హైదరాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు కుండపోత తప్పదని హెచ్చరించింది. వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనంతో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాలు పడుతుండగా మరో మూడు రోజులు అవి కొనసాగుతాయని పేర్కొంది. గత రాత్రి నుంచే ఉమ్మడి విశాఖను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లా నందిగం మండలం మదనపురంలో 3.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే మండలంలోని నందిగంలో 2.7 సెంటీమీటర్ల వర్షం పడింది. పార్వతీపురం జిల్లా గుమ్మలక్ష్మీపురం, శ్రీకాకుళం జిల్లా పాలకొండలో రెండు సెంటీమీటర్ల వర్షం కురిసింది.40-50 కిమీ వేగంతో ఉండనున్న ఈదురు గాలులు వీస్తాయని విపత్తుల శాఖ పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున ఈ నెల 27 వరకూ ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ అధికారులు హెచ్చరించారు.తెలుగు రాష్ట్రాలల్లో ఇప్పటిదాకా కురిసిన వానలకు, ఎగువన కురుస్తున్న వర్షాలకు పలు ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. మహబూబ్‌నగర్ జురాల, నంద్యాల శ్రీశైలం జలాయశంకు వరద పోటెత్తుతోంది. -
వాన వెలిసినా... ముసిరే వ్యాధులు
ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లలో ఇటీవల కురినిన భారీ భారీ వర్షాల తర్వాత ఇరు రాష్ట్రాలు జలమయం కావడం, రోడ్లు మునిగిపోవడంతోపాటు అవి ప్రజల ఆరోగ్యానికీ ముప్పు తెచ్చిపెడుతున్నాయి. ఈ వర్షాల తర్వాత చాలా ఆసుపత్రులూ, క్లినిక్స్‌లో నిమోనియా, ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. సాధారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటప్పుడు, కురిశాక ఉండే తేమతో కూడిన వాతావరణంలో ఈ కేసులు పెరగడం సాధారణం. ఇలాంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయించాల్సిన చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం. వర్షాల అనంతరం నిమోనియా, ఇన్‌ఫ్లూయెంజా (ఫ్లూ) కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో అంతటా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇవి అన్నిరకాలుగా ఆరోగ్యంగా ఉండే యువతతో పోలిస్తే... వ్యాధి నిరోధక శక్తి కాస్త తక్కువగా ఉండే వయోవృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాగే అప్పటికే అనారోగ్యాలతో బాధపడేవారిలో రోగనిరోధకత తక్కువగా ఉండటంతో వాళ్లు నిమోనియా, ఫ్లూ వంటి వర్షాకాలపు సమస్య ల బారిన వేగంగా పడే అవకాశముంది. అంతేకాదు... వ్యాధి నిరోధకత తక్కువ గా ఉండే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వ్యక్తుల్లో ఇది ఒక్కోసారి ప్రాణాపాయం లాంటి తీవ్రమైన ముప్పునకూ దారితీసే ప్రమాదం లేకపోలేదు.వర్షాకాలంలో ముప్పుఎందుకు ఎక్కువంటే... వర్షాకాలంలో ఉండే అధిక తేమ, తడి వాతావరణం వంటివి ఫంగస్ పెరుగుదలకు తోడ్పడతాయి. దాంతో ఆ పెరుగుదల వల్ల అవి శ్వాసనాళాల్లోకి ప్రవేశించినప్పుడు ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులకు అవకాశం పెరుగుతుంది. క్రౌడింగ్ : వర్షాల కారణంగా ప్రజలు గుంపులు గుంపులుగా చాలా దగ్గరి దగ్గరిగా ఉంటారు. అదీగాక ఇక లోతట్టు ప్రాంతాల వాళ్లనందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి ఒకేచోట గుంపులుగా ఉంచడంతో ప్రజలు మరింత దగ్గరిదగ్గరిగా ఉండాల్సి వస్తుంది. పైగా మూసినట్టుగా ఉన్న గదుల్లో (క్లోజ్డ్ ఇన్–డోర్స్ మధ్యన, వెంటిలేషన్ సరిగా లేని చోట్లలో) ఉండటం వల్ల వైరస్లు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశాలెక్కువ. ఉపరితలాలను తాకడం వల్ల : తలుపులు తీసేటప్పుడు డోర్స్ హ్యాండిల్స్‌ను తప్పక తాకుతూ తీయాల్సి వస్తుంది. ఒకరి చేతులనుంచి డోర్స్ నాబ్స్, డోర్ హ్యాండిల్స్‌పై చేరుకున్న వైరస్లు మరొకరు వాటిని ముట్టుకోగానే వారికీ అంటుతాయి. పైగా వర్షాకాలం లాంటి చల్లటి తడి వాతావరణంలో డోర్నాబ్స్పై ఉండే సూక్ష్మజీవులు మరింత ఎక్కువ కాలం జీవించి ఉంటాయి. ఇలా ఈ మార్గంలో వైరస్‌లూ, బ్యాక్టీరియా వ్యాపించడాన్ని ‘ఫొమైట్ ట్రాన్స్మిషన్’ అని కూడా అంటారు. రొటీన్ దెబ్బతినడం వల్ల (డిస్‌రప్టెడ్ రొటీన్): బయట వర్షం కురుస్తుండటం వల్ల తాము వెళ్లాల్సిన పనులకు వెళ్లలేకపోవడంతో రొటీన్ దెబ్బతింటుంది. దీనివల్ల రోజులో తినేవేళలూ, నిద్రవేళలూ ఇవన్నీ క్రమం తప్పుతాయి. దాంతో కొత్త వైరస్లు రూపొందే ముప్పు: వానాకాలం లాంటి సీజన్లలో ప్రజలు దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు వైరస్ల తాలూకు కొత్త స్టెయిన్లూ, బ్యాక్టీరియల్, ఫంగల్ తాలూకు దుష్ప్రభావాలు పెరుగుతాయి. సాధారణంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే పెద్దవయసు వారిలో, చిన్న పిల్లల్లో ఈ స్ట్రెయిన్స్ వ్యాపించాక... వారి నుంచి ఇంకొన్ని స్టెయిన్స్ రూపొందడం... ఇలా సరికొత్తగా రూపొందిన వైరస్లు చాలా చురుగ్గా (విరులెంట్గా) ఉండటం వల్ల అవి వేగంగా వ్యాపిస్తూ మరింత నష్టం కలగజేస్తాయి.ఎవరెవరిలో ముప్పు ఎక్కువంటే... వయోవృద్ధులు (65+), చిన్నపిల్లలు, గర్భిణులు. గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు, డయాబెటిస్, హైబీపీ లేదా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తడి వాతావరణంలో, గదుల్లో గుంపులుగా ఉండేవాళ్లూ / తాత్కాలిక ఆశ్రయాల్లో ఉన్నవారు ∙వ్యాక్సిన్ తీసుకోని పెద్దవయసు వాళ్లలో... ఈ సీజన్ అనంతర వ్యాధుల ముప్పు ఎక్కువ. ఫ్లూ/న్యుమోనియాలను గుర్తించడమెలా? ఫ్లూ లక్షణాలు: ఇది వైరస్‌లో వచ్చే సమస్య కాబట్టి ఆకస్మికంగా తీవ్ర జ్వరం (హైఫీవర్); ఒళ్లు నొప్పులు; గొంతు నొప్పి; తీవ్రమైన అలసట / నీరసం / నిస్సత్తువ; ఎడతెరిపి లేకుండా దగ్గు. అయితే కొన్ని కేసుల్లో ఇది నిమోనియా వంటి సెకండరీ ఇన్ఫెక్షన్కు దారితీసే అవకాశం. నిమోనియా లక్షణాలు: విపరీతంగా దగ్గు వస్తూ కళ్లె (మ్యూకస్) పడుతూ ఉండటం; ఛాతీలో నొప్పి, ఆయాసంతో ఎగ శ్వాస తీసుకుంటూ ఉండటం; తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ; పెద్దవయసు వారిలో పరిస్థితులు మరింత తీవ్రమవుతుండటం; అయోమయానికి గురికావడం; ఆకలిలేకపోవడంతక్షణం వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితులు..శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది; పెదవులు నీలంగా మారడం, ఛాతీ లేదా కడుపులో తీవ్రమైన నొప్పి, అయోమయం, నీళ్లు తాగలేక΄ోవడం / ద్రవపదార్థాలు తీసుకోలేక΄ోవడం. ∙కొన్ని వైద్య పరీక్షలు : వ్యక్తిగతంగా పరీక్షించడం (క్లినికల్ ఎగ్జామినేషన్స్), కొన్ని రక్తపరీక్షలు, ఛాతీ ఎక్స్‌రే లేదా అవసరమైతే కొన్ని ఇమేజింగ్ పరీక్షలు.వానాకాలపు జాగ్రత్తలు / నివారణలు...వ్యాక్సిన్: ప్రతి ఏడాదీ ఫ్లూ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవడం; వయోవృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా న్యుమోకోకల్ వ్యాక్సిన్ తీసుకోవడం. హైజీన్ : వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, ఇల్లు, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, కిటికీలు, తలుపులు తెరచి గదులు తేమ లేకుండా పొడిగా ఉంచుకోవడం, ఇళ్లలో (ఆ మాటకొస్తే బయట కూడా) పొగతాగకుండా/ ఇల్లు ΄÷గచూరకుండా చూసుకోవడం ∙తరచూ చేతులు కడుక్కోవడం, ఇంట్లో ఎవరు అనారోగ్యంగా ఉన్నా అందరూ మాస్కులు వాడటం.చికిత్స...వయోవృద్ధులు, పెద్దవాళ్లు, గర్భిణులు, చిన్నారులు... వీళ్లు ఎవరైనా జబ్బుపడితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం. పోషకాహారం తీసుకోవడం; తగినంత నీరు తాగుతూ ఒంటిని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం; తగినంత విశ్రాంతి; కంటినిండా నిద్ర, డాక్టరు సూచించిన మందుల్ని (యాంటీ వైరల్, యాంటీ బయాటిక్స్ వంటివి) క్రమం తప్పకుండా వాడటం. అవసరాన్ని బట్టి ఆక్సిజన్ మాస్క్ లేదా నెబ్యులైజేషన్ పెట్టడం. పై జాగ్రత్తలతో ఈ వానాకాలంలో ఫ్లూ, నిమోనియా, సెకండరీ నిమోనియా రిస్కులను విజయవంతంగా ఎదుర్కోవడమే కాకుండా, నివారణ పద్ధతులు అనుసరిస్తూ, ముందుజాగ్రత్తలు తీసుకుంటూ ఇంటిల్లిపాదీ వ్యాధులకు దూరంగా కూడా ఉండవచ్చు. డాక్టర్లను ప్రజలు ఎక్కువగా అడుగుతుండే ప్రశ్నలు...ప్రశ్న : మా అబ్బాయికి జలుబు చేసి (ఫ్లూ వచ్చి) తగ్గినప్పటికీ దగ్గు ఎందుకిలా వారాల తరబడి ఉంటోంది? డాక్టర్ జవాబు : వైరస్ వచ్చి తగ్గాయ (పోస్ట్–వైరల్ సెన్సిటివిటీ) లేదా నిమోనియాలాంటి ఇన్ఫెక్షన్ వల్ల ఇలా జరుగుతుండవచ్చు.ప్రశ్న : అల్లం కలిపిన గోరువెచ్చని నీళ్లు తాగడం లాంటి చిట్కాల వల్ల ప్రయోజనం ఉంటుందా? డాక్టర్ జవాబు : ఇలాంటి ఇంటి చిట్కాలు లక్షణాలను కొంతవరకు తగ్గించవచ్చు. కానీ వ్యాక్సిన్ వేయించుకోవడం / వైద్య చికిత్స తీసుకోవడమే పూర్తి రక్షణ ఇస్తాయి.ప్రశ్న : మాస్కులు తొడగడం తప్పనిసరా? డాక్టర్ జవాబు మాస్కులు తొడుక్కోవడం, చేతులు కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా అనుసరించాలి.డాక్టర్ గంగాధర్ రెడ్డి మల్లు, సీనియర్ పల్మనాలజిస్ట్, స్లీప్ మెడిసిన్ స్పెషలిస్ట్ (చదవండి: మేని కాంతికి మెరుగైన చికిత్స..!) -
నదుల్లో వరద పరవళ్లు
సాక్షి, అమరావతి: అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదుల్లో వరద ప్రవాహం ఉరకలెత్తుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజీ నుంచి 4.73 లక్షల క్యూసెక్కుల కృష్ణా జలాలు.. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 7.63 లక్షల క్యూసెక్కుల గోదావరి జలాలు, గొట్టా బ్యారేజీ నుంచి 20,651 క్యూసెక్కుల వంశధార జలాలు, నారాయణపురం ఆనకట్ట మీదుగా 16,300 క్యూసెక్కుల నాగావళి వరద జలాలు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, ప్రధాన ఉప నది తుంగభద్రల్లో వరద ఉధృతి పెరిగింది. ఆల్మట్టి డ్యామ్, నారాయణ్‌పూర్ డ్యామ్ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌లోకి 1,25,164 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్ వే గేట్లు ఎత్తి 1,21,448 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దాని దిగువన సుంకేశుల బ్యారేజీలోకి 1.40 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1,27,840 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి జూరాల నుంచి 2,71,763, సుంకేశుల నుంచి 1,25,660, హంద్రీ నుంచి 2 వేలు వెరసి 3,90,135 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. దాంతో శ్రీశైలంలో 881.9 అడుగుల్లో 198.36 టీఎంసీలను నిల్వ చేస్తూ స్పిల్ వే 10 గేట్లను 14 అడుగుల మేర ఎత్తి 3,44,750, విద్యుదుత్పత్తి చేస్తూ 65,436 క్యూసెక్కులు కలిపి 4,10,186 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 4,10,186 క్యూసెక్కులు చేరుతుండగా.. 584.6 అడుగుల్లో 296.28 టీఎంసీలను నిల్వ చేస్తూ 26 గేట్లను ఎత్తి 4.09 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 3,97,807 క్యూసెక్కులు చేరుతుండగా.. 166.47 అడుగుల్లో 33.54 టీఎంసీలను నిల్వ చేస్తూ 4,13,395 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. వాటికి మున్నేరు, వాగులు, వంకల వరద తోడవుతుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి 4,73,065 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బుధవారం ప్రకాశం బ్యారేజీలోకి వరద ప్రవాహం 5 లక్షల క్యూసెక్కులను దాటే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గోదావరిలోనూ పెరుగుతున్న వరద ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. బుధవారం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. మంగళవారం పోలవరం ప్రాజెక్టులోకి 8,29,424 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 7,63,310 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. పోటెత్తిన నాగావళి, వంశధార ఒడిశా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నాగావళి, వంశధార నదుల్లో వరద పోటెత్తుతోంది. నారాయణపురం ఆనకట్ట మీదుగా 16,300 క్యూసెక్కుల నాగావళి వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 22 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తూ.. 20,651 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో సెలవులు తీసుకోవద్దు భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందున పరిస్థితులు సాధారణ స్థితికి చేరే వరకూ లైన్మెన్ నుంచి అధికారుల వరకు ఎవరూ సెలవులు తీసుకోవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసినందున విద్యుత్‌సంస్థల అధికారులతో మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ సమీక్ష నిర్వహించారు. అలాగే, భారీ వర్షాల నేపథ్యంలో 16 జిల్లాలకు కలిపి అత్యవసర వరద సహాయ చర్యల కోసం ప్రభుత్వం రూ.16 కోట్లు విడుదల చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాకో రూ.కోటి చొప్పున కేటాయించింది. విలీన మండలాల్లో 80 గ్రామాలకు రెండో రోజూ నిలిచిన రాకపోకలు చింతూరు: గోదావరి, శబరి నదులకు వరద ఉధృతి మంగళవారం సాయంత్రం నుంచి క్రమేపీ పెరుగుతోంది. మరోవైపు శబరి నదిలోనూ మంగళవారం మధ్యాహ్నం నుంచి వరద పెరుగుతోంది. విలీన మండలాలైన చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లో వరుసగా రెండోరోజు కూడా 80 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలో కుయిగూరు వాగు వరద తగ్గకపోవడంతో ఆంధ్రా–ఒడిశా జాతీయ రహదారి–326పై రాకపోకలు సాగక వాహనాలు చింతూరులో నిలిచిపోయాయి. చింతూరు మండలంలో సోకిలేరు, కుయిగూరు, జల్లివారిగూడెం, చంద్రవంక, చీకటివాగుల వద్ద వరద ఇంకా రహదారులపైనే నిలిచి ఉంది. కూనవరం మండలం కొండ్రాజుపేట వద్ద కాజ్‌వేపై వరదనీరు ఇంకా తొలగలేదు. -
సబ్‌మెరైన్ సర్వీస్ ప్రారంభం.. ముంబై వర్షాలపై మీమ్స్ వైరల్
ముంబైని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా యూజర్లకు మంచి స్టప్ దొరికేసింది. ‘‘నగరం మునిగిపోతున్నప్పుడు కూడా మేము మీమ్స్ చేస్తాం" అంటూ సరదాగా నవ్వులు పూయిస్తున్నారు. వరదలపై నెటిజన్లు కాస్త గట్టిగానే సెటైర్లు వేస్తున్నారు. ఎక్స్‌లో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఓ యూజర్.. ముంబైలో కొత్త సేవలు ప్రారంభమయ్యాయంటూ.. సబ్‌మెరైన్ వీడియోను పోస్ట్ చేశాడు. ఫన్నీగా మిమ్స్‌ను రూపొందించి వాటిని వైరల్ చేస్తున్నారు.ఆర్థిక రాజధాని వీధులు వరదల్లో మునిగిపోయాయి.. నగరంలోని కుండపోత వర్షానికి అలవాటు పడ్డామంటూ సోషల్ మీడియాలో కూడా మీమ్స్ వర్షం కురుపిస్తున్నారు. "స్పిరిట్ ఆఫ్ ముంబై" అనే పదాన్ని కొంతమంది విమర్శిస్తూ కూడా మీమ్స్ చేస్తున్నారు. వర్షాలపై ప్రజలు మీమ్స్ ద్వారా తమ అనుభవాలను వ్యక్తపరస్తూ.. వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.New service launched in Mumbai 😂 #MumbaiRainspic.twitter.com/gDIlVjyDPo— V🐧 (@Vtxt21) August 18, 2025నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు రెండు రోజుల పాటు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని 36 జిల్లాలకు గాను కనీసం సగం జిల్లాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని అంచనా వేసిన వాతావరణ విభాగం అంచనా వేసింది. నాందేడ్ జిల్లాలోని ముఖెడ్ తాలుకాలో వర్షాలు, వరదల్లో ఏడుగురు చనిపోయారు. వరదల్లో చిక్కుకుపోయిన కనీసం 200 మందిని సహాయక సిబ్బంది రక్షించారు.Mumbaikar right now. #MumbaiRains #MumbaiRain pic.twitter.com/79LMu8LrBt— Siddhanth Pilania (@sidhanthpilania) August 18, 2025ఆర్మీ బృందాన్ని సహాయక చర్యల కోసం పంపించారు. జిల్లాలోని లెండి డ్యామ్‌లో భారీగా వరద చేరింది. ఇంకా, మహానగరం ముంబైలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం ఉదయం రెడ్ అలెర్ట్ జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి నీరు చేరడం, చెట్లు విరిగిపడటంతో కనీసం 40 ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.మాతుంగ పోలీస్ స్టేషన్ పరిధిలో వరద నీటిలో నిలిచిపోయిన స్కూలు బస్సు నుంచి ఆరుగురు చిన్నారులను పోలీసులు రక్షించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో సోమవారం ఉదయం ముంబై విమానాశ్రయంలో కొన్ని విమానాల ల్యాండింగ్ ఆలస్యమైంది. ఒక విమానాన్ని దారి మళ్లించారు. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి కొంత మెరుగైందని అధికారులు తెలిపారు. అవసరమైతేనే ఇళ్లు వదిలి బయటకు రావాలని ప్రజలకు అధికారులు సూచనలు చేశారు.అరేబియా సముద్రంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. ముంబైలో సోమవారం 6 నుంచి 8 గంటల వ్యవధిలో 177 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని సీఎం ఫడ్నవీస్ చెప్పారు. దీంతో, లోకల్ రైళ్లు కనీసం 10 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. సబర్బన్ రైళ్లు, సెంట్రల్ రైల్వే మార్గంలోని లోతట్టు ప్రాంతాల్లో పట్టాలపైకి నీరు చేరడంతో రాకపోకలు ఆలస్యమయ్యాయి. ముంబైలోని విద్యాసంస్థలకు సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సెలవు ప్రకటించారు. వర్షాలు కొనసాగే అవకాశాలుండటంతో మంగళవారం సైతం సెలవు ప్రకటించారు.Mumbaikar stuck on roads everyday..#MumbaiRains pic.twitter.com/cqVrkWJbK6— KKthewealthcoach (@MemeOverlord_kk) August 18, 2025 -
నిజాం సాగర్ 13 గేట్లు ఎత్తి 50 వేల క్యూసెక్కుల నీటి విడుదల
-
AP Rain Alert: వాతావరణ శాఖ హెచ్చరిక
-
తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షం
-
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
-
ఇది మట్టి రోడ్డు కాదు.. సీసీ రోడ్డే!
కామారెడ్డి: ఈ చిత్రంలో కనిపిస్తున్న సీసీ రోడ్డు ఎక్కడో మారుమూల గ్రామంలో ఉంది అనుకుంటే పొరపాటే. బాన్సువాడ పట్టణం నడిఒడ్డున ఉన్న సీసీ రోడ్డు ఇది. పట్టణంలోని సంగమేశ్వర చౌరస్తా సమీపంలో ఉన్న మజీద్ నుంచి పాత బాన్సువాడ వినాయకనగర్, మండలంలోని కొల్లూర్, నాగారం వెళ్లే వారికి ఈ రోడ్డు మీదుగా వెళ్తే సుమారు మూడు కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దీంతో ప్రతిరోజు వందలాది వాహనాలు, వందలాది పాదచారులు ఈ రోడ్డుపైనుంచి వెళ్తుంటారు. 2007–08లో ఇక్కడ సీసీ రోడ్డు వేశారు. ఈ మధ్య దారంతా గుంతలమయంగా మారింది. ప్రస్తుతం ఈ రోడ్డుపై నడవాలంటే పాదచారులూ నరకం చూస్తున్నారు. వాహనదారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత్యంతరం లేక పాదచారులు, విద్యార్థులు రోడ్డు పక్కనే ఉన్న డ్రైయినేజీపై నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే ఈ డ్రెయినేజీ కూడా నిండుగా ప్రవహిస్తుంది. అదుపుతప్పి కాలుజారి డ్రెయినేజీలో పడితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
విశాఖ, అల్లూరి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
సాక్షి,విశాఖ: ఉత్తరాంధ్రలో భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుంది. ఫలితంగా వాతావరణ శాఖ విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. వచ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాబోయే మూడు రోజులు రాయలసీమలో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురవునున్నాయి. ఈ క్రమంలో విశాఖ జిల్లాలోని ప్రైవేట్,ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవు మంజూరు చేస్తూ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. -
అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలిని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ బృందాలను తరలించాలని ముందుగా ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, చెరువులు, రిజర్వాయర్లు, కుంటల దగ్గర ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రజల వినతులపై తక్షణమే స్పందించాలన్నారు సీఎం రేవంత్. ఇదిలా ఉంచితే, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీనిలో భాగంగా భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఇక ఆదిలాబాద్, కొమురం భీం, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లా, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. -
మునిగిన వరంగల్
-
ముంబైలో వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈరోజు(శనివారం) తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ)నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా నగరంలోని అనేక ప్రాంతాలు తీవ్ర జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. Mumbai is experiencing heavy rainfall with an Orange Alert in effect. Water-logging and reduced visibility have been reported in several areas.Mumbaikars are advised to avoid non-essential travel and to exercise caution while venturing out.Police have been instructed to be on…— मुंबई पोलीस - Mumbai Police (@MumbaiPolice) August 15, 2025భారీ వర్షాల కారణంగా విఖ్రోలి వెస్ట్ సమీపంలోని కొండచరియలు విరిగిపడగా, ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారు ప్రస్తుతం రాజవాడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీచేసినందున ప్రజలు అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని ముంబై పోలీసులు కోరారు.#WATCH Mumbai: Heavy rain causes waterlogging in many parts of the city. Visuals from Gandhi Market. pic.twitter.com/2mAbfXySWv— ANI (@ANI) August 16, 2025‘ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయిందనే రిపోర్టులు వస్తున్నాయి. బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముంబై పోలీసులు ప్రజలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు’అని ముంబై పోలీసులు ‘ఎక్స్’లో తెలిపారు.భారత వాతావరణ శాఖ ముంబై, థానే, పాల్ఘర్లలో భారీ వర్షాలు కురియనున్నాయని హెచ్చిరించింది. పాల్ఘర్లో ఆగస్టు 19 వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కాగా భారీ వర్షాల కారణంగా నగరంలోని వాషి, కింగ్స్ సర్కిల్, గాంధీ మార్కెట్, అంధేరి, కుర్లా, చెంబూర్ తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి.#WATCH Mumbai: Heavy rain causes waterlogging in many parts of the city. Visuals from Andheri Subway. pic.twitter.com/ZmrdATn84i— ANI (@ANI) August 15, 2025రైల్వే ట్రాక్‌లు నీటితో నిండిపోయాయి. ప్రజలు అనవసరమైన ప్రయాణాలను మానుకోవాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సూచించింది.కాగా గురువారం ముంబైలో అత్యధిక వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ కొలాబా అబ్జర్వేటరీ వద్ద 53 మి.మీ వర్షపాతం నమోదైందని తెలిపింది. #WATCH Mumbai: Heavy rain causes waterlogging in many parts of the city. Visuals from Andheri Subway. pic.twitter.com/ZmrdATn84i— ANI (@ANI) August 15, 2025 -
మరో 24 గంటలు అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు మరో 24 గంటల వరకు మరింత అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. గడిచిన మూడు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ వర్షాలు కురిశాయని, దానిని దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు వర్షాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలసి గురువారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో మంత్రి శ్రీనివాస్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైన భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ తదితర జిల్లాల్లో పరిస్థితులపై కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రాబోయే 24 గంటల్లో రెడ్ అలర్ట్ జోన్లో ఉన్న మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు.సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు రూ.కోటి విడుదల చేశామని, అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామని తెలిపారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ఉమ్మడి పది జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు గుర్తుచేశారు. అధికారులు, సిబ్బంది సెలవులను రద్దుచేయాలని కలెక్టర్లను ఆదేశించారు.గ్రేటర్ హైదరాబాద్‌లో మున్సిపల్, మెట్రో వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, లో లెవెల్ బ్రిడ్జీల దగ్గర పోలీస్ సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని, తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. చిన్నపాటి వర్షాలకే ముంపునకు గురవుతున్న ప్రాంతాల ప్రజలకు వేరేచోట్ల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సూచించారు. -
పాలమూరులో దంచికొట్టిన వాన
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. జోగుళాంబ గద్వాల జిల్లా మినహా మిగిలిన అన్ని చోట్ల వాగులు, కాల్వలు పొంగిపొర్లాయి. రహదారులు దెబ్బతిన్నాయి. చెరువులు, కుంటలు అలుగు పారాయి. ⇒ మహబూబ్‌నగర్‌లోని హనుమాన్‌పురా, అప్పన్నపల్లిలోని రైల్వే అండర్ బ్రిడ్జీలకు ఉన్న రిటైనింగ్ వాల్స్ కూలిపోయాయి. దీంతో పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే 1,000 మంది విద్యార్థులతోపాటు అటు వైపు ఉన్న గొల్లబండతండాకు రాకపోకలు నిలిచిపోయాయి. జడ్చర్ల పరిధిలోని కావేరమ్మపేట వద్ద నల్లచెరువు కట్ట తెగి సమీపంలోని ఇళ్లలోకి వరదనీరు చేరింది. ⇒ జడ్చర్ల, మిడ్జిల్‌తోపాటు నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు, కల్వకుర్తి, ఉప్పునుంతల మండలాల్లో దుందుభి నది ఉధృతంగా ప్రవహించింది. మూసాపేట మండలంపోల్కంపల్లి వద్ద పెద్దవాగు మధ్యలో గొర్రెలు, వాటి కాపరులు చిక్కుకుపోగా రిస్క్ బృందం వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ⇒ మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ సమీపంలో దివిటిపల్లి నుంచి అమర్‌రాజా బ్యాటరీ కంపెనీకి వెళ్లే రోడ్డు వర్షం నీటికి పూర్తిగా ధ్వంసం కాగా.. గురువారం తెల్లవారుజామున సిబ్బందిని తీసుకువెళ్తున్న కంపెనీ బస్సు అందులో బోల్తా పడడంతో 11 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ⇒ జడ్చర్ల వద్ద సర్వీస్‌రోడ్డుపై మోకాళ్లలోతు నీటి ప్రవాహంలో హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సుతోపాటు, ఓ ప్రైవేట్ బస్సు తెల్లవారుజామున నిలిచిపోయాయి. దీంతో వరద నీటిలో చిక్కుకున్న 50 మంది ప్రయాణికులను అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా రోడ్డుపైకి తీసుకొచ్చారు. ⇒ నాగర్‌కర్నూల్ జిల్లాలోని శ్రీశైల ఉత్తర ముఖద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రం వద్ద కొండ చరియలు విరిగి పడ్డాయి. ⇒ నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో 14.46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లాలో మరికల్ 12.62, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో 12.3 సె.మీ. వనపర్తి జిల్లాలో ఖిల్లాలాఘనపురంలో 11.68, పెద్దమందడిలో 10.33, వనపర్తిలో 9.88, సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.వరద బీభత్సంహుజూర్నగర్, కోదాడ ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. లోలెవల్ బ్రిడ్జీల వద్ద వరద ప్రమాదకరంగా మారింది.నెమ్మికల్ దండుమైసమ్మ ఆలయ సమీపంలో సూర్యాపేట–దంతాలపల్లి రహదారిపైకి వరద భారీగా చేరింది. మేళ్లచెర్వు– కోదాడ ప్రధాన రహదారిపై కందిబండ సమీపంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్డి వద్ద తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉద్యాన తోటలు నీట మునిగి రైతులకు తీరని నష్టం వాటిల్లింది. పరిగి మండలం బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యాయత్‌నగర్, హనుమాన్‌గండి గ్రామాల్లో గురువారం తెల్లవారుజామున 3.55 గంటలకు 3 నుంచి 4 సెకన్ల పాటు భూమి కంపించింది. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దవాగు పరీవాహక ప్రాంతాల్లో ఉన్న పత్తి చేలను వరద ముంచెత్తింది. -
విరిగిపడిన కొండ చరియలు.. హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ జాం
సాక్షి,హైదరాబాద్: నార్సింగ్-అప్పారోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా నార్సింగ్-అప్పారోడ్డులో భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. అటువైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల గుండా గమ్య స్థానాలకు వెళ్లాలని వాహనదారులకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణలో భారీ వర్షాలుఇలా ఉంటే హైదరాబాద్‌తో పాటు తెలంగాణ అంతటా మరోసారి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాల కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వాగులు వంకలు పొంగిపొర్లాయి. ఈ క్రమంలో మరోసారి రాష్ట్రానికి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. -
జలదిగ్బంధంలో ఢిల్లీ.. ప్రమాద స్థాయికి ‘యమున’
న్యూఢిల్లీ: ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంతోపాటు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో నేటి (గురువారం) ఉదయం నుండి ఎడతెరిపిలేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. STORY | Yamuna nears warning mark in DelhiREAD: https://t.co/Khi8oNlw1WVIDEO | pic.twitter.com/jBQVZ17moE— Press Trust of India (@PTI_News) August 14, 2025భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తన తాజాగా రెడ్ అలర్ట్ జారీచేసింది. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌లలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. రోడ్లు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.VIDEO | Gurugram: Heavy rainfall on Thursday led to significant waterlogging and traffic congestion at IFFCO Chowk.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/zeQR1oE7ON— Press Trust of India (@PTI_News) August 14, 2025ఆగస్టు 17 వరకు ఈ ప్రాంతంలో ఇదే తరహా వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. మరింత అంచనా వేసింది. ఢిల్లీలోని యమునా నది నీటి మట్టం పాత రైల్వే వంతెన వద్ద 204.43 మీటర్లకు చేరుకుంది.VIDEO | Delhi: Heavy rain floods Mathura Road, causing severe waterlogging as vehicles struggle through the traffic.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/w4FYsbgkga— Press Trust of India (@PTI_News) August 14, 2025అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వర్షం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 23.6 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గింది. ఇది సాధారణం కంటే 3.2 డిగ్రీలు తక్కువ. సాధారణంగా గరిష్ట ఉష్ణోగ్రత దాదాపు 32 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని ఐఎండీ తెలిపింది.వర్షం కారణంగా రింగ్ రోడ్, దక్షిణ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు, తూర్పు ఢిల్లీని కలిపే అనేక ప్రధాన మార్గాలతో సహా అనేక ప్రాంతాలలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.#WATCH | Commuters wade through a partially waterlogged street near BD Marg area in Delhi, as the city receives continuous rain pic.twitter.com/CRdWc8w45N— ANI (@ANI) August 14, 2025సుబ్రోతో పార్క్, ఔటర్ రింగ్ రోడ్డు, ద్వారకా సెక్టార్-20, గురుగ్రామ్‌లోని బసాయి రోడ్డు, ఘజియాబాద్, నోయిడాలోని కొన్ని ప్రాంతాలలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. తూర్పు ఢిల్లీలోని పాండవ్ నగర్ అండర్‌పాస్‌లో నీరు నిలిచిపోయింది. ప్రజలు దాని గుండా వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారు. -
Red Alert: తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాలు
-
గుంటూరు కాజా టోల్ గేట్ దగ్గర భారీగా వరద
-
Hyderabad: మరో 3 రోజులు భారీ వర్షాలు
-
ఏపీకి రాబోయే 4 రోజులు భారీ వర్ష సూచన
-
స్కూళ్లు,కాలేజీలకు సెలవులు .. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం?
సాక్షి,హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాకాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలుండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ నెల 13వ తేదీ నుంచి 16వరకు అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో పరిస్థితిని బట్టి విద్యా సంస్థలకు సెలవులు.. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న మూడు రోజులల్లో భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో ఇన్ఛార్జ్ మంత్రులకు,ఉన్నతాధికారులకు ముందస్తు చర్యలపై దిశానిర్దేశం చేశారు.అకస్మిక వరదలు సంభవించినపుడు ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు అవసరమైన హెలికాప్టర్స్ ఉండేలా చూసుకోవాలి.ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి. విద్యుత్‌కు సంబంధించి అత్యవసర సమయాల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా మొబైల్ ట్రాన్స్ఫర్స్ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.హైదరాబాద్‌లో వరదలపై హైడ్రా అప్రమత్తంగా వ్యవహరించాలి. 24 గంటలు అందుబాటులో ఉండాలి.అత్యవసర సమయాల్లో ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలి. రాబోయే 72 గంటలు అందరూ అప్రమత్తంగా ఉండాలి.లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి.ఎక్కడ ఏం జరిగినా సమాచారం కంట్రోల్ రూంకు చేరేలా చూడాలి. ఉద్యోగులు,సిబ్బంది సెలవులు రద్దు చేసి 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్‌లో ప్రమాద స్థాయికి నీరు చేరిన చోట ప్రజలు వెళ్లకుండా పోలీసు సిబ్బంది అలెర్ట్ చేయాలి.వర్షాల నేపథ్యంలో మూడు కమిషనరేట్లలో ట్రాఫిక్ నియంత్రణకు లా అండ్ ఆర్డర్ పోలీసుల సహకారం తీసుకోవాలి. వర్షాలు, వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఎఫ్ఎం రేడియోలలో అలర్ట్ చేయాలి. క్లౌడ్ బరస్ట్ సమయాల్లో పరిస్థితులను ఎదుర్కొనేలా సన్నద్ధం కావాలి. పరిస్థితులను బట్టి స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాలి. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేసేలా చర్యలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు రోడ్లపై ట్రాఫిక్ తక్కువగా ఉండేలా చూడాలి.అత్యవసర టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి. మీడియా తప్పుడు వార్తలతో భయానక వాతావరణం సృష్టించే ప్రయత్నం చేయొద్దు సమాచార శాఖ మీడియాకు సరైన సమాచారం అందించేలా చర్యలు తీసుకోవాలి. రాబోయే 72 గంటలు అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పనిచేయాలి’ అని సూచించారు. -
Telangana: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 13న అల్పపీడనం ఏర్పడే ఛాన్స్
-
Hyd: అసంపూర్తిగా వదిలేసిన SNDP నాలాలో పడిన డెలివరీ బాయ్
-
పైపైకి పాతాళ గంగ..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలకు భూగర్భ జలమట్టాలు గణనీయంగా వృద్ధిచెందాయి. భూగర్భ జలాల సగటు లోతు గత మేలో 10.07 మీటర్లకు పడిపోగా, వర్షాలు ప్రారంభం కావడంతో జూన్‌లో 9.47 మీటర్లకు.. జూలైలో 8.37 మీటర్లకు పెరిగాయి. మేతో పోలిస్తే జూన్‌లో భూగర్భ జలమట్టాల సగటు 0.6 మీటర్లు, జూలైలో 1.69 మీటర్ల మేర వృద్ధి చెందినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, 2024 జూలైతో పోలిస్తే 2025 జూలైలో మాత్రం 0.13 మీటర్ల మేర భూగర్భ జలాలు తగ్గిపోయాయి. 2024 జూలైలో రాష్ట్ర భూగర్భజలాల సగటు నీటిమట్టం 8.25 మీటర్లు మాత్రమే కావడం గమనార్హం. రాష్ట్ర భూగర్భ జలవనరుల శాఖ జూన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో భూగర్భ జలాల స్థితిగతులను పరిశీలించి తాజాగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. భూగర్భ జలవనరుల శాఖ రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేసిన 1,771 పీజోమీటర్ల ద్వారా భూగర్భ జలాల స్థితిగతులను ప్రతి నెలా సమీక్షించి, తర్వాతి నెలలో నివేదికలను విడుదల చేస్తూ ఉంటుంది. మెదక్ జిల్లాలో 14.16 మీటర్ల లోతుకు.. ఈ సీజన్లో కృష్ణానది పరీవాహకంలో విస్తారంగా వర్షాలు కురవడంతో జలవనరుల్లో పుష్కలంగా నీరు చేరింది. దీంతో పరీవాహకం పరిధిలోని ప్రాంతాల్లో భూగర్భ జలాలు గణనీయంగా వృద్ధి చెందాయి. మరోవైపు గోదావరి పరీవాహకంలో వర్షాభావం నెలకొని ఉండటంతో అక్కడి కొన్ని జిల్లాల్లో భూగర్భ జలాలు జూన్‌తో పోలిస్తే జూలైలో మరింతగా దిగజారాయి. గోదావరి పరీవాహక పరిధిలోని మెదక్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా 14.16 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. కాగా, ఖమ్మం జిల్లాలో 3.87 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని జిల్లాలను సగటు భూగర్భ జలమట్టం 0–5 మీటర్లు, 5–10 మీటర్లు, 10 మీటర్లపైన లోతు.. అనే మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తారు. భూగర్భ జలాలు 0– 5 మీటర్లలోపు లోతులో ఉంటే సురక్షిత స్థాయిలో ఉన్నట్టు భావిస్తారు. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలుండగా, 4 జిల్లాల్లో 0–5 మీటర్ల లోతులోనే భూగర్భ జలమట్టం ఉందని గుర్తించారు. 19 జిల్లాల్లో 5–10 మీటర్ల లోతులో, 10 జిల్లాల్లో 10–15 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నట్టు తేలింది. 10 మీటర్లకన్నా లోతుకు భూగర్భ జలాలు పడిపోయిన జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా భావిస్తారు. సాధారణంతో పోలిస్తే వర్షపాతం తక్కువే.. జూలైలో రాష్ట్ర వార్షిక సగటు వర్షపాతం 358 మి.మీ.లు కాగా, 2025 జూన్‌లో 342 మి.మీ.ల సగటు వర్షపాతమే నమోదైంది. అంటే సాధారణం కంటే 4 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని స్పష్టమవుతోంది. హైదరాబాద్‌లో భారీగా వృద్ధి.. హైదరాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో భారీగా భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. 2024 జూన్‌తో పోలిస్తే 2025 జూన్‌లో రాష్ట్రంలోని 15 జిల్లాల్లో భూగర్భ జలమట్టాల్లో వృద్ధి నమోదు కాగా, మరో 18 జిల్లాల్లో క్షీణత కనిపించింది. గత ఏడాది జూలైలో రాష్ట్ర సగటు భూగర్భ జలాల లోతు 8.25 మీటర్లుకాగా.. ఈ ఏడాది జూలైలో 8.37 మీటర్లుగా నమోదైంది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 2.71 మీటర్లు, అత్యల్పంగా మెదక్ జిల్లాలో 0.03 మీటర్ల వృద్ధి నమోదైంది. 431 మండలాల్లో మెరుగుదల రాష్ట్రంలో మొత్తం 621 మండలాలు ఉండగా, దశాబ్దకాల సగటుతో పోలిస్తే.. గత జూన్ నెలలో 431 మండలాల్లో (79శాతం) 0.1 నుంచి 16.37 మీటర్ల వరకు భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. మిగిలిన 190 మండలాల్లో (21శాతం) 0.02 నుంచి 18 మీటర్ల వరకు భూగర్భ జలమట్టం పతనం అయిందని గణాంకాలు చెపుతున్నాయి. -
ఏపీలో మళ్లీ భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు వార్నింగ్
సాక్షి,విశాఖ: ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆదివారం (ఆగస్ట్10) రాష్ట్రంలో పలు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇందులో భాగంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. పల్నాడు, ప్రకాశం ,కర్నూలు, అనంతపురం, అన్నమయ్య , వైఎస్సార్ ,నంద్యాల జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 30 నుంచి 40కి.మీ వేగంతో గాలువు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. -
Heavy Rainfall: ఢిల్లీకి రెడ్ అలర్ట్
-
తెలంగాణ వ్యాప్తంగా వచ్చే నాలుగు రోజులపాటు విస్తారంగా వర్షాలు
-
వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: వర్షాలు, వరదలతో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ప్రజలు, రైతులకు ఎలాంటి సాయమైనా అందించేందుకు అందుబాటులో ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై రెండు రోజులపాటు ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి.. హైదరాబాద్‌లో గురువారం భారీగా కురిసిన వర్షాలపై ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్‌తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్, విద్యుత్ విభాగం అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. విపత్తు నిర్వహణ బృందాలను సంసిద్ధంగా ఉంచాలని సూచించారు. కాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీఎస్ గురువారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
HYD Rains: హైదరాబాద్ లో వర్ష బీభత్సం
-
పొరుగు దేశం పాకిస్థాన్‌లో జల ప్రళయం.. 299 మంది మృతి
పాకిస్థాన్‌లో గత నెల రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో కురిసిన ఈ భారీ వర్షాలకు ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా సంభవించినట్టు సమాచారం. ఈ వర్షాలకు 300 మంది పైగా మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇంకా వందలాది మంది గాయపడ్డారు. భారీ వరదలకు రోడ్లు, వంతెనలు, భారీ చెట్లు సైతం కొట్టుకుపోయాయి. వందలాది మంది ఇల్లులు దెబ్బతిని నిరాశ్రయులుగా మిగిలారు. దేశవ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. పాక్ విపత్తు నిర్వాహణ సంస్థ పంచుకున్న డేటా ప్రకారం పాకిస్తాన్ వరదల్లో 140 మంది చిన్న పిల్లలతో సహా కనీసం 299 మంది మరణించినట్టు తెలిపింది. దాంతో పాటు 428 మూగజీవాలు కూడా మరణించినట్టు తన డేటాలో పేర్కొంది. -
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం
-
వారం తర్వాతే వానలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షపాతం గణాంకాలు క్రమంగా పడిపోతున్నాయి. పదిరోజుల క్రితం కురిసిన వర్షాలు ఉత్సాహపర్చినప్పటికీ... ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సగటున 10 శాతం లోటు వర్షపాతం ఉంది. గత ఐదేళ్ల వర్షపాతం గణాంకాలను పరిశీలిస్తే... ఆగస్టు నాటికి రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. కానీ ప్రస్తుతం నైరుతి సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు వర్షపాతం లోటులోనే ఉంది. గత వారం వరకు సాధారణ స్థితికి వచ్చిన గణాంకాలు మళ్లీ పడిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. కానీ వరుస వర్షాలకు అవకాశం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరో వారం వరకు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నైరుతి రుతుపవన సీజన్లో ఇప్పటివరకు బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం, వాయుగుండం, తుఫాను లాంటివి ఏర్పడలేదు. సాధారణంగా నైరుతి సీజన్లో రాష్ట్రంలో వర్షాలు కురవాలంటే బంగాళాఖాతంలోని వాతావరణ పరిస్థితులే కీలకం. కానీ ఇప్పటివరకు బంగాళాఖాతంలో తుఫానులాంటివి ఏర్పడకపోవడంతో వర్షాలు అంతంతమాత్రంగానే కురిశాయి. ఈనెల 10వ తేదీ తర్వాత రుతుపవనాల గమనం అనుకూలంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 12 జిల్లాల్లో లోటు వర్షపాతం నైరుతి రుతుపవన సీజన్లో ఆదివారం నాటికి రాష్ట్రంలో 37.80 సెం.మీ. సగటు సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 34.30 సెం.మీ. నమోదైంది. అంటే సాధారణం కంటే 10 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మాత్రమే సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదుకాగా, 12 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ⇒ ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సంగారెడ్డి, జనగామ, సూర్యాపేట, జనగామ జిల్లాల్లో సాధారణం కంటే 20 శాతం తక్కువ వర్షాలు కురిశాయి. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ⇒ మండలాల వారీగా వర్షపాతం గణాంకాలు పరిశీలిస్తే... ఆరు మండలాల్లో మాత్రమే అత్యధిక వర్షాలు కురిశాయి. 73 మండలాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా.. 315 మండలాల్లో సాధారణ వర్షపాతం, 227 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. -
పొద్దున్నే ఢిల్లీని ముంచెత్తిన వర్షం.. చెరువులైన రహదారులు
న్యూఢిల్లీ: ఈరోజు(ఆదివారం) ఉదయం నుంచి రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్లు ప్రాంతాల్లోని రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. గురుగ్రామ్‌లో భారీ వర్షాల కారణంగా జలమయమైన ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వేపై జనం నడుచుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. VIDEO | Heavy rains caused severe waterlogging in parts of Delhi. Visuals from Deoli Vidhan Sabha. (Full video available on PTI Videos - https://t.co/dv5TRAShcC) pic.twitter.com/kR0s9gewpZ— Press Trust of India (@PTI_News) August 2, 2025విజయ్ చౌక్, కన్నాట్ ప్లేస్, మింటో బ్రిడ్జి, సరోజినీ నగర్, ఎయిమ్స్, పంచకుయన్ మార్గ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా జనజీవనం అతలాకుతమయ్యింది. జనపథ్, లజ్‌పత్ నగర్, మింటో బ్రిడ్జిలలో కూడా భారీ వర్షపాతం నమోదైంది. డియోలి ప్రాంతానికి చెందిన దృశ్యాలు వర్షం తీవ్రతను చూపించాయి. ఈ మార్గాలలో రాకపోకలు సాగించేందుకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పంచకుయన్ మార్గ్‌కు సంబంధించిన వీడియో ఫుటేజ్‌లో వర్షం కారణంగా వాహనాలు నీటిలో నడుస్తున్నట్లు, ట్రాఫిక్, పాదచారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడాన్ని చూపిస్తున్నాయి. సరోజినీ నగర్, కన్నాట్ ప్లేస్‌లలో నిన్న రాత్రి కురిసిన వర్షాలకు రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. #WATCH | Delhi | Waterlogging in parts of the national capital following a spell of rain. (Visuals from Panchkuian Marg) pic.twitter.com/Im77ERO6Ps— ANI (@ANI) August 2, 2025భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపిన వివరాల ప్రకారం బహదూర్గఢ్, మనేసర్ తదితర ఎన్సీఆర్ ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. లోని దేహత్, హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, ఘజియాబాద్, ఇందిరాపురం, ఛప్రౌలా, నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్ బల్లభ్గఢ్లతో సహా ఢిల్లీ అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. #WATCH | Delhi: Rain lashes several parts of the National Capital.(Visuals from Sarojini Nagar) pic.twitter.com/gXlpXwmsJh— ANI (@ANI) August 2, 2025ఢిల్లీలో శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 33.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణ సగటు కంటే 1.1 డిగ్రీలు తక్కువ. కనిష్ట ఉష్ణోగ్రత 25.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే 1.4 డిగ్రీలు తక్కువ. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) డేటా ప్రకారం ఢిల్లీలో గాలి నాణ్యత సంతృప్తికరమైన వర్గంలోనే ఉంది శనివారం సాయంత్రం 6 గంటలకు గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) 84గా నమోదైంది. -
ఈ నెలలో వర్షాలు సాధారణమే...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు సాధారణ స్థితిలోనే నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్లో జూన్ నెలలో తీవ్ర లోటువర్షపాతం నమోదు కాగా... జూలైలో కాస్త ఆశాజనకంగా వర్షాలు కురిశాయి. దీంతో రాష్ట్ర వర్షపాతం గణాంకాలు సాధారణ స్థితికి చేరాయి. ప్రస్తుతం నాలుగైదు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర సగటు గణాంకాలు లోటు దిశగా పడిపోతున్నాయి. ప్రస్తుతం ఆగస్టు నెలలో వర్షాలు సాధారణ స్థితిలో నమోదవుతాయని, కొన్ని ప్రాంతాల్లో సాధారణంకంటే తక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వేసిన అంచనాలు కొంత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆగస్టు నెల వర్షపాతం అంచనాలను ఐఎండీ విడుదల చేసింది. ఈ నెలలో వర్షాలు సాధారణ స్థితిలో నమోదవుతాయని, 94 శాతం నుంచి 106 శాతం మధ్యలో వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాల సీజన్ ద్వితీయార్ధంలో వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా నమోదైతేనే రైతాంగానికి లాభం చేకూరుతుందని వ్యవసాయ శాఖ చెబుతుండగా.. తాజాగా వాతావరణ శాఖ వెల్లడించిన గణాంకాలు ఒకింత ఆందోళన కలిగిస్తున్నాయి. మండుతున్న ఎండలు... రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. పగటి పూట తీవ్ర ఉక్కపోతతో కూడిన వాతావరణం... రాత్రిపూట సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాల సీజన్లో భాగంగా ద్వితీయార్ధం ఉష్ణోగ్రతలు తగ్గాల్సి ఉండగా... ప్రస్తుతం అధికంగా నమోదవుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఈ నెలలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో నమోదవుతాయని, రాత్రిపూట మాత్రం సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని సూచించింది. నైరుతి సీజన్లో ఆగస్టు 1 వరకు 36.36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 34.24 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మూడు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా... 24 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 6 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. -
Heavy Rain: తెలంగాణ ప్రజలకు ప్రమాద హెచ్చరిక
-
ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు వాగు
-
కాకినాడ పోయొద్దాం.. మడ అడవులు చూసొద్దాం..
చాలా అడవులు చూసాం.. అరకు.. లంబసింగి.. శ్రీశైలంలో ఉండే నల్లమల చూశాం.. తిరుపతిలోని శేషాచలం చూశాం.. పుష్పా సినిమా షూటింగ్ చేసిన మారేడుమిల్లి అడవులు చూశాం. కానీ ఈ మడ అడవులు ఏందీ. ఏంటి వీటి స్పెషాలిటీ..ముందు చెప్పినవన్నీ.. కొండలు.. గుట్టలు.. అంటే సముద్రమట్టానికి ఎత్తులో ఉంటాయి. అయితే ఈ మడ అడవులు మాత్రం సముద్రం.. నది కలిసే చోట ఉండే చిత్తడి ప్రాంతంలో పెరిగే చెట్ల సముదాయమే మడ అడవులు.. ఇందులో పెద్దపెద్ద వృక్షాలు ఉండవు.. అన్నీ చిన్నచిన్న చెట్లు ఉంటాయి. ఇవి ముఖ్యంగా ఉప్పునీటిలో కూడా పెరిగే వృక్షజాతులు అన్నమాట. ఇవి మన రాష్ట్రంలో ఎక్కడున్నాయి మరి? మన రాష్ట్రంలో కాకినాడ తీరం వద్ద మనం కోరింగ మాడ అడవులను చూడవచ్చు.. అంటే గోదావరి నది సముద్రంలో కలిసే చోట ఉన్నాయి అన్నమాట. ఇక్కడ రకరకాల జీవజాలం ఉంటుంది. సముద్రం భూమ్మీదకు వచ్చేయకుండా.. నేల కోతకు గురికాకుండా ఈ అడవులు కాపాడతాయన్నమాట . సముద్రపు ఒడ్డున ఉండే పల్లెలను తుపాన్లు ముంచెత్తకుండా ఈ మడ అడవులు సరిహద్దుల్లోని సైనికుల మాదిరిగా అడ్డుగోడగా నిలబడతాయి.ఇంకెక్కడా లేవా ఈ మడ అడవులు? ఉన్నాయున్నాయి.. గంగానది సముద్రంలో కలిసే చోట సుందర్ బాన్స్ అడవులు పశ్చిమబెంగాల్లో ఉండగా తమిళనాడులోని పీచవరంలో కూడా ఈ మడ అడవులున్నాయి. మన రాష్ట్రంలో ఉన్న మడ అడవులు దాదాపుగా 40 గ్రామాలను సముద్రపు పోటునుంచి కాపాడుతున్నాయిఇక్కడ ఏమేం చెట్లు ఉంటాయి? భూమ్మీద పెరిగే చెట్లు ఇక్కడ పెరగవు.. ఉప్పునీరు.. మంచినీరు కలగలిసిన ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల్లో పెరిగే చిన్నచిన్న పొదలు.. తుప్పలతోబాటు విభిన్నమైన చెట్లు ఇక్కడ పెరుగుతాయి. అవిసెనియా మరినా, రిజోఫోరా అపిక్యులేటా వంటి విలువైన చెట్లు ఇక్కడ పెరుగుతాయి.పక్షులూ.. జంతువులూ?ఆ..ఆ ఉంటాయుంటాయి. చేపలను వేటాడే పిల్లులూ.. నీటికుక్కలు.. ఆలివ్ రిడ్లే తాబేళ్లు.. కొంగలు.. ఇక్కడ ప్రత్యేకం.. దాదాపుగా వందకుపైగా జంతువులూ.. పక్షుల రకాలు ఇక్కడ చూడొచ్చు..అక్కడికి ఎలా వెళ్లొచ్చు.. ఎలా చూడొచ్చు?కాకినాడకు సమీపంలోనే ఉన్న ఈ మడ అడవులు. దానిలోని వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని చూసేందుకు కాకినాడనుంచి కారులో వెళ్లొచ్చు. ఆటోలూ ఉంటాయి. అక్కడికి వెళ్ళాక చిత్తడి నేలల్లో నడిచేందుకు చెక్క వంతెనలు ఉంటాయి.. అటు ఇటు చూస్తూ.. పక్షుల కిలకిలలు వింటూ.. మధ్య మధ్యలో ఎదురయ్యే పిల్లులు.. నీటి కుక్కలను పలకరిస్తూ లోపలి వెళ్లొచ్చు.. ఇంకా బోట్లో కూడా అదంతా సరదాగా తిరిగి ప్రశాంతమైన వాతావరణంలో అలా సేద దీరవచ్చు. ఇంతకూ ఈరోజు స్పెషల్ ఏమిటి?ఏటా జూలై 26ను ప్రపంచ మ్యాంగ్రోవ్ పరిరక్షణ దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. అందుకే ఈ ప్రత్యేక కథనం. మరింకెందుకు కాకినాడ వెళదాం.. మడ అడవులు చూద్దాం.. గోదావరిలో పరవశిద్దాం. -సిమ్మాదిరప్పన్న -
లోటు నుంచి సాధారణం దిశగా..
సాక్షి, హైదరాబాద్: నైరుతి వర్షాలు జోరందుకున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వానలు రైతాంగానికి ఊరటనిస్తున్నాయి. సీజన్ ప్రారంభం నుంచి దాదాపు నెలన్నర పాటు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా..ఇప్పుడిప్పుడే కురుస్తున్న వానలు సాగు పనులకు కాస్త ఊతమిస్తున్నాయి. వర్షపాత గణాంకాలు లోటు నుంచి సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.నైరుతి రుతుపవనాల సీజన్లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 31.48 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, శుక్రవారం నాటికి 30.48 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతాన్ని పరిశీలిస్తే.. 3 శాతం లోటు ఉంది. శనివారం ఉదయంకల్లా గణాంకాలు లోటు నుంచి సాధారణాన్ని చేరుకుంటాయని, నెలాఖరుకల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆశాజనకంగా వర్షపాత గణాంకాలుంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 12 జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువగా... 12 జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షాలు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌లో సాధారణం కంటే 40 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో 34 శాతం, రంగారెడ్డి జిల్లాలో 24 శాతం, నారాయణపేటలో 14 శాతం, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 13 శాతం అధిక వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం, మహబుబాబాద్, వరంగల్, కరీంనగర్, సిద్దిపేట, వనపర్తి, ఖమ్మం, ములుగు జిల్లాల్లో కూడా సాధారణం కంటే అధిక వర్షాలు కురిశాయి. ⇒ మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ఇంకా వర్షపాతం గణాంకాలు లోటులోనే ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతానికి కాస్త సమీపానికి వచ్చాయి.తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలువాయువ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లోని పశ్చిమబెంగాల్ తీరం, బంగ్లాదేశ్ ప్రాంతంలో వాయుగుండం కేంద్రీకృతమైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి మహారాష్ట్ర మీదుగా ఉత్తర ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నట్టు వివరించింది దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల తేలికపాటి వర్షాలు, ఉత్తర ప్రాంత జిల్లాల్లోని కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముంది. -
మరో మూడు రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి/సాక్షి విశాఖపట్నం: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం బంగ్లాదేశ్ సమీపంలో తీరం దాటింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి.. వాయవ్య బంగాళాఖాతం వైపుగా కదులుతూ శుక్రవారం మధ్యాహ్నం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటింది. అనంతరం ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ జార్ఖండ్, ఉత్తర ఒడిశా వైపు వెళ్లనుంది. దీని ప్రభావం రాష్ట్రంపై దాదాపు తగ్గిపోయింది. శనివారం రాత్రితో వర్షాలు తగ్గుముఖం పట్టే సూచనలున్నాయి. నేడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. నేడు, రేపు కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులకు హెచ్చరిక తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అలజడిగా ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తీరాల్లో 2.9 నుంచి 3.6 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదు. అత్యవసర సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 425 0101 ను సంప్రదించాలి. వర్షపాతం తీరిది 24 గంటల వ్యవధిలో (గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు) ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం నవగంలో 6.6 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం కరిముక్కిపుట్టిలో, పార్వతీపురం మన్యం జిల్లా గొయిడిలో 5.8, అల్లూరి జిల్లా చింతపల్లి మండలం అన్నవరంలో 4.6, శ్రీకాకుళం జిల్లా బుర్జ మండలం మదనపురంలో 4.4, అల్లూరి జిల్లా జి.మాడుగులలో 4.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. -
AP Rains: చల్లని కబురు చెప్పిన వాతావరణ శాఖ
-
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం : ఉత్తర బంగాళాఖాతంలో గురువారం సాయంత్రం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తరాంధ్రకు సమీపంలో కొనసాగుతూ శుక్రవారం సాయంత్రానికి బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుంది. అనంతరం నెమ్మదిగా పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ ఆదివారం నాటికి పశ్చిమబెంగాల్, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా తీరాలవైపు వెళ్లనుంది. అక్కడే తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పుంజుకోనున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేడు అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రానున్న మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే ప్రమాదమున్న నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో పాలకొండలో 69 మి.మీ, సీతంపేటలో 60, ముంచంగిపుట్టులో 53, చింతపల్లిలో 49, బూర్జలో 46 మి.మీ వర్షపాతం నమోదైంది. -
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు
-
అల్పపీడనం.. ఆలస్యం
సాక్షి, విశాఖపట్నం, సాక్షి అమరావతి: ఉష్ణ మండల తుపాను కారణంగా.. ఉత్తర కోస్తాకు సమీపంలో బుధవారం ఏర్పడాల్సిన అల్పపీడనం కాస్తా ఆలస్యమైంది. పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా.. గురువారం ఉత్తర బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో శుక్రవారం నాటికి ఉత్తరాంధ్రకు సమీపంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం రెండూ ఉత్తర కోస్తాకు సమీపంలోనే కొనసాగుతూ.. క్రమంగా ఒడిశా వైపుగా కదలనున్నాయి. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాల్లో విస్తారంగా మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. అదేవిధంగా.. రాయలసీమలో అక్కడక్కడా మోస్తరు వానలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా గురు, శుక్రవారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖార్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిడుగులతో కూడిన వర్షాలు నేపథ్యంలో చెట్లు, టవర్స్, పోల్స్ కింద, బహిరంగ ప్రదేశాల్లో నిలబడరాదని సూచించారు. తీరం వెంబడి గంటకు 50 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గడచిన 24 గంటల్లో కంచిలిలో 71 మి.మీ., నరసన్నపేటలో 65, కోటబొమ్మాళిలో 55, మందసలో 50, కవిటి రాజపురంలో 48, ఇచ్ఛాపురంలో 43, వజ్రపుకొత్తూరులో 42, పలాసలో 40, సీతంపేటలో 39 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
రాష్ట్రమంతా కుండపోత
సాక్షి,నెట్వర్క్: రాష్ట్రాన్ని కుండపోత వాన ముంచెత్తింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో కురిసిన ఏకధాటి వానతో దారులన్నీ ఏరులయ్యాయి. వాగులు వంకలు పొంగిపొర్లాయి. బుధవారం ఉదయం నుంచి కుండపోత వానతో కరీంనగర్ తీవ్రంగా ప్రభావితమైంది. ఆకాశానికి చిల్లులు పడినట్టు ఉదయం 6 గంటల నుంచే వాన విరుచుకుపడటంతో నగర వీధులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ముఖ్యంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ వరదతో అతలాకుతలమైంది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్ ప్రాంగణాలు, ప్రధాన జంక్షన్లు, రహదారులు నీటమునిగాయి. కరీంనగర్ పట్టణంలో 9.3, మానకొండూరులో 7.5 సెం.మీ, గంగిపెల్లి 7.5 సెం.మీ, చింతకుంట 6.3 సెం.మీ, జగిత్యాల జిల్లా ధర్మపురి (నేరెళ్ల) 9.1 సెం.మీ, బీర్పూర్ 5.4 సెం,మీ, ఎండపల్లి 7.3 సెం.మీ, గుళ్లకోట 7.3 సెం.మీ, చొప్పున వర్షం కురిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరువాన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో పలుచోట్ల వాగుల ప్రవాహం, లో లెవల్ చప్టాలపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతుండగా, దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో సీతమ్మ నారచీరల ప్రాంతం, సీతమ్మ విగ్రహం నీట మునిగాయి. కిన్నెరసాని, వైరా రిజర్వాయర్లలో సైతం నీటి మట్టం పెరిగి వైరా రిజర్వాయర్ అలుగు పోస్తోంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు ప్రవాహం పెరగడంతో 15 గేట్లు ఎత్తి 33వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బూర్గంపాడు మండలం పినపాక పట్టీనగర్లోని సీతారామ కాలువ వద్ద నలుగురు బాలురు ఈతకు వెళ్లగా ప్రవాహంలో బొర్రా శివ(16) గల్లంతయ్యాడు. కారేపల్లి మండల వ్యవసాయ అధికారి గాదెపాడు రైల్వేఅండర్ బ్రిడ్జి వద్ద నిలిచిన వరదలో కారు చిక్కుకుపోయింది. దీంతో స్థానికులు గుర్తించి తాళ్ల సాయంతో గంటపాటు శ్రమించి బయటకు తీశారు. ⇒ కుమురంభీం జిల్లావ్యాప్తంగా బుధవారం వర్షం దంచికొట్టింది. భారీ వరదతో చింతలమానెపల్లి, అహేరి మధ్య రవాణా నిలిచిపోయింది. ఆర్టీసీ బస్సులు రద్దు చేశారు. ⇒ మంచిర్యాల జిల్లాలో ఎర్రవాగు ఉప్పొంగింది. కన్నెపల్లి మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన రైతు బోరుకుంట రాజం తన భార్య, మరో ఇద్దరు కూలీలతో కలిసి మంగళవారం తిమ్మాపూర్‌లోని పత్తి చేనుకు వెళ్లాడు. పని ముగించుకుని వస్తుండగా అప్పటికే కురిసిన భారీ వర్షానికి ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ట్రాక్టర్‌పై వాగు దాటుతుండగా ప్రవాహం పెరిగింది. ట్రాక్టర్‌పై ఉన్న వారంతా దూకి ప్రాణాలతో బయటపడ్డారు. ఏజెన్సీలో ఉప్పొంగిన వాగులు ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని జంపన్నవాగు ఉప్పొంగింది. కొండాయి వద్ద తాత్కాలికంగా పోసిన మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం పస్రా– తాడ్వాయి మధ్యలోని జలగలంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క బుధవారం పరిశీలించారు. మంగపేట మండల కేంద్రంలోని గిరిజన పెట్రోల్ బంక వద్ద ప్రధాన రోడ్డుపై నిర్మించిన కల్వర్టు సగం వరకు కోతకు గురై కొట్టుకు పోవడంతో ప్రమాదకరంగా మారింది. గార్ల సమీపంలోని పాకాల ఏరు బుధవారం చెక్‌డ్యాం పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మండల కేంద్రమైన గార్ల నుండి రాంపురం, మద్దివంచ పంచాయతీలకు చెందిన 12 గ్రామాలు, తండాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ⇒ ఎస్ఎస్ తాడ్వాయి మండల పరిధి అల్లిగూడెం గ్రామానికి చెందిన గర్భిణి గుమ్మడి కృష్ణవేణికి పురిటినొప్పులు రావడంతో నర్సాపూర్ వాగు వరదలో నుంచి వైద్య సిబ్బంది గ్రామస్తుల సహాయంలో బుధవారం వాగు దాటించారు. ⇒ ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు గ్రామానికి చెందిన తోటపల్లి వేణు(20) భద్రాచలంలో ఉంటున్న తమ్ముడికి బైక్ ఇవ్వడానికి వెళుతుండగా, మార్గమధ్యలో పెద్ద గొళ్లగూడెం వద్ద పిడుగు పడి చనిపోయాడు. ⇒ మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలకేంద్రానికి చెందిన ఆగబోయిన నరేష్(30) రాళ్ల ఒర్రెవాగులో బుధవారం చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతయ్యాడు. రానున్న రెండ్రోజులు వానలేవానలు రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం వరకు ఏడు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 20 సెంటీమీటర్లకు పైబడి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతిభారీ, ఒకట్రెండు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వివరించింది. ⇒ నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ మహబుబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని సూచిస్తూ... ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ⇒ నైరుతి సీజన్లో ఇప్పటివరకు 29.78 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... బుధవారం నాటికి 26.79 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణం కంటే 10 శాతం లోటు వర్షపాతం ఉంది. నెలాఖరు కల్లా వర్షపాతం నమోదు గణాంకాలు మరింత మెరుగుపడతాయని అధికారులు చెబుతున్నారు. బుధవారం రాష్ట్రంలో సగటు వర్షపాతం 2.83 సెం.మీ.గా నమోదైంది. -
ఏపీలో నాలుగు రోజుల పాటు దంచికొట్టనున్న వానలు
సాక్షి,విశాఖ: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని బుధవారం వాతావారణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో మత్స్యకారులు, రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఫలితంగా నాలుగు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురవనున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఆరెంజ్,ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..ఆరెంజ్ అలెర్ట్ అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావారి, పశ్చిమ గోదావారి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు..ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి 45-65 కిమీ వేగంతో గాలులు ఉండే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని,భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ఇంకా తీవ్ర వర్షాలు కురిసే అవకాశమున్నందున అప్రమత్తత అవసరం ఉందని సూచించారు. -
ఢిల్లీలో కుంభవృష్టి.. నీట మునిగిన రోడ్లు.. అంతటా ట్రాఫిక్ జామ్
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో నేటి(బుధవారం) ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. వరుసగా రెండవరోజు కూడా ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం కూడా రాజధానిలో వర్షాలు పడతాయని అంచనా వేసింది. #WATCH | Delhi: Rain lashes parts of the national capital. (Visuals from Rao Tula Ram Marg) pic.twitter.com/V3AlLZAAcE— ANI (@ANI) July 23, 2025భారీ వర్షానికి నోయిడాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రుతుపవనాలు తీవ్రతరం కావడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం ఢిల్లీలోని కురిసిన వర్షానికి ఎక్స్ ప్రెస్ ఎన్క్లేవ్ రోడ్దు, కుతుబ్ మినార్ మెట్రో స్టేషన్ సమీపంలోని అనువ్రత్ మార్గ్‌లోని రెండు క్యారేజ్‌వేలలో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ఢిల్లీ వాతావరణ బేస్ స్టేషన్ అయిన సఫ్దర్జంగ్లో మంగళవారం ఉదయం 8:30 నుండి సాయంత్రం 5:30 గంటల మధ్య 8.8 మిమీ వర్షపాతం నమోదైంది. ఉత్తర ఢిల్లీలోని రిడ్జ్‌లో 22.4 మిమీ వర్షపాతం నమోదైంది. ఈ నెలలో ఇప్పటివరకు ఢిల్లీలో 136.3 మి.మీ వర్షపాతం నమోదైంది. Very heavy #rain in #Noida Filmcity #Monsoon#Delhirain#Raining#WeatherUpdate pic.twitter.com/RVR099hdSj— Shweta (@imshwetta) July 23, 2025 -
మరో రెండు రోజులు వానలు
సాక్షి, విశాఖపట్నం/వాకాడు: మరో 2 రోజుల పాటు రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ మధ్య, దాన్ని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది రానున్న రోజుల్లో బలపడి.. 24వ తేదీ సాయంత్రానికల్లా.. అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. ఇది 25 వతేదీ రాత్రి లేదా 26న ఉదయానికి మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే సూచనలున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రమంతటా వర్షాలు విస్తారంగా పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా.. దక్షిణ కోస్తాలో రానున్న రెండు రోజుల్లో అనేక చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోనూ తేలికపాటి వర్షాలు.. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. అలల తాకిడికి బోట్లు బోల్తా ఉపరితల ఆవర్తనం, ధ్రోణి ప్రభావంతో సముద్రంలో అలల ఉధృతి ఎక్కువుగా ఉంది. అలల తాకిడి కారణంగా సముద్రంలో చేపల వేట చేస్తున్న మత్స్యకారుల బోట్లు బోల్తాపడుతున్నాయి. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని తూపిలిపాళెం, దుగ్గరాజప ట్నం, అంజలాపురం, కొండూరుపాళెం, శ్రీనివాసపురం, పంబలి, ఓడపాళెం, మొనపాళెం, చినతోట, వైట్‌కుప్పం, పూడికుప్పం, పూడిరాయిదొరువు, నవాబుపేట మత్స్యకార గ్రామాల సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఆదివారం ఆడికృత్తిక పర్వదినం కావడంతో భక్తులు భారీగా సముద్ర తీరాలకు వచ్చారు. అలల తాకిడికి స్నానాలు సజావుగా చేయలేకపోయారు. కొందరు అలల ఉధృతికి చెల్లాచెదురుగా ఎగిరి ఒడ్డుకు నెట్టుకొచ్చారు. -
Nallakunta: ప్రతి సంవత్సరం వర్షం వస్తే ఇదే పరిస్థితి అంటూ కాలనీవాసుల ఆవేదన
-
Weather: ఏపీకి భారీ వర్ష సూచన
-
హైదరాబాద్ లో భారీ వర్షం
-
3 రోజులపాటు పిడుగులతో కూడిన వర్షాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శుక్ర, శని, ఆదివారం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ గురువారం తెలిపారు. శుక్రవారం ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శనివారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు..శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆదివారం కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. -
Hyderabad: దంచికొట్టిన వర్షం
-
Big Alert: కోస్తా జిల్లాల్లో ఐదు రోజుల పాటు పడనున్న వర్షాలు
-
అమర్నాథ్ యాత్ర నిలిపివేత.. కారణమిదే..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రా మార్గంలో భారీ వర్షాలు కురియనున్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపధ్యంలో పహల్గామ్, బాల్టాల్ మార్గాలలో కొనసాగుతున్న అమర్నాథ్ యాత్రను గురువారం(జూలై 17)న ఒకరోజు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కుండపోత వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున, ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. శుక్రవారం (జూలై 18)న యాత్ర తిరిగి ప్రారంభమయ్యే ముందు భద్రతా తనిఖీలు నిర్వహించనున్నారని తెలిపారు. Tragedy Strikes Amarnath Yatra: Pilgrim Killed, Route Halted!A devastating landslide on the Baltal route in Ganderbal claimed the life of a woman pilgrim and injured three others, prompting the suspension of the Amarnath Yatra on July 17, 2025. Heavy rainfall triggered a… pic.twitter.com/uERtEB9cbm— UnreadWhy (@TheUnreadWhy) July 17, 2025కశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ బిధురి మీడియాతో మాట్లాడుతూ గత రెండు రోజులుగా నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా, ట్రాక్‌లపై మరమ్మతు, నిర్వహణ పనులు చేపట్టాల్సిన అవసరం ఏర్పండిందన్నారు. అందుకే గురువారం నాడు ఈ రెండు బేస్ క్యాంపుల మీదుగా పవిత్ర గుహ వైపు వెళ్లేదారిలో ఎటువంటి రాకపోకలను అనుమతించకూడదని నిర్ణయించామన్నారు. పగటిపూట వాతావరణ పరిస్థితులను అనుసరించి శుక్రవారం యాత్ర తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. Indian Army Rescues Pilgrims Amid Heavy Rain on Amarnath Yatra Route #AmarnathYatra #IndianArmy #ArmyRescue #Kashmir #YatraSafety #BreakingNews #Amarnath2025 #PilgrimSupport #DisasterResponse #JaiHind pic.twitter.com/oQyqxeMCHz— Geopolitics | News | Trends (@rareinfinitive) July 17, 2025గందర్బాల్ జిల్లాలోని యాత్ర బాల్తాల్ మార్గంలో కొండచరియలు విరిగిపడి ఒక మహిళ మృతిచెందిన నేపధ్యంలో అప్రమత్తమైన అధికారులు యాత్రను ఒకరోజు నిలిపివేసి మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. అమర్నాథ్ యాత్రా మార్గంలోని బాల్తాల్ ప్రాంతంలో అధిక వర్షపాతం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షాకాలంలో పర్వత ప్రాంతాలలో ఇటువంటి ప్రమాదాలు పొంచి ఉంటాయని అధికారులు తెలిపారు. జూలై 3న యాత్ర ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 2.47 లక్షలకు పైగా యాత్రికులు అమర్నాథ్ పవిత్ర గుహను సందర్శించుకున్నారు. -
రాష్ట్రానికి ‘మళ్లీ’ వర్షసూచన!
సాక్షి, విశాఖపట్నం: రుతుపవనాలు ప్రవేశించి.. దాదాపు నెలన్నర అవుతున్నా.. లోటు వర్షపాతమే కొనసాగుతోంది. మండు వేసవిని తలపించేలా భానుడు భగభగలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో.. బ్రేక్మాన్సూన్ పరిస్థితులు కనిపిస్తున్నాయని ఎండలు.. లోటు వర్షపాతం నుంచి కొంత ఉపశమనం కలిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. వారి అంచనాల ప్రకారం గురువారం నుంచి రాష్ట్రంలో వర్షాలు క్రమక్రమంగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోనూ వర్షాలు జోరందుకోనున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ మోస్తరు వానలు పడనున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, పిడుగులు పడే ప్రమాదం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
అమెరికాను ముంచెత్తిన వరదలు
వాషింగ్టన్: న్యూయార్క్ నగరంతో సహా అమెరికాలోని ఈశాన్య ప్రాంతంలో కుండపోత వర్షం కురిసింది. అనేక నగరాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. గ్యాస్ స్టేషన్లు, సబ్‌వేలు మునిగిపోయాయి. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. విమాన రాకపోకలు ఆలస్యమయ్యాయి. సోమవారం సాయంత్రానికే న్యూయార్క్, వాషింగ్టన్, బాల్టీమోర్, నెవార్క్, న్యూజెర్సీ, వర్జీనియా వంటి అనేక ప్రాంతాలలో వరద హెచ్చరికలు జారీ చేశారు.సాయంత్రమే స్టేటెన్ ఐలాండ్, మాన్‌హట్టన్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. న్యూయార్క్‌లో వాహనాలు వరదనీటిలో చిక్కుకున్నాయి. డ్రైవర్లకు రెస్క్యూ సిబ్బంది సహాయం చేశారు. న్యూజెర్సీలో వరదల కారణంగా బస్సులు, రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఆకస్మిక వరదలు, భారీ వర్షాల కారణంగా న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పౌరులు ఇళ్లలోనే ఉండాలని, అనవసరమైన ప్రయాణాలను నివారించాలని సూచించారు. న్యూజెర్సీలోని కొన్ని ప్రాంతాల్లో 5 అంగుళాల వరకు వర్షం కురిసింది.టెక్సాస్‌లో 131కి చేరిన మృతులు.. మరోవైపు టెక్సాస్‌లో వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 131కి పెరిగింది. గ్రేటర్ కెర్విల్లే ప్రాంతంలో 97 మంది ఆచూకీ తెలియలేదు. కెర్ కౌంటీ మరణాల్లో దాదాపు మూడింట ఒక వంతు మంది పిల్లలే కావడం గమనార్హం. విమాన కార్యకలాపాలకు అంతరాయం.. తుఫాను కారణంగా సోమవారం ఒక్క రోజే అమెరికా అంతటా విమాన కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 10,000 విమానాలు ఆలస్యమయ్యాయి. 1,600 కంటే ఎక్కువ రద్దయ్యాయి. ఫ్లోరిడాను భారీ వర్షాలు ముంచెత్తే అవకావం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇది విమాన రాకపోకలను మరింత ప్రభావితం చేయనుంది. -
జూలైలోనూ వేసవే.!
సాక్షి, విశాఖపట్నం: రోహిణి కార్తె వెళ్లిపోయింది. వేసవి కాలం ముగిసింది. వర్షాలు దండిగా కురవాల్సిన సమయం.. కానీ భానుడి భగభగలు తగ్గకపోగా మరింత పెరిగాయి. ఈ సారి నైరుతి ముందుగానే పలకరించినా జూలైలో ముఖం చాటెయ్యడంతో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేని విధంగా జూలైలో గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పొడిగాలుల కారణంగా శుక్రవారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 3.5 డిగ్రీల అదనంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నెల్లూరులో అత్యధికంగా 39.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. జంగమహేశ్వరపురంలో 39.2, కావలి, మచిలీపట్నంలో 38.9, తిరుపతిలో 38.7డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 14 వరకూ ఇదే రీతిలో వాతావరణం ఉంటుందని, 15వ తేదీ సాయంత్రం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
ఉప్పొంగిన ‘ప్రాణహిత’
చింతలమానెపల్లి/కాళేశ్వరం/ ఆసిఫాబాద్/ములకలపల్లి: ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు, ఉప నదుల వరదల కారణంగా ప్రాణహిత నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. చింతలమానెపల్లి మండలం గూడెం వద్ద అంతర్రాష్ట్ర బ్రిడ్జిని తాకేలా ప్రాణహిత ప్రవహిస్తోంది. నదిలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు అప్రమత్తం చేశారు. మండలంలోని దిందా వాగులో పడి కేతిని గ్రామానికి చెందిన సెడ్మెక సుమన్(18) గల్లంతయ్యాడు. స్నేహితులతో కలిసి వాగు అవతలి వైపు ఉన్న వ్యవసాయ భూముల వద్దకు వెళ్లి వచ్చే క్రమంలో నది దాటేందుకు ప్రయత్నించి పట్టు తప్పాడు. ఈ క్రమంలో గట్టుపై ఉన్న చెట్టును పట్టుకోగా కొమ్మ విరిగి వరద ఉధృతిలో కొట్టుకుపోయాడు. సిర్పూర్(టి) మండలంలో వెంకట్రావుపేట్–పోడ్సా అంతర్రాష్ట్ర హైలెవల్ వంతెనను ఆనుకొని పెన్‌గంగ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఇలాగే కొనసాగితే తెలంగాణ–మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయే అవకాశముంది. వరద నీరు గంట గంటకూ పెరుగుతుండడంతో తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆయా మండలాల్లో వందలాది ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పరీవాహక ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో పత్తి పంటలు నీట మునిగాయి. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద... భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 10.690 మీటర్ల ఎత్తులో నీటిమట్టం దిగువకు ప్రవహిస్తోంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు పరి«ధిలోని మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్‌కు వరద ప్రవా హం 6.36 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రూపంలో వస్తోంది. బరాజ్ 85 గేట్లు ఎత్తి అదే స్థాయిలో 6.36 లక్షల క్యూసె క్కుల నీటిని ఔట్‌ఫ్లోగా దిగువకు విడుదల చేస్తున్నారు. కుమురంభీం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత కుమురంభీం ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు గురువారం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తారు. ఇన్‌ఫ్లో 850 క్యూసెక్కులు ఉండగా.. రెండు గేట్లు ఎత్తి 880 దిగువకు వదులుతున్నారు. ‘సీతారామ’ప్ర«దానకాల్వ కట్టకు కోత సీతారామ ఎత్తిపోతల పథకం (ఎస్ఆర్ఎల్ఐ) ప్రధాన కాల్వ కట్టకు ప్రమాదం పొంచి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం వీకే.రామవరంలోని సీతారామ పంప్‌హౌస్–2 నుంచి కమలాపురం వద్ద గల పంప్‌హౌస్–3 వరకు వెళ్లే ప్రధాన కాల్వకు భారీ గొయ్యి ఏర్పడింది. వర్షాల «నేపథ్యంలో వరద ఉ«ధృతికి క్రమేపీ కోత పెరుగుతోంది. -
ఢిల్లీలో భారీ వర్షం.. రోడ్లపై నిలిచిపోయిన నీరు
-
వరద 'గోదావరి'
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వరద గోదావరి మళ్లీ పోటెత్తుతుంది. ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గోదావరిలో జలకళ మొదలైంది. గత వారం రోజులుగా రోజుకు సగటున 2 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో తీవ్రత మరింత పెరుగుతుందని దానికనుగుణంగా 9.32 లక్షల క్యూసెక్కుల నీరు 15 కల్లా వస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు వరద ప్రవాహంతో ముంపు మండలాల్లో అలజడి మొదలైంది. గోదావరికి వరదల సీజన్ ప్రారంభమైంది. వాస్తవానికి జూలై మొదటి వారం నుంచి వరద హడావుడి ప్రారంభమై ఆగస్టు వరకు రెండు సార్లు ముంపు మండలాల్ని అతలాకుతలం చేస్తోంది. ఈ ఏడాది వర్షాలు కొంత ఆలస్యం కావడం, ఇతర కారణాలతో వరద ఉధృతి గతంతో పోల్చితే తక్కువగానే ఉంది. ఈ నెల 2 నుంచి ప్రారంభమైన వరద నీరు క్రమేపీ పెరుగుతూ వచ్చింది. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో వారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి ఉపనది శబరి పోటెత్తుతుంది. ఈ క్రమంలో ఈనెల 2న 1.06 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం స్పిల్‌వే నుంచి దిగువకు విడుదల చేశారు. 5వ తేదీ నాటికి 2.09 లక్షల క్యూసెక్కులు, 9 నాటికి 2.27 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. వరద పోటెత్తే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేశారు. ఈ నెల 15 కల్లా 9,32,288 క్యూసెక్కుల నీరు పోలవరానికి చేరుతుందని, అదే విధంగా భద్రాచలం వద్ద 43 అడుగుల నీటిమట్టంతో మొదటి ప్రమాదహెచ్చరిక జారీ చేయవచ్చని చెబుతున్నారు. ఈ నేనపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. దిగువకు విడుదలవుతున్న నీటిని పోలవరం నుంచి పూర్తి స్థాయిలో డిశ్చార్జ్ చేస్తున్నారు. ముంపు మండలాల్లో భయం.. భయం పోలవరం ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడుకు వరద ప్రమాదం పొంచి ఉంది. ఈ క్రమంలో 9.32 లక్షల క్యూసెక్కులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరికకు రహదారులపైకి నీరు చేరడం, 11.44 లక్షల క్యూసెక్కులు దాటితే రెండవ ప్రమాద హెచ్చరికకు రహదారులు నీటముగి రాకపోకలు నిలిచిపోయి పదుల సంఖ్యలో గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ళలోకి నీరు చేరుతుంది. 14.26 లక్షల క్యూసెక్కులు దాటితే మూడో ప్రమాద హెచ్చరికతో రెండు మండలాల్లో 18 గ్రామాలు పూర్తిగా జలదిగ్భందంలోకి వెళ్తాయి. ఈ క్రమంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కే.వెట్రిసెల్వి ఆదేశించారు. కొనసాగనున్న ఉధృతి బుధవారం మధ్యాహా్ననికి భద్రాచలంలో 22.40 అడుగుల మేర నీటిమట్టం ఉంది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండటంతో గురువారానికి 3 నుంచి 4 అడుగులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 1986లో 75.60 అడుగుల మేర నీటి మట్టం ఉండటంతో 27 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలైంది. ఇంతవరకు అత్యధికంగా వచ్చిన వరద ఇదే. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో అత్యధిక గ్రామాలు భారీగా నష్టపోయాయి. ఆ తరువాత 2022లో 71.30 అడుగుల నీటిమట్టంతో 21.78 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరానికి ఒకేసారి విడుదలైంది. ఈ క్రమంలో ముంపు మండలాలతో పాటు పశ్చిమలోని లంక గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. 2022లో జూలై 6న, 2023లో జూలై 20న 2024 జూలై 19న వరదలు ప్రారంభమై సుమారు వారం రోజులు పాటు ఇన్‌ఫ్లో కొనసాగింది. -
టెక్సాస్‌ను ముంచెత్తిన వరదలు
-
జూన్, జూలైలో నిరాశ... ఆగస్టుపైనే ఆశ..!
సాక్షి, విశాఖపట్నం: రుతుపవనాలు ప్రవేశించి నెల గడిచినా.. రాష్ట్రంలో లోటు వర్షపాతం కొనసాగుతోంది. ఆగస్ట్‌లో వరుసగా రాబోతున్న రెండు అల్పపీడనాలు బలపడితే మంచి వర్షాలకు ఆస్కారం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రైతుకు ఇది కొంత ఉపశమనం కలిగించే మాటే అయినప్పటికీ, వాస్తవ పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆలోచనే ఆందోళనకు గురిచేస్తోంది. దశాబ్ద కాలం తర్వాత.. వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగా ముందస్తుగా నైరుతి పలకరించడంతో అన్నదాతలు ఖుషీ అయ్యారు.మే నెలాఖరులో కురిసిన భారీ వర్షాలతో.. ఏరువాకకు ముందే పంటల సాగు ప్రారంభించారు. కానీ జూన్‌లో ఆశించిన మేర వర్షాలు నమోదు కాకపోవడంతో రైతుల కళ్లల్లో ఆందోళన ఛాయలు కనిపిస్తున్నాయి. మబ్బులు పట్టినా వర్షం పూర్తిస్థాయిలో కురవలేదు. ప్రతి రోజూ వర్షం కురిసినట్లే అనిపించినా.. భారీ వర్షాలు లేకపోవడంతో.. లోటు వర్షపాతం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది.జూన్ 1 నుంచి జూలై 5 వరకూ రాష్ట్ర సగటు వర్షపాతం 115.6 మిల్లీమీటర్లుగా ఉండాల్సి ఉండగా, 93.9 మిల్లీమీటర్లే నమోదైంది. జూలై మొదటి వారంలో అన్ని జిల్లాల్లోనూ ముసురు వాతావరణం కనిపించినా లోటు పూడ్చేంత భారీ వానలు కురవలేదు. ఈ నెలలోనూ ఆశించిన స్థాయి వర్షాలు పడే సూచనలు కనిపించడం లేదు. ఈ నెల మూడో వారంలో ఏర్పడే అల్పపీడనం ఏమైనా ఫలితాలిచ్చే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అడపాదడపా వర్షాలు కురిసినప్పటికీ, అవి లోటును భర్తీ చేసే స్థితిలో లేకపోవడంతో.. ఆగస్టు నెలలో కురిసే వానలపైనే రైతు ఆశలు పెట్టుకున్నాడు. -
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో శనివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారింది. పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. నాంపల్లి, అబిడ్స్,కోఠి, బషీర్‌భాగ్, ,గోశామహల్ ,మల్లపల్లి,తదితర ప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షం కురిసింది. అలాగే.. ఉప్పల్ రామంతపూర్ చిలకనగర్ బోడుప్పల్ ఫిర్జాదిగూడ ప్రాంతాల్లో భారీ వాన పడింది. ఇదిలా ఉంటే.. ఆది, సోమవారాల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. -
కురుస్తున్న వర్షం... రైతన్న హర్షం
సాక్షి, హైదరాబాద్: రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయం ఊపందుకుంది. ఇప్పటికే పత్తి సాగులో రైతులు బిజీగా ఉండగా, వర్షాల రాకతో వరిసాగు పెరుగుతోంది. చాలా జిల్లాల్లో బావులు, బోర్లు కింద ఇప్పటికే నారుమళ్లు పోశారు. కొన్ని జిల్లాల్లో నాట్లు ప్రారంభం కాగా, మరికొన్ని ప్రాంతాల్లో నాట్లేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రాజెక్టులు, చెరువుల కింద ఉన్న పొలాల్లో రైతులు దుక్కులు దున్నుతూ సేద్యానికి సిద్ధమవుతున్నారు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటికే రైతులు నారుమళ్లు పోసి.. వరి నాట్లేసే కార్యక్రమాలు ప్రారంభించారు. మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో వరిసాగుకు పొలాలను సిద్ధం చేస్తున్నారు. వర్షాల నేపథ్యంలో వ్యవసాయ అధికారులు తగిన సూచనలు, సలహాలతో పంటల సాగును పర్యవేక్షిస్తున్నారు. నిజామాబాద్‌లో లక్షన్నర ఎకరాల్లో ఇప్పటికే సాగు నిజామాబాద్‌లో ఇప్పటికే లక్షన్నర ఎకరాల్లో రైతులు వరిని సాగు చేశారు. కామారెడ్డిలో 27 వేల ఎకరాల్లో వరి సాగు కాగా, జనగాంలో 15వేల ఎకరాల్లో సాగైంది. ఉమ్మడి కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఈ వారాంతానికి బోర్లు, బావులతోపాటు చెరువులు, కుంటల కింద కూడా నార్లు పోస్తారని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేర్, దిగువ మానేరుతో పాటు దేవాదుల, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల కింద నీటి లభ్యతను బట్టి వరిసాగు చేస్తారని తెలిపారు. పత్తి, మొక్కజొన్నకు జీవం ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల మెట్టభూముల్లో సాగైన పత్తి, మొక్కజొన్న పంటలకు జీవం పోసినట్టయ్యింది. నెలరోజుల క్రితం నుంచే పత్తి సాగు మొదలు కాగా, జూన్ మొదటి వారం నుంచే వరుణుడు మొహం చాటేయడంతో రైతులు ఆందోళన చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో పత్తి మొలకెత్తలేదు. కొన్నిచోట్ల మొలకలు వచ్చినా, నీరు లేక ఎండిపోయాయి. కరీంనగర్, మెదక్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో కూడా వర్షాలు లేక పత్తి రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 43.47 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, అందులో పత్తి 31 లక్షల ఎకరాల్లో సాగయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే పత్తి అధికంగా సాగయ్యే ఆదిలాబాద్‌లో వాతావరణం కొంత అనుకూలంగా ఉండటంతో రైతులకు ఊరటనిచ్చింది. ఇదే జిల్లాలో సోయాబీన్, కంది కూడా ఎక్కువగానే సాగు చేశారు. ఈ వర్షాలతో ఆదిలాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో పత్తి, మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కూరగాయల సాగుకు ఊతం రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల కూరగాయల సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఈసారి కూరగాయల సాగు ఎక్కువగా ఉంటుందని ఉద్యానవనశాఖ అంచనా వేస్తుంది. -
ఈ నెలంతా వానలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వానలు జోరందుకున్నాయి. గత నెలలో వర్షాభావ పరిస్థితులు చోటు చేసుకోగా, ఈ నెలలో మాత్రం పరిస్థితులు ఆశాజనకంగా ఉండనున్నాయి. నైరుతి రుతుపవనాల కదలికలు చురుకుగా ఉండటంతో ప్రస్తుతం వానలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. జూలై నెలలో వర్షాలు సాధారణం కంటే అధికంగా కురిసే అవకాశమున్నట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ మేరకు జూలై నెల వర్షాల అంచనాలను బుధవారం విడుదల చేసింది. ఈ నెలలో 22.74 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే... సాధారణం కంటే కనీసం 6 శాతం అధిక వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నెలలో రెండోతేదీ నాటికి సాధారణ వర్షపాతంలో 10 శాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వివరించింది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో న్యూట్రల్ ఎల్‌నినో–దక్షిణ ఓసిలేషన్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. సీజన్ ముగిసే వరకు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాల్లో వర్షపాతం తక్కువగా నమోదు కావొచ్చని, కానీ తెలంగాణలో మాత్రం సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని వివరించింది.జూన్ నెలలో వర్షాభావ పరిస్థితులు రాష్ట్రంలో నైరుతి సీజన్ ప్రారంభ నెలలో వర్షాలు అధికంగా కురుస్తాయి. గత ఐదేళ్లుగా వర్షపాత నమోదును పరిశీలిస్తే సాధారణం కంటే కనీసం 20 శాతం అధిక వర్షాలు నమోదవుతున్నాయి. కానీ ఈ ఏడాది జూన్ నెలలో తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ నెలలో 13.03 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాలి. కానీ నెల ముగిసే వరకు 10.42 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 20 శాతం తక్కువ వర్షాలు కురిశాయి. గతేడాది గణాంకాలను పరిశీలిస్తే 15.90 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత ఐదేళ్లలో తొలిసారిగా జూన్ నెలలో లోటు వర్షపాతం నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మూడు రోజులు..ఎల్లో అలర్ట్ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. గురువారం వివిధ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, శుక్ర, శనివారాల్లో చాలాచోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఇచ్చోడలో 6.2 సెంటీమీటర్ల వర్షం బుధవారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 6.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గద్వాల జిల్లా అయిజలో 6.13 సెం.మీ., బజార్హత్నూర్లో 5.25 సెం.మీ., సరికొండలో 4.1 సెం.మీ., వెంకటాపూర్‌లో 4.05 సెం.మీ. వర్షం కురిసింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 1.96 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 14.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 13.8 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు రాష్ట్ర ప్రణాళిక విభాగం తెలిపింది. -
Shimla: పేకమేడ కాదది.. ఐదంతస్తుల భవనం
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో సోమవారం సిమ్లాలోని ఐదంతస్తుల భవనమొకటి కుప్ప కూలింది. పేకమేడలా నేలమట్టం అవుతున్న ఈ ఇంటికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, కొండచరియలు విరిగిపడుతున్న కారణంగా ముందుగానే భవన యజమాని అంజనా వర్మ బిల్డింగ్‌లోని అందరినీ ఖాళీ చేయించడంతో పెనుముప్పు తప్పింది. Himachal Pradesh: 5-storey building collapses in Shimla after heavy rain—no casualties reported.#Viral #Trending #ViralVideo pic.twitter.com/DVa4rXYcG9— TIMES NOW (@TimesNow) June 30, 2025భవనానికి సమీపంలో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం కారణంగా భవనానికి పగుళ్లు ఏర్పడ్డాయని అంజనా వర్మ ఆరోపించారు. గ్రామ ఉపాధ్యక్షుడు యశ్పాల్ వర్మ కూడా సమీపంలో రోడ్డు నిర్మాణం కారణంగానే బిల్డింగ్‌కు పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. అయినప్పటికీ రోడ్డు పనులు చేపడుతున్న కంపెనీ ఆ పనులను నిలిపివేయలేదు. ఫలితంగా ఇప్పుడు మరికొన్ని ఇళ్లు కూడా ప్రమాదం అంచున ఉన్నాయన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదంటూ వాతావరణ కార్యాలయం రెడ్ అలర్ట్ జారీ చేసింది.ఇది కూడా చదవండి: చెత్త బండీలో మహిళ మృతదేహం.. దారుణానికి పాల్పడ్డ లివ్ ఇన్ పార్ట్నర్ -
మొక్కజొన్న రైతుకు ఆదిలోనే హంసపాదు
పాములపాడు: ‘ముందస్తు వర్షాలు’ అంచనాలను నమ్మిన మొక్కజొన్న రైతు మోసపోయాడు. వర్షం జాడ లేకపోవడం, వేసిన పైరులో ఎదుగుదల లోపించడం, ప్రభుత్వం ఆదుకోకపోవడం రైతులను కలచివేస్తోంది. ఎంతో ఆశతో ఖరీఫ్‌ను ఆరంభించిన అన్నదాత ఆదిలోనే తీవ్ర నష్టం చవిచూడాల్సి వచ్చింది. వరుణుడు ముఖం చాటేయడం కళ్లెదుటే పైరు ఎండుదశకు చేరడంతో చేసేది లేక మొక్కజొన్న పైరును రైతన్నలు దున్నేస్తున్నారు. నంద్యాల జిల్లా పాములపాడు మండలంలో మొక్కజొన్న ప్రధాన పంట. ఖరీఫ్‌లో సుమారు 8వేల హెక్టార్లలో సాగవుతుంది. ఈ సంవత్సరం ముందస్తు వర్షాలు కురుస్తాయని, రుతుపవనాలు జూన్ మొదటి వారంలోనే ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం విదితమే. మే నెల చివరి వారంలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో అన్నదాతలు ఎంతో ఆశతో మొక్కజొన్న, పత్తి సాగుకు సిద్ధమయ్యారు. అయితే జూన్ నెలాఖరు వరకు కూడా వర్షాల జాడలేకపోవడంతో రైతులు నిండా మునిగిపోయారు. ఎండలు తీవ్రంగా ఉండటం, గాలి విపరీతంగా వీస్తుండటంతో భూముల్లో తేమ శాతం తగ్గిపోయింది. విత్తనాలు మొలకెత్తినా పంటలో ఎదుగుదల లేక పైర్లు వాడుపడుతున్నాయి. ఎకరా మొక్కజొన్న సాగుకు రైతులు రూ.15వేల వరకు ఖర్చు చేశారు. చేసేది లేక ఇప్పటికే సుమారు 50 శాతం పైగా రైతులు పొలాలను దున్నేస్తుండటం గమనార్హం. దీనిపై రైతుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. 8 ఎకరాల్లో మొక్కజొన్న దున్నేశాం నేను మా అన్న విజేయుడు 8 ఎకరాల్లో మొక్కజొన్న పైరును దున్నేశాం. విత్తనాలు బాగా మొలిశాయి. పైరు బాగుందనుకున్నాం. ఈ సంవత్సరమైనా కష్టాలు తీరుతాయనుకున్నాం. తీరా చూస్తే వర్షాలు కురవకపోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. పంట ఉంచినా లాభం ఉండదు. అందుకే పైరును దున్నేశాం. వర్షం పడితే మరోసారి విత్తనం వేస్తాం. – గడ్డం కాంతయ్య, రైతు, బానుముక్కల 40 ఎకరాలు సిద్ధం చేసి ఉంచాం మొక్కజొన్న విత్తనం వేయడానికి 40 ఎకరాల పొలం సిద్ధం చేసి ఉంచాం. వర్షం కురిస్తే విత్తనం వేయడమే. ఆకాశంలో మబ్బులు వస్తున్నాయి కానీ.. వర్షం పడటం లేదు. విత్తనాలు, ఎరువులు అన్నీ తెచి్చపెట్టుకొని వర్షం కోసం ఎదురు చూస్తున్నాం. ప్రస్తుతం బోర్లలో ఉన్న నీరు ఎంతకూ సరిపోవు. ఇప్పటికే విత్తనం వేసిన వారు తీవ్రంగా నష్టపోయారు. – కోట్ల నాగేశ్వరరెడ్డి, రైతు, పాములపాడు బాబు హయాంలో కరువే చంద్రబాబు, కరువు కవలలు అంటే ఏమో అనుకున్నాం. ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే నిజమే అనిపిస్తుంది. ముందస్తు వర్షాలు మురిపించినా విత్తనం వేసిన తరువాత వరుణుడి జాడ లేకుండాపోయింది. కూటమి ప్రభుత్వానికి రైతులంటే చిన్నచూపు. ఆరుగాలం కష్టపడే అన్నదాతను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. – రాములు నాయక్, రైతు, క్రిష్ణానగర్ -
బంగాళాఖాతంలో అల్పపీడనం: కోస్తాలో విస్తారంగా వర్షాలు
విశాఖ: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తరకోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలతో పాటు కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం పడే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం జిల్లాల్లో భారీ వర్షం కురిసే చాన్స్ ఉందని, గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీంతో పాటు మరో ద్రోణి విస్తరించి ఉందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా బుధవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తూర్పుగోదావరి జిల్లాలోని నాగంపల్లెలో అత్యధికంగా 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ రూరల్‌లో 3.7, ఎనీ్టఆర్ జిల్లా మునకుళ్లలో 3.6, అల్లూరి జిల్లా కూనవరంలో 3.5, విశాఖ జిల్లా ఎండాడ, సీతమ్మధారలో 3.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ ప్రకటించింది. -
ముందొచ్చింది.. ముఖం చాటేసింది!
నైరుతి రుతుపవనాల కదలిక మందగించింది. సాగుకు కీలకమైన సమయంలో రాష్ట్రంలో వానలకు బ్రేక్ పడింది. సీజన్‌కు ముందు ఏప్రిల్, మే నెలల్లో భారీగా పడిన వర్షాలు.. తీరా వానాకాలం సీజన్ మొదలయ్యాక ముఖం చాటేశాయి. ఈ నెల 1వ తేదీ నుంచి బుధవా రం (25వ తేదీ) నాటికి రాష్ట్రంలో సగటున 10.54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ, 6.72 సెంటీమీటర్లు మాత్రమే నమోదైంది. ఇది సాధారణం కంటే 36 శాతం లోటు నమోదు కావడం గమనార్హం.వర్షపాత లోటు ఇలా..సూర్యాపేట జిల్లాల్లో సాధారణం కంటే 73 శాతం లోటు వర్షపాతం నమోదైంది.మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 72 శాతం, హైదరాబాద్ జిల్లాలో 70 శాతం లోటు వర్షపాతం ఉంది.పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జనగామ జిల్లాల్లో 60 శాతం పైబడి లోటు వర్షపాతం నమోదైంది.5 జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షాలు కురిశాయి. 18 జిల్లాల్లో లోటు, మరో 10 జిల్లాల్లో అత్యంత లోటు వర్షపాతం రికార్డయ్యింది.కుమురంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, ఖమ్మం, ములుగు, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలు లోటు వర్షపాతం జాబితాలో ఉన్నాయి.పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జనగామ, మేడ్చల్–మల్కాజిగిరి, హైదరాబాద్, సూర్యాపేట జిల్లాలో అత్యంత లోటు వర్షపాతం రికార్డయ్యింది.కారణాలు ఎన్నో..సాధారణంగా నైరుతి సీజన్లో వర్షపాతానికి బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ద్రోణులు, ఉపరితల ఆవర్తనాలు కీలకం. కానీ, ఈ ఏడాది సీజన్లో ఇటువంటి వాతావరణ పరిస్థితులు ఇంకా ఏర్పడలేదు. అందుకే ఈ సీజన్లో ఇప్పటివరకు వర్షాలు ఆశించినంతగా లేవు. ఉష్ణోగ్రతలు పెరగటంతో వాతావరణంలో తేమ పెరిగి ఉక్కపోతకు కారణమైంది. మరో వారంపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో ఈ నెలలో వర్షాల నమోదు ఆశించినంతగా ఉండవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాదాపు రెండుమూడు రోజులకోసారి వర్షాలు కురవాల్సి ఉండగా, చాలా ప్రాంతాల్లో ఏకంగా ఏడు నుంచి పన్నెండు రోజులకు పైబడి డ్రై స్పెల్స్ నమోదయ్యాయి.జూలై నెల వానలే కీలకం..రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కదలికలు చురుకుగా లేవు. సాధారణంగా ముందస్తుగా రుతుపవనాల రాకతో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. వారం ముందే వచ్చి, మొదట్లో అత్యంత చురుకుగా కదిలినా.. ఆ తర్వాత కొంత అంతరం ఏర్పడింది. ఈ అంతరంతో వర్షాలకు కాస్త విరామం వచ్చినట్లైంది. కానీ వచ్చే నెల మొదటి వారం నుంచి వర్షాలు ఆశించినంతగా ఉంటాయని అంచనా వేశాం. జూలై నెలలో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.శ్రావణిహైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి -
నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి/మహారాణి పేట (విశాఖ): బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో పాటు మరో ద్రోణి విస్తరించి ఉందని వెల్లడించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా బుధవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తూర్పుగోదావరి జిల్లాలోని నాగంపల్లెలో అత్యధికంగా 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖ రూరల్‌లో 3.7, ఎనీ్టఆర్ జిల్లా మునకుళ్లలో 3.6, అల్లూరి జిల్లా కూనవరంలో 3.5, విశాఖ జిల్లా ఎండాడ, సీతమ్మధారలో 3.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. -
మొగులు.. దిగులు..
సాక్షి, హైదరాబాద్/వరంగల్: రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతన్నలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జూన్ ముగిసిపోతున్నా.. సరైన వర్షాలు లేక లక్షలాది ఎకరాలు సాగుకు నోచుకోలేదు. మరోవైపు నైరుతి రుతుపవనాలు ముందస్తుగా రాష్ట్రంలోకి ప్రవేశించడంతో కురిసిన తొలకరి జల్లులకు మురిసి విత్తనాలు వేసిన రైతులు.. కొన్నిరోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతో దిక్కులు చూస్తున్నారు. ఆకాశంలో మబ్బులు కన్పించగానే ఆశగా చూస్తున్నారు గానీ ఫలితం ఉండటం లేదు. వర్షాలు పడకపోవడం..ఈ సీజన్లో సాగయ్యే పత్తి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్ వంటి పంటలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వర్షాలపై ఆధారపడి చాలా జిల్లాల్లో వేసిన ఆయా పంటల విత్తనాలు అనేక ప్రాంతాల్లో మొలకెత్తలేదు. ముఖ్యంగా పత్తి, మక్క మొలకలు రాలేదు. కొన్నిచోట్ల మొలిచినా నీరు లేక ఎండిపోతున్నాయి. దీంతో రైతులు పెట్టిన పెట్టుబడి వృధా అవుతుండగా..అనేకచోట్ల రైతులు మళ్లీ మళ్లీ పెట్టుబడులు పెడుతూ రెండోసారి, మూడోసారి విత్తనాలు నాటుతున్నారు. దుక్కులు దున్ని, భూమి చదును చేసి, విత్తనాలు వేసిన ఒక్కో పత్తి రైతు ఎకరానికి రూ.10 వేల దాకా నష్టపోయే పరిస్థితి ఉందని అంటున్నారు. 8 జిల్లాల రైతులపై తీవ్ర ప్రభావం రాష్ట్రంలోని 26 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితి ఉంది. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, జనగాం, సూర్యాపేట జిల్లాల్లో వర్షభావ పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 190 మండలాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొనగా, 90 మండలాల్లో వర్షపు చుక్క పడలేదు. ఈ జిల్లాల్లో 60 నుంచి 72 మిల్లీ మీటర్ల వరకు లోటు వర్షపాతం ఉండగా, ముందస్తు వానలతో పలు మండలాల్లో పత్తి, మక్కలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటివరకు విత్తనాలు వేయని వారు వర్షాలు పడిన తర్వాత వేద్దామని చూస్తుండగా, ఆలస్యంగా వేసిన విత్తనాలతో పంట దిగుబడి రాదేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పత్తి, మక్క పంటల పరిస్థితి దారుణం రాష్ట్రంలో 70 నుంచి 100 శాతం వర్షాభావ పరిస్థితుల కారణంగా.. వర్షాధార పంటలుగా వేసిన పత్తి, మక్క ఇతర మెట్ట పంటల పరిస్థితి దారుణంగా మారింది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో కేవలం 0.3 ఎంఎం వర్షం కురిసింది.. అంటే ఒక్క తుంపర కూడా లేదని నివేదికలు చెప్తున్నాయి. ఇదే పరిస్థితి చింతలపాలెం, నేరేడుచర్ల, పెన్‌పహాడ్, చివ్వెంలలో ఉంది. ఖమ్మంలో కామేపల్లి, యాదాద్రి భవనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట, అడ్డగూడూరు, భువనగిరి, నల్లగొండ జిల్లా శాలిగౌరారం, కనగల్, పెద్దవూర, కరీంనగర్లో చిగురుమామిడి, కరీంనగర్ రూరల్, వేములవాడ, సంగారెడ్డిలో పుల్కల్, జిన్నారం, మెదక్‌లో మనోహరాబాద్, నార్సింగ్, సిద్దిపేట జిల్లాలో చిన్నకోడూరు, మిరుదొడ్డి, హుస్నాబాద్, జనగామ జిల్లాలో కొడకండ్ల, జఫర్ఘడ్, వరంగల్‌లో నర్సంపేట, దుగ్గొండి, నల్లబెల్లిలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. హనుమకొండ జిల్లాలో కమలాపూర్, ఐననోలు, మహబూబాబాద్ జిల్లాలో గార్ల, గూడూరు, కేసముద్రం, చిన్నగూడూరు, పెద్దవంగర, పెద్దపల్లి జిల్లాలో ఎలిగేడు, కమాన్‌పూర్, సుల్తానాబాద్, జగిత్యాలలో బీఆర్‌పూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘనపూర్, గోరి కొత్తపల్లి, మహదేవ్పూర్, టేకుమట్ల, మంచిర్యాల రూరల్, భద్రాద్రిలో పినపాక, ఇల్లెందు, గుండాల మండలాల్లో సుమారు 70 నుంచి 100 శాతం వరకు లోటు వర్షపాతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది కన్నా తక్కువ పత్తి సాగు రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో 1.32 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గత ఏడాది ఈ సమయానికి 38 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, అది ఈసారి కేవలం 29.89 లక్షలకే పరిమితమైంది. వేసిన పంటల్లో అధికంగా పత్తి 22.84 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇందులో అత్యధికంగా సుమారు 9 లక్షల ఎకరాలు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోనే సాగు చేశారు. ఆ తర్వాత సంగారెడ్డిలో 2.75 లక్షల ఎకరాల్లో, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, నల్లగొండ జిల్లాల్లో సగటున 1.10 లక్షల ఎకరాల్లో సాగైంది. వర్షాలు లేకపోవడంతో చాలా జిల్లాల్లో ఇంకా విత్తనాలు వేయలేదు. అత్యధిక వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సూర్యాపేటలో గత సంవత్సరం ఇప్పటివరకు 46 వేల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఈసారి కేవలం 7 వేల ఎకరాల్లో సాగు చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. మహబూబాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో పత్తి సాగు గత ఏడాదితో పోల్చుకుంటే సగం కూడా కాలేదు. మిగతా పంటల పరిస్థితీ ఇదే.. పత్తితో పాటు మొక్కజొన్న, జొన్నలు, కందులు, సోయాబీన్ విత్తనాలు వేసిన రైతులు కూడా వానలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆరుతడి పంటలైన ఇవి మొలకెత్తడానికి, మొలకెత్తిన విత్తనాలు మొక్కలుగా పెరగడానికి వర్షం తప్పనిసరి. అయితే విత్తనాలు నాటిన తరువాత వర్షాలు లేకపోవడంతో చాలాచోట్ల మొక్కలు ఎండిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం – 2025 సాగు ప్రణాళిక (ఎకరాలలో...) – సాగు అంచనా :1,32,44,305 – గతేడాది ఈ సమయానికి సాగు: 38,06,097 – ఈ సీజన్లో ఇప్పటివరకు సాగు: 29,89,562 – పత్తి సాగు అంచనా: 4893016 – గత ఏడాది ఇదే సమయంలో: 2858337 – ఇప్పటివరకు సాగైన పత్తి విస్తీర్ణం: 22,84,474 – మొక్కజొన్న సాగు అంచనా : 5,21,206 – గత ఏడాది ఇదే సమయంలో: 1,25,235 – ఇప్పటివరకు సాగైన మొక్కజొన్న విస్తీర్ణం : 1,17,309 లక్ష నష్టం..ఇంకో లక్ష అప్పు చేయాల్సిందే ఇతను జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం గ్రామానికి చెందిన కౌలు రైతు బాల్నె చిన్న కొమురయ్య. రోహిణి కార్తెలో కురిసిన తొలకరి వర్షం నేపథ్యంలో ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.30 వేలకు ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి విత్తనాలు నాటాడు. భూమి దున్నేందుకు, విత్తనాలకు మరో లక్ష రూపాయల పెట్టుబడి పెట్టాడు. అయితే ఆ తర్వాత వర్షాలు కురవలేదు. దీంతో 20 శాతం విత్తనాలు కూడా మొలకెత్తలేదు. మొలకెత్తినవి కూడా వర్షం లేకపోవడంతో పాటు అధిక ఉష్ణోగ్రతతో ఎండిపోతున్నాయి. దీంతో వర్షాలు పడి కాలం కలిసొస్తే మళ్లీ భూమి దున్ని విత్తనాలు పెట్టాల్సిందేనని, మళ్లీ లక్ష రూపాయల అప్పు వెతుక్కోవాల్సిందేనంటూ కొమురయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మొక్కజొన్న మొలకెత్తలే.. ఈ ఫొటోలోని మహిళా రైతు పేరు పావని. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కలకత్త తండాకు చెందిన ఈమె ఎకరం పొలంలో పత్తి, మరో ఎకరంలో మొక్కజొన్న విత్తనాలు పెట్టింది. విత్తనాలు వేసి 25 రోజులు దాటినా చినకు పడకపోవడంతో రెండు పంటలు మొలకెత్తలేదు. ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.20 వేల పెట్టుబడి పెట్టింది. బుధవారం కొద్దిగా కురిసిన వానతో అక్కడక్కడ కొన్ని పత్తి విత్తనాలు మొలకెత్తాయి. అయితే ఇప్పటివరకు ఎండిన నేపథ్యంలో 70 శాతానికి పైగా సాల్లలోనీ పత్తి మొక్కలు పీకేసి మళ్లీ గింజలు పెడదామని ఆలోచిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికి రెండుసార్లు నాటినా.. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన బానోతు వీరన్న తనకు ఉన్న రెండెకరాల భూమిలో 20 రోజుల క్రితం పత్తి విత్తనాలు విత్తాడు. దున్నినందుకు, విత్తనాలకు, కూలీలకు సుమారు రూ.20 వేలు ఖర్చయింది. ఆ తర్వాత తేలికపాటి జల్లులు తప్ప వర్షాలు పడలేదు. దీంతో విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో నాలుగు రోజులు క్రితం మళ్లీ దుక్కి దున్ని మరోసారి విత్తనాలను కొనుగోలు చేసి కూలీలతో నాటించాడు. గత మూడు రోజులుగా తేలికపాటి చినుకులే పడడం వల్ల అవి కూడా మొలకెత్తే పరిస్థితి కని్పంచడం లేదని వీరన్న వాపోతున్నాడు. వానాకాలం మొదటి దశలోనే అప్పుల పాలవుతున్నానని చెప్పాడు. గింజలు పెట్టింది గత్త మల్ల చుక్క పడలేదు నెలకింది పడ్డ వానలకు ఐదు ఎకరాల్లో పత్తి పెట్టినం. పత్తి గింజలు పెట్టింది గత్త మల్ల చుక్క పడలేదు. దీంతో మొలకలు రాలేదు. మళ్లీ విత్తనాలు వేసేందుకు దున్నుతున్నాం. రూ.35 వేలు అదనంగా పెట్టుబడి అవుతోంది. – సిలువేరు లచ్చయ్య, రైతు, జూలపల్లి, పెద్దపల్లి జిల్లా కురవాల్సిన సమయంలో పడట్లేదు మే నెలలో వర్షాలు కురవడంతో నాకున్న 3 ఎకరాలు దుక్కి దున్ని పత్తి విత్తనాలు వేసిన. సుమారు రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టిన. విత్తనాలు వేసి దాదాపు 25 రోజులు గడిచినా వర్షాలు పడకపోవడంతో గింజలు మొలకెత్తలేదు. ఎండలు కొట్టాల్సిన సమయంలో వర్షాలు పడ్డాయి. కురవాల్సిన సమయంలో పడట్లేదు. జూన్‌లో ఇప్పటివరకు వర్షాలే కురవలేదు. విత్తిన పత్తి విత్తనాలను చీమలు తినేసి ఉంటాయి. అదే జరిగితే మళ్లీ పెట్టుబడి పెట్టి పత్తి గింజలు కొని విత్తాలి. –బాదావత్ చంటినాయక్, పూసలతండా,గార్ల మండలం, మహబూబాబాద్ జిల్లా -
తెలంగాణలో తప్పక చూడాల్సిన జలపాతాలు.. (ఫొటోలు)
-
పశ్చిమ గాలుల ప్రభావం.. రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొద్ది రోజులుగా విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. భూ ఉపరితలానికి సమీప వాతావరణ పొరపై నైరుతి, పశ్చిమ దిశ నుంచి వీచే గాలుల ప్రభావం ప్రబలంగా ఉన్నట్లు బుధవారం వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కోస్తా ప్రాంతాల్లో రుతుపవనాల ప్రభావంతో ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కూడా పడుతున్నాయి. మరోవైపు రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో 38 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకూ 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ మధ్యాహ్నం తర్వాత వాతావరణం చల్లగా మారుతోంది. బుధవారం ప్రకాశం జిల్లా కరవాడిలో 22.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. అదే జిల్లా దరిమడుగు, పునుగోడులో 38.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకూ ఇలాంటి పరిస్థితే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
అమెరికా అతలాకుతలం.. వాతావరణ మార్పుతో వరద బీభత్సం
వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని పలు ప్రాంతాలలో ఆకస్మిక వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. వరద బీభత్సానికి పశ్చిమ వర్జీనియా, టెక్సాస్‌లు ఘోరంగా దెబ్బతిన్నాయి. వర్జీనియాలో కురిసిన కుండపోత వర్షాలు, వరదలకు ఐదుగురు మృతిచెందారు. ఫెయిర్‌మాంట్‌లో ఒక భవనం పాక్షికంగా కూలిపోయింది. అమెరికాలో ఆకస్మిక వరదలకు వాతావరణ మార్పే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.భారీ వరదల కారణంగా పశ్చిమ వర్జీనియాలోని వీలింగ్ క్రీక్ నదిలో 90 నిముషాల వ్యవధిలో ఏడు అడుగుల మేరకు నీటిమట్టం పెరిగి, మౌలిక సదుపాయాలను దెబ్బతీసింది. ఒహియో కౌంటీలో భారీ వర్షాల కారణంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆస్టిన్, వాకోతో సహా సెంట్రల్ టెక్సాస్‌లు ఆకస్మిక వరద ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఈ ప్రాంతాల్లో నాలుగు అంగుళాల మేరకు వర్షపాతం నమోదయ్యింది. కాన్సాస్‌లో, ఆకస్మిక వరదల కారణంగా ప్రభుత్వం అత్యవసర సహాయ చర్యలు చేపట్టింది.ఎల్ డొరాడోలో వాల్నట్ నది ఉప్పొంగి సమీపంలోని ఇళ్లను ముంచెత్తింది. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో జూన్ 11 రాత్రి నుండి జూన్ 12 ఉదయం వరకు 10 అంగుళాల వర్షపాతం కురిసింది. ఇది ఇక్కడి సాధారణ నెలవారీ సగటు కంటే చాలా ఎక్కువ. అలబామా, లూసియానా, న్యూయార్క్‌లను కూడా తుఫాను ముప్పు వెంటాడుతోంది. అమెరికాలో వాతావరణ మార్పు కారణంగా తీవ్రమైన ఉష్ణోగ్రతలతో పాటు ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. శాన్ ఆంటోనియోలో 12 గంటల వ్యవధిలో 10 అంగుళాల వర్షం కురిసింది. ఇది జూన్ నెల మొత్తం సగటు వర్షపాతం కంటే రెండింతలు అధికం.అమెరికాలో ఆకస్మిక వరదలకు గల ప్రధాన కారణాలలో వాతావరణ మార్పు ఒకటి. పసిఫిక్ ఇన్స్టిట్యూట్ తెలిపిన వివరాల ప్రకారం వాతావరణ మార్పు వల్ల అధిక వర్షపాతం నమోదు కావడం, సముద్ర మట్టాల పెరుగుదల, వరద ముప్పు లాంటివి చోటుచేసుకుంటున్నాయి. సముద్ర మట్టం పెరగడం కారణంగా తీరప్రాంతాల్లో వరద ముప్పు అంతకంతకూ పెరుగుతోంది. అధిక ఆటుపోట్లు, తుఫానులు ఏర్పడే పరిస్థితుల్లో ఈ ముప్పు మరింత పెరుగుతోంది. వాతావరణ మార్పుల కారణంగా తుఫానులు మరింత విధ్వంసకరంగా మారి, భారీ వర్షపాతం కురవడంతో పాటు వరదలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో వాతావరణ మార్పు కారణంగా నేలలోని తేమ తగ్గుతుంది, దీంతో వర్షపు నీరు భూమిలోకి చొచ్చుకుపోయే బదులు ఉపరితలంపైకి వెళ్లిపోతుంది. ఇది ఆకస్మిక వరదలకు దారితీస్తోంది.అటవీ నిర్మూలన, పట్టణీకరణ వరదల ప్రమాదాన్ని మరింత పెంచుతోంది. పట్టణ ప్రాంతాలలోని కాంక్రీటు నిర్మాణాలు వర్షపు నీటిని భూమిలోనికి వెళ్లకుండా నిరోధిస్తాయి. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం, అటవీ నిర్మూలనను నిరోధించడం, పట్టణ ప్రాంతాలలో డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడం లాంటివి తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: పాక్ ముస్లిం లీగ్.. జైరామ్ రమేష్ ఒక్కటే: బీజేపీ ఘాటు విమర్శ -
Telangana: మూడు రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ, మధ్య మహారాష్ట్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిక్కుకు వాలి ఉండగా, మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. శనివారం ఉత్తరాంధ్ర తీరం, దాని పరిసర ప్రాంతాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, తాజాగా వాయవ్య బంగాళాఖాతం దాని పరిసరాల్లో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనంలో విలీనమైంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.దక్షిణ ప్రాంత జిల్లాలతోపాటు ఉత్తర ప్రాంతంలోని కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. రా ష్ట్రంలోని ఉత్తర ప్రాంత జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు సోమవారం కురిసే అవకాశం ఉన్న ట్టు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా చోట్ల సాధారణం కంటే 4డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. -
Heavy Rains: ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్..
-
వానలకు అనుకూలంగా వాతావరణం
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు క్రమంగా ఊపందుకునే సూచనలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి చల్లదనం సంతరించుకుంటోంది. ఈ క్రమంలో ప్రస్తుతం రుతుపవనాల కదలికలు ఆశాజనకంగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాస్తవానికి రుతుపవనాలు వచ్చినప్పటికీ గత పది రోజులుగా మందగించడంతో వానల జాడ లేకుండా పోయింది. అక్కడక్కడా అడపాదడపా తేలికపాటి వర్షాలు నమోదైనప్పటికీ..వాతావరణంలో నెలకొన్న మార్పులతో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత తీవ్ర ఉక్కిరిబిక్కిరికి గురిచేశాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి మారుతోంది. రుతుపవనాల కదలికలు చురుగ్గా మారుతుండటంతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు tకురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వికారాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఇతర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మాటూర్‌లో 4.93 సెం.మీ. వర్షం బుధవారం రాష్ట్రంలో సగటున 7.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ సీజన్లో 11 రోజుల్లో 3.37 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. బుధవారం సాయంత్రానికి 2.35 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా నల్లగొండ జిల్లా మాటూర్‌లో 4.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లిలో 4.35, నల్లగొండ జిల్లా ముదిగొండలో 3.38, పడమటిపల్లెలో 3.10, తిమ్మాపూర్‌లో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 5 డిగ్రీ సెల్సీయస్ తక్కువగా నమోదయ్యాయి. ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత అదిలాబాద్‌లో 33.8 డిగ్రీ సెల్సీయస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 20 డిగ్రీ సెల్సీయస్ నమోదైంది. రానున్న మూడు రోజులు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. -
‘కట్టలు’ తెగిన కష్టం
ఊరు కళతప్పింది.. ఊరు పక్కనే నిండుగా చెరువు ఉండేది. అది తెగడంతో చుక్కనీరు లేదు. రెండు పంటలు అయినా, ఇంకా మరమ్మతులు చేయలేదు. పంటలు లేక రైతులు, చేతి పనివారు ఊరు విడిచి వలస వెళుతున్నారు. ఇళ్లకు తాళాలు వేసి ఉండటంతో సందడే లేదు. చెరువు తెగడంతో ఊరు కళ తప్పింది. – కడారి ఐలయ్య, రావిరాల, మహబూబాబాద్ జిల్లాసాక్షిప్రతినిధి, ఖమ్మం: వర్షాకాలం వచ్చేసింది. నైరుతి మేఘ ఘర్జన రాష్ట్రమంతా ప్రతిధ్వనిస్తోంది. తెలంగాణలో వర్షాలు దంచికొడితే, వాగులు, వంకల్లోని నీటి నంతా ఒడిసిపట్టేది చెరువులు, కుంటలే. కానీ, చాలా చోట్ల ఈ చిన్ననీటి వనరులు ఇప్పుడు నీటిని నింపుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో కురిసిన వర్షాలు, వరదల కారణంగా వేల సంఖ్యలో చెరువులు దెబ్బతిన్నాయి. గండ్లు పడటంతోపాటు తూములు కొట్టుకుపోయాయి. కొన్నిచోట్ల చెరువుల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేసినా పనుల్లో పురోగతి లేదు. మరికొన్ని చెరువులు దీనస్థితిలో ఉన్నాయి. దీంతో ఈ చెరువులకు మరమ్మతులు ఎప్పుడు పూర్తిచేస్తారోనని ఆయకట్టు రైతులు ప్రభుత్వ అధికారులవైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. సీజన్ మొదలైనా.. ఆదివారం మృగశిర కార్తె ప్రారంభమవుతోంది. దీంతో రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేస్తారు. కానీ, కట్టలు తెగిన, తూములు దెబ్బతిన్న చెరువుల మరమ్మతులకు నిధులు మంజూరైనా పనులు ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే కట్టలు తెగిన అనేక చెరువుల్లోకి వస్తున్న నీటిని లాక్‌లు ఎత్తి కిందకు వదులుతున్నారు. చెరువుల ఆయకట్టు పరిధిలో సాగు ప్రారంభమై.. వర్షాలు కురిసిన సమయంలో లాక్‌లు ఎత్తితే రైతులు తీవ్రంగా నష్టపోతారు. లాకులు ఎత్తకపోయినా నీరు బయటకు వచ్చే ప్రమాదం ఉంది. దీంతో చెరువుల కింద వేలాది ఎకరాల భూమి బీడుగా మారే ప్రమాదం కనిపిస్తోంది. వివిధ జిల్లాల్లోని చెరువుల పరిస్థితి ఇదీ.. ⇒ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 146 చెరువులకు కట్టలు తెగడంతోపాటు తూములు దెబ్బతిన్నాయి. ఖమ్మం జిల్లాలో 11 చెరువులకు రూ.9.55 లక్షలతో తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేశారు. రూ.48.61 కోట్లతో 45 చెరువులకు మరమ్మతులు చేశారు. 42 చోట్ల పనులు జరుగుతున్నాయి. 17 చోట్ల పనులకు ఉన్నతాధికారుల నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ⇒ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 28 చెరువులకు గండ్లు పడగా.. 25 చెరువులకు గండ్లు పూడ్చారు. అశ్వారావుపేట మండలంలో 16 వేల ఎకరాల ఆయకట్టు ఉన్న పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి పడగా రూ.3 కోట్లతో తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. కోతకు గురైన కట్టను మాత్రం వదిలేశారు. ఈ పెద్దవాగు తెలంగాణ, ఏపీ మధ్య ఉండటంతో వివాదం నెలకొంది. రీ డిజైన్ కోసం రూ.19 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. అయితే ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలను ఇంకా ఆమోదించలేదు. దీంతో రీడిజైన్‌కు మోక్షం లభించలేదు. ⇒ ఖమ్మం జిల్లా చింతకాని మండలం తిమ్మినేనిపాలెంలోని గచ్చుబంధం చెరువు కట్ట గత సెప్టెంబర్ వరదలకు తెగింది. దీంతో మూడు గ్రామాల్లోని 228 ఎకరాల ఆయకట్టుకు కొంత నష్టం వాటిల్లింది. మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.9 లక్షలు విడుదల చేయగా, ఇరిగేషన్ అధికారులు నేటికీ పనులు చేపట్టలేదు. చెరువులో నీటిని నిల్వ ఉంచే పరిస్థితి లేకపోవడంతో లాకులు ఎత్తి బయటకు పంపుతున్నారు. చెరువు కట్టకు మరమ్మతులు చేయకపోతే ఆయకట్టు పరిధిలోని తమ భూములను బీళ్లుగా వదిలేయాల్సిందేనని రైతులు వాపోతున్నారు. ⇒ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో ఎంపిక చేసిన 25 చెరువుల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదన పంపారు. ఇప్పటివరకు నయా పైసా నిధులు మంజూరు కాలేదు. మోర్తాడు మండల కేంద్రంలోని ముసలమ్మ చెరువు, కమ్మర్‌పల్లిలోని పల్లె చెరువు తూముల మరమ్మతు అత్యవసరంగా చేపట్టాల్సి ఉంది. అందుకోసం రూ.50 లక్షల వరకు అవసరమని అంచనా. ⇒ యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని కుర్రారం ఊర చెరువు మత్తడి వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయింది. ఇప్పటివరకు తాత్కాలిక మరమ్మతులే చేపట్టారు. 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు నిండితే ఆయకట్టు ప్రాంతంలోని 10 గ్రామాల్లో 5 వేల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. ⇒ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామం చెరువు 152 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు కింద 650 ఎకరాలు నేరుగా, మరో 500 ఎకరాలు బోర్లు, బావుల ద్వారా సాగవుతుంది. గత ఏడాది వచ్చిన వరదలకు చెరువు తెగిపోయింది. ఇప్పుడు సాగు చేద్దామంటే నీళ్లు లేవు. దీంతో రైతులు, కూలీలతోపాటు చేతి వృత్తుల వారు వందకుపైగా కుటుంబాలు వలస వెళ్లాయి. నీళ్లు వస్తే కానీ ఊరికి రాలేమని చెబుతున్నారు. ఈ చెరువు మరమ్మతుల కోసం రూ.1.43 కోట్లు అవసరమని అంచనా వేయగా, ఇప్పుడు రూ.53 లక్షల మాత్రమే మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. తగ్గనున్న భూగర్భ జలాలు.. చెరువుల్లో నీరు పుష్కలంగా ఉంటే భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. ప్రస్తుతం చెరువులు దెబ్బతినడంతో వాటిలో నీరు నిల్వలేదు. దీంతో భూగర్భ జలాలు కూడా పడిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. చెరువులకు సకాలంలో మరమ్మతులు పూర్తి చేయకపోవడంతో తమ భూములు సాగుచేసుకోలేకపోతున్నామని చెబుతున్నారు. చెరువుల్లో నీరు లేకపోవటంతో మత్స్యకారులు కూడా ఉపాధి కోల్పోయారు. కుటుంబాలకు కుటుంబాలే వలస వెళ్లారుమా ఊళ్లో 121 ముదిరాజు, 40 గంగపుత్రుల కుటుంబాలు చెరువునే నమ్ముకొని జీవిస్తున్నాయి. పోయిన వానాకాలం చెరువు తెగడంతో పనులు లేక, ఇక్కడ ఉండి పస్తులు పడలేక హైదరాబాద్ వెళ్లి అడ్డా పనులు చేస్తున్నారు. చెరువు గండ్లు తొందరగా పూడిస్తేనే మా కష్టాలు పోతాయి. – డేగల యాకయ్య, మత్స్యకారుడు, రాజుల కొత్తపల్లి, మహబూబాబాద్ జిల్లా -
ముందే పలకరించిన వానలు : రెయిన్కోట్లకు, గొడుగులకు భలే బేరం!
దాదర్: వర్షాకాలం సమీపించడంతో గొడుగులు, రెయిన్ కోట్లు, ప్లాస్టిక్ క్యాప్‌లు తదితర సామగ్రి విక్రయించే హోల్‌సేల్ మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ముంబైలో గత పక్షం రోజుల నుంచి వాతావరణంలో అనేక మార్పులు చేసుకుంటున్నాయి. ఒకపక్క వర్షం మరోపక్క ఎండలు కాస్తున్నాయి. దీంతో జనాలు ఇంటి నుంచి బయటపడే సమయంలో గొడుగు తీసుకెళ్లాలా? వద్దా? అంటూ సందిగ్ధంలో పడిపోయారు. ఈ సారి వర్షాలు కొంత తొందరగా కురుస్తాయని ఇదివరకే శాంతాకృజ్, కొలాబా వాతావరణ శాఖలు హెచ్చరించాయి. అనుకున్నట్లు ఈ సారి వర్షాలు గత పక్షం రోజుల నుంచి కురుస్తున్నాయి. ఏటా వర్షాకాలం జూన్ ఏడో తేదీ నుంచి ప్రారంభమవుతుంది. కానీ ఈ సారి వర్షాలు దాదాపు పక్షం రోజుల ముందు నుంచే కురుస్తున్నాయి. దీంతో అనేక మంది ముందస్తు ఏర్పాట్లు చేసుకోలేకపోయారు. దీంతో కొత్త గొడుగులు, రెయిన్ కోట్లు కొనుగోలు చేయడానికి మార్కెట్లకు పరుగులు తీస్తున్నారు. ఫలితంగా మార్కెట్లన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. రంగురంగుల గొడుగులు.. డిజైన్లతో కూడిన రెయిన్ కోటుముంబైలో దాదర్, క్రాఫర్డ్ మార్కెట్, చెంబూర్ తదితర ప్రాంతాల్లో వర్షాకాల సామగ్రి విక్రయించే హోల్‌సేల్ మార్కెట్లున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి కోనుగోలుదార్లను ఆకర్షించే రంగురంగుల గొడుగులు, వివిధ డిజైన్లతో కూడిన రెయిన్ కోట్లు మార్కెట్లోకి వచ్చాయి. ముఖ్యంగా పిల్లలను ఆకట్టుకునే వివిధ రంగులు, డోరెమాన్, ఛోటా బీం, మోటూ–పాత్‌లు, స్పైడర్ మెన్, బార్బీ డాల్, సిండ్రోలా తదితర కార్టూన్ బొమ్మలతో కూడిన రెయిన్ కోట్లు, గొడుగులు వచ్చాయి. ఇవి పిల్లలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా పెద్దలు వినియోగించే ప్లాస్టిక్ జాకెట్లు, ప్యాంట్లు, క్యాప్‌లు, ఫోన్లు వర్షానికి తడవకుండా భద్రపర్చుకునే మొబైల్ కవర్లు, బైక్‌లు, కార్లపై కప్పడానికి వినియోగించే ప్లాస్టిక్ కవర్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంచారు. అయితే ఈ సారి ధరలు 10–20 శాతం మేర పెరిగినట్లు హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. ఈ సామగ్రిని రిటైల్ వ్యాపారులు క్వాలిటీని బట్టి 20–30 శాతం ధరలు పెంచి విక్రయిస్తున్నారు. దీంతో ఈ సారి కోనుగోలుదార్ల జేబులకు చిల్లులు పడడం ఖాయమని తెలుస్తోంది. చదవండి: Chitrakoot Facts: చరిత్ర చెక్కిన రామాయణం చిత్రకూటం.. ఎన్ని విశేషాలో!రెయిన్ కోట్ రూ.30 నుంచి రూ.150 లోపే.. ఇదిలా ఉండగా వర్షాకాలంలో వ్యాపారులు, ఉద్యోగులతో పాటు వివిధ పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటపడే సామాన్యులు ఇదివరకు వాడిన లేజర్ బూట్లు, సాధారణ పాదరక్షలు పక్కన పెట్టేశారు. వర్షంలో వినియోగించే ప్లాస్టిక్ చెప్పులు, బూట్లు, స్లీపర్లు కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. సందెట్లో సడేమియా అన్నట్లుగా గత సంవత్సరం అమ్మగా మిగిలిపోయిన సామగ్రిని బయటకు తీసి ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ సారి అకాల వర్షాలు పక్షం రోజుల ముందే కురవడంతో అనేక మంది వ్యాపారులు వర్షాకాల సామగ్రి ముందుగానే నిల్వచేసుకుని సిద్ధంగా ఉంచుకున్నారు. సాధారణ గొడుగులతోపాటు డబుల్, ట్రిపుల్ ఫోల్డింగ్ గొడుగులు, ట్రాన్స్పరెంట్ రెయిన్ కోట్లు, క్యాప్‌లు, కప్పుకునేందుకు ప్లాస్టిక్ పేపర్లు ఇలా అనేక రకాల వర్షాకాల సామగ్రి మార్కెట్లోకి వచ్చాయి. రూ.100–500 వరకు ధర పలికే హైక్లాస్ ప్లాస్టిక్ బూట్లు, రబ్బర్ చెప్పులు మార్కెట్లో ఉంచారు. వీటిని అధికంగా ఉద్యోగులు, కాలేజీ విద్యార్థులు కొనుగోలు చేస్తున్నారు. చాలామందికి వెంట రెయిన్ కోట్లు, గొడుగులు ఉంచుకోవడం ఇష్టముండదు. దీంతో ఇలాంటి వారికోసం యూజ్ అండ్ త్రో రెయిన్ కోట్లు మార్కెట్లోకి వచ్చాయి. ఒక్కో రెయిన్ కోట్ ధర కేవలం రూ.30–150 వరకు పలుకుతున్నాయి. బరువు కూడా చాలా తక్కువ ఉండడంతో హ్యాండ్ బ్యాగులో సులభంగా ఇమిడిపోతుంది. దీంతో వీటిని కొనుగోలు చేయడానికి ఉద్యోగులు, వ్యాపారులతో పాటు సాధారణ జనాలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదీ చదవండి: కొడుకు మృతిపై తల్లడిల్లిన తల్లి : కన్నీటి పర్యంతమైన డిప్యూటీ సీఎం -
ఎండలు ముందే ముగిశాయెందుకు?
మే నెల భానుడి ప్రచండ వేడికి పెట్టింది పేరు. రోహిణి కార్తెలో రోకళ్లు పగులుతాయని పెద్దల మాట. సూర్యప్రకోపానికి జనం విలవిల్లాడిపోయే కాలంగా ఎండాకాలం దశాబ్దాలుగా పేరు తెచ్చుకుంది. కానీ ఈసారి మే నెలలో దాదాపు వేడి మాయమై చల్లదనమే రాజ్యమేలింది. దేశవ్యాప్తంగా చాలా చోట్ల వర్షాలు పడ్డాయి. పైగా ముందస్తుగానే ఎండాకాలం జనాలకు బైబై చెప్పి వెళ్లిపోయింది. 2024లో మే, జూన్ నెలల్లో ఎండలు విపరీతంగా ఉండటంతో 2025లో ఆదిత్యుడు ఇంకెంత రెచ్చిపోతాడోనన్న భయాలను పటాపంచలు చేస్తూ ఈసారి మే నెలలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే నమోదవడం విశేషం. తక్కువ ఎండలకు తోడు తక్కువ రోజులే ఎండాకాలం కొనసాగడం గమనార్హం. వేడిమి, ఉక్కబోతతో విసుగుతెప్పించే వేసవికాలం వేగంగా గడిచిపోయింది. 2024 సంవత్సరం భూమి మీద అత్యంత ఉష్ణమయ ఏడాదిగా చరిత్రలో నిలిచిపోయింది. ఇక భారత్‌లో గత ఏడాది మేలో దేశవ్యాప్తంగా వడగాలులు చండ ప్రచండంగా వ్యాపించి జనాన్ని బెంబేలెత్తించాయి. ఇందుకు పూర్తి భిన్నంగా 2025 మేనెల సాగిపోవడం సాధారణ ప్రజానీకాన్ని ఆశ్చర్యంలో, ఒకింత ఆలోచనలో పడేసింది. ఈసారి దేశ వాతావరణ ముఖచిత్రంలో మార్పులొచ్చాయని కొందరు విశ్లేషణలు మొదలెట్టారు. 2024 మే, జూన్‌లో..గత ఏడాది మే, జూన్ నెలల్లో దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదుకావడంతోపాటు వడగాల్పుల ఘటనలు చాలా చోట్ల సంభవించాయి. దీంతో చాలా ప్రాంతాల్లో కరువు తాండవించింది. దీంతో జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటాయి. నీటి లభ్యత బాగా తగ్గిపోయింది. భూగర్భజలాలు మరింత కిందకు వెళ్లిపోయాయి. విద్యుత్ కొరత సమస్య సైతం అధికమైంది. వాతావరణ మార్పులతో ముడిపడిన ఈ అధిక ఉష్ణోగ్రతల విపరిణామాలు వెనువెంటనే వ్యవసాయం, ఆరోగ్యంతోపాటు కోట్లాది మంది మధ్యతరగతి ప్రజల జీవనంపైనా దుష్ప్రభావాలు చూపాయి. వడదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోయారు. 2025 మేలో అధిక ఉష్ణోగ్రతలు నమోదుకాకుండా అకాలవర్షాలు అడ్డుకున్నాయి. దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో వర్షాలు పడ్డాయి. పలు చోట్ల కుండపోత వర్షాలు కురిశాయి. వాతావరణ చక్రంలో మార్పుల కారణంగానే మేలో వేడిమి మటుమాయమై చల్లదనం వచ్చి చేరిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. చల్లదనం అత్యధిక రోజులు కొనసాగడంతో అది అంతిమంగా ఎండకాలం ముగింపునకు ముందస్తు నాంది పలికిందని నిపుణులు విశ్లేషించారు. మరెన్నో కారణాలు..వర్షాకాలం ఈసారి ముందస్తుగా ముంచుకురావడం సైతం ఎండకాలం తీవ్రతను తగ్గించేసింది. వాతావరణంలో ముందస్తుగా తేమ శాతం పెరగడం, చల్లని గాలుల క్రమానుగతిలో మార్పులు సైతం ఉష్ణోగ్రత అధికం కాకుండా అడ్డుకున్నాయి. దీంతో వేసవికాలంలో వేడి తగ్గిపోయింది. గతంతో పోలిస్తే ఈసారి ఎండాకాలంలో వాతావరణం చాలావరకు మేఘావృతమైంది. దాంతోపాటు దేశంలో మేనెలలో ప్రతిరోజూ ఏదోఒక చోట వర్షాలు పడుతూ సగటు ఉష్ణోగ్రత పెరగకుండా నిలువరించాయి. ఈ చల్లదన పరిస్థితులు పరోక్షంగా ప్రభుత్వాల మీదా పెనుభారాన్ని ఒక్కసారిగా దించేశాయి. విద్యుత్ డిమాండ్ పెరగకుండా అడ్డుకున్నాయి.ముందుకొచ్చిన కొత్త ధోరణిఉడికించే ఉష్ణోగ్రతలు ఉన్నపళంగా తగ్గిపోవడం కొన్ని రకాల పంటల దిగుబడిపైనా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చక్కటి వేడి పరిస్థితుల్లోనే కొన్నిరకాల పంటలు ఏపుగా పెరిగే పరిస్థితులు ఉంటాయని, ఈసారి ఎండలు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో ఆయా పంటల సాగుఫలంపై ప్రతికూల ప్రభావం పడొచ్చని వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు. ఈసారి మారిన ఈ పరిస్థితులకు తగ్గట్లు కర్షకులు తమ పంటల విత్తునాటడం మొదలు ఎరువులు, పురుగుమందులు చల్లడం దాకా ప్రతిదాంట్లో కాస్తంత సమయపాలన పాటించడం తప్పనిసరి అయిందని వాళ్లు చెబుతున్నారు. హఠాత్తుగా ఎండాకాలం వ్యవధి తగ్గి వర్షాలు మొదలవడంపై వాతావరణ విభాగం సైతం వాతావరణ ముందస్తు అంచనాల వ్యూహాలకు పదునుపెట్టింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
నదిని దాటాలంటే.. ప్రాణాలతో చెలగాటమే..
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. జనజీవనం అతలాకుతలమవుతోంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో జనం తమ ప్రాణాలను పణంగా పెట్టి, నదులను దాటుకుంటూ ఆవలివైపునకు చేరుకుంటున్నారు. రాష్ట్రంలోని వరద పరిస్థితులను తెలియజేస్తూ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు(Kiren Rijiju) తన ‘ఎక్స్’ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు.ArunachalPradesh receives heaviest Monsoon rains in the world. Got this video of a man crossing traditional hanging bridge in Anjaw district, Arunachal Pradesh near tri-junction of India, China & Myanmar border. Please remain careful & safe. Govt will provide necessary support. pic.twitter.com/GZ9ypeOzZj— Kiren Rijiju (@KirenRijiju) June 1, 2025దానిలో ఒక నది ఉవ్వెత్తున ఉప్పొంగుతుండగా, ఒక వ్యక్తి తాడు పట్టుకుని ఎంతో కష్టం మీద వంతెన దాటున్న దృశ్యం కనిపిస్తోంది. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఏర్పడుతున్న వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో లోతట్టు ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాలలోని పరిస్థితులను ఈ వీడియో(Video) కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. అక్కడ ఉంటున్నవారు ఎంత దుర్భర స్థితిలో ఉంటున్నారో తెలియజేస్తుంది. ఈ వీడియోను భారత్, చైనా, మయన్మార్ సరిహద్దుల్లోని ట్రై-జంక్షన్ సమీపంలోని అంజావ్ జిల్లాలో చిత్రీకరించారు. ఈ వంతెనను వెదురు, చెక్కలు, తాళ్లతో నిర్మించినట్లు కనిపిస్తోంది. ఈ వంతెనలో అక్కడక్కడా కొంతభాగం భారీ వర్షాల కారణంగా కొట్టుకుపోయినట్లు లేదా మునిగిపోయినట్లు కనిపిస్తోంది. వీడియోలో వంతెనపై ఒకవైపు తాళ్లను పట్టుకున్న వెళుతున్న వ్యక్తి కనిపిసుండగా, కింద ఉప్పొంగి ప్రవహిస్తున్న నది ఏ క్షణంలోనైనా వంతెనను తుడిచిపెట్టేస్తుందనేలా ఉంది. గడచిన 48 గంటల్లో అరుణాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు తొమ్మిది మంది మృతి చెందారు. ముఖ్యమంత్రి పెమా ఖండు బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతాయనే అంచనాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనవసరమైన ప్రయాణాలను చేయవద్దని కోరారు. ఇది కూడా చదవండి: బీహార్‌లో మరో దారుణం.. తొమ్మిదేళ్ల దళిత బాలిక విలవిల -
బలహీనపడిన వాయుగుండం
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడింది. నాలుగు రోజులుగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా వేగంగా విస్తరించేందుకు ఇది దోహపడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయుగుండం బలహీనపడడంతో వర్షాలు కొద్దిమేర తగ్గుతాయని పేర్కొన్నారు. అయితే, చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.శనివారం నుంచి ఆదివారం సాయంత్రం వరకు విజయనగరం, వైఎస్సార్ కడప, నంద్యాల, అనకాపల్లి, తూర్పు గోదావరి, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో వర్షాలు కురిశాయి. విజయనగరం జిల్లా గుర్ల, వైఎస్సార్ కడప జిల్లా ఎస్.మైదుకూరులో 24 గంటల వ్యవధిలో 8.7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
గ్రీష్మవర్షం
‘దేవుడికేం హాయిగ ఉన్నాడూ, మానవుడే బాధలు పడుతున్నాడూ’ అంటాడో సినీకవి. అనాదిగా జరుగుతున్నదీ, మనం అంతగా గమనించనిదీ ఏమిటంటే, ఈ చరాచర జగత్తు మొత్తానికి మనిషి తనే కేంద్రస్థానమనుకుంటాడు; ఈ విశ్వరచన అంతా తన కోసమేననీ, తనే సృష్టిచక్రం తిప్పు తున్నాననే భ్రమలోకి జారిపోతూ ఉంటాడు, తన బాధ ప్రపంచ బాధగా ఊహించుకుంటాడు. నిజానికి మనిషే కాదు, ప్రతి జంతువూ, చెట్టూ, పిట్టా కూడా అలాగే అనుకుంటాయేమో కూడా!కానీ కొంచెం సూక్ష్మంగా యోచిస్తే, దేవుడూ, లేదా ప్రకృతీ కూడా అంత హాయిగా ఏమీలేనట్టూ, తమవైన బాధలను, సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నట్టూ అర్థమవుతుంది. మనం దేవతగా భావించే భూమినే తీసుకుంటే, తన వందల కోట్ల సంవత్సరాల ఉనికిలో అదెన్ని బాధలు పడిందో, ఎన్నెన్ని అస్తిత్వ సమస్యల నెదుర్కొందో, ఎంతటి అస్థిరత్వానికి, అనిశ్చితికి గురైందో భూభౌతిక విజ్ఞానం మనకెంతో కొంత అవగాహన కలిగిస్తూనే ఉంది. మొదట భూమి మొత్తం మండిపోయే ఓ అగ్నిగోళం. క్రమంగా ఉపరితలం చల్లబడుతూ వచ్చింది. అయినా ఇప్పటికీ లోపల, తాపమానం మీద వందల, వేల డిగ్రీల మేరకు సెగలూ, పొగలూ కక్కుతూనే ఉందంటారు. ఆ పైన లక్షల సంవత్సరాల నిడివిగల మంచుయుగాలు, జలప్రళయాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు, అంతర్గత ప్రకంపనాలతో అతలాకుతలమవుతూనే వచ్చింది. అప్పుడు తను కూడా మనిషిలానే, తనకన్నా పైన ఉన్న ఏ తీవ్రశక్తినో ఉద్దేశించి, ‘దేవుడికేం హాయిగ ఉన్నా’డని పాడుకునే ఉంటుందేమో! మరీముఖ్యంగా తన ప్రకృతి గమనానికి సంబంధించి భూమి తనదైన ఓ ఋతుభ్రమణాన్ని నిర్దేశించుకుని అదే స్థిరమూ, శాశ్వతమూ అని కూడా భ్రమిస్తూ ఉండచ్చు. ఇక్కడే మనిషికీ, భూమికీ మరో పోలిక. మనిషి కూడా తనదైన ఓ ఋతుచక్రాన్ని కల్పించుకుని, దానినో కాలచక్రంలో బంధించాననుకుంటాడు. తను కోరుకున్నట్టే అవి తిరుగుతూ ఉంటాయనుకుంటాడు. కానీ, తన పైనున్న శక్తులు తను నిర్దేశించుకున్న ఋతుభ్రమణాన్ని తలకిందులు చేయగలవన్న ఎరుక భూమికి తరచు తప్పినట్టే, ప్రకృతి తన ఋతుచక్రాన్ని వెనక్కి తిప్పగలదన్న ఎరుక మనిషికీ తప్పుతుంది. అసలు ప్రకృతీ, తనూ అనుసరించే ఋతుకాల సూచికలు ఒకటే కావాల్సిన అవసరం లేదన్న గ్రహింపూ మనిషికి లోపిస్తూ ఉంటుంది. ఇంతకీ సంగతేమిటంటే, ఈ ఏడాది దేశంలోని పలు ప్రాంతాలు గ్రీష్మతాపాన్ని చవిచూడకుండానే వర్షర్తువు చొరబడిపోయింది. ఆ విధంగా గ్రీష్మానికి, వర్షర్తువుకు మనం నిర్దేశించుకున్న కాలిక మైన హద్దుల్ని ప్రకృతి మరోసారి చెరిపేసింది. దాంతో వాతావరణ, పర్యావరణ శాస్త్రవేత్తలు రంగంలోకి దిగిపోయి వర్షపాతానికి సంబంధించిన చారిత్రకమైన గణాంకాలు, ఇతర వివరాల కవిలె కట్టల్ని బయటికి తీసి శోధించడం ప్రారంభించారు. కేరళనే తీసుకుంటే, నైరుతి ఋతుపవనాలు 1975, 1990 తర్వాత మళ్ళీ ఇప్పుడే అక్కడికి వారం రోజుల ముందు అడుగుపెట్టాయంటున్నారు. దేశం ఇతర ప్రాంతాలలో ఇలా జరగడం 2009 తర్వాత మళ్ళీ ఇప్పుడేనంటున్నారు. ఆ పైన ఈసారి కేరళతోపాటు, తమిళనాడులోనూ, కర్ణాటక, మహారాష్ట్రలలోని అత్యధిక ప్రాంతాలలోనూ నైరుతి ఋతుపవనాలు మామూలు గడువుకన్నా ముందు రావడమే కాకుండా; ఒకే రోజున ఒకేసారి పెద్ద ఎత్తున ముంచెత్తడాన్ని విశేషంగా చూపుతూ, ఇలా జరగడం 1971 తర్వాత ఇదే మొదటిసారి అంటున్నారు. మళ్ళీ ఇంకోవైపునుంచి చూస్తే, 1970లనుంచీ ఒక పద్ధతి ప్రకారం ఋతుపవనాల రాకలో ఆలస్యం జరుగుతోందంటున్నారు. మొత్తంమీద సంవత్సరాల వారీగా వర్షర్తువు చరిత్రనైతే నమోదు చేయగలుగుతున్నా, అది ఒక్కోసారి గడువు కన్నాముందే ఎందుకు తొలకరించి పలక రిస్తుందో, ఒక్కోసారి ఎందుకు వేళతప్పిన అతిథి అవుతుందో ఇప్పటికీ కారణాలు అంతుబట్టక శాస్త్రవేత్తలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. అలాగని వాతావరణ, పర్యావరణ రంగాల్లో వైజ్ఞానికంగా మనం వేసిన అంగలు చిన్నవేమీ కావు. వర్షాలు ఎందుకు పడతాయో, ఎందుకు పడవో మనకిప్పుడు బాగా తెలుసు. నేలమీది శీతోష్ణాలు, సముద్రాలమీది శీతోష్ణాలు చెట్టపట్టాలు వేసుకుని విడతలవారీగా అల్పపీడనాలను సృష్టిస్తూ వర్షపాతానికి ఎలా కారణమవుతాయో; మారిషస్, మడగాస్కర్ల సమీపంలో పుట్టుకొచ్చే సోమాలీ నిమ్నవాయువులూ, పసిఫిక్ గాలులూ అరేబియా సముద్రం, బంగాళాఖాతాల దాకా వ్యాపించి మన గడ్డమీద వర్షాలకు, లేదా వర్షాభావాలకూ కూడా ఎలా దోహదం చేస్తాయో, ప్రత్యేకించి హిమాలయాలు మన దగ్గర వర్షసామ్రాజ్యాన్ని ఎలా శాసిస్తున్నాయో మనకిప్పుడు మరింత స్పష్టంగా తెలుసు. అసాధారణ ఉపరితల ఉష్ణోగ్రతలను సంకేతించే ‘ఎల్ నినో’, అంతే అసాధారణ శీతలత్వాన్ని సూచించే ‘లా నినా’ అనే వాతావరణ ధోరణులకూ – వర్షాల రాకడకూ, పోకడకూ, ఇతర పరిణామాలకూ ఉన్న సంబంధం గురించిన అవగాహన కూడా మనకుంది. అయినాసరే, గడువుకు ముందే వర్షాలు, వర్షాభావాలూ, వర్షాలస్యాల వెనుక ప్రకృతి అనుసరించే సూత్రబద్ధత ఏమిటో ఇప్పటికీ అంతుబట్టని బ్రహ్మపదార్థంగానే ఉంది. మనకు సరే, ప్రకృతికి మాత్రం అది అంతుబట్టిందా అన్నది అంతిమ ప్రశ్న. అదలా ఉంచితే, ముందుస్తు వర్షాలు రేపటి ఆశల విరిజల్లులను తలపించి సంతోషభరితం చేస్తాయి కానీ, దురదృష్టవశాత్తూ ప్రతిసారి అవి వర్షపుష్కలత్వానికి హామీ ఇవ్వకపోవచ్చని శాస్త్రవేత్తలు పెదవి విరుస్తున్నారు. వారి భయాలు నిజం కాకూడదని మనసారా కోరుకుందాం. -
రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు
మహారాణిపేట (విశాఖ): నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో కొన్నిచోట్ల ఒక మోస్తరు వర్షాలు.. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.వీటి ప్రభావంవల్ల పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఇక శనివారం విజయనగరం జిల్లా గుర్లలో 8.75 మిల్లీమీటర్లు.. వేపాడ, నంద్యాల జిల్లా ముత్యాలపాడులో 7.9 మిమీ, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 7.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. -
సమ్మర్ స్పెషల్.. వేసవిలో వర్షాలు!
సాక్షి, హైదరాబాద్: వేసవి సీజన్ కూల్‌గా గడిచిపోయింది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదైనప్పటికీ వాతావరణంలో వేగంగా మార్పులు జరగడం... అకాల వర్షాలు... ముందస్తు రుతుపవనాలతో ప్రజలు వేసవి కాలాన్ని కూడా కూల్‌గా ఆస్వాదించారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు పరిసర జిల్లాల్లో ఈసారి ఉష్ణోగ్రతల ప్రభావం ఎక్కువ రోజులు లేదు.మార్చి నెలలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదు కాగా ఆ తర్వాత అడపాదడపా కురిసిన వర్షాలతో ఎక్కువ రోజులు వాతావరణం చల్లగానే ఉంది. మరోవైపు వేసవి సీజన్లో వర్షాలు విస్తరంగా కురిశాయి. సీజన్లో కురవాల్సిన సాధారణ వర్షాల కంటే 203 శాతం అధికంగా వర్షాలు కురవడం గమనార్హం. గతేడాది వేసవి సీజన్లో సాధారణం కంటే 160 శాతం అధిక వర్షాలు కురవగా ఈ సీజన్లో అంతకు రెట్టింపు వర్షాలు కురిశాయి.సాధారణానికి మించి..రాష్ట్రవ్యాప్తంగా వేసవి సీజన్లో నెలవారీగా కురవాల్సిన సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ మోతాదులోనే వర్షాలు నమోదయ్యాయి. సాధారణంగా మార్చి నెల నుంచి మే నెలాఖరు వరకు వేసవి సీజన్‌గా పరిగణిస్తారు. ఈ మూడు నెలల కాలంలో రాష్ట్రంలో సగటున 55.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది. అయితే గత నాలుగేళ్లుగా వర్షపాతం గణాంకాలు పరిశీలిస్తే సాధారణం, అంతకు మించి వర్షాలు నమోదవుతున్నాయి. 2022 వేసవి సీజన్లో సగటున 42.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా 2024 వేసవిలో 80.5 మిల్లీమీటర్లు వర్షం నమోదైంది. గతేడాది నైరుతి సీజన్లో మాత్రం వర్షపాతం గణాంకాలు ఆశాజనకంగా లేవు. సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ పలు మండలాల్లో వర్షాభావ పరిస్థితులు కనిపించాయి. ప్రస్తుత సీజన్లో వర్షాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈసారి వేసవి సీజన్లోనే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో వాతావరణం చల్లబడింది.మార్చిలో తక్కువగా..మేలో అత్యధికంగా...ఈ ఏడాది మార్చి నెలలో సాధారణం కంటే కాస్త తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ ఏప్రిల్ నెలలో మాత్రం సాధారణం కంటే 80 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అదేవిధంగా మే నెలలో 376 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. మే నెలలో బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో వర్షాలు భారీగా నమోదయ్యాయి. మరోవైపు ముందస్తుగా రుతుపవనాల రాకతోనూ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు మోస్తరు నుంచి భారీగా కురవడంతో వర్షపాతం గణాంకాలు అమాంతం పెరిగాయి. -
నేడు, రేపు వర్షాలు
మహారాణిపేట: రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతు పవనాలు విస్తరించడంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం విజయనగరం జిల్లా గుర్లలో 87.5 మి.మీ, వైఎస్సార్ కడప జిల్లా శెట్టివారిపల్లిలో 87.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం
తిరువనంతపురం: అత్యంత భారీ వర్షాలు, విపరీతమైన వేగంతో కూడిన ఈదురు గాలులు కేరళ(Kerala)ను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ బీభత్సం కొనసాగుతున్న సమయంలోనే రాబోయే మూడు గంటల్లో కేరళలోని 5 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందంటా వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.కేరళలోని అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, త్రిస్సూర్, పాలక్కాడ్ జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాబోయే మూడు గంటల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు, కొన్ని ప్రదేశాలలో 60 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలియజేసింది. తిరువనంతపురం(Thiruvananthapuram), కొల్లం, పతనంతిట్ట, ఇడుక్కి, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్ , కాసరగోడ్ జిల్లాలలోనూ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.ప్రజలు అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు చెట్లు పడిపోయే అవకాశం ఉందని, విద్యుత్ వైర్లు తెగిపడవచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రమాదకరమైన విద్యుత్ లైన్లు గమనిస్తే ఈ విషయాన్ని విద్యుత్‌శాఖ సిబ్బందికి తెలియజేయాలని అధికారులు కోరారు.ఇది కూడా చదవండి: ఐఎన్ఎస్ విక్రాంత్‌ను సందర్శించిన రక్షణమంత్రి రాజ్‌నాథ్ -
రాష్ట్రమంతా నైరుతి!
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు అత్యంత చురుకుగా కదులుతున్నాయి. ఈనెల 26న రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించగా... బుధవారం సాయంత్రానికి తెలంగాణ అంతటా విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన నాలుగు నుంచి ఆరు రోజుల వ్యవధిలో రాష్ట్ర భూభాగం అంతటా విస్తరించేవి. కానీ ఈసారి కేవలం రెండున్నర రోజుల వ్యవధిలోనే విస్తరించడం గమనార్హం.ప్రస్తుతం రుతుపవనాల కదలికలు చురుకుగా ఉండటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు... కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ సూచించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించిన వాతావరణ శాఖ... ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జూన్ నెలలో విస్తారంగా వర్షాలు... కాగా, జూన్ నెలలో రుతుపవనాల గమనానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనాలు విడుదల చేసింది. నైరుతి సీజన్లో జూన్ నెలలో రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 12.94 సెంటీమీటర్లు. ఐఎండీ అంచనాల ప్రకారం జూన్ నెలలో సాధారణం కంటే అధికంగా వర్షాలు కురుస్తాయని.. సగటున 111 శాతం వర్షపాతం నమోదు కావొచ్చని వివరించింది.గతేడాది జూన్ నెలలో 15.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణంకంటే 23 శాతం అధికంగా వర్షపాతం నమోదు కాగా... ఈసారి అంతకుమించి వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా ఉట్కూర్‌లో 4.88 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదేవిధంగా వికారాబాద్ జిల్లా బషీరాబాద్‌లో 3.0 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 2.75 సెంటీమీటర్లు, నల్లగొండ జిల్లా గుండ్లపల్లెలో 2.28 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. -
కాల్మొక్త సారూ.. మా వడ్లు కొనండి
నర్సింహులపేట/దంతాలపల్లి/కోనరావుపేట: వానాకాలం తరుముకొచ్చి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలున్న అన్నదాతలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. వారాలతరబడి వేచిచూస్తున్నా అధికారులు ధాన్యం కొనుగోలు చేయకపోవటం, మరోవైపు రోజూ వర్షాలు పడుతుండటంతో దిక్కుతోచని స్థితిలో వడ్లకు కాంటా వేయాలని అధికారుల కాళ్లావేళ్లా పడుతున్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ధాన్యం కొనుగోలు కేంద్రంలో తమ ధాన్యం కొనుగోలు చేయాలని ఇద్దరు గిరిజన మహిళా రైతులు తహసీల్దార్ రమేశ్‌బాబు కాళ్లు మొక్కి వేడుకున్నారు. తిర్మాతండాకు చెందిన భూక్య గోరి, భూక్య ఈరి అనే మహిళా రైతులు 40 రోజుల క్రితం తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. ఇప్పటివరకు అధికారులు ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు. అక్కడ మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసి కొనుగోలు కేంద్రం జలమయమైంది. దీంతో తహసీల్దార్ రమేశ్‌బాబు బుధవారం ఆ కేంద్రాన్ని పరిశీలించడానికి వచ్చారు.వర్షానికి వడ్లు తడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, వెంటనే కాంటా వేసి తరలించాలని వేడుకుంటూ ఆ రైతులు తహసీల్దార్ కాళ్లు మొక్కారు. ఇతర రైతులు ఆగ్రహంతో నిలదీయటంతో రెండు రోజుల్లో కాంటా వేసి ధాన్యం తరలిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. ధాన్యం బస్తాలతో రోడ్డుపై నిరసనధాన్యం కొనుగోలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్లలో రైతులు బుధవారం ధాన్యం బస్తాలతో రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేయాలని ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోకపోవటంతో దంతాలపల్లి – సూర్యాపేట రహదారిపై ధాన్యం బస్తాలు అడ్డుగా పెట్టి సుమారు 45 నిమిషాలు ధర్నా చేశారు. దీంతో ప్రధాన రహదారిపై కిలోమీటర్‌పైగా వాహనాలు నిలిచిపోయాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ రైతు తమ ధాన్యం కొనుగోలు కేంద్రంలో పోసి 60 రోజులు అవుతోందని, ధర్నాను అడ్డుకోవద్దని పోలీసుల కాళ్లు పట్టుకోబోయాడు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పోలీసులు చెప్పడంతో రైతులు ధర్నా విరమించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన రైతులు బుధవారం స్థానిక వై జంక్షన్ వద్ద పురుగులమందు డబ్బాలు పట్టుకుని తమ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ధర్నా నిర్వహించారు. వెంకట్రావుపేట కేంద్రం పరిధిలో 10 వేల క్వింటాళ్లలోపే ధాన్యం ఉత్పత్తి అవుతుందని, ఇప్పటికే 8,300 క్వింటాళ్లు తూకం వేశామని సింగిల్‌విండో చైర్మన్ బండ నర్సయ్య చెప్పారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే సింగిల్‌విండోను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయతి్నస్తున్నారని ఆరోపించారు. -
ముంబై: నీట మునిగిన మహా నగరం.. 107 ఏళ్ల రికార్డు బద్దలు
ముంబై: మహారాష్ట్రలోని ముంబైని వానగడం ఇప్పట్లో వీడేలా లేదు. ఆదివారం రాత్రి నుండి సోమవారం ఉదయం వరకూ ఎడతెరిపి లేకుండా ముంబైని ముంచెత్తిన వర్షం కాస్త తెరిపిచ్చినప్పటికీ, ఇప్పుడు(మంగళవారం ఉదయం) మళ్లీ తన ఉగ్రరూపం చూపిస్తోంది. ప్రస్తుతం దక్షిణ ముంబైలో మళ్లీ భారీ వర్షం ప్రారంభమైంది.ఈ నేపధ్యంలో మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు నగరానికి వాతావరణ శాఖ(Meteorological Department) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ సమయంలో భారీ నుండి అతి భారీ వర్షాలు ముంచెత్తుతాయని తెలిపింది. గడచిన 24 గంటల్లో ముంబైకి జారీ చేసిన రెండవ రెడ్ అలర్ట్ ఇది. నారిమన్ పాయింట్, వార్డ్ మున్సిపల్ హెడ్ ఆఫీస్, కొలాబా పంపింగ్ స్టేషన్, కొలాబా ఫైర్ స్టేషన్ తదితర ప్రాంతాలలో ఆదివారం రాత్రి నుండి సోమవారం ఉదయం వరకు 200 మి.మీకి మించిన వర్షం కురిసింది. ఫలితంగా రోడ్లు జలమయం అయ్యాయి. సాధారణ జీవితం స్తంభించిపోయింది.గడచిన 24 గంటల్లో ముంబైలో కురిసిన వర్షపాతం 107 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టింది. గత 75 ఏళ్లలో నగరంలో రుతుపవనాల ప్రభావం ఇంత భారీ స్థాయిలో ఉండటం ఇదే తొలిసారని వాతావరణ శాఖ పేర్కొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విమాన, లోకల్ రైళ్ల కార్యకలాపాలు నిలిచిపోయాయి. రెండు వారాల క్రితమే ప్రారంభించిన మెట్రోలోని ఒక భూగర్భ స్టేషన్ నీటితో నిండిపోయింది. దీనితో అధికారులు ఈ మార్గంలో కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది. కుర్లా, సియోన్, దాదర్, పరేల్‌తో సహా అనేక లోతట్టు ప్రాంతాలు వర్షాలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున వాహనాలు వరదలతో నిండిన వీధుల గుండా వెళుతున్న దృశ్యాలు కనిపించాయి.థానేలో పరిస్థితిని సమీక్షించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే.. నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడం, ఫలితంగా కురిసిన భారీ వర్షపాతం ముంబైలోని అనేక ప్రాంతాలలో ముంపునకు కారణంగా నిలిచిందన్నారు. ముంబైలో రుతుపవనాలు షెడ్యూల్ కంటే 16 రోజులు ముందుగానే వచ్చాయి. గత సంవత్సరం రుతుపవనాలు జూన్ 25న మహారాష్ట్ర రాజధానికి చేరుకున్నాయి. కాగా రుతుపవనాలు శనివారం కేరళకు చేరుకున్నాయి. ఇది కూడా చదవండి: పాక్‌లో జ్యోతి మల్హోత్రాకు వీఐపీ సెక్యూరిటీ -
మునిగిన ముంబై.. అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‌ను ముంచెత్తిన వరద నీరు.. వీడియో వైరల్
ముంబై: ముంబై మునిగింది. దేశ ఆర్థిక రాజధాని వర్షాలతో అతలాకుతలమైంది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో రాత్రి నుంచి ముంబైలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముంబై మహానగరానికి వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. కుండపోతవానకు నగరం నరకంలా మారింది. రవాణా స్తంభించి పోయింది.రోడ్లు చెరువుల్లా మారడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన కూడళ్లలో భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాక్‌లపైకి వాన నీరు చేరడంతో రైల్వే సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. మే 10న ప్రారంభమైన వర్లీ మెట్రో స్టేషన్‌కు వరదనీరు పోటెత్తింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ట్రైన్ వచ్చే వరకు, వచ్చిన తర్వాత ట్రైన్ లోపలికి వెళ్లేందుకు వినియోగించే స్టేషన్ గేట్ల వరకు మాత్రమే కాకుండా ప్లాట్‌ఫామ్‌లను నీరు ముంచెత్తింది. వెలుగులోకి వచ్చిన ఆ వీడియోల్లో ప్లాట్ ఫామ్ పూర్తిగా బురద నీటితో నిండిపోయి ఉండటాన్ని చొడొచ్చు.Newly inaugurated Worli underground metro station of Aqua line 3 submerged in water this morning. #MumbaiRain pic.twitter.com/D0gwopOXBE— Tejas Joshi (@tej_as_f) May 26, 2025 అంతేకాదు, మెట్రో లోపల తీసిన మరో వీడియోలో పైకప్పులో లీకేజీ కారణంగా ప్లాట్‌ఫారమ్‌పై నుండి నీరు ప్రవహించింది. భారీ ఎత్తున నీరు నిలిచిపోవడంతో మెట్రోసర్వీసులకు ఆటంకం ఏర్పడింది. అయితే, అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లో వరదకు కారణం డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడమే కారణమని తెలుస్తోంది. ముంబై మూడు లైన్ల అండర్‌గ్రౌండ్ మెట్రోస్టేషన్‌ను బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC) నుండి వర్లిలోని ఆచార్య అత్రే చౌక్ వరకు సేవల్ని అందిస్తోంది. ఈ మెట్రో సేవలు ఈ నెల ప్రారంభంలో మే 10న అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలే ప్రారంభమైన మెట్రోస్టేషన్‌ను వరద నీరు ముంచెత్తడంతో మౌలిక సదుపాయాల గురించి ప్రశ్నలు తలెత్తాయి. -
తెలుగు రాష్ట్రాలను తాకిన నైరుతి రుతుపవనాలు
-
కేరళ చేరిన నైరుతి
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. శనివారం ఉదయం కేరళ భూభాగంలోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రుతుపవనాల కదలికలు అత్యంత చురుకుగా ఉన్నాయని, లక్షదీవులతో పాటు కేరళ రాష్ట్రంలోకి పూర్తిగా ప్రవేశించేందుకు అత్యంత తక్కువ సమయం పడుతుందని వివరించింది. మరోవైపు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను కూడా రుతుపవనాలు తాకాయి. నైరుతి రుతుపవనాలు ముందుగా కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత దేశమంతటా విస్తరిస్తాయి. ఈ సీజన్లో రుతుపవనాలు వాతావరణ శాఖ అంచనాల కంటే మూడురోజులు ముందుగానే భారత ప్రధాన భూభాగాన్ని తాకటం విశేషం. గతేడాది నైరుతి రుతుపవనాలు మే 30న కేరళను తాకగా... ఈసారి ఆరు రోజుల ముందే ప్రవేశించాయి. రానున్న రెండురోజుల్లో రుతుపవనాలు మధ్య అరేబియన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గోవాలో పూర్తి భూభాగం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలతోపాటు సబ్ హిమాలయన్ పశ్చిమబెంగాల్, సిక్కింలోకి ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. ఈసారి వర్షాకాలంలో రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మూడురోజుల్లో రాష్ట్రంలోకి.. రానున్న మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా కేరళను తాకిన తర్వాత సగటున నాలుగు నుంచి ఆరు రోజుల మధ్య తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రుతుపవనాల కదలికలు చురుకుగా ఉండడంతో మూడు రోజులలోపే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరించేందుకు మరో మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గతేడాది జూన్ 3వ తేదీన రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశించగా... ఈసారి మే నెలలోనే ప్రవేశించడం గమనార్హం. 27న బంగాళాఖాతంలో అల్పపీడనం నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండడం రైతాంగంలో ఉత్సాహాన్ని నింపుతోంది. సాధారణంగా నైరుతి రుతుపవనాల సీజన్లో కురిసే వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం, వాయుగుండం, తుఫానులపైనే ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 27న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆరోజుకల్లా తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో ఈ అల్పపీడనం ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని, చాలాచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం రెండ్రోజుల్లో బలపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని ముందస్తు అంచనాలు వెల్లడించాయి. రెండ్రోజులు తేలికపాటి వర్షాలు రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. తూర్పు మధ్య అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ్ – గోవా తీర ప్రాంతం సమీపంలో కొనసాగిన స్పష్టమైన అల్పపీడన ప్రాంతం శనివారం ఉదయం బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం అదే ప్రాంతంలో రత్నగిరికి ఆగ్నేయంగా 40 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. క్రమంగా తూర్పు దిశలో కదిలి శనివారం రాత్రికల్లా దక్షిణ కొంకణ్ తీరంలో రత్నగిరి, దాపోలి మధ్యలో వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో దక్షిణ ప్రాంత జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదు కానున్నాయి. -
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్లో భారీ వర్షం కురిసింది. అలాగే సనత్ నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, మెహదీపట్నం, టోలీచౌకీ, గోల్కోండ తదితర ప్రాంతాల్లోనూ వాన పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. ఆఫీసులు ముగిసే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ భారీగా జామ్ కావడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. ఇంకా చిరు జల్లులు పడుతుండగా.. రేపు భారీ వర్షం పడొచ్చని వాతావరణశాఖ తెలిపింది. నైరుతి(Southwest Monsoon) రుతుపవనాలు సాధారణం కంటే ఎనిమిది రోజుల ముందే కేరళను తాకాయి. దీంతో రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ విభాగం ప్రకటించింది. Ameerpet metro station 🌧️ #HyderabadRains#Hyderabad pic.twitter.com/svyXFaOb0b— Rajesh (@bekindtoevery_1) May 24, 2025#24MAY 7:30PM⚠️Pouring So Heavily in Northern & Western Parts of the City #Hyderabadrains pic.twitter.com/gNR0GD4WZc— Hyderabad Rains (@Hyderabadrains) May 24, 2025 -
పదహారేళ్ల తర్వాత ముందస్తు పలకరింపు..!
సాక్షి, విశాఖపట్నం: పదహారేళ్ల తర్వాత.. నైరుతి రుతుపవనాలు ముందస్తుగా రాష్ట్రాన్ని పలకరిస్తున్నాయి. భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అంచనాలకు అనుగుణంగానే వారం ముందుగా.. ఈ నెల 26 నాటికి రాయలసీమలోకి ప్రవేశించనున్నాయి. 29 నాటికి రాష్ట్రమంతటా విస్తరించే సూచనలున్నాయి. మే నెలాఖరులో రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకడం 2009 తర్వాత ఇదే మొదటిసారని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వాతావరణంలో మార్పులు, ఎల్‌నినో ప్రభావం లేకపోవడం రుతుపవనాల ముందస్తు రాకకు కారణమని పేర్కొంటున్నారు. వారు అందించిన వివరాల ప్రకారం.. » తూర్పు–పశ్చిమ షీర్ జోన్ ఒక చోదక శక్తిగా నైరుతిని ముందుండి నడిపిస్తోంది. » ఈ ఏడాది మే మధ్యలో ఏర్పడిన షీర్ జోన్, అరేబియా సముద్రం, బంగాళాఖాతం రెండింటిలోనూ అల్పపీడన వ్యవస్థలను ప్రేరేపించడంతో.. రుతుపవనాలు చురుగ్గా కదిలేందుకు అవకాశం కలిగింది. » ఈనెల 24 నాటికి రుతు పవనాలు కేరళను తాకే సూచనలు కనిపిస్తున్నాయి. 26 నాటికి రాయలసీమ అంతటా.. దక్షిణ కోస్తా జిల్లాల్లోని సీమ సరిహద్దు ప్రాంతాల్లోనూ విస్తరించనున్నాయి. 28 నాటికి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల మొత్తం, 29 నాటికి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రమంతటా విస్తరించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. » ఈసారి వర్షపాతం దీర్ఘకాలిక సాధారణ సగటు 104 శాతం కంటే 5 శాతం అదనంగా పడే సూచనలున్నాయి.27న అల్పపీడనం!ఓవైపు నైరుతి చురుగ్గా కదులుతున్న తరుణంలో.. మరింత అనుకూల వాతావరణాన్ని కల్పించేలా అల్పపీడనం ఏర్పడుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 27న అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఇది రానున్న రోజుల్లో మరింత బలపడవచ్చని పేర్కొంది. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురిసే సూచనలున్నాయని తెలిపింది. గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీయవచ్చని పేర్కొంది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాగా, ఈ నెల్లో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి వర్షాలు కురిశాయని ఏపీ వాతావరణ శాఖ అధికారి స్టెల్లా వెల్లడించారు. ఈనెల 1 నుంచి 21 వరకూ ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ సగటు వర్షపాతం 39.2 మిమీ కాగా, 126 శాతం అధికంగా 88.5 మిమీ వర్షపాతం నమోదైందని తెలిపారు. -
రెయిన్ అలెర్ట్.. ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు
సాక్షి,విశాఖ: ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.దక్షిణ కొంకణ్, గోవా ఆనుకుని ఈస్ట్ అరేబియా సముద్రంపై అల్పపిడనం ఏర్పడింది. ఈ అల్పపీడన ద్రోణి తెలంగాణ వరకు వ్యాపించింది. దాని ప్రభావంతో దాని ప్రభావంతో కోస్తాలో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.అల్పపీడన ప్రభావంతో ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు పలు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురవనున్నాయి. ఉరుములతో కూడిన జల్లులు పడే ప్రాంతంలో 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండగా..ఇవాళ, రేపు ఈ రెండు రోజుల పాటు వాతవరణ పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉంది.గడచిన 24 గంటల్లో.. అమరావతి 9, పొదిలి 7, మాచర్ల 6, విశాఖ, మచిలీపట్నం, జంగ మహేశ్వరపురం 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
నోటికాడి బువ్వ.. నీటిపాలు
సాక్షి, హైదరాబాద్/ నల్లగొండ/ మంచిర్యాల అగ్రికల్చర్/ మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ/ నిజామాబాద్ అర్బన్: రాష్ట్రంలో అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో వివిధ జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం బుధవారం కురిసిన వర్షానికి చాలా వరకు తడిచిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్లముందే తడిచిపోవటంతో రైతులు ఆవేదనకు గురయ్యారు. తూకం వేసిన ధాన్యం బస్తాలు సైతం తడిచిపోవడంతో మిల్లర్లు వాటిని తీసుకుంటారో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో వర్షాలకు ధాన్యం తడిచిపోతోంది. ఇంకా కొనుగోలు చేయాల్సిన ధాన్యం 10 ఎల్ఎంటీ రాష్ట్రంలో ఇప్పటివరకు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చినట్లు పౌరసరఫరాల సంస్థ అధికారికంగా చెబుతోంది. అందులో 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేయగా, మిల్లులకు తరలించింది 54.33 ఎల్ఎంటీ మాత్రమే. అంటే ఇంకా సుమారు 6 ఎల్ఎంటీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉంది. ములుగు, మహబూబాబాద్, ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో అక్కడక్కడ కోతలు ఆలస్యమైన నేపథ్యంలో మరో 5 ఎల్ఎంటీకి పైగా ధాన్యం రైతుల కల్లాల్లోనో, పొలాల్లోనో ఉంది. మొత్తంగా మరో 10 ఎల్ఎంటీ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉంది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, 17 శాతానికి తేమ తగ్గేవరకు ఆరబెట్టిన తరువాతే కొనుగోలు చేస్తామని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెప్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా, తేమ 20 శాతం ఉన్నా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి లేఖ రాసినట్లు సమాచారం. నీటిపాలైన ధాన్యం ⇒ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కొత్తపేట, కట్టంగూర్, ఐటిపాముల, శాలిగౌరారం, గుడివాడ, తుంగతుర్తి, మద్దిరాల, నాగారం, నూతనకల్ మండలాల్లో, భూదాన్ పోచంపల్లి, గూడూరు ప్యాక్స్ కేంద్రాల్లో ధాన్యం నీట మునిగింది. పెద్దఅడిశర్లపల్లి మండలంలోని పెద్దగట్టులో పిడుగుపాటకు రెండు ఆవులు మృతిచెందాయి. జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొట్టుకుపోయింది. అర్వపల్లి కేంద్రంలో ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురంలో పిడుగుపడి 10 గొర్రెలు, చివ్వెంల మండలం గంటోనిగూడెంలో 14 గొర్రెలు, కోదాడ మండలం నల్లబండగూడెంలో 38 మేకలు మృతిచెందాయి. ⇒ జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాగారం, ఆజంనగర్, రాంపూర్, కమలాపూర్, గొల్ల బుద్ధారం, పాంబాపూర్, భీమ్ ఘనపూర్ గ్రామాల్లో ధాన్యం తడిచింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇంధనపల్లి గ్రామంలో ధాన్యం నీటిపాలైంది. ⇒ మహబూబ్‌నగర్‌లో బుధవారం ఉదయం 7 గంటల నుంచి 9.30 గంటలకు వరకు, రాత్రి 7.30 గంటల నుంచి 9.30 గంటలకు వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. పలు కాలనీల్లో ఓపెన్ నాలాలు, డ్రెయినేజీలు పొంగిపొర్లటంతో. పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ విజయేందిర, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలంతో పాటు జడ్చర్ల, భూత్పూర్, దేవరకద్ర, అడ్డాకుల, మూసాపేట, నవాబుపేటలో ఓ మోస్తారు వర్షం కురిసింది. దేవరకద్ర, మిడ్జిల్, వెల్దండ ప్రాంతాల్లో వర్షాలకు ధాన్యం తడిచిపోయింది. ⇒ మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో కలిపి లక్ష మెట్రిక్ టన్నుల మేర నష్టం జరిగినట్లు సమాచారం. ⇒ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో బచ్చోడు కొనుగోలు కేంద్రంలో నిల్వధాన్యం తడిచిపోయింది. కరేపల్లి, రఘునాథపాలెం మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ⇒ వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని మార్కెట్ యార్డులో భారీగా ధాన్యం తడిచిపోయింది. ⇒ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దహెగాం మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిచింది. పెంచికల్పేట్, కౌటాల మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కొట్టుకుపోయాయి. ⇒ నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద, లోకేశ్వరం, కుంటాల, భైంసా రూరల్, ఖానాపూర్, మామడ తదితర మండలాల్లో అకాల వర్షం రైతులను ఆగం చేసింది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిచి ముద్దయింది. ⇒ భారీ వర్షాలకు ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం, ఎస్ఎస్ తాడ్వాయి మధ్య రోడ్డుపై చెట్టు అడ్డుగా పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యంతోపాటు ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. వరంగల్ జిల్లా నర్సంపేట, ఇల్లంద వ్యవసాయ మార్కెట్లలో ఆరబెట్టిన ధాన్యం కొట్టుకుపోయింది. ⇒ నిజామాబాద్ జిల్లాలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మోపాల్ మండలం చిన్నాపూర్‌లో ట్రాన్స్ఫార్మర్ నేలకూలింది. ముదక్పల్లి, నర్సింగ్‌పల్లిలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మాక్లూర్ మండలంలో ఐదెకరాల బీర తోట ధ్వంసమైంది. పెర్కిట్, ఆర్మూర్, ఆలూర్ మండలంలో ఆరబోసిన వరిధాన్యం, సజ్జ పంట తడిశాయి. -
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు
మహారాణిపేట (విశాఖ)/సాక్షి నెట్వర్క్: ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. తాజాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడ ద్రోణి వల్ల రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఉపరితల ఆవర్తనం వల్ల ఇప్పటికే నైరుతి రుతుపవనాల కదలిక జోరుగా ఉంది.రానున్న మూడు రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిప్రాంతాల్లో గంటకు 40 –50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. ఉమ్మడి కృష్ణాజిల్లాను 2 రోజులుగా వర్షాలు వీడటం లేదుమచిలీపట్నంతోపాటు కృష్ణాజిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం వర్షం కురిసింది. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. తాజాగా రాత్రి 8 గంటల సమయంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో జోరు వాన కురిసింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. » గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు గుంటూరు నగరంతోపాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గుంటూరులో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మే నెల 21 వరకు జిల్లా సాధారణ వర్షపాతం 42.8 మిల్లీ మీటర్లు కాగా, ఇప్పటి వరకు 106.2 మి.మీ వర్షపాతం నమోదైంది. » ప్రకాశం జిల్లాలో బుధవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. గిద్దలూరు, మార్కాపురం, వైపాలెం, కనిగిరి నియోజకవర్గాల్లో ఉరుము లు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి. అత్యధికంగా దోర్నాల మండలంలో 10.2 మి.మీ వర్షపాతం నమోదైంది. తీగలేరు పొంగిపొర్లడంతో మార్కాపురం–దోర్నాల మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. » శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో బుధవారం జోరు వాన కురిసింది. నెల్లూరులోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. -
'ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి': ఎంపీ ట్వీట్
బెంగళూరులో ఆదివారం (మే 18) ఉదయం 8:30 గంటల నుంచి సోమవారం (మే 19) ఉదయం 8:30 గంటల మధ్య 24 గంటల వ్యవధిలో 105.5 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షం నగరాన్ని అస్తవ్యస్తం చేసింది. ప్రయాణం ఇబ్బందిగా మారింది, ఆఫీసులకు వెళ్లలేక ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో బెంగళూరులోని అన్ని కంపెనీలు రెండు రోజులు వర్క్ ఫ్రమ్ సదుపాయం అందించాలని బీజేపీ ఎంపీ పీసీ మోహన్ ట్వీట్ చేశారు.భారీ వర్షాల కారణంగా.. కాగ్నిజెంట్ కంపెనీ ఈరోజు (మే 20) తన ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని చెప్పింది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ.. బెంగళూరులో 40,000 మంది ఉద్యోగులను నియమించింది.ఇన్ఫోసిస్ ఇప్పటికే మూడు రోజుల వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానాన్ని అనుసరిస్తోంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా టెక్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారీ వర్షం కారణంగా, సిల్క్ బోర్డ్.. రూపేన అగ్రహార మధ్య హోసూర్ రోడ్డును బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఈరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు తాత్కాలికంగా మూసివేశారు.All companies in Bengaluru, including Infosys, must declare two days of work from home due to rains.— P C Mohan (@PCMohanMP) May 19, 2025 -
బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం
-
చురుగ్గా నైరుతి రుతుపవనాలు.. ముందుగానే తొలకరి!
విశాఖ: దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాలు ముందుగానే పలకరించనున్నాయి. ఐదు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) స్పష్టం చేసింది. దక్షిణ, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో విస్తరించిన రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు ఐఎండీ తెలిపింది. మే 25వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వచ్చే వారం రోజులు వర్షాలు ఉధృతి కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, వైఎస్సార్, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వచ్చే 24 గంటట్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. నిన్న(సోమవారం) రేపల్లెలో 9 సెం.మీ వర్షపాతం నమోదైంది. -
Rain Alert: అరేబియా సముద్రంలో బలపడుతున్న గాలులు
-
చల్లని కబురు
సాక్షి, విశాఖపట్నం: దేశమంతా భానుడి భగభగలతో మండుతున్న వేళ భారత వాతావరణ శాఖ (ఐఎండీ)చల్లని కబురు అందించింది. ముందుగానే ఊహించినట్టు నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నట్టు ఐఎండీ అంచనా వేస్తోంది. మే 13న రుతుపవనాలు అండమాన్ సముద్రంలోకి ప్రవేశించనున్నట్టు ఐఎండీ ప్రకటించింది. 13 సాయంత్రం నాటికి అండమాన్ సముద్రంతో పాటు దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి నైరుతి ప్రవేశించనుంది. సాధారణంగా రుతుపవనాలు మే 20 తర్వాతే అక్కడికి చేరుకుంటాయి. కానీ.. ఈసారి వాతావరణ పరిస్థితులు పూర్తి అనుకూలంగా ఉండటంతో వారం ముందుగానే ఆగ్నేయ బంగాళాఖాతానికి రాబోతున్నాయి. రుతుపవనాల రాకకు వాతావరణం కలిసొస్తే జూన్ మొదటి వారంలోనే కేరళని తాకే అవకాశం ఉంది. ఈసారి నైరుతి కాలంలో సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణ తెలంగాణ, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షం పడే సూచనలున్నాయని పేర్కొన్నారు. ఈదురు గాలుల తీవ్రత కొనసాగుతుందని.. గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని ఆంధ్ర ప్రదేశ్ అధికారులు తెలిపారు. -
ఏపీకి భారీ వర్ష సూచన. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ
విశాఖ : రాబోవు కొన్ని గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. దాంతో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.గంటలకు 60 నుంచి 80 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీయవచ్చని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నట్లు స్పష్టం చేసింది. దాంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.ఐదు జిల్లాలకు రెడ్ అలెర్ట్‌రాగల రెండు మూడు గంటల వ్యవధిలో ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని, గంటకు 60 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనవసరంగా బయటకు రాకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విజ్ఞప్తి చేశారు విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ, రోణంకి కూర్మనాథ్,పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్మరోవైపు అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ జిల్లాలతో పాటు వాటి పరిసర ప్రాంతాల్లోనూ వర్షాలు పడే సూచనలున్నాయని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. -
RCB vs CSK: అభిమానులకు బ్యాడ్‌న్యూస్!
ఐపీఎల్-2025 (IPL 2025)లో క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు దూసుకుపోతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఇప్పటికే పోటీ నుంచి తప్పుకొన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది.ఇక చెన్నై దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni)కి ఇదే ఆఖరి సీజన్ అన్న వార్తల నడుమ.. ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli)తో కలిసి మైదానంలో కనిపించడం ఇదే చివరిసారి అని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాలను మళ్లీ మైదానంలో కలిపి చూడలేమేమో అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.చెన్నైదే పైచేయిఏదేమైనా ఆర్సీబీ- చెన్నై పోరు అంటే ఉండే మజానే వేరు. ఇప్పటికి ఐపీఎల్లో ఇరుజట్లు 34 మ్యాచ్‌లు ఆడగా.. 21 మ్యాచ్‌లలో చెన్నై, 12 మ్యాచ్‌లలో బెంగళూరు జట్లు విజయాలు సాధించాయి. ఓ మ్యాచ్ మాత్రం రద్దై పోయింది.ఇక ఇప్పటి వరకు ఆర్సీబీపై చెన్నైదే పైచేయి కాగా.. ఈ సీజన్లో మాత్రం బెంగళూరు జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. 2008 తర్వాత తొలిసారి మళ్లీ చెన్నైని వారి సొంత మైదానం చెపాక్ స్టేడియంలో ఓడించి చరిత్ర తిరగరాసింది.వర్షం ముప్పుతాజాగా తమ సొంతమైదానం చిన్నస్వామి స్టేడియంలో శనివారం నాటి మ్యాచ్‌లోనూ గెలిచి.. సీఎస్కేపై పూర్తి ఆధిపత్యం చెలాయించాలని పట్టుదలగా ఉంది. అయితే, వర్షం ఇందుకు ఆటంకం కలిగించేలా ఉంది. గత రెండు రోజులుగా బెంగళూరులో వాన పడుతోంది.భారత వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. శనివారం కూడా బెంగళూరులో ఆకాశం మేఘావృతమై ఉంది.. సాయంత్రం భారీ వర్షం లేదా ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడేలా ఉంది.ఇక ఈఎస్‌పీఎన్‌క్రిక్ ఇన్ఫో అందించిన వివరాల ప్రకారం.. చెన్నై శుక్రవారం మూడు గంటలకే ప్రాక్టీస్ మొదలుపెట్టగా.. 45 నిమిషాల్లోపు వర్షం వల్ల ఆటగాళ్లు తిరిగి వెళ్లిపోయారు. తర్వాత మళ్లీ 4.30 నిమిషాలకు తిరిగి వచ్చారు. ఆర్సీబీ ఆటగాళ్లు ఐదింటికి అక్కడకు చేరుకోగా.. కాసేటికే మళ్లీ వర్షం పడింది. ఇలా వరుణుడు ఇరుజట్లతో దోబూచులాడుతున్నాడు.కనీసం రెండు గెలిచినా బెర్తు ఖరారేఒకవేళ ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయితే ఆర్సీబీ- చెన్నైలకు చెరో పాయింట్ వస్తుంది. దీంతో ఇప్పటికి పదికి ఏడు గెలిచి పద్నాలుగు పాయింట్లతో ఉన్న ఆర్సీబీకి ఖాతాలో మరో పాయింట్ చేరుతుంది. ఇంకా మిగిలిన మూడు మ్యాచ్‌లలో కనీసం రెండు గెలిచినా బెర్తు ఖరారైపోతుంది.ఇక ఇప్పటికే పదింట ఏడు ఓడిన పట్టికలో ఆఖర్లో పదో స్థానంలో ఉన్న సీఎస్కేకు మ్యాచ్ రద్దైనా పోయేదేమీ లేదు. అయితే, పరువు నిలుపుకోవాలంటే మాత్రం ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి. కాగా ఐపీఎల్-2025లో ఆర్సీబీకి రజత్ పాటిదార్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. సీఎస్కే సారథి రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో ధోని మళ్లీ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఇక ఈ సీజన్లో వర్షం వల్ల ఇంత వరకు ఒక్క మ్యాచ్ మాత్రమే రద్దైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్- కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ వాన వల్ల అర్ధంతరంగా ముగిసిపోయింది.చదవండి: IPL 2025: సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే..? ఏ జట్టు ఎన్ని గెలిచింది? -
వర్షాలతో సాగు సమృద్ధి
ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే అధికంగా నమోదు కావచ్చంటూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వేసిన అంచనాలు వ్యవసాయ రంగానికి సానుకూలమని.. ఉత్పాదకత పెరుగుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) పేర్కొంది. దీనికితోడు వడ్డీ రేట్ల తగ్గింపు వినియోగానికి ఊతమిస్తాయని.. ప్రతీకార సుంకాలతో పడే ప్రభావాన్ని ఎదుర్కొని భారత్ బలంగా నిలబడగలదని అంచనా వేసింది. ఐఎండీ అంచనాలు కేవలం రైతులకే కాకుండా, ఆర్థిక వ్యవస్థకూ అనుకూలమేనని తెలిపింది. అయితే మొత్తం మీద వర్షపాతం ఎలా ఉంటుందన్న దానిపైనే ఈ ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయని స్పష్టం చేసింది.వాతావరణ మార్పులతో వర్షాల పరంగా ఎలాంటి ఊహించని షాక్‌లు లేకుండా సాధారణంగా ఉంటే మరో ఏడాది వ్యవసాయ రంగం స్థూల విలువ జోడింపు (జీవీఏ) 4 శాతం స్థాయిలో ఉంటుందని ఇండ్-రా అంచనా వేసింది. ‘2024 ఖరీఫ్, రబీ పరంగా మంచి సాగును చూశాం. 2025–26లోనూ రెండు సానుకూల పంట సీజన్లు, ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్షిత స్థాయికి దిగువన ఉండడం, ద్రవ్య పరపతి విధాన సరళీకరణ అన్నవి ప్రతీకార సుంకాల ప్రభావాన్ని భారత్ తట్టుకుని నిలిచేలా చేస్తాయి’ అని ఇండ్–రా ప్రతినిధి దేవేంద్ర కుమార్ పంత్ తెలిపారు. ఈ ఏడాది జూన్–సెప్టెంబర్ మధ్య కాలంలో వర్షాలు భౌగోళికంగా వివిధ ప్రాంతాల్లో ఎలా ఉంటాయన్నది చూడాల్సి ఉంటుందని ఇండ్–రా తెలిపింది. ఇదీ చదవండి: భారత్–అమెరికా మధ్య డీల్..?ఉపాధి కల్పనలో కీలక పాత్ర2022–12 నాటికి జీడీపీ జీవీఏలో సాగు రంగం వాటా 18.5 శాతం ఉంటే, 2024–25లో 14.5 శాతానికి తగ్గినట్టు ఇండ్–రా తన నివేదికలో వెల్లడించింది. అయినప్పటికీ దేశ ఆరి్థక వ్యవస్థలో ఉపాధి కల్పన పరంగా కీలక భూమిక పోషిస్తున్నట్టు తెలిపింది. సాగు రంగం నుంచి ఉపాధి కల్పన వాటా 2018 మార్చి నాటికి 44.1 శాతంగా ఉంటే, 2025 మార్చి నాటికి 46.1 శాతానికి పెరిగినట్టు వెల్లడించింది. ఇది వినియోగ డిమాండ్‌పై, ముఖ్యంగా గ్రామీణ డిమాండ్‌పై ప్రభావం చూపిస్తున్నట్టు తెలిపింది. -
రాష్ట్రంలో అనిశ్చిత వాతావరణం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అనిశ్చిత వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలతో పలు ప్రాంతాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మరో రెండు, మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా ప్రాంతంలో ఎండలతోపాటు వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు రాయలసీమ ప్రాంతంలో ఎండలు మండుతున్నాయి. అనేక ప్రాంతాల్లో 40 నుంచి 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం వైఎస్సార్ జిల్లా కమలాపురంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల జిల్లా గుల్లదుర్తిలో 41.7, తిరుపతి జిల్లా వెంకటగిరిలో41.3, కర్నూలు జిల్లా రేవూరులో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. వర్షాలతోపాటు పిడుగులు పడుతుండడంతో ప్రజలు, వ్యవసాయ పనులు చేసుకునేవారు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశి్చమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో ఉష్ణోగ్రతలు 41 నుంచి 42.5 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. -
తెలుగు రాష్ట్రాల వాతావరణంపై ... IMD షాకింగ్ ప్రకటన
-
రైతులకు భారత వాతావరణ కేంద్రం శుభవార్త
సాక్షి, విశాఖపట్నం: అన్నదాతకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ముందుగానే నైరుతి రూతుపవనాలు రానున్నాయని.. దేశమంతా విస్తారంగా వానలు కురిసే అవకాశముందని వెల్లడించింది. కొన్ని రీజన్లలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈ ఏడాది 105 శాతం వర్ష శాతానికి ఛాన్స్ ఉందని ఐఎండీ పేర్కొంది.జూన్ నుంచి సెప్టెంబరు వరకు దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని.. దీర్ఘకాలిక సగటు 87 సెంటీ మీటర్లుగా ఉండగా.. ఈసారి 105 శాతం అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ వెల్లడించింది. ఈ సారి ఎల్‌నినో లాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం లేదని భావిస్తున్నట్లు తెలిపింది.కాగా, రానున్న మూడు గంటల్లో ఏపీలోని ఉత్తరాంధ్ర, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములతో కూడిన వర్షం కురిసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. -
రాష్ట్రంలో రెండు రోజులు తేలికపాటి వానలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య మధ్యప్రదేశ్ సమీప ప్రాంతం నుంచి ఈశాన్య తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర ప్రాంత జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. కాగా, రాష్ట్రంలో రెండు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వివరించారు. శనివారం ఖమ్మంలో గరిష్టంగా 41.8 డిగ్రీల సెల్సియస్, మెదక్‌లో కనిష్టంగా 22.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు రోజులు మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈమేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. -
ఏపీకి వారం రోజుల పాటు వర్ష సూచన
-
నేడు, రేపు వానలు
సాక్షి, విశాఖపట్నం/తిరుపతి రూరల్/: పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది గురువారం అర్ధరాత్రి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపుగా కదిలే అవకాశం ఉంది. మరోవైపు.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు వరకూ విస్తరించింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మరో 2 రోజులపాటు వర్షాల ప్రభావం అక్కడక్కడా ఉంటుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అల్పపీడనం కారణంగా.. నేడు, రేపు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలుపడే సూచనలున్నాయని తెలిపారు. గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, కోస్తాంధ్ర మత్స్యకారులు శుక్రవారం వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలో బొప్పాయి తోటలకు తీవ్ర నష్టం గురువారం కురిసిన వర్షాలకు ప్రకాశం జిల్లా కురిచేడు, మర్రిపూడి, గిద్దలూరు, పామూరు, దర్శి, పొదిలి మండలాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దర్శి మండలం చందలూరు, వెంకటచలంపల్లి, మారెడ్డిపల్లి, బసిరెడ్డిపల్లి, అబ్బాయిపాలెం, మల్లవరం, చిదంబరంపల్లి, గొల్లపల్లి, కుంచేపల్లి పాములపాడు గ్రామాల్లో బొప్పాయి తోటలకు తీవ్రనష్టం వాటిల్లింది. మిరప, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. తిరుపతి రూరల్, చంద్రగిరి, రామచంద్రాపురం మండలాల్లో భారీ వర్షం కురిసింది. -
హైదరాబాద్‌లో భారీ వర్షం.. కూలిన చెట్లు, చెరువులుగా రోడ్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో భారీ గాలులు మొదలయ్యాయి. పలు చోట్ల వర్షం కురుస్తోంది. గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్, పంజాగుట్ట, అమీర్‌పేట్ ఎస్ఆర్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే మూడు గంటల పాటు హైదరాబాద్ నగరంలో గాలి దుమారంతో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.తెలంగాణలో పలు ప్రాంతాల్లో 3 రోజుల పాటు వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ భద్రాద్రి ములగు భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది.హైదరాబాద్‌లో హైడ్రా డిజాస్టర్ టీం అప్రమత్తమైంది. మొదలైన భారీ గాలులు వీస్తుండటంతో చెట్ల కొమ్మలు విరిగిపడే ప్రమాదాలు అధికంగా ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ ప్రజలను అధికారులు సూచించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధి సర్దార్ నగర్, రావిరాల,తుక్కుగూడ, శ్రీనగర్, ఇమామ్ గూడా, హర్షగూడ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాష్టంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో గాలిలో తేమ శాతం పెరిగి గాలి దుమారంతో వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి, వికారాబాద్‌లో దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. వికారాబాద్, సంగారెడ్డిలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఈ రెండు జిల్లాలకు వచ్చే మూడు గంటల పాటు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. కామారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో వచ్చే మూడు గంటల పాటు ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది. -
హైదరాబాద్ సహా తెలంగాణలో పలు చోట్ల వాన
హైదరాబాద్, సాక్షి: క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల గురువారం మధ్యాహ్నాం నుంచి వర్షాలు మొదలయ్యాయి. రాజధాని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వాన కురుస్తోంది. దీంతో ఉక్కపోత నుంచి ప్రజలు ఊరట పొందుతున్నారు.హైదరాబాద్ నగరంలో.. మియాపూర్, చందానగర్, మదీనాగూడ, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో వాన కురిసింది. సాయంత్రంకల్లా మరికొన్ని ప్రాంతాల్లోనూ వర్షం పడే అవకాశం ఉంది. ఇక.. నారాయణఖేడ్, కామారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల వానలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రాత్రికల్లా.. సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రెండు, మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో రైతాంగం అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచనలు జారీ చేసింది.ఆరెంజ్ అలర్ట్జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే సూచనలున్నాయి. ఈ క్రమంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఎల్లో అలర్ట్సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.