breaking news
Funday
-
కార్తవీర్యార్జునుడి దత్తోపాసన
హైహయ వంశంలో కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. మహిష్మతీపురాన్ని రాజధానిగా చేసుకుని, ప్రజలను సుభిక్షంగా పరిపాలిస్తుండేవాడు. కృతవీర్యుడికి చాలాకాలం వరకు సంతానం కలగలేదు. మహారాణి ఎన్నెన్నో నోములు నోచింది. దానాలు చేసింది. ఏ నోము ఫలమో గాని, కొంతకాలానికి మహారాణి కడుపు పండింది. మగబిడ్డ జన్మించాడు. అయితే, ఆ మగబిడ్డకు చేతులు వైకల్యంతో ఉన్నాయి. శిశువు పరిస్థితి చూసి కృతవీర్యుడి దంపతులు దిగులు చెందారు. అయినా, లేకలేక కలిగిన సంతానం కావడంతో అల్లారు ముద్దుగా పెంచారు. అర్జునుడు అని నామకరణం చేశారు. కృతవీర్యుడి కొడుకు అయినందున కార్తవీర్యార్జునుడిగా పేరుపొందాడు. కార్తవీర్యార్జునుడికి చేతులు చచ్చుబడి ఉన్నా, శరీరం వజ్రతుల్యంగా ఉండేది. కృతవీర్యుడు కొడుకును గురుకులంలో చేర్పించాడు. గురువుల వద్ద కార్తవీర్యార్జునుడు సకల శాస్త్రాలనూ నేర్చుకున్నాడు. విద్యాభ్యాసం పూర్తయ్యే నాటికి యుక్తవయస్కుడయ్యాడు. కొడుకును యువరాజుగా పట్టాభిషేకం చేయాలని కృతవీర్యుడి కోరిక. అయితే, అవిటి చేతులవాడైన కొడుకుకు యువరాజుగా పట్టాభిషేకం జరిపిస్తే లోకులు ఏమనుకుంటారోననే సంశయం చెందాడు. సింహాసనంపై కూర్చోబెట్టిన తర్వాత కొడుకు సజావుగా పరిపాలన సాగించలేకపోతే ప్రజల ముందు తలవంపులు తలెత్తవచ్చని బెంగపెట్టుకున్నాడు. కృతవీర్యుడు ఈ బెంగతోనే కొడుకుకు పట్టాభిషేకం చేయకుండానే కన్నుమూశాడు.రాజ్యంలో అరాచకం తలెత్తకూడదనే ఉద్దేశంతో మంత్రులు, పురోహితులంతా కలసి వెళ్లి పట్టాభిషేకానికి అంగీకరించమని కార్తవీర్యార్జునుడిని కోరారు.‘మహానుభావులారా! నేను అవిటివాణ్ణి. ప్రజారక్షణ చేయలేను. ప్రజారక్షణ చేయలేనివాడు పట్టాభిషేకం జరిపించుకోవడం తగదు. రాజు రక్షణ కల్పిస్తాడనే ప్రజలు పన్నులు చెల్లిస్తారు. ప్రజల నుంచి పన్నులు తీసుకుని, వారికి ఎలాంటి రక్షణ కల్పించకుండా, సుఖభోగాలు అనుభవించేవాడు రాజు కాదు, చోరుడు అవుతాడు. మీ మాటకు తలవంచి, పట్టాభిషేకం జరిపించుకుని, పాలనా బాధ్యతలను మీపై మోపితే, నేను మీ చేతిలో కీలుబొమ్మనవుతాను. రాజ్యంలో ఇలాంటి పరిస్థితి ఉంటే, ప్రజలు నన్ను ఆడిపోసుకుంటారు. ఇరుగు పొరుగు రాజులు చులకన చేస్తారు. తెలిసి తెలిసి పాపం మూటకట్టుకోలేను. ఇప్పుడు ఈ కిరీటాన్ని మోయలేను’ అన్నాడు కార్తవీర్యార్జునుడు.మంత్రులు, పురోహితులు ఎంతగా నచ్చజెప్ప చూసినా, పట్టాభిషేకానికి కార్తవీర్యార్జునుడు ససేమిరా అంటూ తిరస్కరించాడు. ‘నేను వెళ్లి తపస్సు చేసి, రాజ్యపాలనకు తగిన అన్ని సామర్థ్యాలను సంపాదించుకుని వస్తాను. అంతవరకు సమర్థులైన మీరంతా పరిపాలన కొనసాగించండి’ అని చెప్పాడు.పురోహితుల్లో ఒకరైన గర్గముని కార్తవీర్యార్జునుడి నిర్ణయాన్ని ప్రశంసించాడు. ‘రాకుమారా! తపస్సులు ఫలించడం అంత తేలిక కాదు. వేల ఏళ్లు పట్టవచ్చు. నీకొక తేలిక మార్గం చెబుతాను, విను. సహ్యాద్రి లోయల్లో దత్తాత్రేయుడు ఆశ్రమం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాడు. అతడు సాక్షాత్తు విçష్ణ్వంశ సంభూతుడు. జంభాసురాదులు స్వర్గాన్ని ఆక్రమించినప్పుడు సాక్షాత్తు దేవేంద్రుడంతటి వాడే దత్తాత్రేయుడిని ఆశ్రయించి, కష్టాల నుంచి గట్టెక్కాడు. అందువలన నువ్వు దత్తత్రాయుడిని ఆశ్రయించు. ఆయనను ప్రసన్నం చేసుకో. నీ అభీష్టం నెరవేరగలదు’ అని చెప్పాడు.గర్గముని సలహాపై కార్తవీర్యార్జునుడు సుముహూర్తం చూసుకుని దత్తుని ఆశ్రయించడం కోసం వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. మంత్రులు, పురోహితులకు రాజ్యాన్ని అప్పగించి, వారి ఆశీస్సులు తీసుకుని సహ్యాద్రి వైపు బయలుదేరాడు. రాజలాంఛనాలన్నీ వదిలేసి, నిరాడంబర వేషంలో వెదుక్కుంటూ వెళ్లి, దత్తాశ్రమానికి చేరుకున్నాడు.కార్తవీర్యార్జునుడు ఆశ్రమంలోకి అడుగుపెట్టే సరికి దత్తాత్రేయుడు మణిమయ పీఠంపై మధువు సేవిస్తూ, మానినులతో సల్లాపాలాడుతూ ఉన్నాడు.రాజు రక్షణ కల్పిస్తాడనే ప్రజలు పన్నులు చెల్లిస్తారు. ప్రజల నుంచి పన్నులు తీసుకుని, వారికి ఎలాంటి రక్షణ కల్పించకుండా, సుఖభోగాలు అనుభవించేవాడు రాజు కాదు, చోరుడు అవుతాడు. గోత్ర నామాలు చెప్పుకుని, కార్తవీర్యార్జునుడు ఆయన ముందు సాష్టాంగపడ్డాడు. దత్తాత్రేయుడు అతడివైపు ఓరచూపు విసిరి, చిరునవ్వు చిందించాడు. స్వామి తనరాక గమనించాడని కార్తవీర్యార్జునుడు కుదుటపడ్డాడు. దత్తాత్రేయుడిని సేవించుకుంటూ, ఆశ్రమంలోనే గడపసాగాడు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు వైకల్యంగల తన చేతులతోనే దత్తాత్రేయుడు కూర్చున్న పీఠంపై శయ్యను సుఖంగా కూర్చునేందుకు వీలుగా సర్దుతున్నాడు. అదే సమయంలో దత్తాత్రేయుడి నుంచి అపాన వాయువు వెలువడింది. ఆ వాయువు వేడికి వైకల్యంగల కార్తవీర్యార్జునుడి చేతులు మాడిపోయాయి. ఆ బాధకు అతడు కుప్పకూలిపోయాడు.అది చూసి, ‘అయ్యో! ఎంతపని జరిగింది! కొండనాలుకకు మందు వేస్తే, ఉన్న నాలుక ఊడినట్లయింది కదా’ అన్నాడు దత్తాత్రేయుడు.‘స్వామీ! ఇలాంటి పరీక్షలు నువ్వు ఎన్ని పెట్టినా, నిన్నే ఆశ్రయించుకుని ఉంటాను’ అన్నాడు కార్తవీర్యార్జునుడు. అతడి భక్తికి దత్తాత్రేయుడు సంతోషించాడు. అతడికి శక్తిసంపన్నమైన సహస్రబాహువులను అనుగ్రహించాడు. -సాంఖ్యాయన -
ఆయ్! నాకేం వద్దండీ!
సచివాలయం ఆ రోజు సందడిగా ఉంది. కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టిన సీమ రెడ్డి మొదటిసారి సచివాలయానికి వచ్చారు. ఆయన చాంబర్ ముందు పెద్ద కోలాహలంగా ఉంది. బొకేలు, శాలువాలతో జనం క్యూ కట్టారు. ఒకరి తర్వాత ఒకరు మంత్రిని కలిసి శాలువ కప్పటం, బొకే అందించటం.. అన్నింటికంటే ముఖ్యంగా ఫొటోలు దిగటం చేస్తున్నారు. ఉదయం 9.45కి మొదలైన ఈ ఫొటో సెషన్ లంచ్ టైమ్ దాటినా నడుస్తూనే ఉంది. బలవంతంగా అందర్నీ కాసేపు ఆపేసి ప్యూన్ యాదగిరి చాంబర్ తలుపులేశాడు. ‘అయ్యా! ఇదంతా మామూలే. ముందు మీరు లంచ్ కానివ్వండి. మీ కోసం వచ్చిన వాళ్లు ఎంత సేపైనా ఆగుతారులెండి. మీకు వాళ్లతో పనిలేకున్నా, వాళ్లకు మీతో పని కదండి– ఆగుతారు. ఎవరికోసం ఆగుతారు’ అంటూ మంత్రిగారితో చెబుతూ టేబుల్ పైకి క్యారియర్ తెచ్చి పెట్టటం, ప్లేట్లోకి అన్ని పదార్థాలు పద్ధతిగా వడ్డించటమూ చకచకా జరిగిపోయింది. యాదగిరి మరో సంవత్సరంలో రిటైర్ కాబోతున్నాడు. ఈ సచివాలయంలోనే పనిలో చేరి, ఇక్కడే రిటైర్ కాబోతున్నాడు. ఎంతమంది మంత్రులను, వారి ఆర్భాటాలను చూసి ఉంటాడు! అనుభవంతో యాదగిరి చెప్పే మాటలు వింటూ మంత్రిగారు భోజనం చేయటం మొదలెట్టారు.సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకు మళ్లా మంత్రిగారితో ములాఖత్‌లు మొదలయ్యాయి. మళ్లీ అదే తంతు. కాకపోతే జనం కాస్త పలచబడ్డారు. యాదగిరి చూపు గుంపుకు కాస్త పక్కగా నిలబడిన ఓ వ్యక్తిపై పడింది. ఉదయం నుంచి చూస్తున్నాడు. అతను కావాలనుకుంటే అందరితోపాటే లైన్ లో వచ్చి మంత్రిని కలిసి ఉండేవాడు. లంచ్‌కు ముందే మంత్రిగారిని కలిసి ఉండేవాడు. కాని, ఎందుకనో చాలాసేపటి నుంచి అక్కడే ఉన్నాడు, క్యూ లైన్‌కు సంబంధం లేకుండా. ‘బహుశా ఏదో పెద్ద పైరవీపై వచ్చినట్టున్నాడు. మంత్రిగారిని పర్సనల్‌గా కలుసుకోవాలనుకుంటున్నాడేమో’ అని యాదగిరి ఆలోచిస్తూనే అతడిని గమనిస్తూనే ఉన్నాడు. సాయంత్రం 5 అయ్యింది. ఇక అంతా అయిపోయారు అని తెలుసుకున్న ఆ వ్యక్తి అప్పుడు కదిలాడు మంత్రిగారి చాంబర్ కేసి. చేతిలో ఓ పెద్ద బొకే, ఓ పండ్ల బుట్ట పట్టుకుని లోపలికి అడుగు పెట్టాడు. మంత్రిగారు యాదగిరి వైపు ఓసారి చూశాడు. మంత్రిగారి చూపులను ఇట్టే అర్థం చేసుకున్న యాదగిరి, ‘ఇతనొక్కరే సర్. ఇక అయిపోయారు. మీరిక రిలాక్స్ అవ్వొచ్చు‘ అన్నాడు. చివరిగా వచ్చిన అతను అందించిన బొకే తీసుకున్న మంత్రి యాదిగిరిని పిలిచి ఆ బొకేతో పాటు పండ్ల బుట్టను కూడా ఇచ్చేశాడు. అలవాటుగా మంత్రి ఫొటోకు ఫోజివ్వటానికి సిద్ధపడుతుంగా, ఆ వ్యక్తి మాట్లాడుతూ ‘అబ్బే! ఫొటోలాంటివి వద్దండి. నేను మీకు అభిమానినండి. కేవలం మిమ్మల్ని కలవటానికే వచ్చానండి’ అని అన్నాడు. మంత్రిగారి భృకుటి ముడిపడింది. అదేమిటీ అభిమానినంటాడు, ఫొటో వద్దంటాడు– సరే ఇంతకీ ఏమైనా పని కోసం వచ్చాడేమో అని ‘చెప్పండి. మీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చేస్తుంటారు?’ అన్నాడు సీమ రెడ్డి. ‘నా పేరు భాస్కర్రావండి. మాది అమలాపురమండి. మీరంటే మొదట్నుంచి అభిమానమండి. మీరు మంత్రిగా అయ్యారు కదండి. చాలా సంతోషమేసిందండి.. ఆయ్.. అందుకే ఓపాలి మిమ్మల్ని కలిసిపోదామనొచ్చానండి‘ అన్నాడు. సీమ రెడ్డి పెద్ద నిట్టూర్పు విడిచి, ‘సరేనండి.. నాకు చాలా కార్యక్రమాలున్నాయి. మరెప్పుడైనా కలుసుకుందాం, సెలవు’ అని ఓ దండం పెట్టాడు. ‘చాలా సంతోషమండి.. ఉంటానండి. ఆయ్’ అని భాస్కర్‌రావు బయటకు వెళ్లిపోయాడు. ఆ రోజు ఉదయం నుంచి ఎందరెందరో తనను కలిశారు. అందులో ఎంతోమంది ప్రముఖులున్నారు. బిజినెస్‌మన్ ఉన్నారు, తనతో పనులు చేయించుకోవటానికి ఎందరెందరో వచ్చి కలిశారు. కాని, చివర్లో వచ్చిన ఆ వ్యక్తి మాత్రం మంత్రిగారికి అలా గుర్తుండిపోయాడు.మంత్రి సీమరెడ్డి తన రొటీన్ లైఫ్‌లో పడ్డాడు. ఏదో ఒక మూల ఏదో ఒక కార్యక్రమం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సమీక్షలు, ఉపన్యాసాలు, ప్రిపరేషన్లు, నియోజకవర్గ పనులు, రాజకీయ ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టటాలు సర్వ సాధారణంగా మారింది. ఎవరెవరో వస్తున్నారు. వాళ్ల పనుల గురించి పైరవీలు చేసుకుంటున్నారు. అడపాదడపా ఆ రోజు చివర్లో వచ్చిన భాస్కర్‌రావు కూడా తన చాంబర్‌కు వస్తూ పోతున్నాడు. వచ్చిన ప్రతిసారి తన కోసం ఏదో ఒకటి తెచ్చి ఇచ్చి పోతున్నాడు తప్పితే, పల్లెత్తి ఒక్క పని కూడా అడగటం లేదు. ‘ఎందుకయ్యా ఇవన్నీ’ అంటే, ‘ఏదో నా అభిమానమండి’ అని మాత్రమే అంటాడు. ఏమిటో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ఈ రోజుల్లో అని మంత్రి అప్పుడప్పుడు యాదగిరితో అంటూనే ఉన్నాడు. ఎంతోమందిని చూసిన యాదగిరికి కూడా ఈ భాస్కర్‌రావు వైఖరి అసలు అంతుపట్టడం లేదు. ఏదో ఒక పని లేకుండా అన్నేసి సార్లు మంత్రిగారిని ఎందుకు కలుస్తున్నాడు. నోరు తెరిచి అడిగినా ‘అబ్బే! ఏం లేదండి’ అంటాడు. చాలా విచిత్రమైన కేసు ఇది అని యాదగిరి ఎన్నోసార్లు బుర్ర గోక్కుంటూనే ఉన్నాడు. ఇలా ఓ సంవత్సరం గడిచింది. ఈ మధ్య కాలంలో ఓ వందసార్లు అయినా భాస్కర్‌రావు మంత్రిగారిని కలవటానికి వచ్చి ఉంటాడు. వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి తెస్తాడు. ఏమన్నా అంటే, ‘ఇది మా పొలంలో పండింది’ అంటాడు. ‘ఇది మా ఏరియాలో ఫేమస్సు’ అంటాడు. ‘ఎందుకయ్యా’ అంటే, ‘అభిమానమండి’ అంటాడు తప్ప పనులేమీ అడగడు. ఈ తంతు ఎక్కడి దాకా పోయిందంటే, మంత్రిగారిని డిఫెన్ ్సలో పడేసే వరకూ వెళ్లింది వ్యవహారం. అరె ఇంత అభిమానం చూపిస్తున్న ఇతనికి ఏదో ఒక సాయం చేయాల్సిందే అని గట్టిగా నిర్ణయించుకున్నాడు సీమరెడ్డి.ఎప్పటిలాగే ఓ రోజు సీమరెడ్డి చాంబర్‌కు వచ్చాడు భాస్కర్‌రావు. ఆ రోజు యాదగిరి కూడా ఏదో పని ఉందని సెలవు పెట్టాడు. సీమ రెడ్డి ఒక్కడే చాంబర్లో ఉన్నాడు. బయట సెక్యూరిటీ గార్డ్స్‌కు బాగా పరిచయమున్న ఫేస్ కావటంతో భాస్కర్‌రావును ఎవరూ అడ్డుకోలేదు. పైగా ‘వెళ్ళండి వెళ్లండి మంత్రిగారు ఒక్కరే ఉన్నారు’ అంటూ అతనికి స్వాగతం పలికారు. భాస్కర్‌రావు మీద వారికి ఎందుకంత అభిమానమంటే వస్తూ పోతూ వీళ్లకు కావాల్సినవేవో భాస్కర్‌రావు మొహమాట పెట్టి మరీ ఇచ్చి పోతుంటాడు మరి. ఎప్పటి లాగే మంత్రిగారి గదిలోకి అడుగు పెట్టాడు భాస్కర్‌రావు. ‘రండి.. రండి భాస్కర్. ఏమిటీ ఇవాళేం తెచ్చావు నాకోసం’ అంటూ సీమరెడ్డి అతని చేతిలోని లగేజీ వైపు చూశాడు. ‘మీకు తెలీందేముందండి... మా ఏరియాలో పూతరేకులకు బాగా ఫేమస్ ఆత్రేయపురం. నిన్న ఏదో ఫంక్షన్ ఉండి వెళ్లాను. ఎలాగూ అంతదూరం వెళ్లాను కదా.. తమరి కోసం మంచినెయ్యి దట్టంగా వేయించి మరీ డ్రైఫ్రూట్స్‌తో ప్రత్యేకంగా తయారు చేయించానండి. ఎలాగూ హైదరాబాద్ వస్తున్నా కదాని పట్టుకొచ్చానండి’ అన్నాడు భాస్కర్‌రావు. అతని బ్యాగ్‌లోంచి బాక్స్‌లు బయటకు తీస్తుంటేనే కమ్మటి నెయ్యి వాసన ఆ రూమ్ అంతా పరుచుకుంది. ఆ వాసనకే మంత్రిగారు అదోలా అయిపోయారు. ఎప్పుడెప్పుడు బాక్స్ ఓపన్ చేసి ఒకటి నోట్లో వేసుకుందామా అని ఆశగా చూస్తున్నాడు సీమరెడ్డి. ఇవేమీ పెద్దగా పట్టించుకోనట్టు కనిపిస్తూనే బాక్స్ ఓపెన్ చేసి మంత్రిగారి ముందు పెట్టేశాడు. తన మనసులో అంశాన్ని పసిగట్టి ఆచరణలో పెట్టిన భాస్కర్‌రావు కుశాగ్రబుద్ధికి మెచ్చుకోలుగా చూశాడు సీమరెడ్డి. ఆత్రంగా ఆత్రేయపురం పూతరేకును ఆబగా నోట్లో పెట్టేసుకున్నాడు. నోటికి తగలగానే కరిగిపోతూ అద్భుతమైన జిహ్వచాపల్యాన్ని తీర్చిన ఆ పూతరేకులపై, అవి తెచ్చిన భాస్కర్‌రావుపై అవ్యాజ్యమైన ప్రేమ పుట్టుకొచ్చింది సీమరెడ్డికి. కాసేపటికి కాన్షియస్లోకి వచ్చిన సీమ రెడ్డి సభ్యత కాదని మూతి తుడుచుకుని ‘కూచోబ్బా! భాస్కర్రావూ’ అంటూ కుర్చీ చూపించాడు. ఎంతో వినయంగా మంత్రి ఎదురుగా ఉండే కుర్చీలో కూర్చున్నాడు భాస్కర్‌రావు. ‘కాదబ్బా భాస్కర్.. నేనొకటి అడుగుతా.. నీవు గమ్మున ఒప్పుకోవాలి. లేదంటే నా మీద ఒట్టే!’ అన్నాడు సీమరెడ్డి. మంత్రిగారి స్పందనను ముందే ఊహించినా, అదేమీ తన ముఖంపై ప్రతిబింబించకుండా జాగ్రత్త పడ్డాడు భాస్కర్‌రావు. ‘ఆయ్! ఎంత మాటండి.. మీరు అడగటమూ, నేనూ ఒప్పుకోకపోవటమా! అన్నన్నా! అదెలాగ కుదురుతుందండి‘ అన్నాడు. ‘మరేం లేదబ్బా! ఎప్పటి నుంచో నా కాడకు వస్తుండావు. ఎప్పడడిగినా ఏమీ లేదంటావు.. ఒప్పుకుంటాలే గానీ. నీకేదో సాయం చేయకపోతే నాకేదోలాగుందయ్యా! ఏ పని అయినా సరే కోరుకో.. నీ కోసం రూల్స్ గీల్స్ అన్నీ పక్కన పెట్టి చేస్తానయ్యా!’ అని ఓ రకంగా బతిమాలేలా అన్నాడు సీమరెడ్డి. నిజానికి సీమరెడ్డికి ఉండే పొగరుకు ఇలాంటి మాటలు ఆయన నోటి వెంట రావటం ఆశ్చర్యమే! తప్పలేదు. ఎందుకంటే ఈ భాస్కర్‌రావు గత కొన్నాళ్లుగా తనను మానసికంగా బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ప్రతిఫలం ఆశించకుండా ఓ మంత్రిగారిని ఇన్నేసిసార్లు కలుసుకోవడమేంది? వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి ఇచ్చిపోతా ఉంటాడు. ఇవ్వటానికి ఆయనకు మనసున్నా, ఉట్టినే తీసుకోవటానికి నాకెట్లా కుదురుతుంది? అసలే సీమకు చెందినోడ్ని. ఉపకారం చేయకుండా ఎట్లా ఉంటా? గత కొన్ని రోజులుగా సీమరెడ్డిని తీవ్రంగా వేధిస్తున్న ప్రశ్నలివి. దీనికి ముగింపు పలకటానికే ఇవాళ సిద్ధమయ్యాడు. అందుకే అతని గొంతులో ఏనాడూ లేని బేలతనం ఉట్టిపడింది.సరే.. ఇక చెప్పే టైమ్ వచ్చేసిందని గుర్తించిన భాస్కర్‌రావు తన మనసులోని మాటను ఇలా బయటపెట్టాడు.. ‘మీ పెద్ద మనసుకు చాలా ధన్యవాదాలండీ. ఆయ్.. మీరింత మంచోళ్లను నేను ఎక్కడా చూడలేదండి. అందుకే మీరంటే ప్రత్యేక అభిమానమండి. మరేం లేదండి.. మీరింతగా అడుగుతున్నారు కాబట్టి నాకొక పని చేసిపెట్టండి. ప్రభుత్వం మా ఊర్లో కొత్తగా ఆర్టీసీ బస్టాండు, డిపో కూడా పెడతామని నిర్ణయించింది కదండి. అందుకు భూమి కూడా సేకరిస్తున్నారని తెలిసింది. ఆ ఊరిలో పుట్టి పెరిగిన వాడిగా ఊరిమీది మమకారంతో చెబుతున్నానండి. ఊర్లో ఎక్కడా బస్టాండ్, డిపో పెట్టకండి. కాస్త దూరంగా పెడితే మా ఊరు కూడా పెరిగి విస్తరిస్తుందండి. ఇదొక్కటే నాకోసం... కాదు కాదు... మా ఊరి కోసం చేయండి’ అన్నాడు భాస్కర్‌రావు. భాస్కర్‌రావు కోరిక విన్నాక సీమరెడ్డికి నిజంగానే మతిపోయింది. ఈ రోజుల్లో కూడా ఊరికి ఉపకారం చేసే మనుషులున్నారా? తాను విన్నది నిజమేనా అని ఓసారి గిల్లి కూడా చూసుకున్నాడు. చురుక్కుమనటంతో నిజమే అని నమ్మాల్సి వచ్చింది సీమరెడ్డికి. ఎందుకనో ఆ క్షణం సీమరెడ్డికి భాస్కర్‌రావు పిచ్చిపిచ్చిగా నచ్చాడు. ‘సరే! అబ్బా.. నీ మాట ప్రకారమే ఊరి బయట బస్టాండ్, డిపో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటా, కాకపోతే నీవు ఆ ఊరివాడివే కాబట్టి.. అనువైన స్థలమేదో కూడా నీవే చూసి పెట్టాలబ్బా!’ అన్నాడు సీమరెడ్డి. ‘ఆయ్! అదెంత పనండి... నేనుండేది అందుకే గాదండీ... మీరు చెప్పారు కదాండి... అది చాలండి. ఫలానా దిక్కున నాకు తెలిసిన పోరంబోకు భూమి ఉందండి. కాస్త దూరమైనా ఓసారి బస్టాండ్, డిపో వస్తే అదే డెవలప్ అయిపోతుందండి’... అని మంత్రిగారిని ఊరి బయట బస్టాండ్, డిపో నిర్మాణానికి ఒప్పించాడు భాస్కర్‌రావు. తన మనస్సులో ఏదో పెద్ద బరువు దిగిపోయినట్టు దీర్ఘంగా నిట్టూర్చాడు సీమరెడ్డి. ఆ రోజు అమలాపురంలో కొత్తగా కట్టిన ఆర్టీసీ బస్టాండ్, డిపో రెండింటికి ప్రారంభోత్సవం, మంత్రి సీమరెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం, అంగరంగ వైభవంగా కార్యక్రమం జరిగింది. రెట్టించిన ఉత్సాహంతో మంత్రిగారు భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రసంగించి వెళ్లిపోయారు. అంతా సవ్యంగా జరిగింది. ఇచ్చిన హామీని నెరవేర్చిన మంత్రిగారు హ్యాపీ. తమ ఊరికి కొత్త బస్టాండ్, డిపో కూడా రావటంతో ఊరి జనమంతా హ్యాపీ. వీళ్లందరికన్నా ఎన్నో రెట్లు సంతోషపడిన వాడు భాస్కర్‌రావు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా కట్టిన బస్టాండ్, డిపో ఊరికి చాలా దూరంలో ఉండి, ఏ డిమాండ్ లేక పడి ఉన్న భాస్కర్‌రావు పొలాల పక్కనే ఉండటం. ఇన్నాళ్లు తొండలు గుడ్లు పెట్టిన తన భూమికి ఎక్కడ లేని డిమాండ్ రావటంతో భాస్కర్‌రావు ఒక్కసారిగా ఆ ఊరిలో బిగ్ షాట్ అయిపోయాడు. నిన్నా మొన్నటి వరకు ఊర్లో ఎవరికీ పెద్దగా తెలీని భాస్కర్‌రావు– ఇవ్వాళ భాస్కరావు గారు, పైగా ఉపన్యాసంలో మంత్రిగారు స్వయంగా భాస్కర్‌రావు పేరు పదే పదే పలవరించటం, ఊరి మీద భాస్కర్‌రావుకు ఉన్న ప్రేమను పొగడటం ఒక్కసారిగా ఊళ్లో భాస్కర్‌రావు క్రేజ్ పెంచింది. దీనికి తోడు పెద్దగా సంపాదన లేని భాస్కర్‌రావు నేడు కోటాను కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదంతా సాధించటానికి ఇతను ఖర్చు చేసింది ఓ సంవత్సరం సమయం, అడపాదడపా రాజధానికి వెళ్లి మంత్రిగారిని కలిసి రావటానికి పెట్టిన ఖర్చు, పెట్టిపోతలు, రవాణా, ఇతరత్రా ఖర్చులన్నీ లెక్కేస్తే 50 వేలు కూడా అవ్వలేదు. కానీ లౌక్యంగా పని చక్కబెట్టుకురావడంతో 50 వేల పెట్టుబడికి కోట్లు రాబట్టాడు, వెలకట్టలేని రాజకీయ పలుకుబడి సాధించాడు. అందుకే అంటారు ఉపాయం లేని వాణ్ణి ఊళ్లోంచి వెళ్లగొట్టాలని. బహుశా భాస్కర్రావులాంటి వారిని చూసే ఈ సామెత కనిపెట్టారనిపిస్తుంది.‘కాదబ్బా భాస్కర్.. నేనొకటి అడుగుతా.. నీవు గమ్మున ఒప్పుకోవాలి. లేదంటే నా మీద ఒట్టే!’ అన్నాడు సీమరెడ్డి. మంత్రిగారి స్పందనను ముందే ఊహించినా, అదేమీ తన ముఖంపై ప్రతిబింబించకుండా జాగ్రత్త పడ్డాడు భాస్కర్‌రావు.నిన్నా మొన్నటి వరకు ఊర్లో ఎవరికీ పెద్దగా తెలీని భాస్కర్‌రావు– ఇవ్వాళ భాస్కరావు గారు, పైగా ఉపన్యాసంలో మంత్రిగారు స్వయంగా భాస్కర్‌రావు పేరు పదే పదే పలవరించటం, ఊరి మీద భాస్కర్‌రావుకు ఉన్న ప్రేమను పొగడటం ఒక్కసారిగా ఊళ్లో భాస్కర్‌రావు క్రేజ్ పెంచింది. -
వైబ్ వావ్!
ఒకేసారి సాధారణ గది, సాధారణ కేక్, సాధారణ ఫ్రెండ్స్ కూడా ఈ గాడ్జెట్స్‌తో ఒక ఫ్లాషింగ్ ఫ్యాంటసీ వరల్డ్‌లోకి మారతాయి. అవే ఈ గాడ్జెట్స్ మ్యాజిక్!కూల్ పార్టీ!సింగిల్ బటన్ తో గది మొత్తం పార్టీ వైబ్‌లోకి మారిపోతుంది అంటే నమ్ముతారా? అదే పీ–ట్రాన్ఫ్యూజన్ బ్లూటూత్ స్పీకర్ మ్యాజిక్! ఒకేసారి లైట్లు, మ్యూజిక్ అన్నీ ఫుల్ ఫన్ . చిన్న సైజ్, పెద్ద శబ్దం. వైర్లెస్ కరవోకే మైక్‌తో పాట పాడితే మీ వాయిస్ స్పష్టంగా, గట్టిగా వినిపిస్తుంది. ఫన్నీ వాయిస్ ఎఫెక్ట్స్‌తో స్మైల్ మోస్ట్ ఫన్! రంగురంగుల లైట్లు బీట్‌కు ట్యున్ అవుతూ గేమ్ మూడ్‌లోకి లాగేస్తాయి. సింగిల్ చార్జ్‌తో ఆరు గంటల నాన్ స్టాప్ మ్యూజిక్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆటో ప్లే మోడ్ సపోర్ట్. చిన్న బటన్లు, మల్టీ ఫంక్షన్. ఇలా ఏ ప్లేస్‌లోనైనా పార్టీ మూడ్‌ను సెట్ చేసే మాస్టర్! ధర రూ. 1,499 మాత్రమే!.స్పిరిట్ స్టార్ట్! ఐస్.. గ్లాస్లో వేస్తే కూల్ మాత్రమే కాదు, ఇప్పుడు కూల్ పార్టీ స్టార్లా కూడా మారిపోతుంది. ఎందుకంటే, ‘మల్టీకలర్ ఐస్ క్యూబ్స్’ రంగు రంగుల మహిమాన్విత రత్నాల్లా కనిపిస్తాయి. కాని, ఇవి గ్లాస్లో పడిన క్షణం నుంచే నీ డ్రింక్ ‘నేను మెరిసిపోతున్నా!’ అని లైట్స్‌తో చూపులను లాగేసుకుంటుంది. ఒక్క బటన్ నొక్కితే ఇంద్రధనుస్సులోని రంగులన్నీ కలసి ఒకేసారి డాన్స్ చేస్తాయి! స్టెడీ లైట్ కావాలా, డీజే ఫ్లాష్ మోడ్ కావాలా? మూడ్ ఏదైనా, ఈ చిన్న క్యూబ్స్ వెంటనే అర్థం చేసుకుని రంగులు మార్చేస్తాయి. ఐస్‌లో వేసినా, నీటిలో వేసినా వెలుగుతూనే ఉంటాయి. ప్రతి క్యూబ్ పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది గంటలు పనిచేస్తుంది. ఒకసారి కొనుక్కుంటే రెండు, మూడు పార్టీలను ఈజీగా మెరిపిస్తాయి. ధర రూ. 2,680 మాత్రమే!పాన్ చాట్కావలసినవి: తమలపాకులు – 10పైనే, శనగపిండి– అరకప్పు నూనె, నీళ్లు, ఉప్పు– సరిపడా, పసుపు – కొద్దిగాకారం– ఒక టీ స్పూన్ , ఆమ్చూర్, ధనియాలు జీలకర్ర పొడి– అర టీస్పూన్, గడ్డ పెరుగు – ఒక కప్పు, పంచదార – ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా – ఒక టీస్పూన్ , కొత్తిమీర చట్నీ లేదా చింతపండు చట్నీ – కొద్దికొద్దిగా, కారప్పూస, దానిమ్మగింజలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము – కొద్దికొద్దిగాతయారీ: ముందుగా ఒక బౌల్లో శనగపిండి, పసుపు, కారం, కొద్దిగా ఉప్పు, ఆమ్చూర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్‌లో తమలపాకులు ముంచి, నూనెలో దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు పెరుగులో పంచదార, గరం మసాలా వేసి బాగా కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక్కో తమలపాకు వడమీద కొద్దికొద్దిగా పెరుగు మిశ్రమాన్ని, కొత్తిమీర చట్నీ లేదా చింతపండు చట్నీ వంటివి వేసుకోవాలి. ఆపైన కారప్పూస, దానిమ్మ గింజలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుముతో మరిన్ని నచ్చినవి జల్లుకుని సర్వ్ చేసుకుంటే, ఈ పాన్ చాట్ భలే రుచిగా ఉంటుంది.వెలుగుల బుడగలు!బెలూన్స్ అంటేనే పార్టీ మోడ్ ఆన్ ! ఇప్పుడు ఆ మజా మరింత మెరిసేలా మార్చడానికి వచ్చేశాయి ‘పార్టీ ప్రాప్స్ ఎల్ఈడీ బెలూన్స్’. ఒక్క సెట్లో ఇరవై ఐదు బెలూన్స్, ప్రతి ఒక్కటి రంగురంగుల లైట్స్‌తో మెరిసి, వేడుకకు రాక్‌స్టార్ ఎఫెక్ట్ ఇస్తాయి. చిన్నపిల్లల పుట్టినరోజు, ప్రేమికుల వార్షికోత్సవం, ఫ్రెండ్స్ కలిసిన సందర్భం ఇలా ఏదైనా వీటి రాకతో, చిన్న ఫ్యాంటసీ వరల్డ్ క్రియేట్ అయిపోతుంది. అన్నింటినీ సెట్ చేసి, కేవలం ఒక్క స్విచ్ నొక్కితే చాలు, బెలూన్స్లోని లైట్స్ ఆన్ అయి, వెలుగుల పండుగను ప్రారంభిస్తాయి. ఉపయోగించడం సులభం. ధర రూ. 397 మాత్రమే!ఐస్ క్రీమ్ బర్గర్కావలసినవి: బన్స్ – 2 లేదా 4, ఐస్‌క్రీమ్ – 4 లేదా 8 స్కూప్స్ (వీటిని సర్వ్ చేసుకునే ముందే ఫ్రిజ్‌లోంచి బయటికి తియ్యాలి, వెనీలా, చాక్లెట్, స్ట్రాబెర్రీ వంటి ఫ్లేవర్స్ ఎంచుకోవచ్చు), పీనట్ బటర్ – 2 లేదా 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి, బాదం, జీడిపప్పు – కొద్దికొద్దిగా (దోరగా నేతిలో వేయించి చిన్నచిన్నగా కట్ చేసుకోవాలి)తయారీ: ముందుగా బన్స్‌ని మధ్యలోకి సమాంతరంగా కట్ చేసి ఓవెన్ లో నేతితో బేక్ చేసుకోవాలి. అనంతరం లోపలవైపు పీనట్ బటర్ పూసుకుని, నేతిలో వేయించిన జీడిపప్పు, బాదం జల్లుకుని, రెండేసి బన్స్ ముక్కలు తీసుకుని, వాటి మధ్యలో ఐస్ క్రీమ్ స్కూప్స్ పెట్టుకోవాలి. నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఈ బర్గర్స్ చాలా టేస్టీగా ఉంటాయి.అరటిపువ్వు సమోసాకావలసినవి: అరటి పువ్వు– ఒక కప్పు (కచ్చా బిచ్చా కట్ చేసుకుని–మసాలా, ఉప్పు వేసి, ఆవిరిపై మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి), క్యారట్ తురుము – పావు కప్పు, కొబ్బరి తురుము–పావు కప్పు సోయా సాస్, టొమాటో సాస్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్ల చొప్పున, గోధుమ పిండి – 2 కప్పులు, మైదా పిండి – ఒక కప్పు మిరియాల పొడి – 1 టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – సరిపడాతయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో క్యారట్ తురుము, కొబ్బరి తురుము, మిరియాల పొడి, అరటి పువ్వు ముక్కలు, సోయా సాస్, టొమాటో సాస్, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్లో మైదా పిండి, గోధుమ పిండి, అర టేబుల్ స్పూన్ నూనె, కొద్దిగా ఉప్పు వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ చపాతీ ముద్దలా చేసుకోవాలి. అనంతరం ఆ ముద్దపైన తడిబట్ట కప్పి, అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని, ఆ ఉండల్ని చపాతీలా ఒత్తి, సమోసాలా చుట్టి అందులో అరటి పువ్వుల మిశ్రమాన్ని పెట్టి, ఊడిపోకుండా ఫోల్డ్ చేసుకోవాలి. వాటిని కాగిన నూనెలో వేయించి తీస్తే సరిపోతుంది. -
191 ఎట్ 52!
అతడి పేరు మహ్మద్ సలీం... మారుపేరు సునీల్‌శెట్టి... సొంత దుకాణం నుంచే చోరీలు ప్రారంభించాడు. 52 ఏళ్ల వయస్సున్న ఇతగాడు 34 ఏళ్ల నేర ప్రస్థానంలో 191 చోరీలు చేశాడు... ఇప్పటివరకు 26 సార్లు పోలీసులకు చిక్కి కటకటాల్లోకి వెళ్లాడు... ‘పీడీ’కి దొరక్కుండా జాగ్రత్తపడుతున్న ఇతగాడిని హైదరాబాద్‌లోని బండ్లగూడ పోలీసులు డిసెంబర్ 2న మరోసారి పట్టుకున్నారు. చోరీల ద్వారా వచ్చిన సొమ్మును ఇతగాడు ఉత్తరాదిలో జల్సాలతో పాటు హెలీటూరిజానికి వెచ్చిస్తుంటాడు. హైదరాబాద్‌లోని ఫతేదర్వాజా సమీపంలో ఉన్న కుమ్మరివాడికి చెందిన సలీం పూర్తి నిరక్షరాస్యుడు. బతుకుతెరువు కోసం తొలినాళ్లల్లో కిరోసిన్ లాంతర్లు తయారు చేసే కర్మాగారంలో పనివాడిగా చేరాడు. ఆపై తన తండ్రి నిర్వహిస్తున్న కిరాణా దుకాణంలోనే పని చేయడం మొదలెట్టాడు. ఇలా తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్న సలీంకు 16వ ఏట ఓ అమ్మాయితో పరిచయమైంది. అక్కడ నుంచి అతడి జీవితం మలుపులు తిరగడం మొదలైంది. ఈ పరిచయం కాస్తా కొన్నాళ్లకు ప్రేమకు దారి తీసింది. ఆమెతో కలిసి షికార్లు చేయడానికి అవసరమైన ఖర్చుల కోసం చోరుడిగా మారాడు. తొలుత తమ దుకాణంలోనే చిన్న చిన్న చోరీలు చేయడం మొదలెట్టాడు. కొన్నాళ్లు గుట్టుగానే సాగినా, చిరవకు విషయం బయటకు పొక్కేసరికి ఇల్లు వదిలి పారిపోవాల్సి వచ్చింది. దీంతో గత్యంతరం లేక చాదర్‌ఘాట్‌లోని ఓ హోటల్లో కార్మికుడిగా చేరాడు. ఈ పని చేస్తూనే అవకాశం చిక్కినప్పుడల్లా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న గృహోపకరణాలు తస్కరించేవాడు. 1991లో ఇతడి 18వ ఏట ఇత్తడి వస్తువుల చోరీ కేసులో తొలిసారిగా చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. జైల్లో పరిచయమైన ‘సీనియర్ల’ వద్ద తాళాలు పగులకొట్టడంతో మెలకువలు నేర్చుకున్నాడు. ఈ చోరుడు ప్రధానంగా పాతబస్తీలోని ఓ వర్గానికి చెందిన వారి ఇళ్లనే టార్గెట్‌గా చేసుకునేవాడు. అందుకే గడిచిన మూడుసార్లూ బండ్లగూడ పోలీసుస్టేషన్లో నమోదైన కేసుల్లోనే అరెస్టు అయ్యాడు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు సాధారణంగా తెల్లవారుజాము 3 గంటల వరకు మెలకువగానే ఉంటారు. అందుకే ఇతగాడు తెల్లవారుజాము 4 గంటల తర్వాతే రంగంలోకి దిగుతాడు. అప్పటి వరకు నిద్రరాకుండా ఉండేందుకు తన స్మార్ట్‌ఫోన్‌లో లూడో, క్రికెట్ ఆడుతూ టైమ్‌పాస్ చేస్తాడు. చిన్న టార్చ్‌లైట్, కటింగ్ ప్లేయర్‌తో ఫీల్డ్‌లోకి వచ్చే ఇతగాడు ప్రధానంగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన ఇళ్లనే ఎంచుకుంటాడు. తాళం వేసున్న ఇంటిని టార్గెట్ చేసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ పగులకొట్టడు. గోడ దూకి సజ్జ ద్వారా ఇంటి పైకి చేరతాడు. అక్కడ నుంచి ఇంట్లోకి చేరే మార్గం వెతుక్కుని ప్రవేశిస్తాడు. ఇతగాడు చోరీ చేసే సమయంలో పెట్రోలింగ్ వాహనాలు ఆ ప్రాంతానికి వచ్చినా ఇంటి తాళం యథాతథంగా ఉండటంతో వారు ఆ ఇంటిపై దృష్టిపెట్టరనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటాడు. టార్గెట్ చేసిన ఇంటి లోపలకు వెళ్లాక అక్కడ దొరికే చెంచాలు తదితరాలతోనే అల్మారాలు పగులకొట్టి సొత్తు స్వాహా చేస్తాడు. ఇతగాడు 1998లో ముగ్గురు సంతానం ఉన్న ఓ వితంతువును వివాహం చేసుకున్నాడు. సునీల్‌శెట్టి ప్రస్తుతం ఏడుగురి పిల్లలకు తండ్రి. ఈ సొత్తు విక్రయించగా వచ్చిన సొమ్ముతో ముంబై, అజ్మీర్ సహా ఉత్తరాదిలో జల్సాలు చేస్తుంటాడు. సైట్ సీయింగ్‌తో పాటు హెలీకాఫ్టర్లో సంచరించే హెలీటూరిజం కోసం భారీగా ఖర్చు చేస్తాడు. సెక్స్‌వర్కర్ల వద్దకు వెళ్ళే అలవాటు ఉన్న సలీం ఓసారి రూ.12 లక్షల చోరీ సొత్తుతో ముంబైలోని ఓ మహిళ వద్దకు వెళ్లాడు. ఇతడు నిద్రపోతున్న సమయంలో ఆ సొత్తు కాజేసిన ఆమె అక్కడ నుంచి ఉడాయించింది. బాలీవుడ్ నటుడు సునీల్‌శెట్టి అంటే అమితంగా ఇష్టపడే సలీం తన పేరునూ అలానే మార్చుకున్నాడు. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆ హీరో ఇంటి వద్దకు అనేకసార్లు వెళ్లినా కలవడం సాధ్యం కాలేదు. ఇప్పటి వరకు 191 నేరాలు చేసి 26 సార్లు అరెస్టు అయినా, శిక్షలు పూర్తయ్యే వరకు జైలు నుంచి బయటకు రాని నేపథ్యంలోనే ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగం అనేక సందర్భాల్లో సాధ్యం కాలేదు. పోలీసులకు చిక్కిన ప్రతిసారీ ఐదారు చోరీలు అంగీకరిస్తున్నా, ఇన్నేళ్లల్లో కేవలం రెండుసార్లే ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగం సాధ్యమైంది. -
అంతరించింది అనుకుంటే.. అంతలోనే కనిపించింది
అడవుల్లో ఇంకా ఎన్నో రహస్యాలు, ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయని మరోసారి నిరూపించింది ఒక చిన్న ప్రాణి. గత మూడు దశాబ్దాలుగా కనుమరుగైందనుకున్న ‘మౌస్ డీర్’, మళ్లీ అడవిలో నడుస్తూ కనిపించింది. ఇటీవలి రోజుల్లో వియత్నాం అడవుల్లో శాస్త్రవేత్తలు దీనిని కెమెరాల్లో గుర్తించారు. ముప్పై ఏళ్లుగా దాని జాడ కనిపించకపోవడంతో, శాస్త్రీయ రికార్డుల్లో ఏ ఆధారమూ లేకపోవడంతో, ఇది పూర్తిగా అంతరించిపోయిందని అందరూ నమ్మేశారు. కాని ప్రకృతి ఎప్పుడూ తన ప్రణాళికలను చివరి నిమిషంలోనే బయటపెడుతుంది. అన్నట్లు, అలా ఒక్కసారిగా సర్ప్రైజ్లా ప్రత్యక్షమైంది ఈ చిన్న జీవి. ప్రపంచంలోనే అతి చిన్న కాళ్లున్న, గొర్రెల కుటుంబానికి చెందిన ఈ మౌస్ డీర్ బరువు పది కిలోలు. అడవుల లోతుల్లో, వెలుగుకు దూరంగా జీవించే స్వభావం వల్ల దీని ఉనికి తెలుసుకోవడం అంత సులువు కాదు. అందుకే ఇన్ని ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించడమే ఒక అరుదైన అద్భుతం. -
స్టార్ స్టయిల్..!
ప్రతిరోజూ ఫ్యాషన్‌లో ఒక చిన్న అడ్వెంచర్! అదితిరావు స్టేట్మెంట్ యిల్! ఇందుకోసం, తను ఫాలో *అయ్యే చిన్న చిన్న స్టయిల్ హ్యాక్స్, స్పార్కింగ్ టిప్స్ ఏంటో ఇక్కడ చూడండి!కొత్త ఆభరణాలు, కొత్త లుక్స్ ఇవన్నీ ప్రయత్నించడానికి నేను ఎప్పుడూ వెనుకాడను. ఫ్యాషన్‌లో కొత్తదనం భయాన్ని కాకుండా, ఉత్సాహాన్ని ఇస్తుంది. నిజమైన మెరుపు ఆభరణాల్లో కాదు, వాటిని ధరించే మన వైబ్‌లోనే ఉంటుంది.– అదితిరావు హైదరీజుంకాల మ్యాజిక్!చెవులకు వేసుకునే ఆభరణాల్లో ఎన్నో రకాలున్నా, సంప్రదాయ అందాన్ని క్లాసీగా చూపించడంలో ఆక్సిడైజ్డ్ జుంకాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా పెద్ద డోమ్ ఆకారంలో మెరిసే ఈ జుంకాలు, మొత్తం లుక్‌ను మరింత అందంగా మార్చేస్తాయి. ఎక్కువగా ఇలాంటి జుంకాలు రంగురంగుల దారాలు, మిర్రర్ వర్క్‌తో ఉండే కుర్తాలు, డీప్ జ్యూల్ టోన్స్లో ఉన్న అనార్కలీలకు అద్భుతంగా సరిపోతాయి. కళ్లకు సాఫ్ట్ కాజల్, నేచురల్ మేకప్, చిన్న బొట్టు ఇవన్నీ కలిస్తే ఆభరణాల అందం మరింత మెరిసిపోతుంది. హెయిర్ స్టయిల్ సింపుల్‌గా వదిలి, మెడను బోసిగా ఉంచడం చాలా ముఖ్యం, అప్పుడే ఈ జుంకాలు హైలైట్ అవుతాయి. చేతులకు దుస్తుల రంగులకు తగ్గట్టు బీడెడ్ బ్రేస్లెట్లు లేదా చిన్న ట్రెడిషనల్ గాజులు వేసుకుంటే మొత్తం స్టయిల్‌కు కలర్‌ఫుల్ టచ్ వస్తుంది. ఫెస్టివల్స్, ఫ్యామిలీ ఫంక్ష¯Œ ్స, కల్చరల్ ఈవెంట్స్ ఇలా ఎక్కడైనా ఇలాంటి జుంకాలు వేసుకుంటే, మీరు ప్రత్యేకంగా కనిపించడం ఖాయం!∙దీపిక కొండి -
నోటిఫికేషన్లతో కెరీర్ డేమేజ్
అర్ధరాత్రి సరిగ్గా 2:17 గంటలకు అర్చనకు టీమ్స్ నోటిఫికేషన్ వచ్చింది. కళ్లు తెరవాలనిపించలేదు. కానీ ఏం నోటిఫికేషన్ వచ్చిందో వెంటనే చెక్ చేయమని మెదడు అరుస్తోంది. మెదడే నెగ్గింది. అర్చన స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసింది. ‘Tomorrow's Deck Updated’’ అని నోటిఫికేషన్ కనిపించింది. నిద్ర ఎగిరిపోయింది. ఇది కేవలం అర్చన కథ కాదు. ప్రతి నగరంలో, ప్రతి కంపెనీలో వేలాది మంది ప్రొఫెషనల్స్ ఇలా ఫోన్ నోటిఫికేషన్ శబ్దాలకు నిద్రను కోల్పోతున్నారు. చూడ్డానికి ఇది చిన్న డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. కానీ దాని ప్రభావం వృత్తి, వ్యక్తిత్వం, మానసిక ప్రశాంతత... ఇలా అన్నిటిపై పడుతుంది. ఫోన్ నోటిఫికేషన్లు మన జీవితం మీద చేస్తున్న దాడులు కేవలం శబ్దాల దాడులు కావు. అవి మైక్రో–బ్రెయిన్ హిట్స్. ప్రతి పింగ్ ఒక చిన్న ఒత్తిడి. ప్రతి చిన్న ఒత్తిడి ఒక పెద్ద డిస్టర్బెన్స్. ప్రతి డిస్టర్బెన్స్ చివరకు బర్న్ఔట్కు దారితీస్తుంది. సైన చెప్పే అసలు నిజం...మన మెదడు ఏ పని మీదైనా ఫోకస్ పెట్టగలిగే సమయం సుమారు 8 నుంచి 12 నిమిషాలు మాత్రమే. ఆ సమయంలో దానికి విఘాతం కలిగితే తిరిగి ఫోకస్ రావడానికి 23 నిమిషాలు పడుతుందని బ్రెయిన్ సైంటిస్టులు చెప్తున్నారు. ఉద్యోగులకు రోజుకు వచ్చే నోటిఫికేషన్ల సంఖ్య: వాట్సప్–120, ఈమెయిల్ అలర్ట్స్–40–100, టీమ్స్ 85–150, కేలండర్ పింగ్స్ 10–20. అంటే రోజుకు సగటున 250–300 విఘాతాలు. అంటే మీ ఎనిమిది పని గంటల సమయంలో ఐదు గంటలు పూర్తిగా ఫోకస్ లేకుండా వృథా అవుతున్నాయి. అందుకే చాలామంది ప్రొఫెషనల్స్ రోజంతా బిజీగా ఉన్నప్పటికీ రోజు చివర్లో ‘ఏం చేశాను?’ అనిపిస్తుంది. ఇది మీ తప్పు కాదు. ఇది మీ మెదడుపై జరిగిన దాడి.అలసట కాదు, బ్రెయిన్ డామేజ్ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లో బర్న్ఔట్ను occupational phenomenon’ జాబితాలో పెట్టింది. వర్క్ ప్లేస్ ఒత్తిడి వల్ల మెదడు ఎగ్జాస్ట్ అవుతోందని అర్థం. బర్న్ఔట్కు మూడు ప్రాథమిక లక్షణాలున్నాయి. ∙భావోద్వేగ అలసట. అంటే, ఉదయం లేచిన వెంటనే శక్తి లేకపోవడం. ‘ఇవాళ కూడా ఇదేనా...’ అనిపించడం. ∙పనిపట్ల విసుగు. ఎంతో ఇష్టంగా చేసిన పని కూడా ఇప్పుడు చిరాకు తెప్పించడం. ∙పనితీరు పడిపోవడం, సృజనాత్మకత క్షీణించడం. చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడంలో కూడా గందరగోళం.షాకింగ్ విషయం ఏమిటంటే నోటిఫికేషన్లు ఈ మూడు లక్షణాలను డైరెక్ట్‌గా పెంచుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. స్టాన్‌ఫర్డ్ న్యూరోసైన్స్ ల్యాబ్స్ స్టడీ ప్రకారం నోటిఫికేషన్ల వల్ల పనితీరు 17శాతం పడిపోతుంది. ‘ఒక్క నిమిషం...’తో కెరీర్ డ్యామేజ్నిరంతర నోటిఫికేషన్లతో ఫోకస్ కోల్పోవడం వల్ల జరిగే నష్టం మూడు దిశల్లో సాగుతుంది.1. నోటిఫికేషన్లు మీ డీప్ జోన్‌ను విచ్ఛిన్నం చేసి మిమ్మల్ని ఒక రియాక్షన్–మోడ్ ఉద్యోగిగా మార్చేస్తాయి. దీనివల్ల మీరు క్రియేటివ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ లాంటి డీప్ వర్క్స్ సమర్థంగా చేయలేరు. దాంతో గుర్తింపు, పదోన్నతి, నాయకత్వ స్థానాలకు దూరమవుతారు. 2. ‘ఏం జరిగినా వెంటనే స్పందించాలి’ అనుకోవడం విధేయత కాదు, బర్న్ అవుట్ ప్రారంభదశ. దీనివల్ల భావోద్వేగ క్షీణత జరుగుతుంది. 3. మీరు రోజంతా బిజీగా ఉన్నా ప్రభావం శూన్యం కావడం మీ కెరీర్ గ్రోత్‌కు అత్యంత ప్రమాదకరం. మేనేజర్లు, హెచ్ఆర్, ఉన్నతాధికారులు దీన్ని గమనిస్తారు.ఇది కేవలం మీ తప్పా?ఇది కేవలం మీ తప్పు కానే కాదు, ఈనాటి వర్క్ ప్లేస్ సమస్య. ఈనాటి ఆఫీసుల్లో మీటింగ్స్ ఎక్కువ, మెసేజింగ్ యాప్స్ ఎక్కువ. డెడ్ లైన్లు నెత్తిమీద కూర్చుంటాయి. అందరూ ‘అర్జెన్సీ అడిక్షన్’లో చిక్కుకు పోయారు.పరిష్కారాలు... 1. రోజులో కనీసం రెండు గంటలు ‘నో నోటిఫికేషన్ జోన్’. ఆ సమయాన్ని మీ డీప్ వర్క్‌కు ఉపయోగించండి. 2. నోటిఫికేషన్ డైట్ పాటించండి. అంటే, వాట్సప్ గ్రూప్‌లను మ్యూట్ చేయండి. సోషల్ మీడియాను ఆఫ్ చేయండి. ఈమెయిల్స్ రోజుకు మూడుసార్లు మాత్రమే చెక్ చేయండి. 3. ప్రతి 90 నిమిషాల పని తర్వాత ఐదు నిమిషాల బ్రేక్ తీసుకోండి. ఆ సమయంలో కొద్దిగా నడవండి. లేదా నీళ్లు తాగండి. ఇది మీ కాగ్నిటివ్ ఎనర్జీని తిరిగి పెంచుతుంది. 4. మల్టీ టాస్కింగ్ అనేది మెదడుకు విషం లాంటిది. సింగిల్ టాస్క్ ఆక్సిజన్ లాంటిది. అందుకే ఒకసారి ఒకేపని అనే నిబంధన పెట్టుకుని పాటించండి. -సైకాలజిస్ట్ విశేష్‌ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్సైకాలజిస్ట్ విశేష్www.psyvisesh.com -
ఆచి తూచి 'తగ్గొచ్చు'
ఆహారమే ఔషధం అన్నారు పెద్దలు. కాని, మనం ఆ ఆహారాన్ని అపసవ్యంగా తింటూ అనారోగ్యాల పాలవుతున్నాం. కారణాలేమైనప్పటికీ, ఆహారం తీసుకోవటంలో నియంత్రణ కోల్పోవటమే అసలు సమస్య. మనం ఊబకాయులుగా, రోగులుగా మారటానికి మూల కారణం మనం తింటున్న పదార్థాల మోతాదులే. పరిమాణం, నాణ్యత, సమతుల్యత గాడి తప్పింది. అవసరానికి మించి తిన్న ‘అసమతుల్య ఆహారం’ శరీరానికి శక్తిని ఇచ్చే క్రమంలో దేహాన్ని అతిగా బరువెక్కించి రోగాల పుట్టగా మార్చుతోంది. ఏది వీలైతే అది, ఎంత వీలైతే అంత తింటున్నాం. ఏయే పోషకాలు ఎంత మోతాదులో నాకు అవసరం ఉంది? ఎంత తింటున్నాను? అనే అవగాహన లోపించటం లేదా సమాచారం తెలిసినా విస్మరించడమే అధిక బరువుకు, ఆ పైన ఊబకాయానికి రాచబాటలు వేస్తోంది. ముఖ్యంగా పొట్ట చుట్టుకొలత పెంచుతోంది. చర్మం కింద శరీరం అంతటా పేరుకునే కొవ్వు కన్నా పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వు అత్యంత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఇన్సులిన్ నిరోధకత ఫలితంగా కొవ్వు నిల్వలు పేరుకుంటాయి. ఫలితంగా బీపీ, షుగర్, ఫ్యాటీ లివర్, గుండెజబ్బు వంటి జీవనశైలి జబ్బులన్నీ వస్తున్నాయి. మనల్ని రోగాల పుట్టగా మార్చుతున్నది మనం తిన్న ఆహారమే అయినప్పుడు... ఆ ఆహారాన్నే తెలివిగా శక్తియుతమైన ఆయుధంగా వాడి రోగాలను, వాటికి మూలమైన ఊబకాయాన్ని ఎందుకు తగ్గించుకోకూడదు? అందుకు ఉన్న మార్గాలేమిటి?.. చర్చిద్దాం..ఆహారంలో ఎక్కువ పరిమాణంలో అవసరమైన పోషకాలను స్థూల పోషకాలని, అతి తక్కువ మోతాదులో అవసరమైన వాటిని సూక్ష్మ పోషకాలని అంటాం. స్థూల పోషకాలైనా, సూక్ష్మ పోషకాలైనా ఆ వ్యక్తి వయసు, ఎత్తు, శారీరక శ్రమ అవసరాలకు తగిన మోతాదులో ఉండాలి. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తదితర పోషకాలను అవసరమైనంత, సమతులమైన పాళ్లలో తినాలి. కాని, మనలో చాలామంది ఈ క్రమశిక్షణ పాటించటం లేదు. ఎంత తింటే ఆరోగ్యకరం?ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ ‘మై ప్లేట్ ఫర్ ది డే’ 2024 సిఫారసుల ప్రకారం.. సగటు భారతీయ వ్యక్తి రోజులో తీసుకునే కిలోకేలరీల శక్తిలో వరి బియ్యం, గోధుమ పిండి, చిరుధాన్యాలన్నీ కలిపి 45%కు పరిమితం చేయాలి. పప్పుధాన్యాలు, గుడ్లు, మాంసాహారం 14%–15% వరకు ఉండాలి. కొవ్వు 30% కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి. గింజలు, నూనె గింజలు, పాలు, పాల ఉత్పత్తులు 8%–10% వరకు తీసుకోవాలి.ఎంత తింటున్నాం?కేంద్ర ప్రభుత్వ ‘గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్)’ ప్రకారం 2023–24లో పట్టణ వాసులు సగటున తలసరి ఆహార వినియోగం రోజుకు 2,233 కిలో కేలరీల మేరకు ఉంది. 338 గ్రాముల పిండి పదార్థాలు (1,351 కిలో కేలరీలు. 61%), 63 గ్రాముల ప్రొటీన్లు (254 కిలో కేలరీల. 11%), 70 గ్రాముల కొవ్వు పదార్థాలు (628 కిలో కేలరీలు. 28%) తీసుకుంటున్నారు. దేశ జనాభాలో ఎక్కువ మంది సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాలను (చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, బీన్స్, గింజలు, తాజా కూరగాయలు, పండ్లు) చాలా తక్కువగా తింటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ‘ఆహార జబ్బు’ల భారం 56%భారతీయులు మోస్తున్న జబ్బుల ఆర్థిక భారంలో 56.4% మేరకు అపసవ్యమైన, అసమతుల్యతతో కూడిన ఆహారం తీసుకోవటమేనని జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్–ఎన్ఐఎన్) 2024 నాటి డైటరీ గైడ్‌లైన్స్‌లో స్పష్టం చేసింది. అసమతుల్య ఆహారం ఫలితంగా జీవక్రియలు లయ తప్పి మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర, అధిక ట్రైగ్లిజరైడ్లు, తక్కువ హెచ్‌డీఎల్ (మంచి) కొలెస్ట్రాల్ స్థాయి, పెరిగిన నడుము చుట్టుకొలత (ఉదర ఊబకాయం).. ఈ ఐదింటిలో ఏ మూడు ఉన్నా వారికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్లే.సమతులాహారం, శారీరక శ్రమ ద్వారా గుండె జబ్బుల్ని, రక్తపోటు సమస్యలను తగ్గించుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్‌ను 80% వరకు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అకాల మరణాలను చాలా వరకు నివారించుకోవచ్చని ఎన్ఐఎన్ చెబుతోంది.ఎవరి లెక్క వారికే! ఒక వ్యక్తికి పిండి పదార్థాలు, ప్రోటీన్, కొవ్వు పదార్థాలు ఎన్ని గ్రాములు/కేలరీలు అవసరం? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటుంది. వ్యక్తిని బట్టి మారిపోతుంది. మీ వ్యక్తిగత పోషక అవసరాలు మీ బరువు, మీ రోజువారీ శారీరక శ్రమ స్థాయి, మీకున్న ఆరోగ్య సమస్యలు, మీ ఆరోగ్య లక్ష్యాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తున్నారు? అనే దాన్ని బట్టి కూడా పోషకాల కూర్పు, శాతం ఆధారపడి ఉంటుంది. ఆహార పద్ధతులు అనేకం ఉన్నప్పటికీ ప్రధానమైనవి రెండు రకాలు. మొదటిది: హై కార్బ్ డైట్. అంటే.. ప్రధాన శక్తి వనరుగా పిండి పదార్థాలను తీసుకోవటం. సాధారణంగా అందరూ అనుసరించే ఆహార పద్ధతి ఇదే. రెండో పద్ధతి: లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్) డైట్. అంటే.. కొవ్వు పదార్థాలను ప్రధాన శక్తి వనరుగా తీసుకోవటం. వీటిలో ఏ ఆహార పద్ధతిని అనుసరించినా, ముఖ్యంగా మీరు ఆశించిన ఆరోగ్య లక్ష్యాలు సాధించాలంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తారు? ఎంత తినాలి? ఏది తినాలి? అనే విషయాపై నిర్ణయం తీసుకొని, ఆచరించటం ప్రారంభించాలి. ఆచి ‘తూచి’ తినాలి. ఆహార క్రమశిక్షణతో పాటు శారీరక వ్యాయామ క్రమశిక్షణను కూడా జోడించి కొనసాగించాలి. అప్పుడే మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.మీ బీఎంఐ, బీఎంఆర్ ఎంత?శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారు మొదట చెయ్యాల్సిన పని వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), బాడీ మెటబాలిక్ రేట్ (బీఎంఆర్) ఎంతో తెలుసుకోవాలి. ఇటువంటి ముఖ్యమైన డేటాను తెలుసుకోవటానికిప్పుడు ‘బాడీ ఫ్యాట్ స్కేల్’ అనే డిజిటల్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఈ పరికరాలు పెడుతున్నారు. బరువు తూచే డిజిటల్ పరికరంలోనే బీఎంఐ, బీఎంఆర్, పొట్టచుట్టూ కొవ్వు, శరీరం మొత్తంలో కొవ్వు ఎంత ఉన్నాయి వంటి చాలా వివరాలను తెలుసుకోవచ్చు. బీఎంఐ 23 కన్నా తక్కువగా ఉంటే ఆరోగ్యకరం. 30లోపు ఉంటే అధిక బరువు, 35కి మించితే ఊబకాయంగా భావిస్తారు. ఎంత అధిక బరువు ఉంటే బీఎంఆర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఈ కొలమానాలను బట్టి బరువు తగ్గాలా? నార్మల్ రేంజ్‌లోకి రావాలంటే ఎంత తగ్గాలి? అనేది బరువుతో పాటు బీఎంఆర్‌ను కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయించుకోవాలి. వ్యక్తి శరీరంలో దైనందిన జీవక్రియలకు ఎన్ని కిలో కేలరీల శక్తి అవసరమవుతోందో బీఎంఆర్ తెలియజేస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే బీఎంఆర్ చూపే కేలరీల కన్నా రోజు మొత్తంలో తక్కువ కేలరీలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా కేలరీల కొరత సృష్టించినప్పుడు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగించి వినియోగించుకోవటానికి శరీరం అలవాటుపడుతుంది. ఒకవేళ తగినంత బరువు లేని వారైతే బీఎంఆర్ కన్నా ఎక్కువ కేలరీల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అనుకునే వ్యక్తి పని బీఎంఆర్ కన్నా తక్కువగా ఎన్ని కేలరీలు తినాలని నిర్ణయించుకున్న తర్వాత ఏ ఆహార పద్ధతిని అనుసరించాలన్న ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. బరువు పెరగడానికి దారితీసిన పిండిపదార్థాల కేలరీలనే ఎక్కువగా తీసుకునే ఆహార పద్ధతిలోనూ కొన్ని కేలరీలు తగ్గించి తింటే క్రమంగా బరువు తగ్గుతుంది. పిండి పదార్థాల శాతం గతం కన్నా తగ్గించి, ప్రొటీన్లను పెంచుకోవాలి. తగ్గాలి సరే.. అయితే, ఏ పిండి పదార్థాలైతే ఒంట్లో కొవ్వు ఎక్కువగా పెరగటానికి కారణమైనాయో వాటినే తగ్గించి తింటూ, వ్యాయామం చేస్తే ఫలితాలు వస్తాయి. అయితే, కొద్ది నెలలు బరువు తగ్గినా వ్యాయామం వల్ల ఆకలి ఎక్కువై, ఎక్కువ తినాల్సి వచ్చి, మళ్లీ బరువు పెరిగే ముప్పు ఉంటుంది. ఏ ఆహార పద్ధతిలో అధిక కొవ్వు నిల్వల సమస్య వచ్చిందో ఆ ఆహార పద్ధతిలోనే కొన్ని మార్పులు చేసినంత మాత్రాన గణనీయమైన ఫలితాలు సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఊబకాయానికి కారణమైన బరువును, ఆ బరువుకు కారణమైన కొవ్వు నిల్వలను గణనీయమైన స్థాయిలో కరిగించుకోవాలంటే ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకునే వేరే ఆహార పద్ధతిని అనుసరించటం మేలు. లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహార పద్ధతిని అనుసరించటం ద్వారా ఆరోగ్య లక్ష్యాలను సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే, మీ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను తినటమే కాకుండా.. పిండి పదార్థాలను బాగా తక్కువగా, కొవ్వు పదార్థాలను ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీర బరువు నీరసం లేకుండా, ఆరోగ్యదాయకంగా తగ్గించుకోవచ్చని ఎల్సీహెచ్ఎఫ్ నిపుణులు, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ పీ వీ సత్యనారాయణ అంటున్నారు. ఎల్సీహెచ్ఎఫ్ డైట్‌తో పాటు ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చెయ్యటంతో పాటు వ్యాయామం జోడిస్తే మరింత ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఎల్సీహెచ్ఎఫ్ వైద్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ పద్ధతిని ఆచరించటం ద్వారా సత్ఫలితాలు సాధించటంతో పాటు కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఇన్సులిన్ నిరోధకతే కీలకంరక్తంలో చక్కెర స్థాయిని తెలిపే హెచ్‌బీఏ1సి పరీక్షతో పాటు.. ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలోకి విడుదలయ్యే గ్లూకోజ్‌ను కణజాలానికి అందించడంలో కీలకపాత్ర నిర్వహించే ఇన్సులిన్ హార్మోన్ ఏ స్థాయిలో విడుదలవుతోంది? ఎంతసేపటికి తిరిగి సాధారణ స్థితికి వస్తోంది? అనే గణాంకాలను బట్టి ఇన్సులిన్ నిరోధకత ఎంత ఉన్నదనే విషయం నిర్ధారిస్తారు. దీన్ని నిర్ధారించడానికి ‘హోమా ఐఆర్’ అనే ఓరల్ గ్లూకోజ్ టెస్ట్ చేస్తారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తక్కువగా ఉండే వారిలో కూడా ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హెచ్‌బీఏ1సి పరీక్ష ద్వారా షుగర్ వ్యాధి నిర్ధారణ అయ్యేదానికి 15 సంవత్సరాలు ముందే హోమా–ఐఆర్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్సులిన్ నిరోధకతను తొలి దశలోనే గుర్తించి, ఆహారంలో తగిన మార్పు చేసుకుంటే షుగర్, తదనంతర గొలుసు వ్యాధుల ముప్పును తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘హోమా–ఐఆర్’ టెస్ట్‌లో ఇన్సులిన్ నిరోధకత (ఇన్సులిన్ రెసిస్టెన్స్) ఎంత ఉంది? ఆ వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యల స్థితిగతులు ఎలా ఉన్నాయి? అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని లోకార్బ్ హెల్దీ అండ్ హై ఫ్యాట్ డైట్లో పోషకాల కూర్పును, శాతాన్ని, వ్యాయామాన్ని డాక్టర్ సూచిస్తారు. ఇది ఏ ఇద్దరికీ ఒకేలా ఉండదు. ఎవరి ప్రత్యేక పరిస్థితులకు తగిన విధంగా వారికి ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్ సూచిస్తారు. కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు తమ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను మాత్రమే తీసుకోవాలన్న నియమం ఈ ఆహార పద్ధతిలో కూడా వర్తిస్తుంది. అంతకన్నా ఎక్కువ కేలరీలు తింటే బరువు పెరిగే ముప్పు ఏ ఆహార పద్ధతిలోనైనా ఉంటుంది. అందుకే కదా మితాహారం ముద్దు అని మన పెద్దలు చెప్పేది! లోకార్బ్ డైట్ ప్లానింగ్ ఎలా? ఉదాహరణకు 177 సెం.మీ. ఎత్తు, 59 ఏళ్ల వయసు ఉన్న పురుషుడు 82 కిలోల బరువు ఉన్నాడనుకుందాం. బీఎంఐ 28.5. బీఎంఆర్ 1678. మెటబాలిక్ ఏజ్ 62. పొట్ట చుట్టూ కొవ్వు 6 కన్నా తక్కువ ఉండాలి. కానీ, 11 ఉంది. బీపీ, షుగర్ లేదు. ఫ్యాటీ లివర్ గ్రేడ్1 ఉంది. ఇన్సులిన్ నిరోధకత ఉంది. జాగ్రత్త పడకపోతే కొద్ది సంవత్సరాల్లో షుగర్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఇదీ అతనికి ఇచ్చిన ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్.. రోజులో 1500 కిలోకేలరీలకన్నా తక్కువ ఆహారం తినాలి. నికర పిండి పదార్థాలు 20 గ్రాములకు మించకూడదు. 60 గ్రాములు ప్రొటీన్లు, 100–150 గ్రాముల కొవ్వు పదార్థాలను తీసుకోవాలి. క్రమశిక్షణతో ఈ ఆహార నియమాలతో పాటు వ్యాయామం చేస్తూ ఉంటే 6 నెలల్లోనే బీఎంఐ 23.5కు, పొట్ట 7కు తగ్గింది. రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్వంటకం ఏదైనా, అందులో ఉపయోగించే ప్రతి పదార్ధానికి సంబంధించిన స్థూల పోషక విలువలను విధిగా లెక్కించాలి. పొద్దున్నే ఆ రోజు తినాలనుకునే పదార్థాలతో పట్టిక తయారు చేసుకోవాలి. ఏవి తిన్నా రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్ పరిమితుల మేరకే తినాలి. వాటిలో నికర పిండి పదార్థం (పిండి పదార్థంలో నుంచి పీచును తీసేస్తే మిగిలేది నికర పిండి పదార్థం) ఎంత? ప్రొటీన్లెన్ని? కొవ్వు పదార్థం ఎంత? అని సరిచూసుకొని, తూకం వేసుకొని, ముందే పట్టిక రాసుకోవటం అతి ముఖ్యమైన విషయం. ఆ తర్వాతే ఏది తినాలో, ఎంత తినాలో నిర్ణయించుకొని అంతే తినాలి. నెయ్యి లేదా వెన్న, కాఫీ (లేదా టీ) డికాక్షన్/ వేడి నీటితో కలిపి, గిలకొట్టి తయారు చేసుకొని తీసుకునే ‘బుల్లెట్ కాఫీ’ ఈ ఆహార పద్ధతిలో చాలా కీలకమైన ఉదయకాలపు శక్తి వనరు. 50 గ్రా. నెయ్యి/వెన్న, 25 గ్రా. పాల మీగడ, 5 గ్రా. గానుగ కొబ్బరి నూనె, 100 ఎం.ఎల్. కాఫీ డికాక్షన్ కలిపి దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకునే ‘బుల్లెట్ కాఫీ’లో 1.3 గ్రా. నికర పిండి పదార్థాలు, 1.4 గ్రా. ప్రొటీన్, 45.9 గ్రా. కొవ్వు పదార్థాలు, 418 కిలోకేలరీల శక్తి ఉంటాయి. వ్యక్తి అవసరాలను బట్టి నెయ్యి/వెన్న, పాల మీగడల మోతాదులో హెచ్చు తగ్గులు చేసుకోవచ్చు. రోజంతా తీసుకునే కేలరీల్లో దాదాపు మూడింట ఒకవంతు బుల్లెట్ కాఫీ ద్వారానే సమకూర్చుకోవచ్చు. దాహాన్ని బట్టి తాగునీటిని పుష్కలంగా తాగాలి. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, పిక్కలను విధిగా, తగు మాత్రంగా రోజువారీ మెనూలో చేర్చుకుంటే సూక్ష్మపోషకాల లోపం రాకుండా ఉంటుంది. వంటకాలు వ్యక్తిగత ఆహారపు అలవాట్లు, ఆసక్తులు, లభ్యత, కొనుగోలు శక్తిని బట్టి ఏ రోజుకారోజు వారానికి ఒక షెడ్యూల్ పెట్టుకొని పునరావృతం చేసుకోవచ్చు. ఇతరత్రా ఆహార పదార్థాలు రోజుకోలా మారుతుంటాయి. బుల్లెట్ కాఫీ మాత్రం రోజూ తీసుకోవాలి. మాంసాహారులకు ఈ ఆహార పద్ధతి కొంత సులువు. గుడ్డు కూడా ముట్టని శాకాహారులైతే చాలా రకాల ప్రత్యామ్నాయ ఆహారాలు సమకూర్చుకొని తినాల్సి వస్తుంది. వీగన్లకు ఇంకా కొంచెం కష్టం. ఫుడ్ సప్లిమెంట్లు వాడుకోవాల్సి ఉంటుంది. అతిగా తిన్న పిండి పదార్థాల వల్ల శరీరంలో పెరిగిపోయిన కొవ్వు నిల్వలను కొవ్వు ప్రధాన ఆహారంతో కరిగించాలంటే తెలివైన ప్రణాళిక, రాజీలేని క్రమశిక్షణతో కూడిన ఆచరణే వజ్రాయుధాలు!హెచ్చరిక: ఈ కథనం ఉద్దేశం ఎల్సీహెచ్ఎఫ్ డైట్ గురించి కొంతమేరకు అవగాహన కలిగించటానికి మాత్రమే. మరింత లోతైన అవగాహన కోసం ‘లో కార్బ్ స్కూల్’ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూడండి. ఎల్సీహెచ్ఎఫ్ డైట్‌పై అవగాహన గల వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ ఆహార పద్ధతిని అనుసరించబూనుకోవటం ఆశించిన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చకపోగా అనర్థాలకు దారితీసే అవకాశాలు మెండుగా ఉంటాయి. జాగ్రత్త. లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ ‘ఆరోగ్యకరమైన’ ట్రెండ్రోజూ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఉండేది పిండి పదార్థాలే. వీటివల్ల మనం రోగాల బారిన పడుతున్నాం. కడుపులోకి వెళ్లిన పిండి పదార్థాన్ని పచనం చేసి, గ్లూకోజ్‌గా మార్చి, శరీరానికి శక్తినిచ్చే పని ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా జరుగుతుంది. అవసరానికి మించి పిండి పదార్థాలు, హానికరమైన కొవ్వు పదార్థాలను మనం రోజూ తినడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల శరీరంలో అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ ఫలితం లేని స్థితికి చేరినప్పుడు ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ (ఇన్సులిన్ నిరోధకత) ఏర్పడుతోంది. అధిక బరువు దగ్గరి నుంచి క్యాన్సర్ వరకు 64 రకాల జబ్బులకు ఇదే కారణమవుతోందన్న అవగాహన ఇటీవల కాలంలో పెరిగింది. అందువల్ల పిండిపదార్థాలను తక్కువగా తీసుకుంటూ.. మాంసకృత్తులు, ఆరోగ్యదాయకమైన కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే ‘లో కార్బ్ హెల్దీ ఫ్యాట్’ – ఎల్సీహెచ్ఎఫ్ ఆహార పద్ధతిగా చెబుతున్నారు.పిండి పదార్థాలను ఎక్కువగా తింటే.. మనం తినే ఆహారం జీర్ణమై గ్లూకోజ్‌గా మారి, శరీర భాగాలు నిర్విరామంగా పనిచేయటానికి శక్తిగా ఉపయోగపడుతుంది. ఆహారంలో పిండి పదార్థాలు పెరిగితే రక్తంలో చక్కెర శాతాలూ పెరుగుతాయి. శరీరం ఈ చక్కెరలను కరిగించడానికి, శక్తి ఉత్పత్తి చేయటానికి కనీసం 2 నుంచి 3 గంటల సమయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియను నిర్వహించే ఇన్సులిన్ చాలినంత లేకపోయినా, సరిగ్గా పనిచేయకపోయినా రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉండదు.⇒ ఆహారం ద్వారా అందే గ్లూకోజ్‌లో అవసరమైనప్పుడు వెంటనే వాడుకోవటానికి వీలుగా కొంత మేరకు గ్లైకోజెన్ గా మారుతుంది. మిగిలిపోయిన అదనపు శక్తిని కొవ్వుగా మార్చి నిల్వ చేసుకునే సామర్థ్యం శరీరానికి ఉంది.⇒ గ్లైకోజెన్ .. బ్యాంకు ఖాతాలో ఎప్పుడైనా వాడుకోవటానికి సిద్ధంగా ఉండే సొమ్ములాంటిది. కొవ్వుగా మారిన గ్లూకోజ్‌ను.. ఫిక్స్డ్ డిపాజిట్‌గా చెప్పుకోవచ్చు.⇒ గ్లూకోజ్ ఒకసారి కొవ్వుగా మారితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప, తిరిగి దానికదే గ్లూకోజ్‌గా మారదు. ఈ కొవ్వును జీవన క్రియ ద్వారానే కరిగించి శక్తిగా మార్చగలం. ⇒ పిండి పదార్థాలు తక్కువగా, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహారం తీసుకుంటే శరీరంలో అధిక కొవ్వును సులువుగా కరిగించవచ్చు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటే..ఊబకాయులు ఆహారం పరిమితం చేసినా, ఉపవాసం ఉన్నా కూడా బరువు తగ్గటం కంటే పెరుగుతారు. ఈ విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే, మనకు ఎక్కువ ఆకలి వేసినప్పుడు ఇన్సులిన్ ప్రభావం అధికమై ఆహారంలోని పిండి పదార్థాలను కొవ్వుగా మార్చి నిల్వ చేస్తుంది. ఈ పరిస్థితి మారాలంటే మన ఆహారంలో అధిక సంతృప్త కొవ్వులు ఉన్న నూనె వాడాలి. తద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి, బరువు పెరుగుదలను నివారించవచ్చు. దీనికి తక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారాన్ని కలిపితే శరీరంలో ఉన్న నిల్వ కొవ్వు కూడా కరగటం మొదలవుతుంది.శాకాహారులైనా, మాంసాహారులైనా అనుసరించవచ్చునేను గత 47 సంవత్సరాలుగా వేలాది గుండె శస్త్రచికిత్సలు, ముఖ్యంగా బైపాస్ సర్జరీలు చేశాను. పిండి పదార్థాలను ఎక్కువగా తింటూ వ్యాయామాలు చేసినా శరీరంలో కొవ్వు కరగటం పెద్దగా జరగదు. ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయన ఫలితాలను స్టడీ చేశాను. తక్కువ పిండి పదార్థాలు, ఎక్కువ ‘ఆరోగ్యకరమైన కొవ్వులు’ ఉండే లోకార్బ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్.) ఆహారం ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి సహాయకారిగా నిలిచిందని నా అధ్యయనంలో గుర్తించాను. ఆ తర్వాతే నేనూ ఇది పాటించి లబ్ధి పొందాను. 17 ఏళ్ల క్రితం మధుమేహం, రక్తపోటుకు ఇన్సులిన్ ఇంజక్షన్లు వాడేవాడిని. మొదట్లో ఈ ఆహార పద్ధతిని నేనూ నమ్మలేదు. రెండేళ్లు పరిశోధన చేసి ఈ నియమావళిని నమ్మి ప్రారంభించాను. ఇందులో గానుగ ద్వారా తీసిన కొబ్బరి నూనె వాడకం చాలా ప్రధానం. 6 వారాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. ఇన్సులిన్ ఇంజక్షన్, రక్తపోటుకు మందులు వాడటం ఆపేశాను. ‘లో కార్బ్ స్కూల్’ అనే యూట్యూబ్ చానల్లో.. అనేక ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎలాంటి ఆహార పద్ధతులు పాటించాలో తెలిపే చాలా వీడియో ప్రసంగాలు కూడా చేశాను. ఎల్సీహెచ్ఎఫ్ డైట్‌ను శాకాహారులైనా, మాంసాహారులైనా అనుసరించవచ్చు. – డా. పి.వి. సత్యనారాయణ ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్, ఎల్సిహెచ్ఎఫ్ ఆహార పద్ధతి నిపుణులు, హైదరాబాద్ఎంతెంత మోతాదుల్లో తినాలి?ఆహారంలో ఎక్కువ పరిమాణంలో అవసరమైన పోషకాలను స్థూల పోషకాలని, అతి తక్కువ మోతాదులో అవసరమైన వాటిని సూక్ష్మ పోషకాలని అంటాం. స్థూల పోషకాలైనా, సూక్ష్మ పోషకాలైనా ఆ వ్యక్తి వయసు, ఎత్తు, శారీరక శ్రమ అవసరాలకు తగిన మోతాదులో ఉండాలి. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తదితర పోషకాలను అవసరమైనంత, సమతులమైన పాళ్లలో తినాలి. కాని, మనలో చాలామంది ఈ క్రమశిక్షణ పాటించటం లేదు. ఎంత తింటే ఆరోగ్యకరం?ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ ‘మై ప్లేట్ ఫర్ ది డే’ 2024 సిఫారసుల ప్రకారం.. సగటు భారతీయ వ్యక్తి రోజులో తీసుకునే కిలోకేలరీల శక్తిలో వరి బియ్యం, గోధుమ పిండి, చిరుధాన్యాలన్నీ కలిపి 45%కు పరిమితం చేయాలి. పప్పుధాన్యాలు, గుడ్లు, మాంసాహారం 14%–15% వరకు ఉండాలి. కొవ్వు 30% కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి. గింజలు, నూనె గింజలు, పాలు, పాల ఉత్పత్తులు 8%–10% వరకు తీసుకోవాలి.ఎంత తింటున్నాం?కేంద్ర ప్రభుత్వ ‘గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్)’ ప్రకారం 2023–24లో పట్టణ వాసులు సగటున తలసరి ఆహార వినియోగం రోజుకు 2,233 కిలో కేలరీల మేరకు ఉంది. 338 గ్రాముల పిండి పదార్థాలు (1,351 కిలో కేలరీలు. 61%), 63 గ్రాముల ప్రొటీన్లు (254 కిలో కేలరీల. 11%), 70 గ్రాముల కొవ్వు పదార్థాలు (628 కిలో కేలరీలు. 28%) తీసుకుంటున్నారు. దేశ జనాభాలో ఎక్కువ మంది సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాలను (చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, బీన్స్, గింజలు, తాజా కూరగాయలు, పండ్లు) చాలా తక్కువగా తింటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ‘ఆహార జబ్బు’ల భారం 56%భారతీయులు మోస్తున్న జబ్బుల ఆర్థిక భారంలో 56.4% మేరకు అపసవ్యమైన, అసమతుల్యతతో కూడిన ఆహారం తీసుకోవటమేనని జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్–ఎన్ఐఎన్) 2024 నాటి డైటరీ గైడ్‌లైన్స్‌లో స్పష్టం చేసింది. అసమతుల్య ఆహారం ఫలితంగా జీవక్రియలు లయ తప్పి మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర, అధిక ట్రైగ్లిజరైడ్లు, తక్కువ హెచ్‌డీఎల్ (మంచి) కొలెస్ట్రాల్ స్థాయి, పెరిగిన నడుము చుట్టుకొలత (ఉదర ఊబకాయం).. ఈ ఐదింటిలో ఏ మూడు ఉన్నా వారికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్లే.సమతులాహారం, శారీరక శ్రమ ద్వారా గుండె జబ్బుల్ని, రక్తపోటు సమస్యలను తగ్గించుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్‌ను 80% వరకు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అకాల మరణాలను చాలా వరకు నివారించుకోవచ్చని ఎన్ఐఎన్ చెబుతోంది.ఎవరి లెక్క వారికే! ఒక వ్యక్తికి పిండి పదార్థాలు, ప్రోటీన్, కొవ్వు పదార్థాలు ఎన్ని గ్రాములు/కేలరీలు అవసరం? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటుంది. వ్యక్తిని బట్టి మారిపోతుంది. మీ వ్యక్తిగత పోషక అవసరాలు మీ బరువు, మీ రోజువారీ శారీరక శ్రమ స్థాయి, మీకున్న ఆరోగ్య సమస్యలు, మీ ఆరోగ్య లక్ష్యాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తున్నారు? అనే దాన్ని బట్టి కూడా పోషకాల కూర్పు, శాతం ఆధారపడి ఉంటుంది. ఆహార పద్ధతులు అనేకం ఉన్నప్పటికీ ప్రధానమైనవి రెండు రకాలు. మొదటిది: హై కార్బ్ డైట్. అంటే.. ప్రధాన శక్తి వనరుగా పిండి పదార్థాలను తీసుకోవటం. సాధారణంగా అందరూ అనుసరించే ఆహార పద్ధతి ఇదే. రెండో పద్ధతి: లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్) డైట్. అంటే.. కొవ్వు పదార్థాలను ప్రధాన శక్తి వనరుగా తీసుకోవటం. వీటిలో ఏ ఆహార పద్ధతిని అనుసరించినా, ముఖ్యంగా మీరు ఆశించిన ఆరోగ్య లక్ష్యాలు సాధించాలంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తారు? ఎంత తినాలి? ఏది తినాలి? అనే విషయాపై నిర్ణయం తీసుకొని, ఆచరించటం ప్రారంభించాలి. ఆచి ‘తూచి’ తినాలి. ఆహార క్రమశిక్షణతో పాటు శారీరక వ్యాయామ క్రమశిక్షణను కూడా జోడించి కొనసాగించాలి. అప్పుడే మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.మీ బీఎంఐ, బీఎంఆర్ ఎంత?శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారు మొదట చెయ్యాల్సిన పని వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), బాడీ మెటబాలిక్ రేట్ (బీఎంఆర్) ఎంతో తెలుసుకోవాలి. ఇటువంటి ముఖ్యమైన డేటాను తెలుసుకోవటానికిప్పుడు ‘బాడీ ఫ్యాట్ స్కేల్’ అనే డిజిటల్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఈ పరికరాలు పెడుతున్నారు. బరువు తూచే డిజిటల్ పరికరంలోనే బీఎంఐ, బీఎంఆర్, పొట్టచుట్టూ కొవ్వు, శరీరం మొత్తంలో కొవ్వు ఎంత ఉన్నాయి వంటి చాలా వివరాలను తెలుసుకోవచ్చు. బీఎంఐ 23 కన్నా తక్కువగా ఉంటే ఆరోగ్యకరం. 30లోపు ఉంటే అధిక బరువు, 35కి మించితే ఊబకాయంగా భావిస్తారు. ఎంత అధిక బరువు ఉంటే బీఎంఆర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఈ కొలమానాలను బట్టి బరువు తగ్గాలా? నార్మల్ రేంజ్‌లోకి రావాలంటే ఎంత తగ్గాలి? అనేది బరువుతో పాటు బీఎంఆర్‌ను కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయించుకోవాలి. వ్యక్తి శరీరంలో దైనందిన జీవక్రియలకు ఎన్ని కిలో కేలరీల శక్తి అవసరమవుతోందో బీఎంఆర్ తెలియజేస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే బీఎంఆర్ చూపే కేలరీల కన్నా రోజు మొత్తంలో తక్కువ కేలరీలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా కేలరీల కొరత సృష్టించినప్పుడు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగించి వినియోగించుకోవటానికి శరీరం అలవాటుపడుతుంది. ఒకవేళ తగినంత బరువు లేని వారైతే బీఎంఆర్ కన్నా ఎక్కువ కేలరీల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అనుకునే వ్యక్తి పని బీఎంఆర్ కన్నా తక్కువగా ఎన్ని కేలరీలు తినాలని నిర్ణయించుకున్న తర్వాత ఏ ఆహార పద్ధతిని అనుసరించాలన్న ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. బరువు పెరగడానికి దారితీసిన పిండిపదార్థాల కేలరీలనే ఎక్కువగా తీసుకునే ఆహార పద్ధతిలోనూ కొన్ని కేలరీలు తగ్గించి తింటే క్రమంగా బరువు తగ్గుతుంది. పిండి పదార్థాల శాతం గతం కన్నా తగ్గించి, ప్రొటీన్లను పెంచుకోవాలి. తగ్గాలి సరే.. అయితే, ఏ పిండి పదార్థాలైతే ఒంట్లో కొవ్వు ఎక్కువగా పెరగటానికి కారణమైనాయో వాటినే తగ్గించి తింటూ, వ్యాయామం చేస్తే ఫలితాలు వస్తాయి. అయితే, కొద్ది నెలలు బరువు తగ్గినా వ్యాయామం వల్ల ఆకలి ఎక్కువై, ఎక్కువ తినాల్సి వచ్చి, మళ్లీ బరువు పెరిగే ముప్పు ఉంటుంది. ఏ ఆహార పద్ధతిలో అధిక కొవ్వు నిల్వల సమస్య వచ్చిందో ఆ ఆహార పద్ధతిలోనే కొన్ని మార్పులు చేసినంత మాత్రాన గణనీయమైన ఫలితాలు సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఊబకాయానికి కారణమైన బరువును, ఆ బరువుకు కారణమైన కొవ్వు నిల్వలను గణనీయమైన స్థాయిలో కరిగించుకోవాలంటే ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకునే వేరే ఆహార పద్ధతిని అనుసరించటం మేలు. లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహార పద్ధతిని అనుసరించటం ద్వారా ఆరోగ్య లక్ష్యాలను సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే, మీ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను తినటమే కాకుండా.. పిండి పదార్థాలను బాగా తక్కువగా, కొవ్వు పదార్థాలను ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీర బరువు నీరసం లేకుండా, ఆరోగ్యదాయకంగా తగ్గించుకోవచ్చని ఎల్సీహెచ్ఎఫ్ నిపుణులు, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ పీ వీ సత్యనారాయణ అంటున్నారు. ఎల్సీహెచ్ఎఫ్ డైట్‌తో పాటు ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చెయ్యటంతో పాటు వ్యాయామం జోడిస్తే మరింత ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఎల్సీహెచ్ఎఫ్ వైద్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ పద్ధతిని ఆచరించటం ద్వారా సత్ఫలితాలు సాధించటంతో పాటు కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఇన్సులిన్ నిరోధకతే కీలకంరక్తంలో చక్కెర స్థాయిని తెలిపే హెచ్‌బీఏ1సి పరీక్షతో పాటు.. ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలోకి విడుదలయ్యే గ్లూకోజ్‌ను కణజాలానికి అందించడంలో కీలకపాత్ర నిర్వహించే ఇన్సులిన్ హార్మోన్ ఏ స్థాయిలో విడుదలవుతోంది? ఎంతసేపటికి తిరిగి సాధారణ స్థితికి వస్తోంది? అనే గణాంకాలను బట్టి ఇన్సులిన్ నిరోధకత ఎంత ఉన్నదనే విషయం నిర్ధారిస్తారు. దీన్ని నిర్ధారించడానికి ‘హోమా ఐఆర్’ అనే ఓరల్ గ్లూకోజ్ టెస్ట్ చేస్తారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తక్కువగా ఉండే వారిలో కూడా ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హెచ్‌బీఏ1సి పరీక్ష ద్వారా షుగర్ వ్యాధి నిర్ధారణ అయ్యేదానికి 15 సంవత్సరాలు ముందే హోమా–ఐఆర్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్సులిన్ నిరోధకతను తొలి దశలోనే గుర్తించి, ఆహారంలో తగిన మార్పు చేసుకుంటే షుగర్, తదనంతర గొలుసు వ్యాధుల ముప్పును తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘హోమా–ఐఆర్’ టెస్ట్‌లో ఇన్సులిన్ నిరోధకత (ఇన్సులిన్ రెసిస్టెన్స్) ఎంత ఉంది? ఆ వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యల స్థితిగతులు ఎలా ఉన్నాయి? అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని లోకార్బ్ హెల్దీ అండ్ హై ఫ్యాట్ డైట్లో పోషకాల కూర్పును, శాతాన్ని, వ్యాయామాన్ని డాక్టర్ సూచిస్తారు. ఇది ఏ ఇద్దరికీ ఒకేలా ఉండదు. ఎవరి ప్రత్యేక పరిస్థితులకు తగిన విధంగా వారికి ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్ సూచిస్తారు. కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు తమ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను మాత్రమే తీసుకోవాలన్న నియమం ఈ ఆహార పద్ధతిలో కూడా వర్తిస్తుంది. అంతకన్నా ఎక్కువ కేలరీలు తింటే బరువు పెరిగే ముప్పు ఏ ఆహార పద్ధతిలోనైనా ఉంటుంది. అందుకే కదా మితాహారం ముద్దు అని మన పెద్దలు చెప్పేది! లోకార్బ్ డైట్ ప్లానింగ్ ఎలా? ఉదాహరణకు 177 సెం.మీ. ఎత్తు, 59 ఏళ్ల వయసు ఉన్న పురుషుడు 82 కిలోల బరువు ఉన్నాడనుకుందాం. బీఎంఐ 28.5. బీఎంఆర్ 1678. మెటబాలిక్ ఏజ్ 62. పొట్ట చుట్టూ కొవ్వు 6 కన్నా తక్కువ ఉండాలి. కానీ, 11 ఉంది. బీపీ, షుగర్ లేదు. ఫ్యాటీ లివర్ గ్రేడ్1 ఉంది. ఇన్సులిన్ నిరోధకత ఉంది. జాగ్రత్త పడకపోతే కొద్ది సంవత్సరాల్లో షుగర్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఇదీ అతనికి ఇచ్చిన ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్.. రోజులో 1500 కిలోకేలరీలకన్నా తక్కువ ఆహారం తినాలి. నికర పిండి పదార్థాలు 20 గ్రాములకు మించకూడదు. 60 గ్రాములు ప్రొటీన్లు, 100–150 గ్రాముల కొవ్వు పదార్థాలను తీసుకోవాలి. క్రమశిక్షణతో ఈ ఆహార నియమాలతో పాటు వ్యాయామం చేస్తూ ఉంటే 6 నెలల్లోనే బీఎంఐ 23.5కు, పొట్ట 7కు తగ్గింది. రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్వంటకం ఏదైనా, అందులో ఉపయోగించే ప్రతి పదార్ధానికి సంబంధించిన స్థూల పోషక విలువలను విధిగా లెక్కించాలి. పొద్దున్నే ఆ రోజు తినాలనుకునే పదార్థాలతో పట్టిక తయారు చేసుకోవాలి. ఏవి తిన్నా రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్ పరిమితుల మేరకే తినాలి. వాటిలో నికర పిండి పదార్థం (పిండి పదార్థంలో నుంచి పీచును తీసేస్తే మిగిలేది నికర పిండి పదార్థం) ఎంత? ప్రొటీన్లెన్ని? కొవ్వు పదార్థం ఎంత? అని సరిచూసుకొని, తూకం వేసుకొని, ముందే పట్టిక రాసుకోవటం అతి ముఖ్యమైన విషయం. ఆ తర్వాతే ఏది తినాలో, ఎంత తినాలో నిర్ణయించుకొని అంతే తినాలి. నెయ్యి లేదా వెన్న, కాఫీ (లేదా టీ) డికాక్షన్/ వేడి నీటితో కలిపి, గిలకొట్టి తయారు చేసుకొని తీసుకునే ‘బుల్లెట్ కాఫీ’ ఈ ఆహార పద్ధతిలో చాలా కీలకమైన ఉదయకాలపు శక్తి వనరు. 50 గ్రా. నెయ్యి/వెన్న, 25 గ్రా. పాల మీగడ, 5 గ్రా. గానుగ కొబ్బరి నూనె, 100 ఎం.ఎల్. కాఫీ డికాక్షన్ కలిపి దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకునే ‘బుల్లెట్ కాఫీ’లో 1.3 గ్రా. నికర పిండి పదార్థాలు, 1.4 గ్రా. ప్రొటీన్, 45.9 గ్రా. కొవ్వు పదార్థాలు, 418 కిలోకేలరీల శక్తి ఉంటాయి. వ్యక్తి అవసరాలను బట్టి నెయ్యి/వెన్న, పాల మీగడల మోతాదులో హెచ్చు తగ్గులు చేసుకోవచ్చు. రోజంతా తీసుకునే కేలరీల్లో దాదాపు మూడింట ఒకవంతు బుల్లెట్ కాఫీ ద్వారానే సమకూర్చుకోవచ్చు. దాహాన్ని బట్టి తాగునీటిని పుష్కలంగా తాగాలి. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, పిక్కలను విధిగా, తగు మాత్రంగా రోజువారీ మెనూలో చేర్చుకుంటే సూక్ష్మపోషకాల లోపం రాకుండా ఉంటుంది. వంటకాలు వ్యక్తిగత ఆహారపు అలవాట్లు, ఆసక్తులు, లభ్యత, కొనుగోలు శక్తిని బట్టి ఏ రోజుకారోజు వారానికి ఒక షెడ్యూల్ పెట్టుకొని పునరావృతం చేసుకోవచ్చు. ఇతరత్రా ఆహార పదార్థాలు రోజుకోలా మారుతుంటాయి. బుల్లెట్ కాఫీ మాత్రం రోజూ తీసుకోవాలి. మాంసాహారులకు ఈ ఆహార పద్ధతి కొంత సులువు. గుడ్డు కూడా ముట్టని శాకాహారులైతే చాలా రకాల ప్రత్యామ్నాయ ఆహారాలు సమకూర్చుకొని తినాల్సి వస్తుంది. వీగన్లకు ఇంకా కొంచెం కష్టం. ఫుడ్ సప్లిమెంట్లు వాడుకోవాల్సి ఉంటుంది. అతిగా తిన్న పిండి పదార్థాల వల్ల శరీరంలో పెరిగిపోయిన కొవ్వు నిల్వలను కొవ్వు ప్రధాన ఆహారంతో కరిగించాలంటే తెలివైన ప్రణాళిక, రాజీలేని క్రమశిక్షణతో కూడిన ఆచరణే వజ్రాయుధాలు!హెచ్చరిక: ఈ కథనం ఉద్దేశం ఎల్సీహెచ్ఎఫ్ డైట్ గురించి కొంతమేరకు అవగాహన కలిగించటానికి మాత్రమే. మరింత లోతైన అవగాహన కోసం ‘లో కార్బ్ స్కూల్’ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూడండి. ఎల్సీహెచ్ఎఫ్ డైట్‌పై అవగాహన గల వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ ఆహార పద్ధతిని అనుసరించబూనుకోవటం ఆశించిన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చకపోగా అనర్థాలకు దారితీసే అవకాశాలు మెండుగా ఉంటాయి. జాగ్రత్త. లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ ‘ఆరోగ్యకరమైన’ ట్రెండ్రోజూ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఉండేది పిండి పదార్థాలే. వీటివల్ల మనం రోగాల బారిన పడుతున్నాం. కడుపులోకి వెళ్లిన పిండి పదార్థాన్ని పచనం చేసి, గ్లూకోజ్‌గా మార్చి, శరీరానికి శక్తినిచ్చే పని ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా జరుగుతుంది. అవసరానికి మించి పిండి పదార్థాలు, హానికరమైన కొవ్వు పదార్థాలను మనం రోజూ తినడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల శరీరంలో అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ ఫలితం లేని స్థితికి చేరినప్పుడు ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ (ఇన్సులిన్ నిరోధకత) ఏర్పడుతోంది. అధిక బరువు దగ్గరి నుంచి క్యాన్సర్ వరకు 64 రకాల జబ్బులకు ఇదే కారణమవుతోందన్న అవగాహన ఇటీవల కాలంలో పెరిగింది. అందువల్ల పిండిపదార్థాలను తక్కువగా తీసుకుంటూ.. మాంసకృత్తులు, ఆరోగ్యదాయకమైన కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే ‘లో కార్బ్ హెల్దీ ఫ్యాట్’ – ఎల్సీహెచ్ఎఫ్ ఆహార పద్ధతిగా చెబుతున్నారు.ఏయే ఆహార పదార్థాల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు ఎంతెంత ఉన్నాయో తెలుసుకొని, ఏ వ్యక్తి (పసిపిల్లలు, పిల్లలు, యుక్తవయస్కులు, నడివయస్కులు, గర్భవతులు, బాలింతలు, వృద్ధులు)కి ఎంత మోతాదుల్లో అవి అవసరమో లెక్క వేసుకొని తినటం ద్వారా సమతుల ఆహారం తీసుకోవచ్చు. లెక్క వేసుకొని తినాలన్న మాట విడ్డూరంగాను, అంత అవసరమా అనే సందేహం రావచ్చు. కానీ, సత్ఫలితాలు రాబట్టాలంటే అదే అవసరం. ఎంత తినాలో తెలుసుకొని, తెలివిగా తింటే అధిక బరువు/ ఊబకాయంతో పాటు వచ్చే ఎన్నో ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. వ్యాధులు దరిచేరకుండా ఆరోగ్యంగా జీవించడానికి కూడా ఈ సమతులాహారం దోహదం చేస్తుంది. మనం ఏయే పదార్థాలను ఎంతెంత మోతాదులో తినాలో తెలియాలంటే మొదట ఆయా ఆహార పదార్థాల్లో అసలు పోషకాలు ఎంతెంత మోతాదులో ఉన్నాయో తెలుసుకోవాలి. సాధారణంగా ప్రతి ఆహార పదార్థంలోనూ స్థూల పోషకాలైన పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలతోపాటు సూక్ష్మ పోషకాలు ఉంటాయి. అయితే, వేర్వేరు మోతాదుల్లో ఉంటాయి. కొన్నిటిలో పిండి పదార్థాలు ఎక్కువగా, ప్రొటీన్లు తక్కువగా, కొవ్వు పదార్థాలు మరీ తక్కువగా ఉంటాయి. మరికొన్నిటిలో కొవ్వు ఎక్కువ, ప్రొటీన్లు మోస్తరుగా, పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఇంకొన్నిటిలో అసలు పిండి పదార్థాలే ఉండవు. కాబట్టి, వ్యక్తిగతంగా మీకు ఏయే పోషకాలు ఎంత మోతాదులో కావాలో తెలుసుకొని, మీ ఆరోగ్య లక్ష్యం నిర్దేశించుకోవాలి. ఈ లక్ష్య సాధనకు అవసరమైనన్ని పోషకాలతో కూడిన ఆహారాన్ని పనిగట్టుకొని లెక్క వేసుకొని తీసుకుంటే మీ ఆరోగ్య లక్ష్యాలను క్షేమకరమైన రీతిలో సాధించవచ్చు.ఆహారంలో ఎక్కువ పరిమాణంలో అవసరమైన పోషకాలను స్థూల పోషకాలని, అతి తక్కువ మోతాదులో అవసరమైన వాటిని సూక్ష్మ పోషకాలని అంటాం. స్థూల పోషకాలైనా, సూక్ష్మ పోషకాలైనా ఆ వ్యక్తి వయసు, ఎత్తు, శారీరక శ్రమ అవసరాలకు తగిన మోతాదులో ఉండాలి. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తదితర పోషకాలను అవసరమైనంత, సమతులమైన పాళ్లలో తినాలి. కాని, మనలో చాలామంది ఈ క్రమశిక్షణ పాటించటం లేదు. ఎంత తింటే ఆరోగ్యకరం?ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ ‘మై ప్లేట్ ఫర్ ది డే’ 2024 సిఫారసుల ప్రకారం.. సగటు భారతీయ వ్యక్తి రోజులో తీసుకునే కిలోకేలరీల శక్తిలో వరి బియ్యం, గోధుమ పిండి, చిరుధాన్యాలన్నీ కలిపి 45%కు పరిమితం చేయాలి. పప్పుధాన్యాలు, గుడ్లు, మాంసాహారం 14%–15% వరకు ఉండాలి. కొవ్వు 30% కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి. గింజలు, నూనె గింజలు, పాలు, పాల ఉత్పత్తులు 8%–10% వరకు తీసుకోవాలి.ఎంత తింటున్నాం?కేంద్ర ప్రభుత్వ ‘గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్)’ ప్రకారం 2023–24లో పట్టణ వాసులు సగటున తలసరి ఆహార వినియోగం రోజుకు 2,233 కిలో కేలరీల మేరకు ఉంది. 338 గ్రాముల పిండి పదార్థాలు (1,351 కిలో కేలరీలు. 61%), 63 గ్రాముల ప్రొటీన్లు (254 కిలో కేలరీల. 11%), 70 గ్రాముల కొవ్వు పదార్థాలు (628 కిలో కేలరీలు. 28%) తీసుకుంటున్నారు. దేశ జనాభాలో ఎక్కువ మంది సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాలను (చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, బీన్స్, గింజలు, తాజా కూరగాయలు, పండ్లు) చాలా తక్కువగా తింటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ‘ఆహార జబ్బు’ల భారం 56%భారతీయులు మోస్తున్న జబ్బుల ఆర్థిక భారంలో 56.4% మేరకు అపసవ్యమైన, అసమతుల్యతతో కూడిన ఆహారం తీసుకోవటమేనని జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్–ఎన్ఐఎన్) 2024 నాటి డైటరీ గైడ్‌లైన్స్‌లో స్పష్టం చేసింది. అసమతుల్య ఆహారం ఫలితంగా జీవక్రియలు లయ తప్పి మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర, అధిక ట్రైగ్లిజరైడ్లు, తక్కువ హెచ్‌డీఎల్ (మంచి) కొలెస్ట్రాల్ స్థాయి, పెరిగిన నడుము చుట్టుకొలత (ఉదర ఊబకాయం).. ఈ ఐదింటిలో ఏ మూడు ఉన్నా వారికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్లే.సమతులాహారం, శారీరక శ్రమ ద్వారా గుండె జబ్బుల్ని, రక్తపోటు సమస్యలను తగ్గించుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్‌ను 80% వరకు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అకాల మరణాలను చాలా వరకు నివారించుకోవచ్చని ఎన్ఐఎన్ చెబుతోంది.ఎవరి లెక్క వారికే! ఒక వ్యక్తికి పిండి పదార్థాలు, ప్రోటీన్, కొవ్వు పదార్థాలు ఎన్ని గ్రాములు/కేలరీలు అవసరం? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటుంది. వ్యక్తిని బట్టి మారిపోతుంది. మీ వ్యక్తిగత పోషక అవసరాలు మీ బరువు, మీ రోజువారీ శారీరక శ్రమ స్థాయి, మీకున్న ఆరోగ్య సమస్యలు, మీ ఆరోగ్య లక్ష్యాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తున్నారు? అనే దాన్ని బట్టి కూడా పోషకాల కూర్పు, శాతం ఆధారపడి ఉంటుంది. ఆహార పద్ధతులు అనేకం ఉన్నప్పటికీ ప్రధానమైనవి రెండు రకాలు. మొదటిది: హై కార్బ్ డైట్. అంటే.. ప్రధాన శక్తి వనరుగా పిండి పదార్థాలను తీసుకోవటం. సాధారణంగా అందరూ అనుసరించే ఆహార పద్ధతి ఇదే. రెండో పద్ధతి: లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్) డైట్. అంటే.. కొవ్వు పదార్థాలను ప్రధాన శక్తి వనరుగా తీసుకోవటం. వీటిలో ఏ ఆహార పద్ధతిని అనుసరించినా, ముఖ్యంగా మీరు ఆశించిన ఆరోగ్య లక్ష్యాలు సాధించాలంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తారు? ఎంత తినాలి? ఏది తినాలి? అనే విషయాపై నిర్ణయం తీసుకొని, ఆచరించటం ప్రారంభించాలి. ఆచి ‘తూచి’ తినాలి. ఆహార క్రమశిక్షణతో పాటు శారీరక వ్యాయామ క్రమశిక్షణను కూడా జోడించి కొనసాగించాలి. అప్పుడే మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.మీ బీఎంఐ, బీఎంఆర్ ఎంత?శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారు మొదట చెయ్యాల్సిన పని వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), బాడీ మెటబాలిక్ రేట్ (బీఎంఆర్) ఎంతో తెలుసుకోవాలి. ఇటువంటి ముఖ్యమైన డేటాను తెలుసుకోవటానికిప్పుడు ‘బాడీ ఫ్యాట్ స్కేల్’ అనే డిజిటల్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఈ పరికరాలు పెడుతున్నారు. బరువు తూచే డిజిటల్ పరికరంలోనే బీఎంఐ, బీఎంఆర్, పొట్టచుట్టూ కొవ్వు, శరీరం మొత్తంలో కొవ్వు ఎంత ఉన్నాయి వంటి చాలా వివరాలను తెలుసుకోవచ్చు. బీఎంఐ 23 కన్నా తక్కువగా ఉంటే ఆరోగ్యకరం. 30లోపు ఉంటే అధిక బరువు, 35కి మించితే ఊబకాయంగా భావిస్తారు. ఎంత అధిక బరువు ఉంటే బీఎంఆర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఈ కొలమానాలను బట్టి బరువు తగ్గాలా? నార్మల్ రేంజ్‌లోకి రావాలంటే ఎంత తగ్గాలి? అనేది బరువుతో పాటు బీఎంఆర్‌ను కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయించుకోవాలి. వ్యక్తి శరీరంలో దైనందిన జీవక్రియలకు ఎన్ని కిలో కేలరీల శక్తి అవసరమవుతోందో బీఎంఆర్ తెలియజేస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే బీఎంఆర్ చూపే కేలరీల కన్నా రోజు మొత్తంలో తక్కువ కేలరీలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా కేలరీల కొరత సృష్టించినప్పుడు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగించి వినియోగించుకోవటానికి శరీరం అలవాటుపడుతుంది. ఒకవేళ తగినంత బరువు లేని వారైతే బీఎంఆర్ కన్నా ఎక్కువ కేలరీల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అనుకునే వ్యక్తి పని బీఎంఆర్ కన్నా తక్కువగా ఎన్ని కేలరీలు తినాలని నిర్ణయించుకున్న తర్వాత ఏ ఆహార పద్ధతిని అనుసరించాలన్న ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. బరువు పెరగడానికి దారితీసిన పిండిపదార్థాల కేలరీలనే ఎక్కువగా తీసుకునే ఆహార పద్ధతిలోనూ కొన్ని కేలరీలు తగ్గించి తింటే క్రమంగా బరువు తగ్గుతుంది. పిండి పదార్థాల శాతం గతం కన్నా తగ్గించి, ప్రొటీన్లను పెంచుకోవాలి. తగ్గాలి సరే.. అయితే, ఏ పిండి పదార్థాలైతే ఒంట్లో కొవ్వు ఎక్కువగా పెరగటానికి కారణమైనాయో వాటినే తగ్గించి తింటూ, వ్యాయామం చేస్తే ఫలితాలు వస్తాయి. అయితే, కొద్ది నెలలు బరువు తగ్గినా వ్యాయామం వల్ల ఆకలి ఎక్కువై, ఎక్కువ తినాల్సి వచ్చి, మళ్లీ బరువు పెరిగే ముప్పు ఉంటుంది. ఏ ఆహార పద్ధతిలో అధిక కొవ్వు నిల్వల సమస్య వచ్చిందో ఆ ఆహార పద్ధతిలోనే కొన్ని మార్పులు చేసినంత మాత్రాన గణనీయమైన ఫలితాలు సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఊబకాయానికి కారణమైన బరువును, ఆ బరువుకు కారణమైన కొవ్వు నిల్వలను గణనీయమైన స్థాయిలో కరిగించుకోవాలంటే ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకునే వేరే ఆహార పద్ధతిని అనుసరించటం మేలు. లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహార పద్ధతిని అనుసరించటం ద్వారా ఆరోగ్య లక్ష్యాలను సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే, మీ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను తినటమే కాకుండా.. పిండి పదార్థాలను బాగా తక్కువగా, కొవ్వు పదార్థాలను ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీర బరువు నీరసం లేకుండా, ఆరోగ్యదాయకంగా తగ్గించుకోవచ్చని ఎల్సీహెచ్ఎఫ్ నిపుణులు, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ పీ వీ సత్యనారాయణ అంటున్నారు. ఎల్సీహెచ్ఎఫ్ డైట్‌తో పాటు ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చెయ్యటంతో పాటు వ్యాయామం జోడిస్తే మరింత ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఎల్సీహెచ్ఎఫ్ వైద్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ పద్ధతిని ఆచరించటం ద్వారా సత్ఫలితాలు సాధించటంతో పాటు కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఇన్సులిన్ నిరోధకతే కీలకంరక్తంలో చక్కెర స్థాయిని తెలిపే హెచ్‌బీఏ1సి పరీక్షతో పాటు.. ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలోకి విడుదలయ్యే గ్లూకోజ్‌ను కణజాలానికి అందించడంలో కీలకపాత్ర నిర్వహించే ఇన్సులిన్ హార్మోన్ ఏ స్థాయిలో విడుదలవుతోంది? ఎంతసేపటికి తిరిగి సాధారణ స్థితికి వస్తోంది? అనే గణాంకాలను బట్టి ఇన్సులిన్ నిరోధకత ఎంత ఉన్నదనే విషయం నిర్ధారిస్తారు. దీన్ని నిర్ధారించడానికి ‘హోమా ఐఆర్’ అనే ఓరల్ గ్లూకోజ్ టెస్ట్ చేస్తారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తక్కువగా ఉండే వారిలో కూడా ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హెచ్‌బీఏ1సి పరీక్ష ద్వారా షుగర్ వ్యాధి నిర్ధారణ అయ్యేదానికి 15 సంవత్సరాలు ముందే హోమా–ఐఆర్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్సులిన్ నిరోధకతను తొలి దశలోనే గుర్తించి, ఆహారంలో తగిన మార్పు చేసుకుంటే షుగర్, తదనంతర గొలుసు వ్యాధుల ముప్పును తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘హోమా–ఐఆర్’ టెస్ట్‌లో ఇన్సులిన్ నిరోధకత (ఇన్సులిన్ రెసిస్టెన్స్) ఎంత ఉంది? ఆ వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యల స్థితిగతులు ఎలా ఉన్నాయి? అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని లోకార్బ్ హెల్దీ అండ్ హై ఫ్యాట్ డైట్లో పోషకాల కూర్పును, శాతాన్ని, వ్యాయామాన్ని డాక్టర్ సూచిస్తారు. ఇది ఏ ఇద్దరికీ ఒకేలా ఉండదు. ఎవరి ప్రత్యేక పరిస్థితులకు తగిన విధంగా వారికి ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్ సూచిస్తారు. కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు తమ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను మాత్రమే తీసుకోవాలన్న నియమం ఈ ఆహార పద్ధతిలో కూడా వర్తిస్తుంది. అంతకన్నా ఎక్కువ కేలరీలు తింటే బరువు పెరిగే ముప్పు ఏ ఆహార పద్ధతిలోనైనా ఉంటుంది. అందుకే కదా మితాహారం ముద్దు అని మన పెద్దలు చెప్పేది! లోకార్బ్ డైట్ ప్లానింగ్ ఎలా? ఉదాహరణకు 177 సెం.మీ. ఎత్తు, 59 ఏళ్ల వయసు ఉన్న పురుషుడు 82 కిలోల బరువు ఉన్నాడనుకుందాం. బీఎంఐ 28.5. బీఎంఆర్ 1678. మెటబాలిక్ ఏజ్ 62. పొట్ట చుట్టూ కొవ్వు 6 కన్నా తక్కువ ఉండాలి. కానీ, 11 ఉంది. బీపీ, షుగర్ లేదు. ఫ్యాటీ లివర్ గ్రేడ్1 ఉంది. ఇన్సులిన్ నిరోధకత ఉంది. జాగ్రత్త పడకపోతే కొద్ది సంవత్సరాల్లో షుగర్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఇదీ అతనికి ఇచ్చిన ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్.. రోజులో 1500 కిలోకేలరీలకన్నా తక్కువ ఆహారం తినాలి. నికర పిండి పదార్థాలు 20 గ్రాములకు మించకూడదు. 60 గ్రాములు ప్రొటీన్లు, 100–150 గ్రాముల కొవ్వు పదార్థాలను తీసుకోవాలి. క్రమశిక్షణతో ఈ ఆహార నియమాలతో పాటు వ్యాయామం చేస్తూ ఉంటే 6 నెలల్లోనే బీఎంఐ 23.5కు, పొట్ట 7కు తగ్గింది. రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్వంటకం ఏదైనా, అందులో ఉపయోగించే ప్రతి పదార్ధానికి సంబంధించిన స్థూల పోషక విలువలను విధిగా లెక్కించాలి. పొద్దున్నే ఆ రోజు తినాలనుకునే పదార్థాలతో పట్టిక తయారు చేసుకోవాలి. ఏవి తిన్నా రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్ పరిమితుల మేరకే తినాలి. వాటిలో నికర పిండి పదార్థం (పిండి పదార్థంలో నుంచి పీచును తీసేస్తే మిగిలేది నికర పిండి పదార్థం) ఎంత? ప్రొటీన్లెన్ని? కొవ్వు పదార్థం ఎంత? అని సరిచూసుకొని, తూకం వేసుకొని, ముందే పట్టిక రాసుకోవటం అతి ముఖ్యమైన విషయం. ఆ తర్వాతే ఏది తినాలో, ఎంత తినాలో నిర్ణయించుకొని అంతే తినాలి. నెయ్యి లేదా వెన్న, కాఫీ (లేదా టీ) డికాక్షన్/ వేడి నీటితో కలిపి, గిలకొట్టి తయారు చేసుకొని తీసుకునే ‘బుల్లెట్ కాఫీ’ ఈ ఆహార పద్ధతిలో చాలా కీలకమైన ఉదయకాలపు శక్తి వనరు. 50 గ్రా. నెయ్యి/వెన్న, 25 గ్రా. పాల మీగడ, 5 గ్రా. గానుగ కొబ్బరి నూనె, 100 ఎం.ఎల్. కాఫీ డికాక్షన్ కలిపి దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకునే ‘బుల్లెట్ కాఫీ’లో 1.3 గ్రా. నికర పిండి పదార్థాలు, 1.4 గ్రా. ప్రొటీన్, 45.9 గ్రా. కొవ్వు పదార్థాలు, 418 కిలోకేలరీల శక్తి ఉంటాయి. వ్యక్తి అవసరాలను బట్టి నెయ్యి/వెన్న, పాల మీగడల మోతాదులో హెచ్చు తగ్గులు చేసుకోవచ్చు. రోజంతా తీసుకునే కేలరీల్లో దాదాపు మూడింట ఒకవంతు బుల్లెట్ కాఫీ ద్వారానే సమకూర్చుకోవచ్చు. దాహాన్ని బట్టి తాగునీటిని పుష్కలంగా తాగాలి. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, పిక్కలను విధిగా, తగు మాత్రంగా రోజువారీ మెనూలో చేర్చుకుంటే సూక్ష్మపోషకాల లోపం రాకుండా ఉంటుంది. వంటకాలు వ్యక్తిగత ఆహారపు అలవాట్లు, ఆసక్తులు, లభ్యత, కొనుగోలు శక్తిని బట్టి ఏ రోజుకారోజు వారానికి ఒక షెడ్యూల్ పెట్టుకొని పునరావృతం చేసుకోవచ్చు. ఇతరత్రా ఆహార పదార్థాలు రోజుకోలా మారుతుంటాయి. బుల్లెట్ కాఫీ మాత్రం రోజూ తీసుకోవాలి. మాంసాహారులకు ఈ ఆహార పద్ధతి కొంత సులువు. గుడ్డు కూడా ముట్టని శాకాహారులైతే చాలా రకాల ప్రత్యామ్నాయ ఆహారాలు సమకూర్చుకొని తినాల్సి వస్తుంది. వీగన్లకు ఇంకా కొంచెం కష్టం. ఫుడ్ సప్లిమెంట్లు వాడుకోవాల్సి ఉంటుంది. అతిగా తిన్న పిండి పదార్థాల వల్ల శరీరంలో పెరిగిపోయిన కొవ్వు నిల్వలను కొవ్వు ప్రధాన ఆహారంతో కరిగించాలంటే తెలివైన ప్రణాళిక, రాజీలేని క్రమశిక్షణతో కూడిన ఆచరణే వజ్రాయుధాలు!హెచ్చరిక: ఈ కథనం ఉద్దేశం ఎల్సీహెచ్ఎఫ్ డైట్ గురించి కొంతమేరకు అవగాహన కలిగించటానికి మాత్రమే. మరింత లోతైన అవగాహన కోసం ‘లో కార్బ్ స్కూల్’ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూడండి. ఎల్సీహెచ్ఎఫ్ డైట్‌పై అవగాహన గల వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ ఆహార పద్ధతిని అనుసరించబూనుకోవటం ఆశించిన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చకపోగా అనర్థాలకు దారితీసే అవకాశాలు మెండుగా ఉంటాయి. జాగ్రత్త. లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ ‘ఆరోగ్యకరమైన’ ట్రెండ్రోజూ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఉండేది పిండి పదార్థాలే. వీటివల్ల మనం రోగాల బారిన పడుతున్నాం. కడుపులోకి వెళ్లిన పిండి పదార్థాన్ని పచనం చేసి, గ్లూకోజ్‌గా మార్చి, శరీరానికి శక్తినిచ్చే పని ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా జరుగుతుంది. అవసరానికి మించి పిండి పదార్థాలు, హానికరమైన కొవ్వు పదార్థాలను మనం రోజూ తినడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల శరీరంలో అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ ఫలితం లేని స్థితికి చేరినప్పుడు ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ (ఇన్సులిన్ నిరోధకత) ఏర్పడుతోంది. అధిక బరువు దగ్గరి నుంచి క్యాన్సర్ వరకు 64 రకాల జబ్బులకు ఇదే కారణమవుతోందన్న అవగాహన ఇటీవల కాలంలో పెరిగింది. అందువల్ల పిండిపదార్థాలను తక్కువగా తీసుకుంటూ.. మాంసకృత్తులు, ఆరోగ్యదాయకమైన కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే ‘లో కార్బ్ హెల్దీ ఫ్యాట్’ – ఎల్సీహెచ్ఎఫ్ ఆహార పద్ధతిగా చెబుతున్నారు.పిండి పదార్థాలను ఎక్కువగా తింటే.. మనం తినే ఆహారం జీర్ణమై గ్లూకోజ్‌గా మారి, శరీర భాగాలు నిర్విరామంగా పనిచేయటానికి శక్తిగా ఉపయోగపడుతుంది. ఆహారంలో పిండి పదార్థాలు పెరిగితే రక్తంలో చక్కెర శాతాలూ పెరుగుతాయి. శరీరం ఈ చక్కెరలను కరిగించడానికి, శక్తి ఉత్పత్తి చేయటానికి కనీసం 2 నుంచి 3 గంటల సమయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియను నిర్వహించే ఇన్సులిన్ చాలినంత లేకపోయినా, సరిగ్గా పనిచేయకపోయినా రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉండదు.⇒ ఆహారం ద్వారా అందే గ్లూకోజ్‌లో అవసరమైనప్పుడు వెంటనే వాడుకోవటానికి వీలుగా కొంత మేరకు గ్లైకోజెన్ గా మారుతుంది. మిగిలిపోయిన అదనపు శక్తిని కొవ్వుగా మార్చి నిల్వ చేసుకునే సామర్థ్యం శరీరానికి ఉంది.⇒ గ్లైకోజెన్ .. బ్యాంకు ఖాతాలో ఎప్పుడైనా వాడుకోవటానికి సిద్ధంగా ఉండే సొమ్ములాంటిది. కొవ్వుగా మారిన గ్లూకోజ్‌ను.. ఫిక్స్డ్ డిపాజిట్‌గా చెప్పుకోవచ్చు.⇒ గ్లూకోజ్ ఒకసారి కొవ్వుగా మారితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప, తిరిగి దానికదే గ్లూకోజ్‌గా మారదు. ఈ కొవ్వును జీవన క్రియ ద్వారానే కరిగించి శక్తిగా మార్చగలం. ⇒ పిండి పదార్థాలు తక్కువగా, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహారం తీసుకుంటే శరీరంలో అధిక కొవ్వును సులువుగా కరిగించవచ్చు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటే..ఊబకాయులు ఆహారం పరిమితం చేసినా, ఉపవాసం ఉన్నా కూడా బరువు తగ్గటం కంటే పెరుగుతారు. ఈ విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే, మనకు ఎక్కువ ఆకలి వేసినప్పుడు ఇన్సులిన్ ప్రభావం అధికమై ఆహారంలోని పిండి పదార్థాలను కొవ్వుగా మార్చి నిల్వ చేస్తుంది. ఈ పరిస్థితి మారాలంటే మన ఆహారంలో అధిక సంతృప్త కొవ్వులు ఉన్న నూనె వాడాలి. తద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి, బరువు పెరుగుదలను నివారించవచ్చు. దీనికి తక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారాన్ని కలిపితే శరీరంలో ఉన్న నిల్వ కొవ్వు కూడా కరగటం మొదలవుతుంది. పిండి పదార్థాలను అతి తక్కువగా, కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరం శక్తి వినియోగ పద్ధతి గ్లూకోజ్ నుంచి కీటోన్ బాడీస్‌కి షిఫ్ట్ అవుతుందని డాక్టర్ పీ వీ సత్యనారాయణ తెలిపారు. శక్తి వనరుగా (పిండి పదార్థాల ద్వారా అందే) గ్లూకోజ్‌కు బదులుగా (కొవ్వు పదార్థాల ద్వారా అందే) కీటోన్ బాడీస్‌పై శరీరం ఆధారపడుతుంది. బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీల ఆహారం తీసుకున్నప్పుడు శరీరంలో కొవ్వు నిల్వలను కరిగించి వాడుకోవటానికి శరీరం అలవాటు పడుతుంది. పిండి పదార్థాలు తక్కువగా తినటం వల్ల ఇన్సులిన్ నాణ్యత మెరుగుపడుతుంది. క్రమంగా ఇన్సులిన్ నిరోధకత సమస్య కూడా తీరుతుంది. ఈ విధంగా ఇన్సులిన్ నిరోధకతతో వచ్చిన జీవన శైలి జబ్బులు సైతం మందులు లేకుండానే సమసిపోతాయని డా. సత్యనారాయణ వివరించారు.ఏమేమి తినొచ్చు?లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్) డైట్లో కొవ్వులు, ప్రొటీన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తినాలి అంతే. ఈ పరిమితుల్లో ఏయే ఆహార పదార్థాలను సమకూర్చుకోగలిగితే, ఏవి ఇష్టపడితే వాటిని తినొచ్చు. ఏయే ఆహార పదార్థాల్లో, ఏయే వంటకాల్లో మొత్తం ఈ మూడు పోషకాలు ఎనెన్ని గ్రాములు, ఎన్నెన్ని కిలో కేలరీలు ఉన్నాయో లెక్క వేసుకొని, పోషకాహార పట్టిక రాసుకొని మరీ తినాలి. మాంసాహారులు, శాకాహారులు, వీగన్లు ఎవరైనా ఈ డైట్‌ను అనుసరించవచ్చు. వంద గ్రాములు బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలలో 50 గ్రాములకు పైగా పిండి పదార్థాలుంటాయి కాబట్టి అవిగానీ, వాటితో వండిన వంటకాలు గానీ తినటానికి లేదు. నెయ్యి, వెన్న, కూరగాయలు, ఆకుకూరలు, గుడ్లు, గింజలు, మాంసం తినొచ్చు. మసాలాలు మామూలే. కొబ్బరి గానుగ నూనె వాడాలి. కొబ్బరి పిండి రొట్టెలు, బాదం పిండి రొట్టెలు, అవిసె పిండి రొట్టెలు తినొచ్చు.ఏ నిష్పత్తిలో తీసుకోవాలి?ప్రధానంగా మనం తీసుకునే ఆహారంలోని స్థూల పోషకాలు మూడు.. పిండి పదార్థాలు(కార్బోహైడ్రేట్లు), మాంసకృత్తులు (ప్రొటీన్లు), ఆరోగ్యదాయకమైన కొవ్వు పదార్థాలు (హెల్దీ ఫ్యాట్స్). ఎల్సీహెచ్ఎఫ్ పద్ధతి ప్రకారం.. ఉదాహరణకు.. 172 సెం.మీ. ఎత్తు, 82 కిలోల బరువు ఉన్న వ్యక్తి.. బరువు తగ్గాలనుకుంటే.. రోజువారీ తీసుకోవాల్సినవి..నికర పిండి పదార్థాలు – 20 గ్రా.(పిండి పదార్థం నుంచి పీచును మినహాయిస్తే మిగిలేవి నెట్ కార్బోహైడ్రేట్లు)మాంసకృత్తులు – 70 గ్రా.ఆరోగ్యకరమైన కొవ్వులు – 100–150 గ్రా.ఈ మూడూ కలిపి కనిష్ఠంగా 1200 నుంచి గరిష్ఠంగా 1500 క్యాలరీల వరకు తీసుకోవాలి.ఈ ఆహార విధానం అందరికీ ఒకేలా ఉండదు. అందువల్ల దీనిపై అవగాహన ఉన్న వైద్యులను సంప్రదించి, వారి పర్యవేక్షణలోనే ఈ ఆహారం, జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి మనిషికి వారి వారి అనారోగ్య సమస్యలు, ఆరోగ్య లక్ష్యాలు.. వీటన్నింటి ఆధారంగా వైద్యులు అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తారు. ఈ ఆహార నియమావళికి అలవాటు పడటానికి కొన్ని రోజుల నుంచి కొన్ని వారాలు సమయం పట్టవచ్చు.ఆహారంలో ఎక్కువ పరిమాణంలో అవసరమైన పోషకాలను స్థూల పోషకాలని, అతి తక్కువ మోతాదులో అవసరమైన వాటిని సూక్ష్మ పోషకాలని అంటాం. స్థూల పోషకాలైనా, సూక్ష్మ పోషకాలైనా ఆ వ్యక్తి వయసు, ఎత్తు, శారీరక శ్రమ అవసరాలకు తగిన మోతాదులో ఉండాలి. పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు తదితర పోషకాలను అవసరమైనంత, సమతులమైన పాళ్లలో తినాలి. కాని, మనలో చాలామంది ఈ క్రమశిక్షణ పాటించటం లేదు. ఎంత తింటే ఆరోగ్యకరం?ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ ‘మై ప్లేట్ ఫర్ ది డే’ 2024 సిఫారసుల ప్రకారం.. సగటు భారతీయ వ్యక్తి రోజులో తీసుకునే కిలోకేలరీల శక్తిలో వరి బియ్యం, గోధుమ పిండి, చిరుధాన్యాలన్నీ కలిపి 45%కు పరిమితం చేయాలి. పప్పుధాన్యాలు, గుడ్లు, మాంసాహారం 14%–15% వరకు ఉండాలి. కొవ్వు 30% కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి. గింజలు, నూనె గింజలు, పాలు, పాల ఉత్పత్తులు 8%–10% వరకు తీసుకోవాలి.ఎంత తింటున్నాం?కేంద్ర ప్రభుత్వ ‘గృహ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్)’ ప్రకారం 2023–24లో పట్టణ వాసులు సగటున తలసరి ఆహార వినియోగం రోజుకు 2,233 కిలో కేలరీల మేరకు ఉంది. 338 గ్రాముల పిండి పదార్థాలు (1,351 కిలో కేలరీలు. 61%), 63 గ్రాముల ప్రొటీన్లు (254 కిలో కేలరీల. 11%), 70 గ్రాముల కొవ్వు పదార్థాలు (628 కిలో కేలరీలు. 28%) తీసుకుంటున్నారు. దేశ జనాభాలో ఎక్కువ మంది సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాలను (చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, బీన్స్, గింజలు, తాజా కూరగాయలు, పండ్లు) చాలా తక్కువగా తింటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ‘ఆహార జబ్బు’ల భారం 56%భారతీయులు మోస్తున్న జబ్బుల ఆర్థిక భారంలో 56.4% మేరకు అపసవ్యమైన, అసమతుల్యతతో కూడిన ఆహారం తీసుకోవటమేనని జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్–ఎన్ఐఎన్) 2024 నాటి డైటరీ గైడ్‌లైన్స్‌లో స్పష్టం చేసింది. అసమతుల్య ఆహారం ఫలితంగా జీవక్రియలు లయ తప్పి మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడుతున్నారు. అధిక రక్తపోటు, రక్తంలో అధిక చక్కెర, అధిక ట్రైగ్లిజరైడ్లు, తక్కువ హెచ్‌డీఎల్ (మంచి) కొలెస్ట్రాల్ స్థాయి, పెరిగిన నడుము చుట్టుకొలత (ఉదర ఊబకాయం).. ఈ ఐదింటిలో ఏ మూడు ఉన్నా వారికి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్లే.సమతులాహారం, శారీరక శ్రమ ద్వారా గుండె జబ్బుల్ని, రక్తపోటు సమస్యలను తగ్గించుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్‌ను 80% వరకు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అకాల మరణాలను చాలా వరకు నివారించుకోవచ్చని ఎన్ఐఎన్ చెబుతోంది.ఎవరి లెక్క వారికే! ఒక వ్యక్తికి పిండి పదార్థాలు, ప్రోటీన్, కొవ్వు పదార్థాలు ఎన్ని గ్రాములు/కేలరీలు అవసరం? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటుంది. వ్యక్తిని బట్టి మారిపోతుంది. మీ వ్యక్తిగత పోషక అవసరాలు మీ బరువు, మీ రోజువారీ శారీరక శ్రమ స్థాయి, మీకున్న ఆరోగ్య సమస్యలు, మీ ఆరోగ్య లక్ష్యాలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇంకో ముఖ్యాంశం ఏమిటంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తున్నారు? అనే దాన్ని బట్టి కూడా పోషకాల కూర్పు, శాతం ఆధారపడి ఉంటుంది. ఆహార పద్ధతులు అనేకం ఉన్నప్పటికీ ప్రధానమైనవి రెండు రకాలు. మొదటిది: హై కార్బ్ డైట్. అంటే.. ప్రధాన శక్తి వనరుగా పిండి పదార్థాలను తీసుకోవటం. సాధారణంగా అందరూ అనుసరించే ఆహార పద్ధతి ఇదే. రెండో పద్ధతి: లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్.సి.హెచ్.ఎఫ్) డైట్. అంటే.. కొవ్వు పదార్థాలను ప్రధాన శక్తి వనరుగా తీసుకోవటం. వీటిలో ఏ ఆహార పద్ధతిని అనుసరించినా, ముఖ్యంగా మీరు ఆశించిన ఆరోగ్య లక్ష్యాలు సాధించాలంటే.. మీరు ఏ ఆహార పద్ధతిని అనుసరిస్తారు? ఎంత తినాలి? ఏది తినాలి? అనే విషయాపై నిర్ణయం తీసుకొని, ఆచరించటం ప్రారంభించాలి. ఆచి ‘తూచి’ తినాలి. ఆహార క్రమశిక్షణతో పాటు శారీరక వ్యాయామ క్రమశిక్షణను కూడా జోడించి కొనసాగించాలి. అప్పుడే మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.మీ బీఎంఐ, బీఎంఆర్ ఎంత?శరీర బరువును తగ్గించుకోవాలనుకునే వారు మొదట చెయ్యాల్సిన పని వారి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ), బాడీ మెటబాలిక్ రేట్ (బీఎంఆర్) ఎంతో తెలుసుకోవాలి. ఇటువంటి ముఖ్యమైన డేటాను తెలుసుకోవటానికిప్పుడు ‘బాడీ ఫ్యాట్ స్కేల్’ అనే డిజిటల్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో ఈ పరికరాలు పెడుతున్నారు. బరువు తూచే డిజిటల్ పరికరంలోనే బీఎంఐ, బీఎంఆర్, పొట్టచుట్టూ కొవ్వు, శరీరం మొత్తంలో కొవ్వు ఎంత ఉన్నాయి వంటి చాలా వివరాలను తెలుసుకోవచ్చు. బీఎంఐ 23 కన్నా తక్కువగా ఉంటే ఆరోగ్యకరం. 30లోపు ఉంటే అధిక బరువు, 35కి మించితే ఊబకాయంగా భావిస్తారు. ఎంత అధిక బరువు ఉంటే బీఎంఆర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఈ కొలమానాలను బట్టి బరువు తగ్గాలా? నార్మల్ రేంజ్‌లోకి రావాలంటే ఎంత తగ్గాలి? అనేది బరువుతో పాటు బీఎంఆర్‌ను కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయించుకోవాలి. వ్యక్తి శరీరంలో దైనందిన జీవక్రియలకు ఎన్ని కిలో కేలరీల శక్తి అవసరమవుతోందో బీఎంఆర్ తెలియజేస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే బీఎంఆర్ చూపే కేలరీల కన్నా రోజు మొత్తంలో తక్కువ కేలరీలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా కేలరీల కొరత సృష్టించినప్పుడు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కరిగించి వినియోగించుకోవటానికి శరీరం అలవాటుపడుతుంది. ఒకవేళ తగినంత బరువు లేని వారైతే బీఎంఆర్ కన్నా ఎక్కువ కేలరీల ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అనుకునే వ్యక్తి పని బీఎంఆర్ కన్నా తక్కువగా ఎన్ని కేలరీలు తినాలని నిర్ణయించుకున్న తర్వాత ఏ ఆహార పద్ధతిని అనుసరించాలన్న ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. బరువు పెరగడానికి దారితీసిన పిండిపదార్థాల కేలరీలనే ఎక్కువగా తీసుకునే ఆహార పద్ధతిలోనూ కొన్ని కేలరీలు తగ్గించి తింటే క్రమంగా బరువు తగ్గుతుంది. పిండి పదార్థాల శాతం గతం కన్నా తగ్గించి, ప్రొటీన్లను పెంచుకోవాలి. తగ్గాలి సరే.. అయితే, ఏ పిండి పదార్థాలైతే ఒంట్లో కొవ్వు ఎక్కువగా పెరగటానికి కారణమైనాయో వాటినే తగ్గించి తింటూ, వ్యాయామం చేస్తే ఫలితాలు వస్తాయి. అయితే, కొద్ది నెలలు బరువు తగ్గినా వ్యాయామం వల్ల ఆకలి ఎక్కువై, ఎక్కువ తినాల్సి వచ్చి, మళ్లీ బరువు పెరిగే ముప్పు ఉంటుంది. ఏ ఆహార పద్ధతిలో అధిక కొవ్వు నిల్వల సమస్య వచ్చిందో ఆ ఆహార పద్ధతిలోనే కొన్ని మార్పులు చేసినంత మాత్రాన గణనీయమైన ఫలితాలు సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఊబకాయానికి కారణమైన బరువును, ఆ బరువుకు కారణమైన కొవ్వు నిల్వలను గణనీయమైన స్థాయిలో కరిగించుకోవాలంటే ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకునే వేరే ఆహార పద్ధతిని అనుసరించటం మేలు. లో కార్బ్ హై అండ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహార పద్ధతిని అనుసరించటం ద్వారా ఆరోగ్య లక్ష్యాలను సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంటే, మీ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను తినటమే కాకుండా.. పిండి పదార్థాలను బాగా తక్కువగా, కొవ్వు పదార్థాలను ప్రొటీన్లను ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా శరీర బరువు నీరసం లేకుండా, ఆరోగ్యదాయకంగా తగ్గించుకోవచ్చని ఎల్సీహెచ్ఎఫ్ నిపుణులు, సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ పీ వీ సత్యనారాయణ అంటున్నారు. ఎల్సీహెచ్ఎఫ్ డైట్‌తో పాటు ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చెయ్యటంతో పాటు వ్యాయామం జోడిస్తే మరింత ఉత్తమ ఫలితాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఎల్సీహెచ్ఎఫ్ వైద్య నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ పద్ధతిని ఆచరించటం ద్వారా సత్ఫలితాలు సాధించటంతో పాటు కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఇన్సులిన్ నిరోధకతే కీలకంరక్తంలో చక్కెర స్థాయిని తెలిపే హెచ్‌బీఏ1సి పరీక్షతో పాటు.. ఆహారం తీసుకున్న తర్వాత రక్తంలోకి విడుదలయ్యే గ్లూకోజ్‌ను కణజాలానికి అందించడంలో కీలకపాత్ర నిర్వహించే ఇన్సులిన్ హార్మోన్ ఏ స్థాయిలో విడుదలవుతోంది? ఎంతసేపటికి తిరిగి సాధారణ స్థితికి వస్తోంది? అనే గణాంకాలను బట్టి ఇన్సులిన్ నిరోధకత ఎంత ఉన్నదనే విషయం నిర్ధారిస్తారు. దీన్ని నిర్ధారించడానికి ‘హోమా ఐఆర్’ అనే ఓరల్ గ్లూకోజ్ టెస్ట్ చేస్తారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తక్కువగా ఉండే వారిలో కూడా ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హెచ్‌బీఏ1సి పరీక్ష ద్వారా షుగర్ వ్యాధి నిర్ధారణ అయ్యేదానికి 15 సంవత్సరాలు ముందే హోమా–ఐఆర్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇన్సులిన్ నిరోధకతను తొలి దశలోనే గుర్తించి, ఆహారంలో తగిన మార్పు చేసుకుంటే షుగర్, తదనంతర గొలుసు వ్యాధుల ముప్పును తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘హోమా–ఐఆర్’ టెస్ట్‌లో ఇన్సులిన్ నిరోధకత (ఇన్సులిన్ రెసిస్టెన్స్) ఎంత ఉంది? ఆ వ్యక్తికి ఇతర ఆరోగ్య సమస్యల స్థితిగతులు ఎలా ఉన్నాయి? అనే విషయాలను పరిగణనలోకి తీసుకొని లోకార్బ్ హెల్దీ అండ్ హై ఫ్యాట్ డైట్లో పోషకాల కూర్పును, శాతాన్ని, వ్యాయామాన్ని డాక్టర్ సూచిస్తారు. ఇది ఏ ఇద్దరికీ ఒకేలా ఉండదు. ఎవరి ప్రత్యేక పరిస్థితులకు తగిన విధంగా వారికి ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్ సూచిస్తారు. కొవ్వు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువగా, పిండి పదార్థాలు అతి తక్కువగా తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు తమ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీలను మాత్రమే తీసుకోవాలన్న నియమం ఈ ఆహార పద్ధతిలో కూడా వర్తిస్తుంది. అంతకన్నా ఎక్కువ కేలరీలు తింటే బరువు పెరిగే ముప్పు ఏ ఆహార పద్ధతిలోనైనా ఉంటుంది. అందుకే కదా మితాహారం ముద్దు అని మన పెద్దలు చెప్పేది! లోకార్బ్ డైట్ ప్లానింగ్ ఎలా? ఉదాహరణకు 177 సెం.మీ. ఎత్తు, 59 ఏళ్ల వయసు ఉన్న పురుషుడు 82 కిలోల బరువు ఉన్నాడనుకుందాం. బీఎంఐ 28.5. బీఎంఆర్ 1678. మెటబాలిక్ ఏజ్ 62. పొట్ట చుట్టూ కొవ్వు 6 కన్నా తక్కువ ఉండాలి. కానీ, 11 ఉంది. బీపీ, షుగర్ లేదు. ఫ్యాటీ లివర్ గ్రేడ్1 ఉంది. ఇన్సులిన్ నిరోధకత ఉంది. జాగ్రత్త పడకపోతే కొద్ది సంవత్సరాల్లో షుగర్ బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ఇదీ అతనికి ఇచ్చిన ఎల్సీహెచ్ఎఫ్ డైట్ ప్లాన్.. రోజులో 1500 కిలోకేలరీలకన్నా తక్కువ ఆహారం తినాలి. నికర పిండి పదార్థాలు 20 గ్రాములకు మించకూడదు. 60 గ్రాములు ప్రొటీన్లు, 100–150 గ్రాముల కొవ్వు పదార్థాలను తీసుకోవాలి. క్రమశిక్షణతో ఈ ఆహార నియమాలతో పాటు వ్యాయామం చేస్తూ ఉంటే 6 నెలల్లోనే బీఎంఐ 23.5కు, పొట్ట 7కు తగ్గింది. రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్వంటకం ఏదైనా, అందులో ఉపయోగించే ప్రతి పదార్ధానికి సంబంధించిన స్థూల పోషక విలువలను విధిగా లెక్కించాలి. పొద్దున్నే ఆ రోజు తినాలనుకునే పదార్థాలతో పట్టిక తయారు చేసుకోవాలి. ఏవి తిన్నా రోజువారీ న్యూట్రిషనల్ బడ్జెట్ పరిమితుల మేరకే తినాలి. వాటిలో నికర పిండి పదార్థం (పిండి పదార్థంలో నుంచి పీచును తీసేస్తే మిగిలేది నికర పిండి పదార్థం) ఎంత? ప్రొటీన్లెన్ని? కొవ్వు పదార్థం ఎంత? అని సరిచూసుకొని, తూకం వేసుకొని, ముందే పట్టిక రాసుకోవటం అతి ముఖ్యమైన విషయం. ఆ తర్వాతే ఏది తినాలో, ఎంత తినాలో నిర్ణయించుకొని అంతే తినాలి. నెయ్యి లేదా వెన్న, కాఫీ (లేదా టీ) డికాక్షన్/ వేడి నీటితో కలిపి, గిలకొట్టి తయారు చేసుకొని తీసుకునే ‘బుల్లెట్ కాఫీ’ ఈ ఆహార పద్ధతిలో చాలా కీలకమైన ఉదయకాలపు శక్తి వనరు. 50 గ్రా. నెయ్యి/వెన్న, 25 గ్రా. పాల మీగడ, 5 గ్రా. గానుగ కొబ్బరి నూనె, 100 ఎం.ఎల్. కాఫీ డికాక్షన్ కలిపి దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకునే ‘బుల్లెట్ కాఫీ’లో 1.3 గ్రా. నికర పిండి పదార్థాలు, 1.4 గ్రా. ప్రొటీన్, 45.9 గ్రా. కొవ్వు పదార్థాలు, 418 కిలోకేలరీల శక్తి ఉంటాయి. వ్యక్తి అవసరాలను బట్టి నెయ్యి/వెన్న, పాల మీగడల మోతాదులో హెచ్చు తగ్గులు చేసుకోవచ్చు. రోజంతా తీసుకునే కేలరీల్లో దాదాపు మూడింట ఒకవంతు బుల్లెట్ కాఫీ ద్వారానే సమకూర్చుకోవచ్చు. దాహాన్ని బట్టి తాగునీటిని పుష్కలంగా తాగాలి. కూరగాయలు, ఆకుకూరలు, గింజలు, పిక్కలను విధిగా, తగు మాత్రంగా రోజువారీ మెనూలో చేర్చుకుంటే సూక్ష్మపోషకాల లోపం రాకుండా ఉంటుంది. వంటకాలు వ్యక్తిగత ఆహారపు అలవాట్లు, ఆసక్తులు, లభ్యత, కొనుగోలు శక్తిని బట్టి ఏ రోజుకారోజు వారానికి ఒక షెడ్యూల్ పెట్టుకొని పునరావృతం చేసుకోవచ్చు. ఇతరత్రా ఆహార పదార్థాలు రోజుకోలా మారుతుంటాయి. బుల్లెట్ కాఫీ మాత్రం రోజూ తీసుకోవాలి. మాంసాహారులకు ఈ ఆహార పద్ధతి కొంత సులువు. గుడ్డు కూడా ముట్టని శాకాహారులైతే చాలా రకాల ప్రత్యామ్నాయ ఆహారాలు సమకూర్చుకొని తినాల్సి వస్తుంది. వీగన్లకు ఇంకా కొంచెం కష్టం. ఫుడ్ సప్లిమెంట్లు వాడుకోవాల్సి ఉంటుంది. అతిగా తిన్న పిండి పదార్థాల వల్ల శరీరంలో పెరిగిపోయిన కొవ్వు నిల్వలను కొవ్వు ప్రధాన ఆహారంతో కరిగించాలంటే తెలివైన ప్రణాళిక, రాజీలేని క్రమశిక్షణతో కూడిన ఆచరణే వజ్రాయుధాలు!హెచ్చరిక: ఈ కథనం ఉద్దేశం ఎల్సీహెచ్ఎఫ్ డైట్ గురించి కొంతమేరకు అవగాహన కలిగించటానికి మాత్రమే. మరింత లోతైన అవగాహన కోసం ‘లో కార్బ్ స్కూల్’ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూడండి. ఎల్సీహెచ్ఎఫ్ డైట్‌పై అవగాహన గల వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ ఆహార పద్ధతిని అనుసరించబూనుకోవటం ఆశించిన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చకపోగా అనర్థాలకు దారితీసే అవకాశాలు మెండుగా ఉంటాయి. జాగ్రత్త. లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ ‘ఆరోగ్యకరమైన’ ట్రెండ్రోజూ మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఉండేది పిండి పదార్థాలే. వీటివల్ల మనం రోగాల బారిన పడుతున్నాం. కడుపులోకి వెళ్లిన పిండి పదార్థాన్ని పచనం చేసి, గ్లూకోజ్‌గా మార్చి, శరీరానికి శక్తినిచ్చే పని ఇన్సులిన్ అనే హార్మోన్ ద్వారా జరుగుతుంది. అవసరానికి మించి పిండి పదార్థాలు, హానికరమైన కొవ్వు పదార్థాలను మనం రోజూ తినడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల శరీరంలో అధికంగా ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ ఫలితం లేని స్థితికి చేరినప్పుడు ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ (ఇన్సులిన్ నిరోధకత) ఏర్పడుతోంది. అధిక బరువు దగ్గరి నుంచి క్యాన్సర్ వరకు 64 రకాల జబ్బులకు ఇదే కారణమవుతోందన్న అవగాహన ఇటీవల కాలంలో పెరిగింది. అందువల్ల పిండిపదార్థాలను తక్కువగా తీసుకుంటూ.. మాంసకృత్తులు, ఆరోగ్యదాయకమైన కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యాలు దరిచేరవు అంటున్నారు వైద్య నిపుణులు. దీన్నే ‘లో కార్బ్ హెల్దీ ఫ్యాట్’ – ఎల్సీహెచ్ఎఫ్ ఆహార పద్ధతిగా చెబుతున్నారు.పిండి పదార్థాలను ఎక్కువగా తింటే.. మనం తినే ఆహారం జీర్ణమై గ్లూకోజ్‌గా మారి, శరీర భాగాలు నిర్విరామంగా పనిచేయటానికి శక్తిగా ఉపయోగపడుతుంది. ఆహారంలో పిండి పదార్థాలు పెరిగితే రక్తంలో చక్కెర శాతాలూ పెరుగుతాయి. శరీరం ఈ చక్కెరలను కరిగించడానికి, శక్తి ఉత్పత్తి చేయటానికి కనీసం 2 నుంచి 3 గంటల సమయం తీసుకుంటుంది. ఈ ప్రక్రియను నిర్వహించే ఇన్సులిన్ చాలినంత లేకపోయినా, సరిగ్గా పనిచేయకపోయినా రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో ఉండదు.⇒ ఆహారం ద్వారా అందే గ్లూకోజ్‌లో అవసరమైనప్పుడు వెంటనే వాడుకోవటానికి వీలుగా కొంత మేరకు గ్లైకోజెన్ గా మారుతుంది. మిగిలిపోయిన అదనపు శక్తిని కొవ్వుగా మార్చి నిల్వ చేసుకునే సామర్థ్యం శరీరానికి ఉంది.⇒ గ్లైకోజెన్ .. బ్యాంకు ఖాతాలో ఎప్పుడైనా వాడుకోవటానికి సిద్ధంగా ఉండే సొమ్ములాంటిది. కొవ్వుగా మారిన గ్లూకోజ్‌ను.. ఫిక్స్డ్ డిపాజిట్‌గా చెప్పుకోవచ్చు.⇒ గ్లూకోజ్ ఒకసారి కొవ్వుగా మారితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప, తిరిగి దానికదే గ్లూకోజ్‌గా మారదు. ఈ కొవ్వును జీవన క్రియ ద్వారానే కరిగించి శక్తిగా మార్చగలం. ⇒ పిండి పదార్థాలు తక్కువగా, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే లో కార్బ్ హెల్దీ ఫ్యాట్ (ఎల్సీహెచ్ఎఫ్) ఆహారం తీసుకుంటే శరీరంలో అధిక కొవ్వును సులువుగా కరిగించవచ్చు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటే..ఊబకాయులు ఆహారం పరిమితం చేసినా, ఉపవాసం ఉన్నా కూడా బరువు తగ్గటం కంటే పెరుగుతారు. ఈ విచిత్రమైన పరిస్థితి ఎందుకంటే, మనకు ఎక్కువ ఆకలి వేసినప్పుడు ఇన్సులిన్ ప్రభావం అధికమై ఆహారంలోని పిండి పదార్థాలను కొవ్వుగా మార్చి నిల్వ చేస్తుంది. ఈ పరిస్థితి మారాలంటే మన ఆహారంలో అధిక సంతృప్త కొవ్వులు ఉన్న నూనె వాడాలి. తద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గి, బరువు పెరుగుదలను నివారించవచ్చు. దీనికి తక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారాన్ని కలిపితే శరీరంలో ఉన్న నిల్వ కొవ్వు కూడా కరగటం మొదలవుతుంది. -
అర్ధరాత్రి అతిథి
ఆ రాత్రి నాకు ఏదో చప్పుడుకి మెలకువ వచ్చింది. లేచి లైట్ వేసి పడక గదిలోంచి హాల్లోకి వచ్చాను. ఓ కొత్త వ్యక్తి నాకు కనపడ్డాడు. అతను ఎవరో, అక్కడ ఎందుకు ఉన్నాడో నాకు అర్థమైంది. ఇంట్లోకి ఎలా ప్రవేశించాడా అని చూశాను. వంటగదిలోని వెంటిలేటర్కున్న రెండు ఇనప కడ్డీలు వంచబడ్డాయి. అతని చేతిలోని రెండున్నర అడుగుల పొడవున్న పంపు గొట్టంతోనే వాటిని వంచాడని ఊహించాను. ‘‘డబ్బు.’’ అతను చెప్పాడు. ‘‘డబ్బు?’’ ‘‘డబ్బు, నగలు ఇస్తే హాని చేయకుండా వెళ్ళిపోతాను. లేదా...’’ చేతిలోని ఆయుధాన్ని ఝళిపించాడు.గోడకి వేలాడే నా షోల్డర్ బేగ్‌ని అందుకుని జిప్పుని లాగాను. అందులోంచి తీసిన పర్స్ చూపించాను. దాన్ని తనవైపు విసిరేయమన్నట్లుగా సౌంజ్ఞ చేశాడు. ఆ పని చేశాను. వంగి దాన్ని అందుకుని అందులోని డబ్బుని చూసి మొహం చిట్లించాడు. ‘‘నేను అడిగింది బిచ్చం కాదు.’’ కోపంగా చెప్పాడు. ‘‘ఇంట్లో ఉన్నదంతే.’’‘‘ఇంట్లో రెండు వందల ఏభై మాత్రమే ఉందంటే నమ్మను. నగలు ఎక్కడున్నాయి?’’ అడిగాడు. ‘‘నగలు లేవు. ఇంటి పైభాగం కొత్తగా కట్టించాను. నగలు బేంక్‌లో తాకట్టులో ఉన్నాయి. గోల్డ్ లోన్ తీసుకున్నాను.’’అతని మొహంలో అసంతృప్తి కొట్టొచ్చినట్లుగా కనిపించింది. ‘‘ఈ ఇంట్లో నువ్వు, నేను తప్ప ఇంకెవరూ లేరని నాకు తెలుసు. నువ్వు మళ్ళీ నీ ఫేమిలీ ఫోటోలోని అందరినీ చూడాలనుకుంటే నేను అడిగింది ఇచ్చి పంపు.’’ కసురుతూ చెప్పాడు. ‘‘నేను అబద్ధం చెప్పలేదు.’’ ‘‘బేంక్ గోల్డ్ లోన్ కాగితాలు చూపించు.’’ ఆ తెలివైన దొంగ కోరాడు. ‘‘అవి బేంక్ లాకర్లో ఉన్నాయి.’’ ‘‘లాకర్ తాళం చెవి చూపించు.’’ రెట్టిస్తూ అడిగాడు. నా భార్య బుర్రలా నాది చురుగ్గా ఆలోచించదు. అతన్ని భౌతికంగా ఓడించలేను. నా కష్టార్జితాన్ని అతనికి అప్పగించలేను. ‘‘ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నువ్వు చెప్పింది కట్టు కథని నాకు తెలుసు. మీ పడక గదిలో బట్టల అలమర లోపల గోడకి ఫిక్స్ చేసిన ఐరన్ సేఫ్‌ని తెరు.’’ రుసరుసలాడుతూ ఆజ్ఞాపించాడు. అందులోని నా భార్య నగల విలువ పాతిక లక్షలకి తక్కువ ఉండదు. ‘‘పద.’’ ‘‘మా ఆవిడ దాని తాళంచెవి ఎక్కడ పెట్టిందో నాకు తెలీదు.’’ ‘‘సరే. ఆవిడకి ఫోన్ చేసి అడుగు.’’‘‘ఇప్పుడా?’’ ‘‘భార్యకి భర్త ఏ సమయంలోనైనా ఫోన్ చేయొచ్చు. ముఖ్యంగా తన ప్రాణం మీదకి వచ్చిన సందర్భంలో. మీ ఆవిడతో తాళం చెవి గురించి తప్ప ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే తల పగులుతుంది. అందులో ముఖ్యమైన కాగితాలు ఉన్నాయని, రేపు వాటి అవసరం ఉందని గుర్తొచ్చిందని చెప్పు. నువ్వు చెప్పిందంతా నేను నమ్మానని అనుకోక. నీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ మాత్రమే ఇస్తున్నాను. నేనీ ఇంట్లోంచి ఈ రాత్రి డబ్బు, బంగారంతో లేదా రక్తం తడిసిన చేతులతో వెళ్ళడం మాత్రం ఖాయం. స్పీకర్ ఫోన్ ఆన్ చేసి మాట్లాడు.’’ కఠినంగా చెప్పాడు. నేను మా ఆవిడకి ఫోన్ చేశాను. ఆమె ఆన్సర్ చేసింది. ‘‘బేంక్‌లో తాకట్టు పెట్టిన బంగారం రసీదు అవసరమైంది. మన లాకర్ తాళంచెవి ఎక్కడుంది?’’ అడిగాను. ‘‘మర్చిపోయారా? అక్వేరియంలో కత్తి పక్కనే.’’ ‘‘హాల్లో అక్వేరియంలో ఉంది.’’ లైన్ కట్ చేసి అతనివైపు తిరిగి చెప్పాను. ‘‘కత్తేమిటి?’’ అడిగాడు. ‘‘ఫిష్ టేంక్లోని చేపలకి ఐరన్ అందాలని ఓ కత్తిని ఉంచాం. అది ఎవరూ వెతకని చోటని అందులో లాకర్ తాళంచెవి ఉంచుతామన్న సంగతి మర్చిపోయాను.’’ అతను నా వెంట హాల్లోకి నడిచాడు. అక్వేరియంలో ఆరంజ్, నీలం రంగు చేపలు తిరుగుతున్నాయి. నేను నీళ్ళల్లో చేతిని ఉంచబోతే అరిచాడు. ‘‘ఆగు. కత్తిని తీద్దామనా? నేను తీస్తాను.’’ నన్ను పక్కకి నెట్టి అక్వేరియం నీళ్ళలో తన ఎడమ చేతిని ఉంచాడు. అరగంట తర్వాత ఆ దొంగని అంబులెన్స్‌లోకి ఎక్కిస్తూంటే చెప్పాను.‘‘అతనికి స్టింగ్ రే చేప ముల్లు గుచ్చుకుందని డాక్టర్‌కి చెప్పండి.’’ ఆ అక్వేరియంలోని చేపల్లో ఆ చేప ఖరీదైంది. కొరడాలా ఉండే దాని తోకతో కొడితే, దాని చివర ఉన్న విషపు ముల్లు ద్వారా శరీరంలోకి విషం ఎక్కి క్షణాల్లో మనిషికి స్పృహ తప్పుతుంది. మా ఆవిడ నాలా కాదు. ఏం జరుగుతోందో ఇట్టే ఊహించింది. అతనే అందులో చేతిని ఉంచాలని, కత్తిని ఉంచినట్లు అబద్ధం చెప్పింది. చెప్పాగా. ఆవిడ మెదడంత చురుగ్గా నా బుర్ర పని చేయదు.ఆ లాకర్ తాళంచెవి మంచానికి ఉన్న చిన్న రహస్య అరలో ఉందని నాకు తెలుసని మా ఆవిడకి తెలుసు. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
కెమెరా ఆఫ్.. భూమి ఆన్!
బిగ్‌బాస్‌లో కనిపించిన నిజమైన మనసు, సహజమైన వెలుగు భూమి శెట్టిని ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇప్పుడు ఆ నిరాడంబరతలో దాగి ఉన్న ధైర్యం, నిశ్శబ్దంగా పెరిగిన శక్తి ‘మహాకాళి’గా మారి సినీ ప్రపంచంలో ఒక కొత్త రూపాన్ని సృష్టించబోతోంది. ఆ ప్రయాణంలోని విశేషాలన్నీ ఆమె మాటల్లోనే మీ కోసం. నేను కర్ణాటకలోని కుందాపురలో పుట్టాను. సముద్రపు గాలి, ఇంటి ముందున్న చెట్ల నీడ, చిన్న చిన్న పండుగల హడావుడి అవే నా బాల్యపు ఆనందాలు.అమ్మానాన్న భాస్కర్ శెట్టి, బేబీ శెట్టిలది సాధారణ జీవితం, వాళ్లు నేర్పిన విలువలే నేడు నన్ను ఉన్నతంగా తీర్చిదిద్దాయి.ఇంజినీరింగ్ చేశాను. కాని, నా మనసు మాత్రం పూర్తిగా యాక్టింగ్పైనే ఉండేది. అలా నా నటన ప్రయాణం టీవీతో మొదలైంది. ‘కిన్నరి’ సీరియల్లో చేసిన ‘మణి’ పాత్ర నాకు సినిమాల ప్రపంచానికి తలుపులు తెరిచింది. 2019లో ‘బిగ్ బాస్ కన్నడ’లోకి వెళ్లినప్పుడు ఎలాంటి అంచనాలు లేవు కాని, నా నిజమైన వ్యక్తిత్వం ప్రేక్షకుల హృదయాన్ని తాకింది. రన్నరప్‌గా బయటికి వచ్చినా కూడా, నాకు వచ్చిన ప్రేమ మాత్రం ఒక విజేతలా నిలిచింది.ఆ తర్వాత వచ్చిన ‘ఇక్కట్’ సినిమా ప్రేక్షకుల అభిమానం రెట్టింపు చేసింది. ఆ ప్రేమే నాకు సినిమా మీదున్న నమ్మకాన్ని మరింత బలపరచింది. తర్వాత వచ్చిన ‘షరతులు వర్తిస్తాయి’, ‘కింగ్డమ్’ వంటి ప్రాజెక్టులు నా నటనకు కొత్త షేడ్స్ ఇచ్చాయి. ప్రతి పాత్ర నాకు నాలో ఉన్న మరో భూమిని పరిచయం చేసింది.∙ఇప్పుడు నా ముందున్న పెద్ద మైలురాయి ‘మహాకాళి’. సూపర్‌హీరో ఫిల్మ్‌లో ఫీమేల్ లీడ్‌గా నిలవడం నాకు ఒక గౌరవం మాత్రమే కాదు. ఒక బాధ్యత కూడా. ఈ పాత్ర నా శక్తులను కొత్తగా పరీక్షించబోతోంది.∙నా రోజువారీ జీవితం మాత్రం చాలా సింపుల్. నాట్యం, కథలు, సంగీతం ఇవే నా హ్యాపీ స్పేస్.కెమెరా ముందు నటిస్తున్నంతసేపు ‘భూమి శెట్టి’ అనే వ్యక్తిని మరచిపోతాను. కాని, కెమెరా ఆఫ్ అయ్యాక మళ్లీ కుందాపుర అమ్మాయిగా నా చిన్న ప్రపంచంలోకి వెళ్తాను.∙అభిమానులు పంపే ప్రేమే నా ఎనర్జీ. వాళ్లే నా నమ్మకం. వాళ్ల వల్లే నా ప్రయాణం ప్రతి రోజూ మరింత అందంగా మారుతోంది. -
ఈ వారం కథ: సముద్రం
మలక్కా జలసంధి ..మలయా ద్వీపకల్పం సుమత్రా ద్వీపానికి మధ్య ఉన్న 930 కిలోమీటర్లు ఉన్న జలసంధి.అక్కడ నుండి పశ్చిమానికి 90 మైళ్ళ దూరంలో ఒక ఓడ ఆగి ఉంది. ఆ ఓడ మీద ఒక నలజెండా ఎగురుతూ ఉంది. దాని మీద ఒక పుర్రెబొమ్మ ఉంది.ఆ ఓడలో సుమారు ఒక ఇరవై మంది వరకు ఉన్నారు. ఓడ డెక్ మీద కూర్చున్న వారందరూ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుంది వాళ్ళ వాలకం. వారందరి చేతుల్లోనూ పుర్రెలతో తయారు చేసిన మద్యం గ్లాసులు ఉన్నాయి. వాటిల్లో పోసిన ‘రమ్’ తాగుతూ వినోదిస్తున్నారు.ఇంతలో ఒక పెద్ద అల వచ్చి ఆ డెక్ మీదకు కొన్ని చేపలను విసిరేసి సముద్రంలో కలిసిపోయింది.చెవులకు రింగు పెట్టుకుని; తలకు నల్లటి పాగా కట్టుకుని, ఆ పాగాలో పిడిబాకు ఉంచిన ఒక వ్యక్తి తన పక్కన పడి ఉన్న పెద్దచేపను చేతిలోకి తీసుకున్నాడు.దాని నోరు తెరిచి, తాను తాగుతున్న రమ్‌ను నోటిలో పోశాడు. తర్వాత దాన్ని నోటిలో పెట్టుకుని నమలసాగాడు.అదంతా చూస్తున్న మిగిలిన అందరూ ‘హే నాయకా’ అంటూ అరవసాగారు. వాళ్ళందరూ అలా అరుస్తున్న సమయంలో సముద్రంలో ఈదుకుంటూ వచ్చిన ఒక వ్యక్తి డెక్ మీదకు వచ్చాడు. అందరూ నిశ్శబ్దమై పోయారు. ‘నాయకా!’ అంటూ అతడికి సలాం చేశాడు.తరువాత తాను తెచ్చిన వివరాలతో ఒక మ్యాప్ అతడికి అందించాడు. అది చూసిన అతడు ‘మన ఓడను ఇక్కడి నుంచి ఉత్తరం దిశగా మళ్లించండి. మనం ఎదురు చూస్తున్న నౌక ఇంకొన్ని గంటల్లో బయల్దేరుతుంది’ అని ఆజ్ఞాపించాడు. ఓడ ముందుకు కదిలింది.అందరూ తమ వద్ద ఉన్న పిడిబాకులను తుపాకులను, కత్తులను పట్టుకుని ఉన్నారు. వారందరూ తమ నాయకుడి ఆజ్ఞ కోసం సిద్ధంగా ఉన్నారు.వారందరూ స ..ము ..ద్ర.. పు .. దొం.. గ.. లు ... పైరేట్స్!సాల్ శెట్టి ద్వీపం..దేశంలో అత్యంత రద్దీగా ఉండే ముంబై ఓడరేవు.కదలడానికి సిద్ధంగా ఉన్న కార్గో నౌకలతో; సముద్రతీరానికి చేరుకుంటున్న ఇతర నౌకలతో; ప్రయాణికులతో; అటు ఇటు తిరుగుతూ తమతమ విధులు నిర్వర్తిస్తున్న ఓడల సిబ్బందితో కిటకిటలాడుతోంది.తీరంలో కొద్దిదూరంలో ఒక పెద్ద నౌక లంగరు వేసి ఉంది. అది ముంబై తీరం నుంచి సింగపూర్ వరకు ప్రయాణించే క్రూజ్ షిప్ అయిన ‘రాయల్ డైమండ్ డాన్’.ప్రయాణికులందరూ ఒక్కొక్కరుగా ఓడలోకి వెళ్తున్నారు. ఎంట్ర¯Œ ్స వద్ద వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే వారిని డెక్ మీదకు పంపిస్తున్నారు.ఓడ ఎక్కబోయే ముందు ఒక అందమైన యువతి ఫోన్ మాట్లాడుతూ అక్కడ నిలబడి ఉంది. మాట్లాడుతూ మాట్లాడుతూ యథాలాపంగా ముందుకు చూసింది. అక్కడ ఒక వ్యక్తి తన వద్దకే వస్తున్నట్టు ఆమెకు అనిపించింది. ఆ వ్యక్తి కలర్ గాగుల్స్ ధరించి, జేబుల్లో చేతులు పెట్టుకుని ముందుకు వస్తున్నాడు. తల పైకెత్తి ఓడను చూస్తూ వస్తున్నట్టు ఆమెకు అర్థమైంది.ఈలోగా ఆ గాగుల్స్ ఉన్న వ్యక్తి వచ్చి ఆమెను ఢీ కొట్టాడు. ఆ ఢీ కొట్టడంతో ఆమె పట్టుకున్న ఫోన్, అతను పెట్టుకున్న గాగుల్స్ ఒకేసారి కింద పడిపోయాయి. ‘ఏయ్ మిస్టర్ కళ్ళు పైకి పెట్టుకుని నడిస్తే ఇలాగే ఉంటుంది.’ అంటూ తన ఫోన్ కోసం కిందకు వంగింది. ‘సారీ మిస్’ అంటూ ఆ వ్యక్తి కూడా గాగుల్స్ కోసం కిందకు వంగాడు. అదే సమయంలో ఇద్దరి తలలు మరోసారి ఢీ కొట్టుకున్నాయి.అబ్బా అనుకుంటూ పైకి లేచింది ఆ యువతి. ‘ఏయ్ మిస్టర్ ఇలాంటి పెద్ద ఓడను ఎప్పుడూ చూడలేదా?’చిరుకోపంగా అడిగింది. ‘ఇప్పుడే మొదటిసారి ఇంత పెద్ద ఓడను చూస్తున్నాను.’ అమాయకంగా మొహం పెట్టి ఆమెకు బదులిచ్చాడు. అతడి కళ్ళు అల్లరిగా నవ్వుతున్నాయి.ఆమెను చూస్తూ ‘మీరు చాలా అందంగా ఉన్నారు. మిస్ ఇంటర్నేషనల్ పోటీలకు బాగా సరిపోతారు’ అని ముందుకు నడుస్తూ చెప్పాడు అతడు.‘అయినా నేను సింగపూర్‌లో జరిగే మిస్ ఇంటర్నేషనల్ పోటీలకు వెళ్తున్నట్టు ఇతడికి అర్థమైందా?’ మనసులో అనుకుంటూ, ‘మిస్టర్ పోకిరి’ అనుకుంది ఆమె.తరువాత ఓడ ఎక్కడానికి వెళ్ళింది. మిస్టర్ పోకిరి కూడా డెక్ మీదకు చేరుకున్నాడు.అరగంట తర్వాత మెల్లిగా ‘రాయల్ డైమండ్ డాన్’ అరేబియా సముద్ర జలాల్లో ముందుకు కదిలి క్రమేణా వేగం పుంజుకుంది.ఇండియన్ నేవీ హెడ్ క్వార్టర్స్...ఒక బులెట్ ప్రూఫ్ కారు శరవేగంగా వచ్చి ఆ భవనం ముందు ఆగింది. అందులోంచి ఒక వ్యక్తి కిందకు దిగాడు. ఆ వ్యక్తి మొహంలో ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అతడిని చూడగానే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది ‘సెల్యూట్’ చేస్తున్నారు. కాని, అదంతా పట్టించుకోని ఆ వ్యక్తి పరిగెడుతున్నట్టే లోపలకు అడుగు పెట్టాడు.నాలుగు అంతస్తులున్న ఆ భవనంలో మూడవ అంతస్తులో ఉన్న సౌత్ బ్లాక్ వింగ్. లిఫ్ట్ కోసం చూడకుండా క్షణానికి రెండు మెట్లు ఎక్కుతూ వింగ్‌లోకి దూసుకుపోయాడు.సౌండ్ ప్రూఫ్ గది అయిన ఆ గదిలోకి దూసుకువచ్చిన ఆ వ్యక్తిని చూశాడు నేవీ చీఫ్ అగర్వాల్. తన నోట్లో ఉన్న సిగార్‌ను బయటకు తీస్తూ ఆ వ్యక్తి వంక చూశాడు. ఆ వ్యక్తి నేవీ ఆఫీసర్ తరుణ్ మిశ్రా.‘బాస్! అక్కడ దాడి జరగబోతోంది. రాయల్ డైమండ్ డాన్ నౌకను పైరేట్స్ ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నారని మనకు రహస్య సమాచారం అందింది. వెంటనే మన వాళ్ళను అలెర్ట్ చేయకపోతే నౌకలో ఉన్న ప్రయాణికులను సముద్ర దొంగలు ప్రాణాలతో వదిలిపెట్టరు.’ తరుణ్ కంగారుగా చెప్పాడు.అంతా వింటున్న అగర్వాల్ ఏమీ మాట్లాడకుండా మళ్లీ సిగార్ నోట్లో పెట్టుకుని, పైకి లేచాడు. అతడిని చూస్తూ .. ‘ఈ సమాచారం నాకు కొన్ని గంటల కిందటే వచ్చింది’ అన్నాడు తాపీగా.‘బాస్! మరిప్పుడు డైమండ్ డాన్ నౌకను కాపాడటం ఎలా?’ ఆందోళనగా అడిగాడు.‘మరేం పర్వాలేదు. సముద్రదొంగలను వెంటాడి వేటాడడానికి మన మెరైన్ కమాండో విజయ్ రాణా– డైమండ్ డాన్ నౌకలో ఉన్నాడనే సమాచారం కూడా వచ్చింది. పదిహేను రోజులు సెలవు తీసుకున్న విజయ్ ఆ షిప్లో వెళ్తున్నాడని తెలిసింది’ అన్నాడు.ఆ మాటలు వినగానే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు తరుణ్ మిశ్రా. తమ చీఫ్ కంగారు లేకుండా అలా తాపీగా ఎందుకున్నాడో అర్థమైంది.అనంత సాగర జలాలలో ‘డైమండ్ డాన్’ నౌక 2 నాటికల్ మైళ్ళ వేగంతో ప్రయాణిస్తోంది. ప్రయాణికుల్లో కొంతమంది తమ తమ క్యాబిన్లలో ఉండిపోయారు. కొంతమంది నౌకలో ఉన్న ఫుడ్ కోర్ట్స్‌లో– నౌకను చూడాలని కుతూహలంతో ఇలా ఎవరికి వారు తమతమ పనులలో ఉన్నారు.‘డైమండ్ డాన్ రెస్టారెంట్’ తాటికాయలంత మెరిసే అక్షరాలతో రాసిన పేరుని చూస్తూ లోపలికి అడుగు పెట్టాడు మిస్టర్ పోకిరి. అలా అడుగుపెట్టగానే అతడి కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. కారణం అక్కడ మిస్ ఇంటర్నేషనల్ ఫుడ్ తింటూ కూర్చుని ఉంది. ఆమెను చూడగానే ‘ఈ బ్రహ్మచారి జీవితం ఈ భామకే అంకితం’ అని పాడుతూ.. ఫుడ్ తీసుకుని వెళ్లి ఆమె ముందు కూర్చున్నాడు. ఆమె అతడిని కళ్ళెత్తి చూసి ‘ఇక్కడకు కూడా వచ్చేసాడు మిస్టర్ పోకిరి’ అనుకుంటూ తినడం మొదలెట్టింది.‘హలో మిస్! నేను మిస్టర్ బ్రహ్మచారిని మాత్రమే కాని, పోకిరిని మాత్రం కాదు’ అన్నాడు. తినడం మొదలుపెడుతూ.తాను మనసులో అనుకున్న మాటలు ఇతడికెలా తెలిశాయనుకుంటూ ఆమె ఆశ్చర్యపోయింది.ఉన్నట్టుండి తమను ఎవరో గమనిస్తున్నట్టు బలంగా అనిపించసాగింది అతడికి.వెంటనే అతడు అలెర్ట్ అయ్యాడు. కనుచివరల నుంచి చుట్టూ గమనించాడు. అందరూ ఎవరి పనుల్లో వారున్నారు కాని, మిస్ ఇంటర్నేషనల్ వెనుక ఉన్న కుర్చీల్లో ఉన్నవారు యథాలాపంగా తమనే గమనిస్తున్నారు.వారు మొత్తం నలుగురు ఉన్నారు. ఏదో తింటూ, తాగుతూ కనురెప్ప వేయకుండా ఆమెనేచూస్తున్నారు. ఆమె తినడం ముగించి, లేచి బయటకు నడిచింది. మిస్టర్ పోకిరి కూడా లేచి, ఆమె వెనుక వెళ్ళడానికి అన్నట్టుగా ముందుకు కదిలాడు.అంతలో ఆ గమనిస్తున్నవారిలో ఒకడు అతడి వద్దకు అడ్డుగా వచ్చాడు. వాడిని చూసిన మిస్టర్ పోకిరి ‘ఎవరు బాస్ నువ్వు? అడ్డు తప్పుకో’ అన్నాడు మిస్ ఇంటర్నేషనల్ వెళ్లిన వైపుగా చూస్తూ...వాడితో ఉన్న మిగిలిన ముగ్గురూ మిస్టర్ పోకిరిని చుట్టుముట్టారు. అప్పుడు గమనించాడు వారందరినీ... వారి వాలకం... వారి మాటల్లో కరుకుదనం... వారి బలిష్టమైన చేతులు... శరీరాలు కనుచివరల నుంచి గమనించాడు అతడు. అక్కడ ఉన్న నలుగురూ అదే తీరులో ఉన్నారు.వాళ్లెవరో అతడికి అర్థమైపోయింది. ఒక్కసారిగా గుండె ఝల్లుమంది. చుట్టూ చూశాడు. స్త్రీలు, చిన్నపిల్లలతో సహా నౌకలో చాలామంది అక్కడున్నారు.వారందరినీ వీళ్ళు చుట్టుముడితే? అసలు వీళ్ళు నౌకలోకి ఎలా రాగలిగారు?ఎంతమంది వచ్చారు? ఆలోచిస్తూ అక్కడి నుంచి ముందుకు కదిలాడు మిస్టర్ పోకిరి.ఆలోచిస్తూ డెక్ మీదకు వచ్చాడు.అప్పటికే అక్కడ మిస్ ఇంటర్నేషనల్ డెక్ మీద నిలబడి సముద్రాన్ని చూస్తోంది.అతడిని చూడగానే ఆమె ‘వచ్చేశాడు మిస్టర్ పోకిరి’ అని మనసులోనే తిట్టుకుంది.కాని, అతడి ఆలోచనలు వేరుగా ఉన్నాయి. అతడి మెదడు శరవేగంగా ఆలోచిస్తోంది.అతడి వెనగ్గా వచ్చిన నలుగురిలో ఇద్దరు వ్యక్తులు ఆమెను చుట్టుముట్టారు.అది చూసిన మిస్టర్ పోకిరి ఆమె చేయి పట్టుకుని ముందుకు పరుగు తీశాడు.వాళ్లిద్దరూ డెక్ చివరిభాగానికి చేరుకున్నారు. అక్కడ ఆ సమయంలో ఎవరూ లేరు.తమను చుట్టుముట్టిన ఆ ఇద్దరినీ మిస్టర్ పోకిరి గాలిలోకి డైవ్ చేస్తూ, ఊహించని వేగంతో ఒక్కసారిగా తన్నాడు. ఆ వేగానికి వాళ్లిద్దరూ అల్లంతదూరంలో పడ్డారు.పైకి లేచి అక్కడినుంచి పారిపోయారు. వారిని చూసి మిగిలిన ఇద్దరు కూడా అక్కడినుంచి జారుకున్నారు. అదే సమయంలో అతడి షూ నుంచి జారిపడిన ఐడీ కార్డును చేతిలోకి తీసుకున్న మిస్ ఇంటర్నేషనల్ ఆ కార్డు చూసి, స్థాణువులా అలా నిలబడిపోయింది.ఆమె ముందుకు వచ్చిన మిస్టర్ పోకిరి ‘హలో మిస్!’ అన్నాడు.ఆ మాటలకు ఉలిక్కిపడి తేరుకున్న ఆమె ‘మీరు మెరైన్ కమాండో విజయ్ రాణా’... అంటూ ఆగిపోయింది.తాను మిస్టర్ పోకిరి అనుకుంటున్నవాడు విజయ్ రాణా నా? అతడి గురించి తాను ఎన్నోసార్లు విని ఉంది. ఎన్నో నౌకలను, ఎందరో ప్రయాణికులను కాపాడటంలో విజయ్ రాణాను మించిన సాహసవంతుడు ఎవరూ లేరని ఎన్నోసార్లు విని ఉంది. అలాంటి వ్యక్తి తన ఎదురుగా తనతో పాటే ఉంటూ తనను కాపాడటం అనేది ఆమెకు నమ్మశక్యం కాకుండా ఉంది. ‘హలో మిస్!’... చిటికె వేస్తూ మళ్ళీ పిలిచాడు విజయ్ రాణా. తేరుకున్న ఆమె ‘నా పేరు అర్చన. మనదేశం తరపున నేను సింగపూర్‌లో జరిగే మిస్ ఇంటర్నేషనల్ పోటీలకు వెళ్తున్నాను’ అన్నది.‘మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎందుకు వెళ్తున్నారో అంతా నాకు తెలుసు’ అన్నాడు విజయ్ రాణా.ఆ మాటలకు అర్చన ఆశ్చర్యంగా ఉండిపోయింది.‘అర్చనా! మనం ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నాం. ఈ నౌకలో ఉన్న ప్రయాణికులందరినీ కాపాడాలి. నువ్వు వెంటనే నీ కేబిన్‌లోకి వెళ్ళిపో, క్విక్!’ అంటూ అక్కడి నుంచి ముందుకు కదిలాడు విజయ్ రాణా.అర్చన ‘ఏమైంది?’ అని అడిగింది. వెళ్తూ వెళ్తూ ‘ఈ నౌకలో సముద్రపు దొంగలున్నారు’... చెబుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విజయ్ రాణా.∙∙ దెబ్బ తిన్న దొంగలు కచ్చితంగా ఊరికే ఉండరు. ప్రయాణికులను భయపెట్టడమో, దోచుకోవడమో చేసే పనిలో తప్పకుండా ఉంటారని అనుకున్నాడు విజయ్ రాణా. ముందు ఈ నౌకలోకి పైరేట్స్ ఎంతమంది వచ్చారో తెలుసుకోవాలనుకుంటూ నౌక కెప్టెన్ శ్రీకర్ వద్దకు వెళ్ళాడు.‘కెప్టెన్ మన నౌకలో సముద్రపు దొంగలు ప్రవేశించారు. వారెంతమంది ఉన్నారో మొదటగా తెలుసుకోవాలి. తరువాత వారినెలా ఎదుర్కోవాలో చూద్దాం’ అన్న రాణా మాటలకు శ్రీకర్ అదిరిపడ్డాడు.‘అట్టే సమయం లేదు’ అని చెబుతున్న రాణా మాటలకు శ్రీకర్ వెంటనే వెళ్లి, నౌకలో ఉన్న కెమెరాల ఫుటేజీ మొత్తం విజయ్ రాణాకు చూపించసాగాడు.కిందటి రాత్రి నౌక ఒకచోట లంగరు వేసినప్పుడు లంగరు కోసం ఉపయోగించిన మోకులాంటి తాడు ద్వారా వాళ్ళందరూ నౌకలోకి సాధారణ ప్రయాణికుల రూపంలో వచ్చారు. వాళ్ళు సుమారు ఇరవై మంది వరకు ఉన్నారని కనిపెట్టాడు విజయ్ రాణా.అది చూడగానే వెంటనే, నౌకలో సిబ్బందిని ఆపదలో ఉన్నప్పుడు అలెర్ట్ చేసే అలారం మోగించాడు.శ్రీకర్ వెంటనే ‘మీరు విజయ్ రాణా కదా!’ అడిగాడు. చిరునవ్వుతో ఔనన్నట్లుగా తలాడించి, అక్కడినుంచి వెళ్ళిపోయాడు.ఇక ఎంతమంది సముద్రపుదొంగలు దాడి చేసినా తమకు ఎలాంటి భయం లేదనుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళాడు శ్రీకర్. అతను లోపలకు రాగానే అక్కడే ఉన్న దొంగల నాయకుడు అతడికి తుపాకీ గురి పెట్టాడు. తరువాత అతడిని బందీగా చేసుకుని, నౌకను దారి మళ్ళించమని ఆదేశించాడు.అలారం మోగగానే నౌకలో పై అంతస్తులలో ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ప్రమాదాన్ని శంకించారు. అన్ని క్యాబిన్లకు ఉన్న లాక్ సిస్టమ్‌ను ఫ్రీజ్ చేసేశారు. దాని వల్ల లోపల ఉన్నవాళ్లు బయటకు రాలేరు. బయట వాళ్ళు లోపలికి పోలేరు. కాని, భయంతో కేకలు వేస్తున్న మిగిలిన ప్రయాణికులను సముద్రపు దొంగలు చుట్టుముట్టి, అందరి తలలకు తుపాకులు ఎక్కుపెట్టారు. అందరినీ నౌక డెక్ మీదకు తీసుకు వచ్చారు. వారిలో సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు. డెక్ మీద ప్రయాణికులందరినీ నిలబెట్టారు. వారి చుట్టూ దొంగలు చుట్టుముట్టి ఉన్నారు.కెప్టెన్ శ్రీకర్ కాబిన్... దొంగల నాయకుడు అతడి పక్కనే ఉండి తలకు తుపాకీ గురిపెట్టి ఉన్నాడు. నౌకను తనకు ఇష్టం వచ్చిన దిశలో మళ్లిస్తున్నాడు.శ్రీకర్ చేసేదేమీ లేక అతడు చెప్పినట్టుగానే నౌకను నడుపుతున్నాడు.ఇంతలో ఒక్కసారిగా దొంగలనాయకుడు దూరంగా ఎగిరి పడ్డాడు. అతడి చేతిలోని తుపాకీ అల్లంత దూరంలో ఎగిరి పడింది.మెరుపువేగంతో కదిలి ఆ తుపాకీని అందుకున్నాడు విజయ్ రాణా. దొంగల నాయకుడిని ఇద్దరూ కలిసి పెడరెక్కలు విరిచి కట్టారు. అతడిని చెరోపక్క పట్టుకున్న విజయ్ రాణా, శ్రీకర్ డెక్ మీదకు వచ్చారు.అక్కడ తమ నాయకుడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్న దొంగలందరూ ఆ దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు.దొంగలనాయకుడి తలకు తుపాకీ గురిపెట్టిన విజయ్ వారిని చూస్తూ, ‘అందరూ మీ తుపాకులను, కత్తులను పక్కన పెట్టండి. లేకుంటే మీ నాయకుడి ప్రాణాలకు ముప్పు వస్తుంది’ అన్నాడు.దొంగలందరూ కలిసి తమ తుపాకులను, కత్తులను ఒక చోట పెట్టారు. ‘అందరినీ వదిలేయండి. లేకపోతే...’ అన్నాడు శ్రీకర్.అందరినీ వదిలి దొంగలందరూ ఒకపక్కగా వచ్చారు. వారిని అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది బంధించారు. అదే సమయంలో తప్పించుకున్న దొంగల నాయకుడు ముందుకు వేగంగా కదిలి తన తలపాగాలో దాచి ఉన్న పిడిబాకును బయటకు తీసి దగ్గరలో ఉన్న అర్చనను ముందుకు లాగి, ఆమె కంఠానికి గురి పెట్టాడు.అది చూసిన విజయ్ రాణా కదలకుండా అక్కడే ఆగిపోయాడు.‘మర్యాదగా మమ్మల్ని ఇక్కడనుండి వెళ్లనివ్వండి. లేకపోతే ఈ అమ్మాయిని చంపేస్తాను’ అన్నాడు దొంగల నాయకుడు.అందరూ అక్కడే ఆగిపోయారు. దొంగలందరినీ వదిలిపెట్టారు. అర్చనను ముందుకు తీసుకెళ్తున్నాడు దొంగలనాయకుడు. విజయ్ రాణా ఊహించని మెరుపువేగంతో కదిలి, దొంగలనాయకుడిని వెనుక నుంచి ఒక్క తోపు తోశాడు. ఆ దెబ్బకు దొంగల నాయకుడు ముందుకు తూలి పడిపోయాడు. కాని, రెప్పపాటులో మిగిలిన దొంగలందరూ అర్చనను చుట్టుముట్టారు. ఆమెను మధ్యలో పెట్టుకుని ముందుకు నడుస్తున్నారు.పైకి లేచిన దొంగలనాయకుడు విజయ్ రాణాను చూసి, వికటంగా నవ్వుతూ ముందుకు కదిలాడు.వారందరూ కలిసి డెక్ అంచుల వరకు వెళ్లారు. అర్చనను తీసుకుని సముద్రంలో ఉన్న తమ మరపడవలో వెళ్లిపోవాలని దొంగల నాయకుడు మిగిలినవారిని ఆదేశించాడు.అలాగే చూస్తూ ఉండిపోయిన విజయ్ రాణా మెరుపువేగంతో కదిలాడు. అతడు ఏం చేస్తాడా అని అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. రెప్పపాటు వేగంలో డెక్ దగ్గరకు చేరుకోవడం... ఒక పెద్ద రాకాసి అల ఉవ్వెత్తున లేచి డెక్ మీదకు ఉరకడం రెండు ఒకేసారి జరిగాయి.అల ధాటికి కొట్టుకుపోతున్న అర్చనను ఒక చేత్తో గట్టిగా హత్తుకుని, డెక్ మీద ఉన్న బలమైన ఉక్కు పైపును మరొకచేత్తో గట్టిగా పట్టుకున్నాడు విజయ్ రాణా.ఆ అల ధాటికి సముద్రంలోకి కొంతమంది దొంగలు కొట్టుకుపోగా, మిగిలినవారిని అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది బంధించారు. సముద్రపు దొంగల దాడికి గురైన నౌకలో ఉన్న ప్రయాణికులను ప్రత్యేక భద్రతతో ఇండియాకు తిరిగి పంపిస్తున్నారు. ఆ నౌక డెక్ మీద విజయ్ రాణా పక్కన అర్చన కూడా ఉంది.ఆమెను చూస్తూ ‘మిస్ ఇంటర్నేషనల్ పోటీలు మిస్ అయిపోయావు’ అన్నాడు విజయ్ రాణా. ‘ఈ మిస్టర్ పోకిరికి మిసెస్ కావాలని.. కావాలనే ఆ పోటీలు మిస్ చేసుకున్నాను’ అన్నది అతడిని చుట్టేసి, అతని ప్రేమకు, సాహసానికి బందీ అవుతూ... ∙శ్రీసుధామయి -
కథాకళి: వన్ బై టు
గత ఆరేళ్ళుగా ఓ కార్పొరేట్ హాస్పిటల్లో నర్స్‌గా పని చేస్తున్న అద్విత ఆరోజు అంబులెన్స్‌లో ఓ ఫామ్ హౌస్‌కి వెళ్ళింది. ఆ ఇంటి సర్వెంట్ మెయిడ్ చెప్పింది.‘‘అతను మా సార్ డ్రైవర్. వెనక ఔట్ హౌస్‌లో ఉంటాడు. కారు సిద్ధం చేయమని చెప్పడానికి వెళ్ళి చూస్తే, అపస్మారకంగా కనిపించాడు. సార్‌కి చెప్తే మీకు ఫోన్ చేయమన్నారు.’’‘‘అతనికి ఎవరైనా ఉన్నారా?’’ ఆమె వెంట నడుస్తూ అద్విత అడిగింది.‘‘లేరు. బ్రహ్మచారి. ‘జీతం బానే వస్తుంది. పెళ్ళి చేసుకోలేదే’మని అడిగితే ఓ నవ్వు నవ్వుతాడు తప్ప జవాబు చెప్పడు.’’స్ట్రెచర్‌తో ఇద్దరు పేరామెడిక్స్ వారిని అనుసరించారు. సర్వెంట్ మెయిడ్ వాళ్ళని ఫామ్ హౌస్ వెనక ఉన్న పెంకుటింటికి తీసుకెళ్ళింది. అద్విత ఇనుప బద్దీలకి అల్లిన ప్లాస్టిక్ నవారు మంచం మీది సన్నటి పరుపు మీద స్పృహలో లేని రోగిని, ఓ మూల ఉన్న డంబెల్స్‌ని చూసింది.‘‘ఇతని వయసు తెలుసా?’’ అద్విత అతని బీపీని చూస్తూ అడిగింది.‘‘రాబోయే నెలకి ముప్ఫై ఒకటి వస్తాయి అనుకుంటా.’’‘‘బీపీ బాగా పడిపోయింది. హార్ట్ ఎటాక్. గుండె బలహీనంగా కొట్టుకుంటోంది. ఇతన్ని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి.’’ స్టెతస్కోప్‌తో అతని గుండె చప్పుడుని విని, అతనికో ఇంజక్షన్ ఇచ్చి చెప్పింది. ‘‘రోజూ ఎక్సర్సైజ్ చేస్తాడు. చెడ్డ అలవాట్లు లేవు. కాఫీ, టీలు కూడా తాగడు. టీ ఇస్తానంటే, ఒంటరిగా తాగను అంటాడు. ‘నాతో కలిసి తాగు’ అంటే నీతో కాదు అంటాడు. అయినా ఇదేం ఖర్మ?’’‘‘ఈ రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యం కూడా ఓ రోగమే. చెడ్డ అలవాట్లు లేని కన్నడ నటుడు శివరాజ్ కుమార్‌కి చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ వచ్చి పోలా?’’అంబులెన్ ్సలో వెళ్ళేప్పుడు అతను కళ్ళు తెరిచి చూసి మూసుకున్నాడు. కాని వెంటనే మళ్ళీ కళ్ళు తెరచి అద్వితని చూశాడు. అతని మొహంలో బలహీనమైన చిరునవ్వు. ఏదో మాట్లాడాడు. కాని అది వినపడకపోవడంతో ఆమె తన చెవిని అతని నోటి దగ్గరికి తీసుకెళ్ళింది.‘‘నిన్ను చూస్తే సంతోషం వేస్తోంది.’’ బలహీనంగా వినిపించింది.‘‘ఫర్వాలేదు. భయపడక. నీకేం కాదు.’’ అతని భుజం తట్టి చెప్పింది.‘‘నర్స్‌గా కాదు సంతోషం.’’హాస్పిటల్‌కి చేరుకున్నాక అతన్ని ఎమర్జెన్సీ రూమ్‌కి షిఫ్ట్ చేయడంతో అద్విత బాధ్యత పూర్తయింది.అరగంట తర్వాత ఓ నర్స్ వచ్చి చెప్పింది.‘‘జూనియర్ డాక్టర్‌గారు నిన్ను రమ్మంటున్నారు.’’అక్కడికి వెళ్ళాక కార్డియాక్ మానిటర్ని చూసి, అతని గుండె ఎంత బలహీనంగా కొట్టుకుంటోందో గ్రహించింది.‘‘ఇతను నీతో మాట్లాడతాడట.’’‘‘మాట్లాడు.’’ ఆమె అతని నోటి దగ్గర తన చెవిని ఉంచి చెప్పింది.‘‘నర్సింగ్ కాలేజ్‌లో నేను బస్‌డ్రైవర్‌గా పని చేసేటప్పుడు నిన్ను చూశాను అద్వితా. రెండుసార్లు నీతో కలసి వన్ బై టు టీ తాగాలని ఉందని చెప్పాను. మూడోసారి నన్ను వేధించకు అన్నావు.’’‘‘ఓ. సారీ. నువ్వు నాకు గుర్తు లేదు.’’‘‘ఇప్పుడు నీతో కలిసి వన్ బై టు టీ తాగాలని ఉంది. ఆ టీ తాగుతూ ‘ఐ లవ్ యు’ అని చెప్పాలనుకున్నాను...’’ అతను రొప్పుతూ చెప్పాడు.‘‘మాట్లాడకు.’’ అద్విత చెప్పింది. జూనియర్ డాక్టర్ వెంటనే కేంటీన్ కి ఫోన్ చేసి వన్ బై టు టీ తీసుకురమ్మని చెప్పాడు. అది వచ్చేలోగా మాటిమాటికీ కార్డియాక్ మానిటర్ని, తలుపుని చూడసాగాడు. టీ వచ్చాక అద్విత ఓ కప్పుని అతని నోటికి అందించింది. అతను ఓ గుక్క తాగి తను చెప్పాలి అనుకున్నది ఎంత ప్రయత్నించినా చెప్పలేకపోయాడు.‘‘అతన్ని ముద్దు పెట్టుకో. తర్వాత ప్రశ్నలు.’’ జూనియర్ డాక్టర్ వెంటనే అరిచాడు.ఆమె ఆ పని చేస్తే సరిదిద్దాడు.‘‘పెదవుల మీద.’’ఆమె అతని పెదవులని తన పెదవులతో చుంబించింది. అతను కళ్ళు తెరచి ఆమె వంక చూశాడు. ఆ కళ్ళల్లో అకస్మాత్తుగా వెలుగు! క్రమంగా అది ఆరిపోయింది. మానిటర్‌లోని ఆకుపచ్చ గీత స్ట్రైట్ లైన్ గా మారింది. జూనియర్ డాక్టర్ అతని మొహం మీద దుప్పటిని కప్పాడు.రెండు కన్నీటి చుక్కలు ఆ టీ కప్పుల్లో పడ్డాయి.‘‘ఇతను నిన్ను ప్రేమించాడని తెలిస్తే మన పెళ్ళి జరిగేది కాదేమో!’’ జూనియర్ డాక్టర్ అద్వితతో చెప్పాడు.∙∙ అద్విత టీ తాగటం మానేసింది. పూర్తిగా. ఒంటరిగా కూడా. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి ‘ఫన్డే’లో ప్రచురితమయ్యే ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడాభాగస్వాములను చేయనున్నారు. మీరైతే ఈ కథకు ఏ పేరు పెడతారో ఈ కింది మెయిల్‌కు పంపండి. kathakalisakshi@gmail.com -
హైహయుల కథ
హైహయ వంశంలో కార్తవీర్యార్జునుడు అనే మహారాజు ఉండేవాడు. నర్మదా తీరంలోని మహిష్మతీ నగరాన్ని రాజధానిగా చేసుకుని, రాజ్యాన్ని పాలించేవాడు. కార్తవీర్యార్జునుడి వద్ద భృగువంశ విప్రులు పురోహితులుగా ఉండేవారు. వారి ఆధ్వర్యంలో కార్తవీర్యార్జునుడు అనేక యజ్ఞయాగాదులు చేశాడు. అతడు చేసిన దానాలతో, అతడి నుంచి అందుకున్న సంభావనలతో భృగువంశీయులందరూ సంపన్నులయ్యారు. కార్తవీర్యార్జునుడు స్వర్గస్థుడయ్యాక హైహయులు నిర్ధనులయ్యారు. ఒకసారి వారికి పెద్దమొత్తంలో ధనం అవసరమైంది. హైహయులు సుక్షత్రియులే అయినా, అహం చంపుకొని భృగువంశ పురోహితులను ఆర్థిక సహాయాన్ని అభ్యర్థించారు. లుబ్ధులైన భార్గవులు లేదు పొమ్మంటూ హైహయులకు మొండిచేయి చూపారు. హైహయులు తమ సంపదను బలవంతంగా దోచుకుంటారేమోనని భయపడిన భార్గవులు తమ వద్దనున్న అపార ధనరాశులను భూమిలో పాతిపెట్టి, తట్టా బుట్టా సర్దుకుని, భార్యా బిడ్డలతో పాటు మహిష్మతీ నగరాన్ని విడిచిపెట్టి, అడవుల్లోకి పారిపోయారు.హైహయులకు ఎక్కడా ధనం దొరకలేదు. మనసు చంపుకొని భార్గవులనే మరోసారి అడుగుదామని వారి ఆశ్రమాలకు వచ్చారు. అన్నీ ఖాళీగా ఉన్నాయి. వారందరూ పారిపోయారని తెలిసింది. ధనరాశులను పాతిపెట్టి ఉంటారని అనుమానించిన హైహయులు ఇళ్లన్నీ తవ్వారు. అంతులేని ధనరాశులు దొరికాయి. ఈ సంగతి తెలిసిన భార్గవులలో కొందరు లబోదిబోమంటూ తిరిగి తమ ఆశ్రమాలకు వచ్చారు. క్షమించమంటూ హైహయుల కాళ్ల మీద పడ్డారు. తాము సవినయంగా అడిగితే ధనం లేదని చెప్పి, పాతిపెట్టి పారిపోయిన భార్గవులపై హైహయులు మండిపడ్డారు. వారిపై ధనుర్బాణాలను ఎక్కుపెట్టారు. దొరికిన వారిని దొరికినట్లుగా మట్టుబెట్టారు. అడవులలో తలదాచుకున్న భార్గవులను వెదికి వెదికి మరీ సంహరించడం ప్రారంభించారు. ఈ బీభత్సానికి భార్గవుల పత్నులు రోదనలు ప్రారంభించారు. హైహయుల మారణకాండ వల్ల చెలరేగిన కలకలానికి, రోదనలకు చుట్టుపక్కల ఆశ్రమాల్లోని మునీశ్వరులు ఏదో దారుణం జరుగుతోందని తలచి పరుగు పరుగున అక్కడకు చేరుకున్నారు. వారు అక్కడికి చేరుకునే సరికి హైహయులు భార్గవులను ఊచకోత కోస్తూ కనిపించారు. మునిగణమంతా హైహయులకు అడ్డువెళ్లి, వారించారు. విప్రులను వధించడం పాపకృత్యమని, ఈ హింసాకాండను ఇక్కడితో విరమించుకోమని హెచ్చరించారు. మునిగణం వారించడంతో హైహయులు కొంత శాంతించారు. ఆగ్రహావేశాల నుంచి తేరుకుని, పెదవి విప్పారు.‘మునీశ్వరులారా! మీరు మమ్మల్ని నిందిస్తున్నారే గాని, వీరు మా పట్ల చేసిన పాపకృత్యం మీకు తెలియదు. వీరు మా పూర్వీకుల వద్ద పౌరోహిత్యం చేసేవారు. మా పూర్వీకుల నుంచి భూరి దానాలు, సంభావనలు స్వీకరించి ధనాఢ్యులయ్యారు. వీరు విప్రులు కాదు, నయవంచకులు, పరమ లోభులు. మాకు అత్యవసరం ఏర్పడి ధనాన్ని సర్దుబాటు చేయమని సవినయంగా అర్థిస్తే, కనికరమైనా లేకుండా, లేదు పొమ్మన్నారు. పైగా మేమెక్కడ బలవంతం చేస్తామోనని అనుమానించి, ధనరాశులను భూమిలో పాతిపెట్టి, అడవులకు చేరుకున్నారు. కృతజ్ఞత కలిగిన మనుషులు చేయదగిన పనేనా ఇది? వీరిని చంపుతున్నామంటే, చంపమా మరి? వీరికి ఈ ధనరాశులన్నీ మా పూర్వీకుడైన కార్తవీర్యార్జునుడు లోక క్షేమం కోసం యజ్ఞ యాగాదులు చేయమని, తాము సుఖంగా బతకమని, యాచకులకు దానం చేయమని వీరికి అపార ధనరాశులను ఇచ్చాడు. వీళ్లు ఈ మూడింటిలో ఏ ఒక్క పనీ చేయలేదు. పైగా లోభంతో ధనరాశులను భూమిలో పాతిపెట్టారు. పరమ లోభులైన ఈ నీచులను విప్రులు అనవచ్చునా? యజమానుల క్షేమం కోరుకోని వీరు లోకక్షేమాన్ని కాంక్షిస్తారనుకోగలమా? ధనానికి మూడే గతులు. దానం, భోగం, నాశం. దానం చేయక, తాను అనుభవించక ధనం కూడబెట్టిన లోభులు వంచకులు, దండనార్హులు. అందుకే మేము ఈ వంచకులను దండించాం. ఇందులో మా తప్పులేదని మా అభిప్రాయం. దీని గురించి మీరు మాపై కినుక వహించకండి’ అన్నారు.హైహయుల సమాధానానికి మునీశ్వరులెవరూ మారు పలకలేకపోయారు. అయితే, మునిగణం రాకతో హైహయులు ఆగ్రహం నుంచి బయటపడ్డారు. రోదిస్తున్న భార్గవుల పత్నులను ప్రాణాలతో విడిచిపెట్టారు. అప్పటికే భయకంపితులై ఉన్న ఆ స్త్రీలు, ప్రాణాలు దక్కడమే చాలనుకుని, అక్కడి నుంచి బయలుదేరి హిమవంతం చేరుకున్నారు.హిమాలయాలకు చేరుకున్న భార్గవుల పత్నులు కొన్నాళ్లకు భయాందోళనల నుంచి తేరుకున్నారు. వారంతా నదీతీరంలో మట్టితో గౌరీదేవి బొమ్మను చేసి, దీక్షగా అర్చించారు. వారి భక్తికి ప్రసన్నురాలైన దేవి కలలో కనిపించింది. ‘మీలో ఒకరికి ఊరు అంశతో కొడుకు పుడతాడు. అతడే మీ దుఃఖాలను తొలగించగలడు’ అని పలికింది. కొన్నాళ్లకు భార్గవపత్నులలో ఒకరికి తొడలో గర్భం ఏర్పడింది. ఒకనాడు వారు ఉంటున్నవైపు హైహయులు వచ్చారు. వారిని చూసి భార్గవపత్నులు భయకంపితులై పరుగులు తీశారు. హైహయులు వారిని వెంబడించారు. పరుగు తీయలేని ఊరుగర్భిణిని ఖడ్గధారులైన హైహయులు చుట్టుముట్టారు. ఊరుగర్భంలో ఉన్న బాలకుడు తన తల్లి దీనావస్థకు చలించిపోయి, గర్భాన్ని చీల్చుకుని బయటకు వచ్చాడు. మార్తాండకాంతితో మెరిసిపోతున్న ఆ బాలుడిని చూడటంతోనే హైహయులకు కళ్లు పోయాయి. ఇది పాతివ్రత్య మహిమ అని గ్రహించిన హైహయులు రోదిస్తూ ఆ తల్లి కాళ్ల మీద పడ్డారు. ‘తల్లీ! కనికరించు’ అని ప్రాధేయపడ్డారు. ‘క్షత్రియవీరులైన మీరు నావంటి సామాన్య స్త్రీని ప్రాధేయపడటం తగదు. నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు. తన తాత తండ్రులను చంపినందుకు నా కుమారుడికే మీ మీద కోపంగా ఉంది. ఇతడు జగదీశ్వరి ప్రసాదంగా నాకు జన్మించాడు. అతడే మిమ్మల్ని క్షమించగలడు’ అని చెప్పింది. హైహయులు వెంటనే ఆ బాలుడి పాదాల మీద పడ్డారు. బాలభార్గవుడు ప్రసన్నుడై, వారికి దృష్టి ప్రసాదించాడు. ధర్మబద్ధంగా పాలన సాగించండి అని హితవు చెప్పి, వారిని పంపాడు.సాంఖ్యాయన -
పోలీసులూ జైలుకెళ్లారు!!
లంచాలు తీసుకుంటూ చిక్కి, ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టి, అవకతవకలకు పాల్పడి, నేరాలు చేసి, చివరకు రాజకీయ కక్షసాధింపుల వల్ల– రకరకాల కారణాలతో పోలీసులు జైలు పాలైన ఉదంతాలను వింటుంటాం. కొన్ని కేసుల దర్యాప్తులో భాగంగా నిందితులను విచారించడానికి కోర్టు అనుమతితోనూ పోలీసులు జైలు లోపలకు వెళతారు. అయితే ఎలాంటి ఆధారం లేకుండా, అగమ్యగోచరంగా ఉన్న ఓ కేసు దర్యాప్తుకు అవసరమైన సమాచారం సేకరించడానికి అరెస్టైన ఓ పోలీసు అధికారి కొన్ని రోజులు జైల్లో, ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైదీల మధ్య గడిపాడు. ఇది 2007 సెప్టెంబర్‌లో చోటు చేసుకుంది. గోకుల్‌చాట్, లుంబినీ పార్కు పేలుళ్ల కేసు దర్యాప్తు నేపథ్యంలో ఈ ఉదంతం జరిగింది. హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్, లుంబినీపార్క్‌ల్లో 2007 ఆగస్టు 25న సాయంత్రం జంట పేలుళ్లు జరిగాయి. అదే రోజు దిల్‌సుఖ్‌నగర్‌లోని వెంకటాద్రి థియేటర్ సమీపంలో మరో పేలని బాంబు పోలీసులకు దొరికింది. ఆ రెండు చోట్లా జరిగిన పేలుళ్లలో 45 మంది మరణించారు. దాదాపు మూడువందల మంది గాయపడ్డారు. ఈ ఘాతుకానికి సరిగ్గా వంద రోజుల ముందు 2007 మే 18 మధ్యాహ్నం హైదరాబాద్ పాతబస్తీలో ఉన్న మక్కా మసీదులో బాంబు పేలుడు జరిగింది. శుక్రవారం ప్రార్థనల్ని టార్గెట్‌గా చేసుకున్న ఉగ్రవాదులు రెండు బాంబులు ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి పేలగా, మరోదాన్ని స్వా«ధీనం చేసుకున్న పోలీసులు దాన్ని నిర్వీర్యం చేశారు. ఈ విధ్వంసంలో 11 మంది మరణించగా, 19 మంది గాయపడ్డారు.హైదరాబాద్‌లో వంద రోజుల వ్యవధిలో రెండు విధ్వంసాలు జరగడంతో పోలీసు విభాగం అప్రమత్తమైంది. అప్పటికే మక్కా మసీదు పేలుడు కేసు సీబీఐకి బదిలీ కాగా, గోకుల్‌చాట్, లుంబినీపార్క్ పేలుళ్ల కేసు దర్యాప్తునకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ (సిక్) ఏర్పాటైంది. ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందిలో ఉగ్రవాదంపై పట్టున్న అధికారులను డిప్యుటేషన్‌పై సిక్లో నియమించారు. అప్పటికే ఉగ్రవాద కేసుల్లో అరెస్టయి, బయటకు వచ్చిన వ్యక్తులు, అనుమానితులు, వారి అనుచరులు– ఇలా వందల మందిని అదుపులోకి తీసుకున్న సిక్ – వీరి విచారణ కోసం హైదరాబాద్ శివార్లలోని అనేక గెస్ట్ హౌస్‌లు, ఫామ్‌హౌస్‌లు ఇంటరాగేషన్ కేంద్రాలుగా ఉపయోగించుకుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పోలీసులు ఎలాంటి ఆధారం చిక్కలేదు. భారీ సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో వారి కుటుంబీకులు, న్యాయవాదులు, పౌరహక్కుల సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి పోలీసులపై ఒత్తిడి పెరిగింది.ఆధారాలు దొరక్కపోవడంతో సిక్ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది. అప్పట్లో హైదరాబాద్‌లోని జైళ్లల్లో ఖైదీల వద్ద సెల్ఫోన్లు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి తోడు అప్పటికే రిమాండ్‌లో ఉన్న ఉగ్రవాదులను కలవడానికి వారి సంబంధీకులు వచ్చిపోతుండే వాళ్లు. ఈ పరిణామాలను గమనించిన ఓ పోలీసు అధికారికి ఓ ఆలోచన వచ్చింది. గోకుల్‌చాట్, లుంబినీపార్క్ పేలుళ్లకు సంబంధించిన సమాచారం ఏదైనా జైల్లో ఉన్న ఉగ్రవాదులకు తెలిసే అవకాశం ఉంటుందని భావించారు. జైల్లో ఉన్న వారిని ప్రశ్నిస్తే ఏదైనా క్లూ దొరుకుతుందని అనుకున్నారు. ఈ ఆలోచన బాగానే ఉన్నా, వారిని ప్రశ్నించడం ఎలా అన్నదే ఎవరికీ అంతుచిక్కలేదు. న్యాయస్థానం అనుమతి లేకుండా జైల్లోకి వెళ్లి ప్రశ్నించలేరు. కస్టడీలోకి తీసుకోవడానికి వారిపై ఎలాంటి ఆరోపణలు, ఆధారాలు లేవు. పిటిషన్లు వేసినా, పెద్ద సంఖ్యలో ఖైదీలను ప్రశ్నించడానికి కోర్టు అనుమతి లభించదు. ఇవన్నీ బేరీజు వేసిన ఓ అధికారికి వచ్చిన ఆలోచనే– నమ్మకమైన సమర్థుడైన పోలీసు అరెస్టు. ఉగ్రవాదులు నమ్మే వర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేసుకుని, ఏదో ఒక కేసులో అరెస్టు చేసి జైలుకు పంపడానికి ఉన్నతాధికారులూ అంగీకరించారు. అంతే.. సిక్లో ఉన్న అధికారులంతా తమ వద్ద పని చేసిన, చేస్తున్న వారిలో అలాంటి పోలీసు కోసం వెతికారు. అప్పట్లో ఆంధ్రా ప్రాంతంలో పని చేస్తున్న ఓ పోలీసు దీనికి సమర్థుడని అంతా అంగీకరించారు. ఆలోచనను ఆచరణలో పెట్టడానికి పోలీసు సిద్ధంగా ఉన్నా, జైలులోకి ఎలా పంపాలన్న దానిపై భారీ తర్జనభర్జన జరిగింది. చివరకు గుడుంబా ప్యాకెట్లు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై హైదరాబాద్‌లోని ఓ పోలీసుస్టేషన్లో ఆ పోలీసుపై కేసు నమోదు చేయించారు. అందులో అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్ ఖైదీగా పంపారు. ఆ పోలీసు దాదాపు 15 రోజులు జైల్లో ఉండి సమాచార సేకరణకు ప్రయత్నించారు. జైల్లో ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సిక్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. చాకచక్యంగా జైల్లో గడిపిన సదరు పోలీసు అధికారి, ఈ పేలుళ్లపై వారికి ఎలాంటి సమాచారం లేదని నిర్ధారించుకున్నాక బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆపై ఈ కేసులు ఆక్టోపస్‌కు బదిలీ కావడంతో సిక్ కథ ముగిసింది. దీంతో ‘జైలుకు వెళ్లిన పోలీసు’ తాను పని చేసే ప్రాంతానికి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆపై కొన్నాళ్లకు నాటకీయ పరిణామాల మధ్య ఆ గుడుంబా కేసు క్లోజ్ అయింది. కొన్నాళ్లకు ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) హైదరాబాద్ జంట పేలుళ్లకు కారణమని తెలిసింది. 2007 సెప్టెంబరు 13న ఢిల్లీలో వరుస పేలుళ్లు చోటు చేసుకున్నాయి. దీనికీ ఐఎం బాధ్యత ప్రకటించుకుంది. ఈ కేసులను దర్యాప్తు చేసిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు నిందితుల షెల్టర్ గుర్తించారు. అక్కడి జామియానగర్‌లోని బాట్లాహౌస్ ఎల్–18 ఫ్లాట్‌లో 2008 సెప్టెంబర్ 15న జరిగిన ఎన్కౌంటర్లో ఆతిఖ్ అలియాస్ బషర్ సహా మరో ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా, ముగ్గురు పట్టుబడ్డారు. ఈ ఉదంతంతో ఐఎం డొంక కదిలింది. ఈ ఆధారాలతో ముందుకు వెళ్లిన ముంబై క్రైమ్ బ్రాంచ్ దేశ వ్యాప్తంగా 11 విధ్వంసాలకు పాల్పడిన ఉగ్రవాదులను అరెస్టు చేసింది. వీరిలోనే జంట పేలుళ్ల నిందితులు సైతం ఉండటంతో సిక్ డీల్ చేసిన కేసులు కొలిక్కి వచ్చాయి. వీరిని పీటీ వారెంట్లపై తీసుకువచ్చి అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఈ మూడు కేసుల్లో నిందితులుగా ఉండి, అరెస్టు అయిన ఐదుగురిలో అనీఖ్, అక్బర్‌లపై 2018 సెప్టెంబర్ 4న నేరం రుజువైంది. వీరికి అదే నెల 10న ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.శ్రీరంగం కామేష్ -
ఉరుము లేని పిడుగు
1941 డిసెంబర్ 7న జపాన్ సైన్యం హవాయిలోని పెర్ల్ హార్బర్లో ఉన్న అమెరికా నౌకా స్థావరం పైన ఆకస్మికంగా దాడి జరిపింది. అసలు ఏ మాత్రం ఊహించని ఆ పరిణామంతో అమెరికా, రెండో ప్రపంచ యుద్ధంలోకి దిగక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. డిసెంబర్ 8న, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డెలానో రూజ్వెల్ట్ జపాన్ పై యుద్ధ ప్రకటన కోసం చట్ట సభ ‘కాంగ్రెస్’ ఆమోదం కోరారు. కాంగ్రెస్ వెంటనే సమ్మతించింది. అందుకు ప్రతిచర్యగా డిసెంబర్ 11న, జపాన్ తో పొత్తు ఉన్న జర్మనీ, ఇటలీ అమెరికాపై యుద్ధం ప్రకటించాయి. ఆ విధంగా అమెరికా పూర్తిస్థాయిలో రెండవ ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించవలసి వచ్చింది.స్నేహితులు శత్రువులయ్యారు!నిజానికి అమెరికా, జపాన్ ఒక జట్టులో ఉండి మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాయి. పెర్ల్ హార్బర్‌పై దాడి కారణంగా రెండో ప్రపంచ యుద్ధంలో రెండూ పరస్పరం శత్రు దేశాలు అయ్యాయి. అసలెందుకు జపాన్ పెర్ల్ హార్బర్ నౌకా స్థావరంపై దాడి చేయవలసి వచ్చింది? ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో సైనిక విస్తరణను నిలిపివేయాలని జపాన్ పై అమెరికా ఒత్తిడి తెస్తుండటమే అందుకు కారణం. పుస్తకం ఇచ్చిన ప్రేరణ!పెర్ల్ హార్బర్‌పై దాడి చేయాలన్న ఆలోచన మొదట వచ్చింది.. జపాన్ అడ్మిరల్ ‘ఇసోరోకు యమమోటో’కు. ఆ దాడికి పథక రచన చేసింది కెప్టెన్ మినోరు గెండా. యమమోటోకు ఆ ఆలోచన రావటానికి రెండు విషయాలు ప్రేరణనిచ్చాయి. ఒకటి : కాలజ్ఞాన గ్రంథం. రెండోది, అప్పటికి ఏడాది క్రితమే జరిగిన ఒక దాడి. యమమోటోకు ప్రేరణ కలిగించిన ఆ గ్రంథం పేరు ‘ది గ్రేట్ పసిఫిక్ వార్’. దానిని 1925లో బ్రిటిష్ నౌకాదళ అధికారి హెక్టర్ బైవాటర్ రాశారు. అందులోని కథాంశం, అమెరికా– జపాన్ల మధ్య ఘర్షణలు జరగడం. జపనీయులు యుఎస్ నౌకాదళాన్ని నాశనం చేయడంతో ఆ గ్రంథం ప్రారంభమై గువామ్ (పశ్చిమ పసిఫిక్ ప్రాంతం), ఫిలిప్పీన్స్ లపై జపాన్ దాడి చేయడం వరకు కొనసాగుతుంది. అలాగే, 1940 నవంబర్ 11న ఇటలీలోని టొరంటో నౌకాశ్రయంలో ఇటాలియన్ నౌకాదళంపై బ్రిటన్ రాయల్ వైమానిక దళం విజయవంతంగా దాడి చేయటం కూడా యమమోటోకు స్ఫూర్తిని ఇచ్చింది. దాడికి ఒక రోజు ముందు1941 డిసెంబర్ 6న పెర్ల్ హార్బర్లో ఓడల కదలికలు, మోహరింపు స్థానాల గురించి జపాన్ వివరాలు రాబడుతున్నట్లు అమెరికాకు సమాచారం అందింది. ఆ సమాచారాన్ని ఒక క్రిప్టాలజిస్ట్ తన ఉన్నతాధికారి అయిన మహిళా ఆఫీసర్‌కు చేరవేసి, తను డిసెంబర్ 8 సోమవారం వచ్చి కలుస్తానని చెప్పారు. ఆ మర్నాడు డిసెంబర్ 7 ఆదివారం... హవాయిలోని ఓహులో ద్వీపంలో ఒక రాడార్ ఆపరేటర్ తన కంప్యూటర్ స్క్రీన్‌పై... ద్వీపం మీదుగా వెళుతున్న పెద్ద విమానాల సమూహాన్ని చూశాడు. వెంటనే అతను ఆ విషయాన్ని తన ఉన్నతాధికారికి ఫోన్ చేసి చెప్పారు. అయితే ఆ అధికారి, ఆ విమానాలు ఆరోజు అక్కడికి రావాల్సిన యు.ఎస్. బి–17 బాంబర్ యుద్ధ విమానాలు అయి ఉండవచ్చని, వాటి గురించి ఆందోళ చెందాల్సిన పని లేదనీ చెప్పాడు. గంట 15 నిముషాల్లోనే!ఆ తర్వాత కొద్ది సేపటికే ఉదయం 7:55 గంటలకు పెర్ల్ హార్బర్‌పై జపాన్ దాడి ప్రారంభమైంది. ఆ మొత్తం దాడి కేవలం ఒక గంట 15 నిముషాల్లోనే పూర్తయింది. దానికి ముందు కెప్టెన్ మిట్సువో ఫుచిడా.. ఓహూలో ద్వీప గగన తలంలోకి రాగానే, ‘అమెరికా దిక్కుతోచని విధంగా మా చేతికి చిక్కింది’ అని చెప్పటానికి ‘టోరా, టోరా, టోరా’ అనే కోడ్ సందేశాన్ని జపాన్ నౌకాదళానికి పంపారు. నిజానికి 1907 నాటి హేగ్ సమావేశంలోని మొదటి నిబంధన ప్రకారం, దాడి ప్రారంభించే ముందు ఏ దేశమైనా ముందుగా యుద్ధ ప్రకటన చేయాలి. అయితే జపాన్ ఆ విషయాన్ని ముందస్తుగా వాషింగ్టన్‌లోని అమెరికా అధికారులకు తెలియబరచటానికి ముందే దాడి మొదలైపోయింది. దాంతో జపాన్ పెర్ల్ హార్బర్‌పై దొంగదాడి చేసినట్లయింది. విమానాల నుంచి విధ్వంసంపెర్ల్ హార్బర్‌పై జపాన్ దాడిలో నాలుగు వాహక నౌకల నుండి పైకి లేచిన 353 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. వాటిలో 40 టార్పెడో విమానాలు, 103 లెవల్ బాంబర్లు, 131 డైవ్–బాంబర్లు, 79 ఫైటర్ జెట్లు ఉన్నాయి. ఇంకా... రెండు భారీ క్రూజర్లు, 35 జలాంతర్గాములు, రెండు లైట్ క్రూజర్లు, తొమ్మిది ఆయిలర్లు, రెండు యుద్ధనౌకలు, 11 డిస్ట్రాయర్లు ఉన్నాయి. ఆ దాడిలో 68 మంది అమెరికన్ పౌరులు సహా 2,403 మంది అమెరికా సైనికులు మరణించారు. 8 యుద్ధనౌకలు సహా 19 యూఎస్ నేవీ నౌకలు ధ్వంసం అయ్యాయి. యూఎస్ పసిఫిక్ నౌకాదళానికి చెందిన మూడు విమాన వాహక నౌకలు దాడికి ముందే సముద్రంలోకి వెళ్లి ఉండటంతో జపాన్ సైన్యం వాటిని గుర్తించలేకపోయింది. డోరీ మిల్లర్ అసమాన శౌర్యంజపాన్ దాడిలో ‘యు.ఎస్.ఎస్. (యునైటెడ్ స్టేట్స్ షిప్) అరిజోనా యుద్ధనౌక’ సిబ్బంది సహా పాటుగా పసిఫిక్ మహా సముద్రంలో మునిగిపోయింది. పెర్ల్ హార్బర్ దాడిలో చనిపోయిన వారిలో సగం మంది అరిజోనా షిప్‌లోని వారే. మునిగిపోయిన యుద్ధనౌక పైన అమెరికా జెండా ఎగురుతూ ఉంది. ఆనాటి దాడిలో మరణించిన అమెరికన్ అమర వీరులకు స్మారక చిహ్నంగా ఆ జెండా నిలిచిపోయింది. యు.ఎస్.ఎస్. వెస్ట్ వర్జీనియా నౌక స్టీవార్డ్ డోరీ మిల్లర్, పెర్ల్ హార్బర్‌పై జపాన్ దాడి జరుపుతున్న సమయంలో కనబరచిన అసమాన ధైర్య సాహసాలు, విధి నిర్వహణ పట్ల ఆయన అంకిత భావం అమెరికాకు చిరస్మరణీయమైనవి. మొదట అతడు ప్రాణాంతకంగా గాయపడిన కెప్టెన్‌కు సహాయం అందించాడు. తరువాత మెషిన్‌గన్ తో రెండు జపాన్ విమానాలను ధ్వంసం చేశాడు. నిజానికి మెషిన్ గన్ని ఆపరేట్ చేయటం డోలీ మిల్లర్‌కు అదే మొదటిసారి. దాడి సమయంలో అతడు చూపిన తెగువకు, సమయస్ఫూర్తికి, సేవకు గుర్తింపుగా అమెరికా అత్యున్నత పురస్కారం ‘నేవీ క్రాస్’ లభించింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఆ నేవీ క్రాస్‌ను పొందిన మొదటి ఆఫ్రికన్ అమెరికన్ డోరీ మిల్లర్. జపాన్‌పై ప్రతీకార దాడులుపెర్ల్ హార్బర్ దాడిలో అమెరికా ప్రతిఘటనతో జపాన్ 29 విమానాలను, 5 చిన్న జలాంతర్గాములను కోల్పోయింది. ఒక జపాన్ సైనికుడు ఖైదీగా పట్టుబడ్డాడు. 129 మంది జపాన్ సైనికులు మరణించారు. పెర్ల్ హార్బర్‌పై దాడిలో పాల్గొన్న అన్ని జపాన్ నౌకలలో, ఉషియో అనే ఒక్క నౌక మాత్రమే చెక్కు చెదరకుండా బయటపడింది. దీనిని యోకోసుకా నౌకా స్థావరం వద్ద అమెరికా స్వాధీనం చేసుకుంది. కూటమి ధాటికి ఓటమిమొత్తానికి అమెరికా కోలుకుంది. అది కూడా జపాన్ ఊహించిన దాని కంటే త్వరగా! కేవలం ఆరు నెలల తర్వాత, 1942 జూన్ ఉత్తర పసిఫిక్ మహా సముద్రంలోని మిడ్వే ప్రాంతంలో అమెరికాకు చెందిన విమాన వాహక నౌకాదళం... యమమోటో నావికాదళానికి చెందిన నాలుగు జపాన్ విమాన వాహక నౌకలను ధ్వంసం చేసింది. ఈ మిడ్వే విజయం తర్వాత, 1945 సెప్టెంబరులో మూడో ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి, ఒక నెల ముందు ఆగస్టులో అమెరికా, బ్రిటన్, చైనా, రష్యాల కూటమి ధాటికి జపాన్ సామ్రాజ్యం ఓటమి పాలైంది. సాక్షి, స్పెషల్ డెస్క్ -
అప్పుడే తెలిసిపోయింది
తన ప్రయాణం ప్లాన్ చేసినదేం కాదు. కాని, విధి పిలుపును మాత్రం ఆమె విన్నది. అలా హైదరాబాద్ వీధుల్లో పానీపూరీ తింటూ నవ్వుకున్న సాదాసీదా అమ్మాయి– నేడు తెరపై సహజ మంత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆమె శివాని నాగారం. ఆమె విషయాలు ఆమె మాటల్లోనే మీ కోసం!⇒ చిన్నప్పటి నుంచే నేర్చుకున్న కూచిపూడి నాట్యం నాకు ఒక థెరపీలా ఉంటుంది. ఏదైనా టెన్షన్ ఉన్నా, కొన్ని స్టెప్స్ వేస్తే చాలు, మనసంతా రిలాక్స్ అయిపోతుంది.⇒ హైదరాబాద్‌లోనే పెరిగాను. అందుకే రోడ్డు పక్కన నిలబడి మిర్చి బజ్జీ, పానీపూరీ తినడం, సాయంత్రం రోడ్ల మీద కార్లు వెళ్లే శబ్దం వినడం ఇవన్నీ నా చిన్న చిన్న ఆనందాలు.⇒ సినిమాల్లోకి రావడం నేను ముందే ప్లాన్ చేసుకున్న విషయం కాదు. కాని, నా ప్రయాణం పెద్ద తెరతో కాదు, చిన్న కథలతోనే మొదలైంది. ఒక చిన్న షార్ట్‌ఫిల్మ్‌లో కొద్దిసేపు మాత్రమే కనిపించినా, అలా మొదటిసారి కెమెరా ముందు నిలబడ్డ ఆ క్షణంలోనే ‘ఇదే నా దారి’ అని నాకు స్పష్టంగా తెలిసిపోయింది.⇒ మొదటి సినిమా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ విడుదలైనప్పుడు మనుసులో కొంచెం భయం ఉన్నా, ప్రేక్షకులు చూపిన ప్రేమ ఆ భయాన్ని పూర్తిగా కరిగించింది.⇒ రెండో, మూడో సినిమాలు వచ్చేటప్పటికి నాలోనే ఒక కొత్త శివానిని చూసుకున్నాను. ప్రతి పాత్ర నాకు ఒక కొత్త నేర్పు, ఒక కొత్త అనుభవం ఇచ్చింది.⇒ పూలంటే నాకు ప్రత్యేకమైన ప్రేమ. ఏ పువ్వైనా చేతిలో తీసుకుని అలా తిరగేస్తూ, వాసన చూస్తూ ఉండటం నాకు హాబీలా మారిపోయింది.⇒ కథలు చదవడం నా అలవాటు. పెద్ద నవలలు కాకుండా, హృదయానికి హత్తుకునే చిన్న కథలు బాగా నచ్చుతాయి.⇒ ఫ్యాషన్ విషయానికి వస్తే నేను చాలా సింపుల్. ఒక మంచి జీన్స్, క్లీన్స్ గా ఉండే కుర్తా, చిన్న చెవిపోగులు. అంతే, నేను సిద్ధం.⇒ చర్మ సంరక్షణ విషయంలో నేను ఎక్కువ క్రీములు వాడను. రోజూ తగినంత నీళ్లు తాగడం, రాత్రి మాయిశ్చరైజర్ మాత్రం తప్పనిసరి. వారానికి ఒకసారి పెసరపిండి రాసుకుంటే చాలు, చర్మం బాగా ఫ్రెష్‌గా మారుతుంది.⇒ నాకు ఇష్టమైన రంగులు పింక్లోని మృదువైన షేడ్స్, లైట్ బ్లూ.⇒ అభిమానులతో మాట్లాడటం నాకు చాలా ఇష్టం. వాళ్ల కామెంట్లు, మెసేజులు, వారి ప్రేమ– అవన్నీ నాకు కొత్త శక్తి ఇస్తాయి. -
పేరెంట్స్ చేతిలో ఫోన్లు.. పిల్లలతో పెరుగుతున్న దూరాలు
సాయంత్రం. వర్క్‌ఫ్రమ్– హోమ్ జూమ్ మీటింగ్ ముగిసింది. అమ్మ సోఫాలో కూర్చొని ఫోన్ స్క్రోల్ చేస్తుంది. నాన్న యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ బిజీ. ఆరేళ్ల ఆరాధ్య వాళ్ల ముందు కూర్చుని ఉంది. ఆ రోజు స్కూల్లో ఏం జరిగిందో చెప్తోంది. పేరెంట్స్ తమ బిజీలో తామున్నారు. ఆ బిడ్డ కళ్లలో చిన్న నిరాశ. పేరెంట్స్ అది గమనించలేదు. కానీ ఆరాధ్య మెదడు గమనిస్తోంది. ప్రతిరోజూ, ప్రతి నిమిషం పేరెంట్స్ ‘హాజరు’ కన్నా ‘గైర్హాజరు’ను గుర్తించి రికార్డు చేస్తుంది. ఇది చిన్న విషయం కాదు. ఇది ఈ తరానికి సంబంధించిన నిశ్శబ్ద భావోద్వేగ సంక్షోభం. పేరెంట్స్ పక్కనే ఉంటున్నారు, కానీ ఎమోషనల్‌గా కాదు. పిల్లలతో తాము సరిపడినంత సమయం గడుపుతున్నామని 70శాతం పేరెంట్స్ అనుకుంటున్నారు. కానీ పేరెంట్స్ ఎప్పుడూ ఫోన్‌తో బిజీగా ఉంటున్నారని 67శాతం పిల్లలు ఫీలవుతున్నారని హార్వర్డ్ యూనివర్సిటీకి అధ్యయనం చెబుతోంది. భోజనాల సమయంలో పేరెంట్స్ ఫోన్ చూస్తూ ఉండటం పిల్లలకు మరింత దూరం చేస్తుందని మరో అధ్యయనంలో స్పష్టమైంది. భారతదేశంలో జరిగిన పలు అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. దీంతో పిల్లలు సమస్యలు సృష్టిస్తూ పేరెంట్స్ దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంటే పిల్లలది తప్పు ప్రవర్తన కాదు, పేరెంట్స్ అటెన్షన్ కోసం ఆరాటం మాత్రమే.మెదడు ఎలా స్పందిస్తుంది?⇒ అనుబంధం పెరగడానికి ప్రతిస్పందన, ఇచ్చిపుచ్చుకోవడం, పునరావృతం ముఖ్యం. ఫోన్ వల్ల ఈ మూడూ బ్రేక్ అవుతాయి. ⇒ పిల్లలు తమ భావాలను నియంత్రించడానికి మొదటగా తల్లిదండ్రుల ముఖాన్ని, స్పందనను గమనిస్తారు. పేరెంట్స్ చూసి స్పందించకపోతే, వారి మెదడులో ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ పెరుగుతుంది.⇒ పిల్లలు పరిశీలన ద్వారా నేర్చుకుంటారు. పేరెంట్స్ ఫోన్లో ఉంటే వారు నేరుగా చూడటం, కమ్యూనికేషన్, సహానుభూతి చూడలేరు. దీంతో వారిలో క్రమంగా సామాజిక ఇబ్బంది పెరుగుతుంది. ⇒ పేరెంట్–పిల్లల మధ్య ఇంటరాక్షన్ తగ్గితే పిల్లల్లో ప్రవర్తనా సమస్యలు మూడురెట్లు పెరుగుతాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది. తినడం, ఆడటం, మాట్లాడటం– అన్నీ దెబ్బతింటాయి. ⇒ పేరెంట్స్‌తో పదేపదే డిస్కనెక్షన్ అనుభవించిన పిల్లలు తక్కువగా షేర్ చేస్తారు, తక్కువగా నమ్ముతారు, తక్కువగా అటాచ్ అవుతారు.∙ఏం చెయ్యాలి?నోటిఫికేషన్లు, డెడ్ లైన్లు, వాట్సప్ మెసేజ్‌లు రోజూ ఉండేవే. అవి రోజూ వస్తూనే ఉంటాయి. కానీ ఒకసారి పిల్లలతో అనుబంధం విరిగిపోతే, తిరిగి రావడానికి సంవత్సరాలు పడతాయి. అందుకే పిల్లలతో బంధానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మీరు ఎంత సమయం గడిపారనేది కాదు, ఎంత ప్రెజెన్స్‌తో ఉన్నారనేది ముఖ్యం. 1. ప్రతి రోజూ కేవలం 20 నిమిషాలు ఫోన్‌కు దూరంగా ఉండేలా నిబంధన పెట్టుకోవాలి. ఆ 20 నిమిషాలు పిల్లలకు క్లాసులు పీకకుండా, సరిదిద్దకుండా వాళ్లు చెప్పేది శ్రద్ధగా వినాలి. దీనివల్ల అనుబంధాలకు కారణమయ్యే ఆక్సిటోసిన్ విడుదలవుతుంది. 2. డైనింగ్ టేబుల్, బెడ్ రూమ్, పిల్లలు చదువుకునే చోట ఫోన్ ఉపయోగించకూడదు. పిల్లలు మీరు చెప్పేది తక్కువ వింటారు, మీరు చేసేది ఎక్కువ అనుసరిస్తారు. 3. పిల్లలతో బంధం బలపడాలంటే గంటలు గంటలు గడపాల్సిన అవసరంలేదు. ఒక చిరునవ్వు, ఒక స్పర్శ, ఒక చూపు చాలు. ఇలాంటి సూక్ష్మమైన అంశాలు పిల్లల్లో భావోద్వేగ భద్రత కలిగిస్తాయని స్టాన్ఫోర్డ్ సైకాలజిస్ట్ ఎమా సెపాలా చెప్తున్నారు. 4. మీరు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు పిల్లల గొంతు వినిపిస్తే, వెంటనే వారి వైపు చూడాలి. వారి మాటలను వింటున్నట్టు సిగ్నల్ ఇవ్వాలి. ఈ ఒక్క చిన్న మార్పు పిల్లల్లో అనుబంధానికి భారీ భరోసానిస్తుంది. 5. ఆదివారం కనీసం ఒక గంట పూర్తిగా పిల్లలతో గడపండి. ఆటలు ఆడండి, పాటలు పాడండి, కథలు వినండి, కుటుంబమంతా కలిసి గడపండి. ఈ గంట పిల్లల మనసులో ‘ఫ్యామిలీ ఫస్ట్’ అనే ఫ్రేమ్ వర్క్‌ను బలపరుస్తుంది. 6. ఫోన్ నోటిఫికేషన్లు, వాట్సప్ గ్రూపులు ఆఫ్ చేయండి. సోషల్ మీడియా లాగిన్‌కు సమయాన్ని నిర్ణయించుకోండి. మీ నియంత్రణే మీ పిల్లలకు నమూనా అవుతుంది. 7. ‘‘నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను ఫోన్ చూస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది?’’ అని అడగండి. వారి సమాధానాన్ని శ్రద్ధగా విని, ఆ మేరకు మీ ఫోన్ అలవాట్లలో మార్పులు చేసుకోండి. 8. ‘‘నాకు నువ్వు, నీ మాటలు ముఖ్యం’’ అని పిల్లలకు రోజుకు ఒక్కసారైనా చెప్పండి. అది పిల్లల్లో నమ్మకం, ఆత్మవిశ్వాసం, భద్రతాభావాన్ని పెంచుతుంది.- సైకాలజిస్ట్ విశేష్ ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్ -
ఆత్మరక్షణకు ‘ఆస్కార్’ నటన!
‘నేచర్ ఆస్కార్ అవార్డ్స్’లో బెస్ట్ యాక్టర్ ఇన్స్ సర్వైవల్ డ్రామా ట్రోఫీ ఎవరికి దక్కాలంటే, సందేహమే లేదు, ఒపాసమ్కే వస్తుంది! ఎందుకంటే ఈ చిన్న జంతువు సస్పెన్స్ థ్రిల్లర్ లెవెల్లో యాక్టింగ్ చేస్తుంది. ప్రమాదం ఎదురైతే ఒక్కసారిగా నేలపై పడిపోతుంది, శరీరాన్ని పూర్తిగా శవంలా మార్చేసుకుని, కళ్ళు మూసేసుకుని చచ్చిపోయినట్లు నటిస్తుంది.అంతే కాదు, తనను వేటాడటానికి వచ్చిన జంతువులకు తాను చచ్చినట్లు నమ్మకం కలిగించడానికి కుళ్లిన శవం వాసన కూడా విడుదల చేస్తుంది. దీన్ని ఆ పరిస్థితిలో చూసిన క్రూరమృగాలు ‘ఇది చచ్చిపోయింది, పైగా కుళ్లిపోతోంది కూడా!’ అని అనుకుని వెనక్కి తగ్గిపోతాయి. ఈ సీక్రెట్ సర్వైవల్ ట్రిక్‌నే ‘ప్లేయింగ్ పోసమ్’ అంటారు. ప్రకృతి ఇచ్చిన ఈ సహజ రక్షణ పద్ధతితో, శత్రువు వెళ్లిపోయాక మన ఒపాసమ్ నెమ్మదిగా కళ్లు తెరచి, డ్రామా పూర్తయ్యిందని తెలుసుకుని, సైలెంట్‌గా జంగిల్లోకి జారిపోతుంది! -
చలివెచ్చని జాగ్రత్తలు
కాలాలన్నింటిలోనూ శీతకాలం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఓవైపు చల్లటిగాలి జివ్వుమనిపిస్తుంటే– స్వెటర్ తొడుక్కుని లేదా శాలువలు కప్పుకుని తిరగడం దగ్గర నుంచి, వెచ్చటి చలిమంటల ముందో, రూమ్ హీటర్ ముందో ఒద్దికగా కూర్చోవడం వరకు, ఇవన్నీ ఆస్వాదించాల్సిన సందర్భాలే! త్వరగా చీకటిపడి, ఆలస్యంగా వెలుతురు రావడం, కాలం వేగంగా పరుగులు తీస్తున్న భావన కలగడం– ఈ సీజన్లో మరో ప్రత్యేకత! నిజానికి చాలామంది కాలాలన్నింటిలోనూ పసందైన కాలం చలికాలమే అంటారు. వర్షాకాలంలో వర్షాలు, ఎండాకాలంలో ఎండలు ఎక్కువైనా, తక్కువైనా వాటిని భరించలేం కాని, చలికాలంలో స్వెటర్లు, గ్లౌజులు వేసుకుని చలి గజగజలను ఆస్వాదిస్తూ గమ్మత్తుగా గడిపేయవచ్చు మరి! అయితే శీతకాలంలో చలి మాత్రమే కాదు, వ్యాధులు కూడా వణికించేస్తుంటాయి. ఈ కాలంలో అనారోగ్య సమస్యలు వస్తే తగ్గించుకోవడం ఏమంత సులభం కాదు.చలికాలంలో సాధారణంగా వచ్చే అనారోగ్యాలు ఎంతవరకు అంటువ్యాధులుగా మారతాయి? ఎలాంటి జాగ్రత్తలు అవసరం? ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? వాటి సంగతి ఒకసారి పరిశీలిద్దాం... చలికాలంలో వాతావరణం పొడిగా ఉండటం, అలాగే మనుషులంతా ఇండోర్స్‌లో గుమిగూడటం వలన జలుబు చేసే క్రిములు, ఫ్లూ వైరస్లు, ఇతర శ్వాసకోశ వ్యాధులు సులభంగా వ్యాపిస్తాయి. వ్యాధి లక్షణాలు కనిపించక ముందు, లక్షణాలు తగ్గిన తర్వాత కూడా ఇవి ఇతరులకు సోకే అవకాశముంటుందని ప్రపంచ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ – క్లీవ్‌లాండ్ క్లినిక్ వెల్లడించింది. సాధారణంగా వ్యాధి సోకిన రెండు నుంచి మూడు రోజుల తర్వాత ఇతరులకు అంటించే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆ క్లినిక్ తేల్చింది. ఈ చలికాలంలో సర్వసాధారణంగా వచ్చే అనారోగ్యాలు, అవి ఎలా వ్యాప్తి చెందుతాయో ఇప్పుడు చూద్దాం!సాధారణ జలుబుఇది అంటువ్యాధి. లక్షణాలు కనిపించకముందే, లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు (సుమారు మూడవ రోజు వరకు) ఇతరులకు సులభంగా సోకుతుంది. లక్షణాలు తగ్గిన తర్వాత కూడా రెండు వారాల వరకు వైరస్ ఇతరులకు అంటించే అవకాశవఫ్లూఇది కూడా త్వరగా వ్యాప్తి చెందే అంటువ్యాధే! లక్షణాలు కనిపించకముందే ఇతరులకు అంటుతుంది. లక్షణాలు కనిపించిన తర్వాత ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఇతరులకు సోకే అవకాశముంటుంది.కోవిడ్ 19ఇది చాలా సులభంగా, అలాగే వేగంగా వ్యాపిస్తుంది. లక్షణాలు కనిపించడానికి ఒకటి లేదా రెండు రోజుల ముందు, అలాగే లక్షణాలు మొదలైన తర్వాత రెండు నుంచి మూడు రోజుల పాటు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశముంది. తేలికపాటి లక్షణాలున్నవారు ఐదు రోజుల వరకు, తీవ్రమైన లక్షణాలు ఉన్నవారు 20 రోజుల వరకు కూడా ఈ వ్యాధిని వ్యాప్తి చేసే అవకాశముంది.రెస్పిరేటరీ సిన్సిషీయల్ వైరస్ఇది సాధారణంగా ఆరోగ్యవంతులలో జలుబులా ఉన్నప్పటికీ, శిశువులు, వృద్ధులు, రోగనిరోధక శక్తి లేనివారికి ఇది ప్రమాదకరమైన వ్యాధి. లక్షణాలు కనిపించడానికి కొన్ని రోజుల ముందు, ఆ తర్వాత ఎనిమిది రోజుల వరకు ఇది అంటువ్యాధి. అయితే, శిశువులు, రోగనిరోధక శక్తి లేనివారు నాలుగు వారాల వరకు కూడా ఈ వైరస్‌ని వ్యాప్తి చెయ్యగలరు.చెస్ట్ కోల్డ్ (బ్రోంకైటిస్)బ్రోంకైటిస్ అంటువ్యాధి కాదు. ఇది వస్తే ఊపిరితిత్తుల్లోని శ్వాసనాళాల వాపు, శ్లేష్మం ఎక్కువ ఉత్పత్తి కావడం, ఛాతీ బిగువుగా, నొప్పిగా అనిపించడం వంటి సమస్యలు కనిపిస్తాయి. అయితే బ్రోంకైటిస్కు కారణమయ్యే జలుబు, ఫ్లూ లేదా ఇతర వైరస్లు మాత్రం అంటువ్యాధులే. వేరొకరి నుంచే వైరస్ వ్యాప్తి చెంది చెస్ట్ కోల్డ్లా మారుతుంది.న్యుమోనియావైరల్ న్యుమోనియా, బ్యాక్టీరియల్ న్యుమోనియా ఇవి రెండూ అంటువ్యాధులే. వైరల్ న్యుమోనియా జ్వరం పూర్తిగా తగ్గేంత వరకు వ్యాప్తి చెందుతుంది. బ్యాక్టీరియల్ న్యుమోనియా అయితే, యాంటీబయోటిక్స్ తీసుకున్నా, 48 గంటలు తర్వాతే అంటువ్యాధి తీవ్రత తగ్గుతుంది.పింక్ ఐవైరస్ లేదా బ్యాక్టీరియాతో వచ్చే పింక్ ఐ చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. వైరల్ పింక్ ఐ లక్షణాలు ఉన్నంత కాలం, ఇంక్యుబేషన్ పీరియడ్‌లో ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తుంది. బ్యాక్టీరియల్ పింక్ ఐ యాంటీబయోటిక్స్ తీసుకున్న 24 గంటల వరకు లేదా లక్షణాలు పూర్తిగా తగ్గేంత వరకు అంటువ్యాధిగానే పరిగణిస్తారు.సైనస్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ సైనస్ ఇన్ఫెక్షన్ అంటువ్యాధి కాదు. కానీ, సైనస్‌కు కారణమయ్యే జలుబు మాత్రం ఇతరులకు సోకుతుంది. ఇతరుల వల్లే మనకొస్తుంది.స్ట్రెప్ థ్రోట్గ్రూప్ ఏ స్ట్రెప్టోకాకస్ అనే బ్యాక్టీరియాతో ఇది వస్తుంది. ఇది తీవ్రంగా వ్యాప్తి చెందే అంటువ్యాధి! జ్వరం పూర్తిగా తగ్గిన తర్వాత కనీసం 12 గంటల పాటు యాంటీబయోటిక్స్ తీసుకున్న తర్వాతే జనాల్లో తిరగడం ఉత్తమం. అంతవరకు ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది.ఆయుర్వేద చిట్కాలు ఆహార నియమాలుఆయుర్వేదం ప్రకారం, శీతకాలంలో జీవ శక్తిని, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. సలాడ్లు లేదా చల్లటి ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి, ఎందుకంటే అవి శరీరంలో కఫాన్ని పెంచవచ్చు. నెయ్యి, నూనెలను మితంగా తీసుకోవడంతో చర్మం పొడిబారకుండా ఉంటుంది. చలికాలంలో వెచ్చదనానికి, ఆరోగ్యం కోసం తినదగిన ఉత్తమ ఆహారాలను ఇప్పుడు చూద్దాం.ఆయుర్వేదం ప్రకారం, శీతకాలంలో జీవ శక్తిని, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. సలాడ్లు లేదా చల్లటి ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి, ఎందుకంటే అవి శరీరంలో కఫాన్ని పెంచవచ్చు. నెయ్యి, నూనెలను మితంగా తీసుకోవడంతో చర్మం పొడిబారకుండా ఉంటుంది. చలికాలంలో వెచ్చదనానికి, ఆరోగ్యం కోసం తినదగిన ఉత్తమ ఆహారాలను ఇప్పుడు చూద్దాం.అల్లం: ఆయుర్వేదంలో దీనిని ‘సార్వజనీన ఔషధం’ అని పిలుస్తారు. దీన్ని చలికాలంలో ఎక్కువగా తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది. టీలోను, కూరల్లోను, సూపుల్లోను అల్లం వాడటం మంచిది. అలాగే, అల్పాహారంలో శొంఠి లడ్డూలు, అల్లం చట్నీ తీసుకోవడం కూడా మంచిదిపసుపు: ముఖ్యంగా శీతకాలంలో పసుపు బాగా పనిచేస్తుంది. పసుపులో వాపును తగ్గించే రసాయనాలు ఉంటాయి. ఇది శరీరానికి, మెదడుకి, గుండెకు చాలా మంచిది. శీతకాలంలో కూరల్లోను, పాలల్లోను పసుపు తరచుగా తీసుకోవచ్చు.జాజికాయ : ఇది శరీరానికి వెచ్చదనాన్నిచ్చే సుగంధ ద్రవ్యం. నిద్ర మెరుగుపరచడానికి, జీర్ణక్రియకు ఇది బాగా సహాయపడుతుంది. వేడి పాలలోను, మిఠాయిల్లోను, కూరల్లోని మసాలా మిశ్రమాల్లోను జాజికాయ పొడిని వాడుకోవచ్చు. ఉసిరి: చలికాలంలో వచ్చే జలుబు, ఫ్లూ నుంచి ఉసిరి రక్షణనిస్తుంది. ఉసిరిలో పుష్కలంగా ఉండే విటమిన్–సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. రోజుకి ఒకటైనా పచ్చి ఉసిరిని నేరుగా తినొచ్చు. తేనె లేదా పంచదారతో కలిపి కూడా తినవచ్చు. ఉసిరిని ఊరగాయలా కూడా తీసుకోవచ్చు.నువ్వులు: నువ్వులలో ప్రొటీన్, ఐరన్, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కాలేయానికి, గుండెకు రక్షణనిస్తాయి. ఈ చలికాలంలో నువ్వుల లడ్డూలు, నువ్వుల చిక్కీలు తీసుకోవచ్చు. రకరకాల వంటకాలపై నువ్వులపొడిని కలుపుకుని తినడం కూడా మంచిదే!బెల్లం: బెల్లం శరీరానికి వెచ్చదనాన్నిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. బెల్లంతో చిక్కీలు, అరిసెలు, లడ్డూలు చేసుకుని తింటే ఉత్తమం.సజ్జలు– రాగులు : ఈ చిరుధాన్యాలు శరీరానికి వెచ్చదనాన్నిస్తాయి. వీటిలో ఫైబర్, ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, ఐరన్, బి విటమిన్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేయడానికి సహాయపడతాయి. వీటితో రొట్టెలు, ఉప్మా, దోసె, అంబలి, లడ్డూలు వంటివి చేసుకోవచ్చు.నెయ్యి: చలికాలంలో నెయ్యి శరీరానికి శక్తిని, చురుకుదనాన్ని ఇస్తుంది. దీనిలో విటమిన్–ఎ, ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. చర్మానికి కాంతినిస్తుంది. కిచిడీ, పప్పు, పరాఠాలు, హల్వా లేదా అన్నంతో కలిపి తీసుకోవచ్చు.మెంతులు–మెంతికూర: ఇవి చలికాలంలో జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వీటిలో ప్రొటీన్, ఐరన్ అధికంగా ఉంటాయి. మెంతులను రాత్రి నీటిలో నానబెట్టి పేస్ట్ చేసుకుని తినడం మంచిది. మెంతి ఆకులను పరాఠాలు లేదా కూరల్లో కూడా వాడుకోవచ్చు.గోందు: చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్నిచ్చే చక్కటి ఆహారం ఇది. తుమ్మచెట్ల నుంచి సేకరించే జిగురును గోందు కటిర అంటారు. ఇది బరువు నియంత్రణకు, కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి, కాల్షియం పెరగడానికి సహాయపడుతుంది. దీంతో లడ్డూలు కూడా చేసుకుంటారు.బాదం – వాల్నట్లు: చలికాలంలో బాదం, వాల్నట్ వంటి గింజలు తినడం మంచిది. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్, ఫైబర్ ఉంటాయి. వాల్నట్లలో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్, బాదంలో విటమిన్– ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని నానబెట్టి చిరుతిండిగా తినడం లేదా డ్రై ఫ్రూట్ లడ్డూలలో కలిపి తినడం మంచిది.చిలగడ దుంపలు – క్యారట్లు: చలికాలంలో ఈ దుంపలు శరీరానికి వెచ్చదనాన్ని, రోగనిరోధక శక్తిని అందిస్తాయి. క్యారట్లలో విటమిన్ ఎ, చిలగడ దుంపలలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. చిలగడదుంపలను ఎక్కువగా ఉడికించి లేదా కాల్చి తింటారు. వీటిని సూప్‌లలో కూడా వాడుకోవచ్చు. క్యారట్‌ను కూరల్లో ఉపయోగించడంతో పాటు హల్వా రూపంలోను తీసుకుంటారు.ఆకు కూరలు: పాలకూర, తోటకూర వంటివి చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఐరన్, కాల్షియం అందించడానికి సహాయపడతాయి. వీటిని పప్పు, పరాఠాలు, సూప్‌ల రూపంలో తీసుకోవడం మంచిది.జామకాయ: జామకాయల్లో విటమిన్–సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జామకాయ చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలోని అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పచ్చిగా లేదా పండురూపంలో తినొచ్చు.స్టమక్ బగ్ఇది కూడా వేగంగా వ్యాప్తి చెందే అంటువ్యాధే! వాంతులు, విరేచనాలు అవుతున్న సమయంలో ఎక్కువగా వ్యాపిస్తుంది. లక్షణాలు తగ్గిన తర్వాత కూడా రెండు వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు వ్యాధిగ్రస్థుల నుంచి ఇతరులకు సోకే అవకాశముంటుంది. పైగా ఈ వైరస్లు ఉపరితలాలపై వారాల తరబడి జీవించగలవు.ఇలాంటి అంటువ్యాధుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పైన పేర్కొన్న అంటువ్యాధులతో పాటు చెవినొప్పి, చలి–జ్వరం, దవడ వాపు వంటివన్నీ చలికాలంలో వచ్చే సాధారణ వ్యాధులే.టాన్సిలైటిస్చలికాలంలో ఎక్కువగా ఇబ్బంది పెట్టే మరో సమస్య టాన్సిలైటిస్. ఇది అంటువ్యాధి కాదు! గొంతు లోపలి భాగంలో గుండ్రటి కణజాలాలుంటాయి. వాటినే టాన్సిల్స్ అంటారు. బ్యాక్టీరియా లేదా వైరస్ సోకినప్పుడు వీటికి వాపు రావడాన్నే టాన్సిలైటిస్ అంటారు. ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లయితే, ఆహారం, నీళ్లు, లాలాజలం కూడా మింగడానికి కష్టంగా ఉంటుంది.ఆర్థరైటిస్ (కీళ్ల నొప్పులు)మధ్య వయస్సు లేదా వృద్ధాప్యంలో ఉన్నవారికి శీతకాలపు కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తాయి. వీటిని ఎదుర్కోవడం చాలా కష్టం. ఈ నొప్పులకు కచ్చితమైన కారణాన్ని వైద్య శాస్త్రం ఇంకా చెప్పలేకపోతోంది. నొప్పి, వాపు, కండరాలు బిగించినట్లుగా అనిపించడం ఇవన్నీ లక్షణాలే! ముఖ్యంగా బరువు పెరగకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఈ సమస్య కాళ్ళ కీళ్లపై భారం పడేలా చేస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి. కనీసం వాకింగ్ అయినా చేస్తుండాలి. బాడీ మొత్తం కప్పి ఉండేలా ఉన్ని దుస్తులు వేసుకోవాలి. ఎందుకంటే తీవ్రమైన చలికి గురికావడం కూడా కీళ్ల నొప్పికి కారణమవుతుంది. పొగతాగే అలవాటు ఉంటే మానేయాలి. సెకండ్‌హ్యాండ్ స్మోకింగ్‌కు కూడా దూరంగా ఉండాలి. ఈ కాలంలో ఆహారం, నీళ్లు, ఇతర వస్తువులను తోటివారితో పంచుకోకపోవడం ఉత్తమం.శీతకాలంలో డీహైడ్రేషన్!సాధారణంగా డీహైడ్రేషన్ అనే మాట మనం వేసవిలో ఎక్కువగా వింటాం. నిజానికి చలికాలంలో దాహం తక్కువగా అనిపించినా, డీహైడ్రేషన్ సమస్య రాకుండా చూసుకోవాలి అంటున్నారు నిపుణులు. నారింజ, ద్రాక్ష, నిమ్మకాయ వంటి పండ్లలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, చర్మానికి సహజ కాంతిని ఇవ్వడానికి వీటిని తీసుకోవడం ఉత్తమం. దానిమ్మ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. చలికాలంలో శరీరానికి శక్తినిస్తుంది. వీటితో పాటు వెచ్చని నీళ్లు లేదా హెర్బల్ టీలను తరచుగా తీసుకోవడంతో శరీరంలో తేమ శాతం నిలకడగా ఉంటుంది.చలికాలంలో వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి చిట్కాలు⇒ దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు చేతులకు కాకుండా మోచేతి లోపలి భాగానికి అడ్డు పెట్టుకోవాలి.⇒ తలుపు నాబ్స్, కౌంటర్‌టాప్‌ల వంటి తరచుగా తాకే ఉపరితలాలను శుభ్రం చేయాలి.⇒ వ్యక్తిగత వస్తువులను పంచుకోకుండా ఉండాలి.⇒ లక్షణాలు తగ్గేంత వరకు ఇంటికే పరిమితం కావాలి.⇒ తరచుగా సబ్బు, గోరువెచ్చని నీటితో చేతులు కడుక్కోవాలి. ⇒ వైరస్లు– టేబుల్స్, డోర్నాబ్లు, కౌంటర్‌టాప్‌లు, ఆఫీస్ సామాగ్రి వంటి ఉపరితలాలపై కొన్ని గంటలు లేదా రోజులు కూడా జీవించగలవు. ఈ సాధారణంగా తాకే ఉపరితలాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయడానికి, సురక్షితమైన క్లీనర్లను ఉపయోగించాలి⇒ ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు తగినంత నిద్ర అవసరం. పెద్దలు రాత్రికి 7–9 గంటలు, పిల్లలు వారి వయస్సును బట్టి ఎక్కువ నిద్ర పోవాలి. నిద్ర లేమి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది.⇒ విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్న పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తినడంతో రోగనిరోధక వ్యవస్థను కాపాడుకోవచ్చు. విటమిన్ సి, జింక్ వంటి పోషకాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.⇒ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో రోగనిరోధక వ్యవస్థ పుంజుకుంటుంది. జలుబు దగ్గు వంటి లక్షణాల నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. వారంలో ఎక్కువ రోజులు కనీసం30 నిమిషాలు తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది. ⇒ చేతులతో తరచుగా ముఖం, నోరు తాకకుండా ఉండాలి. గొంతును తేమగా ఉంచడానికి క్రమం తప్పకుండా నీళ్లు తాగాలి. ⇒ వైరస్ లేదా బ్యాక్టీరియా బారిన పడితే రోజుకు రెండుమూడు సార్లు ఉప్పు నీటితో కొన్ని నిమిషాల పాటు పుక్కిలించాలి. ఇది గొంతు నొప్పిని తగ్గిస్తుంది. ⇒ ఈ సీజన్లో ఎక్కువగా గోరువెచ్చని నీరు తాగాలి. ఇంటి వాతావరణాన్ని తేమగా ఉంచడానికి ఎయిర్ హ్యూమిడిఫైయర్ గాడ్జెట్ (చర్మం, గొంతు, ముక్కు, పెదవులు పొడిబారకుండా నివారించే పరికరం) ఉపయోగించాలి.ఇక ఈ కాలంలో చర్మం పొడిబారిపోకుండా కళావిహీనంగా మారిపోకుండా ఆలివ్ నూనె, వెన్న, కొబ్బరి నూనె వంటి వాటితో శరీరానికి మర్దన చేసుకున్నాక స్నానం చేయడంతో మంచి ఫలితముంటుంది. ఎక్కువగా క్రీమ్స్, లోషన్స్ వంటి కాస్మెటిక్స్ వాడటం కంటే వంటింటి చిట్కాలను పాటించడమే మేలు. ఆరోగ్యం, ఆహారం, అందం ఈ మూడింటా తగు జాగ్రత్తలు తీసుకుంటే వింటర్‌కి మించి సీజనే ఉండదు. - సంహిత నిమ్మన -
కళాకాంతుల కనుల వేడుక
కనువిందైన కళ– ఆ కళకు తగ్గ కాంతి మిళితమై, చలికాలపు రాత్రుల్లో కళ్లు చెదిరే మాయాజాలాన్ని చూడాలంటే నెదర్లండ్స్ రాజధాని ఆమ్స్టర్డామ్కి పోవాల్సిందే! ‘ఆమ్స్టర్డామ్ ఫెస్టివల్’– ఇది ప్రతి సంవత్సరం శీతాకాలంలో నిర్వహించే ఒక అంతర్జాతీయ కాంతి కళా ప్రదర్శన. ఈ ఉత్సవం ప్రధాన లక్ష్యం కాంతితో చీకటిని తరిమి, ఆనందాన్ని నింపడమే! ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన థీమ్‌తో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులు డిజైన్ చేసిన ప్రత్యేకమైన లైట్ ఆర్ట్‌వర్క్‌లను ఇక్కడ ప్రదర్శిస్తారు.ఈ ఉత్సవం సాధారణంగా నవంబర్ నెల చివర నుంచి జనవరి నెల మధ్య వరకు జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆ వెలుగులు ఈ ఏడాది నవంబర్ 27న ప్రారంభమై జనవరి 18న ముగుస్తాయి. ఆమ్స్టర్డామ్ కాలువలు, నదీతీరాలు, పట్టణ ప్రాంతాలు కాంతి కళాకృతులతో మెరుస్తున్నాయి. ఈ కళాఖండాలు కేవలం అలంకరణలు మాత్రమే కాకుండా, ప్రతి సంవత్సరం ఎంచుకున్న థీమ్‌కు సంబంధించిన కథలను, ఆలోచనలను తెలియజేస్తాయి. నిజానికి ఈ 2025–26 థీమ్ ‘లెగసీ’– అంటే మన భవిష్యత్ తరాలకు మనం ఏమి వదిలి వెళ్తున్నాం? అనే ప్రశ్న చుట్టూనే కాంతులు ప్రతిబింబిస్తాయి. మొత్తానికి ఈ ఫెస్టివల్‌ను మూడు పద్ధతుల్లో తిలకించొచ్చు. మొదటిది పడవ ప్రయాణం, రెండవది నడకమార్గం, మూడవది సైకిల్ యాత్ర.పడవ ప్రయాణం ఈ లైట్ ఆర్ట్‌వర్క్‌లను వీక్షించడానికి సౌకర్యవంతమైన మార్గం పడవ ప్రయాణం. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ ‘వాటర్ కలర్స్’ మార్గంలో పయనించేటప్పుడు, కాంతి ప్రతిబింబాలు నీటిపై పడి అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి. అనేక క్రూజ్ కంపెనీలు కళాఖండాల గురించి వివరించే ఆడియో గైడ్లను అందిస్తాయి.నడకమార్గం ఫెస్టివల్లో ఆర్ట్‌వర్క్‌లను దగ్గరగా, నిదానంగా చూడాలనుకునే వారికి నడక మార్గమే మంచిది. దీనిని ‘ఇల్యూమినాడే’ అని కూడా పిలుస్తారు. ఈ మార్గం నగరం నడిబొడ్డు గుండా వెళుతుంది. అద్భుతంగా ఉంటుంది.సైకిల్ యాత్ర సైకిల్‌పై నగరంలో లైట్ ఆర్ట్‌వర్క్‌లను చూస్తూ వెళ్ళడం మరొక ఆసక్తికరమైన అనుభవం. ఏ మార్గాన్ని ఎంచుకున్నా ఆ కళాకాంతులను చూసి కళ్లు జిగేల్ మనక మానవు! -
అదే.. నా స్టయిల్ హంట్ స్పాట్!
పేరు రితు వర్మ, కానీ ఫీల్? క్లాసీ చార్మ్, ఎలిగెంట్ వైబ్! స్క్రీన్స్ పై ఆమె ఫ్రేమ్ రాగానే కథే కాదు, మొత్తం మూడ్ మారిపోతుంది. మెరిసే ఆ స్పార్క్, గ్రేస్‌తో సైలెంట్‌గా స్టన్నింగ్‌గా అనిపించే ఆమె స్టయిలింగ్ టిప్స్ మీ కోసం!డ్రెస్ బ్రాండ్: గీతిక కానుమిల్లి ధర రూ. 46,800జ్యూలరీ బ్రాండ్: కర్ణిక జ్యూలర్స్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.నేను చాలాప్రైవేట్ పర్సన్స్ . అందుకే నా ఫ్యాషన్స్ కూడా పూర్తిగా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్స్ మోడ్‌లోనే ఉంటుంది. దుస్తుల బ్రాండ్ అయినా, స్ట్రీట్ షాప్ అయినా, నచ్చితే చాలు వెంటనే కార్ట్‌లో ఉంటాయి. అయితే, నా స్టయిల్ హంట్ స్పాట్ ఎక్కువగా ఆన్లైన్ స్క్రోలింగ్లోనే! – రీతు వర్మ -
ఈ వారం కథ: కుందేలు కూర
ఇరు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. కౌంటర్ కేసులు పెట్టి అందర్నీ జైలుకు పంపారు. పరిస్థితులు సద్దుమణిగే వరకు ఊళ్ళో పోలీసు పికెట్ నడుస్తుంది. గ్రామ పంచాయితీ ఆఫీసులో షెల్టర్ తీసుకున్నారు. నలుగురు కానిస్టేబుళ్లు, ఒక ఇంచార్జ్ జందార్ ఉన్నారు. ఒక పోలీసు నిరంతరం తుపాకీ పట్టుకొని పహారాలో ఉంటాడు. మిగతా వారు తమ తుపాకులను పంచాయితీ ఆఫీసు లోపలి గదిలో పెట్టి బయట యాప చెట్టు కింద కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. ఆఫీస్ వెనకాల ఉన్న ఖాళీ స్థలంలో భోజనాలు వండుతున్నారు. వంట వచ్చిన పోలీసు ఆ పనిలో ఉన్నాడు. గ్రామ మస్కురి చికెన్ కడుగుతున్నాడు. పోలీసుకు భోజనానికి కొదువ ఉండదు. కాకపోతే సమయానికి దొరకదు. ఇంతలో ఒక గ్రామస్తుడు వచ్చి జందార్ను పరిచయం చేసుకున్నాడు. ‘‘సర్... ఈరోజు రాత్రి మా ఇంటికి భోజనానికి రండి సార్’’ అన్నాడు. కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ ఉత్సాహం ప్రదర్శించి ‘‘దాందేముంది.. వస్తాం సార్’’ అన్నాడు. జందార్ కానిస్టేబుల్ వైపు గుర్రుగా చూసి ‘‘ఇంకోసారి వస్తాంలే బ్రదర్ ఈరోజుకు వంట అయిపోయింది’’ అని అతనితో అన్నాడు. దాంతో అతను వెళ్ళిపోయాడు. ‘‘ప్రజల్లో పోలీసుకు సహజ అనుకూలురు సహజ వ్యతిరేకులు ఉంటారు. అందుకు ఎవరి కారణాలు వారికుంటాయి. పోలీసుకు భోజనం ఎంత దూరమో అంత ప్రమాదం కూడా’’ అని కొత్త కానిస్టేబుల్‌తో అన్నాడు. కొత్త కానిస్టేబుల్ అయోమయంగా చూసి ‘‘ఎందుకు సార్?’’ అన్నాడు. ‘‘నీకు అనుభవం లేదు కాబట్టి, ఒక జరిగిన సంఘటన చెబుతా విను’’ అన్నాడు. 1 తుపాకుల నర్సయ్య తన చుట్టూ గుమికూడిన పోరగాండ్లని దూరంగా పొమ్మని గద్దించి, తన భుజానికి గట్టిగా బిగబట్టి ఢామ్మని తుపాకీ పేల్చాడు. తుపాకీ చప్పుడు విన్న వారి గుండెలు కొట్టుకున్నాయి. పిట్టలు దిగ్భ్రాంతి చెంది తుపాకీలోని ఛర్రాల లాగా చెల్లాచెదురయ్యాయి. రాయి చెట్టు మీద ఉన్న పచ్చ గువ్వలు, తపసు పక్షులు, గుడ్లగూబలు చెల్లా చెదురుగా ఆకాశంలోకి ఎగిరిపోయాయి. బర్మార్ తుపాకీలో నుండి దూసుకొచ్చిన చర్రాలు పచ్చ గువ్వల వంట్లోకి దూసుకుపోయాయి. ఒక రెండు గువ్వలు చెట్టు మీది నుండి కింద పడ్డాయి. ఇంకో రెండు ఓ వంద గజాలు ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్లి పొలంలో రాలిపోయాయి. తుపాకీని భుజానికి తగిలించుకొని, చెట్టు కింద పడ్డ గువ్వలను చేతిలోకి తీసుకున్నాడు నర్సయ్య. రక్తం ఓడుతున్న రెండిట్లో ఒకటి ఇంకా కదులుతూనే ఉంది. వాటిని తన భుజానికి ఉన్న గుడ్డ సంచిలో వేశాడు. నర్సయ్య వెంట వచ్చిన వెంకన్న పొలంలో పడ్డ రెండు పచ్చ గువ్వలను తెచ్చాడు. వాటిని కూడా సంచిలో వేసుకున్నాడు నర్సయ్య. నర్సయ్య ఆరడుగుల ఎత్తు ఉంటాడు. మోకాళ్ళ వరకు ఖాకీ రంగు నిక్కరు, నిండు చేతుల చొక్కా, కాస్త పెద్దగా ఉండే మీసాలు, కుడి భుజం మీద నుండి ఎడమ వైపుకు వేలాడే మందుగుండు సామగ్రి ఉండే సంచి, పిక్కల కంటే కొంచెం కిందుగా ఉండే నల్లని బూట్లు. చూడ్డానికి బలిష్టమైన జవాను లాగా ఉంటాడు. కాకపోతే ఒక్క ఎర్ర టోపీ మాత్రం ఉండదు. కానీ, ఎర్ర తువాలు నెత్తికి చుట్టుకునేవాడు. నర్సయ్య పోలీసు కంటే కూడా సీరియస్‌గా ఉండేవాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. వారానికోసారి వేటకు బయలుదేరేవాడు. వెంట ముగ్గుర్నో నలుగుర్నో సహాయంగా తెచ్చుకునేవాడు. సహాయకులు మాట్లాడుకునేవారు తప్ప నర్సయ్య మాత్రం మాట్లాడేవాడు కాదు. నర్సయ్య సైన్యాధ్యక్షుడిలా ముందు నడుస్తుంటే సైన్యం వెనకాల పరిగెత్తేది. ఊరి చుట్టుపక్కల చెట్ల మీది పచ్చ గువ్వలు, చమర కాకులు, కముజు పిట్టలను కొట్టేవాడు. నర్సయ్య మోకాళ్ళమీద కూసోని బర్మార్ తుపాకిని మోకాళ్ళ మధ్యన పెట్టుకొని, సంచిలో డబ్బాలో ఉన్న పచ్చటి పొడిని చెంచాలాగా చేసిన తాటాకు ముక్కతో తీసి తుపాకీ గొట్టంలో పోసేవాడు. దానిమీద సైకిల్ చర్రాల వంటి ఇనుప గుండ్లు పోసేవాడు. దానిమీద పిడకల పొడిని వేసేవాడు. తుపాకీకి తగిలించి ఉన్న పొడుగాటి ఇనుప సువ్వ తీసుకొని ఆ గొట్టంలో పెట్టి కూర్చేవాడు. ట్రిగ్గర్ తగిలే దగ్గర గొట్టంలో పచ్చటి పొడిని పోసి నెమ్మదిగా ట్రిగ్గర్ బిగించేవాడు. ఆ ట్రిగ్గర్ను పైకి లాగి వదిలితే తుపాకీ పేలుతుంది. పిట్టల కూర మీద మొహం మొత్తినప్పుడు కుందేళ్ళ వేటకు వెళ్ళేవాడు. అప్పుడు తుపాకీని కుడి చేత్తో పట్టుకుని రంగనాయకుల గుట్ట వైపు వేటకు పోయేవాడు. ఆయన వెంట ఆ ముగ్గురో నలుగురో సైనికుల్లా అనుసరించేవారు. అప్పుడు వాళ్ళలో ఒకరి చేతిలో పెద్ద బ్యాటరీ లైటు ఉండేది. ఆ లైటు ఫోకస్ కుందేళ్ళ మొకం మీద పడితే అవి కదలలేవట మరి. ఊర్లో ఇంకో ముగ్గురికి తుపాకులు ఉన్నాయి. కానీ, ఆ రాజసం మాత్రం ఎవరికీ లేదు. ఒకాయన పంచ కట్టుకొని, ఇంకొకాయన పాయింటు వేసుకొని, ఇంకొకాయన నిక్కరు వేసుకొని వేట చేసేవారు. కానీ, వారి తుపాకులకు ఎలాంటి రాజసమూ లేదు. వారి మీదున్న తుపాకులను చూస్తే పచ్చ గువ్వలు కాదు కదా ఊర పిచుకలు కూడా బెదరవు. వారు పట్టుకున్నందువల్ల మాత్రమే ఆ తుపాకులకు కళ పోయింది. తుపాకులు ఎప్పుడూ పిరికివి కావు. వాళ్ళు తుపాకులు పేల్చినా జనాలు పట్టించుకునేవారు కాదు. అదే నర్సయ్య పేల్చకపోయినా యుద్ధ సన్నద్ధం గోచరించేది. సరిహద్దు సైనికులకుండే నిబద్ధత ఏదో నర్సయ్యలో ఉంది. కేవలం వేట కోసమే తాను పుట్టినట్టు కనపడేవాడు. తనను ఎప్పుడు పేల్చుతాడా అని నర్సయ్య తుపాకీ ఎదురు చూసేది. రాత్రంతా వేటాడి కుందేళ్లు, రకరకాల పిట్టలను సంచిలో మోసుకుంటూ తెచ్చేవారు. రాత్రంతా నిద్ర లేక వారి మొహం అలసిపోయి ఉండేది. నర్సయ్య మొహంలో సంతృప్తో, అసంతృప్తో తెలియని గంభీరత ఉండేది. 2నర్సయ్యకు ఇద్దరు భార్యలు. ఇంటి ముందు గదిలో చిన్నపాటి కిరాణా కొట్టు నడిపేవాడు. ఆ కొట్లో కొన్నిసార్లు చిన్న భార్య, కొన్నిసార్లు పెద్దామె కూర్చునేవారు. చాలా అరుదుగా నర్సయ్య కూడా కొట్లో కూర్చునేవాడు. కొట్లో, ఇంట్లోనూ కూడా పోలీసు నిక్కరు మీదనే ఉండేవాడు. కొట్లో కొనుక్కోడానికి వచ్చే వాళ్లతో కూడా పేలడానికి సిద్ధంగా ఉన్న తుపాకీ మాదిరిగా గుంభనంగా ఉండేవాడు. పెద్ద మనుషులు ఎవరన్నా పలకరిస్తే ముక్తసరిగా మాట్లాడేవాడు. నర్సయ్య బయటి ఆడోళ్లవైపు చూసేవాడు కాదు. మొదటి పెండ్లికి ముందు చలాకీగా, రెండో పెండ్లికి ముందు కాస్త తక్కువ చలాకీగా ఉండేవాడని ఆయన వెంట ఉండే సైనికులు చెప్పేవారు. మరి ఇద్దరు భార్యలను ఎందువల్ల చేసుకోవలసి వచ్చిందో సరైన కారణం తెలియదు. మొదటి పెండ్లి తరువాత తగ్గిన చలాకీతనాన్ని ఆయన అంచనా వేసి ఉండకపోవచ్చు. ఆయన ఇంట్లో అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. ముఖ్యంగా వేటకు వెళ్లొచ్చిన రోజు తప్పకుండా గొడవ అయ్యేది. మొదటి గొడవ కూర వండను అన్నప్పుడు, రెండోది కూర బాలేకుంటే. అయితే ఆ గొడవ ఒక్కోసారి హఠాత్తుగా ముగిసిపోయేది. నర్సయ్య కాస్త ఎక్కువ తాగిన రోజున తుపాకీ లోడు చేసి భార్యల వైపు గురిపెట్టే వాడని, దాంతో గొడవ హఠాత్తుగా ముగిసిపోయేదని చెప్పుకునేవారు. 3నర్సయ్య ఇంటి పక్కనే బడి ఉంది. సర్పంచ్ ఎన్నికల కోసం ఆ రోజు మధ్యాహ్నానికే అధికారులు వచ్చి బళ్ళో విడిది చేశారు. ఆ ఊరుకు గతంలో ఫ్యాక్షన్ చరిత్ర ఉంది కాబట్టి నలుగురు పోలీసులను బందోబస్తుకు పంపారు. నలుగురి వద్ద నాలుగు 303 తుపాకులు ఉన్నాయి. వారి బసకు బళ్లో ఒక గదిని కేటాయించారు. తెల్లారితే ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల అధికారి ఆ ఊరి మస్కురి సహాయంతో భోజన ఏర్పాట్లలో ఉన్నాడు. ఎన్నికల హడావిడి అంతా మాదే అన్నట్టు ఫీల్ అవుతారు ఎన్నికల అధికారులు. కానీ, అది నిజం కాదు. అసలైన హడావిడి అంతా పోలీసుల చుట్టే ఉంటుంది. పోలీసులకు చాలా ముందుచూపు ఉంటుంది. ఆ రాత్రికి పుష్టికరమైన భోజనం ఏర్పాటు చేసుకోవడానికి అది బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు లోకల్ పోలీసులు కాదు కాబట్టి ఆ ఊళ్ళో ఎవరూ పరిచయం లేదు. ఒక పోలీసు డ్రెస్ మార్చుకొని నింపాదిగా పక్కనే ఉన్న నర్సయ్య కిరాణం కొట్టుకు వెళ్ళాడు. సిగరెట్ కొనుక్కున్నాడు. నర్సయ్య చిన భార్య ఇచ్చిన అగ్గిపెట్టెతో సిగరెట్ ముట్టించాడు. కొట్టు ముందు అరుగు మీద కూసున్న కుర్రోళ్ల పక్కన కూసోని సిగరెట్ తాగాడు. రెండు సిగరెట్లు అయిపోయే లోపల నర్సయ్య చరిత్ర మొత్తం సేకరించాడు. నర్సయ్య పోలీసుల కంటే మేలైన విలుకాడు అని కూడా గుర్తించాడు. 4ఇంచార్జ్ పోలీసుకు ఉండాల్సింది సమాచారాన్ని వాస్తవ రూపం దాల్చేలా చేయడమే. మస్కురిని పంపి తుపాకుల నర్సయ్యని పిలిపించాడు. ‘‘నీ తుపాకీని స్టేషన్లో డిపాజిట్ చేయాలి కదా! ఎందుకు చేయలేదు?’’ అని గంభీరంగా అడిగాడు నర్సయ్యని. ‘‘నాకు తెలియదు సార్.. నాకు ఎవరూ చెప్పలేదు’’ అన్నాడు నర్సయ్య వినయంగా. ‘‘ఒక గంట లోపల అన్ని తుపాకులూ ఇక్కడికి తెప్పించాలి’’ అని మస్కురికి చెప్పాడు ఇంచార్జ్ పోలీసు. పోలీసు ఆదేశాలపట్ల గౌరవంతో తన తుపాకీ తేవడానికి నర్సయ్య వెళ్ళిపోయాడు. ‘‘మాజీ సర్పంచ్ వెళ్లి ఎస్సైతో మాట్లాడాడంట సార్. అందుకే వీళ్ళు తుపాకులు ఇవ్వలేదు’’ అన్నాడు మస్కురి.‘‘నాగ్గూడా తెలుసులేరా.. మరి పోలీసన్నాకా కొంచెం అన్నా అధారిటీ చూయించకపోతే జనాలకు భయం ఉండదు. రేపు ఓట్లు అయిపోయే వరకూ నేనే కదా ఇక్కడ శాంతి భద్రతలు కాపాడాల్సింది? అందుకే అందర్నీ పిలువు. నా తడాఖా ఏందో నువ్వు చూద్దువుగానీ’’ అని మీసం మెలేశాడు. దర్పం ప్రదర్శించడంలోనే పోలీసు విలువ ఉందన్న సత్యం మస్కురికి తెలుసు. ఇంతలో ఇంకో పోలీసు వచ్చాడు. ఆయన లోకల్ పోలీసు. నాన్ లోకల్ పోలీసులకు గైడుగా వచ్చాడు. తుపాకులోళ్ళని పిలిపిస్తున్నట్టు తెలుసుకున్నాడు. ‘‘వాళ్ళని పిలిపిస్తే గొడవ అయిద్ది సార్. ఈ వూరు అసలే మంచిది కాదు. తుపాకులోళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మీరు వదిలేయండి సార్’’ అన్నాడు లోకల్ పోలీసు. ఇంచార్జ్ ఏమీ అనలేదు. ‘‘నర్సయ్య దగ్గర ఏమన్నా కుందేళ్లు ఉన్నాయా?’’ అని మస్కురిని అడిగాడు లోకల్ పోలీసు. ‘‘రాత్రి యాటకు బొయ్యి పొద్దున్నే వచ్చిండు. ఉండొచ్చు సార్’’ అన్నాడు. ఇంతలో నర్సయ్య తుపాకీ తీసుకొని వచ్చాడు.‘‘ఏంది నర్సయ్యా.. ఎలక్షన్ల టైములోతుపాకీ తీసుకొని తిరుగుతున్నావు?’’ అని అడిగాడు లోకల్ పోలీస్. ‘‘బావుండ్రా సార్... మీరెప్పుడొచ్చారు?’’ అని నవ్వుతూ ‘‘మీవోళ్ళే తెమ్మన్నారు సార్’’ అన్నాడు. ‘‘ఏ..హే.. వాళ్లకు నీ గురించి తెల్వదులే.. ఏమి సంగతులు? రాత్తెర యాట బాగ జరిగిందంట గదా?’’ అన్నాడు. ‘ఏం లేదు సార్.. రెండు కుందేళ్లు, ఓ పది గల కముజు పిట్టలు పడ్డయి సార్! అన్నీ అమ్మిన. ఒక్క కుందేలు మాత్రం ఉంది సార్’’ అన్నాడు. ‘‘మరి ఇయ్యాల మాకు కుందేలు కూర తినిపియ్యరాదు. జందార్ సాబ్‌కు ఇష్టమట’’ అన్నాడు నవ్వుతూ. ‘‘సరే సార్.. దాందేముంది’’ అనుకుంటూ తుపాకీ తీసుకొని వెళ్ళిపోయాడు నర్సయ్య. 5గ్రామం నిశ్శబ్దంగా ఉంది. ఊళ్ళో పార్టీల నాయకులు పోల్ మేనేజ్మెంట్ పనిలో బిజీగా ఉన్నారు. అసలైన ప్రజాస్వామ్యానికి పునాది పడేది ఆరాత్రే. రాత్రి ఎనిమిదింటి సమయంలో బళ్ళో ఉన్న పోలీసులు రెండు పెగ్గులేసి, కుందేలు కూర సగం తిన్నారో లేదో.. నర్సయ్య ఇంట్లో హఠాత్తుగా గొడవ మొదలయింది. ఎన్నడూ లేనంత తారస్థాయిలో మాటలు పేలుతున్నాయి. నర్సయ్య ఇంట్లో గొడవతో జనాలు ఒక్కొక్కరుగా ఇండ్లల్లో నుంచి బయటకు వస్తున్నారు. బడికి ప్రహరీ గోడ లేదు. పోలీసులు గ్లాసులు పక్కకునెట్టి బయటకు వచ్చి నిలబడ్డారు. తుపాకీ తీసుకొని వెంటబడడంతో నర్సయ్య ఇద్దరు భార్యలూ ‘‘వామ్మోవ్.. ముండాకొడుకు కాల్చి సంపెట్టుండే’’ అని మొత్తుకుంటూ ఉరికొచ్చి పోలీసుల వెనకాల నిలబడ్డారు. పోలీసులు గద్దాయించినా కూడా నర్సయ్య గన్ను దింపకపోగా.. ‘‘దొంగ ముండల్లారా.. ఇయ్యాల మీరో నేనో తేలిపోవాలి’’ అని నేరుగా జందార్ సాబుకే తుపాకీ గురిపెట్టాడు. జందార్ సాబ్‌కు ఉచ్చ బడ్డది. ‘‘ఒరేయ్... వాని తుపాకీ గుంజుకోరా’’ అని మస్కురికి పురమాయించాడు. ఇంతలో జనం జమయ్యారు. పోల్ మేనేజ్మెంట్లో ఉన్న కార్యకర్తలూ నాయకులూ ఆ గలాటా దగ్గరికి వచ్చారు. ఎన్నికల అధికారి బ్యాలెట్ బాక్సుల గదికి తాళం వేసి ఆన్నే కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. ఆందోళనల్లోనుండే ప్రజాస్వామ్యం పురుడు పోసుకుంటదనే సోయి ఎన్నికల అధికారికి ఉంది. మిగతా సిబ్బంది కర్రలు పట్టుకుని ఆయన చుట్టూ నిలబడ్డారు. పోల్ మేనేజ్మెంట్లోని ఒక వర్గం కార్యకర్తలు నర్సయ్య భార్యల వెనకవైపు వచ్చి ‘‘ఏమైందీ?’’ అని ఆరా తీస్తున్నారు. ఇంకో వర్గం నర్సయ్య వెనకాలకు చేరి ‘‘ఏమైందీ?’’ అని అడిగారు. ‘‘ఈ పోలీసు సారు కుందేలు కూర అడిగితే వండమన్నా.. అదేమో వండనన్నది. ఇదేమో వండింది గని.. వండినంక.. ‘వాడెవనికి బుట్టిండు, వీడెవనికి బుట్టిండు! అన్నది. ఆఖరికి నువ్వెవనికి బుట్టినవు అని కూడా అన్నది. ఎప్పన్నుంచో ఓపికబడుతున్న. ఇయ్యాల ఈ ముండల సంగతి తేలాలి’’ అని భుజానికి తుపాకీని అదిమి పెట్టి పట్టుకున్నాడు. రోజుటికంటే ఇయ్యాల ఒక పెగ్గు ఎక్కువే తాగినట్టుండు నర్సయ్య. పైగా ఇద్దరు పెండ్లాలు ఏకమైనా కూడా కుందేలు కూర తిన్న పోలీసులు తనకే సపోర్ట్ చేస్తారనే ధైర్యం కూడా తోడయినట్టుంది. కొందరు తుపాకీని గుంజుకోవాలని చూసినా నర్సయ్య ఉడుం పట్టు వదలడం లేదు. భార్యల వైపు ఉన్న ఒక కార్యకర్త ‘‘ఇదంతా ఈ పోలీసుల వల్లనే వచ్చింది. కుందేలు కూర దొబ్బితిని మొగుడూ పెండ్లాలకు గొడవ పెట్టిండ్రు’’ అన్నాడు. ‘‘ఏయ్.. ఎవడ్రా నువ్వు.. మాటలు జాగర్తగా రానియ్యి’’ అని వాని మీదికి పొయ్యాడు జందార్ సాబ్. అంత మంది ముందు పోలీసు తన కార్యకర్త మీదికి పోయేసరికి వాళ్ళ నాయకుడు కోపానికి రావాల్సొచ్చింది. ‘‘ఏదీ.. మావోనిమీద చెయ్ వెయ్ చూస్తా’’ అని పోలీసు ఇంచార్జ్ మీదికి పోయాడు. ప్రత్యర్థి వర్గ నాయకునికి కూడా పౌరుషం వచ్చింది. ఇలాంటి సమయంలో దూసుకొని పోకపోతే రేపు తనకు ఓట్లు పడవు అనే డౌట్ వచ్చిన సర్పంచ్ అభ్యర్థి ‘‘ఏందిరా.. పోలీసు మీదనే చెయ్ వేస్తావా!’’ అని అతని మీదికి పోయాడు. ‘‘నువ్వెవర్రా?.. ఈ పోలీసులు నీవోల్లా?.. రిగ్గింగ్ చేయనీకి తెచ్చుకున్నవా?’’ అని అతని గల్లా పట్టనే పట్టిండు ఒక కార్యకర్త. సహనం కోల్పోయిన నర్సయ్య ఢాం అని తుపాకీ పేల్చాడు. పోలీసు ఇంచార్జ్ పక్కనుండి, ఇద్దరు భార్యల మీదకి గుండ్లు వెళ్ళేవే.. కానీ, ఎవరో తన చెయ్యి పట్టి లాగడం వల్ల అది పైకి గాల్లోకి పేలింది. ఇదే సందని రెండు వర్గాలూ గలాటాకు దిగాయి. ఒకరినొకరు నెట్టుకుంటూ రోడ్డు మీద నుండి బళ్లోకి వచ్చారు. పోలీసులకు తమ కర్తవ్యం గుర్తొచ్చి, డ్రెస్ వేసుకునే సమయం లేక, లుంగీలు కాశబోసి, లోపలికి ఉరికి తమ తుపాకులు తెచ్చి లోడు చేసి బ్యాలెట్ బాక్సుల ముందు వరుసగా నిలబడ్డారు. ‘‘నన్ను రిగ్గింగ్ చేసేటోడంటావురా’’ అని కర్రలతో కొట్టుకుంటూ, రాళ్లు విసురుకోవడం మొదలు పెట్టారు. ఈలోపు ఒక వర్గం కార్యకర్త గభాల్న ఉరికి బ్యాలెట్ గది తలుపుని తన్ననే తన్నాడు. బ్యాలెట్‌కు ఏదన్నా అయితే కనీసం ప్రతిఘటన అయినా ఇవ్వలేదని అధికారులు అడుగుతారని పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. నర్సయ్య తన ఇంట్లోకి వెళ్ళి మరోసారి గన్ను లోడు చేయడం మొదలు పెట్టాడు. మస్కురి ఉరికి నర్సయ్య బయటకు రాకుండా గొళ్ళెం పెట్టాడు. నర్సయ్య భార్యలు పక్కింట్లో తల దాచుకున్నారు. బీపీ పెరిగి పడిపోయిన ఎన్నికల అధికారికి ఊళ్ళో పేరుమోసిన ఆర్ఎంపీ డాక్టర్ సపర్యలు చేస్తున్నాడు. ఇంతలో అదనపు బలగాలు వచ్చాయి. వీపుకు తుపాకులు, చేతిలో లాఠీలతో డీసీఎం వాన్ నుండి దూకిన స్పెషల్ పోలీసులు అందినకాడికి వీపులు, అందకపోతే పిర్రలు పగలగొట్టారు. అటు సగం మందిని ఇటు సగం మందిని గెదిమి రోడ్డుమీద నిలబడ్డారు పోలీసులు. కొందరు కార్యకర్తలు ఎంతో హుషారుగా ఉంటారు. వాళ్ళు నాయకుల కోసం ఎంతకైనా తెగిస్తారు. పోలీసులు లాఠీఛార్జ్ పనిలో ఉండగా, వారు తెరిచి ఉన్న గదుల్లో జొరబడ్డారు. వాళ్ళు ఏమి చేయాలనుకున్నారోగానీ ముందుగా కనపడ్డ మందు బాటిళ్ళూ, కుందేలు కూర ఎత్తుకుపోయారు. కొత్త కానిస్టేబుల్ తల విదిలించి ఉడుకుతున్న చికెన్ వాసనను గాఢంగా పీల్చుకున్నాడు. తుపాకులు ఉన్నా ఒక్కోసారి మన కూర మనకు దక్కదు అని అనుకున్నాడు. ‘‘వంట అయింది భోజనానికి రండి సార్’’ అని వంట కానిస్టేబుల్ పిలిచాడు. దూరం నుంచి తీవ్రంగా చర్చించుకుంటూ పంచాయితీ ఆఫీసు వైపు వస్తున్న జనాల గుంపును చూసి తుపాకులు తెచ్చుకొని బయట నిలబడ్డారు పోలీసులు. - గోపిరెడ్డి యేదుల -
ఈ సండే రుచికరమైన పొటాటో బైట్స్, పనీర్ టిక్కా టోస్ట్ చేసేద్దాం ఇలా..!
పొటాటో బైట్స్కావలసినవి: బంగాళాదుంప గుజ్జు – ఒక కప్పుఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు – 3 టేబుల్ స్పూన్లు చొప్పున, పచ్చి మిర్చి – 2 (చిన్నగా కట్ చేసుకోవాలి), పుదీనా తురుము – 2 టేబుల్ స్పూన్లు, మామిడికాయ పొడి – ఒక టీస్పూన్, మ్యాగీ మసాలా – ఒక టీస్పూన్ , కొత్తిమీర చట్నీ – కొద్దిగా, నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్, బిస్కట్లు – ఒక చిన్న ప్యాకెట్, కారప్పూస – కొద్దిగా, ఉప్పు – సరిపడా తయారీ: ముందుగా ఒక పాత్రలో బంగాళదుంప గుజ్జు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా తురుము, మామిడికాయ పొడి, మ్యాగీ మసాలా, కొత్తిమీర చట్నీ, నిమ్మరసం ఇలా అన్నీ కలిపి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు రెండేసి బిస్కట్స్ తీసుకుని వాటి మధ్యలో కొద్దికొద్దిగా ఈ బంగాళదుంప మిశ్రమాన్ని ఉంచి, రెండు బిస్కట్స్ అతుక్కునేలా, చిత్రంలో ఉన్న విధంగా నొక్కాలి. ఆ తర్వాత అంతా సమాంతరం అయ్యేలా చేసుకుని కారప్పూసలో దొర్లించాలి. అనంతరం టొమాటో సాస్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే, ఆ బైట్స్ భలే రుచికరంగా ఉంటాయి.పనీర్ టిక్కా టోస్ట్కావలసినవి: పనీర్ ముక్కలు – ఒక కప్పుబ్రెడ్ స్లైసెస్ – 4 లేదా 5, కారం, గరం మసాలా, పసుపు, ఉప్పు, నూనె – సరిపడాచిల్లీ సాస్, టొమాటో సాస్ – కొద్దికొద్దిగాక్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు – కొద్దికొద్దిగా (కాస్త పెద్దగా కట్ చేసుకోవాలి)నూనె, చీజ్ తురుము – సరిపడాతయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, పాన్‌లో కొద్దిగా నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. అందులో కారం, గరం మసాలా, పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలిపి, పనీర్ ముక్కలకు బాగా పట్టించి, వేయించుకోవాలి. ఇప్పుడు ఒక్కో బ్రెడ్ స్లైసెస్పైన చిల్లీ సాస్ కొద్దిగా, టొమాటో సాస్ కొద్దిగా పూసుకుని, ఆపైన నాలుగేసి పనీర్ ముక్కలను పరచుకోవాలి. అనంతరం ఒకవైపు క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ప్రతి పనీర్ ముక్కకు ఆనించి, పైన చీజ్ తురుము జల్లుకోవాలి. ఇప్పుడు వాటిని బేకింగ్ ట్రేలో పెట్టుకుని, ఓవెన్లో బేక్ చేసుకుంటే సరిపోతుంది.స్పెషల్ గువావాకావలసినవి: జామకాయ – ఒకటి (పెద్దది)చాట్ మసాలా, కారం, ఉప్పు, గరం మసాలా – కొద్దికొద్దిగా, పంచదార – 2 టేబుల్ స్పూన్లుచిక్కటి పాలు – కొద్దిగా (కాచి చల్లార్చినవి)తయారీ: ముందుగా పెద్ద జామకాయను ఇరువైపులా కాస్త కట్ చేసి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు నుంచి గుంత తీసి, జామకాయను గిన్నెలా తయారు చేసుకోవాలి. ఆ మధ్యలో తీసిన జామకాయ ముక్కల్లో పంచదార, గరంమసాలా వేసి కొద్దిగా పాలు పోసి మిక్సీ పట్టుకుని, పేస్ట్‌లా చేసుకోవాలి. ఈలోపు గిన్నెలా మార్చుకున్న జామకాయలో కారం, ఉప్పు జల్లి, ఆ గుంతలో ఈ జామ–పంచదార మిశ్రమాన్ని వేసుకుని నింపుకోవాలి. అనంతరం పైన చాట్ మసాలా జల్లుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే పండ్లు ఇష్టంగా తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. -
సంయుక్తా మీనన్ ఫ్యాషన్, ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
చీర కట్టుకుంటే క్లాసిక్ క్వీన్ , గౌన్ వేసుకుంటే గ్లామర్ గర్ల్, కేజువల్ వేర్లో వెళ్తే చీర్‌ఫుల్ చిక్! ఇలా ప్రతి లుక్‌లోనూ ‘వావ్!’ అనిపించేస్తుంది నటి సంయుక్తా మేనన్ . ఇప్పుడు ఆ అందం వెనక దాగి ఉన్న ఫ్యాషన్ రహస్యాలు, ఫిట్నెస్ మంత్రాలు మీ కోసం... ఫిట్నెస్ విషయంలో నేను చాలా కాన్షియస్! రుచిగా ఉన్న ప్రతి ఆహారం ఆరోగ్యకరమైనది కాకపోవచ్చని ఇప్పుడిప్పుడే గ్రహించాను. అందుకే చక్కెర, ఉప్పు, మసాలా, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అన్నింటినీ దూరం పెడుతున్నాను. ఇక స్టయిలింగ్ విషయానికి వస్తే, ప్రతి ఔట్ఫిట్లో చిన్న చిన్న డీటెయిల్స్ ఉండాలి, అప్పుడు లుక్ కంప్లీట్ ఫీల్ వస్తుంది.సంయుక్తా ముత్యాల వడ్డాణం!‘పూసల వడ్డాణం’ అంటే పాతకాలపు ఆభరణం అనుకుంటే, పొరపడినట్టే! ఇప్పుడు ఈ ముత్యాల వడ్డాణం ఫ్యాషన్ ర్యాంప్ మీదే కాదు, ఇన్‌స్టా రీల్స్‌లో కూడా హాట్ ఫేవరెట్! చిన్న చిన్న పూసలు, ముత్యాలతోనే బంగారు వడ్డాణం కంటే పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. డార్క్ కలర్ శారీస్‌పై ఇది పర్ఫెక్ట్ చాయిస్! ఇది ఎలిగెన్స్‌కి గ్లామర్ కలిపిన కాంబినేషన్ . పర్ల్ వర్క్ బ్లౌజ్ ఉంటే, అదనపు ఆభరణాలు ఇక అవసరం కూడా ఉండవు. అయితే, ఈ పూసల వడ్డాణం వేసుకునే ముందు హెయిర్ స్టయిల్ లోబన్ లేదా ఆప్డో ఉండేలా చూసుకోండి. దానికి తగ్గట్టుగానే చీరను డార్క్ కలర్స్‌తో పెయిరప్ చేస్తే లుక్ మరింత హైలైట్ అవుతుంది. ఇయర్ రింగ్స్ హూప్ లేదా స్టేట్మెంట్ పీస్ ఉంటే మోడర్న్ వైబ్ వస్తుంది. స్మోకీ ఐస్, న్యూడ్ లిప్ కలర్ వంటి మినిమల్ మేకప్‌తో క్లాసీ లుక్ క్రియేట్ చేయవచ్చు. ఇక్కడ సంయుక్త మీనన్ ధరించే చీర..బ్రాండ్: క్యూబీ ఐక్యూధర: రూ. 45,000, జ్యూలరీ బ్రాండ్: సుహానీ పిట్టె, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. (చదవండి: ముందుగానే డెలివరీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి..?) -
సైలెంట్ మ్యారేజ్ కిల్లర్
కిషోర్ మంచం మీద ఫోన్లో స్క్రోల్ చేస్తున్నాడు. ఆనంది తనతో మాట్లాడాలనుకుంటుంది, అతను ‘ఒక్క నిమిషం’ అన్నాడు. ఆ ‘ఒక్క నిమిషం’తో రాత్రంతా గడిచిపోతుంది. ఇది ఇప్పుడు ప్రతి ఇంటిలో కనిపించే సైలెంట్ డ్రామా. ఇప్పుడు కాపురాలు విడిపోవడంలేదు. కాని, విడిపోయిన రెండు మనసులు ఒకే ఇంట్లో రెండు స్క్రీన్ల మధ్య బతుకుతున్నాయి.కొత్త మూడో వ్యక్తి...ఒకప్పుడు భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి అంటే అనుమానం. ఇప్పుడు ఆ మూడో వ్యక్తి పేరు ‘స్మార్ట్‌ఫోన్.’ పనికోసం, కాంటాక్ట్ కోసం, వినోదం కోసం ఇంట్లోకి ప్రవేశించిన స్మార్ట్ ఫోన్ మెల్లగా మనుషుల మధ్యకు చేరి మనసుల్ని వేరు చేసింది.ఇప్పుడు జంటలు రోజుకు సగటున మూడుగంటలకు పైగా ఫోన్లో గడుపుతున్నారని ఒక అధ్యయనంలో వెల్లడైంది. కాని, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కనీసం 30 నిమిషాలు కూడా ఇవ్వడం లేదు. గతంలో దంపతుల మధ్య ‘దూరం’ శారీరకంగా ఉండేది. ఇప్పుడు ఆ దూరం ‘డిజిటల్’గా మారింది. మనుషుల మధ్య ‘మొబైల్ సిగ్నల్’ ఉన్నా, ‘మానసిక సిగ్నల్’ ఉండటం లేదు. ఎమోజీలు ఎక్కువ... ఎమోషన్లు తక్కువ...ఒకప్పుడు భోజనాల వద్ద మాట్లాడుకునేవారు. ఇప్పుడు భోజనం ముందు ఫొటో తీస్తున్నారు. భోజనం చేసేటప్పుడు ఫోన్ స్క్రీన్‌నే ఎక్కువగా చూస్తున్నారు. ఇప్పటి దంపతులు ఎక్కువగా ‘టెక్ట్స్’ చేస్తారు, కాని తక్కువగా ‘టచ్’ చేస్తారు. మెసేజ్‌లు ఎక్కువ, మాటలు తక్కువ. ఎమోజీలు ఎక్కువ, ఎమోషన్లు తక్కువ. దీనివల్ల భావోద్వేగ దూరం పెరుగుతోంది. దగ్గరున్నా దూరమే... ప్రేమంటే ఒకరితో ఒకరుండటం. కాని, ఇప్పుడు జంటలు ఫిజికల్లీ ప్రెజెంట్, మెంటల్లీ ఆబ్సెంట్. ‘‘నువ్వు నాతో ఉన్నావు కాని, నీ మనసు ఫోన్లో ఉంది’’ అని భార్య అంటోంది. ఇదేమీ జోక్ కాదు. ఎమోషనల్ నెగ్లిజెన్స్ అనే సైలెంట్ సమస్య. మనం ఒకరిని ప్రేమిస్తున్నా, ఫోన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ ప్రేమను ‘పాజ్’ చేస్తున్నాము. ఒక సర్వే ప్రకారం, రాత్రిళ్లు ఫోన్ వాడటం వల్ల మాట్లాడుకోవడం తగ్గిందని 65శాతం జంటలు చెప్పారు. దీనివల్ల చాలా జంటల మధ్య ఎమోషనల్ డిస్కనెక్షన్, అటెన్షన్ డెఫిషిట్, జెలసీ, నిద్ర సమస్యలు, ఇంటిమసీ తగ్గిపోవడం వంటి మానసిక లక్షణాలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా ప్రేమలు...ప్రేమకు ప్రైవసీ అవసరం. కాని, ఇప్పుడంతా పబ్లిసిటీగా మారింది. ఇంట్లో ఎలా ఉన్నా, ఇద్దరి మధ్య ఎన్ని సమస్యలున్నా, సోషల్ మీడియాలో ‘హ్యాపీ కపుల్’ పోస్టులు పెడుతుంటారు. ఇదో కొత్తరకం మానసిక మాయ. సోషల్ మీడియాలో ఇతరుల జీవితం చూసి మన జీవితం తక్కువగా అనిపించడం ‘కంపేరిజన్ బర్నవుట్’ను పెంచుతుంది. అది ఈర్ష్య, కోపం లేదా విరక్తిగా బయటపడుతుంది. కాపురంలో ప్రేమ చనిపోదు, దాన్ని చంపేది మౌనం. మాటలు తగ్గిన చోట ఊహలు పెరుగుతాయి. ఆ ఊహల వెనుక అభద్రత ఉంటుంది. సైకలాజికల్‌గా చెప్పాలంటే, జంటలు రోజూ కనీసం 20 నిమిషాలు మనసువిప్పి మాట్లాడుకోకపోతే ఎమోషనల్ డ్రైనెస్ పెరుగుతుంది.జంటలేం చేయాలి?రాత్రి భోజనం తర్వాత ఫోన్ పక్కన పెట్టేయండి. కనీసం గంటైనా ఫోన్ పూర్తిగా దూరంగా ఉంచండి.నిద్రకు ముందు కనీసం పది నిమిషాలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అలవాటుగా మార్చుకోండి. ఫోన్లో స్క్రోల్ చేయడం కాదు, హృదయాన్ని స్క్రోల్ చేయండి.సోషల్ మీడియాలో ఒక వారం ‘ఫొటోలెస్ చాలెంజ్’ పెట్టండి. జంటగా గడిపిన సమయాన్ని మీరు మాత్రమే అనుభవించండి.రోజుకు కనీసం ఐదు నిమిషాలు కళ్లలోకి చూస్తూ మాట్లాడండి. స్క్రీన్ కన్నా కళ్లు చూడటం ఇంటిమసీని తిరిగి తెస్తుంది.ఫోన్ రహస్యాలు పెరగడమంటే దూరం పెరగడం. స్మార్ట్ఫోన్లను కాకుండా, మనసులను ట్రాన్స్పరెంట్ చేయండి.ఫబ్బింగ్ సిండ్రోమ్... మనిషి మెదడు అనుబంధం కోరుకుంటుంది. మనం ‘చూస్తూ మాట్లాడే’ జీవులం. కాని, ఇప్పుడు మన కళ్ళు స్క్రీన్కు, మనసు నోటిఫికేషన్లకు అతుక్కుపోయింది. యూనివర్సిటీ ఆఫ్ ఎసెక్స్ పరిశోధన ప్రకారం ఫోన్ టేబుల్‌పై పెట్టినా కూడా జంటల మధ్య మాటల్లో భావోద్వేగ గాఢత 30 శాతం తగ్గిపోతుంది. దీన్నే ‘ఫబ్బింగ్ సిండ్రోమ్’ అని పిలుస్తారు. అంటే భాగస్వామిని పట్టించుకోకుండా ఫోన్‌ను ఎక్కువగా పట్టించుకోవడం. ఈ స్థితిలో ఉన్నామని చాలామందికి తెలియదు కాని, దీనివల్ల జంటల మధ్య ఆప్యాయత, నమ్మకం, సహానుభూతి తగ్గిపోతున్నాయి.సైకాలజిస్ట్ విశేష్‌ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్ (చదవండి: ముందుగానే డెలివరీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి..?) -
ముందుగానే డెలివరీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి..?
నేను ప్రస్తుతం 30 వారాల గర్భిణిని. ఇది నా మొదటి బిడ్డ. నా గ్రోత్ స్కాన్ లో బిడ్డ పెరుగుదల కొంచెం తక్కువగా ఉందని. తరచుగా స్కాన్లు చేయించుకోవాలని, మెరుగుదల లేకపోతే ముందుగానే డెలివరీ చేయాల్సి రావచ్చని చెప్పారు. నేను చాలా ఆందోళనగా ఉన్నాను. ఇది ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. బిడ్డ పెరుగుదల మెరుగుపడటానికి, ముందుగానే డెలివరీ జరగకుండా ఉండటానికి నేను ఏమి చేయాలి?– సుశీల, రాజమండ్రి. మీ ఆందోళన అర్థమవుతోంది. చాలామంది గర్భిణులకీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. గర్భధారణలో బిడ్డ ఎదుగుదల గర్భకాలానికి తగినంతగా లేకపోతే దానిని ‘ఫీటల్ గ్రోత్ రిస్ట్రిక్షన్ ’ లేదా ‘ఇంట్రా యూటరైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్ ’ అంటారు. ఇది సుమారు పది శాతం గర్భధారణల్లో కనిపించే పరిస్థితి. అంటే ఇది అరుదు కాదు, కానీ జాగ్రత్తగా పర్యవేక్షించాల్సినది. ఈ పరిస్థితి రావడానికి పలు కారణాలు ఉంటాయి. గర్భిణి మహిళకు అధిక రక్తపోటు ఉండటం, మధుమేహం, అధిక బరువు, వయస్సు ముప్పై ఐదు ఏళ్లు దాటడం, జంట గర్భం లేదా మల్టిపుల్ గర్భధారణ, గతంలో చనిపోయిన బిడ్డ పుట్టిన చరిత్ర, రక్తహీనత, గుండె సంబంధిత వ్యాధులు లేదా ఆటో ఇమ్యూన్ సమస్యలు. కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకపోయినా సహజంగానే బిడ్డ ఎదుగుదల కొంచెం మందగించవచ్చు. అయితే మంచి విషయం ఏమిటంటే, చాలామంది ఇలాంటి బిడ్డలు పుట్టిన తరువాత పూర్తిగా ఆరోగ్యంగా ఎదుగుతారు. కాబట్టి ముందుగా భయపడకుండా వైద్యుల సూచనలను జాగ్రత్తగా పాటించాలి. ముందుగా మీరు చేయాల్సింది ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం.ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. తగినంత నీరు తాగాలి. డాక్టర్ సూచించినంత వరకే తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ధూమపానం, మద్యం అలవాట్లు ఉంటే వెంటనే వాటిని పూర్తిగా మానేయాలి. ఇవి బిడ్డకు ఆక్సిజన్ సరఫరా తగ్గించి ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. నియమితంగా వైద్య పర్యవేక్షణలో ఉండటం చాలా ముఖ్యం. బిడ్డ ఎదుగుదలలో తేడా ఉన్నప్పుడు, డాక్టర్ తరచుగా గ్రోత్ స్కాన్లు సూచిస్తారు. ఈ స్కాన్లలో బిడ్డ బరువు, రక్తప్రవాహం, యామ్నియోటిక్ ద్రవం పరిమాణం వంటి అంశాలు చూస్తారు. డాప్లర్ పరీక్షల ద్వారా బిడ్డకు తల్లి నుంచి రక్తప్రవాహం ఎలా జరుగుతోందో అంచనా వేస్తారు. ఈ వివరాల ఆధారంగా డాక్టర్ తదుపరి చర్యలను నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాల్లో తల్లి రక్తంలో చక్కెర స్థాయులు లేదా రక్తపోటు నియంత్రణలో లేకపోతే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆ విలువలను ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి. ప్రోటీన్ లోపం ఉంటే ఆహారంతో దాన్ని పూడ్చుకోవాలి. చాలామంది తరచుగా స్కాన్ చేయించుకోవడమే బిడ్డకు హానికరమని అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పు. అల్ట్రాసౌండ్ పరీక్ష గర్భంలోని బిడ్డను అంచనా వేయడానికి అత్యంత సురక్షితమైన విధానం. బిడ్డ ఎదుగుదల పూర్తిగా ఆగిపోతే లేదా స్కాన్‌లో రక్తప్రవాహం తగ్గిపోతే, బిడ్డలో ఒత్తిడి లక్షణాలు కనిపిస్తే, అప్పుడే ముందుగా డెలివరీ చేయడం అవసరం అవుతుంది. అలాంటి సందర్భాల్లో బిడ్డ ఊపిరితిత్తులు పక్కాగా పనిచేయేందుకు ముందుగానే స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇస్తారు. డెలివరీ విధానం సాధారణమా లేదా సిజేరియన్ చేయాలా అనేది బిడ్డ ఆరోగ్యం, తల్లి పరిస్థితి, గర్భధారణ వయస్సు లాంటి అంశాలపై ఆధారపడి నిర్ణయిస్తారు. ఇప్పుడున్న ఆధునిక పరీక్షలు, ముఖ్యంగా స్కాన్లు, బిడ్డ ఎదుగుదల మందగించే ప్రమాదం ఉన్న మహిళలను ముందుగానే గుర్తించడానికి సహాయ పడుతున్నాయి. కొన్ని బయోకెమికల్ పరీక్షలతో పాటు, ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికి తక్కువ మోతాదులో ఆస్పిరిన్ మందు ఇవ్వడం ద్వారా ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ తగ్గించవచ్చు. అందుకే, మీరు మీ వైద్యుడి దగ్గర క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేయించుకోవాలి. భయపడకండి. జాగ్రత్తగా వైద్యుల సూచనలను పాటిస్తే, మీ బిడ్డ సురక్షితంగా, ఆరోగ్యంగా పుడతారు. డాక్టర్ కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ (చదవండి: ‘ఎగ్’సలెంట్ లుక్, గోళ్ల ఆరోగ్యం కోసం!) -
‘ఎగ్’సలెంట్ లుక్ కోసం!
నిజానికి గోళ్లలో చేరే ఫంగస్‌ను గోరంత సమస్య అనుకుంటే పొరబాటే! అందం, ఆరోగ్యం ఇలా రెండింటిపైనా ప్రభావం చూపించే ఈ సమస్య పూర్తిగా తగ్గాలంటే తగిన జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు నిపుణులు! పైనంతా పుచ్చిపోయి, లోపలికంటా పుండుపడిపోయి, ఇబ్బందిగా మారిన గోళ్లు తిరిగి మునుపటి రూపంలోకి రావాలంటే, ఈ అధునాతన పరికరం ఇంట్లో ఉండాల్సిందే!‘ఫంగబీమ్’ అనే ఈ డివైస్ తక్కువ–స్థాయి లేజర్ థెరపీని అందిస్తుంది. డ్యూయల్–వేవ్‌లెంగ్త్ లేజర్ టెక్నాలజీని ఉపయోగించడం ఈ గాడ్జెట్ ప్రత్యేకత. దీనిలో 905 నానోమీటర్ల ఇన్ఫ్రారెడ్ లైట్, 470 నానోమీటర్ల బ్లూ లైట్– ఇలా రెండు ఆప్షన్స్ ఉంటాయి. మొదటిది గోరు అడుగు భాగానికి లోతుగా చొచ్చుకుపోయి, ఫంగల్ ఇన్ఫెక్షన్ మూలాన్ని లక్ష్యంగా చేసుకునేలా పని చేస్తుంది. రెండవది ఉపరితల స్థాయిలో పరిశుభ్రతను పెంచడానికి, గోరు రూపాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ రెండు లైట్ థెరపీలు– ఎటువంటి మందులు, రసాయనాలు లేకుండా, నొప్పిలేకుండా ఫంగస్ నిర్మూలనకు సహాయపడతాయి.ఈ పరికరం ప్రధానంగా వినియోగదారులకు చక్కటి సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. ఇది పూర్తిగా ఆటోమేటెడ్‌గా పని చేస్తుంది, ఎలాంటి సెట్టింగులు అవసరం లేదు. ఒక్కో గోరుకు కేవలం 7 నిమిషాల సమయం పడుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఈ ట్రీట్మెంట్లో ఎటువంటి నొప్పి ఉండదు. దీనితో ఇంట్లో లేదా ప్రయాణంలో ఈజీగా చికిత్స చేసుకోవచ్చు. ఈ డివైస్ క్రమం తప్పకుండా వాడటం వలన గోరు రంగు చక్కగా మారుతుంది. గోరు మందం పెరిగి, ఆరోగ్యంగా కనబడుతుంది. ఈజీ చికిత్సను కోరుకునే వారికి ఇది ఒక గొప్ప ప్రత్యామ్నాయం.‘ఎగ్’సలెంట్ లుక్!సాధారణంగా చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గాలంటే ఎగ్ వైట్స్ వాడమంటున్నారు నిపుణులు. ఓ కప్పులోకి ఎగ్ వైట్ తీసుకుని బాగా మిక్స్ చేయాలి. దానిలో కలబంద గుజ్జు కొద్దిగా, పంచదార పొడి కొద్దిగా వేసుకుని, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్‌ని ముఖానికి పట్టించుకోవాలి. కనీసం 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఎగ్ వైట్స్‌లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని బిగుతుగా మార్చుతుంది. మృదువుగా మచ్చలు లేకుండా చేస్తుంది. అయితే 20 నిమిషాల పాటు ఉంచుకున్న తరవాత గోరు వెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా తరచుగా చేస్తుంటే ఫలితం కనిపిస్తుంది. (చదవండి: అతిపెద్ద ఆలయం ఎక్కడ ఉందంటే..! మన ఇండియాలో మాత్రం కాదు..) -
పరుల సొమ్ము
అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఉండేది. అది ప్రతిరోజూ ఆహారం కోసం అడవి చుట్టూతా ఉన్న గ్రామాలకు వెళ్లేది. అక్కడ ఆడవారు ధరించే నగలు, చూసి తాను కూడా ఒంటినిండా నగలు ధరించి తిరగాలనుకునేది.ఒక రోజు కోతి అడవికి దగ్గర్లో ఉన్న రామాపురం గ్రామానికి వెళ్ళింది. ఆ గ్రామంలోని చెరువులో నీళ్లు స్వచ్ఛంగా ఉండేవి. ఆహారం తిన్నాక కోతి నీళ్లు తాగటానికి చెరువుకు వెళ్ళింది. దాహం తీర్చుకున్నాక పక్కనే ఉన్న చెట్టు ఎక్కి కూర్చుంది. చెరువు దగ్గరికి రాకుమారి ఆమె మిత్రబృందం రావటం గమనించింది. రాకుమారి తన ఒంటిమీది వజ్రాల హారం చెరువు ఒడ్డున పెట్టి నీటిలోకి దిగింది.రాకుమారి›స్నానం చేస్తుండగా, కోతి నెమ్మదిగా చెట్టు దిగి వజ్రాల హారం పట్టుకొని అడవిలోకి పరిగెత్తింది. అది గమనించిన రాకుమారి, ఆమె మిత్రబృందం ‘పట్టుకోండి పట్టుకోండి!!! కోతి వజ్రాలహారం పట్టుకుని పరిగెడుతోంది!’ అంటూ పెద్దగా కేకలు వేశారు. దూరంగా ఉన్న రాజ భటులు కోతి వెంట పరుగు తీశారు. కోతి చాలా వేగంగా పరిగెత్తి అడవిలోకి వెళ్ళింది. కోతి పరుగెత్తి, పరుగెత్తి అడవి మధ్యలో ఒక చెట్టు ఎక్కి ఆయాసం తీర్చుకోసాగింది. అక్కడే చెట్టు కింద ఒక పాము పుట్ట గమనించింది. అప్పుడే ఆ పుట్టలోంచి పాము బయటికి వచ్చింది. పాముని గమనించిన ముంగిస, పాముని పొదల్లోకి వెంబడించింది. కోతికి వెంటనే ఒక ఉపాయం తట్టింది. ‘ఎలాగో పామును ముంగిస చంపేస్తుంది– నేను దొంగిలించిన వజ్రాల హారాన్ని దాచుకోటానికి ఈ పుట్టే సరైన ప్రదేశం. పుట్టలో పాము ఉందనుకుని ఎవరూ ఇక్కడికి రారు’ అనుకుంది. వెంటనే వజ్రాల హారాన్ని పుట్టలోకి జారవిడిచింది. తెల్లారి వచ్చి వజ్రాల హారాన్ని తీసుకోవచ్చని భావించింది.అక్కడి నుంచి రాజభటులకు కనిపించకుండా తన ఇంటికి వెళ్ళిపోయింది. చీకటి పడటంతో రాజభటులు కోతి కోసం కొద్దిసేపు గాలించి, వెనుతిరిగి చెరువుకు వెళ్ళిపోయారు. తెల్లారి కోతి పుట్టలో చేయి పెట్టి వజ్రాల హారం తీసుకుంది. మెడలో ధరించి మురిసిపోయింది. ఇంతలో పుట్ట నుంచి పాము వచ్చి కోతిని చుట్టేసింది. అప్పుడే అటుగా రాజభటులు కోతిని వెతుక్కుంటూ వచ్చారు. కోతి మెడలో వజ్రాల హారం చూసి పుట్ట దగ్గరకు పరుగున వచ్చారు. పాము కోతిని విడిచి పుట్టలోకి దూరింది. రాజభటులు కోతిని బంధించి వజ్రాలహారాన్ని తీసుకున్నారు. దొంగిలించిన పరుల సొమ్ము విషపూరితమైనదని, ప్రమాదకరమైనదని గ్రహించింది కోతి.పల్లా శైలజ -
యోధుడా.. నీకు సెల్యూట్ ..!
మిలట్రీ వాళ్లను చూసినా, మిలట్రీ డ్రెస్‌ను చూసినా సెల్యూట్ కొట్టాలని అనిపించేంతగా భావావేశానికి లోనవుతాం. అదీ మిలట్రీ పవర్! సాధ్యం కాదు కానీ, అందరికీ దేశ రక్షణ దళాలలో పని చేయాలనే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఫ్యాషన్లన్నీ మిలట్రీ నుంచి వచ్చినవే. దేశాధి నేతలు మొదలు సామాన్య పౌరుల వరకు ఏదో ఒక సందర్భంలోమిలట్రీ దుస్తులు మన ఒంటిపై కవాతు చేస్తూ కనిపిస్తాయి. అంతగా స్ఫూర్తిని ఇస్తున్న సైనిక వస్త్ర, శస్త్ర విశేషాలు.. క్లుప్తంగా మీ కోసం!కార్గో ప్యాంట్లు1930లలో, బ్రిటిష్ సైన్యం కార్గో ప్యాంట్లను యుద్ధ దుస్తులలో భాగంగా ప్రవేశపెట్టింది. తూటాలు, ఇతర మందుగుండు సామగ్రి అమర్చుకోవటానికి సదుపాయంగా ఆ ప్యాంట్లకు ఇరువైపు ‘పక్క తొడ’ల పైన, నడుముకు ముందువైపు రెండు వైపులా జేబులు ఉండేలా డిజైన్ చేశారు. బ్రిటన్ తర్వాత కార్గో ప్యాంట్లను క్రమంగా యూఎస్ సైన్యం కూడా ఉపయోగించటం మొదలుపెట్టింది. 1990ల నాటికి ఇది సాధారణ పౌరుల ఫ్యాషన్ స్టేట్మెంట్గా మారింది. యువతీ యువకులు స్టెయిల్ కోసం వీటిని ధరించటం మొదలు పెట్టారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తరచు కార్గో ప్యాంట్స్‌లో కనిపిస్తుంటారు. మూడేళ్లుగా సాగుతున్న రష్యా–ఉక్రెయిన్ ఘర్షణల సమయంలో జెలెన్స్కీ వస్త్రధారణ కూడా ఒక ప్రతీకగా మారింది! త్రిశూలం గుర్తు ఉన్న నల్లటి, లేదా ఆలివ్ ఆకుపచ్చ టాప్‌తో, కార్గో ప్యాంట్స్ ధరించే జెలెన్స్కీ, ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఆపించే విషయమై ప్రపంచ దేశాధినేతలతో చర్చిస్తున్నప్పుడు దేశాధ్యక్షుడిగా కాక, కార్గో ప్యాంట్లలో ఒక సైనిక యోధుడిని తలపిస్తుంటారు. మన దగ్గర బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ కార్గో ప్యాంట్స్‌ని ఎక్కువగా ధరిస్తుంటారు.ఏవియేటర్ సన్గ్లాసెస్హాలీవుడ్లోకి ఏవియేటర్ సన్‌గ్లాసెస్ రావటానికి ముందే, యూఎస్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు వాటిని ధరించారు. అంతకుముందు వరకు పైలట్లు పాతకాలపు బరువైన గాగుల్స్ వాడేవారు. ఆ తర్వాత వాటికి బదులుగా ఏవియేటర్ సన్‌గ్లాసెస్‌ను కనిపెట్టారు. ‘పైలట్’ను ‘ఏవియేటర్’ అని కూడా అంటారు. ఆ పేరు మీదే ఏవియేటర్ సన్‌గ్లాసెస్ వాడుకలోకి వచ్చాయి. ఎండ తాకిడి నుంచి అవి బలమైన రక్షణను ఇస్తాయి.ఏవియేటర్ సన్‌గ్లాసెస్‌కు అధునాతన రూపమే ‘రే–బాన్’ కళ్లద్దాలు. ‘రే’ అంటే సూర్యకిరణాలు. ‘బ్యాన్’ అంటే తెలిసిందే, నిషేధం అని. సూర్యకిరణాలు పడకుండా అడ్డుకుంటాయి కనుక అవి రే–బాన్ సన్‌గ్లాసెస్ అయ్యాయి. సంపన్నుల ఫ్యాషన్‌లో ఇప్పుడు ముఖ్య భాగం అయ్యాయి. అమెరికా పూర్వపు అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నెడీ, రెండో ప్రపంచ యుద్ధపు అమెరికన్ టాప్ కమాండర్ జనరల్ డగ్లస్ మాక్ఆర్థర్, వియత్నాం విప్లవ నాయకుడు హో చి మిన్.. రే–బాన్ గ్లాసులు ధరించేవారు. ప్రస్తుత నాయకులలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అప్పుడప్పుడు రే–బాన్‌లో దర్శనం ఇస్తుంటారు టీ–షర్ట్టీ–షర్ట్ నమూనాను తొలిసారిగా అమెరికా నావికాదళం డిజైన్ చేసినట్లు చరిత్ర చెబుతోంది. బహుశా 1898 స్పెయిన్–అమెరికా యుద్ధ సమయంలో షర్ట్ కింద వేసుకునే అండర్ షర్ట్‌గా దీనికి రూపకల్పన చేశారని అంటారు. టీ షర్ట్ క్రమేణా సైన్యంలో తప్పనిసరి ధారణగా మారింది. అక్కడి నుండి 1950ల నాటికి పాప్ సంస్కృతిలో భాగమైంది. ఆ తర్వాత దాదాపు ప్రతి వార్డ్రోబ్లోకీ ప్రవేశించింది. దేశాధినేతలు అధికారిక కార్యక్రమాలలో టీ షర్ట్‌ను ధరించటం ప్రపంచ దేశాలలో ఎక్కడా కనిపించదు. అదే విధంగా, దాదాపు అన్ని కార్యాలయాలలో టీ షర్ట్‌పై అనధికార నిషేధం ఉంటుంది. విధి నిర్వహణలో కాకుండా ఉల్లాసంగా గడిపే సమయాలలోనే సాధారణంగా ఎవరైనా టీ షర్ట్‌ను ధరించి ఉండటం కనిపిస్తుంది.అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, కెనడా మాజీ ప్రధాని ఇప్పుడంటే టీ–షర్ట్‌లో దర్శనం ఇస్తున్నారు కానీ, పదవిలో ఉండగా వాళ్లేనాడూ టీ షర్ట్‌లో అధికారిక కార్యక్రమాలలో కనిపించలేదు. గ్రీకు రాజ్యమైన మేసిడోనియా రాజు ‘అలెగ్జాండర్ ది గ్రేట్’ (క్రీ.పూ.356–323) టీ షర్ట్‌లను పోలిన పై వస్త్రాన్ని ధరించేవారని అనుకోవటానికి కొన్ని పోలికలు కనిపిస్తాయి.20వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచం అంతటా నావికులు, కార్మికులు, సౌకర్యవంతమైన లోదుస్తులుగా టీ షర్టులకు ప్రాధాన్యం ఇచ్చారు. దేశాధినేతలు అధికారిక కార్యక్రమాలలో టీ షర్ట్‌ను ధరించటం ప్రపంచ దేశాలలో ఎక్కడా కనిపించదు. అదే విధంగా, దాదాపు అన్ని కార్యాలయాలలో టీ షర్ట్‌పై అనధికార నిషేధం ఉంటుంది. విధి నిర్వహణలో కాకుండా ఉల్లాసంగా గడిపే సమయాలలోనే సాధారణంగా ఎవరైనా టీ షర్ట్‌ను ధరించి ఉండటం కనిపిస్తుంది.అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, కెనడా మాజీ ప్రధాని ఇప్పుడంటే టీ–షర్ట్‌లో దర్శనం ఇస్తున్నారు కానీ, పదవిలో ఉండగా వాళ్లేనాడూ టీ షర్ట్‌లో అధికారిక కార్యక్రమాలలో కనిపించలేదు. గ్రీకు రాజ్యమైన మేసిడోనియా రాజు ‘అలెగ్జాండర్ ది గ్రేట్’ (క్రీ.పూ.356–323) టీ షర్ట్‌లను పోలిన పై వస్త్రాన్ని ధరించేవారని అనుకోవటానికి కొన్ని పోలికలు కనిపిస్తాయి.20వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచం అంతటా నావికులు, కార్మికులు, సౌకర్యవంతమైన లోదుస్తులుగా టీ షర్టులకు ప్రాధాన్యం ఇచ్చారు. కార్డిగన్కార్డిగన్ ధరించినప్పుడు హాయిగా, సౌఖ్యంగా ఉండే కార్డిగన్ దుస్తులను మొదట 1850లలో క్రిమియన్ యుద్ధంలో రష్యన్లపై దాడి చేసిన సమయంలో బ్రిటిష్ సైన్యం ధరించింది. నిజానికి ‘కార్డిగన్’ అనేది ఒక బిరుదు. ‘ఎర్ల్ ఆఫ్ కార్డిగన్’ అంటే కార్డిగన్ అనే బిరుదు కలిగిన గొప్ప వంశానికి చెందిన వ్యక్తి. అప్పటి బ్రిటిష్ అశ్విక దళానికి నాయకత్వం వహించిన 7వ ‘ఎర్ల్ ఆఫ్ కార్డిగన్’ జేమ్స్ థామస్ బ్రూడెనెల్ ఆనాటి క్రిమియన్ యుద్ధానికి ఈ దుస్తులను ధరించి సారథ్యం వహించారు కనుక ఆ దుస్తులకు కార్డిగన్ అని పేరు పెట్టారు. కార్డిగన్ డిజైన్, దానిని ధరించిన వారి కార్యాచరణలు బ్రిటిషర్ల దేశభక్తికి ప్రతీకలుగా నిలిచిపోయాయి. కాలర్ లేని స్వెట్టర్ లేదా జాకెట్‌ను ‘కార్డిగన్’ అంటారు. ఫ్రెంచి ఫ్యాషన్ డిజైనర్ కోకో చానల్ 1920లలో మహిళలు ధరించే కార్డిగన్లను ప్రాచుర్యంలోకి తెచ్చారు. పురుషుల కార్డిగన్లను ధరించేటప్పుడు తన జుట్టు చెదిరిపోతుండటం నచ్చకపోవటంతో ఫ్రంట్ ఓపన్ కార్డిగాన్లను మహిళల కోసమే ఆమె ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఒక బల్గేరియన్ రేడియో ఎడిటర్నైతే కార్డిగన్ ఏకంగా ఒక హత్యాయత్నం నుండే కాపాడింది! అతను ధరించిన మందపాటి ఉన్ని కార్డిగన్.. రహస్య ఏజెంటు ఆ ఎడిటర్‌పై పేల్చిన విషపు గుళిక శరీరంలోకి చొచ్చుకొని పోకుండా నిరోధించింది. హై – హీల్స్అశ్విక దళంలోని సైనికులు గుర్రాలను ఎక్కి రెండు వైపుల బూటు కాలు ఉంచే రింగులలో (అంకేలు) పాదాలకు మరింతగా కుదురును ఇవ్వటం కోసం మొదట పర్షియన్ సైనికులు 10వ శతాబ్దంలో హై హీల్స్‌ను కనిపెట్టారు. యుద్ధ సమయంలో గుర్రాన్ని దౌడు తీయించటంలో ఎంతో ప్రాముఖ్యాన్ని కలిగి ఉండే ఈ హై హీల్స్ కాల క్రమంలో హోదాకు చిహ్నంగా మారాయి. చివరికి గ్లామర్‌కు పర్యాయపదం అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మహిళల మనసు దోచుకున్నాయి. మహిళా దేశాధినేతలు హైహీల్స్ ధరించటం సర్వ సాధారణమే కానీ, చరిత్రలో హై హీల్స్‌ను ఇష్టపడిన పురుష నాయకులూ ఉన్నారు. ఫ్రాన్స్ రాజు 14వ లూయీ తన హోదాకు చిహ్నంగా హై హీల్స్ ధరించేవారు. ఐక్యరాజ్య సమితిలో ఓసారి అమెరికా మాజీ రాయబారి (ఐరాసకు) నిక్కీ హేలీ హై హీల్స్ ధరించటం గురించి గళం విప్పారు! ‘‘హై హీల్స్ శక్తిని, సాధికారతను ఇస్తాయి. యథాతథ స్థితిని సవాలు చేస్తాయి. అందువల్లనే నేను హై హీల్స్ ధరిస్తాను’’ అని ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియో వంటి వారు పొడవుగా కనిపించటానికి హై హీల్స్ ధరిస్తారన్న పుకార్లు ఉన్నాయి. 2023లో, మహిళలపై హింసకు వ్యతిరేకంగా అవగాహన పెంచటానికి ‘హోప్ ఇన్ హై హీల్స్’ ప్రచారంలో కెనడా పురుష ఎంపీలు హై హీల్స్ ధరించారు. బాంబర్ జాకెట్బాంబర్ జాకెట్‌ను మొదటి ప్రపంచ యుద్ధ పైలట్ల కోసం ‘యూఎస్ ఆర్మీ ఏవియేషన్ క్లోతింగ్ బోర్డ్’ సృష్టించింది. ఎ–1 అని వ్యవహరించిన ఆ బాంబర్ జాకెట్‌ను తొలిసారి 1917లో అమెరికన్ పైలట్లు ధరించారు. పైలట్లను వెచ్చగా ఉంచడానికి బోర్డు రూపొందించిన మొదటి ఫ్లయిట్ జాకెట్ అది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యూరప్‌పై ప్రమాదకరమైన ఎత్తైన ప్రదేశాలలో బాంబు దాడులను నిర్వహించిన యువ అమెరికన్ వైమానిక దళ సభ్యులను ‘బాంబర్ బాయ్స్’ అనే వారు. ఆ పేరు నుంచే బాంబర్ జాకెట్ వాడుకలోకి వచ్చింది.అమెరికన్ మిలిటరీ 1950లలో ఎం.ఎ.–1 అనే బాంబర్ జాకెట్‌ను వృద్ధి చేసింది. అది ప్రకాశవంతమైన నారింజ రంగు లైనింగ్‌తో ఉండేది. ఒకవేళ విమానం కూలిపోతే, రక్షణ బృందాలకు సజీవంగా ఉన్న పైలట్ తేలిగ్గా కనిపించటానికి జాకెట్‌ను తిప్పి వేసుకోవచ్చు. లోపలి లైనింగ్ నారింజ రంగులో ఉంటుంది కనుక క్షతగాత్రుడైన పైలట్ జాడ కనిపెట్టటం వారికి తేలికవుతుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మిగిలిపోయిన బాంబర్ జాకెట్లను అమెరికన్ సైన్యం పౌరులకు అందుబాటులోకి తెచ్చింది. ఆ తర్వాతి నుంచి వాటిని సామాన్యులూ వాడటం మొదలు పెట్టారు. ముఖ్యంగా హిప్–హాప్ కళాకారులు. 1980లో బాంబర్ జాకెట్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది. దానికి కారణం టామ్ క్రూజ్ హిట్ చిత్రం ‘టాప్ గన్’లో ఆయన జి1 మోడల్ బాంబర్ జాకెట్‌ను ధరించటమే. ప్రారంభంలో బాంబర్ జాకెట్లు బరువైన తోలుతో తయారైనప్పటికీ తర్వాత్తర్వాత తేలికపాటి నైలాన్, సిల్క్, రీసైకిల్ చేసిన సముద్రపు ప్లాస్టిక్‌ల వంటి వాటితో విస్తృతంగా తయారై, ఏ సీజన్‌కైనా అనుకూలంగా ఉండేలా మారాయి. డాగ్ ట్యాగ్లుయుద్ధ సమయంలో సైనికులు మరణించినా, గాయపడినా.. వారిని సేవా దళ సభ్యులు గుర్తించటానికి వీలుగా వారి దుస్తులకు తగిలించి ఉండేవే డాగ్ ట్యాగ్లు. ఇవి అండాకారంలో ఉండే రేకు ముక్కలు. వాటిపై ఆ సైనికుల వివరాలు ముద్రించి ఉంటాయి. అమెరికా అంతర్యుద్ధ సమయంలో తొలిసారిగా ఈ డాగ్ ట్యాగ్‌లను అనధికారికంగా ప్రవేశపెట్టారు. గుర్తు తెలియని సమాధులలో శత్రువులు కనుక తమ వారిని సమాధి చేస్తే వారిని కనిపెట్టేందుకు డాగ్ ట్యాగ్‌లను తగిలించారు.డాక్ ట్యాగ్‌లను ఇప్పుడు సైనికులతో పాటుగా, పౌరులు కూడా తగిలించుకుంటున్నారు. కార్పొరేట్ కార్యాలయాలలో ఉద్యోగుల మెడలో కనిపించే ఐడీ కార్డులకు ప్రేరణ డాగ్ ట్యాగ్ల నుండి వచ్చిందేనని అంటారు.ట్రెంచ్ కోట్నీటితో తడవని, బరువు ఉండని తేలికపాటి ‘గ్రేట్ కోట్’లకు సమానమైన ట్రెంచ్ కోట్‌ను తొలిసారిగా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ సైన్యం ఉపయోగించింది. సైనికులను కందకాలలో పొడిగా ఉంచే ఈ కోటు కాల క్రమేణా పౌరుల దైనందిన జీవితంలో భాగం అయింది.గ్రేట్ కోట్ పొడవుగా, బరువుగా, వెచ్చని ఓవర్ కోట్లా, ఉన్నితో తయారై ఉంటుంది. మొదట్లో సైనిక సిబ్బంది వీటినే ధరించేవారు. తీవ్రమైన చలి గాలుల నుంచి ఈ గ్రేట్ కోట్లు వారికి రక్షణ కల్పించేవి. వీటి పొడవు సాధారణంగా మోకాలి కింది వరకు ఉంటుంది. ట్రెంచ్ కోట్... గ్రేట్ కోట్కు అడ్వాన్స్డ్ వెర్షన్ అని చెప్పాలి. వాటర్ ప్రూఫ్ వస్త్రంతో తయారౌతుంది. అదనపు రక్షణను కల్పిస్తుంది. సైనిక చిహ్నాలను తగిలించటానికి భుజం పట్టీలు ఉంటాయి. ట్రెంచ్ కోట్ కూడా మోకాలి కింది వరకు ఉంటుంది. క్రమంగా ఇందులోకీ ఫ్యాషన్ వచ్చి చేరింది. మహిళలకు ప్రత్యేకంగా ట్రెంచ్ కోట్లు వచ్చాయి. ఫ్యాషన్ షోలలో ఎక్కువ మంది మోడళ్లు ట్రెంచ్ కోట్లను పోలిన వస్త్రాలను ధరించటం మీరు చూసే ఉంటారు. ట్రెంచ్ అంటే కందకం. కందకాల్లో ఉండి పోరాడే సైనికుల కోసం తయారైన కోట్ కనుక వీటికి ట్రెంచ్ కోట్ అనే పేరు వచ్చింది. సాక్షి, స్పెషల్ డెస్క్ (చదవండి: పొలాల నుంచి డిజిటల్ ప్రపంచంలోకి..ఇవాళ 400 మందికి పైగా యువతకు..!) -
దారి చూపిన చెప్పులు
దేశ రాజధాని ఢిల్లీలో నవంబర్ 10న చోటు చేసుకున్న విధ్వంసం మానవబాంబు దాడిగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. సిటీ పోలీసు విభాగానికి గుండెకాయ లాంటి నగర పోలీసు కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై 2005 అక్టోబర్ 12న రాత్రి 7.20 గంటల సమయంలో ఇది చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు అధికారులు ఓ చెప్పుల జత ఆధారంగా ముందుకు వెళ్లారు. బేగంపేటలో గ్రీన్లాండ్స్ చౌరస్తాలోని నగర కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయం (ప్రస్తుతం సికింద్రాబాద్‌కు మారింది) 2005 అక్టోబరు 12న మానవబాంబు దాడి జరిగింది. నగరానికి చెందిన గజ ఉగ్రవాది షాహెద్ అలియాస్ బిలాల్ తదితరుల నేతృత్వంలో జరిగిన ఈ కుట్రలో బంగ్లాదేశ్‌కు చెందిన మౌథసిమ్ బిల్హా అలియాస్ డాలిన్ మానవబాంబుగా మారాడు. ముందే పెట్టుకున్న ముహూర్తం ప్రకారం టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై దాడి చేశాడు. ఆ రోజు దసరా పండుగ కావడం, అప్పటికి కొద్ది నిమిషాల ముందే సిబ్బంది సమావేశం ముగించుకుని బయటకు వెళ్లిపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పి ఉగ్రవాదుల అంచనాలు తలకిందులయ్యాయి. సెంట్రీ డ్యూటీలో ఉన్న హోంగార్డు ఎ.సత్యనారాయణ చనిపోగా, కానిస్టేబుల్ వెంకట్రావుకు తీవ్రగాయాలయ్యాయి. పేలుడు జరిగిన కొద్దిసేపటి వరకు అసలు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. ఘటనాస్థలికి చేరుకున్న పంజగుట్ట పోలీసులు తొలుత ఇది టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో ఉంచిన బాణసంచా లేదా స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల వల్ల జరిగిందని భావించారు. కొంత సమయానికి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణుల బృందం అనేక కోణాల్లో పరిశీలించి, మృతదేహం శరీరభాగాలు సేకరించి, విశ్లేషించిన తర్వాతే మానవబాంబు దాడిగా నిర్ధారించింది. ఈ ఘాతుకం విషయం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు, హోంమంత్రి హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అప్పటికే చాలా వరకు ధ్వంసమైన టాస్క్‌ఫోర్స్ కార్యాలయం మొండి గోడల నుంచి అప్పటికీ పొగలు వస్తూనే ఉన్నాయి. పోలీసుల్నే టార్గెట్‌గా చేసిన ఈ దాడి కేసును సవాలుగా తీసుకున్న అధికారులు పంజగుట్ట పోలీసుస్టేషన్ నుంచి నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) బదిలీ చేశారు.ఈ కేసును ఎంత సవాల్‌గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించినా, తొలి అడుగు వేయడానికి అవసరమైన ఒక్క ఆధారంగా కూడా అప్పటికి పోలీసుల వద్ద లేదు. టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై ఓ వ్యక్తి మానవబాంబుగా మారి దాడి చేశాడనే అంశం తప్ప అతడు ఎవరు? ఎక్కడి వాడు? వెనుక ఉన్నది ఎందరు? తదితర వివరాలేవీ అందుబాటులో లేవు. మానవబాంబు ఎవరనేది తెలిస్తేనే అడుగు ముందుకు పడుతుందని భావించిన పోలీసులు మరోసారి ఘటనాస్థలిని సమగ్రంగా పరిశీలించడానికి నిపుణుల బృందాన్ని రప్పించారు. అక్కడి అణువణువూ పరిశీలించిన ఫోరెన్సిక్ అధికారులకు ఓ జత తోలు చెప్పులు లభించాయి. ఆరో నంబర్ సైజుతో కూడిన వాటిని అంతకు ముందు సేకరించిన మానవబాంబు మృతదేహం పాదాలకు పోల్చిచూడగా సరిగ్గా సరిపోయాయి. దీంతో అవి మానవబాంబువే అని నిర్ధారించిన నిపుణులు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలోనే వాటిపై ఉన్న ‘టీకే 200’ అక్షరాలు నిపుణుల దృష్టిలో పడ్డాయి. అది ఆ చెప్పుల రేటును స్పష్టం చేసే అంశంగా తేల్చిని అధికారులు చుట్టుపక్కల ఉన్న దేశాల్లోని కరెన్సీ వివరాలు ఆరా తీశారు. ఇలా టీకే అంటే బంగ్లాదేశ్ కరెన్సీ టాకా అని గ్రహించిన నిపుణులు సదరు మానవబాంబు బంగ్లాదేశ్‌కు చెందిన వాడని స్పష్టం చేశారు. దీంతో ఐఎస్ఐ, దాని ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల ప్రమేయం కోణంలో దర్యాప్తు జరిగి కేసు కొలిక్కి వచ్చి, ఉగ్రవాద సంస్థ హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామీ (హుజీ) పాత్ర వెలుగులోకి వచ్చింది. అలా దొరికిన తీగతో మొదలైన దర్యాప్తు దేశవిదేశీ కోణాలను వెలికి తీసింది. ‘టాస్క్‌ఫోర్స్’ కేసులో మొత్తం 20 మందిని నిందితులుగా గుర్తించిన సిట్ విదేశాల్లో, పరారీలో ఉన్న వారిని మినహాయించి మిగిలిన పది అరెస్టు చేసింది. మూడో నిందితుడిగా ఉన్న మానవబాంబు డాలిన్ ఘటనాస్థలిలోనే మరణించాడు. మిగిలిన తొమ్మిది మందిలో ప్రధాన నిందితుడు గులాం యజ్దానీ అలియాస్ నవీద్ 2006లో ఢిల్లీలో, రెండో నిందితుడిగా ఉన్న షాహెద్ అలియాస్ బిలాల్ 2007లో పాకిస్థాన్‌లో ఉన్న కరాచీలో ఎన్కౌంటర్ అయ్యారు. హైదరాబాద్‌కు చెందిన ఫర్హాతుల్లా ఘోరీ, బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫ్, ముతాలిబ్, ఇక్బాల్, అష్రాఫ్, పాకిస్తాన్‌కు చెందిన ఖాన్ అలియాస్ పఠాన్లతో సహా ఏడుగురు చిక్కనే లేదు. ఈ కేసుకు సంబంధించి సిట్ చార్జ్‌షీట్, సప్లమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేసినప్పటికీ, అదనపు సెక్షన్లు చేర్చే విషయంపై స్టే కారణంగా సుదీర్ఘకాలం విచారణకు బ్రేక్ పడింది. చివరకు 2012లో మళ్లీ నాంపల్లి కోర్టులో ట్రయల్ ప్రారంభమైంది. పోలీసులు అరెస్టు చేసిన నిందితులపై నేరం నిరూపించడంలో ప్రాసిక్యూషన్ వైఫల్యం చెందింది. దీంతో ఈ కేసు వీగిపోయి నిందితులు బయటపడ్డారు. -
నాడు ఆఫీసు బాయ్... నేడు కంపెనీ సీఈఓ
ప్రతి వ్యక్తిలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే తపన ఉంటే అదే మన జీవితాన్ని ఉన్నతంగా మార్చేస్తుంది.మనం చేయగలగింది ఎప్పుడైనా సమర్థత, ప్రతిభను అందిపుచ్చుకుంటూ ప్రయాణిస్తూ ఉండాలి. అప్పుడే డబ్బు కూడా వస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో అందరు తల్లిదండ్రుల కల.. తమ బిడ్డ టెక్నాలజీ రంగంలో రాణించాలని. బీటెక్ చదివిన విద్యార్థుల ఆశలు.. పెద్ద పెద్ద కంపెనీలలో లక్షల్లో ప్యాకేజీ పొందాలని.‘కానీ, ఈ రోజుల్లో నైపుణ్యాల లేమి వల్ల వీరి కలలు నెరవేరడం లేదు’ అంటారు ఫణిరాజు జాలిగామ. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అజా (AJA Coding Tutor) కోడింగ్ ట్యూటర్ ద్వారా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఫణిరాజు జాలిగామ సాఫ్ట్వేర్ కంపెనీలకు అర్హత కలిగిన ఉద్యోగులను అందించడంలో బిజీగా ఉన్నారు. ‘సాఫ్ట్వేర్ రంగంలో సెట్ అవడానికి ఇతర డిగ్రీలు చేసిన వాళ్లు కూడా అర్హత సంపాదించుకోవచ్చు’ అంటూ అందుకు తన జీవితమే గొప్ప ఉదాహరణగా చూపుతున్నారు. ఉక్కు నరాలున్న వందమంది యువతను అప్పగిస్తే దేశ తలరాతను మార్చి చూపుతా అన్న వివేకానందుడి మాటలను గుర్తు చేస్తూ ‘ప్రతి వ్యక్తిలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే తపన ఉంటే అదే మన జీవితాన్ని ఉన్నతంగా మార్చేస్తుంది’ అంటారు. ఒకప్పుడు జిల్లా కోర్టులో ఆఫీస్ బాయ్‌గా పనిచేయడం నుంచి నేడు కోట్లాది రూపాయల ఐటీ సేవల సంస్థకు అధ్యక్షుడు, సీఈఓగా ఎదిగే వరకు ఫణిరాజ్ జాలిగామ ప్రయాణం అత్యంత స్ఫూర్తితో నిండినది. ఆఫీసు బాయ్‌గా.. డ్రైవర్‌గా! పూర్వ కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి పట్టణవాసి ఫణిరాజు జాలిగామ. ఆయన తండ్రి అక్కడ రిజిస్ట్రేషన్ స్టాంపులు అమ్మేవారు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టుడంతో తాతల నాటి కొద్దిపాటి ఆస్తి అమ్ముకొని రోజులు గడపాల్సి వచ్చింది. పదో తరగతి పూర్తయ్యేసరికి ఆ ఆస్తీ కరిగిపోయింది. టెన్త్‌లో 85 శాతం మార్కులు సాధించి, పై చదువులకు వెళ్లాలన్న తపన ఉన్నా ఆర్థిక ఇబ్బందులు అడ్డుగోడలా నిలిచాయి. ఎవరినీ చేయి చాపి అడగని మనస్తత్వం. కానీ, ఎదగాలి అంటే ఏదో ఒక పని చేయాలి. ఒక పాన్ షాపులో పనికి కుదిరాడు. ఓ తెలుగు వారపత్రికను ఇల్లిల్లూ చేర్చడానికి ఏజెంట్‌గా మారాడు. ఐటీఐ చేసి, ఎలక్ట్రీషియ¯Œ గా పనిచేశాడు. ఈ అన్ని పనుల ద్వారా వచ్చిన డబ్బుతో ఇంటర్మీడియట్ చదువును ప్ర«థమ శ్రేణిలో పూర్తి చేశాడు. కార్ డ్రైవర్‌గా పనిచేస్తూ కరీంనగర్ జిల్లా కోర్టులో ఆఫీస్ బాయ్ ఉద్యోగం సంపాదించాడు. అది అతని మొదటి ప్రభుత్వ ఉద్యోగం. ఎదగాలనే తపనే సోపానంకోర్టులో క్లర్క్ జాబ్‌కు ఉన్న ప్రాధాన్యం చూసి ఆ ఉద్యోగం పొందాలనుకున్నాడు. ఏ టేబుల్ మీద అయితే టీ, కాఫీలు అందిస్తూ వచ్చాడో ఆ టేబుల్ ముందు కూర్చొని వర్క్ చేయాలనుకున్నాడు. తెలిసినవారిని అడిగితే షార్ట్‌హ్యాండ్ పరీక్షలలో పాసైతే అదే హోదాతో కాపీయిస్ట్ ఉద్యోగం పొందవచ్చని సూచించారు. దీంతో బాయ్‌గా పనిచేస్తూనే షార్ట్ హ్యాండ్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. న్యాయమూర్తి అనుమతితో రాత్రిపూట కోర్టులో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. ఉదయం షార్ట్ హ్యాండ్ నేర్చుకునేవాడు. కొద్ది రోజుల్లోనే షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 225 పదాలు రాయగలిగాడు. ఆ పరీక్షలో డిస్టింక్ష¯Œ లో పాస్ అయ్యాడు. ఆ సంవత్సరం జిల్లా కోర్టులో కాపీరైట్ల పోటీకి హాజరు కావడంతో ఆ ఉద్యోగం వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం, స్థిరమైన ఆదాయం జీవనం సాఫీగానే సాగిపోతోంది. ఈలోగా ఎంసీఏ చేసిన మేన మరదలు శ్రీలలితతో వివాహం జరిగింది. భార్య ఐటీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. ‘నేను అప్పటికే కరస్పాండె¯Œ ్స డిగ్రీ పూర్తి చేశాను. నా టాలెంట్‌ను గమనించిన నా భార్య ఐటీ ఉద్యోగం అయితే మంచిదని సూచించడమే కాకుండా, ప్రయత్నించమని చెప్పింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టి, కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడం ప్రారంభించాను. బంధువులు వద్దని వారించినా ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి, పూణేలోని ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాను‘ అని ఫణిరాజ్ తాను ఐటీ రంగంలోకి ప్రవేశించిన విధానాన్ని వివరిస్తారు.కంపెనీ డైరెక్టర్.. లక్షల్లో జీతం...ఐటీ కంపెనీలో ఫణిరాజ్ మొదటి జీతం రూ. 15,000. చేరిన ఆరు నెలల్లోనే, ఐటీ రంగంలో మంచి భవిష్యత్తు అని గ్రహించాడు. తర్వాత ఎంబీయే పూర్తి చేసి, టీసీఎస్‌లో సీనియర్ మేనేజర్‌గా చేరి నెలకు రూ. 4.5 లక్షల జీతం పొందాడు. ‘ఆ తర్వాత 2015లో కాగ్నిజెంట్ టెక్నాలజీలో అసోసియేట్ డైరెక్టర్‌గా ఎదిగారు. ‘అప్పుడే నా ఫ్రెండ్ సూచనతో స్వంత కంపెనీని స్థాపించాలనే ఆలోచన వచ్చింది. డబ్బుల కోసం ఆలోచించలేదు. నా దగ్గర ఉన్న పనిని ఇంకొంత మెరుగ్గా, పదిమందికి ఉపయోగపడాలనేదే ఆలోచన. అప్పటికే సాఫ్ట్‌వేర్‌లోకి ఎంతో మంది ఉద్యోగులను తీసుకోవడం, వారి చేత వర్క్ చేయించడం... ఓ యజ్ఞంలా సాగుతూనే ఉంది.బంగారం అమ్మేసి.. ఎక్కడ చూసినా ప్రతిభావంతులు తక్కువ శాతమే కనిపిస్తున్నారు. సరైన నైపుణ్యాలు లేక ఐటీ రంగంలో జాబ్‌లు పోగొట్టుకున్నవారు ఎందరో. హైదరాబాద్‌లో అమీర్‌పేట్ లాంటి ప్లేసుల్లో రకరకాల టెక్నాలజీ కోర్సుల్లో చేరి, సాధారణ ఉద్యోగాలు పొందేవారు ఎంతోమంది ఉన్నారు. ఇదంతా గమనించే ‘ఓజాస్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్’ను స్థాపించాను. అయితే, ఇదంత సులువు కాలేదు. సొంత కంపెనీని స్థాపించాలంటే పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. తగినంత మొత్తం సమకూరలేదు. దీంతో మా ఆవిడ నగలు అమ్మేసి, లోన్లు తీసుకొని ఈ కంపెనీని స్థాపించాను. ఐదేళ్లలో 5000 మందికి ఉద్యోగవకాశాలు లభించాయి. కంపెనీ అతి త్వరలోనే ఏడాదికి దాదాపు రూ. 50 కోట్ల టర్నోవర్ పొందే స్థితికి చేరుకుంది. అమెరికాలోని సియమెన్స్, ఇన్ఫ్యూజన్ సాఫ్ట్ .. వంటి పెద్ద కంపెనీలు మా కస్టమర్లు అయ్యారు. మనం చేయగలగింది ఎప్పుడైనా సమర్థత, ప్రతిభను అందిపుచ్చుకుంటూ ప్రయాణిస్తూ ఉండటమే. అప్పుడే డబ్బు కూడా వస్తూ ఉంటుంది’ అంటారు ఈ ఐటీ దిగ్గజం. ఇంజనీర్ డిగ్రీ చేయకపోయినా.. ఉద్యోగంఐటీ రంగంలోకి ప్రవేశించడానికి ముందు తాము ఎదుర్కొన్న ఇబ్బందులను మరచిపోలేదని చెబుతారు ఫణిరాజు. అందుకే, నాన్ టెక్నాలజీ వాళ్లవైపు తమ ఆలోచన ఉండేవని వివరిస్తారు. ‘కాలేజీల్లో టాప్ ర్యాంకర్లను మాత్రమే కాకుండా, అమీర్‌పేట్‌లో కోచింగ్ తీసుకుంటూ ఇబ్బందులు పడుతున్న వారిని ఉద్యోగులుగా తీసుకున్నాం. 5 లక్షల వరకు ప్యాకేజీ ఇచ్చి మేమే శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాం. రెండేళ్ల కిందట అజా పేరుతో కోడింగ్ ట్యూటర్‌ను ప్రారంభించాం. దీని ద్వారా బీయే, బీకామ్ చదివి ఐటీ రంగంలోకి ప్రవేశించాలనుకునే వారికి కూడా శిక్షణ ఇచ్చి, కంపెనీలకు నియామకాలు చేస్తున్నాం. నేర్చుకోవాలనే తపన ముఖ్యం కానీ, డిగ్రీలు కావు. బీటెక్ చేసిన చాలా మంది విద్యార్థులకు నాలుగు లైన్ల కోడింగ్ రాయడం రాదు. కానీ, నలభై లక్షల ప్యాకేజీ కావాలన్నట్టుగా ఉంటారు. ఏదో విధంగా సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగం తెచ్చుకున్నా మూడు నుంచి ఆరు నెలలలోపే బయటకు వస్తున్నారు. దీని వల్ల ఇటు ఉద్యోగి భవిష్యత్తు, కంపెనీల భవిష్యత్తుకు ప్రమాదంలో పడుతుంది. అందుకే, ముందు స్కిల్స్‌పైన దృష్టి పెట్టాలి. స్కిల్ నేర్చుకున్నవారికి మేమే సరైన కంపెనీల ద్వారా ఉద్యోగావకాశాలను ఇప్పిస్తున్నాం’ అని తెలియజేశారు.జీవితంలో రాణించాలని, ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే కోరిక అతను కోరుకున్న గమ్యస్థానాలకు దగ్గర చేసింది. ఇంకా, చేరుకోవాల్సిన లక్ష్యాలు చాలానే ఉన్నాయి అంటారు ఈ ఐటీ నిపుణుడు. ఉన్న స్థానం నుంచి మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలనే తపన తనను ఎప్పుడూ వెంటాడుతుందని, ఏదైనా సాధించాలనుకున్న ప్రతిసారీ ఈ భావనే ముందుకు నెడుతుందని చెబుతున్నారు ఫణిరాజ్. ఆ తపనే ఆఫీస్‌బాయ్ నుంచి ఐటీ కంపెనీకి సీఈఓగా మార్చిందని వివరించారు. ∙నిర్మలా రెడ్డిఫొటోలు: మోర్ల అనిల్‌కుమార్ -
పాత బొమ్మల కొత్త రి‘స్టోరీ’
గోల్డెన్ క్లాసిక్‌గా నిలిచిన ఆ తరం పాత సినిమాలను నేటి అధునాతన టెక్నాలజీ అయిన 4కే రిజల్యూషన్‌తో పునరుద్ధరించి, సరికొత్తగా జీవం పోస్తున్నారు. ఉదాహరణగా చెప్పుకోవాలంటే తాతయ్య అమ్మమ్మ జ్ఞాపకాలుగా ఇంట్లో ఉన్న పాత మరచెంబును అలా మూలకు పడకుండా చింతపండు వేసి తోమి తళతళా మిలమిలా మెరిపించి కొత్తదానిలా చేయడం. దానితో ఉన్న జ్ఞాపకాలను మరొక్కసారి మననం చేయడమే ఈ రిస్టోరేషన్.1962లో విడుదలైన ‘గుండమ్మ కథ’ సినిమాను ఫోర్ కే రిజల్యూషన్‌లోకి సరికొత్తగా మార్చి, అక్కినేని శత జయంతి సందర్భంగా గత సంవత్సరం అక్టోబర్‌లో విడుదల చేశారు. ఒక తాతయ్య తన మనవరాలితో కలిసి ఆ సినిమా చూశాడు. మొదటిసారిగా ఆ సినిమా చూసినప్పుడు తనెంత చిన్న పిల్లాడో, ఆరోజున సినిమా టికెట్ ధర పది పైసలు సంపాదించడానికి తానెంత కష్టపడ్డాడో, ఆ నేల టికెట్ తీసుకొని కింద ఇసుకలో కూర్చున్న సంగతి నుంచి రాజనాల ఎన్టీఆర్ ఫైట్, అక్కినేని తాగి చేసిన అల్లరి, ‘కోలో కోలో’ పాటకు ఆనందంతో తాను చేసిన డ్యాన్స్ , ఆనాటి నుంచి తనతో పాటు ప్రయాణిస్తూ మదిగదిలో తడియారని జ్ఞాపకాలను మనవరాలితో పంచుకున్నాడు. ‘చదువుకోకుండా టీవీలు, సినిమాలు చూస్తే పాడైపోతారని అస్తమానం మందలించే తాతయ్య, తామంతా భయపడే నాన్న కూడా భయపడే తాతయ్యలో ఇంతటి అల్లరి సినీ ప్రేమికుడు ఉన్నాడా?’ అనుకుంటూ ఆ మనవరాలు ఆశ్చర్యపోయింది. ఆ రోజు నుంచి తాతయ్యకు తనకు బాండింగ్ మునుపటి కంటే ఇంకా చిక్కగా అయ్యింది. ఈ అనుభవం ఒక్క ఆ తాత మనవరాలిదే కాదు. భారతదేశంలో ఉన్న చాలామంది సినీ ప్రేమికులది. దీనికంతటికీ కారణం ఫోర్కే రిజల్యూషన్‌తో రిస్టోర్ చేసిన ఓ సినిమా.వివిధ భాషలకు చెందిన అనేక క్లాసిక్ చిత్రాలను 4కేలో రిస్టోర్ చేసి, థియేటర్లోకి మళ్ళీ విడుదల చేస్తున్న సందర్భంగా ఈ రిస్టోర్ రీ రిలీజ్‌కు సంబంధించిన కథా కమామిషూ తెలుసుకుందాం!సామాన్యంగా ఏ సినిమా అయినా, అది తీసే నాటికి అందుబాటులో ఉన్న టెక్నాలజీతో తెరకెక్కిస్తారు. అప్పటికి అందుబాటులో ఉన్న కెమెరాలనే వాడతారు. పిక్చర్ క్వాలిటీ ఆ కెమెరాల పరిధి మేరకే ఉంటుంది. సరిగ్గా చెప్పాలి అని అంటే కీప్యాడ్ ఫోన్లు ఉన్నప్పుడు జనమంతా వాటినే వాడారు. తర్వాత ఆ కీప్యాడ్ ఫోన్లకి ఓ చిన్న కెమెరా అమర్చారు. అప్పటికి ఫోన్లకు కెమెరా ఉండటమే గొప్ప! తరువాత ఆ కెమెరా క్వాలిటీ పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఉన్న ఫోన్లలో కెమెరాతో 4కే లేదా 8కే వరకు వీడియోలు తీయవచ్చు. అప్పటికీ ఇప్పటికీ వీడియో క్లారిటీ చాలా పెరిగింది. ఇదే విధానం ఇప్పుడు సినిమా కెమెరాలకూ వర్తిస్తుంది. కీప్యాడ్ కెమెరాతో తీసిన వీడియోకు, ప్రస్తుతం ఐఫోన్‌తో తీసిన వీడియోకు వ్యత్యాసం ఎంత ఉందో; ఆనాడు మిచెల్ కెమెరాతో ఫిల్మ్ మీద తీసిన సినిమాలకు ఈనాడు అందుబాటులో ఉన్న కెమెరాలతో చీప్ మీద తీసిన సినిమాలకు అంత వ్యత్యాసం ఉంది. పాత కెమెరాలతో తీసిన సినిమాలను ప్రస్తుతం అందుబాటులో ఉన్న కెమెరా టెక్నాలజీకి అప్ గ్రేడ్ చేయడమే రిస్టోరేషన్ పద్ధతి. సింపుల్‌గా చెప్పాలంటే బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న పాత తాతయ్య ఫోటోను సరికొత్త ఫొటోగా మార్చడం. తెలుగు సినిమా ప్రయాణాన్ని మలుపు తిప్పిన 1989 ‘శివ’ సినిమాను సరికొత్త ఫోర్ కేలోకి రిస్టోర్ చేసి ఇలానే విడుదల చేశారు.తొలి ఘనత ‘కల్పన’‘దీని వలన రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి పాత సినిమాలను నేటితరం కోసం, తర్వాతి తరాల కోసం జాగ్రత్త చేయడం; రెండు ఈ సరికొత్త చిత్రాన్ని రిలీజ్ చేసి వ్యాపారం చేయడం. ఇందులో పుణ్యం పురుషార్థం రెండూ ఉన్నాయి. వ్యాపారం చేసి, డబ్బులు సంపాదించడం ఒకటైతే; ప్రేక్షకుల జ్ఞాపకాలను మరొక్కసారి తట్టి లేపడం రెండవది. అయితే అన్ని చిత్రాలూ డబ్బు సంపాదించి పెట్టలేకపోవచ్చు’’ అంటున్నారు ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ స్థాపకులు, డైరెక్టర్ శివేంద్ర సింగ్ దుంగార్పూర్. ఈ సంస్థ హాలీవుడ్ దర్శకుడు మార్టిన్ స్కోర్ససి స్థాపించిన ఫిల్మ్ రిస్టోరేషన్ సంస్థతో కలిసి పాత సినిమాల పునరుద్ధరణ నిర్వహిస్తుంది. ఈ ఫౌండేషన్ ఉదయ్ శంకర్ 1948లో తీసిన ‘కల్పన’ చిత్రాన్ని ఫోర్ కేలోకి రిస్టోర్ చేసి ఆ సినిమాకు పునరుజ్జీవం పోసింది. ‘కల్పన’ రిస్టోర్ అయిన మొదటి భారతీయ సినిమాగా రికార్డులకెక్కింది.రిస్టోరేషన్ నేటి తరానికి అవసరంనేటి కమర్షియల్ సినిమాల్లో మితిమీరిన హింస, మతిలేని డ్రామా ఉంటోందని ఆనాటి సినిమా చూసిన పాతతరం ప్రేక్షకులు వాపోతుంటారు. వారి మాటల్లోనే చెప్పాలంటే, ‘కత్తి పట్టుకుంటే నరకటం, గన్ను పట్టుకుంటే కాల్చడం, శత్రువును క్షమించడం కంటే కనపడితే రెండుగా చీల్చడం– ఎలివేషన్లే కాని, ఎమోషన్ లేని సీన్లతో ఈ సినిమాలో కథ ఏముంది? అదే మా కాలంలోని సినిమాలోనైతేనా’ అంటూ ఆనాటి వారి సినిమాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు.అయితే ఈ మాటను నేటి యువ సినీ ప్రేక్షకులు ఒప్పుకోరు. హీరో ఎంట్రీ ఎలివేషన్ల బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కి ఈలలు, చప్పట్లతో థియేటర్ని హోరెత్తించే నేటి బర్గర్ పిజ్జా బిర్యానీ తరానికి బ్లాక్ అండ్ వైట్ సినిమా పాత చింతకాయ పచ్చడిలా అనిపిస్తుంది. ఈతరం వారి సినిమాలను అప్పటి వారు మెచ్చుకోరు. ఆతరం వారి సినిమాలను ఇప్పటివారు ఒప్పుకోరు. ఫాస్ట్ కట్స్కి అలవాటుపడ్డ వారికి పాత సినిమాలు లాగ్ అనిపిస్తాయి. అయినా నలుపు తెలుపు రెండే రంగులున్న ఆ పాత సినిమాలు చూసేవారెవరు? చూడాలన్నా అందుబాటులో ఉండాలి కదా! అద్దం మొహం ఒక దగ్గర ఉంటేనే ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అందుకోసమైనా ఆ ఓల్డ్ గోల్డ్ క్లాసిక్స్‌ని నేటి టెక్నాలజీకి అనువుగా మార్చి ఈ జెన్ జీ తరానికి చేరువ చేయాలి. ఆ పాత సినిమాల్లో కథలు ఎలా ఉండేవి? ఆ నటుల నటనాస్థాయి ఏమిటి? హాస్యం, జుగుప్స లేకుండా ఎంత హాయిగా ఉండేది? సంగీతంలో లాలిత్యం, సాహిత్యంలో కవి భావం ఎంత లోతుగా ఉండేదో ఈ తరానికి తెలియాలంటే ఈ ఫోర్ కే రిస్టోరేషన్ అవసరం చాలా ఉంది.‘నేటి ప్రేక్షకుడు సాంకేతికంగా నాణ్యమైన సినిమాని చూడడానికి అలవాటు పడ్డాడు. సినిమా, టీవీ తెరలే కాదు, ఎక్కువ సమయాన్ని గడిపే మొబైల్ స్క్రీన్లు కూడా అద్భుతమైన ఫోర్ కే దృశ్యాలను చూపెడుతున్నాయి. అలాంటి వారికి సెవెంటీ ఎంఎంపై తీసిన సినిమాలు చూడమంటే ఇబ్బందే. అందుకే పాత సినిమాల రిస్టోరేషన్ చేయడం అవసరం’ అని శేమారూ ఎంటర్టైన్మెంట్ సీఈవో హిరేన్ గాడా అభిప్రాయపడ్డారు.‘ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్‌లు ప్రస్తుతం 4కేలో లేని సినిమాలను స్వీకరించడానికి ఆసక్తి చూపడం లేదు. పాత సినిమాలను ఫోర్ కేలో రిస్టోర్ చేసిన హక్కుదారులకు, అదే పాత సినిమాను నాన్ ఫోర్కే హక్కుదారులకు వ్యాపారపరంగా చాలా అంతరం ఉంది. పాత సినిమాలను పాత పద్ధతిలో ఉంచుకున్న వారికి ఆదాయ మార్గాలు చాలా పరిమితంగా ఉన్నాయి’ అని అల్ట్రా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ గ్రూప్ సీఈవో సుశీల్ కుమార్ అగర్వాల్ తెలిపారు.‘బోల్తా’బొమ్మలతో రిస్టోరేషన్కు వేగంపాత క్లాసిక్స్‌ను ఫోర్ కేలో రిస్టోర్ చేసి, రిలీజ్ చేయడం వలన థియేటర్లో ప్రేక్షకుల రాక మళ్ళీ పెరిగింది. అమితాభ్ బచ్చన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 అక్టోబర్‌లో జరిగింది. ఇందులో అమితాభ్ బచ్చన్ పదకొండు హిట్ సినిమాలను దేశవ్యాప్తంగా ప్రదర్శించారు. ఆ సినిమాలను చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా రిలీజ్ అయిన హిందీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం కూడా పాత సినిమాల 4కే రిస్టోరేషన్ను వేగవంతం చేసింది. మల్టీప్లెక్స్‌లకు కొత్త కంటెంట్ కావాలి. వారాల తరబడి, నెలల తరబడి అవి ఒకే సినిమాను ప్రదర్శించవు. అందులోనూ సినిమా సక్సెస్‌ను బట్టి రిలీజ్ అయిన రెండు వారాలలోపే ఓటీటీలోకి ఆ సినిమాలు వచ్చేస్తుంటే మల్టీప్లెక్స్‌లకు ఆడియన్స్ ఎందుకు వస్తారు? కాబట్టి ఓటీటీలోకి వచ్చిన సినిమాను మల్టీప్లెక్స్ నుంచి తీసేయాల్సిన పరిస్థితి. అందుకోసమైనా కొత్త కంటెంట్ కావాలి. కంటెంట్ లేమితో ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రదర్శించడానికి కూడా మల్టీప్లెక్స్‌లు వెనుకాడటం లేదు. సరిగ్గా ఈ సందర్భాన్ని ఫోర్ కే రిస్టోరేషన్ సినిమాలు సమర్థంగా వాడుకుంటున్నాయి. సౌత్‌లో కూడా ఫోర్ కే రిలీజ్ ట్రెండ్‌గా మారింది. దానికంటూ కొత్తతరంలో సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా తయారైంది.కొంతమంది నిర్మాతలు దర్శకులు నటులు తమ తొలినాటి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి ఈ ఫోర్ కే రిస్టోరేషన్ను గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ‘శివ’ సినిమా 4కే విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో నాగార్జున ‘శివ సినిమాను నాన్నగారు చూశారు. ఆరోజు మేమిద్దరం కారులో వెళుతున్నాం. నాన్నగారే డ్రైవింగ్ చేస్తున్నారు. పంజాగుట్ట శ్మశాన వాటిక దగ్గరకు వచ్చేసరికి ఆయన నా చేతి మీద చేయి వేస్తూ చాలా బాగా నటించావు. సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది. ఈ సక్సెస్ ఎక్కడికెళ్ళి ఆగుతుందో అంచనా వేయడం చాలా కష్టం’ అని తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నారు. ఈ ట్రెండ్ కొనసాగేనా..?ఆ పాత మధురాలను ఫోర్ కేలో రిస్టోర్ చేసి రిలీజ్ చేస్తే ప్రస్తుతానికైతే ప్రేక్షకులు బాగానే చూస్తున్నారు. ప్రేక్షకుల ఆదరణను పరిగణనలోకి తీసుకొని చాలా సినిమాలను ఫోర్ కేలోకి మారుస్తున్నారు. అయితే ఈ ఆదరణ తాత్కాలికమేనా, లేదా దీర్ఘకాలికంగా కొనసాగే అవకాశం ఉందా అంటే ‘అది ప్రేక్షక దేవుళ్లే చెప్పాలి’ అని సినిమా ప్రముఖులు సమాధానం చెబుతున్నారు. కొత్తగా సినిమా తీసి రిస్క్ చేయడం కంటే ఆల్రెడీ సక్సెస్ అయిన సినిమాను 4కేలో రిలీజ్ చేయడం ఖర్చుతో పాటు రిస్క్‌ను కూడా తగ్గిస్తుంది. పాత సినిమాలను 4కేలో రిస్టోర్ చేయడానికయ్యే ఖర్చు దాని నెగటివ్ నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. నెగటివ్ నాణ్యతను బట్టి రూ. 20 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఖర్చవుతుంది. అదే కొత్త సినిమా తీయాలంటే కనీసం ఐదు కోట్లయినా కావాలి. దాన్ని కూడా లో బడ్జెట్ చిత్రంగానే పరిగణిస్తారు. ఆ సినిమాలకు ఓపెనింగ్స్ ఉండవు. హిట్ టాక్ వస్తే ఆడియ¯Œ ్స వస్తారు. లేదంటే పోస్టర్ మైదా ఖర్చులు కూడా రావు. అదే పెద్ద సినిమాలైతే వందల కోట్లు కావాలి. ఎన్ని కోట్లు పెట్టినా సక్సెస్ అవుతుందన్న గ్యారంటీ కూడా ఉండదు. అదే పాత సినిమాల విషయంలో ఆ భయం అవసరం లేదు. ఖర్చు తక్కువ, ఆదరణ ఎక్కువ. అలాగని పాత సినిమాలన్నీ సక్సెస్ అవుతాయని నమ్మకం లేదు.‘మేము గురుదత్ సినిమాలను 4కేలోకి రిస్టోర్ చేశాం. వాటిలో కొన్ని మాత్రమే లాభసాటి బిజినెస్ చేశాయి. ఉదాహరణకు బాజ్ (1953) సినిమాకు ప్రేక్షకులు లేరు. కాని, ప్యాసా (1953) మాత్రం బాగా వర్కౌట్ అయింది’ అని అగర్వాల్ చెప్పారు.ఇప్పుడు పాత సినిమా హక్కుదారులు జాగరూకులయ్యారు. 10–15 రీస్టోర్ చేసిన సినిమాలు దీర్ఘకాలికంగా తమకి ఎంత లాభాలు తీసుకువస్తాయో అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలిక ప్రదర్శన, సినిమా పాపులారిటీని బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు. 4కే చేసిన పాత సినిమాల రిస్టోరేషన్ తర్వాత మూడు నుండి ఐదు సంవత్సరాల్లో మొత్తం ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అధికంగా ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, రిస్టోరేషన్ ఒకసారి చేస్తే సరిపోతుంది. ప్రేక్షకుడిని చేరుకునే పరిస్థితి గణనీయంగా పెరుగుతుంది. టెక్నాలజీకి అనుగుణంగా మారి థియేటర్లో ప్రేక్షకుడికి పాత సినిమా సరికొత్త అనుభూతినిస్తుంది. ఫిల్మ్ రిస్టోరేషన్ రంగంలో పనిచేసే కంపెనీలు చెప్పిన దానిని బట్టి ‘ఈ ఫోర్ కే సినిమాల ఆదాయం స్మార్ట్ టీవీలు, యూట్యూబ్‌పై వచ్చే యాడ్స్ ఆదాయం పాత సినిమాల ఆదాయం కంటే అధికంగా ఉంటుంది. ఒక సినిమాని ఫోర్ కేలో చూడాలా లేదా పాత ఫార్మాట్లో చూడాలా అనే సంశయం ప్రేక్షకుడికి అస్సలు లేదు. ఫోర్ కే ఓకే అంటాడు. మారిన ప్రేక్షకుడి అభిరుచి కూడా ప్రకటనల ద్వారా మంచి ఆదాయం రావడానికి కారణమైంది. ప్రస్తుతం సగటున అగ్రిగేటర్ల లైబ్రరీలో కనీసం 10 శాతం సినిమాలు 4కేలోకి రిస్టోర్ అయ్యాయి. మిగతా 80–90% సినిమాలు కనీసం హెచ్డీ ఫార్మాట్ వరకు అప్డేట్ అయ్యాయి. లభ్యమయ్యే ఆదాయ మార్గాల దృష్ట్యా రాబోయే సంవత్సరాలలో 4కే రిస్టోరేషన్ మరింత పెరుగుతుందని పరిశ్రమ నిపుణుల అంచనా. మరోవైపు, అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ కంప్లీట్ చేయలేకపోవడం, కంప్యూటర్ గ్రాఫిక్స్ పూర్తి కాకపోవడం వలన సినిమాలు ముందుగా ప్రకటించిన తేదీలకు విడుదల కాకపోవడం, మరో తేదీకి వాయిదా పడడం కూడా ఈ రీ రిలీజ్ సినిమాలకు కలిసి వచ్చే అంశం అయింది. వాళ్ల తేదీలను వీళ్లు ఉపయోగించుకుంటున్నారు.‘క్లాసిక్ సినిమాలకు 20 ఏళ్ల తర్వాత కూడా ప్రేక్షకులు ఉంటారు. ఒక క్లాసిక్ సినిమాకు ప్రజాదరణ ఉన్నప్పుడు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ మార్గాల ద్వారా తక్కువలో తక్కువ 300 నుంచి 400 శాతం లాభం తీసుకు రాగలదు’ అని ‘క్వాలిటీ మేటర్’ వ్యవస్థాపకుడు కౌశిక్ భట్టాచార్య చెప్పారు.అలా 4కే పుట్టింది! 4కేఅంటే సాధారణంగా ‘ఓకే, మంచి క్వాలిటీ’ మాత్రమే కాదు. ఆ స్క్రీన్ లోపల జరుగుతున్న మ్యాజిక్ తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు! 3840 ఎక్స్ 2160 పిక్సెల్స్ అంటే సామాన్యంగా అంటే 8.3 మిలియన్ చుక్కలు! ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి ముఖం, రంగు, నీడ అన్నీ ఆ 83 లక్షల పిక్సెల్స్ కలిసి వేసే ఒక అందమైన చిత్రం. అందుకే దీన్నే అల్ట్రా హెచ్డీ అంటారు. ఒకసారి పోల్చితే 720 పిక్సెల్స్ హెచ్డీ నుంచి 1080 పిక్సెల్స్ అల్ట్రా హెచ్డీ నుంచి దానికి రెట్టింపు 2160 పిక్సెల్స్. ఇప్పుడిది సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 1980 నుంచి 1997 వరకు పాత సినిమాలు పాత ఫొటోల్లో ఉండే చిరునవ్వులా స్పష్టత లేని చిత్రాల్లా జీవించాయి. రీల్స్ మీద కాలం వేసిన మరకలు, రంగుల్లో మసక, శబ్దంలో జనాల చప్పట్లు అలా– అవి బతికి ఉండేవి కాని, మెరిసేవి కాదు. తర్వాత 2006లో ఒక్కసారిగా హెచ్డీ టెక్నాలజీతో వాటి రంగు మెరిసింది. ఒక్కో పాత రీల్ మేల్కొంటున్నట్టుగా, పాడైపోయిన ఫ్రేమ్స్‌కు రంగులు పూయడం మొదలయింది. ఇక 2015లో 4కే రాకతో అసలు పండుగ మొదలైంది. పాత సినిమాలకు పునర్జన్మ లభించినట్టుగా– అదే ఏడాదిలో 23 సినిమాలు పుట్టాయి. మరుసటి ఏడాదికి 43 అయ్యాయి. 2022 నాటికి 85. ప్రపంచం మొత్తం పాత ఖజానాలను తిరిగి వెలుగులోకి తెచ్చేందుకు పరుగెడుతోంది.ఈ కథ వెనుక నిశ్శబ్ద సూపర్ హీరో మార్టిన్ స్కోర్సేసీ. ఆయన 1990లో స్థాపించిన ఫిల్మ్ ఫౌండేషన్ సంస్థ. నటులు కథలను జీవిస్తే, ఈయన కథలను కాపాడతాడు. ఆయన ఒక్కరితోనే వందలాది సినిమాలు మళ్లీ శ్వాస పీల్చాయి. ఆ జ్వాల భారతదేశానికీ చేరింది. 2015లో నేషనల్ ఫిల్మ్ yð వలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్డీసీ) పాడైపోయిన రీల్స్‌ను చేతుల్లోకి తీసుకుని, డిజిటల్ ప్రపంచంలోకి లాగి, 4కే కాంతిలో మళ్లీ నిలబెట్టింది. అప్పటి నుంచే మనం పాత సినిమాలను చూసేటప్పుడు ‘అది పాత సినిమా కాదు, పాత కాలం కొత్తగా పుట్టింది’ అనిపిస్తోంది.సినీ పునరుద్ధరణ ప్రస్థానం∙1980 నుంచి 1997 నెగటివ్ నుంచి ఎస్డీ ఫార్మాట్ ∙2006 నుంచి 2013 హెచ్డీ ఫార్మాట్ ∙2015 2కే ∙2016 4కే ∙2022 8కే ∙1990 ఫిల్మ్ ఫౌండేషన్ అనే సంస్థను హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మార్టిన్ స్కోర్సేసీ స్థాపించారు.∙2015 నుంచి నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్డీసీ), నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా (ఎన్ఐఎఫ్ఏఐ) ఫిల్మ్ రిస్టోరేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
కథాకళి: పేపర్ బాయ్
నేను ఇంజినీరింగ్ సెకండియర్ చదువుతూ సంపాదనకి రోజూ ఉదయం ఆరులోగా వంద ఇళ్ళల్లో దినపత్రికలని సరఫరా చేయసాగాను. అందుకు రెండు గంటల పైనే పడుతుంది. ఆ అదనపు ఆదాయం నా బస్ పాస్‌కి సరిపోతుంది. సమయం అంటే డబ్బు అని ఎందుకు అంటారో అలా నాకు అనుభవపూర్వకంగా తెలిసింది. తక్కువ సమయం తక్కువ డబ్బు, ఎక్కువ సమయం ఎక్కువ డబ్బు. నా బీట్‌లో అపార్ట్మెంట్స్ తక్కువ. సొంత ఇళ్ళ వాళ్ళు ఎక్కువ. అపార్ట్మెంట్ సబ్స్క్రైబర్స్లోని సౌకర్యం, ఎక్కువ దినపత్రికలని తక్కువ సమయంలో డెలివరీ చేయొచ్చు. ఇండిపెండెంట్ ఇళ్ళల్లో ఇవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది.నేను పేపర్లని వేసే ఓ ఇండిపెండెంట్ ఇంటి యజమానిని నెల నెలా కలిస్తే పేపర్ బిల్‌ని కేష్గా చెల్లిస్తూంటాడు. నా కస్టమర్స్ అందరిలోకి ఆయనే ఎక్కువ వయసు గలవాడు. ఆయన మిగిలినవారి కన్నా ప్రేమగా ఉంటాడు. నెల నెలా డబ్బు కలెక్ట్ చేసుకోడానికి వెళ్ళినప్పుడు నా గురించి అడిగి తెలుసుకునేవాడు. నా చదువు ఎలా సాగుతోందని అడిగేవాడు. ప్రతిసారి వాగ్బకరీ ఇన్ స్టంట్ కార్డమమ్ టీని ఇచ్చి కాని పంపేవాడు కాదు. నాలుగు నెలల క్రితం బిల్ కోసం వెళ్తే ఆయన కోరాడు.‘‘రేపటి నుంచి నువ్వు నాకో సహాయం చేయాలి.’’‘‘అలాగే, చెప్పండి.’’‘‘నువ్వు పేపర్ని కాంపౌండ్ గోడ మీంచి విసిరేసి వెళ్తున్నావు. అలా కాకుండా బెల్ కొట్టి నాకు ఇస్తూండు.’’‘‘అలాగే సర్. కాని నేను ఆ పేపర్ సరిగ్గా మీ తలుపుకి తగిలి దాని ముందు పడేలా చక్కగా విసురుతున్నాను. ఇంతదాకా ఎన్నడూ నేను మిస్ అవ్వలేదు. అయ్యానా సర్?’’ఆయన సన్నగా నవ్వి చెప్పాడు.‘‘లేదు. నీ టాలెంట్‌ని గుర్తించాను. కాని నువ్వా పని చేయాలి. నేను అడిగేది నీ సమయాన్ని ఎక్కువ తీసుకోవడం అని నాకు తెలుసు. నీ సమయానికి నీకు నెలకి ఐదు వందలు అదనంగా చెల్లిస్తాను. సరేనా?’’‘‘అది చాలా పెద్ద మొత్తం సర్. నూట ఏభై చాలు.’’ఆయన నవ్వి చెప్పాడు.‘‘నీకు. నాకు కాదు. నిజానికి నాకు అది చాలా చిన్న మొత్తం. ఎందుకంటే...’’ఆయన చెప్పింది విన్నాక మర్నాటి నుంచి ఆయన ఇంటి ముందు సైకిల్ దిగి స్టాండ్ వేసి లోపలికి వెళ్ళి డోర్ బెల్ కొట్టి తలుపు తెరచిన ఆయనకి ‘గుడ్ మార్నింగ్’ చెప్పి పేపర్ ఇవ్వసాగాను.ఆయన ప్రతిసారి కృతజ్ఞతగా ‘థాంక్యూ. గాడ్ బ్లెస్ యు’ అంటారు. ‘బై సర్. టేక్ కేర్ సర్’ లాంటి మాటలు చెప్పి నేను సైకిల్ ఎక్కుతాను. నెలకి ఐదు వందల రూపాయలు అదనపు ఆదాయానికి మా ఇంట్లో అందరికన్నా మా అమ్మ ఎక్కువ ఆనందించింది. ఇంట్లో కుట్టు మెషిన్ తో బ్లౌజులు కుట్టడానికి ఒకో దానికి మా అమ్మ సంపాదించే మొత్తం అది. ఓరోజు తలుపు తట్టినా ఆయన తెరవకపోవడంతో పేపర్ని తలుపు ముందు పడేసి వెళ్ళిపోయాను. నా బీట్ ముగిశాక ఆయన ఇంటి ముందు నుంచి వెళ్తూ ఆగి చూస్తే పేపర్ అక్కడే ఉంది. ఆయన కోరిక ప్రకారం నేను మధ్యాహ్నం పన్నెండున్నరకి మళ్ళీ వెళ్ళి చూస్తే ఆయన ఇంటి తలుపు ముందు దినపత్రిక నేను వేసిన చోటే కనిపించింది. ఆ తర్వాత ఆయన కోరింది చేశాను.పోలీసుల దగ్గరకి వెళ్ళి ఆయన ఇంటి డూప్లికేట్ తాళం చెవి ఎవరి దగ్గర ఉంటుందో చెప్పాను. ఆ వృద్ధుడు నాకు ఇచ్చిన తన మాజీ కొలీగ్ ఇంటి చిరునామా, ఫోన్ నెంబర్ గల కాగితాన్ని నేను ఎస్సైకి ఇచ్చాను. నేను చెప్పింది విని ఎస్సై ఓ కాన్ స్టబుల్ని ఆ పని చూడమన్నాడు. ఇద్దరం అక్కడికి చేరుకున్నాము.లోపల టీవీ ఆన్ లో ఉంది. దాని ముందు సోఫాలో కూర్చున్న ఆయన ఒరిగిపోయిన తీరు చూడగానే పోయాడని మాకు అర్థమైంది. ఆయన చేతిలోని రిమోట్ తీసే ప్రయత్నం చేసినా, రాకపోవడంతో కాన్ స్టబుల్ చెప్పాడు.‘‘రిగర్‌మార్టిస్. పోయి చాలా గంటలైంది.’’ఆయన మరణించాడని తెలిసి నేను బాధపడ్డాను. ఓ కస్టమర్‌ని కోల్పోయాననో, నెలకి ఐదు వందలు పోయాయనో కాదు. ఆయన పరిస్థితి గురించి తెలిశాక. ఆయన కొడుకు ఫోన్ నెంబర్‌కి ఫోన్ చేసి ఆ విచారకర వార్త చెప్పాను. అతను వచ్చేలోగా ఆయన మృతదేహాన్ని హాస్పిటల్లో భద్రపరిచే ఏర్పాటు ఆయన కొలీగ్ చేశాడు. ఆయన పోయిన పదమూడో రోజు నాకు ఆయన కొడుకు నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే తనని కలవమని చెప్తే వెళ్ళాను. ఓ కవర్ ఇచ్చాడు. దానిమీద నా పేరుంది. దాన్ని చింపి చదివాను.డియర్ పేపర్ బాయ్, థాంక్స్. నువ్వు డోర్ బెల్ నొక్కినప్పుడు నేను తలుపు తెరవక పోవడానికి కారణం తెలిశాక ఇది నీకు అందుతుంది. నా భార్య ఆరు నెలల క్రితం పోయింది. మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు. నాకు వీసా దొరక్క ఇండియాలో ఉండాల్సి వచ్చింది. నా సమయం ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు. నా శవం కుళ్ళిన వాసన వచ్చాక కాక, నేను పైకి వెళ్ళానన్న వార్త మా అబ్బాయికి వెంటనే తెలియచేయడానికి నీతో ఆ ఏర్పాటు చేసుకున్నాను. నన్ను ముఖాముఖి కలిసేవారు, నాతో మాట్లాడేవారు ఎవరూ లేరు. డోర్ బెల్ మోగి తలుపు తెరవగానే నువ్వు చెప్పే గుడ్ మార్నింగ్ నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. బాగా చదువుకో బై! గాడ్ బ్లెస్ యు.ఉత్తరానికి పెట్టిన జెమ్ క్లిప్‌కి నా పేర ఏభై వేల రూపాయలకి తారీఖు వేయని చెక్కు కూడా ఉంది. -
బాబాకు ఇష్టమైన ఏనుగు
సాయిగీత అనేది శ్రీ సత్యసాయిబాబాకు ఎంతో ఇష్టమైన ఏనుగు. ఈ ఏనుగును సత్యసాయి బాబా ప్రేమగా చూసుకునేవారు. ఆ ఏనుగు చనిపోయిన తర్వాత దానికి పుట్టపర్తిలో ఒక సమాధి నిర్మించారు. ఇక్కడ సాయిగీత (ఏనుగు) సమాధికి నిత్యపూజలు నిర్వహిస్తారు. శ్రీ సత్యసాయిబాబా 1962లో ముదుమలై అటవీ ప్రాంతానికి పర్యటనకు వెళ్లినప్పుడు, అనాథగా మిగిలిన గున్నటేనుగును అటవీ అధికారులు అప్పగించారు. బాబా దానిని చేరదీసి, దానికి సీసాతో పాలు తాగించారు. తనతో పాటు పుట్టపర్తికి తీసుకొచ్చారు. సాయిగీత అని పేరు పెట్టి అల్లారుముద్దుగా చూసుకునేవారు. సాయిగీత ఎల్లవేళలా శ్రీ సత్యసాయిబాబాను వెన్నంటి ఉండేది. సాయిగీత 2007 మే 22న తుదిశ్వాస విడిచింది. బాబా స్వయంగా దగ్గరుండి శాస్త్రోక్తంగా అంతిమసంస్కారం జరిపించారు. -
నేను సాయిబాబాను
ఈ ఏడాది వేడుకలకు ప్రత్యేకత ఉంది. మూడు పవిత్రతల సమ్మేళనం భగవాన్ శతజయంతి ఉత్సవాలు, దీపావళి పర్వదినం, అవతార ప్రకటన దినం ఒకేసారి రావడంతో భక్తుల్లో పండుగ వాతావరణం నెలకొంది. శత జయంతి ఉత్సవాల సందర్భంగా నెల రోజుల ముందు నుంచి పుట్టపర్తి వ్యాప్తంగా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అవతార ప్రకటన దినం ఓ వేడుకలా సాగింది. అదే రోజున దీపావళి పండుగ రావటంతో సందడి వాతావరణం నెలకొంది. నాదస్వరం, వేదఘోష, సత్యసాయి ఇ¯Œ స్టిట్యూట్ బ్యాండ్ వాయిద్యాలతో సభా మందిరం సాయి నామస్మరణతో మార్మోగింది. ఈ ఏడాది అక్టోబర్ 20వ తేదీ ఉదయం ప్రశాంతి నిలయంలో భక్తి ఆధ్యాత్మికతలు వెల్లివిరిశాయి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా విద్యాసంస్థల పూర్వ విద్యార్థినులు దేశం నలుమూలల నుంచి చేరి సాయి చరిత్రలో అత్యంత పవిత్రమైన ఘట్టమైన అవతార ప్రకటన దినోత్సవాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఎనభై ఐదేళ్ల క్రితం ఇదే రోజున పుట్టపర్తికి చెందిన పద్నాలుగేళ్ల దివ్యబాలుడు, చిన్న సత్య తన దివ్య స్వరూపాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. ‘నేను సాయిబాబాను’ అని ప్రకటించిన ఆ మాటలు మానవ చరిత్రలో దిశ మార్చిన శబ్దాలుగా మారాయి. అది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు, దైవ అవతరణకు నిదర్శనంగా అవతార ప్రకటన దినోత్సవం సందర్భంగా అనంతపురం క్యాంపస్ పూర్వ విద్యార్థులు ‘సాక్షాత్ పరబ్రహ్మ సాయి’ అనే ప్యానల్ చర్చ కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భగవాన్ అవతార లక్ష్యం, మార్గం గురించి వివరణాత్మకంగా తెలియజేశారు. వేడుకలు సంగీత సమర్పణతో ముగిశాయి. సాయిబాబాపై రాసిన ప్రతి పాటలోనూ.. ప్రేమ, సేవ, సత్యం, ధర్మం కనిపించాయి. -
శ్రీ సత్యసాయి బాబా సూక్తులు
→ ఆశలకోసం కాదు, ఆశయాలకోసం జీవించు→ నిన్ను ఇతరులు ఎలా గౌరవించాలని ఆశిస్తావో ముందు నీవు వారిని ఆ రీతిగా గౌరవించు.→ అతి భాష మతిహాని, మితభాష అతిహాయి→ సత్యం నా ప్రచారం, ధర్మం నా ఆచారం, శాంతి నా స్వభావం, ప్రేమ నా స్వరూపం.→ ప్రార్థించే పెదవులకన్న సేవచేసే చేతులు మిన్న→ గ్రామసేవే రామ సేవ, జనసేవే జనార్దన సేవ→ హరికి దాసులు కండి, సిరికి కాదు.→ విద్య జీవిత పరమావధికే గానీ జీవనోపాధికి కాదు→ భక్తి అనేది దేవుని కోసం కన్నీరు పెట్టడం కాదు, దేవుని సంతోషం కోసం జీవించడం.→ భక్తి అంటే నిరంతర ప్రేమ, ప్రతిఫలం ఆశించని ప్రేమ.→ నా భక్తుల ప్రేమే నాకు ఆహారం, వారి సంతోషమే నా శ్వాస.→ నీ దినచర్యను ప్రేమతో ప్రారంభించు, ప్రేమతో నింపు, ప్రేమతో అంత్యం గావించు. దైవ సన్నిధికి మార్గం ఇదే.→ ప్రేమే నా స్వరూపం, సత్యమే నా శ్వాస, ఆనందమే నా ఆహారం.→ ఉన్నది ఒకే కులం – మానవ కులం. ఉన్నది ఒకే మతం –ప్రేమమతం. ఉన్నది ఒకే భాష – హృదయ భాష. ఉన్నది ఒకటే దైవం – ఆయన సర్వాంతర్యామి.→ భగవంతుడు బాహ్యప్రియుడు కాదు. భావ ప్రియుడు→ మతులు మంచివైతే అన్ని మతములూ మంచివే.→ భగవంతుడు నీ మతమును చూడడు, నీ మతిని చూస్తాడు.→ ప్రేమతో ‘సాయీ’ అని పిలిస్తే ‘ఓయీ’ అని పలుకుతాను→ నా జీవితమే నా సందేశం. -
కొనసాగుతున్న బాబా ఆశయాలు
శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టుకు ప్రస్తుతం ఆర్.జె.రత్నాకర్ మేనేజింగ్ ట్రస్టీగా కొనసాగుతున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహా సమాధి పొందిన తర్వాత ఆయన ఆశయాలను రత్నాకర్ ముందుకు తీసుకువెళుతున్నారు. బాబా ఆశయాల మేరకు పలు సేవారంగాలలో బాబా ప్రారంభించిన సేవలను కొనసాగిస్తున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా నిర్యాణం పొందిన తర్వాత గడచిన పద్నాలుగేళ్లలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రభుత్వంతోను, ఇతర సంస్థలతోను చేతులు కలిపి పలు కొత్త కార్యక్రమాలను ప్రారంభించింది. ఒడిశాలో 2012–13లో వరద ముంపు బారిన పడ్డ గ్రామాల్లో ఇళ్లు కోల్పోయిన వారికి మూడువందల ఇళ్లను నిర్మించింది. కేరళలో 2018లో వరదలు సంభవించిన సుమారు పది గ్రామాల్లో నర్సరీ స్కూళ్ల పునరుద్ధరణ చేపట్టడమే కాకుండా, తొమ్మిది అంగన్వాడీ కేంద్రాలను నిర్మించింది. మరోవైపు అనంతపురం జిల్లాలోని మరో 118 జనావాసాలకు తాగునీటి సరఫరాను విస్తరించింది. పుట్టపర్తిలో నీటిఎద్దడిని తీర్చడానికి 52 ఆర్ఓ వాటర్ ప్లాంట్లను నెలకొల్పింది. అలాగే, శ్రీ సత్యసాయి ఎన్టీఆర్ సుజల పథకం కింద జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 1690 ఇళ్లకు సురక్షితమైన తాగునీటి సరఫరా కోసం ఎనిమిది నీటిశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒడిశాలోని కేంద్రపొడా జిల్లాకు చెందిన రెండు కుగ్రామాల్లో రెండు తాగునీటి సరఫరా కేంద్రాలను, నువాపడా జిల్లాలో ఐదు తాగునీటి సరఫరా కేంద్రాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు నెలకొల్పింది. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ç2019–20లో తెలంగాణలోని బెజ్జంకిలో ఉన్న శ్రీ సత్యసాయి గురుకుల విద్యానికేతన్, ఆంధ్రప్రదేశ్‌లోని పలాసలో ఉన్న శ్రీ సత్యసాయి విద్యావిహార్ పాఠశాలలతో పాటు కర్ణాటకలోని మైసూరులో ఉన్న భగవాన్ బాబా మహిళా మక్కల కూట ట్రస్టుకు ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రిలో గ్రామీణ వృత్తి విద్యా శిక్షణ కేంద్రానికి భవన నిర్మాణం కోసం రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించింది.శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు 2021–22లో తొమ్మిదేళ్లు కొనసాగే శ్రీ సత్యసాయి సమీకృత విద్యా కార్యక్రమాన్ని రూ.5.6 కోట్ల వ్యయంతో ప్రారంభించింది. దేశవ్యాప్తంగా దివ్యాంగ బాలలకు ఉపయోగపడేలా ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం 2020లో జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా ట్రస్టు చేపట్టింది. ‘కరోనా’ కాలంలో సేవలు‘కరోనా’ మహమ్మారి వ్యాపించిన కాలంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రజలకు సేవలు అందించడానికి సత్వరమే రంగంలోకి దిగింది. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ‘కరోనా’ రోగుల కోసం అనంతపురం జిల్లాలో రూ.2 కోట్ల వ్యయంతో తొలి ప్రైవేటు క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలాగే, ప్రధాన మంత్రి సహాయనిధికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చింది. ‘కరోనా’ కాలంలో ఇక్కట్లు పడిన వలస కార్మికులు సహా నిరుపేదలను ఆదుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ సత్యసాయి ట్రస్టులకు కోటి రూపాయలు ఇచ్చింది. లద్దాఖ్‌లోని మహాబోధి అంతర్జాతీయ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలోని మహాబోధి కరుణా చారిటబుల్ ఆసుపత్రికి విడతల వారీగా రూ.2 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. అలాగే పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి సంవత్సరంలో దేశవ్యాప్తంగా కోటి మొక్కలను నాటడం కోసం శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్‌తో కలసి ట్రస్టు ‘శ్రీ సత్యసాయి ప్రేమతరు’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. -
సేవకు ప్రతిరూపం... ఆధ్యాత్మిక కెరటం
సత్యసాయిబాబా తన జీవన ప్రస్థానంలో సత్య ధర్మ శాంతి ప్రేమలనే విలువలను బోధిస్తూ, మానవాళిని విలువైన జీవన మార్గం వైపు పయనింపజేశారు. ఆధ్యాత్మిక బోధనలతో అజ్ఞానాంధకారాన్ని పారదోలుతూ భక్త కోటిలో చైతన్యకాంతులు నింపారు. ప్రేమను పంచే ప్రేమమూర్తిగా, సేవకు ప్రతి రూపంగా; ఉచితంగా తాగునీరు, విద్య, వైద్య సేవలను అందించి సేవాప్రదాతగా కీర్తి గడించారు. పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఆపదలో భక్తులను ఆదుకునే ఆపద్బాంధవుడిగా, ఆరాధ్య దైవంగా భక్తుల మదిలో గూడుకట్టుకున్న సత్యసాయి నిర్యాణం చెంది పద్నాలుగేళ్లు పూర్తవుతున్నా, భక్తులు మాత్రం ఆయననే తమ శ్వాసగా, ధ్యాసగా కొలుస్తున్నారు. సత్యసాయి జయంతిని ఎంతో పవిత్రంగా భావించే భక్తులు పుట్టపర్తిలో జరుగుతున్న జయంతి వేడుకలకు తరలి వచ్చి భక్త నీరాజనాలు అర్పిస్తున్నారు.కరవుకు నిలయమైన అనంతపురం జిల్లాలోని అప్పటి కుగ్రామమైన పుట్టపర్తిలో 1926 నవంబర్ 23న ఈశ్వరాంబ, పెద్ద వెంకమరాజు దంపతులకు సత్యసాయి జన్మించారు. బాల్యం నుంచి ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉన్న సత్యసాయి, తన 14 వ ఏట తాను సత్యసాయి బాబాను, భూమిపై ధర్మ పరిరక్షణకు అవతరించినట్లు ప్రకటించుకున్నారు. నాటి నుంచి పుట్టపర్తిలో మందిరం ఏర్పాటు చేసుకుని ఆధ్యాత్మిక బోధనలు వినిపిస్తూ, తనను ఆరాధించే భక్తులను దగ్గరకు చేర్చుకున్నారు.మానవ సేవయే మాధవ సేవ అని బోధించిన సత్యసాయి, ఒక వైపు ఆధ్యాత్మిక బోధనలతో మానవాళిని చైతన్యవంతులను చేస్తూనే, కనీస అవసరాలకు నోచుకోని బడుగు జీవులకు సేవలందించే మహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 1972లో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి విద్య, వైద్యం, తాగునీరు ఉచితంగా అందించే కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రకృతి విపత్తులు సంభవించే సమయాల్లో తన సేవాదళ్ విభాగాల ద్వారా బాధితులకు సేవలు అందిస్తున్నారు.కేజీ నుంచి పీజీ వరకువిద్య మనిషిని అవివేకం నుంచి వివేకవంతుణ్ణి చేస్తుందని విశ్వసించిన సత్యసాయిబాబా.. పుట్టపర్తి కేంద్రంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా మానవతా విలువలతో కూడిన విద్యను అందించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. పుట్టపర్తిలో సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ యూనివర్శిటీని (డీమ్డ్ టు బి యూనివర్సిటీ) ఏర్పాటు చేశారు. పుట్టపర్తి, నందిగిరి, అనంతపురం, బెంగళూరు సమీపాన బృందావనం వద్ద నాలుగు క్యాంపస్‌లు నిర్వహిస్తున్నారు. అనంతపురం క్యాంపస్ ద్వారా మహిళా విద్యను ప్రోత్సహిస్తున్నారు.ప్రతి ఏటా సుమారు పదివేల మందికి పైగా విద్యార్థులు సత్యసాయి విద్యాసంస్థల ద్వారా ఉచిత విద్యను పొందుతున్నారు. దేశీయంగా గ్రామీణ ప్రాంతాలలో సాంకేతిక పరిజ్ఞానానికి దూరంగా ఉన్న మారుమూల ప్రాంతాలలో విలువలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో 2010లో విద్యావాహిని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం దేశీయంగా 126 పాఠశాలలు ఈ పథకం ద్వారా విద్యను అందిస్తున్నాయి. ఈ సంస్థల ద్వారా విద్యను పొందిన ఎందరో విద్యార్థులు నేడు ఉన్నత స్థానాలలో సేవలు అందిస్తున్నారు.పైసా ఖర్చు లేకుండా‘వైద్యో నారాయణ హరి’ అనే నానుడిని సాకారం చేస్తూ సత్యసాయి ఉచిత వైద్యసేవకు ప్రాధాన్యం ఇచ్చారు. పుట్టపర్తి ప్రాంతంలో పేదలు వైద్యం అందక బాధలు పడుతున్నారని, ఒక ఆసుపత్రి నిర్మించాలని తల్లి ఈశ్వరాంబæకోరగా, తన తల్లికి ఇచ్చిన మాటకు కట్టుబడి పుట్టపర్తిలో 1956లో పుట్టపర్తి నడిబొడ్డున 30 పడకల జనరల్ ఆసుపత్రి నిర్మించారు. తర్వాత 1991లో ఆధునిక వసతులతో కూడిన శ్రీసత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని స్థాపించారు. ఈ ఆసుపత్రుల ద్వారా రోగులు ఉచితంగా ఖరీదైన వైద్యసేవలు పొందుతున్నారు.ఉచిత తాగునీటి సరఫరానిత్యం కరవుతో అల్లాడే రాయలసీమలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవు. రాయలసీమ ప్రజల కష్టాలను చూసి చలించిన సత్యసాయి 1995 నవంబర్‌లో రాయలసీమ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు సత్యసాయి తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో సుమారు 1,400 గ్రామాలు ఈ పథకం ద్వారా తాగునీటిని పొందుతున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైకి కూడా తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా కండలేరు నుంచి ‘సత్యసాయి తాగునీరు’ సరఫరా అవుతోంది. ప్రతిరోజూ సుమారు 20 లక్షల మంది సత్యసాయి తాగునీటి పథకం వినియోగించుకుంటున్నారంటే.. సాయి సంకల్పం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. -
‘అనంత’ భగీరథుడు సత్యసాయి
జలం జీవాధారం. నీరు లేని చోట జీవితం లేదు. ఎక్కడ దాహార్తి ఉందో... అక్కడే సేవ ఉండాలి... -భగవాన్ శ్రీ సత్యసాయి బాబాఅనంతపురం జిల్లాలోని గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం ట్రస్టు నిధులు సమకూరుస్తుందని శ్రీ సత్యసాయి బాబా 1994లో ప్రకటించారు. నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు రూ.300 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 1995 నవంబర్ 18న ప్రారంభించారు.దివిజ గంగను భువికి దించిన భగీరథుడు ఎంతటి లోకోపకారం చేశాడో, శ్రీ సత్యసాయిబాబా కూడా తాగునీటికి అల్లాడుతున్న ప్రాంతాల్లోని ప్రజలకు అంతటి ఉపకారం చేశారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనంతపురం, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 1051 గ్రామాలకు; తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 452 ఎత్తయిన ప్రాంతాలు, గిరిజన ఆవాసాలకు, చెన్నై నగరానికి తాగునీటిని అందించడానికి సత్యసాయి గంగ ప్రాజెక్టును, నీటిశుద్ధి వ్యవస్థలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజల దాహార్తి తీరుతోంది.అనంతపురం తాగునీటి సరఫరా ప్రాజెక్టుఆంధ్రప్రదేశ్లోని కరవుపీడిత జిల్లా అనంతపురం. దేశంలో రాజస్థాన్‌లోని జైసల్మేర్ తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే రెండోప్రాంతం అనంతపురం జిల్లా. ఈ జిల్లాలో ప్రవహించే పెన్నా, హగరి, చిత్రావతి నదులు వేసవిలో ఎండిపోతాయి. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు తక్కువగా ఉండటమే కాకుండా, నీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండటం వల్ల ఇక్కడి ప్రజలలో శారీరక వైకల్యాలు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉండేవి. ప్రజలు తమ దైనందిన అవసరాల కోసం నీరు తెచ్చుకోవడానికి చాలా దూరం నడవాల్సి వచ్చేది. ఫలితంగా విపరీతమైన అలసటకు లోనై కీళ్లనొప్పులతో బాధపడేవారు.అనంతపురం జిల్లాలోని గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం ట్రస్టు నిధులు సమకూరుస్తుందని శ్రీ సత్యసాయి బాబా 1994లో ప్రకటించారు. రూ. 300 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 1995 నవంబర్ 18న ప్రారంభించారు. దీనిని 1997 అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారికంగా అప్పగించారు.ఈ ప్రాజెక్ట్ నిర్మాణం, నిర్వహణల కోసం లార్సెన్ అండ్ టూబ్రో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండువేల కిలోమీటర్ల పొడవున వివిధ పరిమాణాల్లోని పైప్లైన్లు వేశారు. దాదాపు 100,000 లీటర్ల నుంచి 2,500,000 లీటర్ల సామర్థ్యం కలిగిన 43 సంపులు నిర్మించారు. అలాగే,3,00,000 లీటర్ల నుంచి 10,00,000 లీటర్ల సామర్థ్యం కలిగిన 18 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను కొండల పైభాగంలో నిర్మించారు. వీటికి తోడు 270 ఓవర్‌హెడ్ రిజర్వాయర్లను, 125 గ్రౌండ్–లెవల్ రిజర్వాయర్లను ఏర్పాటు చేశారు. వివిధ గ్రామాల్లో 2500 లీటర్ల సామర్థ్యం కలిగిన 1500 కంటే ఎక్కువ ప్రీకాస్ట్ కాంక్రీట్ సిస్టెర్న్లను ఏర్పాటు చేశారు. ప్రతి సిస్టెర్న్లో ప్రజలు నీటిని సేకరించడానికి నాలుగు కుళాయిలు ఉన్నాయి. భారత ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందిన ఈ భారీ ప్రాజెక్టు కింద 731 గ్రామాలకు ఉచితంగా తాగునీరు సరఫరా అవుతోంది.భారత ప్రభుత్వం తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక పత్రం ఈ ప్రాజెక్టును ప్రశంసిస్తూ ట్రస్ట్‌కు ఒక ప్రశంసాపత్రాన్ని అందించింది, ఆ ప్రశంసాపత్రంలో ‘శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఏ రాష్ట్ర బడ్జెట్ మద్దతు లేకుండా, సొంతంగా ఒక ప్రాజెక్టును అమలు చేయడంలో అసమానమైన ఉదాహరణగా నిలిచింది, ఇది 731 నీటిఎద్దడి, ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోని కొన్ని పట్టణాలకు దాదాపు 18 నెలల కాలపరిమితిలో ప్రయోజనం చేకూర్చేలా రూ. 300 కోట్ల్ల వ్యయంతో ఒక భారీ నీటి సరఫరా ప్రాజెక్టు’ అని శ్లాఘించింది.గ్రామీణ ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడంలో సత్యసాయి బాబా చేసిన నిరుపమానమైన సేవకు గుర్తింపుగా భారత ప్రభుత్వ తపాలా శాఖ 1999 నవంబర్ 23న ఒక తపాలా బిళ్ళను, ఒక పోస్టల్ కవర్‌ను విడుదల చేసింది.జపాన్‌లోని ఒసాకాలో 2003లో జరిగిన మూడవ ప్రపంచ జల వేదికలో సత్యసాయి నీటి ప్రాజెక్టును ప్రస్తుతిస్తూ ఒక ప్రతినిధి దీనిని కేస్ స్టడీగా మాత్రమే కాదు, మానవాళికి ప్రేమను పంచే కథగా కూడా చూడాలని కొనియాడారు. మెక్సికోలో 2006లో జరిగిన నాలుగో ప్రపంచ జల వేదికలో ఈ ప్రాజెక్టు ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన మిలీనియం అభివృద్ధి లక్ష్యాలకు దోహదపడే అత్యుత్తమ పది స్థానిక కార్యాచరణలలో ఒకటిగా ఎంపికైంది.సత్యసాయి గంగ కాలువతమిళనాడు రాజధాని చెన్నై (అప్పటి మద్రాస్), దాదాపు 1.19 కోట్ల జనాభా కలిగిన మెట్రోపాలిటన్ నగరం . ‘డెట్రాయిట్ ఆఫ్ ఆసియా’గా పేరుపొందిన చెన్నై మహానగరం– ఆటోమొబైల్స్, బీపీఓ, సాఫ్ట్వేర్, డేటా సెంటర్లు, వస్తూత్పత్తి, వైద్య పర్యాటకం, ఫిన్ టెక్ పరిశ్రమలకు కేంద్రంగా ఉంది. ఈ నగరంలో 2004 డిసెంబర్ వరకు తీవ్రమైన నీటి ఎద్దడి ఉండేది. ప్రజలు మంచినీటి కోసం కుళాయిల వద్ద బారులు తీరి ఉండేవారు. చెన్నై నగరానికి సమీపంలో ప్రధాన నదులేవీ ప్రవహించవు. అందువల్ల చెన్నై పంతొమ్మిదో శతాబ్ది చివరి రోజుల నుంచి తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటూ ఉండేది. 2004 సంవత్సరానికి ముందు నగరంలోని కొన్ని ప్రాంతాలు వేసవిలో ఒక్కోసారి వరుసగా మూడు రోజులు నీటి సరఫరా లేకుండా ఇబ్బంది పడాల్సి వచ్చేది. నగరానికి రోజుకు దాదాపు 750 మిలియన్ లీటర్ల నీరు అవసరమైతే, కేవలం 250 మిలియన్ లీటర్ల సరఫరా మాత్రమే ఉండేది.1960ల ప్రారంభంలో చెన్నై నీటి సమస్యను పరిష్కరించడానికి తెలుగు గంగ ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏటా 15 టీఎంసీల నీటిని కృష్ణానది నుంచి మద్రాసుకు తీసుకువస్తామని ప్రకటించింది, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు తమ వాటా కృష్ణా నీటిలో 5 టీఎంసీలను సమకూరుస్తాయి.శ్రీశైలం జిల్లాలోని సోమశిల జలాశయం నుండి 150 కిలోమీటర్ల పొడవైన కాలువ ద్వారా నీటిని నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయానికి, అక్కడి నుండి చెన్నై నగరానికి నీటిని సరఫరా చేసే తమిళనాడులోని పూండి జలాశయానికి తీసుకెళ్లాలి. కండలేరు, పూండి జలాశయాలను కలిపే కండలేరు–పూండి కాలువను తెలుగు గంగ అని పిలుస్తారు. ఇది 1996లో పూర్తయింది.అయితే, ప్రణాళికాబద్ధమైన 15 టీఎంసీల నీటిలో, కేవలం 0.5 టీఎంసీ నీరు మాత్రమే పూండి జలాశయానికి చేరుకునేది. మిగిలిన నీరు బాష్పీభవనం, నీరు కారడం, కాలువ గోడల కోత కారణంగా పోయింది. కొన్ని సంవత్సరాల తరువాత కాలువ శిథిలావస్థకు చేరుకుంది. లక్షలాది మంది చెన్నై ప్రజలకు నీటి ఎద్దడి తీవ్రమై, ఈ సమస్యకు పరిష్కారం కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో చెన్నై నీటి సమస్యను పరిష్కరించడానికి తాను దృఢ సంకల్పంతో ఉన్నట్లు శ్రీ సత్యసాయి బాబా 2001 జనవరి 19న ప్రకటించారు.శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ చేపట్టిన చెన్నై నీటి ప్రాజెక్టు జూలై 2002లో ప్రారంభమైంది. ఇది చెన్నైకి తగినంత తాగునీటిని సరఫరా చేయడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని దాదాపు 3 లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందిస్తుంది.ఈ ప్రాజెక్టులో భాగంగా శిథిలావస్థలో ఉన్న కండలేరు–పూండి కాలువను పునరుద్ధరించి, కండలేరు జలాశయం సామర్థ్యాన్ని పెంచారు. మొత్తం 150 కి.మీ. పొడవున్న కండలేరు–పూండి కాలువలో 65 కిలోమీటర్లు లైనింగ్ వేశారు. వరదలు సంభవించినప్పుడు నీటిని మళ్లించడానికి మూడు ఎస్కేప్ రూట్లను నిర్మించారు.ఈ ప్రాజెక్టు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని, వేగంగా అభివృద్ధి చెందింది. దీని నిర్మాణానికి దాదాపు నాలుగువేల మంది కార్మికులు అహరహం పనిచేశారు. ఈ ప్రాజెక్టు రికార్డు సమయంలో కేవలం పదహారు నెలల వ్యవధిలోనే పూర్తయింది.ఇప్పుడు చెన్నైకి సరఫరా అయ్యే నీరు తన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు కండలేరు వద్ద ఉన్న జలాశయం నిండిపోవడం విశేషం. చివరగా బాబా 79వ పుట్టినరోజున– 2004 నవంబర్ 23న, కండలేరు జలాశయం గేట్లు తెరిచారు. ఇది వరకు గేట్లు తెరవగానే ఇక్కడ ఉప్పొంగే జలాలు చెన్నై వరకు 150 కిలోమీటర్లు చేరుకోవడానికి దాదాపు పదిరోజులు పట్టేది. పునరుద్ధరణ తర్వాత కేవలం నాలుగు రోజుల్లోనే ఈ జలాలు తమిళనాడు సరిహద్దులకు చేరుకుంటుండటం విశేషం. పునరుద్ధరణ తర్వాత నీరు విడుదలైన కొద్ది రోజులకు– 2004 డిసెంబర్ 11న చెన్నై నుంచి పలువురు భక్తులు బాబాకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ప్రశాంతి నిలయం చేరుకున్నారు. బాబాకు కృతజ్ఞతగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కండలేరు–పూండి కాలువ ప్రాజెక్టును ‘తెలుగు గంగ’కు బదులుగా ‘సత్యసాయి గంగ’గా నామకరణం చేసింది.శ్రీ సత్యసాయి జాతీయ తాగునీటి మిషన్దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తాగునీటి సరఫరా, నీటి శుద్ధీకరణ అవసరాలను తీర్చడానికి శ్రీ సత్యసాయి బాబా ఆధ్వర్యంలో ‘శ్రీ సత్యసాయి జాతీయ తాగునీటి మిషన్’ ఏర్పాటైంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం దేశంలోని 21 రాష్ట్రాలకు చెందిన 177 జిల్లాల్లో తాగునీటి వనరులు మోతాదుకు మించిన ఫ్లోరైడ్‌తో కలుషితమయ్యే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి వల్ల దాదాపు 6.2 కోట్ల మందికి పైగా ప్రజలు సతమతం అవుతుండేవారు. ఈ సమస్యను చక్కదిద్దడానికి శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఆధ్వర్యంలోని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, సెంట్రల్ ట్రస్టు నిధులతో నీటి శుద్ధీకరణ వ్యవస్థల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా 2020 నాటికి ఆరు రాష్ట్రాల్లోని పలు గ్రామాల్లో రూ.5.4 కోట్ల పెట్టుబడితో 108 నీటి శుద్ధీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నీటి శుద్ధీకరణ కేంద్రాలు నీటి నుంచి కాలుష్య కారకాలైన ఆర్సెనిక్ వంటి భార లోహాలను తొలగించగలవు.ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలోని పాడేరులో ఈ మిషన్ 10 మండలాల్లోని 350 గ్రామాలకు తాగునీటిని అందించింది, ఈ ప్రాంతంలో 4,40,585 జనాభా ఉంది. ఈ ప్రాజెక్టులో కొండ ప్రాంతాల గుండా పైపులైన్లు వేయడంతో పాటు నిల్వ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. 2018–2019లో కేరళలోని సత్యసాయి సేవా సంస్థ ప్రారంభించిన సత్యసాయి ప్రేమధార ప్రాజెక్ట్ 119 నీటి వడపోత యూనిట్లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 14 జిల్లాల్లోని దాదాపు 1,65,000 మంది పౌరులకు ప్రతిరోజూ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తోంది.మెదక్, మహబూబ్ నగర్ ప్రాజెక్ట్అనంతపురం తాగునీటి సరఫరా ప్రాజెక్టు విజయవంతం అయిన తరువాత, తెలంగాణ రాష్ట్రంలోని (అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని కరువు పీడిత, ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల ప్రజలకు సురక్షితమైన స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి ట్రస్ట్ ఇలాంటి ప్రాజెక్టులను చేపట్టింది. దాదాపు 320 గ్రామాలు ఈ ప్రాజెక్టుల లబ్ధిదారులుగా ఉన్నాయి.ప్రాజెక్ట్ వివరాలు» రూ.300 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ అమలుకు నోచుకుంది.» దాదాపు 2800 కిలోమీటర్ల పైపులైన్లు వేసి, సుమారు 40 లక్షల మందికి నీటి సరఫరా చేసే సామర్థ్యంతో రూపొందింది.ముఖ్య నిర్మాణాలు» పెద్దకోట్లలో హెడ్‌వర్క్స్ నిర్మాణం» మద్దెల చెరువులో 10 ఎంఎల్డీ నీటి శుద్ధి కేంద్రం» అప్పరా చెరువు, కృష్ణాపురం రోడ్ క్రాస్, కేశాపురం, కొత్తచెరువు ప్రాంతాల్లో 5 సంపులు» కొత్తచెరువు (కొండపై), పెదపల్లి, హెచ్ఎన్ ఎస్ఎస్ టన్నెల్ వద్ద 2 గ్రౌండ్ లెవల్ బాలెన్సింగ్ రిజర్వాయర్లు» వివిధ ప్రాంతాల్లో 2 ఓవర్‌హెడ్ రిజర్వాయర్లు, పంప్ హౌస్లుతూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ప్రాజెక్టులుఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వెనుకబడిన కొండ ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనులు, పేద ప్రజలు బోరుబావులు, వాగుల నుంచి నీటిని పొందుతున్నారు. నిత్యం ప్రవహించే గోదావరి, దాని ఉపనది పాములేరు నుంచి నీటిని సేకరించి, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ తూర్పు గోదావరిలోని 212 జనావాసాలలో సుమారు 2,20,000 మందికి; పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 240 జనావాసాలలో 4,70,000 మందికి సురక్షితమైన తాగునీరు అందించడానికి ప్రాజెక్టులను చేపట్టింది . రెండు జిల్లాల్లోని ప్రాజెక్టులు పూర్తిచేసి, 2007 సెప్టెంబర్ 15న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించింది. -
సత్యసాయి ట్రస్ట్ ప్రేమను పంచడంలో ప్రపంచానికి దిక్సూచి
శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రేమ, శాంతి, సత్యం, ధర్మం తదితర ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. సాంకేతికతను ఆధారంగా చేసుకుని నిమిషాల వ్యవధిలోనే ప్రపంచ వ్యాప్తంగా సాయి నామస్మరణ పాటిస్తున్నారు. మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె. రత్నాకర్ ఆధ్వర్యంలో బాబా ఆశయాలను ఆధునిక రూపంలో ముందుకు తీసుకెళ్తూ ప్రపంచానికి ప్రేమ, సేవా, సత్య సందేశాన్ని విస్తరిస్తున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా నిర్మించిన ప్రశాంతి నిలయం ఆధ్యాత్మిక కేంద్రమే కాకుండా, మానవ సేవకు ఉదాహరణగా నిలుస్తోంది.విరివిగా డిజిటల్ వినియోగం» డిజిటల్ కమ్యూనికేషన్ సెంటర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా భక్తులతో ఆన్ లైన్ సత్సంగాలు, ప్రసంగాలు.» సౌర శక్తి వ్యవస్థల ద్వారా పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తి.» స్మార్ట్ కంట్రోల్ యూనిట్స్ ద్వారా ఆశ్రమంలో విద్యుత్, నీటి వినియోగ నియంత్రణ.సూపర్ స్పెషాలిటీ (ప్రశాంతిగ్రామ్ – వైట్‌ఫీల్డ్) ఆసుపత్రుల్లో రోబోటిక్ సర్జరీ సిస్టమ్స్, అధునాతన హృద్రోగ శస్త్ర చికిత్సల పరికరాలు, ఎంఆర్ఐ, సీటీ స్కాన్, క్యాథ్ ల్యాబ్స్.» రోగుల వైద్య వివరాలు పూర్తిగా కంప్యూటరైజ్డ్ చేసి వేగవంతమైన సేవలు అందిస్తున్నారు.» ఇక్కడ అన్ని వైద్య సేవలను ఉచితంగా అందించడం ప్రపంచానికే ఆదర్శం.» శస్త్రచికిత్స అనంతరం రోగి వేగంగా కోలుకోవడం, కచ్చితమైన ఫలితాలు సాధించడం.» సత్యసాయి విద్యాసంస్థల్లో విలువల ఆధారిత సమగ్ర విద్యను అందించడం.» విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, ఆత్మవికాసం, సేవాస్ఫూర్తి కలిగించడం.» విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు విద్యాసహాయం.» శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, ప్రశాంతి నిలయం ఆధ్వర్యంలో 9 గ్రామీణ బాల సంరక్షణ కేంద్రాలు (అంగన్వాడీలు) పునర్నిర్మించారు.అంతర్జాతీయ సేవా విస్తరణభారతదేశంతో పాటు విదేశాలలో కూడా ట్రస్ట్ సేవా కార్యక్రమాలను విస్తరించడం. విద్య, ఆరోగ్య, శాంతి సదస్సులు, ఆహార సహాయం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. భగవాన్ శ్రీసత్యసాయి బాబా మహా సమాధి తర్వాత కూడా మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఆర్జే రత్నాకర్ నేతృత్వంలో ట్రస్ట్ భగవాన్ ఆశయాలను కొనసాగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను మరింత విస్తరించింది.కొనసాగుతున్న బాబా ఆశయాలుశ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టుకు ప్రస్తుతం ఆర్.జె.రత్నాకర్ మేనేజింగ్ ట్రస్టీగా కొనసాగుతున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహా సమాధి పొందిన తర్వాత ఆయన ఆశయాలను రత్నాకర్ ముందుకు తీసుకువెళుతున్నారు. బాబా ఆశయాల మేరకు పలు సేవారంగాలలో బాబా ప్రారంభించిన సేవలను కొనసాగిస్తున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా నిర్యాణం పొందిన తర్వాత గడచిన పద్నాలుగేళ్లలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రభుత్వంతోను, ఇతర సంస్థలతోను చేతులు కలిపి పలు కొత్త కార్యక్రమాలను ప్రారంభించింది. ఒడిశాలో 2012–13లో వరద ముంపు బారిన పడ్డ గ్రామాల్లో ఇళ్లు కోల్పోయిన వారికి మూడువందల ఇళ్లను నిర్మించింది. కేరళలో 2018లో వరదలు సంభవించిన సుమారు పది గ్రామాల్లో నర్సరీ స్కూళ్ల పునరుద్ధరణ చేపట్టడమే కాకుండా, తొమ్మిది అంగన్వాడీ కేంద్రాలను నిర్మించింది. మరోవైపు అనంతపురం జిల్లాలోని మరో 118 జనావాసాలకు తాగునీటి సరఫరాను విస్తరించింది. పుట్టపర్తిలో నీటిఎద్దడిని తీర్చడానికి 52 ఆర్ఓ వాటర్ ప్లాంట్లను నెలకొల్పింది. అలాగే, శ్రీ సత్యసాయి ఎన్టీఆర్ సుజల పథకం కింద జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 1690 ఇళ్లకు సురక్షితమైన తాగునీటి సరఫరా కోసం ఎనిమిది నీటిశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒడిశాలోని కేంద్రపొడా జిల్లాకు చెందిన రెండు కుగ్రామాల్లో రెండు తాగునీటి సరఫరా కేంద్రాలను, నువాపడా జిల్లాలో ఐదు తాగునీటి సరఫరా కేంద్రాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు నెలకొల్పింది. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు 2019–20లో తెలంగాణలోని బెజ్జంకిలో ఉన్న శ్రీ సత్యసాయి గురుకుల విద్యానికేతన్, ఆంధ్రప్రదేశ్‌లోని పలాసలో ఉన్న శ్రీ సత్యసాయి విద్యావిహార్ పాఠశాలలతో పాటు కర్ణాటకలోని మైసూరులో ఉన్న భగవాన్ బాబా మహిళా మక్కల కూట ట్రస్టుకు ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రిలో గ్రామీణ వృత్తి విద్యా శిక్షణ కేంద్రానికి భవన నిర్మాణం కోసం రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించింది.శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు 2021–22లో తొమ్మిదేళ్లు కొనసాగే శ్రీ సత్యసాయి సమీకృత విద్యా కార్యక్రమాన్ని రూ.5.6 కోట్ల వ్యయంతో ప్రారంభించింది. దేశవ్యాప్తంగా దివ్యాంగ బాలలకు ఉపయోగపడేలా ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం 2020లో జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా ట్రస్టు చేపట్టింది. ‘కరోనా’ కాలంలో సేవలు‘కరోనా’ మహమ్మారి వ్యాపించిన కాలంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రజలకు సేవలు అందించడానికి సత్వరమే రంగంలోకి దిగింది. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ‘కరోనా’ రోగుల కోసం అనంతపురం జిల్లాలో రూ.2 కోట్ల వ్యయంతో తొలి ప్రైవేటు క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలాగే, ప్రధాన మంత్రి సహాయనిధికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చింది. ‘కరోనా’ కాలంలో ఇక్కట్లు పడిన వలస కార్మికులు సహా నిరుపేదలను ఆదుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ సత్యసాయి ట్రస్టులకు కోటి రూపాయలు ఇచ్చింది. లద్దాఖ్‌లోని మహాబోధి అంతర్జాతీయ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలోని మహాబోధి కరుణా చారిటబుల్ ఆసుపత్రికి విడతల వారీగా రూ.2 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. అలాగే పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలో భాగంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి సంవత్సరంలో దేశవ్యాప్తంగా కోటి మొక్కలను నాటడం కోసం శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్‌తో కలసి ట్రస్టు ‘శ్రీ సత్యసాయి ప్రేమతరు’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సత్యసాయిట్రస్ట్ ఆధ్వర్యంలోసేవా కార్యక్రమాలు -
సమాజ సేవే.. విద్యార్థి ధర్మం: భగవాన్ శ్రీసత్యసాయిబాబా
భారతదేశంలో ప్రాచీనకాలంలో వర్ధిల్లిన గురుకుల వ్యవస్థకు ప్రతిరూపంగా శ్రీ సత్యసాయి విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. ఉపాధి కోసం కావలసిన భౌతిక జ్ఞానం సంపాదించుకుంటే సరిపోదు. విద్యార్థి జీవితంలో నిజమైన ఆనందం పొందాలంటే, జ్ఞానాన్ని సమాజ సేవకు వినియోగించాలని మన ప్రాచీన గురువులు తెలుసుకున్నారు. అందుకే వారు విద్యాబోధనతో పాటు ధార్మికత, బాధ్యత, నైతిక విలువలతో విద్యార్థుల సౌశీల్యాన్ని పెంపొందించడమే విద్యకు గల పరమలక్ష్యంగా భావించేవారు. ఈ ప్రాచీన విలువల ప్రాతిపదికనే శ్రీ సత్యసాయి విద్యా సంస్థలను భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఏర్పాటు చేశారు.‘సా విద్యా యా విముక్తయే’ అని వేదోక్తి. అంటే, విద్యతోనే మనిషికి విముక్తి సాధ్యం. మనిషిని విముక్తి వైపు నడిపించేదే నిజమైన విద్య. నేటికాలంలో విద్య వాణిజ్యంగా మారింది. సమాజం భౌతికంగా అభివృద్ధి చెందుతున్నా, నైతికంగా పతనమవుతోంది. సత్యం, ధర్మం, కృతజ్ఞత, భక్తి వంటి ఉన్నత విలువలు వెనుకబడిపోయి; ధనాసక్తి, అధికారదాహం పెచ్చుమీరుతున్నాయి. విద్యార్థులలో పెరుగుతున్న అశాంతి, నిరాశ, ఆందోళన– విద్యా వ్యవస్థ తన లక్ష్యాన్ని కోల్పోయిందనేందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.ఎడ్యుకేర్ – బాబా ఆవిష్కరించిన విద్యా సూత్రంవిద్యారంగంలో విలువలను పునరుద్ధరించాలనే సంకల్పంతో శ్రీ సత్యసాయిబాబా ‘ఎడ్యుకేర్’ భావనను ప్రవేశపెట్టారు. ‘ఎడ్యుకేర్’ లాటిన్ పదం. దీని అర్థం ‘మనలో దాగి ఉన్నదానిని వెలికి తీయడం’. శ్రీ సత్యసాయి విద్యాసంస్థల్లో ఈ విధానం విద్యార్థుల్లో ఉన్న అంతర్గత జ్ఞానాన్ని వెలికితీసి, వారిలో ఉన్నత విలువలను పాదుకొల్పడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఇది కేవలం అకాడమిక్ విద్య కాదు, మనసు, హృదయం, చేతులు అనే మూడు కోణాల సమగ్రాభివృద్ధి.శ్రీ సత్యసాయి విద్యాసంస్థల ఆవిర్భావంశ్రీ సత్యసాయిబాబా 1981లో అప్పటికే అనంతపురం, వైట్‌ఫీల్డ్, పుట్టపర్తిలలో ఉన్న కళాశాలలన్నింటినీ ఏకీకృతం చేసి, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ (డీమ్డ్ యూనివర్సిటీ) నెలకొల్పారు. ఆ తర్వాత రెండేళ్లకు శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రారంభించారు. ఈ సంస్థల్లో ప్రైమరీ స్థాయి నుంచి పోస్ట్ డాక్టరల్ స్థాయి వరకు విద్యాబోధన జరుగుతుంది. ఈ సంస్థల్లో విద్య పూర్తిగా ఉచితం. విద్యార్థులు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన పని ఉండదు. శ్రీ సత్యసాయి విద్యాసంస్థల విశిష్టతకు ఇదే నిదర్శనం.శ్రీ సత్యసాయి విద్యావాహిని దేశంలోని ప్రతి విద్యార్థికి సమగ్ర విద్యను అందించాలనే సంకల్పంతో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 2010 నవంబర్ 23న ‘శ్రీ సత్యసాయి విద్యావాహిని’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ సత్యసాయి విద్యా సంస్థలు విలువలతో కూడిన విద్యను, ప్రావీణ్యాన్ని అందించడంలో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. ఈ సంస్థల్లో విజయవంతమైన విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడానికి సత్యసాయి విద్యావాహిని కార్యక్రమాన్ని చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని, సత్యసాయి విద్యావిధానాన్ని ప్రతి పాఠశాలకు, ప్రతి గురువుకు, ప్రతి విద్యార్థికి చేరవేయడానికి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.ఉన్నతమైన నైతిక విలువలు, ఆధ్యాత్మిక దృక్పథం, సామాజిక సేవా సంసిద్ధత కలిగిన సచ్ఛీలురైన భావి పౌరులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా శ్రీ సత్యసాయి విద్యావాహిని కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా తయారయ్యే విద్యార్థులు కేవలం విద్యార్హతలు మాత్రమే కలిగిన వారిగా కాకుండా; దేశసేవ పట్ల తపన, బాధ్యతాయుతమైన పౌరచైతన్యం, సమగ్రత, ప్రేమ, దయ, సహానుభూతితో కూడిన సమగ్ర వ్యక్తులుగా ఎదగాలనేదే దీని సంకల్పం. విలువలతో కూడిన సార్వత్రిక విద్యను ఉచితంగా అందించడమే శ్రీ సత్యసాయి విద్యావాహిని మూలసిద్ధాంతం. ఈ కార్యక్రమం కింద ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, మానవీయ విలువలతో కూడిన పాఠ్యాంశాలను సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉచితంగా అందిస్తుంది.సాంకేతిక సహకారంతో సేవ సత్యసాయి విద్యావాహిని కార్యక్రమంలో ఉన్నత విద్య, శిక్షణ, సాంకేతిక నైపుణ్యం, అనుభవం కలిగిన స్వచ్ఛంద సేవకులు అంకితభావంతో సేవలు అందిస్తున్నారు. ‘అందరికీ సమీకృత విద్య’ అనే బాబా ఆశయాన్ని సాకారం చేయడానికి నిస్వార్థంగా కృషి చేస్తున్నారు. ఇది సాధారణమైన విద్యా కార్యక్రమం కాదు, భారతీయ విద్యా వ్యవస్థను సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి అనే విలువలతో పునరుజ్జీవింపజేసే మహాయజ్ఞం. ‘విద్య అనేది కేవలం ఉపాధి కోసమే కాదు, అది దైవత్వానికి, సేవకు, సమగ్రతకు దారి చూపాలి’ అనే ప్రాచీన భారతీయ మౌలిక సూత్రానికి ఆధునిక కార్యాచరణ ప్రస్థానం.శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ విద్యాసంస్థలుపుట్టపర్తి, అనంతపురం, నందిగిరి, బెంగళూరులలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఉచిత రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ విద్యాసంస్థలను నిర్వహిస్తోంది. మానవీయ విలువలు, నైతికతలకు ప్రాధాన్యమిస్తూ ఈ విద్యాసంస్థల్లో బోధన కొనసాగుతోంది. పాఠ్యాంశాల బోధన మాత్రమే కాకుండా, పాఠ్యేతర కార్యకలాపాల ద్వారా విద్యార్థులలో క్రమశిక్షణ, త్యాగస్ఫూర్తి, సామాజిక సేవా నిబద్ధతలను పెంపొందించేలా ఈ సంస్థలు విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయి. వీటిలో చదువుకునే విద్యార్థులు తమ విద్యాసంస్థలకు సమీపంలో ఉన్న గ్రామాలను సందర్శించి, తప్పనిసరిగా అక్కడ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్‌ను బోధిస్తారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న విద్యాసంస్థలు ఇవీ...శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్, పుట్టపర్తి ఇది బాల బాలికల కోసం ప్రారంభించిన నాన్ రెసిడెన్షియల్ పాఠశాల. తొలుత దీనిని 1972లో తెలుగు మీడియం పాఠశాలగా బాబా తల్లి పేరిట ప్రారంభించారు. తర్వాత 2010లో సీబీఎస్ఈ సిలబస్ ప్రకారం ఇంగ్లిష్ మీడియం పాఠశాలగా మార్చారు. ఇందులో ఇంగ్లిష్ మీడియం మొదటి బ్యాచ్ 2010 జూన్ 10న ప్రారంభమైంది. పుట్టపర్తి, చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకుంటుంటారు.శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్, పుట్టపర్తి ఇది బాల బాలికల కోసం నెలకొల్పిన రెసిడెన్షియల్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల. ఇందులో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు విద్యాబోధన జరుగుతుంది.శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖ గుర్తింపు పొందిన స్వయంప్రతిపత్తి సంస్థ. ఇది పుట్టపర్తి, వైట్‌ఫీల్డ్–బెంగళూరు, నందిగిరి, అనంతపురం క్యాంపస్‌లలో పనిచేస్తోంది.ఇది విద్యార్థులకు ఉచితంగా గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తుంది. ఈ క్యాంపస్‌లలోని విద్యా వ్యవస్థ పూర్వకాలపు గురుకుల విద్యావ్యవస్థను పోలి ఉంటుంది. ఇక్కడ విద్యాబోధనతో పాటు వ్యక్తిత్వ వికాసానికి కూడా సమాన ప్రాధాన్యం ఉంటుంది. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ పుట్టపర్తి క్యాంపస్‌లో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ (సీఆర్ఐఎఫ్) ఉంది. అధునాతన పరిశోధన వసతులు ఈ సంస్థ ప్రత్యేకత. శ్రీ సత్యసాయి మీర్పురి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్, పుట్టపర్తి ఈ సంగీత కళాశాల 2000 సంవత్సరంలో ఏర్పాటైంది. ఇది వివిధ సంగీత విభాగాలలో ఫౌండేషన్, డిప్లొమా, బ్యాచిలర్స్, మాస్టర్స్ కోర్సులను అందిస్తుంది. దీనిని 2017లో సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్‌లోని ఒక విభాగంగా మార్చారు.ఇతర రాష్ట్రాలలో శ్రీ సత్యసాయి పాఠశాలలుశ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని స్టేట్ ట్రస్టులు దేశంలోని వివిధ రాష్ట్రాలలో పాఠశాలలను నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్, ఇండోర్, ముంబై, దక్షిణ కన్నడ తదితర ప్రాంతాల్లో శ్రీ సత్యసాయి పాఠశాలలు నడుస్తున్నాయి. మీ తల్లిదండ్రులను గౌరవించండి.. గురువులను ఆరాధించండి..సమాజానికి సేవ చేయండి..ఇదే నిజమైన విద్యార్థి ధర్మం.‘గురువు ఇచ్చేది జ్ఞానం మాత్రమే కాదు, జీవన మార్గం చూపే వెలుగు’ అనేదివిద్యార్థులకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా తరచుగా చేసే ఉద్బోధ.రతన్ టాటా చేతుల మీదుగా శ్రీ సత్యసాయి విద్యా వాహిని ప్రారంభంశ్రీ సత్యసాయిబాబా 2010లో తన పుట్టినరోజు సందర్భంగా శ్రీ సత్యసాయి విద్యావాహిని కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమ రూపకల్పనకు టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా ఇతోధికంగా సహాయ సహకారాలందించారు. శ్రీ సత్యసాయి విద్యావాహిని కార్యక్రమం కింద 2023 నవంబర్‌లో దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో నైపుణ్యాలను పంచుకోవడానికి ఎన్సీఈఆర్టీ, సీఐఈటీలతో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. -
శ్రీ సత్యసాయి ట్రస్ట్ ద్వారా అతున్యత వైద్య సేవలు
వైద్యులు త్యాగ స్ఫూర్తితో పేదలకు సేవ చేయాలి. దీనికంటే గొప్ప సేవ మరొకటి లేదు. దిక్కులేని వారికి, నిస్సహాయులకు దేవుడే ఏకైక ఆశ్రయం. మానవుడు దేవుని స్వరూపం కాబట్టి, దిక్కులేని వారికి, నిస్సహాయులకు సహాయం చేయడం అతని ప్రాథమిక కర్తవ్యం. – శ్రీ సత్యసాయి బాబా‘సేవే సత్యసాధన’ అనే సూత్రంతో, సమాజంలో ఆర్థిక, సామాజిక స్థాయులకు అతీతంగా అందరికీ ఉచితంగా ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ విస్తృతంగా కృషి చేస్తోంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా స్థాపించిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, మానవాళి సేవలో అగ్రగామిగా నిలిచిన ఒక పుణ్య సంస్థ. ‘ప్రేమతో చేసే సేవే నిజమైన సేవ’ అనే సూత్రాన్ని ఆచరణలో అమలు చేస్తూ, ఈ ట్రస్ట్ సమాజంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భారం లేకుండా ఉచిత వైద్య సేవలను అందిస్తోంది.శ్రీ సత్యసాయి మెడికల్ మిషన్ లక్ష్యాలుపేద ప్రజల ఇంటి ముంగిటకు సమగ్ర ఆరోగ్య సంరక్షణను సాధించడం.ఆరోగ్యం – పరిశుభ్రతతో సహా నివారణ ఆరోగ్య సంరక్షణపై ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ల ద్వారా అనారోగ్యానికి దూరంగా ఎలా ఉండాలో ప్రజలకు అవగాహన కల్పించడం.ఆరోగ్య సంరక్షణ అమలులో అనుసరించే సూత్రాలు :శ్రీ సత్యసాయి బాబా అమలు చేసిన ఆరోగ్య సంరక్షణకు ఈ కింది ఆరు సూత్రాలే మార్గదర్శకాలు. వీటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఆరోగ్య సంరక్షణ సంస్థల కార్యకలాపాలలో శ్రద్ధగా అనుసరిస్తారు. అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ ఉచిత ఆరోగ్య సంరక్షణ కారుణ్య ఆరోగ్య సంరక్షణ సమగ్ర ఆరోగ్య సంరక్షణ సకాలంలో ఆరోగ్య సంరక్షణ అందించడం వైద్యుడికి, రోగికి మధ్య హృదయపూర్వక, ప్రేమపూర్వక సంబంధాన్ని పెంపొందించడమే వైద్యసేవల ఉద్దేశం. శ్రీ సత్యసాయి మెడికల్ మిషన్ సమగ్ర ఆరోగ్య సంరక్షణ, వైద్య చికిత్సలను క్రమం తప్పకుండా అందించడం ద్వారా ఈ అంశాన్ని వివరిస్తుంది. శ్రీ సత్యసాయి ఆసుపత్రులలోని సంరక్షణలో మానవీయ అంశ స్పష్టంగా కనిపిస్తుంది.శ్రీ సత్యసాయి హెల్త్ కేర్ త్రికోణ విధానంశ్రీ సత్యసాయి హెల్త్ కేర్ ఒక సమగ్ర విధానాన్ని కలిగి ఉంది, ఇది కింది మూడు కోణాల విధానం ద్వారా అమలవుతోంది. నివారణ కార్యాచరణ, నివారణ దృష్టి, ఆధ్యాత్మిక స్థావరం వ్యక్తిగత స్థాయి, కుటుంబ స్థాయి, సమాజ స్థాయి వంటి అన్ని స్థాయులలోను ఆరోగ్య విద్యకు సత్యసాయి ఆసుపత్రులు ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. అలాగే, అన్ని స్థాయులలోనూ స్క్రీనింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు అసంఖ్యాక రోగులకు శ్రీ సత్యసాయి సేవా మెడికల్ మిషన్ ఆశాకిరణంగా నిలుస్తోంది. ఈ సంస్థ అందించే వైద్యసేవలు ఇవీ:వివిధ రాష్ట్రాలలో నిర్వహించే వైద్య శిబిరాలు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జన్మదిన వేడుకల సందర్భంగా వైద్య శిబిరాలు, స్పెషాలిటీ శిబిరాలు, గ్రామ సేవలో భాగంగా శిబిరాలు, శ్రీసత్యసాయి విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌తో వైద్య కార్యకలాపాల ఏకీకరణ, వ్యక్తిగత వైద్యుల క్లినిక్‌లు, అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద చికిత్స కేంద్రాలు కూడా ఇందులో భాగంగా పనిచేస్తున్నాయి. వీటితో పాటు శ్రీ సత్యసాయి మొబైల్ హెల్త్ సర్వీసెస్, టెలీ–మెడిసిన్ సేవలు, రక్తదాన శిబిరాలు (లిక్విడ్ లవ్ డొనేషన్ శిబిరాలు), సాయి పునరావాస కార్యక్రమాలు, పోషకాహార లోపం నిర్మూలన, విపత్తు నిర్వహణ తదితర సేవలను అందించడంలో ముందంజలో ఉంటున్నాయి.నివారణ ఆరోగ్య సంరక్షణ శ్రీ సత్యసాయి మొబైల్ హెల్త్ కేర్ సర్వీసెస్ చికిత్సలో భాగంగా వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణతో పాటు ప్రివెంటివ్ మెడిసిన్‌పై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు. ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత వంటి ప్రాథమిక ఆరోగ్య విధానాలపై గ్రామస్థులలో అవగాహన కల్పించడానికి నిపుణులతో ప్రసంగాలు, ప్రదర్శనలు, వీడియో ప్రదర్శనలు నిర్వహిస్తారు. మద్యపానం, ధూమపానం, పొగాకు నమలడం వంటి దురలవాట్ల వల్ల కలిగే దుష్ప్రభావాలపై కూడా వారికి అవగాహన కల్పిస్తారు.జనరల్ హాస్పిటల్స్ గ్రామీణ వైద్య సేవలుపుట్టపర్తిలో 1956లో స్థాపించిన శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్, 1976లో ప్రారంభమైన వైట్‌ఫీల్డ్ జనరల్ హాస్పిటల్, మహిళలు, పిల్లలు, వృద్ధులు, గ్రామీణ ప్రజలకు సాధారణ చికిత్సల నుంచి ప్రసూతి సేవల దాకా అన్ని వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నాయి. అలాగే, ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న మొబైల్ ఆసుపత్రులు దూర గ్రామాలకు చేరుకుని అక్కడ ప్రజలకు వైద్యపరీక్షలు, మందులు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉచిత వైద్యానికి ప్రతీకలు1991 నవంబర్ 22న భగవాన్ బాబా చేత శ్రీ సత్యసాయి ఇ¯Œ స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ – పుట్టపర్తి ప్రారంభించబడింది.ఈ ఆసుపత్రి గుండె, మూత్రపిండాలు, న్యూరో, యూరాలజీ వంటి క్లిష్టమైన వ్యాధులపై అత్యాధునిక శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తుంది.ఆ తర్వాత 2001లో బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో మరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి స్థాపించబడింది. అక్కడ కూడా గుండె సంబంధిత శస్త్రచికిత్సలు, కేర్ యూనిట్లు ప్రపంచస్థాయి సదుపాయాలతో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.ఈ రెండు ఆసుపత్రుల్లో ఇప్పటి వరకు లక్షలాది మంది రోగులు ఉచితంగా చికిత్స పొందారు. ప్రతి రోగికి బాబా ఆశీర్వాదం, వైద్యుల సేవానిరతి కలసిన మానవతా వాతావరణం అక్కడ ప్రతి మూలలోనూ కనిపిస్తుంది.ఉచిత వైద్య శిబిరాలుభగవాన్ నిస్వార్థ సేవకు ఉదాహరణగా నిలిచి, ప్రపంచవ్యాప్తంగా చాలామంది తమ తోటి మానవులకు సేవ చేయడానికి ప్రేరణ కల్పించారు. భారతదేశంలోని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు వైద్యసంరక్షణ అందుబాటులో లేని ప్రాంతాలలో ఉచిత వైద్యశిబిరాలను నిర్వహిస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్యం, పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. భగవాన్ ప్రేమ, ఆశీస్సులతో ఈ సంస్థల సేవకులు నిశ్శబ్ద ఆధ్యాత్మిక విప్లవాన్ని సృష్టిస్తున్నారు. ఆరోగ్యప్రచారం, విద్య, శస్త్రచికిత్సలు, ఆరోగ్య సంరక్షణ సహా అన్నిరకాల ఆరోగ్యసేవలను నిర్వహించడానికి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రమం తప్పకుండా వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ రోగులకు ఉచితంగా మందులు ఇస్తున్నారు. లక్షలాది మంది రోగులకు కంటి వ్యాధులకు చికిత్స, వేలాది మందికి కంటిశుక్లాల శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు చెందిన వివిధ సమితిలు వివిధ ప్రాంతాలలో ఉచిత వైద్యకేంద్రాలను నిర్వహిస్తున్నాయి.భగవాన్ జన్మదిన వేడుకల సందర్భంగా వైద్య శిబిరాలుప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జన్మదిన వేడుకలలో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా వేలాది మంది రోగులకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు అందిస్తారు. ఈ శిబిరాలకు రోగ నిర్ధారణ పరీక్షల కోసం వచ్చిన వారిలో ఎవరికైనా అధునాతన చికిత్స అవసరమైతే, వారిని శ్రీ సత్యసాయి జనరల్ ఆసుపత్రికి పంపుతారు.ప్రశాంతి నిలయం లేదా ప్రశాంతిగ్రామ్‌లోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ పురోగతిని సమీక్షించడానికి, శ్రీ సత్యసాయిబాబా బోధనలను గుర్తు చేసుకోవడానికి వైద్య శిబిరంలోని ప్రతి ఒక్కరితో రోజూ సాయంత్రం సత్సంగ్ జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లోనూ స్వామి జన్మదిన వేడుకల సందర్భంగా మారుమూల గ్రామాలకు వైద్య సేవలను విస్తరించడానికి ఎంపిక చేసిన గ్రామాల్లో దాదాపు పది రోజులు మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తారు. సాధారణ శస్త్రచికిత్సలు, కంటిశుక్లం రోగులను సమీప పట్టణాలకు తీసుకువచ్చి శస్త్రచికిత్సలు ఉచితంగా చేయిస్తారు.శ్రీ సత్యసాయి మొబైల్ హాస్పిటల్స్శ్రీ సత్యసాయి మొబైల్ హాస్పిటల్ అనేది మరొక ప్రత్యేకమైన ఉచిత గ్రామీణ ఆరోగ్యసేవ. శ్రీ సత్యసాయి బాబా ఈ సేవలను 2006 మార్చి 3న ప్రారంభించారు. వారానికి ఒకసారి శ్రీ సత్యసాయి ఉచిత వైద్య క్లినిక్‌లను అనేక సమితిలు నిర్వహిస్తున్నాయి.టెలీమెడిసిన్టెలీమెడిసిన్ కేంద్రాలు నేరుగా వైద్య చికిత్సలను అందించవు. రోగులు ఎవరైనా వీటిని సంప్రదిస్తే, వారికి తగిన ఆసుపత్రులను సూచించడం, అక్కడ లభించే చికిత్స వివరాలను తెలియజేయడం సహా అవసరమైన సమాచారాన్ని అందిస్తాయి.వివిధ సంస్థలలో వైద్య పరీక్షలువివిధ రాష్ట్రాలకు చెందిన శ్రీ సత్యసాయి సంస్థల వైద్య బృందాలు అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, కుష్టు వ్యాధిగ్రస్థుల నివాసాలు తదితర ప్రదేశాలను తరచు సందర్శించి, అక్కడి వారికి అవసరమైన వైద్య సేవలను అందిస్తాయి. సాధారణ వైద్య శిబిరాలతో పాటు స్థానిక గ్రామీణ పాఠశాలల విద్యార్థులకు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఆరోగ్య సేవలతో పాటు వ్యక్తిగత సంరక్షణ, ఉద్యోగ సంరక్షణ, విద్యా సంరక్షణ, ఆధ్యాత్మిక సంరక్షణ, వ్యవసాయ సంరక్షణ, సామాజిక సంరక్షణ వంటి సేవలన్నీ శ్రీ సత్యసాయి విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌తో అనుసంధానమై పనిచేస్తుంటాయి.సేవకు ప్రతీక సత్యసాయి వైద్య మిషన్సత్యసాయి ట్రస్ట్ వైద్య సేవలు కేవలం రోగాన్ని నయం చేయడమే కాదు, ప్రేమతో, కరుణతో రోగికి మానసిక బలాన్ని కూడా అందిస్తున్నాయి. ఇందులో పనిచేసే వైద్యు లందరూ సేవా భావంతో పనిచేస్తున్నారు. కుల మత ఆర్థిక వ్యత్యాసాలకు తావు లేకుండా, ప్రతి ఒక్కరూ భగవాన్ బాబా సూత్రం ప్రకారం ‘మానవుడు దేవుని రూపం’ అనే దృష్టితోనే సేవలను అందిస్తున్నారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆరోగ్య సేవలు ప్రపంచానికి మానవతా దృక్పథానికి ఆదర్శం.‘ప్రేమలోనే వైద్యం ఉంది, సేవలోనే దేవుడు ఉన్నాడు’ అనే బాబా వాక్యం ఈ సంస్థ ప్రతి పనిలోనూ ప్రతిఫలిస్తుంది. భగవాన్ సత్యసాయి బాబా ఆశీస్సులతో ఈ సేవాయజ్ఞం శతాబ్దాల పాటు కొనసాగాలని ఆకాంక్షిద్దాం.మారుమూల ప్రాంతాలకూ విస్తరణశ్రీ సత్యసాయి ఆస్పత్రుల ఆధ్వర్యంలో ఉచిత వైద్యసేవలు దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించాయి. పుట్టపర్తి, బెంగళూరులోని వైట్ఫీల్డ్లలోని శ్రీ సత్యసాయి జనరల్ ఆస్పత్రులు 2023–24 నాటికి దాదాపు 4.3 లక్షల మంది ఔట్‌పేషెంట్లకు ఉచితంగా వైద్యసేవలు అందించడంతో పాటు సుమారు 38 వేల మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేశాయి. శ్రీ సత్యసాయి ఆస్పత్రుల ఆధ్వర్యంలో దేశంలోని మారుమూల ఉన్న లద్దాఖ్ సహా ఇతర హిమాలయ ప్రాంతాలలోని రోగులకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నాయి. అలాగే, ప్రసూతి సేవలు, హృద్రోగాలు, మధుమేహం, శిశువైద్యం, దంత చికిత్సలు, మానసిక చికిత్సలు తదితర రంగాలకు చెందిన ప్రత్యేక క్లినిక్‌లను కూడా నిర్వహిస్తున్నాయి. వైద్య చికిత్సల ఖర్చు విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో శ్రీ సత్యసాయి ఆస్పత్రులు ఉచితంగా ఉన్నతస్థాయి వైద్య సేవలను అందిస్తుండటం విశేషం.మారుమూల ప్రాంతాలకూ విస్తరణశ్రీ సత్యసాయి ఆస్పత్రుల ఆధ్వర్యంలో ఉచిత వైద్యసేవలు దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించాయి. పుట్టపర్తి, బెంగళూరులోని వైట్ఫీల్డ్లలోని శ్రీ సత్యసాయి జనరల్ ఆస్పత్రులు 2023–24 నాటికి దాదాపు 4.3 లక్షల మంది ఔట్‌పేషెంట్లకు ఉచితంగా వైద్యసేవలు అందించడంతో పాటు సుమారు 38 వేల మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేశాయి. శ్రీ సత్యసాయి ఆస్పత్రుల ఆధ్వర్యంలో దేశంలోని మారుమూల ఉన్న లద్దాఖ్ సహా ఇతర హిమాలయ ప్రాంతాలలోని రోగులకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నాయి. అలాగే, ప్రసూతి సేవలు, హృద్రోగాలు, మధుమేహం, శిశువైద్యం, దంత చికిత్సలు, మానసిక చికిత్సలు తదితర రంగాలకు చెందిన ప్రత్యేక క్లినిక్‌లను కూడా నిర్వహిస్తున్నాయి. వైద్య చికిత్సల ఖర్చు విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో శ్రీ సత్యసాయి ఆస్పత్రులు ఉచితంగా ఉన్నతస్థాయి వైద్య సేవలను అందిస్తుండటం విశేషం. -
ప్రేమ, సేవే లక్ష్యంగా శ్రీ సత్యసాయి బాబా జీవితం
కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 1926 నవంబరు 23న జన్మించారు. ఆయన అసలు పేరు సత్యనారాయణరాజు. బాబా జన్మించిన గొల్లపల్లి– ఇప్పుడు పుట్టపర్తిగా మారింది. భక్తులకు షిరిడీ సాయిబాబా అవతార పురుషుడిగా తనను తాను చెప్పుకొన్నారు. షిరిడీ సాయిబాబా మరణించిన ఎనిమిదేళ్లకు బాబా జన్మించారు. సాయిబాబా జీవితంలో ఎన్ని వివాదాలు వచ్చినా, ఆయన సేవలను మాత్రం ఎవరూ వేలెత్తి చూపించలేకపోయారు. బాబా బంగారు ఉంగరాలు, విబూది సృష్టించి భక్తులకు కానుకలుగా ఇచ్చేవారు. కోట్లాదిమంది భక్తులకు ఆయన ఆధ్యాత్మిక గురువు. కుల మతాలకు అతీతంగా నిలిచారు.సత్యసాయి భక్తులలో హిందువులతో పాటు ముస్లింలు, క్రిస్టియన్లు కూడా చాలామంది ఉన్నారు. సత్యసాయి బాబా తల్లిదండ్రులు ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజు. సత్యసాయి బాబా బాల్యంలోనే చాలా అద్భుతాలు చేశాడని చెబుతారు. చిన్న వయసులోనే అపర మేధావిగా, సేవాభావం గల వ్యక్తిగా ముద్రపడ్డారు. అపర మేధావి అయిన బాబాకు నాట్యంలో, సంగీతంలో, రచనలలో మంచి పట్టు ఉంది. బాబా స్వయంగా పాటలు, పద్యాలు రాసి భక్తులకు వినిపించేవారు.1940 మే 23న తండ్రి ‘నీవెవరు?’ అని అడిగినప్పుడు ‘నేను సాయిబాబా’ను అని సమాధానం చెప్పారు. నిదర్శనం చూపమంటే చేతిలో గుప్పెడు మల్లెపూలను తీసుకుని నేలపైకి విసరగా అవి ‘సాయిబాబా’ అనే అక్షరాలుగా ఏర్పడా›్డయి. ఆ చర్యతో బాబా తండ్రి– బాబాను ఓ అద్వితీయ మహోన్నతుడిగా భావించారు. అప్పుడు బాబా తాను షిరిడీ సాయిబాబా ప్రతిరూపాన్ని అని చెప్పారు. తాను షిరిడీ సాయికి ప్రతిరూపాన్ని అని, తనకు ఎవరితోనూ సంబంధాలు లేవని చెప్పడంతో భక్తులు రావడం ప్రారంభమైంది.1944లో భక్తులు, బాబా స్వగ్రామం పుట్టపర్తిలో ఓ మందిరం నిర్మించారు. ఆ తర్వాత 1948లో ప్రారంభమైన ప్రశాంతి నిలయం 1950 నాటికి పూర్తయింది. 1957 సంవత్సర కాలంలో బాబా ఉత్తర భారతదేశ దేవాలయాల సందర్శనకు వెళ్లారు. 1956లో చిన్నపాటి జనరల్ హాస్పిటల్‌ను పుట్టపర్తిలో నిర్మించారు. 1968లో బొంబాయిలో ధర్మక్షేత్ర అనే ఒక ఆశ్రమాన్ని నిర్మించారు. ఆ తర్వాత 1968 జూన్ 29న బాబా మొదటిసారి విదేశాలకు వెళ్లారు. అక్కడ బాబా తాను ఏ మతాన్ని ప్రచారం చేయడానికి రాలేదని, ప్రేమను పంచడానికి వచ్చానని భక్తులకు చెప్పారు. తన వైపు ఎవరినీ తిప్పుకోవాలని రాలేదని, ఎవరికి వారుగా స్వచ్ఛందంగా వస్తున్నారని అన్నారు. 1973లో హైదరాబాద్‌లో శివం మందిరాన్ని ప్రారంభించారు.అనంతరం 1981 జనవరి 19న చెన్నైలో సుందరం మందిరాన్ని ప్రారంభించారు. 1991లో పుట్టపర్తిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మంచారు. 1995లో రాయలసీమ ప్రాంతంలో బాబా నీటి ప్రాజెక్టు పనులు చేపట్టారు. 2001లో మరొకసూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను బెంగళూరులో నిర్మించారు. 1965లో సత్యసాయిబాబా భారతదేశంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలను స్థాపించారు. దీని ద్వారా కుల మతాలకు అతీతంగా ప్రజలు సమష్టిగా నిస్వార్థ సేవలో పాల్గొని, సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే శాశ్వత విలువలను పెంపొందించు కోవాలని సూచించారు. ఆయన ప్రసంగంలో లవ్ ఆల్.. సర్వ్ ఆల్ (అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు), హెల్ప్ ఎవర్.. హర్ట్ నెవర్ (అందరికీ మంచి చేయి.. ఎవరికీ హాని చేయకు) అనే పదాలు ప్రతిసారీ వినిపించేవి. పుట్టపర్తిలో ఆధ్యాత్మిక అభ్యున్నతి కోసం ప్రశాంతి నిలయం కేంద్రంగా మొదలైన ఉద్యమం.. ప్రపంచవ్యాప్తంగా 156 దేశాలకు పైగా విస్తరించింది.ఉచితంగా విద్య, వైద్యంనిరంతరం ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 1972లో ‘శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్’ స్థాపించారు. అప్పటి నుంచి ఆ సంస్థలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇప్పటికీ అమలులో ఉంది. అదేవిధంగా ఖరీదైన వైద్యం ఉచితంగానే చేస్తున్నారు. కోట్లాది మంది ఉచిత వైద్యాన్ని పొందారు. ప్రేమ, సేవ, సార్వత్రిక సోదరభావంతో సమాజానికి నిత్యం కొత్త నమూనాలను తీసుకొస్తున్నారు. ఇక్కడ చదివిన ఎందరో ప్రముఖులు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అవతార పురుషుడిగా ప్రకటించుకున్న నాటి నుంచి 86 ఏళ్ల వరకు సేవకుడిగానే నిలిచారు. బాబా భౌతికంగా లేకపోయినా, ఆయన పాటించిన, ప్రారంభించిన విధానాలు నేటికీ కొనసాగుతున్నాయి. శ్రీ సత్యసాయి అనే పదం శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. -
ట్రెండ్‌గా..మోడర్న్ ఊయలలు..!
ఎంత పెద్దవారైనా బాల్యపు ఆనందాన్ని తిరిగి పొందాలనుకుంటారు. అది సాధ్యం కాదని నిరుత్సాహపడకుండా పెద్దవాళ్లు కూడా ఊయల ఎక్కి చిన్ననాటి ఆనందాన్ని తిరిగి సొంతం చేసుకోవచ్చు. ఇంటి అలంకరణలోనూ ప్రత్యేక ఆకర్షణగా మారిన మోడర్న్ ఉయ్యాలలు ఇంట్లో ఉండటం ఇప్పుడో ట్రెండ్‌గా మారింది.. జూలా లేదా స్వింగ్ అని పిలిచే ఊయలను ఇంట్లో అలంకరించి, ఆనందాన్ని పొందుదాం. ఊయల పెట్టేంత పెద్ద పెద్ద లోగిళ్లు ఈ రోజుల్లో సాధ్యం కాదని నిరుత్సాహం అక్కర్లేదు. చిన్న స్పేస్‌లో కూడా ఏర్పాటు చేసుకోదగిన మోడర్న్ ఊయలలు నేడు అందుబాటులో ఉన్నాయి.ట్రెండ్ ఎందుకు పెరిగిందంటే... చిన్న అపార్ట్మెంట్లు, బాల్కనీలు పెరిగిన నేపథ్యంలో ఇంట్లో ప్రశాంతంగా కూర్చోగలిగే అవకాశాన్ని ఒక ‘స్వింగ్’ సెటప్ అందిస్తుంది. మోడర్న్ ఫర్నిచర్‌తో కలిపి వుడ్ + మెటల్ చెయిన్ + కాటన్ మెటీరియల్‌తోనూ ఊయలలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నాణ్యత, పరిమాణాన్ని బట్టి వీటి ధరల్లో మార్పులు ఉన్నాయి. ఆన్లైన్–ఆఫ్‌లైన్ మార్కెట్లోనూ ఇవి లభిస్తున్నాయి. వీటి అమరికకు... ఇంట్లో సర్దుబాటు స్థలం ఎంత ఉందో చూసుకోవాలి. స్థలాన్ని బట్టి ఊయల ఎంపిక చేసుకోవాలి. అటూ ఇటు తిరుగుతున్నప్పుడు తగలకుండా, ఒక కార్నర్ ప్లేస్ ఊయలకు కేటాయించడం మంచిది.మెటల్ + వుడ్ కలిపి ఉండే ఊయల ఎంచుకున్నప్పుడు కుషన్లు, వాటి రంగుల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.మ్యాక్రోమేడ్ హ్యాంగింగ్ స్వింగ్ తక్కువ స్పేస్ తీసుకుంటుంది, లైట్ వెయిట్, మోడర్న్ బోహో లుక్‌లోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి. టాయ్ స్వింగ్స్ ఇంటి అలంకరణకు మాత్రమే ఉపయోగించవచ్చు. వీటిని లివింగ్ లేదా డైనింగ్, కిడ్స్ రూమ్, బాల్కనీ కార్నర్ లలో ఉపయోగించవచ్చు. సీలింగ్–మౌంటెడ్ రౌండ్ స్వింగ్ అంటే హాల్ లేదా బాల్కనీలో వీటిని వేలాడదీయవచ్చు. ఇది ఫ్యామిలీ కార్నర్‌గా మారిపోతుంది.ఫోల్డబుల్ ఊయలను అవసరమైనప్పుడు మాత్రమే పెట్టి, తర్వాత తీసి, మడిచి జాగ్రత్త చేయవచ్చు. స్మార్ట్ అర్బన్ లివింగ్‌కి సరైన ఆప్షన్.బాంబూ స్వింగ్స్ నేచురల్ లుక్‌లో కనిపిస్తాయి. ఇవి సస్టెయినబుల్ డెకర్‌లో ఒక భాగం.వాల్–మౌంటెడ్ హ్యాంగింగ్ చెయిర్స్ చిన్న బెడ్రూమ్ లేదా స్టడీ కార్నర్లో కూడా సులభంగా ఫిట్ అవుతాయి.డెకర్ టిప్స్ఊయల చుట్టూ ఇండోర్ ప్లాంట్స్ పెడితే రిలాక్సింగ్ లుక్ వస్తుంది.కుషన్లు, లైట్ బ్లాంకెట్స్‌తో కంఫర్ట్ టచ్ ఇవ్వచ్చు.ఊయల కింద చిన్న రగ్ లేదా ఫ్లోర్ లాంప్ పెడితే మంచి లుక్ వస్తుంది.ఎకో ఫ్రెండ్లీ టచ్‌తో పాత కుర్చీ ఫ్రేమ్‌ని రీయూజ్ చేసి ఊయలగా మార్చుకోవచ్చు. ‘సస్టైనబుల్ లివింగ్‘కి ఇది ఒక అందమైన ఉదాహరణ. ఊయల అంటే ఒక జ్ఞాపకం. ఒక రిలాక్సేషన్ స్పాట్. మోడర్న్ హోమ్‌లలో ఇది ఇప్పుడు కేవలం సీటింగ్ ఆప్షన్ మాత్రమే కాదు, డిజైన్ స్టేట్మెంట్ కూడా. (చదవండి: గర్భిణులకు ఫ్లూ వ్యాక్సిన్ తప్పనిసరా..?) -
భళారే బాలినీస్!
ఇండోనేషియాలో ‘దేవతల దీవి’గా పేరున్న బాలి ద్వీపానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకస్థానం ఉంది. ఇది కేవలం అందమైన బీచ్‌లు, వరి పొలాలకే కాకుండా ఆధ్యాత్మిక పండుగలకు కూడా ప్రసిద్ధి. నిజానికి హిందూ–బౌద్ధ మతాల కలయికను పాటించే అతిపెద్ద జాతి బాలినీస్! వారు 210 రోజులకు ఒకసారి, బాలినీస్ క్యాలెండర్ (పావుకోన్) ప్రకారం జరుపుకునే పండుగను బాలినీస్ ఫెస్టివల్ అంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది నవంబర్ 19 నుంచి 29 వరకు పదిరోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో ‘గలుంగన్’ అనే పేరుతో జరిగే మొదటిరోజు వేడుక, అత్యంత ప్రత్యేకమైనది. ఈ పండుగ సందర్భంగా, ద్వీపం అంతటా రహదారుల పక్కన పెన్జోర్ (అలంకరించిన పొడవైన వెదురు స్తంభాలు) ఏర్పాటు చేస్తారు. ఇవి దైవత్వాన్ని ఆహ్వానించడానికి, శ్రేయస్సుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి గుర్తుగా నిలుస్తాయి. పది రోజుల తర్వాత వచ్చే కుణీంగాన్ పండుగతో ఈ ఫెస్టివల్ ముగుస్తుంది. ఆ చివరి రోజున తమ పూర్వీకుల ఆత్మలు తిరిగి స్వర్గానికి వెళ్తాయని అక్కడివారు నమ్ముతారు. ప్రతి దేవాలయంలో ఒడాలన్ (ఆలయ వార్షికోత్సవం) ఉత్సవం జరుగుతుంది. సంప్రదాయ నృత్యాలు, సంగీతం, ప్రత్యేకమైన కళల ప్రదర్శన కన్నుల పండుగగా సాగుతుంది. ఈ బాలినీస్ పండుగలు కేవలం వేడుకలు మాత్రమే కావు, ఇవి బాలినీస్ ప్రజల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.ఆధ్యాత్మికతలో ఆదర్శం!బాలీలో మరొక ముఖ్యమైన పండుగ న్యేపి (మౌన దినం) గురించి చెప్పుకోవాల్సిందే! సకా క్యాలెండర్ ప్రకారం బాలి ప్రజలు నూతన సంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకుంటూ న్యేపీని ఆత్మపరిశీలన దినంగా జరుపుకుంటారు. ఇది ఎక్కువగా మార్చి నెలలో జరుగుతుంటుంది. న్యేపి రోజున, ద్వీపం మొత్తం 24 గంటల పాటు పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది. విమానాశ్రయాలను మూసివేస్తారు. వీధులు నిర్మానుష్యంగా ఉంటాయి. స్థానికులంతా ప్రార్థన, ధ్యానం, ఆత్మపరిశీలనలో నిమగ్నమవుతారు. ఇది లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది. (చదవండి: గాజు డిస్క్: చిన్నదేగానీ..చిరంజీవి) -
గాజు డిస్క్: చిన్నదేగానీ..చిరంజీవి
‘సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు’ అన్న మాటను ఇప్పుడు ఒక చిన్న గాజు ఫలకం అబద్ధం చేసింది. ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త పీటర్ కజాన్ స్కీ, అతని బృందం రూపొందించిన ఈ గాజు డిస్క్, మొత్తం చరిత్ర జ్ఞాపకాలను శాశ్వతంగా బంధించగల అద్భుతం. దీని పేరు ‘సూపర్మాన్ మెమరీ క్రిస్టల్’. ఇందులో మూడు వందల అరవై టెరాబైట్ల డేటాను స్టోర్ చేయొచ్చు. అంటే చరిత్ర, గ్రంథాలు, సినిమాలు, సంగీతం అన్నీ ఒకే డిస్క్‌లో ఇమిడిపోతాయి. సాధారణ హార్డ్‌డ్రైవ్ లేదా పెన్‌డ్రైవ్ కొంతకాలానికే దెబ్బతింటుంది. ప్రత్యేకమైన గాజుతో రూపొందిన ఈ డిస్కును మాత్రం తీవ్రస్థాయిలోని ఉష్ణోగ్రతల వ్యత్యాసాలు, ప్రకృతి విపత్తులు వంటివేవీ దీనిని తాకలేవు. అణు స్థాయిలో ఉండే నానో నిర్మాణాల ద్వారా పరిమాణం, దిశ, స్థానం వంటి ఐదు మార్గాల్లో ఇందులో డేటా స్టోర్ అవుతుంది. కోట్ల ఏళ్ల తరువాత కూడా మన కథలను ఈ గాజు డిస్క్ ఒక్కటే చెప్తుంది. మొత్తానికి, ఇది ఉత్త గాజు బిళ్ల కాదు, మానవ జ్ఞాపకాలకు కాలాతీత బీమా పథకం! పరిమాణంలో ఇది చిన్నదే గాని, మనుగడలో మాత్రం చిరంజీవి. త్వరలోనే దీనిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి మార్కెట్లోకి తీసుకురానున్నారు. (చదవండి: Ukrainian Inventor Valentyn Frechka: రాలిపోయిన పండుటాకులతో కాగితం తయారీ..) -
నటి అనుపమ అందం వెనకున్న రహస్యం ఇదే..!
చిన్న చిన్న వాటితోనే!అందం అంటే కేవలం మేకప్ కాదు, మన వ్యక్తిత్వం అని చెప్పే అనుపమ సినిమాల్లోనే కాదు, ఆఫ్ స్క్రీన్‌లోనూ సింపుల్, క్లాసీ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ అందం వెనక ఉన్న చిన్న చిన్న రహస్యాలు మీకోసం.. జ్యూవెలరీలో నాకు సిల్వర్ ఆక్సిడైజ్డ్ చెవిపోగులు, చిన్న నెక్‌పీస్‌లు అంటే చాలా ఇష్టం! డ్రెస్ ఏదైనా, ఇలాంటి చిన్న చిన్న వాటితోనే లుక్ పూర్తవుతుంది. ఇక చర్మం కాంతిమంతంగా ఉండాలంటే నిద్ర, ఆహారం రెండూ సమతౌల్యంగా ఉండాలి. ఈ నియమాలనే నేను ఫాలో అవుతానని చెబుతోంది అనుపమ పరమేశ్వరన్. గోల్డ్ గ్రేస్!చిన్న చైన్ అయినా, లుక్‌కి రాయల్టీ టచ్! అదే ఈ సింగిల్ లైన్ గోల్డ్ నెక్‌పీస్ మ్యాజిక్. ఈ సున్నితమైన గోల్డ్ చై నెక్‌లైన్‌పై మెరుస్తూ, మీ మొత్తం లుక్‌కి టైమ్‌లెస్ ఎలిగెన్స్ జోడిస్తుంది. ట్రెడిషనల్ చార్మ్‌తో పాటు, మోడర్న్ టచ్ ఉండటమే దీని ప్రత్యేకత. ప్యూర్ గోల్డ్ ఫినిష్, సాఫ్ట్ షైన్ , మినిమల్ డిజైన్‌తో ఏ డ్రెస్సుకైనా ఈ నెక్‌పీస్ సహజంగా బ్లెండ్ అవుతుంది. దీనిని ఓపెన్ హెయిర్, లైట్ మేకప్ కాంబినేషన్‌తో పెయిర్ అప్ చేస్తే ఈ చైన్ లుక్‌కి రిచ్‌నెస్, సాఫ్ట్ గ్లామ్ టచ్ గ్యారంటీ! చిన్న డీటైల్, కానీ పెద్ద ఇంపాక్ట్. ఎందుకంటే ఇది ఎప్పుడూ ఓవర్ కాకుండా, పర్ఫెక్ట్గా మెరిసిపోతుంది! దీపిక కొండి (చదవండి: చిలుకలు భాషలు కూడా నేర్చుకుంటాయా..?) -
చిలుకలు భాషలు కూడా నేర్చుకుంటాయా..?
చిలుకలు మాట్లాడతాయని విన్నాం. చిలుకలు మాట్లాడటం కూడా మనలో కొందరు నేరుగా వినే ఉంటారు. అయితే ఒక చిలుక ఉంది. ‘ఉంది’ కాదు. ‘ఉండేది’! ఆ చిలుక ఒక పక్షి శాస్త్రవేత్త ఇంట్లోని ల్యాబ్‌లో ఉండేది. ఒకరోజు చిలక్కి, ఆ పక్షి శాస్త్రవేత్తకీ మాటా మాటా వచ్చింది. చిలుక చికాకును ప్రదర్శించింది. అందుకు ఆ శాస్త్రవేత్త హర్ట్ అయ్యారు. వెంటనే ఆ చిలుక, ‘‘క్షమించండి’’ అంది. నిజానికి చిలుక తప్పేం లేదు. చిలుక అరటి పండు అడిగితే, ఆ శాస్త్రవేత్త ఏవో గింజల్ని పెట్టారు. చిలుక మౌనంగా ఉంది. ‘‘ఊ, ఇదుగో అరటిపండు. తినూ..’’ అని మళ్లీ గింజల్నే పెట్టి, ఆ చిలుకను మోసం చేసే ప్రయత్నం చేశారు ఆ శాస్త్రవేత్త! చిలుక కోపంగా ఆ గింజల్ని శాస్త్రవేత్తపై విసిరికొట్టింది. చికాకును ప్రదర్శించింది. వెంటనే ‘సారీ’ కూడా చెప్పేసింది! నిజంగా చిలుకలకు ఇన్ని తెలివితేటలు ఉంటాయా? తెలివితేటలదేముందీ... ఎన్నైనా ఉండొచ్చు. వాటిని ప్రదర్శించటానికి ఈ మూగ జీవులకు మాటలెలా వస్తాయన్నదే ఆశ్చర్యం. ఆ చిలుక పేరు అలెక్స్, ఆ శాస్త్రవేత్త పేరు ఐరీన్ పెప్పర్బర్గ్(Irene Pepperberg). మాటలేనా, భాషలు కూడా!బ్రిటన్‌లో 2010లో ఒక పెంపుడు చిలుక అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. అది మాట్లాడే చిలుక. తన యజమాని మాట్లాడుతుండే బ్రిటిష్ యాసను చక్కగా అనుకరిస్తూ ఉండేది. చిలుక ఎగిరిపోయినందుకు ఆ యజమాని చాలా బాధపడి పోయాడు. తిరిగి నాలుగేళ్ల తర్వాత ఆ చిలుక, యజమాని కలుసుకున్నారు! అయితే చిలుక తన యజమాని మాట్లాడే బ్రిటిష్ భాషను మర్చిపోయింది. బదులుగా స్పానిష్ భాషను మాట్లాడుతోంది! అంటే చిలుకలు మాట్లాడటమే కాకుండా, భాషలు కూడా నేర్చుకుంటాయా? అవును!!మైనాలూ అచ్చు గుద్దేస్తాయిపక్షి జాతిలో మనిషి భాషను అద్భుతంగా అనుకరించేవి చిలుకలతో పాటుగా మరికొన్ని కూడా ఉన్నాయి. (బాక్సులలో చూడండి) మనుషుల మాటల్నే కాక, ఇతర శబ్దాలను కూడా గొంతులోంచి అవి అచ్చు గుద్దేయగలవు! వాటిల్లో ప్రధానమైనవి మైనాలు. మైనాల్లో కూడా ముఖ్యంగా ‘కామన్ హిల్’ జాతి మైనాలు మనుషుల స్వర స్థాయులలోని హెచ్చు తగ్గుల్ని పట్టేసి మాట్లాడేయగలవు. స్పష్టత కూడా ఏం తగ్గదు! దక్షిణాసియా, ఆగ్నేయాసియా కొండ ప్రాంతాలు ఈ మైనాల జన్మస్థలాలు. అండమాన్, నికోబార్ దీవులు, శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, దక్షిణ చైనా, మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లో మైనాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇండియాలో మరీ అంత విస్తారంగా కనిపించవు కానీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రపక్షి ఈ‘మైనా’నే. ఇంకా.. స్టార్లింగ్ పక్షులు (ఐరోపా); కాకి జాతిలోని – కోర్విడ్స్, ఆవెన్స్, మేగ్పీస్ (ఆస్ట్రేలియా); జేస్ (బ్రిటన్, కెనడా); లైర్బర్డ్స్, మాకింగ్ బర్డ్స్ (అమెరికా, మెక్సికో); టూయ్ (తేనె భక్షించే న్యూజీలండ్ పక్షి), కానరీ పక్షులు (స్పెయిన్).. మనిషి మాటలనే కాదు.. అలారాలు, ఫోన్ రింగ్టోన్లు, వివిధ రకాల యంత్రాల ధ్వనులను వాటికవి, మంచి మూడ్‌లో చక్కగా మిమిక్రీ చేస్తాయి! ఇదెలా సాధ్యం?!యునీక్ సిరింగ్స్ అనాటమీమాట్లాడే పక్షుల గొంతులోనూ మానవ స్వరాల్లా గమకాలు పలకటానికి ఉన్న సదుపాయం ఏంటంటే.. వాటి శ్వాసనాళ నిర్మాణంలోని ‘యునీక్ సిరింగ్స్ అనాటమీ’! పక్షులకు పెదవులు, దంతాలు ఉండవు. అవి ఉంటేనే కదా, మనకైనా గొంతులోంచి, నోట్లోంచి ధ్వని వెలువడుతుంది. అయితే ఈ మాట్లాడే పక్షుల్లో పెదవులు, దంతాలకు బదులుగా, వాటి శ్వాసనాళం దిగువన ఉండే ‘సిరింక్స్’ అనే స్వరనాళాలు మాట్లాడేందుకు వీలు కల్పిస్తాయి. మనుషులకు స్వరపేటిక ఎలాగో, పక్షులకు స్వరనాళాలు అలాగ! మాటలకు అవసరమైన స్వర తంతువులు మనుషుల్లో వారి ‘లారింక్స్’ (స్వరపేటిక)లో ఉంటే, పక్షుల్లో వాటి ‘సిరింక్స్’ (స్వర నాళాలు)లో ఉంటాయి. మనుషుల స్వర పేటికలోని స్వర తంతువుల మాదిరిగా కాకుండా, పక్షులు శబ్దాలను సృష్టించటానికి తమ ‘సిరింక్స్’లోని మృదువైన కండరాలను నియంత్రించుకుంటాయి. ప్రకృతి ప్రసాదించిన ఈ ఏర్పాటు – పక్షులు భిన్నమైన శరీర నిర్మాణం కలిగి ఉన్నప్పటికీ – శక్తిమంతమైన, వైవిధ్యభరితమైన గాత్రధ్వనులను జనియింపజేయటానికి వీలు కల్పిస్తుంది. వేగవంతమైన పిచ్ స్విచింగ్ఉత్తర అమెరికాలో ‘కార్డినల్’ అనే పక్షి, మాటల్లో మాస్టర్స్ డిగ్రీ చేసిందా అనిపిస్తుంది! చిలుకల జాతికి ‘చెందని’ ఈ పక్షిలోని సిరింక్స్.. వేగవంతమైన, సంక్లిష్టమైన శబ్దాలను ఉత్పత్తి చేయటానికి వీలు కల్పిస్తుంది. పియానో స్వరాల కంటే కూడా ఎక్కువగా, సెకనులో పదో వంతు లోపు ఈ పక్షులు తమ గొంతును సజావుగా మార్చుకోగలవని పక్షి శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వీటికున్న ఆకట్టుకునే స్వర నియంత్రణ – అధునాతన ధ్వని ఉత్పత్తి సామర్థ్యాలను ప్రదర్శించేలా – వాటిని అప్పటికప్పుడు శబ్దాలను ఉత్పత్తి చేయటానికి అనుమతిస్తుంది. నాలుకలోనే నైపుణ్యమంతా!చిలుకలు తమ నాలుకలను ముందుకు, వెనుకకు కదిలించడం ద్వారా; ముక్కును తెరిచి, మూయటం ద్వారా శబ్దాలను మలచుకుంటాయి. మనుషుల మాటల్ని కూడా ఇదే విధంగా అనుకరిస్తాయి. చిలుకలకు పెదవులు లేనప్పటికీ భాషలోని అచ్చులను, హల్లులను పలకటానికి మానవులు చేసే విధంగా అవి తమ నాలుకలను ప్రత్యేక నైపుణ్యంతో ఉపయోగిస్తాయి. ఈ నైపుణ్యం చిలుకలు, ఇతర మాట్లాడే పక్షులలో అసాధారణమైన స్పష్టతకు, మనుషుల్ని అనుకరించటానికి సహాయ పడుతుంది. చిలుకలు, మరికొన్ని జాతుల పక్షులు మాత్రమే మనుషుల మాటల్ని అనుకరించటానికి కారణం.. మిగతా పక్షుల్లో ఈ విధమైన స్వర నిర్మాణాలు లేకపోవటమే. కలుపుగోలు పలుకులుచిలుకల్లో ప్రకృతి సిద్ధమైన ‘సంభాషణ స్వభావం’ ఉంటుంది. అడవిలో అవి తమ జాతి గుంపులతో బలమైన బంధాలను ఏర్పచుకుంటాయి. ఆ సహజ స్వభావం వల్లనే పంజరాలలో బందీలుగా ఉన్న చిలుకలు కూడా తమ మానవ సహచరులతో బంధాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తాయి. మాటా మాటా కలుపుతాయి. మనుషుల మాటల్నే తిరిగి పలుకుతాయి. అన్నవాహిక హెల్ప్ చేస్తుందిమనిషి భాష మాట్లాడటం పక్షులకు అంత తేలికైన పనేమీ కాదు. భాషలో మనకు అచ్చులు, ఉచ్చారణ విధానాలు ఉంటాయి. కొన్నిసార్లు పలకటానికి కొరుకుడు పడని ఉచ్చారణలూ ఉంటాయి. అయితే ఈ ఇబ్బందిని చిలుకలు తమ స్వర మార్గాన్ని మార్చుకోవటం ద్వారా పలుకులో స్పష్టతను సాధిస్తాయి. చిలుకల్లో పెదవులు లేని లోటును తీర్చి, ఉచ్చారణ అడ్డంకులను తొలగించేందుకు, శబ్దాన్ని నోటి ద్వారా బయటికి పంపించటానికి వాటి అన్నవాహిక తోడ్పడుతుంది. అచ్చుల కోసం, అవి తమ నాలుకలను కదిలిస్తాయి. కచ్చితమైన శబ్దాలను బయల్పరచటానికి తమ ముక్కును సర్దుబాటు చేసుకుంటాయి. పాటల పక్షులకు భిన్నంగా..!చిలుకల మెదడులోని నాడీ మండల విద్యుత్ ప్రవాహాలు ప్రత్యేకమైనవిగా ఉన్నందు వల్ల అవి మానవ భాషను వినగలుగుతాయి. గుర్తుపెట్టుకోగలుగుతాయి. సంక్లిష్టమైన ధ్వనులను సైతం ఉత్పత్తి చేయగలుగుతాయి. ఈ సామర్థ్యాలన్నిటినీ అనుసంధానించే వ్యవస్థ చిలుకల మెదడులో ఉంటుంది. పాటలు పాడే పక్షుల్లో ఉండే ఒకే మాదిరి వ్యవస్థ కాకుండా, చిలుకలకు అదనపు సర్క్యూట్ ఉంటుంది. ఇది వాటి జాతుల పిలుపులను, మానవ జాతుల పిలుపులను నేర్చుకోవడానికి వాటికి అదనపు సౌలభ్యాన్ని ఇస్తుంది. ఈ విధమైన ప్రత్యేక శరీర నిర్మాణంతో చిలుకలు పలకగలవు. అరవగలవు. తిట్టగలవు. ఇక్కడి మాటలు అక్కడ చెప్పనూ గలవు!శిక్షణ ఇస్తే మరింత జ్ఞానం ముఖ్యంగా, శిక్షణ తర్వాత చిలుకలు సందర్భోచితంగా, అర్థవంతంగా పదాలను ఉపయోగించటాన్ని అధ్యయన వేత్తలు గమనించారు. రాత్రి పడుకునే ముందు ‘గుడ్ నైట్’ చెప్పడం, తినేందుకు ఏదైనా పెట్టమని అడగడం, లేదా వస్తువులను లెక్కించడం, వస్తువులను తీసుకురావటం వంటి పనులను చేసే సామర్థ్యం చిలుకల్లో ఉందని శాస్త్రవేత్తలు ఏనాడో గుర్తించిన విషయమే. చక్కటి శిక్షణ పొందిన ఆఫ్రికన్ బూడిద రంగు చిలుక ‘అలెక్స్’, తన రంగు గురించి అడిగినప్పుడు శిక్షకులు నివ్వెర పోయారు. తనకు తానుగా ప్రశ్న వేసిన తొలి చిలుకగా అలెక్స్ చరిత్రలో నిలిచిపోయింది. మహా జ్ఞానవతి అలెక్స్!ఫొటోలో కనిపిస్తున్న బూడిద రంగు చిలుక పేరే.. ‘అలెక్స్’. ఈ మహాజ్ఞాని పక్కన ఉన్నది జంతుజ్ఞాన శాస్త్రవేత్త ఐరీన్ పెప్పర్బర్గ్. అలెక్స్‌కు ఏడాది వయసున్నప్పుడు ఐరీనే ఒక దుకాణంలో దానిని కొనుక్కుని అలెక్స్ అని పేరు పెట్టారు. 31 ఏళ్ల వయసులో అలెక్స్ 2007 సెప్టెంబర్ 6న తన పంజరంలోనే విగతజీవిగా కనిపించింది. ఐరీన్ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పంజరాలలో ఉండే చిలుకల ఆయుర్దాయం 45 సంవత్సరాలు. (అడవి చిలుకలు అడవిలో ఏదో ఒక ప్రమాదంతో ఇంకా ముందుగానే చనిపోతాయి).‘‘నువ్వంటే నాకిష్టం!’’అలెక్స్ అలా హఠాత్తుగా ఎందుకు చనిపోయిందో ఐరీన్‌కు అంతుచిక్కలేదు. ఆ ముందు రోజు రాత్రి అలెక్స్ పలికిన చివరి పలుకులు : యు బీ గుడ్ (నువ్వు బాగున్నావు), ఐ లవ్ యు (నువ్వంటే నాకిష్టం), సీ యూ టుమారో (రేపు కలుద్దాం)... అనేవి. ల్యాబ్‌లో పంజరం ఉండేది. ఐరీన్ ఆ ల్యాబ్‌లో పని చేస్తుండేవారు. ల్యాబ్ నుండి ఐరీన్ ఇంటికి వెళ్లే ప్రతి రాత్రీ ఆ చిలుక ఆమెకు ఈ మూడు మాటలతోనే వీడ్కోలు చెబుతుండేది. శవ పరీక్షలో చిలుక మరణానికి స్పష్టమైన కారణాలు బయపడలేదు. ఆ తర్వాతి పరీక్షల్లో ‘గుండెపోటు’ అని నిర్థారణ అయింది.విసిగిస్తే ‘అంతేగా, అంతేగా..’ దాదాపుగా 30 ఏళ్ల పాటు అలెక్స్ సహజజ్ఞానంపై పరిశోధనలు జరిపారు ఐరీన్. అలెక్స్ తెలివి తేటలకు అనేక పరీక్షలు కూడా పెట్టారు. అలెక్స్ 80 శాతం పరీక్షల్లోనెగ్గింది. ఒకసారి అలెక్స్ ముందు రకరకాల రంగుల బ్లాక్స్ (ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోనివి కావు) ఉంచి, రెండు ఎరుపు బ్లాకులు, మూడు నీలం బ్లాకులు, నాలుగు ఆకుపచ్చ బ్లాకులు) ఉంచి, ‘‘ఏ రంగు బ్లాకులు మూడు ఉన్నాయి?’’ అని ఐరీన్ ఆ చిలుకను అడిగారు. అలెక్స్ తప్పకుండా నీలం రంగు బ్లాకులు అని చెబుతుందనే అనుకున్నారు ఐరీన్. అయితే అప్పటికే నానా రకాల ప్రశ్నలతో విసుగెత్తిపోయిన అలెక్స్.. ‘‘ఫైవ్’’ అని చెప్పింది. ఐరీన్ వదలకుండా, ‘‘అవునా? ఆ ఫైవ్ ఏ రంగులో ఉన్నాయి?’’ అని మళ్లీ అడిగారు. సమాధానంగా అలెక్స్, ‘‘ఏవీ లేవు’’ అని చెప్పింది. దాన్ని బట్టి చిలకలు కూడా, అడిగిందే అడుగుతుంటే మనుషుల్లాగే ప్రవర్తిస్తాయని, కావాలని తప్పుగా సమాధానం చెబుతాయని ఐరీన్ గుర్తించారు. ‘‘నేను ఏ రంగులో ఉన్నాను?’’అలెక్స్‌కు 100 కంటే ఎక్కువ పదాలు తెలుసు. ఒకసారి తనను తను అద్దంలోకి చూస్తూ, ‘‘నేను ఏ రంగులో ఉన్నాను?’’ అని అలెక్స్ అడగటం ఐరీన్‌ను నివ్వెరపరిచింది. ‘నువ్వు బూడిద రంగు (గ్రే కలర్)లో ఉంటావు అని ఆరుసార్లు చెప్పగానే ఆ రంగు అలెక్స్‌కు గుర్తుండిపోయింది. అదలా ఉంచితే, తనకు తనుగా ఒక ప్రశ్న అడిగిన మానవేతర జీవిగా అలెక్స్ నిలిచిపోయింది! (సంకేత భాషను ఉపయోగించటంలో శిక్షణ పొందిన వానరాలు సైతం ఇప్పటి వరకు వాటికై అవి ఒక్క ప్రశ్ననూ అడగలేకపోయాయి). అలెక్స్ చిలుక మానవ భాషనే కాదు, వాక్య నిర్మాణాన్ని కూడా అర్థం చేసుకోగలిగిందని ఐరీన్ వెల్లడించారు. (చదవండి: Ukrainian Inventor Valentyn Frechka: రాలిపోయిన పండుటాకులతో కాగితం తయారీ..) -
రాలిపోయిన పండుటాకులతో కాగితం తయారీ..
ప్రతి శరదృతువులో పాదాల కింద చిందరవందరగా చూసే ఆ పసుపు రంగు ఆకులను చెత్తగా కాకుండా, భూమి భవిష్యత్తును రక్షించే అద్భుత ఆయుధాలుగా భావించాడు అతడు. అతడే, ఇరవై మూడేళ్ల యువ శాస్త్రవేత్త వాలెంటిన్ ఫ్రెచ్కా(Valentyn Frechka). ఉక్రెయిన్‌కు చెందిన ఒక పర్యావరణ ప్రేమికుడు!ప్రపంచవ్యాప్తంగా కాగితం ఉత్పత్తి కోసం కోట్లాది చెట్లను నరికేస్తున్నారు. ఈ ప్రక్రియ వలన అటవీ నాశనం, వాతావరణ మార్పులు, నీటి కొరత వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఇది గమనించిన వాలెంటిన్ ఫ్రెచ్కా, ‘చెట్లను కాపాడే పేపర్ తయారు చేద్దాం!’ అనే ఆలోచనతో ముందుకు వచ్చాడు. చెట్లను నరికి కాకుండా, కేవలం పడిపోయిన ఆకుల నుంచే కాగితం తయారు చేసే ప్రత్యేకమైన పద్ధతిని కనుగొన్నాడు. ఈ విధానం ద్వారా ఒక టన్ను సెల్యులోజ్ తయారు చేయడానికి 17 చెట్లను కాపాడవచ్చని చెప్పినప్పుడు, ఇది ఎంత పచ్చదనాన్ని బతికిస్తోందో ఊహించండి! 2021లో ‘రీలీఫ్ పేపర్’ అనే సంస్థను స్థాపించి, నగరాల్లోని మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి వాడిపోయిన, ఎండిపోయిన ఆకులను సేకరించి, వాటితో బయోడీగ్రేడబుల్, రీసైకిలబుల్ పేపర్ ఉత్పత్తి చేయటం ప్రారంభించాడు. అంతేకాదు, సల్ఫేట్, సల్ఫైట్, క్లోరిన్ వంటి రసాయనాలు ఉపయోగించకుండా, కేవలం ఆవిరి, ఒత్తిడి, మెకానికల్ గ్రైండింగ్ పద్ధతితో ఆకుల నారలను వేరు చేసి పేపర్‌గా మలుస్తున్నాడు. ఈ పేపర్‌తో బ్యాగులు, బాక్సులు, కార్డ్‌బోర్డులు వంటి ప్యాకేజింగ్ వస్తువులు తయారు చేస్తున్నాడు. యుద్ధం మధ్యలో కూడాచిన్న గ్రామమైన సొకిర్నిట్సియాలో పుట్టిన వాలెంటిన్ , చిన్నప్పటి నుంచే ప్రకృతిపై ఆసక్తి ఎక్కువ. అందుకే, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం సమయంలో కూడా తన సంస్థ నష్టాల్లో ఉన్నప్పటికీ ఉత్పత్తి ఆగలేదు. ఫ్రాన్స్‌కి వెళ్లి అక్కడ నుంచే తన కంపెనీని విస్తరించాడు. ఇప్పుడు అతని సంస్థ యూరప్ అంతటా పలు బ్రాండ్లకు ఎకోఫ్రెండ్లీ ప్యాకేజింగ్ సరఫరా చేస్తోంది. ఇందుకు గాను వాలెంటిన్ ఫ్రెచ్కా యూరోపియన్ ఇన్వెంటర్ అవార్డు 2024లో ‘యంగ్ ఇన్వెంటర్స్ ప్రైజ్’ ఫైనలిస్ట్‌గా ఎంపికయ్యాడు. వాలెంటిన్ ఇప్పుడు ఫ్రూట్ బయోవేస్ట్, అనగా అరటి, అనాస, యుకా వంటి ఆకులను కూడా పేపర్‌గా మార్చే పరిశోధనలో ఉన్నాడు. ‘ప్రతి ఆకు ఒక అవకాశమైతే, ప్రతి ఆవిష్కరణ అవనికి ఆశగా మారాలి’ అనే అతని మాటలు ఇప్పుడు ప్రపంచానికి పాఠంగా, కాగితం రూపంలో భూమిని రక్షిస్తున్నాయి. (చదవండి: 91 ఏళ్ల వ్యక్తి 12 గంటలు షిఫ్ట్! హీరో మాధవన్ సైతం..) -
ట్రాన్స్‌లేటర్ పెన్.. జేబులోనే థియేటర్!
ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టం అనిపిస్తుందా? ఇక భయపడాల్సిన పని లేదు! ఎందుకంటే, ఈ ‘హిలిటాండ్ స్మార్ట్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేటర్ పెన్’ మీకు కొత్త భాషలు నేర్పే తెలివైన గురువులా పనిచేస్తుంది. ఈ స్మార్ట్ పెన్ వాక్యాలు, పదాలను స్కాన్ చేసి వెంటనే మీకు కావాల్సిన భాషలోకి అనువదిస్తుంది. చదువులో, ప్రయాణంలో లేదా పరభాషా మిత్రులతో మాట్లాడే సమయంలోనూ ఇలా ఎక్కడైనా సరే దీని సహాయం చాలాబాగా ఉపయోగపడుతుంది. చిన్నదిగా, తేలికగా ఉండే ఈ పరికరాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లడం సులభం. లోపలే డిజిటల్ నిఘంటువు ఉండటంతో తెలియని పదాలకు అర్థాన్ని వెంటనే చూపిస్తుంది. బటన్లు, టచ్ రెండు విధాలా సులభంగా ఉపయోగించవచ్చు. దీర్ఘకాలం పనిచేసే బ్యాటరీతో ఎప్పుడూ రెడీగా ఉండే ఈ పెన్ ధర కేవలం రూ. 3,160 మాత్రమే!జేబులోనే థియేటర్!సినిమా మూడ్ ఎక్కడైనా, ఎప్పుడైనా! కావాలంటే మీ దగ్గర ‘కోడాక్ అల్ట్రా మినీ ప్రొజెక్టర్’ తప్పక ఉండాల్సిందే! చిన్న సైజ్‌లో ఉన్నా, ఇది పెద్ద మ్యాజిక్ చేస్తుంది. ఈ నలుపు రంగు ఎల్ఈడీ ప్రొజెక్టర్ వంద అంగుళాల వరకు స్పష్టమైన దృశ్యాన్ని చూపిస్తుంది. చిన్నది, తేలికైనది, చేతిలో సరిపోయేంత సైజ్‌లో ఉండే ఈ పరికరం లోపలే స్పీకర్ కలిగి ఉంటుంది. ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్ దేనితోనైనా సులభంగా కనెక్ట్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. చీకటి గదిలో చూస్తే రంగులు మరింత మెరిసిపోతాయి, చిత్రం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. సినిమాలు, వీడియోలు, ఫోటోలు ఏదైనా సరే అధిక నాణ్యతతో మీ ముందే ప్రత్యక్షం అవుతాయి. ధర రూ. 30,863 మాత్రమే!ఖుషీ ఖుషీగా.. కుషన్! లాంగ్ ట్రావెల్ అంటే మెడ నొప్పి, వెన్నునొప్పి గ్యారంటీ! కాని, ఇక ఆ బాధలకు ఎండ్! ది స్లీప్ కంపెనీ ట్రావెల్ కాంబో! ఈ సెట్లో నెక్ కుషన్, సీటు కుషన్ రెండూ లభిస్తాయి. ఇందులోని స్మార్ట్ నెక్ కుషన్ మెత్తగా మసాజ్ చేస్తూ, మెడ నొప్పిని తగ్గిస్తుంది. హీట్ థెరపీ ఉండటంతో కండరాలు రిలాక్స్ అవుతాయి, రక్తప్రసరణ మెరుగుపడుతుంది. స్మార్ట్ సీట్ కుషన్ మీ వెన్నునొప్పికి సౌకర్యవంతమైన రిలీఫ్ ఇస్తుంది. జపాన్ స్మార్ట్‌గ్రిడ్ టెక్నాలజీతో తయారైన ఈ కుషన్ మీ శరీరాకారానికి సరిపడేలా ఒదిగి, ఒత్తిడిని తగ్గిస్తుంది. గాలి సరిగా ప్రసరిస్తూ చల్లగా, సౌకర్యంగా ఉంచుతుంది. ఇంట్లోనైనా, విమానంలోనైనా, కారు ప్రయాణంలోనైనా ఎక్కడైనా ఇది పర్ఫెక్ట్ ట్రావెల్ పార్టనర్! తేలికైన డిజైన్‌తో తీసుకెళ్లడం కూడా చాలా ఈజీ. ధర రూ. 4,198 మాత్రమే! -
అమెరికా లెక్క
నారప్పకు దిక్కుతోచడం లేదు. ఎప్పుడు చూసినా ఏదో లోకంలో ఉన్నట్లు ఉంటున్నాడు.పని చేసేటప్పుడు, తినేటప్పుడు, పదిమందిలో కూర్చొని ఉన్నప్పుడు.. ఒక్కటేమిటి? నిద్రపోయేటప్పుడు తప్ప ఎప్పుడు చూసినా పరధ్యానంలోనే ఉంటున్నాడు. నారప్ప ఇలా ఉండబట్టి చాలా రోజులవుతోంది. అలాగని అలవిగాని కష్టాలేమైనా ఉన్నాయా అంటే అదీ లేదు. కడుపు నిండా తినడానికి, కంటి నిండా నిద్రపోవడానికి కొదవలేని బతుకు. పిల్లల్ని బాగా చదివించాడు. మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశాడు. మనవలు, మనవరాళ్లను చూశాడు. ఆస్తి దండిగా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే పెదరాయుడులా దర్జాగా కాలుమీద కాలేసుకొని బతకొచ్చు. అయినా, నారప్పలో ఏదో దిగులు మొదలైంది. చిన్నాపెద్దా లేకుండా ఊళ్లోవాళ్లంతా నారప్పను ‘నక్కజిత్తుల నారప్ప’అంటుంటారు. పైసా లాభం లేకుంటే ఏ పనీ చేయడనీ, పది పైసలు మిగులుతుందంటే ఏదైనా సరే చేస్తాడని ఆ పేరు పెట్టారు. ఇది నారప్పకూ తెలుసు. అయినా, తెలియనట్లే ఉంటాడు. ఎవరైనా మొఖమ్మీదే అన్నా పట్టించుకోడు. నవ్వుతూ తప్పించుకుంటాడు. నారప్ప ఇలా ఉండడం వెనక చాలా పెద్ద కథే ఉంది. నట్టనడి ఊళ్లో ముప్పై రెండు దూలాలు మోసే రాతిమిద్దెలో పుట్టాడు నారప్ప. ముందు అన్న బసప్ప, వెనక చెల్లెలు భీమక్క. అమ్మ వన్నూరమ్మ, నాన్న పుల్లప్ప. నారప్ప పుట్టేనాటికే వాళ్లకు వందెకరాల వరకు పొలం, వెయ్యికి పైగా జీవాలు ఉండేవి. ఆస్తి దండిగ ఉండడంతోపాటు పుల్లప్ప సర్పంచ్ కావడంతో ఆ ఇల్లు వచ్చేపోయే వాళ్లతో కళకళలాడేది. ఆ ఇంటికి ఎప్పుడు పోయినా తిండికి కొదవుండదని పేరు తెచ్చింది.కాలం చాలా కఠినమైనది. జీవితాలను తిప్పేస్తుంది. నారప్ప జీవితమూ అలాగే తిరిగింది. రెండోసారి సర్పంచ్ అయ్యాక పుల్లప్ప దారి తప్పాడు. పేకాటకు, బయటి సంబంధాలకు మరిగాడు. ఆస్తులు తరగడం, అప్పులు పెరగడం మొదలైంది. బసప్ప, నారప్ప చదువు ఊళ్లో బడితోనే ముగిసింది. ఇంటి వద్దకు జనాలు రావడం తగ్గింది. భర్త తిరుగుళ్లు చూసి వన్నూరమ్మ– ఆస్తి కరిగిపోక ముందే కూతురికి పెళ్లి చేయాలని పట్టబట్టింది. చివరికి ఊళ్లోనే ఉండే తన అన్న కదిరప్ప కొడుకు సోమప్పకు ఇచ్చి పెళ్లి జరిపించింది. ఆ తర్వాత కొన్ని రోజులకే కాలంచేసింది.ఆలోగా పొలం ఇరవై ఎకరాలకు చేరుకుంది. గొర్లు, గొడ్లు ఊరు దాటాయి. పుల్లప్ప పదవీకాలం కూడా పూర్తయింది. మూడోసారీ సీట్లో కూర్చుందామని ఆశపడినా ఊళ్లోవాళ్లు ఒప్పుకోలేదు. ఆ కోపంతోనో బాధతోనో ఇల్లు విడిచి బయటికి రావడమే మానేశాడు. కొడుకులిద్దరికీ పెళ్లిళ్లు చేశాక ఊరు విడిచి, కడప జ్యోతిక్షేత్రంలో కాశినాయన ఆశ్రమం జేరి అక్కడే కాలం చేశాడు.పుల్లప్ప పోయిన తర్వాత సర్పంచ్ సీట్లో కదిరప్ప కూర్చున్నాడు. దాని కోసమే తన కొడుక్కి చెల్లెలు కూతుర్ని చేసుకున్నాడనే సంగతి తండ్రీకొడుకులు చాటుగా మాట్లాడుకుంటుండగా విన్న నారప్పకు మాత్రమే తెలుసు. నాన్న, తమ కుటుంబం అనుభవించిన దర్జా, వైభోగం కాలంతోపాటు దూరమైనా నారప్ప మనసులోంచి మాత్రం పోలేదు. అయితే, పరిస్థితులకు తొందరగానే అలవాటు పడ్డాడు. లౌక్యం నేర్చుకున్నాడు. తినీతినక కూడబెట్టడం, వడ్డీలకివ్వడం మొదలుపెట్టాడు. ఆ అతితెలివితేటలు, లౌక్యం చూసే ‘నక్కజిత్తుల నారప్ప’ అని పేరు పెట్టారు.నారప్ప భార్య ఎర్రమ్మ అమాయకురాలు. భర్త మాట దాటదు. కొడుకు రవి బాగా చదువుకొని అమెరికాలో ఉద్యోగం తెచ్చుకున్నాడు. అక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకొని, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి స్థిరపడ్డాడు. తన మాట వినకుండా తెల్లోళ్ల పిల్లను చేసుకున్నాడని కొడుకు మీద కోపమొచ్చినా, కావల్సినంత డబ్బు పంపుతుండడంతో ఏమీ అనలేకపోయాడు నారప్ప. కొడుకు పంపే డబ్బుతో కూతురిని తహసీల్దారుకిచ్చి పెళ్లి చేశాడు. ఊళ్లో డూప్లెక్స్ హౌస్ కట్టించాడు. కూడేరులో జాగాలు, అనంతపురం, హైదరాబాద్, బెంగళూరులో ఇళ్లు కొన్నాడు. నారప్ప బ్యాంకు అకౌంట్లన్నీ లక్షలతో నిండిపోయాయి. అదిగో అప్పటి నుంచే నారప్పకు మనసులో ఏదో దిగులు మొదలైంది. అదేంటో, దాన్ని ఎలా తీర్సుకోవాలో నారప్పకు తెలిసేలా చేసినవి ఆ రెండు సంఘటనలే!ఆ రోజు ఆదివారం. పొద్దున్నే బైక్ మీద తోటకు వెళ్లి, నిమ్మ చెట్లకు డ్రిప్పుతో నీళ్లు విడిచి ఇంటికి బయల్దేరాడు నారప్ప. ఊరికి ఆనుకొని వచ్చేసరికి ఎల్లప్ప గొర్రెల మంద ఎదురైంది. అసలే అది ఇరుకు దారి. పైగా ముందురోజు పడిన వానకు బురద ఉండడంతో బైక్ అదుపు తప్పింది. సర్రున జారి ఒక గొర్రెను బలంగా ఢీకొట్టింది. అది గట్టిగా అరుస్తూ వెనక్కిపడింది. బైక్ కూడా కింద పడుతుంటే ఒడుపుగా అదుపు చేశాడు. మంద వెనకాలే వస్తున్న ఎర్రిసామి అది చూసి ‘‘సచ్చెరా గొర్రె..’’ అని అరుస్తూ గబగబా గొర్రె దగ్గరకు వచ్చాడు. అదృష్టం కొద్ది గొర్రె బతికే ఉంది. అయితే, పొట్ట, బర్రెంకల మీద టైరు రాసుకొని పోవడంతో రక్తం కారుతోంది. అదాటున కింద పడడంతో తిరిగి పైకి లేవలేకపోతోంది. ఎర్రిస్వామికి కళ్ల నుంచి నీళ్లు జలజలా రాలాయి. వెనక్కి తిరిగి నారప్పను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం మొదలుపెట్టాడు. ఆ అరుపులు చెవినబడి పరుగెత్తుకుంటూ వచ్చాడు ఎల్లప్ప. గొర్రెను పట్టుకొని పైకి లేపడానికి ప్రయత్నిస్తూనే కొడుకుతోపాటు తిట్లు అందుకున్నాడు. ఇద్దరూ కలసి నారప్పను నోరు తెరవనీయలేదు. ఈ గోలకు బెదిరి మిగిలిన గొర్రెలన్నీ దూరంగా నిలబడి వీళ్లనే చూస్తున్నాయి. జనం గుమిగూడారు. అందరూ కలసి ఎర్రిసామికి, ఎల్లప్పకు సర్దిచెప్పారు. ఈలోగా కిందపడిన గొర్రె లేచి నడవడంతో తిట్లు ముగించి వెనక్కి కదిలారు అబ్బాకొడుకులు. ఇంటికొచ్చి మంచంమీద కూలబడ్డాడు నారప్ప. చెవుల్లో తిట్లు మోగుతున్నాయి. చుట్టూ చేరినవాళ్లు నవ్వుకోవడం కళ్లలో మెదులుతోంది. కోపం, అవమానం కలసి ఏంచేయాలో తెలియక అలాగే ఉండిపోయాడు. మధ్యాహ్నం అన్నానికీ లేవలేదు. విషయం తెలిసి చీకటి పడుతుండగా వచ్చాడు చెన్నప్ప.‘‘న్నో.. అప్పుడప్పుడూ ఇట్టాంటివి జరుగుతాంటాయి.. మామూలే! అయన్నీ పట్టిచ్చుకుంటామా? ఎల్లప్ప నీకు మేనమామ వరస. ఎర్రిస్వామి మేనల్లుడు. మనోళ్లు ఏదో పొరపాటున మాట జారినారని అనుకోన్నా. లే.. అట్లా కూడేరు దాకా పోయొజ్జాం’’ అంటూ నారప్పను ఓదార్చాడు. ఇద్దరూ బైక్ మీద కూడేరుకు చేరుకునే సరికి ఏడయ్యింది. వైన్‌షాప్‌లో మందు, పక్కనే బజ్జీలు, ఉడకబెట్టిన చెనిక్కాయ విత్తనాలు తీసుకొని ఊరి చివర తోటలో కూర్చున్నారిద్దరూ. అప్పటిదాకా మౌనంగా ఉన్న నారప్ప... గొంతులోకి మందుపోగానే నోరు తెరిచాడు. ‘‘ఊరంతా సూచ్చాండంగా వోళ్లుతిట్నారు సెన్నప్పా. రేపట్నుంచి ఊళ్లో తలెత్తుకుని ఎట్ట తిరగల్ల? మానం, పానం రెండూ పోయినట్లు ఉండ్లా్య..’’ అంటూ కాసేపాగి ‘‘వోళ్లను ఏదో ఒకటి జేయాల.. ల్యాకపోతే అవమానంతో సచ్చేలా ఉండా..’’ అంటూ కళ్లనిండా నీళ్లు నింపుకున్నాడు. చెన్నప్పకు ఆ రోజెందుకో కొత్తగా కనిపించాడు నారప్ప. ‘ఎవరెన్ని అన్యా తుడ్సుకొని పోయే నారప్పన్న ఈ పొద్దెందుకు ఇట్టా అంటన్నాడు’ అని మనసులో అనుకుంటున్నాడు.‘‘సెప్పు సెన్నప్పా.. వోళ్లను ఏమిజెయ్యాల?’’ చెన్నప్పను కుదుపుతూ మళ్లీ అడిగాడు నారప్ప. ‘‘ఏంజేయాల్సిన పన్లేదులేన్నా.. రెండ్రోజులుంటే అంతా మర్సిపోతారు’’ చెప్పాడు చెన్నప్ప. వినలేదు నారప్ప. అవమానం అతన్ని వెనక్కి తగ్గనీయడం లేదు.‘‘కూడేరు స్టేషన్లో నా బామ్మర్ది ఉండాడు. వానికి సెప్పి ఎస్ఐతో మాట్లాడిజ్జాం. అంతో ఇంతో లెక్క కొడితే వాళ్లే స్టేషన్‌కు తీస్కపోయి అబ్బాకొడుకులకు మర్యాద జేస్తారు’’అన్నాడు చెన్నప్ప. ఒప్పుకున్నాడు నారప్ప. నేరుగా ఇద్దరూ స్టేషన్‌కు వెళ్లారు. చెన్నప్ప.. బామ్మర్దికి విషయం చెప్పడంతో లోపలికి వెళ్లి ఎస్ఐతో మాట్లాడాడు. బయటికొచ్చి చెన్నప్ప చెవిలో ఏదో గొణిగినాడు. వెంటనే నారప్ప దగ్గరికి వచ్చిన చెన్నప్ప ‘‘న్నో.. ఎస్ఐ ఇరవై వేలు అడుగుతనాడంటన్నా..’’ అన్నాడు.ఏమీ ఆలోచించలేదు నారప్ప. జేబులోంచి డబ్బు బయటికి తీశాడు. ‘‘లెక్క ఐదు వేలు ఎక్కువనే ఇచ్చనాగాని.. రెండ్రోజులు దాంకా ఇడ్సకండా తన్నమను’’ అన్నాడు పళ్లు కొరుకుతూ.చెన్నప్పకు అది కలో నిజమో తెలియడం లేదు. ఎప్పుడైనా అవసరానికి డబ్బడిగితే ఇవ్వడానికి ఎన్నో సాకులు చెప్పే నారప్పన్న ఇప్పుడు అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడం చూసి నోట మాట రాలేదు.మరునాడు తెల్లారే సరికి ఊరంతా ఒకటే గుసగుసలు. ఎల్లప్పను, ఎర్రిసామిని అర్ధరాత్రి పోలీసులు తీసుకుపోయారని, నారప్ప కేసు పెట్టించాడని మాట్లాడుకుంటున్నారు. అది తెలియడంతో నారప్ప మనసులో ఏదో తెలియని సంతోషం కలిగింది. ఎప్పుడు లేనిది ఆ రోజు హీరోహోండా పక్కన పెట్టి, రాయల్ ఎన్ఫీల్డ్ మీద తోట వద్దకు బయల్దేరాడు. కూలిపనికి పిలిచే సాకుతో ఊరంతా తిరిగాడు. ఖద్దరు చొక్కా, రామరాజు పంచె కట్టి దర్జాగా తిరుగుతున్న నారప్పను చూసి ఆరోజు ఊరు నోరెళ్లబెట్టింది. ఎల్లప్పను, ఎర్రిసామిని రెండ్రోజుల దాకా వదల్లేదు పోలీసులు. వాళ్లు కొట్టిన దెబ్బలతో నెలపాటు ఇంటి నుంచి బయటికి రాలేదు వాళ్లు. ఇది జరిగాక ఊళ్లో నారప్ప పరపతి అమాంతం పెరిగింది. ‘నక్కజిత్తుల నారప్ప’ అని కాకుండా వరుసలు పెట్టి పిలవడం, గౌరవంగా మాట్లాడడం మొదలైంది. అప్పుకో సప్పుకో జనం ఇంటికి రావడం మొదలు పెట్టారు. అది చూశాక తనలోని దిగులేందో మెల్లగా అర్థమవసాగింది నారప్పకు. అంతేకాదు, తన బలమేదో తెలిసొచ్చింది.అయితే, నారప్ప పూర్తిగా ఒళ్లు విరుచుకొని తిరిగేలా చేసింది మాత్రం తిమ్మప్పతో గొడవే!తండ్రి చేసిన అప్పుల కారణంగా తాము అమ్ముకున్న భూములన్నీ తిరిగి కొనుక్కున్నాడు నారప్ప.. ఒక్క తిమ్మప్ప పొలం తప్ప. అది కూడా తీసుకోవాలని ఒకరిద్దరితో అడిగించినా.. అమ్మడానికి తిమ్మప్ప ఒప్పుకోలేదు. దాంతో ఆ పొలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని పంతం పట్టాడు.పక్కూరికి వెళ్లే రోడ్డు పక్కనే నారప్ప, పెద్దన్న పొలాలు పక్క పక్కనే ఉంటాయి. పెద్దన్న పొలానికి పైభాగంలో తిమ్మప్ప పొలం ఉంది. అందులోకి వెళ్లాలంటే పెద్దన్న పొలం మీదుగా వెళ్లాలి. ఏళ్ల తరబడి ఉండే దారది. అది కాకుండా తిమ్మప్ప పొలానికి వెళ్లాలంటే చుట్టూ నాలుగు కిలోమీటర్లు కొండ వారగా వెళ్లాలి. రాళ్లూరప్పలు కంపచెట్లతో ఉండే ఆ దారి ప్రమాదకరం.ఈ అవకాశాన్ని అనుకూలంగా మార్చుకున్నాడు నారప్ప. పెద్దన్న పొలాన్ని కొనేశాడు. అందులో నుంచి తిమ్మప్ప పొలానికి వెళ్లే దారిని మూసేశాడు.తాను పొలం అమ్మలేదనే కోపంతోనే నారప్ప ఇదంతా చేస్తున్నాడని తిమ్మప్పకు అర్థమైంది. గొడవెందుకని బతిమాలాడు. కాని, నారప్ప చెవికెక్కించుకోలేదు. దాంతో తన మనుషులతో గొడవకు దిగాడు. దీనికి నారప్ప ముందే సిద్ధమై ఉన్నాడు. తన దగ్గర డబ్బు చేరాక చుట్టూ చేరిన దాయాదుల్ని, మనుషుల్ని వెంట బెట్టుకొని అడ్డుకున్నాడు. విషయం తెలిసి పోలీసులు వచ్చారు. నారప్పదే తప్పని అందరికీ తెలుసు. కాని, ఎవరూ నోరు తెరవడం లేదు. ఎందుకంటే నారప్ప దగ్గర కట్టలు కట్టలు మూలిగే డబ్బు.. దానితో అవసరం. అందుకే ఏమీ పట్టనట్టు ఉండిపోయారు. తిమ్మప్పను పోలీసులు స్టేషన్‌కు తీసుకుపోయారు.తిమ్మప్ప కూడా అంతో ఇంతో డబ్బున్నోడే. పైగా వెనక్కి తగ్గే రకం కాదు. కాని, రూపాయి కంటే డాలరుకు బలమెక్కువని ఆయప్పకే కాదు ఊరంతటికీ అర్థమవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు.ఒకటికి రెండుసార్లు తనదే పైచేయి అయ్యే సరికి నారప్పకు పట్టపగ్గాల్లేకుండా పోయాయి. మందిని వెనకేసుకొని తిరగడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు తనను వెక్కిరించిన వాళ్లను, ఎగతాళి చేసినవాళ్ల మీద అవకాశం దొరికినప్పుడల్లా పగ తీర్చుకునేవాడు. ప్రతి తగాదాలో తలదూర్చేవాడు. సర్దిచెప్పే సాకుతో అవసరమైనవి లాక్కునేవాడు. మెల్లగా జనానికి నారప్ప సంగతి అర్థమైంది. ఎదిరించి ఇబ్బంది పడేకంటే, గొడవ పడకుండా బతకడమే మేలని నిర్ణయించుకున్నారు. కాని, విషయాలన్నీ నారప్ప కొడుక్కి, కూతురికి చెప్పడం మొదలుపెట్టారు.పిల్లల హితబోధను పట్టించుకోలేదు నారప్ప. భర్తకు చెప్పే ధైర్యం లేని ఎర్రమ్మ.. జరిగేవన్నీ మౌనంగా చూస్తోంది. ‘మీ నాయిన మాదిరే నువ్వూ తయారయితనావని, ఊరంతా శత్రువుల్ని చేసుకుంటనావ’ని చెప్పాలనుకున్న మాటలు ఆమె నోరు దాటి రాలేదు. అంతేకాదు, భర్త అంతిమ లక్ష్యం, దాని కోసం చేస్తున్న ప్రయత్నాలు తెలిసి భయంతో నిద్రలేని రాత్రుళ్లు గడుపుతోంది. భార్యాపిల్లల ఆందోళనలు, ఆవేదనలు ఏవీ నారప్ప చెవికి, మనసుకు ఎక్కడం లేదు. అతని దృష్టంతా మిగిలిన ఆ ఒక్క కోరిక మీదనే ఉంది. అదీ తీరేదే.. ఆ మహమ్మారి రాకుంటే. ∙∙ ప్రపంచాన్ని భయం గుప్పిట్లో బందీ చేస్తూ కరోనా పుట్టుకొచ్చింది. దేశమంతా లాక్డౌన్ తెచ్చింది. జనం ఇళ్ల నుంచి కదలడం లేదు.ఎవరి వల్ల వచ్చిందో.. ఎలా వచ్చిందో.. నారప్ప కరోనా బారిన పడ్డాడు. లక్షణాలు వారంలోనే తగ్గాయి. అయినా మూడు వారాలు ఇల్లు దాటొద్దని వైద్య సిబ్బంది చెప్పడంతో ఇంటికే పరిమితమయ్యాడు. టీవీ చూడడం, ఫోన్లో మాట్లాడడం ఇదే పని. రెండు వారాలు భారంగా గడిచాయి. ఆ తర్వాత ఉండలేకపోయాడు. భార్యకు తెలియకుండా తోటకు బయల్దేరాడు.సాయంత్రం ఆరు సమయంలో ఊరంతా తెలిసిందా వార్త.. తోట దగ్గరి బావిలో పడి నారప్ప చనిపోయాడని. భర్త ఎంతకీ ఇంటికి రాకపోవడం, కాల్ చేసినా కలవకపోవడంతో వెతుక్కుంటూ వెళ్లిన ఎర్రమ్మకు.. ఊరు దాటాక కొద్ది దూరంలో ఉన్నబావి పక్కన బైక్, బావిలో తేలుతున్న నారప్ప శవం కనిపించింది. ఊళ్లో జనానికి విషయం తెలిసినా ఒక్కరూ రాలేదు. అది కరోనా భయం వల్లో, బతికున్నప్పుడు నారప్ప చేసిన పనుల వల్లో తెలియడం లేదు. చివరకు పోలీసులొచ్చి శవం బయటికి తీశారు.నారప్ప అల్లుడు తాసీల్దారు కావడంతో ఎలాగోలా కర్నూలు నుంచి భార్యను వెంటబెట్టుకుని వచ్చేశాడు. కాని, కొడుకు వచ్చేదానికి ఎలాంటి అవకాశమూ లేదు.పంచనామా పూర్తిచేసి మరుసటి రోజు శవాన్ని అప్పగించారు పోలీసులు. బావిలోంచి తీసేటప్పుడు నారప్ప శరీరం మీద కనిపించిన కముకు దెబ్బల గురించి పోలీసులు ఏమీ చెప్పలేదు. ఎర్రమ్మ కూడా ఏమీ అడగలేదు. అడగబోయిన కూతురు, అల్లుడినీ కూడా ఆపింది.∙∙ బ్యాండు మేళం, డప్పు లేకుండానే నారప్ప అంతిమయాత్ర మొదలైంది. ఎర్రమ్మ ఏడుపు ఊళ్లో జనానికి స్పష్టంగా వినిపిస్తోంది. అంతిమయాత్రలో నడుస్తున్న అల్లుడు, కూతురుతోపాటు కొద్దిమంది బంధువుల్లోనూ ఒకటే ఆలోచన... అసలు నారప్పను కొట్టి చంపి, బావిలో వేసిందెవరు? జైలులో పెట్టించి, కొట్టించినందుకు ఎల్లప్ప, అతని కొడుకు చేసిన పనా? తన పొలానికి దారి లేకుండా చేసినందుకు తిమ్మప్ప కుటుంబం చేసిన పనా? స్నేహితుడని నమ్మితే, వావీవరస చూడకుండా తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించినందుకు చెన్నప్ప చేసిన పనా? ఊళ్లో తాను చేసే తప్పుడు పనులు గురించి కొడుక్కు చెప్పాడనే అక్కసుతో ఓబుళప్ప పొలాన్ని ఆక్రమించుకున్నందుకా? ....వాళ్ల ప్రశ్నలన్నింటికీ అక్కడ సమాధానం తెలిసింది ఇద్దరికే.దారిలో.. సోమప్ప ఇంటి బయట.. కరోనా వచ్చినప్పటి నుంచి బయటికి తీయని టాటా సుమో టైర్లకు అంటిన బురద తాజాగా కనిపిస్తోంది.నారెప్ప పాడె మీద చల్లుతున్న చిల్లరలోని నాణేలు కిందపడి తళతళ మెరుస్తున్నాయి.అవి డాలర్లు... అమెరికా లెక్క. -
అద్దంతో అల్లుకుంటూ!
‘దర్యాప్తు అధికారికి సునిశిత దృష్టి, ప్రతి విషయాన్నీ అధ్యయనం చేసి, బేరీజు వేసే తత్త్వం ఉన్నట్లయితే; నేరస్థలిలోని లభించే, కనిపించే ప్రతి అంశమూ ఒక ఆధారం అవుతుంది’– ఇది ప్రపంచ వ్యాప్తంగా దర్యాప్తు అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు నమ్మే అంశం. సాధారణంగా సంచలనాత్మక ఉదంతాల్లో మాత్రమే పోలీసులు దీన్ని కచ్చితంగా పాటిస్తుంటారు. అయితే, హైదరాబాద్‌లోని బొల్లారం పోలీసులు మాత్రం సాధారణ నేరంగా పరిగణించే గుర్తుతెలియని వాహనాల వల్ల జరిగిన రోడ్డు ప్రమాదం (హిట్ అండ్ రన్) కేసునూ సంచలనాత్మక నేరం స్థాయిలో దర్యాప్తు చేశారు. ఘటనాస్థలిలో దొరికిన ఓ అద్దం (కుడివైపు సైడ్ మిర్రర్) ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. అది 2013లో తొలిరోజైన జనవరి 1, సమయం ఉదయం 6.15 గంటలు. చలితో పాటు పొగమంచూ దట్టంగా ఉంది. బొల్లారం ప్రధాన రహదారిలోని సెయింట్ ఆన్స్ హోమ్‌లో ఉన్నవాళ్లు అప్పుడే నిద్రలేస్తున్నారు. అదే సమయంలో ప్రహరీగోడ పైనుంచి హోమ్ ఆవరణలోకి ఓ ఆకారం పడటం గమనించారు. పరుగున వెళ్లి చూసి మహిళ (65)గా గుర్తించారు. ప్రహరీకి ఆవలి వైపున్న రోడ్డు మీద ఓ యువతి (30) తీవ్రగాయాలతో పడినట్లు కలకలం మొదలైంది. అదే సమయంలో వాకింగ్ చేస్తున్న కొందరు ప్రత్యక్ష సాక్షులు గమనించిన దాని ప్రకారం 6037 నెంబర్ కలిగిన తెల్లరంగు స్విఫ్ట్ కారు శామీర్‌పేట వైపు నుంచి వేగంగా వస్తూ వీరిని ఢీ కొట్టింది. ఇరువురినీ ఆసుపత్రికి తరలించారు. వృద్ధమహిళ అప్పటికే మరణించిందని, యువతికి తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు నిర్ధారించారు. ఈ రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న బొల్లారం పోలీసుస్టేషన్లో సబ్–ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న షేక్ సాదిక్ ఘటనాస్థలికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో బాధితులు నివసించేది స్నేహ ఎన్‌క్లేవ్‌లో అని, మృతి చెందిన వృద్ధురాలు ఆశాదేవిగా, క్షతగాత్రురాలు ఆమె కుమార్తె శ్వేత సింగ్‌గా గుర్తించారు. సంఘటన జరిగిన ప్రధాన రహదారికి క్షుణ్ణంగా పరిశీలించిన సాదిక్ దృష్టి అక్కడ పడున్న ఓ కారు సైడ్ మిర్రర్‌పై పడింది. అది ప్రమాదానికి కారణమైన కారుదే అయి ఉంటుందనే ఉద్దేశంతో స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడిని పట్టుకోవడానికి అదే కీలకాధారం అవుతుందని ఆ సమయంలో ఆయన అనుకోలేదు. అద్దం తీసుకుని నేరుగా పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. అప్పట్లో ఆ ఠాణా ఇన్స్పెక్టర్ పని చేస్తున్న టి.లక్ష్మీనారాయణకు కేసు పూర్వాపరాలు వివరించి, ఆ అద్దాన్ని ఆయన ముందుంచారు. ఆ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఇరువురూ దేశానికి సేవ చేసిన మాజీ సైనికాధికారి కుటుంబానికి చెందిన వారని తెలుసుకున్నారు. ఈ విషాదానికి కారణమైన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకోవాలని నిర్ణయించుకున్న ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ ఆ కేసు దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆశాదేవి, శ్వేతలను ఢీ కొట్టింది స్విఫ్ట్ కారు అని స్థానికులు చెప్పడంతో ముందుగా ఆ మోడల్స్ పైనే దృష్టి పెట్టారు. ప్రమాద సమయంలో ఆ కారు శామీర్‌పేట వైపు నుంచి వస్తోందని నిర్ధారణ కావడంతో ఆ దిశలో ముందుకు వెళ్లారు. ఆర్టీఓ డేటాబేస్ ఆధారంగా హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, ఆదిలాబాద్‌ల్లో నమోదైన తెల్లరంగు స్విఫ్ట్ కార్ల వివరాలు సేకరించారు. అది భారీగా ఉండటంతో విశ్లేషించే పనిలో పడ్డారు.ఆయా వాహనాలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి? ఎవరైనా ఆ రోజు బొల్లారం మీదుగా ప్రయాణించారా? ఇలాంటివి తేల్చడానికి కొంత సమయం తీసుకుంటుందని భావించిన ఇన్స్పెక్టర్ ప్రత్యామ్నాయ ప్రయత్నాలు మొదలెట్టారు. బొల్లారంలో ఉన్న ఓ కార్ మెకానిక్‌ను పిలిపించి ఘటనాస్థలిలో లభించిన అద్దాన్ని చూపించారు. దాన్ని పరిశీలించిన ఆ మెకానిక్ అది స్విఫ్ట్ కారుది కాదని, ఫోర్డ్ కంపెనీకి చెందిన కారుదని నిర్ధారించారు. దీనికి తోడు రెండుగా విడిపోయిన ఆ అద్దం వెనుక భాగంలో ‘22.6.2012’ అని రాసి ఉండటాన్ని అదే సమయంలో ఇన్స్పెక్టర్ గుర్తించారు. ఈ ఆధారాలను బేరీజు వేస్తూ సదరు కారు ఆ తేదీ తరవాత వినియోగదారుడికి డెలివరీ అయి ఉంటుందని అంచనా వేశారు. ఆ రోజు తరవాత రిజిస్టర్ అయిన ఫోర్డ్ కార్ల వివరాలు సేకరించిన ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ వాటిలో నాలుగు తెల్లరంగువి ఉన్నట్లు తేల్చారు. ఆయా కార్ల రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా యజమానుల చిరునామాలు గుర్తించారు. ఈ నాలుగు చిరునామాలకు స్వయంగా వెళ్లి, విచారణ చేసి రావడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. చందానగర్ చిరునామాతో రిజిస్టర్ అయి ఉన్న కారును వెతుక్కుంటూ వెళ్లిన ఈ టీమ్ ఓ ఇంటి ఆవరణలో నిలిపి ఉన్న ‘ఏపీ 29 ఏవీ 6037’ నెంబర్ కారును గుర్తించింది. ఆ కారుకి కుడివైపు సైడ్ మిర్రర్ య«థాతథంగా ఉండటం, ప్రమాదానికి సంబంధించిన ఆనవాళ్లు ఎక్కడా లేకపోవడంతో తాము వెతుకుతున్న కారు అది కాదేమోనని అనుకుంటూ విషయాన్ని ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణకు చెప్పింది. ఆయన సూచనల మేరకు ఆ కారుకు కొత్తగా రంగు వేసిన దాఖలాలు, దానికి సంబంధించిన ఆధారాల కోసం సమీపంలోకి వెళ్లి పరిశీలించింది. ఈ నేపథ్యంలోనే ఆ కారుకు కొత్తగా రంగు వేస్తుండగా దాని టైర్‌పై పడిన పెయింట్ చుక్కలు గమనించింది. వెంటనే అప్రమత్తమైన టీమ్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని యజమానుల్ని పోలీసుస్టేషన్‌కు రావాలని చెప్పింది.అలా వచ్చిన యజమానుల్ని విచారించడంతో జనవరి ఒకటో తేదీన ఆ కారుని తన సమీప బంధువైన ఎంటెక్ విద్యార్థి, నేరేడ్మెట్ వాసి డి.భరద్వాజ్ తీసుకువెళ్లాడని, తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నట్లు చెప్పాడని వెల్లడైంది. దీంతో అతడి కోసం గాలింపు ప్రారంభించారు. తన వ్యవహారాన్ని పోలీసులు గుర్తించారనే విషయం తెలుసుకున్న భరద్వాజ్ నేరుగా బొల్లారం పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఆ రోజు పొగమంచు కారణంగా ఓ ప్రమాదం జరిగిందని, అయితే తాను గొడను ఢీ కొట్టానని భావించానని పోలీసులకు తెలిపారు. ప్రమాదం జరిగినట్లు కారు యజమానులకు తెలిస్తే ఇబ్బంది అవుతుందనే కారుకు రంగు వేయించానని అంగీకరించాడు. దీంతో బొల్లారం పోలీసులు భరద్వాజ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. భరద్వాజ్ నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్ధురాలు మరణించడంతో పాటు ఆమె కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. ఇంజనీరింగ్ చదువుతున్న మరో కుమార్తె సుదీర్ఘకాలం షాక్‌లో ఉండిపోయి మాట పలుకు లేకుండా తనను తాను మర్చిపోయారు. ఎవరైనా దగ్గరకు వెళ్లి పలకరిస్తే... ‘అమ్మ వెళ్లి చాలాసేపు అయింది. రమ్మని చెప్పండి’ అని మాత్రమే అంటూ కోలుకోవడానికి చాలా రోజులు తీసుకుంది. ∙ -
కంపెనీలు కావు.. కల్పతరువులు
ఉద్యోగులు మంచి కంపెనీలను కోరుకుంటారు. కంపెనీలు మంచి ఉద్యోగులను కోరుకుంటాయి. మంచి ఉద్యోగులను ఎంపిక చేసుకోవడం, వారిని కాపాడుకోవడం వల్లనే కంపెనీలు విజయాలు సాధిస్తున్నాయి. అలాంటి కంపెనీల్లో ఉద్యోగాలు పొందడానికి అభ్యర్థులు పోటీపడుతుంటారు. మంచి ఉద్యోగులను కాపాడుకోగలిగే కంపెనీలు ఉత్తమ కంపెనీలుగా ఎదుగుతున్నాయి. అభివృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులు పనిచేయడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉండే వంద అత్యుత్తమ కంపెనీలను ఎంపిక చేసిన ఫార్చూన్ పత్రిక ‘బెస్ట్ కంపెనీస్ టు వర్క్’– 2025 పేరుతో ఒక జాబితాను విడుదల చేసింది. వీటిలోని పది అత్యుత్తమ కంపెనీల కథా కమామిషు చూద్దాం. వీటిలో పనిచేయాలని ఉద్యోగులు ఎందుకు ఉవ్విళ్లూరుతుంటారో తెలుసుకుందాం...మంచి కంపెనీలు అంటే అపర కుబేరుల ఆ«ధ్వర్యంలో నడిచే కంపెనీలు అనుకుంటే పొరపాటేనని ‘ఫార్చూన్’ జాబితా రుజువు చేస్తోంది. ఉద్యోగులకు మంచి వేతనాలు చెల్లించడమే కాకుండా, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాల కోసం చర్యలు తీసుకోవడం; ఉద్యోగుల అభివృద్ధిలో పైరవీలకు తావు లేకుండా పనితీరుకు మాత్రమే ప్రాధాన్యమివ్వడం; ఉద్యోగుల అనుభవాన్ని, పనితీరును మదింపు వేసి పదోన్నతులు కల్పించడం; పని ప్రదేశంలో ఆహ్లాదకర పని వాతావరణాన్ని కల్పించడం; ఉద్యోగుల కష్టసుఖాలను పరిగణనలోకి తీసుకుని, వారికి తగిన వెసులుబాట్లు కల్పించడం వంటి మానవీయ చర్యల కారణంగానే ఈ కంపెనీలు అత్యుత్తమ కంపెనీల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ‘ఫార్చూన్’ జాబితాలోని టాప్–10 కంపెనీల పరిస్థితులను ఒకసారి పరిశీలిద్దాం...1 హిల్టన్ అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న బహుళజాతి సంస్థ హిల్టన్ వరల్డ్‌వైడ్. ఆతిథ్యరంగంలో ఈ కంపెనీ దాదాపు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. వర్జీనియాలోని మెక్లీన్లో దీని ప్రధాన కేంద్రం ఉంది. కాన్రాడ్ హిల్టన్ 1919లో ప్రారంభించిన ఈ కంపెనీకి ప్రస్తుతం క్రిస్టఫర్ నాసెట్టా సీఈవోగా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీలో దాదాపు రెండులక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అన్ని స్థాయుల్లోనూ ఉద్యోగులకు సంతృప్తికరమైన వేతనాలు చెల్లించడమే కాకుండా, ‘హిల్టన్’ యాజమాన్యం వారి సంక్షేమానికి, అభివృద్ధికి అనేక చర్యలు చేపడుతోంది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ‘కేర్ ఫర్ ఆల్’ కార్యక్రమం నిర్వహిస్తోంది. ‘హిల్టన్ ఫ్లెక్స్’ కార్యక్రమం పేరిట ఉద్యోగులు తమకు అనువైన వేళల్లో వచ్చి పనిచేసి వెళ్లే వెసులుబాటును కల్పిస్తోంది. ‘గో హిల్టన్’ పేరిట ఉద్యోగుల పర్యాటక ఖర్చులను చెల్లిస్తోంది. ‘హిల్టన్’ సంస్థ తన విజయాలకు ఉద్యోగులే కారణమని చెబుతుంది. నిజానికి ఉద్యోగులకు పూర్తి సంతృప్తికరమైన జీవితాన్ని అందించడమే ‘హిల్టన్’ను ‘ఫార్చూన్’ జాబితాలో మొదటి స్థానంలో నిలిపింది.2 సింక్రనీఅమెరికా కేంద్రంగా ప్రధానంగా ఆర్థిక, బీమా రంగాల్లో పనిచేస్తున్న బహుళజాతి సంస్థ సింక్రనీ. కనెక్టికట్‌లోని స్టామ్ఫర్డ్లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ఈ కంపెనీ 1932లో తొలుత ఆర్థిక సేవల సంస్థగా ప్రారంభమైంది. తర్వాతికాలంలో ఆరోగ్య, గృహవసతులు, రీటైల్ తదితర రంగాలకు విస్తరించింది. ప్రస్తుతం ఇందులో దాదాపు ఇరవైవేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంస్థ తన ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా, ఉద్యోగులు ఇంటి నుంచి కార్యాలయానికి రాకపోకలు జరపడానికి వీలుగా విద్యుత్ వాహనాలు, విద్యార్హతలను మెరుగుపరచుకోవాలనుకునే ఉద్యోగులకు ట్యూషన్ ఫీజులు, ఇతర ఖర్చుల చెల్లింపు వంటి ప్రయోజనాలను అందిస్తోంది. అలాగే, ఉద్యోగులకు పిల్లలు పుడితే, తల్లిదండ్రులకు వేతనంతో కూడిన సెలవులు, సంతానలేమితో బాధపడే ఉద్యోగులకు ఐవీఎఫ్ చికిత్స ఖర్చులను కూడా చెల్లిస్తోంది. వీలైన వేళల్లో పనిచేసుకునే వెసులుబాటు, నిర్ణీత వేళల్లో పనిచేసేవారికి కూడా ప్రతి శుక్రవారం ‘ఫ్లెక్స్ ఫ్రైడే’ వెసులుబాటు తదితర సౌకర్యాలను కల్పిస్తోంది. ఉద్యోగుల ఫీడ్‌బ్యాక్ ప్రకారం తన పనితీరును ఎప్పటికప్పుడు మెరుగుపరచుకునే నిబద్ధత ‘సింక్రనీ’ని ఈ స్థాయికి తెచ్చింది. ఉద్యోగం చేయడానికి ఇది అద్భుతమైన సంస్థ అని ఇందులో పనిచేసే 94 శాతం ఉద్యోగులు చెబుతుండటమే దీని విజయానికి గీటురాయి.3 సిస్కోఇది కూడా అమెరికన్ బహుళజాతి సంస్థల్లో ఒకటి. కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో ప్రధాన కార్యాలయం గల ఈ కంపెనీ ఐటీ రంగంలో సేవలందిస్తోంది. నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ సహా పలు సాంకేతిక సేవలు అందించే ఈ కంపెనీ 1984లో ప్రారంభమైంది. ఉద్యోగులకు సంతృప్తికరమైన పనివాతావరణం కల్పించడానికి సిస్కో అనేక చర్యలను అమలు చేస్తోంది. ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యం కోసం పలు వసతులు కల్పిస్తోంది. ఎప్పటికప్పుడు ఉద్యోగుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా వారికి ఆర్థిక ప్రయోజనాలను, ఇతర ప్రయోజనాలను అందిస్తోంది. పని ప్రదేశంలో మార్పు చేర్పులను ఉద్యోగుల అభిప్రాయాలకు అనుగుణంగా చేపడుతోంది. ఉద్యోగుల నైపుణ్యాల మెరుగుదల కోసం శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనే ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేస్తుండటం సిస్కో ప్రత్యేకత. ఉద్యోగుల అభిప్రాయాలకు విలువనిస్తూ, వారికి తగిన ప్రయోజనాలను అందించడంలో ముందంజలో ఉండటమే సిస్కోను అత్యుత్తమ స్థాయికి చేర్చించింది. తమ అభిప్రాయాలకు యాజమాన్యం విలువనివ్వడం వల్ల ఈ సంస్థలోని ఉద్యోగులు పూర్తి సంతృప్తితో పనిచేసుకోగలుగుతున్నారు.4 అమెరికన్ ఎక్స్ప్రెస్ఆర్థిక సేవల రంగంలో 175 ఏళ్లుగా పనిచేస్తున్న ఈ అమెరికన్ బహుళ జాతి కంపెనీ ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లోని బఫెలో నగరంలో ఉంది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ట్రావెలర్స్ చెక్కులు, బీమా, పర్యాటక రంగాల్లో ఈ కంపెనీ పనిచేస్తోంది. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ కంపెనీలో దాదాపు 75 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంస్థలో పనిచేయడం తమ అదృష్టంగా ఉద్యోగులు భావిస్తారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ సంస్థ పలు చర్యలు తీసుకుంటోంది. ఉద్యోగం వల్ల ఉద్యోగుల వ్యక్తిగత జీవితాల్లో ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఉద్యోగులు కోరుకునే వేళల్లో పనిచేసే వెసులుబాటుతో పాటు వారు ఎక్కడి నుంచైనా పనిచేసే అవకాశం కూడా కల్పిస్తోంది. సంతృప్తికరమైన వేతనాలు; ఉద్యోగాల్లో అభివృద్ధి సాధించడానికి వీలుగా విద్యార్హతలు పొందడానికి చదువుకునే విద్యార్థులకు చదువుల ఖర్చుల చెల్లింపు; ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఉచిత ఆరోగ్య బీమా; పారదర్శకమైన నాయకత్వం ఈ సంస్థను అగ్రగామిగా నిలుపుతున్నాయి. ఆర్థికంగా ఎదగడానికి ఉద్యోగులందరికీ సమానావకాశాలు కల్పించడం; ఉద్యోగుల వ్యక్తిగత జీవితాల్లో తలెత్తే సమస్యల పరిష్కారంలో తోడ్పాటునందించడం వంటి చర్యల ద్వారా ‘అమెరికన్ ఎక్స్‌ప్రెస్’ తన ఉద్యోగుల మనసులను చూరగొంటోంది.5 ఎన్విడీయాఐటీ రంగానికి చెందిన ఈ అమెరికన్ బహుళజాతి సంస్థ కాలిఫోర్నియాలోని శాంటా క్లారా ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. ముప్పయ్యేళ్లకు పైగా పనిచేస్తున్న ఈ సంస్థ ఐటీ రంగంలో ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ వైవిధ్యభరితమైన సేవలను అందిస్తోంది. చిప్స్ తయారీ, డిజైనింగ్, గేమింగ్, ఏఐ సహా పలు సేవలను ప్రపంచవ్యాప్తంగా అందిస్తోంది. ఎన్విడీయా కంపెనీలో దాదాపు 36 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒకసారి ఇందులో ఉద్యోగంలో చేరాక మానేసే వారు అతి తక్కువ. ఉద్యోగ భద్రత, సంతృప్తికరమైన వేతనాలు, సంస్థలోని వివిధ బృందాలు ఉన్నా, ఏ బృందానికి ఆ బృందం స్వయంప్రతిపత్తితో పనిచేసేలా ప్రతి బృందానికి స్వేచ్ఛాయుత వాతావరణం, ఉద్యోగులు అందరూ ఒకేసారి సెలవులను ఆస్వాదించేలా వారాంతపు సెలవులు మాత్రమే కాకుండా, ప్రతి మూడునెలలకు ఒకసారి వరుసగా రెండు రోజులు సెలవులు, ప్రతి ఏడాదిలో ఇరవైరెండు వారాల పాటు వేతనంతో కూడిన సెలవులు తీసుకునే వెసులుబాటు ఈ సంస్థను ఉద్యోగుల పాలిటి ఉత్తమ సంస్థగా నిలుపుతున్నాయి. ఉద్యోగులకు నచ్చిన వేళల్లో పనిచేసుకునే వెసులుబాటు, వారి శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ఆర్థిక మద్దతు, దిగువ స్థాయి ఉద్యోగుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని విధానపరమైన మార్పులు చేపట్టడం వంటి చర్యలు ఈ సంస్థను అగ్రగామిగా నిలుపుతున్నాయి.6 వెగ్మాన్జ్రిటైల్ రంగానికి చెందిన ఈ అమెరికన్ బహుళ జాతి సంస్థ న్యూయార్క్‌లోని రోషెస్టర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. జాన్ వెగ్‌మాన్, వాల్టర్ వెగ్‌మాన్ అనే సోదరులు 1916లో ఈ సంస్థను ప్రారంభించారు. ‘వెగ్మాన్జ్’ సంస్థకు ఇప్పుడు అమెరికాలో మొత్తం 111 సూపర్ మార్కెట్ స్టోర్లు ఉన్నాయి. ‘ఫార్చూన్’ పత్రిక 1998లో ‘బెస్ట్ కంపెనీస్ టు వర్క్’ జాబితాను విడుదల చేయడం ప్రారంభించిన నాటి నుంచి వెగ్‌మాన్ ఈ జాబితాలోని తొలి పది స్థానాల్లో చోటు దక్కించుకుంటూ వస్తోంది. ఈ కంపెనీలో దాదాపు 54 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగ భద్రత, సంతృప్తికరమైన వేతనాలు, పనితీరు ఆధారంగా పదోన్నతులు, ప్రతి ఆరునెలలకు ఒకసారి వేతనాల పెంపు, యాజమాన్య నిర్ణయాల్లో పారదర్శకత, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ఉచిత ఆరోగ్య బీమా, పనివేళలను కోరుకునే రీతిగా ఎంపిక చేసుకునే వెసులుబాటు, ఉద్యోగులకు ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తోంది. ఇన్ని సౌకర్యాలు ఉండటం వల్ల ‘వెగ్మాన్జ్’ ఉద్యోగులు తమ యాజమాన్యం పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తుంటారు.7 యాక్సెంచర్ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగానికి చెందిన ఈ బహుళ జాతి సంస్థ ఐర్లండ్ రాజధాని డబ్లిన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. దాదాపు 120 దేశాలలో కార్యాలయాలు ఉన్న ఈ కంపెనీలో 7.79 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్ట్రాటజీ, కన్సల్టింగ్, ఆపరేషన్స్ తదితర సేవలు అందిస్తున్న ఈ కంపెనీ తన క్లయింట్స్‌కు ఎప్పటికప్పుడు కావలసిన పరిష్కారాలను అందించే దిశగా పరిశోధనలపై భారీగా ఖర్చు చేస్తుంది. ఉద్యోగులను నిరంతర అధ్యయనం చేసేలా ప్రోత్సహిస్తుంది. ప్రాజెక్టుల ఎంపికలోను, కెరీర్ రంగాల ఎంపికలోను, పనివేళల ఎంపికలోను ఉద్యోగులకు పూర్తి స్వేచ్ఛ కల్పిస్తుంది. అధ్యయనానికి, సృజనాత్మకతకు పెద్దపీట వేయడమే కాకుండా, పనితీరు ఆధారంగా ఉద్యోగుల పురోభివృద్ధికి భరోసా కల్పిస్తుండటంతో ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేయడానికి ఇష్టపడతారు. ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా, పిల్లలు పుట్టినప్పుడు తల్లి దండ్రులకు వేతనంతో కూడిన సెలవులు మాత్రమే కాకుండా, సంతాన సాఫల్య చికిత్సలు పొందేవారికి, పిల్లలను దత్తత తీసుకునేవారికి కూడా వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేస్తుండటం ఈ కంపెనీ ప్రత్యేకత.8 మేరియట్ఆతిథ్య రంగానికి చెందిన ఈ అమెరికన్ బహుళజాతి సంస్థ మేరీలాండ్‌లోని బతీజ్దా ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది మేరియట్ ఇంటర్నేషనల్ సంస్థకు వివిధ దేశాల్లో ఆరువందలకు పైగా హోటళ్లు, రిసార్టులు ఉన్నాయి. ‘మనుషులే ప్రధానం’ సిద్ధాంతంతో పనిచేసే మేరియట్ సంస్థ ఉద్యోగుల సంక్షేమానికి, సంతృప్తికి అత్యధికంగా ఖర్చు చేస్తుంది. కంపెనీ అంతర్గత వ్యవహారాల్లో పూర్తి పారదర్శకతను పాటిస్తుంది. ఉద్యోగులతో తరచు సమావేశాలు నిర్వహించడం, ఉద్యోగుల అభిప్రాయాలను తెలుసుకుని, విధాన నిర్ణయాలలో మార్పులు చేయడం వంటి చర్యల ద్వారా మేరియట్ సంస్థ ఉద్యోగుల విశ్వాసాన్ని, అభిమానాన్ని చూరగొంటోంది. పనితీరు ఆధారంగా ఉద్యోగులకు పదోన్నతులు, బహుమతులు ఇవ్వడం, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా, సెలవులలో ఉద్యోగులు పర్యటనలకు వెళ్లేటప్పుడు తమ హోటళ్లలో డిస్కౌంట్‌కు బస, ఆహార పానీయాలు అందించడం, ఉత్తమ పనితీరు కనబరచిన ఉద్యోగులకు ప్రత్యేక బోనస్ చెల్లింపు, ఉద్యోగులకు కంపెనీలో వాటాల కేటాయింపు వంటి చర్యల ద్వారా మేరియట్లో పనిచేయడాన్ని ఉద్యోగులు గొప్ప అవకాశంగా భావిస్తారు.9 పినాకిల్ఆర్థిక సేవల రంగానికి చెందిన ఈ అమెరికన్ కంపెనీ టెనెసీలోని నాష్విల్లె ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్, మార్టిగేజ్ తదితర సేవలను అందించే ఈ కంపెనీలో దాదాపు మూడున్నర వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగులకు సంతృప్తికరమైన వేతనాలతో పాటు కంపెనీలో పరిమిత మొత్తాల మేరకు వాటాల కేటాయింపు; ఉద్యోగుల వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది లేని పనివేళలు; లక్ష్యాలను సాధించిన ఉద్యోగులకు ఆర్థిక ప్రోత్సాహకాలు; ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా; రిటైరైన ఉద్యోగులకు పింఛను చెల్లింపు; వేతనంతో కూడిన సెలవులు; ఉద్యోగులపై ఆధారపడే తల్లిదండ్రుల సంరక్షణ కోసం ప్రత్యేక అలవెన్సు వంటి చర్యల ద్వారా పినాకిల్ సంస్థ ఉద్యోగులు పనిచేయడానికి అన్ని విధాలా అనువైన సంస్థల్లో అగ్రశ్రేణిలో నిలుస్తోంది. ఇందులో పనిచేసే ఉద్యోగులు తమ ఉద్యోగాల పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తుండటం దీని విజయానికి నిదర్శనం.10 వరల్డ్ వైడ్ టెక్నాలజీసాంకేతిక రంగానికి చెందిన ఈ అమెరికన్ బహుళజాతి సంస్థ మిసోరీలోని మేరీలాండ్ హైట్స్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. అప్లికేషన్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్, స్ట్రాటెజిక్ రిసోర్సింగ్, గ్లోబల్ సప్లై చెయిన్, ఇంటిగ్రేషన్ నెట్వర్కింగ్ తదితర సేవలను అందిస్తున్న ఈ కంపెనీలో దాదాపు పన్నెండువేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగులకు సంతృప్తికరమైన వేతనాలను చెల్లించడంతో పాటు వరల్డ్ వైడ్ టెక్నాలజీ కంపెనీ వారికి అనేక ప్రయోజనాలను కల్పిస్తోంది. ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా, ప్రమాద బీమా; ఉద్యోగ విరమణ తర్వాత జీవితం సజావుగా సాగడానికి రిటైర్మెంట్ పథకం; ఉద్యోగుల్లో ఎవరికైనా పిల్లలు పుడితే తల్లులతో పాటు తండ్రులకు కూడా వేతనంతో కూడిన సెలవులు; సంతాన సాఫల్య చికిత్సల కోసం ఆర్థిక సాయం, సెలవులు, పిల్లలను దత్తత చేసుకోవడానికి వేతనంతో కూడిన సెలవులు; అనువైన పనివేళలను ఎంపిక చేసుకునే వెసులుబాటు; నాయకత్వ శిక్షణ తదితర కార్యక్రమాల ద్వారా వరల్డ్ వైడ్ టెక్నాలజీ ఉత్తమ సంస్థల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇందులో పనిచేసే వారిలో తొంభైఐదు శాతానికి పైగా ఉద్యోగులు పూర్తి సంతృప్తితో ఉన్నట్లు చెబుతారు.ఉద్యోగులు లోటులేని జీవితాలను గడపడానికి తగినట్లుగా సంతృప్తికరమైన వేతనాలు, ఉద్యోగ భద్రత, పనివేళల్లో వెసులుబాట్లు, వివిధ అవసరాలకు వేతనాలతో కూడిన సెలవులు, పనితీరుకు తగిన గుర్తింపు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాల పట్ల పట్టింపు వంటి చర్యల ద్వారానే ఈ కంపెనీలు ఉద్యోగుల పాలిటి కల్పతరువుల్లా ఉంటూ అగ్రశ్రేణిలో నిలుస్తున్నాయి. -
చిన్నదే గాని.. చిరంజీవి
‘సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు’ అన్న మాటను ఇప్పుడు ఒక చిన్న గాజు ఫలకం అబద్ధం చేసింది. ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త పీటర్ కజాన్ స్కీ, అతని బృందం రూపొందించిన ఈ గాజు డిస్క్, మొత్తం చరిత్ర జ్ఞాపకాలను శాశ్వతంగా బంధించగల అద్భుతం. దీని పేరు ‘సూపర్మాన్ మెమరీ క్రిస్టల్’. ఇందులో మూడు వందల అరవై టెరాబైట్ల డేటాను స్టోర్ చేయొచ్చు. అంటే చరిత్ర, గ్రంథాలు, సినిమాలు, సంగీతం అన్నీ ఒకే డిస్క్‌లో ఇమిడిపోతాయి. సాధారణ హార్డ్‌డ్రైవ్ లేదా పెన్ డ్రైవ్ కొంతకాలానికే దెబ్బతింటుంది. ప్రత్యేకమైన గాజుతో రూపొందిన ఈ డిస్కును మాత్రం తీవ్రస్థాయిలోని ఉష్ణోగ్రతల వ్యత్యాసాలు, ప్రకృతి విపత్తులు వంటివేవీ దీనిని తాకలేవు. అణు స్థాయిలో ఉండే నానో నిర్మాణాల ద్వారా పరిమాణం, దిశ, స్థానం వంటి ఐదు మార్గాల్లో ఇందులో డేటా స్టోర్ అవుతుంది. కోట్ల ఏళ్ల తరువాత కూడా మన కథలను ఈ గాజు డిస్క్ ఒక్కటే చెప్తుంది. మొత్తానికి, ఇది ఉత్త గాజు బిళ్ల కాదు, మానవ జ్ఞాపకాలకు కాలాతీత బీమా పథకం! పరిమాణంలో ఇది చిన్నదే గాని, మనుగడలో మాత్రం చిరంజీవి. త్వరలోనే దీనిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి మార్కెట్లోకి తీసుకురానున్నారు. -
భళారే బాలినీస్!
ఇండోనేషియాలో ‘దేవతల దీవి’గా పేరున్న బాలి ద్వీపానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకస్థానం ఉంది. ఇది కేవలం అందమైన బీచ్‌లు, వరి పొలాలకే కాకుండా ఆధ్యాత్మిక పండుగలకు కూడా ప్రసిద్ధి. నిజానికి హిందూ–బౌద్ధ మతాల కలయికను పాటించే అతిపెద్ద జాతి బాలినీస్! వారు 210 రోజులకు ఒకసారి, బాలినీస్ క్యాలెండర్ (పావుకోన్) ప్రకారం జరుపుకునే పండుగను బాలినీస్ ఫెస్టివల్ అంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది నవంబర్ 19 నుంచి 29 వరకు పదిరోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు జరగనున్నాయి.ఈ ఉత్సవాల్లో ‘గలుంగన్’ అనే పేరుతో జరిగే మొదటిరోజు వేడుక, అత్యంత ప్రత్యేకమైనది. ఈ పండుగ సందర్భంగా, ద్వీపం అంతటా రహదారుల పక్కన పెన్జోర్ (అలంకరించిన పొడవైన వెదురు స్తంభాలు) ఏర్పాటు చేస్తారు. ఇవి దైవత్వాన్ని ఆహ్వానించడానికి, శ్రేయస్సుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి గుర్తుగా నిలుస్తాయి. పది రోజుల తర్వాత వచ్చే కుణీంగాన్ పండుగతో ఈ ఫెస్టివల్ ముగుస్తుంది. ఆ చివరి రోజున తమ పూర్వీకుల ఆత్మలు తిరిగి స్వర్గానికి వెళ్తాయని అక్కడివారు నమ్ముతారు.ప్రతి దేవాలయంలో ఒడాలన్ (ఆలయ వార్షికోత్సవం) ఉత్సవం జరుగుతుంది. సంప్రదాయ నృత్యాలు, సంగీతం, ప్రత్యేకమైన కళల ప్రదర్శన కన్నుల పండుగగా సాగుతుంది. ఈ బాలినీస్ పండుగలు కేవలం వేడుకలు మాత్రమే కావు, ఇవి బాలినీస్ ప్రజల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. -
కార్చిచ్చు
ఆ పారిశ్రామికవాడలో ఓ నేషనలైజ్డ్ బేంక్ బ్రాంచ్ ఉంది. ప్రతినెలా ఏడవ తారీకున అక్కడి ఫేక్టరీ వర్కర్స్‌కి జీతాలు ఇస్తారు. ఆ జీతాల మొత్తం పదిహేడు లక్షల రూపాయలు. ఆరవ తారీకు సాయంత్రానికల్లా ఆ బ్రాంచ్‌కి సమీపంలోని మరో పెద్ద బ్రాంచ్ నుంచి ఇరవై లక్షల రూపాయలు అందుతూంటాయి. కొంత కాలం ఓ ఫేక్టరీలో పనిచేసి, రాగి తీగల దొంగతనం వల్ల ఉద్యోగం పోగొట్టుకున్న అద్విక్‌కి అది తెలుసు. ఒకే ఆఖరి దొంగతనంలో దాన్ని సంపాదించి తన రాష్ట్రానికి పారిపోవాలనే నిశ్చయంతో అతను జైల్లో పరిచయమైన తన సహచరుడితో ఏడో తారీకు ఉదయం తొమ్మిదికి ఆ బ్రాంచ్‌లోకి ప్రవేశించాడు. లోపల ఐదారుగురు కస్టమర్స్ ఉన్నారు.అద్విక్ సహచరుడు సెక్యూరిటీ గార్డ్ తుపాకీని లాక్కున్నాడు. అద్విక్ కేష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేలోగా అద్దాల తలుపులోంచి జరిగేది చూసిన మేనేజర్ పోలీసులకి ఫోన్ చేసాడు.తన సహచరుడు సిబ్బందిని, కస్టమర్స్‌ని తుపాకీతో కంట్రోల్ చేస్తూంటే, అద్విక్ తన నాటు రివాల్వర్‌తో బెదిరించి కేషియర్తో బేంక్ వాల్ట్‌లోని డబ్బు కట్టలని తనతో తెచ్చిన రెండు సూట్ కేసులలో నింపించాడు. అతను బయటికి రాగానే అతని సహచరుడు ఓ సూట్ కేస్‌ని అందుకున్నాడు. అప్రమత్తంగా ఉన్న అద్విక్ తలుపు కొద్దిగా తెరచి చూస్తే ఎదురుగా పోలీస్ వేన్ ఆగటం కనిపించింది. వెంటనే తలుపు మూసి అరిచాడు.‘‘పోలీసులకి ఎలా తెలిసింది? ఎవరు సమాచారం పంపారు?’’ ఎవరూ మాట్లాడలేదు. ‘‘సరే. పోలీసులని వెళ్ళిపొమ్మని ఓ హెచ్చరిక పంపాలి. ఆ హెచ్చరిక మీలోని ఒకరి శవం.’’ అద్విక్ క్రోధంగా చెప్పాడు. వెంటనే బేంక్ సిబ్బంది మొహాల్లో కనపడే భయం రెట్టింపైంది. ఎవరిని ఎన్నుకుంటాడు? ‘‘నువ్వు బయటికి రా.’’ నలభై ఏళ్ళ కేషియర్ని చూస్తూ ఆజ్ఞాపించాడు. అతను వణుకుతూ కేష్ కేబిన్ లోంచి బయటికి వచ్చాడు. రివాల్వర్ గొట్టాన్ని అతని ఛాతీకి ఆనించగానే ఓ లేడీ క్లర్క్ అరిచింది.‘‘అతన్ని కాదు. నన్ను చంపు.’’‘‘నీకు ప్రాణం మీద తీపి లేదా?’’ ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోయిన అద్విక్ సహచరుడు అడిగాడు. ‘‘చీమతో సహా ప్రతివారికీ అది ఉంటుంది. ఈయనకి నేను ఋణపడ్డాను. అది తీర్చే సమయం వచ్చింది.’’ ‘‘ఏం ఋణపడ్డావు?’’ అద్విక్ అడిగాడు. ‘‘మావారి కిడ్నీలు పాడయ్యాయి. ఎవరివీ మేచ్ కాలేదు. స్వచ్ఛందంగా ముందుకి వచ్చిన ఇతని టిష్యూస్ మేచ్ ఐతే తన కిడ్నీని దానం చేశాడు. ఇతని వల్లే మావారు జీవించారు కాబట్టి.’’ ‘‘ఈమెని బదులు నన్ను చంపు.’’ ఓ ముసలావిడ రివాల్వర్ బేరల్కి, ఆమెకి మధ్యకి వచ్చి చెప్పింది. అందరి దృష్టి ఆవిడ మీదకి మళ్ళింది. ఆవిడ చెప్పింది. ‘‘ఈమెకి ఇద్దరు పిల్లలు. వారికి ఈమె అవసరం ఉంది. నా అవసరం నా పిల్లలకి తీరింది. ఫైబ్రోసిస్ రోగంతో పోయే కంటే ఓ ప్రయోజనంతో పోవడం వల్ల మరణం పవిత్రం అవుతుంది.’’ ‘‘నిన్ను కాదు. యువకులని చంపితే మాకు ఎదురు తిరిగేవాళ్ళు ఒక్కరైనా తగ్గుతారు.’’ సహచరుడు చెప్పాడు. ‘‘అవును. నువ్వు ఇటు రా.’’ దృఢంగా ఉన్న పాతికేళ్ళ యువకుడిని చూసి అద్విక్ ఆజ్ఞాపించాడు. అంతదాకా భయంతో ఏడుస్తూ నిలబడ్డ ఒకావిడ చెంగుతో కన్నీరు తుడుచుకుని అద్విక్ ముందు వచ్చి నిలబడి చెప్పింది. ‘‘అతన్ని కాదు. అతని బదులు నన్ను చంపు.’’ఈసారి అందరి మొహాల్లో విస్మయం రెట్టింపైంది. ‘‘అతను నీ కొడుకా?’’ అద్విక్ అడిగాడు. ‘‘కాదు.’’ ఆ యువకుడు వెంటనే జవాబు చెప్పాడు. ‘‘మా అమ్మాయి పై చదువులకి జర్మనీకి వెళ్ళింది. అందుకయ్యే అన్ని ఖర్చులని ఇతనే భరిస్తున్నాడు. మాకు బంధువు కాదు. స్నేహం కూడా లేదు. నా అవసరం తెలుసుకుని ఇతనంతట ఇతనే మాకు డబ్బు సహాయం చేశాడు. మీరు ఇతన్ని మాత్రం చంపకండి.’’వెంటనే బేంక్ మేనేజర్ అద్విక్ రివాల్వర్ గొట్టం ముందుకి వచ్చి నిలబడి చెప్పాడు. ‘‘మిస్టర్. నన్ను చంపు. వీళ్ళందరికన్నా నన్ను చంపితే అది పవిత్ర మరణం అవుతుంది.’’ మాట్లాడుతూంటే ఆయన కంఠం గద్గదమైంది. ‘‘నీ కథ ఏమిటి?’’ అద్విక్ ప్రశ్నించాడు. ‘‘వీళ్ళల్లోని మంచితనం నన్ను ప్రభావితం చేసింది. కరోనా సమయంలో నా కుటుంబం మొత్తం తుడిచిపెట్టుకు పోయింది. అప్పటినుంచి నిస్సారంగా బతుకుతున్నాను. ఒంటరి బతుకు అర్థం లేనిదని అనుభవపూర్వకంగా గ్రహించాను. నన్ను చంపితే ఓ ఉద్యోగికి ప్రమోషన్ , ఓ నిరుద్యోగికి ఉద్యోగం, మరో మనిషికి ప్రాణాలు లభిస్తాయని అనిపించింది.’’అంతా ఎదురుచూడని సంఘటన జరిగింది. వెంటనే అద్విక్ రివాల్వర్ని ఓ మూలకి విసిరేసి, పోలీసులకి లొంగిపోవడానికి తలుపు తెరచుకుని బయటికి నడిచాడు. అతని సహచరుడు కూడా బయటికి నడుస్తూ చెప్పాడు. ‘‘చిన్నప్పుడు ఆవు, పులి కథలో దూడకి పాలిచ్చి ఆవు తిరిగి రావటం విని, ఆవు తిరిగి రాలేదని అనుకునేవాడిని. కాదని నాకు ఇప్పుడు అర్థమైంది.’’ ఆ రోజు అక్కడ మంచితనం కార్చిచ్చులా వేగంగా పాకింది. -
మళ్లీ అవసరమా?
నేను రెండు నెలల గర్భవతిని. కొంతమంది ‘ఫ్లూ వ్యాక్సిన్’ తప్పకుండా వేయించుకోవాలంటున్నారు. కాని, నేను గత సంవత్సరం వేయించుకున్నాను. ఇప్పుడు మళ్లీ అవసరమా? ఈ వ్యాక్సిన్ గర్భధారణలో మంచిదేనా? – రమ్య, చిత్తూరు. గర్భిణులకు ఫ్లూ వ్యాక్సిన్ చాలా అవసరం. గర్భధారణ సమయంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, అందుకే ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు గర్భిణులపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఫ్లూ వల్ల దగ్గు, జలుబు మాత్రమే కాకుండా కొన్నిసార్లు న్యూమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వంటి తీవ్రమైన సమస్యలు కూడా రావచ్చు. ఫ్లూ వైరస్ ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటుంది. కాబట్టి మీరు గత సంవత్సరం తీసుకున్నా, ఈ ఏడాది కూడా కొత్త స్ట్రెయిన్కి అనుగుణంగా వ్యాక్సిన్ మళ్లీ వేయించుకోవాలి. సాధారణంగా అక్టోబర్ నుంచి మే మధ్యకాలం వరకు ఫ్లూ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అందుకే గర్భిణులు నవంబర్ సమయానికి ఫ్లూ షాట్ తీసుకోవడం మంచిది. ఇది పూర్తిగా సురక్షితమైన వ్యాక్సిన్. మీకు మాత్రమే కాకుండా మీ బిడ్డకూ ఈ వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తుంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మీ శరీరంలో ఏర్పడే యాంటీబాడీలు ప్లాసెంటా ద్వారా బిడ్డకు చేరతాయి. ఆ రక్షణ వల్ల పుట్టిన తరువాత కూడా ఆరు నెలల పాటు బిడ్డకు ఫ్లూ ఇన్ఫెక్షన్ నుంచి సహజమైన రక్షణ లభిస్తుంది. ఎందుకంటే ఆ వయసులో పిల్లలకు ఫ్లూ వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యమవదు. ఫ్లూ వ్యాక్సిన్ వల్ల ఫ్లూ రాదు, వైరస్ తీవ్రతను గణనీయంగా తగ్గిస్తుంది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత రెండు వారాల లోపే శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి. తేలికపాటి జ్వరం, చేతి నొప్పి, బలహీనత వంటి చిన్న దుష్ప్రభావాలు రావచ్చు కాని, అవి తాత్కాలికం. మొత్తం మీద, ప్రతి గర్భిణీ మహిళ ఫ్లూ వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలి. ఇది తల్లీ బిడ్డలిద్దరికీ రక్షణ కలిగించే సురక్షితమైన, అవసరమైన టీకా. మీరు ఇప్పటికే వేసుకున్నా, ఈ సంవత్సరం మళ్లీ వేయించుకోవడం ఉత్తమం. డెలివరీ తర్వాత ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇది సాధారణ జలుబు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఉపయోగపడుతుంది. కొందరికి తేలికపాటి తలనొప్పి, కండరాల నొప్పి ఒకటి రెండు రోజులు ఉండొచ్చు, కాని, అది సాధారణం. గర్భిణులు లేదా తాజాగా డెలివరీ అయిన తల్లులు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇది తల్లికి, పాలిచ్చే శిశువుకి ఎటువంటి హాని చేయదు.నాకు ఇది మూడవ ప్రెగ్నెన్సీ, మూడవనెల. ముందు రెండు నార్మల్ డెలివరీలు అయ్యాయి. ఈసారి కూడా నార్మల్ డెలివరీ అవుతుందనుకుంటున్నాను. కాని, డెలివరీ అయిన వెంటనే పిల్లలు కలగకుండా చేసే పద్ధతులు ఉన్నాయని విన్నాను. అవి నిజంగా పనిచేస్తాయా? ఎంతవరకు సేఫ్‌గా ఉంటాయి? – బింధు, హైదరాబాద్. ఇప్పుడున్న ‘ఎల్ఏఆర్సీ’ అంటే (లాంగ్ యాక్టింగ్ రివర్సబుల్ కాంట్రాసెప్షన్) అనే పద్ధతులు చాలా సురక్షితంగా, ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ కాలంలో జీవితం బిజీగా ఉండటంతో, చాలా మంది మహిళలు డెలివరీ తర్వాత త్వరగా గర్భం రావడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అందుకే డెలివరీ సమయంలోనే ఈ పద్ధతుల గురించి మాట్లాడి, వాటిని అమలు చేయడం ఉత్తమం. మీరు ఇప్పటికే మూడో నెల దాటారు కాబట్టి, ఈసారి డెలివరీ రూమ్‌లోనే ఎల్ఏఆర్సీ ఆప్షన్ గురించి చర్చించుకోవచ్చు. నార్మల్ డెలివరీలో, ప్లాసెంటా బయటికి వచ్చిన పది నిమిషాల లోపలే ‘ఐయూసీడీ’ అంటే ‘ఇంట్రా యూటరైన్ కాంట్రాసెప్టివ్ డివైస్’ అనే పరికరాన్ని గర్భసంచిలో ఉంచవచ్చు. అది ఆ సమయానికే సులభంగా వేయవచ్చు. ఏదైనా కారణం వలన ఆ సమయంలో వేయలేకపోతే, వారం రోజుల్లో కూడా సులభంగా చేయవచ్చు. ఇది అనుభవజ్ఞులైన సీనియర్ డాక్టర్లు డెలివరీ రూమ్‌లోనే సురక్షితంగా చేస్తారు. ఇది పేషెంట్‌కి చాలా ఈజీగా, సౌకర్యంగా ఉంటుంది. డిశ్చార్జ్ అయ్యేలోపే చెక్ చేసి, సరిగా ఉన్నదని నిర్ధారిస్తారు. పైగా ఇది చాలా ఖర్చు తక్కువగా ఉంటుంది. తర్వాత వేరే సమయంలో మళ్లీ వచ్చి చేయాల్సిన అవసరం ఉండదు. డెలివరీ రూమ్‌లోనే ఇది పూర్తవడం వల్ల, మహిళకు భవిష్యత్తులో అవాంఛిత గర్భాలు రాకుండా నిరోధించవచ్చు. ఈ పద్ధతి సురక్షితమైనదే కాకుండా, చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎటువంటి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అయితే, ప్రతి మెథడ్‌కి చిన్నచిన్న జాగ్రత్తలు ఉండేలా, కొన్ని చిన్న ప్రతికూలతలు కూడా ఉంటాయి. ఐయూసీడీ వేసిన తర్వాత కొందరికి కొంచెం ఎక్కువ బ్లీడింగ్ రావచ్చు, కొద్దిగా నొప్పి ఉండొచ్చు. అరుదుగా డివైస్ ఊడిపోవచ్చు లేదా దాని దారాలు లోపలికి ఎక్కువగా వెళ్లిపోవచ్చు. అప్పుడు చెక్ చేయడం కాస్త కష్టమవుతుంది. ఇవన్నీ చాలా అరుదుగా జరిగే పరిస్థితులు మాత్రమే. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఐయూసీడీ వేసుకున్న తర్వాత ఆరు వారాల లోపు మళ్లీ డాక్టర్ చెకప్ తప్పనిసరిగా చేయించుకోవాలి. కొందరు ‘వేసుకున్నాం కదా’ అని నిర్లక్ష్యం చేస్తే, కొద్ది శాతం పేషెంట్లకు అవాంఛిత గర్భం రావచ్చును. దీని వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళనలు వస్తాయి. అలా జరగకుండా ఉండేందుకు రెగ్యులర్ ఫాలోఅప్ చాలా అవసరం. ఇంకా, సిజేరియన్ ఆపరేషన్ సమయంలో కూడా ఐయూసీడీ లేదా బర్త్ కంట్రోల్ ఇంప్లాంట్ వేయించుకోవచ్చు. ఈ ఇంప్లాంట్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది, దాని ఫెయిల్యూర్ ఛాన్్స 1% కన్నా తక్కువ. ఈ పద్ధతులు పాలిచ్చే తల్లులకు కూడా సేఫ్‌గానే ఉంటాయి. మొత్తం మీద, ఐయూసీడీ లేదా ఇంప్లాంట్ రెండూ గర్భనిరోధంలో విశ్వసనీయమైన పద్ధతులు. కొద్ది తాత్కాలిక సైడ్ ఎఫెక్ట్స్ తప్పితే, ఇవి మహిళల ఆరోగ్యానికి సురక్షితం. కాబట్టి డెలివరీ సమయంలోనే మీ గైనకాలజిస్టుతో చర్చించి, మీకు సరిపోయే పద్ధతిని ఎంచుకోవడం ఉత్తమం. -డా‘‘ భావన కాసు ,గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్-హైదరాబాద్ -
నిజమైన ధర్మం
అనగనగా ఒక అడవిలో ఒక నక్క, ఒక కోతి పక్కపక్కనే కాపురముండేవి. ఎవరి ఆహారం అవి సంపాదించుకుని తింటూ కాలక్షేపం చేసేవి. ఒకరోజు కోతి తన బిడ్డను కడుపునకు తగిలించుకుని ఆహారం కోసం బయటకు వెళ్లింది. కానీ ఆ రోజు దానికి ఎక్కడా ఆహారం దొరకలేదు. ఆకలి కడుపుతోనే ఇంటికి తిరిగి వచ్చింది. కనీసం తన బిడ్డకు కూడా ఆహారం పెట్టలేక పోయినందుకు బాధ పడింది. కోతికి పక్కనే ఉన్న నక్క ఇంట్లోంచి కమ్మటి పెసర గారెల వాసన వచ్చింది. ‘అబ్బ! కమ్మటి వాసన! నక్కబావ పెసర గారెలు వండినట్లున్నాడు. తన ఇంటికి వెళితే గారెలు పెడతాడు. దాంతో తన బిడ్డ ఆకలి ఈ పూటకు తీర్చవచ్చు’ అనుకుంది. నక్క ఇంటి తలుపు కొడుతూ, ‘నక్క బావా! నక్క బావా! తలుపు తియ్యవా!’ అంది కోతి. నక్క వెంటనే తలుపు తీయలేదు. తను వండిన పెసర గారెలు కోతికి కనిపించకుండా దాచింది. గారెలు తింటున్న తన పిల్లల్ని పక్క గదిలోకి పంపింది. ఆ తరువాత నెమ్మదిగా తలుపు తెరిచింది. తలుపు తెరుచుకోగానే కమ్మటి పెసర గారెల వాసన కోతిని చుట్టేసింది. దాంతో దానికి ఆకలి మరింత పెరిగింది. ‘నక్క బావా! ఏంటి విశేషం! మీ ఇంట్లో గారెల వాసన వస్తోంది’ అంది చుట్టూ పరికించి చూస్తూ కోతి.‘గారెలా! బూరెలా! ఎక్కడా ఆహారం దొరకక పోయేసరికి పిల్లల ఆకలి రాగాలు వినలేక ఇంట్లో ఉన్న గుప్పెడు పెసర్లతో మూడంటే మూడే గారెలు చేసి రెండు పిల్లలకి పెట్టి ఇప్పుడే ఒకటి నేను తిన్నా!’ నీరసంగా అంది నక్క. ఆశించిన పెసర గారెలు కోతికి నక్క పెట్టలేదు. నిరాశతో కోతి తన బిడ్డతో వెనక్కి వచ్చేసింది. కోతి వెళ్లటం గమనించిన నక్క దాచు కున్న గారెల్ని బుక్కింది. ఓ రోజు నక్క తన పిల్లలతో అడవంతా తిరిగినా ఆహారం దొరకలేదు. దాంతో నీరసంగా తన ఇంటికి చేరింది. నక్కకు పక్కనే ఉన్న కోతి ఇంట్లోంచి కమ్మటి బూరెల వాసన వచ్చింది.‘అబ్బ! కమ్మటి వాసన! కోతి బావ బూరెలు వండినట్లున్నాడు. తన ఇంటికి వెళితే బూరెలు పెడతాడు. దాంతో తన బిడ్డల ఆకలి ఈ పూటకు తీర్చవచ్చని’ ఆశించింది నక్క. కోతి ఇంటి తలుపు కొడుతూ, ‘కోతి బావా! కోతి బావా! తలుపు తియ్యవా!’ అంది నక్క. తింటున్న బూరెను పక్కన పెట్టి వెంటనే తలుపు తీసింది కోతి. తలుపు తెరుచుకోగానే కమ్మటి బూరెల వాసన నక్కను చుట్టేసింది. దాంతో దాని ఆకలి మరింత పెరిగింది. కోతి బూరెలు పెడితే బాగుండనుకుంది. గతంలో ఆకలితో వచ్చిన కోతికి ఒక్క గారె ముక్క కూడా పెట్టకుండా పంపిన సంఘటన గుర్తుకు వచ్చింది. కోతి కూడా తన బిడ్డల్ని ఆకలి కడుపుతో వెనక్కి పంపుతుందనుకుంది. కాని, కోతి అలా చేయలేదు. నక్కను, దాని పిల్లల్ని ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించింది. తను తినటానికి పెట్టుకున్న బూరెల్ని నక్కకు, దాని పిల్లలకు పెట్టింది. ‘కోతి బావా! నీకు బూరెలు ఉన్నాయా?’ ప్రశ్నించింది నక్క.‘ఇప్పుడే ఒకటి తిన్నాను. అతిథులైన మిమ్మల్ని తృప్తి పరచటం నా బాధ్యత. ముందు మీరు తినండి’ అంటూ మరో రెండు బూరెలు వడ్డించింది కోతి. నక్క తినలేక పోయింది. కోతి ప్రేమకు చలించిపోయింది. ‘కోతిబావా! చేసిన పాపం చెబితే పోతుందంటారు. ఆ రోజు నీకు, నీ బిడ్డకు తినటానికి సరిపోను పెసర గారెలున్నా ఆకలి కడుపుతో వెనక్కి పంపాను. గారెలు లేవని అబద్ధం చెప్పాను. ఈ రోజు నువ్వు తినటానికి పెట్టుకున్న బూరెల్ని మాకు అందించి మా ఆకలి తీర్చావు’ ఉబికి వచ్చిన కన్నీటి పొరలను తుడుచుకుంటూ అంది నక్క. కోతి చిరునవ్వుతో నక్కను దగ్గరకు తీసుకుని, ‘నక్క బావా! మనం ఇతరుల నుంచి ఏమి కోరుకుంటామో, ఏమి ఆశిస్తామో వాటినే ఇతరులకు చేయటం నిజమైన ధర్మం’ అంది కోతి. నక్కకు తన తప్పు తెలిసింది. ఆనాటి నుండి ఇంటికి వచ్చిన అతిథులను సత్కరించడమే కాకుండా, తను ఇతరుల నుండి ఏమేమి కోరుకుంటుందో, వాటిని ముందుగానే ఇతరులకు ఇవ్వటం నేర్చుకుంది. -
ఏం ఫీలున్నది మామా!
సాధారణంగా ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లి చూసేవి యాక్షన్, అడ్వెంచర్, డ్రామా; ఇంట్లో ఉండి ఓటీటీల్లో చూసేవి క్రైమ్, కామెడీ, ఫాంటసీ. ఇవి కాకుండా.. ఒక ‘బీభత్స, భయానక, భూత, ప్రేత, పిశాచ’ జానర్ కూడా ఉంది. అదే... హారర్! ఈ చిత్రాల ప్రత్యేకత ఏంటంటే.. థియేటర్‌కు వెళితే స్నేహితులతో, ఇంట్లోనైతే కుటుంబ సభ్యులతో కలిసి చూస్తాం. ‘బాబోయ్ హారర్!’ అనుకుంటాం కాని, చూడటం మాత్రం మానం. అదొక మజా. ఫీల్. దెయ్యాలతో సయ్యాట!ఎందుకంత పడి చచ్చిపోతాం?!గుండెల్లో దడ పుట్టించే, అరచేతులకు చెమటలు పట్టించే హారర్ సినిమాలను ఎందుకు మనం ఏరి కోరి చూస్తుంటాం? నడిచే శవాలు, భూత్ బంగళాలు కథాంశంగా ఉన్న సినిమాలను క్షణ క్షణం భయపడుతూనే ఎందుకు ఆస్వాదిస్తుంటాం? భయం అన్నది.. నిజ జీవితంలో వెనకడుగు వేసేలా చేస్తుంది. కాని, భయానకమైన సినిమా అనగానే ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా అడుగు ముందుకేస్తారు! ఎందుకిలా ప్రేక్షకులు భయాన్ని ‘కొని’ చూస్తుంటారు? ఎందుకు కొరివి దెయ్యం లాంటి భయంతో తల గోక్కుంటారు? ఈ ప్రశ్నలకు సమాధానం మనస్తత్వశాస్త్రంలో లేకపోలేదు. ‘పోరాడు.. లేదా, పారిపో..’భయమంటే మనం ఇష్టపడటానికి ముఖ్య కారణం ‘స్టిమ్యులేషన్’’! మెదడుకు చురుకు పుట్టించే ఇంద్రియ చలనం. సైన్స్ పరిభాషలో నాడీ మండల విద్యుత్ ప్రేరణ. భయం మానసికంగా, శారీరకంగా ఉద్రేకాన్ని జనింపజేస్తుంది. గుండె ఝల్లుమనటం ఇందుకే. థ్రిల్లింగ్ కోసం ‘కోరి తెచ్చుకునే’ భయంలో ఆందోళన, ఉత్సాహం.. రెండూ సమపాళ్లలో మిశ్రమంగా ఉంటాయి. ఊపిరి బిగబట్టి, సినిమాలో ఒక భయానక దృశ్యం చూస్తున్నప్పుడు, హఠాత్తుగా ఎదురయ్యే ఊహించని మలుపుతో మన శరీరంలో ఒక్కసారిగా విడుదలయ్యే అడ్రినలిన్ (ఎపినెఫ్రిన్) హార్మోన్.. ‘పోరాడు లేదా పారిపో’ అని సంకేతాలిస్తుంది. సినిమా కనుక మనం పోరాడేది, సీట్లోంచి పారిపోయేదీ (మరీ భయస్థులు అయితే తప్ప) ఏమీ ఉండదు. బదులుగా ఇంద్రియాలు పదునెక్కి థ్రిల్ కలుగుతుంది. అందుకే హారర్ సినిమాలంటే మనం భయపడుతూనే ఇష్టపడుతుంటాం. ‘హారి దేవుడా.. బయట పడ్డాను..’భయపెట్టే థీమ్‌లో ఉండే ఆసక్తికరమైన అంశం.. ‘కొత్తదనం’. ఆ కొత్తదనమే భయం పట్ల మనకు విపరీతమైన ఆకర్షణను కలుగజేస్తుంది. ‘అపోకలిప్టిక్’ సినిమాలు మీరు చూసే ఉంటారు. ఉదా : ‘ది డే ఆఫ్టర్ టుమారో’, ‘ఎ క్వైట్ ప్లేస్ డే వన్’, ‘ఆర్మగడాన్’ వంటివి. అవి మనకు వాస్తవ ప్రపంచానికి భిన్నంగా కొత్త భయానక లోకాలను చూపిస్తాయి. భూగోళం సమూలంగా ధ్వంసమైపోయి, మనిషి మళ్లీ మొదట్నుంచి పునరుజ్జీవనం పొందే సినిమాల్లోని (పోస్ట్–అపోకలిప్టిక్) భయానక సన్నివేశాలు కూడా థ్రిల్‌ను రేపుతాయి. భూగోళంపై గ్రహాంతర జీవుల దాడి, సమాధుల్లోంచి పైకి లేచి వచ్చే ‘జాంబీ’లు.. మన లోపల సృష్టించే కల్పిత భయాన్ని ‘తట్టుకోవటం’ అన్నది మనం ఏదో సాహసం చేస్తున్నామన్న భావనను, సంతృప్తిని కలిగిస్తుంది. అందుకే హారర్ సినిమాలను అంతా ఇష్టపడతారు. సినిమా పూర్తయ్యాక.. ‘హారి దేవుడా.. ప్రాణాలతో భయపడ్డాను..’ అని సినిమా హాలు నుండి పకపకా నవ్వుతూ బయటికి అడుగులు వేయటం కూడా ఓ గొప్ప అనుభూతిలా, ‘‘ఏం ఫీలున్నది మామా?’’ అనిపించేలా ఉంటుంది. బిక్కు బిక్కుమంటూ లుక్కుస్క్రీన్ మీద కనిపించే పాత్రల్లోని భయం, సినిమా చూస్తున్న వాళ్లలో కలిగే భయం ‘సింక్’ అవటం అన్నది ఒక మంచి బీభత్స, భయానక సినిమాలో ఉంటుంది. అందుకే భయం అంటే మనకు అంత క్రేజు. నరమాంస భక్షణ; దౌర్భాగ్యమైన, మానవత్వం లేని హింసాత్మక జీవితాన్ని గడిపే పాత్రలుండే ‘డిస్టోపియన్’ యాక్షన్ చిత్రాల్లోని హారర్ పట్ల ఉండే మన ఆసక్తిని అలాంటి సినిమాలు సంతృప్తి పరుస్తాయి కనుక, పైకి చెప్పకపోయినా లోలోపల ఆ సన్నివేశాలను బిక్కుబిక్కుమంటూనే చూడటానికి ఇష్టపడతాం. సురక్షిత భయాస్వాదనభయానక దృశ్యాలను ఆస్వాదించే మన సామర్థ్యం.. సైకాలజిస్టులు చెబుతున్న దానిని బట్టి ‘ప్రొటెక్టివ్ ఫ్రేమ్’ (భద్రతా చట్రం), డిటాచ్మెంట్ ఫ్రేమ్ (నిర్లిప్త చట్రం), కంట్రోల్ ఫ్రేమ్ (నియంత్రణ చట్రం) అనే మూడు మానసిక స్థితులపై ఆధారపడి ఉంటుంది. భయపడుతున్నప్పుడు కూడా మనం సురక్షితంగా ఉన్నామని వెనుక నుంచి వెన్ను తట్టి చెబుతుండే చట్రాలు ఇవి. హారర్ సినిమా చూస్తున్నప్పుడు... అదంతా నిజం కాదని, లోపలి పాత్రలు బయటికి వచ్చి మన పీక పట్టుకోవని ‘ప్రొటెక్టివ్ ఫ్రేమ్’ మనకు చెబుతుంటుంది. ఇక తెరపై కనిపిస్తున్న హారర్ నుంచి భావోద్వేగాల పరంగా మనల్ని నిర్లిప్తంగా ఉంచి, భయంలోని మజాను మాత్రమే మన వరకు తెచ్చేది ‘డిటాచ్మెంట్ ఫ్రేమ్’. మూడవదైన ‘కంట్రోల్ ఫ్రేమ్’... భయం పట్ల మన ధీమాను సడలనివ్వకుండా, థ్రిల్స్‌ని మాత్రం ఆనందించేలా చేస్తుంది.కొందరెందుకు ఇష్టపడరు?హారర్‌ను ఇష్టపడే వాళ్లు ఉన్నట్లే, హారరంటే అస్సలు ఆసక్తి లేని వాళ్లు కూడా ఉంటారు. ఇందుకు కారణం అందరి మెదడూ భయానికి ఒకేలా స్పందించక పోవటం. విపరీత సంచలనాలను, ఉరిమే ఉత్సాహాన్ని కోరుకునే వారు ఈ హారర్ చిత్రాలను లైక్ చేస్తారు. హారర్‌లోని సృజనాత్మకతను, కొత్త అనుభవాలను ఇష్టపడేవారు భయాన్ని కోరుకుంటారు. ‘దయ్యాల్లేవ్, గియ్యాల్లేవ్’ అనుకునేవారు; కల్పనలపై కుతూహలం లేనివారు హారర్ చిత్రాలను పట్టించుకోరు. ‘నీ బాధను అర్థం చేసుకోగలను’‘సహానుభూతి’ కూడా హారర్ చిత్రాల్లోని భయాన్ని ఇష్టపడటానికి ఒక కారణం అవుతుంటుంది. సహానుభూతి స్థాయి ఎక్కువగా ఉన్న వారు భయానక చిత్రాలను చూస్తున్నప్పుడు.. దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న తెరపై పాత్రలతో తాము సహానుభూతి చెందుతారు. తెరపై బాధను తమ మనసులోపల మరింత లోతుగా అనుభవిస్తారు. అయితే వయస్సు; స్త్రీ పురుష అంశం కూడా ఇక్కడ ముఖ్యమైనవే. యువ ప్రేక్షకులు, పురుషులు హారర్ చిత్రాలను ఎక్కువగా ఆస్వాదిస్తారు. అందుకు భిన్నంగా మహిళలు తరచుగా చెడును ఓడించి, సమాజాన్ని సవ్యంగా ఉంచే కథలను ఇష్టపడతారు.హారర్.. కలవారి కాలక్షేపం!ఇదొక ఆసక్తికరమైన విషయం. సంపన్న దేశాలలోని వారే హారర్ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడతారట! దీనినే ఇంకోలా చెప్పాలంటే హారర్ చిత్రాలు చూసే వారు సంపన్నులనే అర్థం తీసుకోవచ్చు. ‘రీసెర్చ్‌గేట్’ సైట్లో పొందుపరచి ఉన్న వివరాలను బట్టి, 2020లో 82 దేశాలలో జరిగిన అధ్యయనంలో సంపన్న దేశాల ప్రజలు (తలసరి జి.డి.పి. ఎక్కువగా ఉన్నవారు) హారర్ చిత్రాలను ఎక్కువగా చూస్తున్నట్లు వెల్లడైంది. దీనర్థం? ఆర్థిక భద్రత అనేది వ్యక్తులకు హారర్ పట్ల ‘ప్రొటెక్టివ్ ఫ్రేమ్’ని ఏర్పరుస్తోందని! జీవితం సమస్య కానప్పుడు వినోదం కోసం మనం భయంతో ఒక ఆట ఆడుకోవచ్చు. నవ్వులుగా మారే అరుపులుభయం ఇద్దర్ని ఏకం చేయడమే కాదు. మానవ సమూహాల మధ్య బంధాన్ని కూడా ఏర్పరుస్తుంది. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని భయానక చిత్రాలను చూస్తున్నప్పుడు.. భయం లేదా ఒత్తిడి కలిగే సమయంలో విడుదలయ్యే ‘కనెక్షన్ హార్మోన్’ అయిన ఆక్సిటోసిన్ క్రియాశీలం అవుతుంది. అందుకే భయంతో వేసే అరుపులు చివరికి ఉమ్మడి నవ్వులుగా మారుతాయి.భయం తర్వాత ప్రశాంతతహారర్ మూవీలో చివరికి భయానక పాత్ర ఓడిపోయి సినిమా హాల్లో లైట్లు వెలిగినప్పుడు అదొక అద్భుతమైన ప్రపంచంలా ఉంటుంది. మంచి అనుభూతిని కలిగించే రసాయనాలైన ‘ఎండార్ఫిన్’లను మెదడు విడుదల చేస్తుంది. ఫలితంగా సంతృప్తి, సంతోషం కలుగుతాయి. కుదుపు తర్వాతి స్థిరత్వం అది. కొంతమంది తీవ్ర భయం తర్వాత ఎందుకు ఉల్లాసంగా ఉంటారన్న దానికి ఇదే సమాధానం. ఏమైనా అదొక ఫీల్!· సాక్షి, స్పెషల్ డెస్క్ -
గుజరాతీ సమాచారం!
ఒక్కో కేసుదీ ఒక్కో తీరు. కొన్నిసార్లు చిల్లర దొంగతనం కేసు కూడా నెలల తరబడి పరిష్కారం కాదు. ఒక్కోసారి కోట్లు కొల్లగొట్టిన చోరులు కూడా సొత్తుతో సహా గంటల్లో దొరికేస్తారు. పంజగుట్టలోని అలుకాస్ జ్యూలర్స్లో 2006లో జరిగిన భారీ చోరీ కేసు అటువంటిదే! కేవలం 48 గంటల్లో కొలిక్కి వచ్చిన దీని దర్యాప్తులో తొలి అడుగు ఘటనాస్థలిలో దొరికిన గుజరాతీ పత్రికతో పడింది. అలా ముందుకు వెళ్లిన దర్యాప్తు అధికారులు ఘరానా దొంగ వినోద్ రాంబోలీ సింగ్‌తో పాటు అతడి అనుచుడు శ్రీకాంత్ సింగ్‌ను పట్టుకుని, చోరీ సొత్తు స్వాధీనం చేసుకోగలిగారు. ఈ నిందితులను న్యాయస్థానంలో 2011లో దోషులుగా నిర్ధారించిన శిక్ష కూడా విధించింది. అది 2006 మే 16.. పంజగుట్ట పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో అలుకాస్ జ్యూలరీ షోరూమ్ అప్పటికి అది ప్రారంభమై రెండు నెలలైనా కాలేదు. అంతవరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం ఉదయం 11 గంటల సమయంలో హడావుడిగా మారిపోయింది. సైరన్లు కొట్టుకుంటూ వరుసగా వచ్చిన పోలీసు వాహనాలు ఆ షోరూమ్ వద్ద హడావుడి చేస్తుండటంతో చుట్టుపక్కల షాపుల్లో కొనుగోళ్ల కోసం వచ్చిన కస్టమర్లకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. అంతలోనే ఓ వార్త ఆ ప్రాంతంతో పాటు నగరమంతటా దావానలంలా వ్యాపించింది. అలుకాస్ షోరూమ్‌లో ముందు రోజు రాత్రి దొంగలు పడి, రూ.10 కోట్ల విలువ చేసే బంగారు, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారనేది దాని సారాంశం. నాలుగు అంతస్తుల్లో నిర్మించి ఉన్న కార్ప్హౌస్లోని గ్రౌండ్, మొదటి, రెండో అంతస్తుల్లో అలుకాస్ షోరూమ్ ఉంది. భవనం వెనుక కుడివైపుగా నిర్మాణంలో ఉన్న మరో నాలుగు అంతస్తుల భవనంపైకి ఎక్కిన చోరులు పంజా విసిరేందుకు అనువైన సమయం కోసం అక్కడ మాటు వేశారు. అంతా సద్దుమణిగాక ఆ భవనం టెర్రాస్ పైనుంచి మూడడుగుల దూరంలో ఉన్న అలుకాస్ షోరూమ్ భవనంపైకి చేరుకుని, మెట్ల మార్గంలో రెండో అంతస్తుకు వచ్చారు. షట్టర్ పగులకొట్టి; రెండు, మొదటి అంతస్తుల్లోని డిస్ప్లేల్లో ఉన్న ఆభరణాలను తమతో తెచ్చుకున్న బ్యాగుల్లో సర్దుకున్నారు. లాకర్ల జోలికి వెళ్లని వీళ్లు దుకాణంలోని లైట్లన్నీ ఆర్పేసి, టార్చ్లైట్ల వెలుతురులో తమ పని పూర్తి చేసుకున్నారు. మళ్లీ రెండో అంతస్తులోకి వెళ్లిన చోరులు అక్కడ నుంచి ఓ తాడు సాయంతో పక్కనే ఉన్న మరో బిల్డింగ్‌పైకి దూకి పరారయ్యారు. మర్నాడు ఉదయం ఈ దొంగతనం విషయం యాజమాన్యం పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. తొలుత రూ. ఆరు కోట్ల విలువైన సొత్తు చోరుల పాలైనట్లు అధికారులకు తెలిపింది. పోలీసులు సైతం చోరీ జరిగిన తీరును గుర్తించారు. మరిన్ని కీలక ఆధారాల కోసం షోరూమ్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను అధ్యయనం చేయాలని భావించారు. ఆరాతీస్తే, షోరూమ్‌లో ఉన్న 12 కెమెరాలకు ఆ రోజు 10 పని చేయలేదని తేలింది. మిగిలిన రెండు మాత్రం ఇద్దరు వ్యక్తులు తచ్చాడుతున్నట్లు చూపించాయి. చోరీ జరిగిన తీరు, షోరూమ్‌లో సీసీ కెమెరాలు పని చేయకపోవడం పరిశీలించిన పోలీసుల దృష్టి తొలుత సంస్థ ఉద్యోగులపైనే పడింది. వారిలో ఎవరైనా లేదా వారి సహకారంతో ఎవరైనా ఈ నేరం చేశారా అనే దిశగా దర్యాప్తు చేసినా ఫలితం దక్కలేదు. చోరులు అలూకాస్లోకి ప్రవేశించడానికి ఉపయోగించిన నిర్మాణంలో ఉన్న భవనంపై పోలీసుల దృష్టి పడింది. అక్కడే అసంకల్పితంగా వెతకబోయిన తీగ పేపర్ రూపంలో పోలీసుల కాలికి తగిలింది. ఆ భవనం నాలుగో అంతస్తులో ఖాళీ బిర్యానీ పొట్లాలు, సిగరెట్ పీకలు ఉండటాన్ని బట్టి చోరులు అక్కడే వేచి ఉన్నారని దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. అదే ప్రాంతంలో ‘గుజరాత్ సమాచార్’ దినపత్రిక పడి ఉండటాన్నీ గమనించారు. దానిని చోరులే తెచ్చి ఉంటారని భావించిన పోలీసులు ఆ కోణంలో ఆరా తీశారు. ఆ పత్రిక గుజరాత్‌తో పాటు ముంబైలోనూ దొరుకుతుందని తేలడంతో ఆ రెండు రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేశారు. నగరం నుంచి బయలుదేరిన ప్రత్యేక బృందం ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులను కలిసింది. దుకాణంలోని సీసీ కెమెరాల్లో లభించిన ఫీడ్‌ను వారికి చూపించడంతో పాటు నేరం జరిగిన విధానాన్నీ వివరించింది.అవన్నీ చూసిన ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారుల మదిలో మెదిలిన పేరు వినోద్ రాంబోలీ సింగ్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇతను మహారాష్ట్రలోని సౌత్ ముంబైకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న దహిసార్‌లో స్థిరపడ్డాడు. ఆ రెండు రాష్ట్రాల్లోనూ అప్పటికే అతడిపై ఇరవైకి పైగా చోరీ, దోపిడీ కేసులు నమోదై ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న వేగులను ఆరా తీయగా, వారం రోజులుగా అతడు కనిపించలేదని, రెండ్రోజుల క్రితమే తిరిగి వచ్చాడని తెలిసింది. దీంతో అలుకాస్ భారీ చోరీ అతడి పనిగా నిర్ధారించిన పోలీసులు 2006 మే 18 అర్ధరాత్రి బరివోలిలోని ఓ బార్‌పై దాడి చేశారు. అక్కడ రాంబోలీ సింగ్‌తో పాటు చోరీ సొత్తు కొనుగోలుకు వచ్చిన సూరత్ వజ్రాల వ్యాపారి అజయ్ షా పట్టుబడ్డారు. వీరి నుంచి రూ. 6 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలను రికవరీ చేశారు. రాంబోలీ సింగ్‌కు సహకరించిన శ్రీకాంత్ సింగ్‌ను కొన్ని రోజుల తరవాత అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టు 2011లో శిక్ష విధించింది. 1982 నుంచి నేరాలు చేస్తున్న వినోద్ రాంబోలీ సింగ్ కదలికలు అలుకాస్ నేరం తర్వాత హైదరాబాద్‌లో కనిపించలేదు. 2017లో థానేలోని అంబర్‌నాథ్‌లో ఉన్న జ్యూలరీ షాపు నుంచి రూ.1.7 కోట్ల నగలు, 2022లో దాదర్‌లో ఉన్న పీడీ పెడ్నేకర్ జ్యూలరీ షాపు నుంచి రూ.1.24 కోట్ల విలువైన నగలు చోరీ చేసి పోలీసులకు చిక్కాడు. అంబర్నాథ్ చోరీ తన ‘వృత్తి’లో భాగంగానే చేసినా, పీడీ పెడ్నేకర్‌లో మాత్రం ప్రతీకారంతో చేశాడు. 2022 జూలైలో ఆ దుకాణానికి వెళ్లిన రాంబోలీ సింగ్ కొంత బంగారం ఖరీదు చేశాడు. కేవలం రూ.2 వేల డిస్కౌంట్ విషయంలో దాని యజమాని సోనాలీ ముడ్కేఖర్తో వాగ్వాదం జరిగింది. తనకు రాయితీ ఇవ్వని ఆ దుకాణంపై కక్షకట్టిన రాంబోలీ సింగ్ మరో అనుచరుడితో కలిసి ఆ ఏడాది ఆగస్టు 24న ఈ చోరీ చేశాడు. -
మా అమ్మే నా శత్రువు
ఆ టెలిగ్రామ్ చూడగానే రామ్ సదై బాబులో ఆందోళన మొదలైంది. గబుక్కున స్టూలుమీద నుంచి లేచి, ‘‘ఈ ఉద్యోగం మానేయాలి. నా వల్ల కాదు’’ అనుకుంటూ భార్య ఉన్న గదిలోకి ప్రవేశించాడు.ఆమె గర్భవతి. మంచం మీద విశ్రాంతి తీసుకుంటోంది. భర్త చేతిలో టెలిగ్రామ్ చూడగానే ఆమెకు విషయం అర్థమైంది. ‘‘ఇంతకీ ఏమైంది?’’ భర్తను ఆత్రంగా అడిగింది.‘‘నా సెలవుకు అనుమతి లభించలేదు’’ నిస్పృహగా అన్నాడు రామ్ సదై. ‘‘నీ పరిస్థితి గురించి అంతా పూసగుచ్చినట్టు వివరించాను. వాళ్లకు కనీసం కనికరం కలగలేదు. రేపు మధ్యాహ్నం నేను బయలుదేరాలి’’ అని ఒక నిముషం ఆగి మళ్లీ చెప్పాడు. ‘‘ఉద్యోగానికి రాజీనామా చేసి ఉన్న పొలాన్ని సాగు చేసుకోవటం మంచిదనిపిస్తోంది’’.శశిముఖి మధ్యలోనే అందుకుంది. ‘‘మనిద్దరమే అయితే మీకు ఉద్యోగం ఉన్నా, లేకపోయినా ఫరవాలేదు. కానీ ఇప్పుడు..’’ అర్ధోక్తితో ఆగిపోయింది.ఆమె పూర్తిగా చెప్పవలసిన పనేం లేదు. తమ ఆర్థిక పరిస్థితి గురించి రామ్ సదైకి పూర్తి అవగాహన ఉంది. అందుకే వెంటనే స్పృహలోకి వచ్చి, కోపాన్ని అదుపు చేసుకున్నాడు. తర్వాత కోర్టు పని మీద బయటకు వెళ్లాడు. అతను తిరిగి వచ్చిన తర్వాత భార్య అడిగింది. ‘‘ఇంతకీ మీరేం నిర్ణయించుకున్నారు?’’. ‘‘నేనేం చేయాలో నువ్వే చెప్పు?’’ అన్నాడు రామ్ సదై. ‘‘ఈ పరిస్థితుల్లో నిన్ను వదిలేసి నేను ఎలా వెనక్కి తిరిగి వెళ్లేది? ఒకవేళ తీసికెళదామనుకున్నా అది దగ్గరా దాపూ కాదు. డాక్టర్లు నిన్ను ప్రయాణాలు చేయవద్దని హెచ్చరించారు. పోనీ మనకు తెలిసిన వాళ్లను సాయం చేయమని అడుగుదామా?’’‘‘హాస్పిటల్లో పనిచేసే మంత్రసానిని రోజూ రమ్మనమని చెబుతాను. అవసరమైతే తను నీతోనే ఉంటుంది. ఎలాగూ ఏడెనిమిది రోజుల్లో మథుర్ కాకా వచ్చేస్తారు. ఈలోపు నీకు ఇబ్బంది ఉండదు..’’.అతని మాటలను మధ్యలోనే అడ్డుకుంటూ.. ‘‘నయన్ దీదీని రమ్మని పిలవకూడదూ.. ఇక్కడికి దగ్గరేగా. తనొచ్చి నాకు తోడుగా ఉంటుంది’’ అంది శశి. ‘‘నువ్వు భలే చెప్పావు. నీకు సాయం చేయటానికి ఎవరెవరిని పిలవాలా అని సతమతమవుతున్నాను. నాకెందుకు నయన్ పేరు తట్టలేదో? ఈ మధ్య నా బుర్ర పనిచేయటంలేదు’’తలకొట్టుకుంటూ అన్నాడు రామ్ సదై.నయనతార భర్త హరిపాద గంగూలీ. దర్భంగాలో రైల్వేలో పనిచేస్తున్నాడు. తనకి వచ్చే అరకొర జీతంతో కుటుంబాన్ని నెట్టుకు రావటానికి ఇబ్బంది పడుతున్నాడు. ఈ మధ్యనే వాళ్లకు ఒక బాబు పుట్టాడు.రామ్ సదై తన భార్య పరిస్థితిని పూర్తిగా వివరించి నయనతారను వెంటనే బయలుదేరి రావలసిందిగా లేఖ రాశాడు. ఆమె ఖర్చులకు డబ్బులు కూడా పంపాడు. ఆమె శశిముఖికి దూరపు చుట్టం. వరసకు అక్క అవుతుంది. ఓ వైపు డబ్బుకు కటకటలాడటం, మరో వైపు తన కంటే డబ్బు ఉన్న చెల్లెలి కుటుంబానికి సాయపడితే కొంతయినా ఉపయోగపడుతుందన్న ఆలోచనతో వెనకా ముందు ఆలోచించకుండా ముజారఫ్పూర్ బయలుదేరింది నయన.రామ్ సదై వెళ్లే రైలులోనే ఆమె దిగింది. తల మీద నుంచి మోకాళ్ల వరకూ షాల్ కప్పుకుని పసిపిల్లవాడిని చేతిలో ఉంచుకున్న నయనతారను చూడగానే అతనికి సంతోషం కలిగింది. ‘‘నువ్వొచ్చావు. నాకు కొంచెం ఆందోళన తగ్గింది. ఇద్దరు ఆడవాళ్లను ఒంటరిగా వదిలేసి వెళుతున్నందుకు దిగులుగానే ఉంది. ఏం చేయను తప్పటం లేదు. కాకా త్వరలోనే వచ్చేస్తాడు. ఈలోపు ఎలాంటి ఇబ్బంది ఉండదనే అనుకుంటున్నాను’’ అని జాగ్రత్తలు చెప్పాడు. ఆ తర్వాత తన దగ్గర పనిచేసేవాడిని పిలిచి ఆమెకి వాహనం సిద్ధం చేయమని చెప్పి రైలెక్కేశాడు. ఆ మర్నాడే శశిముఖికి ప్రసవం అయ్యింది. మరి కాసేపటికే ఇబ్బందికర పరిస్థితుల్లో పడింది. నయనతారకి ఆమెను ఎలా ఊరడించాలో అర్థం కాలేదు.తన పరిస్థితి అర్థం చేసుకున్న శశిముఖి ‘‘అక్కా, ఖోకాను ఒక్కసారి నాకు చూపిస్తావా? అనడిగింది.వెంటనే నయనతార పసిబిడ్డను తీసుకొచ్చి ఆమె పక్కలో ఉంచింది. ‘‘దీదీ.. నాకు ఇంకా ఎక్కువ సమయం లేదు. ఈ బిడ్డను నీ చేతుల్లో పెడుతున్నాను. నీ బిడ్డ మాదిరిగానే వాడిని సాకుతానని మాటివ్వు’’. అంది శశిముఖి. ‘‘వీడొకటి.. నా బిడ్డకొకటి వేర్వేరు కాదు. ఇద్దరూ నాకు సమానమే.. పైగా ఇప్పడు ఈ మాటలన్నీ ఎందుకు? నీకేం కాదు. నువ్వు బాగానే ఉంటావు. భయపడకు. ఒకవేళ భగవంతుడు అలా రాసిపెట్టి ఉండి ఏదయినా అనుకోనిది జరిగితే, మీ అబ్బాయికి తల్లి లేని లోటు ఉండదు.’’ ధైర్యం చెప్పింది నయన.కానీ అర్ధరాత్రి గడిచేసరికి శశిముఖి ప్రాణాలు విడిచింది. రామ్ సదై బాబుకు రెండు టెలిగ్రామ్‌లు వెంట వెంటనే అందాయి. తన భార్య ఆరోగ్య పరిస్థితి సరిగా లేదనే సమాచారంతో ఒకటి, హఠాత్తుగా ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లిందన్న విషాదకర వార్తతో మరొకటి. అంతగా వెలుతురు లేని గదిలో ఉంది నయన. శశిముఖికి పరిచయం ఉన్న వాళ్లెవరో పరామర్శకని ఇంటికి వచ్చారు. ఆ సమయంలో తన బిడ్డను మంచం మీద పడుకోబెట్టి శశిముఖి బిడ్డకు పాలిస్తోంది నయన. అదే మంచం మీద వచ్చిన అతిథులను సర్దుకుని కూర్చోమని చెప్పింది. లాంతరు ఒత్తిని కొంచెం పెద్దది చేసింది. గదిలో కొంచెం వెలుతురు ఎక్కువయ్యింది.అక్కడికొచ్చిన వినోద్ బాబు భార్య.. ‘‘ఈ పిల్లవాడు దీదీ బిడ్డ అన్న మాట. అచ్చం అమ్మలాగా ఎంత అందంగా ఉన్నాడు. కనీసం అమ్మను చూసుకోలేకపోయాడు పాపం’’ అంది. అంతలోనే ఆమె పక్కన కూర్చున్న మరో ఆమె అందుకుంది. ‘‘వాడి మొహం చూడు. అచ్చు వాళ్లమ్మలా మిసమిసా మెరిసిపోతుంది. తను ఎంత మంచిది! ఆరోగ్యం సరిగ్గా లేదని మాకు ముందే చెప్పి ఉంటే ఎలాగోలా కాపాడుకునేవాళ్లంగా ’’ ఇలా చెప్పుకుపోతోంది.ఆ బిడ్డ శశిముఖి సంతానం కాదని, తన బిడ్డ అని చెప్పబోయి నయనతార ఆగిపోయింది. ఇద్దరు పిల్లల్లో ఎవరు ఎవరి బిడ్డ అని తేల్చి చెప్పటం ఇతరులకు చిక్కు సమస్యే! నల్లగా బలహీనంగా ఉన్న బిడ్డను నయనతార బిడ్డగానూ, అప్పుడే పుట్టిన వాడికంటే బాగా పుష్టిగా ఉన్న నయనతార బిడ్డను శశి బిడ్డగానూ వాళ్లు భావించారు. అందరూ వెళ్లిపోయాక తీరిగ్గా చాలాసేపు ఆలోచించింది నయన. అసలు చిక్కుముడిని విడతీయకపోతే పోయేది ఏం ఉంది అన్న ఆలోచన చేసింది. తన బిడ్డకు తల్లి లేని లోటు లేకుండా చేస్తానని శశిముఖికి మాటిచ్చాను. దానిని కాపాడుకోవచ్చు.అలాగే మరో వైపు డిప్యూటీ బాబు సంపదతో తన బిడ్డ పెరిగి పెద్దవాడవుతాడు. దానికి అడ్డుకోవటం ఎందుకు? తల్లి లేని బిడ్డకు తల్లినవుతున్నాను కదా..? అని తనను తాను సమాధానపరుచుకుంది. శశిముఖి వార్త తెలియగానే పదిరోజులు సెలవు పెట్టి ఇంటికి వచ్చాడు రామ్ సదై. ఆమె మరణించిందన్న వాస్తవాన్ని జీర్ణించుకో లేకపోయాడు. ఆమె ఉన్నదనే భావనతోనే ఇంట్లో కలియతిరుగుతున్నాడు. డాబా మీద, వంటింట్లో, స్నానాల గదిలో ఇలా ఆమె కోసం వెతుక్కుంటున్నాడు. గుండె బద్దలై పిచ్చివాడిలా వ్యవహరిస్తున్నాడు.ఇదంతా చూసి కదిలిపోయినట్టుగా నటించింది నయనతార. రాని కన్నీళ్లను తుడుచుకుంటూ.. ‘‘జరిగిందేదో జరిగిపోయింది. ఆమె ఇక తిరిగి రాదు. ఆ విషయాన్ని అర్థం చేసుకో. లోపలికి వచ్చి కాస్త ఎంగిలిపడి ఆ తర్వాత విశ్రాంతి తీసుకో’’ అంది.ఆమెను చూడగానే స్పృహలోకొచ్చాడు. ఆమె చెప్పినట్టే స్నానం చేసి, భోజనం చేసి ఆ తర్వాత వాలు కుర్చీలో కూర్చున్నాడు. పనివాడు అందించిన హుక్కాను పీలుస్తూ ఆలోచనల్లోకి జారుకున్నాడు. నయన్ చేతిలో పసిపిల్లవాడితో అక్కడకి వచ్చింది. ‘‘పిల్లవాడు కాస్త సన్నగా ఉన్నాడు. కానీ మీ ఇద్దరికి బాగా పోలికలున్నాయి’’ అని చెప్పి పిల్లవాడిని అతని పొత్తిళ్లలో ఉంచబోయింది.రామ్ సదైకి వాడిని చూడాలనిపించలేదు. ‘‘తల్లిని మింగేసిన రాక్షసుడు’’ అన్నాడు పరుషంగా. ‘‘నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. కానీ వాడిని వదిలేస్తే..’’రామ్ సదై ఆ చిన్నారిని సరిగా ఒడిలో పడుకోబెట్టుకోలేదు. దాంతో అసౌకర్యంగా అనిపించి ఆ పిల్లవాడు ఏడుపు అందుకున్నాడు. ‘‘ఏమిటో ఈ పిల్లాడు.. పెద్దమ్మ అయిన నా దగ్గరకి తప్ప ఎవరి దగ్గరకీ వెళ్లడు’’ అంటూ నయన ఆ పిల్లవాడిని తీసుకుని భుజం మీద వేసుకుంది. ఆ తర్వాత చెల్లెలి భర్తతో భవిష్యత్తు గురించి చర్చించటం మొదలుపెట్టింది.‘‘నువ్వొచ్చేశావ్ కదా? నేను మా ఊరు బయలుదేరతాను. నేను సర్దుకోవలసిన చాలా ఉన్నాయి’’ అంది. ‘‘వద్దొద్దు ఆ పని మాత్రం చేయొద్దు. ఈ పిల్లవాడిని నేను పెంచి పెద్ద చేయలేను. ఉద్యోగంలో టూర్లు చేస్తూ వీడిని చూసుకోవటం కాని పని. నువ్విక్కడే ఉండు. మీ ఆయనకు కూడా ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చూస్తాను’’ అన్నాడు. అది చాలా భారమైన పని అన్నట్టు ప్రవర్తించింది నయనతార. ‘‘ఇతరుల పిల్లలను సొంత పిల్లల్లా పెంచటం కష్టం. అదీగాక సమాజం కూడా ఏదో ఒక తప్పు ఎంచుతూ ఉంటుంది. కానీ నీ ఇబ్బందిని చూసిన తర్వాత కాదనాలనిపించటం లేదు. నాకు శక్తికి మించిన పనే అయినా చేస్తాను’’ అంటూ రామ్ సదై కి తన పట్ల సానుభూతి కలిగేలా జీవితాంతం అతను తన మీద కృతజ్ఞత చూపేలా మాట్లాడింది. ‘‘శశిముఖి బిడ్డను తన బిడ్డలా సాకుతోంది. అంతే కాదు. తనకు కూడా ఓ పసిబిడ్డ ఉన్నాడన్న స్పృహనే ఆమెకు లేదు’’.చాలామంది నయనతార గురించి గొప్పగా చెప్పటం ప్రారంభించారు. రామ్ సదైలో కూడా ఇదే అభిప్రాయం ఏర్పడింది. తన బిడ్డకు లోటు లేకుండా చూస్తున్న ఆమె సాధారణ వ్యక్తి కాదు అనుకునేవాడు. గుండ్రంటి అందమైన తన పిల్లవాడిని అతని బిడ్డగా చెప్పేది. అది అతనూ నిజమేనని భావించేవాడు. రామ్ సదై టూర్‌కి వెళ్లి వచ్చినప్పుడల్లా ఇద్దరు పిల్లలకు కొత్త బట్టలు కొని తెచ్చేవాడు.తన బిడ్డగా ఆమె చెప్పుకుంటున్న పిల్లవాడికి కొత్త బట్టలు ఇచ్చినప్పుడు, ‘‘వాడికి ఇదంతా అలవాటు చేయకు. వాడు పేద ఇంటి పిల్లాడు. అలాగే పెరగనివ్వు. లేకపోతే వాడు పరిస్థితులకు సర్దుకోవటం కష్టం’’ అని వారించేది. దాంతో నయన తారపైన రామ్ సదైకి మరింత అభిమానంపెరిగింది. ఎంత ఆత్మగౌరవం ఉన్న మనిషి అనుకుని ముచ్చటపడేవాడు. దాంతో మరింత ఎక్కువగా అతనికి బహుమతులు ఇవ్వటం మొదలుపెట్టాడు. ఈ రకంగా డిప్యూటీ బాబు కుమారుడు జతిన్, నయనతార కుమారుడు ఉపేన్లు స్థానాలు మార్చుకుని భిన్నమైన పాత్రల్లో పెరగటం మొదలుపెట్టారు. ప్రతిరోజూ పాఠాలు చెప్పటానికి ట్యూటర్ ఇంటికి వచ్చేవాడు. జతిన్ చిన్నతనంలోనే ఓ విషయం గ్రహించాడు. తను పేదింటి బిడ్డ కావటంతో ప్రపంచం పెద్దగా తన పట్ల ఆసక్తిని చూపదు అని సరిపెట్టుకున్నాడు. స్కూలులో అతను ఎంతగా ప్రయత్నించినా కూడా ప్రధానోపాధ్యాయుల ప్రశంసలన్నీ ఉపేన్ వైపే ఉండేవి. జతిన్ ప్రయత్నాలను, తెలివితేటలను గుర్తించి ట్యూటర్ అతనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం ప్రారంభించాడు. ఉపేన్ ఒక క్లాసులో తప్పితే అతన్ని అదే క్లాసులో ఉంచేందుకు ప్రయత్నించారు. కానీ నయనతార పోరాడి అతను పై తరగతిలో అడుగుపెట్టేలా చేయగలిగింది. దాని వల్ల అతనికి బహుమతులు లభించాయి. జితిన్ ఇలాంటి అడ్డదారులను నమ్ముకోలేదు.తల్లి ప్రేమకు నోచుకోకుండానే పెరిగి పెద్దవాడయ్యాడు జతిన్. కానీ సరస్వతీదేవి అనుగ్రహం మాత్రం అతనికి పుష్కలంగా ఉండేది. దాంతో అతనికి ఎన్నో అవార్డులు, పురస్కారాలు అతని సొంతమయ్యాయి. అతనికి ఫీజులు చెల్లించటం మానేయమని, ఏదయినా చిన్న ఉద్యోగంలో అతన్ని చేర్చమని నయనతార అప్పుడప్పుడు రామ్ సదైతో అనేది. అతను ఈ మాటలను పెద్దగా పట్టించుకునేవాడు కాదు. దాంతో జతిన్‌ను పిలిచి మందలించింది. ‘‘ఇంకోళ్ల డబ్బుతో చదువుకోవటానికి సిగ్గులేదా నీకు. ఇప్పటికి చదివింది చాలు. రామ్ సదై మంచివాడు కాబట్టి ఇంతకాలం నిన్ను బాగా చూసుకున్నాడు. ఇంకొకళ్లయితే నిన్ను వీధిలోకి విసిరేవాళ్లు’’.తల్లి మాటలకు బాగా నొచ్చుకున్న జతిన్– రామ్ సదైని కలిశాడు. తాను కోల్కత్తా వెళుతున్నానని, స్కాలర్ షిప్పు డబ్బులతో చదువుకుంటానని చెప్పాడు. ‘‘ఏమైంది. ఇక్కడ ఏదయినా ఇబ్బంది అనిపిస్తోందా?’’ అడిగాడు రామ్ సదై.‘‘అదేం లేదు. పై చదువులు చదువుకోవటానికి కోల్కత్తా అనుకూలంగా ఉంటుందని..’’ జవాబు చెప్పాడు జతిన్.ఆ తర్వాత కోల్కత్తా వెళ్లి అక్కడ ఒక మెస్సులో ఉన్నాడు. ఎవరి నుంచి పైసా సాయం ఆశించకుండా తన సొంత డబ్బుతో కష్టపడి చదువుకున్నాడు. ముందు బీఏ డిగ్రీ పూర్తి చేసి, ఆ తర్వాత లాయర్ అయ్యాడు.ఉపేన్ అతనికి దరిదాపుల్లో లేడు. చదువులోగానీ, పేరు ప్రఖ్యాతుల్లో గానీ.కానీ అతని పెద్దమ్మగా నయనతార అన్ని విషయాల్లో అతన్ని పొగుడుతూండేది. ఇది ఇంకెంత కాలం కొనసాగేదో గానీ, ఇంతలోనే అనుకోని పరిణామం సంభవించింది.హఠాత్తుగా కలరా వ్యాపించటంతో పనిచేస్తున్న చోటే మృత్యువు పాలయ్యాడు రామ్ సదై. ∙∙ ‘‘ఉపేన్, మనకి ఏమవుతుంది? మీ నాన్న వదిలేసిన దాన్ని ఎలా మేనేజ్ చేస్తావో కూడా తెలియటం లేదు’’ నయనతార ఆందోళనగా అంది.‘‘ఫరవాలేదు పెద్దమ్మా.. మనం ఉన్నదానితో సర్దుకోగలం’’ జవాబిచ్చాడు ఉపేన్.‘‘అది వీలుకాని పని. మనకు అప్పు ఇచ్చే వాళ్లు కూడా కనిపించటం లేదు’’ దీనంగా చెప్పింది నయన.‘‘ఒకసారి తాతగారిని కలుద్దాం. ఆయన మనకు ఏమైనా సలహా ఇస్తారు’’ అన్నాడు ఉపేన్.ఈ సమయానికి జతిన్ లాయర్‌గా దర్భంగాలో మంచి పేరు ప్రఖ్యాతులు గడించాడు. సంపాదన బాగా పెరిగింది. ఉపేన్ని తన సొంత తమ్ముడిలా ప్రేమించేవాడు. వాళ్ల పరిస్థితి తెలిసిన తర్వాత అప్పులన్నీ తీర్చేశాడు. అంతే కాదు. వాళ్లను తనతో వచ్చెయ్యమని కోరాడు.జతిన్ ఆస్తిపాస్తులన్నీ చూసిన తర్వాత నయనతార అసూయ కలిగింది. మాటల్లో వర్ణించలేనంత పశ్చాత్తాపానికి లోనయ్యింది. పిల్లలను అటూ ఇటూ మార్చటం వల్ల తాను సాధించింది ఏమీ లేదని గుర్తించింది. కనీసం తనే అతని తల్లిని అనే మాటను కూడా జతిన్‌కు చెప్పుకోలేని స్థితిలో ఉన్నందుకు చింతించింది. ఉపేన్కు చెడ్డ స్నేహితులు ఎక్కువయ్యారు. ఎక్కువ సమయం వాళ్లతో గడుపుతూ జులాయిగా తిరిగేవాడు. ‘‘నీకోసం మంచి ఉద్యోగం చూశాను. అందులో చేరావంటే అంతా సక్రమంగా సాగుతుంది. నీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది’’ అతనికి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు జతిన్.ఉపేన్‌కి ఈ సలహా నచ్చలేదు. నయనతార చాలా రోజులుగా అతనికి బ్రెయిన్ వాష్ చేస్తోంది. జతిన్ తమకు రుణపడ్డాడని. ఉపేన్ అతన్ని ఏమైనా అని సాధించవచ్చని సలహా ఇచ్చింది. ‘‘నువ్వు నన్ను వదుల్చుకోవాలనుకుంటున్నావా?’’ అడిగాడు ఉపేన్.ఈ మాటలకు జతిన్ మనసు గాయపడింది. ‘‘ఇంకెప్పుడూ నిన్ను పనిచేయమని నేను అడగను’’ అని అక్కడ నుంచి చకచకా కదిలి వెళ్లిపోయాడు. హరిపాద, అతని భార్య తీవ్రస్థాయిలో తగువు పడ్డారు. జతిన్‌కి అతను మంచి సంబంధం తెచ్చాడు. అమ్మాయి పేరు సరోజిని. ప్రభుత్వ ప్లీడరు కార్తీకబాబు కుమార్తె. అతను బాగా ఆస్తిపరుడు. జతిన్, సరోజినిల జంట బావుంటుందని, స్వర్గంలో కుదిరిన సంబంధం అని ఎంతగానో భావించాడు. అతను వంశచరిత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. నయనతార ఈ మాట వినగానే ఇంతెత్తున ఎగిరింది. ‘‘మన జీవితాలను తీర్చిదిద్దిన వ్యక్తిని ఆయన లేనంత మాత్రాన మరచిపోతామా? పాపం ఆయన బిడ్డను అలాగే వదిలేస్తామా? నా కంఠంలో ప్రాణం ఉండగా అలా ఎప్పటికీ జరగనివ్వను. మీరు ఆ అమ్మాయిని ఉపేన్‌కి ఇచ్చి వివాహం చేయండి. లేకపోతే నేను ఉరిపోసుకుని చస్తా’’ అని హెచ్చరించింది.భార్య ప్రవర్తనతో కంగుతిన్నాడు హరిపాద. ఆమెతో వాదించి ప్రయోజనం లేదనిపించి అక్కడ నుంచి మాయమయ్యాడు.ఎలాగయినా ఈ పెళ్లిని అడ్డుకోవాలని నిర్ణయించుకున్న నయన ముందుగా జతిన్‌కి కబురు పెట్టింది. ఉపేన్‌కి అతను ఎలా రుణపడ్డాడో చెప్పుకొచ్చింది.అతను అనుభవిస్తున్న సంపద అంతా రామ్ సదై బాబు దయ వల్లనే సాధ్యపడిందని, వాళ్లిద్దరి రుణం తీర్చుకునే సందర్భం వచ్చిందని వివరించింది. ‘‘ఇప్పుడు అంత దుర్మార్గంగా ఎలా వ్యవహరించగలుగుతున్నావ్’’ అని నిలదీసింది. ‘‘అమ్మా, ఈ పెళ్లి సంబంధం కుదిర్చింది నాన్న కదా? ఆయనతోనే నువ్వు మాట్లాడు’’ అని జతిన్ ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత కోర్టుకు వెళ్లిపోయాడు.దాంతో నయనతారకు మరే ప్రత్యామ్నాయం కనిపించలేదు. ఉపేన్‌ను కలుసుకుని, ‘‘బాబూ, నీతో మాట్లాడాలి’’ అంది.‘‘జతిన్ పెళ్లి గురించి నువ్వు వినే ఉంటావు. నువ్వేం కంగారు పడకు. కిందా మీదా పడయినా సరే, అదే అమ్మాయినిచ్చి నీకు పెళ్లి చేస్తా’’ అని ప్రకటించింది. దాంతో కంగుతిన్నాడతను.‘‘పెద్దమ్మా? ఏమిటి నువ్వు అంటున్నది?’’ గట్టిగా అరిచాడు. ‘‘పూర్వీకులు, వంశ చరిత్ర, సామాజిక స్థితి అన్నింటిని పరిశీలించారు. వాళ్లిద్దరి జాతకాలు కుదిరాయి. ముహూర్తం నిశ్చయించారు. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు తన కూతురిని తమ్ముడికి కాకుండా నాలాంటి మూర్ఖుడికివ్వటానికి సిద్ధపడే వాళ్లు ఎవరు ఉంటారు చెప్పు’’ అనడిగాడు. ‘‘నువ్వు ఏ వంశచరిత్ర, పూర్వీకుల గురించి మాట్లాడేది?’’ ఎన్నో సంవత్సరాలుగా గుండెల్లో దాచుకున్న రహస్యాన్ని బట్టబయలు చేయటానికి సిద్ధమవుతూ అంది నయన. ‘‘నువ్వు గొప్పగా చెప్పే వంశవృక్షాన్ని జతిన్ నీ దగ్గర నుంచి గుంజుకున్నాడు. ఇప్పుడు నేను ఆ రహస్యాన్ని బట్టబయలు చేస్తే జతిన్ పెళ్లి ఎలా అవుతుందో చూస్తాను’’ సవాల్ చేస్తున్నట్టుగా అంది.ఉపేన్ మళ్లీ అరిచాడు. ‘‘నీకేమయినా పిచ్చి పట్టిందా? తను నా వంశచరిత్రను ఎలా గుంజుకోగలుగుతాడు?’’ అన్నాడు.‘‘పిచ్చోడా? నీ వంశచరిత్రకు నువ్వు విలువ ఇవ్వాలి. వంశచరిత్ర ముందు సంపద, సామాజిక స్థాయి ఎందుకూ కొరగావు అనేది నేను అనుకుంటే, నా కొడుకుని ఇంకొకరితో మార్చే దానినా?’’ఉపేన్ మంచం మీద ఎగిరి దూకాడు. ‘‘పెద్దమ్మా..?’’‘‘ఇంకా పెద్దమ్మా ఏమిటి? అమ్మా అని పిలువు. నువ్వెప్పుడూ నన్ను నువ్వు అలా పిలవలేదు. నాకు ఆ అదృష్టం లేకుండా పోయింది. నేను నీ కోసం ఎంతో చేశాను. చివరికి దీని వల్ల నాకేం మిగిలింది? ఇప్పుడు నేను అందరికీ చెబుతాను. పుట్టినప్పుడు మీ ఇద్దరిని నేను ఎలా మార్చానో? ఈ రోజు వాడికి రెండు డిగ్రీలు ఉన్నందుకు అహంకారం, తలపొగరు నెత్తికెక్కి హద్దులు లేకుండా వ్యవహరిస్తున్నాడు. వంశచరిత్ర.. దాన్ని ఇప్పడే నాశనం చేస్తా. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి దొరికేలా లేదు’’ అంది గట్టిగా నిట్టూర్పు విడుస్తూ. ‘‘నువ్వు ఇంకేం మాట్లాడకు. ఇంకొక్క మాట మాట్లాడినా నిన్ను నేను చంపేస్తా’’ ఉగ్రుడయ్యాడు ఉపేన్..ఆ రోజు మధ్యాహ్నం భోజనాల సమయంలో అతని జాడ కనిపించలేదు. అలా అప్పుడప్పుడు అతను మాయం కావటం మామూలే. అందుకే ఎవరూ అంతగా పట్టించుకోలేదు.సాయంత్రం జతిన్‌కి అతని పేరుతో ఓ టెలిగ్రామ్ వచ్చింది. ‘‘దాదా, నేను రంగూన్ వెళ్లిపోతున్నాను. మీరంతా సుఖసంతోషాలతో జీవించాలి. అదే నేను మీ నుంచి కోరుకుంటాను. ఇకపోతే నేను చేసిన తప్పులను నువ్వు క్షమిస్తావనే అనుకుంటున్నాను. ఉంటున్నాను– ఉపేన్’’ అని ఉంది అందులో. బెంగాలీ మూలం: మాధురీలతా దేవి అనువాదం: డాక్టర్ పార్థసారథి చిరువోలు -
హిమకరం... హితకరం
స్పీకింగ్ థెరపీ, మ్యూజిక్ థెరపీ, హైడ్రోథెరపీ, ఫిజియోథెరపీ, రేడియోథెరపీ, ఫార్మాథెరపీ ఇలా చికిత్స విధానాల పేరు ఏదైనా సమస్య మాత్రం ఒకటే ‘అనారోగ్యం’. నిజానికి ఈ రకమైన థెరపీలు లెక్కకు మించినవి. శారీరక రోగాలకే కాక, మానసిక ఆరోగ్యం కోసం ఉద్దేశించిన సైకోథెరపీ, ఆహార నియమాలతో మెరుగుపరచే డైటరీథెరపీ, రోగనిరోధక శక్తిని పెంచే ఇమ్యూనోథెరపీ వంటివి ఎన్నో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఆయుర్వేదంలో అయినా, ఆధునిక వైద్యంలో అయినా– కాలాన్ని బట్టి, వ్యాధి స్వభావాన్ని బట్టి చికిత్స విధానాలు మారుతూ, మెరుగుపడుతూ వస్తున్నాయి. నిరంతరం సాగే ప్రయోగాల్లో పరిశోధనల్లో, ఆధునిక విజ్ఞానం ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. అన్వేషించిన వాటిని మరింతగా విశ్లేషించి అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో, వైద్య ప్రపంచాన్ని అబ్బురపరచిన సరికొత్త థెరపీనే, క్రయోథెరపీ! ప్రస్తుతం డెర్మటాలజిస్ట్‌లు, ఫిజియోథెరపిస్ట్‌లు, సర్జన్లు ఇలా చాలామంది మెడికల్ స్పెషలిస్ట్‌ల నోట వినిపిస్తున్న వైద్య పద్ధతి క్రయోథెరపీనే!వారంతా ఈ నాన్–ఇన్వేసివ్ (శరీరానికి కత్తి కోతలు, సూది పోట్లు లేని) చికిత్స విధానానికే ఓటేస్తున్నారు.క్రయో అంటే గ్రీకు భాషలో చల్లని లేదా గడ్డకట్టిన మంచు అని అర్థం. చల్లదనంతో చేసే చికిత్స కాబట్టి దీనికి క్రయోథెరపీ అని పేరొచ్చింది. ఇది– ప్రస్తుతం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల సామర్థ్యం ఉన్న ఒక ఆధునిక చికిత్స విధానం! మొత్తం శరీరానికి లేదా సమస్య ఉన్న శరీరభాగాలకు అతి శీతల ఉష్ణోగ్రతలను అందించి, చికిత్స చేయడమే ఈ క్రయోథెరపీ పద్ధతి. ఈ చికిత్సతో క్యాన్సర్ వంటి కొన్నిరకాల అసాధారణ కణజాలాలను నాశనం చేయొచ్చు. నైట్రోజన్ లిక్విడ్ లేదా ఆర్గాన్ గ్యాస్ వంటి పదార్థాలను ఉపయోగించి ప్రమాదకరంగా మారిన కణాలను తొలగించడానికి కావలసిన తీవ్రమైన చలిని పొడిగాలుల రూపంలో ఉత్పత్తి చేస్తారు. ప్రస్తుతం ఇది వెల్నెస్ ట్రీట్మెంట్లలో వినూత్న పద్ధతిగా ప్రాచుర్యం పొందుతోంది. ఒకప్పుడు కేవలం క్రీడాకారులకు మాత్రమే పరిమితమైన ఈ హిమ చికిత్స ఇప్పుడు పలు ఆరోగ్య సమస్యల నివారణకు, మానసిక ఉల్లాసానికి, సౌందర్య చికిత్సలకు ఉపయోగపడుతోంది. దీనిలో ప్రధానంగా రెండు రకాల చికిత్స విధానాలు ఉన్నాయి. మొదటిది ‘లోకల్ లేదా ఫోకల్ క్రయోథెరపీ’. ఇది శరీరంలోని ఒక నిర్దిష్ట భాగంలో ఉన్న అసాధారణ లేదా ప్రమాదకరమైన కణజాలాన్ని నాశనం చేయడానికి ఉపయోగిస్తారు. దీనిని క్రయో అబ్లేషన్ లేదా క్రయో సర్జరీ అని కూడా పిలుస్తారు. ఉదాహరణకు, క్యాన్సర్ కణాలు, పులిపిర్లు లేదా ఇతర చర్మ గాయాలను సరి చేయడం వంటివి ఈ చికిత్సలోకే వస్తాయి.రెండవది ‘హోల్ అండ్ బాడీ క్రయోథెరపీ’. ఈ ట్రీట్మెంట్లో కొన్ని నిమిషాల పాటు క్రయోచాంబర్ అనే ప్రత్యేక గదిలాంటి అతిశీతల పేటికలో ఉంచుతారు. అది కూడా 2 నుంచి 4 నిమిషాల పాటు మాత్రమే చికిత్స ఉంటుంది. ఆ గది చాలా చల్లగా ఉంటుంది. క్రయోథెరపీలో భాగంగా, శరీరంలోని రక్తనాళాలు అతి శీతల వాతావరణంలో (సుమారు మైనస్ 110 డిగ్రీల సెల్సియస్ నుంచి మైనస్ 140 డిగ్రీల సెల్సియస్ వరకు) సంకోచించి, చికిత్స అవసరమైన అవయవాలకు రక్తప్రసరణను పెంచుతాయి. చికిత్స అనంతరం బయటకు రాగానే – ఆక్సిజన్, పోషకాలు సమృద్ధిగా ఉన్న తాజా రక్తం కండరాలకు, చర్మానికి వేగంగా చేరుతుంది. ఈ ప్రక్రియ వాపును తగ్గిస్తుంది, కండరాల రికవరీలో వేగం కనిపిస్తోంది. నిజానికి అంత మైనెస్ డిగ్రీల చలంటే తలచుకుంటేనే వణుకు పుడుతుంది కదా అనే అనుమానం రావచ్చు. అయితే ‘తడి చలిలో ఉండలేం కానీ పొడిగా ఉండే చలిగాలిలో శరీరం కొద్దిసేపు ఉండగలదు’ అని చెబుతున్నారు క్రయోథెరపీ నిపుణులు.ఈ చికిత్సతో ఓపెన్ సర్జరీ లేకుండానే వ్యాధిగ్రస్థ కణజాలాన్ని తొలగించొచ్చు. దాంతో చాలామంది త్వరగా, తక్కువ నొప్పితో కోలుకుంటారు. పులిపిర్లు, మచ్చలు, ప్రోస్టేట్ క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, కిడ్స్ రెటినోబ్లాస్టోమా (కంటి క్యాన్సర్), ఎముకల క్యాన్సర్ ఇలా చాలా రకాల సమస్యలను, వ్యాధులను ఈ ట్రీట్మెంట్తో నయం చేయొచ్చు.ఈ హిమ చికిత్సకు పునాది ఎక్కడ?చికిత్స కోసం చల్లదనాన్ని ఉపయోగించే క్రయోథెరపీ ఇప్పటిది కాదు. ఈ పద్ధతి వేల సంవత్సరాలుగా అభివృద్ధి చెందింది. నిజానికి క్రయోథెరపీ చరిత్ర పురాతన నాగరికతలతో ప్రారంభమైంది. ఈజిప్షియన్లు, గ్రీకులు, రోమన్లు అసాధారణ వాపులను తగ్గించడానికి, గాయాలకు చికిత్స చేయడానికి మంచుగడ్డను ఉపయోగించేవారు. ప్రసిద్ధ వైద్యుడు హిపోక్రాట్స్ సైతం గాయాలకు, వాపులకు చల్లదనాన్ని ఉపయోగించమని సిఫారసు చేశారట. చల్లని నీటిలో మునగడం, మంచు ముక్కల్లో కూర్చోవడం ఇవన్నీ నాటి మొదటి అడుగులే!1800ల నాటి వైద్యులు ‘ఐస్ బాత్’ను (మంచు స్నానాన్ని) వైద్య చికిత్సలో భాగం చేశారు. కండరాల నొప్పి, కీళ్ల నొప్పుల చికిత్సకు ఐస్ బాన్ క్లినిక్స్ అథ్లెటిక్ శిక్షణ కేంద్రాలలో సర్వసాధారణమయ్యాయి. అనంతరం వైద్యులు శస్త్రచికిత్సల సమయంలో కోల్డ్ ప్యాక్‌లను ఉపయోగించడం మొదలుపెట్టారు. 19వ శతాబ్దం మధ్యలో ఆధునిక క్రయోథెరపీకి పునాది వేసిన నాటి ప్రసిద్ధ వైద్యుడు జేమ్స్ ఆర్నాట్ను క్రయోథెరపీ పితామహుడు అంటారు. ఆయన నొప్పులు, కణితుల నివారణకు ఈ శీతల చికిత్సను ప్రారంభించిన మొదటి వ్యక్తి.20వ శతాబ్దం వచ్చేనాటికి క్రయోసర్జికల్ విధానంలో లిక్విడ్ నైట్రోజన్‌ను ఉపయోగించడంతో పరికరాల అభివృద్ధికి దారితీసింది. ఈ చికిత్స ప్రయోజనాలను ప్రాచీన ఈజిప్షియన్లు క్రీ.పూ. 2500 నాటికే గుర్తించారు.హిపోక్రాట్స్– క్రీ.పూ. 400 ప్రాంతంలో, నొప్పి నివారణ, వాపు కోసం మంచుగడ్డలు ఉపయోగించినట్లు ఆధారాలున్నాయి.క్రయోథెరపీ చరిత్రలో కీలక మలుపు 1978లో వచ్చింది. జపాన్ కు చెందిన డా. తోషిమా యమగుచి– రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న రోగులకు చల్లటి గాలి చికిత్సలను ఉపయోగించడం ప్రారంభించారు. చల్లటి నీటిని ఉపయోగించకుండానే గాలిని వాడి– కీళ్ల నొప్పులు, వాపును త్వరగా తగ్గించే ప్రయత్నం చేశాడు. ఆయన ప్రయోగాలు మంచి ఫలితాలను సాధించడంతో క్రయోథెరపీ చాంబర్ ఆవిష్కరణకు దారి తీసింది. ఇందులో రోగులు తక్కువ సమయం పాటు అతి శీతల ప్రదేశంలో నిలబడతారు. ఇదే ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.భారతదేశంలో క్రయోథెరపీ అభివృద్ధి– భవిష్యత్తు!ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య స్పృహ పెరుగుతున్న తరుణంలో భారత్ కూడా క్రయోథెరపీవైపు బాగానే మొగ్గు చూపుతోంది. రానున్న రోజుల్లో హెల్త్ అండ్ వెల్నెస్లో ఈ చికిత్సకు ప్రాధాన్యం పెరుగుతోంది. భారత్‌లోని ప్రధాన మెట్రో నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి వాటిలో అధునాతన వెల్నెస్ సెంటర్లు, క్రయోథెరపీ క్లినిక్‌లు పెరుగుతున్నాయి. పట్టణ ప్రాంతాలలో ఆరోగ్య స్పృహ ఉన్న ప్రజలు, కొత్త వెల్నెస్ థెరపీలను అన్వేషించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ ధోరణికి క్రీడాకారులు, సెలబ్రిటీల మద్దతు కూడా తోడైంది. వారి సానుకూల అనుభవాలే ఇప్పుడు ప్రజల్లో క్రయోథెరపీపై విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుతున్నాయి.ప్రధాన ప్రయోజనాలుకండరాల నొప్పిని వేగంగా, పూర్తిగా తగ్గించడం, గాయాలను త్వరగా నయం చేయడం వంటి ఫలితాలతో– క్రీడాకారులలో, ఫిట్నెస్ ఔత్సాహికులలో ఈ చికిత్స బాగా ప్రాచుర్యం పొందింది.ఫైబ్రోమయాల్జియా, కీళ్లనొప్పులు (ఆర్థరైటిస్) వంటి దీర్ఘకాలిక సమస్యలకు ఉపశమనం అందించడానికి ఈ ట్రీట్మెంట్ సహాయపడుతుంది.డెర్మటాలజిస్టులు, కాస్మెటిక్ క్లినిక్‌లు ఈ థెరపీని యాంటీ–ఏజింగ్ లక్షణాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది, వృద్ధాప్యం వల్ల శరీరంపై ఏర్పడే ముడతలను తగ్గించి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణను పెంచుతుంది. ‘ఇన్ఫ్లమేజింగ్’ (వయసు పెరగడంతో వచ్చే దీర్ఘకాలిక వాపుల సమస్య)ను తగ్గించి, వృద్ధాప్య సంకేతాలను కాస్త దూరం చేయగలుగుతుంది. క్రయోథెరపీతో జీవక్రియ వేగం పెరుగుతుంది. ఇది బరువు తగ్గడంలో ఎంతగానో సహాయపడుతుంది. కొవ్వును కరిగించే చికిత్సగా ఇది ఫిట్నెస్ మెయింటెనెన్స్‌లో భాగమవుతోంది.క్రయోథెరపీ ఎండార్ఫిన్ ల (ఫీల్–గుడ్ కెమికల్స్) విడుదలకు ఉపయోగపడుతుంది. దాంతో ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ వంటి లక్షణాలను తగ్గుతాయి.నగరాల్లో నివసించే ప్రజలు ఇలాంటి చికిత్సల కోసం ఖర్చు చేయడానికి ఎక్కువ ఆసక్తిగా ఉంటున్నారని సర్వేలు కూడా చెబుతున్నాయి. ఇది క్రయోథెరపీకి పెద్ద మార్కెట్‌ను సూచిస్తుంది. అలాగే సోషల్ మీడియా, హెల్త్ బ్లాగులతో ఈ చికిత్స గురించి అవగాహన కూడా బాగానే పెరుగుతోంది.స్పోర్ట్స్–ఫిట్‌నెస్‌ల మీద అవగాహన, ఆసక్తి పెరుగుతున్న కొద్దీ ఈ థెరపీకి ప్రాధాన్యం పెరుగుతోంది. అథ్లెట్ల తమ నొప్పుల నుంచి త్వరగా కోలుకోవడానికి, క్రీడా అకాడమీలు ఈ థెరపీని తమ శిక్షణ కార్యక్రమాలలో భాగం చేసుకుంటున్నాయి.ఫిజియోథెరపీ, కైరోప్రాక్టిక్, స్పాలు వంటి ఇతర వెల్నెస్ చికిత్సలతో క్రయోథెరపీని అనుసంధానం చేయడంతో భవిష్యత్తులో పూర్తి ఆరోగ్య ప్యాకేజీని కోరుకునే కస్టమర్లను ఆకర్షించవచ్చు.‘తక్కువ ధర, అధిక నాణ్యత’ అనే స్లోగన్‌తో భారత్ ఇప్పటికే చాలా వైద్య విధానాలతో విదేశీ రోగులను ఆకర్షిస్తోంది. క్రయోథెరపీని మెడికల్ టూరిజం ప్యాకేజీలలో చేర్చడంతో అంతర్జాతీయ రోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.∙ఈ చికిత్సలో సాంకేతిక పురోగతులు వేగంగా వస్తున్నాయి. క్రయో పోర్టబుల్ యంత్రాలలో, మెరుగైన, సురక్షితమైన క్రయో చాంబర్లలో టెక్నాలజీ మరింత అప్డేట్ అవుతోంది.క్రయోథెరపీ మార్కెట్ ఎన్నుకునేవారికి సవాళ్లు–సూచనలుసామర్థ్యం ఉన్నప్పటికీ ఈ పోటీ ప్రపంచంలో క్రయోథెరపీ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. రానున్న రోజుల్లో ప్రపంచ వైద్యరంగాన్ని తనవైపు తిప్పుకోనున్న క్రయోథెరపీ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుంది? పెట్టుబడిపరంగా, విద్యపరంగా ఈ రంగాన్ని ఎంచుకునేవారికి ఎలాంటి సూచనలు కనిపిస్తున్నాయి?ఆధునిక క్రయోథెరపీ యంత్రాల దిగుమతి, సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటోంది, ఇది కొత్త పారిశ్రామికవేత్తలకు అడ్డంకిగా మారుతుంది.సాధారణ ప్రజలు, వైద్య నిపుణులలో కూడా క్రయోథెరపీ ప్రయోజనాలు, భద్రత గురించి మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉంది.ఈ క్రయో చికిత్సలకు సంబంధించి – భారత్‌లో సంక్లిష్టమైన చట్టపరమైన నిబంధనలను పాటించడం కాస్త సవాలుగా మారుతుంది.ఈ సవాళ్లను అధిగమించడానికి, ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసం శిక్షణ, అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం అవసరం. డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియాతో కలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచడం, అలాగే వ్యాయామశాలలు, వెల్నెస్ రిసార్ట్‌లతో భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడం ఈ చికిత్సను ప్రజలకు చేరువ చేయగలవు. అంతేకాకుండా, ప్రారంభ ఖర్చులను తగ్గించడానికి తక్కువ–ధర కలిగిన నాణ్యమైన పరికరాలపై దృష్టి పెట్టాలన్నది ఒక సూచన.లాభనష్టాలు!ఈ చికిత్సతో ఏర్పడిన పుండు సాధారణంగా ఒకటి నుంచి మూడు వారాల్లో నయమవుతుంది. క్రయోసర్జరీ తర్వాత, కొద్ది రోజులు ఆ ప్రాంతంలో తేలికపాటి నొప్పి లేదా పుండ్లు ఉండొచ్చు. కొన్నిసార్లు, అసాధారణ కణజాలాన్ని పూర్తిగా తొలగించడానికి ఒకరికంటే ఎక్కువ క్రయోథెరపీలు అవసరం కావచ్చు. అయితే ఈ థెరపీతో నరాలు దెబ్బతినడం, స్పర్శ జ్ఞానం కోల్పోవడం వంటి సమస్యలతో పాటు స్కిన్ ఇన్ఫెక్షన్లు, ఎముకల పగుళ్లు (క్రయోసర్జరీ కారణంగా), గర్భాశయం చుట్టూ రక్తస్రావం లేదా తిమ్మిరి వంటివి తలెత్తొచ్చు. ఇవన్నీ అరుదుగా ఏర్పడే సమస్యలు మాత్రమే! చాలామంది క్రయోథెరపీ తీసుకున్న తర్వాత త్వరగా కోలుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుతం చాలామంది ఆర్థోపెడిక్స్ నుంచి ఆంకాలజీల వరకూ క్రయోథెరపీ గురించే చర్చిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిశోధనలు ఫలించగానే ప్రత్యేక శిక్షణలు తీసుకుంటారు. మార్కెట్లోకి వస్తున్న ప్రతి క్రయోటెక్నాలజీని నేర్చుకునేందుకు చొరవ చూపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ క్రయోథెరపీ– అన్ని వైద్య సేవలతో అన్ని అనారోగ్యాలకు తిరుగులేని చికిత్సగా మారితే ఈ ప్రపంచం వైద్యశాస్త్రంలో మరో మెట్టు ఎక్కినట్లే!భారతదేశంలో క్రయోథెరపీ భవిష్యత్తుపై భారీ అంచనాలు ఉన్నాయి. పెరుగుతున్న ఆరోగ్య స్పృహ, స్పోర్ట్స్ మెడిసిన్ లో ఈ థెరపీ పాత్ర ఇలా– పలు కారణాలతో ఈ రంగంలో అభివృద్ధికి విస్తృతమైన అవకాశముంది. ప్రపంచవ్యాప్తంగా కండరాల రికవరీ, వాపును తగ్గించడం, బరువు తగ్గడం, చర్మ సంరక్షణ వంటి వివిధ పరిస్థితులకు క్రయోథెరపీని ఉపయోగించడంపై నిరంతర పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రజల్లో అవగాహన పెరిగే కొద్దీ, భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో క్రయోథెరపీ తప్పకుండా ప్రత్యేక స్థానంలో నిలుస్తుందనేది ఒక అంచనా.గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థల నివేదిక ప్రకారం, భారతదేశంలో క్రయోథెరపీ మార్కెట్ రాబోయే సంవత్సరాల్లో బాగా అభివృద్ధి చెందుతుందని అంచనా. ఈ క్రయోథెరపీ మార్కెట్ 2024లో 3.6 మిలియన్ డాలర్ల (రూ.31.74 కోట్లు) ఆదాయాన్ని నమోదు చేసింది. ఆ లెక్కన 2030 నాటికి 7.0 మిలియన్ డాలర్ల (రూ.61.72 కోట్లు) ఆదాయాన్ని చేరుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 2025 నుంచి 2030 వరకు 11.6% వార్షిక వృద్ధి రేటు ఉంటుందని లెక్కలేస్తున్నారు.ప్రపంచంలో క్రయోథెరపీ మార్కెట్‌పై సర్వేప్రపంచవాప్తంగా ప్రముఖ క్రయోథెరపీ సంస్థలు– డెన్మార్క్, ఐర్లండ్, జర్మనీ, పోలండ్, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాల్లో ఉన్నాయి. ఈ సంస్థలు సర్జికల్, లోకలైజ్, హోల్–బాడీ క్రయోథెరపీ పరికరాలను తయారు చేసి, అన్ని ఆసుపత్రులకు, చికిత్స కేంద్రాలకు అమ్ముతున్నారు. అలాగే నిర్వహణ సేవలు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా క్రయోథెరపీ మార్కెట్ ఎలా ఉండబోతుంది? ఎలా అభివృద్ధి చెందబోతుంది? అని ‘డేటా బ్రిడ్జ్ మార్కెట్ రీసర్చ్’ అనే కన్సల్టింగ్ సంస్థ చేసిన సర్వేల్లో అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉత్తర అమెరికా, యూరప్, ఏషియా–పసిఫిక్, దక్షిణ అమెరికా, మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో క్రయోథెరపీ అభివృద్ధి గురించి ఈ రీసెర్చ్ సెంటర్ స్పష్టమైన లెక్కలిచ్చింది. ప్రతి సంవత్సరం కొత్త దేశాలు, కొత్త వినియోగదారులు పెరుగుతున్నారని తేల్చింది. ఆ వివరాలు ఈ చార్ట్‌లో చూడొచ్చు.క్రయోథెరపీలో పద్ధతులు– జాగ్రత్తలుక్రయో చాంబర్లోకి ప్రవేశించే ముందు, చర్మం పొడిగా, శుభ్రంగా ఉండాలి.చికిత్సకు 6–12 గంటల ముందు రోగి తినడం, తాగడం మానేయమని చెబుతారు. ముందు నుంచి కోల్డ్ అలెర్జీ, రక్తనాళాల సమస్యలు, రేనాడ్స్ వ్యాధి వంటివి ఉన్న వారు ఈ థెరపీ చేయించుకోరాదు.క్రయో చాంబర్కి తడి బట్టలు వేసుకోకూడదు. ఎలాంటి గాడ్జెట్లను తీసుకెళ్లకూడదు.గుండె జబ్బులు, అధిక రక్తపోటు ఉన్నవారితో పాటు గర్భవతులు కూడా ఈ చికిత్సకు దూరంగా ఉండాలి. -
గంధర్వులను జయించిన భరతుడు
రాముడి అశ్వమేధయాగం విజయవంతంగా పూర్తయిన కొన్నాళ్లకు ఒకనాడు కేకయ దేశాధీశుడు యుధాజిత్తు తన గురువు, అంగిరస పుత్రుడైన గార్గ్యుడిని రాముడి వద్దకు పంపాడు. రాముడికి కానుకగా పదివేల జవనాశ్వాలు, ఐదువేల ఏనుగులు, అరుదైన మణిమాణిక్యాలు, చీనీచీనాంబరాలు, అనేక స్వర్ణాభరణాలను పంపాడు. మహర్షి అయిన గార్గ్యుడు తన రాజ్యంలోకి అడుగుపెట్టినట్లు తెలుసుకుని రాముడు తన తమ్ములతో కలసి క్రోసు దూరం ఎదురువెళ్లి, గార్గ్యుడికి ఘనస్వాగతం పలికి, ఆయనను పూజించాడు. ఆయనను సగౌరవంగా తన సభామందిరానికి తోడ్కొనిపోయాడు.గార్గ్యుడిని ఉచితాసనంపై కూర్చుండబెట్టి, ‘మహర్షీ! సాక్షాత్తు బృహస్పతి వంటి మిమ్మల్ని మా మేనమామ నా వద్దకు పంపిన కారణమేమిటి? ఆయన ఏమైనా చెప్పాడా?’ అని అడిగాడు.‘రామా! మీ మేనమామ యుధాజిత్తు నీతో చెప్పమన్న సందేశాన్ని చెబుతున్నాను విను! మా కేకయ రాజ్యానికి ఇరువైపులా గంధర్వ రాజ్యం ఉంది. శైలూషుడనే వాడు గంధర్వులకు రాజు. అమిత బలశాలురు, యుద్ధ విశారదులు, కామరూపధారులు అయిన గంధర్వులు కేకయ రాజ్యానికి చిరకాలంగా సమస్యగా మారారు. అందువల్ల నువ్వు గంధర్వ రాజ్యాన్ని జయించి, అక్కడ నీ అధీనంలో రెండు నగరాలు నిర్మించుకున్నట్లయితే ప్రశస్తంగా ఉండగలదు’ అని చెప్పాడు.‘మహర్షీ! తప్పకుండా మా మేనమామ చెప్పిన ప్రకారమే చేస్తాను. ఈ కార్యభారాన్ని నా సోదరుడు భరతుడికి అప్పగిస్తున్నాను. భరతుడి కుమారులైన తక్షుడు, పుష్కలుడు మా మేనమామ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోగలరు. వీరులైన ఈ కుమారులిద్దరూ భరతుడితో కలసి, గంధర్వరాజ్యాన్ని జయించుకోగలరు. భరతుడు కుమారులిద్దరికీ రెండు నగరాలను నిర్మించి ఇచ్చి, తిరిగి నా వద్దకు రాగలడు’ అని పలికాడు.తర్వాత రాముడు సైన్యాన్ని సమాయత్తం చేసి, భరతుడికి అప్పగించాడు. భరతుడి కుమారులిద్దరికీ గంధర్వరాజ్యంలో నిర్మించబోయే పురాలకు అధిపతులుగా పట్టాభిషేకం జరిపించాడు. సుముహూర్తం చూసుకుని, గార్గ్యుడిని ముందుంచుకుని భరతుడు తన కుమారులను, సైన్యాన్ని వెంటపెట్టుకుని బయలుదేరాడు. రాముడు ఆ సైన్యాన్ని అయోధ్య నగరం పొలిమేరల వరకు అనుసరించి, సాగనంపాడు. భరతుడి సైన్యం వెంట వేలాది క్రూరమృగాలు, భయంకరమైన రాక్షసమూకలు కూడా యుద్ధంలో శత్రువుల రక్తం తాగాలనే కోరికతో బయలుదేరాయి. దారిలో అక్కడక్కడా మజిలీలు చేస్తూ, మూడు పక్షాలు ప్రయాణం చేశాక భరతుడి సైన్యం కేకయ దేశంలోకి ప్రవేశించింది. యుధాజిత్తు భరతుడికి, అతడి సైన్యానికి ఘనస్వాగతం పలికాడు. గార్గ్యుడిని పూజించి, సత్కరించాడు. తర్వాత తన సైన్యాన్ని కూడా సమాయత్తం చేసి, భరతుడి సైన్యంతో కలసి వెళ్లి గంధర్వదేశాన్ని అన్ని వైపుల నుంచి ముట్టడించాడు. యుధాజిత్తు తన మేనల్లుడు భరతుడితో కలసి వచ్చి, రాజ్యాన్ని ముట్టడించిన సంగతి తెలుసుకున్న గంధర్వులు రెచ్చిపోయారు. రథాలను, ఆయుధాలను సిద్ధం చేసుకుని యుద్ధానికి బయలుదేరారు.భరతుడి సైన్యానికి, గంధర్వులకు ఏడురోజులు హోరాహోరీగా యుద్ధం సాగింది. ఇరువైపులా పెద్దసంఖ్యలో సైనికులు నేలకొరిగారు. భరతుడి సైన్యం వెంట వచ్చిన క్రూరమృగాలు నేలకొరిగిన వారిని సుష్టుగా ఆరగించసాగాయి. జయాపజయాలు ఎటూ తేలని పరిస్థితి ఏర్పడింది. సహనం నశించిన భరతుడు చివరకు సంవర్తాస్త్రాన్ని ప్రయోగించాడు. యముడి కాలదండంలాంటి సంవర్తాస్త్రం నిప్పులు చిమ్ముతూ వెళ్లి నిమిషం వ్యవధిలోనే మూడుకోట్ల మంది గంధర్వులను మట్టుబెట్టింది. భరతుడు ఆ ఒక్క నిమిషంలో చేసిన యుద్ధం అంతకు మునుపు దేవతలు కూడా ఏ సందర్భంలోనూ చేసి ఎరుగరు. గంధర్వులపై భరతుడి యుద్ధాన్ని ఆకాశమార్గం నుంచి దేవతలు చకితులై తిలకించారు. యుద్ధం ముగిసిన వెంటనే భరతుడి పరాక్రమానికి నీరాజనంగా పుష్పవృష్టి కురిపించారు. గంధర్వ రాజ్యాన్ని దిగ్విజయంగా స్వాధీనం చేసుకున్న భరతుడు, అక్కడ ఐదేళ్లు ఉన్నాడు. ఆ ఐదేళ్లలో తన కుమారుల కోసం రెండు గొప్ప నగరాలను నిర్మించాడు. విలాసవంతమైన భవంతులు, మనోహరమైన ఉద్యానవనాలు, కళకళలాడే విపణి వీథులు, వినోద మందిరాలు, విశాలమైన రహదారులతో; అజేయమైన అశ్వశాలలు, గజశాలలు, సైనిక స్థావరాలతో; గొప్ప ధనాగారాలతో, ఆయుధాగారాలతో నిర్మించిన ఆ నగరాల నిర్మాణం ఇంద్రుడి అమరావతికి, కుబేరుడి అలకాపురికి తీసిపోని రీతిలో జరిగింది. వాటిలో తక్షశిల అనే నగరానికి తక్షుడిని, పుష్కలావత నగరానికి పుష్కలుడిని రాజులుగా చేశాడు. కొన్నాళ్లు కొడుకుల వద్ద ఉండి, వారికి రాజ్యపాలనలో అనుసరించవలసిన ధర్మసూక్షా్మలను బోధించి, భరతుడు తిరిగి అయోధ్యకు పయనమయ్యాడు. అయోధ్యకు చేరుకున్న తర్వాత నేరుగా రాముడిని కలుసుకున్నాడు. రాముడికి నమస్కరించి, గంధర్వరాజ్యాన్ని ముట్టడించినది మొదలుకొని, ఏడురోజులు జరిగిన యుద్ధాన్ని సవివరంగా చెప్పాడు. రెండు పురాలను నిర్మించి, తన కుమారులకు అప్పగించిన సంగతిని తెలిపాడు. భరతుడు సాధించిన విజయానికి రాముడు సంతోషించాడు. లక్ష్మణ, శత్రుఘ్నులు కూడా భరతుడిని అభినందించారు. -
డిజిటల్ ట్రాప్‌లో టీనేజర్లు
నిఖిల్ పుస్తకం తెరిచాడు. కాని, ఒక్క నిమిషం కూడా ఒక్క పేజీపై చూపు నిలవడం లేదు. పక్కనే ఉన్న ఫోన్లో నోటిఫికేషన్ సౌండ్ వచ్చింది. అదేమిటో చూడాలని ఫోన్ తీసుకున్నాడు. అంతే, అరగంట గడిచిపోయింది. తల్లిదండ్రులు ‘చదువు మీద ఫోకస్ పెట్టు’ అంటారు. కాని, ఒక్క స్క్రోల్ ఆ ఫోకస్‌ను దూరం చేసేస్తోంది. అలా స్మార్ట్ఫోన్లు మెల్లగా మన యువతలోని ప్రతిభను, శ్రద్ధను, స్వీయ నియంత్రణను కమ్మేస్తున్నాయి. కనబడని ఉచ్చు...ప్రపంచవ్యాప్తంగా టీనేజర్లు రోజుకు సగటున ఏడుగంటలకు పైగా స్క్రీన్ ముందు గడుపుతున్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. అందులో చదువుకు సంబంధించిన సమయం కేవలం10 శాతం మాత్రమే! మిగతా సమయం రీల్స్, గేమ్స్, షార్ట్స్, చాట్స్ – ఇవే వారి కొత్త ‘రియాలిటీ’.ఫోన్ మొదట క్యూరియాసిటీగా మొదలవుతుంది. తర్వాత ‘డిస్ట్రాక్షన్’, చివరికి ‘డిపెండెన్సీ’. చివరకు మెదడు ఫోన్ లేకుండా ఉండలేని స్థితికి చేరుతుంది. అదే ‘డిజిటల్ డిపెండెన్సీ సిండ్రోమ్’.మార్కులపై తీవ్ర ప్రభావం... రోజుకు నాలుగు గంటలకు పైగా ఫోన్ వాడే విద్యార్థుల జీపీఏ సగటున 0.5 పాయింట్లు తక్కువగా ఉందని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్‌లో 2023లో చేసిన అధ్యయనంలో తేలింది. చదువుకుంటూ మధ్యలో ఫోన్ చెక్ చేసే విద్యార్థుల మెమరీ రిటెన్షన్ (గుర్తుంచుకునే సామర్థ్యం) 40 శాతం వరకు తగ్గుతుందని మరొక పరిశోధన చెప్తోంది. ఎందుకంటే, ప్రతి ‘చెక్’ మెదడును రీసెట్ చేస్తుంది. ఫోకస్‌ను మళ్ళీ తిరిగి తీసుకురావడానికి సగటున 23 నిమిషాలు పడుతుంది. అంటే ఫోన్ కేవలం సమయాన్ని తినేయడమే కాదు, మెదడు పనితీరునే మార్చేస్తుంది. భావోద్వేగ అస్థిరత...ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం,ప్రతి 10 మంది యువతలో ఒకరికి ప్రాబ్లమాటిక్ ఫోన్ యూజ్ లక్షణాలు ఉన్నాయి. ఫోన్ లేకపోతే కలిగే ఆందోళనను ‘నోమోఫోబియా’ అంటారు. ఇది మద్యం వ్యసనానికి సమానంగా ప్రభావితం చేస్తుంది.ఈ వ్యసనం వల్ల కలిగే ప్రధాన లక్షణాలు: చిన్న విషయానికే కోపం, చదువుపై విసుగు, నిద్రలేమి, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, స్నేహ సంబంధాలు కోల్పోవడం.భావోద్వేగ గందరగోళంస్మార్ట్ఫోన్ వ్యసనం వల్ల యువత తమ భావోద్వేగాలను నియంత్రించుకోలేని స్థితికి చేరుతున్నారు.ఎవరూ తన స్టోరీ చూడలేదంటే లోమూడ్. ఫ్రెండ్ రిప్లై ఇవ్వలేదంటే యాంగ్జయిటీ. రీల్‌కు తక్కువ లైక్స్ వస్తే సెల్ఫ్–డౌట్. ఇదే ‘డిజిట్ అప్రూవల్ అడిక్షన్’. దీంతో టీనేజర్లు ఆన్లైన్లో సంతోషంగా కనిపించడానికి ప్రయత్నిస్తారు కాని, ఆఫ్‌లైన్‌లో మనసు లోపల ఖాళీగా ఉంటారు.మరచిపోయిన నిద్ర... టీనేజ్ వయస్కుల్లో 60 శాతంమంది రాత్రి 12 తర్వాత కూడా స్క్రీన్ ముందు ఉంటున్నారని లాన్సెట్ మేగజైన్ 2024లో పేర్కొంది. రాత్రి స్క్రీన్ లైట్ మెదడులో మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీని వలన నిద్ర సైకిల్ దెబ్బ తింటుంది. తరువాత రోజు అలసట, ఆందోళన, శ్రద్ధలేమి పెరుగుతాయి.నిద్ర అంటే మెదడు డేటాను ‘సేవ్’ చేసుకునే సమయం. నిద్ర తగ్గితే, నేర్చుకున్నది కూడా తాత్కాలికంగానే మిగులుతుంది. రాత్రి రీల్ చూసి నవ్విన నిమిషం, రేపటి పరీక్షలో గుర్తు రాని సమాధానంగా మారిపోతుంది.తల్లిదండ్రుల ప్రతిబింబంచాలా తల్లిదండ్రులు పిల్లల ఫోన్ అలవాట్లపై ఆందోళన వ్యక్తం చేస్తారు కాని, తమ సొంత అలవాట్లను గమనించరు. పిల్లలు మన మాటల కంటే మన ప్రవర్తనను ఎక్కువగా కాపీ చేస్తారు. అందుకే, తల్లిదండ్రులు ఎప్పుడూ ఫోన్లో ఉంటే, పిల్లల మెదడు అదే నేర్చుకుంటుంది. దాంతో వారి మధ్య ‘ఫోన్’ అడ్డుగోడగా నిలుస్తోంది. డిన్నర్ టేబుల్ సైలెన్స్ గా మారిపోయింది. పలకరింపులు మెసేజ్‌లకు పరిమితమవుతున్నాయి.ఫోను కాదుఅలవాటును మార్చండిఇవన్నీ చూసిన పేరెంట్స్ పిల్లల నుంచి స్మార్ట్‌ఫోన్ లాగేసుకుంటారు. కాని, ఫోన్‌ను నిషేధించడం పరిష్కారం కాదు. ఫోన్‌ను నియంత్రించడం నేర్పడం ముఖ్యం.1 వారంలో కనీసం ఒకరోజు ‘నో ఫోన్ ఈవెనింగ్.’ డిన్నర్ తర్వాత ఒక గంట, ఫోన్ దూరంగా ఉంచి కుటుంబ సంభాషణ చేయండి.2 రాత్రి 9 తర్వాత ఫోన్ దూరంగా ఉంచే నియమం పెట్టండి. నిద్రకు ముందు పుస్తకం, సంగీతం లేదా నిశ్శబ్దం.3 ఫోన్ వాడేటప్పుడు ‘ఇది నాకు అవసరమా లేదా అలవాటా?’ అని అడగాలి. ప్రతి స్క్రోల్‌కు ముందు ఒక క్షణం విరామం తీసుకోండి.4 25 నిమిషాలు చదువు తర్వాత ఐదునిమిషాల బ్రేక్ తీసుకోండి. ఇది మెదడు ఫోకస్‌ను క్రమబద్ధం చేస్తుంది.5 పిల్లలతో భావోద్వేగాల గురించి మాట్లాడండి. వారు ఫోన్‌తో ఎందుకు గడుపుతున్నారో అర్థం చేసుకునేలా చెప్పండి.-సైకాలజిస్ట్ విశేష్ ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్www.psyvisesh.com -
దాని వల్ల సమస్యలా..?
నేను ఆరు నెలల గర్భవతిని. డాక్టర్ నాకు ఐరన్ డిఫిషెన్సీ అనీమియా ఉంది అని చెప్పారు. దీనివల్ల నాకు, నా బిడ్డకు ఏ సమస్యలు తలెత్తవచ్చు? – సుజాత, నెల్లూరు. మీ సమస్య చాలా సాధారణం. గర్భంలో ఉన్న బిడ్డకు ఐరన్ చాలా అవసరం, అందువలన తల్లి శరీరంలోని ఐరన్ నిల్వలు తగ్గిపోతాయి. ఈ పరిస్థితిలో తల్లికి అలసట, శ్వాస తీసుకోవటంలో కష్టం, తలనొప్పి, పల్స్ వేగంగా రావడం, బలహీనత వంటి సమస్యలు రావచ్చు. బిడ్డకు కూడా తక్కువ బరువుతో పుట్టే అవకాశం, రక్తహీనత సమస్యలు రావచ్చు. ఇది రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆహారంలో తగినంత ఐరన్ లేకపోవడం, జీర్ణవ్యవస్థ ఐరన్ గ్రహించకపోవడం, గర్భధారణలో ఐరన్ అవసరం ఎక్కువగా ఉండటం, గర్భధారణకు ముందు అధిక రక్తస్రావం, లేదా సికిల్ సెల్ అనీమియా, థలసీమియా వంటి రక్త సమస్యలు దీనికి కారణమవుతాయి. ముందుగా మేము రక్తపరీక్షలు చేస్తాము. ఐరన్ మాత్రలు తీసుకున్నా రక్తహీనత తగ్గకపోతే, ఫెర్రిటిన్ పరీక్ష ద్వారా శరీరంలోని ఐరన్ నిల్వలను తెలుసుకుంటాము. ఒకవేళ మాత్రలు తగిన సమయంలో పని చేయకపోతే, రక్తంలోకి నేరుగా ఐరన్ ఇవ్వవలసి ఉంటుంది. ఈ చికిత్సలో డైట్ కూడా ముఖ్యం. మాంసం, చేపలు, పప్పులు, తృణధాన్యాలు, పాలకూర, పచ్చికూరలు ఐరన్ సమృద్ధిగా అందిస్తాయి. విటమిన్ సీ ఉన్న ఆహారం ఐరన్ డెఫిషెన్సీని తగ్గించడానికి సహాయపడుతుంది. కానీ టీ, కాఫీలు శరీరంలో ఐరన్ వృద్ధిని తగ్గిస్తాయి. కాబట్టి, వాటికి దూరంగా ఉండండి. కొన్నిసార్లు ఐరన్ మాత్రల వలన పేగు సమస్యలు, ఉబ్బరం, మలబద్ధకం రావచ్చు. అప్పుడు మేము వేరే రకం ఐరన్ టాబ్లెట్స్ ఇస్తాము. రెండు నుంచి నాలుగు వారాల తర్వాత హీమోగ్లోబిన్ సాధారణ స్థాయికి చేరిన తర్వాత, మూడు నెలల పాటు ఐరన్ మాత్రలు కొనసాగించడం శరీరంలో ఐరన్ నిల్వలను పెంచుతుంది. గర్భంలో వయసు ఎక్కువ, మునుపటి గర్భధారణలో రక్తహీనత లేదా ప్రసవ సమయంలో రక్తం కోల్పోవడం ఉంటే, బిడ్డకు జన్మనిచ్చిన తరువాత రక్తహీనత వచ్చే ప్రమాదం ఎక్కువ. హీమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉన్నా, తీవ్రమైన లక్షణాలు ఉంటే రక్తమార్పిడి అవసరం. ప్రసవ సమయంలో తీవ్రమైన రక్తస్రావం జరిగితే, రక్తమార్పిడి మాత్రమే తక్షణ పరిష్కారం. మొత్తానికి, ఐరన్ సరైన విధంగా తీసుకోవడం, డైట్‌ను పాటించడం, వైద్యులు సూచించే పరీక్షలు, అవసరమైన చికిత్సలు తీసుకోవడం ద్వారా మీరు, మీ బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువ. - డా‘‘ ప్రమత శిరీష ,గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ఆల్వేస్ ఫ్రీ!సాధారణ రోజులతో పోలిస్తే చాలామంది ఆడవారు – తమ పీరియడ్స్ రోజుల్లో డల్‌గా మారిపోతారు. అస్సలు యాక్టివ్‌గా ఉండలేరు. అలాంటి వారికి చక్కటి పరిష్కారం ఈ హీటింగ్ ప్యాడ్. ఆధునిక సాంకేతికత, మెడికల్–గ్రేడ్‌తో రూపొందిన ఈ ఎలక్ట్రిక్ టూల్ చాలా చక్కగా పని చేస్తుంది. దీనిలోని స్మార్ట్ సెన్సర్‌తో కూడిన థర్మోసింక్ ఇంజిన్– అవసరమైన వేడిని అందిస్తుంది. దీనిలో 5 వేర్వేరు ఉష్ణోగ్రత స్థాయులను సెట్ చేసుకోవచ్చు. ఇది నొప్పి తీవ్రతను బట్టి హీట్ థెరపీని అందిస్తుంది.ఈ ప్యాడ్‌లో మొత్తం ఆరు లేయర్స్ ఉంటాయి. టెంపరేచర్ అన్నివైపులా సమానంగా వ్యాపిస్తుంది. దాంతో దీన్ని సురక్షితంగా వినియోగించుకోవచ్చు. ఇది 120 నిమిషాల (2 గంటల) తర్వాత ఆటోమేటిక్‌గా స్విచ్ ఆఫ్ అయ్యే ఫీచర్‌ను కలిగి ఉంది. దీని వలన ప్యాడ్‌ను ఎక్కువ సమయం ఉపయోగించినా లేదా పొరపాటున ఆపడం మర్చిపోయినా ఎటువంటి ప్రమాదం ఉండదు. ఈ ఎక్స్ఎల్ సైజ్ హీటింగ్ ప్యాడ్ ముఖ్యంగా పీరియడ్స్ నొప్పితో పాటు వెన్నునొప్పి, కండరాల నొప్పులు, పూర్తి బాడీ రిలాక్సింగ్కి అనుకూలంగా ఉంటుంది. దాంతో దీన్ని ఇంట్లోనే సౌకర్యవంతంగా వినియోగించుకోవచ్చు. -
కాకమ్మ అందం
అనగనగా ఒక అడవిలో చెరువు ఒడ్డున ఒక వేప చెట్టు మీద ఒక కోతమ్మ ఉండేది. ఆ చెట్టు మీదకు కొత్తగా ఒక కాకమ్మ వచ్చి ముళ్లపుల్లలు, చెట్టుబెరడు, జంతువుల వెంట్రుకలు, గడ్డి మొక్కలు తీసుకొచ్చి అందమైన గూడు కట్టింది. కోతమ్మ, కాకమ్మతో స్నేహం చేసింది.ఒక రోజు కాకమ్మ గూటిలో రెండు గుడ్లు పెట్టింది. మరునాడు కాకమ్మ లేనప్పుడు ఒక కోకిలమ్మ నెమ్మదిగా కాకమ్మగూటిలో దూరి రెండు గుడ్లు పెట్టింది. కోతమ్మ అది గమనించింది. ‘అక్కా! నన్ను క్షమించు! నాకు గూడు కట్టుకోవటం రాదని నీకు తెలుసుకదా! అందుకే కాకమ్మ గూటిలో రెండు గుడ్లు పెట్టాను!’ అంది కోకిలమ్మ.కోతమ్మ మాట్లాడలేదు. కాకమ్మ తిరిగి గూటికి వచ్చింది. దానికి మరో రెండు గుడ్లు కనిపించాయి. చుట్టూ చూసింది. ఏ పక్షీ కనిపించలేదు. తనగుడ్లతో పాటు వాటినీ పొదిగి పిల్లల్ని చేసింది.కోతమ్మకు కాకమ్మ పిల్లలు నల్లగా, అందవిహీనంగా కనిపించాయి. వాటిని ముట్టుకోటానికే అసహ్యం కలిగింది.చెట్టు కింద చెరువులో నీళ్లు తాగడానికి కొంగమ్మ, చిలకమ్మా, నెమలమ్మ వచ్చాయి.అది చూసిన కాకమ్మ చెట్టు దిగి కిందికి వెళ్లి తన అందమైన బిడ్డలను చూడవలసిందిగా కోరింది. ‘నీ పిల్లలకి తెల్ల ఈకలు వచ్చాయా.. ఏంటీ!’ అంది కొంగ.‘ఆకుపచ్చ ఈకలు వచ్చాయా.. ఏంటీ!’ అంది చిలుక.‘పోనీ.. రంగు రంగుల ఈకలు వచ్చాయా.. ఏంటీ!’ అంది నెమలి.అప్పుడు ‘నా పిల్లల అందం మీలా వర్ణించలేను. చూస్తే మీకే తెలుస్తుంది!’ అంది కాకమ్మ..కొంగమ్మ, చిలకమ్మా , నెమలమ్మలు కాకమ్మ గూటికి వెళ్లి చూశాయి. పిల్లలు కాకమ్మలా నల్లగా కనిపించాయి.కాకమ్మను బాధ పెట్టకుండా, పిల్లలు తన పోలికతో, బూడిదరంగు ఈకలతో ముద్దుగా ఉన్నాయని దీవించి వెళ్లాయి. అవి వెళ్లగానే ‘అక్కా! ఇంత అందమైన పిల్లలు ఏ ప„ì కైనా పుట్టాయా?’ కోతమ్మతో అంది కాకమ్మ.‘నాకు తెలీదు! రేపు కొంగమ్మ, చిలుకమ్మ, నెమలమ్మ ఇంటికి వెళ్లి పిల్లల్ని చూసి రా.. పో!’ అంది.తెల్లారి కాకమ్మ మొదట కొంగమ్మ గూటికి వెళ్ళింది. గూటిలో రెండు పిల్లలు కనిపించాయి. మెరిసే తెల్లటి, గోధుమ రంగు ఈకలు, పొడవాటి కాళ్లు, పొడవాటి మెడ, కొనతేలిన ముక్కు, గుండ్రటి పెద్ద కళ్లతో ముచ్చటగా ఉన్నాయి.కాకమ్మ అక్కడి నుంచి చిలకమ్మ గూటికి వెళ్ళింది.చిలకమ్మ ఇద్దరి పిల్లలు కూడా ఆకు పచ్చటి ఈకలతో, ఎర్రటి ముక్కుతో, గుండ్రటి పెద్ద కళ్లతో ఆకర్షణగా కనిపించాయి.ఆ తర్వాత అక్కడ నుంచి నెమలి ఇంటికి పోయింది.నెమలి పిల్లలు కూడా గోధుమ ఈకలు, చిన్న కాళ్లు, పదునైన ముక్కుతో, అందంగా కనిపించాయి.కాకి తిరిగి వేపచెట్టు దగ్గరికి వచ్చింది.కోతమ్మ ఆసక్తిగా కాకి కళ్లలోకి చూస్తూ.‘చెల్లీ! కొంగమ్మ, చిలకమ్మ, నెమలమ్మ పిల్లలు ఎలా ఉన్నాయి’ అడిగింది. ‘అక్కా! నా బిడ్డల అందం మాత్రం వాటికి లేదు!’ అంది కాకమ్మ.ఇంతలో కోకిలమ్మ వచ్చి కొమ్మపై వాలింది. ‘చెల్లీ! నా పిల్లల్ని చూసి పోదువురా!’ అంటూ కోకిలమ్మను గూటిలోకి ఆహ్వానించింది కాకమ్మ.‘అక్కా! పిల్లలు ముద్దొస్తున్నారు!’ అంటూ కోకిలమ్మ గూటిలోని నాలుగు పిల్లల్ని ముద్దాడింది. బిడ్డలు ఎలా ఉన్నా, తల్లికి అందంగానే కనిపిస్తారు. కానీ పరాయి బిడ్డల్ని కూడా తన బిడ్డలుగా పెంచే కాకమ్మ మనసు అందంగా కనిపించింది. కాకమ్మ పిల్లలు కూడా ఎంతో అందంగా, ముద్దుగా కనిపించాయి. వాటిని చేతిలోకి తీసుకుని ముద్దాడింది కోతమ్మ. -
ఎక్స్‌ప్రెస్ ది ఫ్యాషన్
ఔట్ఫిట్లో ఆత్మవిశ్వాసం, లుక్‌లో నేచురల్ ఎలిగెన్స్ చూపించే శ్రద్ధా శ్రీనాథ్, స్టయిల్ ఆమె వ్యక్తిత్వంలాగే క్లాసీ, బాలెన్స్డ్, రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఆ సీక్రెట్సే ఇప్పుడు మీకోసం!చీర.. బ్రాండ్: అనిల్ హోసమాని ధర: రూ. 80,000జ్యూలరీ బ్రాండ్: బబుల్ లవ్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.ఫ్యాషన్ అంటే ట్రెండ్స్ కంటే ముందు మనసుకు నచ్చే ఎక్స్ప్రెషన్ ! ఎలాంటి దుస్తులు వేసుకున్నా, సౌకర్యంగా ఉండటం, నన్ను ప్రతిబింబించేలా ఉండటమే ముఖ్యం. ట్రెడిషనల్ లుక్‌కి మినిమల్ జ్యువెలరీ జోడించడం, లేక మోడర్న్ వేర్కి ఎథ్నిక్ టచ్ ఇవ్వడం నాకు బాగా నచ్చుతుంది. – శ్రద్ధా శ్రీనాథ్. -
శతాయుష్మాన్ భవ!
జపాన్ సంస్కృతిలో నవంబర్ నెల ఎంతో ప్రత్యేకమైనది. ఈ సమయంలో జపాన్ దేవాలయాలను సందర్శిస్తే, అందమైన కిమోనో వస్త్రధారణలో మెరిసే చిన్నచిన్న పిల్లలను చూడవచ్చు. ఇది జపాన్ సంప్రదాయ వేడుక. ఈ వేడుకని షిచి–గో–సాన్ పండుగ(Shichi-Go-San festival) అని పిలుస్తారు. ఆ పదాలకు అక్షరాలా ‘ఏడు, ఐదు, మూడు’ అని అర్థం. ఈ పండుగను ఈ మూడు నిర్దిష్ట వయస్సుల్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులు– తమ పిల్లల పెరుగుదలకు దీవెనలందించిన దేవుళ్లకు కృతజ్ఞతలు తెలియజేయడానికి, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం దేవుళ్లను ప్రార్థించడానికి జరుపుకుంటారు.మూడు సంవత్సరాల వయసు ఉన్న బాలుడు లేదా బాలిక, ఐదు సంవత్సరాల వయసు ఉన్న బాలుడు, ఏడు సంవత్సరాల వయసు ఉన్న బాలిక ఈ వేడుకలో పాల్గొంటారు. ఈ పండుగ సందర్భంగా నవంబర్ 15న చాలామంది జపాన్ తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి షింటో దేవాలయాలు లేదా బౌద్ధ దేవాలయాలను సందర్శిస్తారు.షిచి–గో–సాన్ పండుగ చరిత్ర– హీయాన్ కాలం (794–1185) నాటిది. అప్పటి నుంచి, ఉన్నత వర్గాల, సమురాయ్ కుటుంబాలు తమ పిల్లలు ఆరోగ్యంగా పెరిగినందుకు వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పాత రోజుల్లో, వైద్య సంరక్షణ అంతగా అభివృద్ధి చెందనందున, శిశు మరణాల రేటు చాలా ఎక్కువగా ఉండేది. అందుకే ఏడేళ్ల వయస్సు వచ్చే వరకు పిల్లలను ‘కామి నో ఉచి’ అంటే– దేవుని పిల్లలుగా పరిగణించేవారు. ఏడేళ్ల వయస్సు దాటితేనే వారిని మానవ లోకంలోకి ప్రవేశించినట్లుగా భావించేవారు.ఈ వేడుకల కోసం నవంబర్ 15వ తేదీని ఎంచుకోవడానికి ఒక ప్రధాన కారణం ఉంది. అదేంటంటే 1603–1867 మధ్య కాలంలో టోకుగావా సునాయోషి అనే పాలకుడు తన కన్నబిడ్డ ఆరోగ్యం కోసం అదేరోజు ప్రార్థించాడట. ఈ వేడుకలో పాల్గొనే పిల్లలకు తల్లిదండ్రులు ‘చిటోసియామే’ అనే మిఠాయిని ప్రత్యేకంగా తినిపిస్తారు. ఎందుకంటే ‘చిటోసె’ అంటే దీర్ఘాయుష్షు అని అర్థం. ఈ క్యాండీని ‘వెయ్యేళ్ల క్యాండీ’ అని కూడా పిలుస్తారు. ఈ క్యాండీల ప్యాకింగ్పైన కొంగలు, తాబేళ్లు ఇలా దీర్ఘాయుష్షుకు చిహ్నమైన బొమ్మలు ఉంటాయి. -
ఫిట్నెస్కి పప్పీ టచ్!
జిమ్‌కి వెళ్లడం బోర్‌గా అనిపిస్తోందా? అయితే ఈ కొత్త ఫిట్నెస్ ట్రెండ్ మీకు ఒక ‘ఫన్ వర్కౌట్’లా అనిపించొచ్చు! ఎందుకంటే ఇందులో మనుషులు జంతువుల్లా చేతులు, కాళ్లు నేల మీద వేసుకుని పరుగెడతారు. పేరు ‘క్వాడ్రోబిక్స్(Quadrobics)’! కాని, ఫిట్నెస్ ప్రేమికులు దీన్ని ‘ఫుల్ బాడీ ఫన్నీ వర్కౌట్’ అంటున్నారు. అంతే కాదు, సాధారణ వర్కౌట్స్ మాదిరి గంటల తరబడి కాకుండా, కేవలం ఐదు నిమిషాలే చేస్తే ఊపిరి బిగుసుకుంటుంది! అని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు. అయితే, వైద్యులు మాత్రం ‘ఇది కాస్తా జంతువుల్లా ప్రవర్తించే అలవాటుగా మారితే ప్రమాదం!’అని హెచ్చరిస్తున్నారు. చేతులు, మణికట్టు, భుజాలు ఇవన్నీ మన బాడీకి ఈ లోడ్‌కి అలవాటు ఉండవు. కాబట్టి ఫిట్నెస్ కన్నా ఫ్రాక్చర్ ఫాస్ట్‌గా రావచ్చు! అని చెప్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ‘ఫోర్ లెగ్ ఫిట్నెస్’ శరీరానికి కాకపోయినా, లైక్స్‌కి మాత్రం బాగా పని చేస్తోంది! -
సండే అంటే చీట్ డే!
స్క్రీన్ పై క్యూట్‌గా మెరిసే ప్రియాంకా అరుల్ మోహన్ , ఆఫ్‌స్క్రీన్ లో మాత్రం సింపుల్, స్మార్ట్ గర్ల్. ఆ మాటలో మాటగా చెప్పిన ఆసక్తికర విషయాలు మీకోసం..⇒ చెన్నైలో పుట్టాను కాని, పెరిగింది అంతా బెంగళూరులోనే. అందుకే నా జీవితంలో ఈ రెండు నగరాల కలయిక ఉంటుంది. నాన్న అరుల్ మోహన్ నుంచి క్రమశిక్షణ, అమ్మ కృష్ణమోహన్ నుంచి ఫ్యాషన్ నేర్చుకున్నాను.⇒ నా మొదటి సినిమా కన్నడలో ‘ఒంద్ కథె హెళ్లా’. కాని, ప్రేక్షకులు నన్ను నిజంగా గుర్తించింది నానితో చేసిన ‘గ్యాంగ్ లీడర్’ ద్వారానే. ఇప్పుడు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ అన్నింట్లోనూ బిజీగా ఉన్నా, ప్రతి పాత్ర నాకు కొత్త ఫీలింగ్ ఇస్తుంది. ‘ఓజీ’లో నటించడం ఒక ప్రత్యేక అనుభవం. అందులోని కణ్మణి పాత్ర నా ఫేవరెట్!⇒ ఉదయం లేవగానే నా మొదటి మాట ఎప్పుడూ ‘కాఫీ ఉందా?’ అనే. కాఫీ లేకుండా నా రోజు మొదలవదు! ఆ తర్వాత మ్యూజిక్, పుస్తకాలు ఇవే నా మార్నింగ్ మూడ్ సెట్ చేస్తాయి.⇒ యోగా, డ్యాన్స్ నా ఫిట్నెస్ ఫ్రెండ్స్. ఫిట్‌గా ఉండటం అంటే సన్నగా ఉండటం కాదు, హ్యాపీ ఫీలింగ్‌తో ఫైన్ గా ఉండటం.⇒ సాధారణంగా నేను లైట్ డైట్ ఫాలో అవుతాను ఇడ్లీ, ఓట్స్, సలాడ్, సూప్. కానీ సండే అంటే నా చీట్ డే! అప్పుడే పిజ్జా, ఐస్‌క్రీమ్ తప్పనిసరి! చాక్లెట్ మాత్రం కంట్రోల్‌గా ఒక్క క్యూబ్ మాత్రమే తింటాను.⇒ నా స్టయిల్ సింపుల్ కానీ క్లాసీ! కాటన్ చీరల్లో కంఫర్ట్, పేస్టెల్ కలర్స్‌లో చిల్, లాంగ్ ఫ్రాక్లలో ఫన్ . హై హీల్స్ కంటే వైట్ షూస్ ఇవే నా స్టేట్మెంట్ పీస్‌లో ఒకటి. ముఖ సౌందర్యం కోసం నైట్ నిద్రపోయే ముందు అలోవెరా జెల్, ఉదయం లెమన్ వాటర్ తప్పనిసరి.⇒ హీరో జయం రవితో లింక్అప్ రూమర్స్ వచ్చినప్పుడు చాలా నవ్వుకున్నాను! స్క్రీన్ పై కెమిస్ట్రీ ఉంటే చాలు, రియల్ లైఫ్‌లో రూమర్స్ అవసరం లేదు కదా!⇒ ఇటీవల సోషల్ మీడియాలో ఫేక్ ఏఐ ఫోటోలు వైరల్ అయినప్పుడు నేనే ముందుకు వచ్చి మాట్లాడాను. అలాంటి వాటిని షేర్ చేయకండి, మానవత్వాన్ని కాపాడుకుందాం!⇒నా దృష్టిలో జీవితం అంటే పెద్ద సినిమా కాదు, చిన్న చిన్న హ్యాపీ సీన్స్ కలెక్షన్ . అందుకే, టైమ్ దొరికినప్పుడల్లా కొత్త ప్రదేశాలను చుట్టేస్తుంటా! సముద్రతీరాల సైలెన్స్, కొండల కూల్‌నెస్ నాకు థెరపీలా పనిచేస్తాయి. స్విట్జర్లాండ్ వింటర్, కేరళ హౌస్‌బోట్ డే.. ఇవే నా డ్రీమ్ వెకేషన్ . -
ఈ సండే వెరైటీగా లెమెన్ షార్ట్బ్రెడ్, రైస్ కోకోనట్ ఇడ్లీ ట్రై చేయండిలా..!
లెమెన్ షార్ట్బ్రెడ్కావలసినవి: మైదాపిండి, పంచదార పొడి– 2 కప్పులు చొప్పున, బటర్– ఒక కప్పు (తురుములా చేసుకోవాలి)నిమ్మ తొక్క తురుము– ఒక టీ స్పూన్ పైనేఉప్పు– కొద్దిగా, చిక్కటి పాలు– పావు కప్పునిమ్మరసం– 6 టేబుల్ స్పూన్లుతయారీ: ముందుగా మైదాపిండి, ఉప్పును ఒక గిన్నెలో వేసి, బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఒక పెద్ద మిక్సీ గిన్నెలో బటర్ తురుము, అర కప్పు పంచదార పొడి, ఒక టీ స్పూన్ నిమ్మ తొక్క తురుము వేసి, మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. అనంతరం మైదా మిశ్రమాన్ని దీనికి జోడించి, కొద్దిగా నీళ్లు కలుపుతూ, పిండిని ముద్దగా అయ్యే వరకు కలపాలి. మరీ ఎక్కువగా కలపకూడదు. పిండి మెత్తగా ముద్ద అయ్యే వరకు చేతులతో తేలికగా కలపితే సరిపోతుంది. ఆ ముద్దను ప్లాస్టిక్ ర్యాప్‌లో చుట్టి కనీసం ఒక గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఈలోపు ఒక పాత్రలో ఒకటిన్నర కప్పుల పంచదార పొడి, నిమ్మరసం, పాలతో పాటు అభిరుచిని బట్టి ఏలకుల పొడి వేసుకుని, బాగా కలుపుకోవాలి. గంట తర్వాత మైదా ముద్దను బ్రెడ్ ట్రేలో వేసి ఓవెన్లో బేక్ చేసుకుని, నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ముక్కపైన నిమ్మ తొక్క తురుము, పాలు– పంచదార మిశ్రమం వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు.రైస్ కోకోనట్ ఇడ్లీకావలసినవి: అన్నం– ఒక కప్పు (మెత్తగా ఉడికినది)బెల్లం కోరు– పావు కప్పు (పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు)అరటిపండు– 1 (మీడియం సైజ్)కొబ్బరి కోరు– అర కప్పు, ఏలకులు– 3 (పౌడర్ చేసుకోవాలి)నెయ్యి– కొద్దిగా, డ్రై ఫ్రూట్స్– అలంకరణకు తగినంతతయారీ: ముందుగా అన్నం, బెల్లం కోరు, అరటిపండు ముక్కలు మిక్సీ బౌల్లో వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. అనంతరం అందులో కొబ్బరి కోరు, ఏలకుల పొడి వేసుకుని మరోసారి మిక్సీ పట్టుకోవాలి. ఆపై ఇడ్లీ రేకులకు నెయ్యి రాసుకుని, అందులో అన్నం–బెల్లం మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పెట్టుకుని సుమారు పది నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించుకోవాలి. తర్వాత ఆ ఇడ్లీలపై నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని అలంకరించుకుని సర్వ్ చేసుకోవాలి.రాజస్థానీ ఘేవర్కావలసినవి: మైదా పిండి– ఒక కప్పు, నెయ్యి– పావు కప్పు (గడ్డకట్టినది తీసుకోవాలి), చల్లని నీళ్లు– పావు కప్పు ఐస్ ముక్కలు– 8 ముక్కలు, చల్లని పాలు– 3 కప్పులు, శెనగ పిండి– ఒక టీస్పూన్, నిమ్మరసం– కొద్దిగా, నూనె– సరిపడా, పంచదార– ఒక కప్పునీళ్లు– అర కప్పు, ఏలకుల పొడి– పావు టీస్పూన్తయారీ: ముందుగా ఒక గిన్నెలో పంచదార, అరకప్పు నీళ్లు కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలి. పంచదార కరిగేంత వరకు వేడి చేసి, ఆ తర్వాత 2 నిమిషాలు ఉడికించాలి. ఒక తీగ పాకం వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు ఏలకుల పొడి, మూడు చుక్కల నిమ్మరసం కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక పెద్ద గిన్నెలో నెయ్యి, ఐస్ ముక్కలు వేసి, నెయ్యి తెల్లటి క్రీములా మారేవరకు బాగా కలపాలి. ఇప్పుడు మైదా పిండిని కొద్దికొద్దిగా జల్లించి, చల్లని పాలు కొంచెం కొంచెం పోస్తూ, పిండిని ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమం చాలా పల్చగా ఉండాలి. దానిలో ఒక టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. అనంతరం ఒక లోతైన, వెడల్పాటి కడాయిలో నూనెను సగ భాగం కంటే కొంచెం తక్కువగా పోసి బాగా వేడి చేయాలి. ఇప్పుడు మైదా మిశ్రమాన్ని ఒక గరిటెతో నూనె మధ్యలోకి, పైనుండి నెమ్మదిగా సన్నని ధారలా పోయాలి. నూనె పైకి నురగలా వస్తుంది. నురగ తగ్గిన తర్వాత, మళ్లీ కొంచెం మైదా మిశ్రమాన్ని అదే విధంగా పోయాలి. ఇలా సుమారు ఏడెనిమిది సార్లు రిపీట్ చేస్తే, గుండ్రటి జల్లెడలా (ఘేవర్) మారి, దాని మధ్యలో ఒక చిన్న రంధ్రం ఏర్పడుతుంది. ఇప్పుడు దాన్ని గోధుమ రంగులోకి మారేవరకు వేయించాలి. మధ్యలో రంధ్రం దగ్గర చిన్న కర్ర లేదా స్పూన్ సహాయంతో నెమ్మదిగా బయటికి తీసి, టిష్యూ పేపర్స్ మీద కాసేపు ఉంచాలి. ఇదే మాదిరి చాలా ఘేవర్లు తయారుచేసుకోవచ్చు. వేడి తగ్గిన తర్వాత వాటిని ఒక పెద్ద బౌల్లోకి జాగ్రత్తగా ఉంచి, వాటిపైన పంచదార పాకం పోసి, సర్వ్ చేసుకునే ముందు పిస్తా బాదం వంటి ముక్కలతో నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. (చదవండి: అలా ఉంటే..డయాబెటిస్ బోర్డర్లోకి వచ్చినట్లే..?) -
సరిపోయారు ఇద్దరూనూ!
అనగనగా ఒక అడవిలో ఒక మర్రిచెట్టు ఉండేది. మర్రిచెట్టు తొర్రలో ఉడత, కొమ్మ మీది గూటిలో కాకి నివసించేవి.ఉడుత, కాకి రెండూ స్నేహంగా ఉండేవి.ఒకరోజు ఉదయం ఆహారం కోసం చెట్టు దిగింది ఉడుత.ఒక కుందేలు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి చెట్టు నీడలో కాసేపు ఆయాసం తీర్చుకుంది. ఉడుతతో ‘మిత్రమా! నాకు చాలా దాహంగా ఉంది. చెరువుకు దారి చెప్తావా!’ మర్యాదగా అడిగింది కుందేలు.‘చెరువుకు దారి ఎటంటే, అయ్యో... మర్చిపోయానే! అయ్యో ... మర్చిపోయానే!’ అంటూ తల గోక్కుంది.చెట్టు మీదనే ఉన్న కాకి విషయం తెలుసుకొని, ‘నేరుగా వెళ్లి కుడి చేతి వైపు తిరిగితే చెరువు వస్తుంది!’ అంది.‘అవునవును.. గుర్తుకొచ్చింది!’ అంది ఉడుత.అప్పుడు ఉడుత వైపు వింతగా చూసింది కుందేలు.‘నువ్వేమీ కంగారు పడకు! ఉడుతకు మతిమరుపు. అది కొద్దిసేపైతే నువ్వు అడిగింది కూడా మర్చిపోతుంది. అందుకే నేను ఉడుతకు తోడుగా ఉంటాను!’ అంది కాకి.‘సరిపోయారు... ఇద్దరూనూ!’ అనుకుంటూ చెరువు వైపు పరిగెత్తింది కుందేలు.కాకి ఆహారం కోసం ఎగిరి బయటకి వెళ్లింది. ఉడుత దాచుకున్న గింజల కోసం చెట్టు తొర్రంతా వెతికింది గాని, కనపడలేదు. ఏదో గుర్తొచ్చి చెట్టుకిందకు దూకింది.నేల తవ్వి అక్కడ దాచుకున్న గింజలు తింటుండగా నక్క అక్కడికి వచ్చింది.‘మిత్రమా! నేను పక్క అడవి నుంచి వస్తున్నాను. పులిరాజు గుహకు దారి చెపుతావా!’ అని అడిగింది.‘పులిరాజు గుహకు దారి ఎటంటే, అయ్యో... మర్చిపోయానే! అయ్యో ... మర్చిపోయానే!’ అంటూ నెత్తి గోక్కుంది. అప్పుడే ఆహారంతో తిరిగి వచ్చిన కాకి విషయం తెలుసుకుని, ‘నేరుగా వెళ్లి ఎడమ చేతి వైపు తిరిగితే పులిరాజు గుహ వస్తుంది!’ అంది కాకి‘అవునవును.. గుర్తుకొచ్చింది!’ అంది ఉడుత.అప్పుడు ఉడుత వైపు విచిత్రంగా చూసింది నక్క.‘నువ్వేమీ అనుకోకు! ఉడుతకు మతిమరుపు. అది కొద్దిసేపైతే నువ్వు వచ్చిన సంగతి కూడా మర్చిపోతుంది. అందుకే నేను ఉడుతకు సాయంగా ఉంటాను!’ అంది కాకి.‘సరిపోయారు... ఇద్దరూనూ!’ అనుకుంటూ గుహ వైపు నడిచింది నక్క.నక్క పులిరాజు గుహకు దారి అడగటంతో..ఉడుత చెట్టు పైకి చూసి, ‘మిత్రమా! నీకు చెప్పటం మరచా! నీకోసం మంత్రి ఎలుగుబంటి వచ్చింది. పులిరాజు చాటింపు వేయమన్నాడని చెప్పమంది’ అంది ఉడుత. ‘ఏమి చాటింపు?’ అడిగింది కాకి.‘చాటింపు ఏమిటంటే, అయ్యో... మర్చిపోయానే! అయ్యో ... మర్చిపోయానే!’ అంటూ బుర్ర గోక్కుంది.‘పులిరాజు ఏమి పురమాయించాడో గుర్తుకు తెచ్చుకుని చెప్పకపోయావో నా చేతిలో నీచావు తప్పదు!’ అంది కోపంగా కాకి.‘ఆ.. చావంటే గుర్తొచ్చింది. రేపు పులిరాజు తల్లి చనిపోయిన రోజట! అడవంతా విందుకు రమ్మని చాటింపు వేయమని మంత్రి ఎలుగుబంటి నీకు చెప్పమంది!’ అంది ఉడుత. కాకి వెంటనే అడవంతా చాటింపు వేసింది.మరునాడు అడవి జీవులన్నీ పులిరాజు గుహకు చేరాయి. అక్కడ పులిరాజు చిట్టి కూన పుట్టిన రోజు వేడుక జరుగుతోంది. కాకి తప్పు చాటింపు వేశాడని వేడుకకు వచ్చిన అడవి జీవులన్నీ గుసగుసలాడుకున్నాయి. ఆ విషయం ఎలుగుబంటికి, పులికి కూడా తెలిసింది. ఎలుగుబంటి ఉడుతను, కాకిని పిలిచింది. పులిరాజు చేతిలో చచ్చామనుకున్నాయి. కాకి, ఉడుత భయంతో వణుక్కుంటూ వెళ్లాయి. ఉడుత మతిమరపు విషయం చెప్పింది కాకి. పొరపాటుకు క్షమించమని పులి కాళ్లు పట్టుకున్నాయి కాకి, ఉడుత.‘భయపడకండి! మీరు మంచే చేశారు. ఈరోజు నా చిట్టికూన పుట్టినరోజే కాదు, మా అమ్మ చనిపోయిన రోజు కూడా! మా అమ్మే గత యేడు చనిపోయి, చిట్టి కూనగా పుట్టింది. మతిమరపు ఉడుతది కాదు, కూన పుట్టిన ఆనందంలో మరచిన నాదే!’ అంది పులిరాజు.కాకి, ఉడుతలకు విలువైన కానుకలిచ్చాడు పులిరాజు. అడవి జీవులన్నీ కమ్మటి విందు చేశాయి. చేతిలో విలువైన కానుకలతో తిరుగుతున్న కాకి, ఉడుతలను చూసి అడవి జీవులన్నీ ‘సరిపోయారు... ఇద్దరూనూ!’ అనుకున్నాయి. పులిరాజు రాజ వైద్యుడు కోతితో ఉడుతకు వైద్యం చేయించి, మతిమరపు పోగొట్టాడు. ∙ముద్దు హేమలత -
స్మార్ట్‌ఫోన్‌తో తగ్గుతున్న అటెన్షన్
ఒకప్పుడు పిల్లలు ఆటల్లో మునిగి తేలేవారు. ఇప్పుడు స్క్రీన్‌లో మునిగిపోతున్నారు. తల్లిదండ్రులు ప్రేమతో ఇచ్చే ఫోన్ ఇప్పుడు పిల్లల అటెన్షన్, క్రియేటివిటీ, ఎమోషనల్ గ్రోత్‌ను దోచుకుంటోంది. సైలెంట్ డిజిటల్ బేబీ సిట్టర్ పిల్లల మెదడు మొదటి ఐదేళ్లలో నిర్మాణం చెందుతుంది. ఈ వయసులో వచ్చే ప్రతి ఇంద్రియానుభవం వారి మెదడులోని న్యూరాన్ల మధ్య బంధాలను ఏర్పరుస్తుంది. కాని, బిజీగా ఉన్న తల్లిదండ్రులు తరచుగా అనే మాట– ‘నేను కాసేపు పనిచేసుకోవాలి, అప్పటివరకు ఫోన్లో కార్టూన్ చూసుకో!’అలా ‘డిజిటల్ బేబీ సిటింగ్’ మొదలవుతుంది. స్క్రీన్ ఆ బిడ్డ మొదటి స్నేహితుడిగా మారిపోతుంది. స్క్రీన్ అందించే అనుభవం వేగంగా, ప్రాసెసింగ్–లోడ్ ఎక్కువగా, సహజ ప్రపంచం కంటే అసంబద్ధంగా ఉత్తేజపరుస్తుంది. ఫలితంగా మెదడు నిజ జీవితంలోని అనుభవాలపట్ల ఆసక్తి కోల్పోతుంది. డోపమైన్ లూప్ స్క్రీన్ టచ్ చేసిన ప్రతిసారీ పిల్లల మెదడులో సంతోషాన్నిచ్చే రసాయనం ‘డోపమైన్’ విడుదలవుతుంది. కాని, అది వెంటనే తగ్గిపోతుంది. దానికోసం మరొక వీడియో కావాలి. ఇంకో కార్టూన్ కావాలి. ఇంకో గేమ్ కావాలి. అలా వలయంలో చిక్కుకుపోతారు. అంటే స్క్రీన్కు అలవాటైన పిల్లలు తక్షణ సంతృప్తికి అలవాటు పడతారు. అంటే, తక్షణ ఆనందం తప్ప మిగతా ఏదీ విలువైనదిగా కనిపించదు. దీనివల్ల పిల్లలు కేంద్రీకరించడం, శాంతంగా ఆలోచించడం, సహనంతో నేర్చుకోవడం వంటి నైపుణ్యాలను కోల్పోతున్నారు.తగ్గిన అటెన్షన్ స్పాన్ అటెన్షన్ స్పాన్ కేవలం చదువుకోడానికే కాదు, జీవితానికే ఆధారం. కాని, మానవుల సగటు అటెన్షన్ స్పాన్12 సెకన్ల నుండి 8 సెకన్లకు తగ్గిందని మైక్రోసాఫ్ట్ చేసిన అధ్యయనం చెబుతోంది. అది ఎంత తక్కువంటే ఒక గోల్డ్ ఫిష్ అటెన్షన్ స్పాన్ కంటే తక్కువ. పిల్లలు ఒక్క క్షణం కూడా ఫోన్ లేకుండా ఉండలేకపోవడం, బోర్ అనిపిస్తే వెంటనే యూట్యూబ్ తెరవడం– ఇది కేవలం అలవాటు కాదు, అటెన్షన్ డెఫిషిట్ కండిషన్ ప్రారంభమైందనడానికి సంకేతం. మాయమైన ఆటల ప్రపంచం...‘ఆటలే పిల్లల పని’ అన్నారు మరియా మాంటిస్సోరి. కాని, ఆ ఆటల స్థానంలో ఇప్పుడు డిజిటల్ ప్లే వచ్చింది.ఫోన్ గేమ్‌లో హీరో పరిగెడతాడు. కాని, పిల్లాడు కదలడు. వీడియోలో రంగులు మారతాయి, కాని, బిడ్డ బయట పూల రంగులు చూడడు. దీనివల్ల కేవలం శారీరక కదలిక తగ్గడమే కాదు, ఇమాజినేషన్, క్రియేటివిటీ, సోషల్ అవేర్నెస్ అన్నీ తగ్గిపోతున్నాయి.పిల్లలు ‘ఏం చేయాలి?’ అనే ప్రశ్నను అడగరు, ‘ఏం చూపిస్తావు?’ అనే అంచనాతో ఎదురు చూస్తారు.ఇది వారి సహజ కుతూహలాన్ని ముంచేస్తుంది.భావోద్వేగ శూన్యతస్క్రీన్ అనుభవాలను చూపిస్తుంది కాని, భావోద్వేగాలను కాదు. వాటిని చూసి పిల్లలు నవ్వుతారు, కాని, అర్థం లేకుండా విసిగిపోతారు. కాని, ఎందుకో తెలియదు. వాస్తవ ప్రపంచంలోని సంబంధాలు, మమత, శ్రద్ధ, సహానుభూతి– ఇలాంటి ఎమోషనల్ స్కిల్స్ ఇంటరాక్షన్ ద్వారా మాత్రమే అభివృద్ధి చెందుతాయి. కాని, ఫోన్‌పై మమకారం పెరిగితే, మనుషుల పట్ల మమకారం తగ్గిపోతుంది.పేరెంట్స్ మారాలిపిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండవచ్చు కాని, నియంత్రణ తల్లిదండ్రుల చేతిలో ఉండాలి. పేరెంట్స్ ఫోన్ చూస్తూ పిల్లలతో మాట్లాడుతుంటే, ‘మా పేరెంట్స్‌కు ఫోనే ముఖ్యం, నేను కాదు’ అని అర్థం చేసుకుంటారు. పిల్లలు మనం చెప్పేది వినరు, మనమేం చేస్తున్నామో చూస్తారు. తల్లిదండ్రులే స్క్రీన్కు బానిసలైతే, పిల్లలకు డిజిటల్ డిసిప్లిన్ గురించి చెప్పడం వృథా. కాబట్టి మొదటి మార్పు పెద్దల్లోనే ప్రారంభం కావాలి.అటెన్షన్ లోపం చిహ్నాలుచదువుతుంటే తక్షణం బోర్ అనిపించడం · గేమ్ ఆడకపోతే చిరాకు, ఆగ్రహం · ఒకే పని పైన దృష్టి నిలపలేకపోవడం · ఆటలలో క్రియేటివిటీ లేకపోవడం · మాట్లాడేటప్పుడు అర్థం లేని సారాంశం ఇవి కేవలం ప్రవర్తనా సమస్యలు కాదు, న్యూరో–డెవలప్మెంటల్ వార్నింగ్స్.అటెన్షన్ పెంచే మార్గాలుఅటెన్షన్ పెంచడానికి పరిష్కారం టెక్నాలజీని ద్వేషించడం కాదు, దానిని సమయ పరిమితితో, మనో పరిమితితో ఉపయోగించడం.1. రోజుకు ఒక గంట మాత్రమే స్క్రీన్ టైమ్. 2. రోజూ బయట ఆటలు, చేతులతో చేసే క్రియేటివిటీ3. భోజన సమయంలో ఫోన్ లేకుండా మాట్లాడుకోవడం4. కథలు, పుస్తకాలు, సంగీతం ద్వారా మెదడుని మెల్లగా ఉత్తేజపరచడం.5. ఫోన్ వినియోగంలో తల్లిదండ్రులు ఆదర్శంగా నిలవడం. సైకాలజిస్ట్ విశేష్, ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్ (చదవండి: వజ్రనేత్రుడు..! ఏకంగా రెండు కేరట్ల వజ్రంతో..) -
కంటి ఆరోగ్యం కోసం..!
ఈ డిజిటల్ ప్రపంచంలో చాలామందికి కళ్ల అలసట, కళ్లు పొడిబారడంతో పాటు నిద్రలేమి కూడా ఎక్కువ అవుతుంది. కంప్యూటర్ స్క్రీన్లు, మొబైల్ ఫోన్లో ఎక్కువగా చూడటంతో కళ్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. చిత్రంలోని ఈ హీటెడ్ ఐ మాస్క్–పై సమస్యలన్నింటికీ అద్భుతమైన, సౌకర్యవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. ఇది కేవలం నిద్ర మాస్క్ మాత్రమే కాదు, కంటి ఆరోగ్యం కోసం రూపొందిన చికిత్సా సాధనం. ఈ మాస్క్ ఉపయోగిస్తే దీనిలోని ‘ఫార్ ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ’ చాలా ఉపశమనం కలిగిస్తుంది. ఇది కళ్ళకు వేడిని సమర్థంగా అందిస్తుంది. కళ్లు పొడిబారడాన్ని తగ్గిస్తుంది. ఎక్కువ స్క్రీన్ చూడటంతో ఏర్పడే ఒత్తిడిని ఇట్టే తగ్గిస్తుంది. సైనస్, తలనొప్పి వంటి సమస్యలకు కూడా ఈ ఐ మాస్క్ బెస్ట్ ఆఫ్షన్ అని చెప్పుకోవచ్చు. అంతే కాదు ఈ మాస్క్ ధరిస్తే కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గుతాయి. ఈ డివైస్ కంటి వాపును తగ్గించి, గ్రంథుల పనితీరును మెరుగుపరుస్తుంది. సాధారణ మైక్రోవేవ్ లేదా స్టీమ్ మాస్క్‌ల మాదిరిగా కాకుండా, నిరంతరం వేడిని అందిస్తుంది.ఇందులో 95 డిగ్రీల ఫారెన్ హీట్ నుంచి 3–స్థాయిల హీట్ సెట్టింగ్‌లు ఉన్నందున మన సౌలభ్యం మేరకు ఉష్ణోగ్రతను ఎంచుకోవచ్చు, మార్చుకోవచ్చు. అలాగే దీనిలో 15 నిమిషాలు, 30 నిమిషాలు, 45 నిమిషాలు, 60 నిమిషాలతో టైమర్ కూడా ఉంది. ఇది సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ మాస్క్ యుఎస్బీ–పవర్డ్ కావడంతో దీనిని ఎక్కడైనా సులభంగా ఉపయోగించుకోవచ్చు. వాల్ చార్జర్లు, ల్యాప్‌టాప్‌లు, పోర్టబుల్ పవర్ బ్యాంక్‌లు, కార్ చార్జర్లు ఇలాంటి వాటికి కనెక్ట్ చేసి ఆఫీసులో, ఇంట్లో లేదా ప్రయాణంలో కూడా ఈ మాస్క్‌ను వినియోగించుకోవచ్చు.కళ్లకింద నల్లటి వలయాలను పోగొట్టే స్క్రబ్మృతకణాలను పోగొట్టి, చర్మాన్ని మృదువుగా మార్చే స్క్రబ్‌ను ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. అందుకోసం ముందుగా నిమ్మకాయ తొక్క పైపొరను ఒలిచి ఎండపెట్టుకోవాలి. బాగా ఎండిన తర్వాత మిక్సీ పట్టి పౌడర్లా చేసి దాచుకోవాలి. అలా తయారు చేసుకున్న నిమ్మతొక్క పొడిని టేబుల్ స్పూన్ తీసుకుని దానిలో టేబుల్ స్పూన్ పంచదార, టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలుపుకుని, ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. అనంతరం బాగా స్క్రబ్ చేసుకుని ఓ ఐదు నిమిషాలు వదిలెయ్యాలి. ఆపై చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా క్రమం తప్పకుండా చేయడంతో మృతకణాలు తొలగిపోతాయి. కంటి కింద నల్లటి వలయాలు తగ్గుతాయి. చర్మం మృదువుగా మారుతుంది.(చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం..! హైలెట్‌గా వెనక్కి ప్రవహించే నది..) -
దేశానికో చంద్రుడు!
ఇప్పటికీ ఎవరైనా కొత్తగా అమెరికా వెళ్లొస్తే అక్కడి నుండి చాక్లెట్స్ తెస్తారు. ఇక్కడ నలుగురికీ పంచుతారు. అమెరికా వెళ్లొచ్చిన వారికి, అమెరికా చాక్లెట్లు కానుకగా అందుకున్న వారికి.. ఇద్దరికీ అదొక ‘తీపి’ జ్ఞాపకం. అదే విధంగా యాభై ఐదేళ్ల క్రితం ‘నాసా’ తొలిసారి ‘చంద్ర శిలల్ని’ భూమి మీదకు తెచ్చినప్పుడు ఆనాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ప్రపంచ దేశాలకు తలా ఒక శిలా ఖండాన్ని ‘దేశానికో చంద్రుడి’లా గుడ్‌విల్ గిఫ్టు పంపారు. మనకూ ఒక చాక్లెట్... అదే, మనకూ ఒక రాయి (ఆ తర్వాత ఇంకో రాయి కూడా) బహుమతిగా లభించింది. రాయితో పాటుగా నిక్సన్.. ‘మానవ ప్రయత్నాలలోని ఐక్యతకు చిహ్నం’ అని ఒక సందేశాన్ని కూడా జత చేశారు. నాడు ఆ ఘనత సాధించిన ‘నాసా’.. ఇప్పుడు మరో ప్రయత్నానికి సమాయత్తం అవుతోంది. చంద్రుడి పైన చంద్ర శిలల్ని తవ్వేందుకు ఒక జేసీబీని తయారు చేస్తోంది. ఈ సందర్భంగా ‘చంద్ర శిల’ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. చంద్ర శిలలపై శాస్త్ర పరిశోధనలు‘నాసా’కు చెందిన అపోలో మిషన్ వ్యోమగాములు చంద్రుని పైకి వెళ్లినప్పుడు అక్కడి నుండి భూమి మీదకు అద్భుతమైన ‘జ్ఞాపకాలను’ మోసుకొచ్చారు. అవే.. చంద్ర శిలలు!విజయవంతం అయిన 6 అపోలో యాత్రల నుంచి 12 మంది వ్యోమగాములు దాదాపు 382 కిలోల బరువున్న 2,196 శిలా శకలాలను సేకరించారు.చంద్ర శిలలు కేవలం విజయ చిహ్నాలు మాత్రమే కాదు. వీటిపై భూమి మీద శాస్త్ర పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిల్లో కొన్నింటిని సందర్శకుల కోసం మ్యూజియంలలో ప్రదర్శనకు ఉంచారు. మరికొన్ని ప్రపంచ దేశాలకు బహుమతులుగా వెళ్లాయి. నాసా చేపట్టిన మొత్తం అపోలో యాత్రల సంఖ్య 17. ఈ యాత్రలను నాసా 1969–1972 మధ్యకాలంలో నిర్వహించింది. వీటిల్లో మొత్తం 11 మానవ సహిత యాత్రలు కాగా, వాటిలో ఆరు యాత్రలు చంద్రుని పైకి వ్యోమగాములను విజయవంతంగా దింపాయి. అవి అపోలో 11, 12, 14, 15, 16, 17. ఈ ఈరు యాత్రల వ్యోమగాములు తెచ్చినవే ఈ చంద్రశిలలు. ఏయే దేశాలలో ఉన్నాయి?చంద్రుడి పైకి వ్యోమగాముల మొదటి ల్యాండింగ్ 1969 జూలైలో ‘అపోలో 11’ ద్వారా విజయవంతమైంది. అందులోనే నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ ఉన్నారు. ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ భూమిపైకి తెచ్చిన చంద్ర శిలలతో పాటు చంద్రుడి పైకి 1972లో ‘అపోలో 17’ ద్వారా జరిగిన వ్యోమగాముల చివరి ల్యాండింగ్ వరకు అసంఖ్యాకంగా శిలలు భూమికి చేరాయి. ఆ శిలల్లోని 50,000 శిలా శకలాలను ప్రపంచంలోని 15 దేశాలలోని 500 ప్రయోగశాలలకు నాసా పంపించింది. నిజానికి, వ్యోమగామలు తెచ్చిన చంద్రశిలల్లో ఇంకా 80 శాతం అలాగే, ఎవరూ కదలించకుండా ఉన్నాయి. ఈ 80 శాతంలో 15 శాతం చంద్రశిలల్ని ‘నాసా’, హ్యూస్టన్‌లోని తన ప్రధాన స్థావరానికి దూరంగా, న్యూ మెక్సికోలో ఒక దుర్భేద్యమైన భాండాగారంలో భద్రపరచింది. మానవులే స్వయంగా తెచ్చినవి·చంద్రుడి నుండి భూమి మీదకు కేవలం రాళ్లు మాత్రమే రాలేదు. మట్టి, ధూళిని కూడా వ్యోమగాములు తీసుకొచ్చారు. వీటిల్లో అపోలో చంద్ర శిలలు ఎందుకు ఇంత ప్రత్యేకమైనవి అంటే, మానవులు వాటిని తమ స్వహస్తాలతో చంద్రుడి పైనుంచి సేకరించుకుని వచ్చినవి కావటం. సోవియట్ యూనియన్ కూడా కొన్ని రాళ్ల నమూనాలను సేకరించింది. కానీ, అవి.. చంద్రుడి పైకి సోవియట్ యూనియన్ పంపిన మానవ రహిత అంతరిక్ష నౌకలోని రోబో మిషన్లు కిందికి తీసుకు వచ్చినవి. అలాగే, కొన్ని చంద్రశిలలు వాటంతటవే ఉల్కపాతంలా భూమిపై పడినవి. అయితే అవి చంద్రుడి లోని ఏ నిర్దిష్ట ప్రదేశం నుండి పడ్డాయో గుర్తించటం కష్టం. ఆ కారణంగా కొన్ని రకాల పరిశోధనలకు ఆ రాళ్లు తక్కువ ఉపయోగకరంగా ఉంటాయి. ప్రపంచదేశాలకు నిక్సన్ గిఫ్ట్1969లో అపోలో 11 చంద్రయానం ద్వారా తొలిసారి వ్యోమగాములు భూమి పైకి తెచ్చిన చంద్రశిలల నమూనాలను అప్పటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్... అమెరికా సంయుక్త రాష్ట్రాలకు, 135 దేశాలకు బహుమతిగా పంపించారు. అయితే ఆ దేశాలలో సోవియట్ యూనియన్ లేదు!తిరిగి 1972లో, అపోలో 17 ద్వారా వచ్చిన చంద్ర శిలల్ని నిక్సన్ మళ్లీ అన్ని దేశాలకూ కానుకగా పంపించారు. ఈసారి సోవియట్‌కు ఆ అపురూపమైన బహుమతి పంపించారు. కాగా, ఇలా రెండుసార్లు నిక్సన్ పంపిన శిలా బహుమతులను ఆయా దేశాలు ఏం చేశాయో తెలీదు! కొన్ని దేశాలు ప్రదర్శనకు ఉంచాయి. కొన్ని దేశాలు పోగొట్టుకున్నాయి. కొన్ని చోరీ అవగా, మరికొన్ని దేశాలు స్టోర్ రూమ్‌లో పడేసినట్లు తెలుస్తోంది. భారతదేశానికి కూడా నిక్సన్ ఒక చంద్రశిలను కానుకగా పంపారు. 1973లో ఆ కానుక ఇండియా చేరింది. నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ఆ చంద్రశిలను న్యూఢిల్లీలోని పార్లమెంటు మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ఏర్పాటు చేయించారు. అంతకు ముందరి అపోలో 11 గుడ్ విల్ ‘రాక్’ను కూడా అమెరికా ఇండియాకు బహుకరించింది. అదిప్పుడు రాష్ట్రపతి భవన్ మ్యూజియంలో ఉంది. వివిధ దేశాలకు నిక్సన్ పంపిన ఈ చంద్రశిలా కానుకలతో పాటు, ‘మానవ ప్రయత్నాలలో ఐక్యతకు చిహ్నం’ అనే సందేశం కూడా జతపరిచి ఉంది.కొన్ని శిలలైతే ఎక్కడివక్కడే!అపోలో వ్యోమగాములు భూమి పైకి తెచ్చిన చంద్రశిలల్లో కొన్నింటిని నేటికీ కదల్చనేలేదు. అవి ఇప్పటికీ చంద్రునిపై ఉన్నట్లుగానే ఉండిపోయాయి!ర్యాన్ జీగ్లర్ వంటి శాస్త్రవేత్తలు ఈ విలువైన చంద్రశిలల్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. వాటిపై సరైన విధంగా పరిశోధనలు జరుగుతున్నాయా లేదా అని తరచు నిర్ధారించుకుంటూ ఉంటారు. అపోలో వ్యోమగాముల తీసుకొచ్చిన రాళ్లలో కొన్ని 400 కోట్ల సంవత్సరాల క్రితం నాటివని శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని 200 కోట్ల సంవత్సరాల నాటివి. ఈ రాళ్లను భూవాతావరణం, సూక్ష్మక్రిములు, కాలుష్యం నుండి సంరక్షించటానికి నత్రజని నింపిన గదులలో భద్రపరచారు. (చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం..! హైలెట్‌గా వెనక్కి ప్రవహించే నది..) -
స్కూల్ ప్రాజెక్ట్‌లో క్యూట్ సైంటిస్ట్!
ఐదో తరగతి విద్యార్థుల సైన్స్ ప్రాజెక్ట్‌లలో ఎక్కువగా రంగురంగుల పేపర్లు, కార్డ్బోర్డ్, గ్లూ, పెద్దగా రాసిన టైటిల్ కార్డ్స్‌తో వోల్కేనో మోడల్ లేదా సోలోర్ సిస్టమ్ మోడల్ చేస్తారు. కాని, అమెరికాలోని మిడ్‌టౌన్ పట్టణంలో చదువుతున్న 12 ఏళ్ల ఎనియోలా షోకుబ్ని చేసిన సైన్స్ ప్రాజెక్ట్ అందరినీ ఆశ్చర్యపరచింది. తన ప్రాజెక్ట్ కోసం ఆమె ఎంచుకున్నది జీవితానికి ఉపయోగపడే, సూపర్ ఇన్నోవేటివ్ ఐడియా. లాక్డౌన్ సమయంలో పాఠశాలల వాయు భద్రతను మెరుగుపరచడం కోసం, టీచర్ ఇచ్చిన సూచనలతో అందరికీ స్వచ్ఛమైన గాలి అందేలా చేయాలనుకుంది. అందుకోసం, ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ రూపొందించింది. కేవలం అరవై డాలర్ల ఖర్చుతో, ఒక చిన్న బాక్స్, ఫ్యాన్, ఫిల్టర్లు, డక్ట్ టేప్, కార్ట్బోర్డ్లతో ఎయిర్ ప్యూరిఫైర్ నమూనా తయారుచేసి, కమర్షియల్ ప్యూరిఫైర్స్కు అత్యంత చౌకైన ప్రత్యామ్నాయం చూపింది. ఈ ఎయిర్ ఫిల్టర్‌ను యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్ సైంటిస్టులు పరీక్షించారు. ఫలితాలు అద్భుతంగా వచ్చాయి. గాలిలో ఉన్న వైరస్‌లను తొంభై తొమ్మిది శాతం కంటే ఎక్కువ తొలగించే సామర్థ్యం దీనికి ఉందని తేల్చి, డిజైన్‌ను సర్టిఫై చేశారు. అందుకే, ఈ చిన్నారి ఐడియా, ఇప్పుడు ఒక పెద్ద ప్రాజెక్ట్‌గా మారింది. కనెక్టికట్ ప్రభుత్వం 11.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ.101 కోట్లు) నిధిని మంజూరు చేసి, ఈ ఫిల్టర్లను అన్ని పబ్లిక్ స్కూళ్లలోనూ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా, త్వరలోనే ప్రతి తరగతి గది పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గాలి పొందనుంది. (చదవండి: వాసా ప్రీవియా ఉంటే సాధారణ ప్రసవం అవ్వడం కష్టమా..?) -
ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం..! హైలెట్‌గా వెనక్కి ప్రవహించే నది..
కంబోడియాలోని సీమ్ రీప్ నగరంలో ఉన్న ‘ఆంగ్కోర్ వాట్’ ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం. అలాగే ఇది ఆగ్నేయాసియా చరిత్రలో సుదీర్ఘకాలం పాటు ఉనికిలో ఉన్న ఖ్మేర్ సామ్రాజ్యపు అద్భుత సృష్టి. ఇది క్రీ.శ. పన్నెండో శతాబ్దంలో రెండవ సూర్యవర్మ ఆధ్వర్యంలో నిర్మించిన వైష్ణవాలయం. విష్ణువు వెలసిన ఈ ఆలయం తర్వాత బౌద్ధ ఆరామంగా మారింది. దీని నిర్మాణ శైలి హిందూ పురాణాలలోని దేవతల నివాసమైన మేరు పర్వతాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం గోడలపై చెక్కిన శిల్పాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. రామాయణం, మహాభారతం, క్షీరసాగర మథనం తదితర పురాణ గాథల దృశ్యాలను అత్యంత నైపుణ్యంతో చెక్కారు. వందలాది మంది అప్సరసల నృత్య భంగిమలు, నాటి కళాకారుల ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. ఈ ఆలయానికి గల చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత కారణంగా, దీన్ని 1992లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇక్కడ సూర్యోదయాన్ని వీక్షించడం అద్భుతమైన అనుభూతినిస్తుంది. నదికి నీరాజనం‘బోన్ ఓమ్ టౌక్’ అనే వేడుక– కంబోడియాలో అత్యంత ఆకర్షణీయమైన ఉత్సవం. ఇది వర్షాకాలం ముగింపును, టోన్లే సాప్ నది ప్రత్యేకతను సూచిస్తుంది. ఈ సంబరాలు మూడురోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాదిలో నవంబర్ 4 నుంచి మొదలై నవంబర్ 6 వరకు కొనసాగుతాయి.‘వర్షాకాలంలో మీకాంగ్ నది ఉప్పొంగడంతో– టోన్లే సాప్ నది దాని సహజ దిశలో ప్రవహించకుండా, వెనక్కి ప్రవహిస్తుంది. ఈ పండుగ సమయంలో, వర్షాకాలం ముగిసిపోవడంతో, ఆ వెనక్కి ప్రవహించే ప్రవాహం ఆగిపోయి, టోన్లే సాప్ నది తిరిగి తన సహజ దిశలో మీకాంగ్ వైపు ప్రవహించడం మొదలవుతుంది. టోన్లే సాప్ నది తిరిగి సహజదిశలో ప్రవహించడాన్ని స్థానికులు ఈ వేడుకతో పండుగ చేసుకుంటారు.ఈ పండుగలో ప్రధాన ఆకర్షణగా రాజభవనం ముందు టోన్లే సాప్ నదిపై సంప్రదాయబద్ధంగా పొడవైన పడవల రేసులు (డ్రాగన్ బోట్ రేసులు) నిలుస్తాయి. ఆ దేశ నలుమూలల నుంచి వందలాది పడవలు పోటీపడతాయి. మూడు రోజులు అందంగా అలంకరించిన, దీపాలతో వెలిగించిన పడవల ఊరేగింపు జరుగుతుంది. ఈ పోటీలే కాకుండా పలు క్రీడా పోటీలు జరుగుతాయి. ఈ సంబరాలు చూడటానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు తరలివస్తారు. చివరగా పౌర్ణమి రాత్రి చంద్రుడికి ప్రత్యేక వందనాలు తెలుపుతారు. అలాగే అక్ అంబోక్ అనే బియ్యం లేదా అటుకులతో చేసే తీపి వంటకాన్ని ప్రసాదంగా తీసుకుంటారు. ఈ ఉత్సవం కంబోడియన్ల ఐక్యతకు నిదర్శనం. హిందూ, బౌద్ధ విశ్వాసాలతో ముడిపడి ఉన్న ఈ సంప్రదాయంలో, చంద్రుడిని గౌరవించడం ఒక ఆచారం. (చదవండి: వజ్రనేత్రుడు..! ఏకంగా రెండు కేరట్ల వజ్రంతో..) -
వజ్రనేత్రుడు..! ఏకంగా రెండు క్యారెట్ల వజ్రంతో..
సంతోషంతో కళ్లు మెరిసేటప్పుడు కళ్లల్లో నక్షత్రాలు మెరిశాయనడం ఒక వాడుక. కళ్లల్లో నక్షత్రాల సంగతి సరే, అతడి కంటిలో మాత్రం ఏకంగా వజ్రమే మిలమిల మెరుస్తుండటం విశేషం. ఇతగాడి పేరు స్లేటర్ జోన్స్. అలబామా దేశస్థుడు. కొంతకాలం కిందట ప్రమాదవశాత్తు ఒక కన్ను పోగొట్టుకున్నాడు. ప్రమాదాల్లో కన్ను కోల్పోతే, సాధారణంగా కృత్రిమంగా గాజు కనుగుడ్డును అమర్చుకుంటారు. స్లేటర్ దొరగారు బాగా డబ్బున్న మారాజు, పైగా వజ్ర వైడూర్యాది ఆభరణాలతో వ్యాపారం చేసే నగల వర్తకుడు కావడంతో అందరిలాగా గాజు కనుగుడ్డును అమర్చుకుంటే తన ప్రత్యేకత ఏముంటుందని అనుకున్నాడో ఏమో! ఏకంగా రెండు క్యారెట్ల వజ్రంతో కృత్రిమ కనుగుడ్డును ప్రత్యేకంగా తయారు చేయించుకుని, పోయిన కనుగుడ్డు స్థానంలో అమర్చుకున్నాడు. ప్రపంచంలో బహుశా ఇదే అత్యంత ఖరీదైన కృత్రిమ కనుగుడ్డు కావచ్చని అంతర్జాతీయ వార్తాసంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఈ వజ్రనేత్రుడి వ్యవహారం ఇటీవల ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.(చదవండి: సేఫ్టి షర్ట్..!) -
దండుడి వృత్తాంతం
ఇక్ష్వాకుడికి వందమంది కొడుకులు. వారిలో అందరికంటే చిన్నవాడు చదువు సంధ్యలు లేక మూఢుడిగా మారాడు. పెద్దలను ఏమాత్రం లెక్కచేసేవాడు కాదు. అన్నలను ధిక్కరించేవాడు. ‘వీడి శరీరంపై దండం పడక తప్పదు’ అనుకునేవాడు ఇక్ష్వాకుడు. అల్పతేజస్కుడైన చిన్న కొడుకుకు దండుడు అని పేరుపెట్టాడు. సమస్త భూమండలాన్నీ పాలించిన ఇక్ష్వాకుడు తన కొడుకులందరికీ రాజ్యాలు ఇచ్చాడు. చిన్నకొడుకైన దండుడికి తగిన రాజ్యం కోసం అన్వేషించి, చివరకు వింధ్య, శైవల పర్వతాల మధ్యగల ప్రదేశాన్ని దండుడికి రాజ్యంగా ఇచ్చాడు.దండుడు ఆ పర్వత మధ్య ప్రాంతానికి వెళ్లి, అక్కడ నివాసయోగ్యమైన గొప్ప పట్టణాన్ని నిర్మించుకుని, దానికి మధుమంతమని పేరుపెట్టాడు. మధుమంతపురాన్ని రాజధానిగా చేసుకుని, దండుడు పరిపాలన సాగించేవాడు. దానవ గురువైన శుక్రాచార్యుడిని తన పురోహితుడిగా నియమించుకున్నాడు. దండుడు తన రాజ్యాన్ని వైభవోపేతంగా పాలించసాగాడు. బృహస్పతిని పురోహితుడిగా చేసుకున్న దేవేంద్రుడిలా; శుక్రాచార్యుడిని పురోహితుడిగా చేసుకున్న దండుడు తన రాజ్యాన్ని స్వర్గతుల్యంగా తీర్చిదిద్దాడు. తన శౌర్య పరాక్రమాలతో రాజ్యానికి శత్రుబాధ లేకుండా చేశాడు. దండుడి పరిపాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండేవారు.ఇలా సాగుతుండగా దండుడు చైత్రమాసంలో ఒక రోజున వనవిహారానికి వెళ్లాడు. వసంత శోభతో వనమంతా కళకళలాడుతూ ఉల్లాసభరితంగా ఉంది. పక్షుల కిలకిలరావాలు తప్ప అక్కడ మరెలాంటి రణగొణలు లేకపోవడంతో వాతావరణం ప్రశాంతంగా ఉంది. అదే వనంలో శుక్రాచార్యుడి ఆశ్రమం ఉంది. శుక్రాచార్యులను దర్శించుకుందామని దండుడు ఆయన ఆశ్రమం వైపు బయలుదేరాడు. శుక్రాచార్యుడి ఆశ్రమ వాటికలో ఒక ముగ్ధమనోహరి పూలు కోసుకుంటూ కనిపించింది. ఆమె శుక్రాచార్యుడి కుమార్తె. ఆ సమయంలో శుక్రాచార్యుడు ఆశ్రమంలో లేడు. సమిధల కోసం శిష్యులతో కలసి అడవిలోకి వెళ్లాడు.ఆశ్రమం ఆవరణలో ఒంటరిగా కనిపించిన శుక్రాచార్యుడి పుత్రికను చూసి, దండుడికి మతి చలించింది. ఆమెను చూసీ చూడటంతోనే మోహావేశం పొందాడు. వడివడిగా ఆమెను సమీపించాడు.‘సుందరీ! నువ్వెవరివి? నిన్ను చూసిన క్షణంలోనే నా మనసు వశం తప్పింది. నీ పొందుతోనే నాకు మోక్షం లభించగలదు. నన్ను కాదనకు’ అని పలికాడు.అతడి మాటలకు ఆమె విచలితురాలైంది.‘రాజా! నేను శుక్రాచార్యుల జ్యేష్ఠపుత్రికను. నా పేరు అరజ. నా తండ్రి నీ గురువు. నువ్వు ఆయన శిష్యుడివి. మహా తపశ్శాలి అయిన ఆయనకు ఆగ్రహం కలిగిస్తే, నీకు అనర్థం తప్పదు. నన్ను పరిణయం చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లయితే, ధర్మసమ్మతమైన మార్గంలో నా తండ్రిని అర్థించు. అందుకు భిన్నంగా ప్రవర్తిస్తే, నీకు ముప్పు తప్పదు’ అని హెచ్చరించింది. మోహావేశంలో యుక్తాయుక్త విచక్షణ కోల్పోయిన దండుడు ఆమె మాటలను పట్టించుకోలేదు. ‘సుందరీ! అనవసరంగా కాలాన్ని వృథా చేయకు. నువ్వు కాదంటే, నా ప్రాణం పోయేలా ఉంది. నిన్ను పొందిన తర్వాత నాకు మరణమే వచ్చినా, పాపమే చుట్టుకున్నా, మరే ఆపద వచ్చినా నేను చింతించను. ఇక జాగు చేయకు’ అంటూ ఆమెను తన బాహువులతో బంధించాడు. ఆమె విలపిస్తూ, వారించినా వినిపించుకోకుండా ఆమెను బలాత్కరించి, అక్కడి నుంచి తన రాజధానికి వెళ్లిపోయాడు.కొద్దిసేపటికి శుక్రాచార్యుడు ఆశ్రమానికి వచ్చాడు. దీనురాలిలా విలపిస్తున్న అరజను చూశాడు. జరిగిన ఘోరాన్ని తెలుసుకుని ఆగ్రహోదగ్రుడయ్యాడు. పక్కనే ఉన్న శిష్యులతో, ‘దండుడికి ఎలాంటి ఘోరమైన ఆపద రాబోతోందో వినండి. అగ్నిజ్వాలలాంటి నా కుమార్తెను స్పృశించిన దురాత్ముడు దండుడి పరివారానికి వినాశనం సమీపించింది. ఈ దుర్మార్గుడు తన పాపకర్మకు తప్పక తగిన ఫలితాన్ని అనుభవించగలడు. ఇతడి దేశానికి నూరుయోజనాల పరిధిలో ఇంద్రుడు ధూళి వర్షాన్ని కురిపించి, నాశనం చేయగలడు. ఏడురోజులు అహోరాత్రులు కురిసిన ధూళివర్షంలో దండుడి రాజ్యం పూర్తిగా నశిస్తుంది. మీరందరూ రాజ్యానికి సరిహద్దులు దాటి వెళ్లండి’ అని చెప్పాడు.తర్వాత అరజతో ‘నువ్వు ఈ ఆశ్రమంలోనే యోగాభ్యాసం చేస్తూ కాలం గడుపు. ఈ ఆశ్రమం, దీని ఎదుట యోజనం విశాలమైన సరోవరం, ఈ ఆశ్రమ పరిధిలో నీ చెంత ఉండే ప్రాణులకు ధూళివర్షం వల్ల ఎలాంటి ఆపదా రాదు. నువ్వు కాలం కోసం నిరీక్షించు’ అని పలికి, దండుడి రాజ్యాన్ని విడిచి శిష్యసమేతంగా శుక్రాచార్యుడు వెళ్లిపోయాడు.శుక్రాచార్యుడు దండుడి రాజ్యాన్ని విడిచి వెళ్లగానే, ధూళి వర్షం కురిసింది. ఏడురోజులు తెరిపి లేకుండా కురిసిన ధూళి వర్షంలో దండుడి రాజ్యం నామరూపాలు లేకుండా సర్వనాశనమైంది. దండుడు, అతడి పరివారం, భృత్యులు ప్రాణాలు కోల్పోయారు. కొంతకాలం గడిచాక దండుడు రాజ్యం ఏలిన ప్రాంతంలో దట్టమైన కీకారణ్యం ఏర్పడింది. మునులు అక్కడకు చేరుకుని, ఏకాంత ప్రదేశంలో తపస్సు చేసుకునేవారు. దండుడి రాజ్యంలో ఏర్పడిన అరణ్యం కనుక దీనికి దండకారణ్యం అనే పేరు వచ్చింది. మునిజనులు నివాసం ఏర్పరచుకోవడం వల్ల జనస్థానమనే పేరు కూడా వచ్చింది. వనవాస సమయంలో రాముడు కొన్నాళ్లు దండకారణ్యంలో గడిపాడు. ఆ కాలంలోనే అగస్త్య మహర్షి రాముడికి దండకారణ్యానికి సంబంధించిన ఈ వృత్తాంతాన్ని చెప్పాడు.∙సాంఖ్యాయననిన్ను పొందిన తర్వాత నాకు మరణమే వచ్చినా, పాపమే చుట్టుకున్నా, మరే ఆపద వచ్చినా నేను చింతించను. -
బారిష్ బాబా!
2016 జూన్ 15– హైదరాబాద్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇల్లు– కుటుంబ సభ్యులంతా ‘ప్రత్యేక’ పూజలో నిమగ్నమయ్యారు. పూజ పూర్తయితే ఇంట్లో కరెన్సీ వర్షం కురవాల్సి ఉంది. ఇంటి హాలులో వేసిన ముగ్గులో పెట్టిన రూ.1.33 కోట్లు ఏకంగా రూ.10 కోట్లుగా మారాల్సి ఉంది. పూజ చేయిస్తున్న బాబా కొద్దిసేపటికి ప్రసాదంగా పరమాన్నం పెట్టాడు. అది తిన్న కుటుంబ సభ్యులు స్పృహ కోల్పోయారు. కొన్ని గంటలకు లేచి చూసేసరికి, బాబాతో పాటు నగదు కూడా గల్లంతవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరవైనాలుగు గంటల్లోనే పోలీసులు బుడ్డప్పగారి శివ అనే బురిడీ బాబాను, అతడికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండుగంపల్లికి చెందిన శివ తండ్రి విద్యుత్ శాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఇంటర్ చదువును 1996లో మధ్యలోనే ఆపేసిన శివ తల్లిదండ్రులతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. బెంగళూరు వెళ్లిన ఇతగాడికి రవి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడి ద్వారా ఒక హోటల్లో ఉద్యోగంలో చేరాడు. తర్వాత అక్కడి తిప్పసముద్రంలో ఓ కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి, విద్యుత్, పారిశుద్ధ్య కార్మికులను పనికి పంపిస్తూ కమీషన్ తీసుకునేవాడు. కొన్నాళ్లకు ఆ పనీ మానేసి, అక్కడి ఓ ఆశ్రమంలో విద్యుత్ పనులు చేసే ఉద్యోగిగా చేరాడు. కొన్నాళ్లకు తిరుపతి సమీపంలోని కరువాయల్ ఆయుర్వేద ఆశ్రమంలో చేరాడు. అక్కడ షణ్ముగం అనే వ్యక్తి నుంచి కొంత ఆయుర్వేదం నేర్చుకున్నాడు. అప్పుడే ఇతడికి ఉమ్మెత్త గింజల గుజ్జుతో ఎదుటి వారిని మత్తులో దించవచ్చని తెలిసింది. అక్కడ నుంచి తిరిగి మళ్లీ తిప్పసముద్రంలోని ఆశ్రమానికే చేరాడు. శివకు అక్కడ అనంతాచార్యులు అనే ‘స్వామి’తో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారానే పూజలతో నగదు రెట్టింపు మోసం నేర్చుకున్నాడు. ఈ గురువుతోనే కలిసి హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో 2009లో తొలిసారిగా పంజా విసిరాడు. అక్కడ రూ.25 లక్షలు, బెంగళూరులోని కుమ్మలగూడలో రూ.40 లక్షలు స్వాహా చేశాడు. ఆపై శనేశ్వర్ బాబా అనే మరో దొంగ స్వామితో కలిసి కర్ణాటకలోని చామరాజనగర్‌లో రూ.10 లక్షలు దోచుకున్నాడు. ఈ మూడు ఉదంతాలతో అనుభవం పెంచుకున్న శివ తానే స్వయంగా ‘పూజలు’ చేయడం ప్రారంభించాడు. తాను ఎంచుకున్న ‘టార్గెట్’ దగ్గర పూజ చేయడానికి ముందే శివ నిర్ణీత మొత్తాన్ని తొడ భాగంలో కట్టుకుని, పంచె ధరించి కూర్చుంటాడు. లక్ష్మీ కటాక్షం కోసం కొంత మొత్తాన్ని పూజలో పెట్టాలని, పూజ పూర్తవగానే అది రెట్టింపు అవుతుందని చెప్తాడు. భక్తుల పెట్టిన మొత్తానికి తాను ‘తొడలో’ దాచిన నగదు చాకచక్యంగా కలిపేస్తాడు. రెట్టింపు మొత్తాన్ని పూజా ఫలితం అంటూ భక్తులకు ఇచ్చేస్తాడు. ఇది చూసిన వారికి బురిడీ బాబాపై పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. అక్కడితో బురిడీ బాబా అసలు కథ« ప్రారంభించి అందినకాడికి దోచుకుంటాడు. కొందరు భక్తులకు తాను చెప్పిన మొత్తం పూజలో పెడితే దానికి పది రెట్లు వర్షం రూపంలో (బారిష్) కురుస్తుందని నమ్మిస్తుంటాడు. భక్తులు ‘ముగ్గులోకి’ దిగాక ‘పెద్ద పూజ’కు రంగం సిద్ధం చేస్తాడు. ఉమ్మెత్త గింజల గుజ్జును తనతో గుట్టుగా తీసుకువస్తాడు. అత్యాశకుపోయే భక్తులు ఈసారి గతంలో పెట్టిన మొత్తానికి ఎన్నో రెట్లు సమీకరించుకుని పూజకు సిద్ధమవుతారు. పూజ చేసేప్పుడు ఇతరులెవ్వరూ ఉండకూడదంటూ కుటుంబీకుల్ని మాత్రమే ఇంట్లో ఉంచుతాడు. తంతు పూర్తయ్యే తరుణంలో ప్రసాదమంటూ పరమాన్నం సిద్ధం చేసే ఈ బురిడీ బాబా అందులో ఉమ్మెత్త గింజల గుజ్జు కలిపేస్తాడు. అది తిన్న వారంతా మత్తులోకి జారుకున్నాక పూజలో ఉంచిన సొత్తు, సొమ్ముతో ఉడాయిస్తాడు. ఈ దొంగ బాబా శివ 2012లో కూకట్‌పల్లిలో ‘పూజ’ చేసి పోలీసులకు చిక్కాడు. ఆపై బెంగళూరుకు మకాం మార్చి 2014 జూన్ 6న తిరుపతి అర్బన్ జిల్లా అలిపిరి ఆటోనగర్‌లో ఉండే రియల్టర్ ఆర్కే యాదవ్ కుటుంబంపై ‘మత్తు మందు’ జల్లాడు. పూజలో ఉంచిన రూ.63.43 లక్షలు తీసుకునే లోపే యాదవ్ సంబంధీకులు దామోదర్ రావడంతో ఉడాయించాడు. మత్తులో ఉన్న కుటుంబాన్ని చూసిన దామోదర్ ఆ మొత్తం తస్కరించి దొంగ బాబా దొరకడనే ఉద్దేశంతో నేరాన్ని అతడి మీదికి నెట్టాడు. అలిపిరి నుంచి నెల్లూరు చేరుకున్న బురిడీ బాబా అక్కడి ఆనంద్‌రెడ్డి ఇంట్లో ‘పూజ చేసి’ రూ.40 లక్షలు ఎత్తుకుపోయాడు. యాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన అలిపిరి పోలీసులు శివ హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. అమీర్‌పేటలోని ఓ లాడ్జిని అడ్డాగా చేసుకుని నల్లగొండకు చెందిన మరో బడా బాబును మోసం చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుసుకున్నారు. ఆ లాడ్జిపై మెరుపుదాడి చేసిన పోలీసులు శివను పట్టుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో దామోదర్‌ను అరెస్టు చేసి ఇరువురి నుంచి మొత్తం రూ.1.30 కోట్ల నగదు, సొత్తు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ రియల్టర్‌కు కొంపల్లి వాసితో పరిచయం ఉంది. శివ ఇతడి ద్వారానే హైదరాబాద్ రియల్టర్‌కు పరిచయమయ్యాడు. బెంగళూరు శివార్లలో స్థిరపడిన శివను 2015లో ఆ స్నేహితులు ఇద్దరూ వెళ్లి కలిశారు. పక్కా పథకంతో అక్కడి గోల్ఫ్ కోర్ట్‌లో ‘ప్రత్యేక’ పూజ’ చేసిన శివ వీళ్లు తెచ్చిన రూ.లక్షను రూ.2 లక్షలు చేసిచ్చాడు. దీని కోసం దక్షిణ తప్ప అదనంగా ఏమీ తీసుకోకపోవడంతో హైదరాబాద్ రియల్టర్‌కు పూర్తి నమ్మకం ఏర్పడింది. 2016లో మళ్లీ ఈయన్ను సంప్రదించిన శివ తన వద్ద 1616 నాటి రైస్‌పుల్లర్‌గా పిలిచే ఇరీడియం కాయిన్ ఉన్నట్లు చెప్పాడు. దీన్ని అంతర్జాతీయ మార్కెట్లో రూ.వందల కోట్లకు అమ్మవచ్చని, జర్మనీలో పార్టీని వెతుకుదామని చెప్పాడు. ఈ కాయిన్‌తో పాటు డబ్బును రెట్టింపు చేయడానికి మీ ఇంట్లో పూజ చేద్దామంటూ మరో ఇద్దరితో కలిసి హైదరాబాద్ చేరాడు. 2016 జూన్ 15 హైదరాబాద్ రియల్టర్ ఇంట్లో ముగ్గు వేసి పూజ ప్రారంభించిన శివ ఆ ముగ్గులో హ్యారీపోటర్ పుస్తకాన్నీ ఉంచడం గమనార్హం. అదేమంటే మహిమలకు అతడు ప్రతీకంటూ నమ్మించాడు. బురిడీ బాబా శివ 2009–16 మధ్య పదిమంది నుంచి రూ.4.25 కోట్ల మేర స్వాహా చేశాడు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, కేపీహెచ్‌బీ, మైలార్‌దేవ్‌పల్లి; చిత్తూరు జిల్లా అలిపిరి, బెంగళూరులోని కుంబులుగుడ్డు, కడప జిల్లా రాజంపేట, నెల్లూరుల్లో అరెస్టు అయ్యాడు. రైస్‌పుల్లింగ్ కాయిన్ పేరుతో బెంగళూరు గోల్ఫ్ కోర్ట్‌లో ఇద్దరి నుంచి రూ.52 లక్షలు, చెన్నైలోని ఓ త్రీ స్టార్ హోటల్ యజమాని నుంచి రూ.35 లక్షలు కాజేసిన ఉదంతాల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. 2016 తర్వాత ఇతడి పేరు మళ్లీ రికార్డుల్లోకి ఎక్కలేదు. -
ఈ వారం కథ: లక్కీ యాప్
టేబుల్ మీద ఉన్న ఫోన్ రింగ్‌టోన్ మోగుతోంది.‘‘లక్ అన్న మాటే నిల్లో నిల్లు, లైఫ్ ఏమో చాల డల్లో డల్లు’’ అని పాట వినిపిస్తోంది.ఫోన్ చేసింది ఎవరో అనే ఆలోచన లేకుండా, అదే పాటను హమ్ చేస్తూ...‘‘నేనో జీరోని, వ్యాల్యూ లేనోన్ని’’ అంటూ ఫోన్ ఎత్తాడు రఘువరన్ .వెంటనే, ఆ పక్కనుంచి ‘‘ఒరేయ్! రాసిన లాస్ట్ అటెంప్ట్ ఎగ్జామ్ కూడా ఫెయిల్ అయ్యింది రా!’’ అని బాధతో చెప్పాడు ఫ్రెండ్. రఘువరన్ మాత్రం షాక్ కాకుండా, చిరునవ్వు చిందిస్తూ, హీరో రజనీకాంత్‌లా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని, ‘‘చూడు ఇదంతా మామూలే, నువ్వు బాధపడకు’’ అన్నాడు.‘‘ఒరేయ్! ఫెయిల్ అయ్యింది నువ్వురా!’’ అన్న వెంటనే, రఘువరన్, ‘‘తెలుసు! నన్ను అదృష్ట దేవత డైరెక్ట్‌గా వచ్చి వరాలు ఇచ్చినా, నా బెస్ట్ ఫ్రెండ్ వాటిని సక్సెస్‌ఫుల్‌గా ఫెయిల్ చేయగలడు’’ అన్నాడు. ‘‘ఎవర్రా వాడు? చెప్పు వాడ్ని చంపేద్దాం..’’‘‘రేయ్, వాడ్ని ఏం అనకు. నేను పుట్టినప్పటి నుంచి నన్ను ఒక్క క్షణం కూడా వీడని ఫ్రెండ్రా వాడు. నా వన్ అండ్ ఓన్లీ బెస్ట్, బ్లడ్ ఫ్రెండ్ నా బ్యాడ్ లక్! బై!’’ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. తర్వాత మళ్లీ అదే పాట పెట్టుకొని ‘‘నా బాధే నాకు భంగు, నే చెత్త కుప్ప కింగు, నా ఫేట్ నల్లరంగు, నే కొమ్మల్లో పతంగు!’’ అని పాడుతూ, డ్యాన్ ్స చేస్తూ స్నానం పూర్తి చేసి, ఇంటర్వ్యూకి బయలుదేరాడు. ఇలా దాదాపు దశాబ్దంపాటు, రఘువరన్ రోజూ ఉదయం రెడీ అవ్వడం, మధ్యాహ్నం ఇంటర్వ్యూ అటెండ్ కావడం, సాయంత్రం స్నేహితుల గొప్పలు వింటూ ఇంటికొచ్చి భోజనం చేయడం, రాత్రి కొత్త ఉద్యోగానికి అప్లయ్ చేసి నిద్రపోవడం అంతే! ఇదే రఘువరన్ జీవితం.ఇలా ఒక తుప్పు పట్టిన చక్రంలా, రోజులన్నీ ఒకేలా గడుస్తున్న సమయంలో ఒక రాత్రి ల్యాప్‌టాప్ మూసి పడుకోబోతుంటే, తెర మీద వింత అక్షరాలు మెరిశాయి. ‘‘బ్యాడ్ లక్కి బై చెప్పి, లక్కి హాయ్ చెప్పాలనుందా?అయితే వెంటనే ఈ ఆర్టిఫిషియల్ లక్ యాప్‌ను ఇన్ స్టాల్ చేసుకోండి.ఇది నంబర్ వన్ లక్ గ్యారంటీ యాప్!’’రఘువరన్ రెండు క్షణాలు స్క్రీన్ చూస్తూ ఆగిపోయాడు.‘‘ఇలాంటి యాప్స్ కూడా ఉంటాయా? ఉన్నా పనిచేస్తాయా?’’ అని అనుకుంటూ ఇన్ స్టాల్ బటన్ నొక్కాడు. యాప్ ఓపెన్ చేయగానే, కంప్యూటరైజ్డ్ వాయిస్, ‘‘వెల్కమ్! ప్లీజ్ సెలెక్ట్ యువర్ ప్యాకేజ్. డైలీ ఫ్రీ లక్. ప్రీమియం లక్. జాక్‌పాట్ లక్.’’ ‘‘అబ్బో! ఇప్పడు అదృష్టం కూడా డేటా ప్లాన్ ్స ఇస్తుందా?’’ అనుకుంటూ... ఫ్రీ లక్ సెలెక్ట్ చేసుకున్నాడు. అప్పుడే యాప్ నుంచి ఫన్నీ నోటిఫికేషన్ :‘‘ఈ రోజు ఇంటర్వ్యూలో మిస్టర్ రఘువరన్ కడియాలా, యూ ఆర్ సెలెక్టెడ్!’’ ఆ మెసేజ్ చూసి నవ్వుకుంటూ బెడ్ మీద పడ్డాడు. ‘‘ఏమో, ఏడేళ్ల తర్వాత ‘బేవార్స్, ఇడియట్’ అన్నవాళ్లు, నిజంగానే ‘మిస్టర్ రఘువరన్ ’ అంటారేమో!’’ అని అనుకుంటూ కళ్ళు మూశాడు. మరుసటి ఉదయం టింగ్..! ఫోన్ నోటిఫికేషన్: ‘‘యువర్ డైలీ ఫ్రీ లక్ యాక్టివేటెడ్!’’తన బ్యాడ్ లక్ గురించి బాగా తెలిసిన రఘువరన్ ఏమాత్రం ఎగై్జట్ కాలేదు. మూమూలుగానే ఇంటర్వ్యూకి రెడీ అయ్యి బైక్‌లో బయలుదేరాడు. ఆరోజు ఎందుకో, అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ గ్రీన్ . జేబులోని పెన్ ఇంక్ లీక్ కాలేదు. షూస్‌కి దుమ్ము అంటలేదు. లిఫ్ట్ కరెక్ట్‌గా వర్క్ అయ్యింది. వేడి కాఫీ కిందపడకుండా తాగాడు. ఇంటర్వ్యూలో కూడా అచ్చం యాప్ చెప్పిన ట్టు. ‘‘మిస్టర్ రఘువరన్ కడియాలా, యూ ఆర్ సెలెక్టెడ్!’’ అన్నారు. జాబ్ ప్యాకేజీ కూడా బాగానే ఉంది. ఆ తర్వాత కూడా ఆడగకుండానే షాపింగ్ చేసిన తర్వాత ఆఫర్ అంటూ డిస్కౌంటు ఇచ్చారు. బైక్‌కి టైర్ పంచర్, పెట్రోల్ అయిపోవటం లాంటి ఇబ్బందులు లేకుండా ఇంటికి వెళ్లాడు. అపార్ట్మెంట్లో కూడా పార్కింగ్ ఈజీగా దొరికింది. ఆ రోజు అంతా బాగా గడిచిపోయింది. అంతా యాప్ చెప్పినట్టు రోజంతా అదృష్టంతో నిండిపోయింది. దీంతో, అప్పటి దాకా, రింగ్ టోన్ మోగితే కానీ, చూడని ఫోన్ ముఖాన్ని కళ్లార్పకుండా చూశాడు. కుతూహలంతో ఆ యాప్ తెరిచాడు. ఇదంతా నిజమేనా? అని సందేహంతోనే నిద్రపోయాడు. మళ్లీ ఉదయాన్నే ఫోన్ నోటిఫికేషన్ . ‘‘యువర్ ఫ్రీ లక్ ఈజ్ ఓవర్! అప్డేట్ కోసం రూ. 99 ప్రీమియం ప్యాకేజీని సెలెక్ట్ చేసుకోండి.’’ఇదంతా నమ్మాలా వద్దా అన్న అయోమయంలోనే రఘువరన్ ప్రీమియం ప్యాకేజీని సెలెక్ట్ చేసుకున్నాడు.ఆ రోజూ కూడా రఘువరన్ కి అదృష్టమే కలిసివచ్చింది. బస్సులో ఎక్కినప్పుడల్లా కిటికీ సీటు ఖాళీగా ఉంటుంది. బిస్కెట్‌ను టీలో ముంచినప్పుడు కూడా జారిపోకుండా తింటున్నాడు.బార్ బిల్లు ఎప్పుడూ ఫ్రెండ్గాడికే పడుతోంది. దొంగిలించిన వాలెట్‌ని దొంగే తిరిగి తెచ్చి ఇస్తున్నాడు.అడుగు బయట పెట్టగానే ఘోరంగా కురుస్తున్న వాన ఒక్కసారిగా సైలెంట్‌గా మారుతోంది. ఆఫీసులో బాస్ అడక్కుండానే పొగుడుతున్నాడు. ఆఫీస్ బాయ్ కూడా అడక్కుండానే వాటర్, టీ కాఫీలు తెచ్చి టేబుల్ పై పెడుతున్నాడు. మొబైల్ బ్యాటరీ వన్ పర్సెంట్ ఉన్నా, మూడు రోజులు వరకు ఆన్గానే ఉంటుంది. ఫేవరెట్ వైట్ షర్ట్‌ని వాషింగ్ మెషీన్లో వేసినా, అది ఏ కలర్ అంటకుండా, చాలా చక్కగా మారి, మృదువుగా, సువాసనతో బయటకు వస్తుంది. అనుకోకుండా, చేయి ఎత్తితే, అటుగా వెళ్తున్న వక్తి, లిఫ్ట్ అనుకొని, నేరుగా స్కూటీ మీద ఎక్కించుకొని ఇంటి వద్ద దింపాడు. ఇంతేకాదు, ఏటీఎమ్‌లో ఐదు వందల రూపాయలు విత్‌డ్రా చేసుకోగా, మెషిన్ ఐదు వంద నోట్లకు బదులు యాభై నోట్లను ఇచ్చేసింది. ఆన్లైన్లో బ్యాటరీ ఆర్డర్ పెడితే, డెలివరీలో స్మార్ట్ వాచ్, బ్లూటూత్ స్పీకర్ వచ్చాయి. ఇలా అప్పటి వరకు హారర్ సినిమాలా సాగిన రఘువరన్ జీవితం, ఒక్కసారిగా, సూపర్ హిట్ కామెడీ సినిమాలా సాగిపోతోంది. సరిగ్గా, ఒక నెల తర్వాత మళ్లీ ఫోన్ నోటిఫికేషన్ ‘‘యువర్ ప్రీమియం లక్ ఈజ్ ఓవర్! అప్డేట్ కోసం రూ. 999 జాక్‌పాట్ లక్ ప్యాకేజీని సెలెక్ట్ చేసుకోండి.’’ ఈసారి ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే పేమెంట్ చేశాడు.వెంటనే నోటిఫికేషన్ , ‘‘బొంబాయి లాటరీ నంబర్ 5834.’’ ఆ నంబర్ చూసిన వెంటనే రఘువరన్ పరుగెత్తుకుంటూ వెళ్లి లాటరీ కొన్నాడు. నంబర్ కూడా అదే 5834. ఇక అప్పటి నుంచి రఘువరన్ కి నిద్ర పట్టడం లేదు. ప్రతిరోజూ అదృష్టం ఇచ్చే ఆనందాలను ఎంజాయ్ చేయలేకపోతున్నాడు.క్యూలో నిల్చున్నా, వెయిట్ చేసే పని లేకుండా గణేశ్ అన్నదానంలో భోజనం దొరికినా ఆస్వాదించలేకపోయాడు.ఆఫీసులో అందమైన అమ్మాయి నవ్వుతూ పొగుడుతున్నా తిరిగి నవ్వలేకపోయాడు.చికెన్ బిరియానీ ఆర్డర్ చేస్తే, అందులో లెగ్‌పీస్ వచ్చినా ఎంజాయ్ చేయలేకపోయాడు. బుక్ చేసిన క్యాబ్ డ్రైవర్ అడ్రస్ని పది సార్లు అడగకుండానే వేగంగా డెస్టినేషన్ కు తీసుకెళ్తున్నా సంతోషం లేదు. తన పాత క్రష్ సడెన్ గా ‘నిన్ను కలవాలని ఉంది’ అని మెసేజ్ పంపినా, అతను ‘ఊమ్’ అని రిప్లయ్ ఇస్తున్నాడు. అమెజాన్ లో బ్యాటరీ ఆర్డర్ చేశాడు, డెలివరీలో డ్రోన్ , స్మార్ట్‌వాచ్, బ్లూటూత్ స్పీకర్ వచ్చాయి! ‘సారీ సర్, సిస్టమ్ గ్లిచ్’ అని కంపెనీ వాళ్లు చెప్పి, మీరు ఆ వస్తువులను కావాలనుకుంటే మీ వద్ద పెట్టుకోవచ్చు అని చెప్పి, ప్రతి సారి గ్లిచ్ కేవలం రఘుకే వస్తున్నాయి. అలా ప్రతిరోజూ అదృష్టం తన తలుపు తట్టి మరీ ఇచ్చే ఆనందాలు అన్నీ క్రమంగా తనకు బోరింగ్‌గా మారిపోయింది. షాపింగ్‌కి వెళ్లినా రఘు ఏ షర్ట్ పట్టుకున్నా దానిపైనే ‘టుడే ఫ్రీ ఆఫర్!’ బోర్డు వొచ్చేస్తుంది! చాలా డిస్కౌంట్ ఆఫర్‌తో షాపింగ్ చేసినా, తరువాత కాసేపటికే బ్యాంక్ నుంచి మెసేజ్ ‘మీ కొనుగోలుపై క్యాష్‌బ్యాక్ రూ. 4999.’ వచ్చినా కూడా తనకు ఆనందం లేదు. ఎప్పుడూ లాటరీ విన్నర్ అనౌన్ ్సమెంట్ కోసమే ఎదురుచూస్తూ, అదృష్టంపై చిన్న చూపు మొదలయింది. సరిగ్గా, నలభై ఐదు రోజుల తర్వాత ఆ రోజు వచ్చింది.విన్నింగ్ నంబర్‌ను అనౌన్ ్స చేశారు. యాప్ చెప్పినట్టుగానే విన్నింగ్ లాటరీ నంబర్ 5834.ఇక రఘువరన్ ఆనందానికి అవధులు లేవు.లాటరీ ప్రైజ్ వంద కోట్లు.‘‘ఇక నా కష్టాలన్నీ పోయాయి!’’ అని ఆ రోజంతా ఫుల్ పార్టీ చేసుకొని పడుకున్నాడు.ఉదయం లేవగానే ఫోన్ నోటిఫికేషన్ , ‘‘యువర్ జాక్‌పాట్ లక్ ఈజ్ ఓవర్! అప్డేట్ కోసం రూ. 9999 జాక్‌పాట్ లక్ అప్డేషన్ ప్యాకేజీని సెలెక్ట్ చేసుకోండి.’’‘‘వంద కోట్లు ఉంటే నాకు ఇంకా లక్‌తో పని ఏముంది’’ అనుకొని యాప్‌ను అన్ఇన్ స్టాల్ చేసి బొంబాయి లాటరీ ఆఫీసుకు వెళ్లాడు. చాలా కాన్ఫిడెంట్‌గా లాటరీ టికెట్ ఇచ్చి. ‘‘ఐ వాంట్ ఓన్లీ క్యాష్’’ అన్నాడు.కౌంటర్లోని వ్యక్తి టికెట్ తీసుకొని, ‘‘సారీ సార్, ఈ లాటరీ టికెట్ ఎక్స్పైర్ అయింది’’ అన్నాడు.వెంటనే షాక్‌తో టికెట్ తీసుకొని చెక్ చేసుకున్నాడు. నిజంగానే అది లాస్ట్ ఇయర్ టికెట్.‘‘మరి నాకు డబ్బులు రావా!’’ అని బాధతో అడిగాడు.‘‘సారీ సార్!’’ అంటూ టికెట్ తిరిగి అతని చేతిలో పెట్టారు.వెంటనే రింగ్‌టోన్ మోగింది. ‘‘లక్ అన్న మాటే నిల్లో నిల్లు, లైఫ్ ఏమో చాల డల్లో డల్లో’’. ఈసారి చాలా సైలెంట్‌గా ఫోన్ ఎత్తాడు.‘‘రఘువరన్ , డ్యూ టు యువర్ లోయర్ పర్ఫార్మెన్ ్స అండ్ నో కమిట్మెంట్ ఫర్ ఆఫీస్ వర్క్, లాట్ ఆఫ్ లీవ్స్, యూ ఆర్ టెర్మినేటెడ్’’ అని చెప్పి ఫోన్ కట్ చేశారు.రఘువరన్ కి ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాలేదు.‘‘ఇదంతా నేను కేవలం పదివేల రూపాయలకు కక్కుర్తి పడి కోల్పోయానా!’’ అని అనుకుంటూ అయోమయంలో పడ్డాడు.యాప్ అప్డేట్ చేసుకోకపోవడమే కారణం అనుకొని వెంటనే యాప్‌ను మళ్లీ ఇన్ స్టాల్ చేయడానికి ప్రయత్నించాడు. ఎంత వెతికినా ఆ యాప్ దొరకలేదు. ఇక చేసేదేమీ లేక లాటరీ ఆఫీసు నుంచి బయటకు వచ్చాడు.కాలు బయట పెట్టగానే చెప్పు తెగిపోయింది. చాలా కష్టంగా రోడ్డు దాటుకొని నిల్చుంటే వెంటనే ఓ కారు అటుగా పోయి బకెట్ బురదను అతని బట్టలపై చల్లి వెళ్లింది. పైపై తుడుచుకొని బస్‌స్టాండ్‌కు పరుగెత్తుకుంటూ వెళ్తే, అప్పటిదాకా ఆగి ఉన్న బస్సు రఘువరన్ రాగానే చాలా అర్జెంట్ పని ఉన్నట్లు వేగంగా బయలుదేరింది. దీంతో, ‘ఓరి దేవుడా! ’ అని కాస్త పైకి తలెత్తి చూస్తే, ఎదురుగ్గా, ఒక బోర్డింగ్.. ‘ఐ యామ్ బ్యాక్!’. అది చూడగానే, అప్పటిదాకా దిగాలుగా ఉన్న రఘువరన్ ముఖం ఒక్కసారిగా చిరునవ్వు చిందించింది. ‘‘ఇన్ని రోజులు బ్యాడ్‌లక్ నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా, కాదు.. కాదు.. బ్యాడ్‌లక్కే నేను బెస్ట్ ఫ్రెండ్‌ని!’’ అని అనుకొని స్టయిల్‌గా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ‘‘లక్ అన్న మాటే నిల్లో నిల్లు, లైఫ్ ఏమో చాల డల్లో డల్లో’’ అని పాడుకుంటూ చెప్పులు చేతిలో పట్టుకొని నడుచుకుంటూ ఇంటికి బయలుదేరాడు. ∙కొండి దీపిక -
కథాకళి: తల్లి ప్రేమ
డాక్టర్ రాగానే ఆ తల్లి కళ్ళల్లో నీళ్ళు చూశాడు.‘‘డాక్టర్‌గారు. నెలల పిల్ల. ఒళ్ళు కాలిపోతోంది.’’ ఆ తల్లి దుఃఖంగా చెప్పింది.ఆయన ఆ పిల్ల టెంపరేచర్ చూశాడు.‘‘నూట రెండు! తగ్గకపోగా పెరిగింది. నాకు చేతనైన చికిత్స చేస్తున్నాను. ఆపైన దైవం మీదే భారం. నుదుటి మీద ఉడుకులాం పట్టీని తడిపి వేయడం మానకండి. టెంపరేచర్ ఇంకో గంటలో తగ్గితే సరే, లేదా ప్రమాదం.’’ ఆయన హెచ్చరించాడు.దేవుడిని నమ్మేవారు అసాధ్యాలు సాధ్యాలు అవచ్చని నమ్ముతారు. ఆయన వెళ్ళాక ఆమె పూజగదిలోకి వెళ్ళి, ఏడు తరాల నుంచి తమ కులదైవమైన హూళిగాదేవి విగ్రహం ముందు మోకాళ్ళ మీద కూర్చుని, మనసులో ఆ దేవి రూపాన్ని నింపుకుని, తను అంతదాకా ఏదీ కోరలేదని, తన కూతుర్ని కాపాడే కోరికని తీర్చమని ప్రార్థించసాగింది.‘‘దైవం కొన్ని కోరికలని ఎందుకు తీర్చడంటే అవి చేటు చేస్తాయని.’’ మృదుమధుర కంఠం వినబడి ఆమె కళ్ళు తెరచి చూసింది.ఎదురుగా చిరునవ్వుతో కనపడ్డ దేవిని చూసి ఆ తల్లి కోరింది.‘‘నా కూతుర్ని బతికించు మాతా.’’ఆ పాపకి అమ్మవారి నామాలలో ఒకటైన క్రియేశ్వరి పేరుని ఆ దంపతులు పెట్టుకున్నారు.మూడో ఏడు వచ్చేసరికి క్రియేశ్వరికి అన్ని వస్తువులని విసరడం అలవాటైంది. కనిపించిన వస్తువుని తీసుకుని విసిరి కొడుతుంది.‘‘తప్పు. అది ఎవరికైనా తగలొచ్చు.’’ తల్లి మందలిస్తుంది.ఆరో ఏట క్రియేశ్వరి విసిరిన పుస్తకం అంచు భాగం తండ్రి కంట్లో గుచ్చుకోవడంతో రక్తం కారసాగింది. తక్షణం హాస్పిటల్‌కి తీసుకెళ్ళారు. ఆయన కుడి కంటి చూపు శాశ్వతంగా పోయింది. ‘‘మంచిది. పోయింది నా కన్నేగా. ఇదే పరాయి వాళ్ళ కన్నైతే ఎంతో తగువులాట జరిగేది.’’ తండ్రి చెప్పాడు.క్రియేశ్వరి వస్తువులని విసరడం ఏడో ఏడు దాకా ఆపలేదు.క్రియేశ్వరి ఎనిమిదో ఏట స్కూల్ హెడ్ మాస్టర్ ఆమె తల్లిదండ్రులని పిలిచి టీసీ ఇచ్చి చెప్పాడు.‘‘మీ అమ్మాయి ప్రవర్తన, చదువు ఏ మాత్రం బాలేవు. మీ అమ్మాయిని సరైన దారిలో పెట్టమని నాలుగైదుసార్లు హెచ్చరించినా మీరు పట్టించుకోలేదు. తోటిపిల్లల పుస్తకాలు ఎత్తుకెళ్ళి మిఠాయి షాపుల్లో ఇచ్చి మిఠాయి కొనుక్కుంటోంది. అందరితోనూ పోట్లాటే.’’క్రియేశ్వరికి పన్నెండో ఏడు వచ్చేసరికి మూడు స్కూల్స్ మారింది. తమ కూతురిలోని చెడ్డ లక్షణాలకి ఆ దంపతులకి రంపపు కోతగా ఉంది. క్రియేశ్వరి బంధువులు, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు తమ ఇంటికి క్రియేశ్వరితో రావద్దని నిష్కర్షగా చెప్పారు.పధ్నాలుగో ఏట వాళ్ళకి క్రియేశ్వరి పెద్ద కష్టాన్ని తెచ్చింది. ఆమె డబ్బు కోసం మగాళ్ళతో గడుపుతోందని ఆమె తల్లిదండ్రులకి తెలిసింది. కుటుంబ గౌరవం మంట కలుపుతోందని మొదటిసారి తండ్రి కూతుర్ని కొట్టాడు. ఆమె ఎదురు తిరిగి తండ్రి కళ్ళజోడుని విరగ్గొట్టి చొక్కాని చింపేసి, ఆయన్ని గదిలో బంధించి తలుపు గడియ పెట్టింది. గంట తర్వాత ఓ వీధి రౌడీ వచ్చి క్రియేశ్వరి తండ్రిని చితకబాదాడు.‘‘ఖబడ్దార్ గుడ్డి నాయాల. క్రియ నాది. దాన్నేమైనా అంటే నిన్ను చంపేస్తాను.’’ బెదిరించాడు.‘‘నేనంటే వాడికి ఎంత ప్రేమో చూశారా?’’ క్రియేశ్వరి నవ్వుతూ చెప్పింది.మరో ఆరు నెలల తర్వాత మరో కష్టం వారికి వచ్చింది. క్రియేశ్వరి గర్భవతైంది. ఆమె బిడ్డని కంటానని పట్టుపట్టింది. బలవంతంగా అబార్షన్ చేయించారు.క్రియేశ్వరికి పదిహేడో ఏట ఆల్కహాల్ అలవాటైంది. పంతొమ్మిదో ఏట కాల్ సెంటర్లో చేరింది. అయితే, ఆమెని మూడు వారాల తర్వాత ఉద్యోగంలోంచి తీసేశారు. తల్లితండ్రులు ఆమెకి పెళ్ళి చేయకూడదని నిర్ణయించుకున్నారు. తన ఇరవై మూడో ఏట క్రియేశ్వరి ఓ ఏభైరెండేళ్ళ ఆయనతో వచ్చి చెప్పింది.‘‘ఈయన నన్ను ప్రేమిస్తున్నాడు. పెళ్ళి చేసుకుంటాడు. మా పెళ్ళి ఘనంగా చేయండి.’’ఆ పెళ్ళి మానుకోమని బతిమాలారు. క్రియేశ్వరి ఎప్పటిలా పట్టినపట్టు విడవలేదు. ఆమె తండ్రి పీఎఫ్ మొత్తం విత్‌డ్రా చేసి కూతురి పెళ్ళి జరిపించాడు. వృద్ధాప్యంలో వాళ్ళని ఆదుకునే ప్రధాన వనరు అలా మాయమైంది. ఆమె తన ఇరవై ఎనిమిదో ఏట తండ్రి మీద దావా వేసి గెలిచి, ఇంట్లోని తన భాగాన్ని కావాలని పరాయి మతస్తులకి అమ్మింది. ఆ పొరుగుని భరించలేక వాళ్ళు అద్దె ఇంటికి మారారు. తన తండ్రి తన భాగాన్ని అమ్మాడని రెండేళ్ళ తర్వాత తెలిసి వచ్చి ఆ డబ్బు ఇవ్వమని గొడవ చేసింది. ఆయన నిరాకరిస్తే జరిగిన ఘర్షణలో క్రియేశ్వరి కొట్టిన దెబ్బలకి ఆయన మరణించాడు.‘‘ఇల్లమ్మి ఆ డబ్బు నాకు ఇవ్వనందుకు.’’ అరిచింది.ఎర్రబడ్డ కూతురి మొహంలోని రోషాన్ని, కోపాన్ని, ద్వేషాన్ని చూసి ఆ తల్లి భయంతో వణికిపోయింది. ఆవిడ చూస్తూండగానే క్రియేశ్వరి మొహంలో క్రమంగా వయసు తగ్గసాగింది. ఇరవై మూడు నించి పదిహేనుకి, పదికి, ఐదుకి, ఏడాదికి, చివరకి మూడు నెలల పసిపాప మొహం కనిపించింది. ఆమె కళ్ళు తెరచి చూస్తే ఉయ్యాలలోని, ఇంకా పేరు పెట్టని తన కూతురు కనిపించింది. తను కలగనలేదని, అమ్మవారు భవిష్యత్తును చూపించిందని గ్రహించింది. మళ్ళీ అశరీరవాణి వినిపించింది.‘‘నీ ప్రార్థనని నువ్వు మన్నిస్తావో లేదో నీ చేతుల్లో ఉంది. పాపని నువ్వు మరో మూడు నిమిషాల్లో ఎత్తుకుంటే బతుకుతుంది. లేదా మరణిస్తుంది.’’అత్యంత అమాయక మొహం గల ఆ పాప కళ్ళు తెరిచి నీరసంగా తల్లి వంక చూస్తూంటే ఆ పాప నోట్లోంచి బలహీనమైన శబ్దాలు వినిపించాయి. రెండు నిమిషాలు తటపటాయించాక ఆమె లేచి పక్కగదిలోకి వెళ్ళింది. అంతలోనే పరిగెత్తుకు వచ్చి ఉయ్యాలలోంచి కూతుర్ని తీసుకుని గుండెలకి హత్తుకుంది. క్రమంగా నూట రెండు నించి టెంపరేచర్ నూట ఒకటికి, వందకి, తొంభై తొమ్మిదికి, చివరకి నార్మల్‌కి దిగింది.తల్లి తన బిడ్డల మీద ప్రేమని ఎన్నటికీ కోల్పోదు. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి -
స్క్రోలాటం చిట్టి రీల్స్.. గట్టి ఆదాయం
నవ్వించు, ప్రేరేపించు, షేర్ చేయించు ఇవన్నీ రెండు నిమిషాల్లోనే! ఇక్కడ సమయం తక్కువ, ఐడియాలు ఎక్కువ. కాని, పవర్ మాత్రం మ్యాక్స్! టైమింగ్‌లో రీల్స్ కంటే ఎక్కువ, షార్ట్ ఫిల్మ్ కంటే తక్కువ. కానీ, ఫుల్ ఎంటర్టైన్ మెంట్, ఫుల్ ఇంపాక్ట్, ఫుల్ మనీ! అవే, ఈ టూ మినిట్స్ వీడియోల చిన్న సినిమాలు! అందుకే, ఇవి రీల్స్‌నే కాదు, రియల్ లైఫ్‌లోనూ ఫాస్ట్ ఇంపాక్ట్ ఇస్తున్నాయి.చిన్న వీడియోల పెద్ద హంగామాఒకప్పుడు సినిమా థియేటర్లో మూడు గంటలు కూర్చుని ఒక కథ చూస్తే, ఇప్పుడు అదే ఎమోషన్, అదే మెసేజ్, అదే ఫీల్‌ను రెండు నిమిషాల వీడియోలోనే చూస్తున్నాం! కారణం? డిజిటల్ ప్రపంచం వేగంగా పరుగులు తీస్తోంది. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లు, డేటా ఇవన్నీ కలసి మనకు రీల్స్ స్క్రోలింగ్ అనే ఒక కొత్త అలవాటు తెచ్చాయి. ఇప్పుడు ఆ రీల్సే కాస్త పెద్దవై షార్ట్ స్క్రోలింగ్ సినిమాలుగా మారాయి. అందుకే, ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్, జోష్, మోజ్ ఏ యాప్ తెరిచినా ఒక్కో స్క్రోల్లోనే నవ్వు, డ్రామా, పాట, డ్యాన్ ్స, ట్రెండ్, ఎమోషన్ అన్నీ మీ చేతిలోకి వస్తున్నాయి, అది కూడా రెండు నిమిషాల్లోనే! ఇంతలోనే వాటికి మిలియన్ల వ్యూస్, కోట్ల లైక్స్, సూపర్‌స్టార్ ఫేమ్. ఈ రెండు నిమిషాల ఫేమ్‌తో లక్షల ఆదాయం కూడా వస్తోంది.ఎందుకు ఈ పిచ్చి?మనిషి మైండ్ ఇప్పుడు ఫాస్ట్ మోడ్‌లో ఉంది. తక్కువ టైమ్‌లో ఎక్కువ ఎంటర్టైన్ మెంట్ కావాలని కోరుకుంటోంది. పది నిమిషాల వీడియో ఎవరు చూస్తారు? అదే తొంభై సెకన్లలో నవ్వు, ప్రేమ, డ్యాన్ ్స, డ్రామా అన్నీ ఇస్తే, దాన్ని మిస్సవ్వడం కష్టం! అందుకే మనసు వెంటనే ‘నెక్ట్స్’ అంటుంది. ఇదే డోపమైన్ లూప్. ప్రతి స్క్రోల్‌లో చిన్న సంతోషం, ప్రతి వీడియోలో కొత్త హిట్. సైకాలజిస్టుల మాట ప్రకారం, చిన్న వీడియోలు మన మెదడులో ‘ఇన్ స్టంట్ రివార్డ్’ ఫీలింగ్ కలిగిస్తాయి. అందుకే మనం ‘ఇంకో వీడియో మాత్రమే’ అని మళ్లీ మళ్లీ స్క్రోల్ చేస్తూనే ఉంటాం! వీటిలో యూట్యూబ్ షార్ట్స్ వీడియోస్‌కు ఎక్కువ క్రేజ్ రావడంతో, క్రియేటర్లు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్, వీడియోస్ కంటే రీల్స్‌లోనే తమ క్రియేటివిటీతో కథలను సృష్టిస్తున్నారు. అలా ‘ఒక్క నిమిషం చాలదు, రెండు నిమిషాలైనా ఇవ్వండి!’ అని క్రియేటర్లు డిమాండ్ చేసినప్పుడు, యూట్యూబ్ ‘సరే! మీకు 180 సెకన్లు!’ అని అంగీకరించింది. ఈ నేపథ్యం వలనే వివిధ రకాల సోషల్ మీడియా యాప్స్ కూడా ఈ రెండు, మూడు నిమిషాల వీడియోలకు ఆసక్తి చూపించడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం, టిక్‌టాక్, యూట్యూబ్ షార్ట్స్ నిడివి మూడు నిమిషాల వరకు పొడుగవుతుండగా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా పొడవవుతున్నాయి! అలా ఇప్పుడు ప్రపంచం మొత్తం టూ మినిట్స్ రివల్యూషన్ మొదలైంది. క్విక్ కరెన్సీగా!వాణిజ్య ప్రకటనలు అంటే పెద్ద క్యాంపెయిన్, టీవీ యాడ్స్, బిల్‌బోర్డులను అనుకుంటే, ఇప్పుడు అవి మొబైల్లో ఒక్క స్క్రోల్‌తో సరిపోతుంది! మార్కెటింగ్ ఇప్పుడు డైలాగ్ కాదు, రెండు నిమిషాల డ్రామాగా మారింది. ఫ్లిప్‌కార్ట్ రీల్స్‌లో డిస్కౌంట్ చెబుతుంది, స్విగ్గీ రీల్స్‌లో కర్రీ చూపిస్తుంది, మీషో రీల్స్‌లో సేల్స్ పెంచుతుంది! పక్కా మార్కెటింగ్ కన్సల్టెంట్స్ అందరూ ఇదే మంత్రం ‘ప్రోడక్ట్ ఎంత గొప్పదో కాదు, రెండు నిమిషాల్లో ఎవరి మనసు దోచుకుంటామో అదే బ్రాండ్ సక్సెస్!’ అంటున్నారు. వీటికి కంటెంట్ క్రియేటర్స్, ఇన్ ఫ్లుయెన్సర్స్ తోడవటంతో, బ్రాండ్స్‌కు క్రియేటర్లకు షార్ట్ వీడియోలు ఒక క్విక్ కరెన్సీగా మారాయి. స్టార్టప్స్ కూడా ఈ షార్ట్ వీడియోస్ ఆధారంగా కస్టమర్‌ను కట్టిపడేస్తున్నాయి. సంక్లిష్టమైన టెక్నాలజీని కేవలం రెండు నిమిషాల్లో అర్థమయ్యేలా చూపించి, మార్కెటింగ్‌లో కొత్త ఫ్యాషన్ క్రియేట్ చేశారు. మార్కెటింగ్ నిపుణుల ప్రకారం, 2026 నాటికి ప్రపంచం చూసే కంటెంట్‌లో 70 శాతం షార్ట్ వీడియోలే ఉంటాయి. సినిమా ట్రైలర్లు, యూనివర్సిటీ క్యాంపెయిన్లు, ఏ సందేశాలు అయినా ఇప్పుడు రీల్ రూట్లోనే అందరికీ చేరుతున్నాయి.అంతర్జాతీయ స్థాయిలో..ప్రపంచం మొత్తం ఇప్పుడు ‘స్క్రోల్, ప్లే, షేర్!’ అనే రిథమ్‌లో నడుస్తోంది. అందుకే, ప్రపంచ వ్యాప్తంగా టిక్‌టాక్, యూట్యూబ్ షార్ట్స్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్, క్వాయ్, మోజ్, జోష్ కలిపి 80 శాతం మొబైల్ డేటా వినియోగానికి కారణం. ఈ కారణంగానే 2020లో యూజర్లు రోజుకు సుమారు 35 నిమిషాలు స్క్రోల్ చేస్తే, ఇప్పుడు 80 నిమిషాలు స్క్రోల్ చేస్తున్నారట! అందులో మన దేశం ముందు వరుసలో ఉంది. రోజుకు సుమారు 65 కోట్ల మంది యూజర్లు ఈ షార్ట్ వీడియోస్ వీక్షిస్తారు. ముఖ్యంగా తెలుగు, తమిళం, హిందీ వంటి ప్రాంతీయ భాషల కంటెంట్‌కు డిమాండ్ ఎక్కువ. అందుకే, స్థానిక క్రియేటర్లు ఇప్పుడు గ్లోబల్ ఇన్ఫ్లుయెన్సర్లుగా ఎదుగుతున్నారు. ఈ నేపథ్యంలో, ‘2025 గ్లోబల్ షార్ట్ వీడియోస్ ట్రెండ్స్’ సర్వే ప్రకారం, వివిధ సంస్థలు పరిశీలించిన ఫలితాలను వెల్లడి చేశారు. వివిధ మొబైల్ యాప్‌ల డేటా, యూజర్ సర్వేలు, సోషల్ మీడియా విశ్లేషణల ద్వారా, ఒక్కో దేశంలో ప్రత్యేక కంటెంట్, ట్రెండ్స్ స్పష్టమయ్యాయి. ప్రతి చోటా స్థానిక భాషలు, సంస్కృతులు ఆధారంగా షార్ట్ వీడియోలు కొత్త దారులు సృష్టిస్తున్నాయి.డబుల్ లైఫ్!ఉదయం బాస్ ‘మీటింగ్ టైమ్’ అంటాడు, రాత్రి ఫాలోవర్స్ ‘రీల్ టైమ్’ అంటారు! ఇలా రెండు ప్రపంచాల మధ్య బ్రిడ్జ్ వేసుకుని నడుస్తున్నవారే డబుల్ లైఫ్ ఇన్ ఫ్లుయెన్సర్లు! పగలు ఆఫీస్‌లో ప్రెజెంటేషన్ ్స చేసి, రాత్రి కెమెరా ముందు ప్రెజెన్ ్స ఇస్తున్నారు. ఇలా ఇండియాలో ఇప్పటి వరకు 45 లక్షల షార్ట్ వీడియో క్రియేటర్లు ఉన్నారని, వారిలో దాదాపు 60 శాతం మంది ప్రైవేట్ ఉద్యోగులు లేదా ఫ్రీలాన్సర్లు అని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. ప్రపంచం మొత్తం చూస్తే, సోషల్ మీడియాలోని క్రియేటర్లలో 40 శాతం మంది రెండు ఉద్యోగాలు చేస్తున్నార ని అంచనా. వీరిలో దాదాపు 6 లక్షల మంది క్రమంగా వీడియోల ద్వారా ఆదాయం పొందుతున్నారు. అంటే పగలు జీతం, రాత్రి వైరల్ వీడియోల ఆదాయం! దీంతో చాలామంది ప్రొఫెషనల్ ఉద్యోగం కంటే ఈ సైడ్ ఇన్ కమ్ పైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఆఫీస్‌లో ఇంక్రిమెంట్ రాకపోయినా, రీల్లో ఎంగేజ్మెంట్ పెరుగుతుంది! అందుకే, ఒక్క రీల్ సక్సెస్ అయితే నెల జీతం కన్నా ఎక్కువ డబ్బు వచ్చేస్తుంది. వీరంతా ప్రతిరోజూ ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో లంచ్ బాక్స్‌తో పాటు మరో పక్క ట్రైపాడ్‌తో ఆఫీస్‌లకు వెళ్తూ, ఒక కొత్త వర్క్ కల్చర్‌తో పనిచేస్తున్నారు. మరికొందరు ‘వర్క్ ఫ్రమ్ ఆఫీస్’ మాదిరి ‘వర్క్ ఫ్రమ్ రీల్’ అనే కొత్త ఫుల్ టైమ్ ఉద్యోగం చేస్తున్నారు! ఇలా వచ్చిన పాపులారిటీతో టీవీ షోలు, ఇంటర్వ్యూలు, బ్రాండ్ కొలాబరేషన్లు, సిల్వర్ స్క్రీన్ చాన్ ్సలు కూడా దక్కించుకుంటున్నారు. ఇలా సాధారణ ఉద్యోగుల కంటే వీరి జీవితం ఇప్పుడు మరింత ఆదాయభరితంగా, ఆనందభరితంగా, వైరల్‌గా మారింది. ఏఐ క్రియేటర్లు! ఇప్పటి క్రియేటర్లకు కెమెరా మాత్రమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ్స కూడా పెద్ద సహాయంగా మారింది. వీడియో తీసేందుకు డైరెక్టర్, ఎడిటర్, మ్యూజిక్ డిజైనర్ అవసరం లేదు. ఏఐ వాయిస్, ఫేస్ ఫిల్టర్, స్మార్ట్ ఎడిటింగ్ యాప్‌లు ఇవే కొత్త టెక్నాలజీ టీమ్ మెంబర్స్. ఒక క్లిక్‌తో బ్యాక్‌గ్రౌండ్ మారిపోతుంది, వాయిస్ టోన్ అడ్జస్ట్ అవుతుంది, మూడ్‌కి సరిపోయే మ్యూజిక్ వచ్చేస్తుంది. కెమెరా ముందు ఉన్నది మనిషే కాని, వెనుక ఆలోచిస్తున్నది మొత్తం ఏఐనే. ఇదే కారణంగా ఇప్పుడు కంటెంట్ క్రియేటర్ల వేగం పెరిగింది. ఒకప్పుడు వీడియోకి రోజులు పట్టేది, ఇప్పుడు నిమిషాల్లో సిద్ధమవుతోంది!రీల్లోనే ఫీల్స్, డ్రీమ్స్! బ్రేక్అప్ అయినా, బర్త్‌డే అయినా ఇప్పుడు ప్రతి ఒక్క సందర్భానికి రీల్ తప్పనిసరి! ముఖ్యంగా 16 నుంచి 25 ఏళ్ల వయసు వారు ‘రియల్ లైఫ్ కంటే రీల్ లైఫ్ బెటర్!’ అని నమ్ముతున్నారు. సినిమా చూడటానికి ఓపిక లేదు కానీ, రీల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ‘ఒక్క నిమిషం లవ్ స్టోరీ’, ‘30 సెకండ్ల అడ్వెంచర్’, ‘45 సెకండ్ల ట్రాజెడీ’ ఇవే ఇప్పుడు న్యూ ఏజ్ బ్లాక్‌బస్టర్స్! జెన్ జీ కి రీల్ అంటే భాష కాదు లైఫ్ స్టయిల్. ఇదే కారణంగా ఈ వయసు వారు సోషల్ మీడియాలో అత్యధికంగా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఫ్యాషన్ నుంచి ఫుడ్ వరకూ, ట్రావెల్ నుంచి ట్రెండ్ వరకూ అన్నీ వీళ్ల చేతుల్లోనే! అందుకే, అసలైన వైరల్ పవర్ కూడా వీరివద్దే దాగుంది. ప్రాంతీయ భాషల శక్తిప్రపంచం ఇంగ్లీష్‌లో మాట్లాడినా, సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రాంతీయ భాషలే రాజ్యం చేస్తున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో ఉన్న కంటెంట్ ఎక్కువగా వైరల్ అవుతోంది.వీక్షకులు తమ భాషలో ఉన్న కంటెంట్‌కి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ఇందుకే ఇప్పుడు ప్రతి యాప్ కూడా ‘మీ భాషలో రీల్ క్రియేట్ చేయండి’ అని ప్రోత్సహిస్తోంది. తెలుగు క్రియేటర్ల రీల్స్ ఇప్పుడు గ్లోబల్ ట్రెండ్స్‌లోకి చేరాయి!రేపటి రియాలిటీ!భవిష్యత్తులో షార్ట్ వీడియోల ప్రపంచం మరింత టెక్ రిచ్‌గా మారబోతోంది. త్రీడీ వీడియోలు, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ కంటెంట్ ఇవే రేపటి రీల్స్. క్రియేటర్లు ఇప్పుడు కెమెరాతో కాదు, మెటావర్స్‌లో రికార్డు చేయబోతున్నారు! అప్పుడు ప్రేక్షకులు కేవలం వీడియో చూడరు, దానిలోకి అడుగుపెడతారు. అంటే రేపటి రీల్ కేవలం వినోదం కాదు. ఒక వాస్తవిక అనుభవం అవుతుంది! ఇప్పటికే కొంతమంది క్రియేటర్లు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు కూడా. త్వరలోనే రీల్స్ చూడటం కాదు, అందులో జీవించబోతున్నాం. భవిష్యత్తులో రెజ్యూమేలో డిగ్రీ కాదు. ఫాలోవర్స్ కౌంటే కెరీర్ డిసైడ్ చేస్తుందేమో! హై పెయిడ్ జాబ్స్‌లో షార్ట్ వీడియో క్రియేటర్ ఒకటిగా మారచ్చు కూడా! అప్పుడు, డాక్టర్ రీల్ మధ్యలో ఆపరేషన్ చేస్తాడు. లాయర్ వాదన మధ్యలో ‘లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ ప్లీజ్!’ అంటాడు. టీచర్ కూడా కెమెరా ముందు ‘టుడేస్ ట్రెండ్!’ అని క్లాస్ మొదలుపెడుతుంది. ఇలా చాలామంది కంటెంట్ క్రియేటర్‌నే మెయిన్ జాబ్‌గా, మిగతా ఉద్యోగాలను పార్ట్టైమ్లా చేస్తారేమో!కిచెన్ నుంచి కెమెరా వరకు!భారతదేశంలో షార్ట్ వీడియోల రంగంలో మహిళల సంఖ్య ఆశ్చర్యకరంగా పెరిగింది. తాజా గణాంకాల ప్రకారం 40 శాతం పైగా షార్ట్ వీడియో క్రియేటర్లు మహిళలే! వంటింటి కథల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ టిప్స్, ఫ్యాషన్ నుంచి ఫిట్నెస్ వరకు, మహిళలు కంటెంట్ ప్రపంచాన్ని కొత్తగా మలుస్తున్నారు. ఇప్పుడు వాళ్లు కేవలం కంటెంట్ క్రియేటర్లు మాత్రమే కాదు, బ్రాండ్ అంబాసిడర్లు, ఇన్ ఫ్లుయెన్సర్లు, స్టార్టప్ ఫేస్‌లు కూడా అయ్యారు.లక్షల్లో ఆదాయం!చూస్తున్న వీడియోలు కేవలం రెండు నిమిషాలే అయినా, క్రియేటర్లకు మాత్రం లక్షల్లో ఆదాయం తెచ్చిపెడుతుంది. ఇందులో ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న క్రియేటర్ మార్కెట్. 2019లో షార్ట్ వీడియో మార్కెట్ విలువ 1.3 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2025 నాటికి అది 3 బిలియన్ డాలర్లకు చేరనుందని అంచనా. 2027 నాటికి ఇండియాలో క్రియేటర్ ఎకానమీ 45,000 కోట్ల రూపాయల విలువకు చేరనుంది. అందుకే మార్కెటింగ్ కూడా రీల్ ఫార్మ్‌లోకి వచ్చేసింది. రెండు నిమిషాల్లో బ్రాండ్ కథ చెప్పగలిగిన వారే గెలుస్తున్నారు. ఒక్క స్క్రోల్‌కి కోట్ల రూపాయల మార్కెట్– ఇదే కొత్త డిజిటల్ వండర్! ఈ కారణంగానే ఇండియాలో ఇప్పటికే పదకొండు వేలకు పైగా చానెల్స్ మిలియన్ల సబ్స్క్రైబర్లు దాటాయి. రోజూ కోటాను కోట్ల వ్యూస్! అంటే ఒక్కొక్క షార్ట్ వీడియో చూస్తే, మన ఫింగర్స్ స్క్రోల్ చేస్తూ ‘ఓ మై గాడ్!’ అని చెప్పాల్సిందే. మనీకంట్రోల్ సంస్థ ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం, ప్రస్తుతం 45 లక్షల ఇండియాలో క్రియేటర్లలో సుమారు 6 లక్షల మంది డబ్బు సంపాదిస్తున్నారు. వారి సబ్స్క్రైబర్లు, ఫాలోవర్స్ ఆధారంగా ఆదాయం వస్తుంది. యూట్యూబ్ గత మూడు సంవత్సరాల్లో 5.8 లక్షల కోట్ల రూపాయలు క్రియేటర్లకు చెల్లించిందట! ఎవరికి తెలుసు? ఈరోజు మీరు చూసిన చిన్న రీల్ రేపటికి లక్షలు తెచ్చే కంటెంట్ కావచ్చు! -
‘చుక్క’బీరు.. చుక్కల్లో ధర..
బీరు బాబులు మగ్గుల్లో బీరు పోసుకుని గుక్కలు గుక్కలుగా తాగుతారు గాని, ఈ సీసాలో ఉన్న బీరును అలా తాగడం కుదరదు గాక కుదరదు. ఎందుకంటే, ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్న బీరు సీసా. ఇందులో ఉన్నది కేవలం ఒక చుక్క బీరు మాత్రమే! గొంతు తడుపుకోవడానికైనా చాలని చుక్క బీరుతో ఈ సీసాను అసలు ఎందుకు తయారు చేశారోననేగా మీ అనుమానం? స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లోని రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అతి చిన్న బీరు సీసా తయారీలో పోటీ నిర్వహించింది. ఈ పోటీలో గెలుపొందిన వారికి నగదు బహుమతితో పాటు, డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్ కేంద్రంగా పనిచేసే బహుళజాతి బీర్ల తయారీ సంస్థ ‘కార్ల్స్‌బర్గ్’ ప్రధాన కార్యాలయం సందర్శనకు పంపనున్నట్లు ప్రకటించింది. ఈ పోటీలో పాల్గొన్న స్వీడిష్ మినియేచర్ కళాకారిణి ఆసా స్ట్రాండ్ ‘కార్ల్స్‌బర్గ్’ బీరుసీసా నమూనాలోనే ధాన్యం గింజంత పరిమాణంలో ఒక్క చుక్క బీరు మాత్రమే పట్టేంత ఈ సీసాను తయారు చేసి, విజేతగా నిలిచింది. ఈమె రూపొందించిన సీసాలో ఉన్న బీరు పరిమాణం 0.05 మిల్లీలీటర్లు మాత్రమే! దీనికి బహుమతిగా చెల్లించిన మొత్తం పదివేల స్వీడిష్ క్రోన్లు (రూ.93,410) కావడం విశేషం.(చదవండి: నటి ప్రగ్యా జైస్వాల్ స్టైలింగ్ టిప్స్..! బ్లాక్ డ్రెస్ ధరించేటప్పుడు..) -
నటి ప్రగ్యా జైస్వాల్ స్టైలింగ్ టిప్స్..!
ప్రగ్యా జైస్వాల్ అంటే సింపుల్ లుక్‌తోనే మెరిసే స్టార్.ఏ రంగులోనైనా ఏ డ్రైస్లోనైనా, కేవలం కంఫర్ట్ ఫ్లస్ కాన్ఫిడెన్స్ కలయికతో ఫ్యాషన్ స్పార్క్ చూపించే ఆమె స్టయిలింగ్ టిప్స్ మీ కోసం! జిమ్‌లో గంటల కొద్దీ గడపటం కంటే, శరీరానికి కావలసిన విశ్రాంతి ఇవ్వడమే ముఖ్యం. రెస్ట్, హైడ్రేషన్, హెల్తీ మీల్స్ ఇవే నా ఫిట్నెస్ సీక్రెట్స్. ఫ్యాషన్ విషయానికి వస్తే, సింపుల్, క్లాసీ లుక్స్‌ను ఇష్టపడతాను. రెడ్, గోల్డ్ నా ఫేవరెట్ కలర్స్. కాని, బ్లాక్ డ్రెస్ వేసుకున్నప్పుడు వచ్చే ఆ క్లాసిక్ ఫీలింగ్ వేరేలా ఉంటుంది. స్టయిలింగ్ ఏదైనా వాటికి కాన్ఫిడెన్స్ కలిస్తేనే అవే బెస్ట్ లుక్ అవుతాయి అని చెబుతోంది ప్రగ్యా జైస్వాల్. ఆమె ధరించిన చీర బ్రాండ్: స్వాన్ గాంధీ, ధర: రూ. 88,000, జ్యూలరీ బ్రాండ్: రాజ్వాడా జ్యూలర్స్, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. రంగురంగుల దండ!ఏ చీర వేసుకున్నా ఈజీగా సెట్ అయిపోయే సీక్రెట్ వెపన్ కావాలా? అయితే వెంటనే ఒక మల్టీకలర్డ్ నెక్‌పీస్ రెడీ చేసుకోండి. ఇది సాధారణ ఆభరణం కాదు, నవరత్నాల ఫ్యాషన్‌లో పటాకా మోడ్ ఆన్ చేసే రంగురంగుల మణుల దండ! ఎరుపు, పచ్చ, గులాబీ, ముత్యాలు అన్నీ ఒక్కటే లైఫ్‌లో మెరిసిపోతూ, ‘నిన్ను చూడగానే దేవతా వైబ్ వచ్చిందమ్మా!’ అని చెప్పించే మ్యాజిక్ ఇది. ఏ రంగు చీర వేసుకున్నా ఈ మల్టీకలర్డ్ నెక్లెస్ ఆటోమేటిక్‌గా మ్యాచ్ అయిపోతుంది. నలుపు చీర వేసుకుంటే నయగారంగా, పసుపు చీర వేసుకుంటే పండుగలా మారిపోతుంది! జుట్టు బన్ వేసుకుంటే ఈ నెక్లెస్ మెడ చుట్టూ మెరిసిపోతూ లుక్‌ను హైలైట్ చేస్తుంది. ఓపెన్ హెయిర్ అయితే కంఫర్ట్ ఫీల్‌తో కూల్ లుక్ ఇస్తుంది. చెవుల్లో చిన్న జుంకాలు పెయిర్ చేస్తే లుక్‌కి ఫుల్ మార్క్స్. లిప్ కలర్‌ని నెక్లెస్‌లోని ఏదో ఒక స్టోన్ షేడ్‌కి మ్యాచ్ చేస్తే ఇక మీ లుక్ సూపర్‌హిట్ అనిపించక మానదు. (చదవండి: ఈత కొడుతూ ఫ్లూట్ వాయిస్తూ.. ప్రపంచ రికార్డు !) -
సేఫ్టి షర్ట్..!
‘అన్న షర్టేస్తే మాస్!’ మాత్రమే కాదు, ఇప్పుడు అన్న ఈ షర్టేస్తే సేఫ్ కూడా! అవును, జర్మన్ పరిశోధకులు సృష్టించిన ఈ స్మార్ట్ ఫ్యాబ్రిక్‌తో తయారైన షర్ట్ చూడ్డానికి సాధారణ షర్ట్‌లాగే ఉంటుంది. కాని, ఇందులో దాగి ఉన్న మ్యాజిక్ మాత్రం అదిరిపోతుంది! ఈ ఫ్యాబ్రిక్‌లోని మాలిక్యూల్స్‌ను వారు ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఫ్యాబ్రిక్ చూడ్డానికి మృదువుగా, ఫ్లెక్సిబుల్‌గానే ఉంటుంది. కాని, దానిపై ఒక్కసారిగా బలమైన దెబ్బ పడితే, వెంటనే గట్టి కవచంలా మారిపోతుంది. అచ్చం, క్షణాల్లో మారే సాఫ్ట్ షర్ట్ బుల్లెట్ ప్రూఫ్‌లాగా. బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ల మాదిరి రక్షణ ఇస్తూనే, చాలా తేలికగా ఉంటుంది, శ్వాస తీసుకోవడానికీ సౌకర్యంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ సైట్లలో ప్రమాదాలు, క్రీడల్లో గాయాలు, వాహన ప్రమాదాలు వంటి ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్న వారికి ఉపయోగపడేలా దీనిని తయారు చేశారట శాస్త్రవేత్తలు. భవిష్యత్తులో ఈ షర్ట్ ఒక ఫ్యాషన్ మాత్రమే కాదు, సేఫ్టీ వేర్ కూడా! (చదవండి: Railway TTE of Rs 50 bribery charge: 44 ఏళ్ల నాటి లంచం కేసు..! చనిపోయినే కొన్నేళ్లకు క్లీన్ చిట్) -
బిడ్డ చేతికి ఫోన్..ఇంత అనర్థానికి కారణమా..!
‘‘డాక్టర్! మా పాప రోజంతా ఏడుస్తుంటుంది. కాని, మొబైల్ చూపించగానే సైలెంట్ అయిపోతుంది. అందుకే రోజూ రెండుమూడు గంటలు రైమ్స్, కార్టూన్లు పెడతాం’’ అని అమాయకంగా చెప్పింది అనిత.ఆమె మాటల్లో ప్రేమ ఉంది కాని, లోపల ఒక ప్రమాదం దాగి ఉంది. అందుకే ఆ రెండేళ్ల పాపను చూశాను. ‘‘హాయ్ బుజ్జీ’’ అని పలకరించా, స్పందన లేదు. చేతికి బొమ్మ ఇచ్చినా ఆసక్తి చూపలేదు. కాని, ఫోన్ కనిపించగానే కళ్లు వెలిగాయి, చేతులు చాపింది. రెండేళ్లకే ఆ పాప మొబైల్‌కు అడిక్ట్ అయ్యిందని అర్థమైంది. సైలెన్స్ వెనుక తుఫాను...‘మేము బిజీగా ఉంటాం డాక్టర్. కాసేపు పిల్లల చేతిలో ఫోన్ పెడితే తప్పేముంది?’ అని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు. శిశువు ఏడుస్తుందంటే తనకు ఏదో అసౌకర్యంగా ఉందని సిగ్నల్. ‘‘అమ్మా, నా దగ్గరకు రా’’ అని పిలుపు.ఆ సమయంలో బిడ్డ చేతికి ఫోన్ ఇవ్వడమంటే ఆ సిగ్నల్‌ను మ్యూట్ చేయడం. తల్లితో బంధాన్ని కోల్పోవడం. ఎందుకంటే, తల్లి ముఖం కంటే స్క్రీన్ వెలుతురు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఫలితంగా తల్లిదండ్రులు దగ్గరున్నా బిడ్డ ఒంటరిగా పెరుగుతుంది. మెదడు మీద కాంతి దాడిశిశువు జననం తర్వాత మొదటి 36 నెలల్లో మెదడులో ప్రతి సెకనుకు దాదాపు 10 లక్షల కొత్త న్యూరల్ కనెక్షన్లు ఏర్పడతాయి. ఆ కనెక్షన్లు ఆటలతో, స్పర్శలతో, సంభాషణలతో బలపడాలి. తల్లి నవ్వు, తండ్రి చూపు, అమ్మమ్మ పాట – ఇవే అసలైన మానసిక ఆహారం. కాని, ఫోన్ స్క్రీన్ ముందు కూర్చునే పిల్లల మెదడు వేరే రకంగా అభివృద్ధి చెందుతుంది. స్క్రీన్‌లోని వేగం, రంగులు, శబ్దం – ఇవన్నీ మెదడును ఎక్కువగా ప్రేరేపిస్తాయి. మెదడులో డోపమైన్ అనే రసాయనం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా... పిల్లలు సాధారణ ఆటలలో ఆసక్తి కోల్పోతారు. · బోరింగ్ అనిపిస్తే వెంటనే చిరాకు పెరుగుతుంది. · ఎప్పటికప్పుడు స్టిమ్యులేషన్ కావాలనిపిస్తుంది. ఇదే మొదటి దశ డిజిటల్ అడిక్షన్. స్క్రీన్ దెబ్బతో స్తంభించే మాటలు‘‘డాక్టర్, మా పాపకు రెండేళ్లు. ఒక్క మాట కూడా మాట్లాడదు’’ అనేది ప్రస్తుతం నేను వినే అత్యంత సాధారణ ఫిర్యాదు. కారణం తెలుసా? తల్లిని చూస్తూ, వింటూ, అనుకరిస్తూ పిల్లలు ‘‘మాట’’ అనే మ్యాజిక్ నేర్చుకుంటారు.స్క్రీన్‌లోని కార్టూన్ మాట్లాడుతుంది కాని, వినదు. బిడ్డ ప్రయత్నించినా అది స్పందించలేదు. దీనివల్ల కమ్యూనికేషన్ లూప్ ఆగిపోతుంది. ‘రెండేళ్ల లోపు పిల్లలు 30 నిమిషాల స్క్రీన్ టైమ్ వల్ల మాటలు రావడం 49శాతం ఆలస్యమవుతుంది’ అని జర్నల్ ఆఫ్ పిడియాట్రిక్స్ 2020లో జరిగిన పరిశోధనను ప్రచురించింది. ప్రేమ ముసుగులో ‘‘డిజిటల్ జైలు’’‘‘మేము ఎడ్యుకేషనల్ వీడియోలు చూపిస్తున్నాం కదా! నష్టమేంటి?’’ అని కొందరు పేరెంట్స్ అనుకుంటారు. కాని, హ్యూమన్ ఇంటరాక్షన్‌ను ఏ వీడియో భర్తీ చేయలేదని నాసా–యేల్ యూనివర్సిటీ సంయుక్త అధ్యయనం చెబుతోంది. వీడియోలు నేర్పే కంటెంట్ బౌద్ధికంగా ఉపయోగపడినా, భావోద్వేగ అనుభూతిని ఇవ్వలేవు.పిల్లలు నిజమైన ముఖాల నుంచి సహానుభూతి నేర్చుకుంటారు. కథల ద్వారా ఊహాశక్తి పెరుగుతుంది. కాని, స్క్రీన్ యాంత్రికంగా నేర్చుకోవడాన్ని మాత్రమే చేస్తుంది. ఫలితంగా... · భావోద్వేగ స్పర్శ తగ్గిపోతుంది. · స్నేహం కంటే స్క్రీన్ ప్రాధాన్యం పెరుగుతుంది. · పిల్లలో ‘డిజిటల్ లోన్లీనెస్’ ఏర్పడుతుంది. స్క్రీన్‌తో ఏకాగ్రత లోపం... శిశువుల మెదడును స్క్రీన్లు ‘ఫాస్ట్ రివార్డ్’ సిస్టమ్‌లో కట్టేస్తాయి. రంగులు, ఫ్లాష్‌లు, సంగీతం – ఒక్కో సెకనుకు ఒక కొత్త విజువల్ షాక్. దీని వల్ల మెదడు అటెన్షన్‌ను నిలుపుకోలేదు. ఆ తరువాత బిడ్డ పాఠశాలకు వెళ్లినప్పుడు ఫోకస్ నిలపలేరు. హైపర్ రియల్ స్క్రీన్ ప్రపంచం నచ్చి, రియల్ ప్రపంచం బోరింగ్‌గా మారిపోతుంది.తల్లిదండ్రులకు సూచనలు...ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు ప్రకారం రెండేళ్ల లోపు పిల్లలకు ఏ స్క్రీన్ కూడా చూపకూడదు. బదులుగా శిశువులతో ఆడటం, పాడటం, తాకడం లాంటివి చేయాలి. · బిడ్డ ఏడిస్తే వెంటనే ఫోన్ ఇవ్వకండి. దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకోండి. ‘నువ్వు సేఫ్‌గానే ఉన్నావు’ అని సాఫ్ట్‌గా చెప్పండి. తల్లి మాట ఆత్మస్థైర్యం ఇస్తుంది – స్క్రీన్ కాదు.శిశువుతో కలిసి నడవడం, బొమ్మలతో ఆట, నీటిలో ఆడించడంలాంటివి సెన్సరీ ప్లస్ ఎమోషనల్ ఇంటిగ్రేషన్‌ను ఇస్తాయి. · 2–5 ఏళ్ల బిడ్డతో కలిసి చిన్న చిన్న ఎడ్యుకేషనల్ వీడియోలు మాత్రమే చూడాలి. ఆ తర్వాత వాటి గురించి చర్చించాలి. ప్రశ్నలు అడగాలి. సైకాలజిస్ట్ విశేష్‌ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్www.psyvisesh.com(చదవండి: భారత్ 'ధర్మ యోగా' జపాన్ వ్యక్తి జీవితాన్నే మార్చేసింది..!) -
కంటెంట్ క్రియేటర్ నిహారిక ఫ్యాషన్ ఫార్ములా ఇదే..!
ప్రతి లుక్‌లో మూడ్, ప్రతి మూడ్‌లో మ్యాజిక్ చూపించే నిహారికా స్టయిల్, అచ్చం ఆమెలానే! క్రియేటివ్ టచ్‌తో, కంఫర్ట్ స్పార్క్‌తో నిండిన ఆమె స్టయిలింగ్ ఎప్పుడూ ఒక ఆర్ట్‌లా అనిపించేస్తుంది.నా ఫ్యాషన్ ఫార్ములా? మిక్స్ ఇట్ అప్! ట్రెడిషనల్ టచ్‌కి మోడర్న్ ట్విస్ట్ జోడించడం నాకు ఇష్టం. క్యూట్ బిందీతో వెస్టర్న్ వేర్ స్టయిల్ చేస్తాను, అలాగే ట్రెడిషనల్ దుస్తులు ధరించినప్పుడు ఫంకీ జ్యూలరీ లేదా కూల్ ఫుట్‌వేర్‌తో మిక్స్ చేస్తా. నా మూడ్‌ను బట్టి లుక్ కూడా మారిపోతుందని అంటోంది నిహారికాచిన్నగా మెరిసే మెరుపు!చిన్నదే, కానీ చెవుల్లో పెద్ద ఫన్ షో లాంటి ప్రభావం! అవే మినీ హ్యాంగింగ్స్. పెద్ద ఇయర్రింగ్స్ కంటే, ఇవి తేలిగ్గా, క్యూట్‌గా ఉంటూ ఫ్రెండ్లీ, ట్రెండీ లుక్ ఇస్తాయి. ఒక్కసారి మినీ గోల్డ్ బీడ్స్, చిన్న ముత్యాలు, కలర్ స్టోన్స్ వంటివి వేసుకుంటే, సాధారణ డ్రెస్సు కూడా ప్రత్యేకంగా మెరుస్తుంది. డైలీ వేర్కి, సింపుల్ డిజైన్ హ్యాంగింగ్స్ ఎల్లప్పుడూ బెస్ట్ ఆప్షన్. ఆఫీస్‌కి వెళ్లినా, క్లాస్ రూమ్‌లో కూర్చున్నా, మీరు ప్రొఫెషనల్, ఫ్రెష్ లుక్‌తో అందరినీ ఆకర్షిస్తారు. కాని, పార్టీ లేదా ఫంక్షన్ కోసం అయితే, కొంచెం స్టోన్ హ్యాంగింగ్స్ స్టేట్మెంట్గా మారతాయి. పోనీ, వేవీ, కర్ల్స్ ఏ హెయిర్ స్టయిల్ అయినా ఈ చిన్న హ్యాంగింగ్స్ క్యూట్ అండ్ రాయల్టీ ఫీల్‌ను ఇస్తాయి. ఇక్కడ నిహారిక ధరించిన చీర డిజైన్ చేసింది అశ్విని త్యాగరాజన్, ధర: రూ. 70,000, ఇక జ్యూలరీ : బ్రాండ్: రాజీ ఆనంద్, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. (చదవండి: రుమాలు ఉంగరాలు..వివిధ డిజైన్స్‌లో..) -
కథాకళి: డేంజర్ డివైజ్
అది హైద్రాబాద్‌లోని పాపులర్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఒకటి. దాని ప్రిన్సిపాల్ వైద్యరాజ్ గదిలోకి వచ్చిన ప్యూన్ ఓ కాగితాన్ని ఇచ్చాడు. దాని వెనక ‘మీ స్టూడెంట్ ఫాదర్‌ని. దయచేసి ఓ ఐదు నిమిషాలు మీతో మాట్లాడే సమయం కేటాయించగలరా?’ అని ఇంగ్లీష్‌లో రాసుంది.‘‘రమ్మను.’’ ఆయన చెప్పాడు.లోపలకి వచ్చిన ఆయన వయసు నలభైఐదు– ఏభై మధ్య ఉండచ్చని వైద్యరాజ్ అనుకున్నాడు. అతని దుస్తులని బట్టి మధ్యతరగతి మనిషని కూడా గ్రహించాడు.‘‘రండి. కూర్చోండి.’’ మర్యాదగా ఆహ్వానించాడు.‘‘థాంక్ యు సర్. మీరు బిజీ అని నాకు తెలుసు.’’ ఆయన కంఠం సౌమ్యంగా ఉంది.‘‘నేను ఉన్నది మీ కోసమే. చెప్పండి.’’‘‘నా సమస్యని మీకు చెప్పాలని వచ్చాను. మా రెండో అమ్మాయి మీ కాలేజ్‌లో థర్డ్ ఇయర్ స్టూడెంట్. మీ కాలేజీలో చేరక మునుపే దానికి మొబైల్ కొనిచ్చాను.’’ కొద్దిగా బాధగా చెప్పాడు.‘‘ఈ రోజుల్లో కుటుంబంలో ప్రతివారికీ ఓ మొబైల్ తప్పనిసరి.’’ వైద్యరాజ్ చెప్పాడు.‘‘ఇప్పుడు ప్రతి మొబైల్ పాస్వర్డ్ ప్రొటెక్షన్ తో వస్తోంది. కాబట్టి నేను మా నలుగురి పాస్‌వర్డ్స్‌ని ఓ కాగితం మీద రాసి దాన్ని ఫ్రిజ్కి మేగ్నెట్తో తగిలించాను. నిన్న రాత్రి నేను మా ఆవిడకి పంపే ఈమెయిల్ మెసేజ్‌ని పొరపాటున మా అమ్మాయికి పంపాను. అది మా అమ్మాయి పెట్టే అధిక ఖర్చు గురించిన వివరాలు. నా తప్పుని గ్రహించాక వెంటనే దాన్ని మా అమ్మాయి జీమెయిల్లోంచి డిలీట్ చేయాలని అనుకున్నాను. అది ఆ సమయంలో నిద్రపోతోంది. పాస్వర్డ్ చూసి మా అమ్మాయి ఫోన్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తే అది తెరచుకోలేదు. మా అమ్మాయి నిద్ర లేచాక ఫోన్ పాస్వర్డ్ ఎందుకు పని చేయలేదని అడిగాను. మార్చానంది. కొత్తది చెప్పమంటే నీళ్ళు నమిలింది. దాన్ని తెరచి ఇవ్వమంటే సందేహించింది. నేను గట్టిగా అరిస్తే వణుకుతూ తెరిచింది. వాట్సప్ ఓపెనైంది. అందులో టాప్‌లో ఓ అబ్బాయి నుంచి అప్పటికే ఐదారు మెసేజెస్ వచ్చి ఉన్నాయి. దాని మీద క్లిక్ చేస్తే...’’అతను స్వల్పంగా సిగ్గుతో ఆగాడు. తర్వాత కొనసాగించాడు.‘‘రెండు బూతు వీడియోలు, అలాంటి ఫొటోలు నాలుగు కనిపించి షాకయ్యాను.’’‘‘ఓ!’’ వైద్యరాజ్ వెంటనే ఆశ్చర్యంగా చెప్పాడు.‘‘ఆ అబ్బాయి తన సీనియర్ అని చెప్పింది.’’‘‘పేరు?’’‘‘నేను ఆ అబ్బాయి మీద ఫిర్యాదు చేయడానికి రాలేదు. మీ స్టూడెంట్స్ అంతా ఇలా విచ్చలవిడిగా ఉన్నారేమోనని ఫిర్యాదు చేయడానికి వచ్చాను. మీరు మీ స్టూడెంట్స్ తల్లిదండ్రులకి తమ పిల్లల మొబైల్స్ మీద ఓ కన్నేసి ఉంచమని సూచించమని చెప్పడానికి వచ్చాను సార్. వయసులోని వారికి మొబైల్ ద్వారా సీక్రెసీ, ఏక్సెసిబిలిటీ అందుబాటులోకి వచ్చాక మన కళ్ళముందే ఎవరితో ఏం మాట్లాడుతున్నారో తెలీదు. వయసు మహిమ. ఇది మీ దృష్టికి తెస్తే కొందరి జీవితాలైనా బాగుపడచ్చు అనిపించింది.’’‘‘ఇది సీరియస్ ప్రాబ్లం. ఇది నాకు చెప్పినందుకు థాంక్స్. దీని గురించి ఏం చెయ్యాలో ఆలోచిస్తాను.’’ఆయన ఇంకా ఏదో చెప్పాలనుకుని ఆగాడు. ఆయన మొహంలోని అనిశ్చితిని గమనించాక ప్రిన్సిపాల్ అడిగాడు.‘‘ఇంకేదైనా ఉందా?’’‘‘ఎస్. తర్వాత మా ఆవిడ ఫోన్ ని కూడా నేను పంపింది డిలీట్ చేయడానికి తెరవాలని ప్రయత్నించాను. కాని ఆవిడ కూడా తన పాస్‌వర్డ్‌ని మార్చేసింది! మార్చినా నాకు ఎందుకు చెప్పలేదని అడిగాను. వెంటనే ఆమె మొహం పాలిపోయింది. తెరిపించి చూస్తే వాట్సప్‌లో ఎవరికో ఆమె పంపిన రొమాంటిక్ పోస్ట్‌లు, అక్కడి నుంచి వచ్చినవి కనిపించాయి. అది ఆర్కైవ్స్‌లో దాక్కుని ఉంది! నా దిమ్మ తిరిగిపోయింది సర్. మొబైల్ వరం అనుకున్నాను. కాని శాపం కూడా సార్. చాలామందికి ఈ కొత్తరకం టైమ్‌పాస్ జీవితాలని నాశనం చేసే శాపం అనుకుంటున్నాను.’’ ఆయన బాధగా చెప్పాడు.వైద్యరాజ్కి ఏం జవాబు చెప్పాలో తెలీలేదు. అతను వెళ్ళాక కాగితం అందుకుని విద్యార్థుల తల్లితండ్రులకి ఓ సర్కులర్‌ని డ్రాఫ్ట్ చేయసాగాడు.ఇంటికి వెళ్ళాక ప్రిన్సిపాల్ వైద్యరాజ్ తన భార్య స్నానానికి వెళ్ళేదాకా ఆగి, ఆవిడ మొబైల్‌ని తెరిచే ప్రయత్నం చేసి, పాస్వర్డ్ మారిందని గ్రహించాడు.ఆవిడ వచ్చాక తన మొబైల్ ని ఆవిడకి ఇచ్చి చాలా మామూలుగా చెప్పాడు.‘‘పాస్వర్డ్లు ఓ పట్టాన గుర్తుండవు. ఫింగర్ ప్రింట్స్‌తో కూడా తెరిచే మొబైల్స్ మనవి. నా దాంట్లో నీ ఫింగర్ ప్రింట్, నీ దాంట్లో నా ఫింగర్ ప్రింటూ పెట్టుకుందాం. ముందు నా దాంట్లో మారుద్దాం.’’ఆమె మొహం కొద్దిగా పాలిపోయింది. తన ఫింగర్ ప్రింట్‌ని కూడా ఆమె దాంట్లో నమోదు చేశాడు. నివారణ చర్య జరిగింది కాబట్టి తన భార్య మొబైల్లో ఏం ఉందోనని వెదికి ఆ విద్యార్థిని తండ్రిలా ఆయన తన మనసు పాడుచేసుకోదలచుకోలేదు. ∙మల్లాది వెంకట కృష్ణమూర్తి ‘ఫన్డే’లో ప్రచురితమయ్యే ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడాభాగస్వాములను చేయనున్నారు. మీరైతే ఈ కథకు ఏ పేరు పెడతారో ఈ కింది మెయిల్‌కు పంపండి. kathakalisakshi@gmail.com -
‘విలేజ్ హాలోవీన్ పరేడ్’కి వెళ్లాలంటే..గట్స్ ఉండాలి..!
న్యూయార్క్ నగరంలో జరిగే ‘విలేజ్ హాలోవీన్ పరేడ్’కి వెళ్లాలంటే గుండెల్లో దమ్ముండాలి. ఇది గ్రీన్విచ్ విలేజ్ పరిసర ప్రాంతంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న రాత్రి ఏడుగంటల నుంచి జరుగుతుంది. ఈ వేడుకలో అడుగడుగునా, దారిపొడవునా హడలెత్తించే రూపాలు దర్శనమిస్తాయి. హాలోవీన్‌లో పాల్గొనే ప్రజలంతా దయ్యాలు, భూతాలు, రక్తపిశాచాలలాంటి భయంకరమైన వేషాలు వేసుకుని తిరుగుతారు.ఈ హాలోవీన్ పండుగకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అక్టోబర్ 31న వారి కాలమానాల ప్రకారం జీవించి ఉన్న ప్రపంచానికి, చనిపోయిన వారి ఆత్మల లోకానికి మధ్యనున్న తెర పలుచబడుతుందని, దాంతో ఆత్మలు భూమిపైకి వస్తాయని అక్కడివారు నమ్మేవారు. అందుకే చెడు ఆత్మలను తమ దగ్గరికి రాకుండా ఆపడానికి, భయపెట్టడానికి లేదా ఆ ఆత్మలు తమను గుర్తుపట్టకుండా ఉండటానికి ప్రజలు భయంకరమైన లేదా వింతైన వేషాలను ధరిస్తారు.1974లో చిన్నపాటి కమ్యూనిటీ ఈవెంట్‌గా దీనిని ప్రారంభించారు. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అతి పెద్ద హాలోవీన్ పరేడ్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఊరేగింపులో సుమారు 50 వేలమందికి పైగా చిత్రవిచిత్రమైన వేషధారణలతో ఎంట్రీ ఇస్తారు. వేలాదిమంది దీనిని తిలకించడానికి తరలివస్తారు. ఈ పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణ– భారీ తోలుబొమ్మలే. అవి కూడా హడలెత్తించేలానే హారర్ సీన్‌ను క్రియేట్ చేస్తాయి. ఇందులో పాల్గొనడానికి ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. భయపెట్టే కాస్ట్యూమ్ వేసుకున్న ఎవరైనా వచ్చి నేరుగా ఈ ఊరేగింపులో చేరవచ్చు. సాధారణంగా ఈ పరేడ్ మాన్‌హట్టన్‌లోని సిక్స్త్ అవెన్యూలో కెనాల్ స్ట్రీట్ నుంచి 15వ వీధి వరకు సాగుతుంది. నిజానికి ఈ పరేడ్ న్యూయార్క్ నగర ప్రజల సృజనాత్మకతకు ఒక వేదిక. ఈ వేడుకలో పాల్గొనేవారంతా తమకు ఇష్టమైన వేషధారణలో రోడ్లమీదకు వస్తారు. ‘అలా వేరొక వేషధారణలో రావడంతో తమ నిజ జీవిత పాత్రల నుంచి ఒక రాత్రి బయటపడటమనేది ఒక ప్రత్యేక అనుభూతి’ అంటారు వాళ్లంతా. ఏది ఏమైనా ఈ పరేడ్‌లో వణుకు పుట్టించే డెవిల్ వేషాలను చూడాలంటే గుండెల్లో దమ్ము ఉండాల్సిందే మరి!· సంహిత నిమ్మన (చదవండి: రుమాలు ఉంగరాలు..వివిధ డిజైన్స్‌లో..) -
రుమాలు ఉంగరాలు..వివిధ డిజైన్స్‌లో..
వివిధ డిజైన్లలో కనిపించే ఉంగరాలు వేళ్లకు, చేతులకు ఎంత అందాన్ని తీసుకువస్తాయో మనకు తెలిసిందే. ఇదే ఆలోచనను టేబుల్ నాప్కిన్స్కు తీసుకువచ్చారు అలంకార ప్రియులు. నాప్కిన్ రింగ్ హోల్డర్లు నాప్కిన్లను నీటుగా ఉంచుతాయి. టేబుల్ అలంకరణకు ఆకర్షణను జోడిస్తాయి. వీటిని లోహం, కలప, పూసలు, వివిధ రకాల మెటీరియల్‌తో చేతితో తయారు చేసుకోవచ్చు. ఒకే డిజైన్, ఒకే పరిమాణంలో ఉన్న ఈ హోల్డర్లు విందు సమయాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి.వీటి వల్ల ప్రయోజనాలు ఏంటంటే... నాప్కిన్లు అస్తవ్యస్తంగా లేకుండా నీటుగా ఉంటాయి. టేబుల్ అందాన్ని, వ్యక్తిత్వాన్ని, సంపూర్ణతను జోడిస్తాయి. ఈ చిన్న ఉంగరాలు విలాసవంతమైన అనుభూతిని కలిగిస్తాయి. ఈ రింగ్స్ వల్ల నాప్కిన్లను ఒక్కొక్కటి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. బంగారం, ఇత్తడి, స్టెయిన్లెస్ స్టీల్, కలప, ప్లాస్టిక్, వెదురు, జనపనార... ఇలా వివిధ రకాల మెటీరియల్‌తో రుమాలు ఉంగరాలను రూపొందించవచ్చు. సాధారణ బ్యాండ్ల నుండి బొమ్మలు, జంతువులు, ఆకులు... లెక్కలేనన్ని డిజైన్లలో ఈ రింగ్స్ లభిస్తాయి. వీటిని ఎలా ఎంచుకోవాలంటే...భోజనాల గది సౌందర్యానికి అనుగుణంగా ఉండే డిజైన్స్‌ని ఎంచుకోవాలి. ఉపయోగించే నాప్కిన్లకు కాగితం లేదా క్లాత్ ఏదైనా, హోల్డర్ సరైన సైజులో ఉండేలా సరిచూసుకోవాలి.సులభంగా విరిగిపోయేవి, పడిపోయేవి కాకుండా తగినంత బరువుతో ఉండేలా చూసుకోండి. రింగుల హోల్డర్లు గట్టిగా ఉండాలి కానీ, మరీ బరువుగా ఉండకూడదు. మరకలు లేదా తుప్పు పట్టకుండా ఉండే రింగ్ హోల్డర్లను ఎంచుకోవాలి.రుమాలు ఉంగరాలకు చరిత్ర కూడా ఉంది. 1800 ప్రాంతంలో ఫ్రాన్స్‌లో ఈ మోడల్ మొదలైంది. ప్రత్యేక విందు కార్యక్రమాలలో కనిపించే వీటిని బహుమతులుగా ఇచ్చిపుచ్చుకునేవారు. వందల రూపాయల నుంచి అందుబాటులో ఉన్న నాప్కి రింగ్ హోల్డర్లను అభిరుచికి తగినవి సన్నిహితులకు కానుకలుగా ఇవ్వడానికీ సరైన ఎంపిక అవుతుంది. ఎన్నార్ (చదవండి: కనిపెట్టింది మహిళలు.. క్రెడిట్ కొట్టేసింది పురుషులు..!) -
నెరిసిన జుట్టుకి సహజమైన మెరుపు..
ఇప్పుడు తల నెరిసిపోవడానికి వయసుతో సంబంధం లేకుండా పోయింది. దాంతో ముప్పయిల వయసు దాటక ముందే తలకు రంగు వేసుకోవడం కామన్ అయిపోయింది. పెరిగిన రూట్స్ కారణంగా తరచుగా సెలూన్‌కి వెళ్లడం కష్టమవుతూ ఉంటుంది. అయితే, సమయాన్ని, డబ్బును ఆదా చేసేందుకు ఈ డివైస్ చక్కటి పరిష్కారాన్ని అందిస్తుంది. ఇది ఉంటే సెలూన్లో మాదిరి టచ్–అప్ను ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు.ఇది ఇన్స్టంట్ హెయిర్ కలర్ స్ప్రే. ఇది కేవలం నెరిసిన జుట్టునే కాకుండా, పల్చబడిన జుట్టును కూడా కవర్ చేస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఎయిర్బ్రష్లాంటి ఫైన్ స్ప్రే అప్లికేషన్‌ను అందిస్తుంది, ఇది జుట్టు రంగుతో కలిసిపోయి సహజంగా కనిపిస్తుంది. అలాగే దీనితో జుట్టు జిడ్డుగా, గట్టిగా లేదా నిర్జీవంగా మారకుండా మృదువుగా మెరుస్తూ ఉంటుంది. అంతేకాదు, దీన్ని ఒక్కసారి అప్లై చేసుకుంటే షాంపూ చేసే వరకు నిశ్చింతగా ఉండొచ్చు. వేగంగా రూట్స్ కవర్ చేయడానికి ఇది మార్కెట్లో ఉన్న ఉత్తమ మార్గాలలో ఒకటి. బిజీ లైఫ్స్టయిల్లో ఉన్నవారికి, ఎప్పుడూ ఫ్రెష్‌గా కనిపించాలనుకునే వారికి ఈ రూట్ టచ్ అప్ కిట్ తప్పక ఉండవలసిన బ్యూటీ ప్రొడక్ట్! ఈ గాడ్జెట్‌కి సంబంధించిన కిట్‌లో బ్లాక్‌తో పాటు చాలా కలర్స్ అందుబాటులో ఉంటాయి.నూగు మాయం!అవాంఛిత రోమాల పెరుగుదలను తగ్గించడానికి, వాటిని బలహీనపరచి, చర్మాన్ని శుభ్రం చేయడానికి చాలామంది ఇంటి చిట్కాలను ప్రయత్నిస్తుంటారు. ఈసారి ఇలా ట్రై చేయండి. కొద్దిగా పచ్చి బొప్పాయి గుజ్జు తీసుకుని, దానికి కొద్దిగా పసుపు, కొద్దిగా తేనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను అవాంఛిత రోమాలు ఎక్కువగా ఉన్న భాగాల్లో రాసుకుని, సుమారు 15 నిమిషాలు మసాజ్ చేయాలి. అనంతరం మరో 15 నిమిషాలు అలాగే ఉంచి చల్లటి నీటితో కడగాలి. ఈ పద్ధతిని వారానికి రెండుసార్లు చేసినట్లయితే, నెమ్మదిగా వెంట్రుకల పెరుగుదల తగ్గుతుంది. నిజానికి పచ్చి బొప్పాయిలో ఉండే ‘పాపైన్’ అనే ఎంజైమ్ వెంట్రుకల కుదుళ్లను బలహీనపరచడానికి సహాయపడుతుంది. అవాంఛిత రోమాలతో బాధపడేవారికి ఈ చిట్కా మంచి ఫలితాలను అందిస్తుంది. (చదవండి: బియ్యపు గింజంత కంప్యూటర్!) -
కనిపెట్టింది మహిళలు.. క్రెడిట్ కొట్టేసింది పురుషులు..!
చరిత్ర పొరపాట్లు చేయదు. కానీ, మానవ స్వార్థం చరిత్రలో పొరపాట్లు నమోదు అయ్యేలా చేస్తుంది. అటువంటి చారిత్రకమైన స్వార్థపూరిత పొరపాట్లే ఇక్కడ ఉన్న ఈ ఆవిష్కరణలన్నీ. వీటిని కనిపెట్టింది, లేదా సృష్టించింది మహిళలే అయినప్పటికీ, ఆ గొప్పదనం పురుషులకు దక్కింది! నిజానికి ఇది ‘దక్కటం’ కాదు. ‘కొట్టేయటం’! స్త్రీల నుంచి పురుషులు.. చోరీ చేసి, ప్రపంచాన్ని మభ్యపెట్టి, గురువు స్థానంలో ఉండీ, పేటెంట్‌ను మూలన పడేసి, సహోద్యోగిని టాలెంట్‌ను తొక్కిపెట్టి, పైకి మాట్లాడనీయకుండా చేసి, పక్కకు తోసేసి...క్రెడిట్ తీసుకున్న ఇన్నోవేషన్లు.. డిస్కవరీలలో ఇవి కొన్ని మాత్రమే!మోనోపలీ గేమ్ఈ బోర్డ్ గేమ్‌ని కనిపెట్టింది కాలిఫోర్నియాకు చెందిన చార్ల్స్ డారో అనే ఆయన అని; కనిపెట్టి ‘పార్కర్ బ్రదర్స్’ అనే గేమ్ పబ్లిషర్స్‌కి 1935లో విక్రయించారని; అలా ఈ ‘మోనోపలీ’ బోర్డ్ గేమ్ ప్రఖ్యాతి చెందిందని ప్రపంచానికి ఒక పొరపాటు భావన ఉంది.నిజానికి మోనోపలీ బోర్డ్ గేమ్‌ను కనిపెట్టింది అమెరికన్ గేమ్ డిజైనర్, రచయిత్రి ఎలిజబెత్ మ్యాగీ (1866–1948). చార్ల్స్ డారో కంటే 3 దశాబ్దాల ముందే.. ‘ది ల్యాండ్‌లార్డ్స్ గేమ్: యాంటీ–మోనోపలిస్ట్, మోనోపలిస్ట్’ అనే పేరుతో రెండు సెట్ల మోనోపలీ గేమ్‌ని ఎలిజబెత్ మ్యాగీ సృష్టించారు. మోనోపలీ బోర్డ్ గేమ్‌లో ఆటగాళ్లు తమ ప్రత్యర్థులను వ్యాపారంలో దివాలా తీయించటానికి, వ్యాపార ప్రపంచ జగదేక వీరుడిగా నిలవటానికి ఆస్తులను కొనుగోలు చేస్తూ, అమ్ముతూ, లాభాల కోసం ఎత్తులకు పైఎత్తులు వేస్తుంటారు. ఈ గేమ్‌ను కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆడుతుంటారు. ఆటకు కనీసం ఇద్దరు ఉండాలి. 6 లేదా 8 మంది ప్లేయర్ల వరకు ఆడవచ్చు.పేపర్ బ్యాగులు అడుగు భాగం బల్లపరుపుగా ఉండి, పక్కకు వాలిపోకుండా స్థిరంగా నిలబడి ఉండేలా పేపర్ బ్యాగులను తయారు చేసే యంత్రానికి సృష్టికర్త నిజానికి మార్గరెట్ ఎలోయిస్ నైట్ (1838–1914) అనే అమెరికన్ మహిళ. అయితే, చార్ల్స్ అన్నన్ అనే అతడు ఆమె కనిపెట్టిన పేపర్ బ్యాగ్ డిజైన్‌ను తస్కరించి తన పేరుతో పేటెంట్స్ సంపాదించాడు. మార్గరెట్ ఎలోయిస్ నైట్.. పేపర్ బ్యాగ్ యంత్రానికి మొదట చెక్కతో నమూనాను తయారు చేసి, దానికి ఒరిజినల్ వెర్షన్ కోసం (ఇనుప యంత్రం నమూనా) ఒక షాపుకు వెళ్లినప్పుడు అక్కడే ఉన్న అన్నన్ ఆమె దగ్గరున్న పేపర్ బ్యాగ్ డిజైన్‌ను దొంగిలించాడు. అన్నన్పై న్యాయ పోరాటం చేసి మరీ మార్గరెట్ తన పేటెంట్‌ను దక్కించుకోవలసి వచ్చింది. ఆమె తన 12వ యేటే ‘ఆటో–స్టాపర్’ మెషిన్‌ను కూడా కనిపెట్టారు. నేటి ఎలక్ట్రానిక్ గృహోపకరణాలలో; పారిశ్రామిక, వాణిజ్య పరికరాలలో ఆ ఆటో స్టాపర్ (దానంతటే ఆగిపోయే ఏర్పాటు) కీలకమైన పాత్రను నిర్వహిస్తోంది.సెక్స్ క్రోమోజోమ్లుఅమెరికన్ మహిళా జన్యుశాస్త్రవేత్త నెట్టీ స్టీవెన్స్ (1861–1912) 1905లో సెక్స్ క్రోమోజోములను కనిపెట్టారు. అయితే ఆ ఘనతను మొదట ఆమె గురువు ఇ.బి.విల్సన్ దక్కించుకున్నారు. పురుషుల్లోని లింగ నిర్ధారణ క్రోమోజోమ్‌ల ప్రభావాన్ని అర్థం చేసుకోవటానికి నెట్టీ స్టీవెన్స్ పేడ పురుగులపై పరిశోధనలు చేస్తున్నప్పుడు... పుట్టే బిడ్డ ఆడా, మగా అనేది నిర్ణయించేది పురుషుల క్రోమోజోమ్లేనని ఆమె కనుగొన్నారు. తల్లి అండంలో కేవలం ఎక్స్ క్రోమోజోమ్‌లు మాత్రమే ఉంటాయి. తండ్రి శుక్రకణాల్లో ‘వై’, ‘ఎక్స్’ క్రోమోజోములు రెండూ ఉంటాయి. తండ్రిలో ‘వై’ క్రోమోజోమ్ తల్లిలోని ‘ఎక్స్’తో కలిస్తే మగబిడ్డ; లేదా తండ్రిలోని ‘ఎక్స్’– తల్లిలో ఉండే ‘ఎక్స్’తో కలిస్తే ఆడబిడ్డ పుడతారని నెట్టీ స్టీవెన్స్ కనిపెట్టారు. నెట్టీ పరిశోధనను, మరికాస్త ముందు తీసుకువెళ్లటం వరకు మాత్రమే ఇ.బి.విల్సన్ పాత్ర పరిమితమై ఉన్నప్పటికీ అసలైన సృష్టికర్తగా ఆయనకే పేరు వచ్చింది.విండ్‌షీల్డ్ వైపర్లు1902లో, మేరీ ఆండర్సన్ (1866–1953) అలబామా నుండి న్యూయార్క్ నగరానికి కారులో ప్రయాణిస్తున్నారు. బాగా మంచు కురుస్తోంది. విండ్షీల్డుపై పడుతున్న ఆ మంచును మెత్తటి వస్త్రంతో తుడిచేందుకు డ్రైవర్ మాటిమాటికీ కారును రోడ్డు పక్కన ఆపవలసి వస్తోంది. అది చూసిన మేరీ ఆండర్సన్‌కు ఈ విండ్‌షీల్డ్ వైపర్ల ఆలోచన వచ్చింది. వెంటనే ఆ ఆలోచనకు పేటెంట్‌ను దాఖలు చేశారు.దురదృష్టవశాత్తూ ఆమె ఆవిష్కరణకు పెద్దగా ప్రాముఖ్యం లభించలేదు. ఇదీ ఒక ఇన్వెషనేనా అన్నారు. కొంతకాలం ఆమె పేటెంట్ గడువు ముగిసింది. తరువాత కొన్ని నెలల్లోనే అమెరికాలో ఎక్కడ చూసినా విండ్‌షీల్డ్ వైపర్లే! అంతేకాదు, విండ్‌షీల్డ్ వైపర్స్‌ను కనిపెట్టిన క్రెడిట్ రాబర్ట్ కియర్న్స్ అనే వ్యక్తికి దక్కింది! మేరీ ఎలిజబెత్ ఆండర్సన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆమెకు విస్తారంగా పాడి పంటల క్షేత్రాలు ఉన్నాయి. ద్రాక్ష తోటల్ని పెంచేవారు. నిరంతరం కారు ప్రయాణాలు చేస్తుంటారు. ఏమైనా.. విండ్‌షీల్డ్ వైపర్ సృష్టికర్త రాబర్ట్ కియర్న్స్ కాదని, మేరీ ఎలిజబెత్ అని త్వరలోనే ప్రపంచానికి నిజం తెలిసిపోయింది.కేంద్రక విచ్ఛిత్తి ‘కేంద్రక విచ్ఛిత్తి’ని కనుగొన్నందుకు ఒట్టో హాన్ అనే జర్మనీ శాస్త్రవేత్తకు 1944లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. నిజానికి ఆ బహుమతి దక్కవలసింది ఆయన సహోద్యోగి లిజ్ మీట్నర్కు! కేంద్రక విచ్ఛిత్తికి (న్యూక్లియర్ ఫిషన్) సైద్ధాంతిక వివరణను అందించింది అసలు లిజ్ మీట్నరే. యురేనియంలో మహా శక్తి ఉన్నట్లు కూడా ఆమే కనిపెట్టారు.ఒక పరమాణు కేంద్రకం రెండు లేదా అంతకన్నా ఎక్కువ పరమాణు కేంద్రాలుగా విడిపోయే ప్రక్రియే కేంద్రక విచ్ఛిత్తి. రేడియో ధార్మిక వికిరణం కంటే ఎక్కువగా అత్యధిక స్థాయిలో కేంద్రక విచ్ఛిత్తిలో శక్తి విడుదల అవుతుందని లిజ్ మీట్నర్ కనుగొన్నారు. ఆమె అందించిన సహకారం వల్లనే ఒట్టో హాన్ నోబెల్ సాధించగలిగారు.లిజ్ మీట్నర్ (1878–1968) ఆస్ట్రియన్–స్వీడిష్ అణు భౌతిక శాస్త్రవేత్త. వియన్నా విశ్వవిద్యాలయం నుండి భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ పొందిన రెండవ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. 1924–1948 మధ్య రసాయన శాస్త్రంలో 19 సార్లు, 1937–1967 మధ్య భౌతిక శాస్త్రంలో 30 సార్లు నోబెల్‌కు ఆమె నామినేట్ అయ్యారు.గ్రీన్హౌస్ ప్రభావంగ్రీన్హౌస్ ప్రభావం గురించి మాట్లాడేటప్పుడు, ఈ అద్భుతమైన విషయాన్ని కనుగొన్న వ్యక్తిగా బ్రిటిష్ శాస్త్రవేత్త జాన్ టిండాల్ పేరు తరచుగా ప్రస్తావనకు వస్తుంటుంది. అయితే, గ్రీన్హౌస్ ప్రభావాన్ని మొదట సిద్ధాంతీకరించి, దానిని రుజువు చేసింది నిజానికి అమెరికన్ మహిళా శాస్త్రవేత్త యునిస్ ఫూటే (1819–1888). విచారకరం ఏంటంటే – ఆమె కనిపెట్టిన ‘గ్రీన్హౌస్ ఎఫెక్ట్’ గురించి వివరించటానికి ఆమెకు అనుమతి లభించలేదు. దాంతో ఆమె తన పరిశోధనల గురించి మాట్లాడాలని ఒక పురుష సహోద్యోగిని అడగాల్సి వచ్చింది. 1856లోనే యూనిస్ ఫూటే గ్రీన్హౌస్ ఎఫెక్ట్‌ను కనిపెట్టారు. కానీ 1861లో దానిని కనిపెట్టిన జాన్ టిండాల్కు ప్రాధాన్యం లభించింది. భూవాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ వంటి వాయువులు సూర్యుని వేడిని సంగ్రహించి భూమికి హితంగా ఉండేంత మోతాదులో మాత్రమే ఉష్ణోగ్రతను స్వీకరించి, మిగతా కిరణాలను వెనక్కు పంపే సహజ ప్రక్రియే గ్రీన్హౌస్ ఎఫెక్ట్. (చదవండి: తిరిగొచ్చిన ఉంగరం! ఆరు దశాబ్దాలు జ్ఞాపకం..) -
తిరిగొచ్చిన ఉంగరం! ఆరు దశాబ్దాలు జ్ఞాపకం..
నీదైతే ఎక్కడికెళ్లినా నీ దగ్గరకు వస్తుంది. నీది కాకపోతే ప్రపంచం మొత్తం వెతికినా తిరిగి రాదు.’ అన్నట్లు.. అచ్చం ఒక ఉంగరానికి జరిగింది. 1969లో న్యూయార్క్‌లోని సీడార్ బీచ్‌లో అల్ఫ్రెడ్ డి స్టెఫానో అనే వ్యక్తి ఒక రోజు ఈత కొడుతున్నప్పుడు, అతని విలువైన క్లాస్ రింగ్ జారి నీటిలో పడిపోయింది. సముద్రంలో పడ్డ ఆ ఉంగరం, ఇక ఎప్పటికీ దొరకదని భావించి, దానికి మనసులోనే ఫుల్స్టాప్ పెట్టేసుకున్నాడు. కాని, కాలం మరో అద్భుతాన్ని దాచిపెట్టింది. దాదాపు 56 ఏళ్ల తర్వాత, డేవిడ్ ఓర్లొవ్స్కీ అనే మరో వ్యక్తి, మెటల్ డిటెక్టర్ పట్టుకుని బీచ్‌లో నిధి నిక్షేపాల కోసం వెతుకుతుండగా, అనుకోకుండా ఆ ఉంగరం అతని చేతికి చిక్కింది. మొదట అది సాధారణ ఆభరణమేమోనని అనుకున్నాడు. కాని, దానిపై చెక్కి ఉన్న పేరు, కాలేజీ గుర్తు చూసి ఆశ్చర్యపోయాడు. అదే సమయానికి, అతని భార్య ‘నువ్వు నీ ఉంగరం కోల్పోతే, దొరికిన వారు తిరిగి ఇస్తే ఎంత ఆనందిస్తావు?’ అని ప్రశ్నించింది. భార్య మాటలు అతన్ని కదిలించాయి. వెంటనే, ఉంగరం అసలు యజమాని కోసం వెతకడం ప్రారంభించాడు. అలా సోషల్ మీడియా సహాయంతో ఫేస్బుక్లో గాలించి, చివరికి డి స్టెఫానోకు ఆ ఉంగరం చేరేలా చేశాడు. దాదాపు ఆరు దశాబ్దాలుగా దాచుకున్న జ్ఞాపకం అకస్మాత్తుగా తిరిగి చేతిలోకి రావడంతో అతని కళ్లలో ఆనందబాష్పాలు వెల్లువెత్తాయి. (చదవండి: నీటికి బదులు బీర్! స్పెషల్ హైడ్రేషన్ స్టయిల్..) -
నీటికి బదులు బీర్!
ఒక్క రోజంతా నీరు తాగకుండా ఉంటే శరీరం మొత్తం డీహైడ్రేషన్ అయి, ఏ పని చేయలేం. కాని, అమెరికాకు చెందిన లోరీ మాత్రం ఎన్నో ఏళ్లుగా నీరే తాగడం లేదు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం! జిమ్‌లో రెండుసార్లు ఎక్కువ శ్రమ చేసి ఆసుపత్రిలో చేరినా, ఆమె నిర్ణయం ఏమాత్రం మారలేదు. సాదాసీదా నీటి కంటే కాఫీ, బీర్, రుచికరమైన పానీయాలే తనకు ఇష్టమని చెప్పేసి, లోరీ నీటిని పూర్తిగా మానేసింది. డాక్టర్లు దీన్ని ఒక మానసిక సమస్యగా చెప్తున్నారు. అందుకే ఆమె తనకంటూ ఓ ప్రత్యేకమైన హైడ్రేషన్ పద్ధతిని ఫిక్స్ చేసుకుంది. ఉదయం కాఫీతో మొదలు, మధ్యాహ్నం మరో కాఫీతో పాటు సాఫ్ట్ డ్రింక్స్, సాయంత్రం జిమ్ తర్వాత బీర్, రాత్రికి రెండు పుల్ల ఐస్‌క్రీమ్స్.. ఇదే ఆమె స్టయిల్. వీటన్నింటికీ రోజుకి దాదాపు నూటయాభై డాలర్లు, అంటే పదమూడు వేల రూపాయలకు పైగా ఖర్చవుతుంది. మంచినీరు తాగితే ఇంత ఖర్చు అవసరం లేదని తెలిసినా, ‘ఇవి నాకు నీటికి మించిన రుచితో హైడ్రేషన్ ఇస్తున్నాయి’ అని ఆమె సమర్థించుకుంటోంది. ఈ విషయం సోషల్ మీడియాలో తెలిసి కొందరు షాక్ అయ్యారు, కొందరు నవ్వుకున్నారు. కానీ లోరీ మాత్రం తన ప్రత్యేక హైడ్రేషన్ స్టయిల్‌కి కట్టుబడి, తనదైన రీతిలో ఆనందంగా జీవిస్తోంది. View this post on Instagram A post shared by 60 Second Docs (@60secdocs) (చదవండి: బియ్యపు గింజంత కంప్యూటర్!) -
బియ్యపు గింజంత కంప్యూటర్!
ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లు ఇవన్నీ పెద్దవిగా అనిపిస్తున్నాయా? అయితే రెడీగా ఉండండి! ఇప్పుడు ప్రపంచంలోనే అతి చిన్న కంప్యూటర్ వచ్చేసింది. అది కూడా ఒక బియ్యపు గింజ కంటే చిన్నది. అమెరికాలోని మిషిగన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని రూపొందించారు. కేవలం 0.3 మిల్లీమీటర్లు పరిమాణంలో ఉంటుంది. కాని, ఇది చేసే పనులు తెలిస్తే, పెద్ద పెద్ద కంప్యూటర్లు కూడా షాక్ అవుతున్నాయి. అంతేకాదు, ఈ సూక్ష్మ యంత్రాన్ని శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తే, ఇది క్యాన్సర్ కణాలను గమనిస్తుంది. క్యాన్సర్ కణితి లోపలి ఉష్ణోగ్రతను కొలుస్తుంది, ఇంకా డాక్టర్లకు రియల్‌టైమ్ డేటా పంపిస్తుంది. అంటే ఇది డాక్టర్ జేబులో దాగి ఉన్న గూఢచారిలా పనిచేస్తుంది. ప్రస్తుతం ఇంకా పరిశోధన దశలో ఉన్న ఈ కంప్యూటర్, భవిష్యత్తులో పర్యావరణ పరిశీలన, భద్రతా సెన్సర్లు, ఇంకా మన ఊహలకు మించి ఉండే స్మార్ట్ పరికరాల్లోనూ తన మాయాజాలాన్ని చూపబోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. (చదవండి: సూట్‌కేస్ ఓపెన్ చేస్తే.. లైట్ ఆన్!) -
చావుతెలివి!
ఇన్సూరెన్స్ కోసం హత్యలు చేసిన వాళ్లని; ఆస్తులు తగలపెట్టుకున్న వాళ్లని; అక్రమాలకు పాల్పడిన వాళ్లని చూస్తూనే ఉంటాం. వీటన్నింటికీ భిన్నమైన వ్యవహారం 2012లో చోటు చేసుకుంది. అమెరికాలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ప్రవాస భారతీయుడు (ఎన్నారై) ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. వీటి నుంచి బయటపడటానికి తనపై ఉన్న ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడమే మార్గమని భావించాడు. దీనికోసం తానే చనిపోయినట్లు కథ అల్లాడు. దీనికి సంబంధించిన వ్యవహారం ఆద్యంతం పక్కాగానే నడిచినా, ఇన్సూరెన్స్ కంపెనీ క్రాస్ వెరిఫికేషన్‌లో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. ఈ హైడ్రామాలో సూత్రధారితో పాటు పాత్రధారులుగా ఉన్న ఓ వైద్యుడు, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) సిబ్బందికీ ఉచ్చు బిగిసింది. హైదరాబాద్ నగర శివార్లలోని రాజేంద్రనగర్‌లో ఉన్న హైదర్‌గూడ ప్రాంతానికి చెందిన సోమారం కమలాకర్ రెండో కుమారుడు రాజ్‌కమల్. ఇతడికి తొమ్మిది నెలల వయస్సు ఉన్నప్పుడే ఆ కుటుంబం అమెరికాకు వలస వెళ్లి మేరీలాండ్‌లో స్థిరపడింది. కమలాకర్ మేల్ నర్స్‌గా, ఆయన భార్య స్టాఫ్ నర్స్‌గా పని చేసేవాళ్లు. రాజ్‌కమల్ అక్కడే ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. ఇతడి తల్లి అక్కడ ఓ ఇల్లు కొనుగోలు చేయడానికి అప్పులు చేసింది. ఆ అప్పులతోనే తిప్పలు ప్రారంభమయ్యాయి. అప్పులకు తోడు వడ్డీలు పెరిగిపోవడంతో ఆ కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఓ దశలో రాజ్‌కమల్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల కార్డులన్నీ బ్లాక్ అయిపోయాయి. దీంతో గత్యంతరం లేక అతడి సన్నిహితురాలైన శ్రీలంక జాతీయురాలికి చెందిన కార్డుల్నీ వినియోగించేశాడు. దీంతో మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోయాడు.రాజ్‌కమల్ అమెరికాలోని మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 75 వేల డాలర్లు (దాదాపు రూ.15 లక్షలు) విలువైన పాలసీ తీసుకున్నాడు. దీనికి తన సోదరిని నామినీగా పెట్టాడు. 2012లో రాజేంద్రనగర్‌లోని స్వస్థలానికి వచ్చిన రాజ్‌కమల్ అప్పుల బాధ నుంచి బయటపడటానికి ఉన్న మార్గాలను అన్వేషించాడు. ఇక్కడే తాను చనిపోయినట్లు నాటకమాడి, అందుకు అవసరమైన ధ్రువీకరణలు సంపాదించాలని పథకం వేశాడు. వీటిని దాఖలు చేయించడం ద్వారా అమెరికాలో ఉన్న ఇన్సూరెన్స్‌లు క్లెయిమ్ చేసుకోవాలని కుట్రపన్నాడు. దీన్ని అమలులో పెట్టడానికి సహకరించాల్సిందిగా రాజేంద్రనగర్‌లోని శివరామ్‌పల్లిలో నివసించే తన బంధువు, అప్పట్లో జీహెచ్ఎంసీ ఉద్యోగి అయిన ప్రసన్నకుమార్‌ను సంప్రదించాడు. రాజ్‌కమల్ ‘చావు’కు సహకరించడానికి ప్రసన్నకుమార్ అంగీకరించారు. ఈ హైడ్రామాకు అవసరమైన పత్రాల సమీకరణ కోసం ఈ ద్వయం అనేక ఫోర్జరీలు చేసింది. ప్రసన్నకుమార్ తొలుత హైదర్‌గూడలో ఓ నర్సింగ్‌హోమ్ నిర్వహించే తన పరిచయస్తుడిని సంప్రదించాడు. బాగా కావాల్సిన వారి తరఫు వారు మృతి చెందారని, డెత్ సర్టిఫికెట్ కావాలని కోరాడు. నిజమని నమ్మిన ఆయన పూర్వాపరాలు పట్టించుకోకుండా, అంగీకరించారు. ఇలా రాజ్‌కమల్ పేరుతో డెత్ సర్టిఫికెట్ సిద్ధమైంది. 2012 డిసెంబర్ 12న ప్రసన్న కుమార్‌కు కుమారుడు పుట్టి చనిపోయాడు. ఆ శిశువును శివరామ్పల్లిలోని శ్మశాన వాటికలో ఖననం చేశారు. ఈ ధ్రువీకరణలను ఫోర్జరీ చేయడం ద్వారా రాజ్‌కమల్‌ను ఖననం చేసినట్లు పత్రాలు సృష్టించారు. వీటి ఆధారంగా రాజేంద్రనగర్ జోన్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో పని చేసే కుమార్‌ను సంప్రదించారు. అతడి ద్వారా జీహెచ్ఎంసీ రికార్డుల్లోకి ఈ మరణాన్ని జొప్పించారు. ఆపై ఈ–సేవ కేంద్రం నుంచి రాజ్‌కమల్ చనిపోయినట్లు మరణ ధ్రువీకరణ పత్రం పొందారు. ఇవన్నీ కలిపి రాజ్‌కమల్ చనిపోయినట్లు మెట్‌లైఫ్ కంపెనీకి తన స్నేహితుడి ద్వారా క్లెయిమ్ పంపారు. రాజ్‌కమల్ చనిపోయినట్లు వచ్చిన క్లెయిమ్ పత్రాలను ఇన్సూరెన్స్ కంపెనీ సైతం పరిగణనలోకి తీసుకుంది. అయితే నగదు విడుదల చేయడానికి ముందు ప్రాథమిక పరిశీలన చేపట్టింది. ఇందులో భాగంగా హైదర్‌గూడలోని సదరు నర్సింగ్‌హోమ్ అధిపతిని సంప్రదించింది. కంపెనీ అడిగిన ప్రశ్నలకు, ఆయన చెప్పిన సమాధానాలకు పొంతన లేకపోవడంతో కథ అడ్డం తిరిగింది. దీంతో అనుమానం వచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీ తమ ప్రతినిధుల్ని రంగంలోకి దింపి లోతుగా ఆరా తీయించింది. ఇలా రాజ్‌కమల్ ‘చావు’తెలివి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ నేపథ్యంలో నేరం జరిగినట్లు గుర్తించిన పోలీసులు రాజ్కమల్తో పాటు ప్రసన్నకుమార్, కుమార్ తదితరులపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై జీహెచ్ఎంసీ అధికారులూ అంతర్గత విచారణ చేశారు. బాధ్యుల్లో కొందరిని సస్పెండ్ చేయడంతో పాటు మరికొందరిని విధుల నుంచి తొలగించారు. -
ఈ వారం కథ: ఒక్క క్షణం!
నిత్యకు పెళ్లి చూపులు. పెళ్లిచూపులు అనగానే సాధారణంగా వయసొచ్చిన ఏ ఆడపిల్ల మొహంలోనైనా పెళ్లి కళ ఉట్టిపడే మెరుపు కనిపిస్తుంది. దానికి భిన్నంగా నిత్య మొహంలో ఏదో టెన్షన్!నిత్య భయాందోళనలకు కారణం వచ్చిన సంబంధం నచ్చకపోవడం కాదు – మొదటిసారి పెళ్లి చూపుల పేరుతో మగపెళ్లివారి ముందు కూర్చోవడం. పెళ్లి వయసు వచ్చిన తర్వాత ఎన్ని సంబంధాలు వచ్చినా, తల్లి తాయారమ్మ వాటిని నిత్య నిర్ణయం వరకు రానివ్వలేదు. అందం, గుణం, చదువు అన్నిటిలోనూ ముందు వరసలో నిలిచే ఒప్పుల కుప్ప నిత్య. అలాంటి నిత్యను పెళ్లి చేసుకోవడానికి ఒక మాదిరి వరుడెవరూ సరిపోడని, నవలా నాయకుడు వంటి వాడు రావాలని తాయారమ్మ దృఢమైన అభిప్రాయం. అందువల్లనే వచ్చిన సంబంధాలన్నీ తాయారమ్మ వడపోతలోనే వీగిపోతున్నాయి. కాని, ఈసారి వచ్చిన జానకి రామయ్య సంబంధం బంగారం లాంటిదని, దీనిని కాదనడం అదృష్ట దేవత తలుపు తడుతుంటే తెరవక పోవడమేనని పెళ్లిళ్ల పేరయ్య మరీ మరీ చెప్పడంతో తాయారమ్మ కొంచెం మెత్తబడింది. పెళ్లిచూపులు ఏర్పాటు చెయ్యడానికి ఒప్పుకుంది.ఎప్పుడూ యెటువంటి పరీక్షల భయం లేకుండా, నల్లేరు మీద నడకలా ‘బి.టెక్.’ వరకు నిరాటంకంగా ఉత్తీర్ణురాలవుతూ పట్టా తీసుకున్న నిత్యకు పెళ్లి చూపుల పరీక్ష అంటే భయం పట్టుకుంది. తీరా వరుణ్ణి చూసిన తర్వాత తన నిర్ణయం చెప్పడానికి, బాగోగులు చర్చించి సలహాలివ్వడానికి తల్లి, అన్నయ్య మాత్రమే ఉన్నారు. అన్నయ్య చందు సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆఫీసులో అత్యవసరమైన పని తగిలిందనీ, సమయానికి వచ్చేస్తాననీ, ఈలోగా ముహూర్తం ప్రకారం తంతు కానివ్వమనీ ఫోన్ చేశాడు. ఒకవేళ చందు రావడం ఆలస్యమయితే ఈలోగా ఏ మాటా చెప్పమని అవతలి వాళ్లు వొత్తిడి చేస్తే – అమ్మ మాత్రమే గతవుతుంది. కాని అమ్మ ఏ విషయంలోనూ ఓ పట్టాన నిర్ణయం తీసుకోలేని నిత్యశంకితురాలు.తల్లి ఆమె పెళ్లి విషయంలో తీసుకున్న నిర్ణయానికి యిప్పటికీ బాధపడుతుండడం తనకు తెలుసు. అందువల్ల పూర్తిగా తల్లి మీద ఆధారపడ్డం కంటె మరొకరెవరైనా వుంటే మంచిదని నిత్య చిన్నప్పటి నుంచి తనతో కలిసి చదువుకొన్న సత్యను తోడుగా రమ్మని పిలిచింది. సత్య కుటుంబం వుండేది పక్క వీథిలోనే గనుక ఆమె పిలిచింది తడవుగా వచ్చింది. సత్య కూడా నిత్య ఈడుదే గనుక ఆమెను పెళ్లిచూపుల్లో పక్కన కూర్చోపెట్టుకోవద్దని తాయరమ్మ నిత్యను చాటుకు పిల్చి చెప్పింది. తల్లి ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న నిత్య తనకే విషయంలోనూ సత్య పోటీ కాదని, కొత్తవాళ్ల ముందు తను ‘నెర్వస్’ కాకుండా ఆమె తోడుగా వుంటుందని తన చర్యను సమర్థించుకొంది.నిత్యతో పోలిస్తే సత్య అంత తెలివైంది కాదు. పరీక్షల్లో మాత్రం యెక్కడా తప్పకుండా తను కూడా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అనిపించుకుంది. సత్య తల్లిదండ్రులిద్దరూ ఒక పేరున్న ప్రైవేట్ హాస్పిటల్ లో పనిచేస్తున్నారు. కాంపౌండర్ గా పనిచేస్తున్న సత్య తండ్రి తాగుడు వ్యసనంతో విధులకు సరిగా హాజరు కాకపోయినా, డాక్టర్ గారు పట్టించుకోరని, నర్స్‌గా మంచి నైపుణ్యం వున్న సత్య తల్లి శకుంతలను మాత్రం ఆయన ప్రత్యేకాభిమానంతో చూస్తారని జనం చెప్పుకుంటారు. ఆ అభిమానానికి అక్రమసంబంధం కూడా కారణమని డాక్టర్ ఆంతరంగికులు చెవులు కొరుక్కుంటారు. నిజానిజాల మాటెలావున్నా సత్య కుటుంబ నేపథ్యం మీద సదభిప్రాయం లేని తాయారమ్మ సత్య తరచుగా తమ యింటికి రావడానికి యిష్టపడదు. చనువు పెరిగితే కొడుకు చందుకు సత్య యెక్కడ వల వేస్తుందోనని కూడా తాయారమ్మ అనుమానం.సిద్ధాంతిగారు పెట్టిన ముహూర్త సమయానికి వధువును చూపించాలని పెళ్లిళ్ల పేరయ్య అవధాని తొందర పెట్టడంతో ఆ చాదస్తం నచ్చక విసుక్కుంటున్న నిత్యను బతిమాలి మగపెళ్లివారి ముందుకు తీసుకెళ్లింది తాయారమ్మ. నిత్య కోరిక ప్రకారం సత్య కూడా ఆమెకు తోడుగా వెళ్లింది. పెళ్లికూతుర్ని చూడ్డానికి వరుడు జానకిరామయ్య కూడా అతని చిన్నాన్న, పిన్ని మాత్రమే వచ్చారు. తల్లి సూచన మేరకు సంప్రదాయాన్ని పాటిస్తూ తలవంచుకుని కూర్చున్న నిత్యను తలెత్తి వరుణ్ని చూడమన్నట్టు గిల్లి, సైగ చేసింది సత్య. వరుడు జానకి రామయ్య వంక నిత్య ఓరగా చూసింది. డ్రెస్సింగ్ విషయంలో సింపుల్ గా వున్నా, అందమైనవాడే అనుకుంది. మధ్యవర్తి అవధాని ముందుగానే వర్ణించి చెప్పినట్టు లక్షణంగా వున్న నిత్యను చూసి పెళ్లికొడుకు చిన్నాన్న, పిన్ని పెళ్లికొడుకు అభిప్రాయాన్ని ప్రత్యేకంగా అడక్కుండానే తమకు నచ్చినట్టు కళ్లతో వ్యక్తం చేశారు. అదను చూసుకొని అవధాని ఇరుపక్షాలను వుద్దేశించి పరిచయ ప్రసంగం ప్రారంభించాడు.‘అయ్యా, నేను ముందే మనవి చేసినట్టు వధూవరులు ఒకరికొకరు సరిపోతారు. అమ్మాయిని చూశారు కదా! సాక్షాత్తూ మహాలక్ష్మే. తన చదువు సంధ్యల గురించి, గుణగుణాల గురించి తెలియజేసిన తర్వాతే తమను తీసుకొచ్చాను. ఇక అబ్బాయి పేరుకు తగ్గట్టుగానే అపర శ్రీరామచంద్రుడు. ఈ కాలంలో వుండాల్సిన కుర్రాడు కాదు. పోతే ఇతని చిన్నతనంలోనే తల్లి దండ్రులు గతించడం వల్ల పిన్ని బాబాయిల పెంపకంలో పెరిగాడు. ఇక్కడి చదువులు సరిపోక ఢిల్లీలో వుండి సివిల్ సర్వీసెస్ పరీక్షలకు చదువుతున్నాడట. ఆరోగ్యం దృష్ట్యా వండి పెడుతూ ఆలనా పాలనా చూసేవాళ్లుంటే చదువుమీద దృష్టి పెట్టడానికి వీలుగా వుంటుందని పెళ్లిప్రయత్నాలు ప్రారంభించారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఏ జిల్లా కలెక్టరో అవుతాడు. ఇంతవరకు కల్యాణ ఘడియలు రాకపోవడం వల్ల ఈ సంబంధం మీ వరకు వచ్చింది...!’’అవధాని చెప్పడం పూర్తికాకుండానే వరుడి బాబాయి శివయ్య కలిగించుకొని వరుడి విషయంలో తమ పాత్ర గురించి తెలియజేశాడు.‘పూర్వజన్మలో యెంతో పుణ్యం చేసుకుంటే తప్ప మా జానకిరాముడు లాంటి బుద్ధిమంతుడు భర్తగా దొరకడు. మా అన్నయ్యకిచ్చిన మాట ప్రకారం పెంచి పెద్ద చెయ్యడం తప్ప పెళ్లయాక తనమీద మా పెత్తనం కూడా వుండదు. తన తెలివికి, చదువు మీద శ్రద్ధకూ తప్పకుండా కలెక్టరు అవుతాడని అందరూ అంటున్నారు. ఒకవేళ వుద్యోగం లేకపోయినా మా వాడు బతకడానికి లోటులేని ఆస్తి, అతని వాటామీద నేను కూడబెట్టిన డబ్బు వున్నాయి. అందువల్ల కట్నకానుకలు కూడా మేము ఆశించడం లేదు. అమ్మాయి మాకు నచ్చింది. మీరు అమ్మాయిని లోపలకు తీసుకెళ్లి అభిప్రాయం తెలుసుకుంటే నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టుకుందాం...’’‘‘అమ్మా నిత్యా, అన్నీ విన్నావు కదా. అయినా అబ్బాయితో కూడా మాట్లాడతానంటే లోపలకెళ్లి మాట్లాడుకోవచ్చు. ఉభయులూ చదువుకున్నవాళ్లు గనుక ముందుగా మనసులు విప్పి మాట్లాడుకోవడంలో తప్పు లేదు...’’ అంటూ అవధాని చేసిన ప్రతిపాదనను ఆ అవసరం లేదన్నట్టు యిద్దరూ సున్నితంగా తిరస్కరించారు.నిత్యను లోపలకు తీసుకెళ్లిన తర్వాత ముగ్గరి మధ్య పెళ్లికొడుకు గురించిన చర్చ ప్రారంభమైంది.‘‘పెళ్లి కొడుకు బొత్తిగా నోట్లో నాలుకలేని మెత్తని మనిషిలా వున్నాడు’’ అంటూ ముందుగా తాయారమ్మ అనుమానాన్ని వ్యక్తం చేసింది.‘‘అవసరం లేనిదే నోరువిప్పని అల్లుడు దొరికితే మీకే మంచిది కదా ఆంటీ. చీటికీ మాటికీ గొంతెమ్మ కోర్కెలు కోరకుండా వుంటాడు. ఆ పైన సంసారంలో ఆడదాని మాటే చెల్లుతుంది.’’ సత్య పెళ్లికొడుకు మౌనాన్ని సమర్థించింది.‘‘నాకయితే పెళ్లికొడుకు తెగ నచ్చేశాడు. ఇలాంటి బుద్ధుడు దొరికితే నేనెగిరి గంతేసి చేసుకుంటాను. నిత్యా, నీకు ఓకేనా? ఏమైనా అనుమానాలున్నాయా?’’ సత్య నిత్యను కదిలించింది.‘‘ముసలోడి పేరులా ఆ పాత తరహా పేరు నచ్చలేదు. కళ్లజోడు పెట్టుకోవడం వల్ల యెక్కువ వయసున్నవాడిలా కనిపిస్తున్నాడు. పెళ్లిచూపుల్లో నయినా ‘షూ’ వేసుకొని ‘ఇన్ షర్ట్’ చేసుకొని రాలేదంటే అచ్చటా ముచ్చటా తెలియని అడవిమనిషిలా వున్నాడు. ఇంకా...’’‘‘ఊ... ఇంకా ఈ కాలపు కుర్రాళ్లలా ఫ్యాషన్ పేరుతో గడ్డం పెంచి బూచాడి అవతారంలో రాలేదు. లేకపోతే ఏమిటీ నీ సిల్లీ డౌట్స్? అబ్బాయి నీట్‌గా ‘హేండ్సమ్’గా పాత సినిమాల్లో హీరోలా వున్నాడు. ఈ ఆఫర్ నీకు ‘జాక్ పాట్’ లాంటిది ఎక్కువగా ఆలోచించక ముందు ‘ఊ’ అను...’’సత్య హితోపదేశం పూర్తి కాకుండా తలుపు తోసుకొని అవధాని లోనికొచ్చాడు.‘‘ఏమ్మా? మీ ఆలోచనలింకా తెమల్లేదా? మగపెళ్లివారు మీ నుంచి తీపికబురు కోసం యెదురు చూస్తున్నారు. సాధారణంగా పెళ్లిచూపుల్లో ఆడపిల్ల యిష్టం తెలుసుకోకుండా పెళ్లికొడుకు తరఫువాళ్లు ‘స్పాట్’లో అవునో కాదో తేల్చకుండా తర్వాత కబురు చేస్తామని వెళ్లిపోతారు. అలాంటిది వీళ్లు మంచివాళ్లు గనుక ముందుగా తాము ‘సరే’ అని, ఆ తర్వాత పెళ్లి కూతురికి నోరు విప్పే స్వేచ్ఛనిస్తున్నారు. నిజానికి యిప్పుడు కాకపోతే మూడేళ్ల వరకు వివాహం జరగదని సిద్ధాంతి హెచ్చరించకపోతే యిప్పుడీ సంబంధం మీ వరకు వచ్చేది కాదు. అబ్బాయి ఏ వ్యసనాలు లేని వజ్రం. అత్త పెత్తనం, ఆడబిడ్డ పోరు లేవు. అందువల్ల మీరు యెక్కువగా ఆలోచించి సంబంధం దాటపెట్టుకోకండి. ఏ వయసులో ఆ ముచ్చట ఆ వయసులో జరగాలి. మీరు అవునంటే ఈ శుభవార్త వారికి చెప్పేస్తాను. ‘ఆలస్యాత్ అమృతం విషం’ అన్నారు. ఏం తాయారమ్మగారూ, సరేనా?...’’అటు సత్య, యిటు అవధాని ‘బ్రెయిన్ వాష్’ చెయ్యడంతో తల్లీ కూతుళ్లిద్దరూ సానుకూలమైన ధోరణికి వచ్చారు. తాయారమ్మ అవధానికి ‘సరే’ అని చెపుదామని నోటి చివరి వరకు వచ్చేసరికి చందు హడావిడిగా వచ్చి వాళ్లలో చేరాడు. కొడుకు సమయానికి రావడం శుభసూచికంగా భావించిన తాయారమ్మ పెళ్లికొడుకు వివరాలు అతనికి చెప్పి అంతిమనిర్ణయం అతనికి విడిచిపెట్టి వూగిసలాట నుంచి బయటపడింది. చందు పెళ్లివారి దగ్గరకెళ్లి, తనను పరిచయం చేసుకొని పెళ్లికొడుకుతో మాట్లాడి, తిరిగి లోపలకొచ్చి తల్లికి, చెల్లికి తన అభిప్రాయం తెలియజేశాడు.‘‘సంబంధం నిస్సందేహంగా మంచిదే. కాని ‘సివిల్ సర్వీసెస్’ పరీక్ష లాటరీ లాంటిది. దానిలో సక్సెస్ కావడానికి ‘మెరిట్’తో పాటు అదృష్టం కూడా కలసిరావాలి. దానినే లక్ష్యంగా పెట్టుకొని సాధించలేక చతికిలపడిన మేధావులెందరో వున్నారు. సో, నిత్యకింకా వయసు దాటిపోలేదు గనుక రెండేళ్లు ఆగగలిగితే ఈ సంబంధం చేసుకుందాం...’’అసలే చప్పున ఏ నిర్ణయమూ తీసుకోలేని తాయారమ్మకు ‘కర్ర విరక్కుండా పాము చావకుండా’ రీతిలో కొడుకు చెప్పిన మాటలు రుచించాయి. అవధాని ద్వారా విషయం విన్న పెళ్లివారు నిరాశగా వెనుదిరిగారు!తాయారమ్మకు నలభయ్యేళ్ల నాటి తన పెళ్లి సంగతి గుర్తొచ్చింది. క్లాసులో యెప్పుడూ ఫస్ట్ వచ్చే తనను పెళ్లీడు వచ్చిందని సవతితల్లి చదువు మానిపించి సంబంధాలు వెతకడం ప్రారంభించింది. తండ్రి ఆమెకెదురు చెప్పలేని నిస్సహాయుడు. ఎవరో ఒకడికి కట్టబెట్టి తనను వదిలించుకోవడమే ధ్యేయంగా ఆమె అడ్డమైన సంబంధాలకు యెగబడేది. అలా తెచ్చిన సంబంధాలలో గుడ్డిలో మెల్లలాంటిది వెంకటేశ్వర్లు మాష్టారిది. ‘గవర్నమెంటు వుద్యోగం, నీ మొహానికి యింతకంటె యెవరొస్తారు, ఒప్పుకో’మని సవతితల్లి అనసూయ బలవంతపెట్టింది. తండ్రి కూడా భార్యా విధేయతతో తనకు సర్ది చెప్పబోయాడు. అయినా, నల్లగా నాజూగ్గా లేని వరుణ్ని చూసి తను యిష్టపడలేదు. ధైర్యం చేసి నచ్చలేదని చెప్పబోతుండగా సమయానికి గుమ్మంలోకొచ్చిన వరసకు అన్నయ్య అయిన రాఘవులు కలుగజేసుకొని పెళ్లికొడుకు స్థితిగతులు తెలుసుకొని ‘ఫర్వాలేదు, చేసుకొ’మ్మని సలహాయిచ్చాడు. తన శ్రేయోభిలాషి అయిన రాఘవులు మీద నమ్మకంతో ‘సరే’ అంది. కాని పెళ్లయిన యేడాది తిరక్కుండానే వెంకటేశ్వర్లు రంగు బయటపడింది. అతను పచ్చి తాగుబోతు, పేకాటరాయుడు. బతికిన ఆరేడేళ్లు నరకం చూపించి ‘లివర్ సిరోసిస్’తో చనిపోయాడు. అప్పటి నుంచి అతని పెన్షన్, తను వెతుక్కున్న కాన్వెంట్ టీచర్ వుద్యోగం ఆధారంగా పిల్లలు చందు, నిత్యను ఏలోటు యెరక్కుండా పెంచి, చదివించింది. రాఘవులు మాట మీద మొగ్గి ఆ క్షణంలో తప్పుడు నిర్ణయం తీసుకోకపోతే తన బతుకిలా కాలిపోయేది కాదని జీవితం పొడుగునా మథనపడేది అందుకే. తన కూతురు నిత్య జీవితమైనా తనలా కాకూడదని ఆమె పెళ్లి విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలనే నిశ్చయంతోనే – నిత్య కొస్తున్న సంబంధాలన్నిటినీ మొగ్గలోనే తుంచేసింది!జానకిరామయ్య సంబంధాన్ని కాదనడంలో తన నిర్ణయం సరయినదేనని తృప్తిపడిన తాయారమ్మ వారం తిరక్కుండా ఒక వార్త తెలిసి నిర్విణ్ణురాలైంది. జానకిరామయ్యకి పెళ్లి కుదిరిందనీ పెళ్లికూతురు యెవరో కాదు – సత్య అని రూఢిగా తెలిసిన తాయారమ్మ ఆవేశంతో చిందులు తొక్కింది. ముందుగా తన మాట లెక్కచెయ్యకుండా పెళ్లి చూపులకు సత్యను తోడుగా తెచ్చుకున్న నిత్యను చీవాట్లు పెట్టింది. ఆ తర్వాత మా కొచ్చిన సంబంధాన్ని లాక్కొన్నారంటూ సత్య కుటుంబం మీద తగవుకు వెళ్లింది. ఆఖరి ప్రయత్నంగా అవధానిని పిల్చి, తాము పొరపాటు చేశామని యెలాగైనా చేజార్చుకున్న సంబంధాన్ని తిరిగి నిత్యకు ఖాయం చెయ్యమని బతిమాలింది. డబ్బు ఆశ చూపి ప్రలోభపెట్టింది. కాని మాట తప్పడానికి మగపెళ్లివారు అంగీకరించలేదు. వాళ్ల తిరస్కారానికి అవమానంతో రోషంతో రెచ్చిపోయిన తాయారమ్మ నిత్యకు అంతకంటె పదిరెట్లు మంచి సంబంధం చేస్తానని సవాల్ విసిరింది.ఆనాటి నుంచి నిత్యకు యెన్ని సంబంధాలు వచ్చినా, వాటిని తప్పిపోయిన జానకిరామయ్య సంబంధంతో పోల్చి, తన గీటుకు రాక తాయారమ్మ తిరస్కరిస్తూనే వుంది. నిత్య తల్లి మాటను కాదని స్వతంత్ర నిర్ణయం తీసుకోలేకపోతోంది. అలా క్రమంగా యేళ్లు గడుస్తున్న కొద్దీ నిత్య వయస్సు ముప్పైలోకి రావడంతో సీను మారిపోయింది. అంత వయసున్న పెళ్లికొడుకులు దొరక్కపోవడంతో రెండోపెళ్లి సంబంధాలు రావడం తాయారమ్మను కలవరపరిచింది.సత్య జానకిరామయ్యల కల్యాణ శుభలేఖ మొదలుకొని అనేక సందర్భాలకు ఆ జంట నుంచి నిత్యకు, తాయారమ్మకు ఆహ్వానాలు అందుతూనే వున్నాయి. వాటిలో అతి ముఖ్యమైంది జానకిరామయ్య ఐఏఎస్‌కు సెలక్ట్ కావడం. ఒక్కక్షణం నిదానించకుండా చేజేతులా జారవిడుచుకున్న అదృష్టాన్ని తలచుకొని స్వయంకృతాపరాధానికి అవ్యక్తమైన ఆవేదనతో అనుక్షణం కుమిలిపోతున్న తల్లీ కూతుళ్లు సత్యకి సంబంధించిన ఏ వేడుకలకు హాజరుకావడం లేదు. ఇటీవల సత్య జానకిరామయ్య దంపతులు తమ ఏకైకపుత్రిక నిశ్చితార్థానికి రావలసిందిగా స్వయంగా వచ్చి యిచ్చిన ఆహ్వానపత్రిక చూసి నిత్య మనసు వుద్విగ్నభరితమైంది. చూస్తుండగానే నలభైయ్యేళ్ల వయసు మీద పడిన కుమారి నిత్య కన్నీటి బొట్లు పడిన ఆ ఆహ్వానం ఆమెను అవహేళనం చేస్తున్నట్టుంది...! -
తిండిలో మనోళ్లు పిండియన్స్
ఆరోగ్యంగా జీవించాలంటే అన్ని పోషకాలూ సమపాళ్లలో తీసుకోవటం అవసరమని తెలిసినా వాటి గురించి పట్టించుకుంటున్న వారు కొందరే. మన ఆహారంలో రోజుకు 55% పిండి పదార్థాలు, 30% కొవ్వు పదార్థాలు, 15% మాంసకృత్తులు ఉండాలని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సిఫారసు చేసింది. అయితే, మనం చౌకగా దొరుకుతున్నాయి కదా అని 62% పిండి పదార్థాలతో పొట్ట నింపేస్తున్నాం. మాంసకృత్తులను తక్కువగా (11.5%) తింటున్నాం. అవసరానికి మించి మనం తినే నూనెలతో పాటు పిండి పదార్థాలు కూడా కొవ్వుగా మారి మన దేహాల్లో, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోతున్నాయి. ఈ ‘పిండి కొవ్వు’ పుణ్యమే అధిక బరువు, ఊబకాయం, బీపీ, షుగర్, గుండె జబ్బులు వంటి ఆరోగ్య సమస్యలు. ఈ విధంగా తిండి సరిలేక రోగాల బారిన పడుతున్న వారిలో పిల్లలు, పెద్దలని, ఆడా మగా అనే తేడా లేదు. ఇప్పటికైనా మేలుకొని పిండి పదార్థాలను 5%వరకైనా తగ్గించి, ఆ మేరకు మాంసకృత్తులను పెంచితే ఆరోగ్యం మెరుగవుతుందని, జబ్బుల మోత కొంతైనా తగ్గుతుందని ఐసీఎంఆర్ నిపుణులు సూచిస్తున్నారు. ఇది సరే. ఆహారాన్ని ‘సమతూకంగా తీసుకోవాల’ని నిపుణులు సూచిస్తున్నప్పటికీ.. అదెలా పాటించాలన్నది స్పష్టంగా తెలుసుకోలేక దొరికింది తిని ఎలాగోలా బతుకు బండి లాగించేస్తున్నాం. మనలో చాలామంది ఈ కోవలోని వారే! అసలు తిండిలో పిండి పదార్థాలను తగ్గించటం ఎలా? మాంసకృత్తులను పెంచుకోవటం ఎలా? ఈ మార్పులను ఏ విధంగా వర్కవుట్ చేసుకోవాలి?అపసవ్య ఆహారంతో కొనితెచ్చుకున్న జబ్బుల్ని ఆహారంలో గుణాత్మక మార్పులతో తగ్గించుకునేదెలా?.. ఈ విషయాలపై అవగాహన కల్పించే ప్రయత్నమే ఈ కథనం.ఆరోగ్యంగా జీవించటం వ్యక్తి బాధ్యత ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో)వ్యక్తి ఆరోగ్యం చాలా వరకు ఆహార విహారాలపైనే ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి ఒక పదార్థాన్ని లేదా ఒక అలవాటును నియంత్రించలేని కోరికతో, హానికరమైన పరిణామాలు ఎదురవుతున్నప్పటికీ, బలవంతంగా ఉపయోగించటాన్నే ‘వ్యసనం’ అనుకోవచ్చు. ఈ వ్యసనం మెదడు పనితీరును మార్చి, స్వయం నియంత్రణను బలహీనపరుస్తుంది. మనిషిని చుట్టుముట్టే వ్యసనాలు వివిధ రూపాల్లో ఉంటాయి. జూదం, షాపింగ్ వంటివి ప్రవర్తన వ్యసనాలు. మద్యం, డ్రగ్స్.. వంటివి పదార్థ వ్యసనాలు. మనం అనుసరిస్తున్నది పిండి పదార్థాలకు పెద్దపీట వేసే ఆహార పద్ధతి. కొవ్వుతో పాటు పిండి పదార్థాలను కూడా మితంగానే తినాలి. కాని, ఎంత పడితే అంత తింటున్నాం. ముఖ్యంగా తెల్ల వరి అన్నానికి! మనకు ఇదెలాగో ఉత్తరాది వారికి గోధుమ రొట్టె అలా! ఆ విధంగా మనం ‘పిండి వ్యసన’ పరులమై అతిగా బరువెక్కి, రోగాల బారిన పడుతున్నాం.పిండి పదార్థంతోనూ కొవ్వు పెరుగుతుందని తెలుసా?దేహం అవసరాలకన్నా ఎక్కువగా తిన్న పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు మన శరీరంలో వివిధ రూపాల్లో కొవ్వుగా పేరుకుంటున్నాయి. కేవలం కొవ్వు పదార్థాల వల్లనే శరీరంలో కొవ్వు పెరుగుతోందన్న అపోహ చాలా మందిలో ఉంది. అవసరానికి మించి తినే నూనెల వల్ల ఎలా శరీరంలో కొవ్వు పెరుగుతుందో, అతిగా తినే పిండి పదార్థాల వల్ల కూడా శరీరంలో కొవ్వు పెరుగుతుందని గుర్తించాలి. అందువల్ల కొవ్వు పదార్థాలు తగ్గించి తినేవారు కూడా పిండి పదార్థాలను తెలిసో తెలియకో అతిగా తినటం కొనసాగిస్తుంటే, వారిలో కొవ్వు నిల్వలు పెరుగుతూనే ఉంటాయి, తగ్గవు. దైనందిన అవసరాలకు మించి తిన్న ఆహార పదార్థాలు ఇన్సులిన్ హార్మోన్ నాణ్యతను చెడగొట్టి ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తున్నాయి. అదే ఇప్పుడు అసలు ముప్పు. ఇన్సులిన్ నిరోధకత తీవ్రత పెరిగేకొద్దీ అధిక బరువు, ఊబకాయం తీవ్రత పెరుగుతుంటుంది. ఈ ఇన్సులిన్ నిరోధకతే టైప్– 2 మధుమేహం, గుండెజబ్బులు, రక్తపోటు వంటి 200కి పైగా రోగాలను మన శరీరంలోకి వెంటబెట్టుకొస్తోంది. ఆహార సంబంధమైన వ్యసనాలను ఎవరికి వారు గుర్తెరిగి, వాటిని అధిగమించే ప్రయత్నం చెయ్యకుండా వర్తమానంలో గానీ, భవిష్యత్తులో గానీ ఆరోగ్యవంతంగా జీవించగలగటం అసాధ్యమేనని చెప్పక తప్పదు. ఆహారంలో స్థూల, సూక్ష్మపోషకాల సమతూకం లోపించటం వల్ల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. దైనందిన జీవనం ఆరోగ్యవంతంగా, ఆనందమయంగా కొనసాగాలంటే మనం తినే ఆహారంలో ఏయే పోషకాలు ఉండాలి? వాటిని ఏయే పాళ్లలో తీసుకోవాలి? ఇప్పుడు ఎంత తీసుకుంటున్నాం? ఎక్కడ తేడా పడుతోంది? ఏం మార్చుకోవాలి? ఎలా మార్చుకోవాలి?.. ఇలాంటి విషయాలను అర్థం చేసుకోవాలి. అసలు భారత ప్రభుత్వం ఏమి సిఫారసు చేస్తోందో మొదట మనం తెలుసుకోవాలి. మన ఆహారంలో 62% పిండి పదార్థాలే!భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) దేశ ప్రజలకు ఆహార, ఆరోగ్య విషయాలపై మార్గదర్శకాలను విడుదల చేస్తుంటుంది. భారతీయులు ఏం తింటున్నారు, జబ్బులు ఎలా పెరుగుతున్నాయో తెలుసు కునేందుకు ఇటీవలే ఐసీఎంఆర్ – ఇండియా డయాబెటిస్ (ఇండియాఐబీ) అధ్యయనం చేసింది. మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎండీఆర్ఎఫ్)తో కలసి ఐసీఎంఆర్ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 1,21,077 మంది ఆడ, మగవారిపై ఈ అధ్యయనం చేసింది. ‘నేచర్ మెడిసిన్’ జర్నల్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి. భారతీయులు సగటున రోజువారీ ఆహారంలో కొవ్వు పదార్థాలను మితంగానే తీసుకుంటున్నట్లు వెల్లడైంది. అయితే, పిండి పదార్థాలను అతిగా 62% మేరకు తింటున్నారు. మాంసకృత్తులను తక్కువగా 12% మాత్రమే తింటున్నారు. ఈ అసమతుల్య ఆహారమే మూల కారణంగా ఊబకాయం, రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్‌లు, టైప్–2 మధుమేహం వంటి జబ్బులను పెంచి పోషిస్తోందని నివేదిక తేల్చింది. ముఖ్యంగా శుద్ధి చేసిన పిండిపదార్థాలు ఎక్కువగా తినటం వల్ల టైప్–2 మధుమేహం బారిన పడే ముప్పు 14% పెరుగుతుందని ఈ అధ్యయనం గుర్తించింది. ఏపీ, తెలంగాణలోనూ ఎక్కువేదక్షిణ భారత దేశంలో రోజువారీ ఆహారంలో పిండి పదార్థాలను 62.5% తీసుకుంటుంటే (55%కి మించకూడదు).. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సగటున 61.8% (కనిష్ఠం 58.2%, గరిష్ఠం 65.4%) తీసుకుంటున్నారు. తెలంగాణలో 61.4% (కనిష్ఠం 57%, గరిష్ఠం 65.5%) మేరకు పిండి పదార్థాలు తింటున్నారు. అంటే, తెల్ల బియ్యంతో పాటు కొద్దిగా గోధుమ పిండి, చిరుధాన్యాల పిండి వాడుతున్నారు. ముడి చిరుధాన్యాలు వండుకొని తింటే పర్వాలేదు. వాటిని పిండి పట్టించి తింటే షుగర్ తదితర వ్యాధుల ముప్పు తెల్ల బియ్యం తిన్నప్పటి మాదిరిగానే ఉంటున్నదని ఐసీఎంఆర్ అధ్యయనం స్పష్టం చేసింది. కొవ్వు పదార్థాలను (30%కి మించకూడదు) కొంచెం అటూ ఇటుగా అవసరమైనంతే తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 26.4% (కనిష్ఠం 23.4%, గరిష్ఠం 29.8%), తెలంగాణలో 27.1% (కనిష్ఠం 22.8%, గరిష్ఠం 30.8%) తింటున్నారు. ఇక మాంసకృత్తుల విషయానికొస్తే రెండు రాష్ట్రాల్లోనూ (కనీసం 15% తీసుకోవాలి) తక్కువగానే తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 11.5% (కనిష్ఠం 10.5%, గరిష్ఠం 12.5%), తెలంగాణలో 11.5% (కనిష్ఠం 10.6%, గరిష్ఠం 12.5%) తింటున్నారు. వయసు, ఎత్తు, బరువును బట్టి ఏ వ్యక్తి ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారాన్ని ప్రతి రోజూ తీసుకోవాలి అనేది ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తికి ఎన్ని కేలరీల శక్తి అవసరమో తెలియాలంటే ఆ వ్యక్తి బేసల్ మెటబాలిక్ రేటు (బీఎంఆర్), బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) ఎంతో తెలియాలి. ఆ వ్యక్తి శరీరంలో ప్రాణాధార జీవక్రియల సక్రమ నిర్వహణకు ఎన్ని కేలరీలనిచ్చే ఆహారం తీసుకోవాలో బీఎంఆర్ చెబుతుంది. బాడీ స్కేల్ వంటి డిజిటల్ పరికరాల ద్వారా బీఎంఆర్‌తో పాటు బీఎంఐ, శరీరం మొత్తంలో కొవ్వు శాతం ఎంత, పొట్టచుట్టూ / చర్మం కింద కొవ్వు ఎంత, ప్రొటీన్ ఎంత ఉంది? వంటి 12 రకాల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ సమాచారం తెలుసుకుంటే, ప్రస్తుతం మీ శరీర బరువు; శరీరంలో పేరుకున్న కొవ్వు నిల్వలు ఉండాల్సినంత ఉన్నాయా లేదా ఎక్కువ ఉన్నాయా అనేది అర్థమవుతుంది. అధిక బరువు లేదా ఊబకాయం ఉంటే, దాన్ని తగ్గించుకునేలా మీ ఆహార ప్రణాళిక ఉండాలి. బీఎంఐ 25 ఉంటే సాధారణం అని చెబుతుంటారు. అయితే, అది యూరోపియన్లు, అమెరికన్లకు ఉద్దేశించినదని, ఆసియావాసులు 23 కంటే ఎక్కువ ఉండే అధిక బరువుతో ఉన్నట్లే గుర్తించాలని వైద్యులు చెబుతున్నారు. బరువు వయసు, ఎత్తుకు తగిన విధంగా ఉండే సాధారణ వ్యక్తి రోజుకు 2 వేల కేలరీల ఆహారం తీసుకోవాలని ఎన్ఐఎన్ సూచిస్తోంది. ఒకవేళ మీ బీఎంఐ 23 కంటే ఎక్కువగా ఉండి, పొట్టచుట్టూ కొవ్వు అధికంగా పేరుకొని ఉంటే, మీకు ఇప్పటికే ఇన్సులిన్ నిరోధకత ఉందని గుర్తించాలి. ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకోవాలంటే మీరు తీసుకునే ఆహారంలో మొత్తంగా కేలరీలను తగ్గించాలి. ముఖ్యంగా పిండి పదార్థాలను తీసుకోవటం తగ్గించుకోవాలి. మీ బీఎంఆర్ కన్నా తక్కువ కేలరీల ఆహారం తీసుకుంటూ ఉంటే, శరీర నిర్వహణకు కేలరీల కొరత ఏర్పడి, మీ శరీరంలో ఇప్పటికే పేరుకొని ఉన్న కొవ్వును కరిగించి, శక్తిగా మార్చి ఉపయోగించుకోవటాన్ని మీ శరీరం నేర్చుకుంటుంది. అలా చెయ్యగలిగితే కాలక్రమంలో మీ బరువుతో పాటు బీఎంఐ తగ్గి ఆరోగ్యం మెరుగవుతుంది. మందులు వాడి లేదా వ్యాయామం ద్వారా తాత్కాలికంగా బరువు తగ్గినా అవి మానేస్తే మళ్లీ బరువు పెరుగుతారు. కాబట్టి, ఆహారంలో గుణాత్మక మార్పు చేసుకోవటం ద్వారా తగ్గటం మేలైన పద్ధతి.నడుము కొలతే మీ ఆరోగ్యానికి సూచిక!ఈ బీఎంఆర్, బీఎంఐ వంటివి తెలుసుకునే డిజిటల్ పరికరాలు, పరీక్షలు అందుబాటులో లేకపోయినా మీరు అధిక బరువున్నారా? మీకు ఇన్సులిన్ నిరోధకత ఉందా? మొత్తంగా కేలరీలతో పాటు పిండి పదార్థాలను తీసుకోవటం మీరు తగ్గించుకోవాల్సి ఉందా? అనే విషయాన్ని తెలుసుకోవాలంటే మరొక సింపుల్ టెస్ట్ ఉంది. మీ ఎత్తు ఎంత ఉందో మీ నడుము చుట్టుకొలత అందులో సగం ఉండాలి. ఉదాహరణకు మీ ఎత్తు 170 సెం.మీ. అయితే మీ నడుము చుట్టుకొలత 85 సెం.మీ. కన్నా ఎక్కువ ఉండకూడదు. మీ ఎత్తు ఎంత ఉందో అంత పొడవైన తాడును తీసుకొని, దాన్ని రెండు ముక్కలు చెయ్యండి. ఒక ముక్కను మీ నడుము/పొట్ట చుట్టూ ఎక్కడ ఎక్కువ ఎత్తు ఉందో అక్కడ నడుము చుట్టూ పెట్టుకొని చూడండి. దాని రెండు కొసలు కలిస్తే మీరు అధిక బరువు లేరని అర్థం. రెండు కొసలకు మధ్య గ్యాప్ ఎంత ఉంటే మీరు అంత ఎక్కువ ఆరోగ్యపరమైన ముప్పును ఎదుర్కొంటున్నారని అర్థం. అలాంటప్పుడు వైద్యుల సలహా తీసుకొని, తగిన పరీక్షలు చేయించుకొని, ఆహారంలో తగిన మార్పులు చేసుకోవటం మేలు. బరువు తగ్గాలంటే తక్కువ కేలరీల ఆహారాన్ని, ముఖ్యంగా పిండి పదార్థాలు తగ్గించి తినటం ప్రారంభించటం మేలు. కేలరీలు, గ్రాముల లెక్క ఎలా?ఒక వ్యక్తి రోజు మొత్తంలో ఇన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలనుకున్నప్పుడు ఏయే పదార్థాలను ఎన్ని గ్రాముల బరువైనవి తీసుకుంటే నిర్దేశిత మోతాదుకు (55% పిండి పదార్థాలు, 15% మాంసకృత్తులు, 30% వరకు కొవ్వు పదార్థాలు) సరిపోతుందో తెలుసుకోవటం ముఖ్యం. మనం తినే దాదాపు ఆహార పదార్థాలన్నిటిలో పిండి పదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు ఎంతో కొంత శాతం ఉంటాయి. కాబట్టి, మీరు తినే ప్రతి పదార్థంలో కేలరీలతో పాటు ఈ మూడు పోషకాలు ఎంతెంత ఉన్నాయో తెలుసుకొని, మీ అవసరాలకు తగిన రీతిలో రోజువారీగా పట్టిక రూపొందించుకొని, ఏవి ఎంత బరువైనవి తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. ఎన్ఐఎన్ సంకలనపరచిన ‘ఇండియన్ ఫుడ్ కంపోజిషన్ టేబుల్స్ 2017, న్యూట్రిటివ్ వాల్యూస్ ఆఫ్ ఇండియన్ ఫుడ్స్’లో సాధారణంగా వాడే 17 రకాల ఆహార పదార్థాల్లో పోషకాల వివరాలు పొందుపరిచింది. 100 గ్రాముల ముడి పదార్థాల్లో పిండి పదార్థం, మాంసకృత్తులు, కొవ్వులు, కేలరీలు ఎన్ని ఉన్నాయో పట్టిక రూపొందించింది.ఉదాహరణకు 100 గ్రాముల బియ్యానికి, గోధుమలు వంటి ‘ఆహార ధాన్యాల’లో మాంసకృత్తులు 9.3 గ్రా., కొవ్వు 1.2 గ్రా., పిండిపదార్థాలు 72 గ్రా., 343 కిలో కేలరీల శక్తితో పాటు 6 గ్రాముల పీచు ఉన్నాయి. తెల్ల బియ్యానికి, ముడి బియ్యానికి, బియ్యం, గోధుమల రకాన్ని బట్టి వాటిలో పోషక విలువలు కొద్దోగొప్పో మారుతుంటాయి. 100 గ్రాముల ‘మాంసం, కోడి మాంసం’లో ప్రొటీన్ 20.8 గ్రా., ఫాట్ 6.8 గ్రా., కార్బొహైడ్రేట్లు 0 గ్రా., 250 కిలో కేలరీల శక్తి ఉన్నాయని ఎన్‌ఐన్ న్యూట్రిషన్ టేబుల్ చెబుతోంది. కోడి మాంసానికి, మేక మాంసానికి పోషకాల్లో కొంత వ్యత్యాసం ఉన్నా, స్థూలంగా మనకో అవగాహన కల్పించడానికి ఈ టేబుల్ పనికొస్తుంది. ఇలా 17 వర్గాల ఆహార పదార్థాల్లో పోషకాల వివరాలను ఎన్‌ఐన్ పొందుపరిచింది. గూగుల్‌లో కూడా ప్రతి ఆహార పదార్థానికి సంబంధించిన న్యూట్రిషన్ టేబుల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి పోషక విలువలను బట్టి, మన అవసరాన్ని బట్టి అవసరమైన కేలరీలలో, అవసరమైన గ్రాముల బరువైన ఆహారాన్ని లెక్కవేసుకొని తినటం ద్వారా ఖచ్చితత్వంతో కూడిన ఆహార నియమాలను పాటించటానికి అవకాశం ఉంది. అయితే, అసలు ఏ లెక్కా చూసుకోనప్పటి కన్నా ఇది మెరుగు. ఇంకా కచ్చితమైన సమాచారం కావాలంటే ఆయా ఆహార పదార్థాలకు సంబంధించిన వెబ్సైట్లు లేదా బుక్స్ ద్వారా న్యూట్రిషన్ డేటాను తెలుసుకోవచ్చు. ఆ రోజులో ఏమేమి పదార్థాలు ఎంత మోతాదులో తీసుకోవాలో లెక్కించుకోవటం ఆహార ప్రణాళికలో చాలా కీలక ఘట్టం. పిండి పదార్థాలను ఎక్కువ శాతం తీసుకునే వారితో పాటు.. ‘లో కార్బ్ హెల్దీ ఫ్యాట్’ డైట్‌ను అనుసరించే వారు కూడా ఇలాగే లెక్క వేసుకొని తినటం ద్వారా నిర్దేశించుకున్న ఆరోగ్య లక్ష్యాలు సాధించవచ్చు. జీవితాంతం ఈ లెక్కలు వేసుకోవలా అన్న బెంగ అక్కర్లేదు. కొన్నాళ్లు చేస్తే ఏమేమి ఎంత తింటే సరిపోతుందో తెలిసి వస్తుంది. ఆ తర్వాత లెక్క వేసుకోకుండానే ఆరోగ్యకరమైన పరిమాణంలో ఆహారం తీసుకోవచ్చు. తొలుత కష్టమే అయినా, అసాధ్యం అయితే కాదు. ఆహారం 10 రకాలురోజువారీ ఆహారాన్ని పది వర్గాలుగా విభజించారు. వీటిలో స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా కీలకపాత్ర పోషిస్తాయి. స్థూల పోషకాలు 3 రకాలు.. పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్లు), మాంసకృత్తులు (ప్రొటీన్లు), కొవ్వు పదార్థాలు (ఫ్యాట్స్). వీటిని సమతుల్యంగా (అంటే.. నిపుణులు సూచించిన పాళ్లలో) తీసుకోవటంతో పాటు.. ఏవో కొన్ని రకాలకే పరిమితం కాకుండా పది రకాల వైవిధ్యభరితమైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటే విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా అందుతాయి. పోషక లోపాలు, వ్యాధుల నుంచి రక్షించుకుంటూ ఆరోగ్యదాయకంగా జీవించడానికి భారతీయుల పళ్లెంలో ముఖ్యంగా స్థూల పోషకాల కూర్పు ఏది ఎంత శాతం ఉండాలో తెలియజెపుతూ ‘మై ప్లేట్ ఫర్ ద డే’ను ఎన్ఐఎన్ ప్రకటించింది.2000 కిలో కేలరీల శక్తి(రోజుకు)భారతీయుల ఆహారంపై, ఆరోగ్య స్థితిగతులపై భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తూ పాలకులకు, ప్రజలకు ఎప్పటికప్పుడు సంపూర్ణ ఆరోగ్య భారత్ నిర్మాణం దిశగా మార్గదర్శనం చేస్తుంటుంది. ఐసీఎంఆర్ అనుబంధ సంస్థ అయిన జాతీయ పోషకాహార సంస్థ (ఐసీఎంఆర్–ఎన్ఐఎన్) ఈ కృషిలో కీలకపాత్ర పోషిస్తోంది. ఎన్ఐఎన్ 2024లో ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది. రోజుకు 2,000 కిలో కేలరీలుతీసుకునే ప్రతి ఆహార పదార్థమూ మనకు శక్తినిస్తుంది. ఈ శక్తిని కిలో కేలరీలలో కొలుస్తారు. ఎన్ఐఎన్ ‘మై ప్లేట్ ఫర్ ద డే’ సిఫారసుల ప్రకారం.. సగటున ఒక వ్యక్తికి ఒక రోజులో మొత్తం కావాల్సిన శక్తి 2,000 కిలో కేలరీలు. ఒక కిలోగ్రాము బరువున్న నీటిని ఒక డిగ్రీ సెంటీగ్రేడు మేరకు వేడి చేయడానికి అవసరమైన ఉష్ణశక్తికి ప్రమాణమిది. ఏ ఆహారాన్ని మండిస్తే ఎంత వేడి వస్తుందన్న దాన్ని ఈ ప్రాతిపదికపై కొలుస్తారు. శారీరక శ్రమ తక్కువగా చేసే లేదా ఒక చోట కూర్చొని పనిచేసే బుద్ధి జీవులకు రోజుకు 1,500–2000 కేలరీల శక్తి సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది వయసును బట్టి, శారీరక శ్రమను బట్టి మారుతుంది. కాయకష్టం చేసే వారికి రోజుకు 3 వేల కేలరీలు అవసరమవు తాయని అంచనా.రోజుకు ఎన్ని గ్రాములు..?ఎన్ఐఎన్ మై ప్లేట్ ఫర్ ద డే సిఫారసుల(2024) ప్రకారం.. సగటున వ్యక్తి రోజుకు 2 వేల కిలో కేలరీల శక్తి అవసరం అనుకున్నాం కదా. వాటిని సమకూర్చుకోవాలి అంటే ప్రతి రోజూ ఆహారంలో పిండి పదార్థాలు 55%, 15% మాంసకృత్తులు, 30% కొవ్వు పదార్థాలు ఉండాలి. ఆహార పదార్థాల మోతాదు గ్రాముల్లో చెప్పుకోవాలంటే.. బియ్యం/ గోధుమలు వంటి ఆహార ధాన్యాలు, చిరుధాన్యాలు కలిపి 250 గ్రాములు, పాలు–పెరుగు 300 ఎం.ఎల్., కూరగాయలు 400 గ్రా., పండ్లు 100 గ్రా., పప్పులు, గుడ్లు, మాంసం ఉత్పత్తులు 85 గ్రా., పిక్కలు, గింజలు 35 గ్రా., నూనెలు/కొవ్వు పదార్థాలు 27 గ్రాముల మేరకు తీసుకోవాలి. మీరు మాంసాహారులా, శాకాహారులా అన్న దాన్ని బట్టి ఈ పాళ్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అయితే, ఎన్ఐఎన్ చెప్పిన పాళ్లలో పోషకాలు తీసుకోకపోవటం, ముఖ్యంగా పిండి పదార్థాలను అతిగా తినటం, మాంసకృత్తులు, కూరగాయలు, పండ్లను తక్కువగా తింటూ జబ్బుల పాలవుతున్నాం. కార్బోహైడ్రేట్లు పెంచుతున్న కొవ్వు వల్ల మన ఆరోగ్యానికి ముప్పు ముంచు కొచ్చింది.కొవ్వు ద్వారా అధిక శక్తిపిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలను సాధారణంగా గ్రాముల్లో కొలుస్తారు. అయితే, పిండి పదార్థాలు, మాంసకృత్తులతో పోల్చితే కొవ్వు పదార్థాలు రెట్టింపు కన్నా ఎక్కువ శక్తినిస్తాయి. 1 గ్రాము పిండి పదార్థం లేదా 1 గ్రాము మాంసకృత్తుల నుంచి 4 కిలో కేలరీల చొప్పున శక్తి వస్తుంది. అయితే, 1 గ్రాము కొవ్వు పదార్థం ద్వారా 9 కిలో కేలరీల శక్తి చేకూరుతుంది.∙పంతంగి రాంబాబు -
ఎప్పుడూ చేయని వెరైటీ వంటకాలు టేస్టీ.. టేస్టీగా చేసేద్దాం ఇలా..!
ఒడిశా కనికా కావలసినవి: బాస్మతి బియ్యం– ఒక కప్పు, నెయ్యి– 5 టేబుల్ స్పూన్లు, జీలకర్ర– ఒక టీస్పూన్, లవంగాలు– 5, ఏలకులు– 3 (కచ్చాపచ్చా చేసుకోవాలి), దాల్చిన చెక్క– చిన్న ముక్క, జాజికాయ పొడి– కొద్దిగా, బిర్యానీ ఆకు– 1, కిస్మిస్, జీడిపప్పు– 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు– రుచికి సరిపడా, పంచదార– 4 టేబుల్ స్పూన్లు (రుచికి సరిపడా పెంచుకోవచ్చు), పసుపు– పావు టీస్పూన్, నీళ్లు– 2 కప్పులుతయారీ: ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రం చేసి, సుమారు 30 నిమిషాలు నానబెట్టి, ఆ తర్వాత పూర్తిగా నీళ్లు లేకుండా వడకట్టుకుని పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుకర్‌లో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీలకర్ర, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి అవి వేగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు బియ్యాన్ని కుకర్‌లో వేసి, నెయ్యిలో 2 నిమిషాలు గరిటెతో తిప్పుతూ, వేయించాలి. వేగిన బియ్యంలో పసుపు, ఉప్పు, పంచదార వేసి బాగా కలపాలి. ఆ తర్వాత నీళ్లు పోసి, ఒకసారి కలిపి, కుకర్ మూత పెట్టాలి. ఒక విజిల్ వచ్చేవరకు మీడియం మంట మీద ఉడికించాలి. విజిల్ వచ్చాక స్టవ్ ఆపి, కుకర్ లోపల ఆవిరి మొత్తం పోయేవరకు అలాగే కదపకుండా ఉంచాలి. అనంతరం కుకర్ మూత తీసి, జాజికాయ పొడి వేసి, నెమ్మదిగా అన్నం మెతుకులు విరగకుండా కలపాలి. (ఇది పూరీజగన్నాథ ఆలయ ఛప్పన్న నైవేద్యాల్లో ఒకటి). ఈ టేస్టీ కనికాను పప్పుతో కలిపి తింటే భలే రుచిగా ఉంటుంది.నూడుల్ వెజిటబుల్ కట్లెట్స్కావలసినవి: నూడుల్స్– ఒక కప్పు (ఉడికించినవి)కూరగాయ ముక్కలు– అర కప్పు (చిన్నచిన్నగా కట్ చేసుకోవాలి, నచ్చిన కూరగాయలు తీసుకోవచ్చు)బంగాళ దుంపలు– 2 (మెత్తగా ఉడికించి, గుజ్జులా చేసుకోవాలి. కొత్తిమీర తరుగు– 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడ ముక్కలు– కొద్దిగాపచ్చిమిర్చి ముక్కలు– కొద్దిగాబ్రెడ్ పౌడర్– కొద్దిగా, మొక్కజొన్న పిండి– ఒక టేబుల్ స్పూన్, ఉప్పు– తగినంత, నూనె– సరిపడా,టొమాటో కెచప్– కొద్దిగాతయారీ: ఒక గిన్నెలో ఉడికి, చల్లారిన నూడుల్స్, కూరగాయ ముక్కలు, బంగాళ దుంప గుజ్జు, పచ్చిమిర్చి ముక్కలు, మొక్కజొన్న పిండి, బ్రెడ్ పౌడర్, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. అభిరుచిని బట్టి క్యారట్ తురుము వంటివి కలుపుకోవచ్చు. కొత్తిమీర తురుము, ఉల్లికాడ ముక్కలు కలుపుకుని కట్లెట్స్లా చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే టొమాటో కెచప్ కలిపి తింటే చాలా బాగుంటాయి.ఇటాలియన్ టొమాటో బ్రుషెట్టాకావలసినవి: బ్రెడ్ ముక్కలు– 6 (చీజ్ బ్రెడ్ లేదా రస్క్ ముక్కలు కూడా తీసుకోచ్చు), టొమాటోలు– 3 (పండినవి ఎన్నుకోవాలి, చిన్నగా తరిగినవి), వెల్లుల్లి రెబ్బలు– 2 (చిన్నగా తరగాలి), ఆలివ్ నూనె– 3 చెంచాలు, తరిగిన తాజా తులసి ఆకులు– కొన్ని, ఉప్పు– సరిపడా, మిరియాల పొడి– కొద్దిగాతయారీ: ముందుగా ఒక గిన్నెలో చిన్నగా తరిగిన టొమాటో ముక్కలు, ఆలివ్ నూనె, వెల్లుల్లి తరుము, తరిగిన తులసి ఆకులు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు బ్రెడ్ ముక్కలను లేదా రస్క్ ముక్కలను ఒక టోస్టర్ లేదా పాన్‌లో ఆలివ్ నూనెతో దోరగా బేక్ చెయ్యాలి. బ్రెడ్ ముక్కలు వేడిగా ఉన్నప్పుడే, ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకుని వాటిపై రుద్దాలి. ఇది బ్రెడ్‌కు మంచి ఫ్లేవర్‌ని ఇస్తుంది. అనంతరం ప్రతి బ్రెడ్ ముక్కపైన టొమాటో మిశ్రమాన్ని సమానంగా వేసి సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది. వీటికి సాస్‌తో కలిపి తింటే ఇంకా బాగుంటాయి. -
పేరెంటింగ్ టిప్స్: స్మార్ట్‌ఫోన్ వాడకంలో సరిహద్దులు తప్పనిసరి..!
‘‘డాక్టర్! మా బిడ్డ ఫోన్లో కార్టూన్ పెడితేనే తింటాడు.’’ ‘‘సర్! నా భర్తకు నాతో మాట్లాడటానికి టైం లేదు. ఆయన ఎప్పుడూ వాట్సాప్‌లోనే ఉంటాడు. చూస్తేనే చిరాకేస్తుంది.’’ ‘‘మా అమ్మానాన్న ఎప్పుడూ రీల్స్‌లోనే బిజీ. వాళ్లతో మాట్లాడాలంటే కూడా వెయిట్ చేయాలి.’’ ఇవి నా కౌన్సెలింగ్ రూమ్‌లో ప్రతిరోజూ వినిపించే మాటలు. చాలామంది తల్లిదండ్రులు తమ పనులకు అడ్డు రాకుండా ఉంటారని పిల్లలకు ఫోన్ ఇస్తారు. ‘‘పని చేసుకోవాలి కదా’’ అని సమర్థించుకుంటారు. కాని, ఆ రెండు నిమిషాల కంఫర్ట్ వల్ల పిల్లల మనసులు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా ఒక సైలెంట్ గ్యాప్ వస్తోంది. ‘‘నువ్వు నాకు టైమ్ ఇవ్వవు’’ అనే మాటకు బదులు – ఇద్దరూ ఒకే మంచం మీద పక్కపక్కన పడుకుని స్క్రీన్లతో బతుకుతున్నారు. ఒకప్పుడు కుటుంబ సమస్యలంటే కుర్రాళ్ల ప్రేమలు, అత్తాకోడళ్ల గొడవలు, భార్యాభర్తల వివాదాలు, పిల్లల మార్కుల టెన్షన్లు. కాని, ఇప్పుడు కౌన్సెలింగ్ రూమ్‌లోకి వస్తున్న కొత్త సమస్య – స్మార్ట్‌ఫోన్. ఈ చిన్ని యంత్రం – ఒక వైపు మనిషికి వరం, మరో వైపు నిశ్శబ్దంగా మన కుటుంబాల్ని కాలుస్తున్న శాపం.వరం లాంటి అద్భుతంమన జీవితంలో స్మార్ట్‌ఫోన్ తీసుకువచ్చిన విప్లవం అపారమైనది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేని జీవితాన్ని ఊహించలేం. · ఇది కొద్ది సెకన్లలో జ్ఞానం, విద్య, సమాచారాన్ని అందిస్తుంది. · మ్యాప్‌లు, మెడిసిన్, బ్యాంకింగ్ అన్నీ ఒక క్లిక్ దూరంలో. దూరంగా ఉన్నవారిని వాట్సాప్, వీడియో కాల్స్ ద్వారా దగ్గర చేస్తుంది. కరోనా కాలంలో పాఠశాలలు, ఉద్యోగాలు, వైద్య సలహాలు అన్నీ ఫోన్ ద్వారానే నడిచాయి. · ఒక్క మాటలో చెప్పాలంటే, స్మార్ట్‌ఫోన్ మనిషిలో భాగంగా మారిపోయింది. శాపంగా మారిన వరం‘అతి సర్వత్ర వర్జయేత్’ అంటారు పెద్దలు. స్మార్ట్ ఫోన్ విషయంలో ఇది నూటికి నూరుపాళ్లు నిజం. అతిగా వాడటంతో మన చేతిలోని ఫోన్ ఒక డిజిటల్ జైలుగా మారిపోయింది. · పసిపాపలు తినడానికి ఫోన్ కావాలి. పిల్లలు ఆడుకోవడానికి స్క్రీన్ కావాలి. యువత రీల్స్, గేమ్స్‌కు బానిసలైపోయారు. భార్యాభర్తల మధ్య దూరం పెరిగింది. పెద్దలకు నిద్ర, ప్రశాంతత దూరమయ్యాయి. మనిషి తల వంచి నడవడం ఇప్పుడు సిగ్గుతో కాదు – నోటిఫికేషన్ చూడటానికి. ఒకప్పుడు డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చుని తినేవారు, ఇప్పుడు టేబుల్ చుట్టూ కూర్చుని మొబైల్ స్క్రోల్ చేస్తున్నారు. ఇది ఒక సామాజిక విపత్తుగా మారింది అనడంలో ఆశ్చర్యం లేదు.అతి వాడకంతో అనర్థాలుసైకాలజిస్టుల దృష్టిలో, స్మార్ట్‌ఫోన్ వినియోగానికి మూడు స్థాయులు ఉన్నాయి. వాడుక – అవసరమైన పనులకే వాడటం. దుర్వినియోగం – అవసరం లేకపోయినా గంటలు గంటలు స్క్రోల్ చేయడం. వ్యసనం – చేతిలో ఫోన్ లేకపోతే ఆందోళన, కోపం, మనసంతా శూన్యంలా అనిపించడం. జనాభాలో చాలామంది ఇప్పటికే మూడో దశలో ఉన్నారు. దీనివల్ల పిల్లల నుంచి పెద్దల వరకు అనేకానేక కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. నిరంతర నోటిఫికేషన్లతో మెదడు ఫోకస్ కోల్పోతుంది. పిల్లలు ఏకాగ్రత నేర్చుకోలేరు. సోషల్ మీడియాలో పోలికల వల్ల డిప్రెషన్, అసూయ పెరుగుతుంది. ఫోన్ వల్ల భర్త–భార్యలు, తల్లిదండ్రులు– పిల్లలు ఒకరితో ఒకరు నేరుగా మాట్లాడడం తగ్గిపోతుంది. మనిషి విలువను లైక్స్, ఫాలోవర్స్‌తో కొలుస్తున్నాం. · ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల నిద్ర తగ్గిపోతుంది, ఆందోళన పెరుగుతుంది.సరిహద్దులు తప్పనిసరిస్మార్ట్ఫోన్ ఒక వరం. కాని అది మనసు, బంధాలు, పిల్లల వికాసం కన్నా పెద్దదిగా మారితే – అదే శాపంగా మారుతుంది. అందుకే స్మార్ట్‌ఫోన్ ప్రభావాలు, దుష్ప్రభావాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అడిక్షన్ నుంచి తప్పించుకునే మార్గాల గురించీ వారం వారం సవివరంగా తెలుసుకుందాం, మన జీవితాలను మార్చుకుందాం. ముందుగా గ్రౌండ్ రూల్స్... రెండు సంవత్సరాల లోపు పిల్లలకు ఫోన్ అస్సలు ఇవ్వకూడదు.డైనింగ్ టేబుల్, బెడ్రూమ్ ఫోన్ ఫ్రీ జోన్లుగా మార్చాలి.వారంలో ఒక రోజు డిజిటల్ ఫాస్టింగ్ చెయ్యాలి.ఫ్యామిలీ టైమ్‌లో ఫోన్ పక్కన పెట్టేయాలి.ముందుగా తల్లిదండ్రులే రోల్ మోడల్స్‌గా నిలవాలి. · పేరెంట్స్, స్పౌసెస్, ఇండివిడ్యువల్స్– ఈ రోజు ఒక ప్రశ్న అడగండి: ‘‘నా చేతిలో ఉన్న ఫోన్ నా జీవితానికి వరమా? శాపమా? ఆక్సిజనా? జైలా?’’సైకాలజిస్ట్ విశేష్‌ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్www.psyvisesh.com(చదవండి: గర్భం కోస్ల ప్లాన్ చేస్తే..ఆ మందలు వాడాల్సిందేనా..?) -
అవే నా స్టయిల్ ఆఫ్ లవ్: నటి చైత్ర జే ఆచార్
సింపుల్ నుంచి బోల్డ్ వరకు, ట్రెండ్ నుంచి ట్రెడిషనల్ వరకు ఏ స్టయిల్లోనైనా తన స్వాగ్‌ని చూపే నటి చైత్ర జే ఆచార్. జీన్స్, షార్ట్స్ ప్లస్ టీ షర్ట్ నా స్టయిల్ ఆఫ్ లవ్. బయటకు వెళ్లేటప్పుడు ఇదే లుక్‌ను కాస్త బోల్డ్‌గా స్టయిల్ చేస్తా. ప్రత్యేక సందర్భాల్లో చీరల్లో మెరుస్తాను. అవి నాకు సంప్రదాయబద్ధమైన, కంఫర్ట్ లుక్‌ను ఇస్తాయి. దుస్తులు ఏవైనా, మినిమల్ జ్యూలరీని ప్రిఫర్ చేస్తా అంటోంది చైత్ర జే ఆచార్. ఇక్కడ ఆమె ధరించిన చీర బ్రాండ్: ఇజాయి ధర: రూ. 3,850, జ్యూలరీ బ్రాండ్: ఫైన్ షైన్ జ్యూలరీ, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. క్రిస్టల్ క్రష్!రాళ్ల నగలు నేటి యువత స్టయిల్‌కి ర్యాప్ సాంగ్లాంటి ఎనర్జీని ఇస్తున్నాయి. అందుకే, బంగారం మెరుపు కంటే, క్రిస్టల్ జ్యూలరీనే వారి ఫేవరెట్ క్రష్‌గా మారింది. నిజానికి, రాళ్ల ఆభరణాలకు ఫ్యాషన్‌లో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంది. ఇవి కేవలం మెరుపుతోనే కాదు, ట్రెండ్, లగ్జరీ మిక్స్ చేసిన మోడర్న్ డిజైన్లతో వస్తాయి. విశేషంగా, వైట్ స్టోన్ జ్యూలరీకి ఒక అదనపు ఆర్భాటం అందిస్తాయి. ఒక్కసారి రాళ్ల ఆభరణాలు ధరించగానే సాధారణ దుస్తులు కూడా ప్రత్యేకంగా మెరుస్తాయి. డైలీ వేర్‌కు, మినిమలిస్టిక్ వైట్ సఫైర్ స్టడ్స్, సింపుల్ బ్యాంగిల్స్ ఎప్పటికీ బెస్ట్ ఆప్షన్. ఆఫీస్ స్టయిల్‌కు క్లాసిక్ వైట్ స్టోన్ పీసులు, జెంటిల్ డిజైన్, ప్రొఫెషనల్ లుక్ అందిస్తాయి. వివాహాది శుభకార్యాల కోసం పెద్ద హారాలు, చోకర్స్, గ్రాండ్ స్టేట్మెంట్ లుక్ ఇస్తాయి. ప్రతి సందర్భానికి ప్రత్యేకంగా మోడర్న్ స్టోన్ డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. జుట్టు పోనీగా కట్టి వెళ్ళితే రాయల్టీ లుక్, వేవీ హెయిర్ లేదా కర్ల్స్ వేసుకుంటే క్యూట్ టచ్ గ్యారంటీ. (చదవండి: beauty: ముఖం మెరుస్తూ..కాంతిగా ఉండాలంటే..! కుంకుమ పువ్వుతో..) -
Diwali 2025: ఇంటికి వెలుగుల మెరుపులు తెప్పిద్దాం ఇలా..!
దీపాలే అనేది దీపావళి పండుగ అలంకరణకు ప్రాణం. ఆ మెరుపు మన ఇంటిని వెచ్చగా, ఉత్సాహంగా, తక్షణమే పండుగ కళను తీసుకువచ్చేస్తుంది. దీపావళి సమయంలో లైటింగ్ అనే ప్రకాశం నుండి మన జీవనశైలిని కాంతిమంతం చేస్తుంది. దీపావళి అలంకరణను మెరుగుపరచడానికి ఇంటీరియర్ డిజైన్ స్టూడియో క్రిడ్ అఫ్ లైస్ ఫౌండర్ తన్వీ పోర్వాల్, దట్ యెల్లో ట్రంక్ ఆర్కిటెక్ట్, ఫౌండర్ అంజరి గంగూలీ చేస్తున్న సూచనలివి..దీపాలే అనేది దీపావళి పండుగ అలంకరణకు ప్రాణం. ఆ మెరుపు మన ఇంటిని వెచ్చగా, ఉత్సాహంగా, తక్షణమే పండుగ కళను తీసుకువచ్చేస్తుంది. దీపావళి సమయంలో లైటింగ్ అనే ప్రకాశం నుండి మన జీవనశైలిని కాంతిమంతం చేస్తుంది. దీపావళి అలంకరణను మెరుగుపరచడానికి ఇంటీరియర్ డిజైన్ స్టూడియో క్రిడ్ అఫ్ లైస్ ఫౌండర్తన్వీ పోర్వాల్, దట్ యెల్లో ట్రంక్ ఆర్కిటెక్ట్, ఫౌండర్ అంజరి గంగూలీ చేస్తున్న సూచనలివి..ఆహ్లాదకరమైన ప్రకాశం: ఆధునికమైన, విలాసవంతమైన టచ్ కోసం వెచ్చని ఎల్ఈడీ లైట్లను ఉపయోగించవచ్చు. ఇంటి లోపల, మెట్ల భాగంలో ఈ లైట్లను ఏర్పాటు చేస్తే అధిక విద్యుత్తు ఖర్చు కాకుండానే పరిసరాలను ఆహ్లాదకరంగా, కాంతివంతం చేస్తాయి.లైట్ల తోరణం: ప్రకాశవంతమైన తోరణాన్ని గుమ్మానికి ఏర్పాటు చేస్తే, పండగ ముంగిట్లోకి ఇట్టే వస్తుంది. ఇక సిల్క్ టాసెల్స్, పూసలు లేదా ఫెయిరీ లైట్లతో కూడిన స్ఫటికాలనూ ఎంచుకోవచ్చు, ఇది సంప్రదాయాన్ని అధునాతనంగా చూపడంతో పాటు అతిథుల స్వాగతానికి అందమైన కాంతిని అందిస్తుంది.పేపర్ లాంతర్లు: రంగు రంగుల కాగితపు పొరలతో చేసే ఈ లాంతర్లు కాంతిని వినూత్నంగా వెదజల్లుతుంటాయి. ఈ లాంతర్లు బాల్కనీలు, ఇంటి ముందు వసారాలాంటి స్థలాల్లో వేలాడదీయాలి. మెటాలిక్ గోల్డ్, క్రీమ్ లేదా పేస్టెల్ షేడ్స్‌లో వీటిని మనమే తయారు చేసుకోవచ్చు. కొవ్వొత్తి స్టాండ్లు: కలప, ఇత్తడి లేదా పాలరాతి శిల్పాకృతులను పోలి ఉండే కొవ్వొత్తి స్టాండ్లు మార్కెట్లో లభిస్తున్నాయి. అవి వెదజల్లే అందం ఇంటికి మెరుపును తీసుకువస్తుంది. పండుగ వాతావరణానికి ఈ కొవ్వొత్తుల స్టాండ్లు మేలైన ఎంపిక. వారసత్వంగా వస్తున్న కొన్ని గృహాలంకరణ వస్తువులను, తిరిగి బాగు చేయించి కొవ్వొత్తుల స్టాండులుగా ఉపయోగించవచ్చు. మట్టి దీపాలు: టెర్రకోట దీపాలు ఆధునిక ఇంటీరియర్లను వారసత్వ సౌందర్యానికి అనుసంధానిస్తాయి. విలాసవంతమైన టచ్ కోసం వాటిని హైలైట్ చేయవచ్చు. వీటిని కిటికీలు, బాల్కనీలు, లివింగ్రూమ్లు, ఇంటి ముందు అందంగా తీర్చిదిద్దవచ్చు. కొబ్బరి చిప్పలను ప్రమిదలుగా తయారు చేసుకొని, ఉపయోగించవచ్చు. పర్యావరణానికి మేలు చేసేవే కాదు, రీ సైక్లింగ్ పద్ధతుల వల్ల కూడా మేలైన ఫలితాలను పొందవచ్చు. ఎన్నార్ -
ముఖం మెరుస్తూ..కాంతిగా ఉండాలంటే..!
చిత్రంలోని ఈ మిర్రర్ ఒక స్మార్ట్ బ్యూటీ గాడ్జెట్. ఇది మీ అందాన్ని, చర్మ సంరక్షణను మెరుగుపరచడానికి రూపొందించబడింది. సాధారణంగా ఇంట్లో ఉపయోగించే అద్దానికి అధునాతన సాంకేతికతను జోడించి స్మార్ట్ డివైస్‌గా మార్చారు. ఈ అద్దం ముఖాన్ని విశ్లేషించి, చర్మంపై ఉన్న మచ్చలు, ముడతలు, ఎర్రటి గుల్లలు, గీతలు, చర్మ రంధ్రాలు, నల్లటి వలయాలను ఇట్టే గుర్తిస్తుంది. ఇది ఒక సమగ్ర చర్మ నివేదికను అందించి, ఏ ఉత్పత్తులు వాడితే మంచి ఫలితాలు వస్తాయో సూచిస్తుంది. అలాగే ఈ మిర్రర్‌కి ఉన్న ఎల్ఈడీ లైట్లు చాలా ప్రత్యేకమైనవి. ఇవి వివిధ రకాల వాతావరణాలను అనుకరిస్తాయి. ఉదాహరణకు, సన్ లైటింగ్, ఆఫీస్ లైటింగ్, షాపింగ్ మాల్స్ లైటింగ్, నార్మల్ లైటింగ్, నైట్ లైటింగ్ ఇలా ఐదు రకాల లైటింగ్ మోడ్‌లను ఇది అందిస్తుంది. దీనితో మీరు వేసే మేకప్ వివిధ ప్రదేశాల్లో ఎలా కనిపిస్తుందో ముందే తెలుసుకోవచ్చు. ఈ స్మార్ట్ డివైస్ 64జీబీ సామర్థ్యంతో ఏర్పడింది. దాంతో చర్మ ఆరోగ్య నివేదికలు, మేకప్ స్టైల్ వీడియోలు ఇలా డేటాను సురక్షితంగా నెట్ సాయంతో సేవ్ చేసుకోవచ్చు. అదనంగా, ఈ డివైస్ ఏకకాలంలో నాలుగు యూజర్ అకౌంట్లను సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఒకే అద్దాన్ని కుటుంబంలోని నలుగురు సభ్యులు వాడుకోవచ్చు. దీనికి ఒక వైర్లెస్ చార్జింగ్ ప్యాడ్ కూడా ఉంది. ఇది చాలా సౌకర్యవంతమైన ఫీచర్. ఈ అద్దాన్ని సులభంగా పోర్ట్రైట్ (నిలువుగా) లేదా ల్యాండ్‌స్కేప్ (అడ్డంగా) మోడ్‌లోకి మార్చుకోవచ్చు. దీనివల్ల ఈ డివైస్‌లో యూట్యూబ్ వీడియోలు లేదా ఇతర కంటెంట్‌ను చూస్తున్నప్పుడు మరింత సౌకర్యంగా ఉంటుంది. ఇదే స్మార్ట్ మిర్రర్స్లోని కొన్ని మోడల్స్‌లో వాయిస్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంటుంది. దాంతో చేతులు ఉపయోగించకుండానే వాయిస్ కమాండ్స్‌తో అద్దాన్ని నియంత్రించవచ్చు.కుంకుమ పువ్వు, ఇది చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. అలాగే ముఖానికి ప్రత్యేకమైన మెరుపునిస్తుంది. ఒక పావు టీ స్పూన్ కుంకుమ పువ్వుని, ఒక టేబుల్ స్పూన్ పాలలో రాత్రి అంతా నానబెట్టి ఉంచాలి. మరుసటి రోజు ఆ పాలలో కలబంద గుజ్జు వేసి క్రీమీగా చేసుకోవాలి. ఆ మిశ్రమంలో ఎండబెట్టిన గులాబీ రేకుల గుజ్జును అర టీ స్పూన్ వేసుకుని, బాగా కలిపి ముఖానికి పట్టించాలి. అనంతరం సుమారు 30 నిమిషాల పాటు ఆరనిచ్చి, చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా వారానికి రెండు సార్లు అప్లై చేసుకుంటే మంచి ఫలితాలను చూడొచ్చు. -
గర్భం కోస్ల ప్లాన్ చేస్తే..ఆ మందులు వాడాల్సిందేనా..?
నా వయసు 32 సంవత్సరాలు. నేను ప్రస్తుతం గర్భం కోసం ప్లాన్ చేస్తున్నాను. డాక్టర్ ఫోలిక్ యాసిడ్, మల్టీవిటమిన్ సప్లిమెంట్లు వాడమన్నారు. ఇవి నిజంగా అవసరమా? ఎప్పుడు మొదలు పెట్టాలి? దానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి?– దీప్తి, హైదరాబాద్ . గర్భం కోసం ప్లాన్ చేస్తున్న ప్రతి మహిళ ఫోలిక్ యాసిడ్, మల్టీవిటమిన్ సప్లిమెంట్లు తప్పనిసరిగా వాడాలి. గర్భధారణ మొదటి కొన్ని వారాల్లోనే బిడ్డ మెదడు, వెన్నెముక వంటి ముఖ్యమైన అవయవాలు అభివృద్ధి చెందుతాయి. ఈ సమయంలో శరీరంలో ఫోలిక్ యాసిడ్ తక్కువగా ఉంటే, బిడ్డలో ‘న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్’ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి వెన్నెముక లేదా మెదడు అభివృద్ధి సరిగా జరగకపోవడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయి. గర్భధారణకు ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే ఈ లోపాలను చాలా వరకు నివారించవచ్చు. ఫోలిక్ యాసిడ్, బి విటమిన్ గ్రూపుకు చెందిన నీటిలో కరిగే విటమిన్లు. సాధారణంగా శరీరానికి అవసరమైన మోతాదులో తీసుకోవడం పూర్తిగా సురక్షితం. అదనంగా తీసుకున్న ఫోలిక్ యాసిడ్ శరీరంలో నిల్వ కాకుండా మూత్రం ద్వారా బయటకు వెళుతుంది కాబట్టి, ఎక్కువ మోతాదులో తీసుకున్నా హానికరం కాదు. రోజుకు 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ గర్భధారణకు ముందు నుంచే మొదలు పెట్టి, గర్భం వచ్చిన తర్వాత కనీసం మొదటి మూడు నెలలు వాడటం ఉత్తమం. ఫోలిక్ యాసిడ్‌తో పాటు ఐరన్ , విటమిన్ బి12, విటమిన్ డీ, క్యాల్షియం వంటి పోషకాలు కలిగిన మల్టీవిటమిన్ మాత్రలు కూడా వాడితే తల్లి, బిడ్డ ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుంది. ఇవి సాధారణంగా ఎటువంటి దుష్ప్రభావాలు ఇవ్వవు. కొందరికి స్వల్పంగా వాంతులు లేదా మలబద్ధకం అనిపించవచ్చు, అలాంటప్పుడు వైద్యుడి సలహాతో మాత్రలను మార్చుకోవచ్చు. మొత్తానికి, మీరు గర్భం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఇప్పటి నుంచే ఫోలిక్ యాసిడ్, మల్టీవిటమిన్ వాడడం ప్రారంభించండి.నా వయసు 38 సంవత్సరాలు. ఇటీవలి కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చాలా వింటున్నాను. ఇది ఎందుకు వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చు?– శ్వేత, విజయనగరం. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్. బ్రెస్ట్ కణాలు అసాధారణంగా, నియంత్రణ లేకుండా పెరగడం వల్ల ట్యూమర్ ఏర్పడుతుంది. ఇది చికిత్స చేయకపోతే ఇతర అవయవాలకు వ్యాపించవచ్చు. అయితే ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు, అందుకే ముందస్తు పరీక్షలు చాలా ముఖ్యం. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలను బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన నెలగా జరుపుకుంటారు. దీని లక్ష్యం మహిళల్లో అవగాహన పెంచడం, ముందస్తు పరీక్షల ప్రాముఖ్యతను తెలియజేయడం. వయసు పెరగడం, వంశపారంపర్యంగా వచ్చే జన్యువులు, అధిక బరువు, శారీరక వ్యాయామం తగ్గడం, మద్యం సేవించడం, హార్మోన్ల మార్పులు వంటి కారణాల వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. తల్లి, అక్క, చెల్లెలు లేదా పిన్ని వంటి బంధువులలో ఎవరికైనా బ్రెస్ట్ లేదా ఓవరీ క్యాన్సర్ ఉన్నట్లయితే, మీకు కూడా ఆ ప్రమాదం కొంత ఎక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో వైద్యుల సూచనతో హెరిడిటరీ జీన్ టెస్టులు చేయించుకోవడం మంచిది. ఇవి భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని అంచనా వేయడంలో సహాయపడతాయి. 35 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి మహిళా బ్రెస్ట్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. మొదట అల్ట్రాసౌండ్, తర్వాత మామోగ్రఫీ చేయించడం ఉత్తమం. ఇంట్లో నెలకు ఒకసారి స్వయంగా బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేయడం అలవాటు చేసుకోవాలి. అంటే బ్రెస్ట్‌లో ఏదైనా గడ్డ, చర్మం మార్పు, నిపుల్ నుంచి స్రావం, నొప్పి లాంటివి ఉన్నాయా అని గమనించడం. ఏ మార్పు గమనించినా ఆలస్యం చేయకుండా గైనకాలజిస్ట్ లేదా సర్జన్‌ను సంప్రదించాలి. ఆరోగ్యకరమైన ఆహారం, తగిన వ్యాయామం, బరువు నియంత్రణ, ధూమపానం, మద్యం అలవాట్లకు దూరంగా ఉండటం, పాలిచ్చే తల్లిగా ఉండటం. ఇవన్నీ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ముందస్తు జాగ్రత్తలే ఆరోగ్యానికి ఉత్తమ రక్షణ.డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: జిలేబీ, సమోసా, గులాబ్ జామూన్ వంటకాలు ఎవరు తయారు చేశారంటే..!) -
జిలేబీ, సమోసా, గులాబ్ జామూన్ వంటకాలు ఎవరు తయారు చేశారంటే..!
ఉదయాన్నే వేడిగా గొంతులో ఒక టీ చుక్క పడితేనే కానీ భారతీయులకు సూర్యోదయం అయినట్లుండదు. ఫిల్టర్ కాఫీకి అలవాటు పడిన వాళ్లైతే నాసికను తాకే ఆ ప్రాణవాయువులకే లేచి కూర్చుంటారు. ఇక బిర్యానీకి వేళాపాళా ఉండదు. ఇప్పుడు సీటీల్లో 4 ఏఎం బిర్యానీలు కూడా వచ్చేశాయి! సరే, సమోసా గురించి చెప్పేదేముంది? స్నాక్స్‌లో సెలబ్రిటీ! వేడుకలలో జిలేబీ, గులాబ్ జామూన్.. మస్ట్, ది బెస్ట్. ఈ ఆరు రుచులు లేకుండా భారతదేశంలో తెల్లారదు, చీకటి పడదు. విశేషం ఏంటంటే, వీటిల్లో ఏ ఒక్కటి కూడా భారతీయులది కాదు! అంటే మనం కనిపెట్టింది కాదు! మరి, కనిపెట్టిన ఆ మహానుభావులెవరు? చాయ్ / టీ చైనా పానీయం∙క్రీ.పూ. 2700 ప్రాంతంలో చైనాలో ‘టీ’ ని కనిపెట్టటం, కాయటం మొదలైంది. అయితే భారతదేశానికి ‘టీ’ తాగే అలవాటు చైనా నుండి రాలేదు. బ్రిటిష్ వాళ్లు మోసుకొచ్చారు. 1800ల నుండి 1947లో దేశం విడిచి వెళ్లే వరకు బ్రిటిష్ వాళ్లు మన దగ్గర తేయాకు తోటల్ని పెద్ద మొత్తంలో పండించి, ‘టీ’ని పానీయంగా వినియోగించారు. ఆ అలవాటే భారతీయులకూ వచ్చేది. చివరికి ‘టీ’ పుట్టిల్లు భారతదేశమే అనుకునేంతగా జన జీవనంలో కలిసిపోయింది. భారతదేశంలో దాదాపు 80 శాతం కుటుంబాలు టీని సేవిస్తున్నాయి. ప్రపంచంలో నీటి తర్వాత ఎక్కువ మంది తాగే పానీయం ‘టీ’ నే! ‘కమీలియా సెనన్సెస్’ మొక్కల నుంచి (వాడుకలో తేయాకు) తెంపుకొచ్చిన ఆకులు క్రీ.పూ. 2732లో చైనా చక్రవర్తి షెన్ నుంగ్ చేతి నుంచి జారి మరిగే నీటిలో పడినప్పుడు వచ్చిన కమ్మటి పరిమళం ‘టీ’ ఉద్భవించటానికి కారణం అయిందని చరిత్రకారులు అంటారు. చైనాలో కొన్నేళ్ల పాటు తేయాకు కూడా కరెన్సీగా చలామణి అయింది! ఆయుర్వేదంలో ఔషధ ప్రయోజనాలకు తేయాకును వాడటం అన్నది నేటికీ అన్ని దేశాల్లోనూ ఉంది. ఇక ‘టీబ్యాగు’లను 1908లో న్యూయార్క్‌లోని ఒక టీ వ్యాపారి అనుకోకుండా కనిపెట్టారు. హోల్‌సేల్ కొనుగోలు దారులకు వివిధ రకాలైన తేయాకు నమూనాలను పంపేందుకు ఆయన చిన్న చిన్న టీ బ్యాగుల్లో వాటిని నింపేవారు. అలా క్రమంగా టీబ్యాగులు వచ్చాయి. సమోసా ఈజిప్టు ఫలహారంమనమెంతో ఇష్టంగా తినే ‘సమోసా’ కూడా మనది కాదు. కానీ, చాలా ప్రపంచ దేశాల్లో సమోసాకు ‘భారతీయ వంటకం’గా పేరు పడిపోయింది. చరిత్రకారులు సమోసాను క్రీ.శ. 10వ శతాబ్దపు మధ్యప్రాచ్య వంటకంగా గుర్తించారు. ఇరానియన్ చరిత్రకారుడు అబోల్ఫజల్ బెహకీ దీనిని తన గ్రంథమైన ‘తారిఖ్–ఇ బెహఘి’లో ‘సబోసా’గా పేర్కొన్నారు. పరిమాణంలో సమోసా చిన్నదిగా ఉండటంతో, ఇది సౌకర్యవంతమైన ప్రయాణ చిరుతిండిగా, సులభంగా జీను సంచుల్లో ప్యాక్ చేసుకుని తినటానికి వీలైనదిగా ప్రాచుర్యం పొందింది. 10వ శతాబ్దపు మద్యప్రాచ్య దేశాలంటే –బాగ్దాద్, ఇరాక్, పర్షియా, ఉత్తర ఆఫ్రికాలతో కూడిన బైజాంటైన్ సమ్రాజ్యం; అలాగే ప్రస్తుత టర్కీ, ఈజిప్ట్ వంటి దేశాలు. ∙సమోసా వంటకం.. మధ్య ఆసియా వాణిజ్య మార్గాల ద్వారా ఢిల్లీ సుల్తానుల కాలంలో భారత ఉపఖండానికి చేరుకుంది. సమోసా త్రిభుజాకారంలో ఉండటానికి కారణం, మొదట దానిని కనిపెట్టిన వారు ఈజిప్టులో లేదా నాటి ఆసియా ప్రాంతాలలో ఉన్న పిరమిడ్ల ఆకృతిలో వాటిని తయారు చేయటమేనని అంటారు. సమోసా భారతదేశానికి వచ్చిన తొలినాళ్లలో కేవలం రాజకుటుంబాలు, ఉన్నతవర్గాల విందులలో మాత్రమే కనిపించేది. చివరికి ఇప్పుడు సామాన్యుల ఆహారంగా మారింది. పర్షియన్ భాషలో త్రిభుజాన్ని ‘సాన్బోసాగ్’ అనీ, ‘సాగోషాగ్’ అనీ అంటారు. అలా వచ్చిందే ‘సమోసా’ అనే మాట. సెప్టెంబర్ 5 వరల్డ్ సమోసా డే. జిలేబీటర్కిష్ తీపి చుట్లుజిలేబీ పశ్చిమ ఆసియా / పర్షియన్ మూలాలు కలిగిన తీపి వంటకం. ఆ ప్రాంతాలలో దీనిని ‘జలాబియా’ లేదా ‘జోల్బియా’ అని పిలుస్తారు. జిలేబీని 15వ శతాబ్దంలో పర్షియన్లు, ప్రధానంగా టర్కిష్ వ్యాపారులు దక్షిణాసియాకు రుచి చూపించారు. క్రమంగా ఇది అద్భుతమై రుచి కలిగిన, చుట్లు చుట్లుగా వేయించిన తీపి వంటకంగా పరిణామం చెందింది.∙విదేశాల నుంచి వచ్చినప్పటికీ జిలేబీ భారతీయ సంస్కృతి, వంటకాలతో లోతుగా ముడిపడి ఉంది. ప్రధానంగా పండుగలు, వివాహాలు, మతపరమైన నైవేద్యాలలో జిలేబీ కనిపిస్తుంది. క్రీ.శ. 10 వ శతాబ్దం నాటి బాగ్దాదీ వంటల పుస్తకంలో ఉన్న ప్రస్తావనను బట్టి జిలేబీ అంతకు ముందు నుంచే ఉందని, ‘జలాబియా’ అనే పురాతన మిఠాయికి ఇది ఆధునిక రూపం అని అనుకోవలసి వస్తుంది. క్రమేణా 15వ శతాబ్దం నాటికి జిలేబీ భారతదేశంలో అందరికీ నచ్చే తీపి వంటకం అయింది. అన్ని వంట పుస్తకాలలో, సందర్భాలలో చోటు సంపాదించుకుంది. బిర్యానీ పర్షియన్ పరిమళంభారతీయ వంటకంగా చాలా మంది పొరపడే బిర్యానీ, పశ్చిమ ఆసియా పాకశాస్త్ర నిపుణులు కనిపెట్టిన అద్భుతం అని చరిత్ర చెబుతోంది. పర్షియా భాష నుంచి వచ్చిన పదమే ‘బిర్యానీ’ అన్నది. పర్షియాలో ‘బిరియన్’ అంటే ‘వంటకు ముందు వేయించినది’ అని అర్థం. ‘బిరింజ్’ అంటే బియ్యం. అలా ‘బిర్యానీ’ అనే మాట స్థిరపడింది. చారిత్రక ఆధారాలను బట్టి క్రీ.శ. 1398లో తైమూర్ భారతదేశం పైకి దండయాత్రకు రావటానికి, బిర్యానీకి పుట్టుకకు మధ్య సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. సైనికుల కోసం వారు బియ్యం, మాంసం కలిపిన వంటకాన్ని కుండలలో వండారని, అలా తయారైందే బిర్యానీ అని ఆధునిక చరిత్రకారులు రాశారు. ఇంకో ఆధారం... అరబ్ వ్యాపారులు, తమిళులు రాసుకున్న పుస్తకాలలో క్రీ.శ 2 నాటికే ‘ఓన్ సోరు’ అని అచ్చంగా బిర్యానీ వంటి వంటకమే ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాదీ బిర్యానీని ఇష్టపడే సినీ జాతీయ స్థాయి సెలబ్రిటీలకైతే లెక్కే లేదు. పేరుకు హైదరాబాదీ బిర్యానీ అయినా, బిర్యానీ షెఫ్ మహానుభావులు మాత్రం పశ్చిమ ఆసియా వాళ్లే.ఫిల్టర్ కాఫీ యెమెన్ ఘుమఘుమ16వ శతాబ్దంలో మక్కా తీర్థయాత్రకు వెళ్లిన కర్ణాటకకు చెందిన సూఫీ సాధువు బాబా బుడాన్ భారతదేశానికి తిరిగి వచ్చే మార్గంలో ఫిల్టర్ కాఫీని కనుగొన్నారనటానికి కొన్ని చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి. బాబా బుడాన్ యెమన్లోని మోచా ప్రాంతం నుండి ఏడు కాఫీ గింజలను తీసుకువచ్చారు. వాటిని అప్పటి పానీయాల తయారీ విధానం ప్రకారం మద్యంలో కాకుండా; పాలు లేదా చక్కెర తోనూ కాకుండా, కేవలం వేడి నీళ్లలో కాఫీ గింజల సారాన్ని తీసి ఫిల్టర్ కాఫీ తయారు చేశారు. (మామూలు కాఫీని కనుగొంది మాత్రం 9వ శతాబ్దపు ఇథియోపియన్లు).భారతదేశంలోని మొట్టమొదటి కాఫీ హౌస్ 1936లో బొంబాయిలోని చర్చిగేట్‌లో ప్రారంభమైంది. ఆ తర్వాత కొన్నేళ్లకే దేశ వ్యాప్తంగా కాఫీ మన దైనందిన జీవితంలో భాగమైంది. ఇండియన్ ఫిల్టర్ కాఫీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. బాబా బుడాన్.. పాలు, చక్కెర లేని ఘుమఘుమల ఫిల్టర్ కాఫీని కనిపెడితే; కాలక్రమంలో భారతీయులు పాలు, చక్కెర కలిసిన కమ్మని పరిమళ భరిత ఫిల్టర్ కాఫీని తయారు చేశారు. ఇందుకు ఫిల్టర్ కాఫీ పౌడర్ (చికోరీతో కలిసినది), ఫిల్టర్ కాఫీ డబ్బా (స్టెయిన్లెస్ స్టీల్), వేడి నీళ్లు అవసరం అవుతాయి. గులాబ్ జామున్ మొఘల్ మిఠాయిగులాబ్ జామున్ భారతదేశంలో ఎక్కువమంది ఇష్టపడే ‘డెజర్ట్’లలో ఒకటి. డెజర్ట్ అంటే తెలిసిందే కదా... భోజనానంతరం తినే స్వీటు. ఈ గులాబ్ జామూన్‌ను ‘లుక్మత్ అల్ ఖాదీ’ అనే అరబిక్ తీపి కుడుములకు (తీపి ద్రావణంలో నానవేసిన ‘ఫ్రైడ్ పిండి ఉండలు’) ఒక కొత్త రూపంగా మొఘలులు కనిపెట్టారు. ఒక అభిప్రాయం ప్రకారం, గులాబ్ జామూన్‌ను మొఘల్ చక్రవర్తి ఆస్థాన షెఫ్ సృష్టించాడు. అందుకోసం ఆ షెఫ్ పర్షియన్, టర్కిష్ డెజర్ట్‌ల నుండి ప్రేరణ పొందాడు. ఇంకో సిద్ధాంతం ప్రకారం ఇది తీపి ద్రావణంలో నానబెట్టిన ప్రాచీన భారతీయ వంటకానికి మరొక రూపం. ఈ విధంగా చూస్తే గులాబ్ జామూన్ మూలాలు భారతదేశంలోనే ఉన్నాయనుకోవాలి. పశ్చిమ బెంగాల్లో ‘లేడీకేనీ’ రకం గులాబ్ జామూన్ ప్రసిద్ధి. 1850లలో కలకత్తాకు చెందిన మిఠాయి తయారీదారులలో ఒకరైన భీమ్ చంద్ర నాగ్‌కు... నాటి గవర్నర్ జనరల్ లార్డ్ చార్లెస్ కానింగ్ నుండి తన సతీమణి లేడీ కానింగ్ కోసం ఒక ప్రత్యేకమైన స్వీట్ తయారు చేయాలని ఆదేశాలు వచ్చాయి. భర్తతో ఉండేందుకు ఆమె భారతదేశానికి వస్తోంది కనుక ఒక కొత్త తియ్యని వంటకంతో ఆమెను ఆశ్చర్యచకితురాలిని చేయాలని లార్డ్ చార్లెస్ అలాంటి ఆదేశాన్ని ఇచ్చారు. మొత్తానికి భీమ్ చంద్ర నాగ్... లేడీ కానింగ్ కోసం ఒక కొత్త గులాబ్ జామూన్ వంటకాన్ని తయారు చేయటంలో విజయం సాధించారు. ఆ తీపి పదార్థం లేడీ కానింగ్‌ను అమితంగా ఆకట్టుకోవటంతో ఆ స్వీట్‌కు లేడీ కానింగ్ అని పేరొచ్చింది. క్రమేణా ఆ మాట ‘లేడీకేనీ’గా మారింది. (చదవండి: వందేళ్ల హైకింగ్ స్టార్..! సెంచరీ వయసులో మొత్తం ఫ్యామిలీతో..) -
వందేళ్ల హైకింగ్ స్టార్..! సెంచరీ వయసులో మొత్తం ఫ్యామిలీతో..
వయసు వంద దాటాక కుర్చీలో కూర్చోవడం బోరుగా అనిపించిందట! జపాన్‌కు చెందిన కోకిచీ అకుజావాకు. దీంతో, వెంటనే హైకింగ్ స్టిక్ పట్టుకుని, మొత్తం ఫ్యామిలీతో ట్రెక్కింగ్ పార్టీ స్టార్ట్ చేసి, రికార్డు సృష్టించాడు. నిజానికి వందేళ్ల వయసు వరకు బతికి ఉండటమే గగనం అనుకుంటే, అప్పటికీ సజీవంగా ఉండేవారిలో చాలామంది కుర్చీలో కూర్చుని టీవీ రిమోట్ కంట్రోల్ పట్టుకోవడం తప్ప వేరేమీ చేయలేరు. కాని, 102 ఏళ్ల వయసు నిండిన ఈ బాబాయి మాత్రం రిమోట్‌కి బదులు హైకింగ్ స్టిక్ పట్టుకుని నేరుగా 12,000 అడుగుల ఫుజీ శిఖరాన్ని అధిరోహించాడు. అంతే కాదు, తన 70 ఏళ్ల కూతుర్ని కూడా ‘హే, లెట్స్ గో!’ అంటూ వెంట తీసుకెళ్లాడు. అలా మొత్తం ఫ్యామిలీతో కలిసి ఒక పెద్ద పిక్నిక్లా ట్రెక్కింగ్ పూర్తి చేశారు. మధ్యలో కొంచెం అలసటగా అనిపించినా, స్నేహితులు, కూతురు, మనవరాలు ఇచ్చిన మోటివేషన్ ఆయనను మళ్లీ కదిలించింది. మొత్తం రెండు రాత్రులు పర్వత మార్గంలో టెంట్ వేసి గడిపి, చివరికి శిఖరాన్ని చేరి, ఆ అపురూప క్షణాలను ఫేస్బుక్ లైవ్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ విజయంతో, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా వెంటనే సర్టిఫికెట్ ఇచ్చేసింది. ఇదేం.. మొదటి రికార్డ్ కాదు.నిజానికి, అకుజావా 96 ఏళ్ల వయసులోనూ ఇదే పర్వతాన్ని అధిరోహించాడు. ఆ తర్వాత ఆరోగ్య సమస్యల కారణంగా కొంచెం విరామం తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ నూటారెండేళ్ల వయసులో ఫుజీ వైపు అడుగులు వేశాడు. ‘పర్వతం ముందు అందరూ సమానులే. ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళడమే అసలు ఆ గేమ్’ అంటాడాయన. ప్రస్తుతం ఆయన ఒక వృద్ధాశ్రమంలో వాలంటీర్‌గా గడుపుతూ, ఇంట్లో పెయింటింగ్స్ వేస్తూ, ఫ్యామిలీకి కొత్త కొత్త ఆర్ట్ రిక్వెస్టులు నెరవేర్చుతూ బిజీగా ఉంటున్నాడు. (చదవండి: ఎలాన్ మస్క్ 'బేకరీ'.. కానీ ఇక్కడ కేక్‌లు, పేస్ట్రీలు ఉండవు..) -
పిప్పలుడి గర్వభంగం
కశ్యపుడి వంశంలో పిప్పలుడు అనే విప్రుడు ఉండేవాడు. అతడు శమదమాది సద్గుణ సంపన్నుడు. శీత వాత ఆతపాదులను ఒకేరీతిలో సహించగల స్థిరచిత్తుడు. వేదవేదాంగాలను అధ్యయనం చేసిన పండితుడు. పిప్పలుడు నిత్య దరహాస ముఖారవిందంతో ఉండేవాడు. నిత్య నైమిత్తిక కార్యాలను క్రమం తప్పకుండా ఆచరించేవాడు. ఒకసారి పిప్పలుడు తపస్సు ప్రారంభించాడు. అతడి తపస్సు నానాటికీ తీవ్రం కాసాగింది. అతడు తపస్సు ప్రారంభించి వెయ్యేళ్లు గడిచింది. కేవలం వాయుభక్షకుడిగా ఉంటూ నిశ్చలంగా ఒకేచోట కూర్చుని తపస్సు చేస్తుండటంతో అతడి శరీరం శల్యావశిష్టమైంది. శరీరంపై చీమల వంటి కీటకాలు పుట్టలు పెట్టాయి. వాటి చుట్టూ తీగలు, లతలు పాకాయి. పిప్పలుడి చుట్టూ ఏర్పడిన పుట్టలలోంచి అగ్నిజ్వాలలు వెలువడసాగాయి. దేవతలు అతడి తపోతీవ్రతను నివ్వెరపోయి తిలకించసాగారు. అతడి తపస్సు ఎన్నాళ్లకూ చెదరకపోవడంతో సంతోషించిన దేవతలు, అతడి మీద పుష్పవృష్టి కురిపించారు.‘విప్రోత్తమా! నువ్వు వేదవేదాంగ కోవిదుడవు. శ్రుతిస్మృతి విహిత ధర్మజ్ఞుడవు. నీ తపస్సుకు మేమంతా సంతోషించాం. ఏ వరాలు కావాలో కోరుకో! తప్పక నెరవేరుస్తాం’ అని పలికారు.దేవతల మాటలు వినిపించగానే పిప్పలుడు కళ్లు తెరిచాడు. ఎదుట కనిపించిన దేవతలకు వినయంగా నమస్కరించాడు. ‘దేవతలారా! మీ దయానుగ్రహాలకు పరవశుడనయ్యాను. నేను విద్యాధరుడనై, కామగమనుడనై, సువర్ణ రత్నఖచిత దివ్యరథంలో సకల లోకాలలో సంచరించేలా వరాన్ని అనుగ్రహించండి’ అని ప్రార్థించాడు. దేవతలు ‘తథాస్తు’ అని వరం అనుగ్రహించి, అంతర్ధానం చెందారు.దేవతల వరప్రభావంతో పిప్పలుడు సకల విద్యావిశారదుడై, విద్యాధరుడయ్యాడు. మణిమయ స్వర్ణ విమానంలో సకల లోకాలలోనూ యథేచ్ఛగా సంచరించసాగాడు. జగమంతా తన స్వాధీనమైందని సంబరపడసాగాడు. సంకల్ప మాత్రాన ఎక్కడికైనా స్వేచ్ఛా విహారం చేయగల శక్తి సంక్రమించడంతో పిప్పలుడిలో గర్వం పెరిగింది.‘ముల్లోకాలలోనూ నన్ను మించినవాడు వేరొకడు లేడు. దేవ దానవ మానవులలో నన్ను మించినవాడు మరొకడు ఉండడు’ అనుకోసాగాడు.ఒక నదీతీరంలో నివాసం ఉండే ఒక సారసపక్షి పిప్పలుడి తీరుతెన్నులను చాలాకాలంగా గమనించసాగింది. ఒకనాడు ఆ సారసపక్షి ‘ఓ విప్రోత్తమా! జగమంతా నీ స్వాధీనమైందని, సంకల్పమాత్రాన సకలలోక సంచారం చేయగలుగుతున్నందున మహామహిమాన్వితుడవయ్యానని గర్విస్తున్నావు. ఘోర తపస్సులు చేసి, దేవతల నుంచి అనేక దివ్యవరాలు పొందినా, గర్వోన్నతి వల్ల అధోగతి పాలైన వారి గురించి నువ్వు ఎరుగవు. నువ్వు పరాపరాలను ఎరుగవు. నువ్వు మూఢుడివి. కుండలపుత్రుడైన సుకర్ముడనే విప్రుడు పరాపరాలైన ఆత్మానాత్మలను ఎరిగిన విజ్ఞుడు. అతడితో సమానుడైన జ్ఞానవంతుడు ముల్లోకాలలోనూ మరొకడు లేడు. వేదాధ్యయన సంపన్నుడు, సకల శాస్త్రకోవిదుడు అయిన సుకర్ముడు యజ్ఞయాగాదులేవీ ఆచరించలేదు. బాల్యం నుంచి అనునిత్యం మాతృపితృ సేవలో తరిస్తూ, ఆ కర్మయోగ ప్రభావంతో మహాజ్ఞానిగా ఎదిగాడు. నువ్వు జ్ఞానహీనుడివై అనవసరంగా గర్విస్తున్నావు’ అని పలికింది.సారసపక్షి మాటలకు పిప్పలుడు ఉక్రోషం చెంది, ‘పక్షి రూపంలో నన్ను నిందిస్తున్నావు. దేవ దానవ యక్ష గంధర్వాదులలో నువ్వెవరివి? పరాపరాలైన ఆత్మానాత్మలు ఏవి? వాటి స్వరూపమేది? చెప్పు’ అన్నాడు.‘కుండల పుత్రుడైన సుకర్ముడి వద్దకు వెళ్లి, అడుగు. ఆత్మానాత్మ స్వరూపాన్ని అతడే నీకు చెప్పగలడు’ అని పలికింది సారసపక్షి.పిప్పలుడు కుండలుని ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో సుకర్ముడు తన తల్లిదండ్రులకు పాదసేవ చేస్తూ కనిపించాడు. అది చూసి, పిప్పలుడు ద్వారం వద్దనే నిలిచిపోయాడు.సుకర్ముడు ద్వారం వద్ద నిలిచి ఉన్న పిప్పలుడిని గమనించి, వెంటనే లేచి వెళ్లి అతడిని స్వాగతించి, లోనికి తీసుకువచ్చాడు. ఉచితాసనంపై కూర్చుండబెట్టి, కుశల ప్రశ్నలు వేశాడు.‘పిప్పలా! నీ వృత్తాంతం నాకు తెలుసు. సారసపక్షి నీ గర్వాన్ని పరిహసించి, నా వద్దకు పంపడం వల్లనే ఇలా వచ్చావు కదూ’ అన్నాడు సుకర్ముడు.సుకర్ముడి మాటలతో పిప్పలుడికి కాసేపు నోట మాట రాలేదు. కొద్దిసేపటికి తేరుకుని, ‘నువ్వు మహాజ్ఞానివని, పరాపరాలైన ఆత్మానాత్మలను నువ్వెరుగుదువని ఆ పక్షి నాతో చెప్పింది. ఆత్మానాత్మల నిజస్వరూపమేది? నాకు వివరంగా చెప్పు’ అని అడిగాడు.పిప్పలుడికి తన పట్ల శంక తొలగిపోలేదని అతడి ప్రశ్నల ద్వారా గ్రహించాడు సుకర్ముడు.అతడికి విశ్వాసం కలిగించడానికి ఇంద్రాది దేవతలను ఆహ్వానిస్తూ ఆవాహన మంత్రాలు పఠించాడు.వెంటనే అక్కడ ఇంద్రాది దేవతలు ప్రత్యక్షమయ్యారు. ‘సుకర్మా! మమ్మల్ని ఎందుకు పిలిచావు?’ అని అడిగారు.‘దేవతలారా! ఈ పిప్పలుడికి విశ్వాసం కలిగించడానికే మిమ్మల్ని ఆహ్వానించాను. అంతకంటే వేరే ప్రయోజనం ఏదీ ఆశించి కాదు. ఇక మీరు మీ నిజస్థానాలకు వెళ్లవచ్చు’ అన్నాడు.‘నిష్ఫలంగా వెళ్లడం మాకు తగదు. ఏదైనా వరం కోరుకో’ అన్నారు దేవతలు.‘నాకు అనవరతం మాతా పితృభక్తిని, వారికి వైకుంఠవాస ప్రాప్తిని కలిగించండి. అంతే చాలు’ అన్నాడు సుకర్ముడు.దేవతలు ‘తథాస్తు’ అని పలికి అంతర్ధానమయ్యారు.ఇదంతా పిప్పలుడు చేష్టలుడిగి తిలకించాడు.సుకర్ముడు అతడితో ‘పిప్పలా! నిన్ను నా వద్దకు పంపిన సారసపక్షి సాక్షాత్తు చతుర్మఖ బ్రహ్మ’ అని చెప్పి, ఆత్మజ్ఞానాన్ని బోధించాడు.∙సాంఖ్యాయన -
కథాకళి: ముప్పు
భూమికి కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలోని గెలాక్సీ నుంచి వచ్చిన ఆ వ్యోమనౌకలోంచి కొందరు దిగారు. వారందరి సగటు ఎత్తు నాలుగు అడుగుల రెండు అంగుళాలు. వారు తమ వెంట తెచ్చిన ఓ డజనుమంది ఖైదీలని భూగోళం మీద దింపారు. వారంతా జంటలే. వారి చేతులకి వేసిన బేడీలని విప్పారు. ‘‘మీరు చేసిన ఘాతుకాలకి మిమ్మల్ని మనం గ్రహం నుంచి వెలివేయడంతో ఇక్కడికి తెచ్చి వదలమనే తీర్పుని అమలు చేస్తున్నాం. చివరగా మీరు చెప్పుకోవాల్సింది ఏదైనా ఉందా?’’ ఆ నౌక కెప్టెన్ అడిగాడు.‘‘మా స్వగ్రహం నుంచి ఇలా దూరంగా మమ్మల్ని పంపడం సబబు కాదని, ఇక మీదట ఎలాంటి నేరాలు చేయమని, తిరిగి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళమని కోరుతున్నామని మన రాజుకి చెప్పండి.’’ ఆ డజనుమందిలోని ఒకరి భార్య ఆవేదనగా చెప్పింది.‘‘చెప్తాం. మీ సందేశం ఆయనకి చెప్పినా ప్రయోజనం ఉంటుందని అనుకోము. ప్రశాంతంగా జీవించేవారికే ఆ గ్రహం. మనలో ఎవరిలో నేరప్రవృత్తి ప్రవేశిస్తుందో వారి డీఎన్ఏ పుట్టేవారు మన గ్రహంలో ఉండకూడదని, వారిని వెలివేయాలనే చట్టాన్ని మన రాజుగారు అమలు చేశారు. ఇది మన గ్రహంలోని శాంతికి ముఖ్యమని రాజుగారు భావిస్తున్నారు.’’‘‘అక్కడ మీరు చేసిన నేరం ఘోరాతి ఘోరమైంది. మన గ్రహవాసులు అందర్నీ ఒకేసారి చంపే మారణాయుధాన్ని తయారు చేసి, మన రాజుని బెదిరించి డబ్బు కోరారు. కాబట్టి గ్రహ బహిష్కరణ శిక్షని అమలు జరిపి వెళ్ళిపోతున్నాం.’’ మరొకరు చెప్పారు.వాళ్ళు ఆ వ్యోమనౌకలోకి ఎక్కడం, అది పైకిలేచి క్రమంగా దూరమై కనపడకుండా పోవడాన్ని చూశారు. క్షణాల్లో కనుమరుగైన ఆ వ్యోమనౌకని చూశాక వారిలోని ఒకడు క్రూరంగా నవ్వి చెప్పాడు.‘‘వాళ్ళు తిరిగి వెళ్ళాక కాని మన శక్తి తెలీదు. సమయానికి మనం డీయాక్టివేట్ చేయడం లేదు కనుక ఆ మారణాయుధాలన్నీ పేలిపోయి, ఆ గ్రహానికి వెళ్ళాక వాళ్ళకి అక్కడ శ్మశానం తప్ప మరేం కనిపించకపోవడంతో మన తడాఖా అర్థమవుతుంది.’’ఆ నేరస్తులంతా చుట్టూ చూశారు. రాళ్ళు, రప్పలు, మట్టి. దూరంగా పచ్చదనం కనిపించడంతో అటువైపు నడిచారు. ఆ చెట్లకి కాసిన పళ్ళవంక చూసి వారిలోని ఒకరు ఆనందంగా చెప్పారు.‘‘అమ్మయ్య! ఈ గ్రహంలో తిండికీ, నీళ్ళకి కొరత లేదు.’’‘‘నీళ్ళేవి?’’ మరొకరు చుట్టూ చూస్తూ అడిగారు.‘‘వెదికితే కనిపిస్తాయి. నీళ్ళు లేకుండా చెట్లు జీవించలేవు కదా?’’ఆ డజనుమంది భార్యాభర్తలు ఆ గ్రహాన్నంతా తిరిగి చూడసాగారు.వందేళ్ళల్లో వారు ఏడు వందల ముప్ఫై రెండుమందిగా మారారు. మరో వందేళ్ళల్లో పదిహేను వేల ఆరువందల ఎనభై నాలుగు మందిగా... అలా ప్రతి శతాబ్దానికీ ఆ జాతి అభివృద్ధి చెందసాగింది. ఒకే భాష మాట్లాడే గ్రహం నుంచి వాళ్ళు వచ్చారు. కాని ఈ గ్రహంలోని వారు దెబ్బలాడుకుని అనేక ప్రాంతాలకి వెళ్ళడంతో అనేక భాషలు ఏర్పడ్డాయి. వాతావరణం వల్ల చర్మం రంగులో మార్పు సంభవించింది. చట్టాల్లో, ఆచార వ్యవహారాల్లో వారి మధ్య స్పష్టమైన భేదం ఉంది. అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచాక కాలంతో పాటు వారి మేధస్సు కూడా అభివృద్ధి చెందింది.తమ పూర్వీకులు ఓ గ్రహం నుంచి బహిష్కరించబడ్డారన్న సంగతే నేటి ఆ గ్రహవాసులకి తెలీదు. కారణం తెలీకపోయినా ఈ గ్రహానికి ఎందుకు పంపబడ్డారో సరిగ్గా ఆ నేరాన్నే వాళ్ళు కొత్త గ్రహంలో చేశారు. వారి డీఎఏ కారణంగా అలాంటి మారణాయుధాలను ఆ జీవులు కనిపెట్టి తయారు చేశారు. అప్పటికి వారి సంతతి సంఖ్య మూడు వందల డెబ్భైరెండు కోట్లకి చేరుకుంది.ఓ రోజు ఓ దేశపాలకుడు పిచ్చి ఆవేశంతో మారణాయుధాలు లేని దేశం మీదకి తమ మారణాయుధాలని ప్రయోగించాడు. దాంతో ఆ దేశం లొంగింది. ఆ తర్వాత మరో పది దేశాలు కూడా ఆ మారణాయుధాలని తయారు చేసుకున్నాయి. ఆ గ్రహం మీది జనాభా పధ్నాలుగు వందల ఏభై నాలుగు కోట్లకి చేరుకున్నాక ఓ రోజు ఉన్మాదైన మరో దేశపాలకుడు తోటి మారణాయుధాలు గల దేశం మీదకి ఆకస్మికంగా తమ మారణాయుధాలని ప్రయోగించాడు. అది తెలిసి ఆ దేశం కూడా అవి తమని చేరుకునేలోగా జవాబుగా ఆ దేశం మీదకి తమ మారణాయుధాలని కూడా ప్రయోగించింది. మొదటగా ప్రయోగించిన దేశానికి చెందిన మిత్రదేశం అదే అదనుగా భావించి అది మద్దతు ఇచ్చే తమ శత్రుదేశం మీదకి మారణాయుధాలని ప్రయోగించింది. వారం రోజులు గడవకుండానే ఆ గ్రహంలోని మారణాయుధాలన్నీ ప్రయోగించబడ్డాయి. అకస్మాత్తుగా ఉష్ణోగ్రత పెరగడంతో ఓ ఖండంలోని మంచు శిలలు కరిగి ప్రవహించి, ఆ గ్రహం ఉపరితలం మీదకి ఐదు వేల అడుగుల పైకి నీరు చేరుకుని ముంచేసింది.ఏ అపరాధం వల్ల లక్షల సంవత్సరాల క్రితం ఆ గ్రహానికి ఆ జీవులు పంపబడ్డారో అదే అపరాధం వల్ల ఆ గ్రహంలోని వారి జాతి అంతరించి, ఆ గ్రహం మీద తిరిగి ప్రశాంతత నెలకొంది.జరగబోయేది ముందే గ్రహించిన, మొదటగా ఆ గ్రహం మీదకి వచ్చిన మేధావులైన ఆ డజనుమంది, జలప్రళయంతో తమ జాతి అంతరిస్తుందని చెప్పిన విషయం తరతరాలుగా కథగా చెప్పబడింది.FEED ME A STORY : మల్లాది వెంకట కృష్ణమూర్తి ‘ఫన్డే’లో ప్రచురితమయ్యే ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడాభాగస్వాములను చేయనున్నారు. మీరైతే ఈ కథకు ఏ పేరు పెడతారో ఈ కింది మెయిల్‌కు పంపండి. kathakalisakshi@gmail.com -
ఈ వారం కథ: సెవ్వుసాని
చుక్కపొద్దున కోళ్ళ కూతలతో తిరుపతి గోవిందరాజ స్వామి గుడి చుట్టూ ఉన్న మాడవీధుల్లోని వాళ్ళు మేలుకొని స్నాన పానాదులతో సిద్ధమౌతున్నారు. ఉత్తర మాడ వీధిలోని చిన్న జియ్యంగారు మఠం నుండి దివిటీ పట్టుకొని, తాళం పెట్టెను భుజం మీద పెట్టుకొని ఆలయ తలుపులు తెరవడానికి కైకాలరెడ్డి జియ్యంగారుతో బయలుదేరాడు. కొంచెంసేపటికి ఆలయ గుడిలో నుండి స్వామి వారిని మేలుకొలుపుతూ అర్చకులు పాడే సుప్రభాత సేవ మొదలైంది. ఎద్దుల బండ్ల మీద నుంచి వచ్చిన సుదూరప్రాంత యాత్రికులు బండ్ల వీధిలో బండ్లను నిలిపి గ్రామ చావడిలో తమ పేర్లను నమోదు చేసుకొంటున్నారు. అక్కడే వారికి అడ్డంగా మూసిన ఇనుప ప్రవేశ ద్వారాన్ని తెరిచారు. నాలుగు కాళ్ళ మంటపం వరకు గుమిగూడిన జనం ‘గోవింద! గోవిందా!!’ అంటూ గుడివైపు వెళ్ళారు. గుడితో పాటు మాడ వీధులన్నీ యాత్రికుల రాకతో సందడిగా మారిపోయాయి. స్వామివారి నైవేద్య గంటలు ఆ ప్రాంతమంతా మారుమోగాయి. ఉత్తర మాడ వీధిలోని నమ్మాళ్వారు గుడి పక్కనుండే ఓ విశాల ప్రాంగణం కలిగిన చిన్న అంతఃపురంలాంటి భవనం ముందు దివిటీలు పట్టుకొని కొందరున్నారు. అలాగే తలకు తెల్లని పాగాలను చుట్టుకొని, మోకాళ్ళ వరకు గోచీ పంచె కట్టుకొని ఆరుగురు బలిష్టమైన బోయలున్నారు. చూడచక్కని పల్లకి ఆ భవనం ముందు ఆగి ఉంది. బాగా అలంకరించుకొని ఉన్న అందమైన స్త్రీలు భవనం నుండి బయటకొచ్చారు. తిరుపతిని కప్పేసిన చీకటి తొలగిపోలేదు. మేలిముసుగులో ఒక అప్సరలాంటి స్త్రీ అటు ఇటు చెలికత్తెలతో బయటకొచ్చింది. కాంతిపుంజంలాంటి ఆమెను చూసిన చీకటి సూర్యకాంతేమోనని భయపడినట్లు ఆ ప్రాంగణంలో చిన్నబోయింది. ఆమె ఒయ్యారంగా పల్లకీలో ఎక్కి కూర్చుంది. పల్లకీకి అటు ఇటు ఉన్న పారదర్శక పరదాలు గాలికి రెపరెపలాడుతున్నాయి. పట్టు చమ్కీ పరదాలు మెరుపు తీగలాంటి ఆమె ముందు మెరియలేక తమ ఓటమిని అంగీకరిస్తూ తలలు వాల్చేశాయి. పున్నమి ముందు రోజు చంద్రుడు ఆమెను చూసి అసూయతో పడమటి కొండల్లోకి జారుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. బోయలు ముందు ముగ్గురు, వెనుక ముగ్గురు పల్లకీ కొయ్య తండులను లేపి భుజం మీదకు ఎత్తుకొని బయలుదేరారు. పల్లకీ ముందు దివిటీ పట్టుకొన్న వ్యక్తులు కదిలారు. పల్లకి వెనుక వైపు చెలికత్తెలు, పరివార జనం కదిలారు. కత్తులు, బల్లేలు చేత పట్టుకొని చుట్టూ భటులు రక్షణగా వెంట నడిచారు. వీళ్ళు సమ్మాళ్వారు గుడికి పడమరవైపు ఆనుకొని ఉండే దారి గుండా వెళ్తూ తీర్థకట్ట వీధిలోకి ప్రవేశించారు. ‘హరోం హరహర హరహర’ అంటూ బోయలు పల్లకీని మోసుకొంటూ నాదముని అగ్రహారాన్ని దాటుకొని తీర్థకట్ట వీధిలోని కొత్త వీధి మొదటనున్న వేంకటేశ్వరస్వామి గుడి ముందు ఆపి అందరూ నమస్కారాలు చేసుకున్నాక కపిలతీర్థం రహదారి మీదకొచ్చారు. అక్కడి నుంచి జియ్యంగార్ గుడి దాటుకొని, మంగలోళ్ల బావి, అచ్యుతరాయపురం మీదుగా కపిలతీర్థం ముందుకొచ్చి ఆగారు. ఆ రోజు కార్తీక పౌర్ణమి కావడంతో కపిలతీర్థంలో పుణ్యస్నానాలు చేయడానికి కొందరు జనం అప్పటికే ఉన్నారు. పల్లకీ దిగుతూనే అరుణోదయమైంది. మెల్లగా వెలుగు రేఖలు పడుతూనే చీకట్లు తొలిగాయి. వెలుతురు విరజిమ్మింది. పల్లకీలో దిగిన స్త్రీని గుర్తుపట్టి అక్కడున్న జనం ఆమెను చూడడానికి ఎగబడ్డారు. అందాలను రాశి బోసినట్లు ఉండే ఆమె మంద గమనంతో అక్కడున్న జనానికి చిరునవ్వుతో నమస్కరిస్తూ సాయుధ భటుల సహాయంతో కపిలతీర్థంలోని కోనేరుకు పడమర వైపున్న సంధ్యావందన మంటపంలోకి అడుగు పెట్టింది. చిన్నగా వెళ్ళి దుస్తులు మార్చుకొనే గదిలోకి వెళ్ళింది. ఆమె పరివారం ఆమె ఆభరణాలను, దుస్తులను తీసి జాగ్రత్త చేసి, స్నానాలాచరించే దుస్తుల్ని ధరింపజేసి కపిల తీర్థం జలపాతం దగ్గరకు తీసుకెళ్ళారు. వారం ముందు కురిసిన వానల వల్ల జలపాతం ఆకాశగంగలా కోనేటి గట్టుమీదికి దుముకుతోంది. ఆమెను చెలికత్తెలు జలపాతంలో పవిత్ర స్నానాలు చేయించారు. ముఖానికి, చేతులు కాళ్ళకు పసుపు రాశారు. ఆమె భక్తితో నమస్కరిస్తూ కపిలతీర్థం జలపాతంలో స్నానమాచరించింది. బట్టలు మార్చుకోవడానికి చెలికత్తెలతో స్నానాల గదికి వెళ్ళింది. ‘ఇంతకీ ఎవరామె మనల్ని ఎందుకు ఇక్కడే ఆపేశారు?’ అడిగారు ఒక భక్తుడు అక్కడున్న ఆలయ సిబ్బందిలోని ఒక వ్యక్తితో. ‘ఆమె సెవ్వుసాని. గోవిందరాజస్వామి గుడి దేవదాసి. ఆమెకున్న పలుకుబడి సామంతరాజులకు కూడా లేదు. ఆమె కపిలేశ్వరస్వామి గుడిలోకెళ్ళేంత వరకు మీరు వేచి ఉండాల్సిందే’ అన్నాడు ఆలయ ఉద్యోగి వెంకటయ్య. ‘మమ్మల్ని ఈ కోనేటి ఒడ్డున నిలిపితే నిలిపారు గానీ ఒక దేవకన్యను కళ్లారా చూసినట్లైంది’ అన్నాడు ఆ గుంపులోని మరొకడు. ‘ఇంతకీ మీరు ఏ ఊరి నుండి వచ్చారు? మీ పేరేమి?’ అడిగాడు వెంకటయ్య. ‘మాది శ్రీరంగం. నా పేరు రంగరాజన్. మేము పదిమంది కలిసి బండ్ల మీద తిరుపతికొచ్చాం. కపిలతీర్థంలో స్నానం చేశాకే కదా కొండెక్కాలి. అందుకని ఇక్కడికొచ్చాం. పైగా ఈ రోజు కార్తీక పౌర్ణమి. ఇలాంటి ప్రముఖ వ్యక్తులు ఇక్కడకు వస్తారని మేము ఊహించలేదు. మేము తమిళప్రాంతం నుండి వచ్చాము కాబట్టి ఈమె గురించి మాకు తెలియదు. అందుకని ఈమె ఎవరని అడిగాం. ఇంతటి అప్సరస తిరుపతిలో దేవదాసీగా ఉందంటే ఆశ్చర్యంగా ఉంది. మా శ్రీరంగంలోని దేవదాసీ కూడా ఇంత అందంగా లేదు. ఈమె ఇక్కడే పుట్టిందా?’ అడిగాడు రంగరాజన్, ‘ఈ సెవ్వుసాని విజయనగర రాజధానిలో పుట్టి పెరిగింది. తన నృత్యంతో శ్రీకృష్ణదేవరాయలను మంత్రముగ్ధుల్ని చేసేది. రాయలవారు ఈమె పట్ల ఎంతో వాత్సల్యాన్ని ప్రదర్శించేవారు. ఆమెకు ఎనలేని సంపదలను బహూకరించారు. ఆమెకు తిరుపతి అంటే ఎంతో మక్కువ. అప్పుడప్పుడు తిరుపతికి వచ్చినప్పుడు చంద్రగిరిలో ఉండే అచ్యుత దేవరాయల ఆతిథ్యం తీసుకొని తిరుమలేశుని సందర్శించి, తన పరివారంతో విజయనగర రాజధానికి చేరుకొనేది. ఆమె అంటే అచ్యుతదేవరాయలకు ఎనలేని అభిమానం. అనురాగం. శ్రీ కృష్ణదేవరాయల మరణానంతరం ఆయన మరణ శాసనాన్ని అనుసరించి తమ్ముడైన అచ్యుత దేవరాయలు విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. అచ్చుత దేవరాయలు ఇరవై ఏళ్ళు చంద్రగిరిలో ఉండడం వల్ల ఆయన తరచు చంద్రగిరి చుట్టు పక్కలుండే గుళ్ళను దర్శించేవారు. ఆయన సందర్శించే గుళ్ళల్లో శ్రీ గోవిందరాజస్వామి గుడి ఒకటి. ఆ గుడి పురోభివృద్ధికి సాధ్యమైనంత వరకు తన సహాయ సహకారాలను అందించేవారు. ఉత్సవ, ఊరేగింపుల్లో గోవిందరాజస్వామికి నృత్యగానాలు లేకపోవడం వెలితిగా తోచింది అచ్యుత దేవరాయలకు. తనకు ఏదైనా మంచి జరిగితే ఒక దేవదాసీని ఆలయానికి బహూకరిస్తానని మొక్కుకున్నాడు. ఊహించని విధంగా తన అన్న కృష్ణదేవరాయల మరణ శాసనాన్ని అనుసరించి తాను సమస్త విజయనగర సామ్రాజ్యానికి ప్రభువైనాడు. కొన్నాళ్ళకు తన మొక్కుబడిని గురించి అంతఃపురంలో ఉన్న నాట్యకత్తెలకు తెలియజేశాడు. అందరూ తటపటాయిస్తుంటే సెవ్వుసాని తాను దేవదాసీగా గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్తానని ముందుకొచ్చింది. విజయనగరంలోనే మేటి అందగత్తె సెవ్వుసాని సమ్మతించగానే ఆమెను తిరుపతికి పంపి గోవిందరాజస్వామికిచ్చి వివాహం చేసి ఆ దేవునికి దాసిగా మార్చారు’ అన్నాడు వెంకటయ్య.‘అప్పటి వరకు ఆమెకున్న సంపదను ఏమి చేశారు?’ అడిగాడు రంగరాజన్.‘ఆమె సకల సంపదలతో పాటు మంది మార్బలాన్ని, పరివారాన్ని, చెలికత్తెలను తిరుపతికి పంపుతూ అచ్యుతదేవరాయలు మరికొంత సంపదను ఆమె వెంట ఆనందంగా పంపాడు. త్వరలో తానొచ్చి గోవిందరాజస్వామిని దర్శిస్తానన్నాడు. అన్న ప్రకారం కొన్నాళ్ళకు జైత్రయాత్రలో భాగంగా తిరుపతికొచ్చి స్వామి వారిని దర్శించుకొన్నాడు. ఆ సందర్భంగా రెండు రోజులు ఏర్పాటు చేసిన ఉత్సవ ఊరేగింపుల్లో పాల్గొన్నాడు. సెవ్వుసాని ధ్వజస్తంభం ముందుండే నాట్య మంటపాల్లో చేసిన నృత్యానికి పరవశించిపోయాడు. చెంతనే ఉన్న సామంత రాజులు పులకించిపోయారు. ప్రధాన వీధుల్లో స్వామి ఊరేగింపుల్లో పాల్గొన్నాడు. ఇసుకేస్తే రాలని జనంతో తిరుపతి నిండిపోయింది. దారి వెంబడి పూలతో, మామిడి తోరణాలతో, అరటి మానులతో అలంకరించారు. మిద్దెలపై నుండి జనం పూల వర్షం కురిపించారు. అచ్యుతరాయలు సెవ్వుసాని గానంతో కూడిన నాట్యాన్ని తనివితీరా వీక్షించాడు. చివరిరోజు స్వామివారికి అనేక వజ్రవైఢూర్యాలతో కూడిన ఎన్నో ఆభరణాలను బహూకరించాడు. మరెన్నో ఇనాంలను ప్రకటించాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు స్వామి తనని ఇంతటి వాడిని చేశాడనే కృతజ్ఞతతో. ఆ తర్వాత ఆలయం పక్కనే ఉత్తర మాడవీధిలో ఉన్న సెవ్వుసాని భవనానికెళ్ళి ఆమెను బంగారు వరహాలతో అభిషేకించాడు. తన మాట నిలిపినందుకు విలువైన ఆభరణాలను అందజేశాడు. తర్వాత దక్షిణ దేశ జైత్రయాత్రలో విజయుడై విజయనగరానికి చేరుకొన్నాడు.‘అప్పటి నుండి సెవ్వుసాని తిరుపతిలోనే స్థిరపడిపోయిందా?’ అడిగాడు రంగరాజన్.‘అవును అప్పటినుండి ఇప్పటికీ ఆమె తిరుపతిని వీడలేదు. గోవిందరాజస్వామిని నృత్య నీరాజనాలతో ఆరాధిస్తోంది. ఆమెను చూడడానికి ఎంతో పెద్ద ధనవంతులు ఆమె ఇంటి ముందు వరుసలో నిల్చొని ఎదురు చూస్తుంటారు. ఆమె దేవుడినే తన భర్తగా భావించి, ఎలాంటి వారినీ ఇంట్లోకి అనుమతించేది కాదు. పైగా చుట్టు పక్కల సామంత రాజులకు కూడా ఆమె అంటే ఎంతో భయం. ఆమె జోలికి వెళ్ళేవారు కాదు. అంతేగాక పరిపాలనా అనుకూలతల కోసం ఆమె సహాయ సహకారాలను అర్థించేవారు. ఎందుకంటే ఆమె విజయనగర సామ్రాజ్యాధీశునికి అత్యంత సన్నిహితురాలు. ఆమె తలచుకొంటే పదవులు వూడిపోతాయి. తలలు తెగిపడతాయి. ఆమె పరపతి అలాంటిది’ అన్నాడు వెంకటయ్య.సెవ్వుసాని రాకముందే పుణ్యస్నానాలు ఆచరించిన వాళ్ళు కపిలేశ్వరస్వామిని దర్శించి వెళ్ళిపోయారు. సెవ్వుసాని పరివారంతో కలిసి కోనేటిగట్టు మీదుండే సంధ్యావందన మంటపం నుండి వయ్యారంగా నడుస్తూ రాతి మెట్లెక్కి కపిలేశ్వర స్వామిని దర్శించడానికెళ్ళింది. స్వామివారిని దర్శించాక నాగ పడిగలను ప్రదక్షిణం చేసుకొని చక్కటి ముగ్గువేసి మధ్యలో 365 ఒత్తులతో పిండి దీపం వెలిగించి దణ్ణం పెట్టుకొంది. అర్చకులు అందజేసిన ప్రసాదాలను తిని; కపిలేశ్వరస్వామి మహిమల్ని గూర్చి; కార్తీక పౌర్ణమి విశిష్టతను గూర్చి; కోనేటి ప్రవేశ ద్వారంలోని సువిశాల మంటపానికి అటు ఇటు ఉన్న లక్ష్మీ నారాయణస్వామిని గూర్చి; శ్రీకృష్ణ సమేత దేవేరులను గూర్చి అర్చకస్వాములు చెప్తుండగా ఆనందంగా వింటూ తిరుమల కొండను దగ్గర నుండి చూస్తూ పరవశించిపోసాగింది. ఇంతలో గాలులు మొదలయ్యాయి. ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమైంది. తుంపర్లతో మొదలవ్వాల్సిన వాన అనుకోని ఉపద్రవంలా పెద్ద పెద్ద చినుకులతో హఠాత్తుగా దండయాత్ర చేసింది. కాసేపటికి తగ్గిపోతుందనుకున్నారంతా. కాని, రాను రాను వర్షం భీకరమైంది. మెరుపులు, ఉరుములతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. మనుషుల్ని సైతం నెట్టేసే గాలులు మొదలయ్యాయి. కపిలేశ్వరస్వామి గుడి ఆవరణ నుండి కోనేటి గట్టున పెద్దగా నిర్మించి ఉన్న ముఖద్వారం మంటపానికి సెవ్వుసాని పరివారం చేరుకున్నారు.పెద్ద గాలివాన. ఉన్నట్టుండి వాతావరణం ఇంత ప్రళయంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. రెండు గడియలపాటు కుంభవృష్టి కురిసింది. జలపాతం హెూరు చెవులు చిల్లు పడేలా ఉంది. కొండల్లోని ఎర్రని మట్టితో కలిసి జలపాతం విస్తరించి దుముకుతోంది. కోనేరు అలల తాకిడితో కంపించిపోతోంది. నల్లని మబ్బులతో పట్టపగలే చీకట్లు కమ్ముకున్నాయి. అందరి గుండెల్లో గుబులు పుట్టింది. వరుణదేవుని ప్రతాపానికి ప్రముఖులు లేదు సామాన్యులు లేదు– అందరూ అటు ఇటు వాయించిన వర్షానికి కుడితిలో పడ్డ ఎలుకల్లా ముద్దయిపోయారు. ఉరుములు గుండెల్లో ఉరుము వాద్యాలు వాయిస్తున్నాయి. మెరుపులు అలముకున్న చీకట్లను చీల్చుతున్నాయి. అక్కడక్కడా పిడుగులు పడ్డ శబ్దాలు భయం గొల్పుతున్నాయి. ఇంతలో ఒక పిడుగు కపిలేశ్వరస్వామి గుడి మీద పడ్డట్టయింది. అందరూ ఆ శబ్దానికి, వెలుతురుకు భయ కంపితులైపోయారు. వణుకు మొదలైంది. కళ్ళల్లో దైన్యం ఆవహించింది. గుడిలో నుండి ఒక అర్చక స్వామి బతుకు జీవుడా అనుకొంటూ, పరిగెత్తుకొని అందరూ ఉన్న మంటపంలోకొచ్చాడు.‘కపిలేశ్వర స్వామికి ఏమీ కాలేదు. అయితే గుడి ప్రాకారాలు పడిపోయాయి. ఆగ్నేయంలో ఉండే వంటశాల మీద పిడుగు పడింది. వంటశాల ధ్వంసమైపోయింది. నేను పుట్టి బుద్ధెరిగాక ఇంత పెద్దవానను ఈ కపిలతీర్థంలో చూడలేదు’ అన్నాడు. ‘అమ్మగారూ! ప్రళయమొచ్చిందేమో? ననిపిస్తోంది’ అంది ఒక చెలికత్తె.‘ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. అధైర్యపడకండి’ అని అందరికీ ధైర్యం చెప్పింది సెవ్వుసాని.‘అమ్మగారూ! కోనేట్లో నీటి ఉద్ధృతికి సంధ్యావందన మంటపం కంపించిపోతోంది. నీటి ధారలు జల ఖడ్గాలుగా విరుచుకుపడుతున్నాయి. మనమున్న ఈ మంటపాన్ని ఒరుసుకొని నీళ్ళు ప్రవహిస్తున్నాయి. ఈ మంటపానికి ప్రమాదం రాదు కదా?’ అంది మరో చెలికత్తె.‘మనం చేయగలిగిందేమీ లేదు గోవింద నామ స్మరణం తప్ప’ అంది సెవ్వుసాని.అక్కడున్న వాళ్ళంతా ‘గోవిందా గోవింద’ అని గోవిందలు పెట్టడం మొదలెట్టారు. దూరభారం నుండి వచ్చిన వాళ్ళంతా ప్రాణ భయంతో బిక్కుబిక్కుమని చూస్తున్నారు. బతుకు మీద ఆశ వదిలేసుకున్నారు. మెల్లగా వాన తగ్గు ముఖం పట్టింది. ఉన్నట్టుండి తెరపి ఇచ్చింది.‘ఇక బయలు దేరుతాం అమ్మగారూ! మళ్ళీ వాన మొదలయ్యేలోగా వెళ్ళిపోదాం’ అన్నాడు రక్షణాధికారి.సెవ్వుసాని పరివార జనమంతా బయలుదేరి ముఖమంటపం వెలుపలికొచ్చారు. సెవ్వుసాని పల్లకీ ఎక్కుతుంటే పెళపెళమని చెట్టు కొమ్మ విరిగింది. అక్కడే ఉన్న ఆలయ ఏనుగు ముందుకు అడుగేయడంతో కొమ్మ ఏనుగు వీపుమీద పడింది. ఏనుగు పెద్ద ఘీంకారం చేసింది. అక్కడున్న వాళ్ళంతా భయంతో వణికిపోయారు. ‘మంచి కాలం అమ్మగారూ! ఈ ఏనుగు ముందుకు రాకపోయుంటే ఆ చెట్టు కొమ్మ సరిగ్గా మన పల్లకి మీద పడుండేది. అంతా చిత్రంగా ఉంది. బయలుదేరుదాం పదండి’ అంటూ బోయలు పల్లకీని భుజంపై ఉంచుకొని హరోం హర హర... హర హర... అంటూ తిరుపతి వైపుకెళ్ళిపోయారు. సెవ్వుసాని పరివారంతో పాటు క్షేమంగా తమ భవనానికి చేరుకున్నారు. సాయంత్రం చీకటి పడ్డాక గోవిందరాజస్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం సందర్భంగా సగం కుండల్లో పెద్ద వత్తులతో వెలిగించిన దీపాలతో స్వామివారికి హారతిచ్చి; గుడి ప్రాంగణంలో, వెలుపల దీపాల ప్రదర్శన చేసి, ఆలయ నృత్య నీరాజనంలో పాల్గొని తన భవనానికి చేరుకొంది సెవ్వుసాని. భవనం మీద నుండి తన చెలికత్తెలతో పాటు కపిలతీర్థం కొండ కొమ్ముమీద వెలిగించిన దీపాన్ని దర్శించుకొని రాత్రి భోజనానంతరం సెవ్వుసాని తన పడక గదికెళ్ళింది. ఎంత దొర్లినా ఆమెకు నిద్ర పట్టలేదు. ఇదంతా ఎందుకు జరిగిందని ఆలోచించాక ఏం చేయాలో ఒక నిర్ణయానికొచ్చింది. పరోపకారార్థం ఇదం శరీరం అనుకొంది. రెండు రోజుల తర్వాత వానలు కుదుట పడ్డాక మళ్ళీ కపిలతీర్థానికి తన పరివారంతో పాటు వెళ్ళి దెబ్బతిన్న ఆలయ కట్టడాలను బాగుచేయాలనుకొంది.‘కోశాధికారీ! ఈ కపిలతీర్థం గుడి ప్రాకారాలను, వంటశాలను పునర్నిర్మించాలనుకొంటున్నాను. అలాగే దెబ్బతిన్న సంధ్యావందన మంటపాలకు మరమ్మత్తులు చేయాలి. నన్ను కాపాడిన గజరాజుకు ఏమీ కాకపోయినా, ఆ వినాయకుడే నన్ను కాపాడాడనిపిస్తోంది. అందుకని కపిల తీర్థంలోని ఆలయ ప్రాంగణంలో కపిలేశ్వరుని చెంత వినాయకుడ్ని ప్రతిష్ఠించి ఆయన నైవేద్యాలకు దానాలు చేయాలి. ఎన్ని సొమ్ములు ఖర్చు అయినా ఫర్వాలేదు’ అంది సెవ్వుసాని‘అలాగే అమ్మగారు’‘అందుకుగాను ఈ ప్రాంత సామంతరాజు రాచవీడు నాయకుని అనుమతిని తీసుకోండి’‘అవసరం లేదమ్మా! మీరు ఇంత మంచి పని చేస్తానంటే సామంత రాజులు కాదంటారా? మీరడిగిందే మహాభాగ్యంగా భావిస్తారు’ అన్నాడు కోశాధికారి.‘అది తప్పు. మనం రాచరికపు వ్యవస్థలో ఉన్నాం. విజయనగర సామ్రాజ్యాధీశుడు మనకు ఆత్మీయులు కావొచ్చు. స్థానిక సామంత రాజును గౌరవించడం మన కర్తవ్యం’‘అలాగే అమ్మగారు’సామంతరాజు అనుమతి తీసుకొన్న సెవ్వుసాని అన్ని పనులను పూర్తి చేసింది. నేటికీ సంధ్యావందన మంటపాలు చెక్కు చెదరలేదు. కపిలేశ్వరస్వామి ఆలయ ప్రాకారాలు, వంటశాల ఆమె ఔన్నత్యాన్ని చాటుతున్నాయి. ఇక ఆలయంలో ధ్వజస్తంభం పక్కనుండే వినాయకుడు ఇప్పటికీ నిత్యం పూజలందుకుంటూ భక్తులకు కొంగు బంగారమైనాడు. సంపదలు ఉంటాయి, పోతాయి. కాని, సెవ్వుసాని ధార్మికత ఎల్లకాలం నిలిచే ఉంటుంది. ∙ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి -
ఆ రషీద్‌ని నేనే..!
హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు 2007లో నమోదు చేసిన నకిలీ పాస్‌పోర్టుల కుంభకోణం కేసు దర్యాప్తులో రీల్ సీన్‌ను తలపించే రియల్ సీన్ జరిగింది. ఆ స్కామ్‌లో కీలక నిందితుడిగా ఉన్న మహ్మద్ రషీద్ అలీ లొంగుబాటు నేపథ్యంలో అది చోటు చేసుకుంది. టూరిస్ట్ సహా వివిధ వీసాలపై వచ్చి, అక్రమంగా స్థిరపడుతున్న వారిని అరికట్టడానికి అమెరికా, యూకే తదితర దేశాలు గుజరాత్‌కు చెందిన మహిళలు, యువతులకు వీసా ఇవ్వడం మానేశాయి. అయితే రాజకీయ నాయకుల సిఫారసుతో వారి కుటుంబీకులు, సంబంధీకులకు మాత్రం వీటిని జారీ చేసేవి. దీంతో మనుషుల అక్రమ రవాణా కుంభకోణానికి తెరలేచింది.గుజరాత్‌కు చెందిన వారిని అనేకమందిని ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ సంబంధీకులుగా చూపించారు. అలా నకిలీ పాస్పోర్ట్స్ జారీ చేయించి, ప్రత్యేక సిఫారసులతో వీసాలు సంపాదించి అక్రమ రవాణా చేశారు. 2007 ఏప్రిల్‌లో నాటి బీజేపీ ఎంపీ బాబూభాయ్ కటారా ఢిల్లీ విమానాశ్రయంలో అరెçస్టయ్యారు. అలా దొరికిన ఈ మనుషుల అక్రమ రవాణా తీగ లాగితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ డొంక కదిలింది. దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయ నాయకులకు ఈ స్కామ్‌లో ‘దళారి’గా వ్యవహరించిన రషీద్ పేరు వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌కు చెందిన మహ్మద్ రషీద్ అలీ, చప్పల్‌బజార్ వాసి రాజు పిత్తీ 2005 నుంచి స్నేహితులు. వ్యాపారి, క్రికెట్ బుకీ అయిన రాజు– రషీద్‌కు అవసరమైన సొమ్మును వడ్డీకి ఇచ్చేవాడు. ఓసారి రషీద్ మనుషుల అక్రమ రవాణా వ్యవహారాన్ని రాజుకు చెప్పాడు. ఆపై గుజరాత్‌కు చెందిన భరత్ భాయ్‌ని రాజు కలుసుకున్నాడు. అతడితో కలిసి నకిలీ పాస్పోర్ట్స్ తయారీ ప్రారంభించాడు. ఈ ద్వయం అనేక మంది గుజరాతీలను ప్రముఖ రాజకీయ నాయకుల బంధువులు, కుటుంబ సభ్యులుగా చెబుతూ నకిలీ పాస్పోర్ట్స్ ఇప్పించే వారు. దీని కోసం సదరు నేతలకు భారీగానే ముట్టచెప్పేవారు. 2006 నవంబరులో రషీద్ నుంచి రాజు పిత్తీకి ఓ సందేశం అందింది. నేరెళ్ల, బో«ద్ నియోజకవర్గాలకు చెందిన అప్పటి ఎమ్మెల్యేలు కాసిపేట లింగయ్య, సోయం బాబూరావు తమకు సహకరించడానికి సమ్మతించారన్నది దాని సారాంశం.ఇలా ప్రారంభమైన వ్యవహారం 2007 మేలో ఢిల్లీలో బాబూభాయ్ కటారా, నగరంలో లింగయ్య, బాబూరావు అరెస్టులతో సంచలనంగా మారింది. హైదరాబాద్ సీసీఎస్లోనూ నకిలీ పాస్‌పోర్టు స్కామ్, మనుషుల అక్రమ రవాణాపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో రషీద్ అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారాడు. ఇతడితో పాటు మహ్మద్ ముజఫర్ అలీఖాన్, భరత్‌భాయ్, షకీల్‌ల కోసం వేట ప్రారంభమైంది. ఆ కేసు నమోదైన రోజు నుంచి సీసీఎస్ కార్యాలయం హడావుడిగా మారింది. స్థానిక, జాతీయ మీడియా తాకిడితో ఉక్కిరిబిక్కిరైన సీసీఎస్ పోలీసులు ఎవరినీ లోపలకు అనుమతించవద్దంటూ గేటు వద్ద విధుల్లో ఉండే సెంట్రీకి స్పష్టం చేశారు. అయినా కొందరు మీడియా ప్రతినిధులు సెంట్రీ కళ్లుగప్పి లోపలకు వెళ్లారు. దీంతో ఉన్నతాధికారులు ఆ సెంట్రీని హెచ్చరించి, గేటుకు తాళాలు వేయించారు. రషీద్ కోసం ఢిల్లీ, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసుల వేట ముమ్మరమైంది. అయితే అప్పటికి అతడి ఫొటో ఎవరి వద్దా అందుబాటులో లేదు. రషీద్ ఒక దశలో పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. వారి ‘ట్రీట్మెంట్’ను తప్పించుకోవడానికి కొందరు మీడియా ప్రతినిధుల ద్వారా ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపాడు. చివరకు 2007 మే 3న అతడి లొంగుబాటుకు ముహూర్తం ఖరారైంది. ఆ రోజు రషీద్ తన న్యాయవాది, ఇద్దరు మీడియా వ్యక్తులతో కలిసి నేరుగా సీసీఎస్ వద్దకు వచ్చాడు. కాస్త దూరంలో వాహనం దిగిన వీళ్లు నడుచుకుంటూ ఆ కార్యాలయం గేటు వద్దకు చేరుకున్నారు. రషీద్ లొంగిపోవాలనే ఉద్దేశంతో లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న సెంట్రీ అతడితో పాటు వెంట ఉన్న వారినీ అడ్డుకున్నాడు. ‘నేను రషీద్‌ని... లొంగిపోతా’ అని చెబుతున్నా వినకుండా బయటకు నెట్టేసినంత పని చేశాడు. దీంతో అవాక్కైన రషీద్ వెంట వచ్చిన మీడియా ప్రతినిధులు విషయాన్ని ఫోన్ ద్వారా కేసు దర్యాప్తు అధికారికి చెప్పారు. అంతే! రెండో అంతస్తు నుంచి ఉరుకులు పరుగుల మీద వచ్చి ఆయన బృందం రషీద్‌ను తమ వెంట తీసుకువెళ్లింది. రషీద్ విచారణ, అరెస్టు తతంగాలు పూర్తి కావడంతో పోలీసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ అరెస్టు జరిగిన పుష్కర కాలం తర్వాత రషీద్ మరోసారి కటకటాల్లోకి వెళ్లాడు. ఆదాయపు పన్ను శాఖ పేరు చెప్పి ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.91 లక్షలు కాజేసిన కేసులో అదే సీసీఎస్ పోలీసులు 2018 జూన్ 20న జైలుకు పంపారు.హైదరాబాద్, ఢిల్లీలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో తనకు భారీగా ఆస్తులు ఉన్నట్లు రషీద్ డాక్యుమెంట్లు తయారు చేశాడు. తాను ఆదాయపు పన్ను శాఖకు పన్ను బకాయి పడినట్లు, వారు నోటీసులు జారీ చేసినట్లూ నకిలీ నోటీసులు సృష్టించాడు. నోటీసులు అందుకున్నప్పటికీ తాను ఆ మొత్తం చెల్లించకపోవడంతో తనకున్న ఆస్తుల్ని ఐటీ విభాగం అధికారులు సీజ్ చేస్తూ వారు జారీ చేసినట్లు ఓ సీజర్ రిపోర్ట్ సైతం రూపొందించాడు. దీనిపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు చెందిన లోగోలు, అధికారుల సంతకాలు సైతం తయారు చేశాడు. ఈ సీజర్ రిపోర్ట్‌తో పాటు ఆస్తుల జాబితా కూడా రూపొందించిన రషీద్ అలీ వీటితో పాటు అప్పటికే సిద్ధం చేసి ఉంచిన నకిలీ ఆస్తుల పత్రాలను జత చేశాడు. ఇలా రూపొందించిన ఫైల్‌ను వెంటేసుకునే ఇతగాడు ఖరీదైన కార్లతో తిరుగుతూ పరిచయస్తులతో పాటు వారి ద్వారా పరిచయమైన వారికీ చూపించాడు. కేవలం రూ.కోటి, రూ.2 కోట్ల పన్ను చెల్లించనందుకు రూ.200 కోట్ల ఆస్తులు సీజ్ అయ్యాయంటూ నమ్మించాడు. తాను చెల్లించాల్సిన పన్ను మొత్తం ఏర్పాటు చేస్తే ఐటీ విభాగానికి జమ చేసి తన ఆస్తులు విడిపించుకుంటానని, ఆ వెంటనే కొన్నింటికి విక్రయించి అసలుతో పాటు భారీ మొత్తం వడ్డీగా ఇస్తానంటూ ఎర వేసేవాడు. ఈ పేరుతో సయ్యద్ అనీస్ హైదర్, హరీష్ కుమార్ల నుంచి రూ.91 లక్షలు తీసుకుని మోసం చేశాడనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ∙ -
కాలానికి రివైండ్ బటన్
సినిమాల్లో టైమ్ మిషన్ లోకాన్ని చూసి ‘మనకీ ఒకటి ఉంటే బాగుండేది’ అని అనుకున్నారా? అయితే, ఈసారి శాస్త్రవేత్తలు నిజంగానే టైమ్‌ను వెనక్కి తిప్పేశారు! అది కూడా ఒక్క సెకను. ఈ అద్భుతం రష్యా, అమెరికా, స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తల కలయికతో సాధ్యమైంది. ఐబీఎమ్ క్వాంటమ్ కంప్యూటర్ ప్రాసెసర్‌పై ప్రత్యేక అల్గారిథమ్ వాడి, ఒక కణం స్థితిని రివైండ్ చేసి, మునుపటి స్థితికి తీసుకెళ్లగలిగారు. సాధారణంగా మనకు తెలిసిన ప్రపంచంలో టైమ్ ఒకే దిశలో ముందుకు వెళ్తుంది. కాని, క్వాంటమ్ లోకంలో మాత్రం వేరే నియమాలు వర్తిస్తాయి. అవే ఒకటి సూపర్‌పోజిషన్ , అంటే ఒకే సమయంలో కణం రెండు స్థితుల్లో ఉండటం. రెండు ఎంటాంగిల్‌మెంట్, అంటే రెండు కణాలు దూరంలో ఉన్నా ఒకదానిపై మరొకటి ప్రభావం చూపటం. ఇవన్నీ మ్యాజిక్‌లా అనిపించే కాన్సెప్ట్‌లు. వీటిని ఉపయోగించే శాస్త్రవేత్తలు టైమ్‌ని ‘ఒక్క సెకను వెనక్కి’ నెట్టగలిగారు. ఇప్పుడిది చిన్న అంచనా ప్రయోగమే అయినా, ‘పోయిందనుకున్న సమాచారం కూడా తిరిగి వస్తుంది’ అని ఇది రుజువు చేసింది. క్వాంటమ్ కంప్యూటర్లకు ఇది గోల్డెన్ ఆప్షన్ . ఎందుకంటే భవిష్యత్తులో డేటా రికవరీ, ఎర్రర్ కరెక్షన్ , సిస్టమ్ స్టేబిలిటీ అన్నీ సులభం కానున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇలా అయితే, త్వరలోనే టైమ్‌కి రివైండ్ బటన్ వచ్చే రోజులు కూడా రానున్నాయన్నమాట! -
Diwali: జగమంతా దీపావలి
ఇంటింటా దివ్వెల వరుసలతో అమావాస్య చీకటిని తరిమే పండుగ బాణసంచా రంగుల వెలుగులతో నింగీ నేలా మెరిసి మురిసే పండుగ దేశ దేశాల్లో పిన్నా పెద్దా జరుపుకొనే జగమంత పండుగ దీపావళిశరన్నవరాత్రులు ముగిశాక కొద్దిరోజుల విరామంలోనే దీపావళి సందడి మొదలవుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో మూడు రోజులు, ఉత్తరాది రాష్ట్రాల్లో ఐదు రోజులు ఘనంగా వేడుకలు జరుపుకొంటారు. దక్షిణాదిలో దీపావళికి ముందు ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరక చతుర్దశి, అమావాస్య రోజున దీపావళి, కార్తీక శుక్ల పాడ్యమి రోజున బలి పాడ్యమి జరుపుకొంటారు. ఉత్తరాదిలో ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా, చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకొంటారు. అమావాస్య రోజున దీపావళి, కార్తీక శుక్ల పాడ్యమి రోజున బలి పాడ్యమి, కార్తీక శుక్ల విదియ రోజున యమద్వితీయ జరుపుకొంటారు. ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాల్లో దీపావళి వేడుకలలో మరికొన్ని ఆచార భేదాలు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో విలక్షణమైన వేడుకలు, పూజలు కూడా జరుపుతారు.దీపావళికి మూలమైన నరకాసుర వధ పురాణగాథ అందరికీ తెలిసినదే! వరాహమూర్తికి భూదేవికి పుట్టిన కొడుకు నరకుడు. పెరిగి పెద్దవాడయ్యాక ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించేవాడు. నరకుడికి శోణితపుర పాలకుడైన బాణాసురుడితో స్నేహం ఏర్పడింది. బాణుడి ప్రోద్బలంతో నరకుడు దుర్మార్గం పట్టాడు. చుట్టుపక్కల రాజ్యాలపై దండెత్తి, ఆ రాజ్యాల రాజకుమార్తెలను తెచ్చి బంధించాడు. అలా పదహారువేల మందిని చెరపట్టాడు. కామాఖ్య అమ్మవారిని ఆరాధించే నరకుడు అమ్మవారి ద్వారా అనేక వరాలు పొందాడు. వరగర్వంతో ముల్లోకాలలోనూ జనాలను పీడించడం మొదలుపెట్టాడు. చివరకు స్వర్గంపై దండెత్తి, ఇంద్రుడిని తరిమికొట్టి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. నరకుడి ఆగడాలు శ్రుతి మించడంతో దేవతలందరూ శ్రీమహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు. విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు సత్యభామా సమేతంగా నరకుడితో యుద్ధం చేసి, అంతమొందించాడు. ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజున నరకుడు అంతమొందడంతో ఆ వార్త తెలిసిన జనాలు మర్నాడు అమావాస్య రోజున ఇళ్ల ముంగిళ్లలో వరుసగా దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారు. అప్పటి నుంచి దీపావళి పండుగ రోజున ఇళ్ల ముంగిళ్లలో దీపాలు వరుసగా వెలిగించడం ఆనవాయితీగా వస్తోందనేది పురాణాల కథనం. దీపావళి వేడుకల సందర్భంగా పాటించే ఆచారాల గురించి వివిధ వ్రతగ్రంథాలు విపులంగా తెలిపాయి. వీటి ప్రకారం ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున– ధనత్రయోదశి నాడు అపమృత్యు భయ నివారణ కోసం దీపం పెట్టాలి. దీనినే యమదీపం అంటారు. నరకచతుర్దశి రోజున నరకభయ నివారణ కోసం వేకువ జామునే అభ్యంగన స్నానం చేయాలి. సాయంకాలం దేవాలయాలలో దీపాలు వెలిగించాలి. అమావాస్య నాడు మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు బెరళ్లను నీటిలో నానబెట్టి; ఆ నీటితో అభ్యంగన స్నానం చేయాలి. ప్రదోష కాలంలో– అంటే సూర్యాస్తమయానికి ముందు దీపదానం చేసి, ఇంటి బయట జువ్వి కొమ్మలకు మంటపెట్టి, ఆ దివిటీలు తిప్పాలి. వీటిని ఉల్కలు అంటారు. దివిటీలు తిప్పిన తర్వాత లక్ష్మీపూజ చేసి, తీపి పదార్థాలను ఆరగిస్తారు. సూర్యాస్తమయం కాగానే ఇళ్ల ముంగిళ్లలో వరుసగా దీపాలు వెలిగించాలి. దీపావళి అమావాస్య రోజు రాత్రి కొన్ని ప్రాంతాల్లోని స్త్రీలు ఇళ్లల్లో చేటలు, పళ్లేలు, తప్పెట్లు వాయిస్తారు. ఇలా చేయడం వల్ల అలక్ష్మి తొలగి, అషై్టశ్వర్యాలు ప్రాప్తిస్తాయని నమ్ముతారు. దీపావళి అమావాస్య రాత్రివేళలోనే ఇళ్లలో బలి చక్రవర్తిని స్థాపిస్తారు. మర్నాడు పాడ్యమి రోజున ఉదయం బలి చక్రవర్తికి ఉత్సవం చేస్తారు. బలి చక్రవర్తి పూజ ముగిశాక ఉదయం వేళలోనే జూదం ఆడతారు. బలి పాడ్యమినాడు ఆడే జూదంలో గెలిచేవారికి ఏడాది మొత్తం శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఇదే రోజున కొన్ని ప్రాంతాల్లో గోవర్ధనపూజ చేస్తారు. ఆ రోజు పాడి పశువులను అలంకరించి, వాటికి ఆటవిడుపునిస్తారు. యమ ద్వితీయ రోజును భ్రాతృ ద్వితీయ అని కూడా అంటారు. ఆ రోజున సోదరీమణులు తమ సోదరులను ఇళ్లకు పిలిచి, విందుభోజనాలు పెడతారు.బాణసంచా సందడిదీపావళి రోజున బాణసంచా కాల్చడం తరతరాలుగా సాగుతోంది. చైనాలో పుట్టిన బాణసంచా అక్కడి నుంచి దేశదేశాలకు వ్యాపించింది. దీపావళి వేడుకల్లో బాణసంచా కాల్చడం దాదాపు పదిహేనో శతాబ్ది నుంచి మొదలై ఉంటుందని చరిత్రకారుల అంచనా. పద్దెనిమిది, పంతొమ్మిదో శతాబ్దాలలో బాణసంచాకు ఆదరణ తారస్థాయికి చేరుకుంది. దీపావళి పండుగ రోజున మాత్రమే కాకుండా; పెళ్లిళ్లు తదితర వేడుకల్లో కూడా బాణసంచా కాల్చడం పదిహేనో శతాబ్ది నుంచి కొనసాగుతోంది. గుజరాత్ ప్రాంతంలో 1518 సంవత్సరంలో ఒక పెళ్లివేడుకలో వీథుల్లో బాణసంచా కాల్పులతో జరిగిన సంరంభాన్ని పోర్చుగీసు యాత్రికుడు బార్బోసా విపులంగా రాశాడు. మొఘల్ సామ్రాజ్యంలో బాణసంచాకు అమితమైన ఆదరణ ఉండేది. ఔరంగజేబు మినహా మొఘల్ చక్రవర్తులందరూ బాణసంచా కాల్పులను, బాణసంచా తయారీ నిపుణులను బాగా ఆదరించారు. బ్రిటిష్ హయాంలో కూడా బాణసంచా కాల్పుల ప్రదర్శనకు మంచి ఆదరణ ఉండేది. బ్రిటిష్ కాలంలోనే తమిళనాడులోని శివకాశి బాణసంచా తయారీకి ప్రధాన కేంద్రంగా ఏర్పడింది. తొలిరోజుల్లో శివకాశిలో ఎవరికి వారు కుటీర పరిశ్రమలా బాణసంచా తయారు చేసేవారు. సరిగా వందేళ్ల కిందట– 1925లో అయన్ నాడద శివకాశిలో ‘నేషనల్ ఫైర్వర్క్స్’ సంస్థను స్థాపించారు. ఆ తర్వాత శివకాశిలో ఇబ్బడి ముబ్బడిగా బాణసంచా తయారీ సంస్థలు ఏర్పడ్డాయి. శివకాశిలో తయారయ్యే బాణసంచా ఉత్పత్తులు విదేశాలకు కూడా భారీ ఎత్తున ఎగుమతి అవుతున్నాయి. దేశంలో తయారయ్యే బాణసంచా సామగ్రిలో ఎనభై శాతం శివకాశిలోనే తయారవుతున్నాయంటే, ఈ పట్టణంలో బాణసంచా పరిశ్రమ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. శివకాశిలో బాణసంచా ఉత్పత్తుల విక్రయాల విలువ ఏటా రూ.26 వేల కోట్ల మేరకు ఉంటుందని తాజా అంచనాలు చెబుతున్నాయి.పెరిగిన కాలుష్య స్పృహబాణసంచా వల్ల వాతావరణ కాలుష్యం, ధ్వని కాలుష్యం ఫలితంగా ఏర్పడే ఆరోగ్య సమస్యలపై గడచిన పాతికేళ్లుగా జనాల్లో అవగాహన పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రభుత్వాలు బాణసంచా తయారీ, వినియోగాలపై ఆంక్షలు విధించడం కూడా మొదలైంది. ప్రభుత్వాల ఆంక్షల వల్ల బాణసంచా తయారీ సంస్థలు నిబంధనలకు లోబడి పర్యావరణానికి తక్కువ హాని కలిగించే, ‘గ్రీన్ క్రాకర్స్’ తయారు చేస్తున్నాయి. బాణసంచా తయారీలో ధ్వనికాలుష్య నియంత్రణకు సంబంధించి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. బాణసంచా తయారీ సంస్థలు ఈ మార్గదర్శకాలను అమలు చేయాల్సిందేనంటూ 2001లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి దేశంలోని బాణసంచా తయారీ సంస్థలు నిబంధనలకు లోబడి ‘గ్రీన్ క్రాకర్స్’ తయారీని ప్రారంభించాయి. అయినప్పటికీ పలుచోట్ల పాత పద్ధతిలోనే బాణసంచా తయారీ కొనసాగుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ‘నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్’ (ఎన్జీటీ) 2020లో సంప్రదాయ బాణసంచాపై పూర్తి నిషేధం విధించింది. బాణసంచా కాలుష్య ప్రమాణాలను ధ్రువీకరించే లాబొరేటరీ ఇదివరకు నాగపూర్‌లో ఉండేది. శివకాశిలో తయారయ్యే బాణసంచా నమూనాలను అక్కడకు పంపేవారు. అక్కడి నుంచి ధ్రువీకరణ లభించాక మార్కెట్లోకి విడుదల చేసేవారు. శివకాశిలోనే బాణసంచా ప్రమాణాలను పరిశీలించి, ధ్రువీకరించేందుకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండిస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (నీరి) ఉమ్మడిగా ‘సీఎస్ఐఆర్–నీరి’ లాబొరేటరీని 2019 ఆగస్టులో రూ.15 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం ఈ లాబొరేటరీ శివకాశిలో తయారయ్యే బాణసంచా నమూనాలను ఎప్పటికప్పుడు పరిశీలించి, సత్వరమే ధ్రువీకరిస్తోంది.బాణసంచాతో ఆరోగ్య సమస్యలుబాణసంచా కాల్చడం వల్ల ఎక్కువగా చిన్నారులలో, వృద్ధులలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వారితో పాటు ఇదివరకే ఉబ్బసం తదితర శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి, గర్భిణులకు, అలెర్జీలతో బాధపడేవారికి ఆరోగ్య సమస్యలు ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి. బాణసంచా కాల్పుల్లో వెలువడే పొగలో అత్యంత సూక్షా్మతి సూక్ష్మమైన (పీఎం2.5) పరిమాణంలోని రసాయనిక కణాలు ఊపిరితిత్తుల్లోకి చొరబడి శ్వాసనాళం వాపు, విపరీతమైన దగ్గు, ఉబ్బసం, బ్రోంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధులు తలెత్తుతాయి. ఈ సూక్ష్మ రసాయనిక కణాలు రక్తంలోకి చేరితే అధిక రక్తపోటు, గుండెజబ్బులు, పక్షవాతం వంటి తీవ్ర సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది. బాణసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే, వాటి మంటలు అంటుకుని, కాలిన గాయాలు, పేలుళ్ల శబ్దతీవ్రతకు చెవుల వినికిడి శక్తి దెబ్బతినడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. బాణసంచా వెలుగులు, రంగులు ఆహ్లాదాన్ని ఇచ్చినా, తగిన జాగ్రత్తలతో కాల్చితేనే పండుగ ఆనందభరితంగా ఉంటుంది.జైనులకు, సిక్కులకు పర్వదినందీపావళి హిందువులకు మాత్రమే కాదు జైనులకు, సిక్కులకు కూడా పర్వదినం. జైనుల ఇరవైనాలుగో తీర్థంకరుడైన మహావీరుడు ఇదేరోజున నిర్యాణం పొందాడు. అందువల్ల దీపావళి రోజున జైనులు తమ మందిరాలను దీపాలతో అలంకరించి, ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. జైన పండితుడు ఆచార్య జినసేన క్రీస్తుశకం 705లో రచించిన ‘హరివంశపురాణం’లో దీపావళిని ‘దీపాలికాయ’ అనే పేరుతో ప్రస్తావించాడు. మహావీరుడు నిర్యాణం చెందిన ఈ రోజున దీపాలను వెలిగించే సంప్రదాయాన్ని జైనులు తప్పనిసరిగా పాటిస్తారు. దీపావళి మరునాడు కార్తీక శుక్ల పాడ్యమి నుంచి జైనులకు కొత్త సంవత్సరం మొదలవుతుంది.సిక్కులు దీపావళిని ‘బందీ ఛోడ్ దివస్’గా జరుపుకొంటారు. సిక్కుల ఆరో గురువు హరగోబింద్, తన 52 మంది అనుచరులతో కలసి ఖైదు నుంచి విడుదలైన రోజు కావడంతో సిక్కులు దీపావళిని ఖైదు విమోచన దినంగా జరుపుకొంటారు. హరగోబింద్ను నాటి మొఘల్ చక్రవర్తి జహంగీర్ గ్వాలియర్ కోటలో బంధించాడు. తర్వాత 1619 సంతవ్సరం దీపావళి రోజున ఆ చెర నుంచి విడుదల చేశాడు. సిక్కులు దీపావళి రోజున గురుద్వారాలలో దీపాలు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. బంధు మిత్రులతో కలసి విందు వినోదాలు జరుపుకొంటారు. రాత్రివేళ బాణసంచా కాలుస్తూ సందడి చేస్తారు.దీపావళి ముమ్మతాల పండుగదీపావళి జగమంతా వేడుకదీప ప్రశస్తిదీపం చీకటిని తరిమికొట్టి వెలుగును వెదజల్లుతుంది. దీపాన్ని జ్ఞానానికి, ఆనందానికి, సద్గుణ సంపత్తికి ప్రతీకగా భావిస్తారు. దీపాన్ని లక్ష్మీస్వరూపంగా ఆరాధిస్తారు. దీప ప్రశస్తిని తెలిపే పురాణగాథలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది దేవేంద్రుడు దుర్వాసుడి ఆగ్రహానికి గురికావడం వల్ల తన రాజ్యాన్ని, సంపదలను పోగొట్టుకున్న ఉదంతం. దుర్వాసుడు ఒకసారి స్వర్గానికి వెళ్లాడు. దేవేంద్రుడు అతడికి స్వాగత సత్కారాలు చేసి, చక్కని ఆతిథ్యం ఇచ్చాడు. ఇంద్రుడి ఆతిథ్యానికి దుర్వాసుడు తృప్తిచెందాడు. స్వర్గం నుంచి తిరిగి బయలుదేరే ముందు ఇంద్రుడికి కానుకగా ఒక హారాన్ని ఇచ్చాడు. ఇంద్రుడు ఆ హారాన్ని నిర్లక్ష్యంగా అందుకుని, తన పట్టపుటేనుగు ఐరావతానికి అందించాడు. ఐరావతం ఆ హారాన్ని నేలపై పడేసి, కాళ్లతో తొక్కి చిందరవందర చేసింది. ఈ దృశ్యం చూసి ఆగ్రహించిన దుర్వాసుడు ఇంద్రుడిని శపించాడు. ఫలితంగా ఇంద్రుడు తన స్వర్గాన్ని, సిరిసంపదలను కోల్పోయాడు. సర్వం కోల్పోవడంతో ఇంద్రుడు దిక్కుతోచక శ్రీమహావిష్ణువును ప్రార్థించాడు. శ్రీమహావిష్ణువు ఒక దీపాన్ని వెలిగించి, ఇంద్రుడి చేతికి ఇచ్చాడు. ఆ దీపాన్ని మహాలక్ష్మీదేవిగా తలచి, పూజించమన్నాడు. దేవేంద్రుడు ఆ దీపాన్ని పూజించాడు. మహాలక్ష్మి అనుగ్రహం పొంది; తిరిగి స్వర్గాధిపత్యాన్ని, కోల్పోయిన సమస్త సంపదలను పొందాడు. ఈ పురాణ గాథ నేపథ్యంలోనే దీపావళి రోజున దీపాలు వెలిగించి, మహాలక్ష్మీదేవిని పూజించడం సంప్రదాయంగా వస్తోంది. దీపావళి తర్వాత వచ్చే కార్తీక మాసమంతా దీపారాధన చేయడం కూడా సంప్రదాయంగా వస్తోంది. దీపదానం చేయడం వల్ల నరకబాధ తప్పుతుందని కొందరు నమ్ముతారు.దేశదేశాల్లో దీపావళిదీపావళి వేడుకలు భారత్‌తో పాటు భారత సంతతి ప్రజలు ఎక్కువగా నివసించే వివిధ దేశాల్లో ఘనంగా జరుగుతాయి. దాదాపు ఇరవై దేశాలలో దీపావళి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. హిందువులు ఎక్కువగా నివసించే నేపాల్, శ్రీలంక, మారిషస్ దేశాలతో పాటు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, సురినేమ్, దక్షిణాఫ్రికా, ఇండోనేసియా, మలేసియా, థాయ్‌లాండ్, మయాన్మార్, ఫిజి, గయానా తదితర దేశాల్లో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతాయి. నేపాల్‌లో దీపావళి సందర్భంగా ‘తీహార్’ వేడుకలను ఐదురోజుల పాటు జరుపుకొంటారు. ఈ సందర్భంగా విందు వినోదాలు; బాణసంచా సంబరాలు జరుపుకోవడంతో పాటు కాకులు, శునకాలు, గోవులను పూజించి, వాటికి ప్రత్యేకంగా ఆహారం పెడతారు. సింగపూర్‌లోని లిటిల్ ఇండియా ప్రాంతంలో దీపావళి వేడుకలు దేదీప్యమానంగా జరుగుతాయి. దీపావళి పండుగను ఫిజి, గయానా, మలేసియా, మారిషస్, మయాన్మార్, నేపాల్, సింగపూర్, శ్రీలంక, సురినేమ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాలు అధికారిక సెలవుదినంగా పాటిస్తున్నాయి. అమెరికాలో కూడా దీపావళిని జాతీయ సెలవు దినంగా ప్రకటించే దిశగా అక్కడ స్థిరపడ్డ భారత సంతతి ప్రజలు అమెరికన్ ప్రభుత్వంపై కొన్నేళ్లుగా ఒత్తిడి తెస్తున్నారు. అమెరికాలో దీపావళి అధికారికంగా జాతీయ సెలవుదినం కాకున్నా, పెన్సిల్వేనియా వంటి కొన్ని రాష్ట్రాలు దీపావళిని సెలవు దినంగా పాటిస్తున్నాయి. కొన్నేళ్లుగా దీపావళి సందర్భంగా అమెరికా అధ్యక్ష నివాసమైన వైట్‌హౌస్‌లో వేడుకలు జరుపుతున్నారు. అలాగే బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసంలో కూడా కొన్నేళ్లుగా దీపావళి వేడుకలు జరుపుతూ వస్తున్నారు. -
రీసైకిల్ కమ్ డెకరేషన్‌గా.. బాటిల్ ఆర్ట్..!
మన ఇళ్లలో ఖాళీగా ఉన్న గాజు లేదా ప్లాస్టిక్ బాటిళ్లు చెత్త బుట్టలోకి చేరుతుంటాయి. కాని కొంచెం సృజనాత్మక ఆలోచన, కొంచెం కలర్, పెయింట్ లేదా క్రాఫ్ట్ ఐడియాలతో ఆ బాటిళ్లను అందమైన హోమ్ డెకరేషన్లో షో పీసులుగా మార్చుకోవచ్చు. ఇది రీసైక్లింగ్‌కి తోడ్పడటమే కాకుండా ఇంటికి ఒక ప్రత్యేకమైన లుక్‌ను ఇస్తుంది.డెకరేషన్ కోసం ఉపయోగించే మెటీరియల్స్ఆక్రిలిక్ పెయింట్స్, స్ప్రే పెయింట్స్గ్లిట్టర్, బీడ్స్, మిర్రర్ పీసెస్జూట్ రోప్స్టిక్కర్స్, టేప్ఫాబ్రిక్ పీసెస్, లేస్ డిజైన్స్బాటిల్స్ .. క్రియేటివిటీపెయింటెడ్ బాటిల్స్బాటిల్పై స్ప్రే పెయింట్ వాడి ఒకే రంగులో కలర్ చేయాలి.ఆక్రిలిక్ పెయింట్స్‌తో పూలు, ఆకులు లేదా జామెట్రిక్ డిజైన్స్ వేయాలి.జూట్ రోప్ ర్యాప్జూట్ తాడుతో బాటిల్ మొత్తం చుట్టి, పై భాగంలో షెల్స్ లేదా పూలు అతికిస్తే రస్టిక్ లుక్ వస్తుంది.జనపనార తాడును ఉపయోగించి, అందమైన సన్నని అమ్మాయి, అబ్బాయి బొమ్మలను తయారు చేయవచ్చు.లైట్ బాటిల్ ల్యాంప్స్ఖాళీ బాటిల్లో ఫెయిరీ లైట్స్ పెట్టి నైట్ ల్యాంప్‌లా వాడుకోవచ్చు.బొమ్మలుగా ఉండే సంగీత పరికరాలను అతికించి, షో పీసులుగా అమర్చవచ్చు. గ్లాస్ పేస్టింగ్ ఆర్ట్బాటిల్కు కలర్ పేపర్, గ్లిటర్, స్టోరీస ... అతికిస్తే రిచ్ లుక్ వస్తుంది. అలంకరణలో ప్రత్యేకంగా ఉంటుంది.పెయింట్‌తో పాటు పూసలు, అద్దాలు అతికించి మరింత అందంగా మార్చవచ్చు. ఫ్లవర్ వేజ్పెద్ద పెద్ద గాజు బాటిళ్లను పెయింట్ చేసి, అందులో తాజా పువ్వులు లేదా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్‌తో అలంకరించి లివింగ్ రూమ్, సెంటర్ టేబుల్‌పై పెడితే ఆకర్షణీయంగా కనిపిస్తుంది. బాటిల్ డెకరేష మనలోని సృజనాత్మకతను చూపించే ఒక అద్భుతమైన మార్గం. చిన్న బాటిల్ నుంచి పెద్ద బాటిల్ వరకు, ప్రతి ఒక్కదాన్ని కళాఖండంగా మార్చుకోవచ్చు.ఎన్నార్ -
'ఖతర్నాక్ మొక్కలు'..! వీటి టక్కు టమారాలకు విస్తుపోవాల్సిందే..!
నక్కజిత్తులు, టక్కు టమారాలు, వలపు వలలు – మనుషుల్లోనే కాదు ప్రకృతిలోని అన్నీ జీవుల్లోనూ ఉంటాయి. అయితే కొన్ని రకాల మొక్కల్లో కూడా ఈ విధమైన ‘జీవన నైపుణ్యాలు’ ఉంటాయని వింటే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడున్న మొక్కలన్నీ ఏదో ఒక విశేషాన్ని కలిగి ఉన్నవే. కొద్దో గొప్పో తమ ప్రత్యేకతతో విస్తుగొలిపేవే. వీటిల్లో కొన్ని, కొనేందుకు దొరకొచ్చు. కొన్నింటి కోసమైతే ఏ ఆఫ్రికాకో, అమెజాన్ వర్షారణ్య ప్రాంతాలకో వెళ్లాల్సిందే! 1. హైడ్నోరా పైకి కనిపించని పరాన్నజీవి· ‘హైడ్నోరా ఆఫ్రికానా’ అనే ఈ ఆఫ్రికా మొక్క తన జీవితంలో ఎక్కువ భాగం భూగర్భంలో అజ్ఞాతంగా గడుపుతుంది, పుష్పించడానికి మాత్రమే తన గుట్టును రట్టు చేసుకుంటుంది. అంటే భూ ఉపరితలంపైన విప్పారిన పువ్వులా సాక్షాత్కరిస్తుంది. ఈ మొక్కకు ఆకులు ఉండవు. ఆకులు ఉండవు కనుక కిరణజన్య సంయోగక్రియను నిర్వహించదు. ‘కిరణజన్య సంయోగ క్రియ’ అంటే తెలిసిందే కదా. ఆకుపచ్చని ఆకులుండే మొక్కలు సూర్యరశ్మిని ఉపయోగించుకుని నీటిని, కార్బన్ డై ఆక్సైడ్‌ని... గ్లూకోజ్‌గా, ఆక్సిజన్‌గా మార్చి శక్తిని పొందటం.మరి హైడ్నోరా ఆఫ్రికానాకు శక్తి ఎలా? కిరణ జన్య సంయోగ క్రియకు బదులుగా ఇది పోషకాలను దొంగిలించడానికి భూమి లోపల ఇతర మొక్కల వేళ్లకు అంటుకుని ఉంటుంది! దీని వింత జీవనశైలి ఎలా ఉన్నప్పటికీ స్థానికులు ఇందులోని యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను విలువైనవిగా భావిస్తారు. ఫంగస్కీ, బాక్టీరియాకు ఔషధంగా వాడతారు.2. ఫ్లైపేపర్ ప్లాంట్ జిగట ఉచ్చుల జిత్తులమారి‘పింగిక్యులా జైగాంటియా’ అనే ఈ మొక్క, పోషకాలు తక్కువగా ఉండే నేలల్లో పెరుగుతుంది. దీని జిగట ఆకులు కీటకాలను బంధిస్తాయి. ఆ కీటకాలను తిని ఈ మొక్క పెరుగుతుంది. కీటకాలను తన జిగటతో ఒకసారి పట్టుకున్న తర్వాత, ఆ కీటాకాహారం నెమ్మదిగా మొక్కకు జీర్ణం అవుతుంది. మొక్కకు ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. వేసవి నెలల్లో లేత ఊదా నుండి ముదురు ఊదా వరకు వివిధ వర్ణ ఛాయలలో ఈ మొక్కకు సన్నని పూలు పూస్తాయి. ఈ మాంసాహార మొక్క కేవలం తను బతకడానికి మాత్రమే కీటకాలను తినటం కాకుండా, పరిసరాలలో కీటకాల జనాభానూ నియంత్రిస్తుంది. కీటకాలను పట్టుకునే ఉద్దేశంలో (ట్రాప్ మోడ్) లేనప్పుడు పుప్పొడి పరాగ సంపర్కాల కోసం ఆకర్షణీయమైన పువ్వులను కూడా ఉత్పత్తి చేస్తుంది! ఈ మొక్కను హన్స్ లుహర్స్ అనే వృక్ష శాస్తజ్ఞుడు మెక్సికోలో కనిపెట్టారు. ఎత్తయిన పర్వత వాతావరణంలో, నిలువు సున్నపు రాతి గోడల మధ్య ఉండే తేమతో కూడిన పగుళ్లలో ఇవి వృద్ధి చెందుతాయి. 3. హ్యామర్ ఆర్కిడ్ ‘మాస్టర్స్’ డిగ్రీ మాయలాడి!డ్రాకేయా గ్లిప్టోడాన్ అనే ఈ మొక్క మాయల పకీరు వంటిది. ఇది ఆడ కందిరీగను పోలి ఉంటుంది. పోలిక మాత్రమే కాదు, ఆడ కందిరీగ ఒంటి నుంచి వచ్చే వాసన లాంటి వాసననే ఇది విడుదల చేస్తుంటుంది. ఆ వాసనకు మగ కందిరీగలు మైమరచి, దీనితో జత కట్టటానికి వచ్చి వీటిపైన వాలతాయి. ఈ వాలటంలో, పుప్పొడి ఒక పువ్వు నుండి మరొక పువ్వుకు అంటుకుంటుంది. ఈ అద్భుతమైన మాయలాడి వ్యూహం వృక్షశాస్త్రవేత్తల అధునాతన పరిశోధనలకు చక్కగా ఉపయోగ పడుతోందని అంటారు! ఇవి పశ్చిమ ఆస్ట్రేలియాలోని నైరుతి ప్రాంతంలో కనిపిస్తాయి. వీటి పూలు మెరూన్ రంగులో ఉంటాయి. పైభాగంలో మూడింట రెండు వంతులు ‘నూగు’ ఉంటుంది. కింది భాగం జారుడుగా మెరుస్తూ ఉంటుంది. ఆగస్టు చివరి వారం నుండి అక్టోబర్ ఆఖరి వారం వరకు వీటి పూలు కనిపిస్తాయి.4. డెత్ ఆపిల్ ట్రీ వల విసిరే వగలాడి‘హిప్పోమేన్ మాన్సినెల్లా అనే ఈ మొక్క పండ్లను చూడగానే తినేయబుద్ధి అవుతుంది. కానీ అవి అత్యంత విషపూరితమైన పండ్లు. తింటే శరీరం విషమయం అవుతుంది. తక్షణ మరణం కూడా సంభవించవచ్చు. ఇవి ఉష్ణమండల ప్రాంతాలైన దక్షిణ ఉత్తర అమెరికా నుండి ఉత్తర దక్షిణ అమెరికా వరకు విస్తరించి ఉన్నాయి. ఈ మొక్కను ‘లిటిల్ ఆపిల్ ఆఫ్ డెత్’ అని కూడా అంటారు. అందంగా, పచ్చగా కనిపిస్తున్నప్పటికీ ఈ మొక్కల మోసపూరితమైన అందం జానపద కథలలో అపఖ్యాతిని సంపాదించుకుంది. ఈ చెట్టు చుట్టూ అనేక కథలు ఉన్నాయి. ప్రకృతిలో దాగి ఉన్న ప్రమాదాలకు ఒక హెచ్చరికగా ఈ మొక్క కొన్ని కథల్లో గౌరవాన్ని కూడా పొందింది. మొదట వీటికి చిన్న ఆకుపచ్చని పువ్వుల వంటి ముళ్లు వస్తాయి. వాటి నుండి పండ్లు వృద్ధి చెందుతాయి. అవి చిన్న ఆపిల్ పండ్లలా కనిపిస్తాయి.5. మూషిక భక్షకి మాంసాహార రాక్షసి‘నెపెంథెస్ అటెన్ బరోగి’ అనే ఈ ఆగ్నేయాసియాకు చెందిన మొక్క.. వాలీబాల్ నెట్లా పెద్ద మూతితో, కాడ ఆకారపు ఆకులను తోకగా కలిగి ఉంటుంది. ఇది కీటకాలను మాత్రమే కాకుండా ఎలుకలను కూడా బంధించి తింటుంది. వీటిని పిచర్ మొక్కలు అంటారు. ప్రముఖ ప్రకృతి శాస్త్రవేత్త సర్ డేవిడ్ అటెన్‌బరో పేరును ఈ మొక్కకు పెట్టారు. నెపెంథెస్ అటెన్ బరోగి భూమిపై నిటారుగా, లేదా ఊగులాడుతూ పెరిగే పొద. కీటకాలు గానీ, ఎలుకలు గాని ఒకసారి ‘నెట్’లో పడ్డాక ఇక బయటికి రావటం ఉండదు. మొక్క లోపలి ఆమ్ల ద్రవంలో జీర్ణమై పోతాయి. ఫిలిప్పీన్స్ ద్వీప సమూహం అంతటా కనిపించే వివిధ జాతుల పిచర్ మొక్కలను ఒక జాబితాగా తయారు చేయటానికి 2007లో వృక్షశాస్త్రవేత్తలు రెండు నెలల పాటు పరిశోధన జరిపినప్పుడు ఈ నెపెంథెస్ అటెన్బరోగి అమ్మగారు దర్శనమిచ్చారు.6. పోర్క్యుపైన్ టొమాటాముళ్లు కప్పుకున్న వయ్యారి‘సోలనమ్ పైరాకాంతోస్’ అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ పోర్క్యుపైన్ మొక్క టొమాటా మొక్క లాగా కనిపిస్తుంది. అయితే పదునైన ముళ్లను కప్పుకుని ఉంటుంది. ఈ ముళ్లు... వేటాడే జంతువులు, కొన్ని రకాల తెగుళ్ల నుంచి ఈ ‘టొమాటా’లకు సహజ రక్షణ కవచంగా పనిచేస్తాయి. ఆఫ్రికాలోని కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో జీవించడానికి వీలు కల్పిస్తాయి.పోర్క్యుపైన్ అద్భుతమైన రూప లావణ్యాలతో వయ్యారంగా ఉంటుంది. పూలు లావెండర్ రంగులో, ముళ్లు నారింజ రంగులో ఉంటాయి. ఇది ఉష్ణమండల మడగాస్కర్ ద్వీపానికి చెందిన మొక్క. నిత్యం పచ్చగా ఉంటూ, పొదలు పొదలుగా పెరుగుతుంది.7. డాల్స్ ఐ ప్లాంట్భయానక ‘భ్రమ’రాక్షసి ‘ఆక్టేయా పాకిపొడా’ అనే ఈ మొక్క, బెర్రీ పండ్లు అని భ్రమింపజేసే మానవ కనుగుడ్లను పోలిన పండ్లను కలిగి ఉంటుంది. పండు చుట్టూ తెల్లగా ఉంటుంది. మధ్యలో కారునలుపు ఉంటుంది. ఉత్తర అమెరికా అడవులకు చెందిన ఈ ‘బెర్రీ’లు క్షీరదాలకు అత్యంత విషపూరితమైనవి. ఆహారం కోసం వెతికే జంతువులు తమ సహజజ్ఞానం వల్ల కావచ్చు, వీటి దరిదాపులకే వెళ్లవు. అసలు వీటి రూపమే భయం గొల్పేలా ఉంటుంది. ఇవి మనుషులకు, అడవి జంతువులకు నిషిద్ధమైనవి. వీటి పండ్లు తింటే గుండె కండరాల కణజాలంపై తక్షణ ప్రభావం చూపి గుండెను ఆగిపోయేలా చేస్తాయి.8. జెల్లీ ఫిష్ ట్రీ వెల్లకిలా పడిన గొడుగు!తూర్పు ఆఫ్రికా వైపుగా హిందూ మహాసముద్రంలో ఉండే సీషెల్స్ ద్వీప సముద్రంలో మాత్రమే కనిపించే ఈ ‘మెడుసజైన్ ఆపోజిటిఫోలియా’ అనే మొక్క నేడో రేపో అంతరించి పోతుందన్నంతగా ప్రమాదంలో ఉంది. జెల్లీ ఫిష్ టెంటకిల్స్‌ను పోలి ఉండే దీని పండ్ల క్యాప్సూ్యల్స్ దీనిని అరుదైన మొక్కలలో ఒకటిగా నిలిపాయి. చరిత్రకు పూర్వం నుండే ఈ మొక్క జీవించి ఉందని అంటారు. దీనికి వచ్చే తక్కువ విత్తనాలు దీని అంకురోత్పత్తికి సరిపడినంతగా మాత్రమే ఉంటాయట! అలాగే తగ్గిపోతున్న ఆవాసాలు కూడా ఈ మొక్క మనుగడకు ముప్పుగా పరిణమించాయి. వీటి పండ్లు ఎండి చిట్లినప్పుడు వెల్లికిలా పడిన గొడుగుల్లా కనిపిస్తాయి.విక్టోరియా వాటర్ లిల్లీ తేలియాడే ‘శివగామి’అమెజాన్ వర్షారణ్య ప్రాంతాల్లో కనిపించే ‘విక్టోరియా అమెజోనికా’ అనే ఈ మొక్క 9 అడుగుల వెడల్పు వరకు భారీ ఆకులను ఉత్పత్తి చేస్తుంది, ఆ ఆకు చిన్న పిల్లవాడు లేదా ఒక సన్నటి మనిషి బరువును మోసేంత బలంగా ఉంటుంది. వీటిని నీటి ఆకులు అంటారు. తేలికపాటి మోడల్స్ (అమ్మాయిలు) వీటిపై కూర్చొని ఫొటో షూట్ తీసుకోవటం ఇప్పుడు విస్తృతంగా కనిపిస్తోంది. విక్టోరియా మొక్క, జలచరాలకు ఆశ్రయం కల్పిస్తుంది. స్థానికులు దీనిని అనేక విధాలుగా ఉపయోగిస్తుంటారు. ఈ భారీ ‘నీటి కలువ’ ఒక సహజమైన అద్భుతం. అమెజాన్ ప్రాంతీయులకు ప్రకృతి ప్రసాదించిన సంపద. ఈ మొక్క చేసే టక్కు టమారాలు ఏమీ లేకపోయినా, వృక్షశాస్త్రజ్ఞులు దీనిని ‘అరుదైన జాతి’లో చేర్చారు.10. డెడ్ హార్స్ అరమ్ కుళ్లిన వాసన కొట్టే లిల్లీ‘హెలికోడిసెరోస్ మస్కివోరస్’ అనే ఈ మొక్క కుళ్లిన మాంసం వాసనను వెదజల్లటం ద్వారా పరాగ సంపర్కాలను ఆకర్షిస్తుంది. ఈ వాసన, కళేబరాలను తినే కీటకాలను రారమ్మని పిలుస్తుంటుంది. ఆ కీటకాలు ఈ మొక్కల పునరుత్పత్తికి, విస్తరణకు సహాయపడతాయి.మధ్యధరా సముద్రంలో ఈ మొక్కను కనుగొన్నారు. మనుగడ కోసం పోరాటంలో మొక్కల వ్యూహాలు ఎంత తీవ్రంగా, అసాధారణంగా ఉంటాయో తెలుసుకోటానికి ఈ మొక్క ఒక ఉదాహరణ. వీటి పూలను ఆరల్ లిల్లీస్ అంటారు. ఆ లిల్లీపూల పుష్ఫగుచ్చం, చనిపోయిన జంతువు ఆసన ప్రాంతాన్ని పోలి ఉంటుంది. సాక్షి, స్పెషల్ డెస్క్ -
మెరిసే చర్మం కోసం యాంటీ–రింకిల్ బ్యూటీ డివైజ్..
చాలామంది తమలో వృద్ధాప్యఛాయలు రాకుండా చూసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అందంగా, యవ్వనంగా కనిపించే చర్మం కోసం ఇప్పుడు కొత్త ‘పోర్టబుల్ హ్యాండ్‌హెల్డ్ యాంటీ–రింకిల్ బ్యూటీ డివైజ్’ అందుబాటులోకి వచ్చింది. ఇది ఇంట్లోనే సులభంగా చర్మ సంరక్షణ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ పరికరం చర్మ ఆరోగ్యానికి వివిధ రకాలుగా సహాయపడుతుంది. ఇది చర్మాన్ని బిగుతుగా, దృఢంగా మారుస్తుంది. ఈ డివైజ్ సాయంతో చర్మాన్ని లిఫ్ట్ చేసి, బిగుతుగా ఉంచుకోవచ్చు. చర్మంపై ఉండే సన్నటి ముడతలను ఈ పరికరం సమర్థవంతంగా తగ్గిస్తుంది. చర్మంపై కనిపించే రంధ్రాలు పెద్దవిగా ఉంటే, ఈ పరికరం వాటిని చిన్నవిగా చేయడానికి సహాయపడుతుంది.ఈ డివైజ్ చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. కొలాజెన్ చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అలాగే చర్మాన్ని లోపలి నుంచి ఆరోగ్యంగా మార్చి, దానిని పునరుజ్జీవింపజేస్తుంది. ఈ డివైజ్ అయానిక్ మోడ్ ఆప్షన్లతో పనిచేస్తుంది. దీనిలో హై, లో, మీడియం వంటి మైక్రో కరెంట్ పవర్ ఆప్షన్లు ఉంటాయి. దీనితో చర్మ అవసరాలకు తగినట్టుగా కరెంటు స్థాయిని ఎంచుకోవచ్చు. అంతేకాకుండా చికిత్స సమయాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ బ్యూటీ డివైస్‌కి ట్రీట్మెంట్ హెడ్స్ వేరువేరుగా ఉంటాయి. ముక్కు, కళ్లు భాగాలను మసాజ్ చేసుకోవడానికి ఒక హెడ్, ముఖానికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి మరో హెడ్, మొత్తం బాడీని మసాజ్ చేయడానికి ఇంకో హెడ్ ఇలా మూడు వేరువేరు హెడ్స్ లభిస్తాయి. ఈ రకమైన ఫీచర్లు ఉన్న డివైస్‌తో చర్మ సంరక్షణను సులభతరం చేసుకోవచ్చు. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడంతో చర్మం ఆరోగ్యంగా మారుతుంది. అందంగా మెరుస్తూ కనిపిస్తుంది. (చదవండి: Back pain during pregnancy: ప్రెగ్నెన్సీ టైంలో నడుము నొప్పి సాధారణమా? తగ్గాలంటే..) -
ప్రెగ్నెన్సీ టైంలో నడుము నొప్పి సాధారణమా? తగ్గాలంటే..
నేను ఆరునెలల గర్భవతిని. కొన్నిరోజులుగా నడుమునొప్పి ఎక్కువగా వస్తోంది. ఎక్కువసేపు నడిచినా, కూర్చున్నా నొప్పి పెరుగుతోంది. ఇది గర్భధారణలో సాధారణమా? లేక ఏమైనా సమస్య ఉందా? దీన్ని తగ్గించడానికి ఏం చేయవచ్చు?– మాలిని, గుంటూరు. గర్భధారణలో నడుమునొప్పి చాలా సాధారణం. ఎక్కువమంది గర్భిణులు ఏదో ఒక దశలో దీనిని అనుభవిస్తారు. బరువు పెరగడం, గర్భాశయం పరిమాణం పెరగడం, హార్మోన్ల ప్రభావం, శరీర ధారణలో మార్పులు, లిగమెంట్లు సడలడం వంటివి దీనికి ప్రధాన కారణాలు. చాలాసేపు ఒకే స్థితిలో కూర్చోవడం లేదా నిలబడడం, వెన్నుకు సరైన ఊతం లేని కుర్చీలో కూర్చోవడం వల్ల నొప్పి మరింత పెరుగుతుంది. గర్భధారణ మొదటి నెలల నుంచే ఈ సమస్య రావచ్చు, అయితే గర్భధారణ కొనసాగుతున్న కొద్దీ ఇది మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. నడుమునొప్పి తగ్గించుకోవడానికి కొన్ని సాధారణ జాగ్రత్తలు పాటించడం మంచిది. ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడడం తగ్గించుకోవాలి. వెన్నుకు ఊతం ఇచ్చే కుర్చీని ఉపయోగించడం, పక్కకు తిరిగి పడుకోవడం, మోకాళ్ల మధ్య దిండు పెట్టుకుని నిద్రించడం ఉపశమనాన్ని ఇస్తాయి. హీల్స్ వాడకూడదు, సౌకర్యవంతమైన షూలు ధరించాలి. ఎక్కువ నీరు తాగడం, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం, పాల ఉత్పత్తులు తీసుకోవడం, వైద్యులు సూచించిన కాల్షియం, విటమిన్ సప్లిమెంట్స్ వాడటం అవసరం. ఆకస్మిక నొప్పి ఉన్నప్పుడు వేడి నీటి బ్యాగ్‌తో మసాజ్ చేయడం, వేడినీటితో స్నానం చేయడం లేదా మృదువుగా తైలమర్దన చేయించుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. పెయిన్ కిల్లర్ వైద్యుల సూచన లేకుండా వాడకూడదు. తగినంత విశ్రాంతితో పాటు నడక, వ్యాయామం, స్ట్రెచింగ్, ప్రెగ్నెన్సీ యోగా వంటి పద్ధతులు కూడా నడుమునొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని సందర్భాల్లో ఫిజియోథెరపిస్ట్ సలహా తీసుకోవడం కూడా మంచిది. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నడుమునొప్పి తగ్గడమే కాకుండా, ప్రసవానికి శరీరం సిద్ధమవుతుంది, ప్రసవానంతర రికవరీ సులభతరం అవుతుంది, అలాగే గర్భిణికి మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.నేను ఆరు నెలల గర్భిణిని. గర్భధారణ ప్రారంభంలో నా హీమోగ్లోబిన్ 12 గ్రాములు ఉండగా, ఇప్పుడు అది 8 గ్రాములకు పడిపోయింది. నేను ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నప్పటికీ హీమోగ్లోబిన్ తగ్గిపోయింది. డాక్టర్ మరిన్ని పరీక్షలు చేయమని సూచించారు, అలాగే హీమోగ్లోబిన్ సరిచేయడానికి ఇంజెక్షన్లు అవసరం కావచ్చని చెప్పారు. నా బంధువులు చెబుతున్నది ఏమిటంటే, హీమోగ్లోబిన్ తక్కువగా ఉండటంవల్ల బిడ్డ పెరుగుదలపై ప్రభావం చూపవచ్చని, అలాగే డెలివరీ తర్వాత కోలుకోవడం కష్టమవుతుందని. ఇది నిజమేనా? – సుగుణ, మిరియాలగూడ. గర్భిణులు, ముఖ్యంగా భారతీయ మహిళల్లో రక్తహీనత లేదా హీమోగ్లోబిన్ తక్కువగా ఉండటం చాలా సాధారణమైన సమస్య. గర్భధారణ సమయంలో రక్తపరిమాణం పెరగడం వలన శరీరానికి ఐరన్ అవసరం ఎక్కువ అవుతుంది, కాని, ఆహారంతో మాత్రమే ఆ అవసరం తీరడం కష్టం. అందువల్ల హీమోగ్లోబిన్ స్థాయులు తగ్గిపోతాయి. కొందరిలో గర్భధారణకు ముందే రక్తహీనత ఉండి, అది గర్భధారణలో మరింత ఎక్కువ అవుతుంది. ఇది సాధారణంగా ఐరన్ లోపం వల్ల జరుగుతుంది, కానీ కొన్నిసార్లు విటమిన్ బీ12 లేదా ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కూడా రావచ్చు. అరుదుగా జన్యు సంబంధిత వ్యాధులు, ఉదాహరణకు థలసీమియా, సికిల్ సెల్ వ్యాధులు వంటి కారణాలు కూడా ఉండవచ్చు. హీమోగ్లోబిన్ తక్కువగా ఉండటం తల్లి, బిడ్డ ఇద్దరికీ సమస్యలు కలిగించే అవకాశం ఉంది. తల్లిలో అలసట, తలతిరగటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వలన ఇన్ఫెక్షన్లు రావడం, ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం జరగడం, రక్త మార్పిడి అవసరం కావడం, అలాగే ప్రసవానంతరం రికవరీ ఆలస్యమవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. బిడ్డలో పెరుగుదలలో ఆలస్యం, తక్కువ బరువుతో పుట్టడం, కొన్ని సందర్భాల్లో ఐసీయూ అవసరం కావడం వంటి సమస్యలు రావచ్చు. అందువల్ల రక్తహీనతను త్వరగా గుర్తించి చికిత్స చేయడం అత్యంత ముఖ్యం. సాధారణంగా గర్భిణులకు ఐరన్ సప్లిమెంట్లు రెండవ త్రైమాసికం నుంచే ఇవ్వడం ప్రారంభిస్తారు, ఎందుకంటే మొదటి నెలల్లో వాంతులు, మలబద్ధకం వంటి సమస్యలు మరింత పెరగకుండా ఉండటానికి. మాత్రలను విటమిన్ సీ ఎక్కువగా ఉన్న ఆహారాలతో ఉదాహరణకు నిమ్మరసం, నారింజ లాంటివి ఖాళీ కడుపుతో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. మాత్రలు సరిగా పనిచేయకపోతే లేదా తట్టుకోలేకపోతే, ఐరన్ ఇంజెక్షన్లు అవసరం కావచ్చు. ఆహారంలో ఆకుకూరలు, శనగలు, బీన్స్, పప్పులు, కిస్మిస్, ఆప్రికాట్ వంటి డ్రై ఫ్రూట్స్, అలాగే గుడ్లు, చేపలు, కాలేయం, మాంసం వంటి నాన్వెజిటేరియన్ ఆహార పదార్థాలు ఉన్నాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా గర్భధారణలో ఐరన్ లోపాన్ని చక్కదిద్దుకోవచ్చు. సమయానికి పరీక్షలు చేయించుకోవడం, వైద్యులు సూచించిన జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. డెలివరీకి ముందే హీమోగ్లోబిన్ స్థాయులు మెరుగుపడితే, మీకూ, మీ బిడ్డకూ ఆరోగ్యకరమైన ఫలితాలు వస్తాయి. (చదవండి: సరైన ప్రశంసలతోనే... జీనియస్ మైండ్ సెట్!) -
నటి అనుకుట్టి ఇష్టపడే స్టైలిష్వేర్లు ఇవే..!
శారీలో కొత్త డ్రేపింగ్ స్టయిల్స్ ట్రై చేస్తుంటాను. ఇది శారీకి కొత్త జీవాన్ని ఇస్తుంది. సామాన్యమైన సల్వార్‌ను కూడా కొత్త శైలిలో ధరించడం ద్వారా ప్రత్యేకతను పొందవచ్చు. నేను ఎల్లప్పుడూ సహజ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగిస్తాను. అందుకే, నా చర్మం, జుట్టు సహజంగానే మెరుగ్గా ఉంటాయి. నిజానికి, నా అందం మొత్తం నా సహజత్వంలోనే ఉంది అని చెబుతోంది అనుమోల్అందానికి వయసుతో నిమిత్తం ఉండదనేందుకు నిదర్శనం ఆమె. అందమైన వర్చస్సుతో పాటు నిండైన ఆత్మవిశ్వాసం తొణికిసలాడే నటి అనుమోల్ ఫాలో అయ్యే స్టయిలింగ్ టిప్స్ నేటి యువతను కూడా ఆకర్షించి, ఫాలో అయ్యేలా చేస్తున్నాయి. ఇక్కడ అనుమోల్ ధరించిన చీరబ్రాండ్: చినాయా బెనారస్, ధర: రూ. 16,658, జ్యూలరీ బ్రాండ్: దీపాలీ డిజైన్స్, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.స్టిచ్డ్ జ్యూలరీఆభరణాలు లేకుండా రాయల్టీ లుక్ సాధ్యమేనా? అసాధ్యం అనుకుంటున్నారా? కాని, మీ దగ్గర ఒకే ఒక్క స్టిచ్డ్ జ్యూలరీ బ్లౌజ్ ఉంటే, అసాధ్యాన్ని చాలా సులభంగా సుసాధ్యం చేయగలరు. మెడ చుట్టూ నెక్లెస్‌లా మెరుస్తూ, చేతులపై వంకీల్లా మెరిసిపోతూ, వెనుకవైపు పెండెంట్‌లా గ్లామర్ జోడించే ఈ మగ్గం వర్క్ డిజైన్లు, ‘ఎక్కడ హారం? ఎక్కడ గొలుసు?’ అని వెతికే పని, ఇతర అదనపు జ్యూలరీ అవసరం లేకుండా చేస్తాయి. ఎందుకంటే ఆభరణాలే బ్లౌజ్లో దాక్కుని ఉంటాయి. ఒక్క బ్లౌజ్‌తోనే మీ స్టయిల్ నేరుగా స్టార్డమ్ లెవెల్‌కి చేరుతుంది. సింపుల్ కలర్ చీరతో కలిపితే మగ్గం వర్క్ మరింత హైలైట్ అవుతుంది, హెయిర్ స్టయిల్ బన్ లేదా సైడ్ ప్లేట్స్ సరిగ్గా సరిపోతుంది. వీటితోపాటు, మినిమల్ మేకప్ అదనంగా అందాన్ని జోడిస్తుంది. అయితే, బ్లౌజ్ ఫిటింగ్ సరిగ్గా ఉంటే, మగ్గం వర్క్ డిజైన్ మరింత ప్రభావవంతంగా కనిపిస్తుంది. దీపిక కొండి(చదవండి: అందాల ఆషికా రంగనాథ్ స్టైలిష్ వేర్లు ఇవే..!) -
ఎడారిలోన పంట పండెనెంత సందడి!
ఎండలతో ఎర్రగా మారిన ఎడారి నేల ఇప్పుడు పచ్చని పంటలతో మెరిసిపోతోంది. కేవలం చిన్న చిన్న రాళ్ల గుట్టలు, మట్టీ మాయల సహాయంతోనే పరిశోధకులు ఎడారిని పచ్చని పరుపులా మార్చడం పెద్ద పనేం కాదని అంటున్నారు. ఆనకట్టలు కావు.. ఆదుకునే మంత్రాలు!ఎర్రబడిన ఎడారుల్లో కొత్త ఆశ మొలకెత్తింది. ఆ ఆశ పేరే లారా నార్మన్. అమెరికాకు చెందిన ఈ శాస్త్రవేత్త, ఇరవై ఏళ్లుగా ఎడారిలో నీటి జాడల కోసం వెతికేస్తూ చివరకు ఒక రహస్యాన్ని కనుగొన్నారు. ఆ రహస్యం పెద్ద యంత్రం కాదు, క్లిష్టమైన శాస్త్రం కాదు. ప్రకృతి ఇచ్చిన సులభ మంత్రం. పెద్ద పెద్ద రాళ్లు, చెట్లు, కట్టెలు వంటివన్నీ కలిసి నిడ్స్ అనే సహజ అడ్డాలుగా మారతాయి. ఈ అడ్డాలు నీటి ప్రవాహాన్ని పూర్తిగా ఆపకుండా, నెమ్మదిగా మార్చి, నేలను తడిగా ఉంచుతాయని లారా గుర్తించింది. ఈ పద్ధతిని అనుసరించి ఆమె అరిజోనా, న్యూ మెక్సికో ప్రాంతాల్లో చిన్న చెక్ డ్యామ్‌లు, రాళ్ల గుట్టలు ఏర్పాటు చేసింది. మొదట ఇది కేవలం మట్టిని ఆపినట్టే అనిపించింది. కాని, కొద్ది రోజుల్లోనే ఎండిన నేల తడిగా మారింది. తడిబీడులు పుట్టాయి. పచ్చని చెట్లు మొలిచాయి. పక్షులు తిరిగి వచ్చి కూశాయి. ఇలా ఎడారి గుండెకు మళ్లీ జీవం చేరింది. మాయా మట్టీ!ఎడారి ఇసుకల్లో ఒక్కసారిగా పచ్చని పంటలు పండాయి. ఆశ్చర్యంగా అనిపిస్తుందా? కాని, ఇది నిజమే! యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నలభై రోజుల్లోనే ఇసుకమయమైన భూమి కాస్త పచ్చటి తోటగా మారిపోయింది. అంతేగాక, అక్కడి ఎండల్లో తియ్యటి పుచ్చకాయల పంట కూడా పండింది. ఈ అద్భుతానికి కారణం ‘నానోక్లే’. మట్టి, నీరు, స్థానిక ఇసుకల మిశ్రమంతో తయారైన ఈ ద్రవం ఎడారికి ప్రాణం పోసే రహస్య మంత్రంలా పనిచేస్తుంది. ఇసుకపై దీన్ని పిచికారీ చేస్తే, ప్రతి ఇసుక రేణువుకు మట్టి కవచం ఏర్పడుతుంది. ఆ కవచం నీటిని పట్టి ఉంచుతుంది. ఫలితంగా ఎండిన నేల తడిగా మారి, వేర్ల దగ్గర పచ్చని జీవం మొలుస్తుంది. ఇలా కొద్ది గంటల్లోనే ఎడారి పచ్చదనంతో మెరిసిపోతుంది. అంతేకాదు, నీటి వినియోగం సగానికి తగ్గిపోవడం, పంటలు వేగంగా పెరగడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఈ మధ్యనే అబూధాబీలో చేసిన ప్రయోగాల్లో పుచ్చకాయలతో పాటు జుక్కినీ, మిల్లెట్ కూడా పండించగలిగారు. కరోనా సమయంలో వచ్చిన ఆ పంటలు స్థానిక కుటుంబాల కడుపులు నింపాయి. ఇప్పటికీ ఈ ప్రక్రియకు ఖర్చు కొంత ఎక్కువే కాని, భవిష్యత్తులో ఈ సాంకేతికత చౌకగా మారితే ఎడారులన్నీ పచ్చటి పొలాలుగా మారిపోతాయి! (చదవండి: పిట్ట మైల్డ్.. వేట వైల్డ్) -
పిట్ట మైల్డ్.. వేట వైల్డ్
కాస్త వేట తెలిసిన పెద్దపెద్ద పక్షులైతే మాంసం ముక్కకోసం వెతుకుతాయి చిన్నా చితకా పక్షులు గింజలు తింటాయి. దొరికితే పురుగుపుట్రను నోట్లో వేసుకుంటాయి. అయితే ష్రైక్ అనే పక్షి క్రూరత్వాన్ని చూస్తే మాంసాహారులకు కూడా మనసు చలిస్తుంది. దీని వేటలో అంత వ్యూహం ఉంటుంది మరి! ‘లానిడే’ కుటుంబానికి చెందిన అనేక రకాల పక్షులను ష్రైక్ పక్షులు అంటారు. ఈ పక్షులు చూడటానికి చాలా మైల్డ్‌గా కనిపిస్తాయి గాని, వీటిని వైల్డ్ బర్డ్స్ అని కూడా అంటారు. వీటికి వేటాడే జంతువులకు ఉన్నట్లుగా బలమైన కాళ్లు, గోళ్లు ఉండవు. అందుకే ఇవి తన ఆహారాన్ని విలక్షణంగా సమకూర్చుకుంటాయి. చిన్న కీటకాలు, బల్లులు, కప్పలు, చిట్టెలుకలు, కాస్త బలహీనంగా ఉండే రామచిలుకలను వేటాడి, వాటిని నిర్దాక్షిణ్యంగా బతికి ఉండగానే ముళ్ళ పొదలపైన లేదా పదునైన కొమ్మలపైన, మొనలుదేరిన తీగలపైన గుచ్చి చంపుతాయి. మాంసం దుకాణంలో మాంసాన్ని కొక్కేలకు వేలాడదీసినట్లుగా ఈ పక్షులు తమ ఆహారాన్ని ముళ్లకంపలకు వేలాడదీస్తాయి. ఈ పద్ధతి వాటి మనుగడకు అత్యంత కీలకం. ష్రైక్ పక్షులు తమ ఆహారాన్ని నిల్వ చేసుకోవడానికి, తర్వాత అవసరమైనప్పుడు ముక్కలుగా చేసి తినడానికి ఈ విధానాన్నే ఎంచుకుంటాయి. మనకు ఈ పద్ధతి క్రూరంగా అనిపించినా, ప్రకృతిలో ఈ జీవులు తమ మనుగడ కోసం అనుసరించే వ్యూహం ఇదంతా. ఇక తినే ఆహారం విషతుల్యమైందనే అనుమానం వస్తే, ఈ పక్షులు తాము వేటాడిన ఆహారాన్ని అక్కడే వదిలిపెట్టి మరునాడు వచ్చి, అప్పటికి సురక్షితంగా ఉన్నట్లయితే తింటాయట! -
సేఫ్ హ్యాండిల్స్!
డోర్ హ్యాండిల్ అంటే మనం పెద్దగా పట్టించుకోని చిన్న వస్తువు. కాని, అక్కడే నిత్యం బ్యాక్టీరియా కణాలు పార్టీ చేసుకుంటుంటాయి. తెలియకుండానే వ్యాధులను లోపలికి ఆహ్వానించే ఈ హ్యాండిల్స్‌ని చూసి, ‘ఇక చాలు’ అనుకున్నాడు జమైకా యువ ఆవిష్కర్త రేవాన్స్ స్టూవర్ట్ట్. వెంటనే సెల్ఫ్ క్లీనింగ్ డోర్ హ్యాండిల్‌కు ప్రాణం పోశాడు. జమైకా తీరం దగ్గర పుట్టిన అతడి ఆలోచన ఇప్పుడు ఆసుపత్రుల తలుపులకు చేరి వేలాది మంది ప్రాణాలను రక్షిస్తోంది. రేవాన్స్ స్టూవర్ట్.. జమైకా పర్వతాల మధ్యలోని మౌంట్ ప్రాస్పెక్ట్ అనే చిన్న ఊరిలో పెరిగిన అబ్బాయి. జమైకా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుంటున్న విద్యార్థి. అయితే, కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితమయ్యే విద్యార్థి కాదు, వాస్తవ సమస్యలను గమనించి, వాటికి పరిష్కారాలను వెతికే క్రియేటర్. చిన్నప్పటి నుంచి వస్తువులు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. ఆటబొమ్మలు, రేడియోలు విప్పదీసి మళ్లీ కలపడం అతని ఫేవరెట్ గేమ్. అందుకే అతని తల్లి ఎప్పుడూ అతనికి ‘రేవాన్స్ , వస్తువులను పగలగొట్టడం మానెయ్యి!’ అని చెబుతుండేది. కుటుంబంలో ఎవరికీ అక్షరాలు రాకున్నా, రేవాన్స్ యూనివర్సిటీలోకి అడుగుపెట్టాడు. అక్కడ ఇన్నోవేషన్లపై ప్రేమ పెంచుకున్నాడు. వర్చువల్‌గా దుస్తులు ట్రై చేసుకునే సాఫ్ట్‌వేర్‌ను కూడా తయారు చేశాడు. కాని, అసలైన మలుపు ఒక ఆసుపత్రిలో వాలంటీర్‌గా పనిచేసేటప్పుడు వచ్చింది. అక్కడే గ్రహించాడు ‘డోర్ హ్యాండిల్స్ అంటే అనారోగ్యానికి నేరుగా ఫ్రీ ఎంట్రీ పాస్‌ల లాంటివి’. అప్పుడే ‘జెర్మోసోల్’ అనే మ్యాజిక్ డోర్ హ్యాండిల్‌ను తయారు చేశాడు. ఎలా పనిచే స్తుందంటే? సూర్యరశ్మిని సూక్ష్మజీవులు తట్టుకోలేవు కదా! అదే సూత్రాన్ని ఇక్కడ వాడాడు. హ్యాండిల్లో ఒక చిన్న అల్ట్రావయొలెట్ లైట్ అమర్చాడు. మనం తాకగానే అది వెలుగుతుంది. అందులోంచి వెలువడే అల్ట్రావయొలెట్ కాంతి ముప్పయి సెకన్లలో హ్యాండిల్‌పై ఉన్న బ్యాక్టీరియాను అంతం చేస్తుంది. దాదాపు 99.9 శాతం శుభ్రత సాధ్యం! ఇది కేవలం ఒక ఆవిష్కరణ మాత్రమే కాదు, కరీబియన్స్ వాతావరణానికి సరిపోయే ప్రాణరక్షక కవచం. ఆసుపత్రులు, స్కూళ్లు, ఆఫీసులు సహా ఎక్కడ తలుపులు ఉంటాయో, అక్కడ దీని రక్షణ అవసరం. ఈ అద్భుత ఆవిష్కరణ రేవాన్స్ కి జమైకా ప్రధాని చేతుల మీదుగా జాతీయ యువ శాస్త్రవేత్త అవార్డు, అలాగే కామన్వెల్త్ హెల్త్ ఇన్నోవేషన్స్ అవార్డు తెచ్చిపెట్టింది. ఇప్పుడు తలుపు తీయడం అంటే కేవలం లోపలికి వెళ్లడం కాదు, సూక్ష్మజీవులను బయటే వదిలేయడం కూడా! ఈ విషయమై రేవాన్స్ మాట్లాడుతూ, ‘ఎన్ని కష్టాలు వచ్చినా మా కుటుంబం ఎప్పుడూ ఒకటిగానే నిలిచింది. వాళ్లే నా బలం, వాళ్లే నా ప్రేరణ’. అని చెప్పాడు. ∙ -
అసలైన అంధుడు
సూరారంలో సుబ్బయ్య అనే ఆస్తి పరుడు ఉండేవాడు. అతను పరమ లోభి. అనేక అక్రమ వ్యాపారాలు చేసి డబ్బు కూడబెట్టాడు. దానం చేసే బుద్ధి, పరోపకార గుణం సుబ్బయ్యలో మచ్చుకైనా లేకుండేవి. ఏ పనైనా వెంటనే కావాలనుకునేవాడు.అయితే, అతనికి దేవునిపై నమ్మకం ఎక్కువ. వీలు దొరికినప్పుడల్లా ఏదో ఒక దేవాలయానికి వెళ్లి తన కోరికలు చెప్పుకునేవాడు.పండరిపుర పాండురంగడు కోరిన కోరికలు వెంటనే తీరుస్తాడని సుబ్బయ్య చెవిన పడింది. వెంటనే పండరిపురం వెళ్లాడు. చంద్రవంక నదిలో స్నానం చేసి పుండరీకుని దర్శనం చేసుకున్నాడు. తన కోరికలు పాండురంగనికి చెప్పమని కోరుకున్నాడు. ఆ తర్వాత పాండురంగని ఆలయానికి చేరుకున్నాడు.పాండురంగని ఆలయం ఎంతో సుందరంగా ఉంది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కళకళలాడుతున్నాయి. దైవ దర్శనానికి ఉన్న వరుస ఎంతో పొడవుగా భక్తులతో కిటకిటలాడుతోంది.సుబ్బయ్య అక్రమ బుద్ధి అక్కడ కూడా చూపించాడు. వరుసలో భక్తులు ఒకరి వెంట ఒకరు నెమ్మదిగా పాండురంగని భజన చేసుకుంటూ వెళుతున్నారు. సుబ్బయ్య మాత్రం వెంటనే భగవంతుని దర్శనం చేసుకోవాలని వరుసలోంచి పక్కకు వచ్చి అందర్నీ తోసుకుంటూ ముందుకు పోయాడు. పాండురంగని దర్శించుకుని బయటకు వెళ్లాడు. ‘అయ్యా! దానం చేయండి!’ అంటూ బిచ్చగాళ్లు చుట్టుముట్టారు. అందర్నీ విదిలించుకుని వెళ్ళి దూరంగా ఉన్న అరుగు మీద కూర్చున్నాడు.అక్కడ కంటికి నల్ల అద్దాలు పెట్టుకుని పాండురంగని కీర్తిస్తున్న అంధురాలు ‘అయ్యా! గర్భగుడిలో ఇటుక మీద పాండురంగ స్వామి రెండుచేతులు నడుం మీద పెట్టుకుని ఠీవిగా నిల్చున్న అందాన్ని చూడటానికి మన రెండు కళ్ళు చాలవట కదా!’ అడిగింది.సుబ్బయ్య మాట్లాడలేదు. ‘పాండురంగని పాదాలు మన చేతులతో, శిరస్సుతో స్పృశించవచ్చట కదా! మందిరంలో ఎటు చూసినా తులసి మాలలేనట కదా!?’ తిరిగి అడిగింది. ఆమెకు కళ్లు కనిపించవు. అందుకే చూడలేక అడిగింది. సుబ్బయ్యకు రెండు కళ్లున్నా వెంటనే దర్శనం చేసుకుని బయట పడాలని, ఇతర భక్తులను తోసుకు వెళ్లాడు. అందుకే ఆ అందాన్ని ఆస్వాదించలేకపోయాడు.తన కళ్ళకూ, కళాత్మకంగా చూసే కళ్లకు చాలా భేదం ఉంది. కళాత్మక హృదయం లేని తనకు గొప్ప శిల్పం కూడా బండరాయి లాగే కనిపించింది’ అనుకున్నాడు సుబ్బయ్య. పరోపకారం, దానగుణం లేని తాను కళ్లున్న అసలైన అంధుణ్ణనుకున్నాడు. అక్రమ మార్గం విడిచి సక్రమంగా జీవించాలనుకున్నాడు. అలా అనుకున్నాక పేదలకు దానధర్మాలు చేస్తూ, భగవంతుని సుందరరూపాన్ని చూడగలిగాడు సుబ్బయ్య. పువ్వులు∙ గుండాల నరేంద్రబాబుపూలమ్మా పువ్వులు రంగు రంగుల పువ్వులురంగేళీ రవ్వలురాసగుమ్మ గువ్వలురక రకాల పువ్వులురమ్యమైన పువ్వులురా రమ్మను పువ్వులురామచిలుక చిన్నెలుముద్ద ముద్ద బంతులుముద్దుల చేమంతులుమల్లెలు మందారాలుఎర్రనైన గులాబీలుఅరవిరిసిన సింగారాలు -
జిలుగుల జింజు వెలుగుల రంజు
దక్షిణ కొరియాలోని జియోంగ్సాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న జింజు నగరంలో ఏటా జరిగే ఈ జింజు లాంతర్ ఫెస్టివల్ చాలా ప్రత్యేకంగా నడుస్తుంది. రంగురంగుల లాంతర్లతో జింజులోని నామ్గాంగ్ నది ప్రాంగణం మొత్తం దేదీప్యమానంగా వెలిగిపోతుంది.ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో వచ్చే ఈ దీపాల పండుగ.. సుమారు రెండువారాలకు పైగానే కొనసాగుతుంది. ఈ ఏడాది అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 19 వరకు జింజు నగరాన్ని మెరిపిస్తుంది. ఈ పండుగ మూలాలు సుమారు 400 సంవత్సరాల నాటి పురాతన చరిత్రను చెప్పుకొస్తాయి. జింజు నగరం 1592లో సైనిక కేంద్రంగా ఉండేది. ఆనాడు జపాన్ దండయాత్ర జరిగినప్పుడు జింజు కోటను రక్షించుకోవడానికి వేలాది మంది దక్షిణ కొరియా సైనికులు ప్రాణాలను కోల్పోయారు. వారి ప్రాణత్యాగాలకు గుర్తుగా నేటికీ ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. జపాన్ సైన్యం నామ్గాంగ్ నదిని దాటకుండా నిరోధించడానికి, వారిని తికమకపెట్టడానికి– కొరియన్ సైనికులు నీటిపై లాంతర్లను వదిలేవారని, అలాగే యుద్ధసమయంలో తమ కుటుంబ సభ్యులకు తమ క్షేమ సమాచారం తెలియజేయడానికి కూడా తేలియాడే లాంతర్లను ఉపయోగించేవారని చరిత్ర చెబుతుంది.ఈ వేడుకలో సాంస్కృతిక, వినోదాత్మక కార్యక్రమాలు చక్కగా సాగుతాయి. వేలకొద్దీ రంగురంగుల దీపాలు నామ్గాంగ్ నదిపై తేలుతూ, కళ్ళకు ఇంపుగా మెరుస్తాయి. ఈ వేడుకలో పాల్గొనేవారు తమ కోరికలు రాసిన లాంతర్లను నదిలో వదలిపెట్టవచ్చు లేదా ఆ ఆర్టిఫిషియల్ బ్రిడ్జీలకు వేలాడదీయవచ్చు. ప్రపంచంలోని వివిధ దేశాల మైలురాళ్లను పోలిన భారీ లాంతరు శిల్పాల ప్రదర్శన కనువిందు చేస్తుంది. పండుగ సందర్భంగా పర్యటకులకు, నదిపై తాత్కాలికంగా నిర్మించిన వంతెనలపై నడుస్తూ, లాంతర్లను దగ్గరగా చూసే అవకాశం కల్పిస్తారు. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో రాత్రిపూట– కళ్లు చెదిరే బాణాసంచాలు, డ్రోన్ లైట్ షోలతో ఆకాశం కాంతిమయమవుతుంది.అరుదైన లైట్హౌస్బోనవిస్టా ద్వీపకల్పంలో తీరం వెంబడి తరతరాలుగా ప్రయాణించే నావికులకు– కేప్ బోనవిస్టా లైట్హౌస్తో గొప్ప అనుబంధం ఉంది. పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లలో ఉపయోగించిన సీల్ (ఒక సముద్రజీవి) ఆయిల్‌తో మండే అరుదైన కాటోప్ట్రిక్ లైట్ ఉపకరణాన్ని ఇక్కడ చూడొచ్చు. న్యూఫౌండ్లాండ్, లాబ్రడార్లలో అత్యధికంగా ఫొటోలు తీసిన ప్రదేశాలలో ఇది ఒకటి! తిమింగలాలు, మంచు పర్వతాలు, పఫిన్ పక్షులను చూడటానికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. అందుకే ఇక్కడికి పర్యాటకులు ఎగబడుతుంటారు. -
రావణుడి లంకాక్రమణ
రావణుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి వరాలు పొంది, త్రికూట పర్వతానికి వచ్చాడు.ఈ సంగతి తెలిసి, రావణుడి మాతామహుడు సుమాలి తన మంత్రులైన మారీచుడు, సుబాహుడు, ప్రహస్తుడు, మహోదరుడు, విరూపాక్షుడు సహా తన అనుచరులతో కలసి రావణుడిని కలుసుకోవడానికి వచ్చాడు.‘నాయనా! నువ్వు బ్రహ్మదేవుడి నుంచి ఉత్తమ వరాలు పొందావు. విష్ణువు వలన భయం కారణంగా మేమంతా లంకను విడిచి వెళ్లి, రసాతలంలో తలదాచుకుంటూ వస్తున్నాం. లంకానగరం మనది. ఒకప్పుడు రాక్షసులు నివసించిన నగరం అది. ఇప్పుడు నీ సోదరుడు, బుద్ధిమంతుడు అయిన కుబేరుడు లంకను తన నివాసంగా చేసుకున్నాడు. నువ్వు బుద్ధిబలంతో గాని, సామ దాన భేద దండోపాయాలతో గాని తిరిగి లంకను స్వాధీనం చేసుకున్నట్లయితే, మంచి పని చేసినట్లవుతుంది. నువ్వు లంకకు అధిపతివి కాగలవు. నువ్వు మన రాక్షసులందరికీ ప్రభువువు కాగలవు’ అని అన్నాడు.‘తాతా! కుబేరుడు మాకు అగ్రజుడు, పూజ్యుడు. నువ్విలా మాట్లాడటం తగదు’ అన్నాడు రావణుడు.ప్రహస్తుడు కలగజేసుకుని, ‘రావణా! నీ మాటలు వీరోచితంగా లేవు. శూరులకు భ్రాతృప్రేమ ఉండరాదు. తోబుట్టువులైన అదితి, దితి సౌందర్యవతులు. వారిద్దరూ కశ్యప ప్రజాపతి భార్యలు. అదితి ముల్లోకాలకు ప్రభువులైన దేవతలను, దితి దైత్యులను కన్నారు. సాగర పర్వత వన సమన్వితమైన ఈ భూలోకంపై దైత్యులు అధికారం కలిగినవారై ఉండేవారు. విష్ణువు యుద్ధాలలో దైత్యులెందరినో చంపి, ముల్లోకాలను దేవతల వశం చేశాడు. సోదరులతో విరోధం పెట్టుకోవడం అనే విపరీతాన్ని నువ్వొక్కడివే చేయడం లేదు. పూర్వం సురాసురులు ఇదే పని చేశారు. కాబట్టి నేను చెప్పినట్లు చేశావంటే, లంకాధిపత్యమే కాదు, నీకు త్రిలోకాధిపత్యం కూడా లభించగలదు’ అన్నాడు.ప్రహస్తుడి మాటలతో రావణుడు ఆలోచనలో పడ్డాడు.కాసేపు ఆలోచించాక, ‘సరే! అలాగే చేస్తాను’ అని పలికాడు. రావణుడి మాటలతో సుమాలి, అతడి మంత్రులు, అనుచరులు ఆనందంతో తబ్బిబ్బయ్యారు.మాతామహుడితోను, అతడి మంత్రులతోను చర్చలు జరిపిన తర్వాత కుబేరుడి వద్దకు మాటకారి అయిన ప్రహస్తుడిని రాయబారిగా పంపాలని రావణుడు నిర్ణయించాడు.‘‘ప్రహస్తా! నువ్వు లంకకు వెళ్లు. ధనాధిపతి అయిన కుబేరుడితో సామ మార్గంలో ఇలా చెప్పు’ అని తన సందేశాన్ని ఇలా చెప్పాడు: ‘సౌమ్యుడైన కుబేరా! మహాత్ములైన రాక్షసులకు చెందిన లంకా నగరంలో నువ్వు నివాసం ఏర్పరచుకున్నావు. ఇది నీకు తగదు. అందువల్ల ఇప్పుడు లంకను తిరిగి మాకు ఇచ్చేసినట్లయితే, నాకు సంతోషాన్ని కలిగినవాడివి, ధర్మాన్ని పాలించిన వాడివి కాగలవు’ అని ఆదేశించాడు.రావణుడి ఆదేశంతో ప్రహస్తుడు లంకకు బయలుదేరాడు. కుబేరుడి మందిరానికి చేరుకుని, అతడితో ‘బుద్ధిశాలివైన కుబేరా! నీ సోదరుడైన దశకంఠుడు రావణుడు నన్ను నీ వద్దకు పంపాడు. రావణుడి ఆజ్ఞపై నేను చెబుతున్న మాటలు విను– పూర్వం ఈ లంకానగరాన్ని సుమాలి మొదలైన రాక్షసులు ఏలుకున్నారు. అందువల్ల సౌమ్యంగా అర్థిస్తున్న నీ సోదరుడైన రావణుడికి ఈ లంకను అప్పగించు’ అని చెప్పాడు.‘ప్రహస్తా! రాక్షసులెవరూ లేని ఈ లంకను నా తండ్రి నాకు అప్పగించాడు. ప్రజలకు తగిన దాన గౌరవాలు కల్పించడం ద్వారా దీనిని నేను నివాసయోగ్యం చేశాను. నువ్వు వెళ్లి రావణుడితో ఇలా చెప్పు’ అని– ‘రావణా! ఈ లంకానగరం, ఈ రాజ్యం నీకు చెందినదే! ఏ బాధలు లేకుండా రాజ్యాన్ని అనుభవించు. నా రాజ్యాన్ని, నా ధనాన్ని నీతో ప్రత్యేకంగా పంచుకోవలసిన పనిలేదు. ఇవి మనిద్దరమూ కలసి అనుభవించవలసినవి’ అని చెప్పి ప్రహస్తుడిని సాగనంపాడు.తర్వాత కుబేరుడు తన తండ్రి విశ్రవసుడి వద్దకు వెళ్లాడు. లంకను అప్పగించాలంటూ రావణుడు తన వద్దకు దూతను పంపిన విషయం చెప్పి, ఇప్పుడు తానేం చేయాలో చెప్పమన్నాడు.‘కుమారా! రావణుడు ఈ సంగతి నాకు కూడా చెప్పాడు. నేను మందలించాను. అయినా వాడు నా మాట పట్టించుకోవడం లేదు. దుష్టబుద్ధితో లంకను ఆక్రమించుకుంటే నశిస్తావని కూడా వాడికి చాలాసార్లు చెప్పాను. వాడికి మంచిచెడులు తెలియడం లేదు. హితవు వినే పరిస్థితిలో లేడు. కుమారా! ఈ పరిస్థితుల్లో ధర్మసమ్మతం, శ్రేయోదాయకం అయిన మార్గం చెబుతాను విను. నువ్వు నీ అనుచరులతో కలసి లంకను విడిచిపెట్టు. ఉత్తర దిశలో కైలాసపర్వత ప్రాంతంలో ఉత్తమమైన మందాకినీ నది ఉంది. ప్రశాంతమైన ఆ ప్రదేశంలో దేవ గంధర్వ కిన్నెర కింపురుషాలదులు ఆనంద విహారాలు చేస్తుంటారు. అలాంటి మందాకినీ తీరంలో నివాసయోగ్యమైన నగరాన్ని నిర్మించుకో’ అని సలహా ఇచ్చాడు.తండ్రి సలహాతో కుబేరుడు తన భార్యా పుత్రులతో, అమాత్యులతో, పరిజనంతో రథాది వాహనాలను సిద్ధం చేసుకుని, కైలాసం వైపు ప్రయాణం ప్రారంభించాడు. కుబేరుడు లంకను ఖాళీ చేసేయడంతో ప్రహస్తుడు సంతోషించాడు. వెంటనే రావణుడి వద్దకు వెళ్లి, లంకానగరం ఇప్పుడు శూన్యంగా ఉంది. నువ్వు నీ సోదరులు, అమాత్యులు, పరివారంతో చేరుకుని, లంకను యథేచ్ఛగా అనుభవించవచ్చు’ అని చెప్పాడు.రావణుడు లంకను ఆక్రమించుకుని, రాక్షసుల చేత రాజ్యాభిషిక్తుడయ్యాడు. లంకను విడిచి వెళ్లిన కుబేరుడు కైలాస పర్వతం వద్ద మందాకినీ తీరానికి చేరువలో అలకాపురి నగరాన్ని నిర్మించుకున్నాడు.∙సాంఖ్యాయన -
కాలేజీ క్రీమినల్!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న నేరగాడు బత్తుల ప్రభాకర్. కాలేజీలను టార్గెట్‌గా చేసుకుని, స్టూడెంట్ ముసుగులో రెక్కీ చేసి, నల్లధనాన్ని దోచుకుపోయే ఈ గజదొంగ ఈ ఏడాది సెప్టెంబర్ 22న ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా దుద్దుకూరు వద్ద పోలీసు ఎస్కార్ట్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో నేరాలకు పాల్పడ్డ ఈ అంతర్రాష్ట్ర నేరగాడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రూ.333 కోట్లు సంపాదించాక నేరాలు మానేయాలని, అప్పటికే తన జీవితంలో వందమంది యువతులతో సన్నిహితంగా ఉండాలనీ లక్ష్యంగా పెట్టుకున్న ఘరానా దొంగ ఇతడు.పెద్ద పెద్ద కాలేజీలను టార్గెట్‌గా చేసుకుని, చోరీలు చేసే బత్తుల ప్రభాకర్ చదివింది మాత్రం ఎనిమిదో తరగతే. చిత్తూరు జిల్లా ఇరికిపెంటకు చెందిన ఇతగాడు 7, 8 తరగతులు విజయవాడలో చదివాడు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ 17 ఏళ్ల వయస్సు నుంచే చోరీల బాటపట్టాడు. దాదాపు 15 ఏళ్లుగా ఇంజినీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ స్కూళ్లలో చోరీలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారాడు. ఇతడికి బిట్టూ, రాహుల్ రెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, రాజు తదితర మారు పేర్లు ఉన్నాయి. స్నేహితులు, సన్నిహితంగా ఉండే యువతుల వద్ద, షాపింగ్‌కు వెళ్లినప్పడు మృదు స్వభావిగా ఉంటాడు. ఎక్కడా ఎవరితోనూ గొడవలు పడిన దాఖలాలు లేవని పోలీసులు చెబుతున్నారు. కొన్నేళ్ల కిందట రూ.3 వేలు చోరీ చేయడంతో తన నేరచరిత్ర మొదలైంది. అప్పట్లో ఒకే రోజు రూ.3 లక్షలు, మొత్తమ్మీద రూ.33 లక్షలు చోరీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. అందుకే బత్తుల ప్రభాకర్ తన ఛాతీ కుడివైపు 3 సంఖ్యను పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ లక్ష్యాన్ని రూ.333 కోట్లకు పెంచుకున్నాడు. అలాగే 100 మంది యువతులతో సన్నిహితంగా ఉండాలన్నది మరో లక్ష్యమని, విలాసవంతమైన జీవితం గడుపుతున్న తాను ఇప్పటికే 40 మందితో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనికి గుర్తుగానే ఛాతీ ఎడమ వైపు 100 సంఖ్యను టాటూ వేయించుకున్నాడు. విలాస జీవితం గడిపే ఇతగాడు సాఫ్ట్వేర్ ఇంజినీర్ ముసుగుతో ఉంటాడు. గేటెడ్ కమ్యూనిటీల్లో స్నేహితుల పేరిట ఫ్లాట్ తీసుకొని ఉంటూ ఇతర రాష్ట్రాల యువతులతో సహజీవనం చేస్తుంటాడు. ప్రతిరోజూ ఉదయం జిమ్‌కు వెళ్లడం, వీకెండ్స్‌లో పబ్స్‌లో జల్సాలు చేయడం ఇతడి నైజం. కేవలం హైఎండ్ కార్లు మాత్రమే వాడే ప్రభాకర్ సెకండ్ హ్యాండ్ వాహనాలను స్నేహితుల పేరిట కొంటాడు. కొన్నాళ్లు వాడిన తర్వాత ఆ వాహనాన్ని ఆ స్నేహితుడికే వదిలేసి తన మకాం మార్చేస్తాడు. పోలీసులకు చిక్కకుండా ఉండటానికే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు. ఓ ఫ్లాట్ ఖాళీ చేసిన తర్వాత మరో దాంట్లోకి చేరే వరకు ఖరీదైన ప్రాంతాల్లో ఉన్న పేయింగ్ గెస్ట్ అకామడేషన్స్‌లో ఉంటాడు. ఓ కాలేజీని టార్గెట్‌గా చేసుకున్న తర్వాత ప్రభాకర్ ముందుగా రెక్కీ చేస్తాడు. దీనికోసం ఆ కాలేజీ విద్యార్థి మాదిరిగా కొన్ని పుస్తకాలు పట్టుకుని, అందుకు తగ్గ దుస్తులు ధరించి లోపలకు ఎంటర్ అవుతాడు. క్లాసుల్లోకి వెళ్లకపోయినా.. 15 రోజుల నుంచి 20 రోజుల వరకు ఆ కాలేజీకి వెళ్తాడు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఆఫీస్ రూమ్, లాకర్ తదితరాలు ఎక్కడ ఉన్నాయి? ఎలా ఉన్నాయి? పరిశీలిస్తాడు. ఈ రెక్కీ పూర్తయ్యాక తన రూమ్‌లో ఓ పేపర్ మీద డ్రాయింగ్ వేస్తాడు. అందులో లాకర్ రూమ్‌తో పాటు అక్కడకు ప్రవేశించడానికి ఎంచుకోవాల్సిన మార్గాలను గీస్తాడు. లాకర్‌ను కట్ చేయడానికి ఎలక్ట్రిక్ కట్టర్ వాడే ప్రభాకర్... దానికి ప్లగ్ పెట్టడానికి పాయింట్ ఎక్కడ ఉందో కూడా చూసుకుంటాడు. నేరం చేశాక చేతికి చిక్కిన సొమ్ముతో జల్సాలు చేసే ప్రభాకర్, సాధారణంగా ఆ డబ్బు మొత్తం ఖర్చయ్యే వరకు మరో నేరం చేయడు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం వరుసపెట్టి నేరాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫ్లాట్‌లో కలిసి ఉండే క్రమంతో తనకు స్నేహితులుగా మారిన వారికి తన గతం తెలియకుండా జాగ్రత్తపడతాడు. అనుకోకుండా ఎవరికైనా తెలిస్తే వారికి భారీ మొత్తం ఇచ్చి నోరు మూయిస్తాడు. చోరీ నగదును స్నేహితుల అకౌంట్లలో వేసి, వారి యూపీఐలు తన ఫోన్లో యాక్టివేట్ చేసుకుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తాడు. జిమ్, పబ్స్‌తో పాటు గోల్ఫ్, బౌలింగ్ ఆటలు, సినిమాలు ఇతడి హాబీ. వీటిలో ఎక్కడికి వెళ్లినా తన ముఖం సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా కచ్చితంగా మాస్క్ ధరిస్తాడు. ఇతడు చోరీ చేసే డబ్బు డొనేషన్లకు సంబంధించిన నల్లధనమైతే వాళ్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసే వారు కాదు. విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉన్న ఇతగాడిని అనకాపల్లిలో నమోదైన కేసు విచారణ నిమిత్తం 2022 మార్చి 23న అక్కడి కోర్టుకు తీసుకువెళ్లారు. విచారణ అనంతరం వైజాగ్ తీసుకువచ్చిన ఎస్కార్ట్ పోలీసులు సంకెళ్లు తీసి జైలు అధికారులకు అప్పగిస్తుండగా తప్పించు కున్నాడు. అప్పటినుంచి సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, సూర్యాపేట్ పరిధిలో కాలేజీలలో చోరీలు చేశాడు. విశాఖపట్నం జైల్లో ఉండగా పరిచయమైన, వివాదం జరిగిన ఓ వ్యక్తిని చంపడానికి తుపాకీ తూటాలు ఖరీదు చేశాడు. వీటితో సంచరిస్తుండగా ఈ ఏడాది ఫిబ్రవరి 1న గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఆ సమయంలో పోలీసులపై కాల్పులు జరిపాడు. ∙ -
కథాకళి: దాగుడుమూతలు
వరియార్ నా కొలీగ్. మలయాళీ అయిన అతనికి అలెప్పీ నుంచి హైద్రాబాద్‌కి బదిలీ అయి రెండున్నర ఏళ్లైంది. మా అందరికన్నా సీనియర్. మెయింటెనెన్స్ పనిలో అనుభవజ్ఞుడు. తన భార్య ఆరోగ్యంగా లేదని ఓసారి చెప్పాడు. మూడు నెలల క్రితం ఆమె మరణించింది. మృతదేహాన్ని ఆవిడ సొంత ఊరు ఎర్నాకులానికి తీసుకెళ్ళాడు. తిరిగి వచ్చాక వరియార్ మా ఆఫీస్‌లో పనిచేసే ఓ బ్రహ్మచారిని తన అపార్ట్మెంట్కి వచ్చి ఉండమని కోరాడని నాకు తెలిసింది. నేనున్న పేయింగ్ గెస్ట్ అకామడేషన్స్ చాలా ఖరీదుగా ఉంది. హాస్టల్స్‌లో సౌకర్యాలు బాగుండవు. అందుకని వరియార్ పనిచేసే మెషి¯Œ షాప్‌కి వెళ్ళి అడిగాను.‘‘మీ అపార్ట్మెంట్లో నేను ఉండచ్చా?’’వరియార్ మొహం వికసించింది.‘‘తప్పకుండా. ఇద్దరిని అడిగితే రామన్నారు.’’ చెప్పాడు.‘‘నెలకి ఎంత ఇవ్వాలి?’’ అడిగాను.‘‘మీ ఇష్టం. ఇవ్వకపోయినా ఫర్వాలేదు.’’‘‘ఉచితంగా తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను భోజనంతో కలిపి ఇప్పుడు నేను నెలకి పదిహేనువేల ఐదొందలు చెల్లిస్తున్నాను. మీకు ఏడువేల ఐదొందలు ఇస్తాను.’’ చెప్పాను.‘‘అలాగే. మీ ఇష్టం అన్నాగా. కాని సాధ్యమైనంత త్వరగా రాగలరా? వీలుంటే ఇవాళే...’’భార్య పోవడంతో కలిగిన ఒంటరితనం అతన్ని బాధిస్తోందని నాకు అర్థమైంది.ఇంటికి వెళ్ళగానే నేనున్న ఇంటి యజమానికి ఆదివారం ఖాళీ చేస్తానని చెప్పాను.∙∙ నేను వరియార్ అపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత రెండు రోజులు వరుసగా అరుణిక వచ్చింది.‘‘ఈమె అరుణిక. మన పక్క అపార్ట్మెంట్లో ఉంటుంది.’’ పరిచయం చేశాడు.ఆ తర్వాత ఆమె రెండు మూడుసార్లు వచ్చింది. ఆమె కేరళ వాళ్ళు చేసుకోని కందిపొడో, పచ్చి పులుసో, ములక్కాడ, టొమాటోల కూరో ఇలా ఏదో ఒకటి తెచ్చిచ్చేది. ఆమెకీ, వరియార్ భార్యకి మంచి దోస్తీ ఉండి ఉంటుందని అనుకున్నాను.ఆఫీస్ అయ్యాక నేను ఏదైనా సినిమాకి వెళ్ళి అపార్ట్మెంట్కి వెళ్తే దానికి తాళం ఉండేది. లోపల వరియార్ ఉండేవాడు కాదు. సెలవు దినాల్లో నేను బయటికి వెళ్తూంటే అతనూ నాతోపాటే బయటికి వచ్చేవాడు. రెండు వారాల తర్వాత అతను అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం లేదని గ్రహించాను.ఓ రాత్రి చెప్పాను.‘‘మిత్రమా. మీరు మీ ఆవిడని బాగా మిస్ అవుతున్నారు. మీ భార్యని మీరు ప్రేమించినంతగా ఎప్పుడు ఎవరూ తమ భార్యని ప్రేమించలేరు.’’అతను బదులుగా పకపక నవ్వాడు. మర్నాడు ఆదివారం అరుణిక తెచ్చిన గుమ్మడి పులుసుని అన్నంలో కలుపుకుని తింటూండగా చెప్పాడు.‘‘మీకో విషయం నిజాయితీగా చెప్పాలి. నేను అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉండకపోవడానికి కారణం మా ఆవిడ మీద ప్రేమ కాదు.’’‘‘మరి?’’‘‘ఇది రహస్యం. అయినా చెప్తున్నాను. ఎవరికీ చెప్పకండి. కారణం అరుణిక.’’‘‘అరుణికా?’’ ఆశ్చర్యంగా అడిగాను.‘‘అవును. ఆమె భర్త నించి విడాకులు తీసుకుంది. కూతురు, కొడుకుతో మన పక్క అపార్ట్మెంట్లో ఉంటోందని మీకు తెలుసుగా?’’‘‘తెలుసు?’’కొద్దిగా సందేహించాక చెప్పాడు.‘‘ఆమెతో దాగుడుమూతలాట ఆడుతున్నాను. కొన్ని నెలల క్రితం మా మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. మా ఆవిడ ఓ రెండు గంటలు బయటకి వెళ్తే మాకు ప్రైవసీ దొరకగానే రమ్మనేవాడిని. వచ్చేది. మా ఆవిడ హాస్పిటల్లో చేరినప్పుడు కూడా. ఆమె మరణించాక నాకు ప్రైవసీకి లోపం లేకపోవడంతో రోజూ వచ్చి శారీరక సంపర్కం కోరుతోంది. ఆమెకి మన అపార్ట్మెంట్ బయట తాళంకప్ప కనపడితే సరే. లేదా వచ్చేస్తుంది. ఆమె మీద నాకు ఎన్నడో మొహం మొత్తింది. రావద్దని చెప్పి ఆమెని హర్ట్ చేయలేను. ఇది మన కంపెనీ నాకు కేటాయించిన అపార్ట్మెంట్ కాబట్టి ఖాళీ చేయలేను. ఇంట్లో ఇంకొకరు ఉంటే అరుణికని దూరంగా ఉంచొచ్చని నిన్ను రమ్మన్నాను.’’ వివరించాడు.ప్రైవసీ కోసం లోకంలోని ప్రేమికులు వెతుకుతూంటే, వరియార్ దాన్ని దూరంగా ఉంచి దాగుడుమూతలాట ఆడటం నాకు నవ్వు తెప్పించింది. FEED ME A STORY : మల్లాది వెంకట కృష్ణమూర్తి ‘ఫన్డే’లో ప్రచురితమయ్యే ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడాభాగస్వాములను చేయనున్నారు. మీరైతే ఈ కథకు క్లైమాక్స్ ఏమి రాస్తారో ఈ కింది మెయిల్‌కు పంపండి. kathakalisakshi@gmail.com -
ఈ వారం కథ: జీవన మాధుర్యం
‘‘అరేయ్ రాజూ! మాధురికి పెళ్లి కుదిరింది. అబ్బాయి పేరు జీవన్. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్’’ సంతోషంగా చెప్పాడు ప్రకాష్. ‘‘ఓహ్ కంగ్రాట్స్‌రా ప్రకాష్! అబ్బాయి సొంత ఊరేది? అతడి అమ్మానాన్నలు ఎక్కడుంటారు?’’ అడిగాడు రాజీవ్.‘‘అబ్బాయి తండ్రి హైదరాబాద్‌లోని బీఎస్ఎన్ఎల్ ఆఫీసులో మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. తల్లి గృహిణి, వాళ్లకు మొదట అమ్మాయి, తరువాత అబ్బాయి. అమ్మాయికి పెళ్లయిపోయింది. తను కూడా అమెరికాలోనే కాపురముంటోందట!’’ అన్నాడు ప్రకాష్.‘‘చూడబోతే గొప్పింటి సంబంధంలాగా అనిపిస్తోంది. మనలాంటి మధ్యతరగతి వాళ్లకు ఎలా తూగారు?’’ అనుమానంగా అన్నాడు రాజీవ్.‘‘వాళ్ళు డబ్బుతో పాటు మంచి మనసున్న మారాజులురా! కానీ కట్నం వద్దని కచ్చితంగా చెప్పారు’’ అన్నాడు ప్రకాష్.‘‘అయితే మాధురి అదృష్టవంతురాలు. ఎప్పుడూ ఎలాంటి సంబంధం వస్తుందో, ఎంత కట్నం అడుగుతారోనని భయపడేవాడివి. కుదిరిపోయింది కదా, ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి తీసుకో’’ అన్నాడు రాజీవ్.‘‘రాజూ! వాళ్ళు కట్నం వద్దన్నారని మనమేమీ ఇవ్వకుండా ఊరుకుంటే మర్యాదగా ఉంటుందా? మనకూ, వెళ్లిన చోట పిల్లకూ కూడా అవమానమే’’ అన్నాడు ప్రకాష్.‘‘అడిగింది ఇవ్వకపోతే అవమానం కానీ అడగకపోతే ఇవ్వడమెందుకు?’’‘‘అరేయ్ రాజూ! అడిగిన కట్నం ఇచ్చేస్తే ఎటువంటి గొడవుండదు. అడగకపోతే కట్నం లేదని మిగిలిన అన్ని లాంఛనాలు ఘనంగా పెట్టాలి’’‘‘అదీ నిజమే అనుకో! ఇంతకీ తాంబూలాలు పుచ్చుకునేది ఎప్పుడు?’’ అన్నాడు రాజీవ్.‘‘ప్రత్యేకంగా తాంబూలాలు మార్చుకోవడమేమీ లేదు. అమ్మాయిని చూడటానికి వచ్చిన రోజునే అమ్మాయి మెడలో అత్తగారు హారం వేశారు. అబ్బాయి తన చేతికున్న ఉంగరం తీసి అమ్మాయి వేలికి తొడిగాడు. ఇదే నిశ్చితార్థం అనుకుందాం అని మా వియ్యంకులుగారు అన్నారు.’’‘‘అదేంట్రా? ఈ రోజుల్లో ఇంత సింపుల్‌గా నిశ్చితార్థం జరుపుకున్నవారిని మిమ్మల్నే చూశాను. ఎంగేజ్మెంట్ పేరుతో ఇరువైపులా బట్టలు పెట్టుకోవటం; తరువాత పెద్ద హోటల్లోనో, ఫంక్షన్ హల్లోనో భారీ ఎత్తున భోజనాలు, డ్రోన్లతో రక రకాల ఫొటోలు తీయడం దాదాపు పెళ్ళి చేసినంత ఆర్భాటంగా చేస్తున్నారు. వీళ్లేంటీ అలికిడి లేకుండా మన కాలంలో చేసుకున్నట్లు ఇంట్లో క్లుప్తంగా ముగించారు? అబ్బాయి ఎవరి తాలూకా? కుటుంబం గురించి సరైన విచారణ చేశావా?’’ ఆరా తీశాడు రాజీవ్.‘‘హహ...’’ అంటూ నవ్వేశాడు ప్రకాష్.‘‘నవ్వుతావేంట్రా? అసలే అమెరికా సంబంధం అంటున్నావు. ఈ మధ్యన అమెరికా పెళ్లిళ్ల గురించి టీవీలో చాలా వింటున్నాము. ఎవరికీ తెలియనివ్వకుండా తాంబూలాలు కానిచ్చారంటే చాలా ఆలోచనలు వస్తున్నాయి’’ అన్నాడు రాజీవ్.‘‘అలాంటి అనుమానాలు నాకూ వచ్చాయి. వాళ్ళు మా అత్తగారికి కాస్త దగ్గరి బంధువులవుతారు. ఎవరిని అడిగినా మంచి కుటుంబమనే చెప్తున్నారు. వాళ్ళు రాజమండ్రిలో స్థిరపడ్డారు, అబ్బాయి చదువుకోవడానికి అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అసలు ముందుగా పెళ్లిళ్ల పేరయ్య ద్వారా ఈ సంబంధం మనకు వచ్చింది. వాళ్లకు ఫొటోల్లో మన అమ్మాయి నచ్చిందని చెప్పడంతో విషయం మనదాకా వచ్చింది. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు చుట్టరికం బయటకు వచ్చింది. అబ్బాయి వీడియో కాల్లో అమ్మాయిని చూసి, మాట్లాడి తన అంగీకారం తెలిపాడు. తరువాత ఇరుపక్షాల మాటలు జరిగాయి. అంతా సరే అనుకున్నాక పెళ్ళికి సిద్ధపడ్డాం’’ అన్నాడు ప్రకాష్.‘‘తెలిసినవాళ్లేనా? అయితే ఇంకా కంగారు పడటానికేముంది? ఇంతకీ పెళ్లెప్పుడు?’’ అన్నాడు రాజీవ్.‘‘అబ్బాయి పెళ్లయ్యాక అమ్మాయిని కూడా తీసుకెళ్లాలంటే వీసా ప్రక్రియ కోసం పెళ్లి తొందరగా చేయాలని వియ్యంకుడు జగదీష్ చెప్పాడు. పెళ్లి మరో పదిహేను రోజుల్లో’’...‘‘అయితే పెళ్లి పనుల కోసం నువ్వు రేసు గుర్రంలాగా పరుగులు తీయాలి’’ నవ్వుతూ అన్నాడు రాజీవ్.‘‘అవునురా డబ్బున్నవాళ్లతో వ్యవహారం కదా ఎలా చేస్తానో అని కంగారుగా అనిపిస్తుంది. నువ్వు మాత్రం అమ్మాయి అత్తారింటికి వెళ్ళేదాకా తోడుండాలి’’...‘‘అది ప్రత్యేకంగా నువ్వు చెప్పాలా?’’ అన్నాడు రాజీవ్.∙∙ ప్రకాష్ చిన్న వ్యాపారస్తుడు రమ అతడి భార్య, వారికిద్దరు పిల్లలు మాధురి పెద్దది, బీటెక్ పూర్తిచేసి ఊర్లో ఉన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది. తరువాత మహేష్ బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. ప్రకాష్ సంపాదనతో ఉండటానికి సొంత ఇల్లు కట్టుకున్నాడు. అంతకు మించి అతడికి ఎటువంటి స్థిరాస్తులూ లేవు. కూతురికి తన స్తోమతకి తగిన సంబంధాలు చూడామని పెళ్ళిళ్ళ పేరయ్యకు చెప్పాడు. ఆయన వీళ్ళు కట్నం వద్దంటున్నారు, అమ్మాయి గుణగణాలు బాగుంటే చాలంటున్నారని ఈ సంబంధం తీసుకువచ్చాడు. తీరాచూస్తే అది దగ్గరి సంబంధం కావడంతో ప్రకాష్ చాలా సంతోషించాడు. దానికితోడు బంధువులందరూ కూతురికి గొప్ప సంబంధం వచ్చిందని అతడి అదృష్టాన్ని పొగుడుతుంటే మరింత ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ‘‘రమా! మన ఇల్లు తాకట్టు పెట్టాలనుకుంటున్నాను’’ అన్నాడు ప్రకాష్. రమ తుళ్ళిపడింది.‘‘అదేంటండీ? ఎందుకలా? మనం అమ్మాయి పెళ్లికోసం కొంత డబ్బు పక్కన పెట్టాం కదా? ఇప్పుడు ఇల్లు తాకట్టు పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది?’’ ఆశ్చర్యంగా ప్రశ్నించింది రమ.‘‘పిచ్చిదానా! అప్పుడు మనం దాచిన డబ్బు మనబోటి సంబంధం కోసం. ఇప్పుడు మన తాహతుకి మించిన గొప్పవారి సంబంధం కుదిరింది. మరి వారికి నచ్చేలా అన్ని ఏర్పాట్లు చేయాలంటే ఎక్కువ డబ్బు కావాలిగా?’’ ప్రశ్నించాడు ప్రకాష్ . ప్రకాష్ చేతిలో డబ్బు లేక తగ్గి ఉంటాడు కాని, సహజంగా దుబారా మనిషే! రమ ఎంత నచ్చచెప్పాలని చూసినా అతడు వినలేదు. ఇంటి దస్తావేజులు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చాడు. ముందూ వెనుకా చూడకుండా ధారాళంగా ఖర్చు పెడుతున్నాడు. తండ్రి అలా డబ్బులు గుమ్మరిస్తుంటే పిల్లలకు చిత్రంగా అనిపిస్తోంది. మహేష్ అదంతా చూసి సంబరపడినా, మాధురి మాత్రం తల్లి దగ్గర నుండి విషయం రాబట్టింది. తండ్రి చేస్తున్న అప్పు చూసి ఆమె మనసు తల్లడిల్లింది. పెళ్ళిబట్టలకు, నగలకు తాహతుకు మించి కొంటుంటే భవిష్యత్తు తలచుకుని ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.ఒకరోజు ప్రకాష్ పిల్లలను, భార్యను దగ్గరకు పిలిచాడు.‘‘మధూ! మహేష్! మీకు తెలిసిన కొత్తరకం వంటకాల పేర్లు చెప్పండి. మీకు తెలియకపోతే మీ స్నేహితులనైనా అడిగి తెలుసుకోండి. పెళ్ళిలో మనం పెట్టే భోజనాలు చూసి మగపెళ్లివారు అబ్బో భలే ఉన్నాయే అంటూ నోరు తెరవాలి’’ అన్నాడు ప్రకాష్.‘‘డాడీ! నేను చెప్తాను– మొన్న మా ఫ్రెండు అక్క పెళ్ళిలో కోవా వెరైటీస్ కొత్త రకానివి పెట్టారు. పనీర్ జిలేబీ, కోవా కజ్జికాయలు వేడి వేడిగా వేసిస్తుంటే మేమంతా బోలెడన్ని తినేశాం’’ అన్నాడు మహేష్.‘‘డాడీ! తమ్ముడు అలాగే చెప్తాడు కాని, వంటవాళ్ళని అడిగితే కొత్తగా చేస్తున్న వంటకాలు చెప్తారు. ఎక్కువ రకాలు అవసరం లేదు. రుచికరమైనవి కొన్ని చేయిస్తే సరిపోతుంది’’ అంది మాధురి.‘‘మధు సరిగ్గా చెప్పింది. మీరు అనవసరమైన ఆర్భాటాలకు పోకండి’’ అంది రమ.‘‘మనం కట్నం ఇవ్వడం లేదు, భోజనాలైనా మంచిగా పెట్టకపోతే ఎలా?’’ అన్నాడు ప్రకాష్.‘‘ముందు మనం మధూ పెళ్ళికి అనుకున్నదాని కన్నా ఎక్కువే ఖర్చు పెడుతున్నారు. పెళ్లి అవగానే సరికాదు, తరువాతే ఎక్కువ అవసరాలుంటాయి. ఇలా అయితే తరువాత ఇబ్బంది పడతాం’’ అంది రమ.ప్రకాష్‌కి ఆ మాటలు రుచించలేదు. స్నేహితుడిని సంప్రదించాడు. ‘‘మధ్య తరగతి వాళ్ళం చూసుకుని ఖర్చు పెట్టకపోతే పెద్ద దెబ్బ తగులుతుంది. వాళ్ళు అడగకపోయినా బంగారం, బట్టలు అంటూ చాలా డబ్బులు గుమ్మరిస్తున్నావు. చెల్లెమ్మ చెప్పినట్లు విను’’ అన్నాడు రాజీవ్.ప్రకాష్ అతడి మాటలు కూడా పెడచెవిన పెట్టాడు. వంటవాళ్లతో తనే స్వయంగా మాట్లాడి భారీ ఎత్తులో మెనూ తయారుచేశాడు. పెళ్లిరోజు దగ్గరకు వచ్చింది. పెద్ద కళ్యాణమండపం, దానికి అలంకరణ బ్రహ్మాండంగా చేయించాడు.భోజనాలకు ముందు అల్పాహారంలో పానీపూరీ. బజ్జీమసాలా, సమోసా చాట్, చిన్న పునుగు, వెజ్ కట్లెట్, పనీర్ టిక్కా, పావ్ భాజీ, చిన్న పిజ్జా, బఠాణీ చాట్, పెసర దోశ ఏర్పాటు చేశాడు. వచ్చిన జనం అక్కడ కిక్కిరిసిపోయి ఉన్నారు. ఎన్నో రకాల పదార్థాలు నోరూరిస్తూ కనిపిస్తుంటే, అందులోనూ ఉచితంగా ఆకర్షిస్తుంటే ఆపడం ఎవరి తరం?... ఒకో స్టాల్ దగ్గర ఆగడం అక్కడ ఉన్న వంటకం పెట్టించుకోవడం... కొంచెం రుచి చూడటం, అది పారేసి మళ్ళీ మరోదాని కోసం వెళ్లడం, అక్కడ మరో ప్లేట్ తీసుకుని అది వేయించుకోవడం, అది కొంచెం తినగానే మరో కొత్త వంటకం కనిపించగానే చేతిలో ఉన్నది పూర్తిగా తినకుండానే చెత్త డబ్బాలో పడేసి, అక్కడకు వెళ్లి మరో ప్లేట్ అందుకోవడంలో జనం బిజీ అయ్యారు. అల్పాహారాలు తినడంతో సగానికి పైగా పొట్టలు నిండిపోయాయి. తరువాత అందరూ కాసేపు లోపలకు వెళ్లి పెళ్లి చూస్తూ కూర్చున్నారు. కాసేపటి తరువాత మళ్ళీ భోజనాల దగ్గరకు వచ్చారు. అక్కడ సుమారు పది రకాల స్వీట్లు, ఇరవై రకాల వంటకాలు, పది రకాల ఫ్రూట్స్, పది రకాల డిజర్ట్స్ ఉన్నాయి. అన్ని వంటకాలూ వేడిగా ఉండేందుకు అన్నింటి కిందా చిన్న స్టవ్‌లు కూడా ఉన్నాయి. నోరూరించే ఎన్నో రకాల పదార్థాలను చూసి, అన్నీ రుచి చూడాలనే అతృతతో అన్నీ వేయించుకుని, పొట్టలో పట్టకపోవడంతో తినకుండానే వృథాగా చెత్తడబ్బాలో పారేస్తున్నారు. మనిషి తన నోటితో తను ఇక చాలని చెప్పగలిగేది ఆహారం విషయంలో మాత్రమే! ప్రకాష్ దంపతులు పెళ్ళికి వచ్చిన అతిథులను పలకరించి వేదిక మీద కూర్చున్నారు. వేదమంత్రాల సాక్షిగా మంగళవాయిద్యాల నడుమ బంధుమిత్రుల సమక్షంలో మాధురి, జీవన్‌ల పెళ్లి జరిగింది. తరువాత నూతన వధూవరులు, అమ్మాయి తల్లితండ్రులు, అబ్బాయి తల్లితండ్రులు భోజనాలు చేయడానికి భోజనశాల వైపుకి వస్తున్నారు. వారి వెనుక రాజీవ్ కూడా నడుస్తున్నాడు. భోజనశాలలో రెండు విభాగాలున్నాయి. ఒకటి బంతి భోజనాలు, మరొకటి బఫే భోజనాలు. వీళ్ళు బఫే భోజనాలు దాటి బంతి భోజనాల వైపుకి వెళ్తుండగా నడుస్తున్న జగదీష్ ఆగిపోయాడు. ‘‘బావగారు! బఫే భోజనం చేద్దామంటారా?’’ వెనక్కు తిరిగి వచ్చి అడిగాడు ప్రకాష్.‘‘ఆ డస్ట్ బిన్ వైపు చూశారా? అందులో ప్లేట్స్‌లో తినకుండా పారేసిన స్వీట్లు, హాట్లు, ఇతర ఆహార పదార్థాలు చూడండి. ఎంత ఆహారం వృథాగా నేలపాలయిందో చూశారా?’’ అన్నాడు జగదీష్.‘‘బావగారు! ఎక్కువ రకాల వంటకాలు చేయించాం కదండీ! ఒక్కసారే అన్నీ తినలేక పారేసుంటారు అంతే కాని, రుచిగా ఉండకపోవడం వల్ల కాదండీ’’ అన్నాడు ప్రకాష్.‘నా ప్రశ్న మీకలా అర్థమైందా?’ మనసులో అనుకున్న జగదీష్ ఒకసారి ఆయన వైపు అదోలా చూసి మౌనంగా వాళ్లతో నడిచాడు. ప్రకాష్ భోజనాల దగ్గర తనే స్వయంగా ‘‘బావగారు! ఈ స్వీటు తినండి బాగుంటుంది, చెల్లెమ్మా! ఈ పెసర పునుగు ఆవడ తినండి బాగుంటుంది, బాబూ! పుదీనా రైస్ రుచి చూడండి’’ అని పెట్టించబోయాడు. అతను ఎంత బలవంతం చేసినా జగదీష్, అతని భార్య, జీవన్ కొన్ని రకాల పదార్థాలు మాత్రమే తిన్నారు. అదిచూసి ప్రకాష్ ముఖం మాడిపోయింది. అప్పగింతలయ్యాక మగ పెళ్లివాళ్ళు వెళ్లిపోతున్న సమయంలో అందరూ కళ్యాణమండపం బయటకు వచ్చారు. అక్కడ ఒక పక్కన చెత్తబండి పెట్టుంది. ఫంక్షన్ హాల్ లోపల నిండిపోయిన టబ్‌లు తెచ్చి అందులో వేస్తున్నారు. కొంతమంది బిచ్చగాళ్ళు అందులో నుంచి ఆహార పదార్థాలు ఏరుకుని, వాళ్ళ దగ్గరున్న సత్తుగిన్నెల్లో వేసుకుంటున్నారు. కొన్ని తడిసిపోయిన వాటిని తీసి, వారి చినిగిన దుస్తులకు తుడుస్తూ గిన్నెలో వేస్తున్నారు. రెప్పవాల్చకుండా అటువైపే చూస్తున్న జగదీష్ కనుకొలకులలో నీటి బిందువులు నిలిచాయి. జేబులోంచి కర్చీఫ్ తీసుకుని తుడుచుకున్నాడు.‘‘బావగారు! మా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? ఎందుకు బాధపడుతున్నారు’’ కంగారుగా అడిగాడు ప్రకాష్.‘‘అదేం లేదు’’ అంటూ కారెక్కి కూర్చున్నాడు జగదీశ్.పెళ్ళికూతురుని తీసుకుని మగపెళ్లివాళ్ళు హైదరాబాద్ వెళ్లిపోయారు. వెళ్ళేముందు రెండవరోజు జరుగబోయే సత్యనారాయణస్వామి వ్రతానికి, అదేరోజు సాయంత్రం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కి అందరినీ తప్పకుండా రమ్మని మరీ మరీ ఆహ్వానించారు. ‘‘రమా! ఎందుకో జగదీష్గారు సంతృప్తిగా ఉన్నట్లనిపించడం లేదు’’ వాళ్ళు వెళ్ళాక అన్నాడు ప్రకాష్.‘‘అదేం లేదు లెండి!’’ అంది రమ.‘‘ఎందుకో ఆయన కళ్ళు కూడా తుడుచుకున్నాడు’’ అన్నాడు ప్రకాష్. ‘‘ఇప్పుడవన్నీ ఆలోచించే వ్యవధి లేదు. రేపు మనం హైదరాబాద్ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోవాలి. వ్రతానికి పీటలమీద కూర్చున్నప్పుడు అమ్మాయి అల్లుడుగారికి అలాగే వాళ్ళ అత్తమామగార్లకు కూడా మనం బట్టలు పెట్టాలి. పళ్ళు, స్వీట్స్ కూడా పట్టుకెళ్ళాలి’’ అంది రమ. ‘‘రమా! మళ్ళీ చాలా డబ్బులు కావాలి... నా దగ్గరున్న డబ్బంతా అయిపోయిపోతుంది. కట్నం లేదన్న మాటే కానీ పై ఖర్చులు చాలా అయ్యాయి’’ అన్నాడు ప్రకాష్.‘‘ఆర్భాటాలకు పోతే అలాగే అవుతుందని నేనెంత చెప్పినా మీకు అర్థం కాలేదు. ఇప్పుడనుకుని ఏం లాభం? స్వీట్స్ అన్నాను కదా అని ఖరీదు ఎక్కువ వాటి జోలికి పోకండి. లడ్డు, కాజాలు చాలు’’ అంది రమ . ప్రకాష్ కుటుంబం మరి కొందరు దగ్గరి బంధువులతో కలిసి రెండవరోజు ఉదయం మగ పెళ్లివారింటిలో దిగారు. వారు మర్యాదగా ఆహ్వానం పలికారు. అల్పాహారంగా ఇడ్లీ, వడ, కొబ్బరి చట్నీ, కారప్పొడి వేసి పెట్టారు. సత్యనారాయణ స్వామి పూజకు ఇంట్లో బంధువులు మాత్రమే ఉన్నారు. వియ్యాలవారు భోజనాలు ఎంత గొప్పగా పెడతారోనని ఊహించుకున్న ప్రకాష్‌కి నిరాశే ఎదురైంది. పులిహోర, పూర్ణం, మిరపకాయ బజ్జీ, వంకాయ చట్నీ, ముద్దపప్పు, రసం, బెండకాయ వేపుడు, అప్పడం, గడ్డపెరుగు పెట్టారు. అందరూ శుభ్రంగా పదార్థాలన్నీ వదలకుండా తినేశారు. ‘‘అరేయ్ రాజూ! భోజనాలు మరీ ఇంత సింపుల్‌గా పెట్టారేంట్రా?’’ అన్నాడు గుసగుసగా ప్రకాష్.‘‘ఇప్పుడు ఇంట్లో వాళ్లకు మాత్రమే కదా! అందుకే ఇలా పెట్టుంటారు సాయంత్రం రిసెప్షన్లో బాగా పెడతారనుకుంటా. అయినా కొన్ని వంటకాలు పెట్టినా మంచి భోజనం పెట్టారు’’ మెచ్చుకుంటూ అన్నాడు రాజీవ్. సాయంత్రం అందరూ రిసెప్షన్‌కి వెళ్లారు. అది పెద్ద ఫంక్షన్ హాల్. సహజమైన పూలతో చాలా తేలికపాటి అలంకరణ చేశారు. చూడటానికి చాలా అందంగా అనిపిస్తోంది. బయట ఎక్కడా అల్పాహారాల స్టాల్స్ లేవు. లోపలకు వెళ్ళగానే ముందుగా అందరికీ వెల్కమ్ డ్రింక్‌గా బాదంపాలు ఇచ్చారు. మరే ఇతర స్నాక్స్ పెట్టలేదు. రిసెప్షన్‌కి వచ్చిన వాళ్లంతా వధూవరులకు అక్షింతలు వేశాక, కుటుంబ సభ్యులు డైనింగ్ హాల్ వైపు నడిచారు. అక్కడ ఎంన్లోస్ ఒక రైతు వరి కంకులు పట్టుకుని నిలబడిన చిత్రం పెట్టారు. దాని కింద ‘ఒక వరి కంకి తయారు కావాలంటే రైతు నూట ఎనిమిది రోజులు కష్టపడతాడు’ అని రాసుంది. అది దాటుకుని లోపలకు వెళ్ళగానే, అక్కడక్కడా కొన్ని పేపర్ కటింగ్స్ పుల్ల ఆధారంగా నిలబెట్టబడి ఉన్నాయి. ‘అన్నదాతా సుఖీభవ!’...‘ఆహారం వృథా చేయకండి’...‘మీరు ఏది తినగలరో అదే తీసుకోండి’‘తినలేనిది పెట్టుకుని నేలపాలు చేయకండి’...‘పారేసేముందు పంటలు పండించే రైతు కష్టాన్ని గుర్తుచేసుకోండి’...‘పిల్లల పెళ్ళిచేయడానికి ఆ తండ్రి పడే కష్టాన్ని తలచుకుంటే ఒక్క పదార్థం కూడా పారేయకుండా తింటారు’...అనే క్యాప్షన్స్ ఉన్నాయి. అందరూ వాటిని చదువుతూ మాట్లాడుకుంటున్నారు. ‘భలే రాశారు కదా?’...‘ఇలాంటివి చదివాక ఎవరైనా ఆహారం వృథా చేస్తారా?’... ‘అన్ని చోట్లా ఇలాంటి బోర్డులు పెడితే ఎవరూ తినే పదార్థాలు పొరపాటున కూడా పారేయరు’అక్కడున్న అందరూ పైకే మాట్లాడుకుంటున్నారు. ప్రకాష్, రమ, మాధురి, రాజీవ్ ఆశ్చర్యంగా చూస్తున్నారు.‘జీవన్ గారు! ఈ విధమైన ఏర్పాట్లు ఎవరి సూచనలతో చేశారు? నాకు చాలా నచ్చింది’ అంది మాధురి.ప్రకాష్ అల్లుడి జవాబు కోసం అటే చూస్తున్నాడు.‘డాడీ చిన్నప్పటి నుండి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. డబ్బు, ఆహారమే కాదు ఏదీ వృథా చేయడం ఆయనకు ఇష్టముండదు. ఆర్భాటాలకు పోయి అప్పు చేయడం కూడా నచ్చదు. నిన్న అక్కడ పెళ్ళిలో భోజనాలు పారేయడం చూసి చాలా బాధపడ్డారు. అన్నపూర్ణను గౌరవించిన వారి దగ్గర ఆమె కొలువుంటుందని ఎప్పుడూ చెప్తుంటారు. ఆయన మన పెళ్లి సందర్భంగా ఈరోజు చాలామంది హోమ్‌లెస్ పీపుల్‌కి ఆహారం సరఫరా చేశారు’’ అన్నాడు జీవన్.ఆ మాటలు వినగానే ప్రకాష్ ముఖంలో రంగులు మారాయి. రమ ముఖంలో ఆనందం కనిపించింది. ‘‘మామయ్య గారి అభిప్రాయాలు చాలా ఆదర్శవంతంగా అనిపిస్తున్నాయి’’ అంది మాధురి చిన్నగా. ‘‘థాంక్స్ అమ్మా!’’ అన్నాడు జగదీష్. ‘‘బావగారు ! నేను మీ విషయంలో చాలా అపోహపడ్డాను. నన్ను మన్నించండి, ఇంత మంచి కుటుంబానికి నా కూతురిని ఇచ్చినందుకు గర్వపడుతున్నాను’’ ఆనందంగా అన్నాడు ప్రకాష్. ‘‘బావగారు! ఆడపిల్ల పెళ్ళి చేసి బరువు దించుకోవాలనే తాపత్రయంతో మీరు బరువు పెంచుకున్నారని నాకు తెలిసింది. మా అబ్బాయి మీ ఇంటి అల్లుడయ్యాడు. మీ కష్టసుఖాలలో భాగం పంచుకోవడానికి అనుమతిస్తే మన్నిస్తాను’’ నవ్వుతూ అన్నాడు జగదీష్.‘‘ఏమిటది? కొంపదీసి ఇల్లు తనఖా పెట్టిన విషయం తెలిసిందా?’’ ఆలోచిస్తున్నాడు ప్రకాష్. ‘‘బావగారూ! మీరు అంతగా ఆలోచించకండి. ఏ ఆడపిల్లయినా పుట్టింట్లో ఇబ్బందులు లేకుండా ఉంటేనే తను అత్తింట్లో సంతోషంగా ఉండగలుగుతుంది. మా కోడలి సంతోషం మాకు కావాలి. ఇకనుండి మన రెండు కుటుంబాలు ఒకటే’’ అన్నాడు జగదీష్.‘‘అరేయ్ ప్రకాష్! జీవన్, మాధురి పెళ్ళిలో నాకు జీవనమాధుర్యం అంటే ఏమిటో తెలిసిందిరా!’’ అన్నాడు రాజీవ్.ఆ మాటలకు పెళ్లివారింట్లో అందరి నవ్వులు చిచ్చుబుడ్డీలలా వెలుగులపూలు జిమ్మాయి. ‘డాడీ చిన్నప్పటి నుండి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. డబ్బు, ఆహారమే కాదు ఏదీ వృథా చేయడం ఆయనకు ఇష్టముండదు. ఆర్భాటాలకు పోయి అప్పు చేయడం కూడా నచ్చదు. నిన్న అక్కడ పెళ్ళిలో భోజనాలు పారేయడం చూసి చాలా బాధపడ్డారు. ∙కె.వి.సుమలత -
అమెరికా కాదన్నా.. ఆప్షన్స్ అన్‌లిమిటెట్
‘టాలెంట్ ఉన్న ప్రతిచూపు అమెరికా వైపే’ అన్నట్లుగా సాగింది ఇంతకాలం. అమెరికాలో సెటిల్ అయినవారి పేరెంట్స్ దగ్గర నుంచి అమెరికన్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు వరకు ప్రతి ఒక్కరూ అమెరికా కాలమానానికి అనుగుణంగా నడుచుకోవడం పరిపాటి అయిపోయింది! కాని, అమెరికా తీరు మార్చింది. పొమ్మనకుండానే ఇండియన్స్‌కు పొగబెడుతోంది.చదువు, ఉద్యోగం, స్థిరనివాసం కోసం అమెరికా చేరుకోవడమనేది చాలామంది భారతీయుల కల! అందుకోసం ఎంత కష్టమైనా పడడానికి సిద్ధంగా ఉంటారు. కాని, అపారమైన ఆశలతో అమెరికా వైపు చూస్తున్న లక్షలాది మంది భారతీయుల కలలు ఇప్పుడు కరిగిపోతున్నాయి. దీనికి, అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కఠిన నిబంధనలే కారణం! ఎన్నో ఏళ్లుగా ఇండియా–అమెరికాల మధ్య కొనసాగుతున్న బలమైన అనుబంధం ఇప్పుడు మెల్లమెల్లగా బీటలువారుతోంది. ఈ బంధానికి ప్రధాన వారధి అయిన విద్యారంగంపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపెడుతోంది. ఈ పరిస్థితుల్లో, విదేశీ విద్య కోసం అమెరికా తప్పితే మరో మార్గమే లేదా? మరో దేశమే లేదా?! అంటే ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు పలు అభివృద్ధి చెందిన దేశాల నుంచి సాదర ఆహ్వానాలు అందుతున్నాయి.క్రమంగా అమెరికాకే కాదు జర్మనీ, కెనడా యూకే వంటి దేశాలకు ఇండియా నుంచి వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అమెరికాకు బ్రేక్స్ పడుతున్న తరుణంలో భారత యువత తమ విదేశీ ప్రయాణాల గమ్యాలను మార్చుకుంటూదూసుకుని పోతున్నారు. ఏటా విదేశాలకు వెళ్లే మన విద్యార్థులు హెచ్–1బీ వీసా అనేది అమెరికా– తమ దేశంలో ప్రత్యేక నైపుణ్యంతో నిర్వహించే ఉద్యోగాల కోసం– విదేశీ నిపుణులకు ఇచ్చే ఒక వలస వీసా! ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ (స్టెమ్) రంగాల్లో అమెరికాకు చెందిన నిపుణుల కొరతను తీర్చుకోవడానికి ఈ వీసాను 1990లో నాటి అమెరికా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ యాక్ట్ ద్వారా ప్రవేశపెట్టింది. దీనివల్ల అమెరికన్ కంపెనీలు తమ వ్యాపారాలను విస్తరించుకోడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను నియమించుకోగలిగాయి. ఇది అమెరికా ఆర్థిక వృద్ధికి, సాంకేతిక ఆవిష్కరణలకు ఎంతో తోడ్పడింది! ఇప్పటి వరకూ హెచ్–1బీ వీసాలు పొందినవారిలో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అయితే ట్రంప్ నిర్ణయంతో ఎందరో భారతీయుల కలలు చెదిరిపోయాయి. ఈ క్రమంలోనే ‘అమెరికా వద్దంటే ఆగిపోనక్కర్లేదు మా దేశం రండి’ అంటున్నాయి ఎన్నో దేశాలు. ఆ లిస్ట్‌లో జర్మనీ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లండ్, ఫ్రాన్స్, యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్), పోలండ్ ఇలా చాలా దేశాలు చక్కటి భవిష్యత్ కోసం ఎర్రతివాచీలు పరుస్తున్నాయి. ఏయే దేశాల్లో ఎలాంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో చూద్దాం విదేశీయులకు సైతం ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యను, అది కూడా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో దాదాపు ఉచితంగా అందించే అరుదైన దేశం జర్మనీ. ఇది కేవలం ఉన్నత ప్రమాణాలకు, ఆధునిక పరిశోధనలకు ప్రసిద్ధి చెందడమే కాక, ప్రపంచంలోని అగ్రశ్రేణి సాంకేతిక, ఇంజనీరింగ్ కోర్సులకు కేంద్రంగా ఉంది. జర్మనీలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదివే అంతర్జాతీయ విద్యార్థులకు సాధారణంగా ట్యూషన్ ఫీజులుండవు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో కేవలం సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ లేదా అడ్మినిస్ట్రేటివ్ ఫీజు మాత్రమే ఉంటుంది. విద్యార్థులు తమ చదువుపై ప్రభావం పడకుండా ఉండేందుకు ఏడాదికి గరిష్ఠంగా 140 పూర్తి రోజులు లేదా 280 సగం రోజులు పనిచేయడానికి అనుమతి ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా, సెమిస్టర్ కాలంలో వారానికి 20 గంటల వరకు పనిచేయవచ్చు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత, అంతర్జాతీయ విద్యార్థులు తమ అర్హతకు సరిపోయే ఉద్యోగం వెతుక్కోవడానికి 18 నెలల వరకు జర్మనీలో ఉండొచ్చు. అందుకు జాబ్–సీకింగ్ రెసిడె¯ పర్మిట్ పొందాల్సి ఉంటుంది. ఈ 18 నెలల కాలంలో వారు పూర్తి సమయం ఉద్యోగం వెతుక్కుంటూనే తమ ఖర్చుల కోసం తాత్కాలిక ఉద్యోగం కూడా చేసుకోవచ్చు. గడువులోపు ఉద్యోగం సంపాదించి, దానిని వర్క్ పర్మిట్‌గా మార్చుకున్నట్లయితే, జర్మనీలో స్థిరపడటానికి మార్గం సులభమవుతుంది.కెనడానిజానికి కెనడియన్ విద్యార్హతలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అలాగే కెనడాలో ప్రపంచ శ్రేణి విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి, ఇవి విద్యార్థులకు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలనందిస్తాయి. కెనడాలో ప్రభుత్వ నిధులు పొందే విశ్వవిద్యాలయాలలో కూడా విదేశీ విద్యార్థులకు ఫీజులుంటాయి. అయితే కోర్సులను బట్టి, యూనివర్సిటీ స్థాయిని బట్టి ఫీజులు మారుతుంటాయి. స్టడీ పర్మిట్ ఉన్న విద్యార్థులు తమ చదువుల సమయంలో వారానికి గరిష్ఠంగా 20 గంటలు క్యాంపస్‌లో లేదా క్యాంపస్ వెలుపల పనిచేయడానికి అనుమతి ఉంటుంది. సెమిస్టర్ బ్రేక్స్ సమయంలో పూర్తి సమయం పనిచేయవచ్చు. కెనడియన్ డిజిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అర్హత కలిగిన ప్రోగ్రామ్ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు తమ కోర్సు వ్యవధిని బట్టి గరిష్ఠంగా 3 సంవత్సరాల వరకు కెనడాలో ఉండొచ్చు. ఉద్యోగం వెతుక్కోవడానికి పనిచేయడానికి అనుమతించే పోస్ట్–గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ పొందవచ్చు. ఈ పర్మిట్ పొందిన తరువాత, ఒక సంవత్సరం కెనడియన్ గ్రాడ్యుయేట్స్ ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ వంటి ఇమ్మిగ్రేషన్ మార్గాలతో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. కెనడా ప్రభుత్వం వలసదారులను స్వాగతిస్తుంది కాబట్టి, విద్యార్థులకు ఇది ఒక చక్కటి మార్గమవుతుంది.యూకే విద్యార్థులకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గమ్యస్థానం యునైటెడ్ కింగ్డమ్ (యూకే). బెస్ట్ కోర్సులు, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన యూనివర్సిటీలు, గ్రాడ్యుయేషన్ తర్వాత సులభంగా ఉద్యోగం వెతుక్కోవడానికి వీలు కల్పించే విధానాలతో యూకే అంతర్జాతీయ విద్యార్థులకు స్వర్గధామం. అక్కడి విశ్వవిద్యాలయాలు క్వాలిటీ ఎడ్యుకేషన్‌కు ప్రసిద్ధి. ఇక్కడి బ్యాచిలర్ కోర్సులు సాధారణంగా 3 సంవత్సరాలు, మాస్టర్స్ కోర్సులు ఒక సంవత్సరంలోనే పూర్తి అవుతాయి. యూకేలో విదేశీ విద్యార్థులకు ఫీజులు సాధారణంగా దేశీయ విద్యార్థుల కంటే ఎక్కువగా ఉంటాయి. యూనివర్సిటీ ర్యాంకింగ్, నగరంతో పాటు కోర్సును బట్టి ఫీజు మారుతుంది. స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు, విద్యార్థి తమ ట్యూషన్ ఫీజుతో పాటు తమ జీవనానికి సరిపడా కనీస రాబడిని చూపించాల్సి ఉంటుంది. అలాగే ఎంపికైన యూనివర్సిటీ/కాలేజ్ (లైసె¯Œ ్స పొందిన స్పాన్సర్) నుంచి అధికారిక ధ్రువీకరణ పత్రం సిద్ధంగా ఉంచుకోవాలి. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఇంపీరియల్ వంటి అనేక యూనివర్సిటీలు అంతర్జాతీయ విద్యార్థులకు ట్యూషన్ ఫీజులో రాయితీ లేదా పూర్తి స్థాయి స్కాలర్షిప్లను అందిస్తాయి. కామ¯Œ వెల్త్ దేశాలకు చెందిన ప్రతిభావంతులకు కామ¯Œ వెల్త్ స్కాలర్షిప్ కూడా లభిస్తుంది. విద్యార్థులు ఎటువంటి తక్కువ జీతం పొందే ఉద్యోగాన్ని చేస్తున్నా స్కిల్డ్ వర్కర్ వీసాకు మారే అవకాశం కూడా ఉంటుంది.ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యార్థులకు చక్కటి విద్యను, అధిక జీవన ప్రమాణాలను, పట్టభద్రులైన తర్వాత గొప్ప ఉద్యోగ అవకాశాలను పుష్కలంగా అందించే దేశాలలో ఆస్ట్రేలియా కూడా ఒకటి. అంతర్జాతీయ విద్యార్థి వీసా (సబ్‌క్లాస్ 500) ఉన్నవారు చదువుకునేటప్పుడు ప్రతి రెండు వారాలకు 48 గంటల వరకు పని చేసుకోవచ్చు, ఇంకా చదువు విరామ సమయాల్లో అపరిమిత గంటలు పనిచేసే వెసులుబాటు కూడా ఉంది. ఇది విద్యార్థులకు తమ ఖర్చులను తాము భరించడానికి, నెట్‌వర్క్‌ను పెంచుకోవడానికి, చక్కటి అనుభవాన్ని పొందడానికి సహాయపడుతుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తర్వాత, విద్యార్థులు తమ అర్హతలను బట్టి, 18 నెలల నుంచి 4 సంవత్సరాల వరకు (కోర్సుతో పాటు ప్రాంతాన్ని బట్టి) ఆ దేశంలోనే ఉండి, తగిన ఉద్యోగం కోసం వెతుక్కోవచ్చు.న్యూజీలండ్అంతర్జాతీయ విద్యార్థులకు అత్యంత సురక్షితమైన, నాణ్యమైన విద్యను అందించే దేశాల్లో న్యూజీలండ్ కూడా ప్రత్యేకమే! ఇక్కడ పర్యావరణం చాలా అందంగా, ప్రశాంతంగా ఉంటుంది. న్యూజిలాండ్‌లో పలు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు వరల్డ్ క్యూఎస్ (కోక్వారెల్లి సైమండ్స్) ర్యాంకింగ్స్‌లో స్థానాన్ని పొందాయి. కాబట్టి అక్కడ విద్యాప్రమాణాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించొచ్చు. అంతర్జాతీయ విద్యార్థులు పీహెచ్డీ (డాక్టోరల్) కోర్సులు చదివితే, వారికి దేశీయ విద్యార్థులతో సమానమైన, చాలా తక్కువ ఫీజు వర్తిస్తుంది. ఇక విదేశీ విద్యార్థి వీసా కోసం జీవన వ్యయాలు, తిరుగు ప్రయాణ ఖర్చులు చూపించాల్సి ఉంటుంది. విరామ సమయాల్లో పూర్తి సమయం పనిచేయడానికి అనుమతి ఉంది. న్యూజీలండ్‌లో చదువుకున్న తర్వాత అక్కడ స్థిరపడటం కూడా సులభమే.మొత్తానికీ అమెరికా చాన్స్ పోయిందని నిరాశపడే భారతీయులకు ప్రపంచవ్యాప్తంగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా దేశాలు వెల్కమ్ బోర్డ్‌తో ఎదురుచూస్తున్నాయి. ఆ నిరాశను వదిలేసి చుట్టూ ప్రపంచం వైపు చూస్తే మారేదేం లేదు.. విమానాశ్రయంలో ఫ్లైట్ పేరు తప్ప అంటున్నారు అనుభవజ్ఞులు.ఉత్తమమైన దేశాన్ని ఎలా ఎంచుకోవాలి?విదేశాల్లో కెరీర్‌ని ప్లాన్ చేసుకునే యువతకు ఆయా దేశాల్లో చదువుకోవడానికి, ఆపై అక్కడే పని చేయడానికి, అక్కడే స్థిరపడటానికి ఏ దేశాన్ని ఎంచుకోవాలి అనేది ప్రధాన సమస్య. కొన్ని దేశాలు సులభమైన పోస్ట్–స్టడీ వర్క్ వీసా, అలాగే పర్మనెంట్ రెసిడెన్స్ (స్థిరనివాసం) పొందే మార్గాలను అందిస్తాయి. అయితే ఏ దేశాలను ఎంచుకుంటే మేలు జరుగుతుంది?సులభమైన పోస్ట్–స్టడీ వర్క్ వీసా, స్థిరనివాస మార్గాలు ఎక్కువగా ఉన్న దేశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలండ్ వంటి దేశాలు అంతర్జాతీయ విద్యార్థులకు చాలా అనుకూలమైన వీసా విధానాలను పాటిస్తున్నాయి. దాంతో ఈ దేశాలలో పర్మనెంట్ రెసిడెన్సీ (స్థిరనివాసం)పొందే మార్గాలు కూడా సులభంగా ఉంటాయి.కెరీర్ వృద్ధి కోసం ఇంగ్లీష్ మాట్లాడే లేదా ఇంగ్లీష్ బోధించే దేశాలను ఎంచుకోవాలి. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలండ్, యూకే వంటి ఇంగ్లిష్ మాట్లాడే దేశాలు మన భారతీయులకు భాషాపరంగా సౌకర్యంగా ఉంటాయి. అయితే జర్మనీ, నెదర్లండ్స్ వంటి కొన్ని నాన్–ఇంగ్లిష్ దేశాలు ఇంగ్లిష్ భాషలో కోర్సులను అందిస్తాయి. కాని, ఉద్యోగం పొందాలంటే మాత్రం స్థానిక భాషను నేర్చుకోవాల్సి ఉంటుంది. అక్కడే సెటిల్ అవ్వాలి అనుకునేవారు ఎడ్యుకేష సమయంలో స్థానిక భాష నేర్చుకోవడంపై కాస్త దృష్టిపెట్టాలి.ఏ రంగంలో చదువుకోవాలనుకుంటున్నారో దాని ఆధారంగా మనం ఎన్నుకునే యూనివర్సిటీల విషయంలో కోక్వారెల్లి సైమండ్స్ (క్యూఎస్), టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్(టీహెచ్ఈ) వంటి సంస్థల ప్రపంచ ర్యాంకింగ్‌లను పరిశోధించుకోవాలి. ఆయా విశ్వవిద్యాలయాల గ్రాడ్యుయేట్లకు ఎంత సులభంగా ఉద్యోగాలు లభిస్తున్నాయో, వారి సగటు జీతాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. యూనివర్సిటీల అధికారిక వెబ్సైట్లు లేదా లింక్డ్ఇన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వివరాలు లభిస్తాయి.ఒక దేశాన్ని ఎంచుకునే ముందు, అక్కడ అంతర్జాతీయ విద్యార్థులకు ఎంత భద్రత ఉందో తెలుసుకోవాలి. విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విద్యార్థులకు ఎలాంటి సహాయక సేవలు (అకాడెమిక్ సపోర్ట్, కౌన్సెలింగ్, కెరీర్ గైడె¯Œ ్స) అందిస్తున్నాయో పరిశీలించుకోవాలి. ఆ దేశంలో జీవన వ్యయం (అద్దె, ఆహారం, రవాణా) సహా విద్యార్థి సంఘాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోవాలి.చదువుకునే సమయంలో ఆయా దేశాల్లో తమ వ్యక్తిగత ఖర్చులను తగ్గించుకోవడానికి స్కాలర్షిప్లు, ట్యూషన్ ఫీజు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయో లేదో ముందే చూసుకోవాలి. చదువుతున్నప్పుడే ఇంటర్న్‌షిప్‌లు లేదా పార్ట్–టైమ్ ఉద్యోగాలు లభించే అవకాశాలున్న దేశాలను ఎంచుకోవడంతో వృత్తి అనుభవాన్ని పొందవచ్చు. అంతేకాకుండా, స్థానిక భాష కూడా నేర్చుకోవచ్చు. -
చిన్న బిజినెస్.. పెద్ద మ్యాజిక్!
నేటి రోజుల్లో చిన్న చిన్న వ్యాపార యజమానులందరూ సులభంగా, వేగంగా, సురక్షితంగా పని చేయాలనుకుంటే, ఒక్కసారి ఈ స్మార్ట్ టూల్స్ ప్రయత్నించాల్సిందే!పేపర్ ప్లస్ డిజిటల్ మ్యాజిక్ఒకప్పుడు నోట్స్ రాస్తే కేవలం కాగితాలకే పరిమితం అయ్యేది. ఒక్క కాగితం మిస్ అయినా, రాసిన మాట, గీసిన డ్రాయింగ్ అంతా మాయం అవుతుంది. ఇప్పుడు ‘హుయిన్ డిజిటల్ నోట్‌బుక్’తో ఆ భయం పూర్తిగా తొలగింది. ఇది కేవలం ఒక నోట్‌బుక్ కాదు, పేపర్ ప్లస్ డిజిటల్ టాబ్లెట్. ఇందులో రాసిన ప్రతి అక్షరం, గీసిన ప్రతి లైన్ వెంటనే మీ డివైస్‌లో స్టోర్ అవుతుంది. ఆడియో రికార్డ్ ఫీచర్‌తో, మీ వాయిస్ కూడా నోట్స్‌తో కలిసి రికార్డ్ అవుతుంది. ఒక్క క్లిక్‌తో షేర్ చేసుకోవచ్చు కూడా. పేజీలను మిళితం చేయడం, విడగొట్టడం చాలా సులభం. ముఖ్యమైన విషయాలను హైలైట్ చేయడానికి సులభమైన టూల్స్ కూడా ఉన్నాయి. ధర రూ. 7,105 ల ప్యాక్‌లో ఒక హుయిన్ నోట్, ఏ ఐ నోట్ ప్యాడ్, యూఎస్బీ కేబుల్, మాగ్నెటిక్ పెన్ స్లీవ్, రీఫిల్స్, ప్లాస్టిక్ పెన్ నిబ్స్, మార్గదర్శక పుస్తకంతో వస్తుంది.ఒక్క కార్డు చాలు! ఒకప్పుడు పాత పేపర్ విజిటింగ్ కార్డ్ అంటే స్టేటస్ సింబల్. ‘ఇదిగో నా కార్డ్’ అంటూ ఇచ్చేసి స్టయిల్ కొట్టేవాళ్లు. కాని, నిజం చెప్పాలంటే ఆ కార్డుల ఫ్యూచర్ బాగుండేది కాదు. రోజుల తరబడి జేబులో మురిగి, కాఫీ కప్పుల కింద నలిగి, చివరికి ఏ డస్ట్బిన్లోనో ఎండ్ అయ్యేది. అలాంటప్పుడు వాటికోసం అనవసరంగా ఖర్చు ఎందుకు చేయటం. కేవలం, ఒక్క టాప్‌తోనే మీ పేరు, నంబర్, వెబ్సైట్, సోషల్ మీడియా అన్నీ ఎదుటివారి మొబైల్లో బజ్ అయ్యే మాయ చేస్తుంది ఈ ‘టాప్మో స్మార్ట్ బిజినెస్ కార్డ్’. ఇందులో చిన్న లోగో, క్యూ ఆర్ కోడ్, లైఫ్‌టైమ్ వాలిడిటీ అన్నీ రెడీ! యాప్ డౌన్లోడ్ అనే తలనొప్పి లేదు, ‘కార్డులు అయిపోయాయి’ అనే టెన్షన్ లేదు. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు కూడా. ధర కేవలం రూ. 599 మాత్రమే!పోర్టబుల్ సర్వర్స్మాల్ బిజినెస్ ఓనర్స్కు కస్టమర్ డేటా, ఫైనాన్స్ రికార్డులు, ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ రక్షించుకోవాలంటే పెద్ద సర్వర్ అవసరమా? లేనే లేదు! బిజినెస్ డీటైల్స్ అన్నీ ఒకే చోట, సురక్షితంగా ఉంచాలంటే ‘అప్రికార్న్ ఏజిస్ ప్యాడ్‌లాక్’ బెస్ట్ ఆప్షన్. 480 జీబీ స్టోరేజ్, 256–బిట్ ఎన్క్రిప్షన్, రగ్డ్ బాడీ, టూ స్టెప్ వెరిఫికేషన్‌తో ఏ ఫైల్ అయినా సేఫ్‌గా స్టోర్ చేస్తుంది. ఇది కేవలం స్టోరేజ్ సర్వర్ మాత్రమే కాదు, చిన్న బిజినెస్‌కి నమ్మకమైన డేటా గార్డు. ఆఫీస్‌లోనైనా, ఇంట్లోనైనా, ట్రావెల్లోనైనా సులభంగా ఉపయోగించవచ్చు. చిన్న, పోర్టబుల్ బాడీతో జేబులోనైనా పెట్టుకుని క్యారీ చేయవచ్చు. ఏకకాలంలో డేటా యాక్సెస్, బ్యాకప్, షేర్ అన్నీ సులభం. ధర రూ. 49,325. -
అభాగ్యుల పాలిటి అన్నదాత
∙విఎస్ సాయిబాబాఅతనొక మధ్యతరగతి యువకుడు. బంధువుల ఇళ్లకు, ఇతర కార్యక్రమాలకు వెళ్లినపుడు వృద్ధులు, ఆస్తి ఉన్నా పట్టెడన్నం పెట్టే దిక్కులేని, కుటుంబసభ్యులు పట్టించుకోని అభాగ్యులు ఆకలితో అలమటిస్తున్న వైనం అతడిని ఎంతగానో బా«ధించింది. అలాంటి అభాగ్యుల కోసం తన వంతుగా ఏదైనా చేయాలని సంకల్పించుకున్నాడతను. అతడే మళ్ల తులసీరామ్ (రాంబాబు). అతడి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలంలోని పంజా వేమవరం.రాంబాబు ఆగర్భ శ్రీమంతుడేమీ కాదు. నాలుగెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే సాదాసీదా యువరైతు. ఉన్న భూమిలోనే కొంత విస్తీర్ణంలో రొయ్యల సాగు చేపట్టి ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. క్రమంగా రియల్ ఎస్టేట్, రైస్‌మిల్లుల వ్యాపారాల్లోకి ప్రవేశించి, ఆర్థికంగా మరింత పుంజుకున్నారు. తులసీ కన్వెన్షన్ పేరుతో కల్యాణమండపం నిర్మించారు.ఆర్థికంగా బలపడటంతో అన్నార్తులు, అభాగ్యులైన వృద్ధుల కోసం ఏదైనా చేయాలనుకున్న సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి కార్యాచరణకు దిగారు. భార్య, కుమారుడు, కుమార్తె కూడా తన సంకల్పానికి ప్రోత్సాహం ఇవ్వడంతో 2019 అక్టోబర్ నుంచి ఇంటింటికీ భోజనం క్యారియర్స్ పంపడం ప్రారంభించారు.18 గ్రామాల్లోని 160 మందికివీరవాసరంలో తాను నిర్మించిన తులసీ కల్యాణ మండపంలోనే ప్రతి రోజు ఉదయం వంట తయారు చేసి పంజా వేమవరం పరిసర గ్రామాలైన చింతలకోటిగరువు, తోకలపూడి, తోలేరు, రాయకుదురు, కొణితివాడ, జొన్నలగరువు, నవుడూరు, అండలూరు, ఉత్తరపాలెం, బలుసుగొయ్యపాలెం తదితర 18 గ్రామాల్లోని 160 మందికి ప్రతిరోజూ ఇంటి వద్దకే భోజనం క్యారియర్స్ పంపడం మొదలుపెట్టారు.వివక్షకు తావు లేకుండా...కులమత ఆర్థిక తారతమ్యాలకు తావులేకుండా, వయోభేదం లేకుండా కడుపునిండా భోజనానికి నోచుకోని వారిని ఎంపిక చేసుకుని, వారికి ప్రతిరోజూ భోజనం క్యారియర్లు పంపుతున్నారు. ఆస్తిపాస్తులు, కుటుంబ సభ్యులు ఉండి, తల్లిదండ్రులను పట్టించుకోని కొందరికి రాంబాబు పంపే క్యారియర్ ఒక చెంపదెబ్బ! తమ తల్లిదండ్రులకు రాంబాంబు క్యారియర్ పంపడంతో, పరువుపోతుందని భయపడిన పిల్లలు తల్లిదండ్రులను శ్రద్ధగా చూసుకోవడం మొదలుపెట్టిన సంఘటనలు అనేకం!విరాళాలు నిరాకరిస్తూ..ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకే వంట తయారుచేసి క్యారియర్స్‌లో సర్ది, అన్నార్తుల ఇంటికి ఒక ఆటో బయలుదేరుతుంది. సుమారు ఉదయం 11 గంటల లోపుగానే రాంబాబు పంపించే భోజనం క్యారియర్ 160 మందికి చేరిపోతుంది. రోజూ ఒకే రకమైన వంటకం కాకుండా; ప్రతి సోమ, గురు, శనివారం రోజుల్లో పప్పు, మంగళ, శుక్రవారాలు కూరగాయలు, బు«ధ, ఆదివారాలు చేపలు లేదా మాంసం లేదా రొయ్యల కూరతో భోజనం కార్యియర్స్ సిద్ధం చేస్తారు. వారం రోజులపాటు రసం, మజ్జిగపులుసు, సాంబారు ఏదో ఒకటి తప్పనిసరి. మాంసాహారం తినని వారికి శాకాహార భోజనమే పంపిస్తారు. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా, వీరందరికీ క్రమం తప్పకుండా ప్రతిరోజూ భోజనం క్యారియర్లు వేళకు అందుతాయి. ఈ పని సజావుగా సాగడానికి ఆరుగురు పనిమనుషులను నియమించుకున్నారు. ఎప్పుడైనా వంటమనిషి రాకుంటే, రాంబాబే స్వయంగా వంట చేస్తారు. కుటుంబ సభ్యులు అతనికి సహకరిస్తారు. ఈ మహత్కార్యంలో తామూ భాగస్వాములం అవుతామని కొందరు విరాళాలు ఇస్తామంటూ ముందుకు వచ్చినా, రాంబాబు సున్నితంగా తిరస్కరిస్తారు. తన తదనంతరం కూడా ఈ కార్యక్రమాన్ని తన కుటుంబ సభ్యులు నిరంతరాయంగా కొనసాగించేందుకు వీలుగా తానే ఒక శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు రాంబాబు చెబుతున్నారు.అన్నం పెట్టి ఆదుకుంటున్నారుగత రెండేళ్లుగా రాంబాబు పెట్టే భోజనంతోనే బతుకుతున్నాను. నన్ను చూసుకునేవారు ఎవరూ లేరు. గ్రామస్థులు చెప్పిన మాటతో భోజనం క్యారియర్ పంపిస్తున్నారు. భోజనం చాలా బాగుంటుంది.వరహాలు,జొన్నలపాలెం, వీరవాసరం మండలం.రాంబాబే దిక్కునా భార్య చనిపోయింది. ఇద్దరు పిల్లలు ఉన్నా, వారు నన్ను పట్టించుకోరు. నాకు తిండిపెట్టే దిక్కులేని సమయంలో రాంబాబే నాకు దిక్కయ్యారు. ప్రతిరోజూ ఆయన పంపే భోజనం తింటున్నాను.వెంకటేశ్వరరావు, కొణితివాడ, వీరవాసరం మండలం.పదికాలాలు క్షేమంగా ఉండాలిరాంబాబు పంపించే భోజనం చాలా బాగుంటుంది. ప్రతిరోజూ ఒకే రకమైన భోజనం కాకుండా, పండుగ రోజుల్లో మరింత ప్రత్యేంగా భోజనం అందించడం చాలా సంతోషం. అడగకుండానే అన్నంపెట్టే రాంబాబులాంటి వ్యక్తి పదికాలాలపాటు క్షేమంగా ఉండాలి.అప్పారావు, కొణితివాడ.కడుపు నింపడంలోనే సంతృప్తిసంపాదించిన దానిలో కొంతమొత్తంతో కొందరి ఆకలి తీర్చడం కన్నా సంతృప్తి మరొకటి లేదు. ఈ పని తలపెట్టినప్పుడు ఎంతో ఆలోచించాను. నా కుటుంబ సభ్యులు అండగా నిలవడంతో ముందడుగు వేశాను. ‘కోవిడ్’ సమయంలో రెండు మూడు నెలలు మినహా ప్రారంభించిన నాటి నుంచి నిరంతరాయంగా ఈ భోజనం క్యారియర్ల పంపిణీ కొనసాగుతోంది. ఇన్నాళ్లుగా భోజనాలు పంపుతున్నా, రాంబాబు అనే పేరు తప్ప నేనెవరో క్యారియర్లు అందుకుంటున్న చాలామందికి ప్రత్యక్షంగా తెలియదు.మళ్ల తులసీరామ్(రాంబాబు), నిర్వాహకుడు, పంజా వేమవరం. -
దుర్వాసుడి నరక సందర్శనం
దుర్వాసుడు ఒకసారి పితృలోకానికి వెళ్లాడు. శరీరం నిండా విభూతిని అలంకరించుకుని, రుద్రాక్షమాలలు ధరించి, ‘శివా! శంకరా! పరమేశ్వరా! జగన్మాతా! జగదంబికా!’ అంటూ పార్వతీ పరమేశ్వరులను స్మరిస్తూ అడుగుపెట్టిన దుర్వాసుడిని కవ్యవాలాదులైన పితృదేవతలు ఎదురేగి స్వాగతించారు. దుర్వాసుడిని వారు ఉన్నతాసనంపై కూర్చుండబెట్టి, అతిథి మర్యాదలు చేశారు. కుశల ప్రశ్నలు వేశారు. కబుర్లతో వారు కాలక్షేపం చేస్తుండగా, ఎక్కడి నుంచో ఆర్తనాదాలు, హాహాకారాలు వినిపించసాగాయి.ఆ ఆర్తనాదాలకు, హాహాకారాలకు దుర్వాసుడు కలత చెందాడు. ‘హృదయవిదారకంగా ఉన్న ఈ రోదనలు, హాహాకారాలు ఎక్కడివి?’ అని అడిగాడు.‘మునీశ్వరా! ఇక్కడికి సమీపంలోనే యమలోకం ఉంది. అక్కడ పాపులను శిక్షించడానికి యమధర్మరాజు ఉన్నాడు. అతడి అధీనంలో వేలాదిగా యమదూతలు ఉన్నారు. యమలోకంలో ఎనభైఆరు నరకకూపాలు ఉన్నాయి. వాటిలో భయంకరమైనది కుంభీపాక కూపం. మహాపాపులను తెచ్చి, అందులో పడవేసి, వారిని యమదూతలు ఘోరంగా శిక్షిస్తుంటారు. వారి శిక్షల యాతనను వర్ణించడం అసాధ్యం. శిక్షలు అనుభవిస్తున్న పాపుల ఆర్తనాదాలు, రోదనలు ఇక్కడి వరకు వినిపిస్తూ ఉంటాయి. దైవనింద, గురునింద, పరపీడన, నారీపీడన, మాతృ పితృనింద, మిత్రద్రోహం, స్వామిద్రోహం వంటి మహాపాపాలు చేసి వచ్చిన వారికి శిక్షలు అత్యంత దారుణంగా ఉంటాయి. శిక్షల బాధ తాళలేక ఆ పాపులు చేసే ఆర్తనాదాలు మేము రోజూ వింటూనే ఉంటాం. వారి ఆర్తనాదాలు వింటే చాలు ఎవరికైనా వైరాగ్యం పుడుతుంది’ అని చెప్పారు.నరకం నుంచి వినిపించే పాపుల ఆర్తనాదాలు వింటూ దుర్వాసుడు పితృలోకంలో ఉండలేకపోయాడు. చటుక్కున లేచి, వడివడిగా అడుగులు వేస్తూ నరకం వైపు బయలుదేరాడు. కొద్దిసేపటికే అతడు నరకానికి చేరుకున్నాడు. పెద్దపెట్టున ఆర్తనాదాలు వినిపిస్తున్న కుంభీపాక కూపం వద్దకు వెళ్లాడు. గట్టున నిలబడి లోనికి చూశాడు. అప్పటి వరకు మిన్నుముట్టిన ఆర్తనాదాలు ఆగిపోయి, కేరింతలు మొదలయ్యాయి. కుంభీపాక కూపంలో ఉన్న పాపులు ఉల్లాసంగా, ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఆనంద కేళీ విలాసాలు సాగిస్తూ కనిపించారు. యమలోకం గురించి పితృలోకంలో తాను విన్నదొకటి, తాను స్వయంగా చూస్తున్నది వేరొకటిగా ఉండటంతో దుర్వాసుడు ఆశ్చర్యపోయాడు.దుర్వాసుడు మాత్రమే కాదు, పాపులకు శిక్షలు అమలు చేస్తున్న యమదూతలు కూడా ఈ ఆకస్మిక పరిణామానికి నివ్వెరపోయారు. కఠిన శిక్షలకు యాతనలు అనుభవిస్తూ హాహాకారాలు చేయవలసిన పాపులందరూ కేరింతలు కొడుతూ ఆనందకేళీ నృత్యాలు చేస్తుండటం వారిని అయోమయంలో పడేసింది. కుంభీపాకంలోని మహాపాపులందరూ స్వర్గసౌఖ్యాలు అనుభవిస్తున్నంత ఆనందంగా ఉండటం విడ్డూరంగా తోచింది. ఎంతగా తరచి చూసినా ఈ పరిస్థితికి కారణమేమిటో కనిపించలేదు. ఇదేదో మాయలా ఉందని తలచి యమదూతలు హుటాహుటిన యమధర్మరాజు వద్దకు వెళ్లారు. ‘స్వామీ! కుంభీపాకంలోని మహాపాపులందరూ స్వర్గసౌఖ్యాలు అనుభవిస్తున్నంత ఆనందంగా ఉన్నారు. కొద్దినిమిషాల కిందటి వరకు హాహాకారాలు చేసిన వారే ఇప్పుడు ఉల్లాసంగా కేరింతలు కొడుతున్నారు. దీనికి కారణమేమిటో మాకు ఏమాత్రం అంతుచిక్కకుంది. మీరే ఒకసారి స్వయంగా వచ్చి పరిశీలించండి’ అని చెప్పారు.యమదూతల మాటలకు యమధర్మరాజు ఉలిక్కిపడ్డాడు. కుంభీపాకంలో ఏం జరుగుతోందో చూడటానికి వెంటనే మహిష వాహనాన్ని అధిరోహించాడు. ఎందుకైనా మంచిదని ఇంద్రుడు సహా ఇతర దిక్పాలకులకు, బ్రహ్మ విష్ణువులకు కబురు పెట్టాడు.యముడు, ఇంద్రాది దిక్పాలకులు, బ్రహ్మ విష్ణువులు దాదాపు ఒకేసారి కుంభీపాక కూపం వద్దకు చేరుకున్నారు. లోపల ఉన్న పాపులు ఆనంద పరవశులై కేరింతలు కొడుతున్న దృశ్యాన్ని కళ్లారా చూశారు. ఇది నరకకూపం కాదు, పాపుల కోసం ఏర్పాటు చేసిన భోగకూపంలా ఉందని వారంతా నివ్వెరపోయారు. ఈ విడ్డూరానికి కారణమేమిటో వారెవరికీ అంతుచిక్కలేదు.బ్రహ్మ విష్ణువులు ఇంద్ర యమధర్మరాజులతో తర్జనభర్జనలు జరిపారు. ఎంతగా ఆలోచించినా ఈ వింతకు కారణమేమిటో వారికి తోచలేదు. పరమశివుడిని అడిగితే దీనికి కారణమేమిటో చెప్పగలడని వారంతా ఏకగ్రీవంగా అనుకున్నారు. దిక్పాలకులను, ఇంద్రుడిని, యముడిని వెంటబెట్టుకుని బ్రహ్మ విష్ణువులు నేరుగా కైలాసానికి వెళ్లారు. వారంతా శివుడికి నమస్కరించారు. యమలోకపు వింతను వివరించారు. ‘మహేశ్వరా! ఎంతగా ఆలోచించినా ఈ వింతకు కారణమేమిటో మాకు తోచకున్నది. నువ్వు సర్వజ్ఞుడివి. దీనికి కారణమేమిటో నువ్వే చెప్పాలి’ అన్నాడు విష్ణువు.‘మహావిష్ణూ! ఇందులో వింతా లేదు, విడ్డూరమూ లేదు. ఇదంతా విభూతి మహిమ. కుంభీపాకం వద్దకు దుర్వాసుడు వచ్చాడు కదా! నా భక్తుడైన దుర్వాసుడు విభూతిని ధరించాడు. కుంభీపాకం వద్ద అతడు నిలిచి, తలవంచి లోనికి చూశాడు. అప్పుడు అతడి నుంచి విభూతి రేణువులు రాలి ఆ పాపుల మీద పడ్డాయి. అవి పడిన వెంటనే పాపుల యాతనలు మటుమాయమైపోయాయి. కుంభీపాక కూపం స్వర్గతుల్యంగా మారింది. ఇకపై అది పితృలోక వాసులకు పవిత్ర తీర్థమవుతుంది. అందులో స్నానమాచరించిన పితృదేవతలు సుఖపడతారు. అక్కడ ఆలయం నిర్మించి, మా దంపతులను ప్రతిష్ఠించండి. ప్రీతీశ్వరి, ప్రీతీశ్వరులుగా అందులో కొలువుదీరుతాం. పితృలోక వాసుల పూజలు అందుకుంటాం. ముల్లోకాలలోనూ ఉన్న తీర్థాలన్నింటిలోనూ ఇదే పవిత్ర తీర్థమవుతుంది’ అని ప్రకటించాడు శంకరుడు. దేవతలందరూ శివుడి వద్ద సెలవు పుచ్చుకుని బయలుదేరారు. పరమశివుడు చెప్పినట్లుగానే కుంభీపాకం వద్ద తీర్థాన్ని, ఆలయాన్ని నిర్మించారు. అప్పటి వరకు కుంభీపాకంలో ఉన్నవారంతా దివ్యవిమానాల్లో కైలాసానికి చేరుకున్నారు.∙సాంఖ్యాయన -
శాంతి కోసం యుద్ధం చేశారు!
మహిళలు శాంతి దూతలు. శాంతి కోసం అవసరం అయితే వారు వీధి పోరాట యోధులు కూడా కాగలరు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. కళ్లెదుటి వర్తమానం. నోబెల్ బహుమతులు మొదలయ్యాక ఈ 125 ఏళ్లలో ఇప్పటి వరకు 19 మంది మహిళలు శాంతి విజేతలయ్యారు. ఇది చిన్న సంఖ్యలా అనిపించినా, శాంతి సాధనలో మహిళల సంకల్ప బలానికి ఆకాశమంత సాక్ష్యం. 20 వ మహిళా శాంతి బహుమతి విజేత ఎవరన్నది (ఒకవేళ మహిళే విజేత అయితే) ఈ నెల 10 న నోబెల్ కమిటీ ప్రకటిస్తుంది. ఈసారి ‘శాంతి’ బహుమతికి 224 మంది వ్యక్తులు, 94 సంస్థలు పోటీలో ఉండగా... వాళ్లలో కొందరు మహిళలూ ఉన్నారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇప్పటి వరకు నోబెల్ శాంతి బహుమతిని పొందిన పందొమ్మిది మంది మహిళల వివరాలు.. మీ కోసం, క్లుప్తంగా.1905 బెర్తా వాన్ సట్నర్ (1843–1914) ఆస్ట్రియా యుద్ధాన్ని వ్యతిరేకించటంలో చూపిన తెగువకు బెర్తాకు ‘నోబెల్ శాంతి’ లభించింది. 19వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన పుస్తకాలలో ఒకటైన యుద్ధ వ్యతిరేక నవల ‘లే డౌన్ యువర్ ఆర్మ్స్’ (1889) బెర్తా రాసిందే. ఈ నవల పేరు అప్పట్లో చాలామందికి రెచ్చగొట్టేదిగా అనిపించింది. బెర్తా అంతర్జాతీయ శాంతి ఉద్యమ నాయకులలో ఒకరు. 1891లో ఆస్ట్రియన్ శాంతి సమాజాన్ని స్థాపించారు. పురుషాధిక్య శాంతి సమావేశాలలో శక్తిమంతమైన నాయకురాలిగా నిలిచారు.1931జేన్ ఆడమ్స్ (1860–1935), అమెరికామానవాళిలో శాంతి స్ఫూర్తిని రగిలించడానికి చేసిన నిరంతర కృషికి జేన్‌కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. జేన్ 1915లో ‘విమెన్స్ ్స ఇంటర్నేషనల్ లీగ్ ఫర్ పీస్ అండ్ ఫ్రీడమ్’ను స్థాపించారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో నెదర్లండ్స్‌లోని హేగ్‌లో జరిగిన మహిళల శాంతి సమావేశానికి జేన్ అధ్యక్షత వహించారు. అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్స్ అమెరికాను యుద్ధంలోకి దింపినందుకు వ్యతిరేకంగా జేన్ చాలా బిగ్గరగా నిరసన తెలిపారు. 1946ఎమిలీ గ్రీన్ బాల్చ్ (1867–1961), అమెరికానిరాయుధీకరణ, శాంతి స్థాపనల కోసం ఎమిలీ జీవితాంతం చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతి లభించింది. కానీ ఆమెకు అమెరికా ప్రభుత్వం నుండి ఎటువంటి అభినందనలూ అందలేదు! మొదటి ప్రపంచ యుద్ధంలో ఆమె 1931 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత జేన్ ఆడమ్స్‌తో కలిసి, యుద్ధాన్ని ఆపడానికి జోక్యం చేసుకోవాలని తటస్థ దేశాల దేశాధినేతలను ఒప్పించారు. 1935లో ఎమిలీ ‘విమెన్స్ ఇంటర్నేషనల్ లీగ్ ఫర్ పీస్ అండ్ ఫ్రీడమ్’ కు నాయకత్వం వహించారు.1976 బెట్టీ విలియమ్స్ (1943–2020), యు.కె.ఉత్తర ఐర్లండ్‌లో ప్రొటెస్టెంట్లకు, కేథలిక్కులకు మధ్య రగులుతున్న హింసాత్మక సంఘర్షణలకు ముగింపు పలికేందుకు చేసిన కృషికి, మైరీడ్ కొరిగన్ అనే మహిళతో పాటుగా బెట్టి విలియమ్స్‌కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 1976 ఆగస్టులో, బెల్ఫాస్ట్లో (ఉత్తర ఐర్లండ్) జరిగిన కాల్పుల ఘటనలో అమాయకులైన ముగ్గురు చిన్నారులు మరణించారు. గృహిణి అయిన బెట్టీ విలియమ్స్ ఆ విషాదాన్ని చూసి, ఉత్తర ఐర్లండ్‌లో ఘర్షణలు ఆపాలని నిర్ణయించుకుని, శాంతి పునరుద్ధరణకు పాటు పడ్డారు. 1976 మైరీడ్ కొరిగన్ (1944 –), యు.కె.మైరీడ్ బెల్ఫాస్ట్లో ఒక పేద కుటుంబంలో పెరిగారు. యువతిగా ‘లెజియన్ ఆఫ్ మేరీ’ అనే కాథలిక్ సంస్థలో సేవలందించారు. 1976, 1977లలో ఉత్తర ఐర్లండ్‌లో ఘర్షణలు, హింసకు వ్యతిరేకంగా అట్టడుగు వర్గాలలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు వేలాది మందిని ఒకచోట చేర్చారు. బెట్టీ విలియమ్స్‌తో కలిసి పని చేశారు. ఆమెతో నోబెల్ శాంతిని పంచుకున్నారు. 1979మదర్ థెరిసా (1910 – 1997), ఇండియామానవాళికి అసమాన సేవలను అందించినందుకు మదర్ థెరిసాకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. అల్బేనియా కేథలిక్ బాలిక అయిన ఆగ్నెస్ గోంక్షా బోజాక్షియు తన పన్నెండేళ్ల వయసులోనే మానవాళి సేవకు అంకితం అయ్యారు. తదనంతర కాలంలో ఇండియాకు వచ్చి థెరిస్సాగా మారిపోయారు. పేదలను ఆదుకునేందుకు ఆమె స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ కలకత్తాలో అనాథల కోసం ఇళ్లు, కుష్ఠురోగులకు నర్సింగ్ హోమ్‌లు, ప్రాణాంతక వ్యాధిగ్రస్తుల కోసం ఆశ్రమాలను నిర్మించింది.1982అల్వా మిర్డాల్ (1902–1986), స్వీడన్1962లో స్వీడిష్ పార్లమెంటుకు ఎన్నికవటానికి ముందే అల్వా మిర్డాల్ ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలుసు. యుద్ధానంత కాలంలో సోషల్ డెమోక్రాట్ పార్టీ ద్వారా కార్మికవర్గ పరిస్థితులను మెరుగుపరచడానికి ఆమె తన జీవితాన్ని అంకితం చేశారు. మహిళల హక్కుల ప్రచారకర్తగా ప్రసిద్ధి చెందారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితిలో ప్రముఖ పదవులను నిర్వహించారు. ఆమె చేసిన నిరాయుధీకరణ ప్రయత్నాలకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 1991ఆంగ్ సాన్ సూకీ (1945–) బర్మాబర్మాలో పౌర ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించాలని సైనిక నాయకులతో పోరాడారు. 1990లో ఆమె పార్టీ ఎన్.ఎల్.డి. స్పష్టమైన విజయం సాధించినా, అప్పటికే గృహ నిర్బంధంలో ఉన్న సూకీని విడుదల చేయటానికి సైన్యం నిరాకరించింది. 21 సంవత్సరాలలో దాదాపు 15 సంవత్సరాలు ఆమె గృహ నిర్బంధంలోనే ఉన్నారు. 2021 ఫిబ్రవరి 1న సైనిక దళాలు తిరుగుబాటు చేసి, సూకీకి మళ్లీ 8 సంవత్సరాల జైలు శిక్ష విధించాయి. ఆమె అహింసాయుత ప్రజా పోరాటం ఆమెకు నోబెల్ శాంతిని తెచ్చిపెట్టింది.1992రిగోబెర్టా మెంచు తుమ్ (1959–) గ్వాటెమాలారిగోబెర్టా మెంచు తుమ్ స్థానిక ఆదివాసీల హక్కుల కోసం కృషి చేసినందుకు గాను నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేటాడుతున్న సైన్యం ఆమె సొంత కుటుంబంలోని అనేక మందిని చంపింది. దాంతో ఆమె 1980ల ప్రారంభంలో మెక్సికోలో తలదాచుకున్నారు. అక్కడ మానవ హక్కుల కోసం పనిచేస్తున్న యూరోపియన్ సమూహాలతో ఆమెకు పరిచయం ఏర్పడింది. గ్వాటెమాలా తిరిగి వచ్చిన తర్వాత ప్రభుత్వం – గెరిల్లా సంస్థల మధ్య చర్చలలో మధ్యవర్తిగా పని చేశారు. 1997జోడీ విలియమ్స్ (1950 –) అమెరికాజోడీ మందు పాతరల వ్యతిరేక ఉద్యమ నాయకురాలు. 1980లలో యుద్ధంలో దెబ్బతిన్న ఎల్ సాల్వడార్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ కాలంలో మందు పాతరలు పౌర జనాభాకు నిరంతరం ముప్పుగా ఉండేవి. వాటి వల్ల చేతులు, కాళ్లు కోల్పోయిన పిల్లలకు కృత్రిమ అవయవాలను అందించే బాధ్యతను ఆమె తీసుకున్నారు. 1991 నుండి మందుపాతరలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచారాన్ని ప్రారంభించడంలో ముందు నిలిచారు. నోబెల్ విజేత అయ్యారు.2003షిరిన్ ఎబాది (1947–), ఇరాన్ఇస్లామిక్ ప్రపంచం నుంచి తొలి మహిళా శాంతి బహుమతి గ్రహీత. ఇరాన్ తొలి మహిళా న్యాయమూర్తులలో ఒకరు. బ్యూరోక్రసీ పీడనను వ్యతిరేకించారు. పై అధికారులను విమర్శించినందుకు జైలుపాలు అయ్యారు. కనీస మానవ హక్కుల కోసం; ముఖ్యంగా మహిళలు, పిల్లల హక్కుల కోసం పోరాటాన్ని చేపట్టారు. ఇందుకే ఆమెకు నోబెల్ లభించింది. మతం నుండి రాజకీయాలను వేరుచేయాలనే వాదనకు ఎబాది మద్దతుగా నిలిచారు. 2004వంగారి మాతై (1940–2011), కెన్యానోబెల్ శాంతి బహుమతిని అందుకున్న తొలి ఆఫ్రికన్ మహిళ. తూర్పు, మధ్య ఆఫ్రికా నుండి డాక్టరేట్ (జీవశాస్త్రంలో) పొందిన తొలి మహిళ. స్వదేశమైన కెన్యాలో తొలి మహిళా ప్రొఫెసర్ కూడా. కెన్యా ప్రజాస్వామ్య పోరాటంలో చురుకైన పాత్ర వహించారు. 1977లో అడవుల సంరక్షణకు ఉద్యమం ప్రారంభించారు. ‘గ్రీన్ బెల్ట్’ అనే ఆ ఉద్యమం ఇతర ఆఫ్రికన్ దేశాలకు వ్యాపించింది, మూడు కోట్లకు పైగా చెట్లను నాటడానికి దోహదపడింది. సుస్థిరాభివృద్ధి కోసం ఆమె చేసిన కృషికి నోబెల్ దక్కింది. 2011ఎల్లెన్ జాన్సన్ సర్లీఫ్ (1938 –), లైబీరియాఆఫ్రికాలో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన తొలి మహిళా దేశాధినేత. శాంతిని ప్రోత్సహించ డానికి, మహిళల హక్కుల కోసం పోరాడారు. 2005లో అధికారంలోకి వచ్చి, దేశంలో శాంతి సుస్థిరతకు, ఆర్థిక పురోగతికి, మహిళల హక్కుల కోసం పాటుపడ్డారు. ఇందుకే నోబెల్ పొందారు. ఇతర ఆఫ్రికన్ నాయకులకు ఆదర్శంగా నిలిచారు. ఎల్లెన్ జాన్సన్ సర్లీఫ్ అమెరికాలో చదువుకున్నారు. అక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. స్వదేశానికి తిరిగి వచ్చాక రాజకీయ ఉద్యమబాట పట్టారు. 2011లేమా బోవీ (1972–), లైబీరియాశాంతిని నెలకొల్పటానికి, మహిళల హక్కుల కోసం పోరాటం చేశారు. 1990లో లైబీరియాలో అంతర్యుద్ధంలో గాయపడిన బాల సైనికుల సంరక్షణ కోసం ట్రామా థెరపీలో శిక్షణ పొందారు. లేమా నేతృత్వంలోని ‘విమెన్ మాస్ యాక్షన్ ఫర్ పీస్’.. క్రైస్తవ, ముస్లిం మహిళల సంయుక్త ఆధ్వర్యంలో శాంతి, అహింసల సందేశాన్ని అందించే సమావేశాలను నిర్వహించారు. 2008లో, లైబీరియన్ అంతర్యుద్ధంలో మహిళల పోరాటంపై వచ్చిన అవార్డు డాక్యుమెంటరీ చిత్రం ‘ప్రే ది డెవిల్ బ్యాక్ టు హెల్‘లో లేమా కీలక పాత్ర పోషించారు. 2011తవక్కోల్ కర్మాన్ (1979–), యెమెన్జర్నలిస్ట్. యెమెన్స్ లో భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాల కోసం కృషి చేశారు. అధ్యక్షుడు సలేహ్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా అనేక నిరసనలకు నాయకత్వం వహించారు. ‘విమెన్ జర్నలిస్ట్స్ వితౌట్ చైన్స్ ్స’ అనే సంస్థను స్థాపించారు. ఉద్యమశీలిగా జైలు శిక్ష అనుభవించారు. హింసలకు గురయ్యారు. 2011లో షియా– సున్నీ ముస్లింల మధ్య; ఇస్లాం–ఇతర మతాల మధ్య సయోధ్యను ప్రోత్సహించడానికి ఆమె చేసిన ప్రయత్నాలు ప్రశంసలు అందుకున్నాయి. 2014 మలాలా యూసఫ్‌జాయ్ (1997–), యు.కె.ప్రతి చిన్నారికీ చదువుకునే హక్కు ఉందని పోరాడినందుకు మలాలాకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఆమె పాకిస్తాన్స్ లోని స్వాత్ లోయలో జన్మించారు. 2012లో తాలిబాన్లు పాఠశాల బస్సుపై కాల్పులు జరిపినప్పుడు మలాలా తలపై గాయమైంది. ఆమెకు వ్యతిరేకంగా ఫత్వా జారీ అవటంతో ఆమె బ్రిటన్‌లో ప్రవాసంలో నివసించాల్సి వచ్చింది. ఆమె తన 16వ పుట్టినరోజున ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలికల విద్యకు సమాన హక్కుల కోసం పిలుపునిచ్చారు. 2018నాదియా మురాద్ (1993–), ఇరాక్లైంగిక హింసను యుద్ధాలలో ఆయుధంగా ఉపయోగించటంపై పోరాటం చేశారు. ఇరవై ఒక్క ఏళ్ల నాదియాను, ఇతర యువతులను ‘ఐ.ఎస్.’ ఉగ్రవాదులు అపహరించి లైంగిక బానిసలుగా చేసుకున్నారు. కొన్ని నెలల తర్వాత, నాదియా తప్పించుకుని 2015లో జర్మనీ చేరుకున్నారు. ‘ది లాస్ట్ గర్ల్‘ అనే పేరుతో ఆత్మకథను రాశారు. తనపై జరిగిన దురాగతాలను అందులో వివరించడం ద్వారా, భవిష్యత్ తరాల బాలికలు, యువతులు యుద్ధంలో లైంగిక హింసకు బాధితులుగా మారకుండా ఉంటారని ఆకాంక్షించారు.2021మరియా రెస్సా (1963–), ఫిలిప్పీన్స్పత్రికా స్వేచ్ఛ కోసం పోరాడారు. ఫిలిప్పీన్స్ ్స డిలిమాన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన రెస్సా, సీఎన్ఎన్ స్థానిక కరస్పాండెంట్‌గా పనిచేశారు. ప్రధానంగా ఆగ్నేయాసియాలో ఉగ్రవాదం విస్తరించడంపై ప్రత్యేక వార్తా కథనాలు రాశారు. అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే పాలనాధికార దుర్వినియోగాన్ని, హింసాత్మకమైన నిరంకుశత్వాన్ని బహిర్గతం చేశారు. నకిలీ వార్తలను వ్యాప్తి చేయడానికి, ప్రత్యర్థులను వేధించడానికి డూటెర్టే సోషల్ మీడియాను ఎలా ఉపయోగిస్తున్నారో బయటపెట్టారు.∙∙ 2023నర్గేస్ మొహమ్మది (1972–), ఇరాన్ఇరాన్స్ లో మహిళలపై జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా 20 ఏళ్లకు పైగా పోరాడారు. మరణశిక్షలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ప్రభుత్వం ఆమెను 13 సార్లు అరెస్టు చేసి 31 సంవత్సరాల జైలు శిక్ష, 154 కొరడా దెబ్బలు విధించింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా ఎంపిక జరిగినప్పుడు ఆమె టెహ్రాన్స్ లోని ఎవిన్ జైలులో బందీగా ఉన్నారు. నర్గేస్ తన శాంతి బహుమతి గురించి మాట్లాడుతూ.. ‘‘ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వాల కోసం కృషి చేయటాన్ని నేను ఎన్నటికీ ఆపను..’’ అని వ్యాఖ్యానించారు. · సాక్షి, స్పెషల్ డెస్క్ -
శోకగర్భ
నుదుటి మీద అరచేయి అడ్డుపెట్టి, కళ్ళు విప్పార్చి, ఆకాశంలో ఎగిరే గెద్ద వేపు చూసే పిల్లల కోడిలా దూరంగా కన్పించే వ్యక్తులను ఆందోళనగా చూడసాగేడు మజ్జి సూరపు నాయుడు...వారం రోజులుగా యేదో వేళ, యెవరెవరో వస్తున్నారు. పొలాలను పరిశీలిస్తున్నారు, వెళ్తున్నారు. ఎవరితోనూ ఏమీ మాటాడడం లేదు. ‘వాళ్ళెవరు?’ ప్రశ్నార్థకంగా చూస్తున్న సూరపు నాయుడి చొక్కా జేబులోని సెల్ మోగింది. నుదుటి మీది అరచేయి తీసి, చొక్కా జేబులోని సెల్ తీసి పట్టుకొని... ‘‘అలో...ఎవుళూ’’ అని ప్రశ్నించాడు. అవతలి వ్యక్తి తాను ఎవరో చెప్పాడు. ‘‘నువ్వా?’’ అన్నాడు సూరపు నాయుడు. అవతలి వ్యక్తి యేమేమో చెప్తున్నాడు. నాయుడు అన్యమనస్కంగా వింటూ, దూరంగా కన్పించే వ్యక్తుల కదలికలు గమనిస్తున్నాడు.‘‘ఇంటన్నవా నా మాటలు? ఉలకవూ పలకవు. ఏటి చేస్తన్నావ్ బావా?’’ అని ప్రశ్నించాడు అవతలి వ్యక్తి.‘‘వోయ్... వోరమ్ రోజుల నించి పొలాలంట ఎవులెవులో తిరగతన్నారోయ్. ఏటో అనుమానంగా వుందోయ్. పొలాలకి గాలి వొచ్చీటట్టుగా వుందోయ్’’ – అని భయాన్ని వ్యక్తం చేశాడు నాయుడు.‘‘ఏనుగులో, ఎలుగుబంట్లో, జెంతువులేవో పొలాలంట తిరిగితే బయపడాల గాని మనుషులు తిరిగితే బయపడతావేటి బావా?’’ ‘‘జెంతువులయితే పంటల్ని తిని ఎలిపోతాయి, మనుషులు గాని అలికిడి అయితే పారిపోతాయి’’... అని బదులు చెప్తున్నాడు నాయుడు.‘‘అయితేటి ఆలెవులో పొలాల్ని వొట్టుకుపోతారా?’’‘‘వొట్టుకుపోరు, తీసీసుకుంటారు.’’‘‘ఇచ్చీ బావా, మంచి ధర గాని ఇస్తే ఇచ్చీబావా. ఏల ఏటా అప్పుల్ని పండిస్తావు? పిల్లల బతుకులు పాడు చేస్తావు. ఇచ్చీ, ఆ డబ్బు వొట్టుకొని ఇక్కడికి వొచ్చీ.’’సూరపు నాయుడిని వొచ్చేయమని పిలిచిన అవతలి వ్యక్తి సూరపు నాయుడి మేనమామ కొడుకు, పసరాపల్లి వూరివాడు.మేనమామకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఫోనులో మాటాడే అవతలి వ్యక్తి మేనమామ చిన్నకొడుకు, సూరపు నాయుడి కంటే నాలుగేళ్ళు పెద్ద. మేనమామ చనిపోయాక అతని ఇద్దరు కొడుకులు ఆస్తి వాటాలు వేసుకుని, వేరు కాపురాలు అయిపోయారు. పసరాపల్లి ప్రాంతాన థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రతిపాదన రావడం, ఆ ప్రాంత భూములను సేకరించడానికి ప్రభుత్వం పూనుకోవడం, రైతులు ప్రతిఘటించడం, పోలీసు కాల్పుల్లో తన అన్న చనిపోవడం, కేసులు, కోర్టులతో విసిగి, రెండు కుటుంబాలతో హైదరాబాద్ వలస వచ్చేశాడాయన. రెండు కుటుంబాలు కూలీ, నాలీ చేసుకు బతుకుతున్నాయి. తిప్పలెన్ని పడినా, తిండికీ, గుడ్డకీ లోటు లేకుండా గడిచిపోతున్నాయి రోజులు. అందుకే ఆయన సూరపునాయుడ్ని వొచ్చేయమన్నాడు. సూరపు నాయుడు ఆ వ్యక్తితో మాటాడుతూనే పొలం నుంచి వూరి గోర్జీ తోవలోకి నడిచాడు. నడుస్తున్న వాడు ఆగి – ‘‘ఏటివోయ్? పొలం అమ్మీసి, పట్నమొచ్చి ఆ డబ్బులు తిని కూకోమంటావా?’’ అని ప్రశ్నించాడు. ‘‘తిని కూకోడం ఏల బావా? పట్నంల వొవ్వో... బోల్డు పనులు... అపార్ట్మెంట్లల్ల వాచ్మెన్, పెద్ద పెద్దోల్ల బంగ్లాల గేటు కాపలా, యేదో చిన్నా చితకా ఫేక్టరీలల్ల లేబర్ ... ఇలాటివి దొరకవా?’’ అనన్నాడు. ‘‘దొరకవా అని నన్నడుగుతావు? నాకేటి తెలుసు?’’ ప్రశ్నించాడు సూరపు నాయుడు.అవతలి వ్యక్తి, ఆ ప్రశ్నను పట్టించుకోకుండా – ‘‘కాదంటావా... తాపీ పనికో, కళాసీ పనికో యెళ్తే డయిలీ ఇన్కమ్ బావా’’ – అని ఇంగ్లీషులో చెప్పాడు సూరపు నాయుడులో ఆశలు రగిలించడానికి.‘‘వోయ్... రైతోడు చేపలాంటోడువోయ్. పొలమొదిలేస్తే వొడ్డున పడ్డ చేప అయిపోతాడు’’... అన్నాడు నాయుడు. ‘‘వోస్... నీను మరి రైతుని కానేటి? భూమి పోయినపుడు వొచ్చీలేదేటి? వొచ్చిన తొలినాళ్ళు కసింత బెంగగా వుంటాది. ఏదో పని దొరికిన తరాత అలవాటయి పోతాది – వొచ్చీవోయ్. ఒచ్చీ. భూమి ఇచ్చీవోయ్ ఇచ్చీ, పరిహారం అందుకో. అందల కొంత సొమ్ముతో, కూతురుకి పెళ్లిచేసి, అత్తోరింటికి తోలీ. మిగిలిన సొమ్ము తీసుకొని, కొడుకుని తీసుకొని వొచ్చీ. ఆడికి ఆటో ఒకటి కొనీసి ఇచ్చీ. ఇక్కడ ఆటోకి మంచి గిరాకీ. ఇంకోపక్క నువ్వు ఏదో పనికి కుదిరి పోనావనుకో, ఇంక మరి సూడక్కర్లేదు మీకు’’... అని భవిష్యత్ ఆశాజనకంగా చెప్పాడు అవతలి వ్యక్తి. రాజకీయ నాయకులు, అధికారులు కూడా ఆశాజనకంగా చెప్తున్నారు. కంపెనీలు వొస్తే, ఉజ్జోగాలొస్తాయి. హోటళ్ళు, లాడ్జింగులు, బిల్డింగ్లు, రోడ్లుతో ప్రాంతం రూపురేఖలే మారిపోతాయ్ అంటన్నారు. సూరపు నాయుడికే ఏమీ తోచడం లేదు. నిలబడినవాడు, నడుస్తూ – ‘‘నాకు రైత్వారీ పని తప్ప, ఇంకొక పని రాదుగదా’’... అన్నాడు దిగాలుగా. ∙∙∙కొద్ది రోజులకు సూరపునాయుడు భయపడ్డట్టుగానే పొలాలను పరిశీలించిన వారు పొలాలను ఏదో కర్మాగారం కోసం తీసుకున్నారు. రైతులు కొన్నాళ్లు వ్యతిరేకించారు. పోరాడేరు గాని, కొసకు భూములు ఇవ్వక తప్పలేదు. మేనమామ చిన్న కొడుకు చెప్పినట్టే సూరపు నాయుడు ఆడపిల్ల పెళ్లి చేసి, తరవాత కొడుకుని పట్టుకొని హైదారాబాద్ వెళిపోయాడు. మిగిలిన సొమ్ము ఆటో కొనడానికి చాలలేదు, కొంత ఫైనా¯Œ ్స వాడేడు. కొడుకు ఆటో తిప్పుతూ ఫైనా ్స నక్షత్రకుడికి కిస్తీలు కడుతున్నాడు. సూరపు నాయుడు రకరకాల కూలిపనులు చేస్తూ చివరికి ఒక కోటీశ్వరుని ఇంటనున్న రెండు కుక్కల ఆలనా పాలనా చూడడానికి కుదురుకున్నాడు. పొద్దున్న ఏడో గంటకి ఆ కోటీశ్వరుని ఇంటికి చేరితే, రెండు కుక్కలూ రెడీగా ఉంటాయి షికారుకి. షికారుకి వెళ్ళినపుడే అవి ఒంటికీ, రెంటికీ కానిస్తాయి. సూరపు నాయుడే వాటిని శుభ్రం చేయాలి. రెండూ నాయుడి భుజాల దగ్గరకు ఉంటాయి. నాయుడి కంటే బలంగా ఉంటాయి. ఉండవా మరి? అవి తినేవో? మన్లాగా అంబలీ, గెంజీ తాగుతాయేటి? అనుకున్నాడు నాయుడు. తొలినాళ్ళల్లో నాయుడు వాటిని తిప్పడానికి నానా అవస్థలు పడ్డాడు. వాట్ని చూసి భయపడ్డాడు. ‘బేపుల్లాగా లేవివి, బెమ్మ రాచ్చసుల్లాగ వున్నాయి’ అనుకునీవోడు. రాన్రాను మచ్చికయినాయి. కోటీశ్వరుని ఇంటిలో విని నేర్చుకున్న ఇంగ్లీషు పదాలతో... ‘కమాన్, గో,గో, వెయిట్, వెయిట్’ వంటి ఆర్డర్లు వేస్తున్నాడు. షికారుకి కుక్కల్ని తీసుకు వెళ్ళే సమయంలో ఆపుడపుడూ వాటితో ఊసులాడుతుంటాడు. అవి కూడా సూరపు నాయుడి ‘ఊరు ఎలా ఉంటుంది? నగరంలా బాగుంటుందా? అన్నీ పూరిపాకలేనా,పెద్ద,పెద్ద భవంతులుంటాయా? అక్కడ మాలాంటి డాగ్స్ ఉంటాయా?’ అని ప్రశ్నించేవి. సూరపు నాయుడికి ఆ ప్రశ్నలకు జవాబులు చెప్తుంటే పల్లెకూ, నగరానికీ మధ్య అంతరం తెలిసొచ్చేది. దాంతో విచారంగా మౌనంగా నడిచేవాడు. మౌనంగా నడిచే నాయుడిని – ‘మీ ఊరిలో మాలాటి డాగ్స్ లేవుకదా’, ఉండబోవన్న ధీమాగా ప్రశ్నించేవి ఆ కుక్కలు.అప్పుడు... ‘మా ఊరిలో మిమ్మల్ని డాగ్స్ అనరు. బేపులు అంటారు’... అని చెప్పి, తమ ఊరి బేపులెలాగుంటాయో, ఎంత మంచివో, ఇళ్లనీ, ఊరినీ ఎలాగ కాపలా కాస్తాయో చెప్పేవాడు. వాటిని మనుషులు ఎవులో తిప్పక్కర లేదనీ, అవే తిరగతాయనీ, తిండీ ఒకలెవులో తెచ్చి పెట్టక్కర లేదనీ, అవే సంపాయిస్తాయనీ... చెప్పేవాడు. అపుడు ఆ కుక్కలు నిసాకారంగా సూరపు నాయుడి వేపు చూసి – ‘మీ వూరి వాళ్ళు వాటికి తిండీ, తిప్పలు చూడరా? ఏం మనుషులోయ్’ అననేవి. ‘మా వూళ్ళంట బేపులకి మెడలకి బెల్టులు, గొలుసులూ కట్టరు. ఫ్రీగా వొదిలేస్తారు. ఆటి ఇష్టం ఇళ్ళల్లోకి దూరతాయి, వీధుల్లో తిరగతాయి, ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎళ్తాయి, కట్టడి వుండదాటికి. సిత్త కార్తే వొచ్చిందంటే ... సూడాల ఆటి బాగోతం’ అననేవాడు. ఆ కుక్కలకు ఆ బాగోతం ఏమిటో తెలీలేదు గానీ, ఈ నాయుడోడు వాడి వూరి బేపులు తమ కంటే గొప్పవి సుమా అని తమకు చెప్తున్నాడని భావించి, చిరాకెత్తి, కోపగించి, భౌభౌభౌ అని అరచి తమ నిరసన తెలియ జేసేవి. ∙∙∙కొన్నాళ్ళకు నగరంలో బతకటానికి అలవాటుపడ్డాడు సూరపు నాయుడు. నగరం భయపెట్టటం లేదు. భద్రం కొడుకో అని హెచ్చరిక చేస్తోంది. కిక్కిరిసిన జన సమూహంలో ఒంటరివే సుమా అన్న ఎరుకను కలిగించింది. ఒంటరితనం పోగొట్టుకోడానికి అపుడపుడూ తన మేనమామ చిన్నకొడుకుని కలుస్తుంటాడు. ఇద్దరూ కాసేపు తమ గత జీవనాన్ని, తమ తాత, ముత్తాతల తరతరాల జీవనాన్ని ఎరిగిన మేరకు కలబోసుకుంటారు. తామే కాక తమ ప్రాంత జనులంతా శాపగ్రస్తులనీ, ఒడ్డు కనిపించని ప్రవాహంలో ఈదులాడే వాళ్ళనీ... తమ ప్రాంతం చిరకాల శోకగర్భ ప్రాంతమని చింతిస్తారు.కడుపులు కెరలిపోతాయి. ఊరట కోసం సారా కొట్టు చేరుతారు. అపుడపుడూ వీరికి తోడు వీరిలాగే వలస వచ్చిన వాళ్ళు ఎవరో తోడవుతారు. వాళ్లూ లోపలి శోకాన్ని వెళ్లగక్కుతారు... అవెంతో గొప్ప అడివిలున్నాయి. సాగరతీరమా ఎక్కవే వుంది, సారవంత బూములున్నాయి... ఎందుకు మనం ఇలగ వొలసలు రావలసొచ్చింది? ఎందుకు? అక్కరకు రాని కంపెనీల బదులు నదులకి ఆనకట్టలు, పంటలకి కిట్టుబాటు ధరలందితే, జనప, చెరకు వంటి పంటల మీద మిల్లులెడితే మనకీ దుర్గతి రాదుగదా – అని విలపిస్తారు.మద్యపాన దుకాణాల్లో కడుపుల్లోకి మద్యం వెళ్తుంది, గానీ, లోపలి దుఖం బయటకు వెళ్ళదు. మత్తు ఎక్కినా, నొప్పి ఏదో మోస్తూ, తూలుతూ ఇళ్ళు చేరుతారు.అయిదేళ్లు గడిచిపోయాయి. ఎన్నికల ప్రకటన వచ్చింది. తమలాగా నగరానికి వలస వచ్చిన వారికోసం పోటీ చేసిన ప్రధాన పార్టీల వారు బస్సులు వేశారు. వోట్ల కోసం సరఫరా చేయాల్సినవన్నీ చేశారు. ఆ బస్సుల్లో సూరపు నాయుడి కుటుంబమే కాక, ఆ ప్రాంతపు కుటుంబాలు మరికొన్ని ప్రయాణించాయి. ఆ కుటుంబాలు చీపురుపల్లి, రణస్థలం, భోగాపురం తదితర ప్రాంతాల నుండి వలస వచ్చినవి. ప్రయాణం మధ్యలో భోజనాలకు ఆగినపుడు మరికొన్ని బస్సుల్లో మరికొన్ని కుటుంబాలు కలిశాయి. అవి అటు పార్వతీపురం పరిసరాల నుండి ఇటు అనకాపల్లి, చోడవరం, అరకు ప్రాంతాల నుండి వచ్చినవి. కళింగం అంతా దాదాపు వలసలు పోయిందా ఏటి అన్పించింది సూరపు నాయుడికి. ఓటు వేశాక వెంటనే బయల్దేరలేదు. రెండు రోజులు వుండిపోయాడు. ఫ్రీ బస్సులు వెలిపోయాయి. స్వంత వూరిలో ఒకరోజు వున్నారు..స్వంత వూరు రూపు రేఖలు మారిపోయాయి, ఊరినిండా ఏవేవో బిల్డింగులు, దుకాణాలు, ఆఫీసులు... ఒంటినిండా పచ్చబొట్లు పొడుచుకున్న అమ్మవారిలా వుంది ఊరు. పరాయి ఊరులా అన్పించీ, మరసటి రోజే కూతురి వూరు వెళిపోయారు.కూతురి ఊరు ఉద్దాన ప్రాంతం. అరటి, కొబ్బరి, పనస, జీడి తోటలతో ఆకుపచ్చగా ఉంటుంది. కూతురి అత్తవారికి ఒక ఎకరా తోట వుంది. అత్త, మామలు ఉన్నారు. రెండు గదుల ఇల్లుంది. అల్లుడు కష్టజీవి. తోట మీద ఫలసాయంతో ఇబ్బందులు లేకుండా బతుకుతున్నారు. కూతురికి మూడేళ్ళ కొడుకు. ఇపుడు గర్భిణీ. పలాసలో ఏవో స్వీట్స్, పళ్ళు కొని తీసుకు వెళ్లారు. రాత్రివేళ భోజనాలయ్యాక కూతురి కాపురం బాగుందని సంతోషించిన సూరపు నాయుడు – ‘‘ఎంతయినా మీ ఉద్దానం మా మడక కంటే శ్రేష్టమైనిది’’ అనన్నాడు. ‘‘నిజిమే గాని, ఇక్కడి బతుకులూ గాలిలో దీపాలే మామా, చేతులు అడ్డుబెట్టి దీపాలు ఆరకుండా సూస్తన్నాం’’ అని బదులిచ్చాడు అల్లుడు. కలుక్కుమన్నాది సూరపునాయుడి గుండె. ‘‘తుఫానులు, మార్కెట్లూ దెబ్బగొడతన్నా కాసుకుంటన్నాంలే’’ అనన్నాడు అల్లుడు. ఆ మాటతో కాస్త ఊరట చెందాడు నాయుడు.ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. మరో ఏడాది గడిచింది. రోజు పొద్దుటి పూట. కోటీశ్వరుని కుక్కలకు ఫుడ్ పెడుతుండగా సూరపు నాయుడికి ఫోన్ వచ్చింది.జేబులో ఫోన్ తీసి – అలో అన్నాడు ‘..నీను మామా...’ అన్నాడు అల్లుడు అవతల నుంచి ‘... నువ్వా? బాగున్నావా నాయినా? మాయమ్మీ,పిల్లలూ బాగున్నారా? ‘...ఆ, ఆ, అంతా బాగున్నాం, గానీ...’‘...ఆ..కానీ..?’ఆందోళనగా అడిగాడు సూరపునాయుడు. ‘మేమూ అక్కడకి వలస వొచ్చేస్తాము. మీకు తెలిసిన వోరి దగ్గిర ఏదేనా పని చూడు మామా, వొచ్చేస్తాము...’ ‘...వొచ్చెత్తారా? ఏమీ? మీ తోటలూ, దొడ్లూ ఏటి చేస్తారు?’ ‘...ఏదో పెద్ద కంపెనీ వొస్తందట, ఇంకోపక్క విమానాశ్రయం కడతారట... ఆటికి భూమి కావాలగదా? దగ్గిర, దగ్గిర మా మడకల నాలుగైదు ఊళ్లు ఖాళీ అయిపోతాయి... తొందరగా ఏదేనా పని చూడు మామా...’ ఎలుగుగొడ్డు ఏదో గోళ్ళతో తన గుండెను రక్కినట్టన్పించింది సూరపునాయుడికి. అల్లుడికి ఏమి చెప్పాలో తెలీక, మౌనంగా ఉండిపోయాడు. ఆ సమయంలోనే యజమాని వచ్చి, ఏదో పేకెట్ చేత్తో పరిశీలిస్తూ – ‘‘ఓయ్, నాయుడూ, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పేకెట్ తెచ్చీసావోయ్. ఇది డాగ్స్‌కి పెట్టకు సుమీ. షాప్ వాడికి రిటనిచ్చేయి’’ అనన్నాడు. నాయుడికి అర్థం కాలేదు. అవతల ఫోన్లో అల్లుడు ఏదో చెప్తున్నాడు, అయోమయంగా చూశాడు యజమాని వేపు. ‘‘...ప్రతీ దానికీ కొన్నాళ్లే గడువు వుంటుంది..’’ అని యజమాని పేకెట్లో తేదీని చూపి – ‘‘ఈ తేదీ దాటినాక ఇది వాడకూడదు... వాడితే డేంజర్’’ అని విడమరిచాడు.యజమాని వివరణ, అల్లుడి సంభాషణ, నాయుడి మనసులో ప్రశ్నలు రేపాయి. –‘ఈ ఎక్స్పైరీ డేట్ అనేది మాకూ, మా వలస బతుకులకీ ఉండదా?’ నిజానికి సూరపు నాయుడు మనసులో ఆ ప్రశ్న అనుకున్నాడు కాని, అసంకల్పితంగా నోటి నుండి బయటకి వచ్చేసింది. ఆ యజమానికి ఏమీ అర్థం కాలేదు. ‘‘ఏమిటోయ్ నాయుడూ? ఏమంటున్నావ్?’’ అని ప్రశ్నించాడు.శోకంతో పూడుకు పోయిన సూరపు నాయుడి గొంతు పెగలలేదు, మౌనంగా ఉండిపోయాడు. కొన్నాళ్ళకు నగరంలో బతకటానికి అలవాటుపడ్డాడు సూరపు నాయుడు. నగరం భయపెట్టటం లేదు. భద్రం కొడుకో అని హెచ్చరిక చేస్తోంది. కిక్కిరిసిన జన సమూహంలో ఒంటరివే సుమా అన్న ఎరుకను కలిగించింది. -
తరం తడబాటు
ఈ లెక్కలన్నీ ఏం చెప్తున్నాయి?. యువత, విద్యార్థుల మానసిక ఆరోగ్యం ప్రజా సమస్యగా మారుతోందని. ఇవి ఏవో కాకి లెక్కలు కాదు, ప్రతిష్ఠాత్మక జాతీయ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వెల్లడైన విస్తుగొల్పే వాస్తవాలు. విద్యాపరమైన ఒత్తిడి, తల్లిదండ్రుల ఆశలు, అధిక పోటీతో కూడిన విద్యా వ్యవస్థ విద్యార్థుల్లో ఆందోళన, నిస్ప ృహ, ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ సంక్షోభం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తోంది, ముఖ్యంగా యువతలో ఆత్మహత్యల రేటు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.విద్యార్థుల మానసిక ఆరోగ్య సంక్షోభంపై గణాంకాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకారం భారతదేశంలో ఆత్మహత్యల రేటు విద్యార్థుల్లో స్థిరంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 2022 సంవత్సరంలో 13,000 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, అంటే ప్రతిరోజూ సగటున 35 మంది విద్యార్థులు ప్రాణాలను తీసుకున్నారు. 2022లో దేశంలో జరిగిన మొత్తం ఆత్మహత్యలలో విద్యార్థుల ఆత్మహత్యలు 7.6%. గత పదేళ్లలో (2013–2022) విద్యార్థుల ఆత్మహత్యలు 64% పెరిగాయి. ఈ సంఖ్య 6,654 నుండి 13,044కు చేరింది. భారతదేశంలోని 30 విశ్వవిద్యాలయాలలో 2024లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రతి పదిమంది విద్యార్థులలో ఒకరికి గత సంవత్సరంలో ఆత్మహత్య ఆలోచనలు వచ్చాయి. వీరిలో మూడింట ఒక వంతు మంది ఆత్మహత్యకు ప్రయత్నించారు.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం పరీక్షల్లో వైఫల్యం ఆత్మహత్యలకు ఒక కారణం. రాజస్థాన్‌లోని కోటా సహా కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి పొందిన నగరాల్లో ఈ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి.పాఠశాల పిల్లల్లో కూడా.. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్) నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలోని 23% మంది పాఠశాల విద్యార్థులు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ‘నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్’, సీబీఎస్ఈ సంస్థలు పాఠశాలల్లో నిర్వహించిన ఒక సర్వేలో 13–17 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులలో 81% మందికి పరీక్షల ఒత్తిడి ప్రధాన సమస్యగా ఉందని వెల్లడైంది. యూనిసెఫ్ 2021 నివేదిక ప్రకారం, భారతదేశంలో 15–24 సంవత్సరాల వయస్సు గల యువతలో 14% మంది తరచుగా ఆందోళన లేదా డిప్రెషన్ వంటి వాటితో బాధపడుతున్నారు.విద్యార్థుల్లో మానసిక అనారోగ్య లక్షణాలు ఇలా ఉంటాయి. వీటిలో కొన్ని దీర్ఘ కాలం కనిపిస్తే వారిలో మానసిక సమస్య ఉందని అంచనా వేయవచ్చు. నిపుణుల సాయం తీసుకునేలా ప్రోత్సహించవచ్చు. భావోద్వేగ ప్రవర్తన మార్పులునిరంతర విచారం, నిస్సహాయత భావన. ఎక్కువగా చిరాకు పడడం, కోపం లేదా మూడ్ స్వింగ్స్. · ఒకప్పుడు ఆనందించిన కార్యకలాపాల పట్ల ఆసక్తి కోల్పోవడం. · స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి దూరంగా ఉండడం. ·సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండడం. · విపరీతమైన భయం, ఆందోళన లేదా ఆందోళనతో కూడిన దాడులు.మానసిక, శారీరక లక్షణాలునిద్ర, ఆకలిలో మార్పులు (ఎక్కువ నిద్ర పోవడం లేదా నిద్రలేమి, తక్కువ లేదా ఎక్కువ తినడం). ·ఏకాగ్రత, జ్ఞాపకశక్తి సమస్యలు.గతంలో సులభంగా చేసిన పనులను పూర్తి చేయడంలో ఇబ్బంది.·తీవ్రమైన తలనొప్పి లేదా కడుపు నొప్పులు వంటి వివరించలేని శారీరక నొప్పులు. ఆత్మ గౌరవం కోల్పోవడం లేదా నిస్సహాయత భావన. ·ఆత్మహత్య ఆలోచనలు లేదా మరణం గురించి ఆలోచించడం.అకడమిక్, ప్రొఫెషనల్ లక్షణాలుచదువులో గణనీయమైన క్షీణత.పాఠశాల పని పట్ల ఆసక్తి తగ్గడం.తరగతులకు హాజరు కాకపోవడం.పాఠశాల పనితీరులో ఆకస్మిక మార్పులు.అవగాహన అంతంత మాత్రమే! ఓ పక్కన మానసిక ఆరోగ్య సమస్యలు యువతను కారుమబ్బుల్లా కమ్మి వేస్తుంటే, మానసిక ఆరోగ్య సేవలపై అవగాహన రాహిత్యం కనిపిస్తోంది. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ నిర్వహించిన 2023 సర్వే ప్రకారం, దాదాపు 70 శాతం మంది విద్యార్థులు మానసిక ఆరోగ్య సహాయం కోరితే తోటివారి నుండి ప్రతికూలతను ఎదుర్కొంటారని భయపడుతున్నారు.‘ది జర్నల్ ఆఫ్ అమెరికన్ కాలేజ్ హెల్త్’ నివేదిక ప్రకారం, కేవలం 50 శాతం మంది విద్యార్థులకు మాత్రమే తమ క్యాంపస్‌లో కౌన్సెలింగ్ సేవలు ఉన్నట్లు తెలుసు. ఇది కౌన్సెలింగ్ సేవల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరానికి నిదర్శనంగా నిలుస్తోంది.అసలు శత్రువు అదే! యువత, విద్యార్థుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు పెచ్చరిల్లడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ సోషల్ మీడియా వ్యసనం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ‘ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ’ నిర్వహించిన సర్వే ప్రకారం యువతలో 70 శాతం రోజుకు మూడు నుంచి నాలుగు గంటలకు మించి ఫోన్ వాడుతున్నారు. అందులో ఎక్కువగా సోషల్ మీడియాను చూస్తున్నారు. దీనితో ప్రతి ఐదుగురులో ఒకరు డిప్రెషన్ లేదా ఆందోళన బారిన పడుతున్నారు. వ్యసనంగా ఇలా.. మొబైల్ ఫోన్ల వాడకం పెరగడంతో సోషల్ మీడియా వ్యసనం తీవ్రమైన సమస్యగా మారుతోంది. ఈ వ్యసనం కేవలం ఒక అలవాటు కాదు, ఇది మెదడు పనితీరును మార్చే ఒక న్యూరోసై¯Œ ్స ప్రక్రియ. సోషల్ మీడియా వ్యసనానికి ప్రధాన కారణం మన మెదడులోని డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్. డోపమైన్ ఆనందం, సంతృప్తి, ప్రోత్సాహంతో ముడిపడి ఉన్న ఒక రసాయనం. మనం ఏదైనా సంతోషకరమైన పని చేసినప్పుడు, ఇష్టమైన ఆహారం తిన్నప్పుడు లేదా ప్రశంసలు పొందినప్పుడు, మెదడులోని రివార్డ్ సిస్టమ్ డోపమై¯Œ ను విడుదల చేస్తుంది. సోషల్ మీడియాలో ప్రతి లైక్, కామెంట్, షేర్, కొత్త నోటిఫికేషన్ చిన్నపాటి రివార్డ్‌గా పనిచేస్తుంది. ఈ రివార్డ్‌లు డోపమైన్ విడుదలను ప్రేరేపిస్తాయి. యువత మెదడు ఎక్కువ డోపమైన్ పొందడం కోసం నిరంతరం సోషల్ మీడియాను చెక్ చేసుకునేలా అలవాటు పడుతుంది. ఈ నిరంతర ప్రేరణతో మెదడులో డోపమైన్ రిసెప్టర్లు సున్నితత్వాన్ని కోల్పోతాయి, దాంతో మరింత ఎక్కువ డోపమైన్ కోసం మెదడు ఆరాటపడుతుంది. ఇదే వ్యసనానికి దారి తీస్తుంది.మానసిక ఆరోగ్యం మటాష్!సోషల్ మీడియా మన జీవితాల్లో అంతర్భాగంగా మారింది. యువతపై దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఇది సమాచారాన్ని పంచుకోవడానికి, స్నేహితులతో కనెక్ట్ కావడానికి ఒక వేదికగా ఉన్నప్పటికీ, దాని ప్రతికూల ప్రభావాలు మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన సవాళ్లను సృష్టిస్తున్నాయి. వివిధ సర్వేలు, అధ్యయనాలు యువతపై సోషల్ మీడియా ప్రభావం ఎంత ప్రమాదకరంగా ఉందో తెలియజేస్తున్నాయి.ఒక సర్వే ప్రకారం, భారతదేశంలోని ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకరు సోషల్ మీడియాకు బానిసలు అవుతున్నారు. దాదాపు 46 కోట్ల మంది సోషల్ మీడియా వినియోగదారులు ఉన్న భారతదేశంలో ఇది ఒక ప్రధాన సమస్యగా మారింది.యువతలో 27% మంది సోషల్ మీడియాపై ఆధారపడే లక్షణాలను చూపిస్తున్నారని అధ్యయనాలు వెల్లడించాయి. సోషల్ మీడియాను రోజుకు 3 గంటలకన్నా ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.సోషల్ మీడియాలో ఇతరుల ‘పరిపూర్ణమైన‘ జీవితాలను చూసి తమను తాము పోల్చుకోవడంతో యువతలో ఆత్మన్యూనత భావన పెరుగుతోంది. ఇది అసూయ, అసంతృప్తి, ఒత్తిడికి కారణమవుతోంది. ఆన్లైన్ వేధింపులు, బెదిరింపులు యువతలో తీవ్రమైన మానసిక క్షోభను కలిగిస్తున్నాయి. వీటి వల్ల వారు నిస్పృహకు, ఆందోళనకు గురవుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో చూసే అందమైన ఫోటోలు, వీడియోల వల్ల యువత ముఖ్యంగా మహిళలు, తమ శరీర రూపాన్ని గురించి ఆందోళన చెందుతున్నారు. భారత యువతుల్లో 36 శాతం మంది బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్‌తో బాధపడుతున్నారని ఒక సర్వే వెల్లడించింది. ఇది బులీమియా, అనోరెక్సియా నెర్వోసా లాంటి ఈటింగ్ డిజార్డర్స్కు దారి తీస్తోంది.యువతలో 27% మంది సోషల్ మీడియాపై ఆధారపడే లక్షణాలను చూపిస్తున్నారని అధ్యయనాలు వెల్లడించాయి. సోషల్ మీడియాను రోజుకు 3 గంటలకన్నా ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.మెదడులో మార్పులుసోషల్ మీడియా వ్యసనం మెదడులోని వివిధ భాగాలపై ప్రభావం చూపుతుంది.ప్రీఫ్రంటల్ కార్టెక్స్ భాగం నిర్ణయాలు తీసుకోవడం, ఆలోచనా శక్తి, ప్రేరణ నియంత్రణ వంటి కీలకమైన విధులను నిర్వహిస్తుంది. సోషల్ మీడియాకు ఎక్కువగా అలవాటుపడిన వారిలో ఈ భాగం బలహీనపడుతుంది. దీనివల్ల వారు తమ ఫో¯Œ ను వాడటాన్ని నియంత్రించుకోలేరు, త్వరగా నిర్ణయాలు తీసుకోలేరు, ఏకాగ్రతను కోల్పోతారు.అమిగ్డాలా భావోద్వేగాలను నియంత్రించే మెదడు భాగం. సోషల్ మీడియాలో చూసే ప్రతికూల విషయాలు అమిగ్డాలాను నిరంతరం ప్రేరేపిస్తాయి. ఇది ఆందోళనకు, డిప్రెష¯Œ కు దారితీస్తుంది.హిప్పోకాంపస్ భాగం జ్ఞాపకశక్తికి, నేర్చుకోవడానికి సహాయపడుతుంది. సోషల్ మీడియాకు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల హిప్పోకాంపస్ పనితీరు తగ్గుతుంది, ఇది చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.సుప్రీం కోర్టు దిశానిర్దేశంయువత మానసిక ఆరోగ్య సమస్యలకు సోషల్ మీడియాతో పాటు మారిన జీవనశైలి, సామాజిక పరిస్థితులు కూడా కారణం. దీనికి తోడు నిపుణుల కొరత, నిధుల కొరత కూడా వారికి సరైన వైద్య సేవలు అందకుండా చేస్తున్నాయి. దేశంలో మానసిక ఆరోగ్య నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ‘నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే’ ప్రకారం ప్రతి లక్ష జనాభాకు కేవలం సరాసరిన 0.7 శాతం మంది మానసిక వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారు. సైక్రియాట్రిస్ట్లు 0.75 శాతం, క్లినికల్ సైకాలజిస్టులు 0.07 శాతం వరకు అందుబాటులో ఉన్నారు. మన దేశంలో సైకాలజిస్టులకు ఇప్పటి వరకు చట్టపరమైన గుర్తింపు ప్రక్రియ లేకపోవడంతో వారికి సంబంధించిన లెక్కలు లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం లక్ష మందికి కనీసం ముగ్గురు ఉండాలి. ప్రపంచ సగటుతో పోలిస్తే మానసిక సేవలు మన దేశంలో చాలా తక్కువగా అందుబాటులో ఉన్నాయి. మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. సైకియాట్రీ, సైకాలజీ కోర్సులకు తగినంత ప్రోత్సాహం లేకపోవడం, శిక్షణ పొందిన నిపుణులు అందుబాటులో లేకపోవడం ప్రధాన కారణం. ఆరోగ్య సంరక్షణలో మానసిక ఆరోగ్యానికి చాలా తక్కువ నిధులు కేటాయిస్తున్నారు. 2025 కేంద్ర బడ్జెట్లో మానసిక ఆరోగ్య సేవలకు కేవలం 1,004 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది మొత్తం ఆరోగ్య రంగానికి కేటాయించిన బడ్జెట్లో ఒక శాతం. ఇందులో కూడా 860 కోట్లు బెంగుళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్)కు, రూ. 80 కోట్లు ‘టెలిమానస్’కు కేటాయించడంతో మానసిక ఆరోగ్య సేవలు యువతకు చేరడం సాధ్యపడటం లేదు.నానాటికీ పెరిగిపోతున్న యువత, విద్యార్థుల ఆత్మహత్యలు, వారి మానసిక క్షేమంపై ఇటీవల సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విద్యా సంస్థలు తీసుకోవాల్సిన చర్యలను నిర్దేశించింది.ప్రతి వందమంది విద్యార్థులకు ఒక కౌన్సెలర్‌ను నియమించాలి. ఏడాదిలో రెండుసార్లు టీచర్స్‌కు, ఇతర సిబ్బందికి విద్యార్థుల మానసిక ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించాలి. విద్యా సంస్థల్లో సైకలాజికల్ కౌన్సెలింగ్ సేవలను అందుబాటు ఉంచాలి, ఆ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలి. విద్యార్థులపై అకడమిక్ విషయంలో ఎలాంటి లేబుల్స్ వేయకూడదు. విద్యేతర విషయాల్లో ప్రోత్సహించాలి. ర్యాగింగ్, లైంగిక వేధింపులు వంటి వాటిపై సత్వరమే స్పందించే వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. హెల్ప్ లైన్ నంబర్స్ అందరికీ కనిపించేటట్లు బోర్డులు ఏర్పాటు చేయాలి. పేరెంట్స్‌తో తరచుగా సమావేశాలు నిర్వహించి విద్యార్థుల్లో మానసిక అనారోగ్య లక్షణాలు గుర్తించే విధంగా అవగాహన కల్పించాలి. సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలతో పాటు విద్యార్థుల్లో, టీచర్స్‌లో మానసిక ఆరోగ్య సేవలపై ఉన్న అపోహలను పోగొట్టగలిగితే స్వామి వివేకానంద చెప్పినట్లుగా వజ్ర సంకల్పం, ఉక్కు నరాలు ఉన్న యువ భారతాన్ని చూడొచ్చు. రచయిత: జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, అడ్వాన్స్డ్ సైకలాజికల్ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఏ ఇండియా) -
ఆహ్వానించి అపహరణ!
వీరారెడ్డి పేరుతో ఇల్లు, ఇల్లాలు, వాహనం, జైల్లో పరిచయమైన అనుచరులను సిద్ధం చేసుకున్న గౌరు సురేష్– ఆ తర్వాత ఎవరిని కిడ్నాప్ చేసి డబ్బు గుంజాలనేది ఆలోచించాడు. ఏమాత్రం ఇబ్బంది, హడావుడి లేకుండా పని జరగాలంటే, హైదరాబాద్‌కు చెందిన వారు కాకపోతేనే ఉత్తమమని భావించాడు. తన ‘భార్య’తో తిరుమలకు వెళ్లిన గౌరు సురేష్ అక్కడి నుంచి తిరిగి వస్తూ తిరుపతికి చెందిన వ్యాపారి గంగయ్యను టార్గెట్‌గా చేసుకున్నాడు. హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత ఓ డ్రైఫ్రూట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి దానికి అతడే వైస్ ప్రెసిడెంట్‌గా మారి, విజిటింగ్ కార్డులు సిద్ధం చేసుకున్నాడు. మరోసారి తిరుపతి వెళ్లిన సురేష్– గంగయ్యను కలిసి తనను తాను పరిచయం చేసుకున్నాడు. త్వరలో హైదరాబాద్‌లో డ్రైఫ్రూట్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నానని, తప్పకుండా రావాలని చెప్పి ఆహ్వానపత్రం అందించాడు. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోని గంగయ్య దీనిని మరచిపోయాడు. కిడ్నాప్ పథకాన్ని అమలులో పెట్టడానికి సురేష్– గంగయ్య పేరుతో తిరుపతి నుంచి హైదరాబాద్‌కు విమానం టిక్కెట్, తాజ్ కృష్ణలో ఓ గదిని బుక్ చేశాడు. ఎగ్జిబిషన్ పేరుతో ఆహ్వానపత్రిక ముద్రించి, ఇవన్నీ కొరియర్ ద్వారా గంగయ్యకు పంపాడు. గంగయ్యకు సురేష్ ఫోన్ చేసి, తప్పకుండా రావాలని, ఎయిర్‌పోర్టుకు కారు పంపిస్తానని చెప్పాడు. దీంతో గంగయ్య తాను హైదరాబాద్ వచ్చేటప్పుడు వీరారెడ్డి అవతారంలో ఉన్న సురేష్‌కు చెప్పాడు. గంగయ్య వచ్చేరోజు వెంకటరెడ్డి వద్దకు వెళ్లిన సురేష్, భార్యతో కలసి బయటకు వెళ్లడానికంటూ కారు తీసుకున్నాడు. ఆ కారులో విమానాశ్రయానికి వెళ్లి, గంగయ్యను రిసీవ్ చేసుకున్నాడు. ఎగ్జిబిషన్ పనుల్లో తలమునకలై ఉన్నానని, ఉప్పల్‌లో చిన్న పని చూసుకుని వెళ్దామని సురేష్ నమ్మబలికాడు. అలా అతడిని వారాసిగూడలోని మల్లారెడ్డి ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న గ్యాంగ్‌కు గంగయ్యను అప్పగించి, తాను చెప్పే వరకు జాగ్రత్తగా చూసుకోవాలంటూ తన ఫ్లాట్‌కు వెళ్లిపోతూ వెంకట్‌రెడ్డికి కారు అప్పగించేశాడు. గంగయ్య నుంచి అతడి సోదరుడి ఫోన్ నెంబర్ తీసుకున్న సురేష్, ‘మీ అన్నను కిడ్నాప్ చేశామని, విడిచిపెట్టాలంటే రూ.30 లక్షలు ఇవ్వాల’ని డిమాండ్ చేశాడు. విషయం ఏమాత్రం బయటకు వచ్చినా హైదరాబాద్ శివార్లలో గంగయ్య శవం పడి ఉంటుందని భయపెట్టాడు.ఈ ఫోన్ కాల్‌తో భయపడిన గంగయ్య సోదరుడు విషయం పోలీసులకు చెప్పకుండా, డబ్బు కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. డబ్బు సిద్ధం చేసుకోవడానికి అతడు రెండుమూడు రోజుల పాటు పలువురిని సంప్రదించాడు. ఇలా విషయం బయటకు రావడంతో చిత్తూరు పోలీసులు రంగంలోకి దిగి, గంగయ్య సోదరుడి నుంచి వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నించారు. అయితే తన సోదరుడికి హాని జరుగుతుందనే భయంతో విషయం పోలీసులకు చెప్పడానికి గంగయ్య సోదరుడు వెనుకాడాడు. దీంతో అతడి కదలికలపై పోలీసులు నిఘా వేసి ఉంచారు.తన అన్నను విడిపించుకోవడానికి రూ.30 లక్షలు సిద్ధం చేసిన గంగయ్య సోదరుడు ఫోన్ చేసి సురేష్‌కు విషయం చెప్పాడు. ఎవరికీ చెప్పకుండా ఒక్కడివే బయలుదేరి రావాలని, భారత్ ట్రావెల్స్ బస్సులో సీట్ నెం.17 బుక్ చేసుకోవాలని, జడ్చర్ల వద్ద బస్సు దిగిపోవాలని సూచనలు ఇచ్చాడు. ఏమాత్రం తేడా వచ్చినా గంగయ్య ప్రాణాలతో ఉండడని బెదిరించాడు. గంగయ్య సోదరుడు అదే బస్సులో అదే సీటు టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. విషయం తెలిసిన చిత్తూరు పోలీసులు– అదే బస్సులో వెళ్లి, కిడ్నాపర్లను పట్టుకోవడానికి ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లకు టికెట్లు బుక్ చేశారు. గంగయ్య సోదరుడు, ఈ ముగ్గురు పోలీసులు ఒకే బస్సులో బయలుదేరారు. తనను అనుసరిస్తూ పోలీసులు వస్తున్న విషయం గంగయ్య సోదరుడికి తెలీదు. అదే రోజు రాత్రి మరోసారి వెంకట్‌రెడ్డి వద్దకు వెళ్లే సురేష్ మళ్లీ భార్యతో ట్రిప్ అంటూ ఇండికా కారు తీసుకున్నాడు. గంగయ్య సోదరుడు ప్రయాణిస్తున్న భారత్ ట్రావెల్స్ బస్సు జడ్చర్లకు చేరుకునే సమయానికి సురేష్ కారుతో సçహా అక్కడ సిద్ధంగా ఉన్నాడు. బస్సు అక్కడకు చేరుకున్నాక గంగయ్య సోదరుడు బ్యాగ్ పట్టుకుని దిగడంతో, అది గమనించిన ఎస్సై కూడా అతడితో పాటు కిందికి దిగారు. అతడిని చూడగానే పోలీసు అని గుర్తించిన సురేష్, దృష్టి మళ్లించడానికి క్షణాల్లో మరో పథకం వేశాడు. ఆ పోలీసుని ఉద్దేశించి ‘మీరూ హైదరాబాద్ వెళ్లాలా..? లగేజీ తెచ్చుకోండి’ అని చెప్పాడు. ఎదుటి వారికి తనపై అనుమానం రాకూడదని భావించిన సదరు ఎస్సై తన బ్యాగ్ తీసుకువచ్చి కారు ఎక్కాలని భావించారు. బ్యాగ్ కోసం బస్సు ఎక్కగా, అప్పటికే కింద ఉన్న గంగయ్య సోదరుడిని కారులో ఎక్కించుకున్న సురేష్ రాంగ్ రూట్లో ఉడాయించాడు. ఈ పరిణామంతో కంగుతిన్న చిత్తూరు పోలీసులు విషయాన్ని తమ ఉన్నతాధికారులకు చెప్పారు. చిత్తూరు పోలీసుల నుంచి సమాచారం అందుకున్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ వెంటనే రంగంలోకి దిగింది. అయితే అప్పటికే గంగయ్య సోదరుడి నుంచి డబ్బు తీసుకుని, అతడిని శంషాబాద్ వద్ద వదిలేసిన సురేష్ నేరుగా వనస్థలిపురం వెళ్లిపోయాడు. కారు వెంకట్‌రెడ్డికి అప్పగించిన తర్వాత ‘తన భార్య’కు పేమెంట్ సెటిల్ చేసి పంపించేశాడు. డీసీఎం వ్యాన్‌లో ఫ్లాట్‌లోని సామాను మొత్తం సర్దుకుని, మల్లారెడ్డిని సంప్రదించి, ‘ప్యాకేజ్’ని వదిలేసి నాంపల్లికి రావాలని చెప్పాడు. గంగయ్యను తీసుకుని బయలుదేరే మల్లారెడ్డి గ్యాంగ్ అతడిని ఎంజీబీఎస్ వద్ద వదిలేసి, ఖర్చుల కోసం రూ.10 వేలు ఇచ్చింది. వీళ్లు నాంపల్లికి చేరుకునేసరికి సురేష్ డీసీఎంలోని ఇంటి సామాను మొత్తం సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్మేసి, సిద్ధంగా ఉన్నాడు. మల్లారెడ్డి గ్యాంగ్‌కు కొంత మొత్తం ముట్టజెప్పి, అక్కడ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. గంగయ్య, అతడి సోదరుడు బతుకు జీవుడా అనుకుంటూ తిరుపతి చేరుకున్నారు. ఈ కేసులో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మల్లారెడ్డితో పాటు మిగిలిన గ్యాంగ్‌ను పట్టుకుని చిత్తూరు పోలీసులకు అప్పగించారు. అయితే సురేష్ మాత్రం చిక్కలేదు. తన నేర పరంపరను కొనసాగిస్తూ 2006 సెప్టెంబర్ 13న జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యాపారవేత్త జి.కృష్ణంరాజును ఆయన పెంపుడు శునకంతో సహా కిడ్నాప్ చేశాడు. ఈ కేసులో అరెస్టు అయినప్పుడే, గంగయ్య కిడ్నాప్ స్కెచ్ బయటకు వచ్చింది. ఇలాంటి అనేక నేరాలు చేసిన గౌరు సురేష్ 2008 జూలై 18న బేగంపేటలోకి ఎయిర్ కార్గో కాంప్లెక్స్ వద్ద పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో చనిపోయాడు. (సమాప్తం) -
దసరాని ఈ పసందైన వంటకాలతో సెలబ్రేట్ చేసుకుందాం ఇలా..!
మిరియాల పులిహోరకావలసినవి: బియ్యం– ఒక కప్పు, నీళ్లు– 2 కప్పులుచింతపండు– పెద్ద నిమ్మకాయ సైజ్ తీసుకోవచ్చుపచ్చిమిర్చి– 3 (సన్నగా తరగాలి), ఎండుమిర్చి– 4 (ముక్కలు చేసుకోవాలి), మిరియాలు– ఒకటి లేదా ఒకటిన్నర టీ స్పూన్ (పొడి చేసుకోవాలి), ఆవాలు– ఒక టీ స్పూన్, మినపపప్పు, శనగపప్పు– ఒక టేబుల్ స్పూన్ చొప్పున, నూనె, పల్లీలు– 3 టేబుల్ స్పూన్లు చొప్పున, బెల్లం కోరు– ఒక టీ స్పూన్, పసుపు– అర టీ స్పూన్, ఇంగువ– చిటికెడు, కరివేపాకు– 2 రెమ్మలు, ఉప్పు– తగినంతతయారీ: ముందుగా బియ్యాన్ని కడిగి, రెండు కప్పుల నీళ్లు పోసి కుకర్‌లో ఉడికించుకోవాలి. అన్నం మరీ మెత్తగా అవ్వకూడదు. ఈలోపు చింతపండును నీటిలో 10 నిమిషాలు నానబెట్టి, గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. మిరియాలను నూనె లేకుండా వేయించి చల్లార్చి, మెత్తని పొడిలా చేసుకోవాలి. ఉడికించిన అన్నాన్ని ఒక వెడల్పాటి ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంతలో ఒక పాన్‌లో నూనె వేడి చేసి, ఆవాలు, శనగపప్పు, మినపపప్పు, పల్లీలు వేసి వేగించాలి. అనంతరం అందులో తరిగిన పచ్చిమిర్చితో పాటు ఎండుమిర్చి ముక్కలు, ఇంగువ, కరివేపాకు వేసి కొద్దిసేపు వేగించాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు, బెల్లం తురుము, పసుపు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. నూనె పైకి తేలే వరకు ఈ మిశ్రమాన్ని ఉడికించి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నంలో తగినంత ఉప్పుతో పాటు ఈ చింతపండు మిశ్రమాన్ని వేసి బాగా కలిపితే సరిపోతుంది.పనీర్ జిలేబీకావలసినవి: పనీర్ తురుము– 250 గ్రాములు, మైదా పిండి– ఒక కప్పుఏలకుల పొడి– అర టీస్పూన్, బేకింగ్ పౌడర్– పావు టీస్పూన్పంచదార– 2 కప్పులు, నీళ్లు– ఒక కప్పు (పాకం కోసం), నెయ్యి– సరిపడాపిస్తా, జీడిపప్పు ముక్కలు– గార్నిష్కితయారీ: ముందుగా పనీర్ తురుమును బాగా మెత్తగా చేతితో నలుపుకోవాలి. ఇందులో ఎటువంటి గడ్డలు లేకుండా చూసుకోవాలి. అనంతరం ఒక గిన్నెలో ఈ మెత్తని పనీర్, మైదా పిండి, ఏలకుల పొడి, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, జిలేబీ పిండి మాదిరిగా గట్టిగా, మందంగా ఉండేలా కలుపుకోవాలి. పిండి చాలా పల్చగా ఉండకూడదు. ఈ పిండిని 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఒక గిన్నెలో పంచదార, నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. పంచదార కరిగి పాకం కొంచెం చిక్కబడిన తర్వాత, దానిని స్టవ్ నుంచి దింపెయ్యాలి. ఈలోపు ఒక వెడల్పాటి పా¯Œ లో నెయ్యి వేడి చేసుకోవాలి. జిలేబీ మేకర్లో మైదా మిశ్రమాన్ని నింపుకుని, నచ్చిన విధంగా నేతిలో జిలేబీలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. అవి వేడిగా ఉన్నçప్పుడే గోరువెచ్చగా ఉన్న పంచదార పాకంలో ముంచాలి. ఐదు లేదా పది నిమిషాలు పాకంలో జిలేబీలు మునిగేలా ఉంచి ఆ తర్వాత వాటిపైన జీడిపప్పు, పిస్తా ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి.కేసర్ పెడాకావలసినవి: పాల పొడి– 2 కప్పులు, నెయ్యి– 4 చెంచాలు, కండెన్స్డ్ మిల్క్– ఒక కప్పు, ఏలకుల పొడి– ఒక టీ స్పూన్, ఫుడ్ కలర్– కొద్దిగా, కొన్ని పిస్తా పప్పులు– గార్నిష్ కోసం, కుంకుమ పువ్వు– కొద్దిగా, (వెచ్చని పాలలో నానబెట్టుకోవాలి)తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసి చిన్న మంట మీద, ఒక పాత్రలో నెయ్యి వేడి చేసి, గరిటెతో కలుపుతూనే పాల పొడి, కండెన్స్డ్ మిల్క్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు కుంకుమ పువ్వు నానబెట్టిన పాలు వడకట్టి, వాటిని వేసి బాగా కలిపి మళ్ళీ ఒక నిమిషం పాటు స్టవ్ మీద గరిటెతో తిప్పుతూ ఉండాలి. కాసేపు స్టవ్ మీద నుంచి గిన్నె పక్కకు దించి గరిటెతో తిప్పుతూ ఉండాలి. అలా స్టవ్ మీద కాసేపు మామూలుగా కాసేపు గరిటెతో కలిపితే ఆ మిశ్రమం పాత్రకు అంటకుండా ముద్దలా మారుతుంది. అలా మారిన తర్వాత దాన్ని 15 నుంచి 20 నిమిషాలు చల్లారనివ్వాలి. అనంతరం 15 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచాలి. చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి, దాన్ని మృదువుగా చేసుకోవాలి. అనంతరం పిస్తా పప్పు, కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. (చదవండి: రుచి.. శుచి... వెంకన్న నైవేద్యం) -
నల్లటి వలయాలు, పుట్టుమచ్చలను మాయం చేద్దాం ఇలా..!
సాధారణంగా ఒత్తిడి, అలసట, నిద్రలేమి, కంప్యూటర్స్ లేదా ఫోన్స్ ఎక్కువగా చూడటంతో కళ్ల కింద నల్లటి వలయాలు (డార్క్ సర్కిల్స్), వాపు, ముడతలు ఏర్పడుతుంటాయి. వాటిని తగ్గించుకోవాలంటే ప్రత్యేకమైన జాగ్రత్తలు తప్పవు. ఇందుకోసం ఈ మెటల్ టూల్ అయిన కళ్ళ మసాజర్ లేదా క్రీమ్ స్పూన్ ప్రత్యేకమైనదిగా నిలుస్తోంది. ఎందుకంటే ఈ టూల్‌కి ఒకవైపు బాల్ లాంటి భాగం మరోవైపు స్పూన్ లాంటి ఆకారం ఉంటాయి. క్రీమ్స్, సీరమ్స్ వంటివి వేళ్లతో కాకుండా ఈ టూల్‌తో అప్లై చేసుకుంటే చర్మంపై బాక్టీరియా చేరే అవకాశం తగ్గుతుంది. ఈ స్పూన్.. జింక్ అలాయ్‌తో తయారైంది. ఇది చాలాకాలం మన్నుతుంది. కళ్ళకు వాడే క్రీములు, ఫేస్‌కి వాడే క్రీమ్స్, డ్రై మాస్క్‌లు, లోషన్లు, ఇతర సౌందర్య ఉత్పత్తులు అప్లై చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని స్నేహితులకు బహుమతిగా కూడా ఇవ్వచ్చు. ఈ మసాజర్‌తో సున్నితంగా మసాజ్ చేయడం వల్ల ముఖంపై ఉండే వాపు తగ్గుతుంది, డబుల్ చిన్ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. కళ్ళ కింద ఉండే నల్లటి వలయాలు, బ్యాగ్స్ కూడా తగ్గుతాయి. ముఖ కండరాలు రిలాక్స్ అవ్వడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఈ టూల్ చాలా తేలికైనది, చిన్నది కాబట్టి హ్యాండ్‌బ్యాగ్‌లో లేదా జేబులో సులభంగా పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. క్రమం తప్పకుండా దీనితో మసాజ్ చేయడంతో, ఇది చర్మాన్ని బిగుతుగా చేసి, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.బెస్ట్ బ్యూటీ ట్రీట్మెంట్!కొన్ని పుట్టుమచ్చలు అందాన్ని తెచ్చిపెడితే, మరికొన్ని పుట్టుమచ్చలు గడ్డల్లా కనిపిస్తూ, ఉన్న అందాన్ని చెడగొడుతుంటాయి. అలాంటి వాటిని తొలగించడానికి చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో షేవ్ ఎక్సిషన్ ట్రీట్మెంట్ ఒక సాధారణ వైద్య పద్ధతి. చర్మంపై ఉన్న పులిపిర్లు, పుట్టుమచ్చలు లేదా చిన్న చిన్న గడ్డలు తొలగించడానికి ఈ చికిత్స సహకరిస్తుంది. ఈ ప్రక్రియలో, ఒక పదునైన బ్లేడుతో చర్మం పైపొరలో ఉన్న పెరుగుదల భాగాన్ని జాగ్రత్తగా ‘షేవ్’ చేస్తారు. ఇది లోతైన కోత కాదు, కాబట్టి సాధారణంగా కుట్లు వేయాల్సిన అవసరం ఉండదు. ప్రక్రియ ఎలా జరుగుతుందంటే.. ముందుగా, ఆ ప్రాంతానికి మత్తు ఇంజెక్షన్ ఇస్తారు, కాబట్టి నొప్పి తెలియదు. అనంతరం ఒక ప్రత్యేకమైన బ్లేడుతో చర్మంపై ఉన్న గడ్డను జాగ్రత్తగా షేవ్ చేస్తారు. కొద్దిగా రక్తం కనిపించే అవకాశం ఉంటుంది, దాన్ని ఆపడానికి విద్యుత్తు లేదా రసాయనాలను ఉపయోగిస్తారు. చికిత్స తర్వాత ఆ ప్రాంతాన్ని పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. చర్మ వైద్య నిపుణుడి సమక్షంలోనే ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం ఉత్తమం. (చదవండి: World Rivers Day: హృదయ నదులు..! వాటి గొప్పదనాన్ని నాడు ఎలా చెప్పారంటే..) -
హృదయ నదులు..! వాటి గొప్పదనాన్ని నాడు ఎలా చెప్పారంటే..
కొన్నిసార్లు సైన్స్ కన్నా, కవిత్వమే ఎక్కువ లాజికల్‌గా అనిపిస్తుంది! అందుకు ఒక ఉదాహరణ... బహుముఖసృజనశీలి అయిన ఇటాలియన్ చిత్రకారుడు, ఇంజినీరు లియోనార్డో డా విన్సీ నదుల్ని మానవ శరీరంలోని ధమనులు, సిరలతో పోల్చటం! నదులు, ఉపనదులు భూగోళానికిజీవ ప్రవాహ నాళాలు అని వాటి ప్రాముఖ్యాన్ని ఈ ఒక్కమాటతోచక్కగా అర్థం చేయించారు డా విన్సీ. 51 కోట్ల, 72 వేల చ.కి. మీ. విస్తీర్ణంలో ఉన్న మన భూమిపై లక్షన్నరకు పైగా నదులు ఉన్నాయని ఒకఅంచనా. ఈ నదుల ప్రాముఖ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉండేందుకని గత ఇరవై ఏళ్లుగా ఏటా మనం సెప్టెంబరు నాల్గవ ఆదివారాన్ని (నేడు)‘ప్రపంచనదుల దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా పురాణాల్లో, సాహిత్యంలో, సినీ గీతాల్లో ఉన్న నదుల మననాలు కొన్ని.. మీ కోసం! ప్రవాహమే నది రూపంనదుల గురించి అల మాత్రంగానైనా మాట్లాడుకోవటం అంటే మహా సముద్రంలో ఈత కొట్టటమే! మొదలు–తుది; అంతము– ఆరంభమూ లేని ప్రవాహం... సమస్త మానవాళి జీవితాన్ని పెనవేసుకుని ఉన్న ఈ నదీ ప్రస్థానం. గ్రీకు తత్వవేత్త హెరాహ్లిటస్ అన్న మాట ఈ నదీ ప్రస్థానానికి, నదీ ప్రస్తావనకు చక్కగా సరిపోతుంది. ‘‘ఒకే మనిషి ఒకే నదిలో రెండోసారి అడుగు పెట్టడు. ఎందుకంటే– ఆ నది ఒకేలా ఉండదు. ఆ మనిషీ ఒకేలా ఉండడు’’ అంటారాయన. అంటే ప్రవాహం ఎప్పుడూ ఒకేలా ఉండదు, మనిషి కూడా నదీ ప్రవాహంలా ఒకేలా ఉండడు అని అంతరార్థం.సాగిపోయే జీవిత నౌకనదుల పోలికతో పాశ్చాత్యులవే మరికొన్ని అద్భుతమైన జీవిత సత్యాలు ఉన్నాయి. లెబనీస్–అమెరికన్ కవి ఖలీల్ జిబ్రాన్ ఏమంటారో చూడండి, ‘‘నది వెళ్లి సముద్రంలో కలిసినట్లే జననం వెళ్లి మరణంలో కలుస్తుంద’’ట! ఇక దివంగత బ్రిటన్ రాజనీతిజ్ఞుడు ఎనోచ్ పావెల్, ‘‘నా ఓడ కనిపించకుండాపోతే, నా ప్రయాణం ముగిసిందని కాదు. నది వంపు తిరిగిందని..’’ అని అంటారు! ఎంత చక్కగా చెప్పారు. ‘కొండగాలి తిరిగింది’ అని ఆరుద్ర అన్నట్లు – కొండగాలి మాత్రమే కాదు, నది కూడా తిరుగుతుంది. ప్రాప్తమున్న తీరానికి జీవిత నౌక సాగిపోతుంది. ఇదీ ఆరుద్ర మాటే. వయ్యారి గోదారమ్మ..!ఒక అమ్మాయికి యుక్త వయస్సు అనేది విశాలమైన నది నుండి సముద్రంలోకి తేలుతున్నట్లుగా ఉంటుంది అంటారు జి.స్టాన్లీ హాల్. 19వ శతాబ్దపు మనో వైజ్ఞానిక నిపుణుడు ఈయన. నదిలా నూత్న యవ్వనం పరవళ్లు తొక్కుతుందని చెప్పటం స్టాన్లీ ఉద్దేశం. ‘వయ్యారి గోదారమ్మ ఒళ్లంత ఎందుకమ్మ కలవరం..’ అని వేటూరి అడిగిన ప్రశ్నకు స్టాన్లీ ఆల్రెడీ సమాధానం చెప్పేసే ఉంచారన్న మాట! అమెరికన్ సంగీతకారుడు జాన్ విలియమ్స్, నదిని సంగీతంలో పోల్చారు. ‘‘సంగీతంలో నేను ఎక్కువ తక్కువల్ని చూడను. సంగీతం అన్నది మనమందరం కప్పులతో ముంచుకుని తాగ గల అమృతవాహిని అయిన నది’’ అన్నారు విలియమ్స్. ఇళయ రాజా దృష్టిలో సంగీతం అంటే ఏ ఉద్దేశమూ లేనిది! ‘‘నది ప్రవాహంలా సంగీతం సహజంగా, ఉద్దేశరహితంగా ఉండాలి’’ అంటారు ఇళయరాజా.స్వర్గలోక వెండి ప్రవాహంప్రాచీన కాలపు చైనా దేశీయులు పాలపుంతను కూడా ఒక ప్రకాశవంతమైన నదిగానే ఊహించారు. ఆ నదిని స్వర్గంగా, ఆ ప్రవాహాన్ని వెండిగా భావించారు. బౌద్ధ దార్శనికుడైన ఆచార్య నాగార్జునుడు మానవ జీవితంలోని దుఃఖం గురించి మాట్లాడుతూ, ‘‘నదిలో కలిసి, కదిలే చెక్క దుంగలు ప్రతి అల చేత విడిపోతాయి. అనివార్యంగా అలా వేరు అవటం దుఃఖానికి కారణం కాకూడదు’’ అంటారు. ప్రసిద్ధ బ్రెజిల్ నవలా రచయిత పాలో కోయెలో మరికాస్త లోతుకు వెళ్లి, ‘‘మీరు నదిలో పడటం వల్ల మునిగిపోరు, కానీ దానిలో మునిగిపోవటం వల్ల మునిగిపోతారు’’ అంటారు. జీవితాన్ని భయంతో ఈదలేమని చెప్పటం కావచ్చు. ఇంగ్లిష్ నటి జూలీ ఆండ్రుస్ (89)కు నది వాసన అంటే ఇష్టం. నది సౌమ్యత ఇష్టం. ఆమె చిన్నతనం అంతా నదితోనే గడిచింది. నది ఆమెను ప్రశాంతపరచింది. ఆమెకు ఓదార్పునిచ్చింది. ఈ విషయాన్ని జూలీ అనేక ఇంటర్వ్యూలలో చెప్పారు. గంగా తీరాన రిషికేశ్హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్‌కు భారతదేశంలోని సాయంత్రాలు అంటే చాలా ఇష్టమట. ఎందుకు ఇష్టమో ఆయన మాటల్లోనే విందాం. ‘‘సూర్యుడు ప్రపంచం అంచుకు చేరుకుంటాడు. శబ్దాలు అస్తమిస్తుంటాయి. పది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు సైకిళ్లపై నదీ ప్రవాహంలా ఇంటికి చేరుకుని, శ్రీకృష్ణుడి గురించి, జీవన వ్యయం గురించి ఆలోచిస్తూ ఉండే మాయా క్షణాలవి’’ అంటాడు కామెరాన్. సైకిళ్లపై ఒక ఒరవడిగా వెళ్లే శ్రామికులను ఆయన ఒక నదీ ప్రవాహంగా ఊహించుకున్నారు. మైకేల్ ఎడ్వర్డ్ లవ్ కూడా భారతదేశం గురించి గొప్పగా చెప్పారు. ఆ గొప్పకు కారణం గంగా నది. మైకేల్ అమెరికన్ సింగర్, సాంగ్‌రైటర్. ‘‘1968 వసంతకాలంలో, ‘ది బీటిల్స్’ బ్యాండ్‌కు, నాకు మహర్షి మహేష్ యోగి నుండి భారతదేశంలోని రిషికేశ్కు రమ్మని ఆహ్వానం అందింది. రిషికేశ్ అనేక సంవత్సరాలుగా లక్షలాది మందికి ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది హిమాలయాల నుండి గంగా నది ప్రవహించే ప్రదేశంలో ఉంది. ఆ వాతావరణంలో ఉండటం చాలా ప్రత్యేకమైనది’’ అంటారు మైకేల్. పురుష నది.. బ్రహ్మపుత్ర!భారతీయ పురాణాలలో అనేక నదులు ప్రవహించాయి. అయితే అవి కేవలం భౌతిక ప్రవాహాలు కావు. దైవత్వం పొందినవి. దేవతలతో సమానంగా గౌరవాన్ని పొందినవి. పూజలను అందుకున్నవి. గంగా, యమునా, సరస్వతి, గోదావరి నదులను స్త్రీ దేవతలుగా పూజిస్తారు. ఆ పవిత్ర జలాలలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. మరి పురుష నదులే లేవా? లేనట్లున్నాయి. బ్రహ్మపుత్ర నదిని మాత్రం ‘పురుష నది’గా పరిగణిస్తారు. మన నదులన్నీ కూడా రుగ్వేదం, మహాభారతం, రామాయణం వంటి పురాణ, ఇతిహాసాలలో ముఖ్యమైన పాత్రను కలిగి ఉన్నాయి. ‘గంగావతరణ’ ఘట్టందశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసిందీ, శ్రీరాముడి అవతార పరిసమాప్తి అయిందీ ‘సరయూ’ సమీపంలోనే. రామాయణంలోని ‘గంగావతరణ’ ఘట్టం అయితే ఒక అద్భుతమైన చిత్రణ. సీతను వెదకి రమ్మని వానరులను పంపేటప్పుడు ఆమెను ఎక్కడెక్కడ వెతకాలో చెబుతూ శరావతి, కావేరి, తామ్రపర్ణి, నర్మద, కౌశికీ, యమునా నదులను ప్రస్తావిస్తాడు సుగ్రీవుడు. ఇక కవుల గురించి చెప్పక్కర్లేదు. నది ఊసు లేనిదే వారి కలాలు పరవళ్లు తొక్కవు. ‘కవుల కవిత్వంలో పొంగిన నదులు’ అంటూ రాజన్ పి.టి.ఎస్.కె. అనే రచయిత తెలుగులో ఒక పుస్తకమే రాశారు. కృష్ణవేణి.. విరిబోణి.. అలివేణినది పేరుతో అనేక తెలుగు నవలలు, కథలు వచ్చాయి. అదొక అంతే లేని జాబితా. అలాగే తెలుగు సినిమా పాటలు వందలు, వేలు! పూర్తిగా ఒక నదిపైనే వచ్చిన పాట మాత్రం బహుశా డాక్టర్ సి.నారాయణ రెడ్డి రాసిన ‘కృష్ణవేణి తెలుగింటి విరిబోణి / కృష్ణవేణి నా ఇంటి అలివేణి’ కావచ్చు. ఆ పాటలో కృష్ణానది విశేషాలన్నిటినీ సినారె పొందుపర1చారు. భక్తిగీతంలా మొదలై పరవళ్లు తొక్కుతూ వెళ్లి సాగర హృదయాన సంగమిస్తుంది. ఈ పాట ‘కృష్ణవేణి’ (1974) చిత్రం లోనిది.వేదంలా ఘోషించే గోదావరికృష్ణవేణికి దీటైన ఇంకో తెలుగు సినిమా పాట.. ‘వేదంలా ఘోషించే గోదావరి.. అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి’. 1983 నాటి ‘ఆంధ్ర కేసరి’ సినిమా కోసం ఆరుద్ర ఈ పాటను రాశారు. అయితే ఆ పాట పూర్తిగా గోదావరి విశేషాల మీద కాకుండా, గోదావరికి అనుసంధానమై ఉన్న సుందర నగరాలు, కవులు–కావ్యాలు, ఏలిన రాజులు మీద సాగుతుంది. గోదావరి మీదే వేటూరి గారు రాసిన పాట ‘గోదావరి’ చిత్రంలోని ‘ఉప్పొంగెలే గోదావరి’. ఇంకా.. ‘ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తుందీ’ (ఆత్రేయ–‘చక్రవాకం’), ‘నవ్వుల నదిలో పువ్వుల పడవ’ (ఆరుద్ర–‘మర్మయోగి’), ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ’ (శేషేంద్ర శర్మ–‘ముత్యాల ముగ్గు’) ‘చినుకులా రాలి.. నదులుగా సాగి’ (వేటూరి–నాలుగు స్తంభాలాట), ‘గోదారి గట్టుంది.. గట్టు మీద సెట్టుంది..’ (దాశరథి కృష్ణమాచార్య–‘మూగ మనసులు’)... వంటి పాటలు పూర్తిగా నది చుట్టూ తిరిగినవి కాకపోయినా, దోసెడు నది నీళ్లను పట్టి ప్రేక్షకుల తలపులపై చిలకరించినవి. నదులపై మంచి మంచి సినిమా పాటలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవి కొన్ని రేణువులు మాత్రమే. నదులు కేవలం నీళ్లు కాదు, కేవలం ప్రవాహాలు కాదు, కేవలం ప్రయాణ మార్గాలు అంతకన్నా కాదు. మనిషిని బతికించే సంజీవినులు మాత్రమే కాదు. డా విన్సీ అన్నట్లు – భూగోళానికే జీవాన్ని, చేవను ఇచ్చే సిరలు, ధమనులు.శ్రీశ్రీ అనుసంధానం!‘మరో ప్రపంచం’ (1970) సినిమాలో శ్రీశ్రీ ‘అణగారిన బ్రతుకులలో..’ అనే పాట రాశారు. అందులోని ఒక చరణంలో... ‘గంగా, కావేరీ – నదులను కలుపుదాం..’ అన్నారు ఆయన. ఆ చరణం ఇలా ఉంటుంది : ‘ఈ దేశం నీదీ నాదని / ఇది ఒక్కరికే సొంతం కాదని / గంగా, కావేరి నదులు కలుపుదాం / కలిపి, సరిహద్దు చెరిపి, చెలిమి నిలుపుదాం..’ అని. యాభై ఏళ్ల క్రితం తొలిసారి 1972లో అప్పటి కేంద్ర మంత్రి కె.ఎల్.రావు గంగ–కావేరి నదులను అనుసంధానించాలని ప్రతిపాదించారు. అంటే, శ్రీశ్రీ తన పాట ద్వారా అంతకు రెండేళ్లకు ముందే గంగ, కావేరీలను అనుసంధానించారు! అందుకే, సృజనశీలులను కాలజ్ఞానులు అని కూడా అంటారు. నదుల అనుసంధానం గురించి 1974లో కెప్టెన్ దిన్షా జె.దస్తూర్ మరో ప్రతిపాదన తెచ్చారు. హిమాలయ నదులైన గంగ, సింధు, బ్రహ్మపుత్రలను... ద్వీపకల్ప నదులైన గోదావరి, కృష్ణ, మహానది, కావేరి, నర్మద, తపతి, పంబ వంటి వాటితో కలపొచ్చని! ఆ తర్వాత కేంద్ర జల వనరుల శాఖ ఇంకో ప్రతిపాదన తెచ్చింది. ఇవేవీ ఆచరణకు రాలేదు. సాక్షి, స్పెషల్ డెస్క్ -
అందాల ఆషికా రంగనాథ్ స్టైలిష్ వేర్లు ఇవే..!
నేచురల్‌గా మెరిసే అందం ఆశికా రంగనాథ్ సొంతం! మినిమల్ స్టయిలింగ్ టిప్స్‌తోనే, ఒక కొత్త లుక్‌ని సింపుల్‌గా, క్లాసీగా, కంఫర్టబుల్‌గా చూపిస్తూ మ్యాజిక్ చేసేస్తోంది. ఆ విషయాలే మీకోసం! బయటకు వెళ్లేటప్పుడు నా ఫేవరెట్ హాక్ బ్రెయిడ్ వేసుకోవడం. బ్రెయిడ్ని ఓపెన్ చేస్తే వచ్చే సాఫ్ట్ వేవ్స్ నాకు బాగా ఇష్టం. బ్లాక్ డ్రెస్‌లు, క్రాప్‌టాప్స్ నా ఆల్‌టైమ్ ఫేవరెట్. యాక్సెసరీస్ విషయానికి వస్తే సింపుల్ జ్యూలరీనే ఎంచుకుంటాను. గ్లామర్ మొత్తం సింప్లిసిటీలోనే ఉంది ఆశికా రంగనాథ్. ఇక్కడ ఆమె ధరించే చీర..బ్రాండ్: సాయి తనార్య, ధర: రూ. 22,000, జ్యూలరీ బ్రాండ్: వివంత్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యూలరీ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కనీ కనిపించని కనికట్టుమెడలో ఒక్కసారిగా స్టోన్స్ మాత్రమే మెరుస్తూ కనిపిస్తే అదే ఇన్విజిబుల్ చైన్ మ్యాజిక్. గొలుసు కనిపించకపోయినా, పెండెంట్ మాత్రం గ్లామర్‌తో మెరుస్తుంది. చీర మీద క్లాసీగా, గౌన్ మీద గ్లామరస్‌గా, డైలీ వేర్లో క్యూట్‌గా ఏ లుక్కైనా ఈ ఇన్విజిబుల్ చైన్ సెట్ అవుతుంది. చిన్న పెండెంట్ వేసుకుంటే సింపుల్‌గా, సాఫిస్టికేటెడ్ లుక్ ఇస్తుంది. పెద్ద స్టోన్ పెండెంట్ అయితే స్పాట్‌లైట్‌లో ఉండే జ్యూలరీ అవుతుంది. ఫొటోల్లో ఈ పెండెంట్ లైట్‌ని క్యాచ్ చేస్తూ అదిరిపోయే గ్లో ఇస్తుంది. హెవీ జ్యూలరీ మానేసి, ఈ ఇన్విజిబుల్ చైన్ విత్ పెండెంట్‌ని వేసుకుంటే, నేచురల్ బ్యూటీ ఇంకో లెవెల్‌కి హైలైట్ అవుతుంది. జుట్టు లూజ్ వేవ్స్‌గా వదిలేస్తే క్లాసీ లుక్, హై బన్ చేస్తే ఎలిగెంట్ లుక్ మీ సొంతం. మార్కెట్లో గోల్డ్, సిల్వర్, కలర్‌ఫుల్ డిజైన్స్ లైట్‌వెయిట్ ఆప్షన్లతో దొరుకుతున్నాయి. ఇదొక ఆభరణం మాత్రమే కాదు, అది న్యూ ఏజ్ ట్రెండ్, స్టయిల్ సీక్రెట్ కూడా! (చదవండి: దశ విధాల అలంకరణతో ఇంటిని స్వర్గధామంలా మార్చేద్దామా..!) -
వండర్ బామ్మ..! 93 ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్
వయసు తొంభై ఏళ్లు దాటితే చాలామంది కూర్చుని మోకాలికి నూనె రాసుకోవడం, మనవరాళ్లకు కథలు చెప్పడం, రక్తపోటు–షుగర్ మందులు సరిగ్గా తీసుకున్నామా అని చెక్ చేసుకోవడం చేస్తుంటారు. కాని, ఈ అమ్మమ్మ మాత్రం అలా కాదు. ట్రాక్‌లోకి దూకి గోల్డ్ మెడల్ కొట్టేసింది. ఆమె తొంభై మూడేళ్ల పానీదేవి. పానీదేవి కథ సాధారణం కాదు. అమ్మాయిలకు చదువూ ఆటలూ దూరమైన కాలంలో పుట్టింది. పదిహేను ఏళ్లకే పెళ్లి, యాభై ఏళ్లకే భర్తను కోల్పోయింది. ఎనిమిది మంది పిల్లలకు తల్లి, తండ్రి తానే అయి పెంచింది. చిన్న వయసు నుంచే పొలాల్లో కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించింది. జీవితం అంతా బాధ్యతలతో నిండిపోయినా, ఆమె మనసులో ఎప్పుడూ ఒక కల మేల్కొని ఉండేది. ఆ కలను నిద్రపుచ్చాలా లేక సాకారం చేసుకోవాలా అనే ప్రశ్నకు సమాధానం ఆమె రెండేళ్ల క్రితం చెప్పింది. ఒకరోజు తన మనవడు జైకిషన్ పారా అథ్లెట్లకు శిక్షణ ఇస్తుండగా, పానీదేవి ఒక్కసారిగా ‘నేనూ చేస్తాను’ అని చెప్పింది. ఇంత వయసులో విశ్రాంతి తీసుకోమని కాకుండా, మనవడు ‘పరుగెత్తు’ అని ప్రోత్సహించాడు. అలా ఆ మనవడు, అమ్మమ్మ కాస్తా గురుశిష్యులుగా మారారు. కొత్త జీవితం! ఇంటి పనులు ముగించుకుని మైదానానికి వెళ్లడం, పాదాలు నొప్పితో వణికినా ఆగిపోకుండా శిక్షణ కొనసాగించడం, చుట్టుపక్కల వాళ్ల నవ్వులు వినిపించినా తన గమ్యం మర్చిపోకుండా పరిగెత్తడంతో ఆమె కొత్త జీవితం ఆరంభమైంది. ప్రేక్షకులు మొదట ‘ఈ వయసులోనా?’ అని ఆశ్చర్యపోయినా, ఘాఘ్రా–చోళీతో ట్రాక్‌లోకి దూకి కేవలం 45 సెకన్లలోనే 100 మీటర్లు పూర్తి చేసేసరికి చప్పట్లతో మైదానం మార్మోగిపోయింది. ఆ పోటీకి ముందు గుంతలో పడిపోయి ఆమె మోకాళ్లు గాయపడ్డాయి. డాక్టర్లు ‘విశ్రాంతి తీసుకోండి’ అన్నారు. కాని, పానీదేవి మాత్రం ‘మహా అయితే ఓడిపోతాను. కష్టానికి గౌరవం ఇవ్వకుండా ఆగిపోవడం మాత్రం అసలు చేయను’ అంటూ పట్టుదలతో ట్రాక్‌లోకి దిగింది. అలా 2023లో అల్వార్‌లో మొదటి మెడల్, 2024లో పుణేలో జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆమె ఇవన్నీ ఇంట్లో అల్మారాలో దాచేసింది! మనవడు వీడియో పోస్ట్ చేయకపోతే, దేశం మొత్తం ఆమెను అసలు చూడకపోయేది. ఇప్పుడు ఆమె కల మరింత పెద్దది. త్వరలోనే ఇండోనేషియాలో జరగబోయే ఆసియన్ మాస్టర్స్ గేమ్స్‌లో భారత్ తరపున పతకం గెలవడానికి సిద్ధమవుతోంది. (చదవండి: అందరికీ ఒకటే రక్తం!) -
ఒక్క క్లిక్ చాలు.. వెంటనే చేతిలో ఫొటో
మునుపటి రోజుల్లో ఫొటో అంటే ఒక్క క్లిక్ చాలు. వెంటనే ఆ ఫొటో చేతిలోనే ఉండేది. వేలకొద్దీ బ్లర్లు, సెల్ఫీ డిలీట్స్, ఎడిట్స్ ఏమీ ఉండేవి కాదు. ఆ మ్యాజిక్‌ను మళ్లీ మన చేతిలో తేవడానికి వచ్చింది – ఇన్‌టాక్స్ మినీ ఇవో ప్రీమియం ఎడిషన్! ఇది కేవలం కెమెరా మాత్రమే కాదు, ప్రింటర్ కూడా. ఒక్క క్లిక్‌తో ఫొటో తీయవచ్చు, అదే క్షణంలో ప్రింట్ చేసుకోవచ్చు. పది లెన్స్ ప్రభావాలు, పది ఫిల్మ్ ప్రభావాలు – మొత్తం వంద రకాల మూడ్లలో మీ ఫోటోలు తీర్చిదిద్దుకోవచ్చు. రెట్రో లుక్ డిజైన్, డయల్స్‌తో పాత కెమెరా ఫీల్‌కు కొత్త స్పర్శ ఇస్తుంది. అంతేకాదు, డైరెక్ట్ ప్రింట్ ఫీచర్‌తో మొబైల్ నుంచి ఫోటోలు నేరుగా ప్రింట్ చేయవచ్చు. ధర రూ. 19,999.చిన్ననాటి జాదూ బాక్స్!చిన్నప్పటి రోజుల్లో స్కూల్ నుంచి వచ్చి బ్యాగ్ మూలన పడేసి, భోజనం కూడా మరచిపోయి గేమ్ కన్సోల్ ఆన్ చేసిన క్షణాలు గుర్తున్నాయా? మారియోలో ప్రిన్సెస్ కోసం పరిగెత్తిన ఆ ఉత్సాహం, కాంట్రాలో లైఫ్ పోయినప్పుడు మనసులో పడిన ఆ బాధ– ఇవన్నీ మళ్లీ నిజం కానున్నాయి. ‘బెలోక్సీ ఎ5 హ్యాండ్‌హెల్డ్ గేమ్ కన్సోల్’ అంటే కేవలం ఒక గాడ్జెట్ కాదు, అది 90ల నాటి బాల్యపు మజాను తిరిగి మన చేతిలో పెట్టే జాదూ బాక్స్. ఇందులో ఏకంగా 500 క్లాసిక్ గేమ్స్. చేతిలో పట్టుకుని ఆడినా సరే, టీవీకి కనెక్ట్ చేసి పెద్ద స్క్రీన్‌పై ఆడినా సరే, ఆ పాత రెట్రో ఫీల్ కచ్చితంగా వస్తుంది. రాత్రిళ్లు దుప్పట్లో దాక్కుని, లైట్ ఆఫ్ చేసి ఆడిన ఆ సీక్రెట్ మజాను కూడా ఇది మళ్లీ జ్ఞాపకం చేస్తుంది. ధర కేవలం రూ.758 మాత్రమే!అప్పటి రోబో పెట్!ప్రస్తుత పిల్లలు ఆడుతున్న ఆర్టిఫిషియల్ రోబో ఫ్రెండ్స్, డిజిటల్ టాయ్స్ కంటే బెటర్‌గా అప్పట్లో ఒక నిజమైన డిజిటల్ ఫ్రెండ్ ఉండేది. అది అప్పటి అందరి ఫేవరెట్ పెట్– టమాగొచ్చి! అప్పట్లో అది కేవలం ఒక గేమ్ కాదు, నిజంగా మనకున్న డిజిటల్ పెట్ ఫ్రెండ్. దానికి తిండి పెట్టాలి, స్నానం చేయించాలి, బయటికి తీసుకెళ్లాలి, ఆటలు ఆడించాలి– ఇవన్నీ మన బాధ్యతే! ఇప్పుడా పెట్ కొత్త కలర్ స్క్రీన్, టచ్ బటన్స్, కెమెరా, గేమ్స్ అన్నీ కలిపి మరింత అప్డేట్ అయి మన చేతిలోకి వచ్చేసింది– బాండై అమెరికా టమాగొచ్చి పిక్స్ – స్కై పర్పుల్ ఎడిషన్! ఇందులో మీరు మీ పెట్‌తో సెల్ఫీలు తీయొచ్చు, వంటలు చేయించవచ్చు, ఫ్రెండ్స్ టమాగొచ్చిలతో కలసి ప్లే డేట్స్‌కి వెళ్లొచ్చు, గిఫ్ట్‌లు మార్చుకోవచ్చు. పదిహేడుకు పైగా గేమ్స్‌లో ఆడి పాయింట్స్ సంపాదించి, మీ పెట్‌కి కావలసిన ఫర్నిచర్, ఫుడ్, యాక్సెసరీస్ కొనిపెట్టొచ్చు. ధర రూ.9,831. -
అందరికీ ఒకటే రక్తం!
‘మనుషులందరిలోనూ ఒకటే నెత్తురు’... ‘ఏ మనిషిలో ఉండే నెత్తుటిదైనా ఒకటే రంగు, ఎరుపు’.. పాత సినిమాల్లో ఇంచుమించుగా ఇలాంటి డైలాగులు వినే ఉంటారు. మనుషులందరిలోనూ ఉండే నెత్తుటి రంగు ఎరుపే అయినా, నెత్తుటిలో రకాలు ఉన్నాయని ఆధునిక వైద్యశాస్త్రం చెబుతోంది. వైద్య శాస్త్ర ప్రకారం మనుషుల్లో ఏ, బీ, ఓ, ఏబీ బ్లడ్ గ్రూపులు ఉన్నాయి. వీటిలోనూ ఒక్కోదానికి పాజిటివ్, నెగటివ్ రకాలు ఉన్నాయి. శస్త్రచికిత్సలు జరిగేటప్పుడు, ఆకస్మిక ప్రమాదాలు జరిగినప్పుడు మనుషులను బతికించాలంటే, నెత్తురు అత్యవసరం. అవసరంలో ఉన్నవారి ప్రాణాలను నిలబెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా పెద్దపెద్ద ఆస్పత్రులు బ్లడ్‌బ్యాంకులను కూడా నిర్వహిస్తుంటాయి. ఇన్ని ఉన్నా, ఒక్కోసారి అవసరమైన వేళకు తగిన రక్తం దొరకక గాల్లో కలిసిపోతున్న ప్రాణాలెన్నో! ఒక్కొక్కరికి ఒక్కో రకం రక్తంతో పని లేకుండా, అందరికీ సరిపోయే కృత్రిమ రక్తాన్ని జపానీస్ ప్రొఫెసర్ హిరోమీ సకాయి రూపొందించారు. జపాన్‌లోని కషిహరాలో ఉన్న నరా మెడికల్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హిరోమీ ‘హిమోగ్లోబిన్ బేస్డ్ ఆక్సిజన్ క్యారియర్స్’ (హెచ్‌ఓబీసీ) ఉపయోగించి, నానో టెక్నాలజీ ద్వారా ఈ కృత్రిమ రక్తాన్ని తయారు చేశారు. ఈ రక్తం ఏ గ్రూపు రక్తం ఉన్నవారికైనా సరిపోతుంది. ఈ కృత్రిమ రక్తం విస్తృతంగా అందుబాటులోకి వస్తే, ఆపదలో ఉన్న ఎన్నో ప్రాణాలు నిలబడతాయి. అంతేకాకుండా, రక్తదాతల అవసరం కూడా తగ్గుతుంది. (చదవండి: ప్రెగ్నెట్ టైంలో సైనటిస్ మందులు వాడితే ప్రమాదమా..?) -
ప్రెగ్నెంట్ టైంలో సైనసైటిస్ మందులు వాడితే ప్రమాదమా..?
నేను మూడు నెలల గర్భవతిని. నాకు ఎప్పటినుంచో డస్ట్ అలెర్జీ, సైనసైటిస్ సమస్యలు ఉన్నాయి. గర్భం వచ్చిన తర్వాత తరచూ జలుబు, తుమ్ములు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని మందులు వాడాను. ఈ మందులు నా బిడ్డకు ఎలాంటి ప్రభావం చూపుతాయోనని ఆందోళనగా ఉంది. గర్భధారణ తొలి నెలల్లో మందులు వాడటం సురక్షితమా? నేను ఏవైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా?– సుశీల, నాగర్కర్నూల్సుశీల గారు, గర్భధారణ తొలి నెలల్లో శరీరంలో రక్షణశక్తి, హార్మోన్లలో మార్పులు ఎక్కువగా జరుగుతాయి. అందుకే ఈ సమయంలో జలుబు, తుమ్ములు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు రావడం సాధారణం. కొన్నిసార్లు ఫ్లూ కూడా రావచ్చు. ఈ లక్షణాలు ఎప్పుడు వస్తే, వాటి కారణం ఏమిటో ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే చికిత్స కారణాన్ని బట్టి మారుతుంది. ఇలాంటి సమయంలో ముందుజాగ్రత్తలు చాలా సహాయపడతాయి. ముఖ్యంగా ఫ్లూ సీజన్లో ఎక్కువ జనసమూహాలు ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండడం, అలెర్జీ కలిగించే పదార్థాలను తీసుకోకపోవటం, అవసరమైతే మాస్క్ ధరించడం మంచిది. ఫ్లూ వ్యాక్సిన్ గర్భధారణలో ఎప్పుడైనా సురక్షితంగా తీసుకోవచ్చు. ఇది తల్లికి, బిడ్డకు రక్షణ ఇస్తుంది. తేలికపాటి జలుబు, సైనసైటిస్ ఉన్నప్పుడు ఎక్కువగా నీరు తాగడం, వేడి సూపులు తాగడం, ఇంట్లో ఆవిరి పీల్చడం లాంటి చిట్కాలు ఉపశమనాన్ని ఇస్తాయి. మీ శరీర ఉష్ణోగ్రత, పల్స్, ఆక్సిజన్ స్థాయిలను ఇంట్లోనే ఉంటూ గమనించడం మంచిది. లక్షణాలు ఎక్కువైనా లేదా ఏదైనా అసాధారణంగా అనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మొదటి మూడు నెలల్లో మందులు వాడడంపై మీరు ఆందోళన పడుతున్నా, నిపుణుల సూచనలో ఇచ్చే తేలికపాటి చికిత్సలు సాధారణంగా సురక్షితమే. ఇవి బిడ్డ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపవు. సమయానికి వైద్య పర్యవేక్షణ, జాగ్రత్తలు పాటిస్తే గర్భధారణలో జలుబు, తుమ్ములు, ఫ్లూ వంటి సమస్యలు సులభంగా నియంత్రించుకోవచ్చు.నాకు ఈ మధ్యనే రెండవ ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయింది. అయితే, నా మొదటి గర్భధారణలో నాకు తీవ్రమైన వాంతులు అయ్యాయి. పలుసార్లు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. శారీరకంగా, భావోద్వేగపరంగా చాలా ఇబ్బంది పడ్డాను. అందుకే, ఇప్పుడు ఈ గర్భధారణను కొనసాగించడానికి భయం వేస్తోంది. ఈ గర్భధారణలో కూడా నాకు మళ్లీ అలాంటి వాంతులు వస్తాయా? వాంతులు తగ్గించుకోవడానికి నేను ఏమి చేయగలను?– కీర్తి, వరంగల్గర్భధారణ సమయంలో వాంతులు, వికారం సాధారణంగా కనిపించే సమస్య. దీనిని ‘మార్నింగ్ సిక్నెస్’ అంటారు. ఇది ఎక్కువగా మొదటి త్రైమాసికంలో కనిపిస్తుంది. సాధారణంగా ఆరు నుంచి ఏడవ వారంలో ప్రారంభమై, పదనాలుగు నుంచి పదహారు వారాల మధ్య తగ్గిపోతుంది. అయితే ఈ లక్షణాల తీవ్రత వ్యక్తికి వ్యక్తికి వేరుగా ఉంటుంది. కొందరికి స్వల్పంగా మాత్రమే ఉండగా, మరికొందరికి చాలా తీవ్రమైన, రోజువారీ జీవితాన్ని ఇబ్బందిపెట్టేంతగా వాంతులు రావచ్చు. మీరు చెప్పినట్టుగా కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో చేరడం, ఇంజెక్షన్స్, మెడిసిన్స్ తీసుకోవడం కూడా అవసరమవుతుంది. ఒకే మహిళకు వేర్వేరు గర్భధారణల్లో వాంతుల తీవ్రత వేరుగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు ప్రధాన కారణం గర్భధారణ హార్మోన్ అయిన బీటా హెచ్‌సీజీ స్థాయి అకస్మాత్తుగా పెరగడం. అందుకే కవలలు గర్భంలో ఉన్నప్పుడు వాంతులు మరింతగా వస్తాయి. వాంతులు తగ్గించుకోవడానికి మీరు పాటించగల కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. రోజంతా కొద్దికొద్దిగా నీరు తాగుతూ ఉండాలి, ప్రతి రెండు నుంచి మూడు గంటలకు తక్కువ మోతాదులో అయినా తరచు ఆహారం తీసుకోవాలి. మృదువైన, సులభంగా జీర్ణమయ్యే పదార్థాలను తినడం మంచిది. మసాలా వంటకాలకు, బయట ఆహారానికి వీలైనంత దూరంగా ఉండాలి. ఎక్కువసేపు ఆకలితో ఉండకూడదు. వాంతులు ఎక్కువగా వస్తున్నప్పుడు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. కొన్ని వాసనల వల్ల వాంతులు పెరిగే అవకాశం ఉన్నందువలన అలాంటి వాసనల నుంచి దూరంగా ఉండాలి. అల్లం, నిమ్మరసం వంటి పదార్థాలను ఆహారంలో చేర్చడం కూడా కొంత ఉపశమనం ఇస్తుంది. వాంతులు తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కొన్ని మందులు సురక్షితంగా వాడవచ్చు. ఇవి మీ డాక్టర్ సూచనతో మాత్రమే తీసుకోవాలి. మీరు ఏమీ తినలేకపోతున్నా లేదా తాగలేకపోతున్నా, బరువు తగ్గడం లేదా డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తున్నా వెంటనే మీ వైద్యుడిని సంప్రదించాలి. సమయానికి చికిత్స తీసుకోవడం వల్ల మీకు, శిశువుకు కలిగే సంక్లిష్టతలను తగ్గించవచ్చు. డా. కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: కంటి ఆరోగ్యం కోసం 20:20:20 రూల్ వెబ్సైట్..!) -
షార్ట్ ఫిలింస్ నుంచి సినిమాల్లోకి.. హార్ట్స్ దోచేస్తున్న తెలుగమ్మాయి
ప్రేక్షకుల మనసుకు దగ్గరవ్వాలంటే కేవలం అందం ఉంటే సరిపోదు. ఎంచుకున్న పాత్రలో ఇమిడిపోయి నటించాలి. అలాంటి నటనతో మన పక్కింటి అమ్మాయిలా ఉందేంటి? మనింటి అమ్మాయిలానే ఉంది.. అనుకునేట్టుగా దగ్గరవుతున్న నటి శివాని నాగారం. ఆకర్షించే కళ్లు, ఆకట్టుకునే నటన ఈ తెలుగమ్మాయి సొంతం. ఈ లిటిల్ హార్ట్ గురించి మరెన్నో విశేషాలు మీకోసం..ఆ సినిమాతో క్లిక్అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమాలో వెండితెరపై మెరిసిన నటి శివాని (Shivani Nagaram). మొదటి సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడింది. ఇటీవల విడుదలై సూపర్ హిట్ కొట్టిన ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో శివాని కుర్రాళ్లకు క్రష్‌గా మారింది. శివాని స్వస్థలం హైదరాబాద్. విల్లా మేరీ కాలేజీలో కామర్స్ డిగ్రీ పూర్తి చేసింది. ఆమె మొదట ‘అంతర్గత’ అనే షార్ట్ ఫిల్మ్ చేసింది. తర్వాత ‘మిస్టర్ గర్ల్ ఫ్రెండ్’ అనే వెబ్ సిరీస్ చేసి తెలుగు యువతకు ముందుగానే పరిచయమైంది.చాలా అవకాశాలొచ్చాయి, కానీ..చిన్నతనం నుంచే శివాని సంగీతం, కూచిపూడి నృత్యం నేర్చుకుంది. ఖాళీ సమయాల్లో పిల్లలకు మ్యూజిక్, డ్యాన్స్ క్లాసులు తీసుకోవడం తనకెంతో ఇష్టమట! సోషల్ మీడియాలో ఆమె తన తమ్ముడితో కలిసి పాటలు పాడుతూ వీడియోలు తీసి పోస్ట్ చేస్తుంటుంది. దాన్నిబట్టి ఆమెకు సంగీతంపై ఉన్న ఇష్టం అర్థమవుతుంది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్’ హిట్ అయ్యాక, చాలా అవకాశాలు వచ్చాయి కాని, ఒప్పుకోలేదు. ఎందుకంటే అదే తరహా క్యారెక్టర్స్ చేయడం ఇష్టం లేదు. నాకు ఎప్పటికప్పుడు చేంజ్ ఓవర్ ఉండాలి.నిత్యవిద్యార్థినిఇప్పుడే కెరీర్ స్టార్ట్ అయింది కదా.. నేనింకా యాక్టింగ్ లో చాలా నేర్చుకోవాలి. నిత్యవిద్యార్థినిగా ఉండేందుకు సిద్ధంగా ఉంటాను. నా దృష్టిలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు రెండూ గొప్పవే. నటిగా నన్ను మలచుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాననే నమ్మకం నాకుంది. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలి. వచ్చి మంచి సక్సెస్ ఫుల్ సినిమాలు చేయాలని ఎప్పుడూ కోరుకుంటాను. కాలేజీ రోజుల్నుంచే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం ఉండేది. దాన్ని మా కుటుంబ సభ్యులూ ప్రోత్సహించారు. వాళ్లు నన్నెప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు.ఆ హీరోయిన్‌కు అభిమానినినేను హీరోయిన్ సమంతకు పెద్ద ఫ్యాన్. శ్రీదేవి గారు, సావిత్రి గారి నటన అంటే చాలా ఇష్టం. 'నువ్వు హీరోయిన్ కాకపోయుంటే ఏమయ్యేదానివి’ అని చాలామంది అడుగుతుంటారు. హీరోయిన్ కాకుంటే కచ్చితంగా సింగర్ అయ్యేదాన్ని. నాకు మ్యూజిక్, డ్యాన్స్ అంటే ప్రాణం. నాకు కథ, అందులో నా క్యారెక్టర్ చాలా ముఖ్యం. అవి నచ్చితేనే సినిమాలు ఒప్పుకుంటాను. అంతే తప్ప, గ్లామరస్ రోల్స్ మాత్రమే చేయాలని అనుకోవట్లేదు. నేను రెండు సినిమాలే చేశాను. వాటికే తెలుగు ప్రేక్షకులు నన్ను ఇంతలా ప్రేమిస్తుండటం చూస్తే, చాలా అదృష్టవంతురాలిని అనిపిస్తుంది.చదవండి: దమ్ముంటే నాకు సైట్ కొట్టి చూడండి : హీరోయిన్ -
నేరము శిక్ష
ఆ చీకటి కేబిన్ లోని ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్నారు. దైవజ్ఞ తన చేతి గడియారాన్ని చూసుకుని లేచాడు. రో 23జి సీట్‌కి చేరుకుని, అందులో కూర్చుని గాఢనిద్రలో ఉన్న ఏభైపైబడ్డ ఆవిడ మెడ కింద, డిన్నర్‌తో ఇచ్చిన స్టీల్ కత్తితో కసుక్కున అడ్డంగా కోశాడు. ఆవిడ మెలకువ వచ్చి చిన్నగా కేకపెట్టింది. రక్తం చిందింది. కాని పూర్తిగా తెగలేదు. మరోసారి, ఇంకోసారి. గరగర శబ్దంతో పాటు ఆ మెడలోంచి ఎర్రటి గాలి బుడగలు బయటికి వచ్చాయి. దైవజ్ఞ ఆవిడ సీట్ మీది రీడింగ్ లైట్‌ని వెలిగించి, కాల్ బటన్ ని నొక్కాడు. నిమిషంలో ఏర్‌హోస్టెస్ అక్కడికి వచ్చింది. రీడింగ్ లైట్లో ఆవిడ మెడ నించి తల అతి అసహజ రీతిలో పక్కకి వేలాడటం, ఆవిడ ఛాతీ రక్తంతో తడిసి ఉండటం చూసి ఆమె భయంగా రెండు అడుగులు వెనక్కి వేసింది. దైవజ్ఞ ఆమెకి మడిచిన కాటన్ నేప్కిన్ ని ఇచ్చి చెప్పాడు.‘‘నేనే చంపాను. ఇది హత్యాయుధం.’’అయోమయంగా చూసే ఆమె తన చెవులని తనే నమ్మలేకపోయింది.‘‘మీ పైలెట్‌కి ఈ విషయం చెప్పండి. లాగ్ బుక్‌లో రాస్తారు.’’ అతను శాంతంగా చెప్పాడు.ట్రాన్ ్సలో ఉన్నట్లుగా ఆమె కాక్‌పిట్‌లోకి వెళ్ళింది. గజ గజ వణుకుతూ వగరుస్తూ మధ్య మధ్యలో ఆపి చెప్పింది.‘‘సీట్ 23జిలోని లేడీ మెడ తెగింది. ఒకతను తనే చంపానని, ఇందులో కత్తి ఉందని చెప్పి ఇచ్చాడు.’’‘‘నువ్వు చూస్తూండు.’’ తక్షణం కెప్టెన్ లేస్తూ ఫస్ట్ ఆఫీసర్‌తో చెప్పాడు.ఇద్దరూ 23 జి దగ్గరకి వచ్చారు. దైవజ్ఞని ఇద్దరు ప్రయాణికులు కదలకుండా చేతులు బిగించి పట్టుకున్నారు.‘‘కెప్టెన్ . నా పేరు దైవజ్ఞ. నన్ను వదలమని చెప్పండి. తలుపు తెరుచుకుని పారిపోతానా?’’ దైవజ్ఞ నవ్వుతూ సూచించాడు.‘‘ఇతను ఈవిడని పొడవడం నేను చూశాను. ఇదే వరుసలో లేప్‌టాప్‌లో పని చేసుకుంటున్నాను.’’ ఒకడు చెప్పాడు.‘‘ఎందుకు చంపావు?’’ హతురాలి మీద దుప్పటిని కప్పుతూ కెప్టెన్ అడిగాడు.‘‘ఇక్కడ చంపితే నాకు శిక్ష పడదని.’’‘‘నువ్వు నేరాన్ని ఒప్పుకున్నావు. సాక్షులు కూడా ఉన్నారు. ఎందుకు శిక్ష పడదు?’’ కెప్టెన్ అడిగాడు.‘‘నా నేరానికి నన్ను ఎవరు శిక్షిస్తారు?’’ దైవజ్ఞ ప్రశ్నించాడు.‘‘మన విమానం షికాగోలో దిగగానే అక్కడి పోలీసులు.’’‘‘వాళ్ళు నన్ను అరెస్ట్ చేస్తే ఫాల్స్ అరెస్ట్‌కి వాళ్ళ మీద నష్టపరిహార దావా వేస్తానని కూడా చెప్పండి. చూస్తూండండి. నేను స్వేచ్ఛగా తిరుగు విమానంలో వెళ్ళిపోతాను.’’అతను పిచ్చివాడని అనుమానించిన కెప్టెన్‌కి కాదని, మేధావి అయుండొచ్చని అనిపించింది. చాలామంది ప్రయాణికులు లేచారు.‘‘ఈ లేడీ విలన్ ని చంపటానికి నేను ఈ ప్రదేశాన్ని, ఈ సమయాన్ని ఎన్నుకున్నాను కెప్టెన్. ప్రపంచంలో ఎవరూ నా నేరానికి శిక్షించలేరు. అందుకు సాంకేతికతలు అడ్డు వస్తాయి.’’ దైవజ్ఞ ఆత్మవిశ్వాసంతో చెప్పాడు.‘‘సాంకేతికతలా? ఏమిటవి?’’ ప్రయాణికుల్లోని ఒకరు ప్రశ్నించారు.‘‘నన్ను ఈ నేరానికి అరెస్ట్ చేసే హక్కు ఎవరికీ లేదు. చేస్తే నన్ను ఎక్కడ విచారిస్తారు?’’‘‘ఇండియాలో. నేను లాయర్ని.’’ ఒకరు చెప్పారు.‘‘మీరు మళ్ళీ లా క్లాస్‌లో చేరండి లాయర్‌గారు. నేరం ఇండియా భూభాగం మీద జరగలేదు. ఇది ఇండియా విమానం తప్ప ఇండియన్ కన్సులేటో లేదా ఎంబసీనో కాదు. అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో, ఆకాశంలో ఈ నేరం జరిగింది. నేరం జరిగిన స్థలం నుంచి రెండు వందల నాటికల్ మైల్స్లో ఏ దేశం లేదు. ప్రపంచంలోని ఏ దేశానికి జ్యూరిస్డిక్షన్ లేని చోటుని ఎంచుకుని మరీ ఈవిడని చంపాను.’’ దైవజ్ఞ చిరునవ్వుతో చెప్పాడు.‘‘ఎందుకు చంపారు?’’ ఏర్‌హోస్టెస్ ప్రశ్నించింది.‘‘ఈవిడ న్యూరాలజిస్ట్. హైద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్లో సంవత్సరానికి కోటి రూపాయల పేకేజ్తో పని చేస్తోంది. అంత జీతం పొందటానికి ఆవిడకి నెలకి హాస్పిటల్‌కి ఎంత సంపాదించి పెట్టాలో టార్గెట్స్ ఉంటాయి. నా భార్యకి బ్రెయిన్ ట్యూమర్. మరణం తథ్యమని తెలిసీ హాస్పిటల్లో చేర్పించమంది. ఎన్ని టెస్టులు రాసిందో! పన్నెండు రోజులకి ముప్ఫైరెండు లక్షల బిల్‌ని సొంత ఇంటిని అమ్మి కట్టాను. నేను ఓ ఫేక్టరీలో టర్నర్ ఉద్యోగం చేస్తున్నాను. ఈవిడ వల్ల మా ఆవిడతో పాటు నాకు నిలువ నీడ కూడా పోయింది. నా భార్యకి ఇచ్చిన మందుల సైడ్ ఎఫెక్ట్‌ల వల్ల తిన్నది తిన్నట్లుగా వాంతైపోయి, ఎప్పుడూ మైకంలో ఉండేది. మా ఆవిడ బతకదని తెలిసీ మభ్యపెట్టి నన్ను దోపిడీ చేసింది. ఆ శిక్ష పడని నేరానికి, నేనూ శిక్ష పడకుండా ఈవిడని ఎలా చంపాలా అని చాలా రీసెర్చ్ చేసి, ఆవిడ విమాన ప్రయాణం కోసం ఏడు నెలలుగా వేచి చూస్తున్నాను. ఇక్కడ నా పగ తీర్చుకున్నాను. షికాగోలో దిగాక తిరిగి విమానంలో మళ్ళీ హైద్రాబాద్ వెళ్ళిపోతాను. ప్రపంచంలోని అన్ని దినపత్రికలు నా గురించి రేపు రాస్తాయని పందెం.’’ ‘‘నీ పథకంలో ఓ ఎదురుచూడని భాగం కూడా ఉంది.’’ అతన్ని పట్టుకున్న వ్యక్తి నెమ్మదిగా చెప్పాడు.‘‘ఏమిటది?’’‘‘ఇది. నీకెంత పగ ఉందో నాకు అంతే పగ ఉంది. ఇక్కడ జరిగిన నేరానికి నీకులా నాకూ శిక్ష పడదు.’’ చెప్పి అతను ఓ సిరంజిలోని నీడిల్ని చటుక్కున దైవజ్ఞ భుజంలో గుచ్చి ఇంజెక్ట్ చేశాడు.దైవజ్ఞ తల పక్కకి వాల్చగానే ప్రయాణికులు మరోసారి దిగ్భ్రాంతి చెందారు.‘‘మీరెవరు?’’ కెప్టెన్ అడిగాడు.‘‘ఆవిడ మా అమ్మ.’’ అతను కూడా దైవజ్ఞ అంత శాంతంగా జవాబు చెప్పాడు.‘ఫన్డే’లో ప్రచురితమయ్యే ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడాభాగస్వాములను చేయనున్నారు. మీరైతే ఈ కథకు ఏ శీర్షిక పెడతారో ఈ కింది మెయిల్‌కు పంపండి. kathakalisakshi@gmail.com -
ఆటో ఆపద్బాంధవి!
‘ఓహో.. ఈ చెన్నై అర్ధరాత్రి వీ«థుల్లో ఒంటరిగా ఏలారా వెళ్లడం!’ అని మీరు ఆలోచిస్తున్న సమయానికే, పసుపు, ఆకుపచ్చ ఆటో ఒక సూపర్ హీరో ఎంట్రీ ఇచ్చినట్టుగా బ్రేక్ వేసి మీ ముందుకు ఆగుతుంది. అదే మన రాజి అక్క!రాజి అక్కకి ఆటో అంటే వాహనం మాత్రమే కాదు, అది ఒక ఇల్లులాంటిది. అంతకంటే, ఎక్కువగా ఆ ఆటోలో ప్రయాణం కొండంత భరోసా, భద్రత! ఇరవై ఏళ్లకు పైగా ఆటో నడుపుతున్న ఆమె, ఒక డ్రైవర్ మాత్రమే కాదు; వేలమంది మహిళలకు రక్షకురాలు, ఆపద్బాంధవురాలు కూడా! ఒక భయంకరమైన ఘటన తన కళ్ల ముందే జరగడం చూసి, నిర్ణయించుకుంది ‘ఇకపై ఒక్క మహిళ కూడా భయపడుతూ ఇంటికి చేరకూడదు’ అని. అప్పటి నుంచి ఆమె ఆటో చక్రాలు కేవలం మీటరు చూపించడం మాత్రమే కాదు; భద్రత, స్నేహం, మనసులో నమ్మకం కూడా అందిస్తున్నాయి. ఆమె ఆటోలో కూర్చుంటే అందులో ఒక చిన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్, వాటర్ బాటిల్, బిస్కట్ ప్యాకెట్, సానిటరీ న్యాప్కిన్ అలా అలా! చాలా కనిపిస్తాయి. అప్పుడు అడుగుతారు ‘అక్కా, నువ్వు డ్రైవరా లేక ట్రావెల్ మమ్మీనా?’ అని, దానికి అక్క నవ్వుతూ ‘ఇవి ఉంటే ఎవరికైనా కష్టంలో ఉపయోగపడతాయి. అంతే, సేల్స్ కాదు, ప్రమోష¯Œ ్స కాదు మచ్చీ!’ అని చెబుతుంది. ఇలా ఆడుతూ పాడుతూ రోజుకు ముప్పై ట్రిప్స్ పూర్తి చేసి, శరీరం అలసిపోయినా సరే, అర్ధరాత్రి ఎవరో ఒక అమ్మాయి కాల్ చేస్తే? రాజి అక్క వెంటనే ఆటో స్టార్ట్ చేస్తుంది. ‘మహిళలు సేఫ్‌గా ఇంటికి చేరితేనే నాకు నిద్ర వస్తుంది’ అంటుంది. అంతేకాదు సీనియర్ సిటిజన్ ఎక్కితే ఫ్రీ. పిల్లాడు స్కూల్‌కి ఆలస్యమైతే ఫ్రీ. ఎవరికైనా సడెన్ ఎమర్జెన్సీ అయితే ‘మీటర్ ఆఫ్, హాస్పిటల్ ఆన్!’ ఇంతా చేస్తుంది తన ఖాళీ సమయంలో కాదు, తన జీవిత పోరాటంలో భాగంగానే!ఆమె కష్టాలకు కుటుంబమే సాక్ష్యంరాజి అక్కకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు ఇంజినీర్ అయ్యాడు, కూతురు నర్సింగ్ చదువుతోంది. భర్త అనారోగ్యం వల్ల పని మానేశాడు. అప్పటి నుంచి ఈ ఆటోనే వారికి అన్నం పెడుతోంది. కానీ రాజి అక్క ధైర్యం ముందు ఇవేమీ ఇబ్బంది కాలేదు. ‘ఈ చక్రాలు తిరిగేంత వరకు నా ఫ్యామిలీకి ఏ భయం లేదు’ అని గర్వంగా చెబుతుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ‘ఎనయుమ్ కైకల్’ అనే మహిళా ఆటో డ్రైవర్ల గ్యాంగ్ లీడర్ కూడా రాజి అక్కే! ఆమె ఆటోకి పంక్చర్ అయితే, ఐదు ఆటోలు సూపర్ ఫాస్ట్‌గా ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ స్టయిల్లో వచ్చేస్తాయి. మరెంతోమందికి ఉచిత డ్రైవింగ్ క్లాసులు కూడా ఇస్తుంది. ఆటో నడపడం నేర్చుకోవాలనుకునే మహిళలకు ఆమె గురువు. ప్రస్తుతం అక్క ఆటో ప్రయాణ కథలను విన్నవారంతా అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని నగరాల్లోనూ ఇలాంటి అక్క ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు. ఎందుకంటే, రాజి అక్క డ్రైవర్ మాత్రమే కాదు ఆపదలో ఆదుకునే అక్క, అమ్మ, ఫ్రెండ్, బాడీగార్డ్ అన్నీ. నారీ భగీరథ! కర్నాటకలోని సిర్సి దగ్గర ఒక చిన్న గ్రామం. అక్కడ ఒకప్పుడు నిత్యం నీటి కొరత, ఎండిన పంటలు, దాహంతో అలమటిస్తున్న జీవులు కనిపించేవి. అలాంటి సమయంలో చాలామంది ‘ఎవరైనా వచ్చి పరిష్కరిస్తారు’ అని చేతులెత్తేసి కూర్చుంటే, యాభై మూడు ఏళ్ల గౌరి నాయక్ మాత్రం భిన్నంగా ఆలోచించింది. తన పంటలు పచ్చగా మారాలని తపనతో ముందడుగు వేసింది. స్వయంగా తన చేతులతో బావి తవ్వడం మొదలుపెట్టింది. యంత్రాలు లేవు, సహాయం లేదు, కేవలం ఒక గిలక, తాడు, బకెట్ మాత్రమే. రోజూ ఆరు గంటలపాటు కష్టపడి, ఆరు నెలల పాటు శ్రమించింది. పక్కవాళ్లు ‘ఇది అసాధ్యం’ అన్నారు. కాని, గౌరి మాత్రం ఆగలేదు. ఆమె పట్టుదల ఫలించింది. అరవై అడుగుల లోతులో నీరు దొరికింది. ఆ నీటితో ఆమె పంటలు తిరిగి పచ్చగా మారాయి. అక్కడితో ఆగిపోకుండా, మరో బావి తవ్వింది. ఈసారి తనకోసం కాదు– పొరుగువారి కోసం. ‘నా పంటలు బతికితే సరిపోదు, నా ఊరి ప్రజలందరికీ జీవం రావాలి’ అని అనుకుంది. పాఠశాల దగ్గర బావి తవ్వొద్దని అధికారులు ఆపినా, గౌరి వెనక్కి తగ్గలేదు. స్కూల్ పిల్లలకు కూడా నీరు అందేలా చేసింది. మధ్యలో ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి, అలసట– అన్నింటినీ తట్టుకుంది. అందుకే, ఈరోజు అందరూ ఆమెను ‘లేడీ భగీరథ’ అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఆమె బావులు రైతులకు, పిల్లలకు, జంతువులకు జీవనాధారంగా నిలుస్తున్నాయి. ఇంకా గౌరి ఆగలేదు. గ్రామస్తులు దూరంగా నడుస్తూ నీరు తెచ్చుకోకూడదనే తపనతో, మూడో బావిని కూడా తవ్వుతోంది. -
హృదయ నదులు
హృదయ నదులు కొన్నిసార్లు సైన్స్ కన్నా, కవిత్వమే ఎక్కువ లాజికల్‌గా అనిపిస్తుంది! అందుకు ఒక ఉదాహరణ... బహుముఖసృజనశీలి అయిన ఇటాలియన్ చిత్రకారుడు, ఇంజినీరు లియోనార్డో డా విన్సీ నదుల్ని మానవ శరీరంలోని ధమనులు, సిరలతో పోల్చటం! నదులు, ఉపనదులు భూగోళానికిజీవ ప్రవాహ నాళాలు అని వాటి ప్రాముఖ్యాన్ని ఈ ఒక్కమాటతో చక్కగా అర్థం చేయించారు డా విన్సీ. 51 కోట్ల, 72 వేల చ.కి. మీ. విస్తీర్ణంలో ఉన్న మన భూమిపై లక్షన్నరకు పైగా నదులు ఉన్నాయని ఒక అంచనా. ఈ నదుల ప్రాముఖ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉండేందుకని గత ఇరవై ఏళ్లుగా ఏటా మనం సెప్టెంబరు నాల్గవ ఆదివారాన్ని (నేడు)‘ప్రపంచనదుల దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా పురాణాల్లో, సాహిత్యంలో, సినీ గీతాల్లో ఉన్న నదుల మననాలు కొన్ని.. మీ కోసం!ప్రవాహమే నది రూపంనదుల గురించి అల మాత్రంగానైనా మాట్లాడుకోవటం అంటే మహా సముద్రంలో ఈత కొట్టటమే! మొదలు–తుది; అంతము– ఆరంభమూ లేని ప్రవాహం... సమస్త మానవాళి జీవితాన్ని పెనవేసుకుని ఉన్న ఈ నదీ ప్రస్థానం. గ్రీకు తత్వవేత్త హెరాహ్లిటస్ అన్న మాట ఈ నదీ ప్రస్థానానికి, నదీ ప్రస్తావనకు చక్కగా సరిపోతుంది. ‘‘ఒకే మనిషి ఒకే నదిలో రెండోసారి అడుగు పెట్టడు. ఎందుకంటే– ఆ నది ఒకేలా ఉండదు. ఆ మనిషీ ఒకేలా ఉండడు’’ అంటారాయన. అంటే ప్రవాహం ఎప్పుడూ ఒకేలా ఉండదు, మనిషి కూడా నదీ ప్రవాహంలా ఒకేలా ఉండడు అని అంతరార్థం.సాగిపోయే జీవిత నౌకనదుల పోలికతో పాశ్చాత్యులవే మరికొన్ని అద్భుతమైన జీవిత సత్యాలు ఉన్నాయి. లెబనీస్–అమెరికన్ కవి ఖలీల్ జిబ్రాన్ ఏమంటారో చూడండి, ‘‘నది వెళ్లి సముద్రంలో కలిసినట్లే జననం వెళ్లి మరణంలో కలుస్తుంద’’ట! ఇక దివంగత బ్రిటన్ రాజనీతిజ్ఞుడు ఎనోచ్ పావెల్, ‘‘నా ఓడ కనిపించకుండాపోతే, నా ప్రయాణం ముగిసిందని కాదు. నది వంపు తిరిగిందని..’’ అని అంటారు! ఎంత చక్కగా చెప్పారు. ‘కొండగాలి తిరిగింది’ అని ఆరుద్ర అన్నట్లు – కొండగాలి మాత్రమే కాదు, నది కూడా తిరుగుతుంది. ప్రాప్తమున్న తీరానికి జీవిత నౌక సాగిపోతుంది. ఇదీ ఆరుద్ర మాటే. వయ్యారి గోదారమ్మ..!ఒక అమ్మాయికి యుక్త వయస్సు అనేది విశాలమైన నది నుండి సముద్రంలోకి తేలుతున్నట్లుగా ఉంటుంది అంటారు జి.స్టాన్లీ హాల్. 19వ శతాబ్దపు మనో వైజ్ఞానిక నిపుణుడు ఈయన. నదిలా నూత్న యవ్వనం పరవళ్లు తొక్కుతుందని చెప్పటం స్టాన్లీ ఉద్దేశం. ‘వయ్యారి గోదారమ్మ ఒళ్లంత ఎందుకమ్మ కలవరం..’ అని వేటూరి అడిగిన ప్రశ్నకు స్టాన్లీ ఆల్రెడీ సమాధానం చెప్పేసే ఉంచారన్న మాట! అమెరికన్ సంగీతకారుడు జాన్ విలియమ్స్, నదిని సంగీతంలో పోల్చారు. ‘‘సంగీతంలో నేను ఎక్కువ తక్కువల్ని చూడను. సంగీతం అన్నది మనమందరం కప్పులతో ముంచుకుని తాగ గల అమృతవాహిని అయిన నది’’ అన్నారు విలియమ్స్. ఇళయ రాజా దృష్టిలో సంగీతం అంటే ఏ ఉద్దేశమూ లేనిది! ‘‘నది ప్రవాహంలా సంగీతం సహజంగా, ఉద్దేశరహితంగా ఉండాలి’’ అంటారు ఇళయరాజా.స్వర్గలోక వెండి ప్రవాహంప్రాచీన కాలపు చైనా దేశీయులు పాలపుంతను కూడా ఒక ప్రకాశవంతమైన నదిగానే ఊహించారు. ఆ నదిని స్వర్గంగా, ఆ ప్రవాహాన్ని వెండిగా భావించారు. బౌద్ధ దార్శనికుడైన ఆచార్య నాగార్జునుడు మానవ జీవితంలోని దుఃఖం గురించి మాట్లాడుతూ, ‘‘నదిలో కలిసి, కదిలే చెక్క దుంగలు ప్రతి అల చేత విడిపోతాయి. అనివార్యంగా అలా వేరు అవటం దుఃఖానికి కారణం కాకూడదు’’ అంటారు. ప్రసిద్ధ బ్రెజిల్ నవలా రచయిత పాలో కోయెలో మరికాస్త లోతుకు వెళ్లి, ‘‘మీరు నదిలో పడటం వల్ల మునిగిపోరు, కానీ దానిలో మునిగిపోవటం వల్ల మునిగిపోతారు’’ అంటారు. జీవితాన్ని భయంతో ఈదలేమని చెప్పటం కావచ్చు. ఇంగ్లిష్ నటి జూలీ ఆండ్రుస్ (89)కు నది వాసన అంటే ఇష్టం. నది సౌమ్యత ఇష్టం. ఆమె చిన్నతనం అంతా నదితోనే గడిచింది. నది ఆమెను ప్రశాంతపరచింది. ఆమెకు ఓదార్పునిచ్చింది. ఈ విషయాన్ని జూలీ అనేక ఇంటర్వ్యూలలో చెప్పారు. గంగా తీరాన రిషికేశ్హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్‌కు భారతదేశంలోని సాయంత్రాలు అంటే చాలా ఇష్టమట. ఎందుకు ఇష్టమో ఆయన మాటల్లోనే విందాం. ‘‘సూర్యుడు ప్రపంచం అంచుకు చేరుకుంటాడు. శబ్దాలు అస్తమిస్తుంటాయి. పది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు సైకిళ్లపై నదీ ప్రవాహంలా ఇంటికి చేరుకుని, శ్రీకృష్ణుడి గురించి, జీవన వ్యయం గురించి ఆలోచిస్తూ ఉండే మాయా క్షణాలవి’’ అంటాడు కామెరాన్. సైకిళ్లపై ఒక ఒరవడిగా వెళ్లే శ్రామికులను ఆయన ఒక నదీ ప్రవాహంగా ఊహించుకున్నారు. మైకేల్ ఎడ్వర్డ్ లవ్ కూడా భారతదేశం గురించి గొప్పగా చెప్పారు. ఆ గొప్పకు కారణం గంగా నది. మైకేల్ అమెరికన్ సింగర్, సాంగ్‌రైటర్. ‘‘1968 వసంతకాలంలో, ‘ది బీటిల్స్’ బ్యాండ్‌కు, నాకు మహర్షి మహేష్ యోగి నుండి భారతదేశంలోని రిషికేశ్కు రమ్మని ఆహ్వానం అందింది. రిషికేశ్ అనేక సంవత్సరాలుగా లక్షలాది మందికి ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది హిమాలయాల నుండి గంగా నది ప్రవహించే ప్రదేశంలో ఉంది. ఆ వాతావరణంలో ఉండటం చాలా ప్రత్యేకమైనది’’ అంటారు మైకేల్. పురుష నది.. బ్రహ్మపుత్ర!భారతీయ పురాణాలలో అనేక నదులు ప్రవహించాయి. అయితే అవి కేవలం భౌతిక ప్రవాహాలు కావు. దైవత్వం పొందినవి. దేవతలతో సమానంగా గౌరవాన్ని పొందినవి. పూజలను అందుకున్నవి. గంగా, యమునా, సరస్వతి, గోదావరి నదులను స్త్రీ దేవతలుగా పూజిస్తారు. ఆ పవిత్ర జలాలలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. మరి పురుష నదులే లేవా? లేనట్లున్నాయి. బ్రహ్మపుత్ర నదిని మాత్రం ‘పురుష నది’గా పరిగణిస్తారు. మన నదులన్నీ కూడా రుగ్వేదం, మహాభారతం, రామాయణం వంటి పురాణ, ఇతిహాసాలలో ముఖ్యమైన పాత్రను కలిగి ఉన్నాయి. ‘గంగావతరణ’ ఘట్టందశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసిందీ, శ్రీరాముడి అవతార పరిసమాప్తి అయిందీ ‘సరయూ’ సమీపంలోనే. రామాయణంలోని ‘గంగావతరణ’ ఘట్టం అయితే ఒక అద్భుతమైన చిత్రణ. సీతను వెదకి రమ్మని వానరులను పంపేటప్పుడు ఆమెను ఎక్కడెక్కడ వెతకాలో చెబుతూ శరావతి, కావేరి, తామ్రపర్ణి, నర్మద, కౌశికీ, యమునా నదులను ప్రస్తావిస్తాడు సుగ్రీవుడు. ఇక కవుల గురించి చెప్పక్కర్లేదు. నది ఊసు లేనిదే వారి కలాలు పరవళ్లు తొక్కవు. ‘కవుల కవిత్వంలో పొంగిన నదులు’ అంటూ రాజన్ పి.టి.ఎస్.కె. అనే రచయిత తెలుగులో ఒక పుస్తకమే రాశారు. కృష్ణవేణి.. విరిబోణి.. అలివేణినది పేరుతో అనేక తెలుగు నవలలు, కథలు వచ్చాయి. అదొక అంతే లేని జాబితా. అలాగే తెలుగు సినిమా పాటలు వందలు, వేలు! పూర్తిగా ఒక నదిపైనే వచ్చిన పాట మాత్రం బహుశా డాక్టర్ సి.నారాయణ రెడ్డి రాసిన ‘కృష్ణవేణి తెలుగింటి విరిబోణి / కృష్ణవేణి నా ఇంటి అలివేణి’ కావచ్చు. ఆ పాటలో కృష్ణానది విశేషాలన్నిటినీ సినారె పొందుపర1చారు. భక్తిగీతంలా మొదలై పరవళ్లు తొక్కుతూ వెళ్లి సాగర హృదయాన సంగమిస్తుంది. ఈ పాట ‘కృష్ణవేణి’ (1974) చిత్రం లోనిది.వేదంలా ఘోషించే గోదావరికృష్ణవేణికి దీటైన ఇంకో తెలుగు సినిమా పాట.. ‘వేదంలా ఘోషించే గోదావరి.. అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి’. 1983 నాటి ‘ఆంధ్ర కేసరి’ సినిమా కోసం ఆరుద్ర ఈ పాటను రాశారు. అయితే ఆ పాట పూర్తిగా గోదావరి విశేషాల మీద కాకుండా, గోదావరికి అనుసంధానమై ఉన్న సుందర నగరాలు, కవులు–కావ్యాలు, ఏలిన రాజులు మీద సాగుతుంది. గోదావరి మీదే వేటూరి గారు రాసిన పాట ‘గోదావరి’ చిత్రంలోని ‘ఉప్పొంగెలే గోదావరి’. ఇంకా.. ‘ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తుందీ’ (ఆత్రేయ–‘చక్రవాకం’), ‘నవ్వుల నదిలో పువ్వుల పడవ’ (ఆరుద్ర–‘మర్మయోగి’), ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ’ (శేషేంద్ర శర్మ–‘ముత్యాల ముగ్గు’) ‘చినుకులా రాలి.. నదులుగా సాగి’ (వేటూరి–నాలుగు స్తంభాలాట), ‘గోదారి గట్టుంది.. గట్టు మీద సెట్టుంది..’ (దాశరథి కృష్ణమాచార్య–‘మూగ మనసులు’)... వంటి పాటలు పూర్తిగా నది చుట్టూ తిరిగినవి కాకపోయినా, దోసెడు నది నీళ్లను పట్టి ప్రేక్షకుల తలపులపై చిలకరించినవి. నదులపై మంచి మంచి సినిమా పాటలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవి కొన్ని రేణువులు మాత్రమే. నదులు కేవలం నీళ్లు కాదు, కేవలం ప్రవాహాలు కాదు, కేవలం ప్రయాణ మార్గాలు అంతకన్నా కాదు. మనిషిని బతికించే సంజీవినులు మాత్రమే కాదు. డా విన్సీ అన్నట్లు – భూగోళానికే జీవాన్ని, చేవను ఇచ్చే సిరలు, ధమనులు.· సాక్షి, స్పెషల్ డెస్క్శ్రీశ్రీ అనుసంధానం!‘మరో ప్రపంచం’ (1970) సినిమాలో శ్రీశ్రీ ‘అణగారిన బ్రతుకులలో..’ అనే పాట రాశారు. అందులోని ఒక చరణంలో... ‘గంగా, కావేరీ – నదులను కలుపుదాం..’ అన్నారు ఆయన. ఆ చరణం ఇలా ఉంటుంది : ‘ఈ దేశం నీదీ నాదని / ఇది ఒక్కరికే సొంతం కాదని / గంగా, కావేరి నదులు కలుపుదాం / కలిపి, సరిహద్దు చెరిపి, చెలిమి నిలుపుదాం..’ అని. యాభై ఏళ్ల క్రితం తొలిసారి 1972లో అప్పటి కేంద్ర మంత్రి కె.ఎల్.రావు గంగ–కావేరి నదులను అనుసంధానించాలని ప్రతిపాదించారు. అంటే, శ్రీశ్రీ తన పాట ద్వారా అంతకు రెండేళ్లకు ముందే గంగ, కావేరీలను అనుసంధానించారు! అందుకే, సృజనశీలులను కాలజ్ఞానులు అని కూడా అంటారు. నదుల అనుసంధానం గురించి 1974లో కెప్టెన్ దిన్షా జె.దస్తూర్ మరో ప్రతిపాదన తెచ్చారు. హిమాలయ నదులైన గంగ, సింధు, బ్రహ్మపుత్రలను... ద్వీపకల్ప నదులైన గోదావరి, కృష్ణ, మహానది, కావేరి, నర్మద, తపతి, పంబ వంటి వాటితో కలపొచ్చని! ఆ తర్వాత కేంద్ర జల వనరుల శాఖ ఇంకో ప్రతిపాదన తెచ్చింది. ఇవేవీ ఆచరణకు రాలేదు. -
కకుత్థ్స విజయం
అయోధ్య పాలకుడు ఇక్ష్వాకుడు ఒకనాడు పితృదేవతలకు శ్రాద్ధం పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. తన పెద్దకొడుకు వికుక్షిని పిలిచి, శ్రాద్ధ భోజనాల కోసం అడవికి వెళ్లి మాంసం తెమ్మని ఆజ్ఞాపించాడు. అతడు ఆయుధం ధరించి, రథంపై అడవికి వెళ్లాడు. వరాహాలను, జింకలను, కుందేళ్లను వేటాడాడు. వేటలో అడవంతా తిరిగి తిరిగి బాగా అలసిపోయాడు. అలసట వల్ల ఆకలి దప్పులను తాళలేకపోయాడు. ఆకలి తీర్చుకోవడానికి వేటాడిన జంతువుల్లో ఒక కుందేలును భుజించాడు. మిగిలిన వాటిని తీసుకొచ్చి, తండ్రికి అందించాడు. ఇక్ష్వాకుడి చేత శ్రాద్ధ కర్మ జరిపిస్తున్న వసిష్ఠుడు ఆ జంతువుల మాంసాన్ని సంప్రోక్షించబోతూ, అది భుక్తశేషమని గుర్తించాడు. ‘ఈ మాంసం భుక్తశేషం. ఇది శ్రాద్ధకర్మకు పనికిరాదు’ అని కోపంగా పలికాడు.ఇక్ష్వాకుడు వెంటనే కొడుకును పిలిచి, ఏం జరిగిందో చెప్పమని నిలదీశాడు.‘వేట ముగిశాక ఆకలికి తాళలేక వేటాడిన వాటిలో ఒక కుందేలును తిన్నాను’ అని చెప్పాడు వికుక్షి.శ్రాద్ధకర్మలో విధిలోపం చేసినందున ఇక్ష్వాకుడు అతడికి దేశబహిష్కారం విధించాడు. శ్రాద్ధానికి తీసుకు రావలసిన కుందేలు మాంసాన్ని భుజించడం వల్ల వికుక్షికి శశాదుడనే పేరు వచ్చింది. తండ్రి ఆజ్ఞ ప్రకారం శశాదుడు ఇల్లు విడిచి అడవులకు వెళ్లిపోయి, అక్కడే నివసించసాగాడు.కొన్నాళ్లకు ఇక్ష్వాకుడు కాలధర్మం చెందాడు. తండ్రి మరణంతో శశాదుడు తిరిగి రాజధానికి వచ్చి, మంత్రుల సలహాతో రాజ్యభారం స్వీకరించాడు.శశాదుడికి కకుత్థ్సుడు అనే కొడుకు కలిగాడు. కకుత్థ్సుడు ఆదిపరాశక్తి అపరభక్తుడు. నిత్యం అమ్మవారిని సేవిస్తూ ఉండేవాడు. శశాదుడి మరణం తర్వాత కకుత్థ్సుడు రాజ్యపాలన చేపట్టాడు. అమ్మవారి అనుగ్రహంతో అతడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయసాగాడు. అతడి పాలనలో రాజ్యం సుఖశాంతులతో తులతూగుతూ ఉండేది.అయోధ్యలో కకుత్థ్సుడి పాలన కొనసాగుతున్న కాలంలో దేవదానవులకు సంగ్రామం జరిగింది. అసురుల చేతిలో దేవతలు చిత్తుగా ఓడిపోయి, స్వర్గం నుంచి పలాయనం చిత్తగించారు. దిక్కుతోచని స్థితిలో ఇంద్రాది దేవతలందరూ నేరుగా వైకుంఠానికి వెళ్లారు.‘ఆపద్బాంధవా! జగద్రక్షకా! శరణు.. శరణు! నువ్వే మాకు దిక్కు’ అని శేషతల్పంపై చిద్విలాసంగా శయనిస్తున్న శ్రీమహావిష్ణువుకు మొర పెట్టుకున్నారు.‘దేవతలారా! దిగులు చెందకండి. అయోధ్య రాజు శశాద తనయుడైన కకుత్థ్సుడిని సాయం కోరండి. అతడికి ఆదిపరాశక్తి అనుగ్రహం అపరిమితంగా ఉంది. అతడు యుద్ధంలో మీ పక్షాన నిలబడి, పోరాడి మిమ్మల్ని గెలిపించగలడు’ అని చెప్పాడు విష్ణువు.విష్ణువు సలహాతో దేవతలందరూ అయోధ్యకు వచ్చి, కకుత్థ్సుడిని దర్శించుకున్నారు.కకుత్థ్సుడు వారికి ఉచిత మర్యాదలు చేశాడు.‘దేవతలారా! మీ రాకతో నా జన్మ ధన్యమైంది. దేవతలు స్వయంగా ఇంటికి రావడమంటే, నిజంగా అరుదైన సంఘటనే! ఆజ్ఞాపించండి! మీ కోసం నేనేం చేయాలన్నా చేస్తాను. మానవమాత్రులకు దుస్సాధ్యమైన పని అనుకున్నా మీ కోసం నేను తప్పక చేస్తాను’ అని పలికాడు.‘రాజేంద్రా! నువ్వు దేవేంద్రుడికి బాసటగా మాకు యుద్ధంలో సాయం చేయాలి. అసురులను ఓడించాలి’ అని చెప్పారు దేవతలు.‘నేను తప్పక మీ తరఫున అసురులతో యుద్ధం చేసి, వారిని ఓడిస్తాను. కాకుంటే, నాదొక షరతు. రణరంగంలో దేవేంద్రుడు నాకు వాహనంగా ఉండాలి. అప్పుడే నేను సంగ్రామంలో విజృంభించి, అసురులను తరిమికొడతాను’ అని పలికాడు కకుత్థ్సుడు.కకుత్థ్సుడి షరతుకు దేవతలు నివ్వెరపోయారు. తమలో తాము తర్జనభర్జనలు పడ్డారు. అవసరం తమది కనుక అతడి షరతుకు ఒప్పుకోమని ఇంద్రుడిపై ఒత్తిడి తెచ్చారు. చివరకు విష్ణువు కూడా అదే సలహా చెప్పాడు. చేసేదేమీ లేక ఇంద్రుడు సరేనంటూ వృషభరూపం ధరించి, కకుత్థ్సుడికి వాహనంగా మారేందుకు అంగీకరించాడు. కకుత్థ్సుడు వృషభరూపంలో ఉన్న ఇంద్రుడిపైకి అధిరోహించి, రణరంగానికి బయలుదేరాడు. వృషభాన్ని అధిరోహించిన కకుత్థ్సుడు నందీశ్వరుడిని అధిరోహించిన పరమశివుడిలా కనిపించడంతో అసురులు కొంత కంగారు పడ్డారు. అయినా, శక్తి కూడదీసుకుని, దేవతలపై యుద్ధానికి సిద్ధమయ్యారు.హోరాహోరీగా సాగిన పోరులో కకుత్థ్సుడు అసురులను చిత్తుగా ఓడించాడు. వారి నగరాన్ని స్వాధీనం చేసుకుని, ఇంద్రుడికి అప్పగించాడు.ఇంద్రుడిని వాహనంగా చేసుకున్నందుకు కకుత్థ్సుడికి ఇంద్రవాహనుడని, అసురుల నగరాన్ని స్వాధీనం చేసుకున్నందున పురంజయుడని పేరు వచ్చింది.∙సాంఖ్యాయననేను తప్పక మీ తరఫున అసురులతో యుద్ధం చేసి, వారిని ఓడిస్తాను. కాకుంటే, నాదొక షరతు. రణరంగంలో దేవేంద్రుడు నాకు వాహనంగా ఉండాలి. -
‘వీడు ఒలింపిక్స్‌కు వెళ్లి ఉంటే ఇండియాకు కచ్చితంగా గోల్డ్‌మెడల్ వచ్చేది’
నంద గోపాల్ పాత్రలో మహేష్‌బాబు హీరోగా నటించిన ‘అతడు’ సినిమా గుర్తుందా! అందులో ఓ సీన్ ఉంటుంది. బాజిరెడ్డి (కోట శ్రీనివాసరావు) హత్య కేసు దర్యాప్తు కోసం సీబీఐ ఆఫీసర్ ఆంజనేయ ప్రసాద్ (ప్రకాష్‌రాజ్) రంగంలోకి దిగుతాడు. బాజిరెడ్డిని కాల్చడానికి వినియోగించిన బిల్డింగ్ పైకి వెళ్లి సహచరుల నుంచి వివరాలు తెలుసుకుంటూ ఉంటాడు. ఆ భవనం పైనుంచి తాడు సాయంతో పక్కనే ఉన్న రైల్వేస్టేషన్లో రైలు మీదికి నంద గోపాల్ దూకాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. ‘వీడు ఒలింపిక్స్‌కు వెళ్లి ఉంటే ఇండియాకు కచ్చితంగా గోల్డ్‌మెడల్ వచ్చేది’ అంటాడు. అలాంటి తెలివైన నేరగాళ్లు బయటి ప్రపంచంలోనూ ఉన్నారు. అలాంటి వారిలో గౌరు సురేష్ ఒకడు. డబ్బు కోసం కిడ్నాప్స్ చేయడంలో పేరుమోసిన ఈ నేరగాడి ప్లానింగ్‌కు 2005 నాటి తిరుపతి వ్యాపారి కిడ్నాప్ ఓ ఉదాహరణ. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన గౌరు సురేష్ బీకాం పూర్తి చేశాడు. ఎంబీఏ చదవాలనే లక్ష్యంతో 1999లో హైదరాబాద్‌కు వచ్చి బద్రుకా కాలేజీలో చేరాడు. అనివార్య కారణాలతో ఆ కోర్సులో డ్రాపౌట్‌గా మిగిలిన సురేష్.. బతుకుతెరువు కోసం దిల్‌సుఖ్‌నగర్‌లో ‘మార్చ్ స్టడీ సర్కిల్’ ఏర్పాటు చేశాడు. ఈ స్టడీ సర్కిల్ నష్టాలను మిగల్చడంతో తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం నేరాల బాట పట్టాడు. 17 దోపిడీలు, 11 బందిపోటు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చాడు. 2003 నుంచి కిడ్నాపర్‌గా మారి, పలువురు బడా బాబులను కిడ్నాప్ చేసి భారీ మొత్తాలు వసూలు చేసుకున్నాడు. ఈ నేరాలకు సంబం«ధించి ఆరు కేసులు నమోదు కాగా, పోలీసు రికార్డుల్లోకి ఎక్కని కిడ్నాప్‌లు 14 వరకు ఉంటాయి. 2008లో ఎన్కౌంటర్ అయ్యే వరకు ఇతగాడు ఉమ్మడి రాష్ట్ర పోలీసుల్ని పరుగులు పెట్టించాడు. గౌరు సురేష్ ఏదైనా ఓ కేసులో జైలుకు వెళితే బయటకు వచ్చిన తర్వాత చేయాల్సిన నేరానికి అక్కడే స్కెచ్ వేస్తాడు. అందుకు అవసరమైన ప్రాథమిక ఏర్పాట్లనూ అక్కడ నుంచే పూర్తి చేస్తాడు. 2004లో ఇలానే ముషీరాబాద్ జైల్లో ఉన్న సురేష్– బెయిల్‌పై వచ్చాక చేయాల్సిన కిడ్నాప్‌లో ‘వాడుకోవడానికి’ ఓ ముఠాను తయారు చేసుకోవాలని భావించాడు. దీనికోసం జైల్లో ఉన్న మాజీ నక్సలైట్ మల్లారెడ్డిని, అతడి అనుచరులను పరిచయం చేసుకున్నాడు. తాను త్వరలో చేయబోయే కిడ్నాప్‌కు సహకరించాలని కోరాడు. కథ మొత్తం తానే నడిపిస్తానని, కేవలం తాను అప్పగించిన ప్యాకెట్‌ను (కిడ్నాప్ చేసిన వ్యక్తి) రెండు మూడు రోజులు జాగ్రత్తగా చూసుకోవాలని, తాను చెప్పినప్పుడు వదిలేస్తే చాలని చెప్పాడు. దీనికి మల్లారెడ్డి అంగీకరించడంతో ఓ కిడ్నాప్ స్కెచ్‌కు జైల్లోనే నాంది పడింది. అయితే అప్పటికి ఎవరిని కిడ్నాప్ చేయాలన్నది సురేష్ నిర్ణయించుకోకపోవడం కొసమెరుపు. ముషీరాబాద్ జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన సురేష్ మరో కిడ్నాప్ కోసం ప్లాట్‌ఫామ్ సిద్ధం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన పని ఎలాంటి ఆటంకాలు, హడావుడి, ఆర్భాటాలు లేకుండా పూర్తి కావాలంటే ఇల్లు, ఇల్లాలు, వాహనం కావాలని భావించాడు. ప్రాథమికంగా వీరారెడ్డి అనే బోగస్ పేరు, వివరాలతో గుర్తింపుకార్డులు తయారు చేసుకున్నాడు. దీని ఆధారంగా కొన్ని సిమ్‌కార్డులు తీసుకుని తన వద్ద ఉంచుకున్నాడు. హోల్‌సేల్ కిరాణా వ్యాపారి అవతారం ఎత్తాడు. ఆ పేరుతోనే వనస్థలిపురంలోని అపార్ట్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. కొత్తగా పెళ్లి అయిందని, త్వరలోనే భార్యను తీసుకువస్తానని చెప్పి యజమానికి అడ్వాన్స్ ఇచ్చాడు. ఓ చిన్న కుటుంబం సంసారం చేయడానికి అవసరమైన సామాన్లు ఖరీదు చేసి ఆ ఫ్లాట్‌లో పెట్టాడు. ఆపై కృష్ణనగర్‌కు చెందిన ఓ జూనియర్ ఆర్టిస్టును సంప్రదించి నెల రోజుల పాటు తన భార్యగా నటించాలని, రోజుకు రూ.2 వేలు చొప్పున చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఆమెను తీసుకుని వనస్థలిపురంలోని ఫ్లాట్‌కు వెళ్లిన గౌరు సురేష్ అలియాస్ వీరారెడ్డి ‘కొత్త కాపురం’ ప్రారంభించాడు. ఇలా ఇంటిని, ఇల్లాలిని సిద్ధం చేసుకున్న గౌరు సురేష్ తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు వాహనం ఇచ్చే వ్యక్తి కోసం గాలించాడు. అప్పట్లో సెల్ఫ్ డ్రైవింగ్స్ కార్స్ విధానం మొదలు కాలేదు. ఎవరికి వాహనం అవసరమైనా ట్రావెల్స్ నుంచి తెప్పించుకోవాల్సిందే! ఆ కారుతో పాటు డ్రైవర్నీ ట్రావెల్స్ నిర్వాహకులే పంపిస్తుంటాడు. ఆపరేషన్ పూర్తి అయిన తర్వాత ఏ దిశలో దర్యాప్తు జరిగినా తన ఉనికి బయటపడకుండా ఉండటానికి అవసరమైన స్కెచ్ వేశాడు. అలా జరగాలంటే తనతో పాటు కారులో డ్రైవర్ ఉండకూడదు. ఈ కోణంలో ఆలోచించిన సురేష్ అలియాస్ వీరారెడ్డి వనస్థలిపురం పరిసరాల్లోని ట్రావెల్ ఏజెన్సీల విషయం ఆరా తీశాడు. చివరకు వెంకట్‌రెడ్డి అనే ట్రావెల్స్ నిర్వాహకుడిని ఎంచుకున్నాడు. ఆయన వద్ద రెండు మూడుసార్లు వాహనం బుక్ చేసుకున్న సురేష్... తన ‘భార్య’తో కలిసి శ్రీశైలం, యాదగిరిగుట్ట, వేములవాడ వెళ్లి వచ్చాడు. ఆయా సందర్భాల్లో వెంకట్‌రెడ్డి కారుతో పాటు డ్రైవర్నీ పంపిస్తాడు. ఇలా వెంకట్‌రెడ్డికి రెగ్యులర్ కస్టమర్‌గా మారిపోయిన సురేష్... ప్రతిరోజూ సాయంత్రం వేళ ఆయన ట్రావెల్స్ వద్దకే వెళ్లి కూర్చునేవాడు. తాను వ్యాపారినని, కొత్తగా పెళ్లి అయిందంటూ పథకం ప్రకారం మాటల సందర్భంలో చెప్పాడు. తన భార్యతో కలిసి తరచు బయటకు వెళ్లి వస్తుంటానని, అలా సరదాగా వెళ్లేప్పుడు కారులో డ్రైవర్ ఉండటం తమ ప్రైవసీకి భంగంగా ఉందంటూ వెంకట్‌రెడ్డికి చెప్పాడు. దీంతో సురేష్ ఇబ్బందిపడుతున్నట్లు భావించిన ఆయన... ‘మీకు డ్రైవింగ్ వచ్చా?’ అని ప్రశ్నించాడు. వచ్చంటూ సురేష్ చెప్పడంతో ఈసారి కారు కావాలంటే మీరే తీసుకువెళ్లండని ఆఫర్ ఇచ్చాడు. ఈ మాట కోసమే ఎదురు చూసిన సురేష్– రెండు సందర్భాల్లో అలానే తీసుకువెళ్లి చెప్పిన ప్రకారం తిరిగి ఇచ్చేశాడు. మరోపక్క తాను ఉంటున్న అపార్ట్మెంట్ వాచ్‌మెన్‌కు తరచు డబ్బులు ఇస్తూ మచ్చిక చేసుకున్నాడు. ఇలా సురేష్ అలియాస్ వీరారెడ్డి ఇల్లు, ఇల్లాలు, వాహనం సిద్ధం చేసుకునే సమయానికి మల్లారెడ్డితో పాటు అతడి అనుచరులు ముషీరాబాద్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆ వెంటనే మల్లారెడ్డి తాము విడుదలైన సమాచారాన్ని సురేష్‌కు చేరవేశాడు. దీంతో అతడిని వనస్థలిపురం పిలిపించుకున్న సురేష్... ఎవరికీ అనుమానం రాని, ఎవరి దృష్టీ పడని ఓ సురక్షిత ప్రాంతంలో ఫ్లాట్ అద్దెకు తీసుకోవాలని, అందులో కాస్త సెటిల్ అయ్యాక అసలు కథ మొదలుపెడదామని, ఆ ఫ్లాట్‌కు అద్దె, అడ్వాన్స్ కూడా తానే చెల్లిస్తానని చెప్పాడు. దీంతో మల్లారెడ్డి వారాసిగూడ ప్రాంతంలో ఫ్లాట్ ఎంపిక చేసి, ఆ విషయం సురేష్‌కు చెప్పాడు. దానికి అవసరమైన అడ్వాన్స్‌తో పాటు ఖర్చుల కోసం కొంత మొత్తం మల్లారెడ్డికి ఇచ్చిన సురేష్– అప్పుడు టార్గెట్ కోసం వెతకడం మొదలుపెట్టాడు. (తరువాయి వచ్చేవారం) -
ఈ వారం కథ: లిఖితం
తూర్పు ఇంకా తెల్లవారలేదు. వీధి లైట్లు మిణుకు మిణుకుమంటూ వెలుగుతున్నాయి. కార్తీకమాసంలోనూ చలిగాలులు వీస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వచ్చాడు గణపతి శాస్త్రి. పంచె పైకిలాక్కుని, భుజం మీద కండువా వేసుకుని, రాగిచెంబు చేత్తో పట్టుకుని ఆ మసకచీకటిలో కేదార్ ఘాట్కేసి నడవడం మొదలుపెట్టాడు. కాశీలోని ఆ ఇరుకు రోడ్లమీద నడవడం కొత్తవాళ్ళకు సవాలే! శాస్త్రికి ప్రతి సందు తెలుసు. అతనికి తెలియని వాడ, చూడని ప్రదేశం లేదు.నెమ్మదిగా కేదార్ ఘాట్‌లో మెట్లు దిగాడు. మూడుసార్లు ‘హరహర మహాదేవ్’ అంటూ గంగలో మునిగి గట్టు మీదకు వచ్చాడు. కండువాతో వొళ్ళు తుడుచుకుని, పంచె పిండుకుని కట్టుకున్నాడు. నుదుట విభూతి ధారణ చేసి, శివ పంచాక్షరి మంత్రం మనసులో జపిస్తూ, రాగి చెంబులోని గంగా జలంతో శ్రీగౌరీ కేదారేశ్వరుడితో బాటు, అరుణాచలేశ్వరుడికి, దక్షిణామూర్తికి అభిషేకం చేశాడు. ఛప్పన్న గణపతిని, మీాక్షి అమ్మవారిని కూడా దర్శించుకొని, మళ్ళీ చెంబుతో గంగాజలం తీసుకుని బయల్దేరాడు. ఉత్తర వాహినిగా సాగే గంగా ప్రవాహాన్ని , నదీ జలాలమీద గిరికీలు కొడుతున్న తెల్లని కొంగల్ని చూస్తూ, నెమ్మదిగా మానస సరోవర్ ఘాట్, క్షేమేశ్వర్ ఘాట్, చౌసెట్టి ఘాట్ల మీదుగా దశాశ్వమేధ ఘాట్ చేరుకున్నాడు. అలాగే ఘాట్ల మీద నడక సాగిస్తూ మణికర్ణిక ఘాట్‌కు చేరుకున్నాడు. అప్పటికే అక్కడ మృతిచెందిన అదృష్టవంతుల కాష్టాలు కాలుతున్నాయి.‘ఆ అదృష్టం కోసమే కదా తను పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. రిటైరయిన తర్వాత వచ్చిన డబ్బులతో కాశీలో ఇల్లు కొనుక్కున్నదే అందుకోసం. పిల్లలు ఇద్దరూ బాగా స్థిరపడ్డారు. తన శేషజీవితాన్ని విశ్వేశ్వరుని సన్నిధిలో గడపాలని, తన కాష్టం ఇక్కడే కాలాలని ఇక్కడకు వచ్చేశాడు. మానవజన్మ దుర్లభం. ఈ జన్మలో కాశీలో మరణిస్తే మోక్షమే. మళ్ళీ జన్మంటూ ఉండదు’ అనుకున్నాడు. అక్కడున్న తారకేశ్వర లింగానికి గంగాజలంతో అభిషేకం చేశాడు శాస్త్రి. మళ్ళీ రాగి చెంబుతో గంగా జలం తీసుకున్నాడు.భక్తిభావం పొంగుతుంటే తన్మయత్వంతో ‘విశ్వేశ్వరా! నా ఆఖరిశ్వాస నీ సన్నిధిలో, ఈ కాశీక్షేత్రంలోనే తీసుకునే అదృష్టం ప్రసాదించు తండ్రీ!’ అంటూ చేతులు జోడించి మనస్సులోనే ప్రార్థించి విశ్వనాథుని మందిరంలోకి అడుగుపెట్టాడు. సర్కారువారి పుణ్యమాని మందిరం దగ్గర కొన్ని ఇరుకు ఇరుకు వీధులన్నీ విశాలమయ్యాయి. భక్తులు గంగానదిలో స్నానం చేసి సరాసరి విశ్వనా«థుని దర్శనం చేసుకోవచ్చు. అక్కడి మందిరంలో పండిట్స్‌తో బాటు భద్రతా సిబ్బంది కూడా గణపతి శాస్త్రికి పరిచయం అయినవాళ్లే. శాస్త్రికి క్యూలతో పనిలేదు. సరాసరి అంతరాలయంలోకి వెళ్లి, అక్కడే ఎంతసేపైనా ధ్యానం చేసుకోగలడు. రాగిచెంబులో తెచ్చిన గంగాజలంతో విశ్వేశ్వరునికి అభిషేకం చేసుకున్నాడు.బయటకు వచ్చి అన్నపూర్ణని, ఆ ప్రాంగణంలో భాస్కర రాయులవారు ప్రతిష్ఠించిన శ్రీచక్ర లింగాన్ని, విశాలాక్షిని దర్శనం చేసుకున్నాడు. గదోలియా చౌక్‌లో పనులు చూసుకొని, జంగంబాడి మఠ్, పాండే హవేలీ, సైకిల్ స్వామి సత్రం మీదుగా గదికి బయలుదేరాడు. ఇరుకు సందుల్లో తాపీగా తిరుగుతున్న ఆవుల్ని, భయపెట్టే కుక్కల్ని తప్పించుకుంటూ, రుద్ర జపం చేసుకొంటూ నడవడం శాస్త్రి ప్రతిభ.‘ఈ దారుల్లో ఆవులు మనుషుల్ని పొడవవు. ఆలయం మీద నుంచి గద్దలు ఎగరవు. బల్లులు అరవవు. శవాలు వాసన పట్టవు. ఇంతకంటే గొప్ప పుణ్యక్షేత్రం ప్రపంచంలో ఉందా?’ అనుకున్నాడు శాస్త్రి.‘అయ్యా! విశ్వనాథుని గుడికి ఎలా వెళ్ళాలి?’ అన్నారు ఎవరో. కాశీలో చాలామంది తెలుగు మాట్లాడుతుంటారు. పక్కకు చూశాడు శాస్త్రి. ఓ అరవయ్యేళ్ళ పైబడిన పెద్దాయన కుటుంబంతో నిలబడి ఉన్నాడు.‘శివ శివ అనుకుంటూ వెళ్ళండి. లేకపోతే ఓం నమశ్శివాయ అనుకుంటూ వెళ్ళండి’ అన్నాడు.‘అది కాదు స్వామీ! మందిరానికి దారెటని’ అన్నాడు ఆ పెద్దాయన.‘ఎక్కడనుంచి వచ్చారు? ఎక్కడ దిగారు?’ అన్నాడు శాస్త్రి. ‘రాజమండ్రి నుంచి వచ్చామండి. ఎక్కడా ఆశ్రమాలు ఖాళీ లేవండి. గంగలో మునిగి బట్టలు మార్చుకున్నాం’ అన్నాడు ఆయన.‘సరే! ఒక పనిచేయండి. ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు. అక్కడ మీరు మీ సామాన్లు పెట్టుకుని విశ్రాంతి తీసుకోవచ్చు. అదిగో అలా తిన్నగా వెళ్లి ఎడమపక్కకు తిరిగితే విశ్వనాథుని ఆలయం. నాకూడా రండి’ అని వాళ్ళ సమాధానం కోసం చూడకుండా తన ఇంటికేసి దారితీశాడు. వాళ్ళు ఆనందంగా శాస్త్రిని అనుసరించారు.‘ఇదిగో ఇదే విశ్వనాథుని మందిరం. పది నిమిషాలు నడవ గలిగితే మా ఇల్లు’ ఆన్నాడు శాస్త్రి.‘అయ్యా! తమరు పుణ్యాత్ములు. నా పేరు రామనాథం. రిటైర్డ్ స్కూల్ టీచర్ని. ఈమె నా భార్య వైదేహి. వీడు నా కొడుకు రవి. వాడి భార్య రేవతి. వాళ్ళు నా మనవలు’ అని కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేశాడు. శాస్త్రి తన ఇల్లు చూపిస్తూ, ‘నాదో నాలుగు గదుల చిన్న ఇల్లు. మీకు నచ్చితే ఆ గదిలో మీ సామాన్లు పెట్టుకుని గుడులన్నీ తిరిగి రావొచ్చు. మీ గదికి తాళం వేసుకుని వెళ్ళిరండి‘ అన్నాడు గది చూపించి. అప్పుడే మిగిలిన రెండు రూముల్లో వసతి దొరకని తెలుగు వాళ్ళ కుటుంబాలు ఖాళీ చేసి వెళ్లాయి. ‘అయ్యా! మేము ఓ నాలుగు రోజులుండి ఇక్కడ చుట్టుపక్కల ఆలయాలు అన్నీ చూసుకుంటాము. రోజుకు ఎంత ఇవ్వాలో చెప్పండి’ అన్నాడు రామనాథం.‘నేను భక్తులకు సేవ చెయ్యడం భగవంతునికి సేవ చెయ్యడంగా భావిస్తాను. బంధుమిత్రులకు, వసతి దొరకని వారికి నా గదులు ఉచితంగానే ఇస్తాను. ఇక్కడ స్టౌ, పాత్రలు ఉన్నాయి. మీ పిల్లలకు పాలు కాచి ఇచ్చుకోవచ్చు. మీరు ఖాళీ చేసి వెళ్లేటప్పుడు తలుపుకు గొళ్లెం పెట్టి వెళ్ళిపోవచ్చు. భోజనానికి ఇక్కడ సత్రాలు, ఆశ్రమాలు చాలా ఉన్నాయి. అందరూ ఉచితంగానే భోజనం పెడతారు. మీరు ఇవ్వాలనుకున్న డబ్బులు ఎవరైనా అవసరం ఉన్నవాళ్లకు ఇవ్వండి’ అన్నాడు శాస్త్రి. రామనాథం కుటుంబం వారికి చూపించిన గదికి వెళ్ళిపోయారు. తన గదికి వెళ్లి మళ్ళీ స్నానం చేసి, సంధ్యావందనం చేసుకుని, ప్రాణాయామం, ధ్యానం చేసి, యోగాసనాలు వేసి పది నిముషాలు మౌనంగా కూర్చున్నాడు. కరోనా సమయంలో భార్య పోవడంతో శాస్త్రి ఒంటరి వాడయిపోయాడు. ‘అందరూ పోయేవాళ్ళమే, కాస్త ముందు వెనుక. అదృష్టవంతురాలు కనుకనే అనసూయ కాశీలో పోయింది’ అని సర్దిచెప్పుకున్నాడు. కాశీ వచ్చిన వారికి సేవ చెయ్యడం అంటే విశ్వనాథుడికి సేవ చెయ్యడంలాగే భావిస్తాడు శాస్త్రి.రామనాథం వాళ్ళు సామాన్లు గదిలో పెట్టుకుని తాళం వేసుకుని గుడికి వెళ్ళిపోయారు. ఇంతలో సెల్ మోగింది. చూస్తే బెంగళూరు నుంచి పెద్దకొడుకు విశ్వనాథ్. శాస్త్రి సెల్ ఆన్ చేశాడు.‘ఎలా ఉన్నారు నాన్నా?’ అన్నాడు విశ్వనాథ్.‘భేషుగ్గా ఉన్నాను. చెప్పు’ అన్నాడు శాస్త్రి.‘మీకు చెప్పాను కదా నాన్నా కొత్తగా విల్లా తీసుకుంటున్నాను అని.. రేపు పదిహేనో తారీఖున గృహప్రవేశం. నాలుగు రోజులుండి వెళ్ళండి. రాను పోను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను’ అన్నాడు.‘ఈ భవబంధాలు తెంచుకుంటేనేగానీ నేను అనుకున్న గమ్యం చేరలేనురా. రిటైర్ అయ్యాక ఐదేళ్లు ప్రతి ఏడాదీ అమలాపురం నుంచి కాశీ వచ్చేవాడ్ని. పదేళ్ల క్రితం ఇల్లు కొన్నప్పటి నుంచి మీ అమ్మ పోయినా ఎక్కడికీ వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నాను. ఎందుకని? నా ఆఖరి శ్వాస ఇక్కడే తీసుకోవాలని, నా కాష్టం ఇక్కడే కాలాలని. నువ్వు బెంగళూరు నుంచి, చిన్నాడు అమెరికా నుంచి ఫోన్ చేస్తారు. అప్పుడు నా మనసు అటే లాగుతుంది. మీరు జీవితాల్లో బాగా స్థిరపడ్డారు. నాకా పెన్షన్ వస్తుంది. నా గురించి ఆలోచించొద్దురా. అస్తమానూ ఫోన్లు చేసి నా ప్రస్థానానికి ఆటంకం కలిగించకండి రా! రావడానికి కుదరదు’ అన్నాడు శాస్త్రి్త. ‘అయ్యో! అదేమిటి నాన్నా! కన్నబిడ్డ శుభమాని గృహప్రవేశానికి రమ్మని పిలుస్తే కుదరదంటారేమిటి? ఈ ఒక్కసారికి నామాట వినండి. రాకపోతే మేం అంతా బాధపడతాం. మీరు రాకపోతే అసలు గృహప్రవేశమే చేసుకోము’ అన్నాడు బాధగా.‘ప్రతిదానికి ఈ ఏడుపొకటి. సరే! రెండు రోజుల కంటే ఉండటానికి కుదరదు. ఇదేఆఖరిసారి. సరేనా?’ అన్నాడు శాస్త్రి్త అయిష్టంగానే. ‘అలాగే.. థాంక్యూ! నాన్నా’ అన్నాడు విశ్వనాథ్ ఆనందంగా. సెల్ కట్ చేశాడు. కాఫీ తాగుదామని చూశాడు. పాలు లేవు. చిన్న గ్లాసుడు బియ్యం సింగిల్ బర్నర్ స్టవ్ మీద పడేశాడు. రాత్రి మిగిలిన మజ్జిగ ఉంటే వేసుకుని తిన్నాడు. ఏది ఉంటే అది తినడం, లేకపోతే పస్తుండటం; మరీ ఆకలనిపిస్తే ఏ ఆంధ్ర ఆశ్రమానికో, గాయత్రి సత్రానికో, కరివెన సత్రానికో వెళ్ళడం; అక్కడ భోజనం అయ్యిందనిపించడం; అక్కడ సత్రంవారికి, యాత్రికులకు ఏదో ఒక సేవ చెయ్యడం అలవాటయిపోయింది.మళ్ళీ సెల్ మోగింది.చూస్తే అమలాపురం నుంచి చిరకాల మిత్రుడు రామ్మూర్తి. కాల్ లిఫ్ట్ చేశాడు.‘ఒరేయ్! శాస్త్రి! నువ్వు అస్తమానూ ఫోన్ చేసి కాశీ రా, గంగలో మునుగు, విశ్వేశ్వరుని దర్శనం చేసుకో అని చెబుతున్నావు కదా! నా భార్య కూడా వెళదామండి అని గొడవ చేస్తోంది. రేపు పన్నెండో తారీఖు ఉదయం కాశీ వస్తున్నాం. మాకు ఆశ్రమంలో వసతి ఏర్పాట్లు చెయ్యరా’ అన్నాడు రామ్మూర్తి.‘అలాగే. ఎంతమంది వస్తున్నారురా?’‘నేను, నాభార్య, కొడుకు, కోడలు’ ఆన్నాడు రామ్మూర్తి.‘ఏనాడూ గుడికి వెళ్ళనివాడివి, భగవన్నామం జపించనివాడివి, శుద్ధబద్ధకస్తుడివి. ఇంటిపని, బయటపని మీ ఇల్లాలే చేస్తుందికదా! ఇన్నాళ్ళకు విశ్వనాథుని దర్శనం చేసుకోవాలని నీకు బుద్ధిపుట్టింది. శుభం. తప్పకుండా రండి. నేను చూసుకుంటా’ అన్నాడు శాస్త్రి. ‘థాంక్స్ రా!’ అన్నాడు రామ్మూర్తి.తర్వాత నెమ్మదిగా ఆంధ్రాశ్రమం ఆఫీసులోకి వెళ్ళాడు. అక్కడ యాత్రికులకు ఆశ్రమం తరపున సేవ చేస్తూ గడిపాడు. సాయంత్రం ఆరు అయ్యింది దశాశ్వమేధ ఘాట్‌కు బయల్దేరాడు. గంగా హారతికి సమయం. కనుల విందుగా జరిగే హారతుల్ని చూడడానికి వచ్చిన జనాలు మెట్ల మీద కూర్చొన్నారు. మైకులో శ్రావ్యంగా భక్తి సంగీతం సాగుతోంది. కొంతమంది విదేశీయులతో బాటు మిగతా యాత్రికులు కూడా ఆ సుందర దృశ్యాలని తమ కెమెరాలలో భద్రపరచుకుంటున్నారు. అంతలో పట్టు పంచెలు కట్టుకున్న యువకులు హారతులు సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. నదిలో అందమైన పడవల మీద జనం కూర్చుని, తమ కనుల ముందు జరుగుతున్న గంగా హారతుల్ని భక్తి శ్రద్ధలతో గమనిస్తున్నారు.ఎప్పుడూ కూర్చునే మండపంలోనే కూర్చున్నాడు శాస్త్రి. హారతి ప్రారంభమయ్యింది. రోజూ చూసే హారతులయినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది శాస్త్రికి. హారతి అవగానే ఆశ్రమానికి వచ్చాడు. గిన్నెలు ఖాళీగా ఉన్నాయి.రెండు అరటిపళ్ళు తిని శివపురాణం తీశాడు. పది గంటల దాకా పారాయణం చేసి నడుము వాల్చాడు. శివనామ స్మరణ చేసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. రోజులు గంగా ప్రవాహంలా నెమ్మదిగా గడుస్తున్నాయి.ఉదయాన్నే ఎవరో తలుపు కొడుతూంటే తలుపు తీశాడు. ఎదురుగా రామ్మూర్తి, భార్య, కొడుకు, కోడలు చిరునవ్వుతో నిలబడ్డారు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది రామ్మూర్తి పన్నెండో తారీఖు వస్తానన్నాడని.‘రండి...రండి’ అంటూ ఆహ్వానించాడు.అప్పటికే శాస్త్రి గంగాస్నానం చేసి, మణికర్ణిక ఘాట్‌లో కాలుతున్న కాష్టాల్ని కనులనిండుగా చూసి, విశ్వేశ్వరునికి అభిషేకం చేసుకు వచ్చి సంధ్య వార్చుకోడం ముగించాడు.రామ్మూర్తిని చూడగానే ‘రా... రా... రామ్మూర్తి! ఎన్నాళ్ళకెన్నాళ్ళకు’ అంటూ ఆహ్వానించాడు.‘మీకు ఇంట్లోనే రెండు రూములు ఏర్పాటు చేశాను. కాలకృత్యాలు తీర్చుకుని రండి. గంగా స్నానం చేసి, విశ్వేశ్వరుని దర్శించుకుందురుగాని’ అన్నాడు శాస్త్రి.వారికి గదులు చూపించాడు.‘కార్తీకమాసంలో కాశీ వచ్చారు. మంచి పని చేశారు, త్వరగా తయారై రండి’ అన్నాడు.ఓ అరగంటలో అందరూ వచ్చారు. అందర్నీ కేదార్ ఘాట్‌కు తీసుకెళ్ళి, సంకల్పం చెప్పించి స్నానాలు చేయించాడు.‘ఏం చలిరా నాయనా! వణికిపోతున్నాను. నా వల్ల కాదు బాబోయ్ అంటున్నా మా అన్నపూర్ణ బలవంతంగా లాక్కొచ్చింది’ అన్నాడు రామ్మూర్తి గజగజ వణుకుతూ.‘ఈ మాత్రం చలికే ఇంత హడావిడి చేస్తున్నావ్. ఈ చలిని గులాబ్ సర్దీ అంటారు ఇక్కడ వాళ్ళు. జనవరి నెలలో చూడాలి, చలికి కాలు బయట పెట్టలేం. అయినా పుణ్యం ఊరికే రాదుగా. పుణ్యం కావాలంటే ఆమాత్రం కష్టపడక తప్పదు’ అన్నాడు శాస్త్రి. ఘాట్ల మీద నడిపిస్తూ, ఆ విశేషాలు వర్ణిస్తూ విశ్వనాథుని దర్శనం చేయించాడు. ఆ తర్వాత సహస్ర లింగేశ్వరుడు, మనోకామేశ్వరుడు, ధనేశ్వరుడు, ప్రీతికేశ్వరుడు, సాక్షి గణపతి, ఢుండి గణపతి, అన్నపూర్ణ, విశాలాక్షిల దర్శనం చేయించాడు. ‘ఇళ్ళల్లోను, షాపుల్లోనూ గుళ్ళు కట్టుకోవడమేమిటిరా? వీళ్ళ భక్తి పాడుగాను!’ అన్నాడు రామ్మూర్తి.‘కాదురా. ఒకనాటి గుళ్లనే, షాపులుగా, ఇళ్లుగా మార్చేశారు. ఏం చెయ్యగలం?’ అన్నాడు శాస్త్రి్త.రామ్మూర్తికి చాలా అలసటగా ఉంది. భారీకాయంతో నడవలేక పోతున్నాడు. ఆతని భార్యకి మాత్రం ఇంకా చూడాలని ఉంది. ఉత్సాహంగా శాస్త్రి్త ముందుకు సాగుతూ, మంగళగౌరి, మాయుఖాదిత్యుడు బిందుమాధవుడు, కాలభైరవుడు, దండపాణి, కృత్తివాసేశ్వరుని దర్శనాలు చేయించాడు.రామ్మూర్తికి కాఫీ చుక్క గొంతులో పడకపోవడంతో చుక్కలు కనిపిస్తున్నాయి. అతగాడి దృష్టి అంతా కాఫీ మీదే ఉండి చిరాకుగా ఉంది.‘ఈ ఊరేమిటిరా శాస్త్రి్త! ఈ ఇరుకిరుకు సందులు గొందులు, వాటిల్లో అడ్డంగా పడుకున్న కుక్కలు, తాపీగా సాగే ఆవులు వాటి మలమూత్రాలు, దుర్గంధం... మోటార్ సైకిళ్ళ విన్యాసాలు, కిక్కిరిసిన జనం... వాళ్ళ జరదాలు, కిళ్ళీల కంపు... అబ్బబ్బ! ఎలా ఉంటున్నావురా బాబూ? దేవుడు కాశీలోనేగాని, కూచిమంచి అగ్రహారంలో లేడా? ఆ పండిట్లు ఏమిటిరా? వాళ్ళ దౌర్జన్యం ఏమిటి? వాళ్ళ చెయ్యి తడిపితే కాని విశ్వనాథుని దర్శించుకోనివ్వరా?’ అన్నాడు రామ్మూర్తి అసహనంగా.‘నువ్వు కాశీయాత్రకు వచ్చావు. విహార యాత్రకు కాదు. ఇది మహోన్నతమైన ఆధ్యాత్మిక కేంద్రం. అందమైన ప్రదేశాలు చూడాలంటే కాశ్మీర్‌కు వెళ్లొచ్చు. జన్మ సార్థకం కావాలంటే కాశీకే రావాలి. దీన్ని మహా శ్మశానం అంటారు. నువ్వు చెప్పే ఈ అసౌకర్యాలన్నీ మన భక్తిని, సహనాన్ని పరీక్షించడానికి విశ్వనాథుడు పెట్టే పరీక్షలు’ అన్నాడు శాస్త్రి్త. దర్శనాలయ్యి ఆశ్రమానికి వచ్చేటప్పటికి మధ్యాహ్నం రెండు అయ్యింది. ‘కాఫీ’ అన్నాడు రామ్మూర్తి.‘ఇక భోజనాలే. ఆంధ్రా ఆశ్రమంలో భోజనం చాలా బాగుంటుంది. భోజనాలు అయ్యాక విశ్రాంతి తీసుకోండి. సాయంత్రం ఆరుగంటలకు హారతికి వెళ్దాం’ అని భోజనాలకు తీసుకెళ్లాడు.తను కూడా విశ్రాంతి తీసుకుని సాయంత్రం దశాశ్వమేధ ఘాట్‌కు తీసుకెళ్ళి హారతి చూపించాడు. రామ్మూర్తికి ఈ దర్శనాలు, హారతుల మీద ఆసక్తి లేదు. ఎక్కడ మంచి భోజనం దొరుకుతుందా, ఎక్కడ సుఖంగా కునుకు తీయవచ్చా అన్నదాని మీదే ధ్యాస!రెండో రోజు మనిషిని తోడు ఇచ్చి, చింతామణి గణపతి, సంకట మోచన్ హనుమాన్, దుర్గా దేవాలయం, కాశీరాజు కోట, అస్సీ ఘాట్, బెనారస్ విశ్వవిద్యాలయం చూసే ఏర్పాటు చేశాడు. మూడోరోజు శాస్త్రి కారు ఏర్పాటు చేశాడు.‘ఈ కారు డ్రైవర్ జగన్నాథ్ మన కోనసీమ వాడే. ఎక్కడ ఏం చెయ్యాలో, ఎక్కడ పిండప్రదానం చెయ్యాలో అన్నీ అతనే చూపిస్తాడు. రేపు త్రివేణి సంగమం వెళ్లి రండి. ఎల్లుండి గయలో ఎక్కడ ఏది చెయ్యాలో అన్నీ చూపిస్తాడు. గయలో పిండ ప్రదానం చేస్తే పితృ దేవతలు తరిస్తారు. మన జన్మ కూడా ధన్యమే అంటారు. నేను రేపు మా పెద్దాడి గృహప్రవేశానికి బెంగళూరు వెళ్లి రెండు రోజుల్లో వచ్చేస్తాను. మీరు అన్నీ చూడటానికి మూడు నాలుగు రోజులు పడుతుంది. ఈలోపు నేను వచ్చేస్తాను’ అన్నాడు శాస్త్రి రామ్మూర్తి భుజం మీద చెయ్యేసి.‘నువ్వున్నావు కాబట్టి వచ్చానురా శాస్త్రి! లేకపోతే గుమ్మం దిగే ప్రసక్తే లేదు. నీకు తెలుసుగా, ఇంటి పక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికే వెళ్లను. అవునూ గాయత్రి సత్రంలో భోజనాలు చాలా రుచిగా ఉంటాయని విన్నాను’... అన్నాడు రామ్మూర్తి బొజ్జ చేత్తో రాసుకుంటూ.‘నీకు భుక్తి మీద ఉన్న రక్తిలో పదోవంతు భక్తి మీద ఉంటే బాగుండేది రా! సరే అలాగే కానీయ్’ అన్నాడు శాస్త్రి్త.రామ్మూర్తి కుటుంబం కార్లో కూర్చోగానే కారు బయల్దేరి, మలుపు తిరిగింది.ఇంతలో రామనాథ కుటుంబంతో వచ్చాడు. కుటుంబం అంతా శాస్త్రికి దండం పెట్టి వెళ్ళిపోయారు.తన నివాసానికి వచ్చి పూజాకార్యక్రమాలు ముగించుకొని, ఫలహారం తిని, ఆశ్రమానికి వచ్చి యాత్రికుల సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడు. మర్నాడు ఉదయమే సెల్ మోగింది. కొడుకు జగన్నాథ్. ఆన్సర్ చేసి ‘చెప్ప రా!’ అన్నాడు.‘ఈరోజు సాయంత్రం ఫ్లయిట్‌కు టికెట్ పంపించాను. అందింది కదా! మళ్ళీ మీకు పదహారో తారీఖుకు కాశీకి టికెట్ బుక్ చేశాను. ఎట్టి పరిస్థితుల్లో మీరు రావాలి నాన్నా!’ అన్నాడు విశ్వనాథ్.‘అలాగేలేరా! వస్తున్నాను’ అన్నాడు అయిష్టంగానే. ఆ సాయంత్రం ఫ్లైట్‌కు బెంగళూరు బయల్దేరాడు. విశ్వనాథ్ ఎయిర్ పోర్ట్‌కు కారులో వచ్చి తండ్రిని రిసీవ్ చేసుకున్నాడు.ఆరాత్రి కొడుకు, కోడలు మనవడితో సంతోషంగా గడిపాడు. మరునాడు గృహప్రవేశానికి బంధుమిత్రులందరూ వచ్చారు. అందరూ శాస్త్రి్త అదృష్టాన్ని, ఆధ్యాత్మిక చింతననూ పొగిడేవారే! విశ్వనాథ్ కొన్న విల్లా చాలా ఖరీదైనది. కొడుకుతో అటువంటి ఇంటిలో ఉండే అవకాశం వదులుకున్నందుకు కొందరు శాస్త్రి మీద జాలి పడ్డారు. గృహప్రవేశానికి వచ్చినవాళ్ళందరితో మంచి హడావుడిగా ఉంది. మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో, తోరణాలతో, పట్టుచీరలతో ఇల్లు కళకళలాడుతోంది. ఇంతలో శాస్త్రి్త సెల్ మోగింది. చూస్తే డ్రైవర్ జగన్నాథ్ కాల్ చేస్తున్నాడు. పక్కకు వెళ్లి ఆన్ చేశాడు.‘చెప్పు జగన్నాథ్’ అన్నాడు.‘సార్! ఘోరం జరిగిపోయింది సార్! మీ ఫ్రెండ్ రామ్మూర్తి గారిని గయలో విష్ణుపాదాల దగ్గర పిండ ప్రదానం చేయించి, కాశీలో కేదారఖండం తీసుకురాగానే హార్ట్ ఎటాక్ వచ్చి ప్రాణం వదిలేశారు సార్! బాడీని మణికర్ణికా ఘాట్‌కు తీసుకొచ్చాం సర్!’ అన్నాడు జగన్నాథ్. శాస్త్రి్త నిర్ఘాంతపోయాడు. స్థాణువులా నిలబడిపోయాడు. తేరుకుని ‘అయ్యో! నేను రేపు వస్తున్నాను. నువ్వు దగ్గరుండి కార్యక్రమాలన్నీ సజావుగా చేయించు’ అని సెల్ కట్ చేశాడు. టైం చూస్తే మధ్యాహ్నం రెండు అయ్యింది. ఎవరి హడావుడిలో వాళ్ళు ఉన్నారు. కొందరు భోజనాలు చేస్తున్నారు. శుభం జరుగుతున్న ఈ ఇంట్లో ఎవరికీ ఈ వార్త చెప్పడానికి లేదు. వెంటనే బాత్రూంలో దూరి తల స్నానం చేసి వచ్చాడు.‘ఇదేమిటి నాన్నా! మిట్టమధ్యాహ్నం వేళ ఈ స్నానం ఏమిటి?’ అన్నాడు జగన్నాథ్.‘నాకు కాశీలో అలవాటు రా!’ అన్నాడు. ఇంతలో కొడుకు ఎవరో పిలిస్తే వెళ్ళిపోయాడు.శాస్త్రి్త ఆలోచనలో పడ్డారు.‘ఎంత అదృష్టవంతుడు రామ్మూర్తి! బాధ్యతలు తీరిపోయాయి. ఒక్కనాడు గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోని వాడు కాశీలో, అందులోనూ భైరవ యాతనలకు తావు లేని కేదార ఖండంలో ఆఖరిశ్వాస తీసుకున్నాడంటే విశ్వనాథుని దయలేకుండా జరుగుతుందా? పుణ్యాత్ములు పాపాత్ములని మనం ఏవో లెక్కలు వేస్తాం. కానీ ఆ విశ్వేశ్వరుని లెక్కలు వేరే ఉంటాయి. ఎవరికి ఏది, ఎప్పుడు ఇవ్వాలో లిఖించేది ఆయనే’ అనుకున్నాడు శాస్త్రి. అతగాడికి బాధపడాలో, సంతోషించాలో అర్థం కావడం లేదు. ‘అది పూర్వజన్మ సుకృతం. ఈ జన్మలో కాకపోతే గత జన్మలో చేసుకున్న పుణ్యం’ అనుకున్నాడు. సాయంత్రానికి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. శాస్త్రి కుటుంబసభ్యులు మాత్రమే మిగిలారు.. ‘రేపు ఉదయమే కదా ఫ్లయిట్. బట్టలు, మందులు, పూజాసామాన్లు అన్నీ సర్డుకోవడం అయిపోయింది. పెందరాళే పడుకోవాలి. ప్రొద్దున్నే లేవాలి కదా!’ అన్నాడు శాస్త్రి.‘సరే! నాన్నా! పడుకోండి. తెల్లవారు ఝామునే లేపుతాను’ అన్నాడు విశ్వనాథ్.శాస్త్రికి మనసంతా వికలం అయిపోయింది. పడుకున్నాడన్న మాటేగాని, చిన్ననాటి మిత్రుడు అలా అకస్మాత్తుగా శివైక్యం చెందడాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు. ఏ అర్ధరాత్రికో నిద్రలోకి జారుకున్నాడు. రోజు బ్రహ్మమూహూర్తంలో లేచే శాస్త్రి్త ఇంకా లేవలేదు. విశ్వనాథ్ రెడీ అయ్యి టైమ్ చూసుకున్నాడు. ఫ్లయిట్‌కి టైమవుతోంది. లేపుదామని తండ్రి గదిలోకి వచ్చాడు. శాస్త్రి్త ప్రశాంతంగా పడుకుని ఉన్నాడు.‘ప్రయాణానికి టైమవుతోంది. లేవండి నాన్నా!’ అంటూ శాస్త్రి వంటిమీద చెయ్యివేశాడు. చల్లగా మంచులా తగిలింది తండ్రి శరీరం. జరిగింది నమ్మలేక పోయాడు. తిరిగి రానిలోకాలకు తండ్రి ప్రయాణం ఎప్పుడో ప్రారంభమయ్యిందని విశ్వనాథ్‌కు తెలియగానే ‘అయ్యో! నాన్నా’ అని గట్టిగా అరిచాడు. ఆ కేకకి విశాలాక్షి పరిగెత్తుకొచ్చింది.దీనినే లాలటలిఖితం అంటారేమో! విశ్వనాథుని లిఖితం... అగోచరం..అదృశ్యం...అనూహ్యం.


