West Godavari
-
భయాందోళనలో ఆస్పత్రి వర్గాలు
తణుకు అర్బన్: తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని వైద్యవర్గాలు విధి నిర్వహణ చేయాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో విధులంటే హడలెత్తిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అత్యవసర విభాగానికి రాత్రి వేళల్లో రోగులు, క్షతగాత్రుల కోసం వచ్చేవారు అలజడి సృష్టిస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 19వ తేదీ రాత్రి చిన్నపాటి గాయంతో ఆస్పత్రి అత్యవసర విభాగానికి వచ్చిన పాతవూరుకు చెందిన ఇద్దరు సోదరులు వైద్యవర్గాలను అసభ్యపదజాలంతో విరుచుకుపడడమే కాకుండా దాడికి సైతం ప్రయత్నించి భయబ్రాంతులకు గురిచేశారు. దీంతో ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ సత్యలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఇటీవల ఇటువంటి చిన్నాపెద్దా ఘటనలు చోటుచేసుకుంటుండగా పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను వేడుకున్నా పట్టించుకోవడంలేదని వైద్యవర్గాలు ఆందోళన చెందుతున్నారు. 100 గ్రామాలకు పెద్దాసుపత్రి తణుకు నియోజకవర్గానికి సంబంధించి సుమారు 10 కిలోమీటర్లుపైగా జాతీయ రహదారి ఉండడంతో ఇటు అలంపురం నుంచి సిద్ధాంతం పైవరకు జరిగే రోడ్డు ప్రమాదాలన్నీ తణుకు ఆస్పత్రికే తరలిస్తుంటారు. అంతేకాకుండా చుట్టుపక్కల 100 గ్రామాలకు పెద్దాసుపత్రిగా సేవలందిస్తుండడంతో అధికశాతం ఈ ఆస్పత్రికి వైద్యసేవల కోసం వస్తుంటారు. నిత్యం 150 పడకలు నిండి ఉండగా, 600పైగా ఓపీ సంఖ్య ఇక్కడ నమోదవుతోంది. ఇంతటి ప్రాధాన్యత ఈ ఆస్పత్రికి ఉండడంతో పగలు, రాత్రి కూడా రోగులు, సహాయకులతో రద్దీగానే ఉంటుంది. అటువంటి ఆస్పత్రిలో వైద్యవర్గాలకు రక్షణ కల్పించకపోగా పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటుచేయమంటే ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నిత్యం రద్దీగా అత్యవసర విభాగం జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని అత్యవసర విభాగానికి ప్రతిరోజూ రాత్రి సమయంలో వివిధ కారణాలతో వైద్యంకోసం వస్తుంటారు. ముఖ్యంగా ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు, కొట్లాటల్లో గాయపడిన వారు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఆ సమయంలో వారితోపాటు సహాయకులు, బంధువులు మద్యం మత్తులో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారని సిబ్బంది వాపోతున్నారు. రాత్రి సమయంలో అత్యవసర విభాగంలో ఉండే ఒక వైద్యుడితోపాటు సిబ్బంది, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది విధుల్లో ఉంటారు. అయితే వారికి నచ్చినట్లుగా వైద్యం చేయకపోయినా, లోపలకు అనుమతించకపోయినా దాడులకు దిగే పరిస్థితులు ఇక్కడ జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులతోపాటు పదుల సంఖ్యలో లోపలకు రావడం వలన వైద్యసేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అందరూ లోపలకు రావద్దంటున్న సిబ్బందిపై మందుబాబులు బీభత్సం చేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో మహిళా వైద్యులు విధుల్లో ఉండాలంటనే భయంతో వణికిపోతున్నారని వైద్యవర్గాలు చెబుతున్నారు. ముఖ్యంగా ఏరులై పారుతున్న మద్యానికి బానిసలైన మందుబాబులు ఆస్పత్రికి వస్తే చాలు వైద్యవర్గాల గుండెల్లో రైళ్లు పరిగెట్టే పరిస్థితి ఇక్కడ నెలకొంది. అత్యవసర విభాగమా అమ్మ బాబోయ్.. రాత్రి వేళల్లో మందుబాబుల వీరంగంతో హడల్ నైట్ డ్యూటీ అంటే బెంబేలెత్తిపోయే పరిస్థితి పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ -
పశువుల్లో గురక వ్యాధి నివారణ ఇలా..
చింతలపూడి: వర్షాకాలంలో గేదెలు, గేదె దూడలు, గొర్రెలు, మేకల్లో ఎక్కువగా వచ్చే వ్యాధి గురక వ్యాధి. దీనినే గొంతు వాపు వ్యాధి అని కూడా పిలుస్తారు. పశువుల్లో వచ్చే వ్యాధుల్లో ఇది అత్యంత ప్రమాదకరమైనది. గురకవ్యాధి సోకిన పశువులకు అందించాల్సిన చికిత్సను గురించి పశుసంవర్థక శాఖ ఏడీ డా జె. లింగయ్య వివరించారు. ఎలా సంక్రమిస్తుంది పాశ్చురెల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియ వల్ల పశువులు, గొర్రెలు, మేకల్లో వచ్చే ఈ వ్యాధి క్రిములు ఎడతెరపి లేని ముసురు వాతావరణంలో వేగంగా వృద్ధి చెందుతాయి. కలుషితమైన నీరు, మేత, పరికరాలు, విసర్జకాలు, స్రావాలు, కళేబరాలు, మాంసం ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇందుకు ఈగలు, దోమలు, ఇతర కీటకాలు కూడా దోహదపడతాయి. వ్యాధి క్రిములు శ్వాస, జీర్ణ వ్యవస్థ, దోమ కాట్ల ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఎర్ర రక్త కణాలను ధ్వంసం చేసి రక్తం ప్రాణవాయువు ప్రక్రియను దెబ్బ తీస్తుంది. దీంతో ప్రాణ వాయువు సరిగా అందక పశువులు గురక పెట్టడం, రొప్పడం, ఆయాశపడటం వంటి లక్షణాలను ప్రదర్శిస్తుంది. పశువుల శరీర ఉష్ణోగ్రత 106 నుంచి 108 ఫారిన్ హీట్ వరకు పెరగడం, కనుపాపలు ఎర్రగా మారిపోవడం, మేత నెమరు నిలిచి పోవడం, మెడ గొంతు వాయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి క్రిములు శరీరంలోకి ప్రవేశించిన 12 నుంచి 36 గంటలకు వ్యాధి లక్షణాలు కనిపించి, సకాలంలో సరియైన వైద్యం అందకపోతే మరో 12 నుంచి 24 గంటల్లో పశువు మరణిస్తుంది. గురక వ్యాధికి చికిత్స వ్యాధిని గుర్తించిన మరుక్షణం రక్త పరీక్షలు నిర్వహించాలి. వ్యాధి సోకిన పశువును ఇతర పశువుల నుంచి వేరు చేయాలి. పశువులను నిలబెట్టి మాత్రమే వైద్యం చేయడం శ్రేయస్కరం. యాంపిసిల్లిన్, క్లోక్సా సిలిన్, జెంటా మైసిన్, సెఫలాక్సిన్ వంటి యాంటి బయోటిక్ మందుల్ని సరియైన మోతాదులో అవసరాన్ని బట్టి రక్తంలోకి ఎక్కిస్తే వేగంగా ఉపశమనం కలుగుతుంది. సాంబ్రాణి ధూపం వేయడం కూడా మంచిదే. వ్యాధి నిరోధక శక్తిని పెంచే మోమెజోల్ ఇంజక్షన్లు, బి–కాంప్లెక్స్ ఇంజక్షన్లు బాగా నీరసించిన పశువుౖకైతే డెక్ట్స్రోజ్ సైలెన్లు అవసరం కూడా ఉంటుంది. నివారణ ఇలా.. గురకవ్యాధి సోకిన పశువులకు రోగ క్రిములను కలిగిన కలుషిత మేత, నీరు, కళేబరాలను దూరంగా తరలించాలి. కళేబరాలను లోతుగా పూడ్చి వేయడం మంచిది. పరిసరాల్లో క్రిమి కీటకాలు వృద్ధి చెందకుండా పొడిగా ఉంచాలి. డీడీటీ, గమాక్సిన్, సైపర్ మెధ్రిన్, కార్పొరిల్ వంటి క్రిమి సంహారకాలతో క్రిమి రహితం చేయాలి. పొరుగు ప్రాంతాల నుంచి వచ్చిన పశువులను కనీసం వారం రోజులన్నా వేరుగా ఉంచి వ్యాధి లేదని నిర్ధారించుకున్నాక మిగిలిన పశువులతో కలవనివ్వాలి. గురకవ్యాధి నివారణకు ప్రభుత్వం ఏటా ఉచితంగా టీకాలు వేయిస్తుంది. ప్రస్తుతం గురకవ్యాధి, జబ్బవాపు, గాలికుంటు వ్యాధుల నిర్మూలనకు ఒకే వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. పశువైద్యుల సూచనల మేరకు ఈ టీకాలను తొలకరి తొలి దశలో లేదా ఎండలు ముదరక ముందు వేయిస్తే మంచిది. పాడి–పంట -
ఏలూరు రైల్వేస్టేషన్లో మొబిలైజేషన్ డ్రిల్
ఏలూరు (టూటౌన్): ఏలూరు రైల్వేస్టేషన్లో గురువారం సాయంత్రం రైల్వే ఎస్పీ పి.సైమన్, ఏలూరు ఆర్పీఎఫ్ సీఐ, ఎస్సై ఇతర సిబ్బందితో మొబిలైజేషన్ డ్రిల్ నిర్వహించారు. బెదిరింపులు, ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, వరదలు వంటి అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తత, ప్రతిస్పందనను తనిఖీ చేయడం ఈ డ్రిల్ లక్ష్యం అని వివరించారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ప్రస్తుత భద్రతా పరిస్థితులపై కూడా సిబ్బందికి వివరించారు. ఆంజనేయస్వామికి లక్ష తమలపాకుల పూజ జంగారెడ్డిగూడెం: హనుమద్ జయంతిని పురస్కరించుకుని గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో గురువారం ఆంజనేయస్వామికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి లక్ష తమలపాకులతో ప్రత్యేక పూజ జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం విశేష పూజల అనంతరం శ్రీ సువర్చలా హనుమద్ కల్యాణం, సాయంత్రం గుర్వాయిగూడెం, చక్రదేవరపల్లి గ్రామాల్లో స్వామి వారి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి ఆర్వీ చందన తెలిపారు. నిందితుడికి రిమాండ్ భీమవరం: భీమవరం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయలంలో కర్రి మాణిక్యం (79) అనే వృద్ధురాలిని కొట్టడంతో మృతి చెందిన కేసులో నిందితుడైన మృతురాలి మనవడు తోట మధును పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని భీమవరం ప్రిన్సిపల్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండు విధించి తణుకు ఉప కారాగారానికి పంపించారని సీఐ జి.కాళీచరణ్ తెలిపారు. -
బ్లడ్‌బ్యాంక్ సౌకర్యం అందని ద్రాక్షేనా!?
నూజివీడు: రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నూజివీడులోని 100 పడకల ఏరియా ఆసుపత్రిలో బ్లడ్‌బ్యాంకు సదుపాయం అందని ద్రాక్షగా తయారైంది. శస్త్రచికిత్సలు, కాన్పులు, రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులకు చికిత్స చేసే సమయంలో రక్తం అవసరం ఎంతో ఉంటుంది. ఇక్కడ బ్లడ్ బ్యాంక్ లేకపోవడంతో ప్రథమ చికిత్స చేసి విజయవాడకు తరలించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయమనే డిమాండ్ గత రెండు దశాబ్దాల కాలంగా ఉన్నప్పటికీ వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. గుడివాడ, విజయవాడ నుంచి తెస్తున్నారు నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి, విస్సన్ననపేట, రెడ్డిగూడెం, మైలవరం, బాపులపాడు తదితర మండలాల నుంచి నూజివీడు ఏరియా ఆసుపత్రికి ప్రతిరోజూ 450 మంది వరకు రోగులు చికిత్స నిమిత్తం వస్తుంటారు. ప్రతినెలా కాన్పులతో పాటు జనరల్ సర్జన్స్, ఆర్ధోతో పాటు ఇతర శస్త్రచికిత్సలు 320 వరకు జరుగుతాయి. కొన్నిసార్లు రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలైన క్షతగాత్రులకు ఎక్కించేందుకు రక్తం అందుబాటులో లేకపోవడంతో విజయవాడకు రిఫర్ చేయాల్సి వస్తోంది. అలా కాకుంటే విజయవాడ, గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్‌బ్యాంకు నుంచి రక్తాన్ని తెప్పించి ఆ తరువాత ఆపరేషన్లు చేస్తున్నారు. బ్లడ్‌బ్యాంకు వస్తే ఎన్నో లాభాలు ఏరియా ఆసుపత్రిలో బ్లడ్‌బ్యాంకు ఏర్పాటు చేసినట్లయితే ఎన్నో లాభాలు చేకూరతాయి. కాన్పులకు సంబంధించిన శస్త్రచికిత్సలు గాని, జనరల్ శస్త్రచికిత్సలు గాని, ప్రమాదాల్లో తీవ్ర గాయాలైన వారికి సంబంధించిన చికిత్సను గాని ఇక్కడ నిర్వహించడానికి వీలుంటుంది. అంతేగాకుండా రక్తదాతల నుంచి రక్తాని ఇక్కడే స్వీకరించవచ్చు. అలాగే పట్టణంలో, చుట్టుపక్కల గ్రామాల్లో, కళాశాలల్లో రక్తదాన శిబిరాలను నిర్వహించి రక్తాన్ని అందుబాటులో ఉంచుకోవచ్చు. పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రులకు కూడా అవసరమైన రక్తాన్ని ఇవ్వడానికి సైతం వీలుంటుంది. బ్లడ్‌బ్యాంక్ ఏర్పాటుకు అవసరమైన పరికరాలు సైతం ఇక్కడ సిద్ధంగా ఉన్నప్పటికీ బ్లడ్‌బ్యాంక్‌ను మాత్రం ఏర్పాటు చేయడం లేదు. నూజివీడు ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ స్టోరేజీ సెంటర్‌కే పరిమితం రక్తం కావాలంటే విజయవాడ, గుడివాడలకు పరిగెత్తాల్సిందే ప్రతిపాదనలు పంపాం బ్లడ్‌బ్యాంకు ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అధికారులు తనిఖీలు పూర్తి చేసిన అనంతరం బ్లడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ స్టోరేజీ సెంటర్ మాత్రమే ఉంది. రక్తం కావాలంటే గుడివాడ ఏరియా ఆసుపత్రి బ్లడ్‌బ్యాంకు నుంచి, విజయవాడలోని రెడ్‌క్రాస్‌కు చెందిన బ్లడ్‌బ్యాంకు నుంచి తీసుకొస్తున్నాం. – డా.ఆర్ నరేంద్రసింగ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ -
సొసైటీలు ఆడిట్ చేయించుకోవాలి
తణుకు అర్బన్: కో–ఆపరేటివ్ సొసైటీలు ఐటీ చట్టం నిబంధనల ప్రకారం అకౌంట్స్‌ను సరైన సమయానికి ఆడిట్ చేయించుకోవాలని, క్రమం తప్పకుండా ఐటీ రిటన్లు దాఖలు చేయాలని ఇన్కమ్ ట్యాక్స్ రాజమండ్రి రేంజ్ జాయింట్ కమిషనర్ ప్రతాప్ సింగ్ భుక్యా అన్నారు. తణుకు రోటరీ క్లబ్లో గురువారం సొసైటీల సభ్యులకు అకౌంట్స్ ఆడిట్ తదితర విషయాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిర్ణీత సమయానికి ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేయడం వలన ఐటీ చట్టం 1961 ప్రకారం సెక్షన్ 80పి డిడక్షన్ పొందవచ్చని స్పష్టం చేశారు. అనంతరం సీఏ కారుమూరి ధనసాయి ఆదాయపు పన్ను చట్టంలో నూతన నిబంధనలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ఆదాయపు పన్ను అధికారి సీపీకే దొర, జిల్లా ఆడిట్ అధికారి మానేపల్లి సాయిబాబా, డీసీవో శ్రీనివాస్, డీసీఏవో అంబేడ్కర్, ఆదాయపు పన్ను శాఖ అధికారులు, సొసైటీల సభ్యులు పాల్గొన్నారు. -
ఆదివాసీ గిరిజనులపై అమానుషం
భీమవరం: ఆదివాసీ గిరిజనులను కగార్ పేరుతో ఊచకోత కోస్తున్నారని నక్సలైట్లు పేరుతో అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం దారుణమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. భీమవరం సీపీఐ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన పార్టీ జిల్లా సమితి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే వంకతో నక్సలైట్లను నిర్ధాక్షిణ్యంగా కాల్చిచంపడం దుర్మార్గమన్నారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇచ్చిన అర్జీలపై తక్షణం చర్యలు తీసుకోవాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2వ తేదిన తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లు ముప్పాళ్ళ చెప్పారు. పార్టీ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ సీపీఐ జిల్లా మహాసభలు ఆగస్టు 6, 7 తేదీల్లో ఉండిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ముందుగా పహల్గాం ఘటనలో మృతులకు, ఇటీవల మృతి చెందిన సీపీఐ నాయకులు జక్కంశెట్టి నాగేశ్వరరావు, మొల్లేటి చినవెంకటరెడ్డి కుటుంబాలకు సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పాల్గొన్నారు. రొయ్యల పట్టుబడికి వెళ్లనివ్వడం లేదు సాక్షి టాస్క్‌ఫోర్స్: తన రొయ్యల చెరువులో రొయ్యల పట్టుబడికి వెళ్లనీయకుండా టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో వారితో ఏర్పడిన ఘర్షణలో స్పృహ తప్పి ఆస్పత్రి పాలయ్యాడు పెదపాడు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన ఘంటసాల సుబ్బారావు. దీంతో అతడిని ఏలూరులోని ఆయుష్ ఆసుపత్రికి అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులమనే నెపంతోనే తమను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సుబ్బారావు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాజకీయ కక్షల నేపథ్యంలో చెరువుల్లో చేపలు, రొయ్యలు పట్టనీయకుండా అడ్డుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సుబ్బారావుకు చెందిన చెరువుల్లో చేపలను పట్టనీయలేదు. దీనిపై అధికారులను ఆశ్రయించినా ప్రయోజనం లేకపోవడంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం హైకోర్టు ఆదేశాల మేరకు చెరువులో చేపలు పట్టుకున్నారు. మరలా రొయ్యలను పట్టుకోనివ్వకుండా అడ్డుకోవడంతో సుబ్బారావు ఆందోళనకు లోనై ఆస్పత్రిపాలయ్యాడని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం విరమించుకోవాలి భీమవరం: రేషన్‌షాపుల నుంచి మొబైల్ డిస్సెన్సింగ్ యూనిట్లు (ఎండీయూ) ద్వారా నిత్యావసర సరుకులు సరఫరా చేసే వ్యవస్థను రద్దు చేయకుండా మరింత మెరుగుపర్చి ఇంటింటికీ రేషన్ సరుకులు సరఫరా చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జేవీ గోపాలన్ డిమాండ్ చేశారు. గురువారం భీమవరంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎండీయూ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఇంటి వద్ద బియ్యం అందించడంతోపాటు వాహనాల వద్ద రేషన్న్ తీసుకోలేకపోయనవారికి రేషన్న్ డిపో వద్ద సరుకులు తీసుకునేట్లుగా ఏర్పాటు చేయాలన్నారు. -
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌ను 22 శాతానికి పెంచాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ) : ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌ను 22 శాతానికి పెంచాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు డిమాండ్ చేశారు. పట్టణంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 60 లక్షల మంది మాలలు ఉన్నారని తెలిపారు. మాలలకు 7.5 శాతం రిజర్వేషన్ సరికాదని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. హైకోర్టులో మాల సంఘాలు పిల్ వేయడం, కోర్టు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చెల్లదని తీర్పు రావడం ఖాయమన్నారు. ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మాల సంఘాల జేఏసీ నాయకులు గంటా సుందర్ కుమార్, కేసీ రాజు, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. అద్యశ్యమైన యువకుడి హత్య..? భీమవరం: భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసులోని ఓ యువకుడు హత్యకు గురైనట్లు తెలిసింది. ఈనెల 4వ తేదీన కనిపించకుండా పోయిన యువకుడిని పట్టణానికి చెందిన ఒక కుటుంబం హత్య చేసి మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి తూర్పుగోదావరి జిల్లా జొన్నాడ ప్రాంతంలో విడిచినట్లు సమాచారం. యువకుడి కుటుంబ సభ్యులకు ఆకాశరామన్న ఉత్తరం ద్వారా హత్య జరిగినట్లు తెలియడంతో యువకుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా యువకుడిని హత్య చేసినట్లు ఆ కుటుంబం అంగీకరించినట్లు తెలిసింది. దీనితో జొన్నాడ ప్రాంతానికి వెళ్లిన పోలీసులు గోనె సంచిలో ఉన్న మృత దేహాన్ని గుర్తించి హత్యకు కారణమైన వ్యక్తులను విచారిస్తున్నట్లు సమాచారం. కన్నాయగూడెంలో చోరీ కొయ్యలగూడెం : మండలంలోని పొంగుటూరు పంచాయతీ పరిధిలోని కన్నాయగూడెం గ్రామంలో గురువారం తెల్లవారుజామున చోరీ జరిగింది. బాధితురాలు గద్దే రాణి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గద్దే రాణికి చెందిన పాత పెంకుటిల్లును రేకుల షెడ్డుగా మారుస్తున్నారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న పూరి గుడిసెలో సామాన్లు పెట్టుకుని కుటుంబసభ్యులతో అక్కడే నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో మెలకువ వచ్చి చూసినప్పుడు, పెట్టెను కోసి ఉండటాన్ని గుర్తించింది. వెంటనే పెట్టెను పరిశీలించగా, ఇంటి నిర్మాణం కోసం తెచ్చిన రూ.5 లక్షల నగదు, 9 కాసుల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, చోరీపై ఆధారాలు సేకరిస్తున్నారు. -
ఏలూరులో ఘరానా మోసగాడు
ఏలూరు టౌన్: ఏలూరు ప్రాంతానికి చెందిన ఒక ఘరానా మోసగాడు ఏకంగా బెంగుళూరు, హైదరాబాద్ నగరాలతో సహా ఏలూరు పరిసర ప్రాంతాల్లో అనేక మందిని మోసం చేసి భారీగా డబ్బులు కాజేశాడు. బంగారం బిస్కెట్లు, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశాల్లో ఉద్యోగాలు, తన కంపెనీలో పెట్టుబడులు పెడితే లాభాలు ఇస్తానని నమ్మించి కోట్ల నగదు కాజేశాడు. ఈ మోసగాడికి పోలీసులు ఎట్టకేలకు చెక్ పెట్టారు. పోలీసులు తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు నగర శివారు వట్లూరు ఇంద్రప్రస్థా కాలనీకి చెందిన సత్తెనపల్లి హరీష్ కుమార్ అలియాస్ రిషి, అలియాస్ రిషికుమార్ చాలా కాలంగా హైదరాబాద్‌లోని ప్రగతినగర్, మై హోమ్ అపార్ట్‌మెంట్స్‌లో ఉంటూ చార్టర్డ్ అకౌంటెంట్, సొంతగా ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉందని చెబుతూ ఆన్లైన్లో పలువురితో చాటింగ్ చేస్తూ పరిచయం చేసుకున్నాడు. ట్రేడ్ బిజినెస్ లోనూ అపారమైన అనుభవం ఉందని పెట్టుబడులు పెడితే లాభాలు ఇస్తానని నమ్మించేవాడు. ఈ క్రమంలోనే ఏలూరు శనివారపుపేటకు చెందిన ఓ వ్యాపారి పీ. సాయికుమార్ ఇతనికి పరిచయం కాగా విదేశాల్లో ఉద్యోగాలు, గోల్డ్ బిస్కెట్ల వ్యాపారం ఆశ చూపాడు. అతని మాటలు నమ్మిన సాయికుమార్ ఆన్లైన్ ద్వారా రూ. 1 కోటి నగదు చెల్లించాడు. అనంతరం తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు ఫిర్యాదు చేయటంతో సైబరాబాద్ కమిషనరేట్ సైబర్ క్రైం పోలీసులు బుధవారం హరీష్ కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.తీగ లాగితే డొంక కదిలిందితీగ లాగితే డొండ కదిలినట్లు హరీష్ చేసిన అనేక మోసాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో హరీష్ కుమార్ నల్లజర్లకు చెందిన ఒక ఆక్వా వ్యాపారిని ఆన్లైన్లో పరిచయం చేసుకుని గోల్డ్ బిస్కెట్లు, ట్రేడ్ మార్కెట్లో లాభాలు ఇస్తానని నమ్మించి అతని వద్ద విడతల వారీగా రూ. 50 లక్షలు కాజేశాడు. బాధితుడు ఒత్తిడి చేయటంతో ఏలూరు ఇంద్రప్రస్థా కాలనీలో ఉన్న తన ఇల్లు బాధితుడికి అమ్మి రిజిస్ట్రేషన్ కూడా చేశాడు. కానీ ఇల్లు అప్పచెప్పకుండా తన భార్య, తల్లి, మరదలను ఆ ఇంట్లోనే ఉంచుతూ ఫోర్జరీ సంతకాలతో పత్రాలు సృష్టించి ఇబ్బందులు పెట్టాడు. ఇక ఏలూరు శనివారపుపేటకు చెందిన మరో వ్యాపారి వద్ద రూ.2.50 కోట్లు కాజేశాడు. బెంగుళూరులో శశాంక్ అనే వ్యక్తిని పరిచయం చేసుకుని అతనికి బంగారు బిస్కెట్లు ఇస్తానని నమ్మబలికి రూ.62 లక్షలు కాజేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బెంగుళూరు సైబర్ క్రైం పోలీసులు ఇటీవలే హరీష్ కుమార్‌ని అరెస్ట్ చేసి అక్కడ సెంట్రల్ జైల్లో ఉంచారు.అనంతరం హైదరాబాద్‌లో ఈ మోసగాడి చేతిలో రూ.1 కోటి 85 లక్షలకు మోసపోయిన రెనిల్ కుమార్ అనే బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బషీరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అతన్ని ఈనెల 4న పీటీ వారెంట్‌పై అరెస్ట్ చేసి చంచల్గూడా జైలుకు తరలించారు. హరీష్ కుమార్‌పై తాజాగా సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేయటంతో అరెస్ట్‌కు రంగం సిద్ధం చేశారు. ఏలూరులోనే మరికొంతమంది బాధితులు మేమూ మోసపోయామంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారని తెలుస్తోంది. -
నిమ్మల జైలుకు వెళ్లలేదా?
పాలకొల్లు సెంట్రల్: ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిని ఎలా గౌరవించి మాట్లాడాలో తెలియని దుస్థితిలో మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారని పాలకొల్లు వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ గుడాల గోపి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ .. ‘ఆ మంత్రి గారు ఎన్నికల ముందు నీకు 15, నీకు 18, నీకు 45 వేలు అంటూ కనిపించిన ప్రతి ఒక్కరికీ నగదు పంపిణీ చేస్తామని అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు’ అని జగన్మోహన్రెడ్డి మాట్లాడింది మంత్రి నిమ్మల రామానాయుడు గురించేనని, ఈ వీడియో నేటికి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుందని గోపి అన్నారు. మంత్రి నిమ్మల సహనం కోల్పోయి జగన్మోహన్రెడ్డిని ఏకవచనంతో సంభోదించడం అతని అహంకారానికి, గర్వానికి నిదర్శనమన్నారు. కోర్టులో కేసులున్న వారంతా నేరగాళ్లు కాదనే విషయం తెలుసుకోవాలన్నారు. రామానాయుడు గర్వం చూస్తుంటే రాష్ట్రంలో సెకండ్ సీఎంలా ఫీల్ అవుతున్నట్లున్నారని విమర్శించారు. మంత్రి నిమ్మల గతంలో సెంట్రల్ జైలుకు వెళ్లిన విషయం మర్చిపోయారా.. మంత్రి నిమ్మల ఎన్ని ఒత్తిళ్లకు గురిచేసినా యలమంచిలి మండలం ఎంపీటీసీలంతా జగన్‌కు మద్దతుగా ఎంపీపీని గెలిపించుకున్నారన్నారు. రౌడీయిజం చేసి సోషల్ మీడియా, వైఎస్సార్సీపీ నాయకులు, మీడియా ప్రతినిధులపై కేసులు బనాయించి బెదిరింపులకు దిగే కొత్త సంస్కృతిని మంత్రి నిమ్మల తీసుకువస్తున్నారన్నారు. ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు చెల్లెం ఆనందప్రకాష్ మాట్లాడుతూ.. మీరు జైలుకి వెళ్లివచ్చారు, మీ నాయకుడు చంద్రబాబు 52 రోజులు జైలులో గడిపారు. అంటే మీరిద్దరూ నేరస్తులేనా అని నిమ్మలను ప్రశ్నించారు. సూపర్ 6 అమలు చేయాలని.. అంతే గాని ఇలా బెదిరించి కేసులు పెట్టడం సమంజసం కాదని హెచ్చరించారు. సీనియర్ నాయకులు కుమార దత్తాత్రేయవర్మ మాట్లాడుతూ నియోజకవర్గంలో పేకాట శిబిరాలు, కోడి పందేలు, మద్యం సిండికేట్ల నుంచి నెలకు సుమారు రూ.కోటి ఏటీఎంలా మంత్రి నిమ్మలకు ఆదాయం వస్తుందని ఆరోపించారు. జెడ్పీటీసీ నడపన గోవిందరాజులు నాయుడు, యడ్ల తాతాజీ, కర్రా జయసరిత పట్టణ, యలమంచిలి, పోడూరు మండలాల అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు, ఉచ్చుల స్టాలిన్, కొర్రపాటి వీరాస్వామి, పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. కోర్టులో కేసులున్న వారంతా నేరగాళ్లు కాదు వైఎస్సార్సీపీ పాలకొల్లు ఇన్చార్జి గుడాల గోపి -
కోకోకు మద్దతు ధర కల్పించాలి
ఏలూరు (టూటౌన్): కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఏలూరు అన్నే భవనంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ్ణ అధ్యక్షతన బుధవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కోకో రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మోండలీజ్ కంపెనీ ఎదుట చేసిన మహాధర్నా, దీక్షలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈనెల 23న ఏలూరు కలెక్టరేట్‌కు చర్చలకు పిలవడాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా రైతులకు మద్దతు ధర ఇచ్చి కోకో రైతులను ఆదుకోవాలని కోరారు. కోకో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంతవరకు కంపెనీలు, ట్రేడర్లు కొనుగోలు చేసిన కోకో గింజలకు కూడా అంతర్జాతీయ మార్కెట్ ధర వర్తింపజేసి వ్యత్యాసపు ధర చెల్లించాలన్నారు. రైతుల నుంచి కోకో గింజలు సక్రమంగా కొనుగోలు చేయకుండా కంపెనీలు చేస్తున్న మోసాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. విదేశీ కోకో గింజలు దిగుమతులు వెంటనే నిలుపుదల చేయాలని కోరారు. కోకో రైతుల సంఘం గౌరవాధ్యక్షుడు సింహాద్రి గోపాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోళ్ల వెంకట సుబ్బారావు, పానుగంటి అచ్యుతరామయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శులు గుదిబండి వీరారెడ్డి, కొసరాజు రాధాకృష్ణ, ఉప్పల కాశీ తదితరులు పాల్గొన్నారు. -
టీచర్ల బదిలీలకుహెల్ప్ డెస్క్ ఏర్పాటు
భీమవరం: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) భీమవరం కార్యాలయంలో బుధవారం ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి హెల్ప్‌డెస్క్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పీఎస్ విజయ రామరాజు, ఏకేవీ రామభద్రం మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్స్ విషయంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సహాయ కేంద్రంలో ఉపాధ్యాయులు ఆన్లైన్ అప్లికేషన్స్ ఉచితంగా చేయించుకోవడమేగాక ఏమైనా అనుమానాలు ఉంటే నివృతి చేసుకోవచ్చనన్నారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు సీహెచ్ పట్టాభిరామయ్య, జిల్లా కార్యదర్శులు కె.రామకృష్ణ ప్రసాద్, జి.రామకృష్ణంరాజు, అబ్రహం తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష భీమవరం: భీమవరంలో బుధవారం ఏపీ ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష 5 కేంద్రాల్లో నిర్వహించారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 170 మందికి 164 మంది విద్యార్ధులు, మధ్యాహ్నం 170 మందికి 165 మంది హాజరయ్యారు. విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 110 మందికి 104, మధ్యాహ్నం 110 మందికి 106 మంది హాజరు కాగా.. విష్ణు ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 87 మందికి 83, మధ్యాహ్నం 87 మందికి 84 మంది హాజరయ్యారు. డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 100 మందికి 96 మంది, మధ్యాహ్నం 100 మందికి 96 మంది హాజరు కాగా డీఎన్నార్ అటానమస్ కళాశాలలో ఉదయం 100 మందికి 98 మంది, మధ్యాహ్నం 100 మందికి 98 మంది హాజరయ్యారు. ‘దీపం’తో పేదింట వెలుగులు భీమవరం (ప్రకాశంచౌక్): దీపం పథకం పేదింట మహిళల్లో వెలుగులు నింపిందని పర్యాటక, గృహ నిర్మాణ శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. బుధవారం ఆయన భీమవరం దుర్గాపురంలో దీపం పథకం లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి దీపం పథకం ప్రయోజనాలు అడిగి తెలుసుకున్నారు. పేద మహిళలకు ఆర్థిక ప్రయోజనం కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఆయన వెంట కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఐరన్, సిమెంట్ బస్తాల చోరీ వాస్తవమే దెందులూరు: జిల్లాలో పేదల గృహ నిర్మాణ కాలనీల్లో ఇళ్ల నిర్మాణ సామగ్రి దొంగతనాలు, దుర్విని యోగం జరిగాయని జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.సత్యనారాయణ చెప్పారు. బుధవారం ఏలూరులో తన కార్యాలయంలో సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంపై స్పందించారు. దెందులూరు గృహ నిర్మాణ శాఖ గొడౌన్ నుంచి స్టీల్, నూజివీడు గోడౌన్లో డోర్స్, కిటికీలు, స్టీల్, ఎలక్ట్రికల్ సామాన్లు చోరీకి గురయ్యాయాన్నారు. ఏలూరులో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నూజివీడు: ఏలూరులో బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనుండటం ఈ ప్రాంతానికి వరమని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. నూజివీడులో మాట్లాడుతూ దూరవిద్య ద్వారా చదువుకునేలా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. -
చిన వెంకన్న హుండీ ఆదాయం రూ.3.92 కోట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల నగదు లెక్కింపు ప్రమోద కల్యాణ మండపంలో బుధవారం కట్టుదిట్టమైన భద్రత నడుమ జరిగింది. లెక్కింపులో శ్రీవారికి భారీగా ఆదాయం సమకూరింది. గత 34 రోజులకు నగదు రూపేణా స్వామికి రూ. 3,92,94,035 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి తెలిపారు. కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 556 గ్రాముల బంగారం, 8.100 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.2000, రూ.1,000, రూ.500 నోట్ల ద్వారా రూ.66,500 లభించినట్టు చెప్పారు. -
రూ.175 కోట్లు తాగించాల్సిందే!
మద్యాన్ని ఏరులై పారించి సంపదను సృష్టించుకునే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. జిల్లాకు రూ.175 కోట్ల నెలవారీ లక్ష్యం నిర్ణయించి ఆ మేరకు అమ్మకాలు పెంచుకునే పనిలో పడింది. లక్ష్యాన్ని చేరుకునేందుకు నిబంధనలకు నీళ్లొదిలేసింది. అనధికార పర్మిట్ రూంలు, బెల్టు షాపులు, నైట్ పాయింట్ల పేరిట పగలూ రాత్రీ తేడా లేకుండా ప్రజల్ని మద్యం మత్తులో ముంచుతోంది. గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025సాక్షి, భీమవరం: జిల్లాలో 193 మద్యం దుకాణాలు ఉండగా రోజుకు సుమారు రూ.4 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. గతేడాది అదే నెలలో జరిగిన మద్యం అమ్మకాలపై 20 శాతం పెంచేలా టార్గెట్లు విధించగా ఇప్పుడు భారీగా పెంచేసింది. పశ్చిమగోదావరి జిల్లాకు నెలకు రూ.175 కోట్ల అమ్మకాలు చేయాలని నిర్ధేశించింది. ఈ మేరకు రోజుకు రూ.6 కోట్ల వరకు మద్యం అమ్మకాలు చేయాలి. లక్ష్యాన్ని చేరుకునేలా ఎకై ్సజ్ అధికారులపై ఉన్నత స్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. రోజువారీ సమీక్షలతో ఉక్కిరిబిక్కిరవుతున్న అధికారులు లక్ష్యాన్ని చేరేందుకు నిబంధనల అమలులో చూసీచూడనట్లు ఉంటున్నారు. సిండికేట్ల ఇష్టారాజ్యంగా మారింది. ఎకై ్సజ్ పాలసీకి విరుద్ధంగా ఇప్పటికే మద్యం బాటిల్‌పై అదనంగా రూ.10 వరకు ఎమ్మార్పీకి మించి అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారు. ఒక్కో షాపు పరిధిలో రెండు నుంచి ఐదు వరకు బెల్టులు నిర్వహిస్తున్నారు. షాపుల వద్దనే మద్యం సేవించేందుకు టేబుళ్లు, కుర్చీలతో సిట్టింగ్ ఏర్పాట్లు, మంచింగ్ కోసం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, సోడా, డ్రింక్, వాటర్ బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. లూజ్ సేల్స్, నైట్ పాయింట్ల పేరిట చాలా చోట్ల మద్యం అమ్మకాలు చేస్తున్నారు. భారీగా పెరిగిన అమ్మకాలు కూటమి పాలనలో జిల్లాలోని ఆరు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగిపోయాయి. ప్రైవేట్ పాలసీ వచ్చిన గత ఏడాది అక్టోబరు 16 నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకూ 9,42,129 కేసుల లిక్కర్, 3,86,035 కేసుల బీర్లు అమ్మకాలు జరిగాయి. గత ప్రభుత్వంలో 2023 అక్టోబరు 16 నుంచి 2024 మార్చి నెలాఖరు వరకూ 7,60,837 కేసుల లిక్కర్, 2,16,535 కేసుల బీర్ల అమ్మకాలు మాత్రమే జరగడం గమనార్హం. గతంతో పోలిస్తే ప్రైవేట్ పాలసీ వచ్చాక 24 శాతం మేర లిక్కర్, 80 శాతం మేర బీర్ల అమ్మకాలు పెరిగాయి. వీటిని మరింత పెంచుకునేందుకు భారీగా టార్గెట్లను నిర్దేశిస్తోంది. శాంతి భద్రతలకు విఘాతం అమ్మకాలు పెంచుకునేందుకు ప్రభుత్వం నిబంధనలకు గాలికొదిలేస్తుండటంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. ఇటీవల తణుకు ఉండ్రాజవరం గణేష్‌చౌక్ ప్రాంతంలోని మద్యం దుకాణం వద్ద నైట్పాయింట్ పేరిట అనధికారికంగా తెల్లవార్లు మద్యం అమ్మకాలు చేశారు. అర్థరాత్రి మద్యం కోసం వచ్చిన వ్యక్తికి సిబ్బంది మధ్య వివాదం చోటుచేసుకుంది. మద్యం కొనుగోలుకు వచ్చిన వ్యక్తి సిబ్బందిపై రాడ్‌తో దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. వేల్పూరులోని మద్యం దుకాణం కాంపౌండ్‌లో అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతిచెందడం వివాదస్పదమైంది. గతంలో ఊరికి దూరంగా ఉన్న దుకాణాలు ఇప్పుడు జనావాసాల మధ్యలోకి వచ్చాయి. మందుబాబుల ఆగడాలతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. న్యూస్‌రీల్ మద్యంతో సంపద సృష్టి జిల్లాల వారీగా ఎకై ్సజ్ శాఖకు నెలవారీ టార్గెట్లు తాగించాల్సిందేనంటూ ఉన్నత స్థాయి నుంచి ఒత్తిడి అనధికార పర్మిట్ రూంలు, విచ్చలవిడిగా బెల్టుల ఏర్పాటు 6 నెలల్లో 24 శాతం లిక్కర్, 79 శాతం పెరిగిన బీర్ల అమ్మకాలు గత ప్రభుత్వంలో.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ప్రభుత్వ మద్యం పాలసీని తెచ్చి నిర్ణీత వేళల్లో మాత్రమే అమ్మకాలు చేసేవారు. బెల్టుషాపులు పూర్తిగా అరికట్టారు. షాపుల వద్ద కొనుగోలు చేసి తీసుకెళ్లడమే తప్ప తాగేందుకు వీలు లేకుండా చేశారు. ఎమ్మార్పీకి మించి అధిక ధరల ఊసే లేదు. నాడు మద్యంపై వచ్చే ఆదాయం మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరి ప్రజావసరాలకు ఉపయోగపడితే.. నేడు అధిక ధరలు, బెల్టు షాపుల రూపంలో కూటమి నేతలు, సిండికేట్ల జేబుల్లోకి వెళ్తుండడం గమనార్హం. అప్పట్లో ఊరి చివర ఎక్కడో ఉన్న మద్యం దుకాణాలు ఇప్పుడు జనావాసాల్లోకి వచ్చేశాయి. -
రెండు కిలోమీటర్లు వెళ్లాలి
ఇంటింటికి రేషన్ సరుకుల వాహనాలు నిలిపివేస్తే రేషన్ షాఫునకు రెండు కిలోమీటర్లు నడిచివెళ్లి బియ్యం తెచ్చుకోవాలి. కూలి పనులు చేసుకుని జీవించే మాలాంటి వాళ్లకు రేషన్ కోసం ఒక రోజు పని మానేయాలి. క్యూలైన్లో ఎక్కువ మంది ఉంటే మరో రోజు వెళ్లక తప్పదు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఇబ్బందులు తప్పవు. మెరిపే లక్ష్మీపార్వతి, కోమటిచెరువు, పెనుమంట్ర మండలం అనారోగ్యంతో ఎలా తెచ్చుకోగలం? ఇంటికి వచ్చి రేషన్ ఇవ్వడం వల్ల ఐదేళ్లుగా ఎలాంటి ఇబ్బందిలేదు. ఇప్పుడు పాత పద్దతిలో రేషన్ దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకోవాలంటే అనారోగ్యంతో బాధపడే నాలాంటి వారికి పరిస్థితి కష్టం. కష్టపడి వెళ్తే వేలిముద్రలు పడడం లేదంటూ మళ్లీ రమ్మనడం పరిపాటే. దీనితో రెండు రోజులు రేషన్ కోసం పడిగాపులు కాయాల్సివస్తుంది. – కొండేటి మోహన్‌రావు, ఆలమూరు, పెనుమంట్ర మండలం ఉపాధి కోల్పోతాం గత ఐదేళ్లుగా ఎండీయూ వాహనంతో రేషన్ సరుకులను మండలంలోని మేడపాడు, అడవిపాలెం గ్రామాల్లో పంపిణీ చేస్తున్నాను. ప్రభుత్వం ఎండీయూ వాహనాలను నిలిపేవయడంతో మాకు ఉపాధికరువై కుటుంబపోషణ దుర్బరంగా మారే అవకాశముంది. ప్రభుత్వం ఎండీయూ వాహన నిర్వాహకులకు ఉపాధి కల్పించాలి. – పెదపాటి ప్రవీణ్‌కుమార్, మట్లపాలెం, యలమంచిలి మండలం మా పరిస్థితి ఏంటి? ఇంతకాలం ప్రజలకు ఇంటింటికీ ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరుకులు ఇస్తే ఇప్పుడు ఉన్నట్టుండి వాహనాలను నిలిపి వేస్తామనడం దారుణం. రేషన్ సరుకుల పంపిణీ ద్వారానే జీవనం సాగించాం. అకస్మాత్తుగా మమ్మల్ని రోడ్డుమీద వదిలేస్తే మా పరిస్థితి ఏంటి. మాకు ఉపాధి చూపించాలి. – యామల ఆంజనేయులు, శృంగశృక్షం, ఎండీయూ నిర్వహకుడు ● -
మనవడి దాడి.. అమ్మమ్మ మృతి
భీమవరం: మనవడు కొట్టడంతో అమ్మమ్మ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఇది. భీమవరం టూటౌన్ సీఐ జి.కాళీచరణ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్రి మాణిక్యం (79) అనే వృద్ధురాలు రాయలం ప్రాంతానికి చెందిన భూదేవి తోటలో తన కుమార్తె ఇంట్లో ఉంటుంది. కాగా ఆమె కుమార్తెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిలో పెద్ద మనవడికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. ఆ చిన్నారి ఇంటి ఆవరణలోని పూల మొక్కలు లాగేస్తుండగా మృతురాలు ఆగ్రహం వ్యక్తం చేసి తిట్టింది. అమ్మమ్మ తీరుపై ఆమె రెండో మనవడు తోట మధు ప్రశ్నించగా ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. ఆవేశానికి గురైన మధు కొట్టడంతో అమ్మమ్మ మాణిక్యం కింద పడి మృతి చెందింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి దెందులూరు: విద్యుత్ షాక్‌తో ఒక వ్యక్తి మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఎలా ఉన్నాయి. బుధవారం ఏలూరు రూరల్ మండలం లింగారావు గూడెం చెరువు వద్ద పనికి వచ్చిన పెరుమాళ్ళ తాతారావు (50) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ ప్రమాదంలో చెరువు యజమాని మార్త శివకుమార్ కూడా గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు. -
ప్రకృతి సాగుపై లెక్కలు చెప్పండి
ఉండి : లెక్కాపత్రాలు లేకుండా ప్రకృతి సాగు ఎక్కువగా చేస్తున్నారని చెబితే నమ్మేదెలా అంటూ రాష్ట్ర అడిషినల్ సీఎస్ అజయ్‌జైన్ రైతుల ఎదుటే వ్యవసాయాధికారులను ప్రశ్నించారు. బుధవారం మండల పర్యటనలో భాగంగా జేసీ రాహూల్కుమార్రెడ్డితో కలసి ముందుగా మహదేవపట్నం గ్రామంలో పర్యటించిన ఆయన సచివాలయం, అంగన్వాడీ తదితర ప్రదేశాలను పరిశీలించి స్థానికులతోను, అధికారులతో సమావేశమై మాట్లాడారు. అనంతరం ఎన్నార్పీ అగ్రహారంలో ప్రకృతి సాగు నిర్వహిస్తున్న ఓ రైతు క్షేత్రాన్ని పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయంపై చేపట్టిన కార్యక్రమాలపై ప్రదర్శించిన బ్యానర్లను పరిశీలించా అధికారులను లెక్కలు అడిగారు. దానికి వారి నుంచి కొంత ఆలస్యంగా జవాబు వచ్చినా చివరకు 563 ఎకరాలు అంటూ సిబ్బందిలో ఒకరు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు, లెక్కలు లేకుండా ఎలా నమ్మేది అంటూ వారిని ఆయన ప్రశ్నించారు. దీంతో వ్యవసాయాధికారులు నీళ్లు నమిలారు. అనంతరం బ్యానర్లలో ప్రదర్శిస్తున్న డ్రోన్ల గురించి ఆరా తీశారు. ప్రస్తుతం మీ వద్ద ఎన్ని డ్రోన్లు ఉన్నాయని ఆరా తీయగా రెండు ఉన్నాయని.. అవి పనిచేయడం లేదని సమాధానమివ్వడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. డ్రోన్ పైలట్ సరిగా ఆపరేట్ చేయకపోవడంతో అది కాస్త చెట్టుకు ఢీకొని పాడైందని సమాధానమివ్వడంతో ఎందుకు బాగు చేయించలేదంటూ ఆరా తీశారు. అనంతరం నిర్వహించిన ఓ చిరుధాన్యాల స్టాల్‌ను కూడా ఆయన పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయం లాభసాటి అయితే ఎందుకు ఎక్కువమంది రైతులు సాగుచేయడం లేదంటూ ప్రశ్నించారు. మార్కెట్లో ఆర్గానిక్ పేరు చెప్పి సాధారణ పంటలు కూడా అమ్మేస్తున్న కారణంగా వినియోగదారులు నమ్మలేకపోతున్నారని ఆయన అన్నారు. గత ప్రభుత్వమే నయం కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఓ రైతు ఈ ప్రభుత్వంలో ధాన్యం అమ్మిన వెంటనే రైతు ఖాతాలో సొమ్ము పడిపోతుందంటూ నమ్మబలికాడు. అయితే దానికి రైతు కవురు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పలువురు రైతులు ఎదురుదాడికి దిగారు. గత ప్రభుత్వంలోనే వెంటనే సొమ్ములు వచ్చేవని ఎవరో కొందరికి మాత్రమే ఆలస్యం అయ్యాయని ఏ ప్రభుత్వంలో అయినా అలాగే జరుగుతుందని రైతులు అడిషినల్ సీఎస్‌కు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ధాన్యం అమ్మకం చేసి చాలా రోజులైనా ఇంతవరకు తమకు సొమ్ములు ఖాతాల్లో పడలేదని కోటేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఏడీఏ శ్రీనివాస్, తహసీల్దార్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయాధికారులను ప్రశ్నించిన రాష్ట్ర అడిషినల్ సీఎస్ డ్రోన్లు సైతం పనిచేయకపోవడంపై అసహనం -
హడలెత్తిన భీమడోలు
భీమడోలు: మంగళవార అర్ధరాత్రి భీమడోలు హడలిపోయింది. క్షతగాత్రులు, ప్రయాణికుల ఆర్తనాదాలతో, అంబులెన్స్‌లు, పోలీసుల సైరన్లతో ఆ ప్రాంతం దద్ధరిల్లింది. వరుస ప్రమాదాలతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఆగి ఉన్న వ్యాన్‌ను మరో వ్యాన్ ఢీకొనడంతో తణుకుకు చెందిన కోడూరి వెంకట రామచరణ్ (17) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా గుంటూరు జిల్లా తిమ్మలపాలెంకు చెందిన వ్యాన్ డ్రైవర్ మామిడి జయరామ్, భార్య మామిడి ప్రశాంతి క్యాబిన్లో ఇరుక్కుపోయారు. ఎస్సై వై.సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వ్యాన్‌లో ఇరుక్కున దంపతులను బయటకు తీసి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఢీకొన్న మూడు ప్రైవేట్ బస్సులు అదే సమయంలో వస్తున్న ట్రావెల్ బస్సు ట్రాఫిక్ కోన్లను గుర్తించకుండా సడన్ బ్రేక్ కొట్టి ఢీకొంది. దాని వెనుక మరో రెండు బస్సులు రాగా మొత్తం మూడు బస్సులు ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. మధ్యలో ఉన్న బస్సు డ్రైవర్‌తో పాటు 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యలో ఇరుక్కున్న బస్సు ముందు, వెనుక భాగాలు నుజ్జయ్యాయి. మూడో బస్సుల్లోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు పెదపట్నం బాపన్న, అదే జిల్లాలోని ద్రాక్షారామలోని వనుం రామారావు, రావులపాలెంలోని లక్ష్మీపురంనకు చెందిన కొట్టింగ నాగరాజు, కొట్టింగ మీరమ్మలకు గాయాయ్యాయి. మరో బస్సులో అమలాపురంలోని నడిపూడి విత్తనాల నాగరాజు, హైదరాబాద్‌కు చెందిన కేసినకుర్తి చంటిబాబు, విత్తనాల పవన్‌కుమార్, పీసకాయల మోగవల్లిక, శ్రీపూర్ణ దీప్తి గాయపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి, అనంతరం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో భార్యాభర్తలు కొట్టింగ నాగరాజు, కొట్టింగ మీరమ్మలు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అర్ధరాత్రి వరుస ప్రమాదాలు యువకుడి మృతి, పది మందికి తీవ్ర గాయాలు అన్నకు బై చెబుదామని వచ్చి.. తణుకుకు చెందిన కోడూరి దుర్గాలోకేష్, వెంకట రామచరణ్ (17) అన్నదమ్ములు. వీరు అమ్మమ్మ ఊరైన పోలసానిపల్లి వచ్చారు. తండ్రి లేకపోవడంతో దుర్గాలోకేష్ చేపల ప్యాకింగ్ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వెంకట రామచరణ్ ఇంటర్ చదువుతున్నాడు. లోకేష్ గుంటూరు జిల్లా వినుకొండలోని చేపల ప్యాకింగ్‌కు రాత్రి బయలుదేరాడు. అన్నను భీమడోలు రైల్వేగేటు వద్ద డీసీఎం వాహనం ఎక్కించి రామచరణ్ బై చెబుతుండగా వెనుక నుంచి అశోక్ లేలాండ్ వ్యాన్ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామచరణ్ అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. తన కళ్లముందే తమ్ముడు మృతి చెందడంతో దుర్గాలోకేష్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. తల్లి, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ద్వారకాతిరుమల: స్థానిక లింగయ్య చెరువు వద్ద పడిపోయిన గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఎస్సై టి.సుధీర్ తెలిపిన వివరాలు ప్రకారం. లింగయ్య చెరువు వద్ద సుమారు 50 సంవత్సరాల వయస్సుగల వ్యక్తి మంగళవారం ఉదయం పడిపోయాడు. వెంటనే దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తిని స్థానిక పీహెచ్‌సీకి, అక్కడి నుంచి ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు సెల్ నెంబర్ 94407 96653కు సమాచారం అందించాలని ఆయన కోరారు. చికిత్స పొందుతూ జట్టు కూలీ మృతి భీమడోలు: గుండుగొలను శివారు బీసీ కాలనీ వద్ద తవుడు లారీ బోల్తా ఘటనలో జట్టు కూలీ గొర్జి శ్రీనివాసరావు(52) బుధవారం మృతి చెందాడు. ఈనెల 20వ తేదీ సాయంత్రం రత్నాపురంలోని ఆక్వా చెరువుల వద్దకు తవుడు బస్తాలను దిగుమతి చేసేందుకు ఏడుగురు జట్టు కూలీలు లారీ ఎక్కారు. గుండుగొలను నుంచి రత్నాపురం వెళ్తుండగా మార్గమధ్యమైన గుండుగొలను బీసీ కాలనీ వద్ద లారీ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కూలీలకు గాయాలయ్యాయి. వారిలో తీవ్ర గాయాలైన గొర్జి శ్రీను ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెల్ఫోన్ల రికవరీ తాడేపల్లిగూడెం (టీఓసీ): రైలు ప్రయాణికులు పొగొట్టుకున్న సెల్‌ఫొన్లను సీఈఐఆర్ వెబ్సైట్ ద్వారా రైల్వే పోలీసులు దొంగల వద్ద నుంచి రికవరీ చేశారు. వీటి విలువ రూ.1,50,000గా నిర్థారించారు. ఫొన్లు పొగొట్టుకున్న ప్రయాణికులను బుధవారం పట్టణంలోని రైల్వే పోలీస్ స్టేషన్‌కి పిలిపించి సెల్‌ఫొన్లను అందజేశారు. కార్యక్రమంలో రైల్వే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఈ.అప్పారావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రెండో మత్స్యకార సంఘం వద్దు
టి.నరసాపురం: బొర్రంపాలెంలో రెండో మత్స్యకార సంఘాన్ని ఏర్పాటు చేయవద్దు అంటూ అమలులో ఉన్న మత్స్యకార సహకార సంఘ నాయకులు బత్తుల రమేష్, గుండె చిన్న చిట్టయ్య పలువురు సభ్యులు బుధవారం ఉన్నతాధికారులకు వినతి పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు బత్తుల రమేష్, నాయకులు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా బొర్రంపాలెంలో ఒకే మత్స్యకార సంఘం ఉందన్నారు. ఆ సంఘంలో 300 మంది సభ్యులు ఉండి కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలవ జలాశయంలో బొర్రంపాలెం రేవులో చేపల వేటకు వెళ్లి జీవనోపాధి సాగిస్తున్నామన్నారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం మరో మత్స్యకార సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఒక మత్స్యకార సంఘం అమలులో ఉండగా మరో సంఘం ఏర్పాటు చట్ట ప్రకారం తప్పని వివరించారు. కొత్త సంఘం ఏర్పాటును వ్యతిరేకిస్తూ జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, మత్స్య శాఖ జెడీ, పంచాయతీరాజ్ కమిషనర్లకు ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదులను సమర్పించామని వివరించారు. -
పొట్టకూటి కోసం వెళ్లి.. ప్రాణాలు వదిలి
ఉండి : పొట్టకూటి కోసం వెళ్లిన వ్యక్తికి విద్యుత్ షాక్ తగలడంతో మృతి చెందాడు. ఈ ఘటన ఉండి మండలం వెలిపర్రులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం బొజ్జా రవి(23), నాగరాజు అనే ఇద్దరు బోదెల్లో, కాలువల్లో చేపలు పట్టి కుటుంబాలను పోషించుకుంటున్నారు. బుధవారం వెలివర్రులోని ఆక్వా చెరువుల వద్ద ఉన్న బోదెలో చేపలు పట్టేందుకు వెళ్లారు. రవి తన వద్ద ఉన్న వలతో చేపలను పట్టేందుకు బోదెలోకి దిగగా విద్యుత్ పోల్ నుంచి కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగ కాలికి చుట్టుకుని విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం అందించడంతో వారు విద్యుత్ సరఫరాను నిలుపుదల చేశారు. అయితే అప్పటికే రవి మృతి చెందాడు. ఎస్సై ఎండీ నసీరుల్లా ఆధ్వర్యంలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మృతుడు రవికి ఏడాది క్రితం భీమవరం లంకపేటకు చెందిన మావుళ్ళుతో వివాహమైంది. వారికి నెల రోజుల క్రితం మగబిడ్డ పుట్టాడు. తమకు దిక్కెవ్వరూ రవి భార్య, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి -
జగన్‌ను కలసిన యలమంచిలి ఎంపీపీ
యలమంచిలి: యలమంచిలి మండలం ఎంపీపీ ఎన్నికలో విజయం సాధించిన ఇనుకొండ ధనలక్ష్మి రవికుమార్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పాలకొల్లు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇన్చార్జి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) ఆధ్వర్యంలో జగన్మోహన్రెడ్డిని కలిసి ఎన్నిక వివరాలను వెల్లడించారు. జగన్మోహన్రెడ్డిని కలిసిన వారిలో వైస్ ఎంపీపీలు గొల్లపల్లి శ్రీనివాస్, కొప్పాడి శ్రీనుబాబు, మాజీ ఎంపీపీ రావూరి వెంకటరమణ బుజ్జి, మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఉచ్చుల స్టాలిన్ బాబు, రాష్ట్ర వైఎస్సార్సీపీ నాయకులు చిలువూరి కుమార దత్తాత్రేయ వర్మ, మాజీ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ, సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ కుక్కల బాలచంద్రన్, నిమ్మకాయల రామకృష్ణ ఉన్నారు. -
అలరించిన నాటిక పోటీలు
ఉద్యాన పంటల సాగుపై శ్రద్ధ ఉద్యాన పంటల సాగుపై వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రంలో అధికారులు, రైతులతో ఏపీఎంఐపీ పీడీ, ఉద్యాన శాఖ జేడీ సమీక్షించారు. 8లో uఏలూరు (ఆర్‌ఆర్‌పేట): అంబికా సంస్థల వ్యవస్థాపకుడు ఆలపాటి రామచంద్రరావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అంబికా సంస్థలు, హిందూ యువజన సంఘం, హేలాపురి కళా పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి నాటిక పోటీలు మంగళవారంతో ముగిశాయి. నాలుగో రోజు కొలకలూరు శ్రీ సాయి ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో ప్రదర్శించిన జనరల్ బోగీలు, రెండో ప్రదర్శనగా వీరన్నపాలెం కళానికేతన్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన రుతువు లేని కాలం నాటికలకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. అద్భుతమైన కథాంశాలతో నటీనటుల హృద్యమైన నటనతో నాటికలు రక్తికట్టించాయి. అంబికా సంస్థ ఛైర్మన్ అంబికా కృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. నాటిక, నాటకాల ప్రదర్శనలో కళాకారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటారని వాటిని గుర్తించి సహకరించాలన్నారు. వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు యర్రా సోమలింగేశ్వరరావు, సెక్రటరీ కళారత్న కేవీ సత్యనారాయణ, ఎగ్జి క్యూటివ్ కమిటీ అధ్యక్షుడు ఇరదల ముద్దుకృష్ణ, సెక్రటరీ మజ్జి కాంతారావు, అంబికా ప్రసాద్, అంబికా రాజా, డెంటల్ కాలేజీ కరస్పాండెంట్ జీ.మోజెస్ తదితరులు పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లు రద్దు చేయాలి
ఏలూరు (టూటౌన్): కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి డీఎన్వీడి ప్రసాద్, ఏఐటీయూసీ అధ్యక్షుడు ఆర్ శ్రీనివాస, ఐఎఫ్టీయు నాయకుడు గడసాల రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణమే విడనాడాలని డిమాండ్ చేశారు. జూలై 9న దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో పాల్గొని నిరసన తెలియజేయాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలను కార్పొరేట్లకు, ప్రైవేటు వ్యక్తులకు కారుచౌకగా మోదీ ప్రభుత్వం అప్పగిస్తుందని వారు తెలిపారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు, బి.సోమయ్య, వీవీఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రిగారూ.. మెడికల్ కాలేజీ
సాక్షి, భీమవరం: వైద్య విద్యను పేద విదార్థులకు చేరువ చేసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం చేపట్టింది. అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని దగ్గులూరులో రెండేళ్ల క్రితమే నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆ సమయంలో శ్రీఇక్కడ బురద తప్ప మెడికల్ కళాశాల పనులేమి జరగడం లేదుశ్రీ అంటూ ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మల రామానాయుడు ఎంతో హడావుడి చేశారు. పనుల వేగం పెంచాలంటూ పార్టీ పెద్దలను సైతం తీసుకువచ్చి నిరసనలు తెలిపారు. కూటమి వచ్చాక ఆయన్ను మంత్రి పదవి వరించడంతో ఏడాదిలోనే పనులు పూర్తవుతాయని అంతా ఆశించారు. ఇంతవరకూ ఆయన కళాశాల వైపు కన్నెత్తి చూడలేదు. పాలకొల్లు మండలం దగ్గులూరులోని సుమారు 60 ఎకరాల్లో రూ.475 కోట్లతో వైద్య కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. కళాశాల నిర్మాణంతో జిల్లా వాసులకు మేలు జరుగుతుందని, ఎంతో మందికి ఉపాది లభిస్తుందని స్థానికులు ఆశించారు.నిధుల లేక నిలిచిన పనులు2023 ఆగస్టులో నిర్మాణ సంస్థ పనులు ప్రారంభించింది. ఇనన్పేషెంట్, అవుట్ పేషెంట్, ఎమర్జన్సీ సేవల బ్లాకులకు సంబంధించి రూ.75 కోట్ల విలువైన పునాది పనులు దాదాపు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాల పనులకు బ్రేక్ వేసింది. ఈ పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోవడంతో నిర్మాణ సంస్థ పనులను నిలిపివేసింది. సైట్‌లోని ఐరన్, ఇసుక, కంకర, ఇతర నిర్మాణ సామగ్రిని తరలించుకుపోతోంది. పనులు ఆగిపోవడంతో స్థానికుల ఆశలపై నీళ్లు చల్లారు. కాలేజీని ప్రైవేట్ పరం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. దీని వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష అవనుంది.త్వరితగతిన పూర్తి చేయాలిమెడికల్ కళాశాల ద్వారా పాలకొల్లు, పరిసర ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతాయి. నిర్మాణ పనులు పూర్తయితే గత ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న భయంలో ఇప్పటి పాలకులు ఉన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా త్వరితగతిన పనులు పూర్తిచేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.– గుడాల శ్రీహరి గోపాలరావు, వైఎస్ఆర్సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జిపనులు ఆపడం సరికాదుగత ప్రభుత్వం రికార్డు స్థాయిలో రాష్ట్రంలో 15 మెడికల్ కళాశాలల పనులు చేపట్టి ఐదింటిని ప్రారంభించింది. కూటమి వచ్చాక పాలకొల్లులోని పనులను అర్ధాంతరంగా ఆపేయడం సరికాదు. గత ప్రభుత్వంలో కళాశాల పనుల కోసం తపించిపోయిన నిమ్మల మంత్రి అయ్యాక ఒక్కసారి సందర్శించలేదు.– ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
ధాన్యం బకాయిలు చెల్లించాలి
ఏలూరు (టూటౌన్): జిల్లాలో రైతులు, కౌలు రైతులకు చెల్లించాల్సిన రబీ ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించి అన్నదాతలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ కోరారు. స్థానిక అన్నే భవనంలో ధాన్యం బకాయిల సమస్యలపై మంగళవారం ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. చివరి దశలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి దాదాపు రూ.89 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. గత 15 రోజులుగా ధాన్యం సొమ్ములు చెల్లింపులు నిలిచిపోవడంతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రబీ పంటకు తెచ్చిన పెట్టుబడి అప్పులు తీర్చి ఖరీఫ్ సాగుకు సన్నద్ధం కావాల్సిన దశలో ధాన్యం బకాయిలు చెల్లించకపోవడం తగదన్నారు. చివరి దశలో కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన బకాయిలు కూడా చెల్లించి ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ధాన్యం సొమ్ము అందాల్సిన బైరెడ్డి లక్ష్మణరావు మాట్లాడుతూ ఏలూరు శివారు సుంకరి వారి తోటకు చెందిన తనకు గత 15 రోజులు క్రితం తోలిన ధాన్యానికి సొమ్ములు అందలేదన్నారు. ధాన్యం బకాయిలు చెల్లించి ఆదుకోవాలని కోరారు. -
మెరుగైన చికిత్స అందించాలి
నరసాపురం రూరల్: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఆస్పత్రుల్లోనే మెరుగైన పరీక్షలు, చికిత్స అందించాలని, గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవించేలా వారికి అవగాహన కల్పించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం నరసాపురం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఓపీ రిజిస్టర్లు, పలు విభాగాలను, వైద్య సేవలందించే వార్డులు పరిశీలించారు. అనంతరం డీసీహెచ్ఎస్, ఆసుపత్రి కమిటీ సభ్యులు, వైద్యాధికారులతో మాట్లాడుతూ సిబ్బంది పనితీరు, ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలు, ఆసుపత్రిలో జరుగుతున్న ఆపరేషన్లు వంటి విషయాలపై చర్చించారు. అనంతరం రుస్తుంబాద అలంకృతి లేసు పార్కును కలెక్టర్ సందర్శించారు. అక్కడ మహిళలు అల్లిన పలు విధాల లేసు డిజైన్లను పరిశీలించారు. లేసు అల్లికలతో మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా పయనించాలని అన్నారు. అనంతరం మండలంలోని స్వయం సహాయక గ్రూపులు నిర్వహిస్తున్న యూనిట్లను కలెక్టర్ పరిశీలించారు. లక్ష్మణ్వేశ్వరంలో పిండి వంటలు తయారీ యూనిట్, సార్వలో మినీ డైరీ యూనిట్, తూర్పుతాళ్లలో ఫ్లోర్ మిల్లు, పచ్చళ్ళు తయారు చేసే యూనిట్, చామకూరిపాలెంలో డొక్క తాడు పరిశ్రమను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆయా యూనిట్లను నడిపే సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. -
మట్టి తవ్వకాల అడ్డగింత
చాట్రాయి: చనుబండ గ్రామంలోని పెద్ద చెరువులో మట్టి అక్రమ తవ్వకాలను అధికారులు అడ్డుకున్నారు. సోమవారం అర్ధరాత్రి మట్టి తవ్వకాలు చేస్తున్నారని సమాచారం రావడంతో రెవెన్యూ సిబ్బంది, పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుని ఒక పొక్లయిన్, జేసీబీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నాలుగు రోజల క్రితం మట్టి తవ్వకాలకు అనుమతి కావాలంటూ కొందరు అధికారులకు అర్జీ ఇచ్చారు. అర్జీ ఇచ్చినందుకు ఇచ్చిన రసీదుని చూపించి మూడు రోజులపాటు అక్రమంగా మట్టిని తరలించారు. సోమవారం రాత్రి సమాచారం అందుకున్న అధికారులు రెండు యంత్రాలను సీజ్ చేశారు. పారిజాతగిరీశుడికి శేష వాహన సేవ జంగారెడ్డిగూడెం: బ్రహ్మోత్సవాల్లో భాగంగా గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామికి మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. రాజమండ్రికి చెందిన పండితులు పాండంగిపల్లి దుర్గా రామ సత్య పవన్ కుమార్ ఆచార్యులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, ధ్వజరోహణం, అగ్ని ప్రతిష్ట, కుంభ స్థాపన, నిత్య హోమాలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు అత్యంత వైభవంగా శేష వాహన సేవ జరిపారు. సంతానం లేని భక్త దంపతులు స్వామివారి గరుడ ప్రసాదం స్వీకరించారు. పూజా కార్యక్రమాలను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. మద్ది క్షేత్రంలో విశేష పూజలు జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారికి ప్రభాతసేవ, నిత్యార్చన పూజలు జరిపారు. భక్తులు పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం వరకు ఆలయానికి వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,87,132 ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో సుమారు 1600 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారన్నారు. ఈవో చందన మాట్లాడుతూ క్షేత్రంలో హనుమద్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 21 నుంచి 25 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం స్వామి వారి నిజరూప సందర్శనం (సింధూరం వలుపు) అనంతరం విశేష దర్శనములు ఉంటాయన్నారు. -
శ్రమజీవులకు ఎంత కష్టం..
ద్వారకాతిరుమల: వేర్వేరుగా జరిగిన రెండు ప్రమాదాల్లో 20 మంది కూలీలు, ఒక డ్రైవర్ గాయపడ్డారు. ద్వారకాతిరుమల మండలంలోని లైన్గోపాలపురం జాతీయ రహదారిపై ఎండు కొబ్బరి కాయల లోడుతో వెళుతున్న బొలేరో వాహనం వెనుక టైరు పేలడంతో అదుపు తప్పి బోల్తా పడగా 14 మంది గాయాలపాలయ్యారు. గుండుగొలను శివారు బీసీ కాలనీ వద్ద చేపల చెర్వులకు మేత తరలిస్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో ఏడుగురు కూలీలు గాయపడ్డారు. టైరు పేలి బోల్తా పడ్డ వ్యాన్ ద్వారకాతిరుమల మండలం కప్పలకుంట నుంచి ఎండు కొబ్బరి కాయల లోడుతో బొలేరో వాహనం దెందులూరు మండలం గోపన్నపాలెంకు వెళుతోంది. లైన్ గోపాలపురం జాతీయ రహదారిపైకి వచ్చేసరికి వాహనం వెనుక టైరు పేలింది. ఈ ప్రమాదంలో 5 గురు తీవ్రంగా, 9 మంది స్వల్పంగా గాయపడ్డారు. డ్రైవర్ వాన కిషోర్‌తో పాటు, వాహనంపై ఉన్న గోపన్నపాలెం, వేగవరంనకు చెందిన 13 మంది కూలీలు కొండేటి గంగాధరరావు, కాసగాని ఆంజనేయులు, బెజవాడ రత్తయ్య, వాన తిరుపతి, మోర్ల రాము, ఆరే రామకృష్ణ, తాడి సత్యవతి, తాడి సంతోష్, అప్పల నాయుడు, ఒగ్గుల చరణ్, బి.అప్పన్న, ఐక రాంబాబు, రెగాన రామ్మూర్తి, బోణె అప్పమ్మ తదితరులు గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను 108, హైవే ఆంబులెన్స్‌లో హుటాహుటీన భీమడోలు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం తీవ్రంగా గాయపడ్డ ఆంజనేయులు, సంతోష్, అప్పలనాయుడు, సత్యవతి, గంగాధరరావు లను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీ బోల్తా.. కూలీలకు గాయాలు భీమడోలు: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి గుండుగొలను శివారు రత్నాపురంలోని ఆక్వా చెర్వులకు మేత తవుడు దిగుమతి చేసేందుకు లారీ వచ్చింది. లారీ డ్రైవర్ సత్తార్ తవుడు దించేందుకు జట్టు కూలీలను పురమాయించుకుని ఆక్వా చెరువుల వద్దకు వెళుతుండగా గుండుగొలను శివారు బీసీ కాలనీ వద్ద గల మలుపు వద్దకు వచ్చేసరికి లారీ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో లారీ కేబిన్‌లో ఉన్న కూలీలు బూరి తిరపతయ్య, పెద్దింటి కృష్ణ, మంత్రి పాపారావు, చిగడాపు వెంకన్న, గొర్జి శ్రీను, నేలబుల్లి సూర్యానారాయణలతో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భీమడోలు పోలీసులు తెలిపారు. ద్వారకాతిరుమలలో వ్యాన్ బోల్తా పడి 14 మందికి గాయాలు గుండుగొలనులో లారీ అదుపు తప్పి ఏడుగురు కూలీలకు గాయాలు -
ములపర్రు సొసైటీలో మరోసారి కలకలం
పెనుగొండ: డిపాజిట్లు గల్లంతుతో 2018 నుంచి కలకలం రేపుతున్న ములపర్రు హిందూ ముస్లీం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం మరోసారి కలకలం రేపింది. మంగళవారం సీఐడీ పోలీసులు ఆనాటి అధ్యక్ష, కార్యదర్శులను అదుపులోకి తీసుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. 2017 సంవత్సరం పాలకవర్గ అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఆనాటి కార్యదర్శి వెంకటేశ్వరరావు నిధుల గోల్‌మాల్‌కు పాల్పడ్డారంటూ పాలకవర్గంలోని డైరక్టర్లే ఆనాడు రోడ్డేక్కారు. దీంతో డిపాజిట్టుదారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి డిపాజిట్లు తిరిగి చెల్లించాలంటూ ప్రదక్షిణలు చేశారు. అప్పట్లోనే 51 ఎంక్వయిరీ వేసి పలుమార్లు విచారణ జరిపి, ఎంత మోసం జరిగిందో బయటపెట్టకుండా కాలం వెళ్లబుచ్చారు. రూ.50 లక్షల నుంచి రెండ్లు కోట్లకుపైగా అంటూ రకరకాలుగా ప్రకటించే వారు. చివరకు డిపాజిట్టు దారుల ఒత్తిడి పెరగడంతో అప్పటి కార్యదర్శి వెంకటేశ్వరరావు ఆత్మహత్యాయత్నం సైతం చేశారు. అప్పట్లో రాజకీయ ఒత్తిళ్లతో కేసు ముందకు సాగకుండా యత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా కొందరి పెద్దల సమక్షంలో రాజీ కుదర్చుకొని కొంత మేర నగదు చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చినా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. ఈ తరుణంలో ఓ డిపాజిట్టు దారుడు హైకోర్టును ఆశ్రయించడంతో, పూర్తి స్థాయి విచారణ జరిపి నిగ్గు తేల్చాలంటూ సీఐడీకి ఆదేశాలు జారీ చేయడంతో విచారణ చేపట్టారు. విచారణ అనంతరం రూ.రెండు కోట్లకు పైగా నిధుల దుర్వినియోగం జరిగిందని గుర్తించినట్లు సమాచారం. తణుకులో అదుపులోకి ? మాజీ అధ్యక్షుడు నాగేశ్వరరావు, మాజీ కార్యదర్శి వెంకటేశ్వరరావులను మంగళవారం తణుకులో సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మరోసారి ములపర్రు సొసైటీ డిపాజిట్లు దుర్వినియోగం కేసు కలకలం రేపింది. సీఐడీ అదుపులో మాజీ అధ్యక్ష, కార్యదర్శులు -
ఉద్యాన పంటల సాగుపై ప్రత్యేక శ్రద్ధ
తాడేపల్లిగూడెం రూరల్: ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ సీ.వెంకటరమణ, ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండలంలోని వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రంలో వివిధ జిల్లాలకు చెందిన ఉద్యాన శాఖ అధికారులు, రైతులతో ప్రాంతీయ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశం సహాయ పరిశోధన సంచాలకులు డాక్టర్ డి.వెంకటస్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ టమాట, మిరపలో ప్రొసెసింగ్ టెక్నాలజీలను పెంపొందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కోత అనంతరం పండ్ల తోటల్లో నష్టాన్ని అంచనా వేయడం, తద్వారా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అరటి దిగుబడిలో కోస్తా జిల్లాలతో పోలిస్తే రాయలసీమ ముందంజలో ఉందని, దానికి కారణాలు వెతకాలన్నారు. ఏఐని ఉపయోగించి తెగుళ్ల ఉద్ధృతిని అరికట్టాలి రిజిస్ట్రార్ డాక్టర్ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ విదేశీ పంటల సాగుపై దృష్టి పెట్టాలన్నారు. ఈ పంటల సాగుపై రైతులకు కావలసిన సూచనలను, సలహాలను శాస్త్రవేత్తలు అందించాలన్నారు. ఆయిల్ పామ్‌లో అంతర పంటగా సాగు చేసే కోకోలో కొత్త రకాలను తీసుకురావాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను ఆధారం చేసుకుని పురుగు, తెగుళ్ల ఉధృతిని, ఉనికిని కనిపెట్టడం, అవసరాన్ని బట్టి ఎరువులు, నీటి యాజమాన్యం చేపట్టాలన్నారు. వాతావరణ మార్పులకనుగుణంగా పంటల్లో పురుగు, తెగుళ్ల ఉద్ధృతిపై విస్తారంగా పరిశోధనలు జరగాలన్నారు. ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ జమదగ్ని, ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ కే.టి.వెంకటరమణ, యూనివర్సిటి డీఐపీ అధికారి డాక్టర్ కే.ధనుంజయరావు, విస్తరణ పంచాలకులు డాక్టర్ బి.గోవిందరాజులు, పరిశోధన సహాయ సంచాలకులు కోస్టల్ జోన్–1 డాక్టర్ డి.వెంకటస్వామి, కోస్టల్ జోన్–1 డాక్టర్ సి.వెంకటరమణ గత ఏడాదికి గాను అధికారులు, రైతులు అడిగిన సమస్యలకు పరిష్కారాలపై చేపట్టిన పరిశోధనలు తెలిపారు. శాస్త్రవేత్తలు డాక్టర్ ఎన్‌బీవీ.చలపతిరావు, డాక్టర్ ఇ.కరుణశ్రీ, కేవీకే ప్రధాన శాస్త్రవేత్త విజయలక్ష్మి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు చెందిన ఉద్యాన శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఏపీఎంఐపీ పీడీ డాక్టర్ వెంకటరమణ -
చినవెంకన్న బంగారం.. బ్యాంకులో భద్రం
ద్వారకాతిరుమల: శ్రీవారికి భక్తుల నుంచి ఏడాది కాలంగా హుండీలు, కానుకల ద్వారా లభించిన 4.940 కేజీల బంగారాన్ని దేవస్థానం అధికారులు గోల్డ్ బాండ్ స్కీమ్ కింద విజయవాడలోని భారతీయ స్టేట్‌బ్యాంక్ మెయిన్ బ్రాంచ్‌లో మంగళవారం డిపాజిట్ చేశారు. ముందుగా ఆలయ స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరచిన బంగారాన్ని ఆలయ ఈఓ ఎన్వీ సత్యన్నారాయణ మూర్తి, డిప్యూటీ ఈఓ పి.బాబురావు, దేవాదాయశాఖ జ్యూయలరీ వెరిఫికేషన్ అధికారి (రాజమహేంద్రవరం) వీవీ పల్లంరాజు, ఆలయ అర్చకులు కొండూరి జనార్ధనాచార్యులు, కమిటీ సభ్యుల సమక్షంలో బయటకు తీశారు. అనంతరం బంగారాన్ని తూకం వేసి, ప్యాక్ చేశారు. ఆ ప్యాకెట్‌కు సీలు వేసి, సంబంధిత పత్రాలతో పాటు దాన్ని బ్యాంకు అధికారులకు ఆలయ ఈఓ సత్యన్నారాయణ మూర్తి, కమిటీ సభ్యులు అందజేశారు. -
వినియోగదారుల హక్కులపై అవగాహన అవసరం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వినియోగదారులు తమ హక్కులపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, తూనికలు, కొలతలకు సంబంధించిన చట్టాలను తెలుసుకోవాలని తూనికలు, కొలతల శాఖ ఏలూరు జిల్లా ఉప నియంత్రకులు బి.వెంకట హరిప్రసాద్ అన్నారు. ప్రపంచ తూనికలు, కొలతల దినోత్సవం సందర్భంగా నగరంలోని ఆ శాఖ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వినియోగదారులకు తాము మోసపోతున్నామని గ్రహిస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. పెట్రోల్ బంకుల్లో కొలతల్లో మోసం జరుగుతున్నా, వస్తువుల తూకాల్లో తేడా ఉన్నట్లు గ్రహించినా వెంటనే అప్రమత్తం కావాలని సూచించారు. వ్యాపారస్తులు వినియోగదారులకు అందించాల్సిన సేవలు, వ్యాపారస్తులు పాటించాల్సిన నియమ నిబంధనలపై వివరించారు. అలాగే వ్యాపారస్తులు ఉత్పత్తి చేసి, విక్రయించే ప్రతి ప్యాకేజీపై తయారీదారుని పేరు, ప్యాకేజీ చేయబడిన వస్తువు పేరు, దాని నికర బరువు ముద్రించాలన్నారు. కార్యక్రమంలో సహాయ నియంత్రకులు బీఎన్వీఎస్ ఈశ్వర రామ్, పరిశీలకులు వి. ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల ధర్నా కామవరపుకోట: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం స్థానిక శ్రీవేంకటేశ్వర జూనియర్ కళాశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం ధర్నా నిర్వహించారు. అడ్మిషన్లు తీసుకోకుండా కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తూ పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. 42 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కాలేజిని మూసివేసే ప్రయత్నాన్ని విరమించుకోవాలన్నారు కాగా దీనిపై కళాశాలకు వచ్చిన ఆర్ఐఓ యోహాన్ను వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాల మేరకు కళాశాలకు వచ్చానని కానీ ఇక్కడ తిరుపతి దేవస్థానం ఈవో చెబితేనే గాని అడ్మిషన్లు ఇవ్వమని యాజమాన్యం చెప్పారని త్వరలో అడ్మిషన్ తీసుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
జూన్ 10న ఆక్వా రైతుల చలో అమరావతి
పాలకొల్లు సెంట్రల్: ప్రభుత్వం హెచ్చరించినా ధరల విషయంలో ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు, ఫీడ్ కంపెనీలు దిగిరావడం లేదని, దీంతో ఆక్వా రైతులందరూ చలో అమరావతి కార్యక్రమాన్ని చేపట్టనున్నామని ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్ రాజు తెలిపారు. మంగళవారం పాలకొల్లు మండలం పూలపల్లి ఎస్ఎస్ఎస్ కళ్యాణ మండపంలో జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గాంధీభగవాన్ రాజు మాట్లాడుతూ అమెరికా పన్నులు పెంచిందని ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్ సభ్యులు కొనుగోలు నిలుపుదల చేశారని తెలిపారు. సరుకు పట్టుబడులు పట్టుకున్న రైతులు గగ్గోలు పెడితే రూ.50 నుంచి రూ.100 వరకూ ధరలను తగ్గించేశారని అన్నారు. దీనిపై జై భారత్ ఆక్వా సంఘం స్పందించి ఎంతో పోరాటం చేసి క్రాప్ హాలిడే ప్రకటించడం జరిగిందన్నారు. క్రాఫ్ హాలీడేకు మద్దతుగా ఇప్పటికే పాలకొల్లు, ఆచంట, నరసాపురం నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాల్లో రైతులు చెరువులను ఎండగట్టే పనిలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. అలాగే ఫీడ్ కంపెనీలు ముడి సరుకు ధరలు పెరిగితే వెంటనే రూ. 25 పెంచేసి, ధరలు తగ్గినప్పుడు కేవలం రూ.4 లేక రూ.5 తగ్గించడం దారుణమన్నారు. 60 కౌంట్‌ను మినిమమ్‌గా నిర్ణయించాలని, ధర రూ.320 చేయాలని డిమాండ్ చేశారు. వీటిపై ప్రభుత్వం ప్రభుత్వం స్పందించి తగిన న్యాయం చేయకుంటే క్రాఫ్ హాలీడే తథ్యం అని స్పష్టం చేశారు. చలో అమరావతి కార్యక్రమాన్ని రైతులు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బోణం చినబాబు, బోణం రంగయ్యనాయుడు, ఆర్ సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం హెచ్చరికలను బేఖాతర్ చేస్తున్న ప్రాసెసింగ్, ఫీడ్ కంపెనీలు క్రాఫ్ హాలిడేకు మద్దతుగా రైతులు సమాయత్తం -
ఇరగవరం ఉప సర్పంచ్ ఏకగ్రీవం
ఇరగవరం: ఇరగవరంలో సోమవారం జరిగిన ఉప సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మరోసారి పట్టు నిలుపుకుంది. అధికార కూటమి నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు కోటిపల్లి వీర వెంకట సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు డిప్యూటీ ఎంపీడీఓ, ఎన్నికల అధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఎన్నిక అనంతరం ఉప సర్పంచ్ కోటిపల్లికి సర్పంచ్ కంకిపాటి శ్రీనివాస్, వార్డు సభ్యులు పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. తనకిచ్చిన అవకాశం బాధ్యతను పెంచిందని, గ్రామాభివృద్ధి కోసం కృషిచేస్తానని ఉప సర్పంచ్ కోటిపల్లి అన్నారు. గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం మూడేళ్లు ఒకరు, రెండేళ్లు మరొకరు ఉప సర్పంచ్ పదవిని పంచుకున్నారు. -
అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ
భీమవరం(ప్రకాశం చౌక్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందిన అర్జీల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యతతో పాటు అర్జీలు రీ ఓపెన్ కాకుండా చూడాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో భాగంగా జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామ, వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి జెడ్.వెంకటేశ్వరరావుతో కలిసి అర్జీలు స్వీకరించారు. అర్జీల్లో కొన్ని..డబ్బు కట్టి మోసపోయాంవిస్సాకోడేరు పంచాయతీ పరిధిలో శ్రీహరిపురం పేరిట వేసిన లేవుట్‌లో స్థలాలకు డబ్బు కట్టి మోసపోయామని విశ్రాంతి ఉద్యోగులు ఉ ద్యోగులు పలువురు కలెక్టర్‌కు ఫిర్యాదు చే శారు. రిజిస్ట్రేషన్ చేయకుండా, ప్లాట్లు అప్పగించకుండా ఏపీ స్టేట్ గర్నమెంట్ ఎంప్లాయీస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ తమను మోసం చేసిందని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.అంబేడ్కర్ భవన సమస్య పరిష్కరించాలిభీమవరం అంబేడ్కర్ భవన్ సమస్య పరిష్కరించాలని ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. భవనం గురించి మాట్లాడుతున్న దళిత ఉద్యోగులు, దళితులపై సంబంధం లేని వ్యక్తులు దాడులకు దిగుతున్నారని, చర్యలు తీసుకోవాలని కోరారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీల్లో నియామకాలుభీమవరం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం సోమ వారం ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీగా ఒరిగేటి మనోజ్ (తణుకు), రాష్ట్ర దివ్యాంగుల విభాగం ఉపాధ్యక్షుడిగా కొల్లాటి నాగరాజు (నరసాపురం), రాష్ట్ర దివ్యాంగుల విభాగం జనరల్ సెక్రటరీగా బుంగా జయరాజు (పాలకొల్లు), రాష్ట్ర దివ్యాంగుల విభాగం సెక్రటరీగా కేసిరెడ్డి దిలీప్ (ఉండి) నియమితులయ్యారు.చట్టపరిధిలో ఫిర్యాదులపై చర్యలుభీమవరం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పూర్తిస్థాయి విచారణ జరిపి చట్టపరిధిలో పరిష్కారిస్తామని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. భీమవరంలోని జిల్లా పోలీస్ కార్యాల యంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో భాగంగా 8 ఫిర్యాదులు స్వీకరించారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వి.పుల్లారావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ దేశంశెట్టి వెంకటేశ్వరరావు, మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ అహ్మదున్నీషా పాల్గొన్నారు.ప్రశాంతంగా ఈఏపీసెట్ పరీక్షలుభీమవరం: భీమవరంలో ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 100 మందికి 87 మంది, మధ్యాహ్నం 100 మందికి 97 మంది, విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో ఉద యం 90 మందికి 81 మంది, మధ్యాహ్నం 90 మందికి 85 మంది విద్యార్థులు హాజరయ్యా రు. డీఎన్నార్ అటానమస్ కళాశాలలో ఉదయం 91 మందికి 78 మంది, మధ్యాహ్నం 90 మందికి 79 మంది, డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 91 మందికి 81 మంది, మధ్యాహ్నం 90 మందికి 81 మంది హాజరయ్యారు.తాడేపల్లిగూడెంలో..తాడేపల్లిగూడెం (టీఓసీ): స్థానిక శశి ఇంజనీరింగ్ కళాశాలలో ఈఏపీసెట్ పరీక్షలకు ఉదయం 241 మందికి 219 మంది, మధ్యాహ్నం 239 మందికి 224 మంది హాజరయ్యారు. ప్రిన్సిపాల్ ఇస్మాయిల్ పర్యవేక్షించారు.టెన్త్ సప్లిమెంటరీకి 54.75 శాతం హాజరుభీమవరం: జిల్లాలో సోమవారం జరిగిన పదో తర గతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షకు 54.75 శాతం విద్యార్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. తెలుగు పరీక్షకు 1,295 మందికి 709 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. అలాగే ఇంటర్మీడియెట్ (ఏపీఓఎస్ఎస్) హిందీ పరీక్షకు 120 మందికి 27 మంది గైర్హాజరయ్యారన్నారు. 28 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా ఎక్కడ మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని చెప్పారు. -
యలమంచిలిలో న్యాయం గెలిచింది
యలమంచిలి: యలమంచిలి ఎంపీపీ ఎన్నికల్లో తె లుగుదేశం నాయకులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా చివరకు న్యాయమే గెలిచి ఇనుకొండ ధనలక్ష్మి ఎంపీపీ అయ్యారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. ఎంపీపీ ఎన్నిక అనంరతం చించినాడలోని మునసబు బంగ్లాలో ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులకు అభినందన సభ నిర్వహించారు. ఎంపీపీ ధనలక్ష్మితోపాటు ఆ మెకు అండగా నిలిచిన ఎంపీటీసీ సభ్యులందరినీ పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రసాదరాజు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అంటే మూడు రంగుల జెండా, ఒకటే అజెండా ఉంటుందన్నారు. మూడు పార్టీలు కూటమిలా అధికారం కో సం అడ్డదారులు తొక్కడం తమ నాయకుడు జగన్ కు చేతకాదన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంపీపీ స్థానాన్ని కై వసం చేసుకోవాలని తెలుగుదేశం నాయకులు చేసిన కుట్రలు భగ్నమయ్యాయంటే అది వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుల నిజాయతీకి తార్కాణమన్నారు. కూటమి నాయకుల ప్రలోభాలకు గురికాకుండా వైఎస్సార్సీపీకి అండగా నిలిచిన ఎంపీటీసీలకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమికి చెంపపెట్టు : పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని చూసిన తెలుగుదేశం నాయకులకు ఈ ఎన్నికలు చెంపపెట్టు అన్నారు. ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారం కోసం తెలుగుదేశం నాయకులు ఎన్ని అడ్డదారులు తొక్కినా చివరకు న్యాయమే గెలిచిందన్నారు. ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు చెల్లెం ఆనందప్రకాష్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిలువూరి కుమార దత్తాత్రేయవర్మ, మండల కన్వీనర్ ఉచ్చుల స్టాలిన్, మాజీ కన్వీనర్ పొత్తూరి బుచ్చిరాజు, వైస్ ఎంపీపీలు గొల్లపల్లి శ్రీనివాసరావు, కొప్పాడి శ్రీనుబాబు, నాయకులు నిమ్మకాయల రామకృష్ణ, బోనం బులివెంకన్న, నడపన గోవిందరాజులునాయుడు, చివటపు నాగేశ్వరరావు, రావూరి బుజ్జి, వీరా ఉమాశంకర్, మేళం రామాంజనేయులు, మంద హరికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవం యలమంచిలి: యలమంచిలి ఎంపీపీగా ఇనుకొండ ధనలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన ఎంపీపీ ఎన్నికలో ఆమె ఒక్కరే ఎంపీపీ స్థానానికి నామినేషన్ వేయడంతో ఏకగ్రీవంగా ఎంపికై నట్లు డ్వామా పీడీ, ప్రిసైడింగ్ అధికారి కేసీహెచ్ అప్పారావు ప్రకటించారు. ఎన్నిక పూర్తయిన తరువాత ఆయన ధనలక్ష్మికి ఎన్నిక పత్రం అందజేశారు. అనంతరం ఆమె తో ప్రమాణస్వీకారం చేయించారు. కోర్టు మొట్టికాయలతో ఎన్నిక నిర్వహణ.. మార్చి నెలలో కూటమి సభ్యులు, నాయకుల హై డ్రామాకు అధికారులు వత్తాసు పలకడంతో అప్పు డు ఎంపీపీ ఎన్నిక జరగకుండానే వాయిదా పడటంతో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులు 12 మంది హైకోర్టును ఆశ్రయించారు. కోరం సభ్యులు వచ్చి నా ఎంపీపీ ఎన్నిక నిర్వహించకపోవడంపై జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఆశ్చర్యంతోపాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలతో మరలా ఇప్పుడు ఎన్నిక నిర్వహించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు -
సంతలో పశువుల్లా కొన్నారు
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అత్తిలి: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, సంతలో పశువుల మాదిరిగా వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను కొనుగోలు చేసి, ఎంపీపీ స్థానాన్ని గెలిపించుకున్నామని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రగల్భాలు పలకడం సిగ్గుచేటని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు దుయ్యబట్టారు. సోమవారం అత్తిలిలోని తన నివాసంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అత్తిలి మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఉప ఎన్నికలు మార్చి 27న జరగాల్సి ఉండగా కూటమి శ్రేణులు అడ్డుకున్నారని విమర్శించారు. తిరిగి మరలా సోమవారం ఎన్నికలు జరగ్గా వైఎస్సార్సీపీకి చెందిన ఏడుగురు ఎంపీటీసీ సభ్యులను ఎమ్మెల్యే రాధాకృష్ణ కొనుగోలు చేసి ఎంపీపీ స్థానాన్ని గెలవడం సిగ్గుచేటన్నారు. ఇది సిగ్గుగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు. దమ్ముంటే రాజీనామా చేయించండి ఎమ్మెల్యేకు దమ్ము, ధైర్యం ఉంటే వెంటనే వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లినవారితో రాజీనామా చేయించి, తిరిగి ఎన్నికలకు సిద్ధం కావాలని, అప్పుడు తెలుస్తుంది ఎవరి సత్తా ఏమిటో అని మాజీ మంత్రి కారుమూరి సవాల్ చేశారు. ఎంపీపీగా గెలిచామని చెప్పుకొంటున్న మక్కా సూర్యనారాయణ ఫ్యాన్ గుర్తుపై గెలిచిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడేనని గుర్తుచేశారు. అంబులెన్సులో తరలించడం పిరికిపంద చర్య ఎంపీపీ ఎన్నికకు ఎంపీటీసీ సభ్యులను ఎమ్మె ల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ.. అంబులెన్స్ వాహనంలో మండల పరిషత్ కార్యాలయానికి తీసుకురావడం పిరికిపంద చర్యగా కారుమూరి అభివర్ణించారు. ఎంపీపీ ఎన్నికల్లో విష సంస్కృతికి కూటమి నాయకులు తెరతీశారన్నారు. వైఎస్సార్సీపీలో ఉన్న ఎంపీటీసీ సభ్యులు నిజాయతీపరులు, ఆణిముత్యాలు అని, మాజీ సీఎం జగన్ గుండెల్లో వారికి ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని స్పష్టం చేశారు. తణుకు నియోజకవర్గాన్ని జూద క్రీడలకు నిలయంగా ఎమ్మెల్యే మార్చివేశారన్నారు. ప్రతి పనికీ ఆర్కే ట్యాక్స్ పేరుతో అక్రమ వసూళ్లు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బుద్ద రాతి భరణీ ప్రసాద్, పార్టీ మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు రంభ సుజాత, దారం శిరీష, అనిశెట్టి త్రిమూర్తులు, అద్దంకి శ్రీను, నల్లమిల్లి నాగమణి, గుడిమెట్ల ధనలక్ష్మి, ఆడారి శ్రీనివాసరావు, దొమ్మేటి రమ్య, నాయకులు రంభ సూరిబాబు, పెన్మెత్స రామరాజు, పోలినాటి చంద్రరావు, మద్దాల శ్రీనివాస్, కంకటాల సతీష్, సబ్బితి రాజేష్, కోరుకొల్లు వెంకట్రావు, రామిశెట్టి రాము పాల్గొన్నారు. -
తల్లీబిడ్డ సేవలకు సుస్తీ
వేధిస్తున్న సమస్యలు మార్చి 30తో తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను నడుపుతున్న ప్రైవేట్ సంస్థతో టెండరు గడువు ముగియగా ప్రభుత్వం మరో రెండు నెలలు పాటు పొడిగించినట్టు యూనియన్ నాయకులు చెబుతున్నారు. గతంలో అవసరమైన మేర వాహనాల్లో డీజిల్ పోయించుకునే వెసులుబాటు ఉండగా కొద్దినెలలుగా పరిమితం చేసినట్టు చెబుతున్నారు. దీంతో నెలలో డీజిల్ ఉన్న మేర వాహనాలను నడిపి అయిపోయినప్పుడు మూలకు చేరుస్తున్నారు. మరోపక్క సకాలంలో ఆయిల్ ఛేంజింగ్, మరమత్ముల చేయకపోవడంతో ఇబ్బంది పడాల్సి వస్తోందంటున్నారు. సేవలు సరిగా అందక తల్లీబిడ్డలను ఇళ్లకు తీసుకువెళ్లేందుకు వారు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి వారు అడిగిన మొత్తం చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. సాక్షి, భీమవరం: తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలకు సమస్యల సుస్తీ చేసింది. డీజిల్ కొరత, మరమ్మతులతో సేవ లందించేందుకు ఆపసోపాలు పడుతోంది. అరకొర సేవలతో బాలింతలు, వారి కుటుంబ సభ్యులు అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఒక్క రోజు సమ్మె నిర్వహణకు యూనియన్ సిద్ధమైంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులకు ప్రసవానంతరం ప్రభుత్వం 102 పేరిట తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనంలో తల్లీబిడ్డలను సురక్షితంగా వారి ఇంటికి చేరవేస్తుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా 32 వాహనాలు ఉండగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ వాహనాలు సేవలందిస్తున్నాయి. రోజుకు 200 మంది వరకు తల్లీబిడ్డలను వారి ఇళ్లకు చేరుస్తున్నాయి. గతంలో సాఫీగా సాగిన సేవలు కొంత కాలంగా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలో 14 వాహనాలు ఉండగా వాటిలో తొమ్మిది మాత్రమే సేవలు అందిస్తున్నాయి. ఆచంట, తాడేపల్లిగూడెం, తణుకు తదితర చోట్ల ఐదు వాహనాల కెప్టెన్లు (డ్రైవర్లు) కొరత, మరమ్మతులతో మూలకు చేరాయి. డిమాండ్ల సాధన కోసం పోరుబాట ప్రస్తుతం ఇస్తున్న రూ.8,850 జీతం సకాలంలో ఇవ్వకపోగా నెలల తరబడి బకాయిలు పేరుకుపోతున్నాయి. ఏపీ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ పలుమార్లు ప్రభుత్వానికి వినతులు అందజేయడంతో ఇటీవల ఫిబ్రవరి వరకు బకాయిలు విడుదల చేసింది. మరో రెండు నెలలు జీతాలు రావాల్సి ఉన్నట్టు నాయకులు చెబుతున్నారు. కనీస వేతనం రూ.18,500 ఇవ్వాలని, వాహనాలకు మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని, ఆదివారం, వీక్లీ ఆఫ్‌లు, పండుగ సెలవులు అమలుచేయాలని, యజమాని వాటా పీఎఫ్‌ను యాజమాన్యమే చెల్లించాలని, ఈఎస్ఐ అమలుచేయాలని, 8 గంటలు పని విధానం, బఫర్ సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు. డిమాండ్ల సాధన కోసం యూనియన్ పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో మంగళవారం ఒక్క రోజు సమ్మెలో భాగంగా కలెక్టరేట్ల వద్ద నిరసన వ్యక్తం చేయనున్నట్టు యూనియన్ నాయకులు తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మెరుగైన సేవలుతల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను పేదలకు ఎంతో మెరుగ్గా అందించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృషి చేసింది. ఎయిర్ కండిషన్డ్ సౌకర్యాలతో కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి దూరప్రాంతాలకు సైతం ఈ వాహనాల్లో తల్లీబిడ్డలను వారి గమ్యస్థానాలకు చేరవేసేలా కార్యాచరణ చేసి అమలుచేశారు. ప్రసవానంతరం తల్లీబిడ్డలతో ఇళ్లకు చేరుకునేందుకు పేదవర్గాల వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉండేది. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇప్పుడు సేవలందించేందుకు వాహనాలు మొరాయిస్తుండటంతో వారు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తల్లీబిడ్డ సేవలను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని పేదలు కోరుతున్నారు. ప్రజారోగ్యానికి ప్రమాదం డీజిల్ కొరతతో నిలిచిపోతున్న వాహనాలు అరకొర సేవలతో బాలింతల అవస్థలు రెండు నెలలుగా డ్రైవర్ల జీతాల బకాయిలు ఉమ్మడి జిల్లాలో 32 వాహనాలు రోజుకు 200 మంది తల్లీబిడ్డలను ఇంటికి చేరుస్తున్న వైనం సమస్యల పరిష్కారానికి నేడు సమ్మెకు పిలుపు -
కూటమి నిస్సిగ్గు రాజకీయం
మంగళవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: భారీ ప్రలోభాలకు అధికార పార్టీ తెరలేపింది. ప్రలోభాలకు లొంగకపోవడంతో వ్యక్తిగత ఆస్తులు, వ్యాపారాలపై దాడులు చేయిస్తామని బెదిరించింది. దానికి భయపడకపోవడంతో అక్రమ కేసులు బనాయించింది. అయినా య లమంచిలి వైఎస్సార్సీపీ ఎంపీటీసీలంతా మంత్రి నిమ్మల రామానాయుడు చర్యలను సమర్థంగా తట్టుకుని నిలబడటంతో సోమవారం మంత్రి నిమ్మల చేతులెత్తేశారు. పర్యవసానంగా యలమంచిలి ఎంపీపీ స్థానాన్ని వైఎస్సార్సీపీ దక్కించింది. జిల్లాలో ఉప ఎన్నికలు జరిగిన మూడు స్థానాల్లో టీడీపీకి సింగిల్ డిజిట్ బలం లేకపోయినా అడ్డగోలుగా ఎన్నికల్లో పోటీ చేసి బెదిరింపు, దౌర్జన్యాలతో అత్తిలి ఎంపీపీ, కై కలూరు వైస్ ఎంపీపీ స్థానాలను దక్కించుకుంది. తద్వారా జిల్లాలో నిస్సిగ్గు రాజకీయాలకు టీడీపీ యథేచ్ఛగా కొనసాగించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యలమంచిలిలో నిబద్ధతకు పట్టం కట్టి.. యలమంచిలి, అత్తిలి ఎంపీపీ స్థానాలకు, కై కలూరు వైస్ ఎంపీపీ స్థానాలకు ప్రత్యేకాధికారులు సోమవారం ఎన్నికలు నిర్వహించారు. యలమంచిలిలో 18 మంది ఎంపీటీసీలకుగాను ఒక స్థానం ఖాళీ కావడంతో 17 మంది సభ్యులుండగా దానిలో 13 మంది వైఎస్సార్సీపీ సభ్యులు కాగా మిగిలిన ముగ్గురు టీడీపీ, ఒకరు జనసేన. 13 మంది సభ్యుల్లో ఒకరు జనసేనలో చేరడంతో 12 మంది సభ్యులు వైఎస్సార్సీపీలో ఉన్నారు. ఈ క్రమంలో గత మార్చి 27న ఎన్నిక జరగాల్సి ఉండగా టీడీపీ మంత్రి నిమ్మల డైరెక్షన్లో చిల్లర రాజకీయాలు చేసి 28కి వాయిదాపడేలా చేసింది. 28న కూడా హైడ్రామా నడిపి ఎన్నిక వాయిదా వేయించారు. ఈ క్రమంలో ఎన్నిక నిరవధికంగా వాయిదా ప్రకటించిన క్రమంలో వైఎస్సార్సీపీ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఎన్నికల అధికారులకు మొట్టికాయలు వేసింది. దీంతో అధికారులు మరలా ఎన్నిక నిర్వహించారు. మంత్రి రామానాయుడు వైఎస్సార్సీపీ జెండా ఎగురకూడదనే కక్షతో సభ్యులను రకరకాలుగా భయభ్రాంతులకు గురిచేయడం, పార్టీ నేతలపై కక్షపూరితంగా కేసులు బనాయించి నానాయాగీ చేసినా వైఎస్సార్సీపీ శ్రేణులు ధైర్యంగా ముందడుగు వేశారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు ఎన్నికకు హాజరుకావడంతో కూటమి ముఖం చాటేసింది. ఎంపీపీగా ఇనుకొండ ధనలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు అధికారులు ప్రకటించి డిక్లరేషన్ అందజేశారు. ఆరిమిల్లి అంబులెన్స్ రాజకీయంన్యూస్రీల్కై కలూరులో టీడీపీకే కామినేని మద్దతు కై కలూరులో భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కామినేని శ్రీనివాస్ స్థానికంగా ఆ పార్టీ నేతలకు పదవులు దక్కకుండా బలంగా చక్రం తిప్పుతున్నారు. సాధారణ నామినేట్ పదవులు మొదలు అన్నింటిలోనూ టీడీపీ సభ్యులు మినహా సొంత పార్టీకి ప్రాధాన్యం లేదు. ఇదే క్రమంలో కై కలూరు వైస్ ఎంపీపీ–1 స్థానాన్ని టీడీపీకి కట్టపెట్టారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలకు పార్టీ విప్ జారీ చేసింది. అయినా ఎమ్మెల్యే ఒత్తిళ్లతో పార్టీ మారిన సభ్యులు విప్ ధిక్కరించి టీడీపీకి ఓటు వేశారు. కై కలూరులో మొత్తం 22 స్థానాలకు 21 స్థానాలు వైఎస్సార్సీపీ, ఒకటి టీడీపీ గతంలో గెలుచుకుంది. ప్రజాస్వామ్యం అపహాస్యం ఎంపీపీ ఎన్నికల్లో అక్రమ కేసులు, తీవ్రస్థాయిలో బెదిరింపులు ఒత్తిళ్లను తట్టుకుని యలమంచిలి ఎంపీపీ వైఎస్సార్సీపీ కై వసం అత్తిలిలో ఓటింగ్‌కు అంబులెన్స్‌లో ఫిరాయింపు ఎంపీటీసీలు ఎమ్మెల్యే ఆరిమిల్లి చిల్లర వ్యవహారాలపై సర్వత్రా చర్చ యలమంచిలిలో చేతులెత్తేసిన మంత్రి నిమ్మల కై కలూరులో బీజేపీ కాకుండా టీడీపీకి కామినేని పట్టం ఉమ్మడి జిల్లాలో ముగిసిన ఉప పోరు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మరోసారి తనదైన శైలిలో చిల్లర రాజకీయాలకు తెరతీశారు. అత్తిలి మండలంలో 20 మంది ఎంపీటీసీ సభ్యులకుగాను 16 మంది వైఎస్సార్సీపీ, రెండు టీడీపీ, రెండు జనసేన గెలుపొందారు. ఒక వైఎస్సార్సీపీ సభ్యుడు గల్ఫ్‌లో ఉండటంతో మొత్తం 19 మంది ప్రస్తుతం ఎంపీటీసీలుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో గత మార్చిలో అత్తిలి ఎంపీటీసీలతో మాజీ మంత్రి కారుమూరి తన నివాసం నుంచి ఓటింగ్‌కు వెళ్తున్న క్రమంలో దాదాపు వెయ్యి మందికిపైగా టీడీపీ కార్యకర్తలు కారుమూరి ఇంటిని చుట్టుముట్టి దౌర్జన్యం చేసి దాడికి యత్నించి ఎంపీటీసీలు ఓటింగ్‌కు వెళ్లనీయకుండా నిలువరించారు. ఇదంతా పోలీసుల కళ్లెదుట జరిగినా స్పందించని పరిస్థితి. ఆ మరుసటి రోజు కూడా ఓటింగ్‌కు వెళ్లనీయకుండా ఎంపీటీసీలను ఒక రకంగా ఇంట్లోంచి బయటకు రాకుండా ఆందోళనకర వా తావరణం సృష్టించారు. నిరవధిక వాయిదా పడి సోమవారం ఎన్నిక జరుగుతుందని అధికారులు ప్రకటించిన క్రమంలో మూడు రోజుల ముందే వైఎస్సార్సీపీ సభ్యులు కొందరిపై తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగారు. ఒక ఎంపీటీసీ దుబాయిలో పనిచేస్తున్న క్రమంలో ఆయన ఇంటికి పోలీసులను పంపి బెదిరించి తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవడం, మరో ఎంపీటీసీ ఇల్లు రోడ్డుపై ఉందని ఆక్రమణ కింద ఇంటిని కూల్చేస్తామని బెదిరించడం, మరికొందరు ఎంపీటీసీల వ్యాపారాలపై దాడులు చేయిస్తామని బెదిరించడం ఇలా తీవ్రస్థాయిలో భయపెట్టి అత్తిలి ఎంపీపీ స్థానాన్ని టీడీపీ దక్కించుకునేలా వ్యవహరించారు. కట్ చేస్తే.. టీడీపీ నుంచి ఎంపీపీగా గెలుపొందిన మక్కా సూర్యనారాయణ మూడేళ్ల క్రితం వైఎస్సార్సీపీ నుంచి ఎంపీపీగా గెలుపొందిన వ్యక్తే కావడం గమనార్హం. పర్యవసానంగా టీడీపీలో మొదటి నుంచి ఉన్న ఎంపీటీసీలకు ఆరిమిల్లి హ్యాండ్ ఇచ్చారనే చర్చ నియోజకవర్గంలో సాగుతోంది. మరోవైపు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఓటింగ్ వద్ద అడ్డుకుని ఆందోళన నిర్వహిస్తారనే భయంతో ఆరిమిల్లి ఎంపీటీసీలందరినీ అంబులెన్స్‌లో ఎన్నికకు తీసుకురావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
పని భారంపై వీఆర్వోల నిరసన
కొయ్యలగూడెం: క్లస్టర్ విధానంలో రేషనలైజేషన్ పేరుతో విడుదల చేసిన జీవో నెంబర్–4 విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని వీఆర్వో అసోసియేషన్ డివిజనల్ అధ్యక్షుడు అడపా రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్వోలు నిరసన కార్యక్రమం చేపట్టారు. రెండు సచివాలయాలను కలిపి ఒక క్లస్టర్‌గా నిర్ణయిస్తూ దానికి ఒక వీఆర్ఓని మాత్రమే నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని వీఆర్వో అసోసియేషన్ ఖండించింది. ఒక్కో సచివాలయానికి మిగిలిన శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులను ఒక్కొక్కరిని నియమిస్తూ, రెవెన్యూ వ్యవస్థ వచ్చేసరికి రెండు సచివాలయాలకు కలిపి ఒకరినే నియమించడం వల్ల తీవ్రమైన పనిభారం, ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుందంటూ పేర్కొన్నారు. ఇప్పటికే ఒక సచివాలయంలోనే ఉన్న విధులను నిర్వహించడానికి తీవ్రమైన మానసిక ఒత్తిడికి ఎదుర్కొంటుండగా రెండు సచివాలయాలను కలపడం అన్యాయం అన్నారు. అనంతరం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తహసీల్దార్ కె.చెల్లన్నదొరకు వినతిపత్రం సమర్పించారు. వీఆర్వోలు కె.మధు, బట్టు వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ కోసం అవస్థలు
బుట్టాయగూడెం: రేషన్ బియ్యం కోసం నిర్వాసితులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా వీఆర్‌పురం మండలం తుమ్ములూరు, జిల్లేడుగొంది, కొల్లూరు, కొత్తూరు, టి.పోచవరం గ్రామాల నుంచి కొందరు నిర్వాసితులు బుట్టాయగూడెం మండలం నిమ్మలగూడెం, రామన్నగూడెంల మధ్య నిర్వాసిత కాలనీకి తరలివచ్చారు. అయితే రేషన్‌బియ్యం కోసం మాత్రం తమ సొంత గ్రామమైన వీఆర్‌పురం మండలం తుమ్ములూరు గ్రామానికి వెళ్లి వస్తున్నారు. బుట్టాయగూడెం మండలంలో ప్రస్తుతం వీరు ఉంటున్న నిర్వాసిత కాలనీ నుంచి వీఆర్ పురం మండలం తుమ్ములూరు గ్రామానికి సుమారు 235 కిలోమీటర్లు దూరం. దీంతో ప్రతినెలా రూ. 13 వేలు చెల్లించి 46 కార్డుల లబ్ధిదారులు ఆ బియ్యం తెచ్చుకుంటున్నామని నిర్వాసితులు వేట్ల ముత్యాలరెడ్డి, అందెల రామిరెడ్డి, అందెల సీతారామరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ వేరే జిల్లా కావడంతో వీలుపడడం లేదని, దీంతో ప్రతి నెలా రేషన్ కోసం సొంత ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నారు. పూర్తి స్థాయిలో గ్రామాలు తరలిరాకపోవడం వల్ల తమ కార్డులు ఈ మండలానికి బదిలీ కాలేదని నిర్వాసితులు చెబుతున్నారు. జూన్ మొదటి వారంలో నిర్వాసితులను పూర్తిస్థాయిలో తరలిస్తున్నామని అధికారులు చెబుతున్నారని, కార్డులు ఈ మండలానికి మారే వరకు తమకు ఈ కష్టాలు తప్పవని వాపోయారు. -
పిప్పర పంట కాల్వలో గుర్తుతెలియని మృతదేహం
గణపవరం: గణపవరం మండలం పిప్పర పంటకాల్వలో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈవిషయంపై వీఆర్వో గణపవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి వయస్సు 60 సంవత్సరాలు ఉంటుందని, కాల్వలో పడి ఎలా మరణించాడన్న విషయం తెలియరాలేదని, వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆకుల మణికుమార్ తెలిపారు. బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని మోదుగగుంట గ్రామంలో బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన మైనర్ బాలిక (15)కు వివాహం నిశ్చయించినట్లు 1098కు సమాచారం అందడంతో సోమవారం ఐసీడీఎస్ సూపర్వైజర్లు దుర్గాభవాని, బేబి బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఐసీడీఎస్, ఐసీపీఎస్, సీడబ్ల్యూసీ వారి ఆదేశాల మేరకు బాలికను వన్ స్టాప్ సెంటర్‌కు తరలించినట్లు సూపర్వైజర్లు తెలిపారు. సచివాలయ జీఎంఎస్కే యు.సంధ్య, అంగన్వాడీ వర్కర్ కే.గంగారత్నం తదితరులు ఉన్నారు. గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి పెంటపాడు: ఉపాధి హామీ పనులు చేస్తున్న ఓ కూలీ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పెంటపాడు మండలం ముదునూరు గ్రామానికి చెందిన చల్లా రామారావు (81) సోమవారం గ్రామంలో ఉపాధి పనులకు వెళ్లాడు. పనిచేస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. తమతోపాటు పనులకు వచ్చిన రామారావు అకస్మాత్తుగా చనిపోవడంతో మిగిలిన ఉపాధి కూలీలు విలపించారు. కాగా పని ప్రదేశంలో వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాల్సి ఉండగా పలు గ్రామాల్లో కనీసం మందులు సరఫరా చేసేవారు కూడా రావడం లేదని కూలీలు చెబుతున్నారు. చోరీ కేసులో నిందితుడికి రిమాండ్ భీమవరం: భీమవరం పట్టణానికి చెందిన ఓ మహిళను బెదిరించి బంగారు ఆభరణాలు అపహరించిన కేసులో వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఒకటో పట్టణ సీఐ ఎం. నాగరాజు తెలిపారు. వి. రామాకుమార్ పోలీసు బొమ్మ కూడలి వద్ద గతంలో సెల్‌ఫోన్ దుకాణం నిర్వహించేవాడు. ఓ మహిళను బెదిరించి ఆమె దగ్గర ఉన్న 4 కాసుల బంగారు ఆభరణాలు అపహరించాడు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో సోమవారం హాజరుపరచగా అతడికి రిమాండ్ విధించినట్లు సీఐ చెప్పారు. -
మోటార్‌సైకిళ్లు ఢీకొని యువకుడి మృతి
పెనుగొండ: రెండు మోటార్‌సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒక యువకుడు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆచంట మండలం కోడేరు వద్ద సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పెనుగొండ మండలం దేవ శివారు తాళ్లపాలెంకు చెందిన గడ్డం సన్నిబాబు (18) సోమవారం తన అమ్మమ్మ ఊరు పాలకొల్లుకు వెళుతున్నాడు. కోడేరు నుంచి మోటారు సైకిల్‌పై ఆచంట వైపు వస్తున్నాడు. అదే సమయంలో తూర్పుగోదావరి జిల్లా గన్నవరం మండలం లంకల గన్నవరం శివారు నడిగడి గ్రామానికి చెందిన యన్నాబత్తుల సత్యనారాయణ, అతని భార్య కృష్ణకుమారి ఇద్దరు మోటారు సైకిల్ పై ఆచంట నుంచి కోడేరు వెళుతున్నారు. ఈ రెండు మోటార్‌సైకిళ్లు కోడేరు వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సన్నిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. యన్నాబత్తుల సత్యనారాయణకు, అతని భార్య కృష్ణకుమారికి గాయాలు కావడంతో వారిని 108 వాహనంలో పాలకొల్లు ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన సన్నిబాబు పెనుగొండ కళాశాలలో ఇంటర్ చదువుతూ ఇటీవల విడుదలైన ఫలితాలలో ఉత్తీర్ణత సాధించాడు. గత ఏడాది కాలంగా అతను చదువుకుంటూనే పాలకొల్లులో వీడియో ఎడిటింగ్ కూడా చేస్తున్నాడు.మరో ఇద్దరికి గాయాలు -
అలరించిన నాటిక ప్రదర్శనలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): అంబికా సంస్థల వ్యవస్థాపకులు ఆలపాటి రామచంద్రరావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అంబికా సంస్థలు, హిందూ యువజన సంఘం, హేలాపురి కళా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి నాటిక పోటీలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. సోమవారం హైదరాబాద్ యువభేరి థియేటర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన నా శత్రువు, సహృదయ ద్రోణాదుల సంస్థ ఆధ్వర్యంలో ప్రదర్శించిన వర్క్ ఫ్రమ్ హోమ్ నాటికలకు ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభించింది. తొలుత అంబికా సంస్థల చైర్మన్ అంబికా కృష్ణ అధ్యక్షతన జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి మాట్లాడుతూ ఏలూరులో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలోను, కళలను ప్రోత్సహించడంలో అంబికా సంస్థలు, హిందూ యువజన సంఘం ఎప్పుడూ ముందుంటాయన్నారు. నాటక రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న కళాకారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ యువజన సంఘం మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు యర్రా సోమలింగేశ్వరరావు, సెక్రటరీ కళారత్న కేవీ సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడు ఇరదల ముద్దుకృష్ణ, సెక్రటరీ మజ్జి కాంతారావు, అంబికా ప్రసాద్, అంబికా రాజా, వేణు గోపాల్ లునాని, ఎంవీవీ నాగేశ్వరరావు, ఎల్.వెంకటేశ్వరరావు, కేబీ రావు, సంకు సురేష్, ఎం.సూర్యనారాయణ యాదవ్, తదితరులు పాల్గొనగా ఈ కార్యక్రమాన్ని మహమ్మద్ ఖాజావలి సమన్వయం చేశారు. -
మట్టి తరలింపు వాహనాలతో ఉక్కిరిబిక్కిరి
ఉండి: ఒకవైపు వర్షం.. మరోవైపు మట్టి రవాణా వాహనాలతో చెరుకువాడ గ్రామం సోమవారం ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరైంది. మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతుండడంతో మట్టి పెళుసులు రోడ్డుపై పడి ఈ ప్రాంతవాసులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు వైఎస్సార్ సీపీ మండల ఉపాధ్యక్షుడు బొడ్డు నాగన్న, ఎంపీటీసీ చిగురుపాటి కృష్టాఫర్, వార్డు సభ్యుడు బిల్మోరియా ఆధ్వర్యంలో మట్టి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపటికే ట్రాఫిక్‌జామ్ ఏర్పడి మట్టి రవాణా వాహనాలు బారులు తీరాయి. సమస్యపై ఎన్నిసార్లు గ్రామాధికారులు, మండలాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సమాచారం అందుకున్న తహసీల్దార్ నాగార్జున వెంటనే వీఆర్ఏను పంపించి వాహనాలను నిలుపుదల చేశారు. దీంతో స్థానికులు ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోయారు. అయితే కొద్దిసేపటికే మట్టి రవాణా వాహనాలు తిరిగి రోడ్డెక్కడంతో ప్రజలు అవాక్కయ్యారు. ఇదేంటి అని అధికారులను ఆరా తీసినా సమాధానం చెప్పేవారు కరువయ్యారు. ఇది కూటమి నాయకులకు సంబందించిన మట్టి కాబట్టి మేము ఆపలేము అని ఓ గ్రామాధికారి చెప్పడంపై స్థానిక నాయకులు మండిపడుతున్నారు. చెరుకువాడ నుంచి అర్తమూరు ఆర్అండ్బీ రోడ్డు, గుమ్ములూరు పరిధిలో జాతీయ రహదారిపై మట్టి పరుచుకుపోవడంతో చాలా మంది వాహనదారులు సోమవారం సైతం ప్రమాదాలకు గురయ్యారు. అయితే ఇదేమీ మాకు సంబంధం లేదన్నట్లు ఆయా శాఖల అధికారులు ప్రవర్తించడం వింతగా ఉందని స్థానికులు తెలిపారు. చెరుకువాడలో విచ్చలవిడిగా మట్టి రవాణా రోడ్డుపై ఉన్న మట్టి పెలుసులతో తరచూ ప్రమాదాలు వైఎస్సార్ సీపీ నేతలతో కలిసి వాహనాలను అడ్డుకున్న ప్రజలు కాసేపటికే వదిలేసిన అధికారులు -
బ్యాంక్ వద్ద డ్వాక్రా మహిళల బైఠాయింపు
బుట్టాయగూడెం: రెడ్డిగణపవరం బ్యాంక్ ఎదుట గాడిదబోరు గ్రామానికి చెందిన డ్వాక్రా సంఘాల మహిళలు సోమవారం బైటాయించారు. బ్యాంకు రుణాలు మంజూరు చేసిన విషయం తమకు తెలియదని, దీంతో తాము వడ్డీ నష్టపోయామని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మేనేజర్ కుమార్, ఏపీఎం పద్మావతి మాట్లాడుతూ రుణాల సొమ్ములు డ్వాక్రా సంఘాల ఖాతాలోనే ఉన్నందుకు వాటిని తిరిగి రికవరీ చేయడంతోపాటు, వారికి ఎటువంటి వడ్డీ పడకుండా ఉండేలా మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనితో డ్వాక్రా మహిళలు శాంతించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జోడే సత్యదుర్గాప్రసాద్, డ్వాక్రా సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. -
హెల్మెట్ లేకుంటే లైసెన్స్ సస్పెన్షన్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం ఆదేశాల మేరకు జిల్లా రవాణా శాఖ అధికారులు ఏలూరు నగరంతో పాటు జంగారెడ్డిగూడెం, నూజివీడు ప్రాంతాల్లో సోమవారం ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 61 ద్విచక్ర వాహన చోదకులపై కేసులు నమోదు చేసి రూ.1,56,000 అపరాధ రుసుము విధించారు. ఈ సందర్భంగా కరీమ్ మాట్లాడుతూ ద్విచక్ర వాహన చోదకులు విధిగా హెల్మెట్ ధరించాలని, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని తెలిపారు. మోటార్ సైకిల్ లేదా స్కూటర్లను నడిపే వాహన చోదకులు హెల్మెట్ ధరించని పక్షంలో జరిమానా విధించడంతో పాటు 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. రహదారి ప్రమాదాల్లో ద్విచక్ర వాహన చోదకులే అధిక శాతం మర ణిస్తున్నారని, హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణనష్టం జరుగకుండా నివారించవచ్చన్నారు. రహదారి భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించిన నాడే మరణాలను తగ్గించగలుగుతామన్నారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో ఎంవీఐ శేఖర్, ఏఎంవీఐలు స్వామి, నరేంద్ర, సురేష్ బాబు, జమీర్, కళ్యాణి, కృష్ణవేణి, అన్నపూర్ణ, జగదీష్ పాల్గొన్నారు. ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం జిల్లాలో ద్విచక్ర వాహనాల తనిఖీ -
పారిజాతగిరిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
జంగారెడ్డిగూడెం: స్థానిక గోకులతిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. విశ్వక్సేనపూజ, పుణ్యాహవచన, మేదిని పూజ, మృత్ సంగ్రహణము, అంకురారోపణము తదితర వైదిక కార్యక్రమాలతో శ్రీ వైఖానసాగమోక్తంగా ఉత్సవాలు ప్రారంభించారు. ముందుగా ఆలయ ప్రధానార్చకులు నల్లూరు రవికుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో శ్రీనివాసుడిని పెండ్లి కుమారుడిగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పేరిచర్ల జగపతిరాజు, సభ్యులు దండు ధనరాజు, వాసవి సాయి నగేష్, భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమాలను కార్యనిర్వహణ అధికారి మాణికల రాంబాబు పర్యవేక్షించారు. -
కంప్యూటర్ కోర్సుకు వెళ్లి వస్తుండగా..
పెంటపాడు: కంటైనర్ లారీ వెనుక నుంచి ఢీకొనడంతో మోటార్‌సైకిల్‌పై వెళుతున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పెంటపాడు ఎస్సై స్వామి తెలిపిన వివరాల ప్రకారం చింతపల్లి గ్రామానికి చెందిన యర్రంశెట్టి వీరవెంకట సత్యనారాయణ (సతీష్) ఇంటర్ విద్యను పూర్తి చేసుకొన్నాడు. అనంతరం ప్రతి రోజు పెంటపాడు వచ్చి కంప్యూటర్ కోర్సు నేర్చుకొంటున్నాడు. సోమవారం యథావిధిగా కంప్యూటర్ క్లాస్ ముగించుకుని మోటార్‌సైకిల్‌పై స్వగ్రామం వెళ్తూ ఉండగా పెంటపాడు కళాశాల వద్ద విశాఖపట్నం నుంచి భీమవరం వెళుతున్న కంటైనర్ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో సతీష్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడి కక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బంధువులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా అర్ధాంతరంగా చనిపోయాడని తండ్రి నాగరాజు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా నాగరాజుకు ఒక కుమారుడు, కుమార్తె. బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్సై స్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మోటార్‌సైకిల్‌ను ఢీకొన్న కంటైనర్ లారీ ప్రమాదంలో యువకుడి మృతి -
గూడెంలో భారీ వర్షం
తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో అనేక పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రెయిన్లు పొంగి ప్రవహించాయి. చాలా రోడ్లు కాలువల్లా దర్శనమిచ్చాయి. దాదాపు గంటన్నరకు పైగా సాధారణ జన జీవనం స్తంభించింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్మిస్తున్న కల్వర్టు పనులకు అంతరాయం ఏర్పడింది. మునిసిపల్ హెహికల్ డిపో ఎదురుగా సీసీ రహదారి కల్వర్టుకు అడ్డంకి ఏర్పడటంతో బురద నీరు రోడ్డుపైకి చేరింది. అనేక ప్రాంతాలు చెత్త చెదారాలతో నిండి దుర్వాసన వెదజల్లుతున్నాయి. బస్టాండ్‌లో నీరు నిలిచిపోయింది. కె.ఎన్.రోడ్డులో అనేక చోట్ల మార్జిన్లలో నీరు నిలిచిపోవడంతో వ్యాపారస్తులు ఇబ్బంది పడ్డారు. అయితే చల్లని గాలులతో పట్టణ ప్రజలు సేదదీరారు. భీమవరం మండలంలో.. భీమవరం అర్బన్: భీమవరం మండలంలోని యనమదుర్రు, దిరుసుమర్రు, గొల్లవానితిప్ప, అనాకోడేరు, కొమరాడ, తోకతిప్ప, కొత్తపూసలుమర్రు తదితర గ్రామాల్లో ఆదివారం భారీ వర్షం పడింది. దీంతో పలు గ్రామాలలోని శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
పెద్దింట్లమ్మా... చల్లంగా చూడమ్మా..
కై కలూరు: అమ్మా పెదింట్లమ్మా.. నీ చల్లనీ దీవెనలు మాకు అందించమ్మా.. అంటూ భక్తులు అమ్మను భక్తితో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మను సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆదివారం దర్శించుకున్నారు. కోనేరులో స్నానాలు చేసి అమ్మవారికి భక్తులు వేడి నైవేద్యాలు సమర్పించారు. ఆలయ అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు చేశారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున ప్రత్యేక, అంతరాయ దర్శనాలు, కేశఖండనశాల, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదాలు, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాలు విక్రయం, భక్తుల విరాళాల ద్వారా రూ.78,001 ఆదాయం వచ్చిందని తెలిపారు. -
రసాయన ఎరువులతో అనర్థాలు
చింతలపూడి: ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతుంది. రైతులు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంట పండించడానికి విచక్షణారహితంగా రసాయన ఎరువులు వాడుతున్నారు. ఫలితంగా భూముల్లో పంటకు కావలసిన పోషకాలు అందుబాటులో లేక సమతుల్యత లోపించి ముందెన్నడూ లేని విధంగా ద్వితీయ సూక్ష్మ పోషక లోపాలు కనిపిస్తున్నాయి. ఈ పోషకాలు లోపించినప్పుడు సాగులో మిగతా యాజమాన్య పద్ధతులన్నీ సక్రమంగా పాటించినా దిగుబడులు తగ్గుతాయి. వీటిని అధిగమించడానికి సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మేలని వ్యవసాయ సహాయ సంచాలకులు బి.నాగకుమార్ సూచిస్తున్నారు. చింతలపూడి సబ్‌డివిజన్ పరిధిలో ఏటా ఖరీఫ్ సీజన్లో 35,500 ఎకరాల్లో వరి సాగు చేస్తుంటారు. 350 ఎకరాల్లో మొక్కజొన్న, 160 ఎకరాల్లో వేరుశెనగ పండిస్తారు. రబీ సీజన్లో సుమారు 1,500 హెక్టార్లల్లో వరి, 18,000 హెక్టార్లలో మొక్కజొన్న, 2,500 హెక్టార్లలో వేరుశెనగ పంటను రైతులు సాగు చేస్తున్నారు. జిప్సంతో మంచి దిగుబడి జిప్సంలో 24 శాతం కాల్షియం, 18 శాతం గంధకం ఉంటుంది. కాల్షియం, గంధకం మొక్కల పెరుగుదలకు అవసరమైన ద్వితీయ పోషకాలను చౌకగా జిప్సం అందిస్తుంది. ముఖ్యంగా నూనె గింజలు, పప్పు ధాన్యాల వంటి పంటల్లో గంధకం ఆవశ్యకత ఉంటుంది. కాల్షియం మొక్కల్లోని జీవకణాల అంచులు గట్టిగా ఉండటానికి, కణ విభజనకు, వేర్ల అభివద్ధికి, గింజ కట్టడానికి అవసరమవుతుంది. దీని వల్ల మొక్కలకు చీడపీడలు ఎదుర్కొనే శక్తి సమకూరుతుంది. వేరుశెనగ పంటలో అధిక దిగుబడులకు జిప్సం పూత దశలో వేసుకుని భూముల్లో కలియ బెట్టడం వల్ల అధిక దిగుబడులు వస్తాయి. వేరుశెనగలో జిప్సం వినియోగం వల్ల కాయలు గట్టిగా ఉండి కాయ నిండా పప్పు వృద్ధి చెంది గింజల్లో అధిక నూనె శాతం ఉంటుంది. ఫలితంగా కాయలు అధిక బరువు ఉండి మంచి ధర పలుకుతాయి. పూత సమయంలో ఎకరాకు 200 కిలోల చొప్పున భూమిలో తగిన తేమ ఉన్నప్పుడు మొక్కలకు దగ్గరగా జిప్సం వేసుకోవాలి. బీడు, చౌడు భూముల్లో నీరు సరిగా ఇంకదు. గాలి ప్రసరణ తక్కువగా ఉంటుంది. భూమి భౌతిక లక్షణాలు క్షీణించి ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మొక్కల వేర్లు సరిగా వృద్ధి చెందక మొక్కల్లో ఎదుగుదల ఉండదు. ఇలాంటి భూముల్లో జిప్సం వినియోగం వల్ల నేల గుల్లబారి భూమిలో నీరు ఇంకే స్వభావం పెరిగి మొక్కల వేర్లు బాగా వృద్ధి చెందుతాయి. పంట దిగుబడి పెరుగుతుంది. బి.నాగకుమార్, ఏడీఏ, వ్యవసాయ సబ్‌డివిజన్ సేంద్రియ పద్ధతులే మేలంటున్న అధికారులు -
మందలించారని యువకుడి ఆత్మహత్య
ఉండి: పనికి వెళ్లడం లేదని తల్లిదండ్రులు మందలించగా మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం పెరవలి మండలం పిట్లవేమవరానికి చెందిన కుడుపూడి సత్యశంకర్ (22) ఉండి మండలం కోలమూరులో మోటార్ రీవైండింగ్ పనులు చేసే షాపులో పని చేస్తున్నాడు. పనికి సరిగా వెళ్లడం లేదని తెలియడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఈ నెల 15న మధ్యాహ్నం 3 గంటల సమయంలో పనిచేసే దుకాణంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన గణేష్ అనే వ్యక్తి దుకాణం యజమానికి సమాచారం అందించాడు. మెరుగైన వైద్యం కోసం ఏలూరు, అనంతరం గుంటూరుకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పోస్టల్ ఉద్యోగిని ఆత్మహత్యఏలూరు టౌన్: ఏలూరు కొత్తపేటకు చెందిన పోస్టల్ ఉద్యోగిని కృష్ణ సంగీత (29) ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎన్‌ఆర్‌పేటలోని పోస్టల్ కార్యాలయంలో అసిస్టెంట్ పోస్టల్ అధికారిగా పనిచేస్తున్న ఆమె ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె తండ్రి, న్యాయవాది పుచ్చల వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. కృష్ణ సంగీతకు విశాఖపట్నంకు చెందిన నక్కిన శశికిరణ్‌తో 2024 డిసెంబర్ 5న వివాహమైంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న శశికిరణ్ పెళ్లయిన కొద్దిరోజులకే ఉద్యోగం మానేసి ఖాళీగా ఉండేవాడు. ఎన్ఆర్ పేట పోస్టల్ కార్యాలయంలో పనిచేస్తున్న కృష్ణ సంగీతను ఉద్యోగం మానేసి విశాఖపట్నం రావాలని ఒత్తిడి చేసేవాడు. ఆమె జీతాన్ని సైతం భర్తకే పంపేదని.. కట్నకానుకలుగా ఇచ్చిన స్థలాలు సైతం అతని పేరుమీద రాయాలని వేధించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. భర్త వేరే మహిళలతో ఉంటున్న ఫొటోలను పంపి వేధించేవాడని.. భర్తతో పాటు అత్తమామలు సైతం అదనపు కట్నం కావాలని వేధిస్తూ ఉండడంతో ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదు చేశారు. టూటౌన్ సీఐ అశోక్‌కుమార్‌కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అభయాంజనేయస్వామికి మల్లెపూలతో పూజ
పెదపాడు: అప్పనవీడులోని అభయాంజనేయస్వామి ఆలయంలో హనుమజ్జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం మల్లెపూలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు భజన మండలిచే సంప్రదాయ సంకీర్తనలు నిర్వహించారు. సాయంత్రం విజయదుర్గ కోలాట బృందంచే కోలాటం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు వెండి బంగారు పుష్పాలతో ప్రత్యేక పూజ, నక్షత్ర హారతి నిర్వహించారు. శ్రీ విజయదుర్గా నాట్యమండలి బృందం సత్యహరిశ్చంద్ర కాటి సీను ప్రదర్శించింది. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఈ నెల 30న భైరవం సినిమా రిలీజ్ పురస్కరించుకుని అభయాంజనేయస్వామి ఆలయంలో సినీ నటులు మంచు మనోజ్, నారా రోహిత్, విజయ్ కనకమేడల, కేకే రాధామోహన్ స్వామిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేదాశీర్వాదం అందించారు. -
మట్టి లారీలపై గ్రామస్తుల ఆందోళన
కొయ్యలగూడెం: మండలంలోని దిప్పకాయలపాడు శివారు దళిత పేటలో మట్టి తోలకాలను అడ్డుకుని స్థానికులు ఆందోళన చేశారు. ఆదివారం సాయంత్రం దాదాపు యాభై మందికి పైగా యువకులు మట్టి తోలకాల వల్ల రోడ్లు అధ్వానంగా మారాయంటూ వాగ్వాదానికి దిగారు. సుమారు పాతికకు పైగా లారీలను నిలిపేసి రోడ్డుపై బైఠాయించారు. పగలు, రాత్రి తేడా లేకుండా నిరంతరం లారీలు ప్రయాణిస్తుండటంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవి సెలవుల కారణంగా పిల్లలు బయట ఎక్కువగా తిరుగుతున్నారని, ఈ లారీల వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. వెంటనే చర్యలు తీసుకొని, మట్టి లారీల రవాణాపై నియంత్రణ విధించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. జలవనరుల శాఖ సబ్ డివిజన్ అధికారులు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చర్యలు తీసుకోలేకపోతున్నారని ప్రచారం సాగుతోంది. -
లోతు దుక్కులతో మేలు
ముసునూరు: మెట్ట ప్రాంతాల్లో వర్షాధార పంటలు పండించే భూములకు వేసవి (లోతు) దుక్కులు ఎంతో ప్రయోజనకరం. ఈ నేపథ్యంలో జిల్లాలోని మెట్ట ప్రాంత రైతులు వర్షాలు పలకరిస్తుండడంతో వేసవి దుక్కులపై దృష్టి పెట్టారు. తొలకరి వర్షాలు కురిసినపుడు భూమిని లోతుగా దుక్కి చేసుకోవడం వల్ల భూమి పై పొరలు లోపలికి, లోపలి పొరలు బయటకు చేరి, చేనుకు మంచి చేస్తుందని రైతులు చెబుతున్నారు. లోతు దుక్కుల ప్రాధాన్యత: ● దుక్కి లోతుగా చేయడం పండించే పంటపై ఆధారపడి ఉంటుంది. ప్రతి మూడేళ్లకు ఒకసారి పెద్ద మరతో 30 సెం.మీ లోతు వరకు దుక్కు చేయడం మంచిది. ఏటా వర్షాలను బట్టి భూమిని 15–20 సెం.మీ లోతు వరకు దున్నుకోవాలి. ● సాధారణంగా తల్లి వేరు వ్యవస్థ, పీచు వేరు వ్యవస్థ ఉన్న పంటలకు తక్కువ లోతు దుక్కి సరిపోతుంది. తేలికపాటి నేలల్లో 1–3 సార్లు దున్నాలి. కలుపు మొక్కలు, పంటల అవశేషాలు ఎక్కువగా ఉంటే కనీసం మూడు దఫాలుగా దున్నాలి. వేసవి దుక్కులకు అనుకూల పరిస్థితులు ● భూమిలో నిల్వ ఉంచుకునే తేమ 25 నుంచి 50 శాతం ఉంటే అది దుక్కులకు పూర్తి అనుకూలం. ● భూమిలో తేమ తక్కువ ఉన్నప్పుడు దుక్కి దున్నకూడదు. దీని వల్ల భూమి గుల్ల బారదు. ● భూమిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు నాగలికి మట్టి అంటుకుంటుంది. కింద ఉన్న మట్టి గట్టిపడి, భూమిలో గట్టి పొరలు ఏర్పడతాయి. వేసవి దుక్కులతో ప్రయోజనాలు ● వేసవి దుక్కులతో నేల గుల్ల బారుతుంది. తదుపరి వచ్చే వర్షపు నీరు వృథా కాకుండా సద్వినియోగం చేసుకోవచ్చు. ● తగినంత తేమ ఉన్నప్పుడు నేలను లోతుగా వాలుకు అడ్డంగా దున్నడం వల్ల నేల కోతను నివారించి, భూమి పైపొర, భూసారాన్ని కొట్టుకుపోకుండా అరికట్టవచ్చు. ● లోతు దుక్కుల వల్ల భూమిలో నీరు ఉండి, తేమ శాతం పెరగడం వల్ల సేంద్రీయ పదార్థాలు త్వరగా కుళ్ళి పోషకాల రూపంలో అందుబాటులోకి వస్తాయి. ● భూమిని అడుగు లోతు వరకు దున్నుకుంటే విత్తనం మొలకెత్తి, వేర్లు సులభంగా భూమిలోకి దిగి, భూమిలో ఉండే పోషకాలను గ్రహించి, మొక్క పెరుగుదలకు తోడ్పడుతుంది. ● పంట పొలాల్లో లోతు దుక్కులు దున్నడం వల్ల భూమిలో దాగి ఉన్న చీడ పీడలు, కోశస్థ దశలో ఉన్న పురుగులు, బాక్టీరియా, శిలీంద్రాలు, సిద్ధబీజాలు, కలుపు మొక్కల ఎండ వేడికి నశిస్తాయి. పరుగుల్ని పక్షులు తినేయడంతో తెగుళ్ల బెడద తప్పుతుంది. ● పొలంలో మట్టి గడ్డలు తొలగిపోయి, మెత్తని మట్టి ఏర్పడి పంట త్వరగా పెరిగేందుకు దోహద పడుతుంది. వేసవి దుక్కులు భూసారానికి మంచిది పంటలను బట్టి వేసవి దుక్కులు చేసి, భూసారం పెంచి, రైతులు లాభం పొందాలి. తమ శాఖ ద్వారా లభించే సలహాలు, సూచనలు పాటించడం ద్వారా వ్యవసాయాన్ని మరింత సులభతరం చేసుకోవాలి. సబ్సిడీపై లభించే వనరులు పొంది, రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలి. కె.చిన సూరిబాబు, మండల వ్యవసాయాధికారి -
శ్రీమన్నారాయణుడికి చందనోత్సవం
రేపటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని శ్రీ చతుర్భుజ లక్ష్మీతాయారు సమేత శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి ఆలయం(చినగోపురంలో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ఆదివారం స్వామివారికి చందనోత్సవం నిర్వహించారు. ఉదయం సహస్రనామ పూజలు, అలంకార తిరుమంజనం, సుప్రభాతసేవ, స్వస్తివాచకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి స్వామి వారిని పట్టణ పురవీధుల్లో రథంపై ఊరేగించారు. సోమవారం వసంతోత్సవం, ధ్రువ మూర్తుల తిరుమంజనం, మహా పూర్ణాహుతి, ఏడు ముసుగుల ఉత్సవ కార్యక్రమాలు జరగనున్నట్లు ఆలయ ఈవో బిరుదుకోట శంకర్ తెలిపారు. కార్యక్రమాలను ఆలయ ఈవో గుబ్బల రామ పెద్దింట్లరావు, బ్రహ్మోత్సవ కమిటీ సభ్యులు మాజేటి రాంబాబు, మామిడి బాబు, రేపాక ప్రవీణ్‌భాను, మాజేటి సూర్యభవానీ, మాచేపల్లి నాగఅన్నపూర్ణ, రేపాక సుబ్బారావు, దేవత భాస్కరరావు, నున్న కోటేశ్వరరావు, తదితరులు పర్యవేక్షిస్తున్నారు. -
సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు
ముదినేపల్లి రూరల్ ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి చేరుకుని పుట్టలో పాలు పోసి స్వామిని దర్శించుకున్నారు. పాలపొంగళ్ళశాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు. స్వామిని దర్శించుకునే భక్తులు అన్నప్రసాదం కార్యక్రమంలో పాల్గొంటే మేలు జరుగుతుందనే విశ్వాసం ఉంది. దీంతో అన్నదాన కార్యక్రమానికి భక్తలు పోటెత్తడంతో ఆలయ సహాయ కమిషనర్ ఆర్.గంగాశ్రీదేవి ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. స్వామికి గుడివాడకు చెందిన వన్నెంరెడ్డి మధుసూదనరావు కుటుంబసభ్యుడు దినేష్ వెండి పుష్పమాలను అందజేశారు. -
రోడ్డు ప్రమాదంలో దుర్మరణం
తణుకు అర్బన్: తణుకు జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఉండ్రాజవరం పోలీసు స్టేషన్ పరిధిలోని కమ్మ కల్యాణ మండపం ఎదురుగా తాడేపల్లిగూడెం నుంచి తణుకు వైపు బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న 108 వాహన సిబ్బంది అప్పటికే మృతిచెందినట్లు నిర్థారించారు. ఉండ్రాజవరం ఎస్సై జి.శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఏపీ 05 ఈఆర్ 9840 నెంబర్ హోండా బైక్‌పై ప్రయాణిస్తున్న మృతుడు ధరించిన దుస్తుల్లో సెల్‌ఫోన్, కాగితాలు లేకపోవడంతో వివరాలు తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో చిరుజల్లులు పడ్డాయి. వాతావరణంలో మార్పులతో భక్తులు త్వరగా దర్శనాలు చేసుకుని బయటకు వెళ్ళాలని కమిటీ వారు సూచించారు. సాయంత్రం 4 గంటలలోపే భక్తులందరూ తమ పూజా కార్యక్రమాలను ముగించుకుని బయటకు వచ్చారు. శ్రీవారి క్షేత్రంలో కొనసాగిన రద్దీ ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ ఆదివారం సైతం కొనసాగింది. వేసవి సెలవులు కావడంతో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. దాంతో అన్ని విభాగాలు భక్తులతో పోటెత్తాయి. ముఖ్యంగా దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, కేశఖండనశాల ఇతర విభాగాలు భక్తులతో కిక్కిరిసాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. వేంకటేశ్వర స్వామివారిని తూర్పుగోదావరి జిల్లా అడిషినల్ ఎస్పీ అల్లూరి వెంకట సుబ్బరాజు ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి గణపవరం: గణపవరం మండలం సరిపల్లె శివారు ఫ్యాక్టరీ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. గణపవరం ఎస్సై ఆకుల మణికుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఉండి మండలం కల్లిగొట్ల గ్రామానికి చెందిన బిరుదగడ్డ సాల్మన్, దాసరి మురళి ఆదివారం సాయంత్రం మోటార్‌సైకిల్‌పై గణపవరం వస్తుండగా సీపీ మేతల కంపెనీ వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో సాల్మన్ అక్కడిక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడిన దాసరి మురళిని అంబులెన్స్‌లో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మణికుమార్ తెలిపారు. -
ఆక్రమిత భూముల పరిశీలన
పాలకోడేరు : మండలంలోని గొల్లలకోడేరులో యనమదుర్రు డ్రెయిన్ గట్టుపై ఉన్న ఆక్రమిత స్థలాలను కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం నేరమని, త్వరలో ఆక్రమణల స్వాధీనానికి సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం గ్రామంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను ఆమె పరిశీలించారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు చేపడతామని నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఆర్డీఓ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, తహసీల్దార్ ఎన్.భారతి విజయలక్ష్మి, ఎంపీడీఓ వి.రెడ్డియ్య, ఇరిగేషన్ డీ తదితరులు ఉన్నారు. నిమ్మకు గిట్టుబాటు ధర కల్పించాలి ఏలూరు (టూటౌన్): నిమ్మకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స్థానిక అన్నే భవనంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ నిమ్మకాయల ధర పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మార్చి నుంచి మే వరకు నిమ్మకు అధిక ధర ఉండే సమయమని, అయినా ప్రస్తుతం ధర తగ్గిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మరోవైపు ఈదురుగాలులు, అకాల వర్షాలతో నిమ్మ రైతులు నష్టపోతున్నారన్నారు. నిమ్మ ఎగుమతులు సక్రమంగా లేకపోవడం కూడా నష్టాలకు కారణంగా ఉందని, ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. కిలో నిమ్మకాయలకు రూ.100 ధర రావాల్సి ఉండగా రూ.30లోపు మాత్రమే ఉందన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, జిల్లా కమిటీ సభ్యుడు జి.సురేష్ పాల్గొన్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 629 మంది హాజరు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులోని రెండు కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు 629 మంది విద్యార్థులు హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 180 మందికి 175 మంది, మధ్యాహ్నం 180 మందికి 174 మంది హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో ఉదయం 144 మందికి 140 మంది, మధ్యాహ్నం 144 మందికి 140 మంది హాజరయ్యారు. ఘనంగా గంగాదేవి అమ్మవారి జాతర పాలకోడేరు: మోగల్లు గ్రామంలో గంగాదేవి అమ్మవారి జాతర ఆదివారం ఘనంగా జరిగింది. జాతరకు సినీ హీరో నిఖిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి గ్రామానికి బంధువులు తరలివచ్చారు. గ్రామస్తులతో పాటు బంధువులు ఆలయంలో అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేయించారు. చలిమిడి పానకాలతో మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలో మేళతాళాలు కోయ డ్యాన్సులు, బాణసంచా కాల్పులతో అమ్మవారి ఊరేగింపు నేత్రపర్వంగా సాగింది. హీరో నిఖిల్‌ను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. ఎస్సై మంతెన రవి వర్మ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. -
చటాకాయిలో ఉద్రిక్తత
కై కలూరు: చేపల చెరువుల వాటా డబ్బుల పంపిణీ వివాదం చటాకాయి గ్రామంలో ముదిరిపాకాన ప డింది. గ్రామంలో ఉమ్మడిగా సాగు చేస్తున్న 9 చెరువుల్లో వచ్చే ఆదాయం సమానంగా పంచడం లేదంటూ గ్రామస్తుల్లో కొందరు శనివారం ఏలూరు అటవీ శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో ఆదివారం గ్రామంలో రెండు వర్గాల మధ్య వివాదానికి దారి తీసింది. గ్రామానికి ఆదాయాన్ని అందించే చెరువులను ఫారెస్టు అధికారులకు ఫిర్యాదు చేసి పొక్లెయిన్లతో కొట్టేయడానికి ఓ వర్గం ప్రయత్నిస్తున్నారని మైక్‌లలో ప్రచారం చేయడంతో వివాదం మొదలైంది. సర్పంచ్ ఘంటసాల శేషారావును గ్రామ కమ్యూనిటీ హాలు వద్ద వాటాల విషయంపై చర్చించుకోవడానికి పిలిచి ఓ వర్గం దాడి చేశారనే వార్త తెలియడంతో ఆయన కుమారుడు మరికొందరు అక్కడికి వెళ్లారు. ఈ నేపథ్యంలో గ్రామంలో జయమంగళ లెవెన్రాజు, ఘంటసాల లక్ష్మయ్య, ఆయన కుమారుడు నాగరాజు, మోరు నాగేశ్వరరావులపై దాడి చేశారు. జయమంగళ సీతాలక్ష్మిపై దాడి చేయడంతో ఆమె మనస్తాపంతో ఇంట్లో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. జరిగిన ఘటనలను కవర్ చేయడానికి వెళ్లిన మీడియాపై సైతం ఓ వర్గం వాదనకు దిగింది. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ, దాడికి గురైన వ్యక్తులను కై కలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకుని రూరల్ ఎస్సై రాంబాబు సిబ్బందితో చటాకాయి గ్రామానికి వెళ్లి పరిస్థితిని అదుపుచేశారు. ఇరువర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఎస్సై చెప్పారు. చెరువుల డబ్బుల పంపిణీలో వివాదం సర్పంచ్ శేషారావుపై దాడి పురుగుమందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం -
సందేశాత్మకంగా నాటిక ప్రదర్శనలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులో అంబికా సంస్థలు, హిందూ యువజన సంఘం, హేలాపురి కళాపరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి నాటిక పోటీలు రెండోరోజు ఆదివారం కొనసాగాయి. అంబికా సంస్థల వ్యవస్థాపకులు ఆలపాటి రామచంద్రరావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పోటీలు నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. అంబికా కృష్ణ అధ్యక్షతన జరిగిన సభ లో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ అంబికా కుటుంబ సేవలు అభినందనీయమన్నారు. ప్రముఖ సాహితీవేత్త, భాషావేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ గౌరవ ఫెల్లో ప్రొఫెసర్ డాక్టర్ వేల్చేరు నారాయణరావుకు 11వ తానా–గిడుగు రామమూర్తి తెలుగు భాషా పురస్కారాన్ని తానా నాయకులు గొర్రిపాటి చందు, వీఎల్ఎంఆర్ వెంకటరావు అందించి సత్కరించారు. నాటిక పోటీల్లో భాగంగా గోవాడ క్రియేషన్ (హైదరాబాద్) వారి అమ్మ చెక్కిన బొమ్మ, కృష్ణా ఆర్ట్స్–కల్చరల్ అసోసియేషన్ (గుడివాడ) వారి ద్వారబంధాల చంద్రయ్య నాయుడు నాటికలు అలరించాయి. -
నేడు మండల పరిషత్ ఉప ఎన్నికలు
అత్తిలి, యలమంచిలిలో ఎన్నికలు అత్తిలి: అత్తిలి మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు సోమవారం ఉప ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. వాస్తవంగా మార్చి 27న ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను కూటమి నాయకులు అడ్డుకోవడంతో ప్రక్రియ నిలిచింది. మరుసటి రోజున ఎన్నికలకు అధికారులు ఏర్పాటుచేసినా మరలా కూటమి శ్రేణులు భారీగా చేరుకుని ఎంపీటీసీ సభ్యులను మండల పరిషత్ కార్యాలయానికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మరలా ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేయడంతో సోమవారం ఉదయం 11 గంటలకు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నేపథ్యంలో గతంలో మాదిరిగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అత్తిలి చేరుకున్నాయి. యలమంచిలిలో ఎంపీపీ ఎన్నిక యలమంచిలి: యలమంచిలి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగనున్న మండల పరిషత్ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని డ్వామా పీడీ, ప్రిసైడింగ్ అధికారి కేసీహెచ్ అప్పారావు తెలిపారు. ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహిస్తామని, ఒకే నామినేషన్ వస్తే ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు ప్రకటిస్తామని చెప్పారు. ఒకటికి మించి నామినేషన్లు దాఖలైతే సభ్యులు చేతుల ఎత్తే పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణ సమయంలో మండల పరిషత్ కార్యాలయానికి 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, మండల పరిషత్ సభ్యు లు, ప్రోటోకాల్ ఉన్నవారిని మాత్రమే లోపలకు అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. -
మూల్యాంకనం.. సర్వం సిద్ధం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఇంటర్మీడియెడ్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. గతంలో ఇంటర్మీడియెట్ పరీక్షలకు సంబంధించి ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వేర్వేరుగా మూల్యాంకనం జరగ్గా ప్రస్తుతం పేపర్లు తక్కువగా ఉండటంతో ఈ రెండు జిల్లాలకు సంబంధించి ఏలూరు కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూల్యాంకనానికి ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి తొలి విడత మూల్యాంకనం ప్రారంభం కానుండగా ఈనెల 21 నుంచి రెండో విడత ప్రారంభం అవుతుంది. ఈనెల 31న మూల్యాంకనం ముగియనుంది. 81,469 పేపర్లు ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రాసిన జవాబు పత్రాలు అన్ని సబ్జెక్టులు కలిపి జిల్లాకు 81,469 పేపర్లు వచ్చాయి. వీటిలో సంస్కృతం 5,249, తెలుగు 1,821, హిందీ 39, ఇంగ్లిష్ 12,830, గణితం–ఏ 13,424, గణితం–బీ 12,727 పేపర్లు ఉన్నాయి. అలాగే సివిక్స్ 3,152, బోటనీ 2,276, జువాలజీ 3,185, హిస్టరీ 335, ఫిజిక్స్ 9,797, ఎకనామిక్స్ 3,668, కెమిస్ట్రీ 10,683, కామర్స్ 2,283 పేపర్లు వచ్చాయి. మొత్తం 81,469 పేపర్లలో ప్రథమ సంవత్సరం జవాబుపత్రాలు 71,423, ద్వితీయ సంవత్సరం జవాబుపత్రాలు 10,046 ఉన్నాయి. ఈ మేరకు ఎగ్జామినర్లకు విధులు కేటాయించారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి మొత్తం 1,348 మంది ఎగ్జామినర్లను విధులకు నియమించారు. ఎగ్జామినర్ల నియామకం సబ్జెక్టు ఎగ్జామినర్లు ఇంగ్లిష్ 124 గణితం 205 సివిక్స్ 57 తెలుగు 79 హిందీ 11 సంస్కృతం 66 ఫిజిక్స్ 203 ఎకనామిక్స్ 87 కెమిస్ట్రీ 211 హిస్టరీ 31 బోటనీ 88 జువాలజీకి 96 కామర్స్ 90 నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ వాల్యూయేషన్ జిల్లాకు వచ్చిన 81,469 జవాబుపత్రాలు 13,48 మంది ఎగ్జామినర్ల నియామకం -
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు భీమవరం: దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. భీమవరం గునుపూడిలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ స భ్యులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవిత చరిత్ర నాటక ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతి థిగా హాజరైన మోషన్‌రాజు ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలతో నివాళులర్పించా రు. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మోషేన్‌రాజు మాట్లాడుతూ దేశానికి రాజ్యాంగం దిక్సూచిగా ఉందన్నారు. భిన్నత్వంలో ఏక త్వంగా ప్రజలందరినీ సమానంగా చూసేదే రాజ్యాంగం అన్నారు. ప్రతి ఇంట్లో పవిత్ర గ్రంథాలతోపాటు రాజ్యాంగం కూడా ఉండాలన్నా రు. అంబేడ్కర్‌ను రాజ్యాంగానికి మాత్రమే పరిమితం చేయకూడదని, ఆయన జీవితంలో చేసిన ఎన్నో సాంఘిక, రాజకీయ పోరాటాలు ఉ న్నాయని గుర్తుచేశారు. అంబేడ్కర్ నాటక ప్రదర్శన అద్భుతంగా ఉందని, అకాడమీ సభ్యులు ఈ నాటకాన్ని గ్రామాల్లో కూడా ప్రదర్శించాలని కోరారు. ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి మాట్లాడు తూ దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని రాజ్యాంగ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో ఈ కళారూప నాటక ప్రదర్శనలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. నరసాపురం ఆర్డీఓ దాసి రాజు రూ.50 వేల ప్రోత్సాహకాన్ని మోషేన్‌రాజు చేతులమీదుగా కళాకారులకు అందించారు. వ్యవసా య కార్మిక సంఘం పూర్వ రాష్ట్ర కార్యదర్శి మంతెన సీతారాం తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న గిరిజనుల దీక్షలు
బుట్టాయగూడెం: షెడ్యూల్ ప్రాంతంలో ప్రత్యేక డీఎస్సీ కోసం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం కొండరెడ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పట్ల రమేష్‌కుమార్ రెడ్డి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్, ఏటీఏ రాష్ట్ర గౌరవ సలహాదారు తెల్లం రాములు, జేఏసీ నాయ కులు కుంజా వెంకటేశ్వరరావు, సోదెం ముక్క య్య, రవ్వా బసవరాజు, తదితరులు నిరాహార దీక్షలో కుర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ డిమాండ్లు నెరవేరే వరకూ దీక్షలు కొనసాగుతాయని చెప్పారు. జేఏసీ నాయకులు పాల్గొన్నారు. నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 40 కేంద్రాల్లో పరీక్షలకు 7,707 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెన్త్, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయని, వీటి కోసం 11 కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు చెప్పారు. -
7 కేంద్రాలు.. 15,707 మంది విద్యార్థులు
భీమవరం: ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీఈఏపీసెట్ పరీక్షలు సోమ వారం నుంచి ఈనెల 27 వరకు జరుగనున్నాయి. జల్లాలోని ఏడు కేంద్రాల్లో పరీక్షలకు 15,707 మంది హాజరుకానున్నారు. భీమవరంలో డీఎన్నార్ అటానమస్, డీఎన్నార్ ఇంజనీరింగ్, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్, విష్ణు ఇంజనీరింగ్, విష్ణు ఉమెన్స్ ఇంజనీరింగ్, నరసాపురంలో స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్, తాడేపల్లిగూడెంలో శశి ఇంజనీరింగ్ కళాశాలల్లో కేంద్రాలను ఏర్పాటుచేశారు. భీమవరంలోని ఐదు కేంద్రాల్లో ఇంజనీరింగ్ పరీక్షలకు 5,662 మంది, అగ్రి, ఫార్మసీ పరీక్షలకు 1,477 మంది, నరసాపురంలో ఇంజనీరింగ్ పరీక్షలకు 1,501, అగ్రి, ఫార్మసీ పరీక్షలకు 600 మంది, తాడేపల్లిగూడెంలో ఇంజనీరింగ్ పరీక్షలకు 4,527 మంది, అగ్రి, ఫార్మసీ పరీక్షలకు 1,911 మంది హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్న 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. పరీక్ష సమయానికి 1.30 గంటల ముందు నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నేటి నుంచి ఈఏపీసెట్ -
కూటమి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత
తణుకు అర్బన్: కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ప్రజలంతా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సుభిక్ష పాలనపై చర్చించుకుంటున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం పార్టీ పట్టణ కమిటీ ఏర్పాటుపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయపోవడంపై ప్రజలు చీదరించుకుంటున్నారని గుర్తుచేశారు. జగన్ పారదర్శక పాలన అందించారని చంద్రబాబును నమ్మి మోసపోయామంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారని అన్నారు. గతంలో ఏడాదికి రెండు, మూడుసార్లు అర్హులకు ఏదోక పథకం రూపంలో డబ్బులు అందేవని, ఇప్పుడు పెంచిన రూ.వెయ్యి పింఛను తప్ప మిగిలిన పథకాలు ఏమీ అమలుచేయకపోవడంతో ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లలేక ఇళ్లకే పరిమితమవుతున్నారని, రానున్న రోజుల్లో ఎమ్మెల్యేల ఇళ్లను ప్రజలు ముట్టడించే పరిస్థితి వస్తుందని దుయ్యబట్టారు. శ్రేణులంతా పార్టీ బలోపేతానికి పాటుపడాలని, పార్టీ కోసం కష్టపడే ప్రతిఒక్కరిని గుర్తుపెట్టుకుంటానని అన్నారు. వచ్చేవి మంచి రోజులు జగన్ హయాంలో ప్రతి కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుందని, ముఖ్యంగా మహిళలు సంక్షేమ లబ్ధితో చిన్నపాటి వ్యాపారాలు చేసుకుని బలోపేతం అయ్యారని ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్‌కుమార్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి నేతలు వైఎస్సార్సీపీ శ్రేణులను దాడులు, కేసులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతుందని, రానున్న రోజులన్నీ మంచి రోజులేనని స్పష్టం చేశారు. పార్టీ కోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలని, జగన్ చేసిన మంచిని ప్రజలకు తెలియజేస్తూ కూటమి అక్రమాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ పట్టణ కమిటీ ఎన్నికపై నాయకులు కసరత్తు చేశారు. పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, లీగల్ సెల్ సభ్యుడు వెలగల సాయిబాబారెడ్డి, జిల్లా సెక్రటరీ ఆర్గనైజేషన్ యిండుగపల్లి బలరామకృష్ణ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పొట్ల సురేష్, మెహర్ అన్సారీ, బెజ్జవరపు హేమశ్రీ, నూకల కనకదుర్గ, మంగెన సూర్య, నత్తా కృష్ణవేణి, చోడే గోపీకృష్ణ, కారుమంచి యోహాన్, పెనుమాక రాజేష్, కర్రి గంగాధర అప్పారావు, కొత్తపల్లి చరణ్, లారెన్స్ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు -
భీమవరంలో తిరంగా ర్యాలీ
భీమవరం: పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. శనివారం భీమవరంలో ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ప్రపంచ దేశాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వచ్చిందన్నారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) మాట్లాడారు. పట్టణంలో విస్సాకోడేరు వంతెన వద్ద నుంచి అల్లూరి సీతారామ రాజు స్మృతివనం వరకు ర్యాలీ సాగింది. రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు. పరిశుభ్రతతో ఆరోగ్యం భీమవరం: భీమవరంలోని పోలీసు ప్రధాన కా ర్యాలయంలో శనివారం స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, అధికారులు, సిబ్బంది కార్యా లయ ఆవరణలోని చెత్త, పిచ్చిమొక్కలను తొలగించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రతి నెలా మూడో శనివారం కార్యాలయ ఆవరణలో పరిశుభ్రతను నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నా రు. పరిశుభ్రతతో ఆరోగ్యం చేకూరుతుందన్నా రు. ప్లాస్టిక్ వాడకాన్ని వీడాలని కోరారు. అద నపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, జిల్లా స్పె షల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వి.పుల్లారావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ దేశింశెట్టి వెంకటేశ్వరరావు, ఏఆర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ (అడ్మిన్) డి.సురేష్, ఏఆర్ ఇన్స్పెక్టర్ కె.వెంకట్రావు పాల్గొన్నారు. రేపటి నుంచి ఇంటర్ మూల్యాంకనం ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 19 నుంచి ప్రారంభించనున్నట్టు ఏలూరు జిల్లా ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీ య పర్యవేక్షణాధికారి కె.యోహాన్ ప్రకటనలో తెలిపారు. స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ జూని యర్ కళాశాల ప్రాంగణంలో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించి మూల్యాంకన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. సంస్కృతం, ఇంగ్లిష్, తెలుగు, హిందీ, గణితం, సివిక్స్ సబ్జెక్టుల జవాబుపత్రాలను మూల్యాంకనం చేస్తారన్నారు. ఆయా సబ్జెక్టులకు నియమించింన చీఫ్ ఎగ్జామినర్లు, ఎగ్జామినర్లు సోమవారం ఉదయం 10 గంటలకు, స్కూృటినైజర్లు ఈ నెల 20న ఉదయం 10 గంటలకు శిబిరం వద్ద రిపోర్ట్ చేయాలని సూచించారు. సచివాలయ కార్యదర్శి సస్పెన్షన్ చింతలపూడి: విధుల్లో నిర్లక్ష్యం వహించిన చింతలపూడి నగర పంచాయతీ పరిధిలోని పాత చింతలపూడి సచివాలయ కార్యదర్శి కె.గంగా భవానీని అధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌కు జీఎస్‌డబ్ల్యూఎస్ రాష్ట్ర డైరెక్టర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హౌస్ హోల్డ్స్ జియో ట్యాగింగ్ విషయంలో అల సత్వం వహించడంతో పాటు, జీఎస్‌డబ్ల్యూఎస్ డైరెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌కు గైర్హాజరవడం తదితర అంశాలపై సస్పెండ్ చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇద్దరు గ్రామ కార్యదర్శులపై.. సాక్షి టాస్క్‌ఫోర్స్: హౌస్‌హోల్డ్ సర్వేపై నిర్లక్ష్యం వహించిన కారణంగా జిల్లాలో ఇద్దరు గ్రామ కార్యదర్శులను సస్పెండ్ చేయాలని కోరుతూ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్‌కు గ్రామ, వార్డు సచివాలయ శాఖ రాష్ట్ర డైరెక్టర్ సిఫార్సు చేశారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరిలో జిల్లాలోని భీమడోలు గ్రామ కార్యదర్శి కేవీ లక్ష్మీ తనూజ, టి.నరసాపురం గ్రామ కార్యదర్శి ఉన్నట్టు సమాచారం. దీనిపై భీమడోలు ఎంపీడీఓ సీహెచ్ పద్మావతిదేవిని వివరణ కోరగా తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల్లో 4,009 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్టియర్ జనరల్ పరీక్షలకు 3,413 మందికి 3,184 మంది, ఒకేషనల్ పరీక్షలకు 443 మందికి 151 మంది హాజరయ్యారు. -
గూడెంలో భారీ వర్షం
తాడేపల్లిగూడెం రూరల్/తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెం పట్టణం, రూరల్ మండలంలో బంగారుగూడెం, పట్టెంపాలెం, కొమ్ముగూడెం, నీలాద్రిపురం, కడియద్ద, చినతాడేపల్లి గ్రామాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి వాతావరణంలో ఒక్కసారిగా మారిపోయింది. సాయంత్రం 5.30 గంటల నుంచి ఈదురుగాలులు, మెరుపులతో వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని ప్రధాన రహ దారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రెయినేజీలు పొంగి ప్రవహించాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పెదతాడేపల్లిలోని ప్రధాన సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌లో సమస్యతో పరిధిలోని అన్ని సబ్స్టేషన్లలో సరఫరా నిలిచిపోయింది. రాత్రి 7.30 గంటల తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. -
ఈఏపీసెట్‌కు సర్వం సిద్ధం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియెట్ పూర్తిచేసి 2025–26 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీఈఏపీ సెట్ (ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్షలు ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లాలో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా నుంచి 6,865 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు, 21 నుంచి 27 వరకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉద యం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒక సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకూ మరో సెషన్లో కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు జరుగుతాయి. 6,865 మంది విద్యార్థులు ఏలూరు జిల్లా నుంచి 6,865 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో ఇంజనీరింగ్ కోర్సులకు 4,863 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు 1,991 మంది, ఈ రెండు కోర్సులకు 11 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో మూడు పరీక్షా కేంద్రాలను కేటాయించారు. వీటిలో ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్ పాఠశాల, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు ఈఏపీ సెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోనికి అనుమ తించరు.సెల్ఫోన్లు, స్మార్ట్ వాచీలు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెల్లనూ అనుమతించరు. పరీక్షా కేంద్రానికి వచ్చే విద్యార్థులు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న ఫారం, అడ్మిట్ కార్డులు తప్పనిసరిగా తెచ్చుకోవాలి. విద్యార్థులు ఒక గంట ముందుగానే వారికి కేటాయిం చిన కేంద్రాల్లో రిపోర్ట్ చేయడం ఉత్తమం. – పి.బాలకృష్ణ ప్రసాద్, ఈఏపీసెట్ పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ 19 నుంచి అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో.. 21 నుంచి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు జిల్లాలో మూడు కేంద్రాల ఏర్పాటు 6,865 మంది విద్యార్థుల హాజరు జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాలలు, సీట్లు కళాశాల సీట్లు ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ 1,200 ఏలూరు రామచంద్ర ఇంజనీరింగ్ 900 ఏలూరు ఇంజనీరింగ్ కళాశాల 600 హేలాపురి కళాశాల, ఏలూరు 360 ఎన్ఆర్ఐ కళాశాల, ఆగిరిపల్లి 1,360 సారథి ఇంజనీరింగ్ కళాశాల, నూజివీడు 420 -
విద్యుత్ రాయితీ అందేనా..!
ఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025సాక్షి, భీమవరం: ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్‌తో నిమిత్తం లేకుండా రైతులందరికీ యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే ఇస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. ఆక్వా సమస్యల పరిష్కారం కోసం సాగు సమ్మెకు సిద్ధమైన ఆక్వా రైతులు ఈ హామీని అమలు చేయాలని కోరుతున్నారు. జిల్లాలోని భీమవరం, ఉండి, పాలకొల్లు, ఆచంట, నరసాపురం నియోజకవర్గాల్లో 1.26 లక్షల ఎకరాల్లో రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. కోస్తా ఆక్వా కల్చర్ అథారిటీ (సీఏఏ) మార్గదర్శకాల మేరకు ఆక్వా జోన్‌లోని రైతులకు మాత్రమే ప్రభుత్వ లబ్ధి చేకూరుతోంది. గతంలో కొద్ది విస్తీర్ణం మాత్రమే జోన్ పరిధిలో ఉండడటంతో చాలా మంది రైతులకు లబ్ధి అందేదికాదు. గత ప్రభుత్వంలో ఆక్వా రంగంపై ప్రత్యేక దృష్టి సారించడంతో చాలా మంది రైతులకు లబ్ధి చేకూరింది. కూటమి రైతుల్లోనూ అసంతృప్తి విద్యుత్ సబ్సిడీ మంజూరులో జాప్యంపై కూటమికి చెందిన నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ, ఆక్వా రైతు సంఘం నేత మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎన్నికల వాగ్దానాన్ని త్వరితగతిన అమలుచేయాలని, అవసరమైతే ఈ అంశాన్ని తమ పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. ఆక్వా రంగాన్ని సిండికేట్ దోపిడీ నుంచి కాపాడాలని, మేత ధరలు తగ్గించి, రొయ్య రేట్లు పెంచాలని కోరుతూ పాలకొల్లు, ఆచంట, నరసాపురం నియోజకవర్గాల్లో పంట విరామానికి పిలుపునిచ్చిన జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అందరికీ రాయితీ విద్యుత్‌ను అమలుచేయాలని కోరుతోంది. న్యూస్రీల్వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రాధాన్యం ఆక్వా రంగానికి పెద్దపీట వేసిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ–ఫిష్ సర్వే ద్వారా 10 ఎకరాలలోపు రైతులకు చెందిన చెరువులను ఆక్వా జోన్ పరిధిలోకి తెచ్చింది. దీంతో జిల్లాలో ఆక్వా జోన్ పరిధిలోని చెరువులు 1,16,257 ఎకరాలకు పెరిగాయి. జోన్‌లోని 13,648 విద్యుత్ కనెక్షన్లను క్రమబద్ధీకరించి సబ్సిడీపై రూ.1.50లకే విద్యుత్‌ను అమల్లోకి తెచ్చింది. ఆక్వాకు అనుబంధ హేచరీలు, ప్రాసెసింగ్ ప్లాంట్లు తదితర వాటికి నిరంతర విద్యుత్ సరఫరా, కనెక్షన్ల మంజూరు సులభతరం చేసింది. అప్సడా ఏర్పాటుచేసి హేచరీలు, ఫీడ్, ప్రొసెసింగ్ కంపెనీల ఆగడాలకు చెక్ పెట్టింది. సిండికేట్ మాయాజాలంతో రొయ్య ధరలను పూటకోరకంగా మారుస్తూ రైతుల కష్టాన్ని దోచుకునే పరిస్థితికి అడ్డుకట్ట వేసింది. 10 రోజుల పాటు ధరలు స్థిరంగా ఉండేలా ప్రత్యేక చట్టాన్ని రూపొందించారు. ప్రభుత్వ సహకారంతో జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లా రైతులపై రూ.2 కోట్ల భారం జోన్‌తో నిమిత్తం లేకుండా అర్హత కలిగిన ఆక్వా రైతులందరికీ రూ.1.50 రాయితీ విద్యుత్‌ను అందిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. జిల్లాలోని నాన్ ఆక్వా జోన్ చెరువులు సుమారు 9,000 ఎకరాల వరకు ఉండగా, వీటిలో 450 వరకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఎకరా చెరువులో ఆక్సి జన్ సరఫరా నిమిత్తం రెండు ఏరియేటర్లను తిప్పితే నెలకు సుమారు రూ.4,500 వరకు బిల్లు వస్తుంది. జోన్ పరిధిలోని రైతులు ఈ మొత్తంలో రూ.2,250లు చెల్లిస్తే, నాన్ జోన్ పరిధిలోని వారు మొత్తం బిల్లు చెల్లించాల్సి వస్తుంది. 5 నుంచి 10 ఎకరాల వరకు సాగు చేసే రైతులపై ఈ భారం అధికంగా ఉంది. నాన్ ఆక్వాజోన్ పరిధిలో రైతులపై నెలకు రూ.2 కోట్లకు పైగా అదనపు భారం పడుతోందని అంచ నా. కూటమి పాలనలోకి వచ్చి ఏడాది కావస్తున్నా రాయితీ విద్యుత్ రాకపోవడం రైతులను నిరాశకు గురిచేస్తోంది. త్వరితగతిన హామీ అమలుకు ప్ర భుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అందరికీ ఇవ్వాలి ఆక్వా జోన్‌తో సంబంధం లేకుండా రొయ్యలు, చేపల రైతులకు విద్యుత్ యూనిట్ రూ.1.50కు ఇస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీ అమలు కావడం లేదు. దీంతో చాలా మంది రైతులు నష్టాల బారిన పడుతు న్నారు. రొయ్యలకు పూర్తిస్థాయిలో గిట్టుబాటు ధర కల్పించాలి. ప్రతి ఒక్క రొయ్య, చేప రైతు లకు రూ.1.50కు విద్యుత్ సరఫరా చేయాలి. – చవ్వాకుల సత్యనారాయణమూర్తి, ఆక్వా రైతు, తోలేరు ఊసే ఎత్తని కూటమి నాన్ ఆక్వాజోన్‌కు సబ్సిడీ ఇస్తామన్న కూటమి నేతలు ఏడాది కావస్తున్నా కార్యరూపం దాల్చని హామీ జిల్లాలో 1.28 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు నాన్ ఆక్వాజోన్‌లో సుమారు 9 వేల ఎకరాలు రాయితీ కోసం రైతుల ఎదురుచూపులు గత ప్రభుత్వంలో ఆక్వారంగానికి పెద్దపీట -
ఆలయాల్లో హైకోర్టు న్యాయమూర్తి పూజలు
బ్రహ్మోత్సవ శోభ జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాతగిరి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. 19 నుంచి ఉత్సవాలు జరుగనున్నాయి. 8లో uజంగారెడ్డిగూడెం: గోకుల తిరుమల పారిజాతగిరిలోని వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని శనివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ సత్తి సుబ్బారెడ్డి దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన ఆయనకు ఈఓ మానికల రాంబాబు, ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు, కుమారాచార్యులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. జస్టీస్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆయనకు అర్చకులు వేదాశీర్వాదం అందజేసి స్వామి వారి చిత్రపటం, శేషవస్త్రాలు అందించారు. జంగారెడ్డిగూడెం సివిల్ జడ్జి సీహెచ్ కిషోర్‌కుమార్, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ రాజేశ్వరి తేజస్వి, భీమడోలు మెజిస్ట్రేట్ ఎస్.ప్రియదర్శిని ఉన్నారు. మద్దిలో.. గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామిని హైకోర్టు న్యాయమూర్తి సుబ్బారెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈఓ ఆర్వీ చందన మర్యాదపూర్వక స్వాగతం పలికి ప్రత్యేక పూజకు ఏర్పాట్లు చేశారు. న్యాయమూర్తి దంపతులకు స్వామివారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. నారసింహుని సేవలో.. ద్వారకాతిరుమల: ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై కొలువైన లక్ష్మీనరసింహస్వామిని హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ సత్తి సుబ్బారెడ్డి దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. -
ప్రైవేట్ టీచర్లకు ప్రవేశాల భారం
భీమవరం: ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసే టీచర్ల పరిస్థితి దయనీయంగా మారింది. యాజమాన్యాలు అడ్మిషన్ల టార్గెట్లు నిర్దేశించి క్యాంపెయినింగ్‌కు పంపడం, పిల్లలను చేర్పించేందుకు ఇంటింటా తిప్పడంపై టీచర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం విద్యాసంవత్సరం ప్రారంభం కాకుండా ప్రవేశాలు నిషేధం. అయినా కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు వీటిని పట్టించుకోకుండా టీచర్లపై అదనపు భారం మోపుతున్నాయి. తీవ్ర ఒత్తిళ్లు వేసవి సెలవుల్లో కొత్త అడ్మిషన్ల కోసం ఉపాధ్యాయులకు టార్గెట్లు విధిస్తున్నారు. టార్గెట్లు పూర్తిచేయకుంటే ఉద్యోగం ఊడుతుందనే ఆందోళనలో మండుటెండల్లో ఊరూరా తిరుగుతూ పిల్లలను చేర్పించేందుకు టీచర్లు శ్రమిస్తున్నారు. యాజమాన్యాల ఇష్టారాజ్యం ప్రైవేట్ స్కూళ్లలో పనివేళలు నిర్ధిష్టంగా ఉండటం లేదు. కొన్ని విద్యాసంస్థల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉపాధ్యాయులతో పనిచేయిస్తున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు అదనపు క్లాసులు నిర్వహిస్తూ ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచుతున్నారు. దీనికితోడు ప్రవేశాల భారం మోపడంతో వీరంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 563 స్కూళ్లు.. 1.35 లక్షల మంది విద్యార్థులు జిల్లాలో సుమారు 563 ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఉండగా దాదాపు 1.35 లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు. సుమారు 16 వేల మంది టీచర్లు, సిబ్బంది పనిచేస్తున్నారు. స్కూళ్ల నిర్వహణ ఖర్చులు పెరిగాయని, దానికి తగ్గట్టు విద్యార్థుల సంఖ్య లేకుంటే జీతాలు చెల్లించడం కూడా కష్టమని చెప్పి సిబ్బందిని యాజమాన్యాలు బెదిరిస్తున్నట్టు పలువురు వాపోతున్నారు. తనిఖీలు నామమాత్రం ప్రైవేట్ స్కూళ్లల్లో మౌలిక వసతులు, సిబ్బంది సమస్యలపై విద్యాశాఖ అధికారులు తనిఖీలు నామమాత్రంగానే చేస్తున్నారు. కొన్ని స్కూళ్లలో వేసవి సెలవుల్లోనే 10వ తరగతి క్లాసులు నిర్వహిస్తున్నా, పబ్లిక్ గానే అడ్మిషన్లు చేస్తున్నా పట్టించుకునే అధికారులు లేరు. అధికారులు మొక్కుబడి తనిఖీలతో సరిపెడుతున్నారని, సమస్యలను తెలియజేస్తే ఉద్యోగాలు ఊడిపోతాయనే భయంలో టీచర్లు ఉన్నారు. ఉన్నతాధికారులు ప్రైవేట్ విద్యాసంస్థల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న అడ్మిషన్లు విద్యాబోధన అడ్డుకుని సిబ్బందికి భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ ఉపాధ్యాయులు కోరుతున్నారు. అడ్మిషన్ల టార్గెట్లతో సతమతం మండు వేసవిలో ఇంటింటా క్యాంపెయిన్ జిల్లాలో 563 ప్రైవేట్ విద్యాసంస్థలు సుమారు 16 వేల మంది ఉపాధ్యాయులు -
ఇలాగైతే విద్యారంగంనిర్వీర్యమే
భీమవరం : రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో విద్యా రంగం నిర్వీర్యమయ్యే ప్రమాదముందని విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాలల పునర్నిర్మాణ ప్రక్రియ పేరుతో గందరగోళానికి తెర తీశారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం కారణంగా ప్రాథమిక విద్యపై తీవ్ర ప్రభావం పడుతుందని, మిగులు ఉపాధ్యాయులు పెరిగి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం క్లస్టర్ విధానాన్ని తొలగించి మోడల్ స్కూల్ విధానం అమలు చేసేందుకు సిద్ధమైంది. పాఠశాలల పునర్మిర్మాణం పేరుతో కొత్త విధానానికి తెర తీసింది. తొమ్మిది రకాల పాఠశాలలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం చేపట్టిన తాజా చర్యలతో మిగులు ఉపాధ్యాయ పోస్టులు పెరిగి, ప్రాథమిక విద్యకు విఘాతం ఏర్పడుతుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రాథమికోన్నత(యూపీ) పాఠశాలలను ఎత్తివేయాలని భావించింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోను విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో జిల్లా స్థాయి అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో వెనకంజ వేసింది. యూపీ స్కూల్స్ యథావిధిగా కొనసాగించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల పరిధిలో ఇప్పటికే సుమారు 1,156 వరకు ఉపాధ్యాయలు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. జిల్లాలో దాదాపు 1,423 స్కూల్స్ ఉండగా వీటిలో దాదాపు 3,800 మంది ఉపాధ్యాయుల్ని బదిలీ చేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయుల నియామకాలు ఇలా.. ● ఫౌండేషన్ స్కూల్స్ (1–2వ తరగతి, 1–30 మంది విద్యార్థులకు 1 ఎస్జీటీ, 31–60 మంది విద్యార్థులకు ఇద్దరు ఎస్జీటీలు) ● ప్రైమరీ స్కూల్ (1 నుంచి 5వ తరగతి వరకు 20 మందికి ఒక ఎస్జీటీ, 60 మందికి ఇద్దరు ఎస్జీటీలు) ● మోడల్ ప్రైమరీ స్కూల్స్(1 నుంచి 5వ తరగతి వరకు 59 మంది విద్యార్థులకు ముగ్గురిని, 150 మంది విద్యార్థులకు 4 ఉపాధ్యాయులను నియమిస్తారు. ● అప్పర్ ప్రైమరీ స్కూల్స్‌లో 1–10 విద్యార్థుల వరకు స్కూల్ అసిస్టెంట్, 11 నుంచి 30 వరకు ఇద్దరు, 31 నుంచి 140 వరకు నలుగురు, 141 నుంచి 175 మంది విద్యార్థులకు ఐదుగురు స్కూల్ అసిస్టెంట్లను నియమిస్తారు. పాఠశాలల పునర్నిర్మాణ ప్రక్రియపై ఉపాధ్యాయుల ఆగ్రహం ఇలాగైతే ఉద్యమం తప్పదు రాష్ట్ర ప్రభుత్వం అనుచరిస్తున్న విధానాల వల్ల ప్రభుత్వ పాఠశాలలు మూతపడే ప్రమాదముంది. ప్రతి గ్రామంలో ఫౌండేషన్ స్కూల్ స్థానంలో 1 నుంచి 5వ తరగతి వరకు స్కూల్ ఉండాలి. ప్రతి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్యలో సంబంధం లేకుండా ఇద్దరు టీచర్స్ ఉండాలి. హైస్కూల్స్‌లో 45 మంది కంటే ఎక్కువ ఉంటే రెండో సెక్షన్ ఏర్పాటు చేయాలి. మా డిమాండ్ల పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదు. – జి.ప్రకాశం, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, భీమవరం -
యథేచ్ఛగా గ్రావెల్ రవాణా
సాక్షి టాస్క్‌ఫోర్స్: యథేచ్చగా టిప్పర్లతో పోలవరం కాలువ నుంచి గ్రావెల్ రవాణా చేస్తున్నారు. దెందులూరు మండలం చల్ల చింతలపూడి గ్రామంలో బ్రిడ్జి పక్కన పోలవరం గట్టును తవ్వి టిప్పర్లతో గ్రావెల్ తరలిస్తున్న ప్రభుత్వ అధికారులు స్పందించకుండా మౌనంగా ఉన్నారు. మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఈ తతంగం జరుగుతున్నా పట్టనట్లు వ్యవహరించడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదకరంగా ఇసుక తవ్వకాలు జంగారెడ్డిగూడెం: మండలంలోని ప్రధాన కాలువల్లో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి తవ్వకాలు చేస్తున్నారు. వంతెనలు, కల్వర్టులు, కట్టడాలు సమీపంలో ఇసుక తవ్వకూడదనే నిబంధన ఉన్నప్పటికీ అవి పట్టడం లేదు. జల్లేరు గ్రామంలోని జల్లేరు కాలువపై నిర్మించిన వంతెన సమీపంలో ఇసుక తవ్వేయడంతో వంతెనకు ప్రమాదం పొంచి ఉంది. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. డాబా పైనుంచి పడి వ్యక్తి మృతి ఆగిరిపల్లి: మండలంలోని అడవినెక్కలంలో నిద్రలో డాబా పై నుంచి కిందపడి వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై శుభ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం అడవినెక్కలానికి చెందిన అద్దేపల్లి దుర్గారావు(45) కూలీ చేసుకుంటూ జీవిస్తున్నాడు. శుక్రవారం రాత్రి డాబాపై పడుకున్నాడు. నిద్రపోతూ ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దుర్గారావు చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. దుర్గారావుకు కొడుకు, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కొండచిలువ హల్చల్ తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని వెంకట్రామన్నగూడెం తాడిపూడి కాలువలో జంగిల్ క్లీనింగ్ చేస్తుండగా, శనివారం కొండ చిలువ ఉపాధి హామీ పథకం శ్రామికుడి కాళ్లు, నడుమును చుట్టేయడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. మిగతావారు కొండ చిలువను విడదీసి అతనిని కాపాడారు. ఈ పెనుగులాటలో ఇద్దరికి చేతులు విరిగినట్లు సమాచారం. అనంతరం కొండ చిలువను హతమార్చారు. -
దిక్కుతోచని పుచ్చ రైతు
నూజివీడు: ఎంతో ఆశతో ఈ ఏడాది పుచ్చ కాయల సాగు చేపట్టిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివిలా మార్కెట్లో పరిస్థితులు ఉండటం, వాతావరణం అనుకూలించకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. దిగుబడి వచ్చే సమయానికి ధర పతనమవ్వడంతో రైతులు నష్టాల పాలయ్యారు. నూజివీడు మండలంలోని తుక్కులూరు, ముసునూరు మండలంలోని కాట్రేనిపాడులలో దాదాపు 50 ఎకరాల్లో పుచ్చ సాగు చేపట్టగా సాగు చేసిన రైతులందరూ నష్టాల ఊబిలో కూరుకుపోయారు. అకాల వర్షాలతో కాయలు కొనేవారు లేక తోటలోనే కుళ్లిపోవడంతో రైతులు చేసేదేమీ లేక వదిలేస్తున్నారు. ఎకరాకు రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి ఎకరాకు రూ.25 వేల చొప్పున కౌలుకు తీసుకొని సాగు చేసిన పుచ్చ పంటకు ఎకరాకు రైతులు రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. దిగుబడి బాగా వచ్చినా.. సాగు సమయానికి మార్కెట్లో టన్ను ధర రూ.11 వేల నుంచి రూ.12 వేల వరకు ఉండగా దిగుబడి సమయానికి రూ.6 వేలకు పడిపోయింది. దీంతో చేసేదేమీ లేక రైతులు అదే ధరకు విక్రయించేశారు. ఐదేళ్లుగా టన్ను రూ.18 వేల నుంచి రూ.20 వేలు పలికింది. దీంతో పుచ్చసాగు చేసిన రైతులు లాభాల బాటలో పయనించారు. ఈ ఏడాది మాత్రం అందుకు విరుద్ధంగా ధర పతనమైంది. కొంపముంచిన అకాల వర్షాలు పుచ్చ సాగు ప్రారంభంలో అనుకూలించిన వాతావరణం దిగుబడి రావడం ప్రారంభించాక ఒక్కసారిగా అకాల వర్షాలతో కొంప ముంచేశాయి. ఎకరాకు 15 నుంచి 18 టన్నుల దిగుబడి వచ్చినప్పటికీ అకాల వర్షాలు పడటంతో పుచ్చకాయలు కొనుగోలు చేసే వ్యాపారులు ముందుకు రాలేదు. దీంతో కోతకు సిద్ధంగా ఉన్న కాయలు కుళ్లిపోతుండటంతో రైతులు చేసేది లేక వదిలేశారు. కొందరు రైతులు కాయలను కోసి వారే నేరుగా ట్రాక్టర్లలో వేసుకొని గ్రామాల్లోకి, పట్టణాల్లోకి వెళ్లి అమ్మినా పెట్టుబడులు రాలేదు. కాలం కలిసి రాకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అకాల వర్షాలతో తగ్గిన కొనుగోళ్లు ధర పతనమై నష్టాల ఊబిలో రైతులు రూ. 6 లక్షల నష్టం ఆరెకరాల్లో పుచ్చ సాగు చేశా. కౌలుతో సహా ఆరెకరాలకు రూ.7.50 లక్షలు పెట్టుబడి అయింది. రూ.6 వేల చొప్పున 25 టన్నులు విక్రయించా. అనంతరం అకాల వర్షాలు పడటంతో కాయ కుళ్లిపోయింది. దీంతో ఆరు లక్షల నష్టం వాటిల్లింది. గతేడాది టన్ను రూ.19 వేల నుంచి రూ.20 వేలు ఉంది. ఈ ఏడాది మాత్రం దారుణంగా పడిపోయింది. – తల్లిబోయిన రాజగోపాలస్వామి, మర్రికుంట, నూజివీడు మండలంపెట్టుబడి లక్ష.. వచ్చింది రూ.50 వేలే 15 ఎకరాల్లో పుచ్చ పంట సాగుచేశా. ఎకరాకు పెట్టుబడి రూ.1.10 లక్షలు పెట్టాం. దిగుబడి ప్రారంభమైన నాటి నుంచి టన్ను ధర రూ.6 వేలకు పడిపోయింది. దీంతో పుచ్ఛకాయలను విక్రయిస్తే ఎకరాకు రూ.50 వేలు మాత్రమే వచ్చాయి. దీంతో దాదాపు రూ.8 లక్షల నష్టం వాటిల్లింది. మార్కెట్లో ఈ ఏడాది పరిస్థితి దారుణంగా ఉంది. – పాలడుగు విజయ్‌కుమార్, తుక్కులూరు, నూజివీడు మండలం -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
తణుకు అర్బన్ : తుని జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తణుకు పట్టణానికి చెందిన యువకుడు మృతిచెందాడు. తణుకులోని అపోలో ఫార్మసీలో పనిచేస్తున్న వరాడ సుధీర్ (32) స్నేహితులతో కలిసి విశాఖపట్టణం నుంచి కారులో వస్తుండగా ఆగి ఉన్న ఇనుప చువ్వల లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనలో సుధీర్‌తోపాటు మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. సుధీర్ మృతితో తణుకులో విషాద చాయలు అలముకున్నాయి. పోక్సో కేసు నమోదు భీమవరం : బాలికను ప్రేమ పేరుతో మోసం చేసినట్లు ఫిర్యాదు మేరకు ముగ్గురిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు భీమవరం టూటౌన్ సీఐ జి.కాళీచరణ్ చెప్పారు. కాళ్ల మండలం బొండాడ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన బందెల షాలిమ్ ప్రేమిస్తున్నానంటూ వెంటపడగా ముందు తిరస్కరించింది. కుసుమే ప్రవీణ్‌తో షాలిమ్ రాయబారం నడపడంతో బాలిక ప్రేమకు అంగీకరించింది. షాలిమ్ ఈ ఏడాది జనవరి 16న మాయమాటలు చెప్పి భీమవరం పట్టణంలోని లాడ్జికి తీసుకెళ్లాడు. ఆ విషయాన్ని షాలిమ్ బొండాడ గ్రామానికి చెందిన ఎం.బాలుకు చెప్పడంతో, ఈ ఏడాది మార్చి 27న బాలికను షాలిమ్ తీసుకురమ్మంటున్నాడని చెప్పి అదే లాడ్జికి తీసుకువెళ్లి బాలు బలవంతం చేశాడు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాళీచరణ్ తెలిపారు. మంచి సినిమా కథలకు ఆదరణ సినీ రచయిత అబ్బూరి రవి భీమవరం (ప్రకాశంచౌక్): సినిమా క్వాలిటీ రేంజ్ పెరిగిందని, మంచి కథలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుందని సినీ మాటల రచయిత అబ్బూరి రవి అన్నారు. ట్రైలర్లు.. సినిమా పోస్టర్లను చూసి ఇది ఓటీటీ.. ఇది థియేటర్ సినిమా అనే చెప్పే పరిస్థితి నెలకొందని చెప్పారు. ప్రస్తుతం అడవి శేషుతో డెకాయిట్ చిత్రం చేస్తున్న ఆయన శనివారం భీమవరం విచ్చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తనది భీమవరమేనని, త్రివిక్రమ్‌తో స్నేహమే సినిమా మాటల రచయితగా మార్చిందన్నారు. తండ్రిని చంపిన కొడుకు అరెస్టు దెందులూరు: తండ్రిని చంపిన కొడుకును దెందులూరు ఎస్సై శనివారం అరెస్ట్ చేశారు. మండలంలోని ఉండ్రాజవరం గ్రామంలో అంబల్ల సింహాచలంపై పెద్ద కుమారుడు రోకలిబండతో శుక్రవారం దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సింహాచలం మరో కుమారుడు శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై శివాజీ వివరించారు. -
కూటమి నాయకుల మధ్య మట్టి రగడ
కొయ్యలగూడెం: సాగునీటి చెరువుల నుంచి నిర్వహిస్తున్న మట్టి తోలకాలు కూటమి నాయకుల మధ్య రగడ సృష్టిస్తున్నాయి. శనివారం సరిపల్లి గ్రామంలో కూటమిలోని రెండు పార్టీల నాయకులు సమీపంలోని చెరువు నుంచి మట్టితోలకాలకు అనుకూలంగా ఒక వర్గం, వ్యతిరేకంగా మరో వర్గం ఘర్షణకు దిగారు. మే 16న రాత్రి దిప్పకాయలపాడు దళితవాడలో రాత్రి వేళల్లో మట్టి రవాణా గురించి స్థానికులు అభ్యంతరం తెలిపి ఆందోళన చేపట్టారు. లారీలను ఆపి అడ్డుకున్నారు. చెరువుల నుంచి చేస్తున్న మట్టితోలకాలు నిబంధన ప్రకారం వ్యవసాయ భూముల అభివృద్ధికి వినియోగించాల్సి ఉన్నప్పటికీ కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లోని బేస్మెంట్లకు, ఇటుక బట్టీలకు, లేఅవుట్ల స్థలాలకు వినియోగిస్తున్నా కూడా అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. మట్టి రవాణా వాణిజ్య అవసరాలకు వాడుతున్నారని కూటమి నాయకులలోని ఒక వర్గం అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీనిపై ఇరిగేషన్ అధికారులను వివరణ అడగ్గా వాణిజ్య అవసరాలకు మట్టి వెళ్తున్నట్లు ఏవిధమైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. -
పారిజాతగిరిపై బ్రహ్మోత్సవ శోభ
19 నుంచి ఉత్సవాలకు ఏర్పాట్లు జంగారెడ్డిగూడెం : బ్రహ్మోత్సవాలకు పారిజాతగిరి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ నెల 19 నుంచి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ రహదారిని ఆనుకుని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న పారిజాత గిరి వెంకటేశ్వరస్వామి ఆలయం పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. క్షేత్ర పురాణం ప్రకారం.. చిట్టియ్య అనే భక్తుడికి వేంకటేశ్వరుడు కలలో కనిపించి జంగారెడ్డిగూడెం ఉత్తరాన కొండల్లో తన పాదాలు వెలుస్తాయని ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించాలని తెలిపారు. చిట్టియ్య అన్వేషించగా, ఉత్తర వైపున ఉన్న 7 కొండలలో 6వ కొండపై పారిజాతగిరి వక్షం కింద స్వామి వారి పాదాలుదున్న శిలను గుర్తించి చిన్న ఆలయాన్ని నిర్మించారు. నాటి నుంచి భక్తుల అభీష్టాలు తీర్చుతూ ఆలయం అభివృద్ధి చెందింది. పాడిపంటలు కలిగిన ప్రదేశం కాబట్టి గోకులం అనిని, పారిజాత గిరి వృక్షాలు ఉండడంతో పారిజాత గిరి అని, వేంకటేశుడు కొలువై ఉన్నందున తిరుపతి అంటాడు. అందుకు గోకుల తిరుమల పారిజాతగిరిగా ప్రసిద్ధిగాంచింది. పారిజాతగిరిలో.. కొండ వెనుక వరుసగా ఏడు కొండలు ఉండగా ఒక కొండపై పారిజాతగిరి వాసుడి పాదపద్మాలు అవతరించాయి. దీంతో అప్పటి నుంచి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. పారిజాతగిరి వాసుడికి ఎదురుగా గరుడకొండ ఉంది. గిరి ప్రదక్షిణ కోసం రోడ్డు నిర్మాణం దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే స్వామి నుంచి వెలువడే శక్తిని భక్తులు గ్రహించి పునీతులవుతారని నమ్మకం. దాత సహకారంతో గిరి ప్రదక్షిణ రోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. పారిజాతగిరి ఆరు కొండల చుట్టూ సుమారు 2.5 కిలోమీటర్ల మేర దాత గోకరాజు గంగరాజు అందజేసిన రూ.60 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారు. ఈ తరహా గిరి ప్రదక్షిణ అరుణాచలం, ద్వారకాతిరుమల, అన్నవరం, సింహాచలం, శ్రీకాళహస్తిలో మాత్రమే ఉన్నాయి. ఆలయంలో ప్రతి శనివారం అన్నదానం, మే నెలలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. 19 నుంచి బ్రహ్మోత్సవాలు పారిజాతగిరిలో 19వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 19న సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. 20న శేష వాహన సేవ, 21న హనుమంత వాహన సేవ, 22న శ్రీనివాస కళ్యాణం, చంద్ర ప్రభ సేవ, 23న గరుడ వాహన సేవ, 24న వసంతోత్సవం, చక్రస్నానం, 25న శ్రీపుష్ఫయాగం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల బ్రోచర్ ఆవిష్కరణ బ్రహ్మోత్సవాల బ్రోచర్‌ను శనివారం ఆలయ అభివృద్ధి కమిటీ ఆవిష్కరించింది. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ సోమవారం సాయంత్రం బ్రహ్మోత్సవాల ప్రారంభ పూజలు జరుగుతాయన్నారు. సాయంత్రం 6 గంటలకు విశ్వక్సేన పూజ, అంకురార్పణ, వైనతేయ ప్రతిష్ఠ జరుగుతాయన్నారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్ పేరిచర్ల జగపతిరాజు, అబ్బిన దత్తాత్రేయ, రాజన పండు, గొట్టుముక్కల భాస్కరరాజు, అర్జుల మురళి, దండు ధనరాజు, రెడ్డి రంగప్రసాద్, వాసవీ సాయి నగేష్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. 22న స్వామి కల్యాణోత్సవం జరగనుంది. ఆలయ మాడవీధుల్లో అర్చకుల వేద మంత్రాల నడుమ స్వామికి వివిధ వాహన సేవలు నిర్వహించనున్నాం. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలి. ఎం.రాంబాబు, ఈవో, పారిజాతగిరి -
కొనసాగుతున్న కోకో రైతుల ధర్నా
దెందులూరు: కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాలని, కంపెనీల మోసాలు అరికట్టాలని, కోకో రైతులను ఆదుకోవాలంటూ రైతులు శనివారం దెందులూరు మండలం సోమవరప్పాడు మోండలీజ్ కంపెనీ వద్ద ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకులు వై. కేశవరావు, కౌలురైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు మాట్లాడుతూ గత రెండున్నర నెలలుగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నా.. కంపెనీలు స్పందించకపోగా కించపరుస్తూ మాట్లాడడం అభ్యంతకరమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని విదేశీ కోకో గింజల దిగుమతులు నిలుపుదల చేయాలన్నారు. దేశీయంగా రైతుకు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కోకో రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి కే.శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. రైతుల ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. ఈ నెల 19, 20ల్లో జరిగే చర్చలను బట్టి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు. ఏపీ కోకో రైతుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎస్.గోపాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, ఉపాధ్యక్షుడు పానుగంటి అచ్యుత రామయ్య, సహాయ కార్యదర్శి వీరారెడ్డి, మాజీ జెడ్పీటీసీ విద్యాసాగర్ మాట్లాడుతూ కోకో రైతులంతా సంఘటితంగా పోరాడాలన్నారు. ఎంతో కష్టపడి రైతు ఉత్పత్తి చేస్తున్న కోకో గింజలకు తగిన ధర ఇవ్వకుండా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ధర అమలు చేస్తూ రైతులను మోసం చేసి భయపెట్టి కోకో గింజలు కొనుగోలు చేయడం తగదన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్మాట్లాడుతూ కోకో రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు. రైతుల దీక్షలతో మోండలీజ్ వద్ద పోలీసుల్ని మోహరించారు. కంపెనీ మేనేజర్ రాజేష్ రామచంద్రన్, రైతుల సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. రెండు మూడ్రోజుల్లో ధర నిర్ణయంపై కంపెనీ యాజమాన్యం చర్చలకు వస్తుందని, ఆందోళన విరమించాలని కోరారు. అప్పటి వరకు కంపెనీ కార్యకలాపాలు నిలుపుదల చేయాలని రైతు సంఘాల నాయకులు కోరగా మేనేజర్ అంగీకరించారు. కంపెనీతో పాటు మిగిలిన కంపెనీలు కూడా తమ గోడౌన్లలో ఉన్న సరుకు బయటకు పంపకుండా కంపెనీల కార్యకలాపాలు నిలుపుదల చేయాలని అన్ని కంపెనీలకు సమాచారం ఇచ్చారు -
కాంట్రాక్టు బస్సులపై 85 కేసులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గత గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు కలపర్రు టోల్గేట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించి కాంట్రాక్టు క్యారేజ్ బస్సులపై 85 కేసులు నమోదు చేసినట్లు ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ ఒక ప్రకటనలో తెలిపారు. రవాణా కమిషనరు ఆదేశాల మేరకు కాంట్రాక్టు క్యారేజ్ బస్సులపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏలూరు జిల్లాలోని వాహన తనిఖీ అధికారులు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. విశాఖపట్నం నుంచి విజయవాడ, విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య తిరిగే కాంట్రాక్టు క్యారేజ్ బస్సులను తనిఖీలు చేసి.. పర్మిట్ నిబంధనలను ఉల్లంఘించిన 85 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.3.70 లక్షలు వసూలు చేసినట్లు చెప్పారు. తనిఖీల్లో ఆర్టీవో ఎండీ. మదని తదితరులు తెలిపారు. -
ఆవకాయ పెట్టలేం.. కొంటాం!
ప్రస్తుతం మార్కెట్లో పచ్చడికి అవసరమైన సరకులు దొరుకుతున్నాయి. వీటి ధరలు పరిశీలిస్తే.. లావు మిరపకాయల కారం కిలో రూ.560 వేరుశనగ నూనె కిలో రూ.155 పప్పు నూనె కిలో రూ.450 ఆవాలు కిలో రూ.120 మెంతులు కిలో రూ.120, వెల్లుల్లి కిలో రూ.140 క్వాలిటీని బట్టి ధరలు మారుతున్నాయి. మామిడి కాయల ధరల విషయానికొస్తే.. ఆవకాయకు వాడే చిన్న రసాలు వంద రూ.1000 దేశవాళీ కాయలు రూ.1000 సువర్ణరేఖ రూ.1500 ఐజర్లు రూ.1500 కొత్తపల్లి కొబ్బరి రూ.1800 మాగాయి పచ్చడికి వాడే పెద్ద రసాలు వంద కాయలు రూ.1200 వరకూ విక్రయిస్తున్నారు. పాలకొల్లు సెంట్రల్: వేసవి వస్తే ఇళ్లలో ఆవకాయ సందడి మొదలవుతుంది. ఆవకాయ పచ్చడి ఉంటే చాలు ఆ రోజుకు కూర అవసరం లేదనేది ఆంధ్రుల నమ్మకం. ముద్దపప్పుతో ఆవకాయ కలుపుకుని తింటే ఆ రుచే వేరు. సంవత్సరం మొత్తానికి సరిపడేలా మామిడితో రకరకాల పచ్చళ్లు తయారు చేసి జాగ్రత్త చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఇళ్లలో ఆవకాయ పెట్టుకునే వారి సంఖ్య తగ్గింది. మార్కెట్లో రెడీమేడ్‌గా దొరుకుతుండడంతో వాటితోనే సరిపెట్టుకుంటున్నారు. వేసవి సీజన్ వస్తుందంటే మహిళలు పచ్చడి తయారీలో బిజీగా గడిపేవారు. అయితే ఇప్పటి బిజీ లైఫ్‌లో ఆవకాయ పెట్టలేం.. కొంటాం అంటున్నారు మహిళలు.. ఇప్పుడు అన్ని మార్కెట్లోనే కొనేస్తున్నారు. మామిడి కాయల ముక్కలు కూడా మార్కెట్లో అమ్ముతున్నారు. కారం, శుభ్రం చేసిన మెంతులు, ఆవాలు, వెల్లుల్లి పాయలు ఇలా పచ్చడి తయారీకి కావలసిన అన్ని రకాల సరుకులు దొరుకుతున్నాయి. ఇప్పటికీ కొందరు అన్నీ ఇంట్లోనే తయారుచేసుకుని పచ్చడి పెడుతుంటే.. కొందరు మాత్రం అవసరమైన దినుసులు మార్కెట్లో కొనుగోలు చేసి పచ్చళ్లు పెడుతున్నారు. మరికొందరు ఈ గొడవ అంతా ఎందుకని.. రెడీమేడ్ పచ్చళ్లు కొనేస్తున్నారు. జనంలో నేడు పచ్చడిపై మక్కువ తగ్గడానికి కారణం రెడీమేడ్‌గా నాణ్యమైన పచ్చళ్లు మార్కెట్లో దొరకడం. అలాగే పచ్చడికి అవసరమైన సరకుల ధరలు పెరగడం. పిల్లల చదువులు, ఫోన్లతో బిజీగా ఉండడం వంటివి.. ఇదివరకటిలా పెట్టేంత తీరిక లేదంటున్న మహిళలు అవసరమైన సరకులు మార్కెట్లో కొంటున్న వైనం రెడీమేడ్ పచ్చడి కొనేందుకు మరికొందరు మొగ్గు సొంతంగా పెట్టుకుంటేనే రుచి పచ్చడి నిల్వ ఉండాలంటే సొంతంగా తయారు చేసుకుంటేనే మేలు. గానుగ నూనె వాడుకోవడం మంచిది. పూర్వం రెండు మూడు కుటుంబాల మహిళలు కలిపి పచ్చడి పెట్టేవారు. నేడు ఎవరి పని వారిదే అన్నట్లు ఉంది. మార్కెట్ రెడీమేడ్ పచ్చళ్లు దొరుకుతుండడంతో పచ్చళ్లు పెట్టడానికి కొంతమంది మొగ్గు చూపడంలేదు. ఎంత కష్టమైనా కనీసం పాతిక కాయలతోనైనా తయారు చేసుకుని రుచిచూడాల్సిందే. దూడే వరలక్ష్మి, గృహిణి, పాలకొల్లు మామిడి ధరలు తగ్గాయి తూర్పుగోదావరి జిల్లాలో గూడపల్లి, లక్కవరం, బట్టేలంక, పశ్చిమగోదావరి జిల్లాలో సీతారామపురం, మొగల్తూరు ప్రాంతాల నుంచి మామిడి కాయలు ఖరీదు చేస్తుంటాం. గత సంవత్సరంతో పోలిస్తే.. కాపు ఎక్కువగా ఉండడం వల్ల ధరలు బాగా తగ్గాయి. ఐజర్లు, కొత్తపల్లి కొబ్బరి గత సంవత్సరం కాయ రూ. 35 నుంచి 50 వరకూ విక్రయించాం. ఈ సంవత్సరం రూ.15 నుంచి రూ.20కి విక్రయిస్తున్నాం. – కటకంశెట్టి మల్లి, వ్యాపారి, పాలకొల్లు -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
ఏలూరు టౌన్ : దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేసి అతని నుంచి బంగారు ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. త్రీటౌన్ స్టేషన్లో సీఐ కోటేశ్వరరావు వివరాల ప్రకారం.. త్రీటౌన్ పరిధిలోని సౌభాగ్యలక్ష్మి అమ్మవారి గుడి, వన్‌టౌన్ పరిధిలోని రెండు దేవాలయాల్లో దొంగతనాలపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సీసీఎస్ సీఐ సీహెచ్ రాజశేఖర్, త్రీటౌన్ ఎస్ఐ పీ.రాంబాబుతో పాటు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలు జరిగిన తీరును పరిశీలిస్తూ... సీసీటీవీ పుటేజ్ ఆధారంగా శుక్రవారం ఏలూరు మినీబైపాస్ రోడ్డులో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చోరీలకు పాల్పడుతున్న కొత్తపేట ఈమని రాంబాబును అరెస్ట్ చేసి అతని నుంచి 30 గ్రాముల బంగారు అభరణాలు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. చోరీ చేయాలనుకునే గుడిని ఎంచుకుని, భక్తుడిలా గుడిలోకి వెళ్తాడు. పూజారితో మాటలు కలిపి భక్తుడిలా కలరింగ్ ఇస్తాడు. పూజారి పరధ్యానంగా ఉన్న సమయంలో దేవుడికి, అమ్మవారికి అలంకరించిన బంగారు వస్తువులు చోరీ చేస్తూ పరారవుతాడని త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు తెలిపారు. రాంబాబుపై కృష్ణా, గుంటూరు జిల్లాలోను కేసులున్నాయని తెలిపారు. రాంబాబుపై రాష్ట్ర వ్యాప్తంగా 50కిపైగా చోరీ కేసులు నమోదయినట్లు చెప్పారు. -
వేసవిలో వాహనాలు జాగ్రత్త
బైక్‌లు, కార్ల నిర్వహణలో మెకానిక్‌ల సూచనలు పాలకొల్లు సెంట్రల్ : వేసవిలో వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధిక ఉష్ణోగ్రతల వల్ల వాహనాల రంగు మారిపోవడం, టైర్లలో గాలి తగ్గిపోవడం, పెట్రోలు ఆవిరయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల బైక్ మెకానిక్‌లు వేసవిలో బైక్‌ల రక్షణకు పలు సూచనలు చేస్తున్నారు. నీడలో పార్కింగ్ మేలు ● వాహనాలను ఎక్కువ సమయం పార్కింగ్ చేయాల్సి వస్తే నీడ ఉన్న చోట చేయడం మేలు. ఎండ వేడికి వాహనాలు రంగు మారిపోయే అవకాశాలు ఎక్కువ. ● అధిక వేడి వల్ల టైర్లలో గాలి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. తప్పని సరిగా వారానికోసారి టైర్లలో గాలిని తనిఖీ చేయించుకోవాలి. టైర్లలో గాలి తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. ● గాలి తక్కువగా ఉండడం వల్ల టైర్లు దెబ్బతింటాయి. ఎక్కువ గాలి ఉన్నా.. ఎండ వేడికి రన్నింగ్‌లో టైరు పేలిపోయే ప్రమాదాలు ఉంటాయి. ● ఎక్కువ సమయం వాహనం ఎండలో ఉండడం వల్ల పెట్రోల్ ఆవిరయ్యే పరిస్థితి ఉంటుంది. వాహనాల్లో పగలంతా తిరిగి ఇంటికి చేరుకుంటాం. ఆ సమయాల్లో పెట్రోల్ ట్యాంక్ మూతను ఓ పది నిమిషాలు తీసి ఉంచితే మేలు. ట్యాంకులో కొంతవరకూ గ్యాస్ స్టోరయ్యే పరిస్థితి ఉంటుంది. మూత తీసి ఉంచితే గ్యాస్ బయటకు పోతుంది. వేసవిలో ఆయిల్‌ను సాయంత్రం కొట్టించడం మేలు. ● దూర ప్రయాణం చేసేటప్పుడు.. వాహనాలు ఎక్కువ వేడెక్కుతాయి. కొంతదూరం ప్రయాణం చేశాక ఇంజన్ ఆపి కొద్దిసేపు సేద తీరడం మంచిది. వేసవిలో ఫుల్ ట్యాంక్ వద్దు బైక్‌లు కొందరు ఫుల్ ట్యాంక్ చేయించుకునే అలవాటు ఉంటుంది. వేసవిలో ఫుల్ ట్యాంక్ చేయించకుండా ఉంటే మేలు. వాహనాన్ని పార్కింగ్ చేసే సమయంలో తప్పనిసరిగా నీడ ప్రాంతాన్ని చూసుకోవాలి. వేడికి పెట్రోల్ ఆవిరవ్వడమే కాకుండా రంగు మారే అవకాశాలు, గాలి తగ్గడం వంటివి జరుగుతాయి. వర్ధినీడి ఉమా, బైక్ మెకానిక్, పాలకొల్లు ఆగి ప్రయాణం చేయడం ఉత్తమం రేడియేటర్లలో నీళ్లు లేకపోవడం వల్ల ఇంజిన్ వేడెక్కి వైరింగ్ షార్టయ్యే ప్రమాదం ఉంటుంది. వేసవిలో సుమారు 200 కి.మీ దూరం ప్రయాణం చేసిన అనంతరం ఎక్కడైనా వాహనాన్ని పార్కింగ్ చేసుకుని ఇంజిన్ కూల్ అయ్యాక మళ్లీ ప్రయాణం చేయడం ఉత్తమం. వాహనం హీట్ ఉన్నప్పుడు టైర్లు వెడెక్కుతాయి. వాటిపై నీళ్లు వేస్తే టైర్‌పై ఎయిర్ బబుల్స్ వచ్చి టైర్లు పేలిపోయే ప్రమాదం ఉంటుంది. – పడమటి సూరిబాబు, లారీ యజమాని, పాలకొల్లు కార్లు, భారీ వాహనాల విషయంలో జాగ్రత్తలు కార్లు, లారీలు, ఇతర భారీ వాహనాల విషయంలో రేడియేటర్లలో నీటి శాతం తరచూ చూసుకోవాలి. రేడియేటర్లలో నీళ్ల కంటే కూలెంట్ ఆయిల్ వాడడం మంచిది. వాహనాల్లో ఇంజన్ ఆయిల్ శాతం తరచూ చూసుకోవాలి. వేసవిలో సాధ్యమైనంత వరకూ సీఎన్జీ వాహనాల్లో ప్రయాణం తగ్గించుకుంటే మంచిది. ఏసీ నిలబడాలంటే కారు అద్దాలకు క్లాత్ మ్యాట్స్ ఏర్పాటు చేసుకోవాలి. భారీ వాహనాలకు కొత్త టైర్లు వాడితే ఉత్తమం. దూర ప్రాంతాలకు ప్రయాణం సమయంలో పాత టైర్లు వేడెక్కి గాలి తగ్గిపోతుంది. పేలిపోవడం వంటి ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు. -
కార్టూనిస్టుకు విశిష్ట బహుమతి
పెనుగొండ : కార్టూనిస్టుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్టూన్ల పోటీలో పెనుగొండకు చెందిన కార్టూనిస్టు వేండ్ర గోపాలకృష్ణ కార్టూన్‌కి విశిష్ట బహుమతి లభించింది. గోపాలకృష్ణ విలేకర్లతో మాట్లాడుతూ తొలి తెలుగు వ్యంగ్య చిత్రకారుడు తలిశెట్టి రామారావు జయంతి పురస్కరించుకొని నిర్వహించిన పోటీలో ఈ బహుమతి గెలుచుకున్నట్లు చెప్పారు. ఈ నెల 20న రవీంద్రభారతీలో పురస్కారాన్ని అందుకోనున్నట్లు తెలిపారు. రైలు నుంచి జారి యువకుడి మృతి భీమడోలు: ఓ యువకుడు ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. భీమడోలు రైల్వే ఎస్సై సైమన్ తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రం సహస్ర జిల్లా శౌర్య గ్రామానికి చెందిన రాహుల్‌కుమార్(23) బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పని పనిచేస్తున్నాడు. ఈ నెల 14న స్వగ్రామానికి వెళ్లే క్రమంలో బెంగళూరులో రైలెక్కాడు. జనరల్ బోగిలో ప్రయాణిస్తున్న సమయంలో శుక్రవారం రైలు భీమడోలు రైల్వే స్టేషన్‌కు వచ్చే సరికి ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి అక్కడిక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
కలెక్టర్ నాగరాణికి సత్కారం
భీమవరం: అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసుకుంటున్న మహిళలను గౌరవించాలని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ అధ్వర్యంలో దివంగత ఉద్దరాజు వెంకట లక్ష్మీనరసయ్య 50వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఆనంద ఫంక్షన్ హాల్లో ఆనంద సీ్త్ర పురస్కారాల ప్రదానం చేశారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు సతీమణి అన్నపూర్ణ, ప్రముఖ సంగీత విద్వాంసురాలు డా.కొల్లూరి వందన (తిరుపతి), జిల్లా వైద్య అధికారిణి గీతాబాయి, పోలీస్ శాఖ, ఆనంద గ్రూప్‌కు చెందిన ఆరుగురు ఉత్తమ సేవాతాత్పరులకు, 50 మంది మున్సిపల్ మహిళ పారిశుద్ధ్య కార్మికులకు పురస్కారాలు అందించారు. కార్యక్రమంలో పౌండేషన్ చైర్మన్ ఉద్ధరాజు కాశీ విశ్వనాథ్ రాజు, కంతేటి వెంకటరాజు, దాయన చంద్రజీ, రఘుపతి రాజు తదితరులు పాల్గొన్నారు. అక్రమ కలప స్వాధీనం కొయ్యలగూడెం : అక్రమంగా కలప రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు కన్నాపురం అటవీశాఖ అధికారి రేంజర్ శివరామకృష్ణ శుక్రవారం పేర్కొన్నారు. యర్రంపేట, ఆరిపాటి గ్రామాల మధ్య బండారు జాతికి చెందిన భారీ వృక్షాలను ట్రాక్టర్లో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నామన్నారు. కలప విలువను లెక్కించాల్సి ఉందని పేర్కొన్నారు. చాట్రాయిలో భారీ వర్షం చాట్రాయి : చాట్రాయిలో శుక్రవారం ఉదయం భారీ వర్షం కురిసింది. కొటపాడులో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగగా చెట్లు కూలిపోయాయి. ఈ వర్షం మెట్ట దుక్కులకు అనువుగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. చనుబండ పాత దళితవాడ రోడ్డు జలమయవ్వడంతో కాలనీ వాసులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. డ్రైవర్‌కు ఏడేళ్ల జైలు కొయ్యలగూడెం : లారీతో ఢీకొట్టి వ్యక్తి మృతికి కారణమైన డ్రైవర్‌కు కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించినట్లు ఎస్సై వి.చంద్రశేఖర్ శుక్రవారం పేర్కొన్నారు. 2018లో చెరుకూరి నరసింహ కొయ్యలగూడెం చేపల మార్కెట్ వద్ద పులిరామన్నగూడెంకు చెందిన నడపాల మంగిరెడ్డిని ఢీకొట్టాడు. దీనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా కొవ్వూరు ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్ కోర్టు జడ్జి జీవీఎల్ సరస్వతి శిక్ష విధించారన్నారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు చెల్లించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారన్నారు. -
ఆర్టీఏ లైసెన్స్ తప్పనిసరి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కేంద్ర ప్రభుత్వం రూపొందించిన క్యారేజ్ బై రోడ్ యాక్ట్ – 2007, క్యారేజ్ బై రోడ్ రూల్స్ – 2011 ప్రకారం వినియోదారుల నుంచి స్వీకరించిన పార్సిళ్లను స్టోర్ చేసి, వాటిని గమ్యస్థానాలకు చేరవేసే రవాణా సంస్థలు తప్పనిసరిగా ఆర్టీఏ కార్యాలయం నుంచి లైసెన్స్ పొందాలని ఉప రవాణా కమిషనరు షేక్ కరీం తెలిపారు. శుక్రవారం స్థానిక డీటీసీ కార్యాలయంలో జిల్లాలోని అన్ని పార్సిల్ రవాణా సంస్థల యాజమాన్య ప్రతినిధులతో డీటీసీ కరీం సమావేశం నిర్వహించి, వారికి చట్టంపై అవగాహన కల్పించారు. సోమవారం నాటికి జిల్లాలోని అన్ని పార్సిల్ రవాణా సంస్థలు ఆర్టీఏ లైసెన్స్ పొందాలని, లేనిపక్షంలో వాహనాలపై కేసులు నమోదు చేసి సీజ్ చేస్తామన్నారు. సమావేశంలో వాహన తనిఖీ అధికారులు ఎన్డీ విఠల్, ఎస్బీ శేఖర్, పీ. రమేష్ బాబు, పార్సిల్స్ రవాణా సంస్థల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు. -
గుక్కెడు నీళ్లు.. గుప్పెడు గింజలు
ఏలూరు(మెట్రో) : వేసవి తాపానికి పక్షులు నీరు దొరక్క అల్లల్లాడిపోతాయి. సమయానికి నీరు, ఆహారం లేకపోవడంతో బిల్డింగుల మధ్య, కరెంటు తీగలపై చాలా వరకూ చనిపోయి కనిపిస్తుంటాయి. అలాంటి చిన్న ప్రాణాలను కాపాడాలని ఏలూరు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ప్రజలకు పలు సూచనలు చేశారు. వేసవిలో నగరాల్లో తిరిగే పక్షులు నీరు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటాయి. అలాంటి పక్షులకు సాయం చేయాలనుకుంటే, పరిశుభ్రమైన నీరు, ఆహారం, సురక్షితమైన ఆశ్రయం కల్పించాలి. గిన్నెలో మంచినీరు ఉంచి నీడ ఉన్న ప్రదేశంలో పెట్టాలి. ప్రతిరోజూ నీటిని మార్చాలి. పక్షులు తాగేటప్పుడు, సురక్షితంగా కూర్చోవడానికి చిన్న రాళ్ళు లేదా గులకరాళ్లను ఉంచాలి. ఆకలి తీరుద్దాం అలాగే వేసవిలో తినేందుకు ఏమీ దొరక్క పక్షులు ఆకలితో అలమటిస్తాయి. అందువల్ల వేసవి వాతావరణానికి అనుకూలంగా ఉండే విత్తనాలు, తృణధాన్యాలు కూడా అందుబాటులో ఉంచాలి. రాగులు, పొద్దుతిరుగుడు విత్తనాలు, వరి ధాన్యం మంచివి. ఏ పక్షులకు ఎలాంటి ఆహారం ఇవ్వొచ్చు ● పిచ్చుకలు : రాగులు, పొద్దుతిరుగుడు విత్తనాలు, చిరుధాన్యాలు ● చిలుకలు: అరటి, జామ, బొప్పాయి వంటి పండ్లు ● కాకులు, కోకిలలు : వండిన అన్నం, చపాతీలు, మృదువైన పండ్లు -
రోడ్డు ప్రమాదంలో వ్యాపారి మృతి
బుట్టాయగూడెం : జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక పొగాకు వ్యాపారి మృతి చెందాడు. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కొయ్యలగూడెంకు చెందిన ముప్పిడి వరప్రసాద్, గోపాలపురానికి చెందిన పి. కృష్ణ, గుంటూరుకు చెందిన ఏ.రాంబాబు, మెదడుమెట్లకు చెందిన టి.వీరాంజనేయులు అనేజంగారెడ్డిగూడెం నుంచి జీలుగుమిల్లి పొగాకు బేళ్లు కొనేందుకు వెళ్తుండగా లక్ష్మీపురం సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి తుప్పల్లోకి దూసుకుపోయింది. గాయపడిన క్షతగాత్రులను 108లో జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ముప్పిడి వరప్రసాద్ అప్పటికే మృతి చెందాడు. పదేళ్లుగా మృతుడు వరప్రసాద్ పొగాకు వ్యాపారం చేస్తున్నారు. -
శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ సత్తి సుబ్బారెడ్డి శుక్రవారం రాత్రి సందర్శించారు. సతీసమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. న్యాయమూర్తి సుబ్బారెడ్డి దంపతులు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు ఆయనకు శేషవస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలకగా, ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి స్వామివారి మెమెంటో, ప్రసాదాలను అందజేశారు. న్యాయమూర్తి వెంట భీమడోలు కోర్టు జడ్జి ఎస్.ప్రియదర్శిని నూతక్కి ఉన్నారు. ప్రశాంతంగా సప్లిమెంటరీ పరీక్షలు భీమవరం: జిల్లాలోని 40 కేంద్రాల్లో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలకు 91 శాతం విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ఎ.నాగేశ్వరరావు తెలిపారు. ఫస్టియర్ జనరల్ కేటగిరీలో 4,844 మందికి 4,477 మంది, ఒకేషనల్ కేటగిరీలో 645 మందికి 569 మంది హాజరయ్యారన్నారు. సెకండియర్ జనరల్ కేటగిరీలో 903 మందికి 810 మంది, ఒకేషనల్ కేటగిరీలో 146 మందికి 125 మంది హాజరయ్యారని, పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని చెప్పారు. వెబ్సైట్లో వాహన పన్ను చెల్లించాలి భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని వాహన యజమానులు త్రైమాసిక పన్నును వెబ్సైట్లో చెల్లించాలని జిల్లా రవాణా శాఖ అధికారి టి.ఉమామహేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. జూన్ 30లోపు పన్ను చెల్లించకుంటే 25 శాతం అపరాధ రుసుం విధిస్తామన్నారు. పన్ను చెల్లించకుండా తిరిగితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు 200 శాతం పెనాల్టీ పడుతుందని పేర్కొన్నారు. అలాగే పాఠశాలల బస్సుల ఫిట్నెస్ ధ్రువీకరణ పొందిన తర్వాతే విద్యార్థులను బస్సుల్లో తీసుకువెళ్లాలని సూచించారు. రోడ్డు భద్రతకు పటిష్ట చర్యలు భీమవరం (ప్రకాశం చౌక్): రోడ్డు భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టి, ప్రమాదాలు నివారణకు కృషి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో రోడ్డు భద్రత కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలను ఉపేక్షించబోమని, స్కానింగ్ కేంద్రాలపై డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్లో పీసీ–పీఎన్డీటీ యాక్ట్, ఏఆర్టీ అండ్ సరోగసి యాక్ట్ అమలుపై ఆమె సమీక్షించారు. అలాగే మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి పథకాలపై కలెక్టర్ సమీక్షించారు. లభ్యం కాని బాలుడి వివరాలు ద్వారకాతిరుమల: స్థానిక యూనియన్ బ్యాంకు సమీపంలో ఈనెల 9న ఒంటరిగా తిరుగుతూ కనిపించిన ఐదేళ్ల బాలుడిని స్థాని కులు పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. బాలుడు తన పేరు గోపాల్ అని, తండ్రి పేరు నాయక్ అని మాత్రమే చెబుతు న్నాడు. అంతకు మించి వివరాలు చెప్పలేకపోవడంతో బాలుడిని ఏలూరులో జిల్లా శిశు గృహానికి తరలించి, తాత్కాలిక వసతి కల్పిస్తున్నట్టు డీసీపీఓ సీహెచ్ సూర్య చక్రవేణి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. బాలుడి వివరా లు తెలియలేదని, ఎవరికైనా తెలిస్తే సెల్ 94910 63810, లేదా ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్ 94407 96653, చైల్డ్ హెల్ప్‌లైన్ కో–ఆర్డినేటర్ వైవీ రాజు 77027 48404 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు. కన్న తండ్రినే కడతేర్చాడు దెందులూరు: కుమారుడు దాడి చేయడంతో తండ్రి మృతి చెందిన ఘటన మండలంలోని ఉండ్రాజవరంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఉండ్రాజవరం గ్రామానికి చెందిన అంబల్ల సింహాచలం (72)పై అతడి పెద్ద కుమారుడు సన్యాసిరావు రోకలి బండతో దాడి చేశాడు. దీంతో తీవ్రగాయాలైన సింహాచలం అక్కడికక్కడే మృతిచెందాడు. సన్యాసిరావు తరచుగా తండ్రితో గొడవ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఇంటి వద్ద ఉన్న సింహాచలంతో గొడవ పడి రోకలి బండతో మోదడంతో సింహాచలం అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘట నా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు -
రైతులకు అభయం.. సమస్యలపై సమరం
● ప్రధానంగా వివిధ సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు అండగా నిలవాలని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారని బొత్స తెలిపారు. ధాన్యం కల్లాల్లో ఉన్నా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయంపై ఈ సందర్భంగా చర్చించారు. ధాన్యం కొనుగోళ్లపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెబుతున్న మాటలకు.. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితికి పొంతనే లేదని నేతలు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంలో రైతుల ఇబ్బందులు తెలుసుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించి, వారితో మాట్లాడి, అండగా నిలవాలని నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. ● ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణమని నిర్ధారించారు. రొయ్యల ధరలు పడిపోవడం, మేత ధరలు అడ్డగోలుగా పెరిగిపోయి రైతులు నష్టపోతున్నా సర్కార్‌కు చీమ కుట్టినట్టయినా లేదని, ఆక్వా రైతులకు వెన్నంటి నిలవాలని తీర్మానించారు. ● గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మాదిరిగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పొగాకు రైతులకు అండగా నిలిచి, పోరాడటానికి సిద్ధంగా ఉండాలని నిర్ణయించారు. ● ప్రధానమైన ప్రజాసమస్యలపై పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు సైతం సిద్ధంగా ఉన్నారని బొత్స సత్యనారాయణ వివరించారు. ● సూపర్ సిక్స్ సహా కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలయ్యే వరకూ ప్రభుత్వంపై ప్రజాపోరులో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యే లా బాధ్యత తీసుకోవడానికి నాయకులు ముందుకు వచ్చారు. ● క్షేత్రస్థాయిలో పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, పార్టీ శ్రేణులు, ప్రజలకు అండగా నిలిచి, మనోధైర్యం కల్పించాలని సమావేశంలో తీర్మానించారు. -
డ్వాక్రా మహిళలకు తెలియకుండా రుణాలు
బుట్టాయగూడెం: తమకు తెలియకుండా తమ ఖాతాల్లో డ్వాక్రా రుణాల సొమ్ములు జమచేశారని, ఐదు నెలల తర్వాత తెలిసి ప్రశ్నిస్తే ఆ సొమ్ములకు వడ్డీ కట్టాలని బ్యాంకు అధికారులు అంటున్నారని మండలంలోని గాడిదబోరుకు చెందిన గిరిజన మహిళలు లబోదిబోమంటున్నారు. తమ ఖాతాల్లో సుమారు రూ.75 లక్షల వరకు సొమ్ములు జమయ్యా యని చెబుతున్నారు. డ్వాకా సంఘాల మహిళ టి. గంగాదేవి తెలిపిన వివరాల ప్రకారం.. గాడిదబోరుకు చెందిన ధనలక్ష్మి, మహాలక్ష్మి, ప్రియదర్శిని, ముత్యాలమ్మ, స్నేహలత, ప్రభ అనే ఆరు గ్రూపులకు రెడ్డిగణపవరంలోని ఓ బ్యాంకు 2021లో రూ.19 లక్షల చొప్పున డ్వాక్రా రుణాలు మంజూరు చేసింది. అప్పటినుంచి గ్రూపు సభ్యులు నెలవారీ వాయిదాలు చెల్లిస్తున్నారు. ఇంకా రూ.5 లక్షల వరకు బకాయిలు ఉండగా తాజాగా డ్వాక్రా మహిళలు బ్యాంకుకు వెళ్లి రుణాల లావాదేవీల స్టేట్మెంట్ తీయించారు. అయితే ఒక్కో ఖాతాలో రూ.19 లక్షల వరకు బకాయి ఉన్నట్టు తెలిసి మహిళలు కంగుతిన్నారు. దీనిపై బ్యాంకు అధికారులను ఆరా తీయగా ఐదు నెలల క్రితం ఒక్కో ఖాతాలో రూ.12.20 లక్షల రుణం జమైందని, వడ్డీతో కలిపి రూ.19 లక్షల వరకు అయ్యిందని చెప్పారు. కొత్త రుణం కోసం తామేమీ దరఖాస్తు చేయలేదని, దీనిపై తమకు బ్యాంకు నుంచి లేదా వెలుగు అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదని మహిళలు అంటున్నారు. ఒక్కో సంఘం రూ.78 వేలు వడ్డీ కింద కట్టాలని బ్యాంకు అధికారులు చెబుతున్నారని మహిళలు ఆవేదన చెందుతున్నారు. డ్వాక్రా మహిళలు శుక్ర వారం ఎంపీడీఓ కె.జ్యోతిని కలిసి సమస్యను తెలి యజేశారు. బ్యాంక్ మేనేజర్‌తో ఎంపీడీఓ జ్యోతి ఫోన్లో మాట్లాడగా తాను సెలవులో ఉన్నానని సోమవారం అన్ని విషయాలు చెప్తానని మేనేజర్ సమాధానమిచ్చారు. వడ్డీ రూపంలో బ్యాంక్ అధికారులు తమ కష్టాన్ని దోచుకుంటున్నారని విషయాన్ని సోమవారం కలెక్టర్ దృష్టికి తీసుకువెళతా మని మహిళా సంఘాల సభ్యులు అన్నారు. ఖాతాల్లోకి రూ.75 లక్షల జమ! 5 నెలల తర్వాత తెలిసి కంగుతిన్న సంఘ సభ్యులు వడ్డీ కట్టాలంటున్న అధికారులు -
కాలువ గట్టు.. పూడిక తీసికట్టు
ఉండి: అనుకున్నంత అయ్యింది.. చెప్పినట్టే జరిగింది.. ఉండి కాలువ పూడికతీత పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకుందని, చినుకుపడితే పూడిక తీసిన మట్టి మళ్లీ కాలువలోకి వెళ్లిపోతుందని ఈనెల 13న ‘సాక్షి’లో ‘మట్టి తీసి గట్టు మీద పెట్టు’ శీర్షికన కథనం ప్రచురించింది. ఈనెల 15న సాయంత్రం ఉండి మండలంలో కురిసిన కొద్దిపాటి వర్షానికే కలిసిపూడి గ్రామంలో ఉండి కాలువలో చేపట్టిన పూడిక తీత మట్టి మళ్లీ కాలువలోకే జారిపోయింది. నామమాత్రంగా పనులు చేపట్టడం, పూడిక తీసిన మట్టి మరలా కాలువలోకే జారిపోవడంపై రైతులు మండిపడుతున్నారు. కలిసిపూడి రెగ్యులేటర్ నుంచి కాలువ శివారు అజ్జమూరు వరకు రూ.33 లక్షలు అంచనా కాగా అగ్రిమెంట్‌గా రూ.22 లక్షలతో పనులు చేపట్టారు. కాలువలో నీరు ఉండగానే పూడికతీత పనులు చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ఇవేమీ పట్టించుకోకుండా కాంట్రాక్టర్, అధికారులు తూతూమంత్రంగా రాత్రిళ్లు పనులు చేపట్టారు. కాలువలో తీసిన మట్టి గట్లపై వేస్తుండటంపై ప్రజల నుంచి వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. కాలువ నుంచి తీసిన పూడికతీత మట్టి గట్ల అంచుల్లో పూసేస్తున్నారు. దీంతో కొద్దిపాటి వర్షానికే అంచుల్లోని మట్టి కాలువలోకి జారిపోయింది. నీళ్లు నములుతున్న అధికారులు ‘సాక్షి’లో కథనం ప్రచురితం కాగా నాయకులు, అధికారులు ఈనెల 14న ఉండి ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కాలువలో తీసిన మట్టి గట్లపై కాకుండా ఎక్కడ వేస్తారు అంటూ ఛలోక్తులు విసురుకున్నట్టు సమాచారం. అయితే ఇప్పుడు కాలువలోకి జారిన మట్టిపై ఎవ రు సమాధానం చెబుతారనేది ప్రశ్నార్థకం. దీనిపై అధికారులను వివరణ కోరగా నీళ్లు నములుతున్నారు. కాలువలోకి జారిన మట్టిని తొలగిస్తారా అని ఏఈ ఫణిశంకర్‌ను ప్రశ్నించగా కాలువలోకి జారితే తీసేస్తామంటూ సమాధానమిచ్చారు. దీనిని బట్టి పూడికతీత పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించడం లేదని అర్థమవుతోంది. కాలువలోకి జారిపోయిన మట్టిన మరలా ఎప్పుడు తొలగిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పూడిక తీసిన మట్టి మళ్లీ కాలువలోకే.. కొద్దిపాటి వర్షానికే జారిపోయిన గట్లు ‘సాక్షి’ చెప్పినట్టే జరిగింది -
సారారహిత జిల్లాగా పశ్చిమ
భీమవరం: పశ్చిమగోదావరి సారారహిత జిల్లాగా ప్రకటించుకోవడం ఆనందంగా ఉందని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన నవోదయం 2.0 కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సారా తయారీ, విక్రయదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం రుణాలు అందిస్తున్నామన్నారు. ఇలా జిల్లాలో గుర్తించిన 13 మందికి రూ.లక్ష చొప్పున రూ.13 లక్షల చెక్కును అందించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ సారా తయారీ, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీలత మాట్లాడుతూ జిల్లాలో సారా వృత్తిలో ఉన్న వారిని గుర్తించి ప్రత్యామ్నాయ ఉపాధిని కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి ఆర్ఎస్ కుమరేశ్వరన్, ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ నాగ ప్రభుకుమార్ పాల్గొన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణపై.. మాదకద్రవ్యాల నియంత్రణకు అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. కలెక్టర్ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆధ్వర్యంలో ఎన్ కార్డ్ (జిల్లాస్థాయి కమిటీ ఫర్ బెటర్ కో–ఆర్డినేషన్ ఇన్ కంట్రోలింగ్ గంజాయి–ఇతర మాదకద్రవ్యాల నియంత్రణ)పై సమావేశాన్ని నిర్వహించారు. డ్రగ్స్ అనర్థాలపై అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. -
నష్టాల్లో మగ్గుతున్న మామిడి రైతు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: నూజివీడు మామిడికి కళ తప్పింది. సాధారణంగా దిగుబడి తగ్గితే పంట ధర పెరుగుతుంది. కానీ మామిడి విషయంలో దిగుబడితో పాటు ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. తెగుళ్లతో నాణ్యత పడిపోవడం దీనికి ఒక కారణంకాగా, ఈ పరిస్థితిని లాభంగా మార్చుకుంటున్న సిండికేట్ వైఖరి మరో కారణం. ‘సాగు’ క్షీణత : ఏలూరు జిల్లాలో నూజివీడు, చింతలపూడి నియోజకవర్గాల్లో మామిడి సాగు గణనీ యంగా ఉంది. నూజివీడు మామిడికి దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయంగాను మంచి డిమాండ్ ఉంటుంది. మూడేళ్ల క్రితం అమెరికాకు కూడా మామిడి ఎగుమతి చేసిన పరిస్థితి. జిల్లాలో 15 ఏళ్ల క్రితం వరకు 80 నుంచి లక్ష ఎకరాల్లో విస్తరించి ఉన్న మామిడి సాగు వరుస నష్టాలు, తుపానుల ధాటికి క్రమంగా తగ్గుతూ, ప్రస్తుతం 52 వేల ఎకరాలకు పడిపోయింది. ఈ సీజన్‌కు సంబంధించి గత డిసెంబర్లో మంచి పూత వచ్చినా నల్లతామర తెగులుతో సుమారు 60 నుంచి 70 శాతం మేర దిగుబడి తగ్గిపోయింది. జిల్లాలో ప్రధానంగా బంగినపల్లి, తోతాపురి (కలెక్టర్ కాయలు), చిన్నరసాలు, పెద్దరసాల సాగు అధికంగా ఉంటుంది. దేశీయ మార్కెట్‌కే పరిమితం ఈ ఏడాది జిల్లాలో 1.35 లక్షల టన్నుల దిగుబడి అంచనా కాగా, తెగుళ్ల ధాటికి 50 వేల టన్నులకే పరిమితమైంది. ప్రధానంగా బంగినపల్లి, తోతాపురిలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు అవుతుండగా చిన్నరసాలు, పెద్దరసాలు రాష్ట్రంలో విక్రయాలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో గతేడాది బంగినపల్లి రకం టన్ను రూ.25 వేల నుంచి రూ.30 వేలు, తోతాపురి టన్ను రూ.13 వేల నుంచి రూ.15 వేల ధరకు విక్రయించారు. అయితే ఈ ఏడాది సీజన్ ప్రారంభమైన మార్చిలో పంట దిగుబడి లేకపోవడంతో బంగినపల్లి రకం టన్ను ధర రూ.80 నుంచి రూ.లక్ష వరకు పలికి, క్రమక్రమంగా తగ్గుతూ ప్రస్తుతం రూ.15 వేలకు చేరింది. అలాగే తోతాపురి కూడా ప్రారంభంలో అత్యధికంగా రూ.20 వేల నుంచి రూ.25 వేలకు పలికిన ధర ప్రస్తుతం రూ.8 వేలకు వేలకే పరిమితమైంది. మార్కెట్లో తగ్గిన హవా ఏటా మార్చి నెలాఖరు నుంచి మే నెలాఖరు వరకు నూజివీడు మామిడి విజయవాడ మ్యాంగో మార్కె ట్ ద్వారా ఎగుమతులు జరుగుతుంటాయి. ప్రధానంగా నూజివీడు వైరెటీకి మహారాష్ట్ర, గుజరాత్లో మంచి డిమాండ్ ఉండటంతో అక్కడ వ్యాపారులు ప్రత్యేకంగా స్థానిక మార్కెట్లో కొనుగోలు చేసే పరిస్థితి. అయితే ప్రస్తుత పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండటంతో దేశీయ మార్కెట్లో నూజివీడు హవా పూర్తిగా తగ్గి తెలంగాణ, ఉలవపాడు మామిడికి కొంత డిమాండ్ పెరిగింది. 50 శాతం పతనమైన ధర బంగినిపల్లి, తోతాపురి ధరల క్షీణత దిగుబడి తగ్గినా.. ధర పెరగని పరిస్థితి అకాల వర్షాలు, తెగుళ్లతో నాణ్యతలేమి తీవ్ర నష్టాల్లో మామిడి రైతులు -
సమస్యలపై ప్రజాపోరు
వేసవిలో వాహనాలు జాగ్రత్త వేసవిలో వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధిక ఉష్ణోగ్రతలతో వాహనాలు దెబ్బతింటాయని మెకానిక్‌లు చెబుతున్నారు. IIలో uఅంతర్రాష్ట్ర దొంగ అరెస్టు ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను ఏలూరు పోలీసులు అరెస్టు చేసి బంగారు ఆభరణాలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. IIలో uశనివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2025సాక్షి ప్రతినిధి, కాకినాడ: సమస్యలపై ప్రజా భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని మేలుకొల్పేలా పోరుబాటకు వైఎస్సార్ సీపీ సిద్ధమవుతోంది. ఇందుకు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా రానున్న రెండు నెలల్లో మండల, గ్రామ కమిటీల నియామకాలు పూర్తి చేయాలని పార్టీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో–ఆర్డినేటర్, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పార్టీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే జూన్‌లోపు ఇంకా మిగిలిన మండలాలు, జూలైకల్లా గ్రామస్థాయి కమిటీల నియామకాలు పూర్తి చేయా లని సూచించారు. కాకినాడ డి–కన్వెన్షన్‌లో శుక్రవారం జరిగిన పార్టీ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవ్వాలనేది ప్రధాన అజెండాగా నిర్ణయించారు. ఇందుకోసం ప్రజల సమస్యలపై పార్టీ స్థానిక నాయకత్వాలు శాంతియుత పంథాలో నిరసన కార్యక్రమాలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇటీవల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జి ల్లా పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి నాయకత్వాన ని ర్వహించిన ఆందోళనలపై సమీక్షలో చర్చించారు. ఇదే తరహాలో సమస్యలపై పోరుబాటకు సన్నద్ధం కావాలని నేతలకు బొత్స సూచించారు. జిల్లాస్థాయిలో సైతం పార్టీ కార్యకలాపాలను మరింత వి స్తృతంగా నిర్వహించాలని తీర్మానించారు. దీని కో సం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో 50 రోజుల కార్యక్రమాన్ని ఖరారు చేశారు. వచ్చే జూన్ 1 నుంచి ప్రతి 10 రోజులకు ఒక జిల్లాలో పార్టీ జిల్లాస్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాలను ఐదు జిల్లాల్లో 50 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. సమావేశంలో పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు వంకా రవీంద్ర, కవురు శ్రీనివాస్, మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, పార్లమెంటరీ కో–ఆర్డినేటర్లు కారుమూరి సునీల్‌కుమార్, నరసాపురం పార్లమెంటరీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్ గుడాల గోపి తదితరులు పాల్గొన్నారు. న్యూస్‌రీల్ ప్రజలతో నేతలు మమేకమవ్వాలి ధాన్యం కొనుగోళ్లపై రైతులకు అండ ఆక్వా రైతులకు వెన్నుదన్ను క్షేత్రస్థాయి పర్యటనలకు అధినేత జగన్ ప్రతి 10 రోజులకూ జిల్లా సమావేశం త్వరలో మండల, గ్రామ కమిటీల నియామకం పార్టీ నేతలకు రీజినల్ కో–ఆర్డినేటర్ బొత్స దిశానిర్దేశం కాకినాడలో ఉభయ గోదావరి జిల్లాల వైఎస్సార్సీపీ సమావేశం -
తనిఖీలు నామమాత్రం.. తవ్వకాలు నిత్యకృత్యం
ద్వారకాతిరుమల: పోలవరం కుడి కాలువ గట్టుపై జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలపై ‘సాక్షి’లో ప్రచురించిన వరుస కథనాలకు ఎట్టకేలకు మైనింగ్ విజిలెన్స్ అధికారుల్లో చలనం కలిగింది. అయితే గురువారం అధికారులు చేపట్టిన తనిఖీలు విమర్శలకు తావిచ్చాయి. ద్వారకాతిరుమల మండలంలోని పంగిడిగూడెం, ఎం.నాగులపల్లి వద్ద పోలవరం కుడి కాలువ గట్టుపై గ్రావెల్‌ను అక్రమంగా తవ్వుతూ కూటమి నేతలు సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై వరుస కథనాలు ప్రచురించగా అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉదయం కాలువ గట్టుపైకి వచ్చిన విజిలెన్స్ అధికారులు ఒక్కచోట మాత్రమే కారు దిగి పరిశీలించారు. అది కూడా అనుమతులు ఇచ్చిన ప్రాంతంలోనే పరిశీలించి.. మిగిలిన రెండు పాయింట్లను పట్టించుకోలేదు. అధికారులు వెళ్లిన కొద్దిసేపటికే అక్రమార్కులు పొక్లెయిన్లు తీసుకువచ్చి యథేచ్ఛగా గ్రావెల్ తవ్వి తరలించారు. గ్రావెల్‌ను కై కలూరు–పామర్రు హైవే రహదారి నిర్మాణం, నారాయణపురంలో చేపల చెరువుల గట్లకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. అధికారుల తనిఖీల సంగతి కూటమి నేతలకు ముందే తెలిసినట్టు సమాచారం. ఇదిలా ఉండగా కాలువ గట్టును తవ్విన ప్రాంతాల్లో భారీ గోతులు కనిపిస్తున్నా అధికారులు ఏమీ లేనట్టు వెళ్లిపోవడం రైతులను విస్మయానికి గురిచేసింది. ఇక పచ్చ నేతలు ఇచ్చే రిపోర్టే.. అధికారుల తుది నివేదిక అవుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. చక్రం తిప్పుతున్న ముగ్గురు పచ్చ నేతలు ప్రధానంగా గ్రావెల్ దందాలో ముగ్గురు పచ్చ నేతలు చక్రం తిప్పుతున్నారు. అన్ని వ్యవహారాలను వారు మేనేజ్ చేస్తున్నట్టు సమాచారం. పోలవరం కుడి కాలువ గట్టుకు తూట్లు నామమాత్రంగా అధికారుల పరిశీలన -
రూ.75 కోట్ల పనులు రద్దు!
సాక్షి, భీమవరం: ఏళ్ల తరబడి పట్టి పీడిస్తున్న సమస్యలకు త్వరలో పరిష్కారం లభిస్తుందన్న ప్రజల ఆశలపై కూటమి నీళ్లు చల్లింది. టెండర్ల దశకు చేరిన రూ.75.28 కోట్ల విలువైన ఏడు పనులకు బ్రేక్ వేసింది. ఆ పనులు మొదలు పెట్టాలని కూటమి నేతలు కోరినా ఫలితం లేదు. సమస్యను ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పనులు జరిగేట్టు చూడాలని కోరినట్టు సమాచారం. అప్రోచ్‌లకు మోక్షం కలిగేనా? డెల్టా ఆధునికీకరణలో భాగంగా దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాలో భీమవరం నియోజకవర్గంలోని యనమదుర్రు డ్రెయిన్‌పై వంతెనల నిర్మాణానికి రూ.110 కోట్లు మంజూరు చేశారు. గొల్లవానితిప్ప, దొంగపిండి, పట్టణంలో రెస్ట్‌హౌస్ రోడ్డు వద్ద వంతెనలు నిర్మించారు. నిధులు చాలక అప్పట్లో అప్రోచ్ రోడ్ల నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో రాకపోకలకు ఆయా గ్రామాల ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు అదుపుతప్పి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో స్థానిక నాయకులు నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి సమస్యను తీసుకువెళ్లగా ఆయన స్పందించి అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి రూ.36.71 కోట్లు మంజూరు చేశారు. వీటిలో కాళీపట్నం–భీమవరం వంతెన వద్ద రూ.9.22 కోట్లు, భీమవరం–దొంగపిండి వంతెన వద్ద రూ.16.58 కోట్లు, దెయ్యాలతిప్ప–నాగిడిపాలెం వంతెన వద్ద రూ.10.91 కోట్లు మంజూరై టెండర్ ప్రక్రియ ప్రారంభం కాగా ఈలోపు ఎన్నికలు రావడంతో పనులకు బ్రేక్ పడింది. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను పక్కన పెట్టేసింది. అవసరమని చెప్పినా.. ఆయా పనుల ఆవశ్యకత దృష్ట్యా పనులు రద్దు కాకుండా కొనసాగించాలని కూటమి నేతలు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఇటీవల జిల్లాకు వచ్చిన ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి ప్రజాప్రతినిధులు ఈ విషయం తీసుకువెళ్లారు. రద్దు చేయకుండా వాటిని కొనసాగించాలని కోరగా ప్రభుత్వంతో మాట్లాడతానని ఆయన చెప్పినట్టు సమాచారం. కాగా ఆ పనులకు మరలా అంచనాలు రూపొందించి, ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపితే సాంకేతిక, పాలన అనుమతులు వచ్చి, టెండర్ ప్రక్రియ మొదలయ్యేసరికి చాలా సమయం పడుతుందని పలువురు అంటున్నారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల ఆశలు ఆవిరి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్రోచ్‌లు, రోడ్లకు నిధులు టెండర్ల దశకు చేరిన పనులకు బ్రేక్ వేసిన కూటమి సర్కారు ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యేలు పనులు కొనసాగించాలని వినతి అటకెక్కిన పనులు గత ప్రభుత్వంలో ఉండి నియోజకవర్గంలోని చినమిల్లిపాడు, సిద్ధాపురం, రాజులపేట, రాజుల కొట్టాడ, ధర్మాపుర అగ్రహారం, నల్లమిల్లిపాడు గ్రామాలు, కొల్లేరు తీర ప్రాంత ప్రజలు, రైతులు చినమిల్లిపాడు–ఆకివీడు మెయిన్‌రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదభరితంగా ఉన్న ఈ రోడ్డును 11.6 కిలోమీటర్ల మేర విస్తరణ పనులు చేపట్టి అభివృద్ధి చేసేందుకు రూ.25 కోట్లు మంజూరయ్యాయి. భీమవరం నుంచి కలిదిండి మీదుగా గుడివాడ వెళ్లే రోడ్డులోని బొండాడ డ్రెయిన్లపై వంతెన నిర్మాణానికి రూ.12 కోట్లు మంజూరు చేశారు. ఆచంట నియోజకవర్గంలో నెగ్గిపూడి, తాడేపల్లిగూడెంలో ఆర్అండ్బీ ఇన్స్పెక్షన్ బంగ్లాల ఆధునికీకరణ నిమిత్తం రూ.1.57 కోట్లు మంజూరు చేశారు. ఆయా పనులు దాదాపు టెండర్ల దశకు చేరుకోగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అటకెక్కించింది. -
ఎకై ్సజ్ ఏసీ తనిఖీలు
తణుకు అర్బన్: తణుకు ఎకై ్సజ్ శాఖ పరిధిలో పెండింగ్‌లో ఉన్న అన్ని కేసుల్లోను తక్షణమే చార్జ్‌షీట్స్ వేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ కె.నాగ ప్రభుకుమార్ ఆదేశించారు. గురువారం తణుకు ఎకై ్సజ్ కార్యాలయంలో ఆయన తనిఖీలు చేశారు. గంజాయి, డ్రగ్స్ తదితర కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం తణుకు శివారులోని ఆంధ్రా డిస్టిలరీస్, వాన్బెర్రీ ప్రైవేట్ లిమిటెడ్‌లోని మిథనాల్, ఆర్ఎస్ యూనిట్లను పరిశీలించారు. రసాయనాల వాడకంలో లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. పెండింగ్ కేసుల రిజిస్టర్లను పరిశీలించారు. ఎకై ్సజ్ సీఐ సత్తి మణికంఠరెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు. ఐటీఐ ప్రవేశాలకు 24 వరకు గడువు ఉండి: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశానికి ఈనెల 24న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఐటీఐ జిల్లా కన్వీనర్, ఎన్నార్పీ అగ్రహారం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ వి.శ్రీనివాసరాజు తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లను (ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారం, ఆచంట) సమీపంలోని ప్రభుత్వ ఐటీఐల్లో వెరిఫికేషన్ చేయించుకుని రశీదు పొందాలని, వారు మాత్రమే కౌన్సెలింగ్‌కు అర్హులని తెలిపారు. వివరాలకు నేరుగా లేదా ఫోన్ 08816 297093, 9676099988 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈసెట్‌లో ఆకివీడు విద్యార్థినికి ఫస్ట్ ర్యాంక్ ఆకివీడు: జేఎన్టీయూ అనంతపురం నిర్వహిం చిన ఏపీఈసెట్– 2025 పరీక్షలో బీఎస్సీ స్ట్రీమ్‌లో ఆకివీడు మండలం తరటావకు చెందిన కొట్టి గంగా భవానీ రాష్ట్రస్థాయిలో 95 మార్కులతో ప్రథమ ర్యాంకు సాధించింది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే దళిత కుటుంబానికి చెందిన కొట్టి కాశీ విశ్వనాథం, ధనలక్ష్మి దంపతుల కుమార్తె గంగాభవానీ మండలంలోని తరటావ, చినకాపవరం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాల్లో పదో తరగతి వరకు చదివింది. ఇంటర్ హనుమాన్ జంక్షన్‌లోని జేఎన్‌జీ జూనియర్ బాలికల కాలేజీలో పూర్తిచేసి, డిగ్రీ ఏలూరులోని సీహెచ్‌ఎస్‌డీ థెరిస్సా అటానమస్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్, మ్యా థ్స్లో 93 శాతం మార్కులు సాధించింది. ఈసెట్ కోసం ఇంటి వద్ద నుంచి ప్రీపెర్ కాగా 95 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. బీటెక్ కంప్యూటర్స్ చదవాలనే ఆశయంతో ముందుకు వెళుతున్నట్టు ఆమె తెలిపింది. తల్లిదండ్రులు ఇద్దరూ నిర్లక్ష్యరాస్యులు కాగా ఆమె సోదరుడు అంధుడు. ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ భీమవరం: జిల్లాలో గురువారం ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఫస్టియర్ జనరల్ కేటగిరీలో 8,281 మందికి 7,925 మంది, ఒకేషనల్ కేటగిరీలో 594 మందికి 535 మంది హాజరయ్యారు. సెకండియర్ జనరల్ కేటగిరీలో 1,049 మందికి 963 మంది, ఒకేషనల్ కేటగిరీలో 192 మందికి 173 మంది హాజరయ్యారని, ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఇంటర్మీడియెట్ జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు తెలిపారు. ఏలూరు జిల్లాలో.. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు జిల్లాలో ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలకు 6,067 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫస్టియర్ పరీక్షలకు 5,059 మందికి 4,830 మంది, ఒకేషనల్ పరీక్షలకు 390 మంది హాజరయ్యారు. సెకండియర్ జనరల్ పరీక్షలకు 650 మందికి 601 మంది, ఒకేషనల్ పరీక్షలకు 269 మందికి 246 మంది హాజరయ్యారు. విద్యాహక్కుకు విఘాతం ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా విద్యాశాఖాధికారుల తీరుతో 98 మంది పేద విద్యార్థుల విద్యాహక్కుకు విఘాతం కలిగించారని ఆంధ్రప్రదేశ్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జీజేఏ స్టీవెన్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాటి వెంకటరమణ, తోట ప్రసాద్ ప్రకటనలో ధ్వజమెత్తారు. ఏలూ రు రూరల్ మండలంలోని కండ్రికగూడెం ఎంపీయూపీ పాఠశాల పునర్వ్యవస్థీకరణలో భా గంగా 241 మంది విద్యార్థులుండగా ప్రాథమి క పాఠశాలలో 98 మంది విద్యార్థులున్నారని పేర్కొన్నారు. అయితే 98 మంది విద్యార్థులను కిలోమీటరుకు పైగా దూరమున్న మరో పాఠశాలకు తరలించడంతో వీరంతా చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. -
మానసిక దివ్యాంగుల సంరక్షణకు చర్యలు
భీమవరం(ప్రకాశంచౌక్): తల్లిదండ్రులు లేని మానసిక, బహుళ వైకల్యాలు గల బిడ్డల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. గురువారం కలెక్టరేట్లో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ట్రస్ట్ యాక్ట్ పై ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మానసిక, బహుళ వైకల్యాలు ఉన్న పిల్లల పెంపకం, ఆహారం తదితర అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని ఏడుగురు విభిన్న ప్రతిభావంతులకు ఒక్కోటి రూ.38 వేల విలువైన ల్యాప్‌టాప్‌లను అందజేశారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకుడు బి.రామ్‌కుమార్, కమిటీ సభ్యులు అంజలి ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహాబిటేషన్ ప్రతినిధి ప్రసాద్, దివ్యాంగ మహా సంఘటన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఎస్ఎస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. వడగాల్పులపై అప్రమత్తం జిల్లాలో ఎండ తీవ్రత కారణంగా వడగాల్పును తట్టుకునేందుకు ముందస్తుగా తీసుకోవలసిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి గూగుల్ మీట్ ద్వారా స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై సమీక్షించారు. ఈనెల 17న ‘బీట్ ద ఈట్’ థీమ్‌తో కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. -
కొల్లేరులో తుపాకుల మోత
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పక్షులను తోలే సంప్రదాయ వలస కూలీలు నాటు తుపాకులను వినియోగించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దశాబ్దాలుగా కొల్లేరులో నాటు తుపాకుల సంస్కృతి కొనసాగుతుండగా ఏటా పలువురు మృత్యువాతపడటం, గాయాల పాలవడం షరా మాములుగా తయారైంది. పెద్ద పక్షులు చెరువుల్లోని చేపలను ఆహారంగా తీసుకోవడానికి వచ్చినప్పుడు నల్లమందు వినియోగించి తుపాకీ పేలుళ్ల శబ్ధం చేస్తే కొన్ని గంటల పాటు చెరువు దరిదాపుల్లోకి రావు. దీంతో ఎక్కువ చెరువుల వద్ద గన్‌కల్చర్‌ను కొనసాగిస్తున్నారు. తాజాగా గత నెలలో మందుగుండు పేలి పది మంది గాయాలపాలై నలుగురు మరణించడం, అలాగే రెండు రోజుల క్రితం మిస్‌ఫైర్‌తో ముగ్గురు గాయాలైన ఘటన కొల్లేరులో చోటు చేసుకుంది. చెరువుల కాపలా పనులు చేస్తూ.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలో 901 చదరపు కిలోమీటర్ల పరిధిలో 2,22,300 ఎకరాల్లో కొల్లేరు విస్తరించి ఉంది. 12 మండలాల్లో 3.50 లక్షల మంది ప్రజలు కొల్లేరుపై ఆధారపడి జీవిస్తున్నారు. మంచినీటి సరస్సుగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. విదేశాల నుంచి శీతాకాలంలో లక్షల సంఖ్యలో పక్షులు వలస వచ్చి కొల్లేరులో గుడ్లు పొదిగి తిరిగి వెళ్తుంటాయి. ఏటా కొల్లేరుకు విదేశాల నుంచి లక్షన్నరకు పైగా వివిధ జాతుల పక్షులు వీటిలో అత్యధికంగా పెలికాన్ పక్షులు వస్తుంటాయి. కొల్లేరులో ఆక్రమణల పర్వం దశాబ్దాలుగా యథేచ్ఛగా సాగుతోంది. ప్రజాప్రతినిధుల అండదండలతో అక్రమ సాగు అనేది ఇక్కడ నిత్యకృత్యం. ఈ క్రమంలో కొల్లేరులో చేపల చెరువుల కాపలా పనులకు నెల్లూరు, తమిళనాడుకు చెందిన వలస కూలీల కుటుంబాలు నిర్వహిస్తుంటాయి. ప్రధానంగా పులికాట్ సరస్సు ప్రాంతం వద్ద ఉండే వీరు సీజన్లో ఇక్కడకు వచ్చి పనులు చూసుకుని వెళ్తుంటారు. గన్ కల్చర్ పక్షులను తోలటానికి నాటు తుపాకుల వాడకం నల్లమందు వినియోగించి పేలుళ్లు నెల్లూరు, తమిళనాడు నుంచి వలస కూలీల రాక తుపాకుల మిస్‌ఫైర్‌తో తరచూ ప్రమాదాలు కొల్లేరు అక్రమ చెరువులన్నింటి వద్ద ఇదే పరిస్థితి గత నెలలో మందుగుండు పేలి నలుగురు మృతి రెండు రోజుల క్రితం ముగ్గురికి గాయాలు ప్రమాదం అంచున పని స్థానికంగా కొల్లేరు ప్రాంతంలో నాటు తుపాకులు అద్దెకు ఇస్తుంటారు. కేవలం చెరువుల వద్దకు కాపలాకు మాత్రమే వీటిని వినియోగిస్తుంటారు. కొందరు వలస కూలీలు రోజూ కూలి కోసం ప్రమాద అంచున నిత్యం పనిచేస్తున్నారు. తుపాకుల పేలుళ్లు ప్రమాదమని తెలిసినా గత్యంతరం లేక ఇదే పని చేస్తున్నారు. ప్రత్యేకంగా ఒక కులానికి చెందిన వారే నాటు తుపాకులతో పక్షులను వేటాడుతుంటారు. గత నెలలో కై కలూరు నియోజకవర్గం భైరవపట్నంలో ఇవే కుటుంబాలకు చెందిన ఒక ఇంట్లో మందుగుండు పేలి పది ఇళ్లు తగలబడి నలుగురు మృత్యువాతపడగా ముగ్గురికి గాయాలయ్యాయి. అలాగే రెండు రోజుల క్రితం కై కలూరు మండలం రామవరంలో మందుగుండు పేలి చరణ్, మణి సతీష్, కందాపుల మణికి తీవ్ర గాయాలయ్యాయి. నల్లమందుతో నాటు తుపాకులు భాస్వరం, పొటాషియం వంటి పేలుడు పదార్థాలను నూరి నల్లమందును తయారు చేస్తారు. చిన్నపాటి రాపిడి జరిగితేనే పేలే స్వభావం ఉంటుంది. వీటిని నాటు తుపాకుల్లో నింపి గాల్లో పక్షులు వచ్చినప్పుడు కాల్పులు చేస్తుంటారు. ప్రధానంగా తమిళనాడు, రాష్ట్రంలోని సూళ్ల్లూరుపేటకు చెందిన 150 కుటుంబాలు కై కలూరు, ఉండి నియోజకవర్గాల్లో నివాసం ఉన్నాయి. ఆక్వా చెరువుల యజమానులు రోజు కూలికి వీరిని తీసుకు వెళ్తుంటారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు చెరువు వద్ద నాటు తుపాకీతో కాపలా ఉంటే పెద్ద పక్షిని తోలితే రూ.200 నుంచి రూ.300 వరకు ఇస్తుంటారు. అలా కొందరు రూ.1,000 నుంచి రూ.3 వేల వరకు సంపాదించే పరిస్థితి. వీరు చెరువుల వద్దే తాత్కాలిక పాకలు వేసుకుని నివాసం ఉంటారు. -
వేసవిలో చిన్నారులకు ఆటవిడుపు
బాస్కెట్ బాల్లో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులువేసవి శిక్షణా తరగతుల్లో భాగంగా ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియంలో బాస్కెట్‌బాల్‌లో శిక్షణ ఇస్తున్నారు. చిన్నారులకు బాస్కెట్‌బాల్‌లో మెలకువలు, పోటీపడేతత్వాన్ని నేర్పిస్తున్నారు. 12 ఏళ్ల నుంచి పెద్ద వయస్సు ఉన్న విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఉచితంగా ఈ శిక్షణ ఉంటుందని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోచ్ ఎన్.శ్రీనివాసరావు తెలిపారు. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, ఏలూరు -
జలాశయంలోనూ అక్రమ తవ్వకాలు
జంగారెడ్డిగూడెం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయా పార్టీల నేతలు మట్టి, ఇసుక అక్రమ రవాణాకు తెరతీశారు. చెరువుల్లో మట్టిని అక్రమంగా తరలించుకుపోతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా జలాశయంలో అక్రమ తవ్వకాలు చేయడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయంలో అక్రమంగా తవ్వకాలు చేయడంతో భారీ గోతులు ఏర్పడ్డాయి. చక్రదేవరపల్లికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ఈ గ్రావెల్‌ను తవ్వేసి, అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం నుంచి వయా చక్రదేవరపల్లి మీదుగా వేగవరానికి ఇటీవల రోడ్డును నిర్మించారు. ఈ రోడ్డుకు ఇరువైపులా బెర్ములను నిర్మించేందుకు ఈ మట్టినే ఉపయోగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత ఇరిగేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాలపై ఎర్రకాలువ జలాశయం ఏఈ ఆర్.శ్రీనివాస్‌ను వివరణ కోరగా జలాశయం సమీపంలో మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. తవ్వకాల విషయం తమ దృష్టికి రాలేదని, పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. -
డీఎస్సీలో క్రీడా కోటాపై తలోమాట
ఏలూరు రూరల్ : కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో క్రీడా కోటా విఽధి, విధానాలపై క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్లో మార్గదర్శకాలు అయోమయానికి గురి చేస్తున్నాయంటున్నారు. ప్రభుత్వ పెద్దలు క్రీడా కోటాలో ఉద్యోగాలను అమ్ముకునేందుకు తప్పుడు విధానాలు రూపొందించారని అనుమానిస్తున్నారు. ఇందుకోసం తమకు అనుకూలంగా క్రీడల విభజన, అర్హతలతో ఆన్లైన్ దరఖాస్తు విధానం రూపొందించారని ఆరోపిస్తున్నారు. స్పోర్ట్స్ డీఎస్సీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 421 పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రైనింగ్ లేకుండా ఉద్యోగాలు ఎలా? ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ (బీపీఈడీ) పూర్తి చేయని క్రీడాకారులను సైతం స్పోర్ట్స్ కోటాలో వ్యాయామ ఉపాధ్యాయులుగా నియమిస్తామని కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్లో వెల్లడించడంపై క్రీడా పండితులు, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం ఇతర శాఖలకు మాత్రమే సరిపోతుందని, ఉపాధ్యాయ వృత్తికి మాత్రం సరికాదంటున్నారు. ట్రైనింగ్ పూర్తి చేయకుండా క్రీడాకారుడు పిల్లలకు వ్యాయామ విద్య ఎలా బోధిస్తాడు? అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఉపాధ్యాయ కోటాలో ఇలాంటి నియమాలు పెట్టలేదని గుర్తు చేస్తున్నారు. దీని వల్ల ట్రైనింగ్ పూర్తి చేసిన క్రీడాకారులకు అన్యాయం జరుగుతుందని మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో పక్కాగా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకంలో స్పోర్ట్స్ కోటా అమలు చేశారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 వేల మందికి పైగా క్రీడాకారులు సచివాలయ ఉద్యోగాలు సాధించారు. నాడు ఒక్క క్రీడాకారుడు కూడా విధి, విధానాలపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అయితే నేడు కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ నియామకాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జూనియర్ ఇండియా, ఎస్‌జీఎఫ్‌కు ప్రాధాన్యత లేదా? స్పోర్ట్స్ కోటాలో జూనియర్ ఇండియా చాంపియన్‌షిప్, నేషనల్ స్కూల్‌గేమ్స్ సర్టిఫికెట్స్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులతో నిర్వహించే ఈ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులకు ఉద్యోగాల కల్పనలో ప్రాధాన్యత కల్పించకపోవడంపై క్రీడా విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి పక్కా విధి విధానాలతో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పాయింట్ల విధానంపై గందరగోళం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా చేపట్టేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాప్) ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా క్రీడల ప్రాధాన్యత, క్రీడాకారుడు సాధించిన సర్టిఫికెట్ల స్థాయిని బట్టి పాయింట్లు కేటాయించి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పూరిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం శాప్ విధానాలకు విరుద్ధంగా క్రీడలను ఏ,బీ అనే రెండు కేటగిరీలుగా విభజించింది. ఎటువంటి క్రీడల సర్టిఫికెట్లు ఉంటే ఎన్ని పాయింట్లు కేటాయిస్తారో? వెల్లడించలేదు. ఒలింపిక్స్, ఏషియా గేమ్స్, కామన్వెల్త్, నేషనల్ గేమ్స్, యూనివర్సిటీ స్థాయిలో ప్రతిభ చాటిన వారితో పోస్టులు పూరిస్తామని చెబుతున్నారు. అయితే ఇందులో ప్రాధాన్యత లేని పలు క్రీడలను సైతం ఏ–కేటగిరీలో చేర్చడం వల్ల అత్యంత పోటీ ఉన్న క్రీడల్లో ప్రతిభ చాటిన వారికి అన్యాయం జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్రీడాకారుల్లో అసంతృప్తి నియామక ప్రక్రియపై అనుమానాలు క్రీడల వర్గీకరణతో నిరాశ పారదర్శకత లేదు ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ ఉద్యోగాల స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ పారదర్శకంగా లేదు. ఇందులో పక్కా విధి, విధానాలు వెల్లడించాలి. ఇతర ప్రభుత్వ శాఖల్లో సైతం స్పోర్ట్స్ కోటాతో ఉద్యోగాలు పూరించాలి. అప్పుడే ప్రతిభ ఉన్న క్రీడాకారులకు న్యాయం చేసినట్టు అవుతుంది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. లేదంటే డీఎస్సీ మొత్తం ప్రక్రియ కోర్టు మెట్లు ఎక్కుతుంది. – టి.కొండలరావు, శాయ్ సెంటర్ రిటైర్డ్ ఇన్చార్జితప్పుల తడక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్పోర్ట్స్ కోటా విధానం తప్పుల తడకగా ఉంది. బీపీఈడీ ట్రైనింగ్ చేయకుండా వ్యాయామ ఉపాధ్యాయ ఉద్యోగం ఎలా కేటాయిస్తారు? దీనివల్ల పాఠశాల స్థాయిలో ఫిజికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థ దెబ్బ తింటుంది. క్రీడల వర్గీకరణ సైతం సరిగా లేదు. అంతర్జాతీయ, జాతీయస్థాయిలో అత్యధిక పోటీ కల్గిన క్రీడాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇందులో ప్రతిభ చాటిన వారికి పాయింట్లు విధానం అమలు చేయాలి. –కేటీఎస్ఆర్ ఆంజనేయులు, రిటైర్డ్ డీఎస్డీఓ -
‘ధాన్యంలో తేమ 17 శాతం ఉండాల్సిందే’
అత్తిలి: రైతులు పంట కోసిన వెంటనే తేమ తనిఖీ చేసి 17 శాతం ఉన్నప్పుడే మిల్లులకు తరలించాలని జిల్లా పౌరసరఫరాల అధికారి డి శివరాంప్రసాద్ చెప్పారు. గురువారం అత్తిలి మండలంలో ఆయన పర్యటించి ధాన్యం రాశులను పరిశీలించి, ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ధాన్యం ఎక్కువగా ఎండబెడితే నూక శాతం పెరుగుతుందని, 17 శాతం ఉన్నప్పుడే మిల్లులకు పంపే ఏర్పాటు చేసుకోవాలని రైతులకు సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయశాఖ అధికారి టీకే రాజేష్ ఉన్నారు. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి తాడేపల్లిగూడెం అర్బన్ : విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణంలో కలకలం రేపింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సరవ సూరిబాబు (38) అనే వ్యక్తి పట్టణంలోని స్వీట్స్ దుకాణానికి సంబంధించిన స్వీట్స్ తయారు చేసే యూనిట్లో రోజు కూలీగా పనిచేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం ఆ ప్రాంతంలో గ్రైండర్ స్విచ్ వేస్తుండగా విద్యుత్ షాక్‌తో పడిపోయాడు. ఇది గమనించిన తోటి పనివారు బాధితుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి సూరిబాబు మృతి చెందినట్లు నిర్దారించారు. సూరిబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నూతన ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు చర్యలు
పాలకోడేరు : ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే దిశగా నూతన ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు అన్నారు. గురువారం పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామంలో రూ.10.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఫ్లాటెడ్ కాంప్లెక్స్ (ఇండస్ట్రియల్ పార్క్) నిర్మాణానికి రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ చర్యలతో దూదేకుల ముస్లింలకు అన్యాయం తాడేపల్లిగూడెం (టీఓసీ): కూటమి ప్రభుత్వ అసమర్థత వల్ల దూదేకుల ముస్లిం మైనార్టీలు నష్టపోతున్నారని నూర్ భాషా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు షేక్ హుస్సేన్ బీబీ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలో గురువారం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల పైబడి జనాభా ఉన్నటువంటి నూర్ భాషా ముస్లిం మైనారిటీల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలిపారు. మైనార్టీ కార్పొరేషన్లో బీసీ–బి దూదేకుల ఆప్షన్ లేని కారణంగా మైనార్టీ సబ్సిడీ రుణాలు, మైనార్టీ కోటాలో వచ్చే ఇతర ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. నూర్ బాషా ముస్లింలపై కేవలం ఓట్లు కోసమే ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తుందని మండిపడ్డారు. కొల్లేరు సరస్సు పరిరక్షణపై సమీక్ష ఏలూరు(మెట్రో): సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చేపట్టిన లిడార్ సర్వే ఆధారంగా అక్రమ నిర్మాణాల తొలగింపునకు చర్యలు వేగవంతం చేయాలని జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ అధికారులకు సూచించారు. మంగళవారం జెడ్పీ కార్యాలయంలో కొల్లేరు సరస్సు పరిసరాలలో జరుగుతున్న అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు, డ్రెయిన్స్ డిపార్ట్మెంట్ అధికారులు వారి శాఖల ద్వారా చేపట్టిన ముందస్తు చర్యల గురించి వివరించారు. కొల్లేరులో 67 మినీ డ్రెయిన్ చానల్స్ ఉన్నాయని, అందువల్ల ముంపు బారిన పడకుండా వాటి పూడికతీత పనుల ప్రతిపాదనలు తయారు చేసి అటవీశాఖ ద్వారా ప్రభుత్వ అనుమతి కోసం పంపాలని కోరారు. సమావేశంలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీస్ బి.విజయ, డ్రెయిన్స్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. -
వేప ఉత్పత్తులు.. కీటక నాశకాలు
బుట్టాయగూడెం : తరతరాల నుంచి వేప చెట్లుకు ఒక ప్రత్యేకత ఉంది. వేప చెట్టులో ప్రతి భాగం ఒక్కో విశిష్టత కలిగి ఉంటుంది. వేప చెట్టులోని భాగాలు వైద్యంతోపాటు వ్యవసాయ సాగులో, పంటల్లో చీడ పీడల నివారణలో ఎంతగాలో ఉపయోగపడతాయని వ్యవసాయాధికారులు చెబున్నారు. ప్రకృతిపరంగా లభించే వేపపిండి, వేప నూనె, కొమ్మలను సేంద్రీయ ఎరువుల పద్ధతిలో రైతులు వాడుతుంటారు. వేప పిండి, కొమ్మలు భూమిని సారవంతం చేయడంతో పాటు పంట దిగుబడి పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో సాగులో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి పలు రకాల వేప ఉత్పత్తులను వాటి ఉపయోగాలను వ్యవసాయాధికారులు రైతులకు ముందుగానే వివరిస్తున్నారు. ప్రయోజనాలివీ ● వేప ఆకులు లేదా ఆకు కొనలు పొడి చేసి నిల్వ చేసి ధాన్యంలో కలిపితే పురుగులు పట్టవు. ● వేప ఆకుల కషాయంలో ముంచి ఆరబెట్టిన గోనుసంచులకు పురుగులు దరిచేరవు. ● ఎరువుగా వేపాకులు పొలంలో వేస్తే సేంద్రియ పదార్థం, పోషకాలతోపాటు నిరోధక శక్తి కలిసి వస్తాయి. ● వేప నూనె పంటలపై పిచికారీ చేస్తే కాయ తొలుచు పురుగు, రసం పీల్చు పురుగు, ఆకు తినే పురుగులను అదుపు చేయవచ్చు. ● ఒక లీటర్ వేప నూనెకు 200 లీటర్ల నీరు, 200 గ్రాముల సబ్బుపొడి(సర్ఫ్)ను కలిపి ద్రవణం తయారు చేసుకోవాలి. ఇది ఒక ఎకరంలో స్ప్రేయింగ్ చెయ్యడానికి సరిపోతుంది. నూనె, నీరు కలువదు కనుక ముందుగా సబ్బుపొడి బాగా కలిపి నురగ వచ్చిన తర్వాత నీటిలో కలపాలి. ● వేప పిండి మేలైన చిక్కటి సేంద్రీయ ఎరువు. గింజ నుంచి తీసి వేసిన వేప పిండిలో 5.2 శాతం నత్రజని, 11 శాతం భాస్వరం, 1.5 శాతం పొటాషియం ఉంటుంది. ఇది ఎరువుగానే కాకుండా సస్య రక్షణకు ఉపయోగపడుతుంది. పాడి–పంట వేప నూనె, పిండితో పంటలకు రక్షణ సేంద్రియ పద్ధతుల్లో వాడుతున్న రైతులు వేప ఉత్పత్తులతో పర్యావరణ ప్రయోజనాలు వ్యవసాయంలో వేప ఆధారిత ఉత్పత్తులను వినియోగించడం వల్ల అనేక పర్యావరణ ప్రయోజనాలు లభిస్తాయి. వేప జీవనాధారణ పొందుతుంది. పర్యావరణ వ్యవస్థలో పేరుకుపోదు. కాలుష్య ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వేప నేల నాణ్యతను పెంచుతుంది. ఆరోగ్యకరమైన, స్థితి స్థూపక వ్యవసాయ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. – డి.ముత్యాలరావు, ఏఓ, బుట్టాయగూడెం -
లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదు
భీమవరం (ప్రకాశంచౌక్) : జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయకూడదని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ జి.గీతాబాయి అన్నారు. గురువారం ఆమె అధ్యక్షతన జిల్లా స్థాయి గర్భస్థ పిండ లింగ నిర్ధారణ కమిటీ సలహా సంఘం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గీతాబాయి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆడ పిల్లల నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంత ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. రేపు ఏలూరులో ప్రత్యేక ఉద్యోగ మేళా ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లాలోని ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్సీఎస్) సంయుక్త భాగస్వామ్యంతో శనివారం ఉదయం 10:30 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయం, ఏలూరులో ప్రత్యేక ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సి. మధుభూషణ్ రావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వివిధ కంపెనీల్లో ఉద్యోగాల నిమిత్తం ఇంటర్వ్యూలలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఫార్మల్ డ్రెస్ కోడ్‌లో, రెజ్యూమ్, సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలను కోసం 88868 82032 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. చికిత్స పొందుతూ యువతి మృతి దెందులూరు: పెద్దలు కుదిర్చిన పెళ్లి సంబంధం చేసుకోవడం ఇష్టం లేక ఆత్మహత్యాయత్నం చేసిన మౌనిక అనే యువతి చికిత్స పొందుతూ మృతి చెందిందని దెందులూరు ఎస్సై ఆర్.శివాజీ తెలిపారు. వీరభద్రపురం గ్రామానికి చెందిన గొట్టికల మౌనిక అదే గ్రామానికి చెందిన యువకుడితో కుటుంబ సభ్యులు పెళ్లి కుదిర్చారు. అయితే ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో ఈ నెల 12న పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం గుంటూరు వైద్యశాలలో చేర్పించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న యువతి గురువారం మృతి చెందింది. ఈ మేరకు ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారంతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. -
ఈదురు గాలుల బీభత్సం
ఎండలు మండుతున్న వేళ పెనుగొండ, పెనుమంట్ర మండలాల్లో గురువారం భారీ వర్షం కురవడంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. పెనుగొండలో ఈదురుగాలులు, భారీ వర్షం భీభత్సం సృష్టించింది. పెనుగొండ, వడలి, వెంకట్రామపురం గ్రామాల్లో ఈదురుగాలులకు భారీ వృక్షాలు నెలకొరిగాయి. మార్టేరు– పెనుమంట్ర స్టేట్‌హైవే రోడ్డుపై కొన్ని చోట్ల చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. అయితే భారీ వర్షం నేపథ్యంలో రైతులు కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని రక్షించుకోవడానికి అవస్థలు పడ్డారు. – పెనుగొండ/పెనుమంట్ర -
అక్రమార్కులకు భీమవరం
సాక్షి, భీమవరం: పట్టణంలోని 9వ వార్డు చినరంగనిపాలెంలో రూ.కోట్లు ఖరీదు చేసే ఖాళీ స్థలానికి సంబంధించి సరైన రికార్డు లేకుండా వేరొకరి పేరు మీద మున్సిపల్ అధికారులు పన్ను సృష్టించేశారు. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో ముడుపులు చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి. స్థల యజమానుల ఫిర్యాదుపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు సరైన పరిశీలన చేయకుండా పన్ను వేసినట్టు తేల్చారు. అందుకు బాధ్యులుగా మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన ఎస్.శివరామకృష్ణ, రెవెన్యూ అధికారి డి.సోమశేఖర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎస్.కృష్ణమోహన్, వార్డు సెక్రటరీ పి.చంద్రశేఖర్‌లపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశిస్తూ ఏప్రిల్ 17న ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీచేశారు. కోవిడ్ సమయంలో బాధితులకు వైద్యం సాయం అందించేందుకు గత ప్రభుత్వం పట్టణంలో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటుచేసింది. వీటి నిర్వహణ పేరిట కొందరు మున్సిపల్ అధికారులు అక్రమాలకు తెరలేపారు. కోవిడ్ బాధితులకు సదుపాయాలు కల్పించినట్టుగా నకిలీ బిల్లులు, ఫోర్జరీ సంతకాలతో నిధులను స్వాహా చేశారు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు గత ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. రూ.91.06 లక్షలు అవినీతి జరిగినట్టు తాజాగా విచారణలో తేలింది. అవినీతికి పాల్పడిన నాటి మున్సిపల్ కమిషనర్ కె.రమేష్‌కుమార్ (రిటైర్డ్), ఎఫ్1 సీహెచ్ కామేష్‌బాబు, జూనియర్ అసిస్టెంట్ జీవీఎన్ చంద్రశేఖర్, హెల్త్ అసిస్టెంట్ ఎస్.చంటిబాబు, ఏఈలు వీవీఎస్ శివకోటేశ్వరరావు, కె.రాజ్‌కుమార్, కాంట్రాక్టర్లు జీవీ సురేష్, ఏ.భగవాన్‌పై క్రిమినల్ చర్యలకు ఆదేశిస్తూ రెండు రోజుల క్రితం డీఎంఏ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు వారిపై మున్సిపాల్టీ నుంచి పట్టణ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు విభాగాల్లో అవినీతి టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్, శానిటేషన్, పబ్లిక్ హెల్త్ తదితర విభాగాల్లో అవినీతి రాజ్యమేలుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా నిర్మాణాలు చేస్తున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండటం, పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించిన సామగ్రి కొనుగోళ్లు, వాహనాలకు డీజిల్, మెయింటినెన్స్‌లో అవకతవకలు, చేయని పనులకు చేసినట్టుగా బిల్లులు పెట్టుకుని ప్రజాధనాన్ని కాజేయడం, పనుల అంచనాలు పెంచేయడం, వేసవి సందర్భంగా పట్టణ ప్రజలకు ట్యాంకర్లు ద్వారా తాగునీటి సరఫరా పేరిట బయట అమ్మకాలు చేసుకోవడం తదితర అవినీతి వ్యవహారాలపై ఇప్పటికే స్థానికుల నుంచి పలు ఫిర్యాదులు వెళ్లినట్టు తెలుస్తోంది. అవి వెలుగుచూస్తే మరిన్ని అక్రమాలు బయటపడతాయని అంటున్నారు. పన్నుల్లో అక్రమాలపై ఇటీవల నలుగురిపై క్రమశిక్షణ చర్యలు కోవిడ్ నిధుల స్వాహాపై గతంలోనే విచారణకు ఆదేశించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.98 లక్షలు కాజేసినట్టు తాజాగా తేల్చిన విజిలెన్స్ అధికారులు ఆరుగురు ఉద్యోగులపై క్రిమినల్ చర్యలకు డీఎంఏ ఆదేశం పాలకవర్గం లేక పెచ్చుమీరుతున్న అవినీతి భీమవరం మున్సిపాలిటీ ఘన చరిత్రను కొందరు ఉద్యోగులు తమ అవినీతి వ్యవహారాలతో మసకబారుస్తున్నారు. ప్రత్యేక పాలన, ప్రశ్నించేవారు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని దొరికినకాడికి దోచేస్తున్నారు. 2014లో చివరిగా మున్సిపాల్టీకి ఎన్నికలు జరిగాయి. తర్వాత 2019లో ఎన్నికలు జరగాల్సి ఉంది. పట్టణ సమీపంలోని చిన అమిరం, రాయలం, కొవ్వాడ అన్నవరం, విస్సాకోడేరు, తాడేరు తదితర గ్రామాల విలీన ప్రతిపాధనపై ఆయా గ్రామాల వారు కోర్టుకు వెళ్లడం తదితర కారణాలతో ఎన్నికలు జరగలేదు. నాటి నుంచి ప్రత్యేక పాలన కొనసాగుతోంది. కౌన్సిలర్లు, పాలకవర్గం, సమస్యలపై గళమెత్తే ప్రతిపక్షం లేకపోవడంతో ఉద్యోగుల ఇష్టారాజ్యంగా మారింది. కొందరు ఉద్యోగులు స్థానికంగా పాతుకుపోయారు. రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకుని ఎక్కడికి బదిలీ అయినా వారి సిఫార్సులతో తిరిగి ఇక్కడ వాలిపోతున్నారు. వారి అండదండలతో ‘లోకల్’ అంటూ పెత్తనం చెలాయిస్తూ పై అధికారుల ఆదేశాలను ఖాతరుచేయడం లేదని తెలుస్తోంది. -
సైబర్ కేసును చేధించిన పోలీసులు
తాడేపల్లిగూడెం: సైబర్ మోసం కేసును గూడెం పట్టణ పోలీసులు చేధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని కొబ్బరితోటకు చెందిన పోపూరి సాంబశివప్రసాద్ ను కొందరు డిజిటల్ అరెస్టు అంటూ ఫోన్లో బ్లాక్మెయిల్ చేశారు. ప్రసాద్ వద్ద నుంచి రెండు బ్యాంకు శాఖల ద్వారా రూ.50 లక్షలు బదిలీ చేయించుకున్నారు. తనను కొందరు మోసం చేశారని గ్రహించిన ప్రసాద్ గూడెం పోలీసులను ఆశ్రయించారు. ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ ఎ.సుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఎస్సై బాదం శ్రీనివాసు, సిబ్బంది రాజస్థాన్ వెళ్లి నిందితులను అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని జలోర్ జిల్లా బాగోడా మండలం బాలనికి చెందిన హనుమాన్రామ్, బార్మర్ జిల్లా సోనారి గ్రామానికి చెందిన దినేష్‌ను అరెస్టు చేశారు. నిందితులు రాజస్థాన్‌లోని ఒక పెట్రోలు బంకు ఓనర్ పీఓఎస్ మిషన్ నుంచి రూ.7 లక్షలు తీసుకున్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో అప్రమత్తమైన పోలీసులు బ్యాంకు అధికారుల ద్వారా రూ.10 లక్షలు హోల్డ్‌లో పెట్టించి, రూ.20 లక్షల ఎఫ్డీలు బ్రేక్ అవ్వకుండా చేశారు. ఈ విషయంలో కీలకంగా వ్యవహరించిన హెచ్డీఎఫ్సీ మేనేజర్‌ను ఎస్పీ అభినందించారు. -
ఎర్రకాలువ తవ్వేశారు
జంగారెడ్డిగూడెం: మట్టి మాఫియా ఎర్రకాలువ జలాశయం గర్భంలో భారీగా తవ్వేసి మట్టిని తరలించేశారు. జలాశయం గర్భాన్ని తెగ తవ్వేశారు. దీంతో భారీ గోతులు ఏర్పడ్డాయి. ఈ మట్టి మాఫియా ప్రధాన సూత్రదారి జంగారెడ్డిగూడెం మండలం వేగవరానికి చెందిన టీడీపీ నాయకుడు. అంతా తానై ఎర్రకాలువ జలాశయం గర్భాన్ని తవ్వేసి మట్టిని అమ్మేసుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా రాత్రి సమయాల్లో జేసీబీ పెట్టి తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. పగలు జేసీబీని సమీపంలోని పొలాల్లో పెట్టి.. రాత్రి మట్టి తవ్వేసి యథేచ్ఛగా తరలించేస్తున్నారు. ఎర్రకాలువ జలాశయం గర్భంలో మట్టిని తవ్వేసి తరలించేస్తున్నారని సంబంధిత శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా అధికారులు స్పందించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కొంతమంది దీనిపై ఆయా శాఖల అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదు. ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా దీనిపై స్పందించడం లేదు. మట్టి తరలిస్తున్నారని ఇరిగేషన్ కింది స్థాయి అధికారికి చెప్పినా పట్టించుకోవడం లేదంటున్నారు. క్షేత్రస్థాయిలో నిత్యం జలాశయాన్ని పరిశీలించాల్సిన అధికారి జలాశయం పరిధిలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. చేపలు పట్టేందుకు మత్స్యకారులు, పశువుల్ని కడిగేందుకు పశువుల కాపరులు ఈ జలాశయంలోకి దిగుతుంటారు. భారీ గోతులు వీరి ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయి. -
ఆస్థాన విద్వాంసుడిగా కేవీ సత్యనారాయణ
ద్వారకాతిరుమల : శ్రీవారి దేవస్థానం ఆస్థాన విద్వాంసుడిగా తనను ప్రకటించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు ఏలూరుకు చెందిన ప్రముఖ కూచిపూడి నాట్య గురువు, సినీ నృత్య దర్శకుడు, నాట్య కళా విశారద కేవీ సత్యనారాయణ అన్నారు. ఎన్నో ఏళ్లుగా తన నాట్యం ద్వారా శ్రీవారిని సేవిస్తున్నట్టు చెప్పారు. అందరికీ ఇళ్లు పథకంలో స్థలాలు భీమవరం (ప్రకాశంచౌక్): ‘అందరికీ ఇళ్లు’ (హౌసింగ్ ఫర్ ఆల్) పథకం కింద జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు భూమిని ఇంటి స్థలంగా కేటాయించేందుకు ప్రభుత్వం మార్గదర్శక, నిబంధనలు జారీ చేసినట్లు జాయింట్ కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పథకానికి సంబంధించి సందేహాలను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నివృత్తి చేసికొవచ్చు. ఈ పథకాన్ని అర్హత ఉన్న లబ్ధిదారులు వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 574 మంది గైర్హాజరు భీమవరం: జిల్లా వ్యాప్తంగా బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం సప్లమెంటరీ పరీక్షల్లో 574 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖాధికారి ఎ.నాగేశ్వరరావు చెప్పారు. మొదటి సంవత్సరం పరీక్షలను 40 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించగా జనరల్ కేటగిరిలో 9,525 మందికి 9,111 మంది హాజరుకాగా ఒకేషనల్ కేటగిరిలో 557 మందికి 58 మంది గైర్హాజరయ్యారన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష 18 కేంద్రాల్లో నిర్వహించగా జనరల్ కేటగిరిలో 1,300 మందికి 1,214 మంది హాజరుకాగా ఒకేషనల్ కేటగిరిలో 180 మందికి 162 మంది విద్యార్థులు హాజరయ్యారని ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని నాగేశ్వరరావు తెలిపారు. పాలిసెట్‌లో 6,169 మంది ఉత్తీర్ణత భీమవరం: పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలో జిల్లాల్లో 95 శాతం విద్యార్థులు హాజరయ్యారని పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ ఫణీంద్ర ప్రసాద్ చెప్పారు. పాలిసెట్ పరీక్షకు 7,271 మంది పరీక్ష ఫీజులు చెల్లించగా 6,489 మంది పరీక్షకు హాజరయ్యారని వీరిలో 6,169 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. పాసైన వారిలో 3,634 మంది బాలురు, 2,535 మంది బాలికలు ఉన్నారన్నారు. రాష్ట్ర స్థాయిలో బి.శేఖర్ 4వ ర్యాంకు సాధించగా, వి.ప్రవల్లిక 6వ ర్యాంకు, కె.కృష్ణ ప్రణయ్ 9వ ర్యాంకు సాధించారని ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. రెవెన్యూ పిటిషన్లు సత్వరం పరిష్కరించాలి భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఫేజ్ –1 రీసర్వే మే నెలాఖరునాటికి పూర్తిచేసి గెజిట్ నోటిఫికేషన్ విడుదలకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం భీమవరం జాయింట్ కలెక్టర్ చాంబరులో జాయింట్ కలెక్టర్ రీ సర్వే, పీజీఆర్ఎస్, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, తదితర అంశాలపై గూగుల్ మీట్ ద్వారా ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, సర్వే అధికారులతో సమీక్షించారు. ఫేజ్ 2 రీసర్వే పనులను వేగవంతం చేయాలన్నారు. పీజీఆర్ఎస్ సమస్యల పరిష్కారంలో ఏఐ టెక్నాలజీని వాడి సమస్యలు నాణ్యతతో పరిష్కరించుకోవచ్చన్నారు. అందరికీ ఇళ్ల పథకం కింద గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు భూమిని కేటాయించేందుకు మార్గదర్శకాలతో ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. వర్క్ ఇన్స్పెక్టర్ల తొలగింపు నూజివీడు: మండలంలోని సుంకొల్లులో గృహనిర్మాణలకు సంబంధించి సిమెంట్, స్టీలు అవకతవకల విషయంలో గృహనిర్మాణ శాఖలో అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఐదుగురు వర్క్ ఇన్స్పెక్టర్లను విధుల నుంచి తొలగిస్తున్నట్లు గృహనిర్మాణ శాఖ జిల్లా అధికారి జీవీవీ సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. లబ్ధిదారులకు సంబంధించిన మెటీరియల్ పక్కదారి పట్టిందని వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని గృహ నిర్మాణశాఖ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. విచారణలో 2,450 బస్తాల సిమెంట్, 11,952 కిలోల స్టీలు లబ్ధిదారులకు అందలేదని తేలింది. -
వైభవంగా వసంతోత్సవం
ముగిసిన వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ద్వారకాతిరుమల: శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు బుధవారం జరిగిన విశేష కార్యక్రమాలతో ముగిశాయి. ఉదయం కల్యాణ మండపంలో అర్చకులు శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అర్చనాది కార్యక్రమాలు జరిపి, హారతులిచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు వసంతాలు సమర్పించి, చూర్ణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అందులో భాగంగా స్వామిని కీర్తిస్తూ అర్చకులు, మహిళా భక్తులు వడ్లు దంచారు. ఆ తరువాత రాజాదిరాజ వాహనంపై శ్రీవారికి తిరువీధి సేవను నిర్వహించి, భక్తులకు వసంతాలు అందజేశారు. అలాగే రాత్రి ఆలయంలో స్వామి వారికి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్ప యాగోత్సవాన్ని అర్చకులు, పండితులు వైభవోపేతంగా నిర్వహించారు. ఉభయ దేవేరులతో శ్రీవారికి రాత్రి ఆలయంలో 12 ప్రదక్షిణలు, 12 సేవా కాలాలు, 12 రకాల పిండి వంటలతో నివేదనలు జరిపారు. శ్రీపుష్ప యాగోత్సవాన్ని వైభవోపేతంగా జరిపారు. ఆలయ ముఖ మండపంలో శయన మహావిష్ణువు అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. ఈ వేడుకలతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. నేటి నుంచి ఆర్జిత సేవలు శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో రద్దు చేసిన నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను గురువారం నుంచి పునరుద్ధరిస్తున్నట్టు ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి తెలిపారు. -
మాక్‌డ్రిల్‌తో అప్రమత్తం
భీమవరం (ప్రకాశంచౌక్): మాక్‌డ్రిల్ అవగాహన అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడంతోపాటు, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడానికి ఉపయోగంగా ఉంటుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా తమను తాము రక్షించుకోవాలి అనే అంశాలపై ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీస్, రెవెన్యూ, వైద్య శాఖలు సంయుక్తంగా బుధవారం భీమవరం కొత్త బస్టాండ్ ఆవరణలో కలెక్టర్, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సమక్షంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిలెండర్ నుంచి గ్యాస్ లీకేజీని, మంటలను ఎలా కట్టడి చేయిచ్చో కలెక్టర్ స్వయంగా చేసి చూపించారు. ఎస్పీ మాట్లాడుతూ అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అనేక అనర్ధాలు జరుగుతాయని, ఇలాంటి మాక్‌డ్రిల్స్ ద్వారా ప్రజలకు అవగాహన కలిగించి ప్రమాదాల బారి నుంచి బయటపడవచ్చన్నారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఏ.శ్రీనివాసరావు ప్రతి అంశాన్ని ప్రజలకు వివరించారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్పీ వి.భీమారావు, ఆర్డీవో కే ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా శ్రీచక్ర స్నానం
● నేత్రపర్వంగా తొళక్కం, అశ్వ వాహన సేవలు ● నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు ద్వారకాతిరుమల: శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం శ్రీచక్ర స్నానాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి, అమ్మవార్లు తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. అనంతరం అర్చకులు ఆలయ యాగశాలలో శ్రీవారు, అమ్మవార్లు, శ్రీచక్ర పెరుమాళ్ల ఉత్సవ మూర్తులను ఒక వేదికపై వేంచేపు చేశారు. పూజాధికాల అనంతరం సుగంధ ద్రవ్యాలు, పంచపల్లవులు, శ్రీచందనం, పసుపు, మంత్ర పూత అభిషేక తీర్ధంతో శ్రీచక్ర స్వామిని అభిషేకించారు. సాయంత్రం నిత్యహోమ బలిహరణలు, పూర్ణాహుతి, అనంతరం ధ్వజ అవరోహణ వేడుకలను అర్చకులు వేద మంత్రోచ్ఛరణలతో వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో శ్రీవారి కాళీయమర్ధనం అలంకారం భక్తులకు కనువిందు చేసింది. రాత్రి అశ్వవాహనంపై తిరువీధి సేవను నిర్వహించారు. బుధవారం రాత్రి జరిగే శ్రీపుష్ప యాగోత్సవంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో నేడు : ● ఉదయం 9 గంటల నుంచి – చూర్ణోత్సవం ● సాయంత్రం 6 గంటల నుంచి – కూచిపూడి నృత్య ప్రదర్శనలు ● రాత్రి 7 గంటల నుంచి – ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్ప యాగం–పవళింపు సేవ ● 9 గంటల నుంచి – రామాంజనేయ యుద్ధం నాటకం ● ప్రత్యేక అలంకారం : శయన మహావిష్ణువు -
భారీగా సెల్ఫోన్ల రికవరీ
సింగిల్ బృందం సందడి సింగిల్ చిత్ర బృంద సభ్యులు మంగళవారం ఏలూరులో సందడి చేశారు. నగరంలోని ఎస్వీసీ థియేటర్లో ప్రేక్షకులను కలిసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. 8లో u15వ విడతలో 594 సెల్ఫోన్లు బాధితులకు అందజేత ఏలూరు టౌన్: జిల్లా పోలీసులు శ్రమించి వందలాది సెల్ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద రికవరీ చేసిన సెల్ఫోన్లు మంగళవారం ఎస్పీ చేతులమీదుగా బాధితులకు అందజేశారు. 15వ విడతలో 594 మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. వాటి విలువ మార్కెట్లో సుమారు రూ.71.28 లక్షలు ఉంటుందని అంచనా. ఏలూరు జిల్లాలో మొత్తంగా 15 విడతల్లో 2,976 మొబైల్ ఫోన్లు పోలీస్ అధికారులు రికవరీ చేశారు. ఈ సెల్ఫోన్ల విలువ ఏకంగా రూ.4.75 కోట్లు ఉంటుందని అంచనా.. ఈ సందర్భంగా ఎస్పీ కేపీ శివకిషోర్ మాట్లాడుతూ... చోరీ వస్తువులు కొనడం, విక్రయించటం రెండూ నేరమేనని స్పష్టం చేశారు. సైబర్ నేరాలు, చోరీలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమ ఇళ్లు, షాపులు, ఇతర రద్దీ ప్రాంతాల్లోని దుకాణ సముదాయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఏదైనా నేరం జరిగితే నిందితులను పట్టుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. సెల్‌ఫోన్ పోయిన వెంటనే ఫిర్యాదు చేయటంతోపాటు సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. సైబర్ నేరాల నిరోధానికి 1930కి కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్.జీవోవీ.ఇన్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎస్బీ సీఐ మల్లేశ్వరరావు, బీ.ఆదిప్రసాద్, సైబర్ క్రైమ్ ఎస్ఐ రాజా, తదితరులు పాల్గొన్నారు. -
వాట్సాప్ గవర్నెన్స్ సద్వినియోగం చేసుకోవాలి
భీమవరం (ప్రకాశంచౌక్): మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ చేతుల మీదుగా మనమిత్ర స్టాండ్లు మండలాల వారీగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ధ్రువపత్రాలు వాట్సప్ ద్వారానే ప్రజలు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం మనమిత్రను అందుబాటులో తీసుకొచ్చిందన్నారు. సర్టిఫికెట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు రాకుండానే, వాట్సాప్‌లోనే అప్లై చేసుకోవచ్చని అన్నారు. దేవదాయ, రెవెన్యూ, మున్సిపల్, తదితర శాఖలలో చెల్లింపులు, జనన, మరణాల ధ్రువీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్సులు, వివిధ రకాల ధ్రువపత్రాలు జారీ సేవలు పొందవచ్చన్నారు. పౌరులకు లభించే సేవలపై ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల అధికారి వై.దోసి రెడ్డి, వివిధ మండలాల ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల సిబ్బంది, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. -
పట్టుబడిన మద్యం ధ్వంసం
భీమవరం: భీమవరం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కేసుల్లో పట్టుబడిన మద్యం సీసాలను మంగళవారం భీమవరం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆవరణలో ధ్వంసం చేశారు. ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఆదేశాలతో మద్యం సీసాలను ధ్వంసం చేసినట్లు ఎకై ్సజ్ సీఐ కె.బలరామరాజు చెప్పారు. గతంలో మద్యం కేసుల్లో పట్టుబడిన ఐదుగురిని భీమవరం తహసీల్దార్ ఆర్.రాంబాబు ముందు బైండోవర్ చేసినట్లు చెప్పారు. ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు భీమవరం: ఇంటర్ సంప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా మంగళవారం ఫస్టియర్ ఇంగ్లీష్ పరీక్షకు 95 శాతం విద్యార్ధులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖాధికారి ఎ.నాగేశ్వరరావు చెప్పారు. జనరల్ కేటగిరిలో 7,630 మందికి 7,320 మంది, ఒకేషనల్‌లో 444 మందికి 398 మంది హాజరయ్యారన్నారు. సెకండ్ ఇయర్ ఇంగ్లీషు పరీక్షకు 89 శాతం విద్యార్థులు హాజరుకాగా జనరల్ కేటగిరిలో 294 మందికి 270 మంది, ఒకేషనల్‌లో 102 మందికి 86 మంది హాజరయ్యారన్నారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి అత్తిలి: మహిళలు తమ కాళ్ల మీద నిలబడి ఆర్థికాభివృద్ధి సాధించాలనే ధ్యేయంతో మహిళలకు కుట్టు శిక్షణ ఇస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అత్తిలిలో బీసీ సంక్షేమ ఫైనాన్స్ కార్పోరేషన్న్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం కోసం కుట్టు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారన్నారు. పాలూరులో సీసీ రోడ్డు, రక్షిత మంచినీటి పధకాన్ని హోం మంత్రి ప్రారంభించారు. మైక్రో ఫిల్టర్లు, పైపులైన్ పనులకు శంకుస్ధాపన చేసారు. అత్తిలిలో నిర్మించే రక్షిత మంచినీటి పధకం ట్యాంకు, పైపులైన్ విస్తరణకు భూమిపూజ చేశారు. కె సముద్రపుగట్టులో రక్షిత మంచినీటి పథకం, పైపులైన్లకు శంకుస్ధాపన చేసారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఎంపీపీ సుంకర నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సరస్వతి నది పుష్కరాలకు ప్రత్యేక బస్సు సర్వీస్ భీమవరం (ప్రకాశంచౌక్): ఈనెల 15 నుంచి జరిగే కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాలకు భీమవరం డిపో నుంచి స్పెషల్ సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ పీ.ఎన్.వీ.ఎం.సత్యనారాయణ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఏదైనా గ్రామం నుంచి 35 మంది ప్రయాణికులు ఉంటే అదనపు చార్జీలు లేకుండా ఆ గ్రామం నుంచి మీరు కోరిన సమయంలో సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. టిక్కెట్ ధర ఒక్కొక్కరికీ రూ.2,200 అని.. మరిన్ని వివరాలకు 7382924754, 96660 89036 నెంబర్లలో సంప్రదించాలన్నారు. సీహెచ్‌ఓల సమస్యలు పరిష్కరించాలి ఏలూరు (టూటౌన్): గత 20 రోజులు నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఉభయగోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి డిమాండ్ చేశారు. మంగళవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద సమ్మె శిబిరాన్ని సందర్శించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం తక్షణమే యూనియన్‌తో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించి సమ్మె విరమణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. -
మాపై ఉదాసీనత ఎందుకు?
విజయరాయిలో 20 ఎకరాల్లో కోకో సాగు చేస్తున్నాను. సీజన్లో 100 గ్రాములకు 80 నుంచి 100 గింజలు వస్తాయి. అన్ సీజన్లో 100 గ్రాములకు 120 నుంచి 140 గింజలు వస్తాయి. రెండూ కలిపి సంక్రాంతి తరువాత అమ్ముకునే వాళ్ళం. హఠాత్తుగా ధర తగ్గించేశారు. ప్రస్తుతం రూ 350 నుంచి రూ.450 మధ్య కొనుగోలు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో రూ.750 నుంచి రూ.800 వరకు కొనుగోలు చేస్తున్నారు. – కొనేరు సతీష్‌బాబు, విజయరాయి నష్టాల్లో మునిగిపోయాం చిన్న సన్నకారు కోకో రైతులు నష్టాల్లో మునిగిపోయారు. గతేడాది రూ.1040 వరకు కోకోకు గిట్టుబాటు ధర ఇచ్చారు. నేడు రూ.400 మాత్రమే ఇస్తున్నారు. రైతులు చాలా పెట్టుబడి పెట్టారు. మండలీజ్ వ్యాపారస్తులందరూ సిండికేట్‌గా మారి రైతులను ముంచేశారు. మండలీజ్ కంపెనీ బయట వ్యాపారస్తులని రానివ్వకుండా చేసి, చిన్న రైతులకు నష్టం చేస్తున్నారు. – వంకినేని లక్ష్మీనారాయణ, వంగూరు, లక్ష్మీపురం గ్రామం ● -
బడి బస్సు భద్రమేనా?
బుధవారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2025సాక్షి, భీమవరం / భీమవరం (ప్రకాశంచౌక్) : జిల్లాలో 463 ప్రైవేట్ విద్యాసంస్థల పరిధిలో 1,566 స్కూల్ బస్సులు ఉన్నాయి. విద్యార్థుల ప్రయాణ భద్రత దృష్ట్యా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు రవాణ శాఖ స్కూల్ బస్సుల సామర్థ్యాన్ని పరీక్షించి పూర్తి సామర్థ్యంతో ఉన్న వాటికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు(ఎఫ్‌సీ) జారీచేయాలి. ఎఫ్‌సీ లేనివాటిని సీజ్ చేయాలి. గత ఏడాది ఎఫ్‌సీ గడువు ముగియడంతో రానున్న విద్యాసంత్సరానికి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెంలోని రవాణశాఖ కార్యాలయాల్లో బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేపట్టి సోమవారం నాటికి 849 బస్సులకు పూర్తి చేశారు. తూతూమంత్రంగా తనిఖీలు బస్సు బ్రేక్, హ్యాండ్ బ్రేక్, స్టీరింగ్, టైర్లు, స్పీడో మీటర్, లైట్లు, గ్లాసులు, అత్యవసర ద్వారం, మంటలను ఆర్పే పరికరం తదితర వాటి కండిషన్‌ను మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు స్వయంగా పరీక్షించాలి. బస్సుకు నాలుగు వైపులా రిఫ్లెక్టివ్ టేపు అతికించి ఉందా? లేదా? ఫస్ట్ ఎయిడ్ బాక్స్, బస్సు బయలుదేరే సమయం, ఆగే స్థలాలు, రూట్ ప్లాన్ వివరాలు వంటివి పరిశీలన చేయాలి. ఆ బాధ్య తను కిందిస్థాయి సిబ్బందికి అప్పగించి తూతూమంత్రంగా తనిఖీలు చేయిస్తున్నారన్న విమర్శలున్నాయి. కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూ చూసీచూడనట్లు వదిలేస్తున్నట్టు తెలుస్తోంది. కొరవడిన పర్యవేక్షణ స్కూల్ బస్సుల వేగం గంటకు 60 కిలోమీటర్లు మాత్రమే ఉండేలా స్పీడ్ గవర్నర్స్ తప్పనిసరి. కాగా కొందరు డ్రైవర్లు ఇరుకు సందుల్లో వేగంగా పోనిస్తూ దారిన వెళ్లే వారిని హడలెత్తిస్తున్నారు. కొందరు విధుల్లో మద్యం సేవించి ఉంటున్నారని, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. గతంలో జరిగిన పలు ప్రమాదాలకు నిర్లక్ష్య డ్రైవింగ్, వాహనాలు కండీషన్లో లేకపోవడం కారణమన్న విమర్శలున్నాయి. అధికారులు, స్కూల్ యాజమాన్యాల పర్యవేక్షణ కొరవడటం డ్రైవర్ల ఇష్టారాజ్యంగా మారుతోంది. పేరెంట్స్ కమిటీ పరిశీలించాలి బస్సులోని ఫస్ట్‌ఎయిడ్ బాక్స్‌ను నెలకోసారి పేరెంట్స్ కమిటీ పరిశీలించాలి. సీటింగ్ కెపాసిటికి మించి విద్యార్థులను ఎక్కించకూడదు. ప్రతి నెల బస్సు కండిషన్‌ను యాజమాన్యాలు, పాఠశాల పేరెంట్స్ కమిటీ తనిఖీ చేయాలి. బస్సులో ఫిర్యాదుల పుస్తకం ఉంచి ప్రతి నెలా యాజమాన్యం తనిఖీ చేసి ఫిర్యాదులను పరిశీలించాలి. రవాణా, పోలీస్, విద్యా శాఖల సౌజన్యంతో విద్యార్థులకు రోడ్ సేఫ్టీ తరగతులు నిర్వహించాలి. న్యూస్‌రీల్ ఆందోళన కలిగిస్తున్న ప్రమాదాలు గతేడాది వేర్వేరు ప్రమాదాల్లో ఒకరు మృతి, పలువురికి గాయాలు సిబ్బంది చేతివాటం, తూతూమంత్రంగా తనిఖీలు సెప్టెంబరు 20 : తణుకులోని ఒక ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సు జాతీయ రహదారిలోని డీమార్టు సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలి వైపునకు దూసుకువెళ్లి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో లిప్టు కోసం ఎక్కిన మరో బస్సు క్లీనర్ మృతిచెందాడు. డిసెంబరు 2 : ఇరగవరం మండలం అర్జునుడుపాలెం రోడ్డులో విద్యార్థులతో ఉన్న రెండు స్కూల్ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆ వేగానికి అందులోని చిన్నారులు సీట్లలోంచి చెల్లాచెదురుగా పడిపోయారు. అదృష్టవశాత్తు స్వల్పగాయాలతో బయటపడ్డారు. హుటాహుటిన చిన్నారులను 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. సెప్టెంబరు 10 : పెనుమంట్ర మండలం మాముడూరు నుంచి భీమవరం వస్తున్న ప్రైవేట్ కళాశాల బస్సు పాలకోడేరులో అదుపుతప్పి పంటబోదెలోకి దూసుకుపోయి మట్టిలో కూరుకుపోయింది. ప్రమాద సమయానికి బస్సులో 20 మంది విద్యార్థులు ఉండగా వారిలో ఒకరికి కాలు, చేయి విరిగిపోయింది. 11 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. పక్కాగా ఫిట్నెస్ పరీక్షలు అక్రమాలకు తావులేకుండా జిల్లాలో ఫిట్నెస్ పరీక్షలు పక్కాగా నిర్వహిస్తున్నాం. గత ప్రమాదాలకు కారణాలను విశ్లేషించి అవసరమైన చర్యలు తీసుకున్నాం. ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తాం. ఉమా మహేశ్వరరావు, జిల్లా రవాణ శాఖ అధికారి, భీమవరం రవాణ శాఖ స్కూల్ ఫిట్నెస్ కార్యాలయం బస్సులు పరీక్షలు పూర్తయినవిభీమవరం 557 298 పాలకొల్లు 331 166 తణుకు 234 142 తాడపల్లిగూడెం 444 243 -
కోకో రైతుకు సిండికేట్ దెబ్బ
● రోజురోజుకూ ధరల తగ్గింపు ● అంతర్జాతీయ మార్కెట్లో కిలోకు రూ.750కి పైగానే ధర ● స్థానికంగా రూ.450 మాత్రమే ఇస్తున్న వైనం ● ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నెలకు రూ.100 చొప్పున తగ్గుదల ● ఉమ్మడి జిల్లాలో 50 వేల ఎకరాల్లో కోకో సాగు సాక్షి ప్రతినిధి, ఏలూరు : జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లతో మాకు సంబంధం లేదు. మేం చెప్పిందే రేటు.. లేకపోతే ఏ కంపెనీ కోకో గింజలు కొనదు. ఇది కోకో వ్యాపారులు సిండికేట్ అయ్యి ఇస్తున్న అల్టిమేటం. అంతర్జాతీయ మార్కెట్లో కిలో గింజలు రూ.700 నుంచి రూ.800 పలుకుతుంటే ఏలూరు జిల్లాలో మాత్రం సిండికేట్ వ్యాపారుల వల్ల కేవలం రూ.450కే కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక కోకో సాగు ఏలూరు జిల్లాలోనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ధరను ప్రామాణికంగా తీసుకుని గతేడాది వరకు అదే ధరలు చెల్లించిన వ్యాపారులు పూర్తిగా సిండికేట్ అయ్యి స్థానికంగా ధరలు నిర్ణయించడంతో కోకో రైతులు తీవ్ర సంక్షోభంలో పడ్డారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 50 వేల ఎకరాల విస్తీర్ణంలో కోకో విస్తరించింది. కొబ్బరి, పామాయిల్లో అంతర్ పంటగా సాగుచేస్తున్నారు. 2018 నుంచి కోకో సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. ఏలూరు జిల్లాలో 2020లో 18,483 ఎకరాలు, 2021లో 20,350 ఎకరాలు ఉన్న కోకో సాగు, 2025 నాటికి 36,290 ఎకరాలకు చేరింది. గతేడాది పోటీపడి కొనుగోలు గతేడాది ఏప్రిల్, మే నెలలో కిలో కోకో గింజలు అత్యధికంగా రూ.1000కి పైగా పోటీ పడి మరీ కొనుగోలు చేశారు. గాలిలో తేమ శాతం అధికంగా ఉండటం ఇక్కడ కోకో సాగుకు భాగా కలిసివచ్చే అంశం. ఒక్క ఏలూరు జిల్లా నుంచే ఏటా 12 వేల మెట్రిక్ టన్నుల కోకో దిగుబడి ఉంది. గత మూడేళ్లుగా సగటున రూ.350 ధరతో ప్రారంభమై, 2024 ఏప్రిల్ నాటికి రూ.1040కి చేరింది. మరో 30 ఏళ్ల పాటు కోకోకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. దేశీయ అవసరాలకు ఏటా 1.10 లక్షల టన్నుల డిమాండ్ ఉన్నప్పటికీ దేశంలో 30 వేల మెట్రిల్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. మిగిలింది విదేశాల నుంచి దిగుమతి చేస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు రూ.40 వేల నుంచి రూ.50 వేల ఉన్న ఎకరం పొలం కౌలు ధర రూ.లక్ష నుంచి అత్యధికంగా రూ.1.20 లక్షలకు చేరింది. గతంలో నాణ్యతతో సంబంధం లేకుండా ఎలాంటి కోకో గింజలనైనా ఒకే ధరకు కొనుగోలు చేశారు. ఇప్పుడు వ్యాపారులు పూర్తిగా సిండికేట్‌గా మారి ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారు. 70 శాతం మండలీజ్ కంపెనీ కొనుగోలు కోకో గింజలను స్థానంగా మండలీజ్, జిందాల్, హెరిటేజ్, డీపీ చాక్లెట్, సూర్య ట్రేడర్స్‌తో పాటు కొందరు వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. వీటిలో 70 శాతానికి పైగా కొనుగోళ్లు మండలీజ్ కంపెనీ చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ వారం రూ.750 నుంచి రూ.800 ధరకు కోకోను కొనుగోలు చేస్తున్నారు. స్థానికంగా 5 నుంచి 10 శాతం వ్యత్యాసంలో అదే ధర చెల్లించాలి. వ్యాపారులు సిండికేట్‌గా మారి రూ. 450 ధరకు కొనుగోలు చేస్తున్నారు. అది కూడా ఈ ఏడాది జనవరిలో రూ.650తో ప్రారంభమైన లోకల్ మార్కెట్ ధర మే నాటికి రూ.450కు చేరింది. దీనిపై కోకో రైతు సంఘం పోరు బాట పట్టి కమిషనరేట్ ముట్టడి మొదలుకుని అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. కోకో రైతుల మొర పట్టని సర్కారు గత నెలలో వ్యవసాయ శాఖ మంత్రి వద్ద సమావేశం నిర్వహించి, వ్యవసాయశాఖ మంత్రి అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించాలని కోరింది. చివరకు కంపెనీలు రూ.550కు కొనుగోలు చేస్తాయని చెప్పి మాట తప్పారు. దీంతో పాటు ఎంపిక చేసిన రైతుల వద్ద మాత్రమే కొనుగోలు చేయడం, పూర్తి ప్రాసెసింగ్ రైతే చేయాలని షరతులు విధించడం, అంతర్జాతీయ మార్కెట్ వర్తించదు, మేం ఇచ్చిన రేటే తీసుకోవాలని నిర్ణయించి మరీ మార్కెట్‌ను శాసిస్తున్నారు. దీంతో ఈ ఏడాది కోకో సాగుదారులు పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోయారు. -
వాహనంలో రేడియేటర్ పేలి బాలికకు గాయాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపైన జంటగోపురాల ప్రాంతంలో మంగళవారం ఓ భక్తుడి పాల వాహనంలోని రేడియేటర్ పేలి అందులోని బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం. దెందులూరు మండలం పోతునూరుకు చెందిన ఒక వ్యక్తి సెకండ్ హ్యాండ్ పాల వ్యాన్‌ను కొనుగోలు చేశాడు. దానికి పూజలు చేసేందుకు భార్య, ఇద్దరు పిల్లలతో కలసి శ్రీవారి క్షేత్రానికి వచ్చాడు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి వాహనంలోని రేడియేటర్ ఒక్కసారిగా పేలింది. దాంతో బాలికపై రేడియేటర్లోని వేడి నీరు పడి ఆమెకు గాయాలయ్యాయి. ఆ సమయంలో వాహనం డోర్లు తెరచుకోక పోవడంతో అందులో ఉన్నవారంతా పెద్దపెద్ద కేకలు వేశారు. దాంతో స్థానికులు, భక్తులు వాహనం వద్దకు చేరుకుని, ఎంతగానో శ్రమించి డోర్లు తెరిచారు. గాయపడిన బాలికను ఆలయ ఆవరణలోని ప్రథమచికిత్సా కేంద్రానికి తరలించి, కాలికి చికిత్స చేయించారు. -
డీఎంహెచ్‌వోకు వినతి
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పేరుతో ఒక వ్యక్తి అనధికార దందాలకు పాల్పడుతున్నారని, చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌వో డాక్టర్ మాలినికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తామంతా ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చదువుకొని, వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ప్రైవేట్ ల్యాబ్‌లు నిర్వహించుకుంటూ జీవనం గడుపుతున్నామన్నారు. అయితే గత కొంత కాలంగా 70326 72067 నెంబర్ తో కాల్ చేస్తూం. మేము జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆఫీసు నుంచి మీనాక్షి నీ మాట్లాడుతున్నాను.. మీ లాబ్ పై మాకు కంప్లయింట్ వచ్చింది.. ఈ ఫిర్యాదును జిల్లా ఉన్నతాధికారులకు పంపమంటారా లేదా.. సెటిల్ చేసుకుంటారా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. రూ.20,000 చెల్లిస్తే సమస్య పరిష్కారం అవుతుందని డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వీటిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏలూరు జిల్లా ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంఎస్‌వి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కొసరాజు శ్రీ నాగ సతీష్, కోశాధికారి సత్యకుమార్, సభ్యులు సురేష్, హరికృష్ణ, దుర్గారావు, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, సింహాద్రి ఉన్నారు. -
పాడి రైతులకు ఇబ్బందులు
పశువులకు మేత వేసేందుకు ఎండుగడ్డి దొరక్క పాడి రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పశువుల దాణాను సబ్సిడీపై అందజేసి పాడి రైతులను ఆదుకోవాలి. అంతే కాకుండా ప్రభుత్వం కూడా ఎండుగడ్డిని సేకరించి పాడిపరిశ్రమ అభివృద్ధి చెందేలా చర్యలు చేపట్టాలి. – పీవీఆర్కే ఆంజనేయరాజు, రైతు, వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు, వాండ్రం ప్రభుత్వం ఆదుకోవాలి ప్రస్తుతం ఎండుగడ్డికీ చాలా గిరాకీ ఏర్పడింది. గతంలో రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు ఉండే ఎకరా ఎండుగడ్డి ప్రస్తుతం ఏరియాను బట్టి రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు పలుకుతోంది. దీంతో పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులను ఆదుకోవాలి. – నిమ్మల కేశవకుమార్, రైతు, ఉప్పులూరు, ఉండి మండలం పశువులకు మేత కష్టంగా ఉంది పశువులకు మేత వేసేందుకు ఎండుగడ్డి దొరకడం లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎండుగడ్డిని పాడిరైతులకు అందజేయాలి. పాడిని మనం బతికించుకుని ఆరోగ్యమైన పాలుతాగడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో నిండునూరేళ్లు జీవిస్తాం. పాడిరైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలి. వర్రే పైడియ్య, రైతు, పాములపర్రు, ఉండి మండలం -
హద్దు మీరిన మట్టి దందా
ద్వారకాతిరుమల: కూటమి నేతల అక్రమాలు హద్దులు మీరాయి. మట్టి ముసుగులో అడ్డగోలుగా ఎర్ర గ్రావెల్ అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. అనుమతులు ఉన్నాయంటూ తమకు నచ్చిన చోట యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తూ కోట్లు గడిస్తున్నారు. ఈ మట్టి మాఫియాలో ఖద్దరు చొక్కా పెద్దలకు, కొందరు ఉన్నతాధికారులకు సైతం వాటాలు అందుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ద్వారకాతిరుమల మండలంలోని పోలవరం కుడి కాలువ గట్టుపై జరుగుతున్న మట్టి దందాపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. మూడు పాయింట్లలో అనుమతులు పంగిడిగూడెం వద్ద ఒక పాయింట్, ఎం.నాగులపల్లి వద్ద రెండు పాయింట్లలో తవ్వకాలకు ఇరిగేషన్, మైనింగ్ శాఖలు అనుమతులు ఇచ్చాయి. ఒక క్యూబిక్ మీటర్‌కు ఇరిగేషన్ శాఖకు జీఎస్టీతో కలిపి రూ.170, మైనింగ్ శాఖకు రూ.106 చెల్లించాల్సి ఉంది. అయితే భీమడోలు మండలం సూరప్పగూడెంకు చెందిన నవ్య ఎర్త్‌మూవర్స్ వారు ఇరిగేషన్ శాఖకు 2 వేల క్యూబిక్ మీటర్లకు నగదు చెల్లించగా మైనింగ్ శాఖకు మాత్రం వెయ్యి క్యూబిక్ మీటర్లకు మాత్రమే నగదు చెల్లించి అనుమతులు పొందారు. మిగిలిన వెయ్యి క్యూబిక్ మీటర్ల మట్టి ఏమైనట్టు. ఇదిలా ఉంటే ఏలూరుకు చెందిన లెవలప్ ప్రాజెక్ట్స్ వారు 2,500 క్యూబిక్ మీటర్లకు, కై కలూరు మండలం ఆటపాకకు చెందిన బీకేఎం కనస్ట్రక్షన్స్ వారు 5 వేల క్యూబిక్ మీటర్లకు నగదు చెల్లించి అనుమతులు పొందారు. అన్ని రోజులు అనుమతి ఎందుకో.. రోజుకి ఒక్కో పాయింట్ నుంచి 70 నుంచి 80 టిప్పర్ల గ్రావెల్ మట్టి బయటకు వెళుతోంది. ఒక్కో టిప్పర్‌లో 15 క్యూబిక్ మీటర్ల మట్టి పడుతుంది. దీన్ని బట్టి నవ్య ఎర్త్ మూవర్స్ వెయ్యి క్యూబిక్ మీటర్ల మట్టిని 67 ట్రిప్పుల్లో, లెవలప్ ప్రాజెక్ట్స్ 2,500 క్యూబిక్ మీటర్ల మట్టిని 167 ట్రిప్పుల్లో, బీకేఎం కనస్ట్రక్షన్స్ 5 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని 334 ట్రిప్పుల్లో తోలుకోవాలి. ఇందులో ఒకరికి 30 రోజులు, ఇంకొకరికి 40, మరొకరికి 90 రోజుల పాటు అనుమతులు ఇచ్చారు. వెయ్యి క్యూబిక్ మీటర్లు (67 టిప్పర్లు)మట్టిని 30 రోజులు తోలుకోవడానికి మైనింగ్ అధికారులు అనుమతులు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. రైతుల ప్రాణాలతో చెలగాటాలు అనుమతులు పొందిన పాయింట్లలో కాకుండా తమకు నచ్చిన పాయింట్లలో మట్టిని తవ్వేస్తున్నారు. అది కూడా గట్టుపై ఉన్న మట్టిని కాకుండా, అక్కడే తాడి చెట్టు లోతున భూమిని తవ్వి, ఎర్ర గ్రావెల్‌ను అమ్ముకుంటున్నారు. ఇటీవల ఎం.నాగులపల్లి వద్ద కొందరు రైతులు ఈ తవ్వకాలను అడ్డుకుని, ఓ కంపెనీ వ్యక్తిని నిలదీశారు. అయితే తవ్వకాలు పూర్తయ్యాక పూడ్చి వెళతామని సమాధానమిచ్చి వారిపని వారు చేసుకోవడం మొదలు పెట్టారు. గట్టిగా అడిగితే కూటమి నేతలు ఏం చేస్తారోనన్న భయంతో వారు నిమ్మకుండిపోయారు. అధికారులకు ఫిర్యాదు చేస్తుంటే వారికి అనుమతులు ఉన్నాయంటున్నారని, తవ్వకాలు జరిగిన ప్రాంతాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే తమ బాధ అర్థమవుతుందని అంటున్నారు. గ్రావెల్ తవ్వకాలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఖద్దరు చొక్కా పెద్దలకూ వాటాలు ఇరిగేషన్, మైనింగ్ శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలించి, హద్దులను నిర్ణయించి, రాళ్లు పాతిపెట్టిన తరువాత ఆ పరిధిలో మాత్రమే తవ్వకాలు జరపాలి. అయితే ఆ నిబంధనలేవీ ఇక్కడ అమలు కాలేదు. ఈ తవ్వకాల్లో ఖద్దరు చొక్కా పెద్దలకు, అధికారులకు వాటాలు ఉండటమే కారణంగా తెలుస్తోంది. క్యాష్ చేసుకుంటున్న నేతలు ఎర్ర గ్రావెల్‌కు మంచి డిమాండ్ ఉండటంతో నేతలు క్యాష్ చేసుకుంటున్నారు. కాలువ పక్కన సమాంతరంగా మరో కాలువలా ఎర్ర గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారు. టిప్పర్ గ్రావెల్ మట్టిని దూరాన్ని బట్టి రూ.7 నుంచి 12 వేలకు విక్రయించి, సొమ్ము చేసుకుంటున్నారు. కై కలూరు–పామర్రు హైవేకి, చుట్టుపక్కల ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ వెంచర్ల చదునుకు ఈ గ్రావెల్‌ను తరలిస్తున్నారు. పరిశీలిస్తాం.. కాలువ గట్టుపై గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నట్టు, తమ దృష్టికి రాలేదని ఇరిగేషన్ ఏఈ బాపూజీ తెలిపారు. వెంటనే పరిశీలిస్తామని చెప్పారు. మట్టి ముసుగులో యథేచ్ఛగా ఎర్ర గ్రావెల్ తవ్వకాలు పోలవరం కాలువ గట్టుపై అడ్డగోలుగా తవ్వకాలు ఖద్దరు చొక్కా పెద్దలకు, ఉన్నతాధికారులకూ వాటాలు సాక్షి పరిశీలనలో బట్టబయలు -
ఏలూరులో సింగిల్ చిత్ర బృందం సందడి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గీత ఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన సింగిల్ చిత్ర బృంద సభ్యులు మంగళవారం ఏలూరులో సందడి చేశారు. హీరో శ్రీ విష్ణు, హీరోయిన్లు కేతిక శర్మ, ఇవానా నటించిన సింగిల్ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమౌతున్న నేపథ్యంలో చిత్ర బృందం నగరంలోని ఎస్వీసీ థియేటర్లో ప్రేక్షకులను కలిసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా చిత్రంలోని డైలాగులను చెప్పి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. తమ చిత్రాన్ని ఆదరించి విజయవంతం చేసిన ప్రేక్షకులకు చిత్ర యూనిట్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో శ్రీ విష్ణు, దర్శకుడు కార్తీక్ రాజు మాట్లాడారు. మంచి కామెడీతో పాటు కుటుంబ సమేతంగా చూసే విధంగా చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. సమావేశంలో హాస్య నటుడు వెన్నెల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
జంగారెడ్డిగూడెం: మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హెచ్‌సీ ఎన్.ఉమామహేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాసపురానికి చెందిన రాజులపాటి అప్పారావు, ప్రియాంకలకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పారావు చికెన్ షాపు పెట్టి జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన అప్పారావును ప్రియాంక పలుమార్లు వారించి, పెద్దలలో సైతం పెట్టినా అతడు మద్యాన్ని విడిచిపెట్టలేదు. దీంతో 15 రోజుల క్రితం పిల్లలను తీసుకుని ప్రియాంక అక్కంపేటలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పారావు ఎన్నిసార్లు ఫోన్‌చేసినా ఆమె రాకపోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లోని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ప్రియాంక ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు హెచ్‌సీ తెలిపారు. డివైడర్‌ను ఢీకొన్న ట్రాక్టర్.. డ్రైవర్ మృతి పెదవేగి: ట్రాక్టర్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. ఎస్సై కె రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం భోగాపురం గ్రామానికి చెందిన మట్టా నాగరాజు (36) మంగళవారం ఉదయం స్వగ్రామం నుంచి దుగ్గిరాల ట్రాక్టర్‌పై వెళుతుండగా అమ్మపాలెం జాతీయ రహదారి సమీపంలో ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌పై నుంచి నాగరాజు రోడ్డు మీద పడిపోవడంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ చెప్పారు. మృతదేహాన్ని శవపంచనామ అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడు నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
21 మంది ఎక్సైజ్ పాత నేరస్తుల బైండోవర్
నూజివీడు: మండలంలోని దేవరగుంట, ఓగిరాల తండాలకు చెందిన ఎక్సైజ్ పాత నేరస్తులు 21 మందిని తహసీల్దార్ గుగులోతు భద్రూ నాయక్ ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ ఏ మస్తానయ్య మంగళవారం తెలిపారు. దేవరగుంటకు చెందిన 19 మంది, ఓగిరాల తండాకు చెందిన ఇద్దరు వీరిలో ఉన్నారన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ భద్రూ మాట్లాడుతూ ఏడాది పాటు బైండోవర్ అమలులో ఉంటుందని, ఈ సమయంలో ఎక్సైజ్ నేరాలకు పాల్పడినట్లయితే రూ.లక్ష వరకు జరిమానా విధించడం జరుగుతుందన్నారు.ప్రమాదవశాత్తూ రైలు నుంచి జారిపడి మహిళ మృతిఏలూరు టౌన్: ఏలూరు సత్రంపాడు ప్రాంతంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి ఓ మహిళ మృతి చెందింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. తూర్పుగోదావరి జిల్లా రాజానగరానికి చెందిన బొమ్మేతి కుమారి హైదరాబాద్‌లోని తన చెల్లిని చూసేందుకు తల్లిదండ్రులతో కలిసి సోమవారం రాత్రి ద్వారపూడిలో ట్రైన్ నెంబర్ 12737 గౌతమీ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. మహిళా కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తున్న కుమారి రైలు బండి ఏలూరు సత్రంపాడు సమీపంలోకి వచ్చే సరికి ప్రయాణికుల రద్దీతో ప్రమాదవశాత్తు రైలునుంచి జారిపడింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను 108 అంబులెన్స్‌లో ఏలూరు జీజీహెచ్‌కు తరలించారు. ఆమె చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. ఏలూరు రైల్వే ఎస్సై పీ.సైమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు.అగ్ని ప్రమాదంలో రెండు తాటాకిళ్లు దగ్ధంకుక్కునూరు: అగ్ని ప్రమాదంలో రెండు తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. బర్లమడుగు గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు తాటి చెట్టుకు నిప్పంటించడంతో ఆ నిప్పు రవ్వలు ఎగసి గ్రామానికి చెందిన రేసు రాజు, సోయం బుల్లెమ్మ ఇళ్లపై పడడంతో అగ్నికి ఆహూతయ్యాయి. స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. కాగా ఈ ప్రమాదంలో ఇంట్లో సామాన్లతో సహా అన్ని కాలి బూడిద కావడంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలామని కన్నీటి పర్యంతమయ్యారు. బర్లమడుగు అగ్ని ప్రమాద బాధితులకు వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు తాండ్ర రాజేష్ ఒక్కో కుటుంబానికి రూ.5 వేలు చొప్పున రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. -
ఎండు గడ్డి ప్రియం
ఉండి: వ్యవసాయం అధునాతన సాంకేతిక వైపు అడుగులు వేస్తుండడం రైతులకు వరం కాగా పాడి రైతులకు మాత్రం శాపంగా పరిణమించింది. వరికోతల్లో ఎక్కువగా యంత్రాలనే వినియోగిస్తుండడంతో పశుగ్రాసం లభించక పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కూలీలు వరికోతలను కోయడం వలన కుప్పనూర్పులు చేసి ఎండుగడ్డిని జాగ్రత్త చేసి పశువులకు మేత వేసేవారు. ప్రస్తుతం యంత్రాలతో కోతకోసిన తరువాత ఆ వరి గడ్డి పిప్పిలా మారుతుండడంతో పశువులు తినేందుకు ఆసక్తి కనబరచడం లేదు. దీంతో ఎండుగడ్డి కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎక్కడా ఎండుగడ్డి దొరుకుతుందా అని రైతులు వెదికి అధిక ధర చెల్లించి మరీ కొనుగోలు చేసేందుకు పోటీ పడే పరిస్థితి నెలకొంది. దీంతో ఎండుగడ్డి ధర విపరీతంగా పెరిగింది. గతంలో ఎకరాకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు వరకు పలుకగా ప్రస్తుతం రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు పలుకుతుంది. డెల్టా ప్రాంతం నుంచి అధిక ధరలకు కొని మధ్యవర్తులు మరింత ఎక్కువ ధరకు ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తుండటంతో ఎండుగడ్డి మరింత ప్రియంగా మారింది. ముఖ్యంగా మెట్టప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో మధ్యవర్తులు ఎండుగడ్డిని కొనేందుకు పోటీపడతున్నారు. మార్టేరు తదితర ప్రాంతాల్లో ఫారంలు అధికంగా ఉండడంతో ఆ ప్రాంతాల్లో ఎకరా ఎండుగడ్డి రూ.5 వేల ధర పలుకుతుండటంతో పశువుల రైతులు ఘొల్లుమంటున్నారు. సబ్సిడీపై దాణాను అందజేయాలి గతంలో ఎక్కడబడితే అక్కడ దొరికే ఎండుగడ్డి ఇప్పుడు చాలా అరుదుగా లభిస్తోంది. ప్రభుత్వం పశువుల దాణాను అధిక సబ్పిడీపై అందజేసి పాడి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పశుగ్రాసం లభించక పాడి రైతుల ఇబ్బందులు యంత్రాలతో వరికోతలే ప్రధాన కారణమంటూ ఆవేదన ఎండు గడ్డి ధర చూసి ఆందోళన -
నాటు తుపాకులతో వేటగాళ్లు హల్చల్
ఏలూరు: నాటుతుపాకులతో వేటగాళ్లు హల్చల్ చేస్తున్నారు. ప్రతిరోజు ఆక్వా చెరువులపై పిట్టలు కొట్టేందుకు తుపాకులను విచ్చలవిడిగా వాడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి, అర్తమూరు తదితర గ్రామాలతోపాటు ఆకివీడు, కాళ్ళ, పాలకోడేరు, భీమవరం రూరల్ మండలాలు, ఏలూరు జిల్లాలోని గణపవరం, నిడమర్రు మండలాల్లోను ఇదే విధంగా నాటు తుపాకులు దర్శనమిస్తున్నాయి. పట్టపగలే వాహనాలపై తుపాకులను చేతపట్టుకుని తిరుగుతున్నా పోలీసులు గానీ, ఇతర అధికారులు గానీ ఎవరూ పట్టించుకోడం లేదంటూ సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. తుపాకీ గురితప్పితే తమ పరిస్థితి ఏంటని ఆయా మండలాల్లోని ప్రజలు, వ్యవసాయ కూలీలు ఆందోళన చెందుతున్నారు.ఇది నేరం కాదా?నాటు తుపాకీలతో కేవలం పిట్టలనే కాలుస్తున్నారా.. లేక మరేదైనా జరుగుతుందా.. తుపాకుల సరఫరా ఎక్కడ నుంచి జరుగుతుంది అంటూ పలువురు వీటిపై ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఈ నాటు తుపాకులతో ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల నుంచి వేటగాళ్లు ఇంత బహిరంగంగా ఎలా వస్తున్నారు? వారికి రూ.30 వేలు నుంచి రూ.40 వేలు జీతాలు ఎలా ఇస్తున్నారు?ఇదేమీ నేరం కాదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.గతంలో నాటుతుపాకీతో దారుణాలుగతంలో నాటుతుపాకీతో జరిగిన దారుణాలు గుర్తు తెచ్చుకుని ప్రజలు భయపడుతున్నారు. గతంలో సరిగ్గా పంచాయతీ ఎన్నికల సమయంలో మండలంలోని ఎన్నార్పీ అగ్రహారంలో నాటుతుపాకీతో ఓ హత్య జరగడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పుడు కూడా ఆక్వా చెరువులపై పిట్టలు కొట్టేందుకు తెచ్చిన నాటుతుపాకీగా పోలీసులు గుర్తించినట్లు పలువురు చెబుతున్నారు. అలాగే చెరువుకువాడ గ్రామంలో నాటు తుపాకీతో ఓ వ్యక్తి కోతి(వానరం)ని కాల్చడం కూడా సంచలనానికి దారి తీసింది. ఇంతటి భయంకరమైన ఘటనలు చోటుచేసుకుంటున్నా అధికారులు పట్టంచుకోకపోవడంపై ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వెంటనే వీటిపై చర్యలు తీసుకుని ప్రజల ప్రశాంత జీవనానికి అండగా నిలవాలని వారు కోరుతున్నారు. -
రెవెన్యూ రికార్డుల్లో అవకతవకలు
కాళ్ల: కాళ్లలో రెవెన్యూ రికార్డు ట్యాంపరింగ్ చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని కాళ్ళ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద కాళ్ళ గ్రామానికి చెందిన రైతులు సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో జరిగిన సర్వే ప్రకారం కాళ్ళ వ్యవసాయ భూముల విస్తీర్ణం సుమారు 3,862 ఎకరాలని.. రీసర్వేలోనూ వ్యవసాయ భూమి విస్తీర్ణం 3,862 ఎకరాలుగా చూపారని.. భూమిలో ఏవిధమైన మార్పు లేదన్నారు. భూములను ఆన్లైన్ చేసిన సందర్భంలో రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని తహసీల్దార్ సుందర్‌సింగ్‌కు వివరించారు. అనర్హులను 1బీలో నమోదు చేయటం వల్ల అర్హులు రోడ్డున పడ్డామన్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది సక్రమంగా పనిచేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కాళ్ళలో రీసర్వే జరిగి చాలాకాలం అయినా.. ఆ వివరాలు నోటీసు బోర్డులో ప్రదర్శించకుండా గోప్యత ఎందుకు పాటిస్తున్నారు అని ప్రశ్నించారు. ఒక్కొక్క రైతుకు ఎకరాకు 2 సెంట్ల నుంచి 40 సెంట్లు భూమి వ్యత్యాసం చూపిస్తున్నారని వాపోయారు. -
నాటు తుపాకులతో హల్చల్
ఆక్వా చెరువులపై పిట్టలు కొట్టేందుకు వేటగాళ్లు నాటు తుపాకులు విచ్చలవిడిగా వాడుతున్నారు. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. 8లో uపీజీఆర్ఎస్కు ఫిర్యాదుల వెల్లువ భీమవరం: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించి పీజీఆర్ఎస్కు బాధితులు పోటెత్తారు. వివిధ గ్రామాలకు చెందిన వృద్ధులు, వికలాంగులతోపాటు వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 187 ఆర్జీలను అందచేశారు. భార్య, ఇద్దరు కుమార్తెలు తనను ఇంటి నుంచి గెంటేశారని పెంటపాడు మండలం ప్రత్తిపాడు పంచాయతీ కాగులంపాడుకు చెందిన గజ్జరపు శంకరనారాయణ ఫిర్యాదు చేశారు. తాను 90 శాతం ఆర్ధోపెడిక్ సమస్యతో బాధపడుతున్నానని.. వికలాంగుల ఫించన్ సరిపోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నానని భీమవరం పట్టణం బలుసుమూడికి చెందిన రమణ కాత్యాయినిదేవి ఫిర్యాదు చేశారు. రూ.15 వేల పింఛన్ మంజూరు చేయాలని కోరారు. 2024 –25 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఉన్నతి రుణాలు మంజూరు రూ.7.75 కోట్లు లక్ష్యం కాగా, రూ.8.32 కోట్లు రుణాలను మంజూరు చేశారని.. రుణాల రికవరీ 99.91 శాతం ఉందని.. కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో డీఆర్డీఏ ఉన్నతి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ తిరుమాని మురళీకృష్ణను పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్ అభినందించారు. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
భీమవరం: ఉపాధి హామీ కూలీలకు పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని, గ్రామాల్లో వలసలు నివారించి వ్యవసాయ కూలీలందరికీ 200 పని దినాలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కలిశెట్టి వెంకట్రావు, కార్యదర్శి కళింగ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన సొమ్ము కోట్లాది రూపాయలు పెండింగ్ ఉండడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని, రాజకీయ నాయకుల జ్యోక్యాన్ని పూర్తిగా నివారించాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయి సిబ్బందిపై కక్ష సాధింపులు, వేధింపులు నివారించాలని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి భీమవరం: ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతులు, పాఠశాలల పునర్వ్యవస్థీకరణ సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీయూటీఎఫ్ ఆధ్వర్యంలో భీమవరంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి మాట్లాడుతూ ఉన్నత పాఠశాలల్లో 1:45 నిష్పత్తి ప్రకారం బదిలీలు జరపాలన్నారు. ఏపీయూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె శ్రీదేవి మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించి బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి ఏకేవీ రామభద్రం మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలన్నింటిలో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించి నాణ్యమైన విద్య అందించాలన్నారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్, విద్యాశాఖాధికారికి అందించారు. ప్రిన్సిపల్ అనుచిత ప్రవర్తనపై కలెక్టర్‌కు ఫిర్యాదు భీమవరం/పాలకోడేరు: ఇంటర్ చదువుతున్న తన కుమార్తెను భీమవరం పట్టణంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె.కృష్ణారావు మానసికంగా, శారీరకంగా వేధించాడంటూ భీమవరం రూరల్ మండలం చినఅమిరం గ్రామానికి చెందిన బాలిక తండ్రి సోమవారం కలెక్టర్ చదలవాడ నాగరాణికి ఫిర్యాదు చేశారు. తన కుమార్తె ప్లస్ 2 చదువుతోందని.. ప్రిన్సిపల్ బాలికను తన చాంబర్‌కు పిలిపించుకుని అసభ్యకరంగా ప్రవర్తించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను చెప్పినట్లు వినకపోతే పరీక్షలో ఫెయిల్ చేస్తానని, చంపుతానని బెదిరించేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. భయపడి ఈ విషయాలను ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే బాధపడేదని.. ఎన్నిసార్లు అడిగినా ఏమీ చెప్పలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల ఆ స్కూల్ మూసి వేస్తున్నట్లు, ఆ స్కూల్ యాజమాన్యంలో గొడవలు ఉన్నట్లు సమాచారం రావడంతో ధైర్యం తెచ్చుకుని తనకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పిందని.. తమ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్ కృష్ణారావుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని ఫిర్యాదులో కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. 19న అత్తిలి ఎంపీపీ ఎన్నిక అత్తిలి: ఈ నెల 19న అత్తిలి ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అత్తిలి మండలంలో 20 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 16 స్థానాల్లో వైఎస్సార్సీపీ, 4 స్థానాల్లో కూటమి పార్టీలు గెలుపొందాయి. ఎంపీపీగా మక్కా సూర్యనారాయణ రెండున్నరేళ్లు పని చేసి ఆ పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. మార్చి 27న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు జరగాల్సి ఉండగా వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను ఓటు వేయకుండా నిర్భందించడంతో ఎన్నిక నిలిచింది. మరుసటి రోజు ఎన్నిక జరగకుండా కూటమి నాయకులు అడ్డుపడ్డారు. 19న యలమంచిలి ఎంపీపీ ఎన్నిక యలమంచిలి: ఈ నెల 19న యలమంచిలి ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నుంచి సోమవారం ఉత్తర్వులు వచ్చినట్లు ఎంపీడీఓ నందిపాటి ప్రేమాన్విత తెలిపారు. 15న సభ్యులకు ఎన్నికల నోటీసులు అందజేసి 19న ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహిస్తామని ఆమె వివరించారు. -
15వ రోజుకు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ సమ్మె
భీమవరం: భీమవరం కలెక్టరేట్ సమీపంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారం 15వ రోజుకు చేరుకుంది. ఏపీ ఎంసీఏ జిల్లా అధ్యక్షురాలు పి.శిరీష రాణి, సెక్రటరీ కె.విజయ సీతారామరాజు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఆరేళ్లు పూర్తి చేసుకున్న సీహెచ్‌ఓలను రెగ్యులర్ చేయాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ చేయాలని, నిర్దిష్టమైన జాబ్ కార్డులు అందించాలని, హెచ్ఆర్ పాలసీ ఇంక్రిమెంట్ ట్రాన్స్ఫర్ తదితర డిమాండ్లతో గత 15 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. -
జనసేనకు టీడీపీ షాక్!
మంగళవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు : నామినేటెడ్ పదవుల కేటాయింపుల్లో జనసేనకు టీడీపీ షాకిచ్చింది. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పదవుల్లో కీలక ప్రాధాన్యం ఉంటుందని పదే పదే ప్రకటించి చివరికి జిల్లా స్థాయిలో కూడా చోటు కల్పించకపోవడంతో జనసేన కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. టీడీపీ ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవడం లేదన్న బాధలో ఉన్న వారిని తాజా నియామకాలు మరింత నిరాశకు గురిచేస్తున్నాయి. జనసేన నుంచి నలుగురే.. జనసేన పట్టున్నట్టు చెప్పుకునే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఇంతవరకు రాష్ట్ర స్థాయిలో 12 మందికి నామినేటెడ్ పదవులు దక్కగా వారిలో జనసేన నుంచి కేవలం నలుగురే ఉన్నారు. జిల్లా నుంచి తొలి విడతలో ఇద్దరికి, రెండో విడతలో నలుగురుకి, తాజాగా ఏడుగురికి పదవులు దక్కాయి. మొదటి విడతలో ఏపీ వినియోగదారుల కౌన్సిల్ చైర్‌పర్సన్‌గా నియమించిన టీడీపీ మాజీ మంత్రి పీతల సుజాతకు ఈ సారి రాష్ట్ర మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్‌్ చైర్పర్సన్ పదవి వరించింది. మిగిలిన వారిలో ఆప్కాబ్ డీసీసీబీ చైర్మన్‌గా ఉంగుటూరు టీడీపీకి చెందిన గన్ని వీరాంజనేయులు, డీసీఎంఎస్ చైర్మన్‌గా జనసేనకు చెందిన చాంగటి మురళీకృష్ణ, భవన, ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్‌గా తాడేపల్లిగూడెం టీడీపీకి చెందిన వలవల బాబ్జీ, టైలర్స్ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్‌గా తాడేపల్లిగూడెం టీడీపీకి చెందిన ఆకాశపు స్వామి, మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య అధ్యక్షుడిగా నరసాపురం టీడీపీకి చెందిన కొల్లు పెద్దిరాజు, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్‌గా ఏలూరు టీడీపీ నగర అధ్యక్షుడు పెన్నుబోయిన వాణి వెంకట శివ ప్రసాద్ ఉన్నారు. మూడో విడతలోని ఏడుగురిలో ఆరుగురు టీడీపీకి చెందిన వారే ఉండటం జన సైనికులకు మింగుడు పడటం లేదు. చినబాబుకు భంగపాటు భీమవరం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేయకపోవడంతో ఉమ్మడి జిల్లా జనసేన అధ్యక్షుడు, భీమవరానికి చెందిన కొటికలపూడి గోవిందరావు(చినబాబు) బరిలో ఉంటారని భావించారు. అనూహ్యంగా టీడీపీ నుంచి పులపర్తి రామాంజనేయులు జనసేనలో చేరి సీటు తెచ్చుకున్నారు. కూటమి ధర్మానికి కట్టుబడి భీమవరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పార్టీ ఎమ్మెల్యేల గెలుపునకు పనిచేశారు. ఆయన సేవలకు ఎమ్మెల్సీ పదవి ఆశించారు. పదవి దక్కక ప్రభుత్వ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటున్న తరుణంలో డీసీసీబీ చైర్మన్‌గా నియమిస్తారంటూ అధినాయకత్వం నుంచి సమాచారం వచ్చిందని రెండు నెలల క్రితం హడావుడి చేశారు. అమరావతి వెళ్లి సీఎం చంద్రబాబును కలవడంతో డీసీసీబీ చైర్మన్‌గా చినబాబు ఖాయం అంటూ వార్తలు వచ్చాయి. అదే సమయంలో చినబాబు అనుచరులు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. ఆదివారం ప్రకటించిన పదవుల్లో డీసీసీబీ చైర్మన్ రాకపోగా, ఎక్కడా ఆయనకు చోటు దక్కక అనుచరుల్లో అసంతృప్తి నెలకొంది. నియోజకవర్గంలో, ఉమ్మడి జిల్లాలో పార్టీని నెట్టుకుని వస్తే అధికారంలోకి వచ్చాక పదవులను వేరొకరు ఎంజాయ్ చేస్తున్నారని మథనపడుతున్నారు. న్యూస్రీల్తీవ్ర అసంతృప్తిలో జనసేన కేడర్ గత ఎన్నికల్లో జనసేన నుంచి భీమవరం సీటు ఆశించిన వీరవాసరం జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్‌నాయుడు నామినేటెడ్ పదవి దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. ఇప్పటికే భీమవరంలో పేరుకు జనసేన ఎమ్మెల్యే అయినా పెత్తనమంతా టీడీపీ నాయకుల చేతుల్లోనే ఉంది. ఆచంట, పాలకొల్లు, తణుకు, ఉండి నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తిలో జనసేన కేడర్ ఉంది. ఏలూరు నుంచి రెడ్డి అప్పలనాయుడుకు ఆర్టీసీ రీజనల్ చైర్మన్‌గా రెండో విడత నామినేటెడ్ పదవుల్లో చోటు కల్పించగా కై కలూరు, చింతలపూడి, పోలవరం తదితర నియోజకవర్గాల్లో కేడర్ తమను ద్వితీయ శ్రేణి నేతలుగానే చూస్తున్న పరిస్థితి ఉందని మండిపడుతున్నారు. నామినేటెడ్ పదవుల్లో దక్కని ప్రాధాన్యత పశ్చిమ జిల్లా అధ్యక్షుడు చిన్నబాబుకు మరో‘సారీ’ అసంతృప్తిలో అనుచరులు -
వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే
తాడేపల్లిగూడెం: వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని వైఎస్సార్సీపీ నర్సాపురం పార్లమెంటరీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు అన్నారు. పార్లమెంటులోని నియోజకవర్గాల పర్యటనలో భాగంగా సోమవారం గూడెం నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. కొట్టు సత్యనారాయణ నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయాలని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వారి పక్షాన పోరాడాలన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే అన్ని పథకాలు కొనసాగుతాయని, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని.. ప్రతి ఇంటికి తెలియజేయాలని సూచించారు. నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
దళితుల ఇళ్లకు కరెంటు తొలగింపు అన్యాయం
కాళ్ల: ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండా దళితుల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ తొలగించడం అన్యాయమని, వెంటనే పునరుద్ధరించకపోతే ఉద్యమిస్తామని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి హెచ్చరించారు. సోమవారం కాళ్ల మండల కేంద్రంలో లంక రోడ్డులో ఉన్న దళితుల ఇళ్లను కేవీపీఎస్ బృందం పరిశీలించి, బాధితులను పరామర్శించారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కెవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ కాళ్ల మండల కేంద్రం లంక రోడ్డులో ఉన్న పది దళిత కుటుంబాలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దుర్మార్గంగా కరెంటు కట్ చేయడం అన్యాయమన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు చీకట్లో ఉంటూ కొవ్వొత్తుల వెలుగులో చదువుకుని పరీక్షలకు వెళ్లడం సిగ్గుచేటు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారమే దళితుల ఇళ్ళకు కరెంట్ కట్ చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆదేశాలను పాటించాల్సి వస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పంచాయతీ, ఆర్ అండ్ బీ అధికారులు ఎమ్మెల్యే ఆదేశాలతోనే కరెంట్ కట్ చేసినట్లు చెప్పారన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలక్ట్రికల్ ఏఈ, పంచాయతీ అధికారులు కుమ్మకై ్క కరెంటు కట్ చేశారని తక్షణం వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దళితులు కాబట్టే ఆధిపత్యాన్ని చూపించి అన్యాయంగా కరెంటు కట్ చేశారన్నారు. తక్షణం కరెంటు ఇవ్వకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రత్యామ్నాయం చూపించే ఇళ్లు తొలగిస్తున్నామని చెపుతున్న ఎమ్మెల్యే అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో తొలగించాలనుకుంటున్న ఇళ్ళకు వచ్చి బాధితులతో మాట్లాడాలన్నారు. కేవీపీఎస్ ప్రధాన కార్యదర్శి కె.క్రాంతి బాబు మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో తొలగిస్తున్న పేదల ఇళ్ళకు ప్రత్యామ్నాయం చూపుతున్నారని ఎమ్మెల్యే చెపుతున్నారని ప్రత్యామ్నాయం అంటే ఇళ్ల స్థలాలు చూపి పట్టాలు చేతికివ్వడం మాత్రమే కాదని పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూల్చిన ఇళ్లకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇల్లు కట్టుకొనే వరకు అద్దె కూడా ప్రభుత్వమే చెల్లించాలన్నారు. కార్యక్రమంలో కేవిపీఎస్ జిల్లా అధ్యక్షులు బత్తుల విజయకుమార్, సీఐటీయు జిల్లా నాయకుడు గొర్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కేవీపీఎస్ ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి -
నేత్ర పర్వం.. రథోత్సవం
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో జరుగుతున్న వైశాఖ మాస దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామికి జరిగిన రథోత్సవం నేత్రపర్వమైంది. చినవెంకన్న తిరుకల్యాణ మహోత్సవం జరిగిన మరుసటి రోజు రాత్రి రథత్సవం జరపడం సంప్రదాయంగా వస్తోంది. అధిక సంఖ్యలో భక్తులు రథోత్సవంలో పాల్గొన్నా రు. ముందుగా ఆలయంలో అర్చకులు స్వామి, అమ్మవార్లను తొళక్క వాహనంపై ఉంచి, పూజాదికాలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మగళ వాయిద్యాలు, కోలాట భజనలు, అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్ధుల వేద మంత్రోచ్ఛరణల నడుమ వాహనాన్ని రథం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ రథంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కల్యాణ మూర్తులను ఉంచి, విశేష పుష్పాలంకారాలు చేసి, హారతులిచ్చారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఆలయ అనువంశిక ధర్మకర్త నివృతరావు, ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి తదితరులు రథం వద్ద పూజలు నిర్వహించి, బలిహరణను సమర్పించగా, రథోత్సవం ప్రారంభమైంది. డప్పు వాద్యాలు, కళాకారుల వేషధారణలు, కోలాట భజనలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ శ్రీవారి దివ్య రథం క్షేత్ర పురవీధుల్లో తిరుగాడింది. ఆలయ ముఖ మండపంలో ప్రత్యేక అలంకరణలో భాగంగా స్వామివారు రాజమన్నార్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీహరి కళాతోరణ వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బ్రహ్మోత్సవాల్లో నేడు : ● ఉదయం 7గంటల నుంచి–భజన కార్యక్రమాలు ● 8 గంటల నుంచి – భక్తిరంజని ● 9 గంటల నుంచి–కూచిపూడి నృత్య ప్రదర్శనలు ● 10.30 గంటల నుంచి–చక్రవారి–అపభృధోత్సవం ● మధ్యాహ్నం 3 గంటల నుంచి – వేద సభ ● సాయంత్రం 4 గంటల నుంచి–నాదస్వర కచేరీ ● 5 గంటల నుంచి – సంగీత విభావరి ● రాత్రి 7 గంటల నుంచి–కూచిపూడి నృత్య ప్రదర్శన ● 8 గంటల నుంచి – పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజావరోహణ ● 9 గంటల నుంచి–అశ్వవాహనంపై గ్రామోత్సవం ● శ్రీవారి ప్రత్యేక అలంకారం – కాళీయమర్దనం -
నాటు తుపాకులతో వేటగాళ్ల హల్చల్
ఉండి: నాటుతుపాకులతో వేటగాళ్లు హల్చల్ చేస్తున్నారు. ప్రతిరోజు ఆక్వా చెరువులపై పిట్టలు కొట్టేందుకు తుపాకులను విచ్చలవిడిగా వాడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి, అర్తమూరు తదితర గ్రామాలతోపాటు ఆకివీడు, కాళ్ళ, పాలకోడేరు, భీమవరం రూరల్ మండలాలు, ఏలూరు జిల్లాలోని గణపవరం, నిడమర్రు మండలాల్లోను ఇదే విధంగా నాటు తుపాకులు దర్శనమిస్తున్నాయి. పట్టపగలే వాహనాలపై తుపాకులను చేతపట్టుకుని తిరుగుతున్నా పోలీసులు గానీ, ఇతర అధికారులు గానీ ఎవరూ పట్టించుకోడం లేదంటూ సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. తుపాకీ గురితప్పితే తమ పరిస్థితి ఏంటని ఆయా మండలాల్లోని ప్రజలు, వ్యవసాయ కూలీలు ఆందోళన చెందుతున్నారు. ఇది నేరం కాదా? నాటు తుపాకీలతో కేవలం పిట్టలనే కాలుస్తున్నారా.. లేక మరేదైనా జరుగుతుందా.. తుపాకుల సరఫరా ఎక్కడ నుంచి జరుగుతుంది అంటూ పలువురు వీటిపై ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఈ నాటు తుపాకులతో ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల నుంచి వేటగాళ్లు ఇంత బహిరంగంగా ఎలా వస్తున్నారు? వారికి రూ.30 వేలు నుంచి రూ.40 వేలు జీతాలు ఎలా ఇస్తున్నారు?ఇదేమీ నేరం కాదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో నాటుతుపాకీతో దారుణాలు గతంలో నాటుతుపాకీతో జరిగిన దారుణాలు గుర్తు తెచ్చుకుని ప్రజలు భయపడుతున్నారు. గతంలో సరిగ్గా పంచాయతీ ఎన్నికల సమయంలో మండలంలోని ఎన్నార్పీ అగ్రహారంలో నాటుతుపాకీతో ఓ హత్య జరగడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పుడు కూడా ఆక్వా చెరువులపై పిట్టలు కొట్టేందుకు తెచ్చిన నాటుతుపాకీగా పోలీసులు గుర్తించినట్లు పలువురు చెబుతున్నారు. అలాగే చెరువుకువాడ గ్రామంలో నాటు తుపాకీతో ఓ వ్యక్తి కోతి(వానరం)ని కాల్చడం కూడా సంచలనానికి దారి తీసింది. ఇంతటి భయంకరమైన ఘటనలు చోటుచేసుకుంటున్నా అధికారులు పట్టంచుకోకపోవడంపై ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వెంటనే వీటిపై చర్యలు తీసుకుని ప్రజల ప్రశాంత జీవనానికి అండగా నిలవాలని వారు కోరుతున్నారు. విచ్చలవిడిగా ఆక్వా చెరువులపై నాటు తుపాకుల వినియోగం పట్టించుకోని అధికారులు -
మట్టి తీసి గట్టు మీద పెట్టు
ఉండి: ఉండి సబ్ డివిజన్ పరిధిలో కొత్తగా ఏడు కాలువల పూడికతీత పనులు, గత ప్రభుత్వంలో మంజూరైన రెండు పనులు చేపట్టేందుకు ఇటీవల హడావిడిగా అధికారులు సమాయత్తమయ్యారు. పనులు చేసే విధానం చూస్తుంటే రైతులకు మేలు జరగటం పొరపాటే అని అర్ధం అవుతుంది. కాలువల్లో పూడిక తీసి ఆ మట్టిని వేరే ప్రాంతానికి తరలిస్తే కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డులేకుండా ఉంటుంది. కానీ కాలువల్లో తీసే పూడిక మట్టిని పొక్లెయినర్ సహాయంతో గట్లపైనే వేసి కాంట్రాక్టర్లు చేతులు దులుపుకుంటున్నారు. కాలువల్లో నీరు ఉన్నాగాని పొక్లెయినర్ల సహాయంతో వారికి నచ్చిన ప్రాంతంలో మట్టిని తీసి గట్లపై వేసి పూడిక తీసేసినట్లు మసిపూసి మారేడు కాయచేస్తున్నారు. అంతే కాకుండా చాలా పని చేసేసినట్లు గట్లపైనా, కాలువ అంచున ఉండే గడ్డిని పొక్లెయినర్ సహాయంతో తొలగించి ఆ ప్రాంతంలో పూడికను చాలా బాగా తొలగించినట్లు చెప్పడం విశేషం. అంతే కాకుండా ఆయా ప్రాంతాల్లో కాలువగట్ల వెంబడి ఉండే సీసీరోడ్లపైనా పూడిక తీసిన మట్టిన వేసి సీసీరోడ్లను మట్టిరోడ్లుగా మార్చేస్తున్న విధానంపై స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదేంటి అని అడిగితే దానికి సమాధానం చెప్పేవారు లేరంటే పనులు జరుగుతున్న తీరు అర్థం చేసుకోవచ్చు. కాలువల్లో జరుగుతున్న పనులను పర్యవేక్షించేందుకు అధికారులు కూడా కంటికి కనిపించడం లేదంటే.. పనులు ఎవరికి లాభం చేకూరుస్తున్నాయో తెలుస్తోంది. ఉండి సబ్ డివిజన్లో మొత్తం 9 పనులు మంజూరు ఉండి ఇరిగేషన్ సబ్ డివిజన్లో మొత్తం 9 పూడికతీత పనులు ఈ వేసవిలో ప్రారంభిస్తున్నారు. వీటిలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రూ.94 లక్షలతో ఏడు పనులు, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరైన రెండు పనులు రూ.12.16 లక్షల అంచనాలతో పనులు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. వీటిలో మొదటిగా ఉండి మండలం కలిసిపూడి రెగ్యులేటర్ నుంచి శివారు ప్రాంతం అజ్జమూరు సరిహద్దు వరకు రూ.33 లక్షల అంచనాలు కాగా అగ్రిమెంట్ రూ.22 లక్షలు (వీటిలో లష్కర్ జీతాలు కూడా ఉంటాయని అధికారులు తెలిపారు)గా పనిని ప్రారంభించారు. వాండ్రం కాలువ రూ.7.06 లక్షల విలువైన పనులు ప్రారంభమయ్యాయి. మిగిలినవి యండగండి సెక్షన్లో లోసరి మెయిన్ కాలువ, బాపనకోడు, యండగండి అప్పర్పేర్లల్ కాలువ, చిలకంపాడు సెక్షన్లో రావిపాడు కాలువ, వీఎండబ్ల్యూ కాలువ పరిమెళ్ళ లాకుల వద్ద లీడింగ్ కాలువ పూడిక తీత పనులు రూ.62 లక్షలతో చేపట్టాల్సిన ఐదు పనులు రెండు లేదా మూడు రోజుల్లో ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. అలాగే గత ప్రభుత్వంలో రూ.12.16 లక్షల అంచనాలతో మంజూరైన అర్తమూరు, పాములపర్రు కాలువ, జక్కరం బొర్రకోడుల పనులు చేపట్టాల్సి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రారంభించిన రెండు పనుల్లో ఇంతటి దారుణం జరుతుంటే చేపట్టాల్సిన మొత్తం ఏడు పనుల్లోను ఎంతటి దారుణాలు చోటుచేసుకుంటాయో అని రైతులు వాపోతున్నారు. తూతూమంత్రంగా కాలువల ఆధునికీకరణ? కాలువలో మట్టి తీసి వేరే ప్రాంతానికి తరలించకుండా గట్టుపైనే వేస్తున్న వైనం పనులు పారదర్శకంగా జరుగుతున్నాయి కలిసిపూడి, వాండ్రం కెనాల్ పూడిక తీత పనులు పారదర్శకంగా జరుతున్నాయి. అనుకున్న విధంగానే పనులు చేపట్టి పూర్తి చేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో నీరు ఉండడం వల్ల రెండు లేదా మూడు రోజుల్లో మిగిలిన పనులు ప్రారంభిస్తాము. – డీఈ పీఎన్వీవీఎస్ మూర్తి, ఉండి -
లక్ష్మీనారాయణుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
పాలకొల్లు సెంట్రల్ : పట్టణంలోని చతుర్భుజ లక్ష్మీతాయార్లు సమేత శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణస్వామివారి (చినగోపురం) బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం సాయంత్రం 6 గంటలకు విశాఖ జిల్లా పెందుర్తి వాస్తవ్యులు, కళ్యాణ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రధానార్చకులు ముప్పిరాల అనంతాచార్యస్వామి, వారి శిష్య బృందంచే విశ్వక్సేనారాథన, పుణ్యాహవాచనము, రక్షాబంధనం, బుత్విగరుణము, మృత్సంగ్రహణము, అంకురార్పణ, కుంబావాహన, నివేదన, మంగళాశాసనము, తీర్థప్రసాద వినియోగముతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి బిరుదుకోట శంకర్ తెలిపారు. దేశంలోనే రెండో క్షేత్రం స్వామివారు అష్టబాహువులతో దేశంలో మొత్తం రెండు ప్రాంతాల్లో మాత్రమే కొలువై ఉన్నారని.. ఒకటి కంచి, రెండవది పాలకొల్లులో మాత్రమేనని స్థల పురాణాలు చెబుతున్నాయి. ఆలయంలో మూలవిరాట్ స్వామివారికి కుడివైపున లక్ష్మీతాయారు, ఎడమ భాగంలో ఆండాళ్లవారి ఉపాలయాలు, వెనుక భాగంలో ఆళ్వార్లు ఉపాలయాలు ఉన్నాయి. ఆలయంలో స్వామివారికి ఎడమ వైపు భాగంలో శ్రీరామక్రతువు స్తూపం, ఆగ్నేయంలో స్వామివారి హోమ మండపం, ఉత్తర భాగంలో స్వామివారి కళ్యాణోత్సవ మండపాలు ఉన్నాయి. అలాగే స్వామివారికి స్థానిక బంగారువారి చెరువుగట్టున తోటోత్సవం నిర్వహించే మండపం ఉంది. ఇక్కడ సుమారు 70 అడుగుల ఎత్తులో ఉన్న గాలిగోపురం నేడు చినగోపురంగా ప్రసిద్ధి చెందినది. శ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి (పెద్దజీయరుస్వామి) విశ్వకళ్యాణముకై ప్రతిష్టించిన 108 శ్రీరామ క్రతువు స్తంభాల్లో 85వ స్థంభం 1968లో ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించారు. ఉత్సవాలు ఇలా.. 13వ తేదీన ఉదయం అలంకార తిరుమంజనం, రాత్రి ఊంజల్ సేవ, చంద్రవాహనసేవ, తిరువీధి ఉత్సవం 14న రాత్రి శేషవాహనసేవ 15న హనుమంత వాహనసేవ 16న గరుడ వాహనసేవ, అనంతరం పటికబెల్లంతో శ్రీ కృష్ణ తులాభారాం 17న ఉదయం శ్రీవారికి పూలంగి సేవ, రాత్రి ఎదురు సన్నాహ మహోత్సవము, అనంతరం శ్రీవారి తిరు కల్యాణం 18న ఉదయం శ్రీవారికి చందనోత్సవం, రాత్రి రథోత్సవం 19న ఉదయం వసంతోత్సవం అనంతరం ధ్రువమూర్తుల తిరుమంజనం, మధ్యాహ్నం మహా పూర్ణాహుతి, రాత్రి ప్రణయ కలహం (ఏడు ముసుగుల ఉత్సవము), దివ్య మంగళ దర్శనం 20న ఉదయం సుదర్శన మహాయజ్ఞం, మధ్యాహ్నం తిరుప్పావడై ఉత్సవం, రాత్రి పండిత సత్కారం అనంతరం శ్రీ పుష్పయాగం నిర్వహించనున్నారు. -
ప్రొటోకాల్‌పై జనసైనికుల ఫైర్
పవన్ కళ్యాణ్‌కు సరైన గౌవరం దక్కడం లేదంటూ ఆవేదన నరసాపురం రూరల్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 164 స్థానాలు గెలుపొందేందుకు ముఖ్య కారకుడైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రొటోకాల్ విషయంలో సరైన గౌరవం దక్కడం లేదంటూ జనసైనికులు ఆవేదన వ్యక్తం చేశారు. నరసాపురం మండలంలోని లిఖితపూడి గ్రామంలో సోమవారం జరిగిన ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన కార్యక్రమం వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ ఫొటో మంత్రుల ఫొటోలతో సమానంగా వేయడంపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు కోటిపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడి ఫోటోను ఆ స్థానంలో పెట్టడం కరెక్టుకాదన్నారు. ఆలా చేయడం జనసైనికులందరినీ బాధిస్తుందన్నారు. ఇక మీదట నరసాపురం నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలన్నింటిలో సీఎం చంద్రబాబు ఫొటోతో సమానంగా పవన్ కళ్యాణ్ ఫొటో వేయాలని అధికారులకు సూచించారు. యువతి అదృశ్యంపై కేసు నమోదు ఉండి: యువతి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం ఉండి మండలం పెదపుల్లేరు గ్రామానికి చెందిన యువతి సోమవారం తెల్లవారుజాము నుంచి అదృశ్యమైనట్లు ఆమె మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ఎండీ నసీరుల్లా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కోళ్ల వ్యర్థాల వాహనం సీజ్ పెదపాడు: మండలంలోని వీరమ్మకుంట గ్రామానికి కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్న వ్యాన్‌ను సోమవారం సీజ్ చేసినట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. డ్రైవర్, యజమాని, చేపల చెరువు యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. -
మద్యం మత్తులో యువకుడి హత్య
కాళ్ల: మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో యువకుడు హత్యకు గురైన ఘటన కాళ్ల మండలం ఎల్ఎన్ పురం గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కాళ్ళ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా కోమటిలంకకు చెందిన చెన్నకేశవ అరవింద్(22), ప్రత్తికోళ్లలంక కు చెందిన బండి జాన్ యేసు ఇద్దరూ బంధువులు. కొంతకాలం క్రితం కాళ్ళ మండలం ఎల్ఎన్ పురం గ్రామంలోని చెరువుల వద్దకు జీవనోపాధి నిమిత్తం వచ్చారు. వీరు పనిచేసే చెరువుల వద్ద కిరణ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి వీరు ముగ్గురు పనిచేస్తున్న చెరువుపై మద్యం సేవించారు. మద్యం మత్తులో బంధువులైన జాన్ యేసు, అరవింద్ ఘర్షణకు దిగారు. అనంతరం జరిగిన దాడిలో జాన్ యేసు మేతబస్తాలపై ఉన్న చాకుతో అరవింద్ ఛాతీపై పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో పడిపోయిన అరవింద్‌ని పక్కనే ఉన్న కిరణ్ వేరే వ్యక్తి సహాయంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లుగా వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆకివీడు రూరల్ సీఐ జగదీశ్వరరావు, ఎస్సై శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు అరవింద్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేయగా సీఐ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.వ్యక్తిపై హత్యాయత్నంతాడేపల్లిగూడెం అర్బన్ : ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగిన ఘటన తాడేపల్లిగూడెంలో సోమవారం చోటుచేసుకుంది. పట్టణ ఎస్సై బాదం శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిర్రా నాగేశ్వరరావు మున్సిపాల్టీలో కారు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి 16 ఏళ్ల క్రితం రామతులసీతో వివాహం కాగా కొన్నాళ్ల క్రితం విడిపోయారు. అనంతరం రామతులిసీ బాదంపూడి డేవిడ్ అనే వ్యక్తిని మరో వివాహం చేసుకొంది. రెండో పెళ్లి చేసుకుందనే అక్కసుతో రామతులసీపై సిర్రా నాగేశ్వరరావు లేనిపోని మాటలను ప్రచారం చేస్తున్నాడని బాదంపూడి డేవిడ్ కొన్ని రోజుల క్రితం గొడవ పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి నాగేశ్వరరావును స్థానిక మసీదు సెంటరులోని అంబేద్కర్ కమ్యూనిటీ హాలు వద్ద చూసిన డేవిడ్ కొడవలితో దాడి చేశాడు. ఈ ఘటనలో సిర్రా నాగేశ్వరరావుకు మెడపై గాయాలు కాగా అతడిని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వైద్యం నిమిత్తం తరలించారు. పట్టణ ఎస్సై బాదం శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.యథేచ్ఛగా కంకర తరలింపుఉంగుటూరు: ఉంగుటూరు మండలంలోని మెత్తప్రాంతంలో మట్టి, కంకర మాఫియా ముఠా పడగ విప్పింది. రెండు రోజులనుంచి వందలాది లారీలతో యథేచ్ఛగా కంకరను లంబాడీ గూడెం నుంచి పెంటపాడు మండలం అలంపురంనకు తరలిస్తున్నారు. అలాగే బాదంపూడికి చెందిన కూటమి నాయకుడు పోలవరం కాలవగట్టు కంసాలిగుంట నుంచి పోలవరం కాలవగట్టు తవ్వి కంకరను తరలిస్తున్నుట్ల ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గొల్లగూడెం ప్రాంతంలో కుడిగట్టు కంకర గుట్టలు, నాచుగుంట అయకట్టులో మట్టి తరలింపు పనులు జరుగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా ఇవన్నీ జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై తహసీల్దార్ రవికుమార్‌ను ప్రశ్నించగా కంకర తరలింపు పనులు నిలుపుదల చేసినట్లు తెలియజేశారు. -
కోకో రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలి
ఏలూరు (టూటౌన్): కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించాలని, ఇప్పటివరకు కొనుగోలు చేసిన కోకో గింజలకు కూడా వ్యత్యాసపు ధర చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం డిమాండ్ చేసింది. మోండలీజ్ కంపెనీ ప్రతినిధులు రైతులను అవమానపరచడాన్ని నిరసిస్తూ, అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15వ తేదీన ఉదయం 10 గంటలకు సోమవరప్పాడు సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న మోండలీజ్ కంపెనీ కార్యాలయం, గోడౌను వద్ద కోకో రైతుల ధర్నా నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఏలూరు అన్నే భవనంలో సోమవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించకుండా కంపెనీలు కోకో రైతులను నిలువు దోపిడీ చేయడం దారుణమని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించి రైతులను ఆదుకోవాలని, లేనిపక్షంలో న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ సమావేశంలో విశ్రాంత డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కోకో రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం, కంపెనీలు చర్యలు చేపట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎస్. గోపాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోళ్ల వెంకట సుబ్బారావు, పానుగంటి అచ్యుతరామయ్య, రాష్ట్ర నాయకులు కోనేరు సతీష్ బాబు, ఏబీఎస్ ప్రకాశరావు, యలమాటి విశ్వేశ్వరరావు, ఏ.శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
గూడెంలో మట్టి అక్రమ తవ్వకాలు
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. చేలు, చెరువులు అనే తేడా లేకుండా మట్టిని తవ్వి తరలిస్తున్నారు. ప్రధానంగా జగన్నాథపురం, మాధవరం, కొమ్ముగూడెం తదితర గ్రామాల్లోని చెరువులను టార్గెట్ చేసుకుని జేసీబీల సాయంతో మట్టి తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్ లారీల్లో తరలిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. తద్వారా మట్టి బకాసురులు సొమ్ము చేసుకుంటున్నారు. చేలు, చెరువుల్లో మట్టిని తవ్వి ఇతర ప్రాంతాలకు తరలించాలంటే సంబంధిత శాఖ అనుమతులు తీసుకోవాలి. అయితే మట్టి బకాసురులు మాత్రం అవేమీ లేకుండానే మట్టిని తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మట్టి అక్రమ తవ్వకాలు చేస్తున్న వారిని ప్రశ్నిస్తే నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి పేరును ప్రస్తావించడం గమనార్హం. గతంలో కొమ్ముగూడెం గ్రామంలోని చెరువులో మట్టి అక్రమ తవ్వకాలను స్థానికులు అడ్డుకున్న ఘటనలు ఉన్నాయి. ఇవేమీ పట్టనట్లుగా బకాసురులు తిరిగి యథావిధిగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. ఉదయం, రాత్రి సమయాల్లో మట్టి అక్రమ తవ్వకాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయని సమాచారం. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు మిన్నకుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం -
విద్యాసంస్థల పేరుతో ఘరానా మోసం
లింగపాలెం: గంధం సాంబశివరావు అనే వ్యక్తి విద్యా సంస్థలను అప్పజెప్పినట్లుగా చూపి రూ.70 లక్షలు వసూలు చేసి తనను మోసం చేశారని సాయి జూనియర్ కళాశాల డైరెక్టర్ కోసూరి సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం లింగపాలెం మండలం ధర్మాజీగూడెం శివారులో బాధితురాలు సుజాత విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలు ఆమె మాటల్లోనే.. బాబా ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో గంధం సాంబశివరావు కాలేజీ నడిపే వారు. ఆ కళాశాలలో సరైన వసతులు లేకపోవడంతో ప్రభుత్వం అనుమతితో ధర్మాజీగూడెం శివారు వలసపల్లి అడ్డరోడ్డులో ఉన్న బిల్డింగ్‌లో ఏర్పాటు చేశారు. అమెరికాలో ఉంటున్న తన కుమారుడి వద్దకు తాను వెళ్లిపోతున్నాని, కాలేజీ తీసుకోమని నన్ను అడిగారు. బాబా ఎడ్యుకేషన్ సొసైటీ అనుమతులను సాయి జూనియర్ కళాశాలగా ధర్మాజీగూడెం శివారులో కొత్తగా నిర్మించిన బిల్డింగ్, ఫర్నీచర్‌తో సహ ఐదేళ్లు వాడుకునే విధంగా పెద్దల సమక్షంలో సాంబశివరావుకు రూ.70 లక్షలకు లీజు అగ్రిమెంట్ చేసుకున్నాం. ఏడాదికి రూ.11 లక్షలు అద్దె చెల్లించేలా అగ్రిమెంట్ చేసుకున్నాం. అగ్రిమెంట్ సమయంలో రూ. 40 లక్షలు సాంబశివరావుకు ఇవ్వగా మిగిలిన రూ. 30 లక్షల నిమిత్తం డిగ్రీ కాలేజీ అనుమతులు వేరే వారికి ఇచ్చి ఆ వచ్చిన సొమ్మును సాంబశివరావుకు చెల్లించాను. కాగా సాంబశివరావు ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి వేరే పేర్లతో బినామీగా వనిత జూనియర్ కళాశాల, క్రిసైల్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు అనుమతులు తీసకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తనను మోసం చేసిన గంధం సాంబశివరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేసినట్లు సుజాత తెలిపారు. రూ.70 లక్షలు తీసుకుని నన్ను బురిడీ కొట్టించారు సాయి జూనియర్ కళాశాల డైరెక్టర్ సుజాత ఆవేదన -
భూవివాదంలో జనసేన శ్రేణులు
స్థానికుల ఫిర్యాదుతో ఎమ్మెల్యే మందలింపు కొయ్యలగూడెం: భూవివాదంలో జనసేన పార్టీ శ్రేణుల వ్యవహారంపై స్థానికులు ఎమ్మెల్యేని చుట్టుముట్టి తమపై జరిగిన దౌర్జన్యాన్ని వివరించిన ఘటన కొయ్యలగూడెంలో సోమవారం జరిగింది. దీంతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జనసేన శ్రేణులను మందలించడం కనిపించింది. తహసీల్దార్ కే చెల్లన్న దొరతో కలసి కొయ్యలగూడెంలోని వివాదాస్పద భూమి వద్దకు వచ్చిన ఆయన జాతీయ రహదారికి పక్కన ఉన్న కోట్ల రూపాయల విలువైన ఆ భూమి వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థలం తమదంటూ బయటి వ్యక్తులు వచ్చారని, వారికి మద్దతుగా జనసేన, టీడీపీ నాయకులు ఉన్నారని స్థానికులు ఎమ్మెల్యేకి వివరించారు. తమ పార్టీలోని కొందరు తనకు తెలియకుండా వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వివాదాస్పద ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ఇబ్బంది కలిగించబోమని ఎమ్మెల్యే చెప్పారు. అదే సమయంలో వివాదానికి సంబంధించిన వ్యక్తుల్లో ఒకరు ఎమ్మెల్యే సమక్షంలో అక్కడే ఉండటం.. అతనిపై మహిళలు దాడికి యత్నించడం గమనార్హం. ఈ క్రమంలో ఎస్సై వి.చంద్రశేఖర్ సిబ్బందితో కలసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.