
నాటు తుపాకులతో హల్‌చల్
ఆక్వా చెరువులపై పిట్టలు కొట్టేందుకు వేటగాళ్లు నాటు తుపాకులు విచ్చలవిడిగా వాడుతున్నారు. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. 8లో u
పీజీఆర్‌ఎస్‌కు
ఫిర్యాదుల వెల్లువ
భీమవరం: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించి పీజీఆర్‌ఎస్‌కు బాధితులు పోటెత్తారు. వివిధ గ్రామాలకు చెందిన వృద్ధులు, వికలాంగులతోపాటు వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 187 ఆర్జీలను అందచేశారు. భార్య, ఇద్దరు కుమార్తెలు తనను ఇంటి నుంచి గెంటేశారని పెంటపాడు మండలం ప్రత్తిపాడు పంచాయతీ కాగులంపాడుకు చెందిన గజ్జరపు శంకరనారాయణ ఫిర్యాదు చేశారు. తాను 90 శాతం ఆర్ధోపెడిక్ సమస్యతో బాధపడుతున్నానని.. వికలాంగుల ఫించన్ సరిపోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నానని భీమవరం పట్టణం బలుసుమూడికి చెందిన రమణ కాత్యాయినిదేవి ఫిర్యాదు చేశారు. రూ.15 వేల పింఛన్ మంజూరు చేయాలని కోరారు. 2024 –25 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఉన్నతి రుణాలు మంజూరు రూ.7.75 కోట్లు లక్ష్యం కాగా, రూ.8.32 కోట్లు రుణాలను మంజూరు చేశారని.. రుణాల రికవరీ 99.91 శాతం ఉందని.. కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో డీఆర్డీఏ ఉన్నతి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ తిరుమాని మురళీకృష్ణను పీజిఆర్‌ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్ అభినందించారు.