
సొసైటీలు ఆడిట్ చేయించుకోవాలి
తణుకు అర్బన్: కో–ఆపరేటివ్ సొసైటీలు ఐటీ చట్టం నిబంధనల ప్రకారం అకౌంట్స్‌ను సరైన సమయానికి ఆడిట్ చేయించుకోవాలని, క్రమం తప్పకుండా ఐటీ రిటన్లు దాఖలు చేయాలని ఇన్‌కమ్ ట్యాక్స్ రాజమండ్రి రేంజ్ జాయింట్ కమిషనర్ ప్రతాప్ సింగ్ భుక్యా అన్నారు. తణుకు రోటరీ క్లబ్‌లో గురువారం సొసైటీల సభ్యులకు అకౌంట్స్ ఆడిట్ తదితర విషయాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిర్ణీత సమయానికి ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేయడం వలన ఐటీ చట్టం 1961 ప్రకారం సెక్షన్ 80పి డిడక్షన్ పొందవచ్చని స్పష్టం చేశారు. అనంతరం సీఏ కారుమూరి ధనసాయి ఆదాయపు పన్ను చట్టంలో నూతన నిబంధనలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ఆదాయపు పన్ను అధికారి సీపీకే దొర, జిల్లా ఆడిట్ అధికారి మానేపల్లి సాయిబాబా, డీసీవో శ్రీనివాస్, డీసీఏవో అంబేడ్కర్, ఆదాయపు పన్ను శాఖ అధికారులు, సొసైటీల సభ్యులు పాల్గొన్నారు.