
పట్టుబడిన మద్యం ధ్వంసం
భీమవరం: భీమవరం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కేసుల్లో పట్టుబడిన మద్యం సీసాలను మంగళవారం భీమవరం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆవరణలో ధ్వంసం చేశారు. ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఆదేశాలతో మద్యం సీసాలను ధ్వంసం చేసినట్లు ఎకై ్సజ్ సీఐ కె.బలరామరాజు చెప్పారు. గతంలో మద్యం కేసుల్లో పట్టుబడిన ఐదుగురిని భీమవరం తహసీల్దార్ ఆర్.రాంబాబు ముందు బైండోవర్ చేసినట్లు చెప్పారు.
ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
భీమవరం: ఇంటర్ సంప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా మంగళవారం ఫస్టియర్ ఇంగ్లీష్ పరీక్షకు 95 శాతం విద్యార్ధులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖాధికారి ఎ.నాగేశ్వరరావు చెప్పారు. జనరల్ కేటగిరిలో 7,630 మందికి 7,320 మంది, ఒకేషనల్‌లో 444 మందికి 398 మంది హాజరయ్యారన్నారు. సెకండ్ ఇయర్ ఇంగ్లీషు పరీక్షకు 89 శాతం విద్యార్థులు హాజరుకాగా జనరల్ కేటగిరిలో 294 మందికి 270 మంది, ఒకేషనల్‌లో 102 మందికి 86 మంది హాజరయ్యారన్నారు.
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
అత్తిలి: మహిళలు తమ కాళ్ల మీద నిలబడి ఆర్థికాభివృద్ధి సాధించాలనే ధ్యేయంతో మహిళలకు కుట్టు శిక్షణ ఇస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అత్తిలిలో బీసీ సంక్షేమ ఫైనాన్స్ కార్పోరేషన్‌న్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాన్ని మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం కోసం కుట్టు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారన్నారు. పాలూరులో సీసీ రోడ్డు, రక్షిత మంచినీటి పధకాన్ని హోం మంత్రి ప్రారంభించారు. మైక్రో ఫిల్టర్‌లు, పైపులైన్ పనులకు శంకుస్ధాపన చేసారు. అత్తిలిలో నిర్మించే రక్షిత మంచినీటి పధకం ట్యాంకు, పైపులైన్ విస్తరణకు భూమిపూజ చేశారు. కె సముద్రపుగట్టులో రక్షిత మంచినీటి పథకం, పైపులైన్‌లకు శంకుస్ధాపన చేసారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఎంపీపీ సుంకర నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సరస్వతి నది పుష్కరాలకు ప్రత్యేక బస్సు సర్వీస్
భీమవరం (ప్రకాశంచౌక్): ఈనెల 15 నుంచి జరిగే కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాలకు భీమవరం డిపో నుంచి స్పెషల్ సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ పీ.ఎన్.వీ.ఎం.సత్యనారాయణ మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఏదైనా గ్రామం నుంచి 35 మంది ప్రయాణికులు ఉంటే అదనపు చార్జీలు లేకుండా ఆ గ్రామం నుంచి మీరు కోరిన సమయంలో సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. టిక్కెట్ ధర ఒక్కొక్కరికీ రూ.2,200 అని.. మరిన్ని వివరాలకు 7382924754, 96660 89036 నెంబర్లలో సంప్రదించాలన్నారు.
సీహెచ్‌ఓల సమస్యలు పరిష్కరించాలి
ఏలూరు (టూటౌన్): గత 20 రోజులు నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఉభయగోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి డిమాండ్ చేశారు. మంగళవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద సమ్మె శిబిరాన్ని సందర్శించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం తక్షణమే యూనియన్‌తో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించి సమ్మె విరమణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

పట్టుబడిన మద్యం ధ్వంసం