
టీచర్ల బదిలీలకుహెల్ప్ డెస్క్ ఏర్పాటు
భీమవరం: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) భీమవరం కార్యాలయంలో బుధవారం ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి హెల్ప్‌డెస్క్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పీఎస్ విజయ రామరాజు, ఏకేవీ రామభద్రం మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్స్ విషయంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సహాయ కేంద్రంలో ఉపాధ్యాయులు ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఉచితంగా చేయించుకోవడమేగాక ఏమైనా అనుమానాలు ఉంటే నివృతి చేసుకోవచ్చనన్నారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు సీహెచ్ పట్టాభిరామయ్య, జిల్లా కార్యదర్శులు కె.రామకృష్ణ ప్రసాద్, జి.రామకృష్ణంరాజు, అబ్రహం తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష
భీమవరం: భీమవరంలో బుధవారం ఏపీ ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష 5 కేంద్రాల్లో నిర్వహించారు. ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 170 మందికి 164 మంది విద్యార్ధులు, మధ్యాహ్నం 170 మందికి 165 మంది హాజరయ్యారు. విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 110 మందికి 104, మధ్యాహ్నం 110 మందికి 106 మంది హాజరు కాగా.. విష్ణు ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 87 మందికి 83, మధ్యాహ్నం 87 మందికి 84 మంది హాజరయ్యారు. డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 100 మందికి 96 మంది, మధ్యాహ్నం 100 మందికి 96 మంది హాజరు కాగా డీఎన్నార్ అటానమస్ కళాశాలలో ఉదయం 100 మందికి 98 మంది, మధ్యాహ్నం 100 మందికి 98 మంది హాజరయ్యారు.
‘దీపం’తో పేదింట వెలుగులు
భీమవరం (ప్రకాశంచౌక్): దీపం పథకం పేదింట మహిళల్లో వెలుగులు నింపిందని పర్యాటక, గృహ నిర్మాణ శాఖల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. బుధవారం ఆయన భీమవరం దుర్గాపురంలో దీపం పథకం లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి దీపం పథకం ప్రయోజనాలు అడిగి తెలుసుకున్నారు. పేద మహిళలకు ఆర్థిక ప్రయోజనం కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఆయన వెంట కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఉన్నారు.
ఐరన్, సిమెంట్ బస్తాల చోరీ వాస్తవమే
దెందులూరు: జిల్లాలో పేదల గృహ నిర్మాణ కాలనీల్లో ఇళ్ల నిర్మాణ సామగ్రి దొంగతనాలు, దుర్విని యోగం జరిగాయని జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.సత్యనారాయణ చెప్పారు. బుధవారం ఏలూరులో తన కార్యాలయంలో సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనంపై స్పందించారు. దెందులూరు గృహ నిర్మాణ శాఖ గొడౌన్ నుంచి స్టీల్, నూజివీడు గోడౌన్‌లో డోర్స్, కిటికీలు, స్టీల్, ఎలక్ట్రికల్ సామాన్లు చోరీకి గురయ్యాయాన్నారు.
ఏలూరులో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ
నూజివీడు: ఏలూరులో బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనుండటం ఈ ప్రాంతానికి వరమని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. నూజివీడులో మాట్లాడుతూ దూరవిద్య ద్వారా చదువుకునేలా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు.

టీచర్ల బదిలీలకుహెల్ప్ డెస్క్ ఏర్పాటు