
రెండు కిలోమీటర్లు వెళ్లాలి
ఇంటింటికి రేషన్ సరుకుల వాహనాలు నిలిపివేస్తే రేషన్ షాఫునకు రెండు కిలోమీటర్లు నడిచివెళ్లి బియ్యం తెచ్చుకోవాలి. కూలి పనులు చేసుకుని జీవించే మాలాంటి వాళ్లకు రేషన్ కోసం ఒక రోజు పని మానేయాలి. క్యూలైన్‌లో ఎక్కువ మంది ఉంటే మరో రోజు వెళ్లక తప్పదు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఇబ్బందులు తప్పవు.
మెరిపే లక్ష్మీపార్వతి,
కోమటిచెరువు, పెనుమంట్ర మండలం
అనారోగ్యంతో ఎలా తెచ్చుకోగలం?
ఇంటికి వచ్చి రేషన్ ఇవ్వడం వల్ల ఐదేళ్లుగా ఎలాంటి ఇబ్బందిలేదు. ఇప్పుడు పాత పద్దతిలో రేషన్ దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకోవాలంటే అనారోగ్యంతో బాధపడే నాలాంటి వారికి పరిస్థితి కష్టం. కష్టపడి వెళ్తే వేలిముద్రలు పడడం లేదంటూ మళ్లీ రమ్మనడం పరిపాటే. దీనితో రెండు రోజులు రేషన్ కోసం పడిగాపులు కాయాల్సివస్తుంది.
– కొండేటి మోహన్‌రావు,
ఆలమూరు, పెనుమంట్ర మండలం
ఉపాధి కోల్పోతాం
గత ఐదేళ్లుగా ఎండీయూ వాహనంతో రేషన్ సరుకులను మండలంలోని మేడపాడు, అడవిపాలెం గ్రామాల్లో పంపిణీ చేస్తున్నాను. ప్రభుత్వం ఎండీయూ వాహనాలను నిలిపేవయడంతో మాకు ఉపాధికరువై కుటుంబపోషణ దుర్బరంగా మారే అవకాశముంది. ప్రభుత్వం ఎండీయూ వాహన నిర్వాహకులకు ఉపాధి కల్పించాలి.
– పెదపాటి ప్రవీణ్‌కుమార్,
మట్లపాలెం, యలమంచిలి మండలం
మా పరిస్థితి ఏంటి?
ఇంతకాలం ప్రజలకు ఇంటింటికీ ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరుకులు ఇస్తే ఇప్పుడు ఉన్నట్టుండి వాహనాలను నిలిపి వేస్తామనడం దారుణం. రేషన్ సరుకుల పంపిణీ ద్వారానే జీవనం సాగించాం. అకస్మాత్తుగా మమ్మల్ని రోడ్డుమీద వదిలేస్తే మా పరిస్థితి ఏంటి. మాకు ఉపాధి చూపించాలి.
– యామల ఆంజనేయులు,
శృంగశృక్షం, ఎండీయూ నిర్వహకుడు
●

రెండు కిలోమీటర్లు వెళ్లాలి

రెండు కిలోమీటర్లు వెళ్లాలి

రెండు కిలోమీటర్లు వెళ్లాలి