
రూ.175 కోట్లు తాగించాల్సిందే!
మద్యాన్ని ఏరులై పారించి సంపదను సృష్టించుకునే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. జిల్లాకు రూ.175 కోట్ల నెలవారీ లక్ష్యం నిర్ణయించి ఆ మేరకు అమ్మకాలు పెంచుకునే పనిలో పడింది. లక్ష్యాన్ని చేరుకునేందుకు నిబంధనలకు నీళ్లొదిలేసింది. అనధికార పర్మిట్ రూంలు, బెల్టు షాపులు, నైట్ పాయింట్ల పేరిట పగలూ రాత్రీ తేడా లేకుండా ప్రజల్ని మద్యం మత్తులో ముంచుతోంది.
గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025
సాక్షి, భీమవరం: జిల్లాలో 193 మద్యం దుకాణాలు ఉండగా రోజుకు సుమారు రూ.4 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. గతేడాది అదే నెలలో జరిగిన మద్యం అమ్మకాలపై 20 శాతం పెంచేలా టార్గెట్లు విధించగా ఇప్పుడు భారీగా పెంచేసింది. పశ్చిమగోదావరి జిల్లాకు నెలకు రూ.175 కోట్ల అమ్మకాలు చేయాలని నిర్ధేశించింది. ఈ మేరకు రోజుకు రూ.6 కోట్ల వరకు మద్యం అమ్మకాలు చేయాలి. లక్ష్యాన్ని చేరుకునేలా ఎకై ్సజ్ అధికారులపై ఉన్నత స్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. రోజువారీ సమీక్షలతో ఉక్కిరిబిక్కిరవుతున్న అధికారులు లక్ష్యాన్ని చేరేందుకు నిబంధనల అమలులో చూసీచూడనట్లు ఉంటున్నారు. సిండికేట్ల ఇష్టారాజ్యంగా మారింది. ఎకై ్సజ్ పాలసీకి విరుద్ధంగా ఇప్పటికే మద్యం బాటిల్‌పై అదనంగా రూ.10 వరకు ఎమ్మార్పీకి మించి అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారు. ఒక్కో షాపు పరిధిలో రెండు నుంచి ఐదు వరకు బెల్టులు నిర్వహిస్తున్నారు. షాపుల వద్దనే మద్యం సేవించేందుకు టేబుళ్లు, కుర్చీలతో సిట్టింగ్ ఏర్పాట్లు, మంచింగ్ కోసం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, సోడా, డ్రింక్, వాటర్ బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. లూజ్ సేల్స్, నైట్ పాయింట్ల పేరిట చాలా చోట్ల మద్యం అమ్మకాలు చేస్తున్నారు.
భారీగా పెరిగిన అమ్మకాలు
కూటమి పాలనలో జిల్లాలోని ఆరు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగిపోయాయి. ప్రైవేట్ పాలసీ వచ్చిన గత ఏడాది అక్టోబరు 16 నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకూ 9,42,129 కేసుల లిక్కర్, 3,86,035 కేసుల బీర్లు అమ్మకాలు జరిగాయి. గత ప్రభుత్వంలో 2023 అక్టోబరు 16 నుంచి 2024 మార్చి నెలాఖరు వరకూ 7,60,837 కేసుల లిక్కర్, 2,16,535 కేసుల బీర్ల అమ్మకాలు మాత్రమే జరగడం గమనార్హం. గతంతో పోలిస్తే ప్రైవేట్ పాలసీ వచ్చాక 24 శాతం మేర లిక్కర్, 80 శాతం మేర బీర్ల అమ్మకాలు పెరిగాయి. వీటిని మరింత పెంచుకునేందుకు భారీగా టార్గెట్లను నిర్దేశిస్తోంది.
శాంతి భద్రతలకు విఘాతం
అమ్మకాలు పెంచుకునేందుకు ప్రభుత్వం నిబంధనలకు గాలికొదిలేస్తుండటంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. ఇటీవల తణుకు ఉండ్రాజవరం గణేష్‌చౌక్ ప్రాంతంలోని మద్యం దుకాణం వద్ద నైట్‌పాయింట్ పేరిట అనధికారికంగా తెల్లవార్లు మద్యం అమ్మకాలు చేశారు. అర్థరాత్రి మద్యం కోసం వచ్చిన వ్యక్తికి సిబ్బంది మధ్య వివాదం చోటుచేసుకుంది. మద్యం కొనుగోలుకు వచ్చిన వ్యక్తి సిబ్బందిపై రాడ్‌తో దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. వేల్పూరులోని మద్యం దుకాణం కాంపౌండ్‌లో అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతిచెందడం వివాదస్పదమైంది. గతంలో ఊరికి దూరంగా ఉన్న దుకాణాలు ఇప్పుడు జనావాసాల మధ్యలోకి వచ్చాయి. మందుబాబుల ఆగడాలతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది.
న్యూస్‌రీల్
మద్యంతో సంపద సృష్టి
జిల్లాల వారీగా ఎకై ్సజ్ శాఖకు నెలవారీ టార్గెట్లు
తాగించాల్సిందేనంటూ ఉన్నత స్థాయి నుంచి ఒత్తిడి
అనధికార పర్మిట్ రూంలు, విచ్చలవిడిగా బెల్టుల ఏర్పాటు
6 నెలల్లో 24 శాతం లిక్కర్, 79 శాతం పెరిగిన బీర్ల అమ్మకాలు
గత ప్రభుత్వంలో..
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ప్రభుత్వ మద్యం పాలసీని తెచ్చి నిర్ణీత వేళల్లో మాత్రమే అమ్మకాలు చేసేవారు. బెల్టుషాపులు పూర్తిగా అరికట్టారు. షాపుల వద్ద కొనుగోలు చేసి తీసుకెళ్లడమే తప్ప తాగేందుకు వీలు లేకుండా చేశారు. ఎమ్మార్పీకి మించి అధిక ధరల ఊసే లేదు. నాడు మద్యంపై వచ్చే ఆదాయం మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరి ప్రజావసరాలకు ఉపయోగపడితే.. నేడు అధిక ధరలు, బెల్టు షాపుల రూపంలో కూటమి నేతలు, సిండికేట్ల జేబుల్లోకి వెళ్తుండడం గమనార్హం. అప్పట్లో ఊరి చివర ఎక్కడో ఉన్న మద్యం దుకాణాలు ఇప్పుడు జనావాసాల్లోకి వచ్చేశాయి.

రూ.175 కోట్లు తాగించాల్సిందే!