
మట్టి తవ్వకాల అడ్డగింత
చాట్రాయి: చనుబండ గ్రామంలోని పెద్ద చెరువులో మట్టి అక్రమ తవ్వకాలను అధికారులు అడ్డుకున్నారు. సోమవారం అర్ధరాత్రి మట్టి తవ్వకాలు చేస్తున్నారని సమాచారం రావడంతో రెవెన్యూ సిబ్బంది, పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుని ఒక పొక్లయిన్, జేసీబీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నాలుగు రోజల క్రితం మట్టి తవ్వకాలకు అనుమతి కావాలంటూ కొందరు అధికారులకు అర్జీ ఇచ్చారు. అర్జీ ఇచ్చినందుకు ఇచ్చిన రసీదుని చూపించి మూడు రోజులపాటు అక్రమంగా మట్టిని తరలించారు. సోమవారం రాత్రి సమాచారం అందుకున్న అధికారులు రెండు యంత్రాలను సీజ్ చేశారు.
పారిజాతగిరీశుడికి శేష వాహన సేవ
జంగారెడ్డిగూడెం: బ్రహ్మోత్సవాల్లో భాగంగా గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామికి మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. రాజమండ్రికి చెందిన పండితులు పాండంగిపల్లి దుర్గా రామ సత్య పవన్ కుమార్ ఆచార్యులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, ధ్వజరోహణం, అగ్ని ప్రతిష్ట, కుంభ స్థాపన, నిత్య హోమాలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు అత్యంత వైభవంగా శేష వాహన సేవ జరిపారు. సంతానం లేని భక్త దంపతులు స్వామివారి గరుడ ప్రసాదం స్వీకరించారు. పూజా కార్యక్రమాలను ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.
మద్ది క్షేత్రంలో విశేష పూజలు
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారికి ప్రభాతసేవ, నిత్యార్చన పూజలు జరిపారు. భక్తులు పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం వరకు ఆలయానికి వివిధ సేవలు, విరాళాల ద్వారా రూ.1,87,132 ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో సుమారు 1600 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారన్నారు. ఈవో చందన మాట్లాడుతూ క్షేత్రంలో హనుమద్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 21 నుంచి 25 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం స్వామి వారి నిజరూప సందర్శనం (సింధూరం వలుపు) అనంతరం విశేష దర్శనములు ఉంటాయన్నారు.

మట్టి తవ్వకాల అడ్డగింత

మట్టి తవ్వకాల అడ్డగింత