
పాడి రైతులకు ఇబ్బందులు
పశువులకు మేత వేసేందుకు ఎండుగడ్డి దొరక్క పాడి రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పశువుల దాణాను సబ్సిడీపై అందజేసి పాడి రైతులను ఆదుకోవాలి. అంతే కాకుండా ప్రభుత్వం కూడా ఎండుగడ్డిని సేకరించి పాడిపరిశ్రమ అభివృద్ధి చెందేలా చర్యలు చేపట్టాలి.
– పీవీఆర్‌కే ఆంజనేయరాజు, రైతు, వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు, వాండ్రం
ప్రభుత్వం ఆదుకోవాలి
ప్రస్తుతం ఎండుగడ్డికీ చాలా గిరాకీ ఏర్పడింది. గతంలో రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు ఉండే ఎకరా ఎండుగడ్డి ప్రస్తుతం ఏరియాను బట్టి రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు పలుకుతోంది. దీంతో పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులను ఆదుకోవాలి.
– నిమ్మల కేశవకుమార్, రైతు, ఉప్పులూరు, ఉండి మండలం
పశువులకు మేత కష్టంగా ఉంది
పశువులకు మేత వేసేందుకు ఎండుగడ్డి దొరకడం లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎండుగడ్డిని పాడిరైతులకు అందజేయాలి. పాడిని మనం బతికించుకుని ఆరోగ్యమైన పాలుతాగడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో నిండునూరేళ్లు జీవిస్తాం. పాడిరైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలి.
వర్రే పైడియ్య, రైతు, పాములపర్రు, ఉండి మండలం

పాడి రైతులకు ఇబ్బందులు

పాడి రైతులకు ఇబ్బందులు