రోడ్డు ప్రమాదంలో దుర్మరణం
తణుకు అర్బన్: తణుకు జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఉండ్రాజవరం పోలీసు స్టేషన్ పరిధిలోని కమ్మ కల్యాణ మండపం ఎదురుగా తాడేపల్లిగూడెం నుంచి తణుకు వైపు బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న 108 వాహన సిబ్బంది అప్పటికే మృతిచెందినట్లు నిర్థారించారు. ఉండ్రాజవరం ఎస్‌సై జి.శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఏపీ 05 ఈఆర్ 9840 నెంబర్ హోండా బైక్‌పై ప్రయాణిస్తున్న మృతుడు ధరించిన దుస్తుల్లో సెల్‌ఫోన్, కాగితాలు లేకపోవడంతో వివరాలు తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


