వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీల తొలగింపు
యనమదుర్రులో ఘటన
భీమవరం అర్బన్: భీమవరం మండలంలోని యనమదుర్రు గ్రామంలో సోమవారం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు వివాదంగా మారింది. గ్రామానికి చెందిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఫ్లెక్సీలపై మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకుల ఫొటోలతో క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు వస్తున్నారని పంచాయతీ సిబ్బంది, కూటమి నాయకులు ఫ్లెక్సీలను తొలగించారని వైఎస్సార్‌సీపీ నాయకులు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్న జనసేన ఫ్లెక్సీలు తొలగించకుండా కక్షతో వైఎస్సార్‌సీపీవి తొలగించడంపై నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మండి పడుతున్నారు.


